'బాహుబలి' సీన్‌ రీక్రియేట్‌ చేసిన కాజల్‌.. వైరల్‌ అవుతున్న ఫోటో | Kajal Aggarwal Recreates Katappa Scene From Bahubali With Son Neil | Sakshi
Sakshi News home page

Kajal Aggarwal: సీన్‌ రిక్రియేషన్‌.. కట్టప్పలా మారిన కాజల్‌ అగర్వాల్‌

Aug 11 2022 3:20 PM | Updated on Aug 11 2022 3:33 PM

Kajal Aggarwal Recreates Katappa Scene From Bahubali With Son Neil - Sakshi

హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది.​ కొడుకు నీల్‌ కిచ్లూతో కలిసి బాహుబలిలోని ఓ సీన్‌ రీక్రియేట్‌ చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది. టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాజల్‌ కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే గౌతమ్‌ కిచ్లూ అనే వ్యాపారవేత్తను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇటీవలె ఓ పండంటి బాబుకు జన్మనిచ్చిన కాజల్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

తాజాగా ఆమె షేర్‌ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో కట్టప్ప తలపై బాహుబలి కాలుపెట్టే సీన్‌ని కాజల్‌ తన కొడుకు నీల్‌తో రీక్రియేట్‌ చేసింది.

దీనికి సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. 'రాజమౌళి సర్‌ ఇది నీల్‌, నేను మీకు అంకితమిస్తున్నాం' అంటూ ఫోటోను షేర్‌ చేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కాజల్‌ కమల్‌ హాసన్‌ హీరోగా చేస్తున్న ఇండియన్‌ 2లో త్వరలోనే రీఎంట్రీ ఇవ్వనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement