దర్శకధీరుడు రాజమౌళి పేరు వినగానే మనకు ఠక్కున ఆ రెండు సినిమాల పేర్లే అందరికీ గుర్తుకొస్తాయి. ఒకటి బాహుబలి.. మరొకటి ఆర్ఆర్ఆర్. ప్రభాస్ నటించిన బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో రికార్డ్ క్రియేట్ చేసిన మన జక్కన్న.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాను పేరును మార్మోగించారు. అంతకుముందు తీసిన సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఎవరంటే రాజమౌళి పేరే గుర్తుకొస్తుంది. అయితే ఆయన అందరూ కేవలం దర్శకుడిగానే చూస్తారు. కానీ రాజమౌళి కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు.. మంచి నటుడు కూడా. ఆయన తీసిన సినిమాల్లో నటుడిగా కనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరీ ఆ సినిమాలేవి? ఏయే పాత్రలు చేశారో ఓ లుక్కేద్దాం పదండి.
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి క్యామియో పాత్రల్లో 8 సినిమాల్లో నటించారు. మొదిటసారి 'సై' సినిమాలో వేణుమాధవ్ అనుచరుడిగా కనిపించారు. ఆ తర్వాత రెయిన్ బో చిత్రంలోను నటించారు. అంతే కాకుండా ఆయన డైరెక్షన్‌లోనే రామ్ చరణ్ మగధీర అనగనగనగా పాటలో క్యామియో ఇచ్చారు. ఇక నేచురల్ స్టార్ నానితో తీసిన చిత్రం ఈగ ప్రారంభంలోనే స్టోరీ చెప్పారు. ప్రభాస్‌తో తీసిన బహుబలి మూవీలో సారా అమ్మే వ్యక్తిగా కనిపించారు. మజ్ను మూవీలో దర్శకుడిగా క్యామియోలో దర్శనమిచ్చారు. అంతే కాదు.. ప్రభాస్ నటించిన రాధే శ్యామ్‌లో కూడా కథను స్టార్ట్ చేసేది జక్కన్ననే. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో 'నెత్తురు మరిగితే ఎత్తర జెండా' అనే సాంగ్‌లో కనిపించి సందడి చేశారు. మొత్తానికి మన జక్కన్న సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మాత్రమే కాదు.. మంచి నటుడిగా కూడా తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment