సీక్రెట్స్‌ ఆఫ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ బై రాజమౌళి | RRR Behind and Beyond OTT Review in Telugu | Sakshi
Sakshi News home page

సీక్రెట్స్‌ ఆఫ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ బై రాజమౌళి

Published Wed, Jan 1 2025 3:00 AM | Last Updated on Wed, Jan 1 2025 6:17 AM

RRR Behind and Beyond OTT Review in Telugu

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో ఆర్‌ఆర్‌ఆర్‌ – బిహైండ్‌ అండ్‌ బియాండ్‌ ఒకటి. ఈ డాక్యుమెంటరీ గురించి తెలుసుకుందాం.

తన ఉనికిని తెలిపేందుకు ఓ గదిలో నలుగురు ముందు చప్పట్లు కొడితే ఆ నలుగురికి తన విషయం తెలియవచ్చు. కానీ అదే ఉనికి ప్రపంచానికి తెలియాలంటే సరిగ్గా రాజమౌళిలా ఆలోచించాలి. భారతదేశానికి ఒకప్పుడు సినిమా ప్రమోషన్‌ను  ఓ వినూత్న పంథాలో పరిచయం చేసిన బాలీవుడ్‌ దిగ్గజం అమిర్‌ ఖాన్‌ కూడా తాను ఈ విషయంలో రాజమౌళినే ఫాలో అవుతాననడం దీనికి ఓ నిదర్శనం. చరిత్ర అనేది రాజమౌళి ముందు ఉన్నది తరువాత ఉంటుంది, కానీ ఆ చరిత్రలో రాజమౌళికి ఓ చెరగని పేజీ ఉంటుందనేది మాత్రం నిర్వివాదాంశం.

తెలుగు సినిమా వైభవాన్ని ఎన్నో అంతర్జాతీయ వేదికలపైన నిలిపిన శిల్పి రాజమౌళి. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాకి ఆస్కారమే లేదన్న ఆస్కార్‌ పురస్కారాన్ని అద్భుతంగా అందించిన అత్యున్నత దర్శకులు రాజమౌళి. తన సినిమా అంటేనే ఓ సంచలనం. మరి... ఆ సంచలనం వెనకున్న సీక్రెట్‌ తెలుసుకోవాలని ప్రతి దర్శకుడితో పాటు సామాన్య ప్రేక్షకుడికి కూడా ఆసక్తి ఉంటుంది. ఆ కోవలోనే రాజమౌళి తీసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి సంబంధించిన తన కష్టాన్ని ఓ చక్కటి డాక్యుమెంటరీ రూపంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌ – బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’ పేరిట నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంచారు.

దాదాపు రెండున్నర గంటల పై నిడివి ఉన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాను నాలుగేళ్ల పాటు తీశారు. ఈ డాక్యుమెంటరీలో ఆ సినిమా మొత్తాన్ని ఎలా తీశారో రాజమౌళి వ్యాఖ్యానంతో పాటు సినిమాలోని నటీనటులు టెక్నీషియన్్స కూడా వివరిస్తూ చూపించడం ఎంతో బాగుంది. తన ఈ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రయాణానికి సంబంధించి ఎన్నో తెలియని, చూడని అద్భుత విషయాలను ప్రేక్షకులకు అందంగా అందించారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి... ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ఫుటేజ్‌ కొన్ని గంటల రూపంలో ఉంటే దానిని ఎడిట్‌ చేసి, గంటన్నర నిడివితో అందించారట. ఈ సమాజమనేది ఓ సృష్టి.

ప్రతిరోజూ మన మనుగడ ఈ సృష్టికి అనుగుణంగానే ఉంటుంది. ఓ రకంగా సినిమా అన్నది కూడా ఓ సృష్టే. ఓ దర్శకుడి ఆలోచనకు ప్రతిరూపమే సినిమా అన్న ఓ అద్భుత సృష్టి, కానీ ఈ సినిమా సృష్టిలో ఎంతోమంది కష్టం ఉంటుంది. మరి... అటువంటి సినిమాను ఏ విధంగా రూపొందించారో ఆ రహస్యాలు మీరు కూడా తెలుసుకోవాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతున్న  ‘ఆర్‌ఆర్‌ఆర్‌ – బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’ని చూసేయండి. వర్త్‌ టు వాచ్‌ అండ్‌ ప్రిజర్వ్‌ ద డాక్యుమెంటరీ ఫర్‌ ది ఫ్యూచర్‌ కిడ్స్‌. – ఇంటూరు హరికృష్ణ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement