
విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ ‘కన్యా కుమారి’ ఓటీటీలోకి రాబోతుంది. గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటించిన వినాయక చవితి కానుకగా గత నెల 27న థియేటర్స్ లోకి వచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. రేపటి నుంచి(సెప్టెంబర్ 17)ఈ చిత్రం అమోజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి ‘పుష్పక విమానం’ ఫేం సృజన్ దర్శకత్వం వహించారు. నటి మధు శాలిని ప్రెజెంటర్‌గా వ్యవహరించారు.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. తిరుపతి(శ్రీచరణ్), కన్యాకుమారి(గీత్ సైని) ఒకే స్కూల్. తిరుపతికి కన్యాకుమారి అంటే ఇష్టం. తిరుపతికి రైతు అవ్వాలి, వ్యవసాయం చేయాలని అనుకుంటాడు. కన్యాకుమారి మాత్రం పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవ్వాలని అనుకుంటుంది. తిరుపతి చిన్నప్పుడే చదువు మానేసి రైతు అవుతాడు. దీంతో వీరిద్దరి మధ్య కనెక్షన్ కట్ అవుతుంది. ఇక కన్యాకుమారికి ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల డిగ్రీ చేసి బట్టల షాప్ లో పని చేస్తూ ఉంటుంది. కన్యాకుమారి పెళ్లి సంబంధాలు చూస్తుంటే.. అబ్బాయి జాబ్ చేయాలి, నన్ను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేయాలి, సిటీలో ఉండాలి అని కండిషన్స్ పెడుతుంది.
తిరుపతికి ఏమో రైతు అని పెళ్లి అవ్వదు. అనుకోకుండా తిరుపతి ఫ్రెండ్ వల్ల కన్యాకుమారి – తిరుపతి కలుసుకుంటారు. తిరుపతి మళ్ళీ పాత ప్రేమని బయటకి తీసి కన్యాకుమారి వెంట తిరుగుతాడు. కన్యాకుమారి మాత్రం తిరుపతి రైతు అని పట్టించుకోదు. ఎలాగోలా తిరుపతి ఆమె వెనకాలే తిరిగి ప్రేమలో పడేస్తాడు. కానీ ఆ ప్రేమ బయటపడేలోపే తను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వడానికి సపోర్ట్ చేస్తారన్నారని కన్యాకుమారి ఇంట్లో చూసిన సంబంధానికి ఓకే చెప్తుంది. కనీసం నీకు ఉద్యోగం కూడా లేదు అని తిరుపతిని ప్రశ్నిస్తుంది. దీంతో తిరుపతి కన్యాకుమారి కోసం వ్యవసాయం మానేసి ఇష్టం లేకపోయినా జాబ్ లో జాయిన్ అవుతాడు. మరి కన్యాకుమారి పెళ్లి ఏమైంది? తిరుపతి - కన్యాకుమారిల ప్రేమ ఫలించిందా? తిరుపతి వ్యవసాయంలో సెటిల్ అయ్యాడా? కన్యాకుమారి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.