దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చిత్రం జపాన్‌లోనూ విడుదలకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ప్రమోషన్లు కూడా ప్రారంభించింది. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి జపాన్ పయనమయ్యారు. వీరంతా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రావడంతో అభిమానులు తమ సెల్‌ఫోన్లతో క్లిక్ మనిపించారు. జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో సహా జపాన్ ఫ్లైట్ ఎక్కేశారు. రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి జపాన్ బయలుదేరారు. ఈనెల 21 జపాన్‌లో ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది.
(చదవండి: లాస్‌ఎంజిల్స్‌లో ఆర్ఆర్ఆర్ షో.. రాజమౌళిపై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ వైరల్)
ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్‌లో రాజమౌళితో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పాల్గొననున్నారు. జపాన్‌లో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉండడంతో చిత్ర యూనిట్ భారీస్థాయిలో ప్రమోషన్లు నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్ సంచలనం సృష్టించింది. ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే థీమ్‌తో జక్కన్న రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ రూ. రూ.1200 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇంతటి ప్రజాధారణ పొందిన ఈ చిత్రం భారతదేశం నుంచి ఆస్కార్‌కు ఎంపికవుతుందని అందరూ భావించారు. హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ మూవీ ఆస్కార్ బరిలో నిలవాలని కోరుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతీ మూవీ ఛైల్లో షోను ఆస్కార్స్‌కు నామినేట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment