Ram Charan's 38th Birthday Bash: Vijay Deverakonda, Kajal Aggarwal, Venkatesh And Other Celebrities Attend - Sakshi
Sakshi News home page

Ram Charan: చరణ్‌ బర్త్‌డే పార్టీలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా మంచు మనోజ్‌-మౌనిక జంట

Published Tue, Mar 28 2023 8:56 AM | Last Updated on Tue, Mar 28 2023 1:19 PM

Tollywood Celebraties Attends Ram Charan Birthday Party Photos Goes Viral - Sakshi

ఆర్‌ఆర్‌ర్‌తో గ్లోబల్‌ స్టార్‌గా మారాడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌. నాటు నాటుకు ఆస్కార్‌ రావడంతో చరణ్‌ విశ్వ వేదికలపై మెరిసాడు. ఈ క్రమంలో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. నాటు నాటు ఆస్కార్‌ గెలిచిన తరుణంలో టాలీవుడ్‌తో పాటు భారత సినీ పరిశ్రమ పండుగ చేసుకుంటుంది.

ఈ క్రమంలో ఆ ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తూ మెగా రామ్‌ చరణ్‌ బర్త్‌డే రావడం విశేషం. ఈ నేపథ్యంలో చరణ్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ వేడుకగా జరిగాయి. ఆయన భార్య ఉపాసన చరణ్‌ బర్త్‌డే పార్టీని ఘనంగా నిర్వహించింది. మార్చి 27 రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే.

చరణ్‌ బర్త్‌డే పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులంత హంగామా చేశారు. అలాగే అమెరికాలోనూ చరణ్‌ పుట్టిన రోజు సెలబ్రెషన్స్‌ ఘనంగా జరిగాయి. లాస్ ఏంజిల్స్‌లో రామ్ చరణ్ అభిమానులు.. సర్ ప్రైజ్ గ్రీటింగ్స్ తెలిపారు. 

ప్రపంచ సినిమా స్టూడియోలకు ప్రసిద్ది అయిన హాలీవుడ్ సైన్ పై.. ఎయిర్ ప్లేన్ బ్యానర్ ఎగురవేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే చరణ్‌ బర్త్‌డే సందర్భంగా సోమవారం రాత్రి గ్రాండ్‌ పార్టీ ఇచ్చింది మెగా ఫ్యామిలీ. ఈ పార్టీలో టాలీవుడ్‌ తారలంతా సందడి చేశారు.

‘చందమామ’ కాజల్‌ భర్తలో కలిసి హాజరు కాగా.. కొత్త జంట మంచు మనోజ్‌ భార్య మౌనిక కలిసి పాల్గొన్నాడు. ఈ వేడుకలో కాజల్‌ జంట, మనోజ్‌ జంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

అలాగే మంచు లక్ష్మి, ఎస్‌ ఎస్‌ రాజమౌళి విక్టరి వెంకటేశ్‌, శ్రీకాంత్‌, రానా దగ్గుబాటి, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్‌, సాయి ధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, అడవి శేష్‌, దిల్‌ రాజుతో పాటు ఇతర దర్శక-నిర్మాతలు చరణ్‌ బర్త్‌డే సెలబ్రెషన్స్‌లో పాల్గొని సందడి చేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తారలంతా ఒక్కచోట ఇలా కనిపించడం కనుల విందుగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

చదవండి: 
మై స్వీట్‌ బ్రదర్‌ అంటూ ఫొటో షేర్‌ చేసిన మంచు మనోజ్‌
డైరెక్టర్‌తో ఏడేళ్లు ప్రేమ, పెళ్లి.. పెళ్లైన వారానికే నరకం చూశా: నటి జయలలిత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement