ఆర్‌ఆర్‌ఆర్ సినిమా రిలీజైనప్పటి నుంచి ఒకటే రికార్డుల మోత.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ.. అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల పరంపర.. అబ్బో.. ఇలా చాలానే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ అత్యున్నత పురస్కారంగా భావించే ఆస్కార్ సైతం ఆర్‌ఆర్‌ఆర్ వశమైంది. జక్కన్న చెక్కిన ఈ కళాఖండానికి ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్ వచ్చింది. ఇండియన్ సినిమాను చూసి హాలీవుడ్ సైతం నోరెళ్లబెట్టింది. అంతటి కీర్తిప్రతిష్టలు సొంతం చేసుకున్న ఆర్‌ఆర్‌ఆర్ తాజాగా 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లోనూ సత్తా చాటింది. అత్యధికంగా ఆర్‌ఆర్‌ఆర్‌కు 6 అవార్డులు రాగా పుష్ప సినిమాకు 2 అవార్డులు వచ్చాయి.
ఆర్‌ఆర్‌ఆర్‌కు 6 అవార్డులు
బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ వోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు జాతీయ అవార్డు దక్కింది. ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో ప్రేమ్ రక్షిత్‌కు, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో వి.శ్రీనివాస్ మోహన్, ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్‌గా కీరవాణి, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్‌గా కాలభైరవ, బెస్ట్ యాక్షన్ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా కింగ్ సోలోమన్‌కు జాతీయ అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నటుడిగా రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లలో ఎవరో ఒకరికి పురస్కారం ప్రకటించడం ఖాయం అనుకున్నారు ఫ్యాన్స్.
ఈ ముగ్గురిలో ఒక్కరికీ రాలే
కానీ వారి అంచనాలను తారుమారు చేస్తూ పుష్పరాజ్ బన్నీకి కట్టబెట్టారు. అటు రాజమౌళి పరిస్థితి కూడా అంతే.. ఉత్తమ డైరెక్టర్‌గా ఈయన పేరు ప్రకటించడం ఖాయం అనుకుంటే మరాఠీ డైరెక్టర్ నిఖిల్ మహాజన్(గోదావరి సినిమా)కు పురస్కారం వరించింది. దీంతో అభిమానులు నిరాశ చెందారు. ముగ్గురు ఆర్‌లలో ఏ ఒక్కరికీ అవార్డు కైవసం కాలేదని ఫీలవుతున్నారు. వీళ్లు ఏళ్ల తరబడి పడిన కష్టం అవార్డు కమిటీకి కనిపించలేదా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జక్కన్నకు వచ్చినా బాగుండేది!
ఆర్‌ఆర్‌ఆర్‌కు బోలెడన్ని అవార్డులు వచ్చాయి. సినిమాకు పనిచేసిన అందరినీ దాదాపు ఏదో ఒక అవార్డు వరించింది కానీ ఈ ముగ్గురికి మాత్రం ఒక్క పురస్కారం రాలేదు. వీళ్లకు ప్రపంచవ్యాప్తంగా పేరు, గుర్తింపు వచ్చిందే తప్ప అవార్డులు రావడం లేదెందుకని అభిమానులు తల పట్టుకుంటున్నారు. జక్కన్నకు వచ్చినా మనసు తృప్తి చేసుకునేవాళ్లమని అభిప్రాయపడుతున్నారు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విషయానికి వస్తే.. రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు. విజయేంద్రప్రసాద్ కథ అందించగా రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఎమ్‌ఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య దాదాపు రూ.500 కోట్ల పైచిలుకు భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.
THE PROUD TEAM FLOURISHED AGAIN… 💥💥💥💥💥💥
— RRR Movie (@RRRMovie) August 24, 2023
It’s a SIXERRR at the National Awards 🔥🌊 #RRRMovie pic.twitter.com/GOjsY4IHRl
చదవండి: జాతీయ అవార్డు.. బన్నీని పట్టుకుని కంటతడి పెట్టిన సుకుమార్
Comments
Please login to add a commentAdd a comment