RRR: Jr NTR Was Not Invited To Hollywood Critics Association Film Awards? Here Is The Truth - Sakshi
Sakshi News home page

Jr Ntr: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ చేసిన పనికి దిగొచ్చిన హాలీవుడ్‌.. ట్వీట్‌ వైరల్‌

Published Tue, Feb 28 2023 11:56 AM | Last Updated on Tue, Feb 28 2023 1:40 PM

RRR: Jr Ntr Was Not Invited To HCA Film Awards Here Is The Truth - Sakshi

ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ మల్టీస్టారర్లుగా నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినినిమా స్థాయిని ప్రపంచస్థాయిలో నిలబెట్టిన ఈ చిత్రం ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతార్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఆస్కార్‌కు కూడా నామినేట్‌ అయిన ఆర్‌ఆర్‌ఆర్‌ ఇటీవలె  గోల్డెన్ గ్లోబ్‌తో పాటు ‘హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)’అవార్డుల్లో ఏకంగా ఐదింటిని సొంతం చేసుకొని తెలుగు సినిమా సత్తాని మరోసారి ప్రపంచానికి చాటింది.

హాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ ఫిల్మ్స్ 'బ్లాక్ పాంథర్', 'బ్యాట్ మ్యాన్', 'ది విమెన్ కింగ్', 'టాప్ గన్ మేవరిక్' సినిమాలను వెనక్కి నెట్టి మరీ  'ఆర్ఆర్ఆర్' విజేతగా నిలిచింది. అయితే ఈ అవార్డులు అందుకోవడానికి రాజమౌళి, హీరో రామ్ చరణ్, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, రాజమౌళి తనయుడు కార్తికేయ హాజరయ్యారు.కానీ ఎన్టీఆర్‌ మాత్రం మిస్‌ అయ్యారు. అయితే ఈ మొత్తం ఈవెంట్‌లో రామ్‌చరణ్‌ హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

అటు ఇండస్ట్రీ ప్రముఖులు సైతం రామ్‌చరణ్‌ను ప్రశంసిస్తూ సోషల్‌ మీడియాలో పలు పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడిదే ఫ్యాన్‌ వార్‌కు దారితీసింది. కావాలనే తమ హీరోను దూరం పెట్టారంటూ సోషల్‌ మీడియాలో తారక్‌ ఫ్యాన్స్‌ విరుచుకుపడ్డారు. దీంతో స్పందించిన హెచ్‌సీఏ..ఎన్టీఆర్‌కు తాము ఆహ్వానం అందించామని, కానీ ఆయన ఓ సినిమా షూటింగ్‌లో ఉండటం, ఆతర్వాత ఆయన సోదరుడు తారకరత్న చనిపోవడంతో షూటింగ్‌ కూడా నిలిపివేశారని తెలిపారు. ఆయన పర్సనల్‌ కారణాల వల్లే ఈవెంట్‌కు హాజరుకాలేదని హెచ్‌సీఏ బదులిచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement