HCA
-
శంషాబాద్ ఎయిర్ పోర్టులో గొంగడి త్రిషకు ఘన స్వాగతం.. వీడియో
మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో తెలుగు అమ్మాయి గొంగడి త్రిష(gongadi trisha) అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్‌కు వరుసగా రెండోసారి వరల్డ్‌కప్ టైటిల్‌ను త్రిష అందించింది. ఏడు ఇన్నింగ్స్‌లలో 309 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా త్రిష నిలిచింది.అంతేకాకుండా బౌలింగ్‌లోనూ తొమ్మిది వికెట్లతో త్రిష సత్తా చాటింది. ఇక భారత్ వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన త్రిష సోమవారం ఆర్ద రాత్రి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టింది. స్వదేశానికి చేరుకున్న త్రిషకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఘన స్వాగతం పలికారు. త్రిషతో పాటు ద్రితి కేసరి,టీమ్ హెడ్ కోచ్ నూసిన్, ఫిట్నెస్ ట్రైనర్ శాలిని కూడా తమ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో త్రిష మాట్లాడారు."అండర్ 19 వరల్డ్ కప్‌లో మేం పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇక నుంచి మరింత కష్టపడి సీనియర్ టీమ్‌లో చోటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటాను. వరల్డ్‌కప్ మెగా టోర్నీలో ఆడుతున్నప్పటికి నేను ఎలాంటి ఒత్తిడిని తీసుకోలేదు. ప్రతీ మ్యాచ్‌లో నా పాత్రపై మాత్రమే దృష్టి పెట్టాను అని త్రిష పేర్కొంది.మరోవైపు తన సహచర ప్లేయర్ ద్రితిపై త్రిష ప్రశంసల వర్షం కురిపించింది. "ద్రితి అద్భుతమైన ప్లేయర్. కానీ జట్టు కూర్పు వల్ల ఆమెకు ఈసారి ఆడే అవకాశం లభించలేదు. కానీ కచ్చితంగా భవిష్యత్తులో ఆమె అద్భుతాలు సృష్టిస్తుందని" త్రిష కొనియాడింది.ద్రితి మాట్లాడుతూ.. "తొలుత ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోవడం కాస్త బాధగా అన్పించింది. కానీ రెండు మ్యాచ్‌ల తర్వాత దేశం కోసమే ఆలోచించాను. భారత్‌కు వరల్డ్‌కప్ అందించిన టీమ్‌లో నేను భాగం కావడం చాలా గర్వంగా ఉంది. భవిష్యత్తులో అద్బుతంగా రాణిస్తాన్న నమ్మకం నాకు ఉంది. ఈ టోర్నీలో త్రిష తీవ్రంగా శ్రమించింది" అని చెప్పుకొచ్చారు.చదవండి: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లిGongadi Trisha, the Player of the Tournament, of #U19T20WorldCup receives a grand welcome at #Hyderabad Airport.HCA President Jagan Mohan Rao extended a grand welcome to the Women's Under-19 T20 World Cup star cricketers #GongadiTrisha, Drithi Kesari, Head Coach Nooshin and… pic.twitter.com/4P4yup74L4— Surya Reddy (@jsuryareddy) February 4, 2025 -
ఉప్పల్ స్టేడియంలో హెచ్‌సీఏ మీడియా సమావేశం
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఇవాళ (ఏప్రిల్ 10) హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ఉపాధ్యక్షుడు దల్జిత్ సింగ్, సెక్రెటరీ దేవ్ రాజ్, జాయింట్ సెక్రెటరీ బసవరాజు, ట్రెజరర్ సీజే శ్రీనివాస్, కౌన్సిలర్ సునీల్ అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. ఇటీవల సన్‌రైజర్స్ ఐపీఎల్ మ్యాచ్‌కు ముందు తలెత్తిన పవర్ కట్ సమస్య, బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్ల విక్రయం తదితర విషయాలపై వివరణ ఇచ్చారు. స్టేడియంకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై మాట్లాడుతూ..ఈ సమస్య ఇప్పటిది కాదని, 2015 నుంచి ఉందని తెలిపారు. తమ ప్యానెల్ బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వంతో మాట్లాడి విద్యుత్ బకాయిల విడతల వారీగా కడుతున్నామని, ఇప్పటికే మొదటి ఇన్స్టాల్మెంట్ కూడా చెల్లించామని చెప్పారు. బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్ల విక్రయంపై మాట్లాడుతూ.. టికెట్ల విక్రయం అనేది పూర్తిగా సన్‌రైజర్స్‌కి సంబంధించిందని, ఈ విషయంలో తమకెలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌కు రెండు లక్షల టికెట్ల డిమాండ్ ఉందని.. స్టేడియం కెపాసిటీ కేవలం 38 వేలు మాత్రమేనని తెలిపారు. ఇదే సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. తమ ప్యానెల్ వచ్చాక టెస్ట్ మ్యాచ్ విజయవంతంగా నిర్వహించామని, ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా సజావుగా నిర్వహిస్తున్నామని తెలిపారు.స్టేడియంలో కొత్తగా టీవీలు, ఏసీలు పెడుతున్నామని.. వాష్ రూమ్‌లు, లిఫ్ట్‌లు, లాంజ్‌లు రేనోవేట్ చేసామని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌కు సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు రావడంతో పార్కింగ్ సమస్య తలెత్తిన మాట వాస్తవమేనని తెలిపారు. జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి తమ ద్యేయమని.. ఏప్రిల్ 20 నుంచి అన్ని ఉమ్మడి జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో సమ్మర్ క్యాంప్స్ నిర్వహించబోతున్నామని వెల్లడించారు. భవిషత్లో లక్ష సీటింగ్ కెపాసిటీ గల స్టేడియం నిర్మిస్తామని.. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు తెలిపిందని అన్నారు. స్టేడియం లీజ్ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడామని.. అందుకు సీఎం కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. -
Uppal Stadium: టికెట్ ఉన్నా సీటే లేదు!
ఉప్పల్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్లక్షం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. శుక్రవారం ఉప్పల్ స్డేడియంలో సన్‌రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మద్య జరిగిన మ్యాచ్‌లో ఓ అభిమానికి విచిత్ర అనుభవం ఎదురైంది. అతడికి టికెట్ ఉన్నా స్టేడియంలో సీటు లభించలేదు. నగరానికి చెందిన జునైద్ అహ్మద్ రూ.4,500 వెచి్చంచి టికెట్ కొన్నాడు. టికెట్లో జే– 66 సీట్ నంబర్ అలాట్ చేశారు. తీరా స్టేడియంలోకి వెళ్లగా జే–65 తర్వాత 67 సీటు ఉండటంతో షాక్ తిన్నాడు. జే–66 సీట్ ఎంత వెతికినా లభించలేదు. ఎవరిని ఆరా తీసినా ఫలితం లేకుండాపోయింది. చేసేదేమీలేక మ్యాచ్ ఆసాంతం నిలబడే చూడాల్సి వచ్చిందని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశాడు. హెచ్‌సీఏ, ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్, నిర్లక్ష్యం కారణంగానే తాను 4 గంటల పాటు నిలబడాల్సి వచి్చందని జునైద్ ఆరోపించాడు. ఈ విషయాన్ని న్యాయస్థానం, వినియోగదారుల ఫోరం దృష్టికి తీసుకెళ్తానన్నాడు. -
మహిళా క్రికేటర్లతో అసభ్యంగా ప్రవర్తించిన కోచ్ పై వేటు
-
భారత్, ఇంగ్లండ్ టెస్టుకు ఏర్పాట్లు పూర్తి..
హైదరాబాద్‌లో ఈనెల 25 నుంచి జరగనున్న భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావు తెలిపారు. ఇప్పటికే 26 వేల టికెట్లు అమ్ముడుపోయాయని ఆయన తెలిపారు. మొత్తం 25 వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు ఆయన వివరించారు. భారత జట్టు శనివారమే నగరానికి చేరుకోగా, ఇంగ్లండ్ నేడు అడుగు పెడుతుంది. -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఈడీ విచారణ
-
హెచ్‌సీఏ అక్రమాలపై ఈడీ విచారణ.. మాజీ అధ్యక్షుడు వినోద్‌కు నోటీసులు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్) విచారణ చేపట్టింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియం నిర్మాణంలో రూ.20 కోట్ల మేర జరిగిన అవకతవకలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు, కార్యదర్శులను ఈడీ విచారించింది. మాజీ క్రికెటర్లు ఆర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్‌లను కూడా ఈడీ ప్రశ్నించింది. హెచ్సీఎ మాజీ అధ్యక్షుడు, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో హాజరుకావాలని వినోద్ కు నోటీస్‌లో పేర్కొంది. చదవండి: Test team of the year 2023: అత్యుత్తమ టెస్టు జట్టు ఇదే.. కోహ్లి, రోహిత్‌లకు నో ఛాన్స్ -
హెచ్‌సీఏలో ఎన్నికల సందడి
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక అవకతవకలు, అవినీతి, కోర్టు వివాదాలు, పరస్పర ఆరోపణలు, సస్పెన్షన్లు, పర్యవేక్షకుల పరిపాలన తర్వాత ఎట్టకేలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రిటర్నింగ్ అధికారిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీఎస్ సంపత్ ఆధ్వర్యంలో నేడు ఉప్పల్ స్టేడియంలో ఎన్నికలు జరుగుతాయి. వాస్తవానికి మొహమ్మద్ అజహరుద్దీన్ అధ్యక్షుడిగా 2019లో ఎన్నికైన హెచ్‌సీఏ కార్యవర్గం పదవీ కాలం గత ఏడాది సెపె్టంబర్ 26నే ముగిసింది. ఆ వెంటనే ఎన్నికలు జరగాల్సి ఉన్నా... వేర్వేరు వివాదాలతో అవి వాయిదా పడ్డాయి. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఎన్నికలు జరిగే వరకు రోజూవారీ కార్యకలాపాల కోసం మాజీ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) ఎల్.నాగేశ్వరరావు నేతృత్వంలో ఏకసభ్య పర్యవేక్షణ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే హైదరాబాద్‌లో మూడు వరల్డ్‌కప్ మ్యాచ్‌లు కూడా జరిగాయి. చివరకు అక్టోబర్ 20న ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి ముందు హెచ్‌సీఏను ప్రక్షాళన చేసే క్రమంలో 57 క్లబ్‌లపై నాగేశ్వరరావు నిషేధం విధించారు. దాంతో ఈ క్లబ్‌లకు ఎన్నికల్లో ఓటు హక్కు లేకుండా పోయింది. నాలుగు ప్యానెల్లుగా... అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్... ఇలా ఆరు పదవుల కోసం ఎన్నికలు జరగనున్నాయి. లోధా కమిటీ సిఫారసులు, కొత్త నియమావళి కారణంగా గతంలో కీలక పదవులు నిర్వహించిన సీనియర్లందరూ ఈసారి పోటీలో లేకపోగా, తాము మద్దతునిస్తూ సన్నిహితులను బరిలోకి దించారు. దాంతో ఈసారి ఎక్కువగా కొత్త మొహాలు కనిపిస్తున్నాయి. నాలుగు వేర్వేరు గ్రూప్‌లుగా విడిపోయి అభ్యర్థులంతా పోటీ చేస్తున్నారు. అయితే ఫలితం విషయంలో గ్రూప్‌లతో సంబంధం లేదు. ఒక్కో పదవి కోసం అత్యధిక ఓట్లు సాధించిన వారు ప్యానెల్‌తో సంబంధం లేకుండా ఎన్నికవుతారు. పోలింగ్ కోసం మొత్తం 173 ఓట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 101 రెగ్యులర్ క్రికెట్ క్లబ్‌లు కాగా 48 ఇన్స్టిట్యూషన్ క్లబ్‌లు ఉన్నాయి. 9 జిల్లా క్లబ్‌లతో పాటు 15 మందికి అంతర్జాతీయ ఆటగాళ్ల హోదాలో ఓటు హక్కు ఉంది. గెలిస్తే తాము హైదరాబాద్ క్రికెట్ సంఘాన్ని చక్కదిద్దుతామని, వివాదాలు లేకుండా నడిపిస్తామని అభ్యర్థులంతా హామీ ఇస్తున్నారు. శుక్రవారం సాయంత్రమే ఓట్లను లెక్కించి ఫలితాన్ని ప్రకటిస్తారు. -
‘హెచ్‌సీఏ’ కమిటీపై ఉత్తర్వులు ఇవ్వవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న జస్టిస్ (రిటైర్డ్) ఎల్.నాగేశ్వరరావు కమిటీకి సంబంధించి దిగువ కోర్టులు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌సీఏ కమిటీ రద్దయిన నేపథ్యంలో అసోసియేషన్ కార్యకలాపాలను చక్కదిద్దేందుకు గత ఫిబ్రవరిలో ఎల్. నాగేశ్వరరావుతో ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. అయితే హెచ్‌సీఏ ఎన్నికల అంశం వ్యవహారం సహా ఇతర అంశాల్లో పలువురు హెచ్‌సీఏ సభ్యులు పదే పదే వేర్వేరు కారణాలతో కోర్టును ఆశ్రయిస్తున్నారు. వీరి పిటిషన్ల తర్వాత హైకోర్టుతో పాటు జిల్లా కోర్టులు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశాయి. ఈ విషయం సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. హెచ్‌సీఏ ప్రస్తుత స్థితికి సంబంధించి సుప్రీంకోర్టులోనే పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై తీర్పు ఇచ్చే అధికారం అత్యున్నత న్యాయస్థానానికి ఉందని సుప్రీం అభిప్రాయపడింది. అసలు అలాంటి పిటిషన్లను అనుమతించడమే తప్పని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. హైకోర్టు లేదా జిల్లా కోర్టులు ఎలాంటి ఆదేశాలు ఇచ్చిన చెల్లవని కూడా స్పష్టం చేసిన సుప్రీంకోర్టు... తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. -
వరుసగా 2 మ్యాచ్‌లు కష్టమన్న హెచ్‌సీఏ.. షెడ్యూల్ మార్పు కుదరదన్న బీసీసీఐ
న్యూఢిల్లీ: భారత్ ఆతిథ్యమిచ్చే వన్డే వరల్డ్‌కప్ మరో 45 రోజుల్లో మొదలవనుంది. ఈ దశలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వరుస రోజుల్లో రెండు ప్రపంచకప్ మ్యాచ్‌ల నిర్వహణ కష్టమవుతుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్టోబర్ 9, 10 తేదీల్లో జరిగే మ్యాచ్‌లకు మార్పు కోరింది. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో షెడ్యూల్ మార్పు కుదరదని స్పష్టం చేశారు. నిజానికి మెగా ఈవెంట్ షెడ్యూల్ చాలా ముందుగా విడుదల చేస్తారు. కానీ ఈసారి కేవలం నాలుగు నెలల ముందే జూన్‌లో ప్రకటించారు. ఇటీవలే షెడ్యూల్లో మార్పులు చేశారు. మళ్లీ మార్పులంటే కష్టమేనని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే మరో నాలుగు రోజుల్లోనే (ఈ నెల 25న) టికెట్ల విక్రయం కూడా జరగబోతుంది. లాజిస్టిక్ సమస్యలే కాదు... ఇతరత్రా సర్దుబాట్లకు అవకాశాల్లేవని బోర్డు వర్గాలు అభిప్రాయపడ్డాయి. అందువల్లే ఇకపై షెడ్యూల్లో మార్పలుండబోవని స్పష్టం చేసింది. అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల మధ్య అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్ మొదలవుతుంది. అసలేం జరిగింది? తొలుత ఐసీసీ–బీసీసీఐ ఖరారు చేసిన షెడ్యూలు ప్రకారం అక్టోబర్ 9న ఉప్పల్ మైదానంలో న్యూజిలాండ్, నెదర్లాండ్స్‌ల మధ్య మ్యాచ్, 12న పాకిస్తాన్, శ్రీలంకల మధ్య మ్యాచ్‌లు జరగాలి. అయితే మెగా ఈవెంట్‌కే హైలైట్‌గా నిలువనున్న భారత్, పాక్ పోరు అహ్మదాబాద్‌లో ఒకరోజు ముందుకు (అక్టోబర్ 15 నుంచి 14కు) జరిపారు. దీంతో పాకిస్తాన్‌కు సరైన విరామం కోసమని పాక్, శ్రీలంక మధ్య 12న జరగాల్సిన మ్యాచ్‌ను 10న నిర్వహించడమే హెచ్‌సీఏకు కష్టాలను తెచ్చిపెట్టింది. 9, 10 తేదీల్లో మ్యాచ్‌లంటే పోలీసు శాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని సుప్రీం కోర్టు నియమిత అడ్మిని్రస్టేటర్తో నడుస్తున్న హెచ్‌సీఏ తెలిపింది. నేను హైదరాబాద్ వేదిక ఇన్చార్జ్గా ఉన్నాను. అక్కడ ఏమైన సమస్యలుంటే పరిష్కరించవచ్చు. కానీ షెడ్యూల్ మార్పు ఒక్క బీసీసీఐ చేతుల్లో ఉండదు. ఐసీసీ, పాల్గొంటున్న జట్లు, ఇతరత్రా సంస్థలు (సదుపాయాలు, లాజిస్టిక్స్) అందర్నీ ఒప్పించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు అసాధ్యం. –బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా -
ఆ విషయంలో ఎన్టీఆర్ హర్ట్ అయ్యాడా? అందుకే అమెరికాకు వెళ్లలేదా?
ఆర్ఆర్ఆర్ విడుదలై ప్రపంచ వ్యాప్తంగా దుమ్ములేపింది. ఆస్కార్ అందుకోవటానికి అడుగు దూరంలో ఉంది. ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో వరుసగా గోల్డెన్ గ్లోబ్, లాస్ ఎంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్...హెచ్.సి.ఏ అవార్డ్స్ అందుకుంది. ఇక హెచ్.సి.ఏ అవార్డ్స్ లో హాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టి ఆర్ఆర్ఆర్ బెస్ట్ యాక్షన్ మూవీగా అవార్డ్ సొంతం చేసుకుంది. అమెరికాలో రాజమౌళి అండ్ టీమ్ ..హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఎన్టీఆర్ ప్యాన్స్ మాత్రం తమ హీరోకి అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ టీమ్ ను ఏకి పడేస్తున్నారు..ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కూడా హార్ట్ అయ్యాడనే మాట తెరపైకి వచ్చింది ఆర్ఆర్ఆర్ సినిమా బాగుంది. వరల్డ్ వైడ్ గా మూవీ లవర్స్ అందరూ ఆదరించారు..ప్రశంసించారు. కానీ ఈ సినిమా విడుదలైనప్పడు నుంచి ఈ సినిమాలో ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ పాత్రకే రాజమౌళి ప్రాధాన్యత ఇచ్చాడనే మాట ఎక్కువగా వినిపించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్ లో డైరెక్టర్ రాజమౌళి ఇచ్చిన ఎలివేషన్స్ మూవీ లవర్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. అలాంటి ఎలివేషన్స్ జూనియర్ ఎన్టీఆర్ కి ఇవ్వలేదనేది నందమూరి ప్యాన్స్ ఆరోపణ. ఆస్కార్ ఎంట్రీ కోసం జూనియర్ ఎన్టీఆర్...చెర్రీ ....రాజమౌళి అండ్ టీమ్ దాదాపు రెండు నెలలు అమెరికాలో ఉండి చాలా కష్టపడ్డారు. ఆ సమయంలో హాలీవుడ్ పత్రికలు...ఫిల్మ్ క్రిటిక్స్ అందరూ జూనియర్ ఎన్టీఆర్ నటనని ఆకాశానికి ఎత్తేశారు. ఆస్కార్ బెస్ట్ యాక్టర్ రేస్ లో ఎన్టీఆర్ ఉంటాడని హాలీవుడ్ మ్యాగజైన్ వైరటీ స్పెషల్ స్టోరీ రాసింది. అలాగే యూఎస్ఏ టుడే పత్రిక కూడా ఎన్టీఆర్ యాక్టింగ్ ని తెగ పొగిడేసింది. ఇండియా..ఇంటర్ నేషనల్ పత్రికలు కొమరం భీముడు పాత్రలో నటించిన ఎన్టీఆర్ కి ఆస్కార్ వస్తుందని ఊదరగొట్టారు. ఇక రాజమౌళి కూడా ఎన్టీఆర్ కి బెస్ట్ యాక్టర్ నామినేషన్స్ ఉంటాడనే హామీ ఇచ్చాడనే ప్రచారం జరిగింది. దీంతో ఎన్టీఆర్ ఆస్కార్ పై ఆశలు పెట్టుకున్నాడట. చివరకి నాటు నాటు సాంగ్ కి మాత్రమే నామినేషన్ దక్కింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పాటు...ఎన్టీఆర్ కూడా బాగా డిస్పాయింట్ అయ్యాడనే మాట బాగా వినిపించింది. ఇక ఆస్కార్ నామినేషన్ దక్కపోయినా...కనీసం ఎన్టీఆర్ కి నేషనల్ బెస్ట్ అవార్డ్ వస్తుందని ఆశించారు ఫ్యాన్స్...అది కూడా రాలేదు. రాజమౌళి ఆస్కార్ పై పెట్టిన ఫోకస్...కాస్త ఇండియాలో కూడా పెట్టి ఉంటే నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఖచ్చితంగా ఎన్టీఆర్ కే వచ్చి ఉండేదని మరో వాదన తెరపైకి తీసుకువచ్చారు. రీసెంట్ గా హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ చూసి చెర్రీ యాక్టింగ్ ను తెగ పొగిడాడు. ఈ విషయం తర్వాత ఎన్టీఆర్ బాగా హార్ట్ అనే మాట బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందుకే ఆస్కార్ అవార్డ్ వేడుకకి కూడా అమెరికా వెళ్లటం లేదనే ప్రచారం జరుగుతోంది. అందుకే రామ్ చరణ్ ఒక్కడే అమెరికా వెళ్లిపోయాడనే మాట నెట్టింట ఎక్కువగా వినిపించింది. దీంతో హెచ్‌సీఏ వివరణ ఇచ్చింది. ఎన్టీఆర్‌కు తాము ఆహ్వానం అందించామని, కానీ ఆయన ఓ సినిమా షూటింగ్లో ఉండటం, ఆతర్వాత ఆయన సోదరుడు తారకరత్న చనిపోవడంతో ఆయన రాలేదని పేర్కొంది. Dear RRR fans & supporters, We did invite N. T. Rama Rao Jr. to attend the #HCAFilmAwards but he is shooting a new film in India. He will be receiving his awards from us shortly. Thank you for all your love and support. Sincerely, The Hollywood Critics Association — Hollywood Critics Association (@HCAcritics) February 27, 2023 అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆస్కార్ అవార్డ్స్ ఫెస్టివల్ లో పాల్గొనబోతున్నాడు. తన అన్నయ్య తారకరత్న పెద్దకర్మ మార్చి 2న జరగబోతుంది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మార్చి నాలుగైదు తారీఖుల్లో జూనియర్ ఎన్టీఆర్ అమెరికా బయలు దేరతాడని తెలిసింది. తన అన్నయ్య తారకరత్నకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో ఎన్టీఆర్ ఉండాలనుకున్నాడు...అందుకే చెర్రీ తో కలిసి ఎన్టీఆర్ అమెరికా వెళ్లలేదు. ఇలాంటి సమయంలో కుటుంబానికి అండగా ఉండాలనే కారణంతోనే జూనియర్ ఎన్టీఆర్ కొన్ని రోజులు ఆలస్యంగా యూఎస్ కి బయలుదేరనున్నాడు. -
ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన పనికి దిగొచ్చిన హాలీవుడ్.. ట్వీట్ వైరల్
ఎన్టీఆర్-రామ్‌చరణ్ మల్టీస్టారర్లుగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినినిమా స్థాయిని ప్రపంచస్థాయిలో నిలబెట్టిన ఈ చిత్రం ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతార్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఆస్కార్‌కు కూడా నామినేట్ అయిన ఆర్ఆర్ఆర్ ఇటీవలె గోల్డెన్ గ్లోబ్‌తో పాటు ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్(హెచ్‌సీఏ)’అవార్డుల్లో ఏకంగా ఐదింటిని సొంతం చేసుకొని తెలుగు సినిమా సత్తాని మరోసారి ప్రపంచానికి చాటింది. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ ఫిల్మ్స్ 'బ్లాక్ పాంథర్', 'బ్యాట్ మ్యాన్', 'ది విమెన్ కింగ్', 'టాప్ గన్ మేవరిక్' సినిమాలను వెనక్కి నెట్టి మరీ 'ఆర్ఆర్ఆర్' విజేతగా నిలిచింది. అయితే ఈ అవార్డులు అందుకోవడానికి రాజమౌళి, హీరో రామ్ చరణ్, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, రాజమౌళి తనయుడు కార్తికేయ హాజరయ్యారు.కానీ ఎన్టీఆర్ మాత్రం మిస్ అయ్యారు. అయితే ఈ మొత్తం ఈవెంట్లో రామ్‌చరణ్ హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అటు ఇండస్ట్రీ ప్రముఖులు సైతం రామ్‌చరణ్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడిదే ఫ్యాన్ వార్‌కు దారితీసింది. కావాలనే తమ హీరోను దూరం పెట్టారంటూ సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. దీంతో స్పందించిన హెచ్‌సీఏ..ఎన్టీఆర్‌కు తాము ఆహ్వానం అందించామని, కానీ ఆయన ఓ సినిమా షూటింగ్లో ఉండటం, ఆతర్వాత ఆయన సోదరుడు తారకరత్న చనిపోవడంతో షూటింగ్ కూడా నిలిపివేశారని తెలిపారు. ఆయన పర్సనల్ కారణాల వల్లే ఈవెంట్‌కు హాజరుకాలేదని హెచ్‌సీఏ బదులిచ్చింది. Dear RRR fans & supporters, We did invite N. T. Rama Rao Jr. to attend the #HCAFilmAwards but he is shooting a new film in India. He will be receiving his awards from us shortly. Thank you for all your love and support. Sincerely, The Hollywood Critics Association — Hollywood Critics Association (@HCAcritics) February 27, 2023 He was originally shooting a movie which is why he couldn’t attend. His brother passing happened afterwards and is why he stepped away from the movie. This is what his publicist told us. — Hollywood Critics Association (@HCAcritics) February 27, 2023 -
ఆ ఘనత అందుకున్న తొలి భారతీయ హీరోగా రామ్‌చరణ్ రికార్డు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికా వెళ్ళి ఐదు రోజులవుతుంది. అక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి వరుస కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అమెరికాలోని ఓ ఆలయంలో అయ్యప్ప మాల తీసిన తర్వాత 'గుడ్ మార్నింగ్ అమెరికా' షోలో పాల్గొన్నారు. తర్వాత 'ఏబీసీ న్యూస్'కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అనంతరం అభిమానులతో ముచ్చటించారు. 'ఆర్ఆర్ఆర్', 'నాటు నాటు' సాంగ్, ఎస్.ఎస్. రాజమౌళి గురించి గొప్పగా చెప్పారు. బేవెర్లీ హిల్స్‌లో శనివారం ఉదయం జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లోనూ రామ్ చరణ్ సందడి చేశారు. 'ఆర్ఆర్ఆర్'కు వచ్చిన స్పాట్ లైట్ అవార్డు అందుకున్నారు. హెచ్‌సీఏ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్'కు నాలుగు అవార్డులు వచ్చాయి. ఈ అవార్డుల వేడుకలో రామ్ చరణ్ అరుదైన ఘనత అందుకున్నారు. హెచ్‌సీఏ అవార్డుల్లో ప్రజెంటర్‌గా 'బెస్ట్ వాయిస్ / మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్'ను రామ్ చరణ్ అనౌన్స్ చేశారు. ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ హీరోగా రామ్ చరణ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఆయన పక్కన నిలబడటమే అవార్డ్ అని నటి ఏంజెలా చెప్పారు. హాలీవుడ్ సినిమాకు అవార్డ్ ఇచ్చే గౌరవం అందుకున్న ఏకైక హీరోగా రామ్ చరణ్ నిలిచారు. Honoured to be representing Indian Cinema at the @HCAcritics 2023 along with @ssrajamouli Garu & @mmkeeravaani Garu. I’m proud of the recognition we received as team @RRRMovie tonight. pic.twitter.com/u44ee2peX5 — Ram Charan (@AlwaysRamCharan) February 25, 2023 -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేసిన సుప్రీంకోర్టు
-
హెచ్‌సీఏ అస్తవ్యస్తంగా మారింది: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
-
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ హైదరాబాద్ వన్డే.. టికెట్ల విక్రయం ఎప్పుడు, ఎలా అంటే..?
IND VS NZ 1st ODI: ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ ముగిశాక, న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో కివీస్ 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. పర్యటనలో భాగంగా తొలుత వన్డే సిరీస్ ఆడనున్న న్యూజిలాండ్.. జనవరి 18న హైదరాబాద్ వేదికగా తొలి వన్డే, 21న రాయ్‌పూర్ వేదికగా రెండో వన్డే, 24న ఇండోర్ వేదికగా మూడో వన్డే ఆడుతుంది. అనంతరం జనవరి 27న రాంచీ వేదికగా తొలి టీ20, 29న లక్నో వేదికగా రెండో టీ20, అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 1న మూడో టీ20 ఆడనుంది. వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటల నుంచి, టీ20లు రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమవుతాయి. కాగా, నాలుగేళ్ల విరామం తర్వాత హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో వన్డే మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడు మహ్మద్ అజహారుద్దీన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. టికెట్ల విక్రయం, మ్యాచ్‌కు ముందు షెడ్యూల్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించారు. గతేడాది ఆసీస్‌తో టీ20 సందర్భంగా టికెట్ల విక్రయంలో జరిగిన రసాభసను దృష్టిలో ఉంచుకుని ఈసారి తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. గతంలోలా కాకుండా ఈసారి టికెట్లను కేవలం ఆన్లైన్లో (పేటీయం) మాత్రమే విక్రయిస్తామని స్పష్టం చేశారు. ఆన్లైన్లో టికెట్లు జనవరి 13 నుండి 16 వరకు విడతల వారీగా సేల్ చేస్తామని తెలిపారు. మ్యాచ్‌కు రావడానికి ఫిజికల్ టికెట్ తప్పనిసరి అని, విక్రయించిన టికెట్లను ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో జనవరి 15 నుండి 18 వరకు (ఉదయం 10 నుండి 3 వరకు) కలెక్ట్ చేసుకోవాలని సూచించారు. స్టేడియం కెపాసిటీ 39,112 అయితే, 9695 కాంప్లిమెంటరీ టికెట్స్ పోగా మిగతా 29, 417 టికెట్స్ ఆన్లైన్లో సేల్ చేస్తామని తెలిపారు. న్యూజిలాండ్ టీమ్ జనవరి 14న హైదరాబాద్‌కు చేరుకుంటుందని, 15న ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటుందని, జనవరి 16న టీమిండియా నగరానికి చేరుకుంటుందని వివరించారు. -
మ్యాచ్ నిర్వహణలో మరోసారి బయటపడిన HCA నిర్లక్ష్యం
-
పతనానికి పరాకాష్ట
-
HCA పై మాజీ ప్రెసిడెంట్ వివేక్ ఫైర్
-
అజారుద్దీన్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఫైర్
-
అంతా పారదర్శకమే.. టికెట్ల విక్రయాలపై అజహర్ స్పష్టీకరణ
ఉప్పల్/సాక్షి, న్యూఢిల్లీ: క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయాల్లో అన్ని రకాలుగా పారదర్శకత పాటించామని, తమ వైపునుంచి టికెట్లు బ్లాక్ అయ్యే అవకాశమే లేదని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ స్పష్టం చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్‌లో ఆదివారం జరిగే మూడో టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాల్లో నెలకొన్న గందరగోళంపై ఆయన ఈ మేరకు స్పందించారు. జింఖానా మైదానంలో జరిగిన సంఘటన దురదృష్టకరమని, మ్యాచ్ రోజున ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘టికెట్ల విక్రయం బాధ్యతను పేటీఎంకు అప్పగించాం. ఇందులో నేరుగా హెచ్‌సీఏ ప్రమేయం లేదు. ఆన్లైన్ టికెట్లను బ్లాక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు’ అని చెప్పారు. ఆన్లైన్లో 11,450, 3,000 చొప్పున రెండుసార్లు, ఆఫ్‌లైన్‌లో 2,100 టికెట్లు విక్రయించామని చెప్పారు. తప్పనిసరిగా ఇవ్వాల్సిన స్పాన్సర్లు తదితరులకు 6 వేల టికెట్లు ఇచ్చినట్లు చెప్పారు. నిబంధనల ప్రకారమే తమ క్లబ్ కార్యదర్శులకూ కాంప్లిమెంటరీలు ఇచ్చామని అజహర్ పేర్కొన్నారు. సజావుగా నిర్వహించేందుకు... హెచ్‌సీఏలో కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ మ్యాచ్ నిర్వహణకు సంబంధించి ఆన్లైన్లో సమీక్ష నిర్వహించింది. ఇందులో హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ, ఏసీబీ డైరెక్టర్ అంజనీకుమార్, మాజీ క్రికెటర్లు వెంకటపతిరాజు, వంకా ప్రతాప్ పాల్గొన్నారు. మ్యాచ్‌ను సజావుగా నిర్వహించడమే ప్రధాన ఉద్దేశమని జస్టిస్ కక్రూ తెలిపారు. మ్యాచ్‌ను సక్రమంగా నిర్వహించేందుకు కమిటీ హెచ్‌సీఏకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందన్నారు. టి–20 టికెట్లలో భారీ కుంభకోణం: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హఫీజ్‌పేట్: హైదరాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరగబోయే టి–20 క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో భారీ కుంభకోణం జరిగిందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ ఆదేశాలతో క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రంగంలోకి దిగి, హెచ్‌సీఏతో కుమ్మక్కై టికెట్లను బ్లాక్‌లో అమ్ముకున్నారన్నారు. మియాపూర్ మదీనాగూడలోని కిన్నెర గ్రాండ్ హోటల్లో శుక్రవారం జరిగిన ప్రవాస్ యోజన సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. టికెట్ల విక్రయం ఓ ఆన్లైన్ సంస్థకు అప్పజెప్పి, అర్ధరాత్రి 10 గం.కు అమ్మకాలు ఓపెన్ చేసి 20 నిమిషాల్లో 39 వేల టికెట్లు అమ్ముడుపోయాయనడం విడ్డూరమన్నారు. రూ.800 టికెట్‌ను బ్లాక్‌లో రూ.8,000 నుంచి రూ.30 వేల వరకు అమ్ముతున్నారని ఆరోపించారు. -
నెగెటివ్ ప్రచారం చేయడం తగదు : అజారుద్దీన్
-
అజారుద్దీన్ పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు
-
నిన్న జరిగినా ఘటనకు మేం బాధ్యులం కాదు
-
కాసేపట్లో HCA ప్రెసిడెంట్ అజారుద్దీన్ ప్రెస్ మీట్
-
ఆన్లైన్ బుకింగ్ చేసినవాళ్లకే జింఖానాలోకి ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో జరగబోయే టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయం రసాభాసాగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పేటీఎంలో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లకు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో టికెట్లు ఇవ్వాలని హెస్‌సీఏ నిర్ణయించింది. శుక్రవారం ఉదయం 11 గంటల తర్వాత టికెట్లు ఇవ్వనున్నారు. అలాగే.. ఆఫ్‌లైన్ టికెట్ల కోసమంటూ గ్రౌండ్ వైపు ఎవరూ రావొద్దని పోలీసులు కోరుతున్నారు. గురువారం నాటి తొక్కిసలాట, లాఠీఛార్జీ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పేటీఎంలో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు.. జింఖానా వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్ కో నిల్చోవాలని సూచిస్తున్నారు పోలీసులు. అలాగే ఆన్లైన్ బుకింగ్ ఉన్నవాళ్లకు మాత్రమే జింఖానాలోకి ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. ఇతర వ్యక్తులు గ్రౌండ్లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. ఇక హెచ్‌సీఏ తీరుతో క్రికెట్ చూడటం అభిమానులకు అందని ద్రాక్షేనా అనే ప్రశ్న మొదలైంది. అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహణలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ ఘోర వైఫల్యం చెందారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టికెట్ల విక్రయాల్లో పారదర్శకత లోపించిందని, లోగుట్టుగా నడిచిన మ్యాచ్ టికెట్ విక్రయాల తీరుపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీటికి తోడు కాంప్లిమెంటరీ పాసుల కోసం బడాబాబులు, వీఐపీలు కక్కుర్తి పడుతున్నట్లు తేలింది. అసలు ఆఫ్ లైన్ టికెట్లు సైతం ఎన్ని విక్రయించారో అజార్ క్లారిటీ ఇవ్వకపోవడంపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మ్యాచ్‌ల నిర్వహణ సాఫీగా సాగుతున్న వేళ.. టికెట్ విక్రయాల కోసం హెచ్‌సీఏ సతమతం కావడంపై చర్చ నడుస్తోంది. ఒకరకంగా జింఖానా తొక్కిసలాట ఘటనతో నగర ఈమేజ్ దెబ్బతిందనే మాట సైతం వినిపిస్తోంది. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజార్ ఒంటెద్దు పోకడతోనే ఈ స్థితి కి కారణమంటున్నారు కొందరు. ఇదీ చదవండి: జింఖానా ‘తొక్కిసలాట’.. మహిళను కాపాడేందుకు ఆ లేడీ కానిస్టేబుల్ ఏం చేసిందంటే? -
HCA డకౌట్
-
తొక్కిసలాటకు అజారే బాధ్యత వహించాలి : HCA మాజీ కార్యదర్శి శేషునారాయణ్
-
మ్యాచ్ నిర్వహించడం అంత ఈజీ కాదు : అజారుద్దీన్
-
జింఖానా ‘తొక్కిసలాట’.. మహిళను కాపాడేందుకు ఆ లేడీ కానిస్టేబుల్ ఏం చేసిందంటే?
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద ఉదయం ఆసీస్-భారత్ మ్యాచ్ టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ లేడీ కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించింది. ప్రాణాపాయంలో ఉన్న మహిళకు వెంటనే సీపీఆర్ చేసి ఆ ప్రాణాన్ని నిలబెట్టింది. టిక్కెట్ల కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో అందులో 45 ఏళ్ల మహిళ పూర్తిగా స్పృహ తప్పి పడిపోయారు. చదవండి: హెచ్‌సీఏపై సమీక్ష.. కఠినచర్యలు తప్పవ్..! మంత్రి షాకింగ్ కామెంట్స్ దీంతో బేగంపేట మహిళా పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నవీన తక్షణమే స్పందించి ఆ మహిళను బయటకులాగారు. అప్పటికే ఆమె స్పృహ కోల్పోయి ఊపిరి అందని పరిస్థితిలో ఉండటంతో ఆ కానిస్టేబుల్ సీపీఆర్ చేశారు. మహిళను కాపాడిన కానిస్టేబుల్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కానిస్టేబుల్ నవీన సాక్షితో మాట్లాడుతూ, సాటి మహిళను కాపాడాలని ఆలోచించానని తెలిపారు. -
హెచ్‌సీఏ కీలక నిర్ణయం! రాత్రి 7 గంటల నుంచి ఆన్లైన్లో టికెట్లు!
భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 టిక్కెట్ల అమ్మకం నేపథ్యంలో జింఖానా గ్రౌండ్లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సిరీయస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర క్రీడా శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో చర్చల అనంతరం హెచ్‌సీఏ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం 7 గంటల నుంచి ఆన్లైన్లో టికెట్లను విక్రయించాలని హెచ్‌సీఏ నిర్ణయించకున్నట్లు సమాచారం . సూమారు 7000 టికెట్లు అందుబాటులో ఉండనున్నట్లు హెచ్‌సీఏ వర్గాలు పేర్కొన్నాయి. కాగా జింఖానా గ్రౌండ్లో టికెట్ల విక్రయాలను నిలిపివేసినట్లు ఓ ప్రకటనలో హెచ్‌సీఏ పేర్కొంది. మరోవైపు ఆన్లైన్లో టికెట్ల అమ్మకాలపై హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ మాత్రం భిన్నంగా స్పందించినట్లు సమాచారం. ఓవైపు ఆన్లైన్లో టికెట్లు అని వార్తలు వస్తుంటే.. ఆయన మాత్రం టికెట్లన్నీ అయిపోయాయని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కాగా సెప్టెంబరు 25న భారత్- ఆసీస్ మధ్య మూడో టీ20 ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగనుంది. చదవండి: Ind Vs Aus 3rd T20: మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయండి! అప్పుడే వాళ్లకు తెలిసివస్తుంది! -
హెచ్‌సీఏపై సమీక్ష.. కఠినచర్యలు తప్పవ్..! మంత్రి షాకింగ్ కామెంట్స్
India Vs Australia 2022 3rd T20 Uppal Stadium Tickets- HCA: జింఖానా తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. హెచ్‌సీఏ నుంచి ప్రభుత్వం వివరణ కోరింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులతో సమావేశమయ్యారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్, రాచకొండ సీపీ మహేష్ భగవత్ హాజరయ్యారు. చదవండి: హెచ్‌సీఏ ఘోర వైఫల్యం.. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయి? సమావేశానికి ముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, టికెట్ల అమ్మకాలు పారదర్శకంగా జరగలేదన్నారు. టికెట్ల అమ్మకాల్లో అక్రమాలపై విచారణ చేపడతామన్నారు. అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠినచర్యలు తప్పవన్నారు. తెలంగాణ ప్రతిష్టను దిగజారిస్తే ఊరుకునేదిలేదన్నారు.హెచ్‌సీఐ పూర్తిగా వైఫల్యం చెందిందని మంత్రి అన్నారు. కాగా, ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్‌లో జరగబోయే మ్యాచ్ కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద టికెట్ల అమ్మకాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)ఘోర వైఫల్యం మూటగట్టుకుంది. టిక్కెట్లు కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌సీఏ తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. హెచ్‌సీఏ ఘోర వైఫల్యంపై ఆ అసోసియేషన్ మాజీ కార్యదర్శి శేష్ నారాయణ్ మండిపడ్డారు. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. -
HCA రాజకీయాలు ప్రభుత్వం పై రుద్దితే తీవ్ర పరిణామాలు ఉంటాయి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
-
లాఠీచార్జ్ కు బాద్యులు ఎవరు ..?
-
హెచ్‌సీఏ ఘోర వైఫల్యం.. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయి?
సాక్షి, హైదరాబాద్: ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్‌లో జరగబోయే మ్యాచ్ కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద టికెట్ల అమ్మకాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)ఘోర వైఫల్యం మూటగట్టుకుంది. టిక్కెట్లు కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌సీఏ తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. హెచ్‌సీఏ ఘోర వైఫల్యంపై ఆ అసోసియేషన్ మాజీ కార్యదర్శి శేష్ నారాయణ్ మండిపడ్డారు. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. చదవండి: ఉప్పల్ స్టేడియంలో ఇండియా– ఆస్ట్రేలియా మ్యాచ్.. అభిమానులతో ఆటలా! ‘‘ఒక్కరోజే ఇన్ని టిక్కెట్లు ఎలా అమ్ముదామనుకున్నారు. ఆన్లైన్లో అని చెప్పి ఆఫ్‌లైన్‌లోకి ఎందుకెళ్లారు?. హెచ్‌సీఏలో అజారుద్దీన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. తొక్కిసలాటకు ఆయనే బాధ్యత వహించాలి. 32 వేల టిక్కెట్లు అందుబాటులో ఉండాలి. టికెట్ల విక్రయానికి అన్ని చోట్ల కౌంటర్లు ఏర్పాటు చేయాలి. ఒక్కచోటే కౌంటర్ పెట్టడం సరికాదు. ఒక్కరోజే టికెట్లు విక్రయించడం సరికాదు. కనీసం నాలుగైదు రోజులు టికెట్లు విక్రయించాలి. ఆన్లైన్లో అమ్మిన టికెట్లలో అక్రమాలు జరిగాయి. ఎవరికి టికెట్లు అమ్మారో వివరాలు బయటపెట్టాలి’’ అని శేష్ నారాయణ్ డిమాండ్ చేశారు. -
జింఖానా గ్రౌండ్ తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదు: అడిషనల్ సీపీ
-
జింఖానా గ్రౌండ్ తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదు: అడిషనల్ సీపీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్(HCA) ఘోర వైఫల్యంతో పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్‌లో జరగబోయే మ్యాచ్ కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద ఈ ఉదయం టికెట్ల అమ్మకాలు చేపట్టింది హెచ్‌సీఏ. అయితే.. ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తరుణంలో.. అభిమానులతో పాటు పోలీసులు గాయపడ్డారు. వాళ్లను నియంత్రించేందుకు పోలీసుల లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. ఇక తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిందని ప్రచారం ఊపందుకుంది. అయితే తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదని.. గాయపడిన మహిళ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని అడిషనల్ సీపీ చౌహాన్ క్లారిటీ ఇచ్చారు. హెసీసీఏ సరైన వసతులు కల్పించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని నార్త్ జోన్ అడిషనల్ సీపీ చౌహాన్ తెలిపారు. సరైన కౌంటర్లు కూడా ఏర్పాటు చేయలేదని, కౌంటర్లు పెంచుకోవాలని సూచించినట్లు ఆయన తెలిపారు. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని, వదంతులు నమ్మొద్దని ఆయన మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. హెచ్‌సీఏకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని అన్నారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. కాసేపు కౌంటర్లు మూసేశారు. ప్రస్తుతం గ్రౌండ్లో లైన్లలో ఉన్నవాళ్లకు టికెట్ల విక్రయం కొనసాగించేందుకు యత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. టీ20 మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు గురువారం ఉదయం ఎగబడ్డారు. వేలాది మందిగా ఎగబడిపోవడం.. గేట్లు తెరవడంతో ఒక్కసారిగా దూసుకెళ్లారు అభిమానులు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకోగా అభిమానులతో పాటు పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసుల లాఠీఛార్జ్‌కు దిగారు. ఈ క్రమంలో గాయపడిన కొందరిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. మరోవైపు ఈ పరిస్థితికి హెచ్‌సీఏ ఘోర వైఫల్యమే కారణమన్న విమర్శ వినిపిస్తోంది. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 55వేలుకాగా, ప్రస్తుతం అందుబాటులో కేవలం 3వేల టికెట్లు మాత్రమే ఉంచింది. ఈ మూడు వేల టికెట్ల కోసమే వేలాదిగా అభిమానులు ఎగబడిపోవడంతో ఈ పరిస్థితి చోటుచేసుకుందని తెలుస్తోంది. టికెట్ల అమ్మకంలో మొదటి నుంచి హెచ్‌సీఏ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు రోజుల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నా హెచ్‌సీఏ నుంచి స్పందన కరువైంది. అయితే.. మొదట పేటీఎం ద్వారా టికెట్ల విక్రయమని మాట మార్చిన హెచ్‌సీఏ.. తర్వాత ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయమంటూ ప్రచారం చేసింది. హెచ్‌సీఏ సభ్యుల మధ్య వివాదాలతో టికెట్ల విక్రయాల్లో గందరగోళం నెలకొందనే ఆరోపణ వెల్లువెత్తుతోంది. తొక్కిసలాట నేపథ్యంలో.. హెచ్‌సీఏ తీరుపై పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. -
HCA ఘోర వైఫల్యం
-
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్.. హెచ్‌సీఏలో టికెట్ల రగడ
ఉప్పల్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్లక్ష్య వైఖరిపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో భారత్– ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ– 20 క్రికెట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో టికెట్ల కోసం క్రీడాభిమానులు పడిగాపులు కాస్తున్నారు. స్టేడియానికి నిత్యం వచ్చిపోతున్నా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. టికెట్లు ఇక్కడ లభించవు జింఖానా గ్రౌండ్లో ఇస్తారని చెప్పి పంపిస్తున్నారు. అక్కడికి వెళితే ఉప్పల్ స్టేడియం వద్దే ఇస్తారంటూ పరుగులు పెట్టిస్తున్నారు. ఇలా అక్కడికీ.. ఇక్కడికీ తిప్పించుకోవడమే తప్ప టికెట్లు మాత్రం ఇవ్వడంలేదని అభిమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. టికెట్లు విక్రయించకుండా తమ మనోభావాలతో ఆడుకుంటున్నారని విమర్శిస్తున్నారు. టికెట్ల అమ్మకాల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొందని, నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. అరగంటలోనే అమ్ముడుపోయాయట.. ►టికెట్ల విక్రయం కోసం ఈ నెల 15 నుంచి పేటీఎం ఇన్సైడర్ యాప్‌ను అందుబాటులో ఉంచినట్లు స్వయంగా హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ చెబుతున్నప్పటికీ కేవలం అరగంటలోనే అన్ని టికెట్లు విక్రయించినట్లు, యాప్‌లో అవి అందుబాటులో లేకపోవడంతో హెచ్‌సీఏ పరువు దిగజార్చుకుందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో టికెట్లు అమ్ముడుపోయినా ఆఫ్‌లైన్‌లో అవి లభిస్తాయనే ఆశతో అభిమానులు ఉప్పల్ స్టేడియం చుట్టూ నిత్యం చక్కర్లు కొడుతూనే ఉన్నారు. ►ఉప్పల్, రామంతాపూర్, నాచారం, సికింద్రాబాద్, అంబర్‌పేట, మెహిదీపట్నం, యాదగిరి గుట్ట, ఘట్కేసర్ తదితర ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చి ఉదయం నుంచే స్టేడియం గేటు వద్ద తిండీతిప్పలు లేకుండా పడిగాపులు కాస్తున్నారు. ఒకానొక దశలో గేట్ దూకి వెళ్లడానికి ప్రయత్నించి.. పోలీసులు అడ్డుకోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. టికెట్లు ఎప్పుడు ఇస్తారు? ఎక్కడ ఇస్తారు? లాంటి ప్రశ్నలకు సమాధానం రాక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జింఖానా గ్రౌండ్ వద్ద గందరగోళం.. గేటుకు తాళం.. రసూల్‌పుర: క్రికెట్ మ్యాచ్ టికెట్లు ఇస్తున్నారనే వదంతులతో మంగళవారం సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్ వద్దకు వేలాది మంది క్రీడాభిమానులు ఒక్కసారిగా తరలి వచ్చారు. దీంతో భద్రతా సిబ్బంది మైదానం గేటుకు తాళం వేశారు. ఆగ్రహానికి గురైన అభిమానులు గోడ దూకి లోనికి వెళ్లారు. దీంతో సిబ్బంది లాఠీలకు పని చెప్పారు. లాఠీ దెబ్బలు తిన్న అభిమానులు ఒక్కసారిగా రోడ్లపైకి వెళ్లిపోయారు. దీంతో జింఖానా మైదానం పరిసర రోడ్లపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. సమాచారం అందుకున్న బేగంపేట పోలీసులు జింఖానా మైదానానికి చేరుకుని అక్కడ ఉన్న కొందరు అభిమానులను పంపించివేశారు. గేట్ తీసే వరకు కదిలేది లేదని.. మరికొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నెల 14 నుంచి టికెట్ల కోసం జింఖానా మైదానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామని ఆగ్రహం వ్యక్తంచేశారు. టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని, ఇప్పటికే అవి అమ్ముడుపోయాయని సిబ్బంది చెబుతున్నారని మండిపడ్డారు. జింఖానా మైదానంలో టికెట్లు ఇస్తారో లేదో స్పష్టంగా చెప్పడం లేదని విరుచుకుపడ్డారు. చదవండి: మ్యాచ్‌కు హాజరైన యువరాజ్.. కోహ్లితో మాటామంతీ Situation at hyderabad gymkhana grounds for australia vs india match tickets. #hca #cricket #india #t20 pic.twitter.com/a6FZLy6IuM — Poley_Adiripoley (@poleyadiripoley) September 21, 2022 -
ఆస్ట్రేలియాతో మూడో టీ20.. ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ విషయంలో రగడ!
టీ20 ప్రపంచకప్-2022కు ముందు టీమిండియా స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. మంగళవారం(సెప్టెంబర్ 20) మోహాలీ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక రెండో టీ20 సెప్టెంబర్ 23న నాగ్‌పూర్ వేదికగా.. మూడో టీ20 సెప్టెంబర్ 23న హైదరాబాద్‌లో జరగనుంది. కాగా దాదాపు మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఈ అంతర్జాతీయ మ్యాచ్‌కు అతిథ్యం ఇవ్వనుంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే స్టేడియానికి వెళ్లి మ్యాచ్‌ను వీక్షించాలనుకున్న అభిమానులుకు మాత్రం నిరాశే ఎదురైంది. ఈ మ్యాచ్‌కు కోసం టికెట్ సేల్స్‌ను హెచ్‌సీఏ ఆన్లైన్లో సెప్టెంబర్ 15న ప్రారంభించగా.. నిమిషాల్లో టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. అయితే సెకెండ్ ఫేజ్ టిక్కెట్లు త్వరలో అందుబాటులో ఉంచుతామని ప్రకటించినప్పటికీ.. ఇప్పటివరకు అయితే ఎటువంటి సేల్‌ను ప్రారంభించలేదు. అదే విధంగా ఈ మ్యాచ్ కోసం టికెట్స్‌ను ఆఫ్‌లైన్‌లో జింఖానా గ్రౌండ్లో విక్రయిస్తామని ముందుగా హెచ్‌సీఏ ప్రకటించింది. అయితే టికెట్స్ కొనుగోలు చేసేందుకు భారీగా అభిమానులు తరలివస్తున్నారు. కానీ.. జింఖానా గ్రౌండ్లో టికెట్స్‌కు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో అభిమానులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియషన్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ టికెట్స్ విషయంలో హెచ్‌సీఏ గోల్‌మాల్‌కు పాల్పడినట్లు అభిమానులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మ్యాచ్ టికెట్ల విక్రయాల్లో అవతవకలు జరిగాయి అని హెచ్‌సీఏపై హెచ్ఆర్సీలో ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఇక టికెట్లపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పటికీ హెచ్‌సీఏ స్పందించకపోవడం గమానార్హం. చదవండి: Ind Vs Aus: అరుదైన ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో రోహిత్ శర్మ! రెండు భారీ షాట్లు కొడితే.. -
హెచ్‌సీఏ వివాదం: హైకోర్టులో అజారుద్దీన్‌కు ఊరట
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్‌తో పాటు మరికొందరిని అనర్హులుగా ప్రకటిస్తూ హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్, జస్టిస్ దీపక్ వర్మ జారీచేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం తప్పుబట్టింది. ఈ మేరకు సింగిల్ జడ్జి ఉత్తర్వులను నిలిపివేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచందర్‌రావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ అజారుద్దీన్ దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం విచారించింది. చదవండి: ‘డ్రోన్ డెలివరీ’ అద్భుతం: వరద ప్రభావిత ప్రాంతాల్లో మందుల సరఫరా’ చదవండి: దొంగ తెలివి... చాక్లెట్లు కూడా బంగారమే! -
అజార్ వేసిన పరువునష్టం కేసులో టి సి ఏ కార్యదర్శి కోర్టుకు హాజరు
-
సికింద్రాబాద్ జింఖానా స్టేడియం వద్ద ఉద్రిక్తత
-
హెచ్‌సీఏ వివాదం: జింఖానా వద్ద హెటెన్షన్
-
హెచ్‌సీఏ వివాదం: జింఖానా వద్ద హైటెన్షన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ (హెచ్‌సీఏ)లో వివాదం ముదురుతోంది. సికింద్రాబాద్ జింఖానా వద్ద హెటెన్షన్ నెలకొంది. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ ప్రెస్‌మీట్‌కు పోలీసుల అనుమతి నిరాకరించారు. జింఖానా బయట భారీగా పోలీసుల మోహరించారు. ఈ క్రమంలో ఎలాగైనా ప్రెస్‌మీట్ నిర్వహిస్తామని అపెక్స్ కౌన్సిల్ అంటోంది. అంబుడ్స్‌మెన్ ప్రకటనపై అపెక్స్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అజార్ విజ్ఞప్తి మేరకు జింఖానా వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు అడ్డొస్తే ఎవరినీ ఉపేక్షించమని పోలీసులు తెలిపారు. జింఖానా నుంచి అజార్‌ను కూడా బయటకు పంపేందుకు పోలీసులు యత్నించారు. అజార్ గ్రూప్, జాన్ మనోజ్ గ్రూప్‌లను పోలీసులు అడ్డుకుంటున్నారు. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు అంబుడ్స్‌మన్ మధ్య పంచాయతీ తీవ్రమవుతోంది. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో అజార్‌కు అపెక్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. అపెక్స్ కౌన్సిల్ జాన్ మనోజ్‌ను హెచ్‌సీఏ అధ్యక్షుడిగా నియమించింది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ ఫిర్యాదు మేరకు అంబుడ్స్‌మన్ దీపక్ వర్మ అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేశారు. తదుపరి విచారణ జరిపేంత వరకు అపెక్స్ కౌన్సిల్ రద్దు కొనసాగనుంది. ఈ క్రమంలో అంబుడ్స్‌మన్ నిర్ణయాన్ని అపెక్స్ కౌన్సిల్ తప్పుపట్టింది. అంబుడ్స్‌మన్‌గా దీపక్ వర్మను ఏజీఎం వ్యతిరేకించింది. అపెక్స్ కౌన్సిల్ రద్దు చేసే అధికారం దీపక్‌వర్మకు లేదని పేర్కొంది. దీపక్‌వర్మ నియామకమే చెల్లదని అపెక్స్ కౌన్సిల్ అంటోంది. -
HCA లో కీలకపరిణామం అపెక్స్ కౌన్సిల్ రద్దు
-
'షోకాజ్ నోటీసుకు జవాబివ్వను.. లీగల్‌గా తేల్చుకుంటా'
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏలో వివాదం రోజురోజుకు ముదిరి పాకానా పడుతుంది. తాజాగా తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికైన జాన్ మనోజ్ ఎంపికపై మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ స్పందించాడు. ''తాత్కాలిక ప్రెసిడెంట్ నియామకంపై నేను స్పందించను. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ చేస్తున్నది అక్రమమైన పని. నన్ను ప్రెసిడెంట్ గా తొలగించే అవకాశం అపెక్స్ కమిటీ సభ్యులకు లేదు. అలా తొలగించే అవకాశం ఉంటే... ప్రెసిడెంట్ గా ఉండి నేనే వారిని తొలగించేవాడిని. చాలా ఏళ్ళుగా ఈ సభ్యులు హెచ్‌సీఏను భ్రష్టు పట్టిస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన షోకాజ్ నోటీస్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో కూడా క్రికెట్ అభివృద్ధి కావాలని నేను చూస్తున్నాను. జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి కావడం ఆ సభ్యులకు ఇష్టం లేదు. నేను లీగల్‌గానే తేల్చుకుంటాను. ఇప్పటికే వాళ్ల మీద అంబుడ్స్‌మెన్ కు కంప్లైంట్ చేసాను. అంబుడ్స్‌మెన్ ఇచ్చే నిర్ణయమే నా తుది నిర్ణయం కూడా..'' అంటూ అజారుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదవండి: హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్ -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ముదురుతున్న వివాదం
-
హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్ నియమితులయ్యారు. ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్ శుక్రవారం లెటర్ జారీ చేసింది. లోధా కమిటీ సిఫార్సుల మేరకు తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తూ తీర్మానం చేసింది. ఇక ఉద్దేశపూర్వకంగా హెచ్‌సీఏ ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారని, నిబంధనలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారంటూ మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను ఇటీవలే అపెక్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. హెచ్‌సీఏలో అతని సభ్యత్వం రద్దు చేసి షోకాజ్ నోటీస్ జారీచేసింది. కాగా నోటీసులపై అజారుద్దీన్ వివరణ ఇవ్వకపోవడంతో తాత్కాలిక ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ ను నియమిస్తున్నట్లు అపెక్స్ కౌన్సిల్ తెలిపింది. మరోవైపు హెచ్‌సీఏలో వివాదం రోజురోజుకు ముదురుతుంది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా హెచ్‌సీఏ తయారయ్యింది. అయితే క్రికెట్ సీజన్ మొదలవుతున్న వివాదాల్లో మునిగి తేలుతున్న హెచ్‌సీఏ ఇంకా గాడిన పడలేదు. చదవండి: అజారుద్దీన్ ఒక డిక్టేకర్లా వ్యవహరిస్తున్నాడు -
అజారుద్దీన్ ఒక డిక్టేకర్లా వ్యవహరిస్తున్నాడు
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ఒక డిక్టేటర్లా వ్యవహరిస్తున్నాడని హెచ్‌సీఏ మాజీ సెక్రటరీ శేష్ నారాయన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. '' హెచ్‌సీఏను అజారుద్దీన్ భ్రష్టు పట్టిస్తున్నాడు. అజారుద్దీన్‌కు అందరినీ కలుపుకొనిపోయే తత్వం లేదు. హెచ్‌సీఏపై బీసీసీఐ కలగజేసుకునే రోజులు వస్తాయి'' అంటూ ఆయన పేర్కొన్నాడు. యూఏఈలో జరిగిన అనధికారిక టి10 టోర్నీలో ఒక జట్టుకు మెంటార్‌గా వ్యవహరించడం, తన రిటైర్మెంట్ తేదీపై తప్పుడు సమాచారం ఇవ్వడం, హెచ్‌సీఏ ఖాతాలను స్థంభింపజేయడం, అంబుడ్స్‌మన్ ని యామకం, ఆటగాళ్ల ఎంపికలో జోక్యం చేసుకోవడం, హెచ్‌సీఏ సమావేశాలకు హాజరు కాకపోవడం తదితర అంశాలపై ఆరోపణలు చేసిన హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ అజారుద్దీను అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. చదవండి: అజహరుద్దీన్‌పై వేటు! వాళ్ల అవినీతి బయటపడుతుందనే నన్ను తొలగించారు: అజారుద్దీన్ -
అజహరుద్దీన్‌పై వేటు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో అనూహ్య పరిణామం! నిబంధనలకు విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా హెచ్‌సీఏ ప్రయోజనాలు దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ స్వయంగా అధ్యక్షుడిపైనే హెచ్‌సీఏ చర్య తీసుకుంది. అసోసియేషన్ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్‌ను ఆ పదవినుంచి తప్పిస్తున్నట్లు హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ ప్రకటించింది. ఆయన హెచ్‌సీఏ సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అజహర్‌పై పలు ఆరోపణలు చేస్తూ ఈ నెల 10న అతనికి షోకాజ్ నోటీసు జారీ చేయగా...అందుకు అజహర్ స్పందించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు అపెక్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది. యూఏఈలో జరిగిన అనధికారిక టి10 టోర్నీలో ఒక జట్టుకు మెంటార్‌గా వ్యవహరించడం, తన రిటైర్మెంట్ తేదీపై తప్పుడు సమాచారం ఇవ్వడం, హెచ్‌సీఏ ఖాతాలను స్థంభింపజేయడం, అంబుడ్స్‌మన్ ని యామకం, ఆటగాళ్ల ఎంపికలో జోక్యం చేసుకోవడం, హెచ్‌సీఏ సమావేశాలకు హాజరు కాకపోవడం తదితర అంశాలపై ఆరోపణలు చేసిన అపెక్స్ కౌన్సిల్...ఇకపై అసోసియేషన్ కార్యకలాపాల్లో అజహర్ పాల్గొనరాదని నిషేధం విధించింది. గత కొంత కాలంగా అజహర్‌కు, అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు మధ్య తీవ్ర విభేదాలు నడుస్తున్నాయి. పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో అవతలి పక్షంపై ఇరు వర్గాలు విరుచుకు పడుతున్నాయి. వివాదం బీసీసీఐ వరకు చేరినా, దీనిపై బోర్డు పెద్దగా స్పందించలేదు. ఇదే అపెక్స్ కౌన్సిల్ విభేదించినా సరే... ఇటీవల జరిగిన ఎస్‌జీఎంలో కూడా హెచ్‌సీఏ ప్రతినిధిగా అజహర్ పాల్గొనే అవకాశం బీసీసీఐ కల్పించింది. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయానికి చట్టబద్ధత ఉందా లేదా అనే అంశంపై స్పష్టత లేని నేపథ్యంలో అజహర్‌పై వేటు అంశం ఆసక్తికరంగా మారింది. -
HCA: అజారుద్దీన్ సభ్యత్వం రద్దు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్‌పై అపెక్స్ కౌన్సిల్ వేటు వేసింది. ఈ సందర్భంగా అపెక్స్ కౌన్సిల్ అజారుద్దీన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హెచ్‌సీఏకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని అపెక్స్ కౌన్సిల్ తప్పు పట్టింది. కాగా అజార్‌పై ఉన్న కేసులు పెండింగ్‌లో ఉండడంతో హెచ్‌సీఏ సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. చదవండి: క్రౌడ్ ఫండింగ్... సేవా ట్రెండింగ్ -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గొప్ప మనసు
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గొప్ప మనసు చాటుకుంది. భారత మహిళల క్రికెట్ టీమ్ మాజీ ఆల్‌రౌండర్, హైదరాబాద్ ప్లేయర్ స్రవంతి నాయుడుకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. స్రవంతి తల్లిదండ్రలు ఇద్దరూ కరోనా బారిన పడ్డారు. ఇద్దరు వేర్వేరు హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు.తన తల్లి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, తండ్రి కూడా ఐసీయూలో ప్రాణాల కోసం పోరాడుతున్నాడని స్రవంతి చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న హెచ్‌సీఏ ఆమెకు తక్షణ సాయంగా రూ.3 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. సాయం చేసేందుకు ముందుకొచ్చిన హెచ్‌సీఏకు ఆమె థ్యాంక్స్ చెప్పింది. తల్లిదండ్రుల చికిత్స కోసం స్రవంతి ఇప్పటికే రూ.16 లక్షలు ఖర్చు చేసిందని, ఆమెకు ఆర్థిక సాయం అవసరమని షట్లర్ గుత్తా జ్వాలా ట్వీట్ చేసింది. ఆమెను ఆదుకోవాలని మంత్రి కేటీఆర్‌ను కోరింది. తెలుగు రాష్ట్రాల్లోని కరోనా పేషెంట్స్‌కు సాయం చేస్తున్న క్రికెటర్ హనుమ విహారి.. స్రవంతి కోసం తమవంతు సాయం చేస్తామని ట్వీట్ చేశాడు. (చదవండి:టీమిండియా మహిళా క్రికెటర్ ఇంట్లో విషాదం) -
హెచ్‌సీఏ ఏజీఎంలో మరోసారి రసాభాస
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంబుడ్స్‌మన్ అధికారిగా మా అభ్యర్థి కొనసాగుతాడంటే మా అభ్యర్థి కొనసాగుతాడంటూ హెచ్‌సీఏ అధ్యక్షుడు, భారత మాజీ కెపె్టన్ అజహరుద్దీన్ వర్గం, ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ వర్గం పరస్పరం మాటల యుద్ధానికి తెరలేపాయి. గత నెల 28న జరిగిన ఏజీఎం గొడవకు కొనసాగింపుగా ఈ సమావేశం జరిగింది. అజహరుద్దీన్ అధ్యక్షతన మీటింగ్ ఆరంభం కాగా... రిటైర్డ్ జడ్జి దీపక్ వర్మను హెచ్‌సీఏ కొత్త అంబుడ్స్‌మన్‌గా ప్రకటించి... మద్దతు తెలిపే వారు చేతులు పైకి ఎత్తాల్సిందిగా సభ్యులకు సూచించాడు. జాన్ మనోజ్ వర్గం ఇందుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. ఇవేమీ పట్టించుకొని అజహరుద్దీన్ కొత్త అంబుడ్స్‌మన్‌గా దీపక్ వర్మ నియామకం పూర్తయిందంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అజహర్ వెళ్లిన అనంతరం ఉపాధ్యక్షుడు మనోజ్ అధ్యక్షతన ఏజీఎం కొనసాగింది. ఈ సమయంలో ఆయన మరో రిటైర్డ్ జడ్జి నిసార్ అహ్మద్ కక్రూను అంబుడ్స్‌మన్‌గా ఎన్నుకున్నామని ప్రకటించారు. అయితే అహ్మద్ కక్రూ నియామకం చెల్లదని అజహరుద్దీన్ వ్యాఖ్యానించాడు. -
హెచ్‌సీఏ సమావేశం రసాభాస
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశానికి 186 మంది క్లబ్ సెక్రేటరీలు, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. హెచ్.సీ.ఏ.లో జరుగుతున్న అవినీతి, ప్లేయర్ల సెలక్షన్స్ పై వస్తున్న ఆరోపణలు, జిల్లాలలో క్రికెట్ అభివృద్ధి వంటి అంశాలపై సమావేశంలో చర్చకు వచ్చింది. కాగా అంబుడ్స్‌మెన్‌గా దీపక్‌వర్మను నియమించాలని అజర్ వర్గం పట్టుబడుతుంటే.. వ్యతిరేక వర్గం మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. ఈ విషయంపై అధ్యక్షుడు అజర్‌ను సభ్యులు ప్రశ్నించారు. దీంతో సమావేశం కాస్త రసాభాసగా మారడంతో వీహెచ్ హనుమంతరావు మధ్యలోనే బయటికి వచ్చి మీడియా వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్ మాట్లాడుతూ..'' హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతితో భ్రష్టు పట్టిపోయింది. జిల్లాలో క్రికెట్ అభివృద్ధి ధ్యాసే లేదు. తెలంగాణలోని ఒక్క జిల్లాలోనూ గ్రౌండ్, స్టేడియం లేదు.ఆంద్రప్రదేశ్ లో క్రికెట్ అభివృద్ధి చేసుకుంటున్నారు. ఉన్న నిధులన్నీ అపెక్స్ కౌన్సిల్ మాయం చేసింది. అంబుడ్స్ మెన్ ఎన్నికల్లోనూ పారదర్శకత లేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్ వర్మ ని అంబుడ్స్ మెన్ గా ఎలా నిర్ణయిస్తారు? దీనిపై అజార్ ని ప్రశ్నిస్తే ఎలాంటి స్పందన లేదు. ప్రెసిడెంట్ అజర్ కి అధికార పార్టీ అండదండలు వున్నాయి.'' అని మండిపడ్డారు. కాగా తదుపరి హెచ్‌సీఏ సమావేశం వచ్చే నెల 11న జరిగే అవకాశం ఉంది. -
‘నా ఎంపికను ప్రశ్నించే హక్కు మీకు లేదు’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అంబుడ్స్‌మన్ రిటైర్డ్ జస్టిస్ దీపక్ వర్మను ఎంపిక చేయడంతో అధ్యక్ష, కార్యదర్శి వర్గాల మధ్య వచ్చిన విభేదాల అంకం కీలక మలుపు తీసుకుంది. ఈ విషయంలో కార్యదర్శి విజయానంద్ తదితరులపై అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్దే పైచేయి అయింది. తమకు తెలీకుండా, తమ సూచనలను పరిగణలోకి తీసుకోకుండా అజహర్ ఏకపక్షంగా అంబుడ్స్‌మన్‌ను నియమించారని, అది చెల్లదంటూ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు వాదిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు స్వయంగా దీపక్ వర్మ దీనిపై స్పందించారు. అంద రి అనుమతితోనే గత జూన్‌లోనే తనను ఎంపిక చేసినట్లు, ఇప్పుడు కొత్తగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌గా బాధ్యతలు కూడా స్వీకరించినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు వర్మ నేరుగా లేఖ రాశారు. (చదవండి: వామ్మో రోహిత్.. ఇంత కసి ఉందా!) తన నియామకాన్ని మళ్లీ ప్రశ్నిస్తే న్యాయపరంగా తగిన చర్య తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు. ‘హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌గా బాధ్యతలు చేపట్టాలని కార్యదర్శి విజయానంద్ నాకు స్వయంగా లేఖ రాయడంతో నేను అంగీరిస్తున్నట్లు బదులిచ్చాను. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అసాధారణ నిర్ణయాల అవసరం ఉంది కాబట్టి జూన్ 6న జరిగిన సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేశారు. పైగా ప్రభుత్వ నిబంధనల కారణంగా ఏజీఎం ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి ముందుగా నన్ను నియమించేసి ఆ తర్వాత అంతా చక్కబడిన తర్వాతైనా అధికారికంగా ఆమోద ముద్ర వేయవచ్చని కూడా అదే సమావేశంలో స్పష్టం చేశారు. దీనికి హాజరైన సభ్యులంతా అంగీకారం తెలిపారే తప్ప ఏ ఒక్కరూ అభ్యంతర పెట్టలేదు. అంబుడ్స్‌మన్‌గా నా నియమాకంలో ఎలాం టి అక్రమమూ జరగలేదు. అపాయింట్మెంట్ లెటర్‌పై సంతకం లేకుండా ఉండటం పెద్ద సమస్య కాదు. పైగా నాడు అంగీకారం తెలిపిన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారులకు నన్ను ప్రశ్నించే అధికారం లేదు. మళ్లీ దానిని తప్పుగా చూపిస్తూ ఏవైనా లేఖలు రాస్తే వారిపై చర్య తీసుకుంటాం’ అని దీపక్ వర్మ ఘాటుగా సమాధానమిచ్చారు. వర్మ ఇప్పటికే ఢిల్లీ క్రికెట్ సంఘానికి కూడా అంబుడ్స్‌మన్‌గా వ్యవహరిస్తున్నారు. -
నా క్రికెట్ ప్రస్థానం ఎలా మొదలైందో తెలుసా?
సాక్షి, హైదరాబాద్ : తన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన క్రికెట్‌కు, తనను పరిచయం చేసిన వ్యక్తిని హెచ్‌సీఏ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్ గుర్తుచేసుకున్నారు. ‘నా కెరీర్లో మీరందరూ అపారమైన ప్రేమను, మద్దతును చూపించారు. కానీ నా క్రికెట్ ప్రస్థానం ఎలా ప్రారంభమైందో మీకు తెలుసా? మొట్టమొదటిసారిగా నేను క్రికెట్ బ్యాట్ పట్టేలే చేసింది నా దివంగత మామయ్య మీర్ జైనులాబిదీన్. క్రికెట్‌కు పరిచయం చేసి నా జీవితాన్నే పూర్తిగా మార్చినందుకు ఆయనకు రుణపడి ఉంటా’ అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. క్రికెట్ ప్రేమికులు ముద్దుగా అజ్జూ అని పిలుచుకునే హైదరాబాద్ వాసి మహ్మద్ అజహరుద్దీన్ క్రికెట్ క్రీడాకారుడిగా, టీమిండియా కెప్టెన్‌గా సాధించిన విజయాలు సాధారణమైనవి కావు. హైదరాబాద్‌లో పుట్టి... ఇక్కడే చదువుకుని, ఇక్కడే పెరిగిన ఈ హైదరాబాదీ, ప్రస్తుతం పొలిటీషియన్‌గానూ రాణిస్తున్నారు. టాప్ ఫీల్డర్‌గా ప్రశంసలు... మ్యాచ్ ఫిక్సర్‌గా ఆరోపణలు.. పెళ్లి... విడాకులు... సినీ నటితో ప్రేమ.. పెళ్లి.. మళ్లీ విడాకులు.. ఎదిగిన కొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం.. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా గెలుపు వంటి రకరకాల సవాళ్లు, విజయాలు అజారుద్దీన్ కెరీర్లో కో కొల్లలు. ఇక క్రికెటర్‌గా తన తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలు సాధించిన అజారుద్దీన్ రికార్డు ఇప్పటికీ ఎవరూ సమం కూడా చేయలేకపోయారు. ఫలితంగా ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా ఇప్పటికీ అజారుద్దీన్ కొనసాగుతున్నాడు. భారత్ తరఫున 15 మంది తమ తొలి టెస్టుల్లో సెంచరీలు చేయగా... అజహర్‌తో పాటు గంగూలీ, రోహిత్ శర్మ మాత్రమే తొలి రెండు టెస్టుల్లోనూ శతకాలు సాధించారు. అజహర్ అనూహ్యంగా ముగిసిన తన కెరీర్ చివరి టెస్టు (99వ)లోనూ సెంచరీ సాధించడం విశేషం. -
అజహరుద్దీన్‌పై ఎఫ్ఐఆర్..
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్‌పై ఔరంగాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అజహరుద్దీన్‌తో పాటు మరో ఇద్దరిపై కూడా కేసు నమోదయినట్లు తెలుస్తోంది. అజహరుద్దీన్‌తో పాటు మరో ఇద్దరు కలిసి తనను రూ. 20 లక్షల మేర మోసం చేశారని ఔరంగాబాద్‌కు చెందిన ఓ ట్రావెల్ ఏజెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక తనపై వస్తున్న ఆరోపణలు, ఎఫ్ఐఆర్ నమోదు కావడంపై అజహరుద్దీన్ స్పందించారు. ఔరంగాబాద్ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ అర్థం లేనిదని ఖండించారు. తప్పుడు ఆరోపణలపై కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. అంతేకాకుండా దీనిపై తాను న్యాయ పోరాటం చేస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. తన లీగల్ టీమ్‌తో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని అజహరుద్దీన్ పేర్కొన్నారు. -
‘1800 మంది పోలీసులతో భారీ బందోబస్తు’
హైదరాబాద్: టీమిండియా-వెస్టిండీస్ జట్ల మధ్య శుక్రవారం నగరంలోని ఉప్పల్ స్టేడియంలో తొలి టీ20తో ఇరు జట్ల ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భాగవత్‌తో కలిసి హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ‘కొత్తగా ఏర్పడిన హెచ్‌సీఏ నేతృత్వంలో ఇక్కడ ఇది తొలి మ్యాచ్. దాదాపు 40 వేల మంది అభిమానులు మ్యాచ్ హాజరు కావొచ్చు. 1800 మంది పోలీసులతో మ్యాచ్‌కు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నాం. రేపు బ్లాక్ డే కూడా కావడంతో భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశాం. ఆక్టోపస్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, సీసీ కెమెరాలు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు, డాగ్ స్క్వాడ్ టీం నడుమ భారీ భదత్ర ఉంటుంది. అభిమానులకు పార్కింగ్ సదుపాయం కూడా కలదు. రేపు మెట్రో రైల్ సమయం రాత్రి గం. 1.00ల వరకూ వినియోగించుకోవచ్చు. సిగరెట్లు , ల్యాప్ టాప్స్, హెల్మెట్లు, కెమెరాలు, మ్యాచ్ బాక్స్, బైనాకులర్స్, బ్యాగ్స్, బ్యానర్స్, లైటర్స్, కాయిన్స్, తిండి పదార్ధాలు, పెన్స్, ఫర్ఫ్యూమ్స్ స్టేడియంలోకి నిషేధం. జాతీయ జెండా తప్పా ఇతర ఏ జెండాలు అనుమతించబడవు. షీ టీం బృందాలు కూడా మహిళల రక్షణ కోసం నియమించాం. స్టేడియం మొత్తం సీసీ కెమెరాలు అధీనంలో ఉంటుంది. ఎవరికీ అసౌకర్యం కల్గినా డయల్ 100కి ఫోన్ చేయండి’ అని భాగవత్, అజహర్లు పేర్కొన్నారు. -
అంబటి రాయుడి అంశం తర్వాతే..!
హైదరాబాద్: హెచ్‌సీఏలో అవినీతి రాజ్యమేలుతోందని ఇటీవల టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలను అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ పెద్దగా సీరియస్‌గా తీసుకున్నట్లు కనుబడటం లేదు. తాజాగా అంబటి రాయుడి చేసిన అవినీతి వ్యాఖ్యలపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అన్న ప్రశ్నకు అజహర్ దాటవేత ధోరణి అవలంభించాడు. ఆ విషయాన్ని తర్వాత చూద్దామంటూ ముక్తసరిగా సమాధానమిచ్చారు. ‘ నేను ప్రస్తుతం డిసెంబర్ 6వ తేదీన వెస్టిండీస్-భారత్ జట్ల మధ్య హైదరాబాద్‌లో జరుగనున్న టీ20 మ్యాచ్‌పైనే దృష్టి పెట్టా. దానికి సంబంధించి నివేదిక మాత్రమే ఇప్పుడు పరిశీలిస్తున్నా. (ఇక్కడ చదవండి: ‘అజహర్ స్టాండ్’) హెచ్‌సీఏలో కరప్షన్ అంశంపై ఏమైనా మాట్లాడాలని అనుకుంటే డిసెంబర్ 6 తర్వాతే చూద్దాం. నేను మ్యాచ్‌కు సంబంధించి మాత్రమే ఆలోచిస్తున్నా. దీని కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి. ఒకవేళ వేరే అంశం ఏదైనా ఉంటే అది తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడదాం. మ్యాచ్‌ను సజావుగా జరపడం కష్టంతో కూడుకున్న పని. అందులోనూ అధ్యక్ష హోదాలో ఇది నా తొలి మ్యాచ్. నేను క్రికెట్ ఆడేటప్పుడు ఆడటం, హోటల్‌కు వెళ్లడం మాత్రమే ఉండేది. కానీ అధ్యక్ష హోదా అనేది భిన్నమైన బాధ్యతతో కూడుకున్నది’ అని అజహర్ పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో అజహర్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. -
‘నా అధ్యక్షతన తొలి క్రికెట్ మ్యాచ్ ఇది’
హైదరాబాద్: వచ్చే నెలలో వెస్టిండీస్‌తో ఆరంభం కానున్న ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ హైదరాబాద్‌లో జరుగనుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం భారత్-వెస్టిండీస్‌ల తొలి టీ20 ముంబైలో డిసెంబర్ 6వ తేదీన జరగాల్సి ఉండగా, ఆ మ్యాచ్‌ను హైదరాబాద్‌కు మార్చారు. అయితే హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన మహ్మద్ అజహరుద్దీన్ విజ్ఞప్తి మేరకు తొలి మ్యాచ్‌ను నగరంలో నిర్వహించడానికి బీసీసీఐ మొగ్గుచూపిందట. ఈ విషయాన్ని అజహర్ స్వయంగా తెలియజేశాడు.(ఇక్కడ చదవండి: తొలి టీ20 వేదిక మారింది..) ‘హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో డిసెంబర్ 11వ తేదీన జరగాల్సిన మ్యాచ్‌ను హెచ్‌సీఏ రిక్వస్ట్ మేరకు 6వ తేదీనే నిర్వహిస్తున్నాం. విండీస్‌తో టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ హైదరాబాద్‌లో జరుగనుంది. ఇది హెచ్‌సీఏలో నా అధ్యక్షతను మొదటి మ్యాచ్. క్రికెట్ అనేది ప్రతిరోజూ నేర్చుకునే గేమ్. క్రికెట్ అభిమానులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. పోలీస్ సెక్యూరిటితో పాటు ప్రైవేట్ సెక్యురిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాం. రేపటి నుంచి మ్యాచ్ టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి’ అని అజహర్ పేర్కొన్నాడు. -
అజహర్.. వ్యక్తిగతంగా తీసుకోవద్దు: అంబటి రాయుడు
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. హెచ్‌సీఏలో అవినీతే రాజ్యమేలుతోందని, డబ్బుతో అసోసియేషన్‌ను ప్రభావితం చేసే వ్యక్తుల సంఖ్య పెరిగిపోయిందంటూ రాయుడు వ్యాఖ్యానించాడు. ఈ మేరకు ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌కు సైతం ట్వీట్ చేశాడు. హెచ్‌సీఏను కాపాడాల్సిన బాధ్యత కేటీఆర్‌పై ఉందని పేర్కొన్నాడు. హైదరబాద్ కెప్టెన్‌గా తాను నిస్సాహాయ స్థితిలో ఉన్నానని, దాంతోనే వచ్చే రంజీ సీజన్లో జట్టుకు దూరంగా ఉండదల్చుకున్నానని పేర్కొన్నాడు. దీనిపై హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాయుడు అసహనంతోనే ఆ వ్యాఖ్యలు చేశాడన్నారు. ఈ విషయంపై తిరిగి స్పందించిన రాయుడు.. ‘హాయ్ అజహర్. దీనిని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. అంశం మనిద్దరికంటే పెద్దది. హెచ్‌సీయూలో ఏం జరుగుతోందో మనిద్దరికీ తెలుసు. హైదరాబాద్ క్రికెట్‌ను బాగు చేసేందుకు నీకు దేవుడు అవకాశమిచ్చాడు. పాతకాలపు తప్పుడు వ్యక్తులనుంచి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. అలా చేస్తే భవిష్యత్తు తరాల క్రికెటర్లను రక్షించినట్లవుతుంది’ అని తాజా పరిణామాలపై అజహర్‌కు రాయుడు సూచించాడు. -
హెచ్‌సీఏపై అంబటి రాయుడు తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్వల్ప వ్యవధిలోనే యూటర్న్ తీసుకుని హైదరాబాద్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన తెలుగు తేజం అంబటి రాయుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో అవినీతి పెరిగిపోయిందంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. దాంతో తాను వచ్చే రంజీ సీజన్లో హైదరాబాద్ జట్టుకు దూరంగా ఉంటానంటూ ప్రకటించాడు. దీనిలో భాగంగా హెచ్‌సీఏలో అవినీతిని నిరోధించాలంటూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు(కేటీఆర్‌కు) ట్వీట్ చేశారు. ‘హలో కేటీఆర్ సార్. హెచ్‌సీఏలో తీవ్రంగా ప్రబలిన అవినీతిపై దృష్టి పెట్టండి. అసలు హైదరాబాద్ క్రికెట్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి అవినీతే కారణం. హెచ్‌సీఏను డబ్బుతో ప్రభావితం చేసేవారి సంఖ్య పెరిగిపోయింది. హెచ్‌సీఏను ఎవరైతే ప్రభావితం చేస్తున్నారో వారిపై చాలా ఏసీబీ కేసులు ఉన్నాయి. వారికే రెడ్ కార్పెట్ పరుస్తున్నారు’ అని అంబటి రాయుడు ట్వీట్ చేశాడు. ఇటీవల జరిగిన విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల్లో భాగంగా హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అంబటి రాయుడు.. జట్టులో రాజకీయాలు పెరిగిపోయాయని ఆరోపిస్తున్నాడు. ప్రస్తుత పరిణామాలతో జట్టులో మంచి వాతావరణం లేదన్నాడు. దాంతోనే తాను హైదరాబాద్ జట్టుకు దూరంగా ఉండదలుచుకున్నానని పేర్కొన్నాడు. ‘ నిజాయితీగా చెప్పాలంటే నేను రంజీ ట్రోఫీ ఆడదామనుకున్నా. కానీ ఒక కెప్టెన్‌గా నేను ఊహించినట్లు జరగడం లేదు. రాజకీయాలు పెరిగిపోయాయి. మంచి క్రికెట్ ఆడే వాతావరణం ఇప్పుడు హైదరాబాద్ జట్టులో లేదు. నేను హైదరాబాద్ క్రికెట్ జట్టులో సౌకర్యవంతంగా లేను’ అని ఒక ఇంటర్యూలో పేర్కొన్నాడు. Hello sir @KTRTRS, I request u to plz look into nd address the rampant corruption prevailing in hca. Hw can hyderabad be great when it's cricket team is influenced by money nd corrupt ppl who hav numerous acb cases against them which are being swept under the carpet. — Ambati Rayudu (@RayuduAmbati) November 23, 2019 -
40 ఫోర్లు, 15 సిక్సర్లతో ట్రిపుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎ–2 డివిజన్ రెండు రోజుల లీగ్‌లో మహబూబ్‌నగర్ బ్యాట్స్‌మన్ జి. గణేశ్ (192 బంతుల్లో 329; 40 ఫోర్లు, 15 సిక్సర్లు) దూకుడైన ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. గణేశ్ వీర విధ్వంసంతో బుధవారం డబ్ల్యూఎంసీసీతో ముగిసిన మ్యాచ్ లో మహబూబ్‌నగర్ జట్టు 483 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ జట్టు 79.4 ఓవర్లలో 658 పరుగుల భారీస్కోరు సాధించింది. గణేశ్ విజృంభణకు తోడు అబిద్ (69 బంతుల్లో 110; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) కూడా సెంచరీతో చెలరేగాడు. పి. హర్షవర్ధన్ (49; 9 ఫోర్లు), కేశవులు (78; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ప్రత్యర్థి బౌలర్లలో టైటస్ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్యఛేదనలో డబ్ల్యూఎంసీసీ తడబడింది. బుధవారం ఇన్నింగ్స్ ప్రారంభించిన డబ్ల్యూఎంసీసీ 49.4 ఓవర్లలో కేవలం 175 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. అక్షయ్ (28), హర్ష (28), శరత్ (28) పరవాలేదనిపించారు. మహబూబ్‌నగర్ బౌలర్లలో కయ్యుం 3, రుషేంద్ర 2 వికెట్లు దక్కించుకున్నారు. -
హెచ్‌సీఏ అధ్యక్షునిగా అజహర్ బాధ్యతలు
హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహ్మద్ అజహరుద్దీన్ తన బాధ్యతలను స్వీకరించారు. సోమవారం హెచ్‌సీఏ అధ్యక్షునిగా అజహర్ బాధ్యతలు చేపట్టారు. ఇక వైస్ ప్రెసిడెంట్‌గా జాన్ మనోజ్, సెక్రటరీగా విజయానంద్. జాయింట్ సెక్రటరీ నరేశ్ శర్మ, ట్రెజరర్‌గా సురేంద్ర కుమార్ అగర్వాల్, కౌన్సిలర్‌గా అనురాధలు తమ బాధ్యతలను స్వీకరించారు.కొన్ని రోజుల క్రితం హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజహర్ విజయం సాధించడమే కాకుండా తన ప్యానల్‌ను కూడా గెలిపించుకున్నారు. హెచ్‌సీఏ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అజహర్ మాట్లాడుతూ.. ‘ క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తాను. హెచ్‌సీఏ అవినీతి మరకలు తుడిచేసి పూర్వ వైభవం తీసుకొస్తా. జిల్లాల్లో స్టేడియంలు అభివృద్ధి చేస్తా. అన్ని ప్యానల్‌ను కలుపుకుని వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తా’ అని అన్నారు. మాజీ అధ్యక్షుడు గడ్డం వివేక్ ప్యానెల్ సపోర్ట్ చేసిన ప్రెసిడెంట్ అభ్యర్థి ప్రకాశ్‌చంద్ జైన్ కేవలం 73 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ప్రకాశ్‌చంద్‌కు వచ్చిన మొత్తం ఓట్ల కంటే అజహర్‌కు వచ్చిన మెజారిటీ ఎక్కువ కావడం ఇక్కడ విశేషం. మరో ప్రత్యర్థి దిలీప్‌కుమార్‌కు కేవలం 3 ఓట్లు మాత్రమే దక్కాయి. అజహరుద్దీన్ 147 ఓట్లు దక్కించుకుని, 74 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడు కావాలన్న కలను అజహరుద్దీన్ ఎట్టకేలకు సాకారం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసి భంగపడ్డ ఆయన ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం అందుకున్నారు. -
హెచ్‌సీఏలో అజర్ హవా
-
అజహరుద్దీన్.. ఇలా గెలిచెన్
సాక్షి, హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఎన్నికల్లో ప్రత్యర్థులను చిత్తు చేశారు. అధ్యక్షుడిగా ఆయన విజయం సాధించడమే కాకుండా తన ప్యానల్‌ను కూడా గెలిపించుకున్నారు. హెచ్‌సీఏ చరిత్రలో ఒకే ప్యానెల్ అన్ని స్థానాలు కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. మాజీ అధ్యక్షుడు గడ్డం వివేక్ ప్యానెల్ సపోర్ట్ చేసిన ప్రెసిడెంట్ అభ్యర్థి ప్రకాశ్‌చంద్ జైన్ కేవలం 73 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ప్రకాశ్‌చంద్‌కు వచ్చిన ఓట్ల కంటే ఒక ఓటు ఎక్కువ మెజారిటీతో అజర్ గెలుపొందడం విశేషం. మరో ప్రత్యర్థి దిలీప్‌కుమార్‌కు కేవలం 3 ఓట్లు మాత్రమే దక్కాయి. అజహరుద్దీన్ 147 ఓట్లు దక్కించుకుని, 74 ఓట్ల ఆధిక్యం సాధించారు. 227 ఓట్లకు గాను 223 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాండ్రా బ్రాన్గాంజా(మహిళా క్రికెటర్), అర్జున్ యాదవ్(ఇండియా సిమెంట్), పి. వెంకటేశ్వర్లు(ఆక్స్ఫర్డ్ బ్లూస్ క్రికెట్ క్లబ్), శ్రీనివాస్ ఆచార్య(ఉస్మానియా మెడికల్ కాలేజీ) ఓటు వేయలేదు. మొత్తం మూడు ఓట్లు(సంయుక్త కార్యదర్శికి రెండు, కౌన్సిలర్‌కి ఒకటి) చెల్లలేదు. ఫలించిన అజర్ కల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడు కావాలన్న కలను అజహరుద్దీన్ ఎట్టకేలకు సాకారం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసి భంగపడ్డ ఆయన ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం అందుకున్నారు. హెచ్‌సీఏలో పట్టున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు, తదితరుల అండతో మాజీ అధ్యక్షుడు వివేక్ ప్యానెల్ మద్దతు ఇచ్చిన ప్రకాశ్‌చంద్‌ను చిత్తుగా ఓడించారు. వివేక్ నామినేషన్ తిరస్కరణకు గురికావడం కూడా అజర్‌కు కలిసొచ్చింది. కేసీఆర్‌ను కలుస్తా: అజర్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో అజహరుద్దీన్ పార్టీ మారతారన్న ప్రచారం మరోసారి ఊపందుకుంది. టీఆర్ఎస్ మద్దతుతోనే ఆయన గెలిచారన్న చర్చ కూడా జరుగుతోంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. పార్టీ మారతానో, లేదో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. టీఆర్ఎస్లో చేరతానో, లేదో చెప్పే వేదిక ఇది కాదని అన్నారు. తన ప్యానల్‌తో సహా ప్రగతి భవన్‌కు వెళ్లి శనివారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవనున్నట్టు తెలిపారు. క్రికెట్ అభివృద్ధి గురించి సీఎంతో చర్చిస్తానని చెప్పారు. కాగా, అజహరుద్దీన్.. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హర్షం ప్రకటించిన కాంగ్రెస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో అజహరుద్దీన్ విజయం సాధించడం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం ప్రకటించింది. అజహరుద్దీన్‌కు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు అభినందనలు తెలిపారు. వి.హనుమంతరావు నేతృత్వంలో గాంధీభవన్ వద్ద బాణసంచా కాల్చి కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. ప్రేమ్‌లాల్, అఫ్జలుద్దీన్ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. -
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజహర్
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) నూతన అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ ఎంపికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో అజహర్ 74 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొత్తం 223 ఓట్లు పోల్ కాగా, అజహర్‌కు భారీ స్థాయిలో ఓటింగ్ పడింది. అధ్యక్ష పదవి కోసం అజహరుద్దీన్‌తో పాటు దిలీప్ కుమార్, ప్రకాష్ చంద్ జైన్లు పోటీ పడ్డారు. అజహర్‌కు 147 ఓట్లు పడగా, ప్రకాశ్ జైన్‌కు 73, దిలీప్ కుమార్‌కు 3 ఓట్లు పడ్డాయి. అయితే హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు గడ్డం వివేక్ వెంకటస్వామి అజారుద్దీన్‌కు వ్యతిరేకంగా ప్రకాష్‌కు మద్దతు ఇచ్చారు. అయినప్పటికీ అజహర్ ఘన విజయం సాధించడంతో అతని కల ఫలించినట్లయ్యింది. రెండేళ్ల క్రితం హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసినా అది తిరస్కరణకు గురికావడంతో అజహరుద్దీన్‌కు నిరాశే ఎదురైంది. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో అతనిపై నిషేధం తొలగించడానికి సంబంధించి ‘సంతృప్తికర వివరణ’ ఇవ్వకపోవడంతో అజహర్ నామినేషన్‌ను ఆమోదించలేదు. అయితే హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి మరోసారి పోటీపడ్డ అజహర్ విజయం సాధించారు. -
వివేక్‌కు చుక్కెదురు
హైదరాబాద్: మరోసారి హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన మాజీ ఎంపీ గడ్డం వివేక్‌కు చుక్కెదురైంది. మాజీ అధ్యక్షుడు వివేక్ వేసిన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. శుక్రవారం వివేక్ నామినేషన్ వేసే క్రమంలో సస్పెన్స్ నెలకొన్నప్పటికీ ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తూ రిటర్న్ అధికారి నిర్ణయం తీసుకున్నారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి జి. వివేక్ అనర్హుడని భావించడంతోనే ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు సమాచారం. వివేక్‌కు సంబంధించిన ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’ కేసు ఒకటి సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. దానిపై ఇంకా ఎలాంటి తుది తీర్పు రాకపోవడంతో వివేక్ హెచ్‌సీఏ ఎన్నికకు దూరం కావాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేసిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్‌కు లైన్‌క్లియర్ అయ్యింది. రెండేళ్ల క్రితం హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసినా అది తిరస్కరణకు గురికావడంతో అప్పట్లో అజహరుద్దీన్‌కు నిరాశే ఎదురైంది. అయితే తాజాగా హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి మరోసారి నామినేషన్ దాఖలు చేశారు అజహర్. ఈనెల 27వ తేదీన జరుగునున్న హెచ్‌సీఏ ఎన్నికలో భాగంగా గురువారం అజహర్ నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. -
హెచ్‌సీఏ అధ్యక్ష బరిలో అజహర్
హైదరాబాద్: రెండేళ్ల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్ష పదవికి నామినేషన్ వేసినా అది తిరస్కరణకు గురికావడంతో అప్పట్లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్‌కు నిరాశే ఎదురైంది. అయితే తాజాగా హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి మరోసారి నామినేషన్ దాఖలు చేశారు అజహర్. ఈనెల 27వ తేదీన జరుగునున్న హెచ్‌సీఏ ఎన్నికలో భాగంగా గురువారం అజహర్ నామినేషన్ వేశారు. ‘ హెచ్‌సీఏ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడమే నా ముందున్న లక్ష్యం. దాంతోనే అధ్యక్ష పదవికి నామినేషన్ వేశా. ప్రతీ ఒక్కరి నుంచి సలహాలు తీసుకుంటూ హైదరాబాద్ క్రికెట్‌ను ఉన్నత స్థానంలో నిలపాలనుకుంటున్నా. జిల్లా స్థాయి క్రికెట్‌ను కూడా తీర్చిదిద్దాల్సిన అవసరంఉంది. నాకు విక్రమ్ మాన్ సింగ్‌తో పాటు మాజీ క్రికెటర్లు అర్హద్ అయూబ్, శివలాల్ యాదవ్‌లు సహకారం ఉంది’ అని అజహర్ తెలిపారు. కాగా, మాజీ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ ఆర్పీ మాన్ సింగ్ కుమారుడు విక్రమ్ మాన్ సింగ్ వైస్ ప్రెసిడెంట్ రేసులో ఉన్నారు. గతంలో హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి అజహర్ నామినేషన్ వేయగా అది తిరస్కరణకు గురైంది. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో అతనిపై నిషేధం తొలగించడానికి సంబంధించి ‘సంతృప్తికర వివరణ’ ఇవ్వకపోవడంతో అజహర్ నామినేషన్‌ను ఆమోదించలేదు. -
కెప్టెన్‌గా అంబటి రాయుడు
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్వల్ప వ్యవధిలోనే యూటర్న్ తీసుకున్న తెలుగు తేజం అంబటి రాయుడుకి హైదరాబాద్ క్రికెట్ జట్టు పగ్గాలు అప్పచెప్పారు. తాను మళ్లీ క్రికెట్ ఆడతానంటూ హెచ్‌సీఏకు రాయుడు లేఖ రాయగా, అందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ క్రికెట్ సారథ్య బాధ్యతలను రాయుడికి కట్టబెట్టారు. త్వరలో విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్న హైదరాబాద్ కెప్టెన్‌గా రాయుడ్ని నియమిస్తున్నట్లు హెచ్‌సీఏ ప్రకటించింది. ఈ మేరకు రాయుడు నేతృత్వంలోని జట్టును తాజాగా వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం తనకు క్రికెట్‌పై ఆసక్తి తగ్గలేదంటూ రాయుడు.. హెచ్‌సీఏకు లేఖ రాశాడు. తాను మళ్లీ క్రికెట్ ఆడటానికి అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో కోరాడు. అదే సమయంలో తనకు వీవీఎస్ లక్ష్మణ్, నోయల్ డేవిడ్‌లు అండగా నిలిచారంటూ పేర్కొన్నాడు. వీరిద్దరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు. కాగా, రాయుడ్ని హైదరాబాద్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా నియమించిన తర్వాత నోయల్ డేవిడ్ స్పందించారు. ‘రాయుడికి ఇంకా ఐదేళ్ల క్రికెట్ మిగిలే ఉంది. దురదృష్టవశాత్తూ వరల్డ్‌కప్‌లో ఆడలేకపోయాడు. దాంతో నిరాశ చెందాడు. నేను, లక్ష్మణ్‌లు రాయుడితో మాట్లాడి అతన్ని ఓదార్చాం. ఫలితంగా అతని రిటైర్మెంట్పై వెనక్కి తగ్గాడు. రాయుడి అనుభవం యువ క్రికెటర్లకు ఉపయోగపడుతుంది. హైదరాబాద్‌కు కూడా రాయుడి సేవలు అవసరం’ అని నోయల్ డేవిడ్ తెలిపారు. హైదరాబాద్ విజయ్ హజారే ట్రోఫీ జట్టు ఇదే.. అంబటి రాయుడు(కెప్టెన్), బి సందీప్(వైస్ కెప్టెన్), అక్షత్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, థాకూర్ వర్మ, రోహిత్ రాయుడు, సీవీ మిలింద్, మెహిద్ హసన్, సాకేత్ సాయి రామ్, మహ్మద్ సిరాజ్, మిక్కిల్ జైశ్వాల్, మల్లికార్జున్(వికెట్ కీపర్), కార్తీకేయ కాక్, టి రవితేజ, అయా దేవ్ గౌడ్ -
వాళ్లందరికీ థాంక్స్: అంబటి రాయుడు
న్యూఢిల్లీ: తాను గడ్డు సమయాన్ని ఎదుర్కొన్నప్పడు అండగా నిలిచిన వారికి తెలుగు తేజం అంబటి రాయుడు ధన్యవాదాలు తెలియజేశాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న రాయుడు.. మళ్లీ అన్ని ఫార్మాట్లకు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. ఈ క్రమంలోనే తనకు మద్దతుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మేనేజ్మెంట్తో పాటు వీవీఎస్ లక్ష్మణ్, నోయల్ డేవిడ్‌లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు. దీనిలో భాగంగా హెచ్‌సీఏకు లేఖ రాసిన రాయుడు.. తన రిటైర్మెంట్ నిర్ణయం అనేది ఆవేశంలో తీసుకున్నదేనని స్పష్టం చేశాడు. తాను మళ్లీ క్రికెట్ ఆడాలనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. తనవరకూ చూస్తే ఆడాల్సిన క్రికెట్ చాలా ఉందంటూ తెలిపాడు. గత రెండేళ్లుగా భారత వన్డే ప్రపంచకప్ జట్టు ప్రణాళికల్లో ఉండి కూడా ప్రపంచకప్ ఆడలేకపోవడంతో రాయుడు ఆకస్మికంగా రిటైర్మెంట్ను ప్రకటించాడు. తాజాగా ఇప్పుడు అతను మనసు మార్చుకొని బ్యాట్ పట్టేందుకు సిద్ధమయ్యాడు. హెచ్‌సీఏ నిర్వహించే వన్డే, టి20 క్రికెట్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటానని అతను చెప్పాడు. -
మల్లికార్జున్ అజేయ డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎ1, ఎ2 డివిజన్ వన్డే లీగ్‌లో కేంబ్రిడ్జ్ ఎలెవన్ బ్యాట్స్‌మన్ జె. మల్లికార్జున్ (138 బంతుల్లో 201 నాటౌట్; 12 ఫోర్లు, 12 సిక్సర్లు) దుమ్మురేపాడు. బౌండరీలు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తిస్తూ డబుల్ సెంచరీతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. మల్లికార్జున్‌కు తోడు బౌలింగ్‌లో సాతి్వక్ రెడ్డి (5/38), ఆశిష్ శ్రీవాస్తవ్ (4/27) చెలరేగ డంతో గురువారం రాజుసీసీతో జరిగిన మ్యాచ్‌లో కేంబ్రిడ్జ్ జట్టు 242 పరుగులతో ఘనవిజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేంబ్రిడ్జ్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 352 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆకాశ్ యాదవ్ (127 బంతుల్లో 106 నాటౌట్; 12 ఫోర్లు) అజేయ సెంచరీతో అదరగొట్టాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన రాజు సీసీని సాతి్వక్ రెడ్డి, ఆశిష్ వణికించారు. వీరిద్దరి ధాటికి రాజు సీసీ 29.3 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు వరంగల్ జిల్లా: 163 (హితేశ్ యాదవ్ 3/14, అమోల్ షిండే 4/34), ఆంధ్రా బ్యాంక్: 164/1 (రోడ్రిగ్స్ 52, నీరజ్ బిష్త్ 50 నాటౌట్). ఎంసీసీ: 178/7 (ప్రమోద్ మహాజన్ 84; రవీందర్ 5/44), అవర్స్ సీసీ: 78/7 (శ్రీనివాస్ యాదవ్ 3/20). అగర్వాల్ సీనియర్స్: 152 (వీరేందర్ 62 నాటౌట్; అజీముద్దీన్ 4/63), గౌడ్ ఎలెవన్: 157/3 (హర్ష్ సంక్పాల్ 45, శ్రీకర్ రెడ్డి 49). నిజామాబాద్ జిల్లా: 107 (దుర్గేశ్ 3/25), బీడీఎల్: 108/1 (సింహా 61 నాటౌట్). డెక్కన్ వాండరర్స్: 309 (విశాల్ యాదవ్ 66, నూతన్ కల్యాణ్ 50, షేక్ మాజీద్ 109; అభినవ్ కుమార్ 3/47, చిరంజీవి 5/26), నిజాం కాలేజి: 87 (ఫిరాజుద్దీన్ 6/19). కాంటినెంటల్: 160 (జైదేవ్ గౌడ్ 52; యశ్వంత్ 3/53, అన్వేశ్ 3/22), ఆక్స్ఫర్డ్ బ్లూస్: 44/5 (21 ఓవర్లలో). హైదరాబాద్ బ్లూస్: 278/7 (రుతిక్ యాదవ్ 44, రవి పాండే 110; సుశీక్షిత్ రెడ్డి 3/40), పీకేఎంసీసీ: 190 (అనిరుధ్ కపిల్ గౌడ్ 44, శివ శంకర్ 67; రుతి్వక్ 5/47). డెక్కన్ క్రానికల్: 183 (వరుణ్ గౌడ్ 44, అద్నాన్ 30; జితేందర్ 4/28), ఖల్సా: 63 (అమన్ ఉపాధ్యాయ్ 3/11, విద్యానంద్ రెడ్డి 4/24). ఎలిగెంట్: 223 (దివేశ్ 66, అఫ్జల్ 41), శ్రీ శ్యామ్: 120 (ఇబ్రహీం అలీ 48; సిద్ధార్థ్ 3/29, పి. రాఘవ 5/45). గెలాక్సీ: 84(శ్రవణ్ 3/25, మయాంక్ గుప్తా 3/7), ఎవర్గ్రీన్: 87/1 (రాహుల్ 47). సీసీఓబీ: 267 (షేక్ మొహమ్మద్ 86, అజీజుద్దీన్ 55; రిషిత్ రెడ్డి 3/44, నితిన్ 3/34), బ్రదర్స్ ఎలెవన్: 235 (రిషిత్ రెడ్డి 62, హర్షవర్ధన్ 62; నోమన్ 3/28, అజీజుద్దీన్ 4/48). ఆర్ దయానంద్: 298/3 (బెంజమిన్ 51, షణ్ముఖ 73, రోహిత్ రెడ్డి 77 నాటౌట్, విఘ్నేశ్వర్ 48 నాటౌట్), నల్లగొండ జిల్లా: 140 (మోహిత్ సోని 3/34, బెంజమిన్ 4/25). నేషనల్: 133 (సహేంద్ర మల్లు 30; మెహర్ ప్రసాద్ 4/17), విజయ్ హనుమాన్: 134/6 (శ్రీకర్ రెడ్డి 61 నాటౌట్). డెక్కన్ బ్లూస్: 76 (సయ్యద్ మెహదీ హసన్ 6/9), ఎన్స్‌కాన్స్: 79/2 (10.2 ఓవర్లలో). సాయిసత్య: 184 (ఇషాన్ శర్మ 48; అశ్వద్ రాజీవ్ 3/26, వెంకటేశ్ 3/31), తెలంగాణ: 187/7 (సూరి 49; విజయ్ ఆకాశ్ 3/35). ఈఎంసీసీ: 258/7 (మెహుల్ భౌమిక్ 104, అసదుద్దీన్ 81), కొసరాజు సీసీ: 100/9. స్పోర్టివ్ సీసీ: 137 (విష్ణు 3/33), హెచ్‌యూసీసీ: 97/8 (అతుల్ వ్యాస్ 36 నాటౌట్; అశి్వన్ 4/13). కరీంనగర్: 183/9 (రిత్విక్ సూర్య 76; తనయ్ త్యాగరాజన్ 3/27, దివేశ్సింగ్ 3/33), స్పోర్టిం గ్ ఎలెవన్: 184/3 (హిమాలయ్ అగర్వాల్ 89 నాటౌట్, తనయ్ త్యాగరాజన్ 68). పాషా బీడీ: 143/9 ( పంకజ్ 5/22), చీర్‌ఫుల్ చమ్స్: 144/5 (సాయి కౌశిక్ 60 నాటౌట్; ఫహీమ్ 3/39). -
రిషికేత్ మరో డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఇంటర్ కాలేజి, స్కూల్స్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్లో జాహ్నవి డిగ్రీ కాలేజి బ్యాట్స్‌మన్ రిషికేత్ సిసోడియా (135 బంతుల్లో 200; 8 ఫోర్లు, 18 సిక్సర్లు) మరోసారి దుమ్మురేపాడు. మంచినీళ్ల ప్రాయంలా సిక్సర్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇటీవలే పేజ్ జూనియర్ కాలేజీతో జరిగిన మ్యాచ్‌లో అజేయ 291 పరుగులతో విజృంభించిన రిషికేత్ ఐదు రోజుల వ్యవధిలోనే మరో డబుల్ సెంచరీతో తన సత్తా చాటాడు. దీంతో భవన్స్ వివేకానంద సైన్స్ కాలేజీతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో జాహ్నవి జట్టు 189 పరుగులతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జాహ్నవి జట్టు రిషికేత్ మెరుపు డబుల్ సెంచరీతో 42 ఓవర్లలో 5 వికెట్లకు 315 పరుగుల భారీస్కోరు సాధించింది. అనంతరం భవన్స్ జట్టు 28.3 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. పి. నితీశ్ రెడ్డి (51) అర్ధసెంచరీతో పోరాడాడు. హర్షవర్ధన్ సింగ్ సెంచరీ బ్యాటింగ్‌లో హర్షవర్ధన్ సింగ్ (83 బంతుల్లో 102; 11 ఫోర్లు), బౌలింగ్‌లో అనికేత్ రెడ్డి (4/19) చెలరేగడంతో జాన్సన్ గ్రామర్ స్కూల్ (నాచారం)తో జరిగిన మ్యాచ్‌లో నిజామాబాద్ జిల్లా 127 పరుగులతో గెలుపొందింది. హర్షవర్ధన్ సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ జిల్లా 32 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. అజిత్ (30) రాణించాడు. అనంతరం అనికేత్ ధాటికి జాన్స న్ గ్రామర్ స్కూల్ 82 పరుగులకే ఆలౌటైంది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు: ∙నల్లగొండ జిల్లా: 149, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (రామంతాపూర్): 39 (రాజీవ్ 4/11, ముజాహిద్ 4/9). ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (నాచారం): 135 (సాయి కౌశిక్ 60; నారాయణ్ తేజ 3/44), ఖమ్మం జిల్లా: 142/5 (సునీల్ అరవింద్ 31, విశాల్ 40, రాకేశ్ 35). హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట్): 203/9 (పృథ్వీ రెడ్డి 37; ఆదిత్య 34; హర్ష సంక్పాల్ 3/34, క్రితిక్ రెడ్డి 3/37), గౌతమ్ జూనియర్ కాలేజి: 138 (క్రితిక్ రెడ్డి 57; ఇబ్రహీం ఖాన్ 4/38, పృథ్వీ రెడ్డి 6/22). ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్: 102 (కుశాల్ అగర్వాల్ 35; ఫర్దీన్ ఫిరోజ్ 3/27), భవన్స్ అరబిందో కాలేజి: 105/1 (ఇషాన్ శర్మ 43, నిశాంత్ 39 నాటౌట్). వరంగల్ జిల్లా: 155 (సుకృత్ 60; జైదేవ్ గౌడ్ 3/40), సర్దార్ పటేల్: 156/4 (జైదేవ్ గౌడ్ 32, అబ్దుల్ అద్నాన్ 47 నాటౌట్). మహబూబ్‌నగర్ జిల్లా: 284/5 (హర్ష 117, అరుణ్ 48 నాటౌట్), లయోలా డిగ్రీ కాలేజి: 90 (జుబేర్ 3/12, అరుణ్ 3/15). -
నిబంధనలకు విరుద్ధంగా క్రికెట్ నియామకాలు
హైదరాబాద్: హెచ్‌సీఏలో తాజాగా చేపట్టిన నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పలువురు మాజీ క్రికెటర్లు ధ్వజమెత్తారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్, మాజీ క్రికెటర్ అర్షద్ అయూబ్, హెచ్‌సీఏ ప్రతినిధి శేష్‌నారాయణ ఈ అంశంపై మాట్లాడారు. ఆదివారం జరిగిన హెచ్‌సీఏ సమావేశంలో సభాధ్యక్షునిగా వ్యవహరించిన వ్యక్తి అబద్ధాలతో కూడిన సమాచారాన్ని వెల్లడించారన్నారు. హెచ్‌సీఏ తరఫున బీసీసీఐ ప్రతినిధిగా వివేక్ పేరును ప్రతిపాదించినట్లు ఆయన వెల్లడించిన సమాచారంలో నిజం లేదని అన్నారు. నిజానికి ఒకసారి అనర్హత వేటు పడిన వ్యక్తిని సిఫార్సు చేయకూడదనే నిబంధన ఉందని ఆయన స్పష్టం చేశారు. పది మంది కుమ్మక్కై ఇలా చేయడం సరికాదని, దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఆదివారం నాటి హెచ్‌సీఏ సమావేశంలో అంబుడ్స్‌మన్, ఎథిక్స్ అధికారిగా జస్టిస్ ఎంఎన్ రావు, ఎన్నికల అధికారిగా వీఎస్ సంపత్‌ను నియమించారు. వీరితో పాటు హెచ్‌సీఏ నుంచి బీసీసీఐ ప్రతినిధిగా జి.వివేకానందను, జూనియర్ సెలక్షన్ కమిటీ, క్రికెటింగ్ కమిటీని ఎంపిక చేశారు. ఈ నియామకాలనే తాజాగా అజహరుద్దీన్ బృందం తప్పుబడుతోంది. -
ఆక్స్ఫర్డ్ బ్లూస్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎ–2 డివిజన్ రెండు రోజుల క్రికెట్ లీగ్‌లో భాగంగా మాంచెస్టర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆక్స్ఫర్డ్ బ్లూస్ వికెట్ తేడాతో గెలుపొందింది. 234 పరుగుల ఛేదనకు శుక్రవారం బరిలోకి దిగిన ఆక్స్ఫర్డ్ బ్లూస్ 60.3 ఓవర్లలో 9 వికెట్లకు 238 పరుగులు చేసి గెలుపొందింది. వరుణ్ రెడ్డి (141 బంతుల్లో 121; 17 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుత సెంచరీతో జట్టును గెలిపించాడు. ప్రత్యర్థి బౌలర్ కె. అభిలాష్ 7 వికెట్లు దక్కించుకున్నాడు. అంతకుముందు మాంచెస్టర్ 61 ఓవర్లలో 233 పరుగులు చేసింది. సాయి చరణ్ 5 వికెట్లు దక్కించుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు ∙ఆదిలాబాద్ జిల్లా: 272 (55 ఓవర్లలో), డెక్కన్ వాండరర్స్: 68 (రాకేశ్ గౌడ్ 5/14). ∙నిజామాబాద్ జిల్లా: 118 (వంశీ 56; వెంకట్ 7/24), టీమ్‌స్పీడ్: 121/2 (కార్తీక్ 31, రిషికేశ్ 33). ∙బాలాజీ సీసీ: 318 (నాయుడు 50, శశాంక్ 52, రోమిత్ 50; శౌనక్ కులకర్ణి 6/69), గెలాక్సీ: 253 (కౌశిక్ రెడ్డి 71, సురేశ్ 50). ∙అవర్స్ సీసీ: 156 (రాహుల్ రెడ్డి 43; నీల్ చక్రవర్తి 6/69), జిందా తిలిస్మాత్తో మ్యాచ్. ∙కరీంనగర్: 266 (అజయ్ 81; రాఘవ 4/52), ఎలిగెంట్: 87 (దివేశ్ 31; సాయితేజ 6/18). ∙అగర్వాల్ సీనియర్: 238 (మొయిజ్ 68, శశిధర్ 76; అతుల్ 5/70), హెచ్‌యూసీసీ: 175 (హర్ష 3/37). ∙వరంగల్ జిల్లా: 324 (మేరాజ్ 51, జి. పవన్ 74, ఎన్. పవన్ 70), చీర్ఫుట్ చమ్స్: 72 (అజయ్ 8/30). -
ఆంధ్రా బ్యాంక్ ఇన్నింగ్స్ విజయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎ–1 డివిజన్ మూడు రోజుల లీగ్‌లో ఆంధ్రా బ్యాంక్ జట్టు ఇన్నింగ్స్ విజయాన్ని కైవసం చేసుకుంది. ఇన్కమ్ ట్యాక్స్‌తో గురువారం ముగిసిన మ్యాచ్‌లో ఆంధ్రా బ్యాంక్ ఇన్నింగ్స్ 24 పరుగులతో గెలుపొందింది. ఆట చివరిరోజు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇన్కమ్ ట్యాక్స్.... బౌలర్ల ధాటికి 35 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. రవితేజ (3/24), హితేశ్ (3/41), నీలేశ్ (3/07) క్రమం తప్పకుండా వికెట్లు తీసి ఆ జట్టును కుప్పకూల్చారు. అంతకుముందు ఆంధ్రా బ్యాంక్ తొలి ఇన్నింగ్స్‌ను 373/9 వద్ద డిక్లేర్ చేయగా... ఇన్కమ్ ట్యాక్స్ 244 పరుగులకు ఆలౌటైంది. ఈ గెలుపుతో ఆంధ్రా బ్యాంక్ ఖాతాలో 7 పాయింట్లు చేరాయి. ఆకాశ్ భండారికి 14 వికెట్లు... డెక్కన్ క్రానికల్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో ఎస్బీఐ ప్లేయర్ ఆకాశ్ భండారి ఓవరాల్‌గా 14 వికెట్లతో అద్భుత ప్రతిభ కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 34 పరుగులిచ్చి 7 వికెట్లు దక్కించుకున్న ఆకాశ్... రెండో ఇన్నింగ్స్‌లోనూ 74 పరుగులిచ్చి మరో 7 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతని దెబ్బకు డెక్కన్ క్రానికల్ జట్టు 103 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 229 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన డెక్కన్ క్రానికల్ ఆకాశ్ విజృంభించడంతో 26.2 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. సాయి వికాస్ రెడ్డి (51) అర్ధసెంచరీ చేశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 23/0 గురువారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఎస్బీఐ 34 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఎస్బీఐ 197 పరుగులు చేయగా... డెక్కన్ క్రానికల్ 91కే ఆలౌటైంది. దీంతో ఎస్బీఐ జట్టుకు 6 పాయింట్లు లభించాయి. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు స్పోర్టింగ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 434 (105.3 ఓవర్లలో), బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 329 (తనయ్ త్యాగరాజన్ 4/103), స్పోర్టింగ్ ఎలెవన్ రెండో ఇన్నింగ్స్: 133/7 (సదన్ 3/24). ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 295 (91.2 ఓవర్లలో), ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ తొలి ఇన్నింగ్స్: 245 (ఎస్సీ మొహంతి 107 నాటౌట్, సురేశ్ 54; అజయ్‌దేవ్ గౌడ్ 3/50). జై హనుమాన్ తొలి ఇన్నింగ్స్: 366/4 డిక్లేర్డ్, ఆర్. దయానంద్ తొలి ఇన్నింగ్స్: 204 (బెంజమిన్ థామస్ 50; శ్రవణ్ 4/48, కార్తికేయ 3/66). ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్: 308 (101.5 ఓవర్లలో), ఇండియా సిమెంట్: 290 (శ్రేయస్ వాలా 85, సయ్యద్ అలీ 78; కృష్ణ చరిత్ 4/64, ప్రణీత్ రాజ్ 3/69), ఎంపీ కోల్ట్స్ రెండో ఇన్నింగ్స్: 120/5 (23 ఓవర్లలో). ఎన్స్‌కాన్స్ తొలి ఇన్నింగ్స్: 380 (90 ఓవర్లలో), హైదరాబాద్ బాట్లింగ్: 245 (60.2 ఓవర్లలో), ఎన్స్‌కాన్స్ రెండో ఇన్నింగ్స్: 160/6 డిక్లేర్డ్ (సాయివ్రత్ 52), హైదరాబాద్ బాట్లింగ్ రెండో ఇన్నింగ్స్: 296/5 (వినయ్ గౌడ్ 60, రాధాకృష్ణ 90). ఎవర్గ్రీన్ తొలి ఇన్నింగ్స్: 295 (104.2 ఓవర్లలో), జెమిని ఫ్రెండ్స్ తొలి ఇన్నింగ్స్: 314 (ఠాకూర్ తిలక్ వర్మ 89, రవితేజ 52). కేంబ్రిడ్జ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 228 (83 ఓవర్లలో), ఏఓసీ తొలి ఇన్నింగ్స్: 124/3 (శివం తివారీ 53 నాటౌట్). -
ఉగ్రదాడి: ధర్మశాలలో పాక్ క్రికెటర్ల ఫోటోలు తొలగింపు
ధర్మశాల: పుల్వామా ఉగ్ర దాడికి నిరసనగా పాకిస్తాన్‌కు చెందిన 13 మంది క్రికెటర్ల ఫోటోలను హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) తొలగించింది. ధర్మశాలలోని మైదానంలో ఇమ్రాన్ ఖాన్, వసీం ఆక్రమ్, జావెద్ మియాందాద్‌తో సహా మొత్తం పాక్ ఆటగాళ్ల ఫోటోలను తొలగించాలని మేనేజింగ్ కమిటీ నిర్ణయించింది. 2005లో టీమిండియా పర్యటన నేపథ్యంలో ధర్మశాలలో బోర్డ్ ప్రెసిడెంట్ ఎలవన్‌తో పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ సందర్భంగా షోయబ్ అక్తర్, షాహిద్ ఆఫ్రిది ఆటగాళ్ల ఫోటోలను, ఆ మ్యాచ్‌కు సంబంధించి ఫోటోలను కూడా తొలగించినట్లు హెచ్‌సీఏ ప్రకటించింది. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి నిరసనగా, అదే విధంగా భారతీయ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేనేజింగ్ కమిటీ సీనియర్ ఒకరు తెలిపారు. (ఉగ్రదాడి.. పాక్ క్రికెట్‌కు గట్టిషాక్!) ఇక ఇప్పటికే క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కూడా బ్రాబోర్న్ స్టేడియంలో ఉన్న పాక్ క్రికెటర్ల ఫోటోలను తీసేసిన విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడిని భారత క్రికెటర్లు ఇప్పటికే తీవ్రంగా ఖండించారు. ప్రపంచకప్‌లో రెండు పాయింట్లు కోల్పోయినా సరే... పాక్‌తో మ్యాచ్ టీమిండియా ఆడరాదంటూ సీనియర్ ఆటగాడు హర్బజన్ అభిప్రాయపడ్డాడు. ఇక అమరజవాన్ల పిల్లలను తన స్కూల్లో ఉచితంగా చదివిస్తానని వీరేంద్ర సెహ్వాగ్ ముందుకు రాగా.. మరికొంత మంది ఆటగాళ్లు ఆర్థిక సహాయం అందించారు. బీసీసీఐ కూడా భారీ మొత్తంలో ఆర్థిక సహాయాన్ని అందించింది. -
చాంపియన్ ఆంధ్రా బ్యాంక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎ–డివిజన్ వన్డే లీగ్‌లో ఆంధ్రా బ్యాంక్ జట్టు విజేతగా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. టోర్నీ ఆసాంతం మెరుగ్గా రాణించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తుదిమెట్టుపై బోల్తా పడింది. బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమవడంతో ఆదివారం ఆంధ్రా బ్యాంక్‌తో జరిగిన ఫైనల్లో ఎస్బీఐ 152 పరుగుల భారీ తేడాతో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆంధ్రా బ్యాంక్ 45 ఓవర్లలో 9 వికెట్లకు 310 పరుగుల భారీస్కోరు సాధించింది. పీఎస్ చైతన్య రెడ్డి (93 బంతుల్లో 107; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. నీరజ్ బిష్త్ (44 బంతుల్లో 66; 11 ఫోర్లు, 1 సిక్స్) దూకుడు కనబరిచాడు. 29 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును వీరిద్దరూ ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 72 బంతుల్లో 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆత్మవిశ్వాసాన్ని నింపారు. నీరజ్ పెవిలియన్ చేరాక అభినవ్ కుమార్ (14)తో నాలుగో వికెట్‌కు 29 పరుగులు, టి. రవితేజ (37; 2 ఫోర్లు)తో కలిసి 89 పరుగుల కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి చైతన్య ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అప్పటికి జట్టు స్కోరు 246/5. తర్వాత ఆశిష్ రెడ్డి (25; 2 ఫోర్లు, 1 సిక్స్), ఖాదిర్ (20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో ఆకాశ్ భండారి, టి. సుమన్ చెరో 3 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఎస్బీఐ జట్టు 33.3 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. సయ్యద్ అహ్మద్ ఖాద్రి (34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. ఓపెనర్లు టి. సుమన్ (9), డానీ ప్రిన్స్ (17), అనూప్ పాయ్ (6), బి. సుమంత్ (0), ఆకాశ్ భండారి (16), అనిరుధ్ సింగ్ (18), కేఎస్కే చైతన్య (22; 4 ఫోర్లు) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో జట్టుకు ఓటమి తప్పలేదు. ఆంధ్రా బ్యాంక్ బౌలర్లలో టి.రవితేజ, అమోల్ షిండే, నీరజ్ బిష్త్ తలా 2 వికెట్లు దక్కించుకున్నారు., , , -
సందీప్, చరణ్ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వన్డే నాకౌట్ చాంపియన్‌షిప్‌లో ఇన్కమ్ ట్యాక్స్ జట్టు ముందంజ వేసింది. బ్యాట్స్‌మెన్ ఎంఎస్ఆర్ చరణ్ (103 బంతుల్లో 138; 17 ఫోర్లు, 6 సిక్సర్లు), బి. సందీప్ (67 బంతుల్లో 112 నాటౌట్; 17 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో దుమ్మురేపడంతో సలీమ్‌నగర్ జట్టుపై బుధవారం 183 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ 45 ఓవర్లలో 9 వికెట్లకు 398 పరుగుల భారీస్కోరు సాధించింది. చరణ్ అద్భుత సెంచరీతో ఆకట్టుకోగా, సందీప్ అజేయ మెరుపు శతకంతో విజృంభిం చాడు. వీరిద్దరికి తోడు అక్షత్ రెడ్డి (53) అర్ధసెంచరీతో జట్టు భారీ స్కోరును అందుకుంది. అనంతరం సలీంనగర్ సీసీ 45 ఓవర్లలో 9 వికెట్లకు 215 పరుగులే చేసి పరాజయం పాలైంది. మీర్జా బేగ్ (40), ధనుశ్ (40), ఖాలిద్ ఖురేషి (51) పోరాడారు. ఆకాశ్, రిషికేత్ అజేయ శతకాలు కేంబ్రిడ్జ్ ఎలెవన్ బ్యాట్స్‌మెన్ ఆకాశ్ యాదవ్ (98 బంతుల్లో 114 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిషికేత్ సిసోడియా (83 బంతుల్లో 102 నాటౌట్; 14 ఫోర్లు) అజేయ సెంచరీలతో కదం తొక్కారు. దీంతో ఉస్మానియా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేంబ్రిడ్జ్ ఎలెవన్ 75 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత కేంబ్రిడ్జ్ ఎలెవన్ 30 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 224 పరుగులు చేసింది. అనంతరం ఉస్మానియా జట్టు 24.1 ఓవర్లలో 149 పరుగులకే కుప్పకూలింది. హృదయ్ (42) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో మోహిత్ 3, సాత్విక్ 4 వికెట్లు దక్కించుకున్నారు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు హైదరాబాద్ బ్లూస్ సీసీ: 88 (సౌరవ్ రాథోడ్ 3/24, యశ్వంత్ రెడ్డి 3/14, కమల్ 4/20), ఎవర్గ్రీన్ సీసీ: 92/1 (విక్రమ్ నాయక్ 34 నాటౌట్, రాహుల్ బుద్ధి 44 నాటౌట్). విజయ్ హనుమాన్ సీసీ: 68 (శుభమ్ 3/11, రంగనాథ్ 4/20), జై హనుమాన్: 72/4 (సూర్యతేజ 31 నాటౌట్). ఎన్స్‌కాన్స్: 385/4 (సాయివ్రత్ 121, జునైద్ అలీ 56, మెహదీ హసన్ 45, అజర్ 59; విష్ణు 3/42), అగర్వాల్ సీనియర్ సీసీ: 69 (మెహదీ హసన్ 5/23). డెక్కన్ క్రానికల్: 317/3 (యశ్ కపాడియా 143, నితీశ్ 66, సీవీ మిలింద్ 88 నాటౌట్), గ్రీన్ టర్ఫ్: 141/6 (అక్షయ్ 32, కార్తీక్ 33 నాటౌట్). జెమినీ ఫ్రెండ్స్: 248/7 (షేక్ యాసిన్ 109, సాయి ప్రణయ్ 65), మహబూబ్‌నగర్: 223 (హర్షవర్ధన్ 115; రతన్‌తేజ 3/41). సాయి సత్య సీసీ: 231/8 (నిఖిల్ యాదవ్ 69), నిజామాబాద్: 232/7 (శ్రీకర్ రెడ్డి 92, లలిత్ యాదవ్ 42). -
ఉప్పల్ టెస్ట్.. టికెట్ డబ్బులు వాపస్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు టికెట్లు కొనుగోలు చేసిన వారికి శుభవార్త. గత నెల 12 నుంచి 16 వరకు జరగాల్సిన ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే (అక్టోబర్–14) ముగిసింది. దీంతో 15, 16వ తేదీల్లో మ్యాచ్ వీక్షించాలనుకున్న ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. కాగా... ఆ రెండు రోజుల కోసం ముందుగానే టికెట్లు తీసుకున్న ప్రేక్షకులకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వనుంది. ఈ మేరకు హెచ్‌సీఏ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీని కోసం ఈ నెల 10న ఉదయం గం. 10 నుంచి సాయంత్రం గం. 6 వరకు జింఖానా గ్రౌండ్స్‌లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. నాలుగో, ఐదో రోజు మ్యాచ్ టికెట్లు కొన్న వారు ఒరిజినల్ మ్యాచ్ టికెట్లతో పాటు బ్యాంక్ అకౌంట్ వివరాలతో కౌంటర్ వద్ద సంప్రదించాలి. ఆన్లైన్ ద్వారా కొన్న వారికి ఆన్లైన్ ద్వారానే చెల్లింపు చేయనున్నారు. మొత్తం మ్యాచ్ వీక్షించేందుకు సీజన్ టికెట్ తీసుకున్న వారికి ఇది వర్తించదు. -
క్రికెట్ అభివృద్ధికి కృషిచేస్తాం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ ప్లేయర్స్ అసోసియేషన్ (సీపీఏహెచ్) ఏర్పాటుతో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తామని హెచ్‌సీఏ అపెక్స్ కమిటీ సభ్యులు, స్టీరింగ్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. సోమవారం ఉదయం అపెక్స్ కమిటీ సభ్యులతో నూతనంగా నియమితులైన స్టీరింగ్ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీపీఏహెచ్ ఏర్పాటుతో పాటు, హెచ్ సీఏలో ఉన్న లోపాలు, క్రీడాకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. త్వరలోనే ఎలక్టోరల్ అధికారిని నియమించి అతని ఆధ్వర్యంలో సీపీఎహెచ్ ఏర్పాటు కోసం ఎలక్షన్స్‌ను నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 9 నుంచి 15వ తేదీ మధ్యలో ఎలక్షన్స్‌ను నిర్వహించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. సీపీఏహెచ్ ఏర్పాటయ్యేంత వరకు హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్లో క్రీడాకారుల ప్రాతినిధ్యం ఉండబోదని అన్నారు. ఈ సమావేశంలో అపెక్స్ కమిటీ సభ్యుల మధ్యన ఉన్న విభేదాలను పక్కనపెట్టి క్రికెట్ అభివృద్ధికి సమష్టిగా కృషిచేస్తామని చెప్పారు. క్రీడాకారులు అయోమయానికి లోనవ్వకుండా నియమ నిబం ధనలు దృష్టిలో పెట్టుకుని అధికారికంగా ఒకే టీమ్‌ను ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో హెచ్‌సీఏ అపెక్స్ కమిటీ సభ్యులైన అనిల్ కుమార్, శేష్‌నారాయణ్, మహేందర్, అజ్మల్ అసద్, హనుమంతుతో పాటు, స్టీరింగ్ కమిటీ సభ్యులు వీవీఎస్ లక్ష్మణ్, అజహరుద్దీన్, విద్యా యాదవ్, రజిని వేణుగోపాల్ పాల్గొన్నారు. -
అపెక్స్ కౌన్సిల్ నిర్ణయమే ఫైనల్
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో ఎవ్వరికీ వ్యక్తిగత నిర్ణయం తీసుకునే అధికారంలేదని, అపెక్స్ కౌన్సిల్ నిర్ణయమే ఫైనల్ అని హెచ్‌సీఏ ఇన్చార్జ్ అధ్యక్షుడు కె.అనిల్ కుమార్ అన్నారు. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలు కాదని సెక్రటరీ సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల యువ క్రికెటర్లకు ఎంతో ఇబ్బంది అవుతోందని ఆయన పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్లో నిర్ణయం తీసుకోకుండా జోనల్ టోర్నమెంట్లు ప్రకటించడం తప్పు అని, ఇప్పటికే లీగ్ మ్యాచ్‌లు జరుగుతుండగా జోనల్ మ్యాచ్‌లు ఏర్పాటు చేసేందుకు సిద్ధం కావడం సరికాదన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్‌సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాండురంగ మూర్తి, కోశాధికారి మహేంద్రతో కలిసి మాట్లాడుతూ... ఇటీవల అపెక్స్ కమిటీలో నిర్ణయించిన సెలెక్షన్ కమిటీ పంపిన జట్టుతోపాటు, సెక్రటరీ మరో జట్టును కర్ణాటకకు పంపడంతో రెండు జట్లనూ ఆడనివ్వలేదని, దీంతో యువ క్రికెటర్లు ఎంతో నిరాశకు గురయ్యారని గుర్తుచేశారు. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకే సెక్రటరీ, అధ్యక్షులు అందరూ పనిచేయాలని సెక్రటరీ సొంతంగా ఏర్పాటు చేసిన జోనల్ కమిటీలు చెల్లవని ఈ విషయాన్ని క్రికెటర్ల తల్లిదండ్రులు గ్రహించాలని తెలిపారు. -
సంకీర్త్ డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ ఎ–1 డివిజన్ మూడు రోజుల క్రికెట్ లీగ్‌లో కాంటినెంటల్ సీసీ బ్యాట్స్‌మన్ జి. సంకీర్త్ (380 బంతుల్లో 202; 34 ఫోర్లు) డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. ఎన్ఎఫ్సీ గ్రౌండ్లో జెమిని ఫ్రెండ్స్ జట్టుతో జరుగుతోన్న ఈమ్యాచ్‌లో సంకీర్త్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటంతో కాంటినెంటల్ సీసీ తొలి ఇన్నింగ్స్‌లో భారీస్కోరు సాధించింది. సంకీర్త్‌తో పాటు హర్‡్ష జున్‌జున్‌వాలా (63; 9ఫోర్లు, 1 సిక్స్), హృషికేశ్ (76; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకోవడంతో కాంటినెంటల్ సీసీ 9 వికెట్లకు 491 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ప్రత్యర్థి బౌలర్లలో ఎం. రాధాకృష్ణ 3, ఎన్. అనిరుధ్, ఖురేషి చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన జెమిని ఫ్రెండ్స్ రెండోరోజు బుధవారం ఆటముగిసే సమయానికి 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 57 పరుగులతో నిలిచింది. ఇతర మ్యాచ్‌ల వివరాలు కేంబ్రిడ్జ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 174 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్: 129 (మల్లికార్జున్ 31, సర్తాజ్ 34; జయరామ్ 5/81), హైదరాబాద్ బాట్లింగ్: 337 (శ్రీ చరణ్ 50, సయ్యద్ చాంద్ పాషా 157; ఆశిష్ శ్రీవాస్తవ్ 4/124). బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 256 (టి. సంతోష్ గౌడ్ 31; రక్షణ్ రెడ్డి 5/50), ఇన్కమ్ ట్యాక్స్: 323/3 (చరణ్ 115,అక్షత్ రెడ్డి 114). ఏఓసీ తొలి ఇన్నింగ్స్: 481/9 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్: 216/4 డిక్లేర్డ్ (శివం తివారి 62, సుమిత్ సింగ్ 46, అమిత్ పచేరా 57), ఇండియా సిమెంట్స్ తొలి ఇన్నింగ్స్: 76 ఆలౌట్ (త్రివేండ్ర 6/21), రెండో ఇన్నింగ్స్: 33/3 (13 ఓవర్లలో). స్పోర్టింగ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 315 (భవేశ్ ఖాన్ 74, యుధ్వీర్ సింగ్ 51; షేక్ సలీమ్ 3/79, భగత్ వర్మ 3/94), ఆర్. దయానంద్ సీసీ: 335/6 (దీపాన్‡్ష బుచర్ 104, బి. యతిన్ రెడ్డి 71 బ్యాటింగ్; తనయ్ త్యాగరాజన్ 3/128). జై హనుమాన్ తొలి ఇన్నింగ్స్: 512/7 డిక్లేర్డ్ (జి.శశిధర్ రెడ్డి 146, ఎన్. సూర్యతేజ 107, ప్రతీక్ రెడ్డి 82; అమోల్ షిండే 3/157, హితేశ్ యాదవ్ 3/151), ఆంధ్రా బ్యాంక్ తొలి ఇన్నింగ్స్: 73/2 (రొనాల్డ్ రోడ్రిగ్స్ 36). ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 54/3 (మికిల్ జైస్వాల్ 40), డెక్కన్ క్రానికల్‌తో మ్యాచ్. ఎస్బీఐ తొలి ఇన్నింగ్స్: 268/5 (టి. సుమన్ 44, డానీ డెరెక్ ప్రిన్స్ 84, చైతన్య 51, ఆకాశ్ భండారి 53), ఎస్సీఆర్ఎస్ఏతో మ్యాచ్. ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్: 339/3 (మోహుల్ భౌమిక్ 135, ఎ. వైష్ణవ్ రెడ్డి 72, నిఖిలేశ్ సురేందరన్ 74), ఎన్స్కాన్స్తో మ్యాచ్. -
అభినవ్ డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎ–2 డివిజన్ రెండు రోజుల క్రికెట్ లీగ్‌లో బాలాజీ కోల్ట్స్ బ్యాట్స్‌మన్ జి. అభినవ్ (246 బంతుల్లో 208; 20 ఫోర్లు, 5 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. దీంతో సాయిసత్య సీసీ జట్టుతో సోమవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో బాలాజీ కోల్ట్స్ భారీస్కోరు సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బాలాజీ కోల్ట్స్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 8 వికెట్లకు 442 పరుగులు సాధించింది. అభినవ్ ద్విశతకంతో మెరవగా, ప్రథమేశ్ (90) కొద్దిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. జి. గోపీకృష్ణ రెడ్డి (59), ఎ. జయచంద్ర (39) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో సూరజ్ సక్సేనా 4 వికెట్లు దక్కించుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల వివరాలు ఎంసీసీ: 144 (భాను ప్రకాశ్ 91; ఎన్. నితిన్ సాయి 5/46), హైదరాబాద్ టైటాన్స్: 150/1 (రోహిత్ సాగర్ 86 నాటౌట్). ఫ్యూచర్‌స్టార్: 184 (ఇషాన్‌శర్మ 42; పృథ్వీ రెడ్డి 3/22, రమణ 3/60, ఇబ్రహీం ఖాన్ 3/28), హెచ్‌పీఎస్–బేగంపేట: 116 (డి. సిద్ధార్థ్ ఆనంద్ 31; సందీప్ యాదవ్ 5/55). బడ్డింగ్ స్టార్: 170 (జమీరుద్దీన్ 44, ఫర్హాన్ 40; అమీర్ 3/43, రమావత్ సురేశ్ 5/60), అపెక్స్ సీసీ: 171/5 (విక్రాంత్ 43, నారాయణ 71; తౌసీఫ్ 3/43). డెక్కన్ బ్లూస్: 95 (రాహుల్ 3/15, జె. హరీశ్ కుమార్ 5/38), క్లాసిక్ సీసీ: 93 (సాయితేజ రెడ్డి 37, అక్షయ్ 6/33, దీపక్ 3/23). విశాక సీసీ: 89 (టి. అక్షయ్ 31; కె. చంద్రకాంత్ 4/37, వి. భార్గవ్ ఆనంద్ 5/33), పోస్టల్: 93/1 (టి. విజయ్ కుమార్ 65). జై భగవతి: 195 (పి. శివ 42, మొహమ్మద్ సక్లాయిన్ 59; రోహిత్ గిరివర్ధన్ 5/65, సాత్విక్‌రెడ్డి 3/54), గౌడ్స్ ఎలెవన్:138/4 (సాత్విక్‌రెడ్డి 108). కాంకర్డ్: 336 (వై. సాయి వరుణ్ 62, జి. హేమంత్ 58, ఆర్. ప్రణీత్ 80, టి. ఆరోన్ పాల్; వినయ్ 3/39, అద్నాన్ అహ్మద్ 3/100). సీసీఓబీ: 367/8 (అర్షద్ 59, మీర్జా బేగ్ 136; సౌరవ్ 3/67, వికాస్ 4/103), వీనస్ సైబర్టెక్తో మ్యాచ్. ఖల్సా: 181 (ఆర్యన్ 40; అజ్మత్ ఖాన్ 3/41, ప్రమేశ్ పాండే 4/22), న్యూబ్లూస్: 85/3 (అజిత్ సింగ్ 39, ఆర్యన్ సింగ్ 3/35). నేషనల్: 247 (మొహమ్మద్ ఖాలిద్ 87, ఎస్కే మొహమ్మద్ 47; నితీశ్ 5/70, సుమిత్ 3/39), ఉస్మానియాతో మ్యాచ్. మహమూద్ సీసీ: 285 (హుస్సేన్ 92, భరత్‌రాజ్ 51; మొహమ్మద్ హష్మీ 5/76, విశాల్ సింగ్ 3/92), గ్రీన్‌టర్ఫ్: 13/1 (7 ఓవర్లలో). రోహిత్ ఎలెవన్: 341/9 (సాత్విక్ భరద్వాజ్ 46, అర్జున్ చౌదరి 44, గంగా సింగ్ 43, అబ్దుల్ 50; విశేష్ 4/88), పాషాబీడీతో మ్యాచ్. -
హెచ్‌సీఏ నుంచి విశాక లబ్ధి పొందలేదు
హైదరాబాద్: రాజకీయ లబ్ధి కోసమే తమ సంస్థపై బురద చల్లుతున్నారని విశాక ఇండస్ట్రీస్ ప్రతినిధి వలీనాథ్ ఆరోపించారు. హెచ్‌సీఏ నుంచి విశాక లబ్ధి పొందిందని వస్తోన్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. కొద్ది నెలలుగా ఉద్దేశపూర్వకంగానే కొందరు తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లీగల్ అడ్వైజర్ రజనీకాంత్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన రాజీవ్‌గాంధీ స్టేడియం నిర్మాణం కోసం కోట్లాది రూపాయలు అప్పు తెచ్చి మరీ ఖర్చుపెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. స్టేడియం నిర్మాణం కోసం ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఆ బృహత్తర కార్యక్రమాన్ని విశాక భుజాన వేసుకుందని చెప్పారు. ఆ సమయంలో స్టేడియానికి విశాక ఇండస్ట్రీస్ పేరు పెడతామని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. చేసుకున్న అగ్రిమెంట్లకు విలువ ఇవ్వని హెచ్‌సీఏ ఈ విషయాన్ని రాజకీయం చేసి విశాక పేరును తొలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో కోర్టు తీర్పు కూడా విశాకకు అనుకూలంగా వచ్చిందన్న విషయాన్ని గుర్తుచేశారు. -
‘వీహెచ్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదనుకుంటా’
హైదరాబాద్: అంబర్పేట్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపు కుంటున్నారని హెచ్‌సీఏ అధ్యక్షుడు జి. వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏ నుంచి రూ. 12 కోట్లు... విశాక ఇండస్ట్రీస్ తీసుకుందన్న వీహెచ్ ఆరోపణల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదని అసహనం వ్యక్తం చేశారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వీహెచ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వీహెచ్ మానసిక పరిస్థతి సరిగ్గా లేదంటూ వాగ్బాణాలు విసిరారు. ‘వీహెచ్ ఆరోపణలన్నీ నిరాధారమైనవి. విశాక ఇండస్ట్రీస్ డబ్బు తీసుకుందనడంలో నిజం లేదు. 2004లో స్టేడియం కట్టే సమయంలో విశాక ఇండస్ట్రీస్ నుంచి రూ. 4.32 కోట్లు స్పాన్సర్షిప్ చేశాం. 2011లో అర్షద్ ఆయూబ్ మా అగ్రిమెంట్‌ను అక్రమంగా రద్దు చేశారు. దీనిపై మేము ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేస్తే... హెచ్‌సీఏ రూ. 25.92 కోట్లు విశాకకు పెనాల్టీగా ఇవ్వాలని ఆర్బిట్రేషన్ తీర్పునిచ్చింది. కానీ తర్వాత జరిగిన ఎస్‌జీఎంలో విశాకతో వివాదాన్ని కోర్టు బయట తేల్చుకోవాలని నిర్ణయించుకున్న హెచ్‌సీఏ... అందుకు అనుగుణంగా వ్యవహరించింది. అప్పటి హెచ్‌సీఏ కార్యదర్శి జాన్ మనోజ్ సివిల్ కోర్టు జడ్జి ఎదుట విశాకతో తమ వివాదం ముగిసిందంటూ మెమో సమర్పించాడు. ఇందుకు ప్రతిఫలంగా విశాకకు రూ. 17.50 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు ఆ మెమోలో పేర్కొన్నాడు. కానీ ఇప్పటివరకు చిల్లిగవ్వ కూడా హెచ్‌సీఏ నుంచి విశాకకు అందలేదు’ అని ఆయన వివరించారు. హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి పోటీపడిన అజహరుద్దీన్, కార్యదర్శి శేష్ నారాయణ్, మాజీ అధ్యక్షుడు అర్షద్ ఆయూబ్, మాజీ కార్యదర్శి జాన్ మనోజ్ అందరిపై కేసులున్నాయని... వీరంతా తనను విమర్శిస్తున్నారని వివేక్ మండిపడ్డారు. -
లోధా సిఫారసులను అమలు చేస్తాం!
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ నిర్వహణలో వివిధ మార్పులను సూచిస్తూ లోధా కమిటీ చేసిన సిఫారసులను తమ సంఘంలో అమలు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్ణయించింది. వాటిని తమ నియమావళిలో చేరుస్తూ ఆమోదముద్ర వేసింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన హెచ్‌సీఏ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)లో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో లోధా సిఫారసుల్లో విడిగా కొన్ని అంశాల అమలుకు హెచ్‌సీఏ సిద్ధమైనా... అన్నింటికీ ఏకాభిప్రాయం కుదర్లేదు. అయితే ఈసారి పూర్తి స్థాయిలో వాటిని అమలు చేసేందుకు హెచ్‌సీఏ సిద్ధమైంది. అందు కోసం అసోసియేషన్ బైలాస్ (నియమావళిలో) కూడా లోధా సిఫారసులను చేర్చారు. రాబోయే రోజుల్లో సుప్రీం కోర్టు లోధా సిఫారసులకు సంబంధించి తుది తీర్పు ఇవ్వనుంది. ఆ తీర్పులో ఏమైనా మార్పులను సుప్రీం ఆదేశిస్తే దాని ప్రకారం మరోసారి నియమావళిని మార్చుకోవాలని కూడా ఎస్‌జీఎంలో హెచ్‌సీఏ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు హెచ్‌సీఏ నియమావళి ప్రకారం తెలంగాణ ప్రాంత పరిధిలోని 10 జిల్లాల్లో క్రికెట్ కార్యకలాపాలను హెచ్‌సీఏ పర్యవేక్షిస్తోంది. ఇప్పుడు దీనిని ‘తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలు’గా సవరించారు. సర్వసభ్య సమావేశంలో కొందరు సభ్యుల నుంచి వివిధ అంశాలపై కొంత అభ్యంతరాలు వ్యక్తమైనా... మొత్తంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగానే ముగిసింది. హైకోర్టు నియమించిన మాజీ న్యాయమూర్తులు జస్టిస్ సీతాపతి, జస్టిస్ అనిల్ దవే సమక్షంలో ఈ ఎస్జీఎం జరిగింది. దీనిని పర్యవేక్షిందుకు బీసీసీఐ తరఫున రత్నాకర్ శెట్టి హాజరయ్యారు. -
సాయి అభినయ్ విజృంభణ
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ ఎ–2 డివిజన్ రెండు రోజుల క్రికెట్ లీగ్‌లో కొసరాజు సీసీ జట్టు ఘనవిజయాన్ని సాధించింది. పి. సాయి అభినయ్ (5/31) బౌలింగ్‌లో విజృంభించడంతో డీఎంఆర్సీ–2 మైదానంలో వీనస్ సైబర్‌టెక్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 263 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓవర్‌నైట్ స్కోరు 10/4తో రెండోరోజు శుక్రవారం ఆట కొనసాగించిన వీనస్ జట్టు అభినయ్ ధాటికి 36.3 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. శుభమ్ శివాజీ చవాన్ (33; 6 ఫోర్లు) మినహా బ్యాటింగ్‌లో ఏ ఒక్కరూ రాణించలేకపోయారు. ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాట్స్‌మెన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఇందులో నలుగురు అభినయ్ బౌలింగ్‌లోనే డకౌట్‌గా వెనుదిరగడం విశేషం. అంతకుముందు కొసరాజు సీసీ 348 పరుగులకు ఆలౌటైంది. డెక్కన్ వాండరర్స్ గెలుపు టీమ్ స్పీడ్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో డెక్కన్ వాండరర్స్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట టీమ్ స్పీడ్ 217 పరుగులకు ఆలౌటవ్వగా... వాండరర్స్ 68.1 ఓవర్లలో 6 వికెట్లకు 218 పరుగులు చేసి గెలుపొందింది. గ్రీన్‌టర్ఫ్‌తో మాంచెస్టర్, ఎలిగెంట్తో మహమూద్ సీసీ, బాలాజీ కోల్ట్స్‌తో జై భగవతి, కాన్కర్డ్తో హెచ్‌యూసీసీ, గెలాక్సీతో మెగా సిటీ జట్ల మధ్య రెండో రోజు జరగాల్సిన ఆట వర్షం కారణంగా రద్దయింది. దీంతో మ్యాచ్ ఫలితాన్ని డ్రాగా నిర్ణయించారు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు రాకేశ్ ఎలెవన్: 259/9 (సచిత్ నాయుడు 150, రాఘవ 51), చీర్‌ఫుల్ చమ్స్: 25/0 (6 ఓవర్లలో). హెచ్‌బీసీసీ: 178 (మొహమ్మద్ హుస్సేన్ 70; అబ్దుల్ అద్నాన్ 5/41), శ్రీ శ్యామ్: 87/3 (ప్రణీత్37, ఇబ్రహీం సిద్ధిఖీ 33). క్రౌన్ సీసీ: 247 (అభిషేక్ 52, సందేశ్ 67, దినేశ్ 61; వెంకట్ 4/72), జిందా తిలిస్మాత్: 249/8 (సాయి వ్రత్ 121, షబార్ 48; దినేశ్ 4/73). -
న్యాయ పోరాటానికి సిద్ధం
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు తనకు అర్హత లేదంటూ అంబుడ్స్‌మన్ ఇచ్చిన తీర్పుపై న్యాయపోరాటం చేస్తానని జి.వివేకానంద్ ప్రకటించారు. దీనిపై హైకోర్టులో అప్పీల్‌కు వెళుతున్నట్లు, వీలైనంత తొందరగా తనకు న్యాయం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం వివేకానంద్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. లోధా సూచనల ప్రకారం తాను అన్ని వివాదాస్పద అంశాలపై అంబుడ్స్‌మన్ నరసింహారెడ్డికి ముందే స్పష్టత ఇచ్చానని... అయితే ఆయన తన వివరణను పరిగణనలోకి తీసుకోకుండా ప్రత్యర్థి వర్గానికి అనుకూలంగా వ్యవహరించడం దురదృష్టకరమని వివేక్ అన్నారు. ప్రధానంగా రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ తనపై అనర్హత వేటు వేశారన్న మాజీ ఎంపీ, ఆ రెండూ తనకు వర్తించవని స్పష్టం చేశారు. ‘లాభదాయక పదవిలో ఉంటున్నానని, కేబినెట్ హోదా ఉందని అంబుడ్స్‌మన్ తీర్పులో ఉంది. అయితే నేను ఏనాడూ ప్రభుత్వ పదవి కోసం ప్రమాణ స్వీకారం చేయలేదు. కేబినెట్లో లేను. అది నిజమైతే ఎన్నికల సమయంలోనే రిటర్నింగ్ అధికారి నా దరఖాస్తును తిరస్కరించేవారు. హెచ్‌సీఏ నియమావళిలో కూడా దీని గురించి ఎక్కడా లేదు. రెండోదైన పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఘర్షణ (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్) పరిధిలో కూడా నేను లేను. ఎందుకంటే హెచ్‌సీఏ, విశాక ఇండస్ట్రీస్ మధ్య ఒప్పందం 2016లోనే ముగిసింది కాబట్టి ఇప్పుడు నేను విశాక ద్వారా ఎలాంటి లాభం పొందడం లేదు’ అని వివేక్ వెల్లడించారు. గురువారం లోధా కమిటీ సిఫారసులపై వాదనల సందర్భంగా ఎవరెవరు అనర్హులు అవుతారో అనే దానిపై సుప్రీం కోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది కాబట్టి దాని ఆధారంగా హైకోర్టులో తాజాగా పోరాటానికి సిద్ధమైనట్లు వివేక్ తెలియజేశారు. ఒకప్పుడు రూ. 4.3 కోట్లు ఇచ్చిన తమతో హెచ్‌సీఏ ఒప్పందాన్ని ఉల్లంఘించి, ఆ తర్వాత నష్టపరిహారంగా రూ. 17.5 కోట్లు చెల్లిస్తామని కోర్టులోనే పిటిషిన్ దాఖలు చేసింది కాబట్టి విశాక–హెచ్‌సీఏ ఒప్పందం ముగిసిన అధ్యాయమని వివేక్ వ్యాఖ్యానించారు. హెచ్‌సీఏలో అవినీతికి అలవాటు పడిన వారిని కాదని సొంత డబ్బులతో ఆట అభివృద్ధికి కృషి చేస్తున్న తనను విమర్శించడంలో అర్థం లేదని ఆయన అన్నారు. -
హెస్‌సీఏ-విశాఖ మధ్య ఎలాంటి అగ్రిమెంట్ లేదు
-
ఇంగ్లండ్‌కు డానియల్ అకాడమీ ఆటగాళ్లు
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ రెండు రోజుల లీగ్‌లో సత్తా చాటిన డానియల్ క్రికెట్ అకాడమీ ఆటగాళ్లు ప్రత్యేక శిక్షణ కోసం ఇంగ్లండ్ వెళ్లనున్నారు. లీసెస్టర్షైర్లో నిర్వహించనున్న అంతర్జాతీయ రెసిడెన్షియల్ క్యాంప్ కోసం అకాడమీకి చెందిన ఆరుగురు క్రీడాకారులు పి. గోవింద్ కౌస్తమ్ రావు, డి. శ్రీ చరణ్ వర్మ, సి. అభిషేక్, వి. శశి శేఖర్ నాయుడు, కె. శ్రీవెన్ సచిత్, టీఎన్ఆర్ మోహిత్ ఇంగ్లండ్ బయలుదేరనున్నారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ద్వారా నియమితులైన శిక్షకుల పర్యవేక్షణలో వీరికి ఆధునిక పద్ధతుల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. -
చెలరేగిన ప్రిన్స్, సుమన్
సాక్షి, హైదరాబాద్: ఓపెనర్లు డానీ డారిక్ ప్రిన్స్ (111 బంతుల్లో 103 నాటౌట్; 16 ఫోర్లు, 1 సిక్స్), తిరుమలశెట్టి సుమన్ (98), చెలరేగడంతో హెచ్‌సీఏ ఎ–1 డివిజన్ మూడు రోజుల లీగ్‌లో ఇన్‌కంట్యాక్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ‘డ్రా’ చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఎస్బీఐ జట్టుకు 3 పాయింట్లు దక్కగా... ఇన్‌కంట్యాక్స్ జట్టుకు 1 పాయింట్ లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 279/5తో మూడో రోజు ఆట కొనసాగించిన ఇన్‌కంట్యాక్స్ జట్టు మరో 41 పరుగులు జతచేసి తొలి ఇన్నింగ్స్‌లో 320 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి బౌలర్లలో రవి కిరణ్ 5, ఆకాశ్ భండారి 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఎస్బీఐ గురువారం ఆట ముగిసే సమయానికి 38 ఓవర్లలో వికెట్ నష్టానికి 269 పరుగులు చేసింది. ప్రిన్స్, సుమన్‌లు ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్నారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. సుమన్ ఔటయ్యాక వచ్చిన కేఎస్కే చైతన్య (51 నాటౌట్) కూడా ధాటిగా ఆడటంతో చివరకు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. రాణించిన రవీందర్, నిఖిల్... ఇండియా సిమెంట్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో హైదరాబాద్ బాట్లింగ్ బ్యాట్స్‌మెన్ రవీందర్ (306 బంతుల్లో 219; 35 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్ సెంచరీకి తోడు నిఖిల్ రామ్ రెడ్డి (88; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 606 పరుగులు చేసింది. ప్రత్యర్థి బౌలర్లలో మారుతి, మూడు వికెట్లు పడగొట్టాడు. ఇండియా సిమెంట్స్ తొలి ఇన్నింగ్స్‌లో 298 పరుగులకు ఆలౌట్ కాగా... రవీందర్, నిఖిల్‌లతో పాటు సయ్యద్ చాంద్ పాషా (83) రాణించడంతో హైదరాబాద్ బాట్లింగ్ భారీ స్కోరు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా సిమెంట్స్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు ఈఎమ్సీసీ తొలి ఇన్నింగ్స్: 267, స్పోర్టింగ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 214 (విఘ్నేశ్ అగర్వాల్ 3/26, మికిలి జైస్వాల్ 3/51), ఈఎమ్సీసీ రెండో ఇన్నింగ్స్: 180/7 (మికిలి జైస్వాల్ 57; ఆంజనేయులు 3/40). పాయింట్లు: ఈఎమ్సీసీ–3, స్పోర్టింగ్ ఎలెవన్–1. ఎవర్గ్రీన్ తొలి ఇన్నింగ్స్: 280, ఎన్స్‌కాన్స్ తొలి ఇన్నింగ్స్: 172, ఎవర్గ్రీన్ రెండో ఇన్నింగ్స్: 208 (బి. మనోజ్ కుమార్ 80; సయ్యద్ మెహదీ హసన్ 4/31), ఎన్స్‌కాన్స్ 181 (రౌల్ రోహాన్ 32, ఒవైస్ 33; నవీన్ 4/21, బుద్ది రాహుల్ 3/49), పాయింట్లు: ఎవర్గ్రీన్–6, ఎన్స్‌కాన్స్–0. ఎంపీ కోల్ట్స్: 257, జెమిని ఫ్రెండ్స్: 403/9 (ఠాకూర్ తిలక్ వర్మ 203 నాటౌట్, ఎన్. అనిరుధ్ 35; గిరీశ్ గౌడ్ 3/72, ఆకాశ్ 3/32), ఎంపీ కోల్ట్స్ రెండో ఇన్నింగ్స్: 176/3 (మేహుల్ భౌమిక్ 51, వైష్ణవ్ రెడ్డి 100 నాటౌట్), పాయింట్లు: జెమిని ఫ్రెండ్స్ 3, ఎంపీ కోల్ట్స్–1. డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 251, ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్: 73, డెక్కన్ క్రానికల్ రెండో ఇన్నింగ్స్: 191 (టి. రవితేజ 3/57, కనిష్క్ నాయుడు 3/26), ఆంధ్రాబ్యాంక్ రెండో ఇన్నింగ్స్: 191/4 (ఆశిష్ రెడ్డి 98 నాటౌట్, అమోల్ షిండే 37 నాటౌట్), పాయింట్లు: డెక్కన్ క్రానికల్–3, ఆంధ్రాబ్యాంక్–1. ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ తొలి ఇన్నింగ్స్: 309/9, బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 227 (షేక్ ఖమ్రుద్దీన్ 5/39), ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ రెండో ఇన్నింగ్స్: 214/7 (కపిల్ 32, విశ్వంత్ 47, జగదీశ్ 40, ఎస్కేఎమ్ బాషా 31 నాటౌట్, సధన్ 3/68), పాయింట్లు: ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ–3, బీడీఎల్–1. దయానంద్ సీసీ: 371, జై హనుమాన్: 357/8 (జి. వినీత్ రెడ్డి 35, జి. శశిధర్ రెడ్డి 30, ఎన్. సూర్య తేజ 116 నాటౌట్, కె. సాయి పూర్ణానంద్ రావు 50, ప్రయాస్ సింగ్ 36; షేక్ సలీమ్ 4/67), పాయింట్లు: జై హనుమాన్–3, దయానంద్ సీసీ–1. -
చరణ్, తిలక్ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: ఓపెనర్ ఎంఎస్ఆర్ చరణ్ (192 బంతుల్లో 111; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో అదరగొట్టడంతో హెచ్‌సీఏ ఎ–1 డివిజన్ మూడు రోజుల లీగ్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఇన్‌కంట్యాక్స్ జట్టు దీటుగా బదులిస్తోంది. బుధవారం ఆట ముగిసే సమయానికి ఇన్‌కంట్యాక్స్ 93.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేసింది. చేతిలో మరో ఐదు వికెట్లు ఉన్న ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 112 పరుగులు వెనుకబడి ఉంది. ఎస్బీఐ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 14/1తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇన్‌కంట్యాక్స్ జట్టును చరణ్ ఆదుకున్నాడు. రక్షణ్ రెడ్డి (182 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) తో కలిసి రెండో వికెట్‌కు 137 పరుగులు జోడించి మంచి పునాది వేశాడు. ఓ వైపు చరణ్ బౌండరీలతో చెలరేగుతుంటే రక్షణ్ మాత్రం చాలా నెమ్మదిగా ఆడాడు. ఆ తర్వాత వంశీ వర్ధన్ రెడ్డి (60; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), షాదాబ్ తుంబి (54 బ్యాటింగ్; 8 ఫోర్లు) కూడా రాణించడంతో ఇన్‌కంట్యాక్స్ మంచి స్థితిలో నిలిచింది. ప్రత్యర్థి బౌలర్లలో రవికిరణ్, డానియల్ మనోహర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. తిలక్ వర్మ జోరు... ఎంపీ కోల్ట్స్‌తో జరుగుతున్న మరో మ్యాచ్‌లో జెమిని ఫ్రెండ్స్ జట్టు బ్యాట్స్‌మన్ ఠాకూర్ తిలక్‌వర్మ అజేయ సెంచరీతో అదరగొట్టాడు. తిలక్ సెంచరీ కారణంగా జెమిని ఫ్రెండ్స్ ఆట ముగిసే సమయానికి ఎనిమిది వికెట్లకు 275 పరుగులు చేసింది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు కాంటినెంటల్ సీసీ తొలి ఇన్నింగ్స్: 80, ఏఓసీ: 341/9 డిక్లేర్డ్ (ఇర్ఫాన్ ఖాన్ 40, లలిత్ మోహన్ 4/101) కాంటినెంటల్ సీసీ రెండో ఇన్నింగ్స్: 170 (హృషికేశ్ 39, సంహిత్ రెడ్డి 40; సచిన్ షిండే 4/30, సాగర్ శర్మ 3/40). ఈఎమ్సీసీ: 267, స్పోర్టింగ్ ఎలెవన్: 207/9 (భవేశ్ సేత్ 112, విఘ్నేశ్ అగర్వాల్ 3/26). ఎవర్గ్రీన్ తొలి ఇన్నింగ్స్: 280, ఎన్స్‌కాన్స్ తొలి ఇన్నింగ్స్: 172 (మెహదీ హసన్ 97, మొహమ్మద్ అజహర్ 37; నవీన్ 3/83, ప్రణీత్‌రెడ్డి 3/41), ఎవర్గ్రీన్ రెండో ఇన్నింగ్స్: 139/2 (జి. విక్రమ్ నాయక్ 41, బి. మనోజ్ కుమార్ 70 బ్యాటింగ్). ఎంపీ కోల్ట్స్: 257, జెమిని ఫ్రెండ్స్: 275/8 (ఎం. అభిరత్ రెడ్డి 47, ఠాకూర్ తిలక్ వర్మ 129 బ్యాటింగ్, రచ్నేశ్ దూబే 32, గిరీశ్ గౌడ్ 3/51, ఆకాశ్ 3/17). డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 251, ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్: 73 (టీపీ అనిరుధ్ 5/27, ఎం. పృథ్వీ 3/37), డెక్కన్ క్రానికల్ రెండో ఇన్నింగ్స్: 152/7 (పి. సాయి వికాస్ రెడ్డి 68). ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ: 309/9 (రఫూస్ రోడ్రిగ్స్ 33 నాటౌట్, సుదీప్ త్యాగి 3/57, ఆకాశ్ సన 3/71) బీడీఎల్: 227/9 (ప్రతీక్ పవార్ 40, కె. సుమంత్ 56, షేక్ ఖమ్రుద్దీన్ 4/39). ఇండియా సిమెంట్స్: 298, హైదరాబాద్ బాట్లింగ్: 313/5 (సాయి ప్రణయ్ 39, రోహన్ 75, రవిందర్ 104 బ్యాటింగ్, నిఖిల్ 31 బ్యాటింగ్). దయానంద్ సీసీ: 371 (భగత్ వర్మ 71, కార్తికేయ 3/57), జై హనుమాన్: 181/5 (జి. వినీత్ రెడ్డి 35, జి. శశిధర్ రెడ్డి 30, ఎన్. సూర్య తేజ 45 బ్యాటింగ్). -
చందన్ డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: చందన్ సహాని (220 బంతుల్లో 283; 33 ఫోర్లు, 15 సిక్స్‌లు) డబుల్ సెంచరీకి తోడు విక్రమ్ నాయక్ (351 బంతుల్లో 185; 21 ఫోర్లు) భారీ శతకం బాదడంతో హెచ్‌సీఏ ఎ–1 డివిజన్ మూడు రోజుల లీగ్‌లో ఎంపీ కోల్ట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎవర్గ్రీన్ జట్టు 123 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 610 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఎంపీ కోల్ట్స్ జట్టు బుధవారం ఆట ముగిసే సమయానికి 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. మొహుల్ భూమిక్ (50; 11 ఫోర్లు), వైష్ణవ్ రెడ్డి (56; 11 ఫోర్లు), మొహమ్మద్ అసదుద్దీన్ (49; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు. ప్రస్తుతం నిఖిలేశ్ సురేంద్రన్ (20 బ్యాటింగ్; 3 ఫోర్లు), అభినవ్ తేజ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఎవర్గ్రీన్ బౌలర్లలో సుఖైన్ జైన్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 391/2తో రెండో రోజు ఆట కొనసాగించిన ఎవర్గ్రీన్ జట్టు చందన్ చెలరేగడంతో భారీ స్కోరు చేసింది. 155 పరుగులతో రెండో రోజు మైదానంలోకి వచ్చిన చందన్ బౌండరీలే లక్ష్యంగా విరుచుకుపడ్డాడు. ఎడాపెడా సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో రోజు అతను 12 ఫోర్లు, 10 సిక్స్‌ల సాయంతో 128 పరుగులు చేయడం విశేషం. అతనికి మరో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ విక్రమ్ చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 441 బంతుల్లో 430 పరుగులు జోడించారు. అనంతరం చందన్, విక్రమ్, ప్రణీత్ రెడ్డి (0), శ్యామ్ (6) వెంటవెంటనే ఔటయ్యారు. ప్రత్యర్థి బౌలర్లలో రిత్విక్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇతర మ్యాచ్‌ల వివరాలు గ్రూప్ ‘ఎ’: ఎస్సీఆర్సీఏ: 364 (ఎమ్. సురేశ్ 57, బి. సుధాకర్ 38; సాకేత్ సాయిరామ్ 6/117), జై హనుమాన్: 119/6 (రోహిత్ రాయుడు 30, ఎస్కే ఖమ్రుద్దీన్ 3/15). ఇన్‌కంట్యాక్స్: 556 (షాదాబ్ తుంబి 188, విదాత్ 3/92, భగత్ వర్మ 3/137), దయానంద్ సీసీ: 228/6 (అన్షుల్ లాల్ 100, చైతన్య కృష్ణ 104). బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 232; (సంతోష్ గౌడ్ 31 బ్యాటింగ్), ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్: 320 (రొనాల్డ్ రాయ్ రోడ్రిగ్స్ 92, టి. రవితేజ 60, నీరజ్ బిష్త్ 36; గన్ను సధన్ 5/114, తేజోధర్ 3/64); బీడీఎల్ రెండో ఇన్నింగ్స్: 98/4. ఎస్బీఐ: 342, ఈఎంసీసీ: 244 (మిఖిల్ జైస్వాల్ 39, షేక్ సోహైల్ 83, అంకిత్ అగర్వాల్ 30, అజయ్ దేవ్ గౌడ్ 37 నాటౌట్; అశ్విన్ యాదవ్ 5/34, ఆకాశ్ భండారి 3/82). గ్రూప్ బి: ఏఓసీ: 436 (ఇర్ఫాన్ ఖాన్ 31, ఆశిష్ 5/111); కేంబ్రిడ్జ్ ఎలెవన్: 116 (రాహుల్ చహర్ 4/24); ఏఓసీ రెండో ఇన్నింగ్స్: 75/4. ఎన్స్‌కాన్స్: 393 (అస్కారి 104, అజహరుద్దీన్ 32), కాంటినెంటల్ సీసీ: 139/3 (అనిరుధ్ సింగ్ 67 బ్యాటింగ్). జెమిని ఫ్రెండ్స్: 429 ( కౌషిక్ యాదవ్ 118, రచనేశ్ యాదవ్ 88, మల్లికార్జున్ 4/74, మీర్ ఒమర్ ఖాన్ 3/113), ఇండియా సిమెంట్స్: 115/8 (రోహాన్ 30). -
హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్‌కు ఎదురుదెబ్బ
-
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కొనసాగవద్దు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జి.వివేకానంద్‌కు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా వివేక్ కొనసాగడానికి వీల్లేదంటూ అంబుడ్స్‌మన్ జస్టిస్ నర్సింహా రెడ్డి ఇచ్చిన తీర్పు అమలును నిలిపేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం రద్దు చేసింది. అంబుడ్స్‌మన్ తీర్పుపై తిరిగి విచారణ చేపట్టాలని సింగిల్ జడ్జికి సూచించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. హెచ్‌సీఏతో వాణిజ్యపరమైన ఒప్పందం ఉన్న విశాక ఇండస్ట్రీస్‌కు వివేక్ డైరెక్టర్‌గా వ్యవహరించడం విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని, అందువల్ల ఆయన హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అనర్హుడిగా ప్రకటించాలంటూ అంబుడ్స్‌మన్ ముందు భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్, బాబూరావు తదితరులు ఫిర్యాదులు దాఖలు చేశారు. విచారణ జరిపిన అంబుడ్స్‌మన్ జస్టిస్ నర్సింహా రెడ్డి ఈ ఏడాది మార్చి 8న తీర్పునిస్తూ... విశాక ఇండస్ట్రీస్‌కు డైరెక్టర్‌గా కొనసాగుతూ, అదే కంపెనీతో ఒప్పందం ఉన్న హెచ్‌సీఏకు అధ్యక్షుడిగా ఉండటం విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని తేల్చారు. అందువల్ల హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కొనసాగడానికి వీల్లేదంటూ పేర్కొన్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ వివేక్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి మార్చి 15న అంబుడ్స్‌మన్ తీర్పు అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను మళ్లీ సవాలు చేస్తూ అంబుడ్స్‌మన్ ముందు ఫిర్యాదుదారులైన అజహరుద్దీన్, బాబూరావులు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి మంగళవారం తీర్పు వెలువరిస్తూ... సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. అంబుడ్స్‌మన్ తీర్పుపై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని విచారణ జరపాలని సింగిల్ జడ్జికి సూచించింది. తీర్పును స్వాగతిస్తున్నాం... హైకోర్టు ఉత్తర్వులపై పిటిషనర్ బాబూరావు సంతోషం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏ పనితీరు సక్రమంగా లేకనే బీసీసీఐ నుంచి నిధులు రావడం లేదని... వివేక్ వర్గానికి చిత్తశుద్ధి ఉంటే లోధా కమిటీ సిఫారసులను అనుగుణంగా పూర్తి స్థాయి ఎన్నికలకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. -
మాజీ ఎంపీ వివేక్‌కు షాక్
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు జి.వివేక్‌కు మంగళవారం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో అంబుడ్స్‌మన్ ఇచ్చిన తీర్పును సమర్ధించిన హైకోర్టు.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోసారి పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశించింది. అప్పటి వరకు వివేక్ హెచ్‌సీఏ అధ్యక్ష పదవిలో కొనసాగొద్దని తీర్పునిచ్చింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి జి. వివేక్ అనర్హుడని ప్రకటిస్తూ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి మార్చిలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కేబినేట్ స్థాయి పదవి అయిన ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మరోవైపు హెచ్‌సీఏకు అధ్యక్షునిగా ఉండటం తగదన్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ జి.వివేక్ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ అప్పట్లో స్టే విధించింది. తీర్పును స్వాగతిస్తున్నాము : అజారుద్దీన్ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తెలిపారు. వివేక్ ప్యానల్ ఎంపిక నిబంధనల ప్రకారం జరగలేదన్నారు. అంబడ్స్‌మెన్ వివేక్‌పై తీసుకున్న నిర్ణయమే నిజమైందన్నారు. తొలి నుంచి తాము వివేక్ ప్యానల్‌పై పోరాటం చేస్తున్నామని, చివరకు హెచ్‌సీఏలో న్యాయమే గెలిచిందని తెలిపారు. హెచ్‌సీఏలో ఏం జరగాలన్నది జనరల్ బాడీ మీటింగ్ నిర్వహిస్తారన్నారు. -
‘కోచ్‌లను, క్రికెటర్లను వేధిస్తున్నారు’
హైదరాబాద్: ఇటీవల భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సభ్యత్వం కోరుతూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణాలోని మారుమూల జిల్లాల క్రికెటర్లకు తగిన అవకాశాలు కల్పించేలా తమ అసోసియేషన్‌కు గుర్తింపు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై మరొకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన టీసీఏ సభ్యులు.. తమకు జూన్‌లో అసోసియేటివ్ మెంబర్షిప్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ అసోసియేషన్‌కు ముంబై హైకోర్టులు అనుకూలంగా తీర్పునిచ్చిన సంగతిని టీసీఏ సెక్రటరీ గురువా రెడ్డి మరోసారి గుర్తు చేశారు. 2014 నుంచి జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం టీసీఏ కృషి చేస్తుందన్నారు. వచ్చే దేశవాళీ సీజన్లో టీసీఏ జట్లు కూడా పాల్గొంటాయన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధే లక్ష్యంగా టీసీఏను ఏర్పాటు చేశామన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదనే విషయాన్ని హెచ్‌సీఏ తెలుసుకోవాలన్నారు. జిల్లాల్లో కోచ్‌లను, క్రికెటర్లను హెచ్‌సీఏ వేధిస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమని బెదిరించే బదులు.. క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తే బాగుంటుందని హెచ్‌సీఏకు హితవు పలికారు. తమకు వచ్చే నిధులను తాము తీసుకుంటామన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా.. జిల్లా క్రికెటర్ల కోసం హెచ్‌సీఏ లీగ్‌లు ఏర్పాటు చేస్తుందని, ఇలా పెడుతూ వారి పని వారు చూసుకుంటే మంచిదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆటగాళ్ల కోసం వేలల్లో మ్యాచ్‌లు నిర్వహించామని.. ఇకపై కూడా నిర్వహిస్తూనే ఉంటామన్నారు. శరద్ పవార్, వినోద్ రాయ్, రాజీవ్ శుక్లాలతో తాము మాట్లాడమని, వారంతా తమకు అనుకూలంగా స్పందించినట్లు విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే హెచ్‌సీఏపై ఎన్నో కేసులున్నాయని, వారు చేసిన తప్పులకు తప్పకుండా శిక్ష అనుభవిస్తారన్నారు. టీసీఏ ప్రెసిడెంట్ ఎండెల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. 2016, 17ల్లో టీసీఏ సభ్యత్వం కోసం బీసీసీఐకి వినతిపత్రాలు ఇచ్చామన్నారు. బీసీసీఐ స్పందించని కారణంగా ముంబై హైకోర్టుకు వెళ్లామన్నారు. దీనిపై తమకు అనుకూలంగా తీర్పు వచ్చిన విషయాన్ని ఆయన పేర్కొన్నారు. ఇది తెలంగాణ క్రికెటర్లకు శుభపరిణామంగా ఎండెల తెలిపారు. దీన్ని హెచ్‌సీఏ స్వాగతించాలే తప్పా.. కానీ ఆటగాళ్లను వేధిస్తోందన్నారు. తమకు సభ్యత్వం ఇవ్వొద్దని హెచ్‌సీఏ.. బీసీసీఐ లేఖ రాయడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇలా చేస్తే తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినట్లేనని ఆయన మండిపడ్డారు. -
ఆ తీర్పును కొట్టేయండి: వివేక్
సాక్షి, హైదరాబాద్: తమపై అనర్హత వేటు వేస్తూ హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి ఈ నెల 8న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్ష, కార్యదర్శులుగా వ్యవహరించిన జి.వివేక్, టి.శేష్ నారాయణ్‌లు హైకోర్టును ఆశ్రయించారు. అంబుడ్స్‌మన్ తీర్పుపై వీరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తిస్థాయి వాదనల నిమిత్తం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంబుడ్స్‌మన్ ముందు వివేక్‌కు వ్యతిరేకంగా మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ తదితరులు పిటిషన్ దాఖలు చేశారు. శేష్ నారాయణ్‌కు వ్యతిరేకంగా సాగర్ క్రికెట్ క్లబ్ కార్యదర్శి బాబూరావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన అంబుడ్స్‌మన్ జస్టిస్ నర్సింహారెడ్డి, హెచ్‌సీఏకు అధ్యక్షుడిగా ఉన్న వివేక్, హెచ్‌సీఏతో వాణిజ్యపరమైన ఒప్పందం ఉన్న విశాక ఇండస్ట్రీస్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించడం విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందంటూ ఈ నెల 8న తీర్పునిచ్చారు. అలాగే హెచ్‌సీఏ అవినీతి కేసుల్లో దాఖలైన చార్జిషీట్‌ల్లో శేష్ నారాయణ్ పేరు ఉన్నందున ఆయన కార్యదర్శిగా కొనసాగడానికి వీల్లేదని జస్టిస్ నర్సింహారెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు. తమ తమ విషయాల్లో అంబుడ్స్‌మన్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ఇరువురు కూడా తమ పిటిషన్లలో కోర్టును కోరారు. విశాక ఇండస్ట్రీస్‌తో తనకున్న సంబంధాలరీత్యా తన కంపెనీకీ, హెచ్‌సీఏకు మధ్య ఉన్న వివాదంపై తీసుకునే నిర్ణయాల్లో తాను పాలు పంచుకోనని, ఈ విషయంలో మార్గదర్శకం చేయాలని అంబుడ్స్‌మన్/హెచ్‌సీఏ ఎథిక్స్ ఆఫీసర్‌ను రాతపూర్వకంగా కోరానని, అయితే ఇప్పటి వరకు దానిపై ఆయన స్పందించకపోగా... ఇప్పుడు తనను అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చారని వివేక్ తెలిపారు. తాను హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అనర్హుడినని ప్రకటించడానికి తాను ప్రభుత్వ సలహాదారుగా ఉండటాన్ని కూడా అంబుడ్స్‌మన్ కారణంగా చూపారని, వాస్తవానికి ఈ విషయం అంబుడ్స్‌మన్ న్యాయ పరిధికి సంబంధించింది కాదని ఆయన స్పష్టం చేశారు. లోధా కమిటీ సిఫారసుల ప్రకారం చార్జిషీట్లో పేరు ఉన్న వ్యక్తికి అనర్హత వర్తిస్తుందని ఎక్కడా చెప్పలేదని శేష్ నారాయణ్ తన పిటిషన్లో వివరించారు. ఈ విషయాన్ని అంబుడ్స్‌మన్ పట్టించుకోలేదన్నారు. చార్జ్‌షీట్‌లో పేరున్నంత మాత్రాన అనర్హుడిగా ప్రకటించడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. కాబట్టి అంబుడ్స్‌మన్ తీర్పును కొట్టేయాలని కోరారు. -
వివేక్ అనర్హుడు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక చెల్లదంటూ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి ఉత్తర్వులు జారీచేయడం సంచలనం సృష్టించింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జి. వివేక్ ఆ పదవికి అనర్హునిగా ప్రకటిస్తూ అంబుడ్స్‌మన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కేబినేట్ స్థాయి పదవి అయిన ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మరోవైపు హెచ్‌సీఏకు అధ్యక్షునిగా ఉండటం తగదని ఆయన పేర్కొన్నారు. కాగా, హెచ్‌సీఏ కార్యదర్శి టి. శేష్ నారాయణ్ ఎన్నిక కూడా చెల్లదని ఆయన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఏసీబీ చార్జిషీటులో శేష్‌నారాయణ్ నిందితునిగా ఉన్నందున కార్యదర్శి పదవికి ఆయన అర్హుడు కాదని అంబుడ్స్‌మన్ తేల్చారు. వారిని పదవుల నుంచి తప్పుకోవాలని ఆదేశించారు. హెచ్‌సీఏ అధ్యక్ష, కార్యదర్శుల కోసం మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. అంతవరకు హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్ష, కార్యదర్శులుగా ఉపాధ్యక్షుడు, కోశాధికారి వ్యవహరిస్తారని చెప్పారు. -
వివేక్‌పై చర్య తీసుకోండి!
హైదరాబాద్: హెచ్‌సీఏ కార్యదర్శిగా ఉన్న శేష్ నారాయణ్‌ను చట్టవిరుద్ధంగా ఆ పదవి నుంచి తప్పించారని... అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ, హెచ్‌సీఏ సభ్యుడు వి.హనుమంతరావు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు జి.వివేకానంద్‌పై చీటింగ్ కేసు నమోదు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సర్వసభ్య సమావేశం పూర్తి కాకుండానే లోధా కమిటీ ప్రతిపాదనలకు హెచ్‌సీఏ ఆమోద ముద్ర వేసిందంటూ క్రికెట్ అభిమానులను వివేక్ మోసగించారని వీహెచ్ ఆరోపించారు. హెచ్‌సీఏ సమావేశంలో సభ్యుల హాజరుకు సంబంధించి కూడా లోధా కమిటీకి తప్పుడు లేఖలు సమర్పించారని ఆయన విమర్శించారు. వివేక్ అధ్యక్ష హోదాలో ఉండి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు అదేశాలను, తాము ఇచ్చిన రికార్డులను, ఫిర్యాదులను పరిశీలించి ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు. -
క్రికెట్ అభివృద్ధికి హెచ్‌సీఏ ఏం చేసింది?
హైదరాబాద్: క్రికెట్ అభివృద్ధి కోసం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) తీసుకున్న చర్యలేమిటో వివరించాలని ‘ది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్’ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎ.లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ కార్యదర్శి గురువారెడ్డితో కలిసి హెచ్‌సీఏపై ధ్వజమెత్తారు. వివేక్ దిగిపోవాలని వారి కమిటీ సభ్యులే డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే క్రికెట్ కోసం ఏం చేశారో వివరించాలని హెచ్‌సీఏను బీసీసీఐ కోరడంతో ఏం తోచని సందిగ్ధావస్థలో ఉన్నారని ఆరోపించారు. టీటీఎల్ను నిర్వహించే హక్కు వివేక్‌కు లేదని పేర్కొన్నారు. టీటీఎల్‌లో తెలంగాణ వారు చాలా తక్కువ మంది ఉన్నారన్న లక్ష్మీనారాయణ డబ్బులు తీసుకొని ఆ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వివేక్ బినామీ పేర్ల మీద క్రికెట్ క్లబ్‌లు నడుపుతున్నారని, త్వరలో అన్నీ బయట పడతాయని దుయ్యబట్టారు. -
అట్టహాసంగా వెంకటస్వామి స్మారక టీ20 లీగ్
సాక్షి, హైదరాబాద్ : వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 (టీటీఎల్) లీగ్ శనివారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భారత దిగ్గజ ఆటగాళ్లు కపిల్ దేవ్, వీవీఎస్ లక్ష్మణ్‌లతో పాటు సినీతారలు వెంకటేశ్, శ్రీకాంత్, నిర్మాత డి. సురేశ్‌బాబు, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జి. వివేకానంద్, 10 జిల్లా జట్ల యజమానులు పాల్గొన్నారు. తొలి మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్, మెదక్ మావేరిక్స్ తలపడ్డాయి. ఈ నెల 25న జరిగే ఫైనల్‌తో ఈ టోర్నమెంట్ ముగుస్తుంది. -
వివాదాల్ని రచ్చ చేయొద్దు
నర్సాపూర్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లోని సభ్యుల మధ్య విభేదాలు ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలి గానీ వివాదాల్ని రచ్చ చేయడం తగదని హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్ అన్నారు. అజయ్ యాదవ్ స్మారకార్థం నిర్వహిస్తోన్న ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీని ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభేదాలు ఉన్నంత మాత్రాన బజారున పడి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సరికాదని హితవు పలికారు. ఇలాంటి చర్యల వల్ల హెచ్‌సీఏ పరువు పోతుందని అన్నారు. హెచ్‌సీఏ సమావేశాలకు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజహరుద్దీన్‌ను రానివ్వకపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తికి రెండు పదవులు ఉండరాదని పలు కమిటీలు, కమిషన్ల నిబంధనలు స్పష్టం చేస్తున్నప్పటికీ హెచ్‌సీఏ అధ్యక్షునిగా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా వివేక్ ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అన్నిరకాల క్రీడలను ప్రోత్సహిస్తుండటం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. స్టేడియాలు నిర్మిస్తే ఉపయోగం... హెచ్‌సీఏ ఆధ్వర్యంలో స్టేడియాల నిర్మాణంతో పాటు క్రీడాకారులకు ఉపయోగపడే ప్రాజెక్టులు చేపడితే ముందు తరాల వారికి ఉపయోగకరంగా ఉంటుందని హెచ్‌సీఏ మాజీ ప్రధాన కార్యదర్శి చలపతిరావు అన్నారు. తాము హెచ్‌సీఏను పాలించిన సమయంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించామని గుర్తు చేశారు. పలు జిల్లాల్లో స్టేడియాలను నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో అజయ్ యాదవ్ ట్రస్టు చైర్మన్, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మురళీధర్ యాదవ్, ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
హెచ్‌సీఏపై నిప్పులు చెరిగిన అజారుద్దీన్
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)పై టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోథా సిఫార్సులను హెచ్‌సీఏ అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. హెచ్‌సీఏ పాలకవర్గం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అజారుద్దీన్ విమర్శించారు. ఆయన శనివారమిక్కడ మీడియా సమావేశంతో మాట్లాడుతూ...‘ నేను రాజకీయంగా ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేశానని క్రికెటర్‌గా యూపీ నుంచి రిజిస్ట్రర్ ఎలా చేసుకుంటాను. హెచ్‌సీఏ అందరిని పక్కదారి పట్టిస్తోంది. గ్రామీణ క్రీడాకారులకు అవకాశం ఇవ్వడం లేదు. జిల్లా, రూరల్ ప్రాంతాల నుంచి కూడా మంచి క్రీడాకారులు ఉన్నారు. హెచ్‌సీఏ నిర్వహించే టీ20 లీగ్ అంతా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోంది. ఆ లీగ్‌కు వివేక్ తన తండ్రి పేరు పెట్టడంపై అందరి ఆమోదం తీసుకోలేదు. హెచ్‌సీఏ లోగోతో వివేక్ తండ్రి వెంకటస్వామి పేరుతో టీ20 లీగ్ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమే. ఇక బీసీసీఐ నుంచి నాకు క్లియరెన్స్ రాలేదని ఆరోపించారు. కానీ నాకు హైకోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. దీనిపై నేను బీసీపీఐకి నివేదిక పంపాను. కోర్టు ఆదేశాలను బయటకు రానీయకుండా హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్ తప్పు చేశారు. చదువుకున్న వ్యక్తులు ఇలా ప్రవర్తించడం బాధాకరం. దీనిపై నేను చట్టపరంగా ముందుకు వెళతా. నాకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌తో ఎలాంటి సంబంధం లేదు. అయితే నన్ను ఓ సెలబ్రెటీగా అందరూ ఆహ్వానిస్తారు’ అని తెలిపారు. -
'వివేక్ చెప్పేవన్నీ అవాస్తవాలే'
-
అజారుద్దీన్ మనవాడా, కాదా? : వీహెచ్
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మరోసారి నిప్పులు చెరిగారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను హెచ్‌సీఏ సమావేశానికి అనుమతించకపోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అజారుద్దీన్ కి జరిగిన అవమానం పై పాకిస్తాన్ కోడై కూస్తుందన్నారు. అవసరం ఉంటే అజార్ భాయ్ అంటారు.. అవసరం తీరాక హట్ ఛలో అంటారా..? అని ధ్వజమెత్తారు. అజారుద్దీన్ మనవాడా కాదా?.. అనేది సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. అజారుద్దీన్ హెచ్‌సీఏ మెంబర్ కాదని మొన్నటి వరకు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ వివేక్ అన్నారు. కోర్టు అజారుద్దీన్ కి క్లీన్ చీట్ ఇచ్చినా హెచ్‌సీఏ అనుమతి ఇవ్వడం లేదన్నారు. అజారుద్దీన్ పై కుట్రతో వివేక్ ఇలా చేస్తున్నారని హనుమంతరావు నిప్పులు చెరిగారు. తాను రాజకీయ కుట్రలతో హెచ్‌సీఏ మీటింగ్ కి వస్తున్నానని వివేక్ కరీంనగర్ లో మాట్లాడారని హనుమంతరావు అన్నారు. 8నెలల కింద నెలకొల్పిన ప్యానల్ కి శేష నారాయణ సెక్రెటరీ, వివేక్ ప్రెసిడెంట్ అయ్యారన్నారు. ప్రస్తుత ప్యానల్ కి ఎన్నో సంవత్సరాలు హెచ్‌సీఏని పాలించిన వినోద్ కి పెద్ద పోస్ట్ కట్టపెట్టాలని వివేక్ అంటే దానికి శేష నారాయణ ఒప్పుకోనందుకే ఆయన పై సస్పెన్షన్ వేటు వేశారని తెలిపారు. ఉప్పల్ స్టేడియంకి వివేక్ తండ్రి వెంకటస్వామి పేరు పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారన్నారు. స్టేడియంలో ఇచ్చే టికెట్ల మీద విశాఖ సంస్థ పెరుపెట్టుకొని విక్రయాలు చేస్తున్నారన్నారు. ఆ తరువాత ఐపీఎల్ వాళ్లను బెదిరించి రూ. లక్షలు వసూళ్లు చేశారని ఆరోపించారు. వివేక్, వినోద్‌లు కలిసి హెచ్‌సీఏని దోచుకుంటున్నారని మండిపడ్డారు. వెంకట స్వామి పేరుతో జరుగుతున్న టోర్నమెంట్లపై రూ.12లక్షలు వసూళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. తన ఎంపీ నిధులు రాజీవ్ గాంధీ స్విమ్మింగ్ ఫూల్, ఫుట్ బాల్ గ్రౌండ్, రాజీవ్ గాంధీ పేరుమీద పిల్లలకు స్టైఫండ్ ఇస్తున్నా, ఇది తన రికార్డ్ అని హనుమంతరావు అన్నారు. తెలంగాణ క్రికెట్ అని క్లబ్ ఉంటే నష్టం ఏంటని కేసీఆర్ ని ప్రశ్నించారు. అజారుద్దీన్ అంతర్జాతీయ క్రీడాకారుడు ఆయన సేవలు వినియోగించుకుంటే తప్పేముందని సూచించారు. హెచ్‌సీఏ జరిపే టోర్నమెంట్ లలో ఓపెన్ ఆక్షన్ ఎందుకు పెట్టరో సమాధానం చెప్పాలన్నారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా వివేక్ తప్పుపడుతున్నారని హనుమంతరావు అన్నారు. సానియా మీర్జా, పీవీ సింధు గెలుస్తే డబ్బులు, భూములు సీఎం కేసీఆర్ ఇస్తున్నారు. హెచ్‌సీఏ మీ అయ్య జాగిరా..? అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. పక్క రాష్టంలో క్రీడలు ఎలా ఉన్నాయి.. తెలంగాణలో ఎలా ఉన్నాయి. వివేక్ రాజకీయంగా ఏమైనా చేసుకో కానీ, క్రీడలను నిర్లక్ష్యం చెయ్యకు అంటూ వీహెచ్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి ఇటు ప్రభుత్వంలో జీతం తీసుకుంటూ హెచ్‌సీఏలో ప్రెసిడెంట్ గా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. -
'వివేక్ వెంటనే రాజీనామా చేయాలి'
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్ష పదకి జి. వివేక్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ డిమాండ్ చేశారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వివేక్ హెచ్‌సీఏలో కొనసాగడానికి ఎంతమాత్రం అర్హత లేదన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ)కి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అనుమతి ఇచ్చే విషయంలో అడ్డుకుంటామని వివేక్ స్వయంగా చెప్పడం నిజంగా సిగ్గుచేటన్నారు. ఇలా చెప్పడం తెలంగాణ యువతను క్రికెట్ దూరం చెయ్యడం కాదా.. అని అరుణ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు జరిగిన తరువాత టీసీఏ..బీసీసీఐ అనుమతి కోసం యత్నంచడంలో తప్పేముందని అరుణ నిలదీశారు. ఈ సందర్భంగా టీసీఏను 1986లో పాల్వాయి గోవర్ధన్ స్థాపించిన సంగతిని గుర్తు చేశారు. అదే సమయంలో హెచ్‌సీఏ ఏనాడూ గ్రామీణ ప్రాంతాల్లో టోర్నమెంట్ నిర్వహించి, ప్రోత్సహకాలు అందించిన దాఖలాలు లేవని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా హెచ్‌సీఏ గ్రామాల్లోకి వెళ్లిన దాఖలాలు లేవని మండిపడ్డారు. టీసీఏపై హెచ్‌సీఏ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని అనడానికి వివేక్ వ్యాఖ్యలు ఉదాహరణగా ఆమె పేర్కొన్నారు. హెచ్‌సీఏపై లెక్కలేనటువంటి ఆరోపణలున్నాయని, రూ. 140 కోట్ల అవినీతి జరిగినట్లు ఏసీబీలో కేసులో ఉన్నాయన్నారు. ఇక్కడ జరపని టోర్నమెంట్లను జరిపినట్లు చూపిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని డీకే అరుణ దుయ్యబట్టారు. ఇదిలా ఉంచితే, తెలంగాణలో మహిళా క్రికెటర్లకు ఎంతమాత్రం ప్రోత్సాహం లేదని, దీనిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల యువతి, యువకులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు టీసీఏ కంకణం కట్టుకుని పనిచేస్తోందన్నారు. హెచ్‌సీఏలో వివేక్ కుటుంబ పాలన కొనసాగిస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. హెచ్‌సీఏ అవినీతిపై అసెంబ్లీలో చర్చకు తీసుకొస్తామని హెచ్చరించిన అరుణ.. హెచ్‌సీఏలో ఏమి జరిగినా జవాబు చెప్పాల్సిన బాధ్యత వివేక్‌పై ఉందన్నారు. టీసీఏకి త్వరలో బిసిసిఐ అనుమతి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. టీసీఏ కి వస్తున్న ఆదరణ ఓర్వలేక వివేక్ ఆరోపణలకు దిగుతున్నారని అరుణ ఆరోపించారు. హెచ్‌సీఏలో తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న వివేక్ దాన్ని దృష్టిలో పెట్టుకుని రాజీనామా చేయాలన్నారు. -
వివేక్‌పై నిప్పులుచెరిగిన టీసీఏ
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ సలహాదారు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జి.వివేక్‌పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. జిల్లాల్లో క్రికెట్ టోర్నీలు నిర్వహించని వివేక్.. ఆ పేరుతో కోట్ల రూపాయలు దిగమింగారని టీసీఏ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, జనరల్ సెక్రటరీ గురువారెడ్డిలు ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన టీసీఏ ప్రతినిధులు.. హెచ్‌సీఏ అక్రమాల చిట్టాను బయటపెట్టారు. వెంకటస్వామి ట్రోఫికి అనుమతి ఎవరిచ్చారు? : ‘‘క్రికెట్లో ఓనమాలు కూడా తెలియని వివేక్ రాజకీయాలను అడ్డం పెట్టుకుని హెచ్‌సీఏ అధ్యక్షుడయ్యారు. జిల్లాల్లో టోర్నమెంట్లు నిర్వహించకున్నా ఆ పని చేసినట్లు చెప్పుకుని నిధులు కాజేశారు. గత రెండు సంవత్సరాలలో రూ.2కోట్ల నిధులు దారిమళ్లించారు. హెచ్‌సీఏ కార్యదర్శి(శేష్ నారాయణ్) సస్పెన్షన్ విషయంలో నిబంధనలు పాటించలేదు. వెంకటస్వామి పేరు మీద ట్రోఫీ నిర్వహించడానికి హెచ్‌సీఏ జనరల్ బాడీ అనుమతి ఉందా? వివేక్ తన విశాఖ సంస్థ ప్రచారం కోసం క్రికెట్ సంఘాన్ని వాడుకుంటున్నారు’’ అని లక్ష్మీనారాయణ అన్నారు. పోరాటం చేస్తాం : తెలంగాణ జిల్లాలన్నీ హెచ్‌సీఏ పరిథిలోకే వస్తాయని వివేక్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. టీసీఏ చైర్మన్‌గా మంత్రి ఈటల రాజేందర్, చీఫ్ ప్యాట్రన్‌గా కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయలు ఉన్నారు. ఇప్పటివరకు మేం(టీసీఏ) 1200 మ్యాచ్‌లు నిర్వహించాం. అవసరమైన మేరలో సీనియర్ క్రికెటర్ల సేవలను వినియోగించుకుంటాం. క్రికెట్ కోసం ఇంతగా కష్టపడుతోన్న టీసీఏకి బీసీసీఐ గుర్తింపు విషయంలో హెచ్‌సీఏ అనుమతి అవసరమేలేదు. వివేక్ ఆధ్వర్యంలో హెచ్‌సీఏలో కొనసాగుతోన్న అక్రమపర్వాలపై చట్టపరమైన పోరాటం చేస్తాం..’’ అని గురువారెడ్డి వ్యాఖ్యానించారు. -
బీసీసీఐ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు..!
సాక్షి, హైదరాబాద్ : భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని, కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచ్‌ల ద్వారా వచ్చిన లాభాలతోనే సంస్థను నడిపిస్తున్నామని హెచ్‌సీఏ అధ్యక్షుడు జి. వివేక్ చెప్పుకొచ్చారు. మంగళవారం హెచ్‌సీఏ కార్యాలయంలో అంబుడ్స్‌మన్ సమావేశం జరిగింది. సమావేశం అజెండాలో ప్రధానాంశమైన సెక్రటరీ శేష్ నారాయణపై వేటు, భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు అవమానం తదితర విషయాలపై వివేక్ మీడియాతో మాట్లాడారు. రోజూ రాత్రి ఫోన్ చేస్తాడు : అవినీతి ఆరోపణల నేపథ్యంలో హెచ్‌సీఏ కార్యదర్శి పోస్టు నుంచి సస్పెన్షన్‌కు గురైన శేష్ నారాయణ భవితవ్యంపై అంబుడ్స్‌మన్ కమిటీ చర్చించింది. అతనిపై హెచ్‌సీఏ పాలకమండలి విధించిన సస్పెన్షన్ సమర్థనీయమా, కాదా అనే విషయాన్ని అంబుడ్స్‌మన్ జస్టిస్ నర్సింహారెడ్డి నిర్ధారిస్తారు. కాగా, మంగళవారం నాటి భేటీ తుది నిర్ణయం ప్రకటించకుండానే ముగిసింది. శేష్ నారాయణ సస్పెన్షన్‌పై తీర్పు జనవరి 20కి వాయిదా పడింది. ఇదిలాఉంటే సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్న శేష్ నారాయణ మంచి మిత్రుడని హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్ అన్నారు. ‘రోజూ రాత్రి 11 గంటలకు శేష్ నాకు ఫోన్ చేస్తాడ’ని తెలిపారు. అందుకే అజార్‌ను రానివ్వలేదు : భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌ను హెచ్‌సీఏ ఆఫీసులోకి రానీయకుండా అడ్డుకున్న వ్యవహారం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దానిపై వివేక్ వివరణ ఇచ్చారు. ‘‘నేషనల్ క్రికెట్ క్లబ్ కార్డు చూపించమని అడిగితే అజార్ చూపించలేదు. ఆయన వైస్ ప్రెసిడెంట్లుగా కనీసం రికార్డుల్లోకూడా లేదు. అందుకే అతన్ని హెచ్‌సీఏ సమావేశానికి అనుమతించలేదు. అయితే అజార్ సేవలను వినియోగించుకునేందుకు మేం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. క్రికెట్లో సమస్యలు చెప్పాలని ఆయనను కోరాం’’ అని వివేక్ వివరించారు. ‘‘క్రికెట్లో ఎ, బి, సి, డిలు కూడా తెలియని వ్యక్తులు హెచ్‌సీఏకు ప్రెసిడెంట్‌గా ఉన్నారు’ అని వివేక్‌పై అజారుద్దీన్ మండిపడిన సంగతి తెలిసిందే. క్రికెట్‌ను ఎవరైనా నడిపించొచ్చు : క్రికెట్ కమిటీల విషయంలో జస్టిస్ లోథా కమిటీ, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కాగా అమలుచేస్తున్నట్లు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ వివేక్ చెప్పారు. బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు నిధులు రాలేదని, ఐపీఎల్ మ్యాచ్‌ల ద్వారా వచ్చిన లాభాలతోనే బండిని నడిపిస్తున్నామన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ)తో హెచ్‌సీఏకి ఎలాంటి విబేధాలు లేవని, క్రికెట్‌ను ఎవరైనా నడిపించుకోవచ్చని, అయితే హెచ్‌సీఏకు పోటీ సంఘాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని బీసీసీఐ స్పష్టం చేసిందని వివేక్ తెలిపారు. -
అజారుద్దీన్‌కు బ్రేక్.. మైక్‌ను నేలకు కొట్టిన వీహెచ్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సహనం కోల్పోయారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను హెచ్‌సీఏ సమావేశానికి అనుమతించకపోవడంతో ఆగ్రహించిన వీహెచ్.. సమావేశంలో మైక్‌ను నేలకేసి కొట్టారు. హెచ్‌సీఏ కార్యాలయంలో ఆదివారం హెచ్‌సీఏ ప్రత్యేక సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన అజారుద్దీన్‌ను సిబ్బంది అడ్డుకోవడంతో వీహెచ్ ఆగ్రహంగా స్పందించారు. ఇదేమైనా టీఆర్ఎస్ మీటింగ్ అనుకుంటున్నావా.. అని టీఆర్ఎస్ నేత, హెచ్‌సీఏ ప్రెసిడెంట్ వివేక్‌పై మండిపడ్డారు. ఈ సందర్భంగా వివేక్ స్పందిస్తూ..లోథా కమిటీ ఆదేశాల అమలు కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. మీటింగ్‌లో ఇంతకుముందు అమలైన 16 అంశాలపై చర్చ జరిగిందన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ)కు అజారుద్దీన్ మద్దతిస్తున్నారని తెలిసిందని, అందుకే అనుమతి ఇవ్వలేదని తెలిపారు. అజారుద్దీన్ పై తమకు చాలా గౌరవం ఉందన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో నిధులు లేవని, అండర్-14 నిర్వహించడానికి కూడా నిధులు లేకపోతే ఇతరుల దగ్గర నుంచి నిధులు తెచ్చి నిర్వహించామని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హెచ్‌సీఏ లోథా సిఫార్సులన్నింటినీ అమలు చేస్తుందని వివేక్ చెప్పారు. హనుమంత రావు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. టీసీఏ వాళ్ల పని వాళ్లు చూసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. అజారుద్దీన్ తెలంగాణ క్రికెట్ అసోషియేషన్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటున్నారని వార్తలు వచ్చినందుకు ఆయన్ని మీటింగ్‌కు రానివ్వలేదని వివేక్ స్పష్టం చేశారు. -
హెచ్‌సీఏ సెలక్టర్ల రాజీనామా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో గురువారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ సెలక్షన్ కమిటీలోని ముగ్గురు సభ్యులలో చైర్మన్ రమేశ్ కుమార్, శ్రీనివాస చక్రవర్తి తమ పదవులకు రాజీనామా చేశారు. రంజీ ట్రోఫీ, అండర్–23 జట్ల ఎంపికలో హెచ్‌సీఏ కార్యదర్శి శేష్ నారాయణ్ అతిగా జోక్యం చేసుకోవడం, ఈ విషయంలో ఆయనతో తలెత్తిన విభేదాలే రాజీనామాకు కారణమని సమాచారం. మరోవైపు అండర్–23 జట్టు కోసం కొత్తగా క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ పదవిని సృష్టించి, అన్ని విషయాల్లో ఆయనకు జవాబుదారీగా ఉండాలంటూ హెచ్‌సీఏ నిర్ణయం తీసుకున్నందుకు నిరసనగా జట్టు కోచ్ అనిరుధ్ సింగ్ కూడా తన పదవి నుంచి తప్పుకున్నారు. హైదరాబాద్ రంజీ జట్టు ప్రస్తుతం ఢిల్లీలో రైల్వేస్‌తో తలపడుతుండగా... నేటినుంచి హైదరాబాద్, ఒడిషా మధ్య అండర్–23 మ్యాచ్ జరగనుంది. -
అసదుద్దీన్ అజేయ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ ఎ–2 డివిజన్ రెండు రోజుల క్రికెట్ లీగ్‌లో నేషనల్ సీసీ జట్టు బ్యాట్స్‌మన్ మొహమ్మద్ అసదుద్దీన్ (84 బంతుల్లో 127 నాటౌట్; 9 ఫోర్లు, 9 సిక్సర్లు) మెరుపు సెంచరీతో కదం తొక్కాడు. దీంతో ఉస్మానియా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో నేషనల్ సీసీ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట ఉస్మానియా జట్టు 56 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది. దీపాంకర్ (65) అర్ధసెంచరీ చేయగా, అవినాశ్ (34 నాటౌట్) రాణించాడు. నేషనల్ సీసీ బౌలర్లలో షరీఫ్ జుబేర్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం అసదుద్దీన్ చెలరేగడంతో స్వల్ప లక్ష్యాన్ని నేషనల్ సీసీ అలవోకగా ఛేదించింది. 24.5 ఓవర్లలో 2 వికెట్లకు 176 పరుగులు చేసి గెలిచింది. మరో మ్యాచ్ వివరాలు సీసీఓబీ: 252 (67.2 ఓవర్లలో), టీమ్ స్పీడ్: 253/7 (కె. ప్రజ్వల్ 52, హిమతేజ 57, గణేశ్ 59 నాటౌట్, శ్రీనాథ్ రెడ్డి 36; సయ్యద్ సల్మాన్ 4/50). రాకేశ్ ఎలెవన్: 217 (56 ఓవర్లలో), నిజాం కాలేజి: 221/7 (సాయి కుమార్ 39, హరిహర నాయక్ 41, టి. అక్షయ్ 77 నాటౌట్; అనిరు«ద్ నడిపల్లి 3/28). -
మా మ్యాచ్‌లు ఇవ్వండి!
సాక్షి, హైదరాబాద్: వర్షాల కారణంగా హైదరాబాద్ జట్టు ఆడాల్సిన రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు కూడా పూర్తిగా రద్దయ్యాయని, వీటిని మరోసారి నిర్వహించేలా చూడాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లతో హైదరాబాద్ ఆడాల్సిన ఈ మ్యాచ్‌లలో ఎనిమిది రోజుల పాటు ఒక్క బంతి కూడా పడలేదు. ‘మా గ్రూప్‌లో అందుబాటులో ఉన్న ఆరు మ్యాచ్‌లలో రెండు పూర్తిగా రద్దు కావడం దురదృష్టకరం. ఇది మా నాకౌట్ అవకాశాలను దెబ్బ తీస్తుంది. కాబట్టి దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఈ రెండు మ్యాచ్‌లను మళ్లీ నిర్వహించాలని మేం బీసీసీఐకి లేఖ రాశాము. దీనిపై బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి స్పందించారు. హెచ్‌సీఏ అభ్యర్థనను పరిశీలిస్తామని...బోర్డు టోర్నమెంట్ అండ్ ఫిక్చర్స్ కమిటీ ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన మాకు ప్రత్యుత్తరం ఇచ్చారు’ అని హెచ్‌సీఏ కార్యదర్శి శేష్ నారాయణ్ వెల్లడించారు. -
నేడు హెచ్‌సీఏ మహిళా క్రికెట్ సెలక్షన్స్
సాక్షి, హైదరాబాద్: క్రికెట్లో రాణిస్తోన్న వర్ధమాన మహిళా క్రికెటర్లకు మంచి అవకాశం. హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నేడు అండర్–23, సీనియర్ మహిళల కేటగిరీలో సెలక్షన్ ట్రయల్స్ జరుగనున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఉదయం 10 గంటలకు అం డర్–23 విభాగంలో, మధ్యాహ్నం గం. 2: 30కి సీనియర్ మహిళల కేటగిరీలో సెలక్షన్స్ నిర్వహిస్తారు. ఆసక్తిగలవారు జనన ధ్రువీకరణ, బోనఫైడ్ ఒరిజినల్ సర్టిఫికెట్లతో సెలక్షన్స్‌కు హాజరు కావాలి. వర్షం కారణంగా జింఖానా గ్రౌండ్స్‌లో జరగాల్సిన ఈ సెలక్షన్స్ వేదికను ఉప్పల్‌కు మార్చారు. -
షేక్ వాజిద్ డబుల్ సెంచరీ
130 బంతుల్లో 204; 22 ఫోర్లు, 6 సిక్సర్లు ఎ–3 డివిజన్ వన్డే లీగ్ సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ ఎ–3 డివిజన్ వన్డే లీగ్‌లో అంబర్పేట్ సీసీ జట్టు బ్యాట్స్‌మన్ షేక్ వాజిద్ (130 బంతుల్లో 204; 22 ఫోర్లు, 6 సిక్సర్లు) అదరగొట్టే ప్రదర్శన చేశాడు. రిలయన్స్ సీసీతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు డబుల్ సెంచరీతో విజృంభించాడు. దీంతో ఆ జట్టు 419 పరుగుల తేడాతో రిలయన్స్ సీసీ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అంబర్పేట్ సీసీ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 505 పరుగుల భారీస్కోరు చేసింది. వాజిద్‌తో పాటు చందు (100 బంతుల్లో 166 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ సెంచరీతో కదం తొక్కాడు. షేక్ నాజిర్ (66) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో అభినవ్ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన రిలయన్స్ జట్టును నాజిర్ (6/39) వణికించాడు. అతని ధాటికి 21.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మరో మ్యాచ్ వివరాలు రాజు సీఏ: 63 (ప్రతీక్ సెహగల్ 6/23, మానిక్ 4/28), పికెట్ సీసీ: 64 (సాహి తి కుమార్ 30, జ్ఞాన సాయి 18). -
సెంచరీతో చెలరేగిన రుద్ర
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ ఎ–2 డివిజన్ రెండు రోజుల క్రికెట్ లీగ్‌లో రోహిత్ ఎలెవన్ బ్యాట్స్‌మన్ రుద్ర దండే (120 బంతుల్లో 194; 20 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు సెంచరీతో చెలరేగాడు. దీంతో బాలాజీ కోల్ట్స్ జట్టుతో గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో రోహిత్ ఎలెవన్ భారీ స్కోరు సాధించింది. 81 ఓవర్లలో 480 పరుగులకు ఆలౌటైంది. వాసిత్ సర్తాజ్ (58), గంగా సింగ్ (69) దూకుడుగా ఆడారు. ప్రత్యర్థి బౌలర్లలో యశ్వంత్ రెడ్డి 3, జి. భరత్ రెడ్డి 4 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బాలాజీ కోల్ట్స్ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 3 ఓవర్లలో 2 వికెట్లకు 6 పరుగులు చేసింది. ఇతర మ్యాచ్‌ల వివరాలు సాయి సత్య : 156 (సూరజ్ సక్సేనా 48; అఫ్రోజ్ 3/25, కమల్ సావరియా 3/25, ముజ్తబా 3/45), పాషా బీడీ: 115/3 (విశేష్ శర్మ 65 బ్యాటింగ్, ముజ్తబా 31). న్యూ బ్లూస్: 209 (అకేందర్ 52, అజ్మత్ ఖాన్ 36), అపెక్స్:90/6 (23 ఓవర్లలో). శ్రీచక్ర: 234 (భరద్వాజ్ 41, కె. జైదేవ్ గౌడ్ 61; అద్నాన్ 4/49), జైభగవతితో మ్యాచ్. బడ్డింగ్ స్టార్: 184 (ఆకాశ్ యాదవ్ 68), పోస్టల్: 147 (నవీన్ కుమార్ 43; ఆశిష్ 4/50, అబ్దుల్ మొఖీత్ 3/28). రాకేశ్ ఎలెవన్: 267 (నిఖిల్ నేతాజీరెడ్డి 104, టి. కరణ్ 56; అశ్వద్ రాజీవ్ 5/85, అమిత్ 3/16), ఆక్స్ఫర్డ్ బ్లూస్: 10/0 (5 ఓవర్లలో). కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్: 105 (షకీర్ 42; సమీర్ 4/25, వేదాంత్ 3/23), సలీమ్ నగర్: 109/8 (పవన్ 4/33). మహమూద్ సీసీ: 232 (మొహమ్మద్ హుస్సేన్ 77; నీలమ్ తరుణ్ రాజ్ 3/18), కంకర్డ్ సీసీతో మ్యాచ్. చీర్‌ఫుల్ చమ్స్:141 (అభిషేక్ 36; సహేంద్ర మల్లు 4/47), హెచ్‌యూసీసీ: 143/4 (సహేం ద్ర మల్లు 38 నాటౌట్; ఆర్కే విఘ్నేశ్ 3/47). నిజాం కాలేజ్: 278 (భరత్ కుమార్ 113, హేమంత్ 43; ఇల్యాన్ 4/55), డెక్కన్ ఆర్సెనల్స్: 146/4 (ఎ. వినయ్ 92; డి. శ్రీనివాస్ 3/26). -
సెమీస్‌లో హెచ్‌సీఏ ఎలెవన్
మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో హెచ్‌సీఏ ఎలెవన్ సెమీఫైనల్‌కు చేరుకుంది. హెచ్‌సీఏతో పాటు బరోడా సీఏ, ఎయిరిండియా, ఆంధ్రా కోల్ట్స్ జట్లు కూడా సెమీస్‌లో అడుగుపెట్టాయి. ఎన్ఎఫ్సీ గ్రౌండ్స్‌లో జరిగే తొలి సెమీస్‌లో హెచ్‌సీఏ ఎలెవన్‌తో బరోడా సీఏ, రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగే రెండో సెమీస్‌లో ఎయిరిండియాతో ఆంధ్రా కోల్ట్స్ తలపడతాయి. ఇదిలా ఉండగా సోమవారం జరగాల్సిన రౌండ్–5 లీగ్ మ్యాచ్‌లు వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయాయి. గ్రూప్ ‘ఎ’లో హెచ్‌సీఏ ఎలెవన్ జట్టుకు విదర్భ సీఏ వాకోవర్ ఇవ్వడంతో హెచ్‌సీఏ ఖాతాలో 4 పాయింట్లు చేరాయి. ఈ విభాగంలో కాగ్, గోవా సీఏ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో 2 పాయింట్లు లభించాయి. గ్రూప్ ‘బి’ కేటగిరీలోనూ ఎయిరిండియాతో కేరళ సీఏ, బరోడా సీఏతో హెచ్‌సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్ తలపడాల్సి ఉండగా వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లు జరగలేదు. దీంతో ప్రతీ జట్టుకు తలో 2 పాయింట్లు లభించాయి. లీగ్ మ్యాచ్‌ల అనంతరం రెండు గ్రూపుల్లోనూ తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ పోరుకు అర్హత సాధించాయి. -
తన్మయ్ అగర్వాల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో హెచ్‌సీఏ ఎలెవన్ బ్యాట్స్‌మన్ తన్మయ్ అగర్వాల్ (127 బంతుల్లో 131; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. తన్మయ్‌తో పాటు బౌలర్లు కూడా రాణించడంతో ‘కాగ్’ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్‌లో హెచ్‌సీఏ 163 పరుగులతో ఘనవిజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హెచ్‌సీఏ ఎలెవన్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 354 పరుగులు సాధించింది. అక్షత్ రెడ్డి (80), కె. సుమంత్ (73), ఆశిష్ రెడ్డి (58) అర్ధసెంచరీలతో రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో ఇంతియాజ్ అహ్మద్, అక్షయ్, పునీత్ యాదవ్ తలో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో ‘కాగ్’ జట్టు తడబడింది. హెచ్‌సీఏ బౌలర్లు సీవీ మిలింద్ (2/37), మెహదీ హసన్ (3/26), ముదస్సిర్ హుస్సేన్ (2/32) ధాటికి 40.4 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. పునీత్ యాదవ్ (40), బిపుల్ శర్మ (33) పోరాడారు. ఆకాశ్ భండారీకి ఒక వికెట్ దక్కింది. ఇతర మ్యాచ్‌లలో ఆంధ్ర 82 పరుగులతో విదర్భపై, ఎయిరిండియా 17 పరుగులతో హెచ్‌సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్‌పై, కేరళ 181 పరుగులతో కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్‌పై విజయం సాధించాయి. -
ఆకిబ్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఇంటర్ స్కూల్ క్రికెట్ లీగ్‌లో భవన్స్ హైస్కూల్ ఆటగాడు మొహమ్మద్ ఆకిబ్ (137, 3/18) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొదట బ్యాటింగ్‌లో సెంచరీతో చెలరేగిన ఆకిబ్, తర్వాత బౌలింగ్‌లోనూ విజృంభించాడు. దీంతో మోజెస్ హైస్కూల్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భవన్స్ హైస్కూల్ జట్టు 173 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన భవన్స్ హైస్కూల్ 45 ఓవర్లలో 8 వికెట్లకు 283 పరుగులు సాధించింది. ఆకిబ్ (128 బంతుల్లో 137; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. కార్తికేయన్ (34) రాణించాడు. అనంతరం 284 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన మోజెస్ హైస్కూల్ 45 ఓవర్లలో 9 వికెట్లకు 110 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ఎం. కౌశిక్ (23 నాటౌట్) మినహా ఏ ఒక్కరూ రాణించలేకపోయారు. భవన్స్ బౌలర్లలో అకీబ్ 3, అమన్ మిశ్రా, అనంత్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇతర మ్యాచ్‌ల వివరాలు చిరెక్ పబ్లిక్ స్కూల్: 125 (కార్తీక్ గుప్తా 44, సమర్థ్ 48; ఎస్. నిఖిల్ 5/24, కె. సాహిల్ 3/19), కాల్ పబ్లిక్ స్కూల్: 126 (సాత్విక్ 38 నాటౌట్, గౌరంగ్ 77 నాటౌట్). బాయ్స్టౌన్: 118 (మొహమ్మద్ జైబ్ 42; శశి కుమార్ 3/29, ఎస్. ఈశ్వర్ 3/7), సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్: 90 (మొహమ్మద్ జైబ్ 3/10, మొహమ్మద్ ఫరీస్ షరీఫ్ 2/19, అజయ్ 2/20). వెస్లీ జూనియర్ కాలేజ్: 125 (హరిసింగ్ 44; ఫైజాన్ 5/30), సీడీఆర్ జూనియర్ కాలేజ్: 127/7 (ఆర్య 4/12). హెచ్‌పీఎస్: 92 (28.3 ఓవర్లలో), భవన్స్ ఎస్ఏ: 93/9 (28.1 ఓవర్లలో). జాన్సన్ గ్రామర్ స్కూల్: 121 (కుషాల్ దేశాయ్ 4/13), లయోలా జూనియర్ కాలేజ్: 124/2 (అభిషేక్ లింగం 77 నాటౌట్). సుల్తాన్ ఉలూమ్: 72 (గోవింద్ 5/26), డాన్‌బాస్కో హైస్కూల్: 74/2 (17.4 ఓవర్లలో). సెయింట్ జోసెఫ్ హైస్కూల్: 94 (సాకేత్ 4/23), నీలకంఠ విద్యాపీఠ్: 97/3 (17.2 ఓవర్లలో). గౌతమ్ మోడల్ స్కూల్: 165 (అజీజుద్దీన్ 48; అయాన్ 3/20), మెరిడియన్ హైస్కూల్: 71 (హర్ష సంకల్ప్ 3/12). హైదరాబాద్ వాండరర్స్: 179(ఒబేద్ 43; హర్షిత్ 3/34, శ్రీకాంత్ 3/28), లక్కీ ఎలెవన్: 181(ధీరజ్ 84 నాటౌట్). -
వ్యాయామ విద్యను విస్తరించాలి
జాతీయ సదస్సులో హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్ వ్యాఖ్య ఉస్మానియా యూనివర్సిటీ: ఆరోగ్యంతో పాటు చురుగ్గా ఉండేందుకు వ్యాయామ విద్యను మరింత విస్తరించాలని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు వివేక్ అన్నారు. శనివారం ఓయూ క్యాంపస్ దూరవిద్య కేంద్రంలో ‘ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ సైన్స్–2017’ అనే అంశంపై జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఓయూ వ్యాయామ విద్య విభాగం ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ కార్యక్రమానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్, సదస్సు చైర్మన్ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ అధ్యక్షత వహించగా, వివేక్ ముఖ్య అతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా వ్యాయామ విద్య విస్తరించాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడల పట్ల అవగాహన కల్పిస్తూ విద్యార్థుల్లో వ్యాయామ విద్యపై ఆసక్తిని పెంచాలన్నారు. విశ్వవిద్యాలయాల కృషితోనే ఇది సాధ్యమవుతుందన్నారు. హెచ్‌సీఏ తరఫున ఓయూ క్యాంపస్‌లో ఆధునిక హంగులతో క్రికెట్ పిచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... ఓయూలో సింథటిక్ ట్రాక్‌ను కూడా నిర్మిస్తామని చెప్పారు. రెండు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, పది దేశాల నుంచి 450 ప్రతినిధులు హాజరయ్యారని సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ రాజేశ్ కుమార్ చెప్పారు. అధ్యాపకులు, పరిశోధన విద్యార్థుల నుంచి 300 పరిశోధన పత్రాలను సమర్పించనున్నట్లు చెప్పారు. అనంతరం సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఔటా అధ్యక్షులు ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ, వ్యాయామ విద్య వీసీ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
హెచ్‌సీఏపై అజహర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) పై భారత మాజీ కెప్టెన్ మొహ్మద్ అజహరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్‌సీఏ ఎన్నికలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని, వాటిని వెంటనే రద్దు చేయాలంటూ ధ్వజమెత్తారు. అసలు హెచ్‌సీఏ తీరు సరిగా లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లోథా కమిటీ సిఫార్సుల ప్రకారం చూస్తే హెచ్‌సీఏ సెలక్షన్ కమిటీకి ఎటువంటి అర్హత లేదని విమర్శించారు. ఆ కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారతీయ క్రికెటర్లకు హెచ్‌సీఏలో గుర్తింపు లేదన్న అజహర్.. హైదరాబాద్ క్రికెట్ జట్టు నుంచి కొందరు క్రీడాకారులు రంజీకి ఎంపిక కాకపోవడం నిరాశ కలిగించిందన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు అన్యాయం జరిగింది.. ఈఎంపిక లోథా కమిటీ సిఫారసుల మేరకే జరిగిందా లేదా అర్ధం కావటం లేదన్నారు. ఎన్నికల తరువాత హెచ్‌సీఏలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయని ఆరోపించారు. ఇది ఎవరినీ నిందించటానికి కాదన్నారు.హెచ్‌సీఏ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు రావడానికి ఇంకా సమయం ఉంది...అప్పటి వరకు వేచి చూడాలన్నారు. తీర్పు వచ్చాక ఏం చెయ్యాలో చెప్తానన్నారు. -
మిథాలీని ఆదర్శంగా తీసుకోవాలి
హైదరాబాద్: భారత మహిళల క్రికెట్ జట్టులో మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి ఉండటమే కాకుండా జట్టుకు నాయకత్వం వహిస్తున్న మిథాలీరాజ్‌ను సన్మానించుకోవడం మన కర్తవ్యంగా భావిస్తున్నామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షులు డా.జి.వివేక్ అన్నారు. హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఆదివారం ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మీటింగ్ హాలులో ఆమెను ఘనంగా సత్కరించి రూ. 5 లక్షల నగదు పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహిళల వరల్డ్ కప్‌లో మిథాలీరాజ్ గొప్పగా రాణిం చిందన్నారు. భావి మహిళా క్రికెటర్లకు మిథాలీరాజ్ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మహిళా క్రికెటర్లకు చేయూతనిచ్చేందుకు హెచ్‌సీఏ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. అనంతరం భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్ మాట్లాడుతూ... హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఇంత గొప్పగా సన్మానిస్తున్నందుకు హెచ్‌సీఏ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీనియర్ ఆటగాళ్లంతా రావడం ఆనందంగా ఉందన్నారు. హెచ్‌సీఏ సహకారంతో రానున్న రోజుల్లో మరింతగా రాణిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జస్టిస్ సీతాపతి, మాజీ మంత్రి వినోద్, మిథాలీరాజ్ కోచ్ ఆర్ఎస్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
41 ఫోర్లు, 13 సిక్సర్లు
మణికంఠ ట్రిపుల్ సెంచరీ సెంచరీ కొట్టిన ఆర్యన్ ∙ తొలి వికెట్‌కు 518 పరుగుల భాగస్వామ్యం డీపీఎస్ ఘనవిజయం l హెచ్‌సీఏ అండర్–16 స్కూల్ లీగ్ చిలకలగూడ: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్–16 స్కూల్ లీగ్ క్రికెట్లో ఆదివారం అద్భుతం చోటు చేసుకుంది. సుల్తాన్ ఉల్ ఉలూమ్ స్కూల్ జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్, నాచారం) బ్యాట్స్‌మన్ ఆదం మణికంఠ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. నమ్మశక్యంకానిరీతిలో ఏకంగా ట్రిపుల్ సెంచరీ నమోదు చేసి ఔరా అనిపించాడు. 142 బంతులు ఆడిన మణికంఠ 41 ఫోర్లు, 13 సిక్సర్ల సహాయంతో 316 పరుగులు చేసి అవుటయ్యాడు. మణికంఠతోపాటు మరో ఓపెనర్ గడ్డం ఆర్యన్ (129 బంతుల్లో 159; 16 ఫోర్లు) కూడా కదంతొక్కాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 240 బంతుల్లో 518 పరుగులు జోడించడం విశేషం. మరో బ్యాట్స్‌మన్ సాయి కౌశిక్ (25 బంతుల్లో 57; 10 ఫోర్లు) కూడా రాణించాడు. మరోవైపు సుల్తాన్ ఉల్ ఉలూమ్ జట్టు ఎక్స్‌ట్రాల రూపంలో 107 పరుగులు ఇవ్వడం గమనార్హం. దాంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన డీపీఎస్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లకు 649 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 650 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సుల్తాన్ ఉల్ ఉలూమ్ స్కూల్ జట్టు పృథ్వీ (6/35), మనీశ్ (3/9)ల ధాటికి 14 ఓవర్లలోనే 54 పరుగులకు కుప్పకూలింది. దాంతో డీపీఎస్ జట్టు 595 పరుగుల భారీ తేడాతో విజయం దక్కించుకుంది. ‘ట్రిపుల్’ సెంచరీతో చెలరేగిన మణికంఠతోపాటు సెంచరీ సాధించిన ఆర్యన్లకు స్కూల్ యాజమాన్యంతోపాటు తండ్రి ఆదం విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ ఆదం ఉమాదేవి అభినందించారు. చిలుకూరులోని వీజీ రావు క్రికెట్ గ్రౌండ్స్‌లో నారాయణ కాన్సెప్ట్ స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో గౌతమ్ మోడల్ స్కూల్ ఘనవిజయాన్ని సాధించింది. ఈమ్యాచ్‌లో 293 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన గౌతమ్ మోడల్ స్కూల్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 363 పరుగులు చేసింది. ఓపెనర్లు హర్ష్ (103 బంతుల్లో 107; 13 ఫోర్లు), బి. రూపేశ్ (102 బంతుల్లో 84; 5 ఫోర్లు) తొలివికెట్‌కు 222 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారీస్కోరును అందించారు. రాహుల్ రెడ్డి (55) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం నారాయణ కాన్సెప్ట్ స్కూల్ 22 ఓవర్లలోనే కేవలం 70 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. అనికేత్ 18 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, తర్షిత్ కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చి 3 వికెట్లను దక్కించుకున్నాడు. -
రాయుడు, ఓజా వచ్చేశారు
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ కొత్త సీజన్‌కు ముందు హైదరాబాద్ జట్టు కోసం ప్రాక్టీస్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు హెచ్‌సీఏ సిద్ధమైంది. ఇందులో భాగంగా హైదరాబాద్, విదర్భ క్రికెట్ అసోసియేషన్ జట్టుతో మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ మ్యాచ్‌లు ఈ నెల 24 నుంచి ఆగస్ట్ 2 వరకు జరుగుతాయి. ఇందులో తలపడే హైదరాబాద్ జట్టును బుధవారం ప్రకటించారు. గత ఏడాది వరకు హైదరాబాద్‌కు దూరంగా ఉన్న అంబటి రాయుడు, ప్రజ్ఞాన్ ఓజా తిరిగి జట్టులోకి రావడం విశేషం. రాయుడు... ఆంధ్ర, బరోడా, విదర్భ జట్ల తరఫున ఆడగా, ఓజా బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించాడు. దాదాపు ఇదే జట్టు రంజీ ట్రోఫీకి కూడా ఎంపికయ్యే అవకాశం ఉండటంతో వీరిద్దరి పునరాగమనం ఖాయమైంది. జట్టు: అంబటి రాయుడు, అక్షత్ రెడ్డి, బి. సందీప్, తన్మయ్ అగర్వాల్, ఠాకూర్ తిలక్‌వర్మ, ఆకాశ్ భండారి, ప్రజ్ఞాన్ ఓజా, సీవీ మి లింద్, రవికిరణ్, కె.సుమంత్, మెహదీ హసన్, ఆశిష్ రెడ్డి, విశాల్ శర్మ, రోహిత్ రా యుడు, ముదస్సిర్ హుస్సేన్. స్టాండ్ బైస్: పి.రోహిత్ రెడ్డి, శ్రవణ్ కుమార్, కోచ్: అర్జున్ యాదవ్. హెచ్‌సీఏ సెలక్షన్స్ వాయిదా: నగరంలోని వివిధ మైదానాల్లో నేడు, రేపు జరగాల్సిన హెచ్‌సీఏ ఎ2–డివిజన్ రెండు రోజుల లీగ్ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. అలాగే రెండు రోజుల లీగ్ జట్ల కోసం హెచ్‌సీఏ నిర్వహించాలనుకున్న ఓపెన్ సెలక్షన్స్ కూడా వాయిదా పడ్డాయి. జింఖానా గ్రౌండ్స్‌లో ఈ నెల 24వ తేదీన సెలక్షన్స్ నిర్వహిస్తారు. -
‘లోధా’ సిఫార్సులకు హెచ్‌సీఏ ఓకే
సాక్షి, హైదరాబాద్: జస్టిస్ ఆర్ఎం లోధా ప్యానెల్ సూచించిన సిఫార్సుల అమలుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆమోద ముద్ర వేసింది. ఆదివారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐతో పాటు ఇతర రాష్ట్రాల క్రికెట్ సంఘాలలో సంస్కరణల నిమిత్తం సుప్రీం కోర్టు లోధా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బీసీసీఐను ప్రక్షాళన చేస్తూ పలు సంస్కరణలను సూచించింది. ఆరంభం నుంచి లోధా కమిటీ సిఫార్సుల అమలుకు సుముఖంగానే ఉంది. అయితే ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో వాటికి ఆమోద ముద్ర వేసింది. మీరెలా ఎన్నికయ్యారు? లోధా సిఫార్సుల అమలు కోసం సమావేశమైన హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశంలో రభస జరిగింది. ఇటీవలే జి. వివేక్ అధ్యక్షతన ఎన్నికైన హెచ్‌సీఏ నూతన కార్యవర్గం ఎంపికను ప్రశ్నిస్తూ పలువురూ చర్చను లేవనెత్తారు. లోధా సిఫార్సుల ప్రకారం తమ ఎన్నిక జరిగిందని చెప్పుకుంటున్న నూతన హెచ్‌సీఏ పెద్దలు... ఇన్నాళ్ల తర్వాత లోధా సిఫార్సులకు ఆమోద ముద్ర వేయడం ఏమిటని వ్యతిరేక వర్గం ప్రశ్నించింది. అంటే లెక్క ప్రకారం నూతన కార్యవర్గం ఎంపిక చెల్లదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నలకు హెచ్‌సీఏ కార్యవర్గ సభ్యులు సంతృప్తికర వివరణ ఇవ్వలేకపోయారు. -
భారత్ శుభారంభం
లండన్: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) సెమీఫైనల్స్ టోర్నమెంట్లో భారత జట్టు శుభారంభం చేసింది. స్కాట్లాండ్తో గురువారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 4–1 గోల్స్ తేడాతో గెలిచింది. ఆట ఆరో నిమిషంలో కెప్టెన్ క్రిస్ గ్రాసిక్ గోల్‌తో స్కాట్లాండ్ ఖాతా తెరిచింది. ఆరంభంలోనే గోల్ సమర్పించుకున్న భారత్ ఆ తర్వాత జాగ్రత్తగా ఆడింది. 31వ, 34వ నిమిషాల్లో రమణ్‌దీప్ సింగ్ రెండు గోల్స్ చేయడంతో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్‌కు ఆకాశ్‌దీప్ సింగ్ (40వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (42వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. శుక్రవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో కెనడాతో భారత్ తలపడుతుంది. -
40 ఏళ్లు దాటితే లీగ్స్‌లో నో చాన్స్
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) బాధ్యతలు స్వీకరించిన జి. వివేక్ నేతృత్వంలోని కొత్త కార్యవర్గం లీగ్ మ్యాచ్‌ల నియమ నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసి ఈ సీజన్‌ను ప్రారంభించింది. ఈ ఏడాది నుంచి 40 ఏళ్లు పైబడిన క్రికెటర్లను లీగ్ మ్యాచ్‌ల్లో ఆడేందుకు అనుమతించబోమని హెచ్‌సీఏ కార్యదర్శి టి. శేష్ నారాయణ్ స్పష్టం చేశారు. బుధవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న శేష్ నారాయణ్ హెచ్‌సీఏ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. త్వరలో అండర్–16, 19 స్థాయిలో ప్రత్యేక లీగ్‌లను నిర్వహించేందుకు నగరంలోని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలను సంప్రదిస్తున్నట్లు చెప్పారు. ఈ లీగ్‌ల్లో ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం లోధా కమిటీ సిఫార్సుల అమలుపై చర్చించడానికి జూలై 2న ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం హెచ్‌సీఏ అనుబంధ 214 సంఘాలను సమావేశానికి ఆహ్వానించి వారి నుంచి సలహాలు, సూచనలను స్వీకరిస్తామని చెప్పారు. ఈసారి లీగ్ మ్యాచ్‌లను బీసీసీఐ వర్గాలకు చెందిన అవినీతి నిరోధక కమిటీల ఆధ్వర్యంలో మరింత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 26న ముంబైలో జరిగే బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో తాను పాల్గొనబోతున్నట్లు శేష్‌నారాయణ్ తెలిపారు. రాయుడు మళ్లీ హైదరాబాద్‌కు... హైదరాబాద్ నుంచి తప్పుకొని గతంలో బరోడా, విదర్భ రంజీ జట్లకు ప్రాతినిధ్యం వహించిన అంబటి తిరుపతి రాయుడు తిరిగి హైదరాబాద్ జట్టులోకి చేరాడు. ఈ లీగ్‌లో ఇండియా సిమెంట్స్ జట్టు తరఫున రాయుడు ఆడతాడు. మరోవైపు హెచ్‌సీఏ లీగ్ మ్యాచ్‌ల్లో ఆధిపత్యం ప్రదర్శించే ఎస్బీహెచ్ జట్టు ఈ సీజన్లో ఎస్బీఐ పేరుతో బరిలోకి దిగనుంది. హెచ్‌సీఏ మాజీ అధ్యక్ష, కార్యదర్శులు అర్షద్ అయూబ్, జాన్ మనోజ్‌లతో పాటు వారికి చెందిన లీగ్ జట్లు ఎన్స్‌కాన్స్, ఎంపీ కోల్ట్స్‌పై ప్రస్తుత హెచ్‌సీఏ కార్యవర్గం వేటు వేసింది. ఈ నేపథ్యంలో ఎన్స్‌కాన్స్ జట్టు సభ్యులైన తన్మయ్ అగర్వాల్, మెహదీ హసన్ ఈ సీజన్లో స్పోర్టింగ్ ఎలెవన్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. జాన్ మనోజ్‌కు చెందిన ఎంపీ కోల్ట్స్ ఆటగాళ్లు బి. అనిరుధ్, బెంజమిన్ థామస్, కె.అక్షత్ ఈస్ట్ మారేడ్‌పల్లి సీసీ తరఫున ఆడనున్నారు. -
ఐపీఎల్ వివాదం: సన్‌రైజర్స్‌కు ఝలక్!
హైదరాబాద్: ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ టోర్నమెంటు విషయంలో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు యాజమాన్యానికి, హైదరాబాద్ క్రికెట్ సంఘానికి (హెచ్‌సీఏ) మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల టికెట్ల విషయమై ఇరువర్గాల మధ్య వివాదం నెలకొన్నట్టు తెలుస్తోంది. టికెట్ల విషయంలో సన్‌రైజర్స్ జట్టు తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నదని హెచ్‌సీఏ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. సన్‌రైజర్స్ జట్టు యాజమాన్యం ఇలాగే ప్రవర్తిస్తే.. ఈ నెల 17న ఉప్పల్‌లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌కు సహరించబోమంటూ హెచ్‌సీఏ షాకిచ్చింది. ఐపీఎల్ పదో ఎడిషన్ ఉప్పల్ స్టేడియంలో ఇటీవల ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 17న ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ సన్‌రైజర్స్, కింగ్స్ పంజాబ్ ఎలెవన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అప్పటిలోగా టికెట్ల వివాదాన్ని పరిష్కరించకుంటే సహాయ నిరాకరణ జెండా ఎగురవేస్తామని హెచ్‌సీఏ హెచ్చరిస్తోంది. -
క్రికెట్ అభివృద్ధికే టీసీఏ
హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆట అభివృద్ధి కోసం తెలంగాణ క్రికెట్ సంఘం (టీసీఏ) పాటుపడుతోందని టీసీఏ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. అలాంటి సంఘం సేవలను గుర్తించకపోగా... హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు వివేకానంద ఎద్దేవా చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కార్యదర్శి గురువారెడ్డితో కలసి ఆయన మాట్లాడుతూ గడిచిన 60 ఏళ్లుగా నగరం మినహా తెలంగాణ జిల్లాల వైపు కన్నెత్తి చూడని హెచ్‌సీఏకు టీసీఏ అంటే ఏంటో తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీసీఏ గురించి తనకు తెలియదని వివేక్ అనడం కనులుండి చూడలేని గుడ్డితనమని అన్నారు. తీవ్ర అవినీతి ఆరోపణలతో కొట్టుమిట్టాడుతున్న హెచ్‌సీఏ తమ ఉనికిని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. హెచ్‌సీఏ పెద్దలకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని లక్ష్మీనారాయణ సవాలు విసిరారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి వచ్చిన నిధుల్ని దుర్వినియోగం చేయడం తప్ప క్రికెట్ కోసం హెచ్‌సీఏ వెలగబెట్టిందేమీ లేదని ఆయన దుయ్యబట్టారు. ఎన్నో ఏళ్లుగా భారత జట్టుకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్క క్రికెటరైనా ఎంపిక కాలేదని... చివరికి రంజీల్లోనూ తెలంగాణ ఆటగాళ్లు లేకపోవడం బాధాకరమని తెలిపారు. ప్రతిభను పక్కనబెట్టి డబ్బే పరమార్థంగా హెచ్‌సీఏ వ్యవహరించిందని విమర్శించారు. టీసీఏ ఇప్పటివరకు 860 లీగ్, నాకౌట్ మ్యాచ్‌లు నిర్వహించిందని వెల్లడించారు. -
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా వివేక్ విజయం
హైదరాబాద్: క్రీడావర్గాల్లో ఉత్కంఠరేకెత్తించిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఎన్నికల ఫలితాలు శుక్రవారం రాత్రి వెలువడ్డాయి. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జి. వివేక్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా విజయం సాధించారు. వికేవ్కు మొత్తం 136 ఓట్లురాగా, ఆయన ప్రత్యర్థి విద్యుత్ జయసింహకు కేవలం 68 ఓట్లు పడ్డాయి. వికేవ్ గెలుపుతో ఆయన వర్గీయులు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. హెచ్‌సీఏ పాలకమండలికి జనవరిలోనే ఎన్నికలు జరిగినప్పటికీ, కోర్టు ఉత్తర్వుల మేరకు అధ్యక్ష ఓట్ల లెక్కింపును నిలిపివేశారు. ఎన్నికలను సవాల్ చేస్తూ దాఖలైన సివిల్ రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి. భట్ కొట్టివేస్తూ గురువారం ఆదేశాలు జారీచేయడంతో శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. -
'హెచ్‌సీఏ ఫలితాల్ని ప్రకటించండి'
హైదరాబాద్: ఈ జనవరిలో జరిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఎన్నికల ఫలితాల్ని తక్షణమే ప్రకటించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హెచ్‌సీఏ ఎన్నికల రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టిచేసింది. దీనిలో భాగంగా ఇంతకముందు రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. దాంతో ఫలితాల విడుదలకు మార్గం సుగమైంది. ఇవాళ లేదా రేపు ఎన్నికలు ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. జనవరి 17వ తేదీన హెచ్‌సీఏ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణను ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసిన హైకోర్టు దానిపై తుది తీర్పునిచ్చింది. ఆ పిటిషన్ ను కొట్టివేస్తునే ఎన్నికల ఫలితాల్ని విడుదల చేయాలంటూ ఆదేశించింది. ఇప్పటికే సెక్రటరీగా శేషు నారాయణ ఏక గ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. -
స్కోరర్ వసంత్ కుమార్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) స్కోరర్ వసంత్ కుమార్ కులకర్ణి ఆకస్మికంగా మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. వసంత్ 12 సంవత్సరాలుగా స్కోరర్‌గా పనిచేస్తున్నారు. 46 ఏళ్ల వసంత్ కుమార్ స్వస్థలం కర్ణాటకలోని గుల్బర్గా. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వసంత్ కుమార్ మృతి పట్ల హెచ్‌సీఏ అధికారులు, స్కోరర్లు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. -
ఇంకా నియమావళిని సవరించలేదు
లోధా కమిటీ సిఫారసులను అమలు చేయడం లేదు హెచ్‌సీఏపై హైకోర్టుకు బీసీసీఐ ఫిర్యాదు తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసుల అమలు విషయంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వ్యవహారశైలిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం ఉమ్మడి హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. లోధా కమిటీ సిఫారసుల మేరకు హెచ్‌సీఏ తమ బైలాస్ (నియమావళి)ను సవరించాల్సి ఉన్నా, ఇప్పటి వరకు ఆ పని చేయలేదని బీసీసీఐ తరఫు న్యాయవాది ప్రియదర్శన్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో హెచ్‌సీఏ ఒక్కోసారి ఒక్కో రకంగా వ్యవహరిస్తోందన్నారు. ఒకసారి బైలాస్‌ను సవరించామని, మరోసారి సవరిస్తున్నామని చెబుతోందని వివరించారు. హెచ్‌సీఏ పాలకవర్గం విషయంలో అంతర్గత వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే నెలలో జరగబోయే ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ నిమిత్తం హైకోర్టు రిటైర్డ్ జడ్జిని అడ్మినిస్ట్రేటర్‌గా నియమించాలని బీసీసీఐ కోరుతోందన్నారు. ఈ వ్యవహారంపై హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ లోధా కమిటీ బీసీసీఐతో పాటు ఇతర క్రికెట్ సంఘాల్లో సంస్కరణల నిమిత్తం పలు సిఫారసులు చేసిందని, వాటిని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో సైతం అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది గోవింద రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం అడ్మినిస్ట్రేటర్‌ను నియమించాలని అభ్యర్థిస్తూ బీసీసీఐ ఓ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఈ అభ్యర్థనకు సంబంధించి గత కొద్దిరోజులుగా విచారణ జరుపుతున్న ధర్మాసనం గురువారం తన విచారణను కొనసాగించింది. ఈ సందర్భంగా హెచ్‌సీఏ ఇన్చార్జి అధ్యక్షుడి తరఫు సీనియర్ న్యాయవాది సురేందర్‌రావు వాదనలు వినిపిస్తూ, ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం అడ్మినిస్ట్రేటర్ అవసరం లేదని, పరిశీలకుడి నియామకం సరిపోతుందన్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ జీవన్ రెడ్డి, జస్టిస్ వెంకటరామారెడ్డి, జస్టిస్ జగన్నాథరావుల పేర్లను ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనకు వారు అంగీకరిస్తారో లేదోనని ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో హెచ్‌సీఏ అంతర్గత కలహాలపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ విభేదాలకు ఫుల్స్టాప్ పెట్టాలంది. అటు తరువాత పలువురు న్యాయవాదులు ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం అడ్మినిస్ట్రేటర్ నియామకం అవసరం లేదన్నారు. ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణలో హెచ్‌సీఏ పాత్ర నామమాత్రమని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
హెచ్‌సీఏపై విచారణ వాయిదా
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)పై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. బీసీసీఐ కౌంటర్లో పేర్కొన్న అంశాలపై, హెచ్‌సీఏ ఎన్నికల ఫలితాలపై స్టే ఉన్నందున, ఏప్రిల్ 5వ తేదీన జరిగే ఐపీఎల్ మ్యాచ్ వీక్షకులకు ఇబ్బంది కలగకుండా నిర్వాహకులను నియమించాలని గతంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
మా జీతాలు మాకివ్వండి
హెచ్‌సీఏ సిబ్బంది అభ్యర్థన సాక్షి, హైదరాబాద్: తమకు బకాయి పడిన జీతాలను ఇవ్వాలంటూ హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) సిబ్బంది తమ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలంటూ శనివారం తమ సంతకాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని హెచ్‌సీఏ అధ్యక్షులు, కార్యదర్శులకు సమర్పిం చారు. జనవరి, ఫిబ్రవరి మాసాలకు చెందిన 45 రోజుల జీతాన్ని తమకు ఇంకా చెల్లించలేదని లేఖలో పేర్కొన్నారు. జీతాలతో పాటు తమకు రావాల్సిన ప్రోత్సాహకాలను ఇవ్వాలని కోరారు. 2016లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ఇన్సెంటివ్స్తో పాటు, బెస్ట్ గ్రౌండ్ రివార్డు, ఇండియా–బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్ బోనస్‌తో పాటు అదనపు సమయం పనిచేసినందుకు తమకు చెల్లించాల్సిన బకాయిలను ఇవ్వాలని పేర్కొన్నారు. గత మూడేళ్లుగా హెచ్‌సీఏ సరైన సమయానికి నిధులను విడుదల చేయకపోవడంతో తాము తీవ్రంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు సిబ్బంది తెలిపారు. -
టెస్టు మ్యాచ్‌ను చూసేందుకు రండి!
విద్యార్థులకు హెచ్‌సీఏ ఆహ్వానం మ్యాచ్‌కు ఉచిత ప్రవేశం ఉప్పల్/కాప్రా: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఈ నెల 9 నుంచి జరిగే టెస్టు మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తోంది. 6 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు స్టేడియంలో స్నాక్స్, తాగునీరు సౌకర్యం కల్పించి మ్యాచ్ చూసే అవకాశం ఇస్తామని హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడు నరేందర్ గౌడ్ వెల్లడించారు. పిల్లల జాగ్రత్త కోసం స్టేడియంలో మహిళా వాలంటీర్లను కూడా నియమిస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యార్థులను టెస్టుకు తీసుకురావాలని బీసీసీఐ చేసిన సూచనను తాము అమలు చేస్తున్నట్లు గౌడ్ తెలిపారు. నగరంతో పాటు జిల్లాల్లోగల గ్రామీణ పాఠశాలల విద్యార్థులు సైతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల నుండి ఏ రోజు ఎంత మంది విద్యార్థులకు టికెట్లు కావాలనే విషయాలను తెలియజేస్తూ నగరంలోని జింఖానా మైదానంలో లేదా ఉప్పల్ హెచ్‌సీఏ కార్యాలయంలో లెటర్లను అందజేయాలని తెలిపారు. ఇతర పూర్తి వివరాలకు హెచ్‌సీఏ సంయుక్త కార్యదర్శి కె.విజయానంద్‌ను స్వయంగా లేదా సెల్ నెంబర్ 817920660లో సంప్రదించాలన్నారు. మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తి: మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని నరేందర్ గౌడ్ తెలిపారు. ఈ నెల 5, 6 తేదీల్లో జింఖానా మైదానంలో భారత్ ‘ఎ’తో బంగ్లాదేశ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుందని ఆయన వెల్లడించారు. టెస్టు మ్యాచ్‌కు సంబంధించి విసృ్తత ప్రచారం కల్పించే నిమిత్తం నగరంలో 30 హోర్డింగ్‌లను ఏర్పాటు చేశామని, ఎఫ్ఎం రేడియోలో సైతం ప్రకటనలిస్తున్నట్లు తెలిపారు. మ్యాచ్ టికెట్లను eventsnow. com అనే వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నట్లు తెలియజేశారు. -
‘హెచ్‌సీఏ’ వ్యాజ్యాలను ఏసీజే ముందుంచండి
రిజిస్ట్రీని ఆదేశించిన సింగిల్ జడ్జి జస్టిస్ సంజయ్‌కుమార్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికల వివాదంలో దాఖలైన వ్యాజ్యాలన్నింటినీ కలిపి హైకోర్టులో ఏ న్యాయమూర్తి విచారించాలన్న దానిపై పాలనాపరమైన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా తన ముందున్న వ్యాజ్యాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ ముందుంచాలని రిజిస్ట్రీని సింగిల్ జడ్జి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఆదేశించారు. హెచ్‌సీఏ ఎన్నికల నిర్వహణ నిమిత్తం రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలు కొన్ని శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ముందు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా ఇదే అంశంపై మరో న్యాయమూర్తి ముందు కూడా వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. దీంతో ఈ కేసులన్నింటినీ కలిపి ఏ న్యాయమూర్తి విచారించాలో పాలనాపరమైన నిర్ణయం తీసుకునేందుకు వ్యాజ్యాలను ఏసీజే ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కొందరు స్పందిస్తూ, ఫిబ్రవరిలో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పిటిషన్లపై వీలైనంత త్వరగా విచారణ జరపాలని న్యాయమూర్తిని కోరారు. విచారణ వేగవంతం చేయడానికే ఈ వ్యాజ్యాలను ఏసీజే ముందుంచాలని ఆదేశించినట్లు జస్టిస్ సంజయ్‌కుమార్ స్పష్టం చేశారు. -
హైదరాబాద్ టి20 జట్టు కెప్టెన్‌గా బద్రీనాథ్
సాక్షి, హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ ఆలిండియా టి20 క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే హైదరాబాద్ జట్టును సోమవారం ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎస్. బద్రీనాథ్ ఎంపికవగా... కోచ్‌గా భరత్ అరుణ్ వ్యవహరిస్తారు. ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 3 వరకు చెన్నైలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. హైదరాబాద్ టి20 జట్టు: ఎస్. బద్రీనాథ్ (కెప్టెన్), పి. అక్షత్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, బి. అనిరుధ్, బి. సందీప్, కె. సుమంత్ (వికెట్ కీపర్), మెహదీ హసన్, ఎం. రవి కిరణ్, సీవీ మిలింద్, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ భండారీ, టి. రవితేజ, పి.సాకేత్ సాయిరామ్, ఆకాశ్, హిమాలయ్ అగర్వాల్, శరద్ ముదిరాజ్. -
అజహరుద్దీన్ న్యాయ పోరాటం
ఎన్నికల నిర్వహణ ఉత్తర్వులను కొట్టేయండి కేసు తేలే వరకు ఫలితాలు వెల్లడి కాకుండా చూడండి సాంకేతిక కారణాలతో నా నామినేషన్‌ను తిరస్కరించారు హైకోర్టులో పిటిషన్... విచారణ సోమవారానికి వాయిదా సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికల విషయంలో మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజహరుద్దీన్ న్యాయ పోరాటం ప్రారంభించారు. హెచ్‌సీఏ ఎన్నికల నిర్వహణ, వాటి పర్యవేక్షణ నిమిత్తం అడ్వొకేట్ కమిషనర్‌ను ఏర్పాటు చేస్తూ రంగారెడ్డి జిల్లా ఐదవ అదనపు జిల్లా, సెషన్స జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు తేలేంత వరకు ఎన్నికల ఫలితాలను వెల్లడించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి విచారణ జరిపారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ లోధా కమిటీ సిఫారసులకు విరుద్ధంగా కింది కోర్టు ఉత్తర్వులున్నాయని అజహరుద్దీన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కింది కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న కేసులో పిటిషనర్ సైతం ప్రతివాదిగా చేరారని వివరించారు. ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఇచ్చిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా పిటిషనర్ హెచ్‌సీఏ అధ్యక్ష స్థానానికి నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లారని, అయితే రిటర్నింగ్ అధికారి సాంకేతిక కారణాలతో నామినేషన్ ఇవ్వడానికి తిరస్కరించారన్నారు. ఈ నెల 17న జరిగిన ఎన్నికల్లో పాల్గొనేందుకు పిటిషనర్ అన్ని విధాలుగా అర్హులని, ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారికి తెలిపినా అతను పట్టించుకోలేదన్నారు. నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు చెప్పిన రిటర్నింగ్ అధికారి అందుకు కారణాలను మాత్రం వివరించలేదన్నారు. సరైన ఓటర్ల జాబితా లేకుండా, ఓటర్ల వివరాలు ప్రచురించకుండా, ఎన్నికల అధికారులను నియమించకుండా, లోధా కమిటీ సిఫారసులకు విరుద్ధంగా రిటర్నింగ్ అధికారి ఎన్నికలను నిర్వహించారని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు కింది కోర్టును తప్పుదోవ పట్టించి ఎన్నికల నిర్వహణ ఉత్తర్వులు తీసుకొచ్చారన్నారు. కోర్టు ముందు వాస్తవాలను ఉంచలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. -
మేమే గెలుస్తాం... కాదు ఈ ఎన్నికే చెల్లదు!
హెచ్‌సీఏలో ఇరు వర్గాల వాదనలు సజావుగా ముగిసిన ఎన్నికలు త్వరలో ఫలితాలు ఉప్పల్: ఎప్పుడో పదవీకాలం ముగిసినా ఇంకా కుర్చీలు వదలని కార్యవర్గం... ఎన్నికలు నిర్వహించాలంటూ మళ్లీ మళ్లీ కోరిన ప్రత్యర్థి వర్గం... మధ్యలో లోధా కమిటీ సిఫారసులు, ఆపై కోర్టులో పిటిషన్లు... జిల్లా కోర్టు ఉత్తర్వులు, ఫలితాలు నిలిపేయమని హైకోర్టు ఆదేశం... వీటికి తోడు మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ నామినేషన్ తిరస్కరణ... కొద్ది రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు సంబంధించి సాగిన పరిణామాలు, మలుపులు, వివాదాలు ఇవి. ఎట్టకేలకు ఎన్నికల నిర్వహణతో మంగళవారం వీటికి కాస్త విరామం లభించింది. ఎలాంటి ఇబ్బందీ లేకుండా హెచ్‌సీఏ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రిటర్నింగ్ అధికారి రాజీవ్ రెడ్డి పర్యవేక్షణలో 207 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 216 మంది ఓటర్లుగా నమోదు కాగా, ద్వంద్వ ఓటు, ప్రాక్సీ ఓట్లకు సంబంధించి రిటర్నింగ్ అధికారి విచక్షణ మేరకు కొన్ని ఓట్లను తొలగించారు. అయితే కథ ఇంకా ముగిసిపోలేదు. వీటి ఫలితాలు వెంటనే ప్రకటించే అవకాశం లేదు. ఈ ఎన్నికల చెల్లుబాటు అంశం ఇప్పుడు హైకోర్టు పరిధిలో ఉండటమే దీనికి కారణం. లోధా కమిటీ సిఫారసులపై సుప్రీం కోర్టు ఆదేశాలనే ఉల్లంఘిస్తూ ఈ ఎన్నికలు సాగాయంటూ కోర్టులో పలు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. బుధవారం దీనిపై వాదనలు జరగనున్నాయి. రిటర్నింగ్ అధికారి కూడా నియమ నిబంధనలకు సంబంధించి కోర్టుకు సమాధానం ఇవ్వాల్సి ఉంది. అజహర్ నామినేషన్ తిరస్కరణపై కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. ఎన్నికల సందర్భంగా ఇరు వర్గాల ప్రతినిధులు, ఓటర్లు మీడియాతో మాట్లాడారు. వివేకానంద్ గ్రూప్ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేయగా, అయూబ్ గ్రూప్ మాత్రం ఈ ఎన్నికే చెల్లదంటూ రాబోయే కోర్టు తీర్పుపై ఆశాభావం వ్యక్తం చేశారు. ‘స్వయంగా పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అయూబ్‌కు నన్ను విమర్శించే హక్కు లేదు. ఆరు నెలలకు పైగా ఎన్నికలు నిర్వహించకుండా ఆయన అక్రమంగా పదవిలో కొనసాగారు. ఇప్పుడు దానికి ముగింపు లభిస్తోంది. ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా ప్రశాంతంగా ఎన్నికలు జరగడమే మాకు ఉన్న సానుకూలతను చూపిస్తోంది. ఇంత మంది ఓటింగ్‌లో పాల్గొనడం సంతోషకరం. అజహర్ విషయంలో ఆర్ఓ నిబంధనల ప్రకారమే వ్యవహరించారు. నేను కేబినెట్ హోదాలో ఎలాంటి జీతమూ తీసుకోవడం లేదు కాబట్టి పోటీకి అర్హత ఉంది.’ – జి. వివేకానంద్, అధ్యక్ష పదవి అభ్యర్థి ‘ఎన్నికల ప్రక్రియ మొత్తం చట్టవిరుద్ధంగా సాగింది. తాము మాత్రమే పదవుల్లోకి వచ్చేందుకు కొంతమంది పూర్తిగా అక్రమ రీతిలో ఎన్నికలు నిర్వహించారు. లోధా కమిటీ సిఫారసుల ప్రకారం ఈ ఎన్నికలు మొత్తం చెల్లవంటూ కోర్టు తీర్పు వస్తుందనే నమ్మకం మాకుంది’. – అర్షద్ అయూబ్, మాజీ అధ్యక్షుడు ‘గత కొన్నేళ్లుగా ప్రతిభ గల తెలంగాణ క్రికెటర్లకు హెచ్‌సీఏ తీవ్ర అన్యాయం చేసింది. శివలాల్ యాదవ్ మొదలు పలువురు పెద్దలు కోట్లాది రూపాయలు కొల్లగొట్టి ఆటను భ్రష్టు పట్టించారు. కొత్తగా వచ్చే కార్యవర్గమైనా ఆటను అభివృద్ధి చేస్తుందని విశ్వసిస్తున్నా’. – అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, ‘శాట్స్’ చైర్మన్ ‘ఇది హెచ్‌సీఏకు పండుగ దినం. మేమంతా విజయం సాధించడం ఖాయమైపోయింది. అవినీతిని పారదోలి హైదరాబాద్ క్రికెట్‌ను అభివృద్ధి చేస్తాం. ఇతర తెలంగాణ జిల్లాల్లోనూ ఆటను ప్రోత్సహించి తగు సౌకర్యాలు కల్పిస్తాం. గల్లీ స్థాయినుంచి అంతర్జాతీయ స్థాయికి క్రికెటర్లను తీర్చి దిద్దుతాం. నాకు పోటీ లేకపోవడమే నాపై ఉన్న నమ్మకానికి ఉదాహరణ’. – టి. శేష్‌నారాయణ్, కార్యదర్శి పదవి అభ్యర్థి -
హైకోర్టును ఆశ్రయించిన మాజీ క్రికెటర్!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్ష ఎన్నికల్లో తన నామినేషన్ ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ హైకోర్టును ఆశ్రయించారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో అజారుద్దీన్ దరఖాస్తును రిటర్నింగ్ అధికారి కే రాజీవ్ రెడ్డి తిరస్కరించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంలో అజార్ పై బీసీసీఐ నిషేధం ఎత్తివేసిందా? లేదా? ఆయన హెచ్‌సీఏ ఓటరు అవునా? కాదా? అన్నది స్పష్టత లేకపోవడంతో ఆయన నామినేషన్ ను తిరస్కరించినట్టు తెలిపారు. అయితే, దీనిని తప్పుబడుతూ అజార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. 2000 సంవత్సరంలో భారత క్రికెట్ ను కుదిపేసిన మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో అజారుద్దీన్ ప్రమేయం ఉందంటూ ఆయనపై బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇటీవల జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల నేపథ్యంలో హెచ్‌సీఏ ప్రస్తుత అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ పదవి నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి పోటీపడాలని అజార్ నిర్ణయించారు. అయితే, ఆయన ఈ ఎన్నికల్లో పోటీకి ఎంతవరకు అర్హులన్నది తెలియకపోవడం వల్లే ఆయన నామినేషన్ తిరస్కరణకు గురయినదని ఆయూబ్ ఖాన్ అంటున్నారు. ముగిసిన హెచ్‌సీఏ ఎన్నికలు కాగా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఎన్నికలు ముగిశాయి. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో ఈ ఎన్నికలు జరిగాయి. మొత్తం 17 మంది అభ్యర్థులు పోటీపడగా.. అందులో జి వివేకానంద్, విద్యుత్ జైసింహాలు అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 218 మంది సభ్యులకు ఓటు హక్కు ఉంది. వివాదాల నడుమ ఎన్నికలు జరుగుతుండటంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది. వివాదాల నేపథ్యంలో హైకోర్టు తుది ఉత్తర్వులు వచ్చిన తర్వాతే ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు. బుధవారం మధ్యాహ్నం హైకోర్టు తీర్పు వచ్చే అవకాశముంది. -
హెచ్‌సీఏ ఎన్నికలు ప్రారంభం
హైదరాబాద్:హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం 17 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జి వివేకానంద్,విద్యుత్ జైసింహాలు అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 218 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వివాదాల నడుమ ఎన్నికలు జరుగుతుండటంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఈ రోజు మధ్యాహ్నం గం.2.00ల వరకూ పోలింగ్ కొనసాగనుంది. కాగా, హైకోర్టు తుది ఉత్తర్వుల తర్వాత మాత్రమే ఫలితాలను వెల్లడిస్తారు. -
హెచ్‌సీఏ ఎన్నికలు ప్రారంభం
-
వివేకానంద్‌కు అర్హత ఉంది
హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల్లో పోటీ చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని... కానీ పోటీ చేసేందుకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని వాటి ప్రకారం పోటీ చేయవచ్చు అని హెచ్సీఎ కార్యదర్శి బరిలో ఉన్న శేష్‌నారాయణ్ అన్నారు. ఆయన హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీపడే ముందు ఓటర్‌గా నమోదు చేసుకోలేదని గుర్తు చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లీగల్ అడ్వైజర్ మసూద్ ఖాన్‌తో కలిసి మాట్లాడుతూ... వివేకానంద్‌కు కేబినెట్ ర్యాంక్ ఉంది కాని ఆయన కేబినెట్ మంత్రి కాదని, అందుకు ఆయనకు ఎన్నికల్లో పోటీచేసే అర్హత ఉందని తెలిపారు. మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ హెచ్సీఎను పూర్తిగా భ్రష్టుపట్టించారని... తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పూర్తి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తాము తెలంగాణలోని అన్ని జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎలాంటి అవినీతికి, పైరవీలకు వీలు లేకుండా నడుస్తామని హామీ ఇచ్చారు. లోధా కమిటీ సిఫార్సులు, కోర్టు పరిధిలోనే ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు హన్మంత్‌రెడ్డి, అనిల్ కుమార్, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
హెచ్‌సీఏ ఎన్నికల బరిలో అజహరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ క్రికెట్ పరిపాలనలోకి ప్రవేశించేందుకు సిద్ధమయ్యాడు. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికల్లో పోటీ పడేందుకు అతను సిద్ధమవుతున్నాడు. హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి అజహర్ నామినేషన్ వేసే అవకాశం ఉంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అజహర్‌పై బీసీసీఐ 2000 సంవత్సరంలో జీవితకాలం నిషేధం విధించగా, దాదాపు 12 ఏళ్ల తర్వాత ఏపీ హైకోర్టు బోర్డు నిర్ణయాన్ని తప్పు పడుతూ అజహర్‌ను నిర్దోషిగా తేల్చింది. అయితే ఆ తర్వాత కూడా బీసీసీఐ అధికారికంగా అజహర్‌పై నిషేధాన్ని ఎత్తివేయలేదు. ఇటీవల 500వ టెస్టులో సన్మానం సహా గతంలోనూ కొన్ని బోర్డు కార్యక్రమాలకు ఆహ్వానించినా... అజహర్ పదవులు చేపట్టడంపై మాత్రం ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ ఎన్నికల్లో పోటీ చేయడం అనే అంశం మళ్లీ వివాదం రేపే అవకాశం ఉంది. మరోవైపు అజహర్ ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయాన్ని ఆయన కుటుంబ సభ్యుడొకరు నిర్ధారించారు. ‘హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయాలని అజహర్ నిర్ణయం తీసుకున్నాడు. కోర్టు నిర్ణయంపై బోర్డు అప్పీల్‌కు వెళ్లలేదు కాబట్టి ఆ తీర్పును గౌరవించినట్లే. పోటీకి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు’ అని ఆయన చెప్పారు. భారత్ తరఫున అజహర్ 99 టెస్టులు, 334 వన్డేలు ఆడాడు. -
అందులో వాస్తవం లేదు:హెచ్‌సీఏ
హైదరాబాద్:వచ్చే నెల్లో నగరంలో బంగ్లాదేశ్-భారత్ జట్ల మధ్య జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడం లేదంటూ వచ్చిన వార్తలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఖండించింది. బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌ను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు హెచ్‌సీఏ సెక్రటరీ కే జాన్ మనోజ్ స్పష్టం చేశారు. గతంలో కూడా ఇక్కడ నగరంలో టెస్టు మ్యాచ్‌లు నిర్వహించడానికి ఏనాడు వెనకడుగు వేయలేదని విషయాన్ని గుర్తించుకోవాలన్నాడు. 'టెస్టు మ్యాచ్ నిర్వహణలో భాగంగా స్టేడియం అడ్వర్టైజ్మెంట్కు సంబంధించి టెండర్ నోటీసును కూడా జారీ చేశాం. మ్యాచ్ కు సంబంధించి మీడియాతో ఒప్పందం కూడా ఒకటి రెండు రోజుల్లో జరుగుతుంది. మ్యాచ్‌ను నిర్వహించడం లేదనే రూమర్లు ఎక్కడ్నుంచి వచ్చాయో తెలియడం లేదు'అని మనోజ్ తెలిపారు. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి హైదరాబాద్‌లో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరుగనుంది. -
హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా నరేందర్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా నరేందర్ గౌడ్ నియమితులయ్యారు. శనివారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో సభ్యులంతా ఆయన నియామకానికి ఏకగ్రీవంగా అంగీకరించారు. లోధా కమిటీ సిఫారసుల అమలులో భాగంగా ప్రస్తుతం అధ్యక్షుడు అర్షద్ ఆయూబ్ స్థానంలో నరేందర్ గౌడ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. -
అయూబ్ తదితరులకు ఊరట
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్షద్ అయూబ్, ఇతర కార్యవర్గ సభ్యులకు ఉమ్మడి హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ నెల 18న నమోదు చేసిన కేసులో వారిని అరెస్ట్ చేయవద్దని ఉప్పల్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సంక్రాంతి సెలవుల తరువాతకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో మూడు రోజుల క్రితం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఆడిటర్లు, ఇతర సభ్యులతో కుమ్మక్కై ఖాతాలను తారుమారు చేశారని, ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించారంటూ టి. శేష్ నారాయణ్ అనే వ్యక్తి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెండర్ల జారీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఉప్పల్ పోలీసులు అర్షద్ అయూబ్, పురుషోత్తం అగర్వాల్ తదితరులపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వారు ఈ కేసును కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. తమను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో వారి అరెస్ట్‌పై స్టే విధిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు.