భారత్‌ శుభారంభం | India beat Scotland 4-1 in Hockey World League | Sakshi
Sakshi News home page

భారత్‌ శుభారంభం

Published Fri, Jun 16 2017 2:42 PM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM

భారత్‌ శుభారంభం

భారత్‌ శుభారంభం

లండన్‌: హాకీ వరల్డ్‌ లీగ్‌ (హెచ్‌డబ్ల్యూఎల్‌) సెమీఫైనల్స్‌ టోర్నమెంట్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. స్కాట్లాండ్‌తో గురువారం జరిగిన గ్రూప్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 4–1 గోల్స్‌ తేడాతో గెలిచింది. ఆట ఆరో నిమిషంలో కెప్టెన్‌ క్రిస్‌ గ్రాసిక్‌ గోల్‌తో స్కాట్లాండ్‌ ఖాతా తెరిచింది.

 

ఆరంభంలోనే గోల్‌ సమర్పించుకున్న భారత్‌ ఆ తర్వాత జాగ్రత్తగా ఆడింది. 31వ, 34వ నిమిషాల్లో రమణ్‌దీప్‌ సింగ్‌ రెండు గోల్స్‌ చేయడంతో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్‌కు ఆకాశ్‌దీప్‌ సింగ్‌ (40వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (42వ నిమిషంలో) ఒక్కో గోల్‌ అందించారు. శుక్రవారం జరిగే రెండో లీగ్‌ మ్యాచ్‌లో కెనడాతో భారత్‌ తలపడుతుంది.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement