సయ్యద్ ముస్తాక్ అలీ ఆలిండియా టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే హైదరాబాద్ జట్టును సోమవారం ప్రకటించారు.
సాక్షి, హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ ఆలిండియా టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే హైదరాబాద్ జట్టును సోమవారం ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎస్. బద్రీనాథ్ ఎంపికవగా... కోచ్‌గా భరత్ అరుణ్ వ్యవహరిస్తారు. ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 3 వరకు చెన్నైలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది.
హైదరాబాద్ టి20 జట్టు: ఎస్. బద్రీనాథ్ (కెప్టెన్), పి. అక్షత్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, బి. అనిరుధ్, బి. సందీప్, కె. సుమంత్ (వికెట్ కీపర్), మెహదీ హసన్, ఎం. రవి కిరణ్, సీవీ మిలింద్, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ భండారీ, టి. రవితేజ, పి.సాకేత్ సాయిరామ్, ఆకాశ్, హిమాలయ్ అగర్వాల్, శరద్ ముదిరాజ్.