badrinarth
-
ఒకటిన బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లో దీపావళి వేడుకలు
డెహ్రాడూన్: దీపాల పండుగ దీపావళిని దేశవ్యాప్తంగా అక్టోబర్ 31న జరుపుకోనుండగా, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లలో నవంబర్ ఒకటిన జరుపుకుంటున్నారు. తాజాగా దీపావళి పండుగను నవంబర్ 1న జరుపుకోవాలని బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు ఉత్తరాఖండ్ అంతటా నవంబర్ ఒకటిన దీపావళి వేడుకలు జరుపుకోనున్నారు. బద్రీనాథ్ ధామ్‌కు చెందిన పండితుడు రాధా కృష్ణ తప్లియాల్ తెలిపిన వివరాల ప్రకారం ఈసారి అమావాస్య రెండు రోజుల పాటు వచ్చింది. ప్రదోష కాలం తరువాత కూడా అమావాస్య ఉంటుంది. అందుకే నవంబర్ ఒకటిన మహాలక్ష్మి పూజ చేయాల్సి ఉంటుంది. దీపావళి పండుగను కూడా అదే రోజు చేసుకోవాల్సి ఉంటుంది.నిజానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ముందుగా నవంబర్ 1న దీపావళి సెలవు ప్రకటించింది. అయితే తరువాత దానిని సవరించి అక్టోబర్ 31న సెలవు ప్రకటించింది. తిరిగి ఇప్పుడు దీపావళి అధికారిక సెలవుదినం నవంబర్ ఒకటిగా పేర్కొంది. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో నవంబర్ ఒకటిన దీపావళి వేడుకలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా వెలువడిన 250 పంచాంగాలలో 180 పంచాంగాలలో నవంబర్ ఒకటిన దీపావళిని జరుపుకోవాలని తెలియజేశాయని, అందుకే ఉత్తరాఖండ్‌లో నవంబర్ ఒకటిన దీపావళి జరుపుకుంటున్నట్లు రాష్ట్రానికి చెందిన జ్యోతిష్య నిపుణులు తెలిపారు.ఇది కూడా చదవండి: వరల్డ్ ట్రేడ్ సెంటర్లో దీపావళి వెలుగులు -
కేదారేశ్వరుని సేవలో కన్నప్ప టీమ్.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాను తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీని షూటింగ్‌ను విదేశాల్లో చిత్రీకరించారు. కన్నప్పలో ప్రభాస్‌తో పాటు పలువురు స్టార్ నటులు కనిపించనున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది డిసెంబర్లో పాన్ ఇండియాలో విడుదల చేయడానికి కన్నప్ప టీమ్ సన్నాహాలు చేస్తోంది.తాజాగా కన్నప్ప టీమ్ ఆలయాల సందర్శనకు బయలుదేరింది. మంచువిష్ణు, మోహన్ బాబుతో సహా పలువురు చిత్రబృంద సభ్యులు బద్రినాథ్, కేదార్నాథ్ ఆలయాలను దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శివుని భక్తుడైన కన్నప్ప మూవీ సక్సెస్ కావాలని కేదారాశ్వరుని ఆశీస్సులు తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా.. ఇప్పటికే కన్నప్ప టీజర్ రిలీజ్ కాగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే అత్యధి వ్యూస్ సాధించింది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకులని అలరించింది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు.Seeking blessings for an epic tale! @ivishnumanchu and team #Kannappa’s sacred journey to #Kedarnathॐ and #Badrinathॐ. #HarHarMahadevॐ@themohanbabu @mukeshvachan @arpitranka_30 @24FramesFactory @avaentofficial @KannappaMovie #TeluguFilmNagar pic.twitter.com/nHwehDTfO7— Telugu FilmNagar (@telugufilmnagar) October 25, 2024 -
హైదరాబాద్ టి20 జట్టు కెప్టెన్‌గా బద్రీనాథ్
సాక్షి, హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ ఆలిండియా టి20 క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే హైదరాబాద్ జట్టును సోమవారం ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎస్. బద్రీనాథ్ ఎంపికవగా... కోచ్‌గా భరత్ అరుణ్ వ్యవహరిస్తారు. ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 3 వరకు చెన్నైలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. హైదరాబాద్ టి20 జట్టు: ఎస్. బద్రీనాథ్ (కెప్టెన్), పి. అక్షత్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, బి. అనిరుధ్, బి. సందీప్, కె. సుమంత్ (వికెట్ కీపర్), మెహదీ హసన్, ఎం. రవి కిరణ్, సీవీ మిలింద్, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ భండారీ, టి. రవితేజ, పి.సాకేత్ సాయిరామ్, ఆకాశ్, హిమాలయ్ అగర్వాల్, శరద్ ముదిరాజ్.