
జాన్ మనోజ్ ( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్ నియమితులయ్యారు. ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్ శుక్రవారం లెటర్ జారీ చేసింది. లోధా కమిటీ సిఫార్సుల మేరకు తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తూ తీర్మానం చేసింది.
ఇక ఉద్దేశపూర్వకంగా హెచ్‌సీఏ ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారని, నిబంధనలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారంటూ మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను ఇటీవలే అపెక్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. హెచ్‌సీఏలో అతని సభ్యత్వం రద్దు చేసి షోకాజ్ నోటీస్ జారీచేసింది. కాగా నోటీసులపై అజారుద్దీన్ వివరణ ఇవ్వకపోవడంతో తాత్కాలిక ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ ను నియమిస్తున్నట్లు అపెక్స్ కౌన్సిల్ తెలిపింది. మరోవైపు హెచ్‌సీఏలో వివాదం రోజురోజుకు ముదురుతుంది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా హెచ్‌సీఏ తయారయ్యింది. అయితే క్రికెట్ సీజన్ మొదలవుతున్న వివాదాల్లో మునిగి తేలుతున్న హెచ్‌సీఏ ఇంకా గాడిన పడలేదు.
Comments
Please login to add a commentAdd a comment