John Manoj
-
'షోకాజ్ నోటీసుకు జవాబివ్వను.. లీగల్‌గా తేల్చుకుంటా'
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏలో వివాదం రోజురోజుకు ముదిరి పాకానా పడుతుంది. తాజాగా తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికైన జాన్ మనోజ్ ఎంపికపై మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ స్పందించాడు. ''తాత్కాలిక ప్రెసిడెంట్ నియామకంపై నేను స్పందించను. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ చేస్తున్నది అక్రమమైన పని. నన్ను ప్రెసిడెంట్ గా తొలగించే అవకాశం అపెక్స్ కమిటీ సభ్యులకు లేదు. అలా తొలగించే అవకాశం ఉంటే... ప్రెసిడెంట్ గా ఉండి నేనే వారిని తొలగించేవాడిని. చాలా ఏళ్ళుగా ఈ సభ్యులు హెచ్‌సీఏను భ్రష్టు పట్టిస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన షోకాజ్ నోటీస్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో కూడా క్రికెట్ అభివృద్ధి కావాలని నేను చూస్తున్నాను. జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి కావడం ఆ సభ్యులకు ఇష్టం లేదు. నేను లీగల్‌గానే తేల్చుకుంటాను. ఇప్పటికే వాళ్ల మీద అంబుడ్స్‌మెన్ కు కంప్లైంట్ చేసాను. అంబుడ్స్‌మెన్ ఇచ్చే నిర్ణయమే నా తుది నిర్ణయం కూడా..'' అంటూ అజారుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదవండి: హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్ -
హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్ నియమితులయ్యారు. ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్ శుక్రవారం లెటర్ జారీ చేసింది. లోధా కమిటీ సిఫార్సుల మేరకు తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తూ తీర్మానం చేసింది. ఇక ఉద్దేశపూర్వకంగా హెచ్‌సీఏ ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారని, నిబంధనలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారంటూ మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను ఇటీవలే అపెక్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. హెచ్‌సీఏలో అతని సభ్యత్వం రద్దు చేసి షోకాజ్ నోటీస్ జారీచేసింది. కాగా నోటీసులపై అజారుద్దీన్ వివరణ ఇవ్వకపోవడంతో తాత్కాలిక ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ ను నియమిస్తున్నట్లు అపెక్స్ కౌన్సిల్ తెలిపింది. మరోవైపు హెచ్‌సీఏలో వివాదం రోజురోజుకు ముదురుతుంది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా హెచ్‌సీఏ తయారయ్యింది. అయితే క్రికెట్ సీజన్ మొదలవుతున్న వివాదాల్లో మునిగి తేలుతున్న హెచ్‌సీఏ ఇంకా గాడిన పడలేదు. చదవండి: అజారుద్దీన్ ఒక డిక్టేకర్లా వ్యవహరిస్తున్నాడు -
‘కెప్టెన్’ అజహరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ తొలిసారి క్రికెట్ పరిపాలనలోకి అడుగు పెట్టాడు. శుక్రవారం జరిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల్లో అజహర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ పోటీల్లో సమీప ప్రత్యర్థి ప్రకాశ్‌చంద్ జైన్‌పై 74 ఓట్ల తేడాతో అజ్జూ విజయం సాధించాడు. పోలైన 223 ఓట్లలో మాజీ కెపె్టన్‌కు 147 ఓట్లు రాగా, ప్రకాశ్‌చంద్‌కు 73 ఓట్లు పడ్డాయి. మూడో అభ్యరి్థగా ఉన్న దిలీప్ కుమార్‌కు 3 ఓట్లు మాత్రమే దక్కాయి. ఈ ఎన్నికల్లో అజహర్ ప్యానెల్ మొత్తం ఆరు పదవులనూ గెలుచుకొని క్లీన్‌స్వీప్ చేసింది. ఇదే గ్రూప్‌కు చెందిన జాన్ మనోజ్ (ఉపాధ్యక్షుడు), విజయానంద్ (కార్యదర్శి), నరేశ్ శర్మ (సంయుక్త కార్యదర్శి), సురేందర్ అగర్వాల్ (కోశాధికారి), అనురాధ (కౌన్సిలర్) ఎన్నికయ్యారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు, లోధా కమిటీ సిఫారసుల అనంతరం తొలిసారి అంతర్జాతీయ క్రికెటర్లకు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు కలి్పంచారు. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల సమయంలోనే అజహర్ అధ్యక్ష పదవికి పోటీ పడే ప్రయత్నం చేశాడు. అయితే ప్రత్యరి్థగా పోటీ చేసిన జి.వివేకానంద్... మాజీ సారథి మ్యాచ్ ఫిక్సింగ్ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చి అజహర్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా చేయగలిగాడు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు అర్హత ఉందంటూ బీసీసీఐ లేఖ ఇచి్చందని, తిరస్కరణపై కోర్టుకు వెళతానంటూ అజహర్ పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. రెండేళ్లు ఓపిక పట్టిన అనంతరం అజహర్ మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు బరిలో నిలిచాడు. ఈ సారి అజహర్ నామినేషన్‌కు ఇబ్బంది రాకపోగా...‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’ కారణంగా వివేక్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. 2017 ఎన్నికల సమయంలో తన నామినేషన్ తిరస్కరించడంలో హెచ్‌సీఏ అడ్హాక్ కమిటీ చైర్మన్‌గా కీలక పాత్ర పోషించిన ప్రకాశ్‌చంద్ జైన్‌ను ఇప్పుడు అజహర్ చిత్తుగా ఓడించటం విశేషం. సెకండ్ ఇన్నింగ్స్ షురూ ‘నేను 99 టెస్టుల వద్దే ఆగిపోవడంపై చాలా మంది అయ్యో అంటుంటారు. అయితే ఇప్పుడు నేను చేస్తున్న పోరాటం 100వ టెస్టులాంటిదే’... అజహర్‌ను నిర్దోíÙగా చూపుతూ తీసిన సినిమా ‘అజహర్’లో డైలాగ్ ఇది. టెస్టు చరిత్రలో 99 మ్యాచ్‌లతో కెరీర్ ముగించిన ఒకే ఒక్క ఆటగాడు అజహర్. 6215 టెస్టు పరుగులు, 334 వన్డేల్లో 9378 పరుగులు, మూడు ప్రపంచకప్‌లలో భారత్‌కు నాయకత్వం వహించిన ఘనతతో పాటు పలు రికార్డులు ఆటగాడిగా అజహర్ ఖాతాలో ఉన్నాయి. అయితే 2000లో బయటపడిన మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం అజ్జూ కెరీర్‌ను అనూహ్యంగా ముగించింది. ఇందులో అజహర్ పాత్రను నిర్ధారిస్తూ బీసీసీఐ జీవితకాలం నిషేధం విధించింది. ఆ తర్వాత దశాబ్దం అజహర్ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నాడు. పరిస్థితి మారుతూ... మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం గురించి అభిమానులు మెల్లగా మరచిపోతూ వస్తున్న సమయంలో అజహర్ చురుగ్గా బయట కనిపించడం మొదలు పెట్టాడు. వెటరన్ క్రికెట్ టోరీ్నలలో ఆడటంతో పాటు భార్య సంగీతాతో కలిసి సినిమా ఫంక్షన్లలో తరచూ పాల్గొనేవాడు. టీవీ చానల్స్ తమ చర్చా కార్యక్రమాలకు అజ్జూను విశ్లేషకుడిగా భాగం చేశాయి. 2009లో కాంగ్రెస్ పారీ్టలో చేరి మొరాదాబాద్నుంచి పార్లమెంట్ సభ్యుడిగా కావడం అతని జీవితంలో కీలక మలుపు కాగా... 2011లో రోడ్డు ప్రమాదంలో చిన్న కుమారుడు అయాజుద్దీన్ మరణం పెను విషాదం. తర్వాతి ఏడాదే అజహర్‌పై నిషేధం చెల్లదంటూ ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో మాజీ కెపె్టన్‌కు ఊరట లభించింది. విమర్శలు వచ్చినా... ఫిక్సింగ్ అధ్యాయం ముగిసిందని అజహర్ భావిస్తూ వచి్చనా కొన్ని సార్లు అదే అంశంపై విమర్శలు తప్పలేదు. ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో అతడిని ఢిల్లీ ఆటగాళ్లు కలవడంపై వివాదం రేగింది. గత ఏడాది ఈడెన్‌గార్డెన్స్‌లో అజహర్ గంట మోగించినప్పుడు గౌతం గంభీర్ తీవ్ర విమర్శలు చేశాడు. అయితే హైదరాబాదీ వాటిని ఎప్పుడూ పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ పోయాడు. బీసీసీఐ వైపునుంచి కూడా అజహర్‌పై సానుకూల ధోరణే కనిపించింది. అధికారికంగా తనపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ఎప్పుడూ ప్రకటించకపోయినా... కోర్టు ఇచి్చన తీర్పును బోర్డు సవాల్ చేయలేదు కాబట్టి నిషేధం తొలగినట్లేనని అజహర్ వివరణ ఇస్తూ వచ్చాడు. అధికారిక కార్యక్రమాల్లో తనను పిలవడం అందుకు నిదర్శనమని అతను చెప్పుకున్నాడు. బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమానికి హాజరైన అజహర్‌కు 2016లో భారత్ 500వ టెస్టు సందర్భంగా అధికారిక సన్మానం జరగడంతో గత వివాదాలు ముగిసినట్లేనని అర్థమైంది. దీని తర్వాత ఈ స్టయిలిష్ బ్యాట్స్‌మన్ పూర్తి స్థాయిలో క్రికెట్ పరిపాలనలో పని చేయాలని నిర్ణయించుకున్నాడు. 2017లో ఆ అవకాశం చేజారినా... ఇప్పుడు హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కీలక పదవిని అందుకున్నాడు. -
అయూబ్, జాన్ మనోజ్‌లపై జీవితకాల బహిష్కరణ
హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: పదవిలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు... మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్, మాజీ కార్యదర్శి జాన్ మనోజ్‌లపై హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) జీవితకాల బహిష్కరణ విధించింది. ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని హెచ్‌సీఏ కార్యదర్శి శేష్‌నారాయణ్ తెలిపారు. 2014 నుంచి 2016 వరకు అయూబ్, జాన్ మనోజ్‌లు హెచ్‌సీఏ అధ్యక్ష, కార్యదర్శులుగా వ్యవహరించారు. ‘డెలాయిట్, ఇతర ఆడిట్ నివేదికల్లో అయూబ్, జాన్ మనోజ్‌లు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని తేలింది. దీనికి సంబంధించి మా వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అందుకే వెంటనే బహిష్కరణ విధించాం. ఈ విషయంలో వారి నుంచి వివరణ తీసుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. అయూబ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నాపై సస్పెన్షన్ విధించారు. దానికి ఇది కక్ష సాధింపు చర్యగా అనుకోకూడదు’ అని శేష్‌నారాయణ్ వివరించారు. అయూబ్, జాన్ మనోజ్‌లపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని సమావేశం తీర్మానించిందని శేష్‌నారాయణ్ తెలిపారు. అయూబ్, జాన్ మనోజ్ హయాంలో ఇతర కార్యవర్గ సభ్యులపై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయని... వారిపై కూడా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నామని ఆయన అన్నారు. ఆధారాలు లభించగానే ఇతర సభ్యులపై కూడా కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అయూబ్, జాన్ మనోజ్‌లను సస్పెండ్ చేయడంతో... ఇక నుంచి వీరిద్దరికి చెందిన జట్లు హెచ్‌సీఏకు సంబంధించిన మ్యాచ్‌ల్లో ఆడే అర్హతను కోల్పోయాయి. సమాచారం లేదు: అయూబ్ తనపై హెచ్‌సీఏ జీవితకాల బహిష్కరణ విధించిన విషయం అధికారికంగా తెలియదని అర్షద్ అయూబ్ వివరించారు. అధికారిక సమాచారం లభించాకే ఈ విషయంపై స్పందిస్తానని ఆయన అన్నారు. ‘కొత్తగా ఎన్నికైన హెచ్‌సీఏ కార్యవర్గంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అసలు హెచ్‌సీఏ కార్యవర్గానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారమే లేదు. నేనైతే ఎలాంటి తప్పు చేయలేదు. ఇలాంటి చర్యలకు భయపడేది లేదు’ అని భారత జట్టు మాజీ సభ్యుడైన అయూబ్ తెలిపారు. -
ఆ ఆరోపణలు అవాస్తవం: హెచ్‌సీఏ
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై వస్తున్న ఆరోపణలను హెచ్‌సీఏ అధ్యక్షుడు హర్షద్ అయుబ్, సెక్రటరీ జాన్ మనోజ్ ఖండించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగానే కొంతమంది హెచ్‌సీఏపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని జాన్ మనోజ్ అన్నారు. 120 కోట్ల అవినీతి జరిగిందనడం అవాస్తవం అని.. ఈ రెండేళ్లలో బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు 40 కోట్లు మాత్రమే అని వివరణ ఇచ్చారు. ఈ నిధులను సిబ్బంది జీతాలు, మ్యాచ్‌ల నిర్వహణకే వినియోగించామని జాన్ మనోజ్ తెలిపారు. లోధా కమిటీ సిఫారసుల మేరకే హెచ్‌సీఏ కార్యకలాపాలు కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. -
వ్యక్తిగత కారణాలతోనే...
► ఆంధ్రకు మారానన్న విహారి ► హైదరాబాద్ జట్టుకు గుడ్‌బై సాక్షి, హైదరాబాద్: రంజీ క్రికెట్లో అడుగు పెట్టిననాటి నుంచి హైదరాబాద్ తరఫున అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచిన గాదె హనుమ విహారి ఆంధ్రకు మారుతున్నట్లు ప్రకటించాడు. వచ్చే సీజన్ నుంచి తాను ఆంధ్ర జట్టు తరఫునే బరిలోకి దిగుతానని వెల్లడించాడు. ఈ నెల 25 నుంచి జరగనున్న ఏసీఏ సెలక్షన్స్ టోర్నీలో ఆడనున్నట్లు అతను చెప్పాడు. ‘నేను పుట్టింది కాకినాడలోనే. కుటుంబ కారణాలతో మేమంతా అక్కడికి వెళ్లిపోతున్నాం. ఇలాంటి సమయంలో జట్టు మారడం కూడా తప్పనిసరి అనిపించింది. అందుకే హైదరాబాద్‌ను వదలాలని నిర్ణయించుకున్నా. అక్కడ కూడా మెరుగ్గా రాణిస్తాననే నమ్మకం ఉంది’ అని విహారి అన్నాడు. క్రికెట్లో ప్రాధమిక శిక్షణ నుంచి రంజీ జట్టు కెప్టెన్‌గా ఎదిగే వరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తనకు ఎన్నో అవకాశాలిచ్చిందని, హెచ్‌సీతో విభేదాల కారణంగా జట్టు మారుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అతను స్పష్టం చేశాడు. హెచ్‌సీఏ కార్యదర్శి జాన్ మనోజ్‌తో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతను పేర్కొన్నాడు. హైదరాబాద్, సౌత్‌జోన్ జట్ల తరఫున కలిపి ఆరు సీజన్లలో 40 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన విహారి 55.74 సగటుతో 3066 పరుగులు చేశాడు. 30 వన్డేల్లో 955 పరుగులు చేసిన అతను.. 52 టి20ల్లో 106.93 స్ట్రైక్‌రేట్‌తో 925 పరుగులు సాధించాడు.