ఆ ఆరోపణలు అవాస్తవం: హెచ్‌సీఏ | arshad ayub, john manoj on hca corruption allegations | Sakshi
Sakshi News home page

ఆ ఆరోపణలు అవాస్తవం: హెచ్‌సీఏ

Published Tue, Dec 20 2016 2:51 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

ఆ ఆరోపణలు అవాస్తవం: హెచ్‌సీఏ - Sakshi

ఆ ఆరోపణలు అవాస్తవం: హెచ్‌సీఏ

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌పై వస్తున్న ఆరోపణలను హెచ్‌సీఏ అధ్యక్షుడు హర్షద్‌ అయుబ్‌, సెక్రటరీ జాన్‌ మనోజ్‌ ఖండించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగానే కొంతమంది హెచ్‌సీఏపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని జాన్‌ మనోజ్‌ అన్నారు.

120 కోట్ల అవినీతి జరిగిందనడం అవాస్తవం అని.. ఈ రెండేళ్లలో బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు 40 కోట్లు మాత్రమే అని వివరణ ఇచ్చారు. ఈ నిధులను సిబ్బంది జీతాలు, మ్యాచ్‌ల నిర్వహణకే వినియోగించామని జాన్‌ మనోజ్‌ తెలిపారు. లోధా కమిటీ సిఫారసుల మేరకే హెచ్‌సీఏ కార్యకలాపాలు కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement