arshad ayub
-
హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడి ఇంట్లో ఈడీ సోదాలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి జి వినోద్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. వినోద్‌తో పాటు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్‌ల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతికి సంబంధించి తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో (TACB) దాఖలు చేసిన మూడు ఛార్జిషీట్ల ఆధారంగా తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. మంగళవారం వినోద్ సోదరుడు, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ వెంకటస్వామి నివాసంలోనూ ఈడీ సోదాలు జరిపింది. వివేక్ కంపెనీ ఖాతాల్లో అక్రమ లావాదేవీలు జరిగాయన్న ఫిర్యాదు నేపథ్యంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. వివేక్, వినోద్ దివంగత కాంగ్రెస్ నేత వెంకటస్వామి (కాకా) కుమారులు. -
ఆ ఆరోపణలు అవాస్తవం: హెచ్‌సీఏ
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై వస్తున్న ఆరోపణలను హెచ్‌సీఏ అధ్యక్షుడు హర్షద్ అయుబ్, సెక్రటరీ జాన్ మనోజ్ ఖండించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగానే కొంతమంది హెచ్‌సీఏపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని జాన్ మనోజ్ అన్నారు. 120 కోట్ల అవినీతి జరిగిందనడం అవాస్తవం అని.. ఈ రెండేళ్లలో బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు 40 కోట్లు మాత్రమే అని వివరణ ఇచ్చారు. ఈ నిధులను సిబ్బంది జీతాలు, మ్యాచ్‌ల నిర్వహణకే వినియోగించామని జాన్ మనోజ్ తెలిపారు. లోధా కమిటీ సిఫారసుల మేరకే హెచ్‌సీఏ కార్యకలాపాలు కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. -
పాలమూరులో మాడల్ క్రికెట్ గ్రౌండ్
– అకాడమీతో క్రీడాకారులకు మేలు – హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలో మాడల్ క్రికెట్ మైదానాన్ని నిర్మిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్షద్ అయూబ్ అన్నారు. హెచ్‌సీఏ ఆధ్వర్యంలో పిల్లలమర్రి సమీపంలో ఏర్పాటు చేస్తున్న క్రికెట్ మైదానం పనులను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే లెవలింగ్ పనులు పూర్తయ్యాయని, మరో మూడు నెలల్లో మైదానాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. మైదానంలో పెవిలియన్ బిల్డింగ్, గదులు, జిమ్ సెంటర్ నిర్మించి భవిష్యత్‌లో రెండో అంతస్తులో అకాడమీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇక్కడి క్రికెట్ మైదానం ఏర్పాటు అనంతరం బీసీసీఐ అధికారులు పరిశీలించి సంతప్తి వ్యక్తం చేస్తే రంజీ మ్యాచ్‌లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. త్వరలో ఈ మైదానంలో అండర్–16, అండర్–19 రాష్ట్రస్థాయి మ్యాచ్‌లు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అన్ని విధాల ప్రోత్సాహం ఉంటుందన్నారు. అంతర్ జిల్లా లీగ్ మ్యాచుల్లో రాణించేవారు కంబైన్డ్ జట్టులో ఉంటారని, అక్కడ నైపుణ్యం ప్రదర్శించే వారు రాష్ట్ర జట్లకు ఎంపికవుతారని తెలిపారు. మండలస్థాయిలో క్రికెట్ విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. టెన్నిస్ బాల్‌తో కూడా టోర్నీలు నిర్వహిస్తామని వెల్లడించారు. డివిజన్ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించి నైపుణ్యం గల వారిని గుర్తించి, వారికి జిల్లాస్థాయిలో మెరుగైన శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. సమావేశంలో హెచ్‌సీఏ ప్రధాన కార్యదర్శి జాన్ మనోజ్, కోశాధికారి దేవరాజ్, క్యూరేటర్ చంద్రశేఖర్, ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఉపాధ్యక్షులు సురేశ్‌కుమార్, వెంకటరామరావు, కోశాధికారి ఉదేశ్‌కుమార్, కోచ్‌లు గోపాలకష్ణ, అబ్దుల్లా, మన్నాన్, తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్టు 2న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: అర్షద్ అయూబ్ (మాజీ క్రికెటర్), దేవిశ్రీ ప్రసాద్ (సంగీత దర్శకుడు) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజునికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల ధైర్యసాహసాలు, దేనినైనా ఎదుర్కోవాలన్న పట్టుదల, దృఢసంకల్పం ఉంటాయి. మీరు పుట్టిన తేదీ 2. ఇది చంద్రునికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి, చాకచక్యం పుట్టుకతోనే వస్తాయి. ఈ సంవత్సరం చంద్రకుజుల కలయిక వల్ల, చేసే వృత్తిలో తెలివితేటలతోపాటు చొరవ చూపడం వల్ల ప్రమోషన్ రావడం లేదా ఉన్నతమైన ఉద్యోగావకాశం లభిస్తుంది. విదేశాలకు వెళ్లాలన్న వారి కోరిక ఫలిస్తుంది. అనూహ్యంగా ఫారిన్ ఛాన్స్ వస్తుంది. 9 అనేది న్యూమరాలజీలో అంతిమ సంఖ్య కాబట్టి వ్యాపారస్థులు కొత్తవాటి జోలికి పోకుండా పాతవాటినే కొనసాగించడం మంచిది. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నించేవారికి అంత అనుకూలంగా లేదు. కొత్త వాటి కోసం 2016 జులై తర్వాత ప్రయత్నించడం మంచిది. వివాహం, సంతాన ప్రాప్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సొంత ఇంటి కల ఫలించే అవకాశం ఉంది. తొందరపాటును, కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. వాహనాలను, పదునైన ఆయుధాలను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండడం అవసరం. లక్కీ నంబర్స్: 1,3,6,9; లక్కీ కలర్స్: సిల్వర్, వైట్, క్రీమ్, గోల్డెన్, బ్లూ; లక్కీ డేస్: ఆది, మంగళ, గురు, శుక్రవారాలు. లక్కీ మంత్స్: జులై అక్టోబర్, జనవరి; సూచనలు: అమ్మవారి ఆరాధన, వికలాంగులకు సహాయం చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
మాజీ క్రికెటర్ పై ఛీటింగ్ కేసు
సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ అర్షద్ అయూబ్‌పై మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఛీటింగ్ కేసు నమోదైంది. వివరాలు... శేరిలింగంపల్లి మున్సిపాలిటీ పరిధిలో అర్షద్ అయూబ్ మరికొందరితో కలిసి స్కైటీ పేరుతో అపార్ట్మెంట్ల నిర్మాణం చేపట్టి వాటిని పలువురికి అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 2007లో ప్రారంభించిన ఈ వెంచర్ ఇప్పటికీ పూర్తి కాకపోవటంతో పీజీకే నాయర్ అనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు మియాపూర్ పోలీ సులు అర్షద్ అయూబ్‌పై ఐపీసీ 406,409,415, 420,464,468,470,471,506 రీడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 20 నెలల్లో పూర్తి చేస్తామని కొనుగోలుదార్ల నుండి డబ్బులు తీసుకున్న అయూబ్ ఐదేళ్లైనా పని పూర్తి చేయలేదని, 6,7 అంతస్తులకు అనుమతులు లేకుండానే విక్రయించాడని, ఇదేమని ప్రశ్నిస్తే బెదిరించాడని నాయర్ ఫిర్యాదు చేశారు. నాయర్ తరహాలోనే మరో ఏడుగురు అయూబ్ చేతిలో మోస పోయామని మియాపూర్ పోలీసులను ఆశ్రయించారు.