ఆగస్టు 2న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | On August 2, buying the birthday celebration | Sakshi
Sakshi News home page

ఆగస్టు 2న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Published Sun, Aug 2 2015 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM

ఆగస్టు 2న  పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఆగస్టు 2న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: అర్షద్ అయూబ్ (మాజీ క్రికెటర్), దేవిశ్రీ ప్రసాద్ (సంగీత దర్శకుడు)
 
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజునికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల ధైర్యసాహసాలు, దేనినైనా ఎదుర్కోవాలన్న పట్టుదల, దృఢసంకల్పం ఉంటాయి. మీరు పుట్టిన తేదీ 2. ఇది చంద్రునికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి, చాకచక్యం పుట్టుకతోనే వస్తాయి. ఈ సంవత్సరం చంద్రకుజుల కలయిక వల్ల, చేసే వృత్తిలో తెలివితేటలతోపాటు చొరవ చూపడం వల్ల ప్రమోషన్ రావడం లేదా ఉన్నతమైన ఉద్యోగావకాశం లభిస్తుంది. విదేశాలకు వెళ్లాలన్న వారి కోరిక ఫలిస్తుంది. అనూహ్యంగా ఫారిన్ ఛాన్స్ వస్తుంది. 9 అనేది న్యూమరాలజీలో అంతిమ సంఖ్య కాబట్టి వ్యాపారస్థులు కొత్తవాటి జోలికి పోకుండా పాతవాటినే కొనసాగించడం మంచిది. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నించేవారికి అంత అనుకూలంగా లేదు. కొత్త వాటి కోసం 2016 జులై తర్వాత ప్రయత్నించడం మంచిది. వివాహం, సంతాన ప్రాప్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.  సొంత ఇంటి కల ఫలించే అవకాశం ఉంది. తొందరపాటును, కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. వాహనాలను, పదునైన ఆయుధాలను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండడం అవసరం.

 లక్కీ నంబర్స్: 1,3,6,9; లక్కీ కలర్స్: సిల్వర్, వైట్, క్రీమ్, గోల్డెన్, బ్లూ; లక్కీ డేస్: ఆది, మంగళ, గురు, శుక్రవారాలు. లక్కీ మంత్స్: జులై అక్టోబర్, జనవరి; సూచనలు: అమ్మవారి ఆరాధన, వికలాంగులకు సహాయం చేయడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement