కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన భారీ యాక్షన్ చిత్రం కంగువా. ఈ మూవీకి శివ దర్శకత్వం వహించారు. గతేడాది నవంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని విధంగా డిజాస్టర్‌గా నిలిచింది
అయితే ఈ సినిమాకు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. ఈ మూవీలో దేవీశ్రీ సంగీతంపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ ఎదురయ్యాయి. కొన్ని సీన్స్‌లో విపరీతమైన బీజీఎం(బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) కొట్టారని దేవిశ్రీ ప్రసాద్‌పై కొందరు నెటిజన్స్ విమర్శలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన విమర్శలపై డీఎస్పీ స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసుకుందాం.
దేవీశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ..' సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ నేను పెద్దగా పట్టించుకోను. నా పని మీద మాత్రమే ఫోకస్ పెడతా. మనం ఏం చేసినా విమర్శించే వారు విమర్శిస్తూనే ఉంటారు. సూర్య కంగువా ఆల్బమ్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో మణిప్పు పాటపై ప్రశంసలు కూడా వచ్చాయి. సూర్య కూడా నాకు ఫోన్ చేసి పాటల గురించి చాలాసేపు మాట్లాడారు. నా పనిని ఆయన ప్రశంసించారు. ప్రతి సినిమాలో మంచి చెడు రెండూ ఉంటాయి. కంగువా మేము ఎంత కష్టపడ్డామో విజువల్స్‌లో చూస్తే మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమా కొందరికీ నచ్చకపోయినప్పటికీ మేం గర్వపడుతున్నాం' అని అన్నారు.
ఆస్కార్ బరిలో కంగువా..
అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయిన కంగువా ఆస్కార్-2025 నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంది. భారత్ నుంచి ఆరు చిత్రాలు ఎంపికవ్వగా అందులో కంగువా కూడా ఉంది. ఈ ఏడాది అందించనున్న 97వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం విభాగంలో పోటీలో నిలిచింది. ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపికైన చిత్రాల జాబితా జనవరి 19న రానుంది.
Comments
Please login to add a commentAdd a comment