![Suriya Kanguva Glimpse Released Now - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/23/su.jpg.webp?itok=9ZhKFg47)
సౌత్ ఇండియా స్టార్ హీరో సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ‘కంగువ’. భారీ బడ్జెట్‌తో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు కలిసి దీనిని నిర్మిస్తున్నాయి. నేడు జులై 23న సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇదొక పిరియాడిక్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
(ఇదీ చదవండి: Oppenheimer Movie Review: ఓపెన్‌హైమర్ సినిమా రివ్యూ)
ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించని సరికొత్త లుక్‌లో సూర్య కనిపించారు. ఈ సినిమా కూడా బహుబలి మాదిరిగా రెండు బాగాలుగా రానుంది. సూర్యకు ఇది తొలి పాన్ ఇండియా సినిమా కాబట్టి కోలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఈ ప్రాజెక్ట్ మీద బాగానే ఆశలు పెట్టుకుంది. దీనిని సుమారు పది భాషల్లో రిలీజ చేయనున్నారు. త్రీడీలో కూడా చూసి ఎంజాయ్ చేయవచ్చు.
నేడు విడుదలైన గ్లింప్స్‌ను గమనిస్తే ఇందులో భారీ ఫైట్లతో పాటు. అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా ఉండనున్నాయని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో దుమ్ములేపాడనే చెప్పవచ్చు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఇంతకు 'కంగువ' అంటే తెలుసా..? అగ్ని శక్తితో ఉన్న వ్యక్తి, వీరుడు, పరాక్రమవంతుడు అని అర్థం.
Comments
Please login to add a commentAdd a comment