'కంగువ' రెండో సాంగ్‌లో దేవిశ్రీ ప్రసాద్‌ మ్యాజిక్‌ | Suriya And Disha Patani Kanguva Movie Yolo Lyrical Video Song Out Now, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

Kanguva Yolo Song: 'కంగువ' రెండో సాంగ్‌లో దేవిశ్రీ ప్రసాద్‌ మ్యాజిక్‌

Published Tue, Oct 22 2024 8:25 AM | Last Updated on Tue, Oct 22 2024 11:08 AM

Yolo (Telugu) - Suriya And Disha Patani Kanguva Yolo Song Out Now

సౌత్‌ ఇండియాలో వరుసగా చిత్రాలు చేసేస్తున్నారు నటుడు సూర్య. ఈయన కథానాయకుడిగా ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం కంగువ. తాజాగా ఈ సినిమా నుంచి రెండో సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్‌ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ఈ భారీ చిత్రానికి  శివ దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌ నటుడు బాబీడియోల్‌ ముఖ్య పాత్రను పోషించిన ఇందులో నటి దిశాపటాని నాయకిగా నటించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం 3డీ ఫార్మెట్‌లో 10 భాషల్లో నవంబర్‌ 14వ తేదీన తెరపైకి రానుంది.

సూర్య- దిశా పటానీ మధ్య సాగిన ఈ సాంగ్‌ చాలా కలర్‌ఫుల్‌గా ఉంది.  మొదట తమిళం, మలయాళం వెర్షన్‌ పాటను విడుదల చేయగా తెలుగు వెర్షన్‌ను తాజాగా రిలీజ్‌ చేశారు. రాకేందు మౌళి సాహిత్యం అందించిన ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్‌, సాగర్‌, శ్రద్ధాదాస్‌ ఆలపించారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్‌ దేవివ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement