దిశా పటానిపై కంగువా నిర్మాత భార్య 'చీప్‌ కామెంట్స్‌' | Kanguva Producer K E Gnanavel Raja Wife Neha Gnanavel Comments On Disha Patani Character | Sakshi
Sakshi News home page

దిశా పటానిపై కంగువా నిర్మాత భార్య 'చీప్‌ కామెంట్స్‌'

Published Mon, Nov 18 2024 6:54 PM | Last Updated on Mon, Nov 18 2024 7:11 PM

Kanguva Producer K E Gnanavel Raja Wife Neha Gnanavel Comments On Disha Patani Character

చిత్ర పరిశ్రమలో టాప్‌ హీరోయిన్‌గా రానిస్తున్న ఒక బ్యూటీపై ప్రొడ్యూసర్ భార్య నోరుజారి పలు వ్యాఖ్యలు చేయడంతో విమర్శలపాలయింది. ప్రస్తుతం ఈ  ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీపై 'కంగువా' సినిమా ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా సతీమణి నేహా జ్ఞానవేల్ నోరుజారి చేసిన కామెంట్లతో చిక్కుల్లో పడింది. సూర్య, దిశా పటానీ జంటగా శివ దర్శకత్వం వహించిన చిత్రం ‘కంగువ’. కేఈ జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ఈ చిత్రం నవంబర్‌ 14న విడుదలైంది. అయితే, ఊహించినంత విజయాన్ని అయితే ఈ చిత్రం దక్కించుకోలేదు. సినిమాకు డివైడ్‌ టాక్‌ రావడంతో బిగ్‌ ఓపెనింగ్స్‌ రాలేదు. ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్యకు తీవ్రమైన నిరాశ మిగిలింది.

కంగువా సినిమాతో కోలీవుడ్‌లో  దిశా పటాని ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో సూర్య సరసన మెరిసిన ఈ బ్యూటీ అక్కడ మంచి మార్కులే కొట్టేసింది. అయితే, సినిమాలో కొంత సమయం మాత్రమే దిశా పటాని కనిపించడంతో ఫ్యాన్స్‌ నిరాశ చెందారు. కేవలం పాటల కోసమే ఆమెను దర్శకుడు తీసుకున్నారా అనేలా ఉంది.  సీన్స్‌ విషయంలో కూడా తక్కువే ఉన్నాయి.  బికినీలో అందాల్ని ఆరబోసిన ఈ బ్యూటీ గ్లామర్‌కు కోలీవుడ్‌ ఫిదా అయిపోయింది. 

అయితే, ఒక మీడియా సమావేశంలో చిత్ర మేకర్స్‌కు ఒక ప్రశ్న ఎదురైంది. కంగువాలో  దిశా పటాని పాత్ర చాలా తక్కువగా ఉండటానికి కారణం ఏంటని ప్రశ్నించారు. అందుకు చిత్ర నిర్మాత సతీమణి  నేహా జ్ఞానవేల్ ఇలా చెప్పుకొచ్చారు. 'దిశా పటానీని కేవలం గ్లామర్ కోసం మాత్రమే కంగువా సినిమాలోకి తీసుకున్నాం. దీంతో ఏంజెలా పాత్రకు సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే ఆమె క్యారెక్టర్‌ను పరిమితం చేశాం. ' అని చెప్పారు.

హీరోయిన్‌ దిశా పటాని గురించి  నేహా జ్ఞానవేల్ చేసిన కామెంట్లకు నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. మీరు కూడా ఒక మహిళనే కదా... ఇలా ఒక హీరోయిన్‌ గురించి తక్కువ చేసి ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మగవారు మాత్రమే ఇలాంటి కామెంట్లు చేస్తారని ఇప్పటి వరకు అనుకున్నామని ఆమె తీరును తప్పుపడుతున్నారు. కంగువా  సినిమా కోసం సుమారు రూ. 350 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పటి వరకు కేవలం రూ. 90 కోట్లు మాత్రమే వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement