KE Gnanavel Raja
-
'కంగువా'పై విమర్శలు.. కీలక నిర్ణయం తీసుకున్న మేకర్స్
సూర్య హీరోగా నటించిన కంగువా సినిమాపై డివైడ్ టాక్ రావడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 14న విడుదలైంది. సుమారు రూ. 350 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు కేవలం రూ. 160 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది. కంగువా మొదటి అరగంట అనుకున్న స్థాయిలో లేదని ప్రేక్షకులు చెప్పిన మాట నిజమేనని జ్యోతిక కూడా తెలిపింది. సినిమా ప్రారంభమే కాస్త బోర్‌గా ఉండటంతో కంగువాపై భారీ ప్రభావం చూపిందని చెప్పవచ్చు.కంగువా చిత్రం రెండో భాగం చాలా బాగుందని రివ్యూస్ వచ్చాయి. ఫైనల్‌గా మొదటి అరగంటపై ఎక్కువ విమర్శలు రావడంతో అందులో నుంచి 12 నిమిషాల నిడివిని కత్తిరించారు. ఇప్పుడు ఈ చిత్రం రన్‌టైమ్ 2.22గంటలు మాత్రమే ఉండనుంది. ఈ సినిమా సౌండ్ విషయంలో కూడా విమర్శలు వచ్చాయి. దీనిని కూడా రెండో రోజుకే టెక్నికల్‌గా సరిచేశారు. అదేరోజు సినిమా రన్‌టైమ్ కూడా తగ్గించి ఉంటే ఇంకా బాగుండేదని అభిమానులు కూడా అనుకుంటున్నారు.ప్రేక్షకుల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్‌తో ఈ కాలానికి సంబంధించిన సన్నివేశాల్ని ట్రిమ్ చేశారని తెలుస్తోంది. గోవా ఎపిసోడ్ కాస్త ఎక్కువ బోరింగ్‌గా ఉండటంతో చాలా సీన్లు లేపేశారని సమాచారం. వెయ్యేళ్ల కిందటి కథకు, వర్తమాన కాలానికి లింక్ పెడుతు కంగువా చిత్రాన్ని తెరకెక్కించారు. కంగువా, ఫ్రాన్సిస్ పాత్రల్లో సూర్య నటన అందరినీ ఆకట్టుకుంది. దిశా పటానీ చిన్న పాత్రలో మెరిసినప్పటికీ తన గ్లామర్‌తో ఫిదా చేస్తుంది. బాబీ గ్రీన్ స్టూడియోస్ పతాకంపై జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్‌తో దీనిని నిర్మించారు. -
దిశా పటానిపై కంగువా నిర్మాత భార్య 'చీప్ కామెంట్స్'
చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్గా రానిస్తున్న ఒక బ్యూటీపై ప్రొడ్యూసర్ భార్య నోరుజారి పలు వ్యాఖ్యలు చేయడంతో విమర్శలపాలయింది. ప్రస్తుతం ఈ ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీపై 'కంగువా' సినిమా ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా సతీమణి నేహా జ్ఞానవేల్ నోరుజారి చేసిన కామెంట్లతో చిక్కుల్లో పడింది. సూర్య, దిశా పటానీ జంటగా శివ దర్శకత్వం వహించిన చిత్రం ‘కంగువ’. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 14న విడుదలైంది. అయితే, ఊహించినంత విజయాన్ని అయితే ఈ చిత్రం దక్కించుకోలేదు. సినిమాకు డివైడ్ టాక్ రావడంతో బిగ్ ఓపెనింగ్స్ రాలేదు. ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్యకు తీవ్రమైన నిరాశ మిగిలింది.కంగువా సినిమాతో కోలీవుడ్‌లో దిశా పటాని ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో సూర్య సరసన మెరిసిన ఈ బ్యూటీ అక్కడ మంచి మార్కులే కొట్టేసింది. అయితే, సినిమాలో కొంత సమయం మాత్రమే దిశా పటాని కనిపించడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. కేవలం పాటల కోసమే ఆమెను దర్శకుడు తీసుకున్నారా అనేలా ఉంది. సీన్స్ విషయంలో కూడా తక్కువే ఉన్నాయి. బికినీలో అందాల్ని ఆరబోసిన ఈ బ్యూటీ గ్లామర్‌కు కోలీవుడ్ ఫిదా అయిపోయింది. అయితే, ఒక మీడియా సమావేశంలో చిత్ర మేకర్స్‌కు ఒక ప్రశ్న ఎదురైంది. కంగువాలో దిశా పటాని పాత్ర చాలా తక్కువగా ఉండటానికి కారణం ఏంటని ప్రశ్నించారు. అందుకు చిత్ర నిర్మాత సతీమణి నేహా జ్ఞానవేల్ ఇలా చెప్పుకొచ్చారు. 'దిశా పటానీని కేవలం గ్లామర్ కోసం మాత్రమే కంగువా సినిమాలోకి తీసుకున్నాం. దీంతో ఏంజెలా పాత్రకు సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే ఆమె క్యారెక్టర్‌ను పరిమితం చేశాం. ' అని చెప్పారు.హీరోయిన్ దిశా పటాని గురించి నేహా జ్ఞానవేల్ చేసిన కామెంట్లకు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మీరు కూడా ఒక మహిళనే కదా... ఇలా ఒక హీరోయిన్ గురించి తక్కువ చేసి ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మగవారు మాత్రమే ఇలాంటి కామెంట్లు చేస్తారని ఇప్పటి వరకు అనుకున్నామని ఆమె తీరును తప్పుపడుతున్నారు. కంగువా సినిమా కోసం సుమారు రూ. 350 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పటి వరకు కేవలం రూ. 90 కోట్లు మాత్రమే వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. -
మూడేళ్ల కష్టానికి ఫలితం దక్కింది: కేఈ జ్ఞానవేల్ రాజా
‘‘కంగువ’ సినిమాకు మూడేళ్లు కష్టపడ్డాం. మా కష్టానికి ఫలితంగా ప్రేక్షకులు ఘనవిజయాన్ని అందించారు. తమిళ్ కంటే తెలుగులో ఎక్కువ వసూళ్లు వస్తున్నాయి. సూర్య సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా ‘కంగువ’ నిలుస్తుంది’’ అని నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా తెలిపారు. సూర్య, దిశా పటానీ జంటగా శివ దర్శకత్వం వహించిన చిత్రం ‘కంగువ’. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాను నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేసింది.ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా ‘కంగువ’ విడుదలైంది. ఈ నేపథ్యంలో కేఈ జ్ఞానవేల్ రాజా విలేకరులతో మాట్లాడుతూ– ‘‘కంగువ’లో మేం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాం. దర్శకుడు శివగారు చాలా సపోర్ట్ చేశారు. సూర్యగారు చేసిన రెండు పాత్రలకి, ఆయన నటనకి మంచి అభినందనలు వస్తున్నాయి. బాబీ డియోల్ నటన మరో హైలైట్. క్లైమాక్స్‌లో అతిథిగా వచ్చే కార్తీ పాత్రని చూసి, ఆడియన్స్ థ్రిల్ అవుతున్నారు.ఉత్తరాదిలో రిలీజైన అన్ని దక్షిణాది సినిమాల్లో ‘కంగువ’ బిగ్ ఓపెనింగ్స్ దక్కించుకుంటోంది. ‘కంగువ 2’లో దీపికా పదుకోన్‌ని హీరోయిన్గా తీసుకుంటున్నామనే వార్తల్లో నిజం లేదు. అజిత్‌తో డైరెక్టర్ శివ చేయాల్సినప్రాజెక్ట్ అయ్యాక ‘కంగువ’ 2 పనులుప్రారంభిస్తాం. ప్రస్తుతం మా స్టూడియో గ్రీన్‌లో కార్తీ హీరోగా చేస్తున్న ‘వా వాత్తియార్’ చిత్రాన్ని జనవరి చివర్లో లేదా ఫిబ్రవరిలో విడుదల చేస్తాం’’ అని చె΄్పారు. -
Kanguva Review: 'కంగువా' మూవీ రివ్యూ
టైటిల్: కంగువానటీనటులు: సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులునిర్మాణ సంస్థ: స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్దర్శకత్వం: శివసంగీతం: దేవీవ్రీ ప్రసాద్సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామిఎడిటర్: నిశాద్ యూసుఫ్విడుదల తేది: నవంబర్ 14, 2024కథేంటి అంటే?కంగువ కథ 1070 - 2024 మధ్య నడుస్తుంది. 2024లో ఒక ప్రయోగశాల నుంచి జీటా అనే బాలుడు తప్పించుకుని గోవా వెళ్తాడు. మరోవైపు గోవాలో ఫ్రాన్సిస్ (సూర్య), కోల్ట్ (యోగిబాబు) బౌంటీ హంటర్స్‌గా ఉంటారు. పోలీసులు కూడా పట్టుకోలేని క్రిమినల్స్‌ను వారు పట్టుకుంటూ ఉంటారు. గోవాకు చేరుకున్న జీటాని ఫ్రాన్సిస్ అదుపులోకి తీసుకుంటాడు. ఈ క్రమంలో ఒక నేరస్తుడిని పట్టుకునే క్రమంలో ఒకరిని హత్య చేస్తాడు. ఈ హత్యను జీటా చూస్తాడు. అంతేకాదు ఫ్రాన్సిస్‌ను చూడగానే ఏదో తెలిసిన వ్యక్తిలా జీటా ఫీల్ అవుతాడు. ఫ్రాన్సిస్ కూడా జీటాతో ఏదో కనెక్షన్ ఉండేవాడిలా ఫీల్ అవుతాడు. హత్య విషయాన్ని బయట చెప్పకుండా ఉండేందుకు జీటాను తన ఇంటికి తెచ్చుకుంటాడు. ఇదే క్రమంలో జీటాను పట్టుకునేందుకు ల్యాబ్ నుంచి కొంతమంది వస్తారు. వారినుంచి జీటానీ కాపాడేందుకు ఫ్రాన్సిస్ ప్రయత్నిస్తుండగా కథ 1070లోకి వెళ్తుతుంది. అసలు జీటా ఎవరు..? అతనిపై చేసిన ప్రయోగం ఏంటి..? ఫ్రాన్సిస్, జీటా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? 1070కి చెందిన కంగువా(సూర్య) ఎవరు..? కపాల కోన నాయకుడు రుధిర ( బాబీ డియోల్)తో కంగువకి ఉన్న వైరం ఏంటి..? పులోమ ఎవరు? కంగువపై అతనికి ఎందుకు కోపం? భారత దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు రోమానియా సైన్యం వేసిన ప్లాన్ ఏంటి..? ప్రణవాది కోన ప్రజలను కాపాడుకోవడం కోసం కంగువ చేసిన పోరాటం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఎంత గొప్ప కథ అయినా సరే ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చెప్తేనే ఆ సినిమాని ఆదరిస్తారు. ముఖ్యంగా కథ చెప్పడంలో విసిగించకుండా అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు.. కథ చెప్పాలి. లేకపోతే ఎంత మంచి కథ అయినా...అంతే సంగతి. దర్శకుడు శివ రాసుకున్న కథ చాలా గొప్పది. కానీ అంతే గొప్పగా తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. సినిమా ఫస్టాఫ్ ప్రేక్షకులను మెప్పించడంలో దర్శకుడు కాస్త విఫలం అయ్యారు. సినిమా చూస్తున్నంతసేపు సూర్య పాత్ర మాత్రమే ప్రధానంగా ఉంటుంది. అయితే, స్క్రీన్ మీద ఉన్న క్యారెక్టర్లు అన్నీ ఆడియెన్స్‌ను విసిగిస్తూనే ఉంటాయి. యోగిబాబు, రెడిన్ కింగ్స్లే కామెడీతో విసింగేచేశారనే ఫీల్ అందరిలోనూ కలుగుతుంది.సినిమా ప్రారంభమైన సుమారు 30 నిమిషాల తర్వాత అసలు కథలోకి దర్శకుడు శివ వెళ్తాడు. అప్పటి వరకు ఆడియన్స్‌ను దర్శకుడు విషింగించారనే చెప్పవచ్చు. ఎప్పుడైతే పీరియాడిక్ పోర్షన్ మొదలౌతుందో అక్కడి నుంచి కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా కథ అంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. అప్పుడు వచ్చే వార్ ఎపిసోడ్లు అందరినీ మెప్పించడమే కాకుండా గూస్బంప్స్ తెప్పిస్తాయి. ఫస్టాఫ్‌ను దర్శకుడు ఇంకాస్త బాగా తీసింటే కంగువా మరింత గొప్ప సినిమాగా ఉండేది. ఫస్టాఫ్‌లో సూర్య, దిశా పటానీ లవ్ స్టోరీ అంతగా కనెక్ట్ కాలేదు.విలన్‌గా బాబీ డియోల్ లుక్ బాగున్నప్పటికీ ఆయన పాత్రను చూపించడంలో ఆ క్రూరత్వం కనిపించదు. ఇక్కడ కూడా డైరెక్టర్ శివ కాస్త నిరుత్సాహపరిచారు. అయితే, భారీ ఎమోషనల్ బ్యాంగ్‌తో సినిమాను ఎండ్ చేస్తారు. క్లైమ్యాక్స్ తర్వాత మాత్రం రెండు ట్విస్టులు ఇచ్చిన దర్శకుడు శివ.. సీక్వెల్‌కు మంచి లీడ్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.ఎవరెలా చేశారంటే.. సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తారు. ఈ చిత్రం కోసం ఆయన ప్రాణం పెట్టి నటించారు. కంగువా, ఫ్రాన్సిస్ అనే రెండు విభిన్న పాత్రలో కనిపించిన సూర్య.. ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.. ముఖ్యంగా వెయ్యేళ్ల కిందట వీరుడు కంగువాగా ఆయన నటనతో మెప్పించి సినిమాకే హైలెట్‌గా నిలిచారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఉదిరన్ పాత్రకు బాబీ డియోల్ పూర్తి న్యాయం చేశారు. ఏంజెలీనాగా దిశాపటానీ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రలో అనేక షేడ్స్ ఉంటాయి. సినిమాకు ఆమె స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి.యోగి బాబుతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.ఇక సాంకేతిక విషయాలకొస్తే.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం పర్వాలేదు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. అదే సమయంలో కొన్ని చోట్ల మోతాదుకు మించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. పాటలు పర్వాలేదు. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా, రియాల్టీకీ దగ్గరగా ఉంటుంది. వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు చాలా రిచ్‌గా ఉన్నాయి. -
'కంగువ' నిర్మాత ఫోన్ వాల్ పేపర్‌గా రాజమౌళి ఫొటో
తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ మూవీ 'కంగువ'. నవంబర్ 14న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శుక్రవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి రాజమౌళి అతిథిగా వచ్చారు. కాకపోతే రాజమౌళిపై తనకు, తన నిర్మాత జ్ఞానవేల్ రాజాకు ఎంత ఇష్టముందో అనేది చెప్పకనే చెప్పారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)'కంగువ' టీమ్‌కి కోసం వచ్చిన రాజమౌళి అంతా మాట్లాడిన తర్వాత సూర్య మైక్ అందుకున్నాడు. తాను ఎక్కాల్సిన ట్రైన్ మిస్ అయ్యానని, కాబట్టి సిగ్గు లేకుండా చెబుతున్నాను అదే స్టేషన్లో ఉన్నాను త్వరగానే ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నా అని రాజమౌళితో సినిమా చేయాలని ఉందని సూర్య తన మనసులో మాటని బయటపెట్టాడు.మీ 'బాహుబలి' పేరు పలకడానికి కూడా మాకు అర్హత ఉందో లేదో తెలీదు. మీరు వేసిన దారిలోనే మేం మీ వెనుక నడుస్తూ వస్తున్నాం. మీరు మా నిర్మాత జ్ఞానవేల్ రాజాకి షేక్ హ్యాండ్ ఇస్తే అదే మాకు పెద్ద ఆస్కార్ అని సూర్య చెప్పాడు. జ్ఞానవేల్ రాజా తనకు పరిచయమైనప్పటి నుంచి మీ ఫొటోనే ఫోన్ వాల్ పేపర్‌గా పెట్టుకున్నాడనే ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. దీంతో జ్ఞానవేల్ రాజా స్టేజీపైకి వచ్చి తన ఫోన్లోని రాజమౌళి ఫోటో చూపించడంతో పాటు రాజమౌళి కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. (ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)"In our mobile phones we keep Family photos as wallpaper, but Gnanavel has your photo as wallpaper. You have paved the way for #Kanguva. It will be like an Oscars If you shake hands with Gnanavel"- #Suriyapic.twitter.com/fJ7GKri4mT— AmuthaBharathi (@CinemaWithAB) November 7, 2024 -
కోర్టులో రిలయన్స్ పిటిషన్.. కంగువ విడుదలకు అడ్డంకులు
సౌత్ ఇండియాలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం 'కంగువ'. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య, దిశా పటానీ, బాబీ డియోల్ కీలకపాత్రలు చేశారు. యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్ రాజా ఈ సినిమా కోసం భారీగానే ఖర్చుపెట్టారు. అయితే, ఈ సినిమా విడుదల విషయంలో పలు అడ్డంకులు వచ్చేలా కనిపిస్తున్నాయి. రిలయన్స్ నిర్మాణ సంస్థ ఫిర్యాదుతో కంగువ సినిమా రిలీజ్ విషయంలో మద్రాస్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.3డీ ఫార్మెట్లో 10 భాషల్లో నవంబర్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుందని అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. అయితే, ఈ సినిమా నిర్మాత కేఈ.జ్ఞానవేల్ రాజా, రిలయన్స్ సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీల చిక్కులు ఉన్నాయి. స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్థ తరపున టెడ్డీ-2, ఎక్స్ మీట్స్ ఓయ్, తంగలాన్ చిత్రాల నిర్మాణం కోసం రిలయన్స్ నుంచి రూ.99 కోట్లు పైగానే జ్ఞానవేల్ రాజా రుణం పొందారు. అయితే, ఇప్పటికే రూ.45 కోట్లు తిరిగి చెల్లించిన జ్ఞానవేల్ రాజా మిగిలిన రూ.55 కోట్లు చెల్లించకుండా కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారని రిలయన్స్ తరపున మద్రాస్ హైకోర్టులో కేసు దాఖలైంది.తమకు చెల్లించాల్సిన డబ్బు అందేవరకు సూర్య నటించిన గంగువ సినిమా విడుదలను ఆపేయాలని రిలయన్స్ నిర్మాణ సంస్థ కోర్టుకెళ్లింది. మరోవైపు తంగళాన్ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేయకూడదని ఆ పిటిషన్లో పేర్కొంది. జస్టిస్ కుమారేష్ బాబు ముందు కేసు విచారణకు వచ్చినప్పుడు, స్టూడియో గ్రీన్ ఇలా తెలిపింది. 'నవంబర్ 7 వరకు సమయం కావాలని కోరింది. అప్పటి వరకు 'కంగువ'ను విడుదల చేయబోమని తెలిపింది. ఈ క్రమంలో తంగలాన్ చిత్రాన్ని కూడా నవంబర్ 7వరకు విడుదల చేయబోమని హామీ ఇచ్చింది. దీనిని నమోదు చేసుకున్న న్యాయమూర్తి కేసు విచారణను నవంబర్ 7వ తేదీకి వాయిదా వేశారు. అయితే, కంగువ చిత్రం నవంబర్ 14న విడుదల కానుంది. ఆ సమయంలోపు ఈ కేసు క్లియర్ కాకపోతే సినిమా విడుదలకు చిక్కులు తప్పవని ఇండస్ట్రీ వర్గాలే పేర్కొంటున్నాయి. -
కంగువ ఆడియో వేడుక రెడీ.. సూర్య కొత్త సినిమాలో మరాఠీ బ్యూటీ
సౌత్ ఇండియాలో వరుసగా చిత్రాలు చేసేస్తున్నారు నటుడు సూర్య. ఈయన కథానాయకుడిగా ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం కంగువ. యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ భారీ చిత్రానికి శివ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటుడు బాబీడియోల్ ముఖ్య పాత్రను పోషించిన ఇందులో నటి దిశాపటాని నాయకిగా నటించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం 3డీ ఫార్మెట్లో 10 భాషల్లో నవంబర్ 14వ తేదీన తెరపైకి రానుంది.కంగువ ఆడియో ఆవిష్కరణ వేడుకను త్వరలో చైన్నెలో భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా తాజాగా నటుడు సూర్య తన 44వ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇందులో నటి పూజాహెగ్డే నాయకిగా నటిస్తున్నారు. 2డీ ఎంటర్టెయిన్మెంట్, స్టోన్ బెంచ్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.దీంతో నటుడు సూర్య తన 45వ చిత్రానికి రెడీ అయిపోతున్నారు. దీన్ని నటుడు ఆర్జే. బాలాజీ దర్శకత్వం వహించనున్నారు. డ్రీమ్ వారియర్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం కానుందని సమాచారం. ఇకపోతే ఇందులో నటించే జాక్‌పాట్‌ను వర్ధమాన నటి కాశ్మీరా పరదేశీ కొట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజం అయితే ఆమెకిది నిజంగా లక్కీఛాన్సే అవుతుంది. ఇంతకు ముందు కోలీవుడ్‌లో శివప్పు మంజల్ పచ్చై, పీటీసార్ వంటి చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. అయితే అంతకు ముందే ఈ మరాఠీ బ్యూటీ తెలుగులో నర్తనశాల,వినరో భాగ్యము విష్ణుకథ చిత్రంలోనూ మెరిసింది. హిందీలో మిషన్ మంగళ్ చిత్రంలోనూ నటించింది. కాగా సూర్యతో చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా ఈ క్రేజీ చిత్రానికి హింట్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. -
‘తంగలాన్’ వసూళ్లను చూసి ఆశ్చర్యపోయా: నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా
‘‘తంగలాన్’ సినిమాకు తెలుగులో మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. మేము అనుకున్నదానికంటే రెట్టింపు వసూళ్లు వస్తుండటంతో ఆశ్చర్యపోతున్నాం. విక్రమ్‌గారి కెరీర్లో ‘తంగలాన్’ చిత్రానివే హయ్యెస్ట్ ఓపెనింగ్స్’’ అని నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా అన్నారు. విక్రమ్ హీరోగా పా. రంజిత్ దర్శకత్వం వహించిన చిత్రం ‘తంగలాన్’. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా కేఈ జ్ఞానవేల్ రాజా మీడియాతో మాట్లాడుతూ– ‘‘నేనెప్పుడూ డైరెక్టర్‌నే నమ్ముతాను. పా. రంజిత్గారిపై నమ్మకంతో ‘తంగలాన్’ విషయంలో స్వేచ్ఛ ఇచ్చాం. సినిమాల మేకింగ్ విషయంలో నా నమ్మకం ఏంటంటే ప్రేక్షకుల అభిరుచిని విశ్వసించడమే. హిందీతో పాటు మిగతా అన్ని భాషల్లోనూ ఈ నెల 30న ‘తంగలాన్’ని రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. -
కోర్టు ఆదేశాలు పాటించిన నిర్మాత.. తంగలాన్‌కు లైన్ క్లియర్..!
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తాజాగా నటించిన భారీ యాక్షన్ చిత్రం తంగలాన్. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు హీరోయిన్లుగా నటించారు. కర్ణాటకలోని కేజీఎఫ్ గనుల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం విక్రమ్ ఆటవిక జాతికి చెందిన పాత్రలో మెప్పించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్లో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు.అయితే రిలీజ్‌కు తంగలాన్ నిర్మాతకు ఇబ్బందులు ఎదురు కావడంతో విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలోనే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నిర్మాత కేఈ జ్ఞానవేల్ రూ.1 కోటి రూపాయలు డిపాజిట్ చేశారు. తాజాగా తంగలాన్ రిలీజ్‌కు లైన్ క్లియర్ అయింది. దీంతో విక్రమ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాకుండా సూర్య హీరోగా నటిస్తోన్న కంగువా చిత్రం విడుదలకు ముందు కూడా కోటి రూపాయలు డిపాజిట్ చేయాలని నిర్మాతకు సూచించింది. కాగా.. గతంలో సుందర్‌దాస్ అనే వ్యక్తికి చెల్లించాల్సి డబ్బుల విషయంలో ఆయన కుటుంబం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే..గతంలో అర్జున్‌లాల్ సుందరదాస్ అనే వ్యక్తితో కలిసి నిర్మాత జ్ఞానవేల్ రాజా రూ.40 కోట్లతో ఓ సినిమా నిర్మించాలని అనుకున్నారు. అయితే ప్రీ-ప్రొడక్షన్‌కి ఖర్చులకు గానూ స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్థకు సుందర్‌దాస్ రూ.12.85 కోట్లు చెల్లించారు. తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు రావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి సుందర్‌దాస్ తప్పుకున్నాడు. అయితే అందులో కేవలం రూ.2.5 కోట్లు మాత్రమే తిరిగి వచ్చాయి. ఆ తర్వాత ఆయన మరణించడంతో మిగిలిన రూ.10.35 కోట్ల కోసం సుందర్‌దాస్ కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించారు.అయితే ఈ కేసు గురించి నిర్మాత కేఈ జ్ఞానవేలు మాట్లాడుతూ... మూడు తమిళ సినిమాల హిందీ డబ్బింగ్ హక్కులకు ఇవ్వాల్సిన డబ్బుకు బదులుగా.. ఆ రూ.12.85 కోట్లు ఇచ్చాడని తెలిపారు. అంతే కానీ తమకు ఎలాంటి డబ్బు ఇవ్వలేదని చెప్పారు. కానీ గ్రీన్ స్టూడియోస్ తమకు రూ.10.25 కోట్లను 18 శాతం వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ అర్జున్ లాల్ సుందర్ దాస్ కుటుంబం కోర్టులో దావా వేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టినా ధర్మాసనం నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా సినిమాల రిలీజ్‌కు ముందు కోటి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని ఆదేశించింది. -
నిర్మాతతో స్టార్ హీరో గొడవ.. హైకోర్టుకు ఫిర్యాదు
SivaKarthikeyan Files Petition Against KE Gnanavel Raja: తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ కోర్టు మెట్లెక్కాడు. ప్రముఖ నిర్మాత కె. ఇ. జ్ఞానవేల్ రాజా తనకు రెమ్మ్యునరేషన్ ఇవ్వలేదని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. 2019 మే 27న విడుదలైన 'మిస్టర్ లోకల్' సినిమా కోసం రూ. 15 కోట్లు పారితోషికం ఇస్తామని జూలై 6, 2018న ఒప్పందం చేసుకుని, రూ. 11 కోట్లు మాత్రమే చెల్లించారని తెలిపాడు. మూడేళ్లైనా రూ. 4 కోట్లు ఇవ్వలేదన్నాడు. ఇచ్చిన రూ. 11 కోట్లకు కూడా టీడీఎస్ కట్టలేదని, రూ. 91 లక్షలు టీడీఎస్ కింద కట్ అయ్యాయని పేర్కొన్నాడు. తన కేసు పరిష్కారమయ్యే వరకూ నిర్మాత జ్ఞాన్వేల్ రాజా తన తదుపరి సినిమాలైన 'రెబల్', 'చియాన్ 61', 'పాతు తాల'కు ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదని కోర్టును కోరాడు శివ కార్తికేయన్. అలాగే ఈ సినిమాలకు సంబంధించి థియేట్రికల్ రిలీజ్ కోసం ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లకు, లేదా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఎలాంటి హక్కులు బదిలీ చేయకుండా చూడాలని అభ్యర్థించాడు. ఈ కేసు మళ్లీ గురువారం విచారించనున్నారు. కాగా శివకార్తికేయన్.. రెమో, హీరో, వరుణ్ డాక్టర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇటీవల 'బీస్ట్' మూవీ నుంచి అదరగొట్టిన సూపర్ హిట్ సాంగ్ 'అరబిక్ కుతు'కు లిరిక్స్ అందించాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లల్ 'అయాలాన్' విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రానికి రవి కుమార్ దర్శకత్వం వహించారు. -
‘బంగార్రాజు’ మూవీ డైరెక్టర్‌కు తమిళ నిర్మాత భారీ ఆఫర్
ఈ ఏడాది ఆరంభంలోనే ‘బంగార్రాజు’ మూవీతో భారీ హిట్ కొట్టాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'బంగార్రాజు' మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో పాటు సంక్రాంతి పండగ వాతావరణాన్ని ప్రతిబింబించే సినిమా కావడంతో ‘బంగార్రాజు’ పక్కా పండగ సినిమా అనిపించింది. చదవండి: ఐదేళ్ల తర్వాత మళ్లీ బుల్లి తెరపైకి హాట్ బ్యూటీ.. న్యాయ నిర్ణేతగా అందుకే సంక్రాంతి సెలబ్రెషన్స్‌ను రెట్టింపు చేసుకునేందుకు ప్రేక్షకులంతా సినిమా చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. చాలాకాలం తర్వాత నాగార్జున ఈ మూవీతో భారీ హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి మంచి సినిమాను అందించిన డైరెక్టర్ సి కల్యాణ్ కృష్ణ నెక్స్ట్ మూవీ ఎవరితో, ఏ బ్యానర్లో ఉండనుందనేది ఆసక్తికగా మారింది. ఈ క్రమంలో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై అప్డేట్ బయటకు వచ్చంది. చదవండి: నా బెస్ట్ ఆన్‌స్క్రీన్ పెయిర్ సమంతనే: నాగ చైతన్య ఆయన నెక్ట్ సినిమా తమిళ అగ్ర నిర్మాతతో ఉండనుందని ఖరారైంది. కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజాతో కల్యాణ్ కృష్ణ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాలో కథానాయకుడు ఎవరు? ఎప్పుడు ఈ ప్రాజెక్టు మొదలవుతుంది? అనేది త్వరలోనే వెల్లడించనున్నారు. అయితే జ్ఞానవేల్ రాజా తన స్టూడియో గ్రీన్ బ్యానర్లో ఎక్కువగా హీరో సూర్య, కార్తిలతోనే తీశాడు. దీంతో ఈ సినిమాలో కూడా వాళ్లిద్దరిలో ఒకరు ఉండే అవకాశం ఉందని ఊహగాహనాలు వస్తున్నాయి. Happy to Announce, we have collaborated with Telugu Sankranti BLOCK BUSTER #Bangarraju Director @kalyankrishna_k for his next Big venture👍💐💐👍 Other details Soon..@kegvraja #Sankranti #Bangarraju #BlockbusterBangarraju pic.twitter.com/Q45kO6Prm4 — Studio Green (@StudioGreen2) January 16, 2022 -
నటుడి బంధువు ఆత్మహత్య.. ప్రముఖ నిర్మాతకు ఊరట
సినీ నిర్మాత జ్ఞానవేల్ రాజాకు చెన్నై హైకోర్టులో ఊరట లభించింది. వివరాల్లోకి వెళ్తే 2017లో నటుడు శశికుమార్ బంధువు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన అప్పట్లో కోలీవుడ్‌లో కలకలానికి దారి తీసింది. ఆ వ్యవహారంపై సినీ ఫైనాన్షియర్ బోద్రాను నిర్మాత జ్ఞానవేల్ రాజా విమర్శిస్తూ ఆరోపణలు చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఫైనాన్షియర్ బోద్రా చెన్నై హైకోర్టులో జ్ఞానవేల్ రాజా తనపై నిరాధార ఆరోపణలు చేసినట్లు పిటీషన్ దాఖలు చేశారు. పలుమార్లు విచారణ అనంతరం కేసుకు సంబంధించి న్యాయమూర్తి దండపాణి బుధవారం ఫైనాన్షియర్ బోధ నిర్మాత జ్ఞానవేల్ రాజాపై వేసిన పిటీషన్లో తగిన ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టి వేస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: Deepika Padukone: అటు ద్రౌపదిగా, ఇటు సీతగా! -
వినోదభరితంగా మిస్టర్ లోకల్
మిస్టర్ లోకల్ చిత్రం వినోదమే ప్రధానంగా ఉంటుందని ఆ చిత్ర కథానాయకుడు శివకార్తికేయన్ తెలిపారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ.జ్ఞావేల్‌రాజా నిర్మించిన చిత్రం మిస్టర్‌లోకల్. శివకార్తికేయన్, నయనతార జంటగా నటించిన ఈ చిత్రానికి రాజేశ్.ఎం దర్శకుడు. హిప్ ఆప్ ఆది సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 17న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు రాజేశ్.ఎం మాట్లాడుతూ శివకార్తికేయన్ హీరోగా స్టూడియోగ్రీన్ పతాకంపై చిత్రం చేయడం నిశ్చయం అయినప్పుడు తనకు మంచి విజయవంతమైన చిత్రం ఇవ్వాలని నిర్మాత జ్ఞానవేల్‌రాజా కోరారన్నారు. ఇక నటుడు శివకార్తికేయన్ మద్యం తాగే సన్నివేశాలు, అలాంటి పాటల సన్నివేశాలు, మహిళలను కించపరచే అంశాలు లాంటివి లేకుండా వినోదాత్మక చిత్రం కావాలని అడిగారన్నారు. దీంతో అలాంటివేవీ ఈ మిస్టర్ లోకల్ చిత్రంలో ఉండవని చెప్పారు. కుటుంబ సమేతంగా చూసి ఆనందించే క్లీన్ ఎంటర్టెయినర్ గా మిస్టర్ లోకల్ ఉంటుందని తెలిపారు. చిత్ర కథానాయకుడు శివకార్తికేయన్ మాట్లాడుతూ ఇది చాలా సింపుల్ కథాంశంతో కూడిన కాలక్షేప చిత్రంగా ఉంటుందని తెలిపారు. టీవీ రంగంలో ఉండగానే దర్శకుడు రాజేశ్‌తో కలిసి పనిచేయాలని ఆశ పడ్డానన్నారు. ఆయన తెరకెక్కించిన ఎస్ఎంఎస్ చిత్రంలో తానూ ఒక పాత్రకు డబ్బింగ్ చెప్పానని అన్నారు. ఇక రాజేశ్ సెట్ చేసి ఇచ్చిన చిత్రమే వరుత్తపడాద వాలిభర్ సంఘం అని తెలిపారు. అది తన కెరీర్లో చాలా ముఖ్యమైన చిత్రం అని పేర్కొన్నారు. నయనతారతో రెండవసారి కలిసి నటించిన చిత్రం మిస్టర్ లోకల్ అని తెలిపారు. ఇంతకు ముందు వేలైక్కారన్ చిత్రంలో కలిసి నటించామని, అయితే ఆ చిత్రంలో ఆమెకు నటించడానికి పెద్దగా స్కోప్ లేకుండా పోయిందని చెప్పారు. కాగా ఈ చిత్రంలో నయనతార చిత్రం అంతా ఉంటారని తెలిపారు. ఇకపై ఆరు నెలలకొకసారి మంచి మంచి చిత్రాలతో మిమ్మల్ని కలుస్తానని శివకార్తికేయన్ చెప్పారు. -
దేవరాట్టం కాపాడుతుంది
దేవరాట్టం చిత్రం తనను కాపాడుతుందనే నమ్మకాన్ని ఆ చిత్ర కథానాయకుడు గౌతమ్ కార్తీక్ వ్యక్తం చేశారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన భారీ చిత్రం దేవరాట్టం. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ముత్తయ్య తెరకెక్కించిన ఈ సినిమాలో గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్ జంటగా నటించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే ఒకటవ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం ఉదయం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ దర్శకుడు ముత్తయ్యతో తాను నిర్మించిన రెండవ చిత్రం దేవరాట్టం అని చెప్పారు. ఆయన చిత్రాన్ని ఒకే షెడ్యూల్లో పూర్తి చేశారన్నారు. ఇంత భారీ యాక్షన్ చిత్రాన్ని ఏకధాటిగా పని చేసి పూర్తి చేయడం సాధారణ విషయం కాదన్నారు. చిత్ర నిర్మాణాన్ని కూడా అంతా ఆయనే చూసుకున్నారన్నారు. ఇది మదురై నేపధ్యంలో సాగే కథ, ఈ కథకు గౌతమ్‌కార్తీక్, మంజిమా మోహన్‌లు సరిపోతారా? అన్న భయం తనకు కలిగిందన్నారు. ఈ చిత్రం అక్కా తమ్ముళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించే చిత్రం అని చెప్పారు. చిత్ర కథానాయకుడు గౌతమ్‌కార్తీక్ మాట్లాడుతూ ఈ చిత్రం తనను కాపాడుతుందని అన్నారు. తనకు ఈ చిత్రంలో నటించే అవకాశం రావడానికి ముఖ్య కారణం నిర్మాత జ్ఞానవేల్‌రాజా అని తెలిపారు. దర్శకుడు ముత్తయ్య తనకు మదురై ప్రజల భాషను వారి ప్రవర్తనను, జీవన విధానాన్ని నేర్పించారని చెప్పారు. నటి మంజిమా మోహన్ చాలా సపోర్టు చేశారని చెప్పారు. అనంతరం దర్శకుడు ముత్తయ్య మాట్లాడుతూ ఇది జాతి గురించి చర్చించే కథా చిత్రం అనే అపోహ పడుతున్నారనీ, నిజానికి దేవరాట్టం అనేది ఒక కళ అని తెలిపారు. -
‘తెలుగు పరిశ్రమ నుంచి చాలా నేర్చుకోవాలి’
తమిళసినిమా: తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మనం చాలా నేర్చుకోవాలని స్టూడియోగ్రీన్ సంస్థ అధినేత కేఇ.జ్ఞానవేల్‌రాజా వ్యాఖ్యానించారు. అల్లుఅర్జున్ హీరోగా నటించిన నా పేరు సూర్య చిత్రం తమిళంలోనూ ఎన్ పేర్ సూర్య పేరుతో విడుదల కానుంది. కే.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా లగడపాటి నిర్మించిన ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 4న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను శక్తి ఫిలిం ఫ్యాక్టరీ అధినేత శక్తివేల్ పొందారు. నటి అనుఇమ్మానుయేల్ కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో శరత్‌కుమార్ విలన్‌గా నటించడం విశేషం. అరుణ్, కవిత, బిమ్మన్, చారుహాసన్, సాయికుమార్, ప్రదీప్ ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కేఇ.జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ మనం తెలుగు పరిశ్రమ నుంచి చాలా నేర్చుకోవాలని అన్నారు. నటీనటుల పారితోషికం, వారి సహకారం వంటి విషయాలను మనం అనుసరించాల్సి ఉంటుందని అన్నారు. అక్కడ రూ.50కోట్లు పారితోషికం తీసుకునే నటుడు కూడా అడ్వాన్స్‌గా రూ.5 లక్షలే తీసుకుంటారని, దీన్ని మన నటీనటులు కూడా పాటిస్తే బాగుంటుందని ఆన్నారు. ఈ విషయంపై నడిగర్ సంఘం చర్చించి మంచి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. బాలీవుడ్‌కు వెళ్లినా తెలుగు చిత్రపరిశ్రమ గురించే చెప్పుకుంటున్నారని, ఆ పరిశ్రమ అంత సుభిక్షంగా ఉందని, అందుకే తానూ అక్కడ కార్యాలయాన్ని ప్రారంభించానన్నారు. నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ లారెన్స్ హీరోగా తాను నిర్మించిన లక్ష్యం (తెలుగులో స్టైల్) తమిళ ప్రేక్షకులు ఆదరించారని, మంచి కథా చిత్రాలను ఎప్పుడూ ఆదరించే తమిళ ప్రేక్షకులు ఎన్ పేర్ సూర్య చిత్రాన్ని కూడా ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఇది అల్లుఅర్జున్ కెరీర్లోనే పెద్ద చిత్రంగా నిలిచిపోతుందని అన్నారు. సమావేశంలో శక్తిఫిలిం ఫ్యాక్టరి శక్తివేల్, రచయిత విజయ్‌బాలాజీ పాల్గొన్నారు. -
నేనే డబ్బింగ్ చెబుతా : విజయ్ దేవరకొండ
తమిళసినిమా: తమిళం నేర్చుకుని తన చిత్రానికి తానే డబ్బింగ్ చెబుతానని తెలుగు యువ నటుడు విజయ్ దేవరకొండ తమిళ ప్రేక్షకులకు మాట ఇచ్చారు. ఈయనిప్పుడు నోటా చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేఈ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. మెహ్రీన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం తేనాంపేటలోని నక్షత్ర హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టైటిల్‌ను ప్రకటించారు. నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ దర్శకుడు ఆనందశంకర్తో ఒక చిత్రం చేయాలని భావించానని మంచి కథ లభించడంతో చిత్రాన్ని తెరకెక్కిస్తునట్టు చెప్పారు. తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్ హక్కులను దర్శకుడు బాలా పొందారని, ఆ చిత్రం తెలుగు వెర్షనే చెన్నై, చెంగల్పట్టు ఏరియాల్లో రూ.3కోట్లు వసూలు చేసిందని తెలిపారు. చిత్ర హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ దర్శకుడు ఆనందశంకర్ చెప్పిన కథ విని ఇలాంటి కథే తనకు సూట్ అవుతుందని భావించి చిత్రానికి అంగీకరించానని తెలిపారు. ఈ చిత్రం కోసం తమిళ భాషను నేర్చుకుని తన పాత్రకు తానే డబ్బింగ్ చెబుతానని తమిళ ప్రేక్షకులకు మాట ఇస్తున్నానని విజయ్ దేవరకొండ అన్నారు. -
తమిళంలోకి తొలి అడుగు
విజయ్ దేవరకొండ తమిళ పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. ‘ఇంకొక్కడు’ ఫేమ్ ఆనంద్ శంకర్ డైరెక్షన్లో తెలుగు, తమిళ భాషల్లో విజయ్ దేవరకొండ, మెహరీన్ జంటగా కె.ఇ.జ్ఞానవేల్ నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్‌నివ్వగా, ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ వంగా కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – ‘‘జ్ఞానవేల్ రాజాగారి బ్యానర్లో సినిమా చేయడం ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. కథ వినగానే ఎగై్జటింగ్‌గా అనిపించింది. డేట్స్ అడ్జస్ట్ చేసి మరీ ఈ సినిమాకు ఓకే చెప్పాను’’ అన్నారు. ‘‘అర్జున్ రెడ్డి’ని 5సార్లు థియేటర్లో చూశాను. విజయ్ అద్భుతమైన నటుడు. మా బ్యానర్లో డైరెక్ట్ తెలుగు ఫిల్మ్‌లో విజయ్ హీరోగా నటిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఆనంద్ శంకర్, సంగీత దర్శకుడు శామ్.సి, ఆర్ట్ డైరెక్టర్ కిర ణ్ ఇలా పెద్ద సినిమాలకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాకు వర్క్ చేయడం ఆనందంగా ఉంది. మార్చి 8న హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు జ్ఞానవేల్ రాజా. ‘‘అర్జున్ రెడ్డి’ బాగా నచ్చింది. విజయ్ బాగా యాక్ట్ చేశాడు. నేను చెప్పిన కథ విని బాగా ఎగై్జట్ అయ్యాడు. తమిళం నేర్చుకుని మరీ డైలాగ్స్ చెబుతా అన్నాడు. అంత ప్యాషనేట్ యాక్టర్’’ అన్నారు ఆనంద్ శంకర్. ‘‘ఇటీవల విజయ్‌తో హోలీ సాంగ్ చేశాను. వెంటనే ఫుల్ లెంగ్త్ హీరోయిన్గా చేస్తున్నాను. స్క్రిప్ట్ విని ఎగై్జట్ అయ్యాను. స్టూడియో గ్రీన్ బ్యానర్లో యాక్ట్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు మెహరీన్. కేయస్ రామారావు, బీవీయస్‌యన్ ప్రసాద్, వంశీ పైడిపల్లి, స్వప్నా దత్, నవీన్ ఎర్నేని తదితరులు పాల్గొన్నారు. -
చెన్నై ఎక్స్‌ప్రెస్‌కు టైముందట!
ఆల్మోస్ట్ ఇంకో ఏడాది టైముందట.. అల్లు అర్జున్ చెన్నై ఎక్స్‌ప్రెస్ ఎక్కడానికి! నిజం చెప్పాలంటే... ఈ టైమ్‌కి అల్లు అర్జున్ ఎక్కేయాలి. ఒకానొక దశలో అసలు చెన్నై ఎక్స్‌ప్రెస్‌ను క్యాన్సిల్ చేశారనే మాటలూ వినిపించాయి. అయితే... అటువంటిదేం లేదట. చెన్నై ఎక్స్‌ప్రెస్ అంటే ట్రైన్ కాదు, తమిళ సినిమా. అల్లు అర్జున్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా తెలుగు–తమిళ సినిమా ఒకటి ప్రకటించిన సంగతి తెలిసిందే. చెన్నైలో అట్టహాసంగా ప్రారంభోత్సవమూ జరిగింది. నిజానికి, ‘దువ్వాడ జగన్నాథమ్’ తర్వాత బన్నీ–లింగుస్వామి సినిమా షూట్ మొదలవ్వాలి. కానీ, వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ ప్రారంభించారు బన్నీ. మరోపక్క విశాల్ హీరోగా తమిళంలో ‘సండైకోళి–2’ ప్రారంభించారు లింగుస్వామి . తెలుగులో మంచి విజయం, విశాల్‌కు గుర్తింపు సాధించిన ‘పందెం కోడి’కి సీక్వెల్ ఇది. మరి, ముందుగా ప్రకటించిన బన్నీ సినిమా సంగతేంటి? అంటే... ‘‘తప్పకుండా ఆ సినిమా ఉంటుంది. ‘నా పేరు ఇండియా–నా ఇల్లు ఇండియా’ పూర్తయిన తర్వాత బన్నీ ఆ సినిమా స్టార్ట్ చేస్తారు. ఈలోపు లింగుస్వామి ‘సండైకోళి–2’ పూర్తి చేసి వస్తారు. ఆల్రెడీ బన్నీ–లింగుస్వామిలు ఎప్పుడో స్క్రిప్ట్‌ను లాక్ చేశారు’’ అని గీతా ఆర్ట్స్ సన్నిహిత వర్గాల సమాచారం.