Bangarraju Director Kalyan Krishna Gets Offer From Tamil Production - Sakshi
Sakshi News home page

Bangarraju Director Kalyan Krishna: ‘బంగార్రాజు’ మూవీ డైరెక్టర్‌కు తమిళ నిర్మాత భారీ ఆఫర్‌

Published Mon, Jan 17 2022 11:23 AM | Last Updated on Mon, Jan 17 2022 2:06 PM

Bangarraju Movie Director Kalyan Krishna Gets Offer From Tamil Production - Sakshi

ఈ ఏడాది ఆరంభంలోనే ‘బంగార్రాజు’ మూవీతో భారీ హిట్‌ కొట్టాడు దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ.  ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'బంగార్రాజు' మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో పాటు సంక్రాంతి పండగ వాతావరణాన్ని ప్రతిబింబించే సినిమా కావడంతో ‘బంగార్రాజు’ పక్కా పండగ సినిమా అనిపించింది.

చదవండి: ఐదేళ్ల తర్వాత మళ్లీ బుల్లి తెరపైకి హాట్‌ బ్యూటీ.. న్యాయ నిర్ణేతగా

అందుకే సంక్రాంతి సెలబ్రెషన్స్‌ను రెట్టింపు చేసుకునేందుకు ప్రేక్షకులంతా సినిమా చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. చాలాకాలం తర్వాత నాగార్జున ఈ మూవీతో భారీ హిట్‌ అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి మంచి సినిమాను అందించిన  డైరెక్టర్‌ సి కల్యాణ్‌ కృష్ణ  నెక్స్ట్ మూవీ ఎవరితో,  ఏ బ్యానర్లో ఉండనుందనేది ఆసక్తికగా మారింది. ఈ క్రమంలో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై అప్‌డేట్‌ బయటకు వచ్చంది.

చదవండి: నా బెస్ట్‌ ఆన్‌స్క్రీన్‌ పెయిర్‌ సమంతనే: నాగ చైతన్య

ఆయన నెక్ట్‌ సినిమా తమిళ అగ్ర నిర్మాతతో ఉండనుందని ఖరారైంది. కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ జ్ఞానవేల్‌  రాజాతో కల్యాణ్‌ కృష్ణ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాలో కథానాయకుడు ఎవరు? ఎప్పుడు ఈ ప్రాజెక్టు మొదలవుతుంది? అనేది త్వరలోనే వెల్లడించనున్నారు. అయితే జ్ఞానవేల్ రాజా తన స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో  ఎక్కువగా హీరో సూర్య, కార్తిలతోనే తీశాడు. దీంతో ఈ సినిమాలో కూడా వాళ్లిద్దరిలో ఒకరు ఉండే అవకాశం ఉందని ఊహగాహనాలు వస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement