Bangarraju
-
కూటమిలో కుంపట్లు జనసేన, టీడీపీ నేతల మధ్య కుర్చీల కోసం పోరాటం..
-
'బంగార్రాజు' బ్యూటీ కిల్లింగ్ లుక్స్.. చూస్తే అంతే! (ఫొటోలు)
-
Sankranthi 2025: కర్చీఫ్ మడతపెట్టి...!
సంక్రాంతికి ‘కుర్చీని మడతపెటి...’ అంటూ ‘గుంటూరు కారం’లో మహేశ్‌బాబు చేసిన సందడి ఇంకా వినబడుతోంది. పండగ వెళ్లి మూడు నెలలు కూడా కాకముందే వచ్చే సంక్రాంతి కోసం కర్చీఫ్ మడతపెట్టి, పండగ బరిలో సీట్ రిజర్వ్ చేసుకున్నారు కొందరు స్టార్స్. అయితే సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రకటనలు రావడం, చివరి నిమిషంలో కొన్ని సినిమాలు తప్పుకోవడం మామూలే. ఇక 2025 సంక్రాంతి రేసులో ఇప్పటివరకూ షురూ అయిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. విశ్వంభర వస్తున్నాడు సంక్రాంతికి పండక్కి చాలా హిట్స్ సాధించారు చిరంజీవి. 2023లో ‘వాల్తేరు వీరయ్య’తో సంక్రాంతికి వచ్చి మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. మళ్లీ 2025లో ‘విశ్వంభర’ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. జనవరి 10న రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్‌లో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి కనిపిస్తారనీ టాక్. అలాగే ఈ చిత్రంలో చిరంజీవిది హనుమంతుడి భక్తుడి పాత్ర అట. భార్య.. మాజీ ప్రేయసి.. మధ్యలో మాజీ పోలీసాఫీసర్ ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేశ్ ‘సైంధవ్’ రిలీజైంది. వచ్చే సంక్రాంతికి కూడా రానున్నారు. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వెంకటేశ్. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఓ మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, అతని మాజీ ప్రేయసి.. ఇలా ఈ మూడు పాత్రల చుట్టూ సాగే క్రైమ్ కామెడీ మూవీ ఇది. ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ చిత్రాల నిర్మాత ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. 2017లో శర్వానంద్ హీరోగా నటించిన ‘శతమానం భవతి’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘శతమానం భవతి పేజీ 2’ ఉందని, 2025 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ‘దిల్’ రాజు ప్రకటించారు. ఇప్పుడు వెంకటేశ్–అనిల్ రావిపూడిల కాంబినేషన్లోని సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. మళ్లీ బంగార్రాజు వస్తాడా? ‘నా సామిరంగ’ అంటూ ఈ ఏడాది సంక్రాంతికి హిట్ సాధించారు నాగార్జున. ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో ‘సంక్రాంతికి కలుద్దాం’ అన్నారు నాగార్జున. సో.. 2025 సంక్రాంతికి కూడా నాగార్జున ఓ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారని ఊహించవచ్చు. 2016 సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్ని నాయనా’, 2022 సంక్రాంతికి ‘బంగార్రాజు’ (‘సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్) సినిమాలతో హిట్స్ అందుకున్నారు నాగార్జున. సో.. 2025 సంక్రాంతికి ‘బంగార్రాజు 3’ని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా? అనే ఆలోచనలో ఉన్నారట. మరి.. నాగార్జున ఏ సినిమాను రిలీజ్ చేస్తారు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. లక్మణ్ భేరి రెడీ రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి, చివరి నిమిషంలో ఇండస్ట్రీ మేలు కోసం అంటూ వాయిదా పడింది. ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజైంది. ఈసారి పక్కాగా సంక్రాంతికి రావాలనుకుంటున్నారు రవితేజ. అందుకే తన కెరీర్‌లోని 75వ చిత్రాన్ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రచయిత భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ సినిమాలో లక్మణ్ భేరి పాత్రలో కనిపిస్తారు రవితేజ. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుందని టాక్. మరోవైపు 2021 సంక్రాంతికి ‘క్రాక్’ సినిమాతో వచ్చి రవితేజ హిట్ సాధించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇంకా... ప్రభాస్ హీరోగా నటిస్తున్న‘రాజా సాబ్’ 2025 సంక్రాంతికి వచ్చే చాన్స్ ఉందని ఇటీవల పేర్కొన్నారు ఈ చిత్రనిర్మాత టీజీ విశ్వప్రసాద్. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్‌పై మరోసారి స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఈ ఏడాది సంక్రాంతికి తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్’ మంచి వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఇకపై ప్రతి సంక్రాంతికి ఓ సినిమా వస్తుందని పేర్కొన్నారు ప్రశాంత్ వర్మ. మరి.. వచ్చే సంక్రాంతికి ప్రశాంత్ నుంచి వచ్చే సినిమాపై ఇంకా ప్రకటన రాలేదు. ఇలా సంక్రాంతి బరిలో నిలిచే చిత్రాలు మరికొన్ని ఉన్నాయని తెలిసింది. సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో డబ్బింగ్ చిత్రాలు ఉంటుంటాయి. ఇలా అజిత్ హీరోగా నటించనున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సంక్రాంతి విడుదలకు ఖరారైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. అలాగే సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందనున్న సినిమా కూడా 2025 సంక్రాంతికి విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది. ఇంకా కన్నడ ఫిల్మ్ ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా రూపొందుతున్న ‘కాంతార: ది లెజెండ్ చాప్టర్ 1’ చిత్రం కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుందనే వార్త వచ్చిన సంగతి తెలిసిందే. -
నెటిజన్ నుంచి అలాంటి ప్రశ్న.. వడలు బాగా తింటానని షాకిచ్చిన హీరోయిన్
హీరోయిన్ ధక్ష నగర్కర్ హోరాహోరి,హుషారు,రావణాసుర, జాంబీ రెడ్డి వంటి సినిమాల్లో నటించినా ఈ అమ్మడికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ నాగా చైతన్య బంగార్రాజు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగచైతన్య-దక్ష మధ్య జరిగిన క్యూట్ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరూ సైగలతో మాట్లాడుకోవడంతో ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ అప్పట్లో వార్తలు పుట్టుకుచ్చాయి. అలా ఈ బ్యూటీ పాపులర్ అయింది. అమ్మాయిలందరి క్రష్ నాగ చైతన్య అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పి మరింత వైరల్ అయింది ఈ బ్యూటీ. దక్ష నాగర్కర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ తన అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. అప్పుడప్పుడు తన అభిమానులతో వీడియో కాల్ ద్వారా ముచ్చటిస్తుంది కూడా.. ఆ సమయంలో అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ అందరినీ ఫిదా చేస్తుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు దగ్గరైన దక్ష తాజాగా ఫ్యాన్స్‌తో తన ఇన్‌స్టాగ్రామ్‌లో క్వశ్చన్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. అందులో భాగంగా ఒక తుంటరి అభిమాని మీ 'థైస్'కు పెద్ద అభిమానిని అంటూనే.. ఆ సీక్రెట్ ఏంటో చెప్పాలని కోరుతాడు. దీంతో నెటిజన్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది ఈ బ్యూటీ. తానూ ఎప్పుడూ మసాలా వడలు తింటానని అందుకే తన 'థైస్' అలా ఉంటాయని ఆమె చెప్పుకొచ్చింది. అలాంటి ప్రశ్ననను కూడా ధక్ష సీరియస్‌గా తీసుకోకుండా ఎంతో స్పోర్టివ్‌గా తీసుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. 😹 pic.twitter.com/m3N4UeuYCY — Attipanduthatha (@attipanduthatha) February 5, 2024 View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) -
ఇయర్ రౌండప్ 2022: హిట్ బొమ్మలివే...
దాదాపు 275 (స్ట్రెయిట్, డబ్బింగ్) చిత్రాలు... 20 శాతం హిట్స్‌తో 2022 ముగియనుంది. గత ఏడాది కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్ పడింది. ఈ ఏడాది థియేటర్స్‌కి లాక్ పడలేదు. అయితే కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అనే సందేహం నడుమ సినిమాలు విడుదల అయ్యాయి. కానీ ప్రేక్షకులు సినిమా పట్ల తమకు ఉన్న ప్రేమను నిరూపించుకున్నారు. కానీ విజయాల శాతం మాత్రం ఇరవైకి అటూ ఇటూగానే ఉంది. కాగా స్ట్రెయిట్ చిత్రాలే కాదు.. అనువాద చిత్రాలూ మంచి వసూళ్లు రాబట్టాయి. భారీ అంచనాల నడుమ రిలీజైన కొన్ని చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. 2022 ‘హిట్ బొమ్మ’ (చిత్రాలు)లను చూద్దాం. బంగార్రాజుల సందడి వాసివాడి తస్సాదియ్యా... అంటూ సంక్రాంతికి పెద్ద బంగార్రాజు (నాగార్జున), చిన్న బంగార్రాజు (నాగచైతన్య) జనవరి 14న ఫెస్టివల్ ట్రీట్ ఇచ్చారు. కల్యాణŠ కృష్ణ దర్శకత్వంలో దాదాపు రూ. 25 కోట్ల బడ్జెట్‌తో నాగార్జున నిర్మించిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ నెల దాదాపు 17 చిత్రాలు వచ్చాయి. టిల్లుగాడు.. దంచి కొట్టాడు ఫిబ్రవరిలో ఇరవై చిత్రాలు విడుదలైతే విజయం శాతం రెండు అనే చెప్పాలి. దాదాపు రూ. 5 కోట్లతో రూపొంది, 30 కోట్ల వరకూ వసూళ్లను దంచి కొట్టాడు ‘డీజే టిల్లు’. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా విమల్‌కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇదే నిర్మాత దాదాపు రూ. 80 కోట్లతో పవన్ కల్యాణ్, రానా హీరోలుగా సాగర్ Mð.. చంద్ర దర్శకత్వంలో నిర్మించిన ‘భీమ్లా నాయక్’ 150 కోట్లకు పైగా రాబట్టింది. ఇంకా రవితేజ ‘కిలాడి’, మోహన్‌బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’తో పాటు మరికొన్ని చిత్రాలొచ్చాయి. ఆర్ఆర్ఆర్... రికార్డ్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న వచ్చింది. దాదాపు రూ. 550 కోట్లతో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా సుమారు 1150 కోట్ల వసూళ్ల రికార్డుని సాధించింది. ఇదే నెలలో ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’తో పాటు మరో పది చిత్రాల వరకూ రిలీజయ్యాయి. నిరాశతో ఆరంభమైన వేసవి ఏప్రిల్‌లో దాదాపు 15 సినిమాలు విడుదలైతే ప్రేక్షకుల మెప్పు పొందిన చిత్రాలు పెద్దగా లేవు. అలా వేసవి నిరాశతో ఆరంభమైంది. వరుణ్ తేజ్ ‘గని’, తండ్రీకొడుకులు చిరంజీవి– రామ్‌చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ చిత్రాలు భారీ అంచనాల మధ్య విడుదలయ్యాయి. సర్కారుకీ.. ఫన్‌కీ విజయం మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారువారి పాట’ మే 12న విడుదలైంది. దాదాపు రూ. 60 కోట్లతో మహేశ్‌బాబు, అనిల్ సుంకర, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం సుమారు 200 కోట్లు వసూ లు చేసింది. ఇక వినోద ప్రధానంగా వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన ‘ఎఫ్ 3’ మే 27న రిలీజైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దాదాపు రూ. 70 కోట్లతో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా సుమారు 130 కోట్లు రాబట్టింది. మేలో మరో 7 చిత్రాలు రిలీజయ్యాయి. ‘మేజర్’ హిట్‌తో.. ఒక్క ‘మేజర్’ హిట్‌తో జూన్ సరిపెట్టుకుంది. హీరో అడివి శేష్ టైటిల్ రోల్లో శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో మహేశ్‌బాబు ఓ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలైంది. దాదాపు రూ. 30 కోట్లతో రూపొంది, 65 కోట్ల వసూళ్లు రాబట్టింది. జూన్‌లో దాదాపు 20 చిత్రాలు రిలీజయ్యాయి. హిట్ లేని నెల జూలైలో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’, రామ్ ‘వారియర్’, రవితేజ ‘రామారావు: ఆన్ డ్యూటీ’... ఇలా దాదాపు 20 సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు హిట్ చేసిన సినిమాలు ఏవీ లేకుండా పోయాయి. . అదిరింది ఆగస్ట్ ఆగస్టులో వచ్చిన ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ 2’ బంపర్హిట్స్గా నిలిచాయి. కల్యాణ్‌రామ్ హీరోగా నటించగా, ‘బింబిసార’తో వశిష్ఠ దర్శకుడిగా పరిచయమయ్యారు. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో నందమూరి కల్యాణ్‌రామ్, కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం 70 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది. దాదాపు రూ. 30 కోట్లతో రూపొందిన పీరియాడికల్ ప్రేమకథా చిత్రం ‘సీతారామం’ 100 కోట్ల వసూళ్లకు చేరువలో నిలిచింది. దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా హను రాఘవపూడి దర్శకత్వంలో సి. అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక నిఖిల్ హీరోగా, చందు మొండేటి దర్శకత్వంలో దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్‌తో అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ‘కార్తికేయ 2’ 120 కోట్లు రాబట్టింది. ఒక్క హిందీ భాషలోనే ఈ చిత్రం సుమారు 50 కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం. ఇదే నెలలో విడుదలైన నితిన్ ‘మాచర్ల నియోజకగర్గం’, విజయ్ దేవరకొండ ‘లైగర్’ చిత్రాల వసూళ్లు తడబడ్డాయి. ఒకే ఒక్క విజయం... ఇక సెప్టెంబరులో విడుదలై ప్రేక్షకుల మనసు గెలుచుకున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో దాదాపు రూ. 15 కోట్ల బడ్జెట్‌తో ఎస్ఆర్. ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్‌బాబు నిర్మించిన ఈ చిత్రం 25 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందన్నది ట్రేడ్ వర్గాల మాట. ఇంకా ఈ నెలలో దాదాపు పాతిక చిత్రాలు రిలీజయ్యాయి. స్వాతిముత్యానికి విజయం అక్టోబర్ నెలలో వచ్చిన ‘స్వాతిముత్యం’ హిట్‌గా నిలిచింది. దాదాపు రూ. 8 కోట్లతో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా 25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బెల్లంకొండ గణేష్ హీరోగా, లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం అక్టోబరు 5న విడుదలైంది. ఇదే నెలలో రిలీజైన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ఫర్వాలేదనిపించింది. నాగార్జున ‘ది ఘోస్ట్’ కూడా ఇదే నెల వచ్చింది. ఇదే నెల 21న విడుదలైన మంచు విష్ణు ‘జిన్నా’, విశ్వక్సేన్ ‘ఓరి..దేవుడా..’ మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ లెక్కల్లో తడబడ్డాయి. చిన్న సినిమాకి పెద్ద విజయం సమంత టైటిల్ రోల్ చేసిన ‘యశోద’ నవంబరు 11న విడుదలైంది. హరి–హరీష్ దర్శకత్వంలో దాదాపు రూ. 30 కోట్ల బడ్జెట్‌తో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా 35 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక చిన్న సినిమా ‘మసూద’ రూ. 10 కోట్ల బడ్జెట్లోపు రూపొంది, 20 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సంగీత, తిరువీర్ ముఖ్య తారలుగా సాయికిరణ్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబరులో విడుదలైన దాదాపు 20 సినిమాల్లో అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో..’, అల్లరి నరేశ్ చేసిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీ కం’లకు ప్రేక్షకులు పాస్ మార్కులు వేశారు. ‘హిట్’కి హిట్ జూన్‌లో ‘మేజర్’ హిట్ అందుకున్న అడివి శేష్‌కు డిసెంబరులో ‘హిట్ 2’ రూపంలో మరో హిట్ లభించింది. శైలేష్ కొలను దర్శకత్వంలో దాదాపు రూ. 12 కోట్లతో నాని నిర్మించిన ఈ చిత్రం 30 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ‘రామారావు: ఆన్ డ్యూటీ’, ‘ఖిలాడి’ చిత్రాల తర్వాత ఈ ఏడాది రవితేజ హీరోగా నటించిన ‘ధమాకా’ ఈ నెల 23న విడుదలైంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. అలాగే ‘కార్తికేయ 2’తో హిట్ అందుకున్న నిఖిల్ హీరోగా నటించిన మరో చిత్రం ‘18 పేజెస్’ డిసెంబరు 23నే విడుదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం వసూళ్ల లెక్క రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఇంకా నెలాఖరున ఆది సాయికుమార్ ‘టాప్ గేర్’తో పాటు మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అనువాదం అదిరింది ఈ ఏడాది డబ్బింగ్ చిత్రాల జోరు కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన ఆ చిత్రాల విశేషాల్లోకి వెళితే... వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి ముఖ్య తారలుగా సుమారు రూ. 20 కోట్లతో రూపొందిన ‘ది కశ్మీరీ ఫైల్స్’ అన్ని భాషల్లో దాదాపు 350 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిందని టాక్. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘కేజీఎఫ్ 2’ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1000 కోట్లు సాధించిందని టాక్. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సీనియర్ నటుడు కమల్‌హాసన్ నటించిన ‘విక్రమ్’ సుమారు 100 కోట్లతో రూపొంది, దాదాపు 450 కోట్లు వసూలు చేసిందని భోగట్టా. అలాగే కె. కిరణ్ రాజ్ దర్శకత్వంలో రూ. 20 కోట్లతో రూపొంది, 100 కోట్లకుౖ పెగా వసూళ్లు సాధించింది ‘777 చార్లి’. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’ రూ. 16 కోట్లతో రూపొంది, 450 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇవన్నీ ప్రపంచవ్యాప్త లెక్కలు కాగా తెలుగులో లాభాలిచ్చిన చిత్రాలుగా నిలిచాయి. (వసూళ్ల వివరాలన్నీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం) -
ఐటెం సాంగ్ చేయడానికి కారణం ఏంటంటే..?
-
Tollywood 2022: ఫస్టాఫ్‌లో అదరగొట్టిన, అట్టర్ ఫ్లాప్ అయిన చిత్రాలివే!
2022లో అప్పుడే ఫస్టాఫ్ పూర్తయింది. సినిమాటిక్ లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే ఇంటర్వెల్ కార్ట్ పడింది. మరి ఇప్పటి వరకు వచ్చిన సినిమలెన్ని? వాటిల్లో హిట్ అయినవి ఎన్ని? బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డవి ఎన్నో గత రెండేళ్లు కరోనా రీజన్‌తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ట్రబుల్స్ ఫేస్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో కూడా థర్డ్ వేవ్ రీజన్ తో మూవీస్ పోస్ట్ పోన్ అయ్యాయి.ఈ సిచ్యువేషన్ లో కూడా ధైర్యంగా థియేటర్స్ లోకి అడుగు పెట్టాడు ‘బంగ్రారాజు’. అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ఈ చిత్రం టాలీవుడ్ కు ఫస్ట్ హిట్ అందించింది. ఫిబ్రవరి రెండో వారానికి థర్డ్ వేవ్ కాస్త కంట్రోల్ కావడంతో కాస్త ధైర్యంగా పూర్తిస్థాయిలో ఇండియా వైడ్ గా సినిమా స్క్రీన్స్ తెరుచుకున్నాయి. ‘డీజే టీల్లు’ పెట్టిన డీజేతో ఫిబ్రవరి మొత్తం మార్మోగింది. ఆ తర్వాత నుంచి వరుస పెట్టి తెలుగు సినీ పరిశ్రమ భారీ చిత్రాలను విడుదల చేస్తూ వెళ్లింది. మార్చిలో వచ్చిన రెండు పాన్ ఇండియా చిత్రాల్లో రాధేశ్యామ్ పూర్తిగా నిరాశపరచగా, ఆర్ ఆర్ ఆర్ మాత్రం ఎన్నో రికార్డులు తిరగరాసింది.టాలీవుడ్ సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఏప్రిల్‌లో టాలీవుడ్ కు హిట్ లేదు.మిషన్ ఇంపాజిబుల్ , గని, ఆచార్య ఇండస్ట్రీని దారుణంగా డిజప్పాయింట్ చేసాయి. మేలో సర్కారు వారి పాటతో సూపర్ స్టార్ జోరు చూపించాడు. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ 3(ఎఫ్3) కూడా బాగానే ఎంటర్ టైన్ చేసింది. జూన్‌లో వచ్చిన ‘మేజర్’ పాన్ ఇండియా లెవల్లో ఇంప్రెస్ చేశాడు. అదే నెలలో వచ్చిన అంటే సుందరానికి, విరాటపర్వం చిత్రాలు మంచి రివ్యూస్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ రాబట్టలేకపోయాయి. ఇక బాలీవుడ్ సిసిచ్యువేషన్ మాత్రం చాలా బ్యాడ్ గా ఉంది. మొత్తంగా 25 చిత్రాలు విడుదలైతే అందులో గంగూబాయి, కశ్మీర్ పైల్స్, భూల్ భులయ్యా 2 మాత్రమే విజయాన్ని అందుకున్నాయి. మిగితావన్ని డిజాస్టర్స్ లిస్ట్ లోకి వెళ్లిపోయాయి. -
వాసివాడి తస్సాదియ్యా... 'బంగార్రాజు' జోరు అదిరిందయ్యా!
Nagarjuna-Naga Chaitanya: కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `బంగార్రాజు`. 'సోగ్గాడు మళ్ళీ వచ్చాడు' అనేది ఉపశీర్షిక. కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్టర్. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించాడు. సంక్రాంతికి థియేటర్లలో విడుదలై సూపర్ హిట్టయిన ఈ మూవీ ఫిబ్రవరి 18 నుంచి ''జీ 5' లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. జీ5 లో ప్రసారమవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ విడుదలైన 7 రోజుల్లోనే 500 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో సక్సెస్ ఫుల్‌గా దూసుకుతోంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. 'కోవిడ్ టైంలో ఈ సినిమా రిలీజ్ చేస్తే ఇబ్బంది పడతారని నా శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు. అయితే మా "సోగ్గాడే చిన్నినాయన" సినిమాను గతంలో కూడా సంక్రాంతికి రిలీజ్ చేశాం. ఆ సెంటిమెంట్‌తో కోవిడ్ ఉన్నా కూడా మేము ఎంతో ధైర్యం చేసి సంక్రాంతికి మా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాం. మేము ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్‌తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత జీ5లో రిలీజ్ చేయగా.. అక్కడ స్ట్రీమింగ్ మొదలైన కేవలం 7 రోజుల్లోనే 500 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ అవ్వడం ఓటీటీ ప్లాట్ఫామ్లోనే సరికొత్త రికార్డ్. ఈ సందర్భంగా బంగార్రాజును ఆదరించిన, ఆదరిస్తున్న, ఆదరించబోతున్న ప్రేక్షకులందరికీ మా టీం తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం' అన్నాడు. -
ఇప్పుడు ఓటీటీలో బంగార్రాజు.. ఎప్పటి నుంచంటే
అక్కినేని హీరోలు నాగార్జున-నాగ చైతన్యలు నటించిన తాజా చిత్రం 'బంగార్రాజు'. ఇటీవల సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. . కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ నుంచి కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన బంగార్రాజు ప్రపంచవ్యాప్తంగా రూ. 38.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటికే థియేటర్ రన్ పూర్తిచేసుకున్న‘బంగార్రాజు’చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఈరోజు(శుక్రవారం)నుంచి స్ట్రీమింగ్ కానుంది. జీ-అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతిశెట్టి నటించిన సంగతి తెలిసిందే. #Bangarraju will be streaming from 18th Feb exclusively on @ZEE5Telugu. Watch new #ZEE5 trailer ▶️ https://t.co/MWocTlWr0e#BangarrajuOnZEE5 #BangarrajuFromFeb18th#VaasivaadiTassadiyya pic.twitter.com/KDELs4kZeb — chaitanya akkineni (@chay_akkineni) February 17, 2022 -
ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్న ‘బంగార్రాజు’!, ఎక్కడంటే..
అక్కినేని హీరోలు నాగార్జున-నాగ చైతన్యలు నటించిన తాజా చిత్రం బంగార్రాజు. ఇటీవల సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం మంచి విజయం సాధించింది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ నుంచి కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ విడుదలైన 25 రోజులను పూర్తిచేసుకుంది. దీంతో మరోసారి డిజిటల్ రిలీజ్‌కు బంగార్రాజు సిద్దమువుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే కొత్త చిత్రాలివే.. ఈ నెల14వ లేదా 18వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. కాగా జీ-అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించడంతో జీ5లోనే బంగర్రాజును మూవీని విడుదల చేయాలనుకుంటున్నారట మేకర్స్. ఈ మూవీ విడుదలైన 30 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని ఇది వరకే చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే త్వరలోనే బంగార్రాజును ఓటీటీలో విడుదల చేసేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. చదవండి: 2022 ఆగస్ట్ 7వ తేదీ ఉదయం 7గంటలకు బిడ్డకు జన్మనిస్తా: సామ్ కామెంట్స్ వైరల్ -
అక్కడ హీరోని, తెలుగులో విలన్‌గా చేస్తున్నా
‘‘హీరో, విలన్, కామెడీ.. ఎలాంటి పాత్రైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. విభిన్న పాత్రలు పోషిస్తూ మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా ఆశ’’ అన్నారు గోవింద్ పద్మసూర్య. మలయాళ చిత్రం ‘అడియాలంగళ్’లో హీరోగా నటించిన గోవింద్ తెలుగులో అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో..’, ఇటీవల నాగార్జున ‘బంగార్రాజు’లో విలన్ పాత్రలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం విలేకర్ల సమావేశంలో గోవింద్ మాట్లాడుతూ – ‘‘మాది కేరళ. హీరోగా నా తొలి సినిమా ‘అడియాలంగళ్’కే బెస్ట్ యాక్టర్‌తో పాటు ఐదు స్టేట్ అవార్డ్స్ వచ్చాయి. ఆ తర్వాత మమ్ముట్టి, సురేష్ గోపీగార్లతో కూడా కలిసి నటించాను. తమిళంలో ‘కీ’ సినిమాలో నేను చేసిన విలన్ పాత్ర చూసి ‘అల.. వైకుంఠపురములో..’కి నన్ను త్రివిక్రమ్‌గారు తీసుకున్నారు. ‘బంగార్రాజు’లో ఆది పాత్ర పోషించాను. నాగార్జునగారి వంటి గొప్ప నటుడితో నటించడం అంటే ఓ పాఠం వంటిది. నాగచైతన్య నాకు మంచి మిత్రుడైపోయాడు. ఈ చిత్రదర్శకుడు కల్యాణ్ కృష్ణగారి వల్లే ఆది పాత్రను బాగా చేయగలిగాను. ప్రస్తుతం హీరో నాని సోదరి దీప్తి దర్శకత్వం వహిస్తున్న వెబ్ ఆంథాలజీ ‘మీట్‌క్యూట్’లో ఓ కీలక పాత్ర, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో పోలీసాఫీసర్‌గా చేస్తున్నాను’’ అన్నారు. -
స్టేజ్‌పై హీరోయిన్‌తో చై చిలిపి నవ్వులు.. వీడియో వైరల్
ఇటీవలి కాలంలో హీరో నాగ చైతన్య పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. సమంతతో విడాకుల అనంతరం సినిమాల పరంగా యమ స్పీడుతో దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆయన నటించిన బంగార్రాజు చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. అయితే సినిమాల కంటే కూడా వైరల్ వీడియోలతోనే చై పేరు ఈ మధ్యకాలంలో తెగ ట్రెండింగ్‌లో నిలుస్తుంది. ఇంతకుముందు బంగార్రాజు ప్రమోషన్స్‌లో హీరోయిన్ దక్ష కొంటె చూపులకు చైతూ సిగ్గుపడిపోయిన వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా రాజమండ్రిలో నిర్వహించిన బంగార్రాజు సక్సెస్ మీట్లో నాగార్జున స్టేజ్‌పై మాట్లాడుతుండగానే కృతిశెట్టితో చై మాటలు కలిపాడు. ఈ నేపథ్యంలో ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ చిలిపిగా నవ్వుకోవడం ప్రేక్షకుల కంట పడింది. ఇంకేముందు ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి తెగ వైరల్ చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ☺️ pic.twitter.com/X7IvaHS7bx — ₳ ₭ 🦋 (@itsmeGAK) January 18, 2022 -
రాజమహేంద్రవరంలో ‘బంగార్రాజు’ సక్సెస్ మీట్
-
సీఎం జగన్‌కు నాగ్ కృతజ్ఞతలు
-
జగన్‌తో ‘చిరు’ భేటీ తెలుగు సినిమాకు మేలు
రాజమహేంద్రవరం రూరల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి ఏం మాట్లాడారని చిరంజీవిని అడగ్గా.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి జరుగుతుందని తెలిపారని అక్కినేని నాగార్జున చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం జరిగిన బంగార్రాజు సినిమా బ్లాక్‌బస్టర్ మీట్లో నాగార్జున మాట్లాడుతూ.. కోవిడ్ నేపథ్యంలో నార్త్ ఇండియాలో సినిమాలను ఆపేస్తే కేవలం తెలుగు ప్రేక్షకుల మీద నమ్మకంతోనే బంగార్రాజు సినిమాను రిలీజ్ చేసినట్లు చెప్పారు. కోవిడ్ ఆంక్షలను వాయిదా వేసిన సీఎం జగన్మోహన్రెడ్డికి థాంక్యూ వెరీమచ్ అన్నారు. బంగార్రాజు అచ్చమైన పంచెకట్టు తెలుగు సినిమా అని చెప్పారు. హీరో నాగచైతన్య మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు తన తండ్రి మంచి హిట్ ఇచ్చారన్నారు. దర్శకుడు కళ్యాణకృష్ణ మాట్లాడుతూ బంగార్రాజు ప్రీరిలీజ్ ఈవెంట్‌ను రాజమహేంద్రవరంలో చేయాల్సి ఉందని, కానీ బ్లాక్‌బస్టర్ మీట్ ఏర్పాటు చేశామని చెప్పారు. హీరోయిన్ కృతిశెట్టి మాట్లాడుతూ సర్పంచ్ నాగలక్ష్మి పాత్ర బాగా నచ్చిందా అని అభిమానుల్ని అడిగారు. నటుడు ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈ నెల 11వ తేదీ నుంచి అమలు చేయాల్సిన కోవిడ్ ఆంక్షలను సంక్రాంతి పండుగ సందర్భంగా 18వ తేదీ నుంచి అమలు చేయడం వల్ల బంగార్రాజు సూపర్‌హిట్ అయిందన్నారు. వ్యవసాయ శాఖమంత్రి కె.కన్నబాబు మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతికి అసలైన్ కలర్‌ను బంగార్రాజు చిత్రం ద్వారా తీసుకువచ్చారన్నారు. ఎంపీ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ తాను నాగార్జున స్టైల్స్ ఫాలో అయ్యేవాడినని చెప్పారు. -
చిన్న ‘బంగార్రాజు’ సరికొత్త రికార్డు
తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలను వదిలేస్తే.. వాళ్ళ తర్వాత మిడ్ రేంజ్ హీరోలున్నారు. అంటే వాళ్లతో మీడియం బడ్జెట్ సినిమాలు హాయిగా చేసుకోవచ్చు అన్నమాట. వారిలో రవితేజ, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, నాని, రామ్ లాంటి హీరోలుంటారు. వాళ్ల సినిమాలు హిట్టైతే 50 కోట్ల షేర్ వచ్చే అవకాశం ఉంటుంది.అయితే వీళ్ల సినిమాలు ఎప్పుడూ మినిమమ్ 30 నుంచి 40 కోట్ల షేర్ మధ్య వసూలు చేస్తుంటాయి. నాగ చైతన్యకు కూడా 30 కోట్ల మార్కెట్ ఉంది. హిట్ అయితే కచ్చితంగా 30 కోట్లు వసూలు చేయడం ఖాయం. అయితే ప్రస్తుతం చైతన్య సరికొత్త రికార్డు సృష్టించాడు. మీడియం రేంజ్ హీరోలలో వరసగా నాలుగు 50 కోట్ల గ్రాస్ అందుకున్న సినిమాలున్న హీరోగా నిలిచాడు. మీడియం రేంజ్ హీరోలలో ఈ రికార్డు ఎవరికీ సాధ్యం కాలేదనే చెప్పాలి. చైతన్య నటించిన గత నాలుగు చిత్రాలు మంచి విజయాలు సాధించడం తెలిసిందే. అందులో రెండు మల్టీస్టారర్స్ (వెంకీ మామ, బంగార్రాజు) కాగా రెండు సోలో విజయాలు. వాటిలో సమంతతో కలిసి నటించిన మజిలీ సినిమా 40 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆ సినిమా 70 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసి నాగ చైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ సోలో హిట్‌గా నిలిచింది. అలాగే వెంకటేష్‌తో కలిసి నటించిన వెంకీ మామ కూడా 58 కోట్ల చేసింది. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరితో 60 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించాడు. సంక్రాంతికి రిలీజైన బంగార్రాజులో తన తండ్రి నాగార్జునతో పాటు నటించి చిన బంగార్రాజుగా అదరగొట్టాడు నాగ చైతన్య. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇలా మీడియం రేంజ్ హీరోలలో వరసగా నాలుగు సార్లు 50 కోట్లు గ్రాస్ అందుకున్న సినిమాలు ఒక్క నాగ చైతన్య కెరీర్లో మాత్రమే ఉన్నాయి. -
చై-దక్షల వీడియోపై షాకింగ్ కామెంట్స్, చై బంగారం, ఇదంతా హీరోయిన్ వల్లే..
నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్లుగా నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’ ఈవెంట్లో నాగచైతన్య, నటి దక్ష వీడయో నెట్టింట చర్చనీయాంశమైంది. స్టేజ్‌పై నాగార్జున మాట్లాడుతుంటే చై, హీరోయిన్ దక్ష వైపు చూడగా.. ఆమె కొట్టెగా కనుబొమ్మలు ఎగిరేయడంతో చై సిగ్గుపడిపోయాడు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తూ వైరల్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. బంగార్రాజు మూవీ విడుదలై మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో మూవీ సెక్సెస్ మీట్లో దర్శకడు కల్యాణ్ కృష్ణ ఈ వీడియోపై స్పందించాడు. చదవండి: ఆహాతో నాకు సంబంధం లేదు, గమనించగలరు: అల్లు శిరీష్ ట్వీట్ వైరల్ సెట్లో నాగచైతన్య ఎలా ఉండేవాడు, స్వభావం గురించి వివరిస్తూ ఈ వైరల్ వీడియోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదంతా దక్ష వల్లనే జరిగిందంటూ నటివైపు చూస్తూ అన్నాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. ‘బెసిగ్గా నాగచైతన్య చాలా సిగ్గు, మోహమటస్తుడు. అతడికి ఎంతటి సిగ్గు అంటే దానికి ఉదహరణ ఇటీవల వైరల్ అయిన వీడియోను ఉదాహరణ. నాగ్ సార్ మాట్లాడుతుంటే ఏదో సౌండ్ వినిపంచడంతో వెనక్కి తిరిగాడు. దీంతో దక్ష అతడి చూసి కళ్లు ఎగిరేసింది. దానికే చై సిగ్గుపడ్డాడు. ఆయన స్వభావమే అంతా. దేనికైన సిగ్గు పడతాడు. ఇదంతా దక్ష వల్లే జరిగింది. చైతన్యది ఏం లేదు, అంతా నువ్వే చేశావు’ అంటూ హీరోయిన్ వైపు చూస్తూ అన్నాడు. చదవండి: జూనియర్ ఎన్టీఆర్ సరసన చాన్స్ కొట్టేసిన రష్మిక! ఇలా చై, దక్షల వైరల్ వీడియోపై దర్శకడు కల్యాణ్ కృష్ణ క్లారిటీ ఇచ్చాడు. అలాగే ఈ సందర్భంగ కల్యాణ్ కృష్ణ, నాగ చైతన్యపై ప్రశంసలు కురిపించాడు. ‘చై బంగారం. చైతూని అందరూ బంగారం ఎందుకు అని అంటారో ఆయనతో పని చేశాక తెలుస్తుంది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను చేశాను. ఇప్పుడు బంగార్రాజు చేశాను. 24 కారెట్స్ కాస్త 48 కారెట్స్ అయింది. ఈ నాలుగేళ్లలో అతనిలో చాలా మార్పులు వచ్చాయి. మాట్లాడే పద్దతి, నటన, మెచ్యూరిటీలో మార్పులు వచ్చాయి. చైలో ఉన్న క్లారిటీ మనకు పది శాతం ఉంటే.. హ్యాపీగా బతికేయోచ్చు. ఈ సినిమా వల్ల ప్రతీ రోజు సెట్లో కలిశాం. చై సైలెంట్ అని అనిపిస్తుంది. కానీ అంత సైలెంట్ కాదు. ఓపెన్ అప్ ఎంజాయ్ చేస్తే నవ్వు ఎంతో ప్లెజెంట్‌గా ఉంటుంది. ఇంత వరకు రాముడి పాత్రలు చేస్తే ఇప్పుడు చేసింది కృష్ణుడు కారెక్టర్. • Men Will Be Men 😜#NagaChaitanya || #Bangarraju #BangarrajuOnJan14th pic.twitter.com/J6xaQf9GZT — ChayAkkineni ™ 🏹 (@massChayCults) January 10, 2022 చదవండి: నా జిమ్ ట్రైనర్ టార్చర్ చేస్తుంటాడు, నేను ఆ చాన్స్ మిస్సయ్యా: రష్మిక -
‘బంగార్రాజు’ మూవీ డైరెక్టర్‌కు తమిళ నిర్మాత భారీ ఆఫర్
ఈ ఏడాది ఆరంభంలోనే ‘బంగార్రాజు’ మూవీతో భారీ హిట్ కొట్టాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'బంగార్రాజు' మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో పాటు సంక్రాంతి పండగ వాతావరణాన్ని ప్రతిబింబించే సినిమా కావడంతో ‘బంగార్రాజు’ పక్కా పండగ సినిమా అనిపించింది. చదవండి: ఐదేళ్ల తర్వాత మళ్లీ బుల్లి తెరపైకి హాట్ బ్యూటీ.. న్యాయ నిర్ణేతగా అందుకే సంక్రాంతి సెలబ్రెషన్స్‌ను రెట్టింపు చేసుకునేందుకు ప్రేక్షకులంతా సినిమా చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. చాలాకాలం తర్వాత నాగార్జున ఈ మూవీతో భారీ హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి మంచి సినిమాను అందించిన డైరెక్టర్ సి కల్యాణ్ కృష్ణ నెక్స్ట్ మూవీ ఎవరితో, ఏ బ్యానర్లో ఉండనుందనేది ఆసక్తికగా మారింది. ఈ క్రమంలో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై అప్డేట్ బయటకు వచ్చంది. చదవండి: నా బెస్ట్ ఆన్‌స్క్రీన్ పెయిర్ సమంతనే: నాగ చైతన్య ఆయన నెక్ట్ సినిమా తమిళ అగ్ర నిర్మాతతో ఉండనుందని ఖరారైంది. కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజాతో కల్యాణ్ కృష్ణ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాలో కథానాయకుడు ఎవరు? ఎప్పుడు ఈ ప్రాజెక్టు మొదలవుతుంది? అనేది త్వరలోనే వెల్లడించనున్నారు. అయితే జ్ఞానవేల్ రాజా తన స్టూడియో గ్రీన్ బ్యానర్లో ఎక్కువగా హీరో సూర్య, కార్తిలతోనే తీశాడు. దీంతో ఈ సినిమాలో కూడా వాళ్లిద్దరిలో ఒకరు ఉండే అవకాశం ఉందని ఊహగాహనాలు వస్తున్నాయి. Happy to Announce, we have collaborated with Telugu Sankranti BLOCK BUSTER #Bangarraju Director @kalyankrishna_k for his next Big venture👍💐💐👍 Other details Soon..@kegvraja #Sankranti #Bangarraju #BlockbusterBangarraju pic.twitter.com/Q45kO6Prm4 — Studio Green (@StudioGreen2) January 16, 2022 -
బాక్సాఫీస్‌పై ‘బంగార్రాజు’ దండయాత్ర.. రెండు రోజుల్లోనే అన్ని కోట్లా?
అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటించిన తాజా చిత్రం బంగార్రాజు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజు రికార్డు వసూళ్లు సాధించిన బంగార్రాజు.. రెండో రోజు కూడా అదే దూకుడు చూపించింది. కోవిడ్ నిబంధనలు అదిగమించి.. రెండు రోజుల్లో రూ.36 కోట్లు వసూళ్లు చేసి మరోసారి బాక్సాఫీస్‌పై అక్కినేని ఫ్యామిలీ సత్తా చూపించారు. రూ.40 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగార్రాజు.. రెండో రోజు నైజాంలో రూ.4.47 కోట్లు, సీడెడ్ రూ. 3.46 కోట్లు, ఉత్తరాంద్రలో రూ.2.20 కోట్లు, ఈస్ట్: 1.75 కోట్లు, గుంటూరు: 1.78 కోట్లు, కృష్ణా: 0.96 కోట్లు, నెల్లూరు: 0.85 కోట్లు రాబట్టింది. మొత్తంగా రెండు రోజుల్లో రూ. 36 కోట్లు వసూళ్లు చేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్ని కూడా విడుదల చేసింది. సంక్రాంతికి విడుదలైన ఏకైక పెద్ద సినిమా, అలాగే గ్రామీణ నేపథ్యానికి సంబంధించిన స్టోరీ కావడం ‘బంగర్రాజు’కు బాగా కలిసొచ్చింది. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగచైతన్య సరసన కృతిశెట్టి నటించారు. (చదవండి: బంగార్రాజు మూవీ రివ్యూ) -
బంగార్రాజు సక్సెస్ మీట్.. నానమ్మ, తాతలు గుర్తుకు వచ్చేలా
Bangarraju Movie Success Meet At Annapurna Studios In Hyderabad: బంగార్రాజు సినిమా చూశాక అమల ఇంటికి రాగానే అమె అత్త, మామ గారి ఫొటోలకు దండం పెట్టుకుని ఏడ్చేసిందని కింగ్ నాగార్జున తెలిపారు. అక్కినేని తండ్రి కొడుకులు నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన తాజా చిత్రం 'బంగార్రాజు'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై మంచి విజయంతో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా శనివారం (జనవరి 15)న బంగార్రాజు చిత్రబృందం అన్నపూర్ణ స్టూడియోలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో నాగార్జున, నాగ చైతన్య, కల్యాణ్ కృష్ణ, అనూప్ రూబెన్స్, మలయాళ నటుడు సూర్య, టెక్నికల్ డిపార్ట్మెంట్ జునైద్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతికి బంగార్రాజు సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. 'జనవరి 14 అనేది మాకు చాలా ప్రత్యేకమైన రోజు. అన్నపూర్ణ స్టూడియోస్ పుట్టినరోజు. ప్రతి సంక్రాంతికి సినిమా విడుదల చేయాలని నాన్నాగారు అంటుండేవారు. అలాగే ప్రయత్నిస్తున్నాం. బంగార్రాజుకు ఆంధ్ర, తెలంగాణ, ఓవర్సీస్ నుంచి కలిపి ఒక్క రోజులోనే రూ. 17.5 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ సినిమా చూశాకా పెద్ద బంగార్రాజు పాత్ర ఎక్కువగా ఉందని అంటున్నారు. అది పాత్రపరంగా డైరెక్టర్ డిజైన్ చేసిందే. సినిమా చూశాక అమల ఇంటికి రాగానే ఆమె అత్త, మామ గారి ఫొటోలకు దండం పెట్టుకుని ఏడ్చేసింది. అవి ఆనందంతో కూడిన కన్నీళ్లు. వారు మనల్ని చూసుకుంటున్నారు కదా అని చెప్పింది. వారు మా వెనక ఉన్నారనే ఫీలింగ్‌ను వ్యక్తం చేసింది. ఇదే అభిప్రాయాన్ని చాలామంది వారి అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు, నాన్నలను గుర్తుచేసుకున్నామని చెప్పారు. ఈ సినిమాకు మరో సీక్వెల్‌ను ఇప్పుడే ప్లాన్ చేయలేం.' అని నాగార్జున వెల్లడించారు. నాగ చైతన్య మాట్లాడుతూ బంగార్రాజు సినిమాలో చేయడం నాకు సవాల్‌గా అనిపించింది. గ్రామీణ నేపథ్యం, ఎనర్జిటిక్ పాత్ర ఇంతవరకూ చేయలేదు. ఇందుకు డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ చాలా సపోర్ట్ చేశాడు. ఆయనకు ఆడియెన్స్ పల్స్ బాగా తెలుసు. కథ విన్నాక ఆయన చెప్పినట్లు చేయడమే. షూటింగ్లో నాన్నగారు నన్ను డామినేట్ చేశారనే ఫీలింగ్ ఒకసారి కలిగింది. అది ప్రేరణగా తీసుకుని ముందుకు సాగాను. అని పేర్కొన్నాడు. 'పండుగ సందర్భంగా రాత్రిపూట కర్ఫ్యూ ఎత్తివేయడం మాకు బగా కలిసివచ్చింది. నాగార్జునతోపాటు టెక్నీషియన్స్ అందరూ బాగా కష్టపడి పనిచేశారు. సంగీతం దర్శకుడు అనూప్ రూబెన్స్ పాటలకు తగిన ట్యూన్స్ ఇచ్చి ఆడియోకు మరింత క్రేజ్ వచ్చేలా చేశాడు.' అని డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ తెలిపారు. కథ ప్రకారం వీఎఫ్ఎక్స్ చేశానన్నారు జునైద్. కథకు కావాల్సిన అన్ని అంశాలను డైరెక్టర్‌తో చర్చించి చేయడం వల్లే గ్రాఫిక్ విజువల్స్‌కు మంచి పేరు వచ్చిందన్నారు. ఇదీ చదవండి: బంగార్రాజు మూవీ ఎలా ఉందంటే.. -
నా బెస్ట్ ఆన్‌స్క్రీన్ పెయిర్ సమంతనే: నాగ చైతన్య
అక్కినేని నాగచైతన్య తన మాజీ భార్య, స్టార్ హీరోయిన్ సమంతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతేడాది అక్టోబర్ 2న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కామ్‌గా ఉన్న చై ఇటీవల తొలిసారిగా వారి విడాకులపై స్పందించాడు. నాగచైతన్య తాజా చిత్రం బంగార్రాజు మూవీ ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో చై తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయామని, ఇది ఇద్దరి సంతోషం కోసం తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశాడు. చదవండి: బ్రేకప్ చెప్పుకున్న లవ్‌బర్డ్స్!, క్లారిటీ ఇచ్చిన హీరో ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన మరో ఇంటర్య్వూలో చై, సమంత గురించి మరోసారి ప్రస్తావించాడు. తన బెస్ట్ ఆన్‌స్క్రీన్ పెయిర్, కెమిస్ట్రీ సమంతతోనే అంటూ ఆసక్తిగా స్పందించాడు. కాగా ఇంటర్య్వూలో యాంకర్ నాగ చైతన్యతో మీరు నటించిన హీరోయిన్స్‌లలో బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎవరితో కుదిరిందని ప్రశ్నించింది. దీనికి వెంటనే చై.. ‘బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంటే సమంతతోనే కుదిరింది’ అంటూ తడుముకోకుండా సమాధానం చెప్పాడు. దీంతో చై కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి. కాగా నాగచైతన్య-సమంత తొలిసారిగా ‘ఏం మాయ చేసావే’ సినిమాతో కలుసుకున్నారు. ఈ సినిమా సమయంలో వారిద్దరి కెమిస్ట్రీ చాలా బాగా కుదరిందని టాక్ కూడా వచ్చింది. చదవండి: తొలి రోజు ‘బంగార్రాజు’ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ‘ఆటోనగర్ సూర్య’, ‘మజిలి’, ‘మనం’ చిత్రాల్లో జంటగా నటించారు. కాగా చై సమంత విడిపోయిన తర్వాత సామ్ చాలా సార్లు విడాకుల గురించి ఇండైరెక్ట్ గా స్పందింస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. కానీ నాగ చైతన్య మాత్రం విడాకుల తర్వాత ఒక్కసారి కూడా ఈ విషయంపై మాట్లాడలేదు. వరుస సినిమాలతో తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. సంక్రాంతి కానుకగా నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చైతన్య తొలిసారి సమంత గురించి ప్రస్తావించడం ఆసక్తి సంతరించుకుంది. కాగా నాగచైతన్య-సమంత 2017 అక్టోబర్ 6న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. -
తొలి రోజు ‘బంగార్రాజు’ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..
గత సంక్రాంతి బరిలో ‘సోగ్గాడే చిన్నినాయనా' సినిమాను దింపేసి అత్యధిక వసూళ్లను రాబట్టాడు కింగ్ నాగార్జున. ఈ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘బంగార్రాజు’ చిత్రం కూడా ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. అనుకున్నట్టుగానే నిన్న(జనవరి 14) ఈ సినిమాను థియేటర్తోకి తీసుకు వచ్చింది చిత్ర బృందం. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో పాటు సంక్రాంతి పండగ వాతావరణాన్ని ప్రతిబింబించే సినిమా కావడం వలన 'బంగార్రాజు'కి అన్ని ప్రాంతాల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. చదవండి: బాలయ్య మూవీ ఆఫర్ వదులకున్న నటి రాశి, ఆ సీన్‌పై అభ్యంతరంతోనేనట.. ఈ క్రమంలో తొలి రోజే బంగార్రాజు అన్ని ప్రాంతాలతో పాటు నైజాం, సీడెడ్‌లో మంచి కలెక్షన్స్ రాబ్టటినట్టు ట్రెడ్ వర్గాల చెబుతున్నాయి. నైజామ్‌లో తొలి రోజున 3.1 కోట్ల గ్రాస్‌ను.. 1.73 కోట్ల షేర్‌ను రాబట్టినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా కాలం, 60 శాతం సీట్ల ఆక్యూపెన్సీ పరిస్థితుల్లో ఇవి బంగార్రాజుకు మంచి ఓపెనింగ్స్ అనే అంటున్నారు సినీ వెశ్లేషకులు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 1200 స్క్రీన్లలో విడుదలైన ఈ మూవీ తొలి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంంది. చదవండి: ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్ప్రైజ్.. సంక్రాంతి కానుకగా తొలి రోజున ఓవర్సీస్లో ఈ సినిమాకి మోస్తారు వసూళ్లు కనిపించాయి. ప్రీమియర్ల ద్వారా 40 వేల డాలర్లు వసూలు చేయగా, తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల రూపాయలు కొల్లగోట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మున్ముందు కూడా కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే రిలీజ్‌కు ముందే బంగార్రాజు చిత్రం 39 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. కాగా బంగార్రాజులో నాగార్జున, నాగ చైతన్యలు కాగా వారికి జోడిగా రమ్యకృష్ణ, కృతిశెట్టిలు నటించారు. -
కల్యాణ్ జువెల్లర్స్ ‘బంగార్రాజు’ ఆభరణాలు
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల బ్రాండ్ కల్యాణ్ జువెల్లర్స్ ’బంగార్రాజు’ పేరుతో పురుషుల జ్యువెలరీ ప్రత్యేక కలెక్షన్‌ను ప్రారంభించేందుకు అన్నపూర్ణ స్టూడియోస్‌తో ఒక భాగస్వామ్యం కుదుర్చుకుంది. అక్కినేని నాగార్జున, నాగచైతన్యలు నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతి విడుదల నేపథ్యంలో కల్యాణ్ జువెల్లర్స్ ఈ ప్రత్యేక కలెక్షను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా చిత్ర కథానాయకుడు బంగార్రాజు ధరించిన నవరత్న, పులిగోరు తరహా నెక్లేస్ డిజైన్ ఆభరణాలకు కల్యాణ్ జువెల్లర్స్ షోరూమ్‌లలో ఆర్డర్ ఇవ్వవచ్చని తెలిపింది. -
బంగార్రాజు మూవీ రివ్యూ
టైటిల్ : బంగార్రాజు నటీనటులు : నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి, నాగబాబు రావు రమేశ్, వెన్నెల కిశోర్, సంపత్ రాజ్, గోవింద్ పద్మసూర్య తదితరులు నిర్మాణ సంస్థలు : అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ నిర్మాత : అక్కినేని నాగార్జున దర్శకత్వం : కల్యాణ్ కృష్ణ కురసాల సంగీతం : అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ : జె. యువరాజ్ ఎడిటర్ : విజయ్ వర్థన్ విడుదల తేది : జనవరి 14, 2022 Bangarraju Movie Review: అక్కినేని నాగార్జున డ్యూయల్ రోల్ లో చేసిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’చిత్రం 2016 సంక్రాంతి సీజన్లో విడుదలై సూపర్ హిట్టైంది. ఏకంగా కింగ్ కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలిచింది. ఆ మూవీ భారీ విజయం సాధించడంతో అందులోని బంగార్రాజు పాత్రతో కథని అల్లుకొని ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ సినిమా తెరకెక్కింది. ‘మనం’ తర్వాత నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ఈ చిత్రం శుక్రవారం(జనవరి 14)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కి మంచి స్పందన రావడం.. దానికి తోడు ప్రమోషన్స్‌ని గ్రాండ్ చేయడంలో ‘బంగార్రాజు’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ సంక్రాంతి బరిలోకి దిగిన ఏకైన పెద్ద సినిమా ‘బంగార్రాజు’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాడు? రివ్యూలో చూద్దాం. ‘బంగార్రాజు’కథేంటంటే ‘సోగ్గాడే చిన్ని నాయన’చిత్రం ఎక్కడ ముగిసిందో.. అక్కడి నుంచి ‘బంగార్రాజు’కథ స్టార్ట్ అవుతుంది. ఆత్మగా వచ్చిన బంగార్రాజు(నాగార్జున)..తన ఫ్యామిలీ సమస్యలన్నీ చక్కదిద్ది స్వర్గానికి తిరిగి వెళ్తాడు. కొన్నాళ్లకు డాక్టర్ రాము(నాగార్జున), సీత దంపతులకు కొడుకు పుట్టడం..భార్య చిన్నప్పుడే చనిపోవడంతో..అతని బాధ్యలను నాన్నమ్మ సత్య అలియాస్ సత్తెమ్మ(రమ్యకృష్ణ) చూసుకుంటుంది. మనవడు పెద్దయ్యేసరికి.. సత్తెమ్మ కూడా చనిపోయి..స్వర్గంలో ఉన్న బంగార్రాజు దగ్గరకు వెళ్లుంది. చిన్నబంగార్రాజు(నాగచైతన్య) కూడా తాత మాదిరే ఊర్లో ఆవారాగా తిరుతూ.. అమ్మాయిల వెంటపడుతుంటాడు. మరోపక్క చిన్న బంగార్రాజు మరదలు.. నాగలక్ష్మీ(కృతిశెట్టి) ఆ ఊరికి సర్పంచ్ అవుతుంది. వీరిద్దరికి ఒకరంటే ఒకరుపడరు. కానీ వీరిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటందని భావిస్తుంది సత్తెమ్మ. తన మనవడి ప్రేమకి సహాయం చేయడానికి బంగార్రాజుని భూమ్మీదకి పంపిస్తుంది. చిన్న బంగార్రాజు శరీరంలోకి పెద్ద బంగార్రాజు చేరి.. సర్పంచ్ నాగలక్ష్మీని ప్రేమించేలా చేస్తాడు. మరోవైపు చిన్న బంగార్రాజు హత్య చేయడానికి కొంతమంది ప్లాన్ చేస్తారు. అసలు చిన్న బంగార్రాజుని ఎందుకు హత్య చేయాలనుకున్నారు? హత్యకు కుట్ర చేసిందెవరు? ఆపదలో ఉన్న మనవడిని బంగార్రాజు ఎలా కాపాడుకున్నాడు? ఊరి గుడి కింద ఉన్న నిధులపై కన్నేసిన దుష్టశక్తుల పన్నాగాలను బంగార్రాజు ఎలా తిప్పికొట్టారు? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం నాగార్జున, నాగచైతన్యల నటననే. చిన్నబంగార్రాజు, పెద్ద బంగార్రాజు పాత్రల్లో వీరిద్దరు ఒదిగిపోయారు. సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తాయి. బంగార్రాజు ఆత్మ దూరిన ప్రతిసారి నాగచైనత్య చేసే సందడి ఆకట్టుకుంటుంది. అయితే సాధారణ సమయంలో చిన్నబంగార్రాజు కామ్‌గా ఉండడం.. ఆత్మ దూరిన తర్వాత రెచ్చిపోవడంతో.. చై కంటే నాగార్జుననే హైలెట్ అయ్యాడని చెప్పాలి. క్లైమాక్స్‌లో వీరిద్దకు కలిసే చేసే ఫైట్ సీన్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక సర్పంచ్ నాగలక్ష్మీగా కృతిశెట్టి తనదైన నటనతో మెప్పించింది. అమాయకపు మాటలతో నవ్వించింది. బంగార్రాజు భార్య సత్య అలియాస్ సత్తెమ్మగా రమ్యకృష్ణ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించింది. సంపత్ రాజ్, రావు రమేశ్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. 2016లో సంకాంత్రికి విడుదలైన‘సోగ్గాడే చిన్ని నాయనా’ఎంతటి ఘటన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ అనగానే ‘బంగర్రాజు’కథ ఎలా ఉండబోతుందో అంతా ఊహించుకున్నారు. అనుకున్నట్లుగానే.. పల్లెటూరి వాతావరణం, కలర్‌ఫుల్ సాంగ్స్‌తో ఫన్ అండ్ ఎమోషనల్‌గా ‘బంగార్రాజు’కథ సాగుతుంది. సోగ్గాడే.. సినిమా మాదిరినే.. ఈ చిత్రానికి కూడా గుడికి, బంగార్రాజు కుటుంబానికి ముడిపెట్టి కథను అల్లుకున్నాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. అందులో కొడుకు,కోడళ్లను కలిపేందుకు బంగ్రారాజు ఆత్మ భూమ్మీదకు వస్తే.. ఇందులో మనవడిని జీవితాన్ని చక్కబెట్టేందుకు కిందకు వస్తాడు. ఇక ఈ సీక్వెల్లో సత్తెమ్మ ఆత్మ అదనం. అయితే సోగ్గాడే.. ఆకట్టుకున్నంతగా.. బంగార్రాజు ఆకట్టుకోలేకపోయాడు. ఫస్టాఫ్ అంతా రోటీన్ సీన్లతో నెమ్మదిగా సాగుతుంది. బంగార్రాజు, సత్యల ఆత్మలు భూమ్మీదకు వచ్చాక కథలో వేగం పెరుగుతుంది. అయినప్పటికీ.. సాదాసీదాగానే సాగిపోతుంది. సర్పంచ్ నాగలక్ష్మీ, చిన్నబంగార్రాజుల మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ వార్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. పెద్ద బంగార్రాజు చేసే సందడి మాత్రం ప్రేక్షకులను నవ్విస్తుంది. ఇక సెకండాఫ్‌లో కూడా కథ ప్రేక్షకుడి ఊహకి అందేలా సాగుతుంది. కామెడీ కూడా అంతగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. ‘వీరి వీరి గుమ్మడి పండు’గేమ్ సీన్ అలరిస్తుంది. ఇక సినిమాను ప్రధాన బలం ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ అనే చెప్పాలి. చివరి 30 నిమిషాలు సినిమాపై అభిప్రాయాన్ని మారుస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక సాంకెతిక నిపుణుల పనితీరు విషయానికొస్తే.. అనూప్ రూబెన్స్ సంగీతం సినిమాకి ప్లస్. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా చక్కగా అందించాడు. అయితే సినిమాల్లో వచ్చే పాటలు.. కథకు అడ్డంకిగా అనిపిస్తాయి. యువరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజయ్ వర్థన్ తన కత్తెర ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
బంగార్రాజు ప్రీరిలీజ్ ఈవెంట్ ఫొటోలు