Jathi Ratnalu Heroine Faria Abdullah Gets A Special Chance In Bangarraju: చిట్టి.. నా బుల్‌బుల్ చిట్టి.. అంటూ కుర్రకారు మనసు దోచుకున్న నటి, సొగసైన పొడగరి ఫరియా అబ్దుల్లా. తొలి సినిమా జాతిరత్నాలుతో ఇటు గ్లామర్ పరంగా అటు నటనాపరంగా వందశాతం మార్కులు కొట్టేసింది. తాజాగా ఈ భామ మరో క్రేజీ ఛాన్స్ దక్కించుకున్నట్లు ఫిల్మీ దునియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. నాగార్జున, నాగచైతన్య కలిసి మల్టీస్టారర్‌గా నటిస్తున్న బంగార్రాజు చిత్రంలో చిట్టీ సందడి చేయనుందట.
డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫరియా ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో చిందేయనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. 'సోగ్గాడే చిన్ని నాయనా' హిట్ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న 'బంగార్రాజు' సినిమాకు కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కృతిశెట్టి కథానాయికగా నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment