special song
-
నితిన్ వల్లే ఐటం సాంగ్ చేశా.. ఇప్పటికీ ఇబ్బందిగా అనిపిస్తుంది: గుత్తా జ్వాల
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల గతంలో ఓ సినిమాలో తళుక్కుమని మెరిసింది. నితిన్ కోరిక మేరకు గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంలో డింగ్ డింగ్ డింగ్ డింగ్ అనే ఐటం సాంగ్‌లో ఆడిపాడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను స్పెషల్ సాంగ్ చేయడానికి గల కారణాన్ని వెల్లడించింది.గుత్తా జ్వాల (Jwala Gutta) మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీ (Tollywood)లో పని చేయాలంటే తెల్లగా ఉంటే చాలు. బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్న నాకు చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ వాటన్నింటికీ నో చెప్పాను. సినిమాల్లోకి రావాలని కలలో కూడా అనుకోలేదు. అయితే సినీ ఇండస్ట్రీలో నాకెందరో స్నేహితులున్నారు. చిత్రపరిశ్రమలో ఎలా ఉండాలో వారిని చూస్తే అర్థమవుతుంది. వారిలా నేనుండలేను. అక్కడ ఉండాలంటే మనకు సిగ్గు ఉండకూడదు. చాలా విషయాల్లో సర్దుకుపోతుండాలి.24 గంటలు పనిలోనే..నా భర్త.. హీరో, నిర్మాత విష్ణు విశాల్ (Vishnu Vishal) మూవీ ఇండస్ట్రీలోనే ఉన్నాడుగా.. 24 గంటలు ఆయనకు ఏదో ఒక పని ఉంటుంది. అవన్నీ చూస్తేనే నాకు తల నొప్పి వచ్చేస్తుంది. మేము 10 గంటలు ఆడిన తర్వాత విశ్రాంతి తీసుకోవచ్చు. హాయిగా నిద్రపోవచ్చు. కానీ వాళ్లకేమో డబ్బుల టెన్షన్, ఆ షాట్స్ సరిగా వచ్చిందా? లేదా? ఇలా ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది. నా భర్త రెడీ అవడానికి 2 గంటలు తీసుకుంటాడు. అంతా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాడు. ఇండస్ట్రీలో ఉండేవాళ్లు ఎంతో శ్రమిస్తారు. నిజంగా వాళ్లు చాలా గ్రేట్.. ప్రతిఒక్కరికీ ఏదో ఒక అవార్డు ఇవ్వాల్సిందే!అలా ఐటం సాంగ్ చేశా..ఐటం సాంగ్ విషయానికి వస్తే.. అది తల్చుకుంటేనే ఇబ్బందిగా అనిపిస్తుంది. నితిన్ (Nithiin) నాకు ఫ్రెండ్. ఒక పార్టీలో అతడు.. జ్వాల నువ్వు నా సినిమాలో ఓ పాట చేస్తున్నావ్ అన్నాడు. సరేనని తలూపాను. కానీ, సీరియస్‌గా తీసుకోలేదు. మూడు నెలల తర్వాత పాట రెడీ అని నా దగ్గరకు వచ్చాడు. నేను నోరెళ్లబెట్టాను. ఇప్పుడెలా నో చెప్పాలా? అని ఆలోచనలో పడ్డాను. అతడేమో కచ్చితంగా నేను చేయాల్సిందే అని పట్టుబట్టాడు. అలా సెట్లో అడుగుపెట్టాను.ఫ్రీ పబ్లిసిటీమొదటి రోజు నా మోకాలివరకు ఉన్న డ్రెస్ ఇచ్చారు. రోజురోజుకీ ఆ డ్రెస్ చిన్నదైపోతూ వచ్చింది. ఏంటిదంతా? అనుకున్నాను. నాలుగురోజుల్లో సరదాగా షూట్ పూర్తి చేశాం. అప్పటికే అతడి సినిమాలు వరుసగా ఫెయిలవుతూ వస్తున్నాయి. గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో నేను సాంగ్ చేయడం వల్ల ఆ మూవీకి ఫ్రీగా పబ్లిసిటీ వచ్చింది. తెలుగు సినిమా జాతీయ మీడియాలో కూడా వస్తుందని నితిన్ సంతోషపడిపోయాడు. నా పాట వల్ల సినిమా ఫ్లాప్ అవకుండా హిట్టయింది. అదొక్కటి నాకు సంతోషంగా అనిపించింది అని గుత్తా జ్వాల చెప్పుకొచ్చింది.చదవండి: తమన్నా బ్రేకప్.. విడి విడిగా వచ్చారు.. విడిపోయినట్లేనా! -
నితిన్ సినిమాలో స్పెషల్ సాంగ్ ట్రెండింగ్ లో కేతిక శర్మ (ఫొటోలు)
-
ఐటం సాంగ్‌తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్ సోదరి (ఫోటోలు)
-
రజనీకాంత్‌తో ‘జిగేల్ రాణి’ స్టెప్పులు.. పూజాకి ‘సూపర్’ ఛాన్స్
పూజా హెగ్డే(Pooja Hegde ).. మొన్నటి వరకు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. కానీ ఇటీవల ఆమె నటించిన చిత్రాలన్ని ఆశించిన స్థాయిలో ఆడకపోవడం.. కొత్తగా వచ్చిన హీరోయిన్లు దూసుకెళ్లడంతో కాస్త వెనుకబడింది. దీంతో టాలీవుడ్‌ని వదిలేసి బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకునేందుకు వెళ్లింది. అయితే అక్కడ కూడా ఈ పొడుగు కాళ్ల సుందరికీ నిరాశే ఎదురైంది. దీంతో పూజాకి అటు బాలీవుడ్‌లోనూ ఇటు టాలీవుడ్‌లోనూ పెద్దగా అవకాశాలు లభించట్లేదు. కోలీవుడ్‌లో మాత్రం రెండు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తోంది. దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగణ్’తో పాటు కాంచన 4లోనూ పూజా హీరోయిన్గా నటిస్తోంది. ఆ రెండు చిత్రాలు తప్ప పూజా చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు. ఇలాంటి తరుణంలో పూజాగా ఓ ‘సూపర్’ చాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌కి స్టెప్పులేయబోతుందట.‘కావాలయ్యా’తరహాలో ..రజనీకాంత్(Rajinikanth ) ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’(Coolie Movie) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం ఉందట. ఆ పాటకి పూజా హెగ్డేతో స్టెప్పులేయించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్రబృందం పూజాని సంప్రదించారట. పాట నచ్చడంతో పూజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ‘జైలర్’లోని ‘కావాలయ్యా’ పాట తరహాలో ఈ ఐటమ్ సాంగ్ ఉండబోతుందట. రజనీకాంత్‌తో పాటు నాగార్జున కూడా ఈ పాటలో కనిపించబోతున్నాడని సమాచారం.పూజాకి కొత్తేమి కాదుస్పెషల్ పాటల్లో నటించడం పూజా హెగ్డేకి కొత్తేమి కాదు.హీరోయిన్ గా నటించిన చిత్రాలకంటే.. స్పెషల్ డ్యాన్స్ తో ఇరగదీసిన చిత్రాలతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. 'రంగస్థలం' చిత్రంలో పూజా హెగ్దే 'జిగేలు రాణి' స్పెషల్ సాంగ్ అప్పట్లో యూత్‌ని ఉర్రూతలూగించింది. ఆ పాటకి పూజా వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. ఆ తర్వాత ఎఫ్ 3లోనూ పూజా ఓ ప్రత్యేక పాటకు డ్యాన్స్ చేసింది. అది కూడా మంచి విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ రజనీకాంత్‌తో కలిసి ‘స్పెషల్’ స్టెప్పులేసేందుకు పూజా రెడీ అయింది. ఇక కూలీ విషయానికొస్తే.. లోకేశ్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రజనీ సరికొత్తగా కనిపించబోతున్నాడట. ఆమిర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ నెలలో ఈప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
స్పెషల్ సాంగ్?
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనే సామెత చిత్ర పరిశ్రమలో బాగా వినిపిస్తుంటుంది. ఈ విషయంలో హీరోయిన్లు ఎప్పుడూ ముందుంటారు. ఓ వైపు హీరోకి జోడీగా నటించి, ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు స్పెషల్ సాంగ్స్‌లో నటించేందుకు పలువురు కథానాయికలు పచ్చజెండా ఊపుతుంటారు. ఇప్పటికే సమంత, తమన్నా, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, శ్రుతీహాసన్, శ్రీలీల, రెజీనా, ఫరియా అబ్దుల్లా వంటి పలువురు కథానాయికలు ప్రత్యేకపాటల్లో చిందేశారు.తాజాగా ఈ జాబితాలో హీరోయిన్ కృతీ శెట్టి కూడా చేరనున్నారని బాలీవుడ్ టాక్. ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ బేబమ్మగా అభిమానుల మనసులో స్థానం సంపాదించుకున్నారు. తొలి సినిమాతోనే వంద కోట్ల క్లబ్లో చేరిన హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఈ కన్నడ బ్యూటీ ‘శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ, మనమే’ వంటి పలు తెలుగు చిత్రాల్లో నటించి, ప్రేక్షకులను మెప్పించారు. 2024 జూన్ 7న విడుదలైన ‘మనమే’ సినిమా తర్వాత కృతీ శెట్టి తెలుగులో ఏ సినిమా కూడా కమిట్ కాలేదు. అయితే తమిళ చిత్రాలతో మాత్రం ఫుల్ బిజీగా ఉన్నారామె. ఇదిలా ఉంటే.. కృతీ శెట్టి బాలీవుడ్లో ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నారని టాక్. అద్భుతమైన డ్యాన్స్ చేయడంలో ఆమెకు మంచి పేరుంది. అందుకేనేమో... ప్రత్యేకపాటలో మెరిసేందుకు సై అన్నారని టాక్. అయితే ఆమె ఏ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నారు? ఇందులో వాస్తవం ఎంత? అనే విషయాలపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. -
నలుగురితో రిలేషన్ ..ఒక్కరు కనెక్ట్ కాలేదు: ‘స్పెషల్’ బ్యూటీ
ఇండస్ట్రీలో కొన్ని పాత్రలు కొంతమంది నటులకే సెట్ అవుతాయి. ఆ పాత్రను చూడగానే పలానా నటుడు అయితేనే ఇలా చేయగలడు అనుకుంటాం. వారు తప్ప వేరేవాళ్లు ఆ పాత్రల్లో కనిపించినా.. అంతగా ఆకట్టుకోలేరు. అలాగే పాటలు, డ్యాన్స్‌ల విషయంలోనూ ఆడియన్స్ కొందరికే కనెక్ట్ అవుతారు. ఐటమ్ సాంగ్ అనగానే అందరికి గుర్తొచ్చే పేరు ముమైత్ ఖాన్(Mumaith Khan). గతంలో మన దగ్గర జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్కి స్మిత లాంటి తారలు ప్రత్యేక పాటలతో అలరించినా.. కొన్నాళ్ల తర్వాత ఐటమ్ సాంగ్ హవా తగ్గిపోవడంతో వారంతా కనుమరుగైపోయారు. ఆ తర్వాత తెలుగులో అడపా దడపా స్పెసల్ సాంగ్స్ వచ్చినప్పుటికీ.. అంతగా ఆకట్టుకోలేదు.ఇక అంతరించిన పోతున్న ఐటమ్ సాంగ్స్‌కి ఊపు తెచ్చిన నటి ముమైత్ ఖాన్. పూరీ జగన్నాథ్ - సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో వచ్చిన పొకిరీలో స్పెషల్ సాంగ్ ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ ఎంత హిట్టయిందో అందరికి తెలిసిందే. దానికి యాభై శాతం మణిశర్మ మ్యూజిక్ కారణం అయితే.. మరో యాభై శాతం ముమైత్ వేసిన స్టెప్పులే. అప్పట్లో ఏ ఈవెంట్లో చూసినా ఈ పాటే మారుమోగిపోయేది. ఆ ఒక్క పాటతో ముమైత్ ‘స్పెషల్ సాంగ్’ స్పెషలిస్ట్‌గా మారిపోయింది. పోకిరి తర్వాత యోగి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, బుజ్జిగాడు, మగధీర, కెవ్వు కేక తదితర సినిమాల్లో ఐటమ్ సాంగ్‌కి తనదైన శైలీలో స్టెప్పులేసి అలరించింది. పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి నటిగానూ మంచి మార్కులు కొట్టేశారు ముమైత్ ఖాన్. ఆ తర్వాత ఉన్నట్టుండి వెండితెరపై దూరమయ్యారు.కొన్నాళ్త తర్వాత బిగ్‌బాస్ రియాల్టీ షోలో మెరిసింది.ఆ తర్వాత సినిమాల్లో కానీ బయట ఎక్కడ గాని కనిపించలేదు. రీసెంట్ ఈ ఐటమ్ భామ వరుస ఇంటర్వ్యూలో ఇస్తూ తన గురించి ఆసక్తికర విషయాలు చెబుతోంది. తనకు ఆ మధ్య పెద్ద యాక్సిడెంట్ అయ్యిందని, కోలుకోవడానికి టైం పట్టడంతో ఇంటికే పరిమితమైనట్లు చెప్పింది. అలాగే ప్రేమ పెళ్లి గురించి మాట్లాడుతూ.. గతంలో నలుగురితో డేటింగ్ చేశానని.. వారిలో తనకు ఒక్కరు కూడా కనెక్ట్ కాకపోవడంతో బ్రేకప్ చెప్పానని చెప్పింది. ప్రస్తుతం ఒంటరిగా హాయిగా జీవితాన్ని గడుపుతున్నానని, భవిష్యత్తులో పెళ్లి అనేది రాసుంటే ఖచ్చితంగా చేసుకుంటానని ముమైత్ చెప్పింది. -
రెడ్ కలర్ శారీలో గులాబీలా మెరిసిపోతున్న ఊర్వశి రౌతేలా (ఫొటోలు)
-
'కిస్సిక్' కోసం భారీ రెమ్యునరేషన్.. స్పందించిన శ్రీలీల
ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసిన ‘పుష్ప 2’ మూవీ గురించే మాట్లాతున్నారు. ఇక ఇటీవల విడుదలైన స్పెషల్ సాంగ్ ‘కిస్సిక్’ అయితే యూట్యూబ్‌లో దుమ్ము దులిపేస్తుంది. ఈ పాటకు అల్లు అర్జున్, శ్రీలీల వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పాటు ఈ పాటపై మరో ఆసక్తికర గాసిప్ కూడా నెట్టింట హల్చల్ చేస్తుంది. అదే శ్రీలీల రెమ్యునరేషన్. ఈ ఐటమ్ సాంగ్ కోసం శ్రీలీల భారీ రెమ్యునరేషన్ తీసుకుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఓ భారీ సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటుందో ఈ పాటకు అంతే మొత్తంలో డిమాండ్ చేసిందట. నిర్మాతలు కూడా శ్రీలీల అడిగినంత డబ్బు ఇచ్చారని నిన్నటి నుంచి తెగ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ పుకారుపై శ్రీలీలతో పాటు నిర్మాతలు స్పందించారు.వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్- శ్రీలీల జంటగా రాబిన్‌హుడ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రాబిన్‌హుడ్ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నితిన్, శ్రీలీలతో పాటు దర్శకుడు వెంకీ, నిర్మాత రవి, నవీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్ప ఐటమ్ సాంగ్ రెమ్యునరేషన్‌పై శ్రీలీలకు ప్రశ్న ఎదురైంది. ‘కిస్సిక్’ సాంగ్ కోసం సినిమా స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారట కదా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘అసలు ఇప్పటి వరకు రెమ్యునరేషన్ మ్యాటరే మా మధ్య జరగలేదని అటు శ్రీలీల, ఇటు నిర్మాతలు చెప్పుకొచ్చారు. ‘అంత ఇంత అని ఏమి అనుకోలేదు. అవకాశం వచ్చింది చేసేశా. ఇంకా డబ్బుల గురించి మాట్లాడలేదు’అని శ్రీలీల అన్నారు. నిర్మాతలు, నవీన్ మాట్లాడుతూ..‘రెమ్యునరేషన్ టాపికే శ్రీలీల తీయలేదు. మీరు అనుకున్నంత రెమ్యునరేషన్ అయితే ఇవ్వలేదు’అని క్లారిటీ ఇచ్చారు.ఇక పుష్ప 2 విషయానికొస్తే.. అల్లు అర్జున్- రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
ప్రభాస్‌తో నయనతార ‘స్పెషల్’ స్టెప్పులు..?
స్పెషల్ సాంగ్.. బడా హీరోల సినిమాల్లో ఇది మరింత స్పెషల్ అయిపోయింది. సినిమాలో స్టార్ హీరోయిన్లు ఒకరిద్దరు ఉన్నపటికీ.. స్పెషల్ సాంగ్‌కి వచ్చేసరికి కచ్చితంగా మరో స్టార్ హీరోయిన్ని తీసుకొస్తున్నారు. మార్కెట్ లెక్కలేసి మరీ ఐటమ్ సాంగ్‌పై ప్రత్యేక దృష్టిపెడతున్నారు. హీరో రేంజ్‌కి తగ్గట్లుగా స్టార్ హీరోయిన్‌తో స్పెషల్ డ్యాన్స్ చేయిస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తుండగా..ఇప్పుడు ప్రభాస్ కోసం మరో స్టార్ హీరోయిన్ ‘ప్రత్యేక’ స్టెప్పులేసేందుకు రెడీ అవుతోందట. ఆమే లేడీ సూపర్‌స్టార్ నయనతార.ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంతో ‘ది రాజాసాబ్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కుతోంది. మారుతి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. క్యాస్టింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఇక ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ కూడా ఉందట. దాని కోసం ఓ భారీ సెట్ కూడా ఏర్పాటు చేయబోతున్నారట. అయితే ఈ స్పెషల్ సాంగ్‌ని మరింత స్పెషల్ చేసేందుకు నయనతారని బరిలోకి దింపబోతున్నారట. ఇప్పటికే ఈ పాట కోసం మారుతి నయనతారని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ పాట చేసేందుకు నయన్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. గతంలో మారుతి తెరకెక్కించిన బాబు బంగారం సినిమాలో నయనతార నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పరిచయంతోనే రాజాసాబ్తో స్టెప్పులేసేందుకు నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కాగా, ప్రభాస్, నయన్ కలిసి గతంలో యోగి అనే సినిమాలో నటించారు. మళ్లీ చాలా కాలం తర్వాత ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది నయనతార. వీరిద్దరి కలయికలో రాబోతున్న స్పెషల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. -
శ్రద్ధా కపూర్ 'ఊ అన్నారా'?
హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘పుష్ప: ది రూల్’. ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేస్తుండగా, హీరోయిన్ శ్రీవల్లిపాత్రలో రష్మికా మందన్నా నటిస్తున్నారు. ఈ సినిమా టాకీపార్టు చిత్రీకరణ దాదాపు తుది దశకు చేరుకుంది. అలాగే మిగిలి ఉన్నపాటలను చిత్రీకరించే పనిలో ఉంది టీమ్. ఈ నెలాఖర్లో స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ స్పెషల్ సాంగ్‌లో మెరిసే హీరోయిన్ల పేర్లలో జాన్వీ కపూర్, మృణాళినీ ఠాకూర్, శ్రద్ధా కపూర్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి.అయితే శ్రద్ధా కపూర్‌ను యూనిట్ సంప్రదించిందని, ఆమే నటించనున్నారని భోగట్టా. మరి... శ్రద్ధా కపూర్ ఊ అన్నారా? అనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘పుష్ప: ది రూల్’ సినిమా డిసెంబరు 6న విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘పుష్ప’ సినిమా తొలి భాగం ‘పుష్ప : ది రైజ్’లోని స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మామ..’లో సమంత మెరిశారు. ఈ సాంగ్ ‘పుష్ప: ది రైజ్’ సినిమాకు ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో ‘పుష్ప 2’లోని స్పెషల్ సాంగ్ ఎలా ఉండబోతుందన్న చర్చ జరుగుతోంది. తొలి భాగానికి సంగీతదర్శకత్వం వహించిన దేవిశ్రీ ప్రసాద్ ‘పుష్ప: ది రూల్’కూ సంగీతం అందిస్తున్నారు. -
సినిమాపై ఎఫెక్ట్ పడుతుందని ‘ఆజ్ కీ రాత్’కి నో చెప్పా: తమన్నా
హీరోయిన్ తమన్నా కెరీర్లో స్పెషల్సాంగ్స్కు ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఈ బ్యూటీ ఇప్పటివరకు దాదాపు పదికిపైగా స్పెషల్‌సాంగ్స్‌లో నర్తించారు. ఆడియన్స్ నుంచి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇటీవల ‘స్త్రీ 2’ సినిమాలో తమన్నా చేసిన ‘ఆజ్ కీ రాత్’ స్పెషల్‌సాంగ్‌కు మంచి ఆదరణ దక్కింది. యూట్యూబ్‌లో 200 మిలియన్స్ వ్యూస్ ఈ పాటకు వచ్చాయి. అయితే ఈ స్పెషల్ సాంగ్‌కు తమన్నా మొదట నో చెప్పారు. ఈ విషయంపై తమన్నా ఇటీవల ఓ సందర్భంగా మాట్లాడుతూ– ‘‘రజనీకాంత్‌గారి ‘జైలర్’లో నేను చేసిన ‘వా నువ్వు కావాలయ్యా పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ సమయంలో నాకు ‘ఆజ్ కీ రాత్ ’ చాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సాంగ్ చేస్తే అందరూ ‘వా నువ్వు కావాలయ్యా’ పాటతో పోలికలు పెడతారు. సాంగ్ కాస్త అటు ఇటు అయినా సినిమాపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. దీంతో ఇప్పుడు ఈ సాంగ్ ఎందుకులే? అనుకున్నాను. దీంతో ‘ఆజ్ కీ రాత్’కు మొదట నో చెప్పాను. కానీ ‘స్త్రీ 2’ దర్శకుడు ఆమర్కౌశిక్ పట్టుబట్టి ఈ పాటను నాతో చేయించుకున్నారు’’ అని మాట్లాడారు తమన్నా. ఇక ‘ఆజ్ కీ రాత్’ సాంగ్ ‘స్త్రీ 2’లో సూపర్‌హిట్‌గా నిలవడమే కాకుండా, ఈ సినిమాకు ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘స్త్రీ 2’. అమర్ కౌశిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆల్రెడీ ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్ల రూ΄ాయల వసూళ్లను రాబట్టిందని బాలీవుడ్ సమాచారం. -
తమన్నా ‘స్పెషల్’ : ఐదు నిమిషాలు.. కోటి రూపాయలు?
ఏ సినిమాకు అయినా పాటలు ప్రత్యేక ఆకర్షణ. కథ, కథనం మాములుగా ఉన్నా.. పాటలతోనే హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇక స్పెషల్ సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాకు హైప్ తీసుకురావడంతో అవి కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ దర్శకులు సైతం స్పెషల్ సాంగ్‌పై స్పెషల్ కేర్ తీసుకుంటారు. (చదవండి: సమంత సర్ప్రైజ్.. మొత్తానికి అదేంటో రివీల్ చేసింది!)స్టార్ హీరోయిన్లతో స్టెప్పులేయిస్తే.. కాసుల వర్షం కురుస్తుందని భావిస్తారు. అయితే నిజంగానే కొన్ని సినిమాలకు స్పెషల్ సాంగ్ బాగా కలిసొస్తుంది. అలా ఇటీవల స్పెషల్ సాంగ్‌తో భారీ హైప్ క్రియేట్ చేసుకున్న సినిమా స్త్రీ 2. రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఈ హారర్ ఫిల్మ్ ఆగస్ట్ 15న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ చేసింది.(చదవండి: డ్రగ్ టెస్ట్ రిపోర్ట్స్.. నటి హేమ వైరల్ వీడియో) ‘ఆజ్ కి రాత్’ అంటూ సాగే ఈ పాటకి తమన్నా వేసిన స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి. సినిమాకు హైప్ తీసుకొచ్చిన అంశాల్లో ఈ పాట కూడా ఒకటి. అయితే స్పెషల్ సాంగ్ కోసం తమన్నా భారీగానే పారితోషికం తీసుకుందట. కేలవం 5 నిమిషాల నిడివి గల ఈ పాటకి రూ. కోటి తీసుకున్నట్లు బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అయితే తీసుకున్న పారితోషికానికి తమన్నా న్యాయం చేసిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఆమె కారణంగానే ఆ స్పెషల్ సాంగ్‌కి హైప్ వచ్చిందని..అది సినిమాకు బాగా ప్లస్ అయిందని చెబుతున్నారు. వాస్తవానికి ఈ సాంగ్ నోరా ఫతేహీ చేయాల్సింది. స్త్రీ పార్ట్ 1లో ఆమే ఐటమ్ సాంగ్ చేసింది. పార్ట్ 2 లో నోరానే చేయాల్సింది కానీ.. చివరి నిమిషంలో తమన్నాను సంప్రదించారట మేకర్స్. వాళ్లు తీసుకున్న నిర్ణయం సినిమాకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. -
2024 T20 World Cup: ‘టీమిండియా హై హమ్’ రెహమాన్ స్పెషల్ సాంగ్ వైరల్
హోరాహోరీగా జరిగిన పోరులో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు కైవసం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. 17 ఏళ్ల తరువాత టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను దక్కించుకోవడంపై సర్వత్రా హర్హం వ్యక్తమవుతోంది. ఈ అపురూపమైన సందర్భాన్ని ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ కూడా సంబరంగా జరుపుకున్నారు. అంతేకాదు మెన్ ఇన్ బ్లూకి ఒక అధ్బుతమైన గిఫ్ట్ ఇచ్చారు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఏఆర్ రెహమాన్ బ్లూ ఇన్ మెన్‌కి అభినందనలుత తెలుపుతూ 'టీమ్ ఇండియా హై హమ్' పేరుతో ప్రత్యేక గీతాన్ని బహుమతిగా అందించారు. ఈ మ్యూజిక్ వీడియోకి సంబంధించిన యూట్యూబ్ లింక్‌ను ఏఆర్ రెహమాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సాంగ్‌ను తొలుత అజయ్ దేవగన్ 'మైదాన్' కోసం కంపోజ్ చేశారట. భారత ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా అజయ్ దేవగన్ హీరోగా 'మైదాన్' మూవీకోసం 'టీమ్ ఇండియా హై హమ్'ఒరిజినల్ సాంగ్‌ను ఏఆర్ రెహమాన్ , నకుల్ అభ్యంకర్ పాడారు.కాగా జూన్29న ఉత్కంఠభరితంగా జరిగిన టీ20 వరల్డ్ కప్ పైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా యువత రోడ్లపైకి వచ్చి, బాణా సంచా పేల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నసంగతి తెలిసిందే. -
కుటుంబ సభ్యులు వద్దని చెప్పినా ఆ పాటలో నటించాను: సమంత
తమిళసినిమా: వృత్తిపరంగానే కాదు, వ్యక్తిగతంగానూ నటి సమంత ఒక సంచలనమే. మొదట్లో తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించినా, తెలుగులో నటించిన తొలి చిత్రం ఏమాయ చేసావే సక్సెస్ ఆమె నట జీవితాన్నే మార్చేసింది. ఆ తరువాత తెలుగులో స్టార్ హీరోలతో జత కట్టే అవకాశాలు వరుస కట్టడంతో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు. ఆ తరువాత తమిళంలో విజయ్, సూర్య, విశాల్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వరించాయి. అలా తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ కథానాయకిగా రాణిస్తున్న సమయంలోనే టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ వివాహ జీవితం ఎక్కువ కాలం సాగలేదు. అభిప్రాయభేదాల కారణంగా విడిపోయారు. ఈ విషయాన్ని పక్కన పెడితే సమంత ఐటమ్ సాంగ్ చేసిన చిత్రం పుష్ప. అల్లుఅర్జున్ , రషి్మక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం 2022లో విడుదలై ఎంత సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విజయంలో సమంత నటించిన ఊ అంటావా మామ పాటకు అధిక భాగమే ఉంది. ఆ పాటలో సమంత శృంగార భరిత నటన యువతను గిలిగింతలు పెట్టించింది. ఆ పాటకు డాన్స్ చేయడానికి సమంతకు రూ. 5 కోట్లు పారితోషికం ఇచ్చినట్లు ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ పాటలో నటించవద్దని తన కుటుంబసభ్యులు,స్నేహితులు చెప్పారని సమంత ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు. అందులో ఆ సమయంలో తాను విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని, అలాంటి సమయంలో పుష్ప చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో నటించవద్దని కుటుంబసభ్యులు, సన్నిహితులు చెప్పారన్నారు. అయితే తాను వారి వ్యతిరేకతను మీరి ఆ పాటలో నటించానని పేర్కొన్నారు. ఆ పాట పెద్ద టర్నింగ్ గా మారిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. నిజం చెప్పాలంటే ఆ అవకాశాన్ని కాదనడానికి తన వద్ద సరైన కారణం లేదన్నారు. అలాంటప్పుడు ఎందుకు దాన్ని నిరాకరించాలి, తానే తప్పు చేయలేదు అని అన్నారు. వివాహా జీవితంలోనూ తాను వంద శాతం నిజాయితీగా ఉన్నానని చెప్పారు. అయితే అది తనకు వర్కౌట్ కాలేదని అన్నారు. సమంత చెప్పిన ఈ విషయం పాతదే అయినా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా మైయోసైటీస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సమంత ఖుషీ చిత్రం తరువాత మరో చిత్రం నటించలేదు. కాగా సమంత ఇప్పుడు తన సొంత నిర్మాణంలో చిత్రం చేసి తన మార్కెట్‌ను తిరిగి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె ట్రెండింగ్‌లోనే ఉన్నారు. -
భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
టాలీవుడ్లో పెళ్లి సందడి చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యి తనదైన చలాకీ నటనతో సినీ పరిశ్రమ దృష్టిని తన వైపునకు తిప్పుకున్న నటి శ్రీలీల. అలాగే ఆ చిత్రం సక్సెస్ అయినా ఆ వెంటనే మరో అవకాశం రాకపోవడంతో ఈ అమ్మడి పరిస్థితి అంతేనా అనే కామెంట్స్ కూడా దొర్లాయి.అయితే రవితేజ సరసన నటించిన ఢమాకా చిత్రం హిట్ అవడం, ముఖ్యంగా అందులోని పాటల్లో శ్రీలీల తన డా¯న్స్‌తో కుర్రకారును ఫిదా చేసింది. దీంతో ఆమె పేరు మారు మ్రోగింది. ఆ తరువాత మహేష్ బాబు సరసన నటించే అవకాశం రావడంతో మరింత క్రేజ్ వచ్చింది. దీంతో ఇతర భాషల దర్శక నిర్మాతల దృష్టి శ్రీలీలపై పడింది. అలా కోలీవుడ్‌లో భారీ అవకాశాలు తలుపు తడుతున్నాయి. ముందుగా దళపతి విజయ్‌తో స్పెషల్ సాంగ్‌లో నటించే అవకాశం వచ్చింది.విజయ్ ప్రస్తుతం గోట్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఏజీ ఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నటి మీనాక్షి శేషాద్రి, స్నేహ, లైలా, మైక్ మోహన్, ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్ జీ మొదలగు పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇందులో నటుడు విజయ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఒకటి విలన్ పాత్ర అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రష్యాలో జరుగుతోంది. కాగా ఇందులో ఒక స్పెషల్ సాంగ్ చోటు చేసుకుంటుందట. ఆ పాటలో నటి త్రిష నటించనున్నారనే ప్రచారం జరిగింది.ఆ తరువాత కాల్ షీట్స్ సమస్య కారణంగా ఆమె నటించలేని పరిస్థితి అని, దీంతో టాలీవుడ్ యువ స్టార్ కథానాయకి శ్రీలీలను ఆ అవకాశం వరించిందని సమాచారం. అయితే ఆ అవకాశాన్ని శ్రీలీల తిరస్కరించినట్లు తెలిసింది. కారణం కోలీవుడ్‌లో సింగిల్ సాంగ్‌తో ఎంట్రీ అయితే అది కెరీర్ ఎదుగుదలకు బాధింపు ఏర్పడుతుందని భావించడమేనట. ఇది ఆమె బ్రిలియంట్ డెసిషన్ అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ఇప్పుడు శ్రీలీల త్వరలో మరో స్టార్ హీరో అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో కథానాయికగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్. -
స్టార్ హీరో సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్?
దర్శకుడు వెంకట్ ప్రభు చిత్రం అంటే చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ముఖ్యంగా నటీనటులు ఎక్కువగా ఉంటారు. సాంకేతిక విలువలకు ప్రాముఖ్యత ఉంటుంది. గోట్ చిత్రంలోనూ ఇవి కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. నటుడు విజయ్ నటిస్తున్న చివరి చిత్రానికి ముందు చిత్రం గోట్. దీని తరువాత తన 69వ చిత్రం చేసి విజయ్ నటనకు స్వస్తి పలకనున్నారనే టాక్ చాలా కాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే.వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. నటి మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్‌జీ, మైక్ మోహన్ తదితరు లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గోట్ చిత్రాన్ని సెప్టెంబర్ 5వ తేదీన వినాయక చతుర్థి సందర్భంగా విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం.కాగా ఇందులో నటి త్రిష ప్రత్యేక పాత్రలో మెరవనున్నట్లు ఇంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడా స్పెషల్ అప్పీరియన్స్‌ను ఇవ్వడానికి టాలీవుడ్ క్రేజీ నటి శ్రీలీలతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో ఈమెకు ప్రత్యేకంగా ఒక పాట కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. ఇదే గనుక నిజం అయితే శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ చిత్రం గోట్‌నే అవుతుంది. కాగా ఈ అమ్మడు మరో టాప్‌స్టార్ అజిత్‌తో జత కట్టడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో శ్రీలీల కోలీవుడ్‌పై దండెత్తబోతున్నారన్నమాట. చూద్దాం ఇక్కడ ఈమె ప్యూచర్ ఎలా ఉండబోతోందో. -
దేవ దేవం అయోధ్య రామ గానం
-
'చేజారిన కొడుకు'..! రోడ్డు ప్రమాదాలపై స్పెషల్ సాంగ్ రిలీజ్..!
కరీంనగర్: ఈ ఏడాది జూలై 4న సురక్ష దినోత్సవం నిర్వహిస్తున్నాం. హెల్మెట్ లేకుండా ఓ యువకుడు బైక్ అతివేగంగా నడుపుతున్నాడు. మరో యువకుడు దానిపై కూర్చున్నాడు. జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ ప్రాంతంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తలకు తీవ్రగాయాలై ఇద్దరూ చనిపోయారు. ఓ వారం రోజుల తర్వాత.. జగిత్యాల బైపాస్‌రోడ్డుకు చెందిన ఓ బాలుడి తండ్రి గల్ఫ్ నుంచి వచ్చాడు. అదేరోజే మంచినీళ్ల కోసమని ఆ బాలుడు ద్విచక్ర వాహనంపై వాటర్ ప్లాంట్‌కు బయలుదేరి వెళ్లాడు. అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొని మృతిచెందాడు. ఇంట్లోంచి బయటకు వెళ్లిన కొన్ని క్షణాల్లోనే కొడుకు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీమున్నీరు కావడం బాధించింది. ► నేను చదువుకున్న రోజుల్లోనే చిన్నచిన్న కవితలు రాశా. పాఠశాల, కళాశాల స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నా. అందుకే ప్రమాదాల నియంత్రణకు ఓ పాట రాయాలని సంకల్పించా. మంచి పాట రాశా. ► వీలైనంత వరకు అతిత్వరగా రోడ్డు ప్రమాద ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులకు సూచిస్తున్నా. బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించాలని చెబుతున్నా.. ముఖ్యంగా తక్షణమే స్పందించాలని ఘటనా స్థలాల్లో ఉండే ప్రజలకు అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నా. సీపీఆర్‌పై వివరిస్తున్నా. ప్రజల్లో చైతన్యం తెస్తున్నా. ► హైదరాబాద్‌లో కొంతకాలం ట్రాఫిక్ అడిషనల్ డీసీపీగా సేవలు అందించా. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం అక్కడ షార్ట్‌ఫిల్మ్‌లు నిర్మించా. వాటిని ప్రదర్శిస్తూ ట్రాఫిక్ నిబంధనలు, జాగ్రత్తలు తీసుకునేలా యువతలో చైతన్యం తీసుకొచ్చా. జగిత్యాల జిల్లాలోనూ ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ఇంజినీరింగ్, ట్రాన్స్పోర్ట్ శాఖల అధికారులతో కలిసి హాట్స్పాట్లు గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. ► కొందరు యువకులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నారు. ఇలాంటి వారికి ట్రాఫిక్ శిక్షణ కేంద్రంలో షార్ట్‌ఫిల్మ్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. వారి కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నాం. యువతే కాదు.. ఎవరైనా ట్రాఫిక్ నిబంనలు పాటించాలి. సురక్షితంగా గమ్యస్థానం చేరాలి. అదే మా లక్ష్యం. - ‘సాక్షి’తో ఎస్పీ భాస్కర్ -
అందులో నిజం లేదు, ఆ రూమర్స్ నన్నెంతో బాధపెట్టాయి : తమన్నా
మిల్క్ బ్యూటీ తమన్నా కొంతకాలంగా తరచుగా వార్తల్లో నిలుస్తుంది. ఇటీవలె ఆమె బాలకృష్ణ సినిమాలో ఐటెంసాంగ్ చేస్తుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎన్బీకే 108' ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను సంప్రదించగా, కోటిన్నర డిమాండ్ చేసిందని, దీంతో తమన్నాను తప్పించినట్లు వార్తలు షికార్లు చేశాయి. తాజాగా ఈ రూమర్స్‌పై ఘాటుగానే స్పందించింది తమన్నా. 'అనిల్ రావిపూడితో కలిసి వర్క్ చేయడాన్ని నేను ఎంతో ఇష్టపడతాను. అలాగే బాలకృష్ణ సార్ అంటే కూడా నాకు ఎంతో గౌరవం ఉంది. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో నేను స్పెషల్ సాంగ్ చేస్తున్నాను అంటూ నా గురించి వార్తలు రాస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నా గురించి ఇలా రాయడం నన్నెంతో బాధించింది. చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'విరూపాక్ష' మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసేముందు దయచేసి రీసెర్చ్ చేసి తెలుసుకోండి' అంటూ తమన్నా ట్వీట్ చేసింది. దీంతో ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. గతంలో అనిల్ రావిపూడితో కలిసి ఎఫ్2, ఎఫ్3, సరిలేరు నీకెవ్వరూ లాంటి సినిమాల్లో నటించింది తమన్నా. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. I have always enjoyed working with @AnilRavipudi sir. I have huge respect for both him and Nandamuri Balakrishna sir. So reading these baseless news articles about me and a song in their new film, is very upsetting. Please do your research before you make baseless allegations. — Tamannaah Bhatia (@tamannaahspeaks) May 20, 2023 -
20 ఏళ్ల తర్వాత చిరంజీవితో శ్రియ.. ఏకంగా రూ. కోటి డిమాండ్!
హీరోయిన్ శ్రియ శరన్ క్రేజ్ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో అలరిస్తుంది. అయితే దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ మెగాస్టార్ చిరంజీవితో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇష్టం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన శ్రియ తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. కెరీర్ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే కుర్ర హీరోలతో పాటు బడా హీరోలతోనూ జతకట్టింది. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. 2003లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఠాగూర్ చిత్రంలో చిరు సరసన హీరోయిన్గా నటించింది. అయితే ఇప్పుడు మరోసారి చిరుతో స్టెప్పులు వేయనుంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి ‘భోళా శంకర్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం శ్రియను సంప్రదించగా, ఆమె కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ పాట కోసం ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. చదవండి: ఇండస్ట్రీకి రాకముందు సిరి ఏం చేసేదో తెలుసా? ఫస్ట్ జాబ్ అదేనట -
ఈసారి అఖిల్ అక్కినేనితో ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్
‘ఏజెంట్’ తో ప్రత్యేక స్టెప్పులు వేయనున్నారట హీరోయిన్ ఊర్వశీ రౌతేలా. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ స్పై ఫిల్మ్ ‘ఏజెంట్’. ఇందులో సాక్షీ వైద్య హీరోయిన్. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమాస్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. అయితే ఈ మూవీలోని ఓ ప్రత్యేక పాటలో ఊర్వశీ రౌతేలా డ్యాన్స్ చేయనున్నారని సమాచారం. అఖిల్, ఊర్వశీల మాస్ స్టెప్స్‌తో ఈ పాట అదిరిపోయే రేంజ్లో ఉంటుందట. ‘ఏజెంట్’ చిత్రం ఈ నెల 28న విడుదలకానుంది. కాగా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో ‘బాస్ పార్టీ..’ అనే స్పెషల్ సాంగ్‌లో తన డ్యాన్స్‌తో అలరించారు ఊర్వశి. అలాగే రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా ఆమె ఓ స్పెషల్ సాంగ్ చేశారని తెలిసింది. కాగా ఊర్వశీ రౌతేలా ప్రధాన పాత్రలో నటించిన ‘బ్లాక్ రోజ్’ సినిమా తెలుగులో విడుదల కావాల్సి ఉంది. -
భర్త శివ బాలాజీతో మధుమిత మాస్ డాన్స్, వీడియో వైరల్
టాలీవుడ్ క్యూట్ కపుల్లో నటుడు శివ బాలాజీ, మధుమిత జంట ఒకటి. హీరోహీరోయిన్లుగా నటించిన వీరిద్దరు ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 2004లో వచ్చిన తమిళ చిత్రం ‘ఇంగ్లీస్ కారన్’ షూటింగ్లో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి కొంతకాలం పాటు డేటింగ్ చేశారు. అనంతరం పెద్ద అంగీకారంతో 2009లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇక వివాహం అనంతరం నటకు గుడ్‌బై చెప్పిన మధుమిత ప్రస్తుతం గృహిణిగా పిల్లలు బాధ్యత, ఇంటి వ్యవహారాలను చూసుకుంటుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. చదవండి: ‘కట్టప్ప’ సత్యరాజ్ కూతురు గురించి ఈ ఆసక్తిక విషయాలు తెలుసా? తరచూ తన వ్యక్తిగత విషయాలను, ఫ్యామిలీ వెకేషన్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా భర్త శివ బాలాజీతో కలిసి డాన్స్ చేసిన వీడియో షేర్ చేసింది. పుష్పలో సమంత నటించిన ‘ఊ అంటవా మావ ఊఊ అంటావా’ ఐటెం సాంగ్‌కు భర్తతో కలిసి స్టెప్పులేసింది. ఈ వీడియోకు నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. ఆమె ఇచ్చిన క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, స్టెప్స్‌కి ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతున్నారు. చాలా రోజులు తర్వాత మధుమితను ఇలా కొత్తగా చూస్తున్నామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శివ బాలాజీ-మధుమితల ఈ డాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Madhumitha (@madhumithasivabalaji) -
మహాశివరాత్రి స్పెషల్.. మంచు లక్ష్మి సాంగ్ వైరల్..!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించే వారిలో మంచు లక్ష్మి ఒకరు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. ఇవాళ మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సరికొత్తగా ప్రేక్షకులను పలకరించింది. శివరాత్రి అంటే శివాలయాలు శివ నామ స్మరణతో మారుమ్రోగడం ఖాయం. ఈసారి మంచు లక్ష్మి కూడా ప్రత్యేక గీతంతో అభిమానులను అలరించింది. ఆది శంకరాచార్యులు రచించిన మహాశివుని ‘నిర్వాణ శతకం’ స్వయంగా పాడిన వీడియో రిలీజ్ చేసింది. శివునిపై ప్రత్యేక పాటను మంచు లక్ష్మితో పాటు ఆమె కూతురు విద్య కూడా ఆలపించడం మరో విశేషం. ఈ సాంగ్‌ను ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేసింది. దాదాపు ఎనిమిది నిమిషాల పాటు పాడిన ఈ సాంగ్ యూట్యూబ్‌లో అలరిస్తోంది. ఈ పాటకు మంచు మనోజ్ సైతం అభినందనలు తెలిపారు. సాంగ్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశారు. కాశీలో షూట్ చేసినట్లు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. Always proud of you akka🙏🏼❤️ Awesome song. Wishing you and the team behind this a great success in whatever you guys do. Love you ❤️🙏🏼#HappyMahashivratri #Shambo https://t.co/IocFmhIHUr — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) February 18, 2023 -
SSMB 28: స్పెషల్ సాంగ్‌లో రష్మిక.. పారితోషికం అన్ని కోట్లా?
స్టార్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్ చేస్తే.. ఆ కిక్కే వేరేలా ఉంటుంది. సినిమాకు హైప్ తీసుకురావడానికి ఐటం సాంగ్ బాగా ఉపయోగపడుతుంది. అందుకే మన దర్శకనిర్మాతలు స్పెషల్ సాంగ్‌పై స్పెషల్ కేర్ తీసుకుంటారు. పెద్ద మొత్తంలో పారితోషికం చెల్లించి స్టార్ హీరోయిన్లను ఒప్పిస్తారు. ఇప్పటికే జనతా గ్యారేజ్ లో కాజల్, పుష్పలో సమంత, గనిలో తమన్నా,ఆచార్యలో రెజీనా స్పెషల్ సాంగ్స్ తో మెరుపులు మెరిపించారు. ఇప్పుడు నేషన్ క్రష్ రష్మిక వంతు వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన్నా ఓ స్పెషల్ సాంగ్ చేయనుందట. దీని కోసం రష్మిక భారీగా డిమాండ్ చేస్తోందట. స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేయాలంటే రూ.4 కోట్ల పారితోషికంగా ఇవ్వాలని రష్మిక అడిగిందట. రష్మిక రెమ్యునరేషన్ టాపిక్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రష్మిక హిందీలో రెండు సినిమాలతో పాటు తెలుగులో అల్లు అర్జున్ తో కలిసి 'పుష్ప' సీక్వెల్ 'పుష్ప 2'లోనూ, తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న 'వారసుడు' మూవీలోనూ నటిస్తోంది. -
అందమైన భామలు.. అదిరిపోయే స్టెప్పులు
సినిమా సీరియస్‌గా సాగుతున్నప్పుడు జరగాలి ఓ మ్యాజిక్. స్పెషల్ సాంగ్ ఆ మ్యాజిక్ చేస్తుంది. ఒక్కసారిగా ప్రేక్షకులకు మంచి రిలీఫ్ ఇస్తుంది. అందుకే విడుదలవుతున్న ప్రతి సినిమాలోనూ దాదాపు ఓ స్పెషల్ సాంగ్ ఉండటం కామన్ అయింది. అలా రానున్న రోజుల్లో సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేయనున్న ‘స్పెషల్ సాంగ్స్’ గురించి, ఆ పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేసిన అందమైన భామల గురించి తెలుసుకుందాం. తెలుగు మాస్ ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు హిందీ భామ ఊర్వశీ రౌతేలా. ‘భాగ్ జానీ’, ‘కాబిల్’ వంటి హిందీ చిత్రాల్లో ఇప్పటికే స్పెషల్ సాంగ్స్ చేసిన ఈ బ్యూటీ తెలుగులో ఒకేసారి రెండు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడం విశేషం. చిరంజీవి టైటిల్ రోల్లో, రవితేజ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’లో ఊర్వశి స్టెప్స్ చూడనున్నాం. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకుడు. ఈ చిత్ర సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన స్పెషల్ సాంగ్‌లో చిరంజీవితో కలిసి సూపర్ స్పెషల్ స్టెప్పులేశారు ఊర్వశి. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. కాగా ఊర్వశి చేసిన మరో స్పెషల్ సాంగ్ చిత్రీకరణ కూడా పూర్తయింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌లో రామ్‌తో కలిసి స్టెప్పులేశారు ఊర్వశి. ఊర్వశీ రౌతేలా ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ కానుంది. ఇక ఊర్వశీ రౌతేలా హీరోయిన్గా నటించిన ‘బ్లాక్ రోజ్’ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దర్శకుడు సంపత్ నంది కథ అందించారు. మరోవైపు బుల్లితెర ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్‌ను సంపాదించుకున్న రష్మీ గౌతమ్ స్పెషల్ డ్యాన్స్ మూమెంట్స్‌ను ‘బోళా శంకర్’ చిత్రంలో చూడొచ్చు. చిరంజీవి హీరోగా మోహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. అప్సరా రాణి ఈ చిత్రంలో చిరంజీవితో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌కి డ్యాన్స్ చేశారు రష్మీ. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. ఇంకోవైపు భారత మాలాలు ఉన్న ఆస్ట్రేలియన్ నటి చంద్రికా రవి ‘వీరసింహారెడ్డి’లో బాలకృష్ణతో కలిసి స్పెషల్ డ్యాన్స్ వేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న సినిమా ‘వీరసింహా రెడ్డి’. చిత్ర సంగీతదర్శకుడు తమన్ స్వరపరచిన స్పెషల్ సాంగ్‌లో బాలకృష్ణతో కలసి చంద్రికా రవి మాస్ స్టెప్పులేశారు. చంద్రికా రవి ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే రామ్ ‘రెడ్’ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో మెరిసిన హెబ్బా పటేల్ ‘శాసన సభ’లో కూడా తళుక్కుమననున్నారు. ఇంద్రసేన హీరోగా నటించిన ఈ సినిమాకు వేణు మడికంటి దర్శకుడు. ఈ సినిమాలో ‘నన్ను పట్టుకుంటే...’ అనే పాటలో నర్తించారు హెబ్బా పటేల్. ఈ సినిమాకు ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీత దర్శకుడు. ఇక గత ఏడాది సంక్రాంతికి ‘క్రాక్’లో ‘బూమ్ బద్దల్’ అంటూ సిల్వర్ స్క్రీన్‌ని షేక్ చేసిన అప్సరా రాణి గుర్తుండే ఉంటారు. ఈ బ్యూటీ ఇప్పుడు ‘హంట్’ చిత్రంలో సుధీర్‌బాబుతో కలిసి ‘పాపతో పైలం’ అనే స్పెషల్ సాంగ్ చేశారు. సుధీర్ బాబు హీరోగా శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హంట్’. మహేశ్ సూరపనేని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతదర్శకుడు. వీళ్లే కాదు.. ఇంకా స్పెషల్ సాంగ్స్‌లో మెరవనున్న తారలు కొందరున్నారు. సినిమాకి స్పెషల్‌గా నిలిచే ఈ సాంగ్స్ అందాల తారల కెరీర్లోనూ స్పెషల్‌గా నిలిచిపోతాయి. అందుకే శ్రుతీహాసన్, తమన్నా వంటి అగ్ర తారలు కూడా అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్స్ చేస్తుంటారు. -
వాల్తేరు వీరయ్యలో ఊర్వశి రౌతేల ఐటెం సాంగ్! క్లారిటీ వచ్చేసింది!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాలతో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈచిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరపుకుంటోంది. ఇటీవల ఈ మూవీ టైటిల్ ఖరారు చేసిన ఈ మూవీ నుంచి తాజా ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేల ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. తాజాగా చిత్ర బృందం విడదల చేసిన ఓ ఫోటోతో ఈ వార్తలపై స్పష్టత వచ్చేసింది. సినిమాలో ఐటెం సాంగ్‌కు చిరుతో కలిసి ఆమె స్టెప్పులేసినట్లు తెలుస్తోంది. చదవండి: బర్త్‌డే సర్ప్రైజ్.. వర్షకు కాస్ట్లీ నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చిన ఇమ్మాన్యుయేల్! ఇటీవల ఈ పాటకు సంబంధించిన షూటింగ్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. దర్శకుడు మెహర్ రమేశ్ బర్త్‌డేను వాల్తేరు వీరయ్య సేట్లో సెలబ్రేట్ చేశారు. మూవీ సెట్లో ఆయనతో కేక్ కట్ చేయించిన ఫొటోను డైరెక్టర్ బాబీ ట్విటర్లో షేర్ చేస్తూ ఆయన పుట్టిన రోజును వాల్తేరు వీరయ్య సెట్లో నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. అయితే ఈ ఫొటోలో చిరంజీవి, డైరెక్టర్ బాబీ, మెహర్ రమేశ్ ఇతర క్రూడ్‌తో పాటు నటి ఊర్వశి రౌతేల కూడా దర్శనమించింది. దీంతో ఈ చిత్రంలో ఆమెతో అదిరిపోయే స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేశారని స్పష్టమైందంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా రామ్ పోతినేని-బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కబోయే ఓ సినిమాలో ఆమె ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: విశ్వక్ సేన్, అర్జున్ వివాదంపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ Wishing dearest @MeherRamesh Anna a very happy birthday 🎂 🎉 Super happy to Celebrate your birthday on our #WaltairVeerayya sets along with Boss @KChiruTweets 😍 May you be blessed with best of everything, have a Blockbuster year ahead. ❤️#HBDMeherRamesh pic.twitter.com/OoIMSrue31 — Bobby (@dirbobby) November 6, 2022 -
రామ్ సినిమాలో ఊర్వశీ రౌతేలా.. ఫోటోతో క్లారిటీ
యంగ్ హీరో రామ్ పోతినేని బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా సాగనుంది. పెళ్లిసందడి బ్యూటీ శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్గా నటించనుంది.. శ్రీనివాస సిల్వర్ స్కీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్‌లో కనిపించనుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రూమర్స్‌ని నిజం చేస్తూ హీరో రామ్‌తో సెట్స్‌లో దిగిన ఓ ఫోటోను ఊర్వశీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఈ సినిమాలో ఆమె ఐటెం సాంగ్‌లో నటించనుందనే న్యూస్ కన్ఫర్మ్ చేసినట్లయ్యింది. ఇక అఖండ తర్వాత బోయపాటి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. @ramsayz 🌹♥️ #RP pic.twitter.com/t9eCNweftY — URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) October 27, 2022 -
సమంతకు మరో స్పెషల్ సాంగ్ ఆఫర్? ఈసారి తెలుగులో కాదు!
మంచి కమర్షియల్ సినిమా అంటే అందులో తప్పకుండ ఓ ఐటెం సాంగ్ ఉండాల్సిందే. ఈ మధ్య కాలంలో స్పెషల్ సాంగ్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో తమ సినిమాల్లో ఓ స్పెషల్ సాంగ్ ఉండేలా హీరోలు, దర్శక-నిర్మాతలు చూసుకుంటున్నారు. అంతేకాదు ఈ పాటలో స్టార్ హీరోయిన్స్‌తో స్టెప్పుడు వేయించి మరింత హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు దర్శకులు. చదవండి: మీనా భర్త మృతికి పావురాలే కారణమా? ఈ క్రమంలో కాజల్, తమన్నా, సమంత వంటి స్టార్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్‌లో నటించి మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. ఇటీవల సమంత చేసిన పుష్ప ఐటెం సాంగ్ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు ఈవెంట్స్‌లో, పెళ్లిళ్లలో, షోలో ఈ పాట ఇప్పటికి మారుమోగుతుంది. ఇదిలా ఉంటే సమంత మరోసారి స్పెషల్ సాంగ్‌తో అలరించనుందని తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప చిత్రంలో ఊ అంటావా మామ.. ఊఊ అంటావా సాంగ్‌తో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది సామ్. చదవండి: సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్!, కారణం ఇదేనా? ఈ క్రమంలో ఆమెకు మరో స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈసారి టాలీవుడ్ నుంచి కాకుండ బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందట. హిందీ చిత్రం ‘ఎనిమల్’లోని ఐటెం సాంగ్‌లో నటించేందుకు చిత్ర బృందం సామ్‌ను సంప్రదించిందట. అయితే దీనికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? నో చెబుతుందా? అనేది తెలియాల్సి ఉంది. కాగా సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎనిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నాలు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ మనాలిలో తొలి షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. -
హార్ట్ సింబల్స్‌తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్..
సౌత్‌లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది సమంత. ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'ది ఫ్యామిలీ మేన్ 2'తో బాలీవుడ్‌లోనూ అభిమానులను సంపాదించుకుంది సామ్. అంతేకాకుండా 'పుష్ప' చిత్రంలో చేసిన 'ఊ అంటావా మావా' స్పెషల్ సాంగ్‌తో అనేక మంది చేత 'ఊ' కొట్టేలా చేసింది. ఈ పాటలో తన డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది. అయితే తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ పాటను తనదైన స్టైల్లో ప్రస్తావించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో సల్మాన్ ఖాన్ పాల్గొన్నాడు. ఇందులో భాగంగా 'సల్మాన్ ఖాన్‌ను ఇన్స్పైర్ (ప్రభావితం) చేసిన సినిమా గానీ, పాట గానీ ఏదైనా ఉందా ?' అని సల్లూ భాయిని యాంకర్ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా సల్మాన్ 'ఊ అంటావా మావా' అని హమ్ చేశాడు. ఈ వీడియోను సల్మాన్ ఖాన్ ఫ్యాన్ ట్విటర్లో షేర్ చేశాడు. ఈ ట్వీట్‌ను సామ్ రీట్వీట్‌ను చేస్తూ ఎరుపు రంగులో ఉన్న హార్ట్ ఎమోజీస్‌తో పంచుకుంది. కాగా సమంత ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. యశోద, శాకుంతలం, ఖుషితోపాటు పలు బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో సామ్ నటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట? ♥️♥️♥️ https://t.co/UzkF0PVspl — Samantha (@Samanthaprabhu2) June 26, 2022 చదవండి: హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు.. 'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు -
ట్రెండింగ్‌లో ‘దంపుడు లక్ష్మి’ స్పెషల్ సాంగ్
రుద్ర పిక్చర్స్ పతాకంపై మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి హీరో హీరోయిన్ గా సుకు పూర్వాజ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘మాటరాని మౌనమిది’. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలోని ‘దంపుడు లక్ష్మి’ ఐటమ్ పాటను మధుర మ్యూజిక్ ద్వారా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ దంపుడు లక్ష్మి పాట చూసిన ప్రేక్షకులు మంచి నాటు పాట, చాలా బాగుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాటకు అషీర్ లుక్ సంగీతం అందించగా డి సైయద్ బాషా లిరిక్స్ అందించారు. రేవంత్, మనీష పాండ్రంకి, రాహుల్ కనపర్తి ఈ పాటను ఆలపించారు. ఇప్పుడు ఈ దంపుడు లక్ష్మి పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ.. ‘ఇది నా రెండో సినిమా. మంచి థ్రిల్లర్ ప్రేమ కథ, కథనంతో మీ ముందుకు వస్తున్నాను. మేం ఇటీవల విడుదల చేసిన టీజర్ గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ‘దంపుడు లక్ష్మి’ ఐటమ్ పాటను మధుర మ్యూజిక్ ద్వారా విడుదల చేశాము. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. మంచి నాటు పాట, చాలా బాగుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మా సంగీత దర్శకుడు అషీర్ లుక్ అద్భుతమైన పాటలు ఇచ్చారు, రాజ్ కృష్ణ డాన్స్ స్టెప్స్ ఆ పాటకు ప్రాణం పోశాయి. మా 'దంపుడు లక్ష్మి' ఐటమ్ పాట సోషల్ మీడియాలో ట్రేండింగ్లో ఉంది’ అని ఆయన తెలిపారు. -
ఐటెం సాంగ్స్‌పై సాయి పల్లవి స్పందన, ఏం చెప్పిందంటే..
Sai Pallavi Interesting Comments On Item Songs: హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చిన ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అందం, అభినయంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. తన డ్యాన్స్‌తో ఎంతోమందిని మెస్మరైజ్ చేస్తోంది ఈ నాచులర్ బ్యూటీ. మొదటి నుంచి నటిగా తనకంటూ కొన్ని పరిమితులను పెట్టుకున్న సాయి పల్లవి గ్లామర్ షో, ఎక్స్‌పోజింగ్‌కు దూరమనే సంగతి తెలిసిందే. అంతేకాదు పాత్ర నచ్చితేనే ఆ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ వస్తున్న ఆమె ఇటీవల శ్యామ్ సింగరాయ్ మూవీతో హిట్ కొట్టింది. చదవండి: విజయ్, సమంతలకు థ్యాంక్స్ అంటూ డైరెక్టర్ లేటెస్ట్ అప్డేట్! ఇక త్వరలోనే విరాట పర్యం చిత్రంతో ఫ్యాన్స్‌ను పలకరించబోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల మీడియాతో ముచ్చటించిన సాయి పల్లవి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఐటెం, స్పెషల్ సాంగ్‌లపై ఆమెకు ప్రశ్న ఎదురైంది. పుష్ప మూవీలోని ‘ఊ అంటావా మావ’, రంగస్థలంలోని ‘జిగేలు రాణి’ వంటి తరహా పాటల్లో నటించే అవకాశం వస్తే చేస్తారా? అని హోస్ట్ అడగ్గా.. ఖచ్చితంగా చేయను అని మరు క్షణమే బదులిచ్చింది. దీనిపై ఆమె వివరణ ఇస్తూ.. ‘ఐటెం సాంగ్స్ నాకు కంఫర్ట్‌గా ఉండవు. ఒకవేళ భవిష్యత్తులో అలాంటి వాటిలో నటించే అవకాశం వచ్చినా చేయనని చేప్తాను. చదవండి: ఎలాగో ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోలేను.. నటి ఎందుకంటే వస్త్రధారణ సరిగా లేకపోతే నాకు ఇబ్బందిగా ఉంటుంది. వాటిలో నేను కంఫర్ట్‌గా ఉండలేను. అందుకే స్పెషల్ సాంగ్‌లో నటించలేను. అసలు నాకు అలాంటి పాటలు చేయాలనే ఆసక్తి కూడా లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రేమపై తన అభిప్రాయం ఏంటని అడగ్గా.. ‘జీవితానికి కెరీర్ ఎంత ముఖ్యమో ప్రేమ కూడా అంతే ముఖ్యం. రెండింటిలో ఏది లేకపోయిన జీవితం సంపూర్ణం కాదు’ అని సమాధానం ఇచ్చింది సాయి పల్లవి. చివరగా శ్యామ్ సింగరాయ్‌లో కనిపించిన సాయి పల్లవి ఇప్పటి వరకు ఎలాంటి సినిమాకు సంతకం చేయలేదని తెలుస్తోంది. ఇక రానాతో ఆమె నటించిన విరాట పర్వం జూలై 1న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
'లైఫ్ అంటే ఇట్టా ఉండాలా'.. పూజాతో వెంకీ, వరుణ్ స్టెప్పులు..
F3: Pooja Hegde Life Ante Itta Vundaala Lyrical Song Released: విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా త్రిబుల్ ఫన్‌తో సందడి చేయనున్న చిత్రం 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ 'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్ అని తెలిసిన విషయమే. మిల్క్ బ్యూటీ తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా నటించిన 'ఎఫ్ 3' మే 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదేకాకుండా అంతకుముందు రిలీజైన రెండు సింగిల్స్ ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు తాజాగా మూడో సింగిల్‌ను వదిలారు. లైఫ్ అంటే ఇట్టా ఉండాలా అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మంగళవారం (మే 17) విడుదల చేశారు. ఈ పాటలో బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. పూజాతోపాటు వెంకటేశ్, వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్ కలిసి చిందేసారు. ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించగా, రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి ఆలపించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పార్టీ నంబర్‌గా పేర్కొన్న ఈ పాట పార్టీల్లో, వేడుకల్లో మారుమోగనుంది. చదవండి: ఎఫ్ 3లో సోనాలి చౌహాన్ రోల్‌పై స్పందించిన అనిల్ రావిపూడి -
సమంత ‘ఊ అంటావా..’ పాట సింగర్‌కు గోల్డ్ మెడల్!
సమంత స్సెషల్ సాంగ్ ‘ఊ అంటావా.. మావ ఊఊ అంటావా సింగర్‌కు ఇంద్రావతి చౌహాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ పాటకు గాను ఆమె బిహైండ్‌వుండ్ వారి గోల్డ్ మెడల్‌ను అందుకోనుంది. ప్రముఖ డిజిటల్ మీడియా గ్రూప్ బిహైండ్‌వుడ్ సంస్థ ఈ ఏడాది19 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సంస్థ యానివర్సరి సెలెబ్రెషన్స్‌లో భాగంగా మే 22న ఈ ఏడాది అత్యధిక ప్రజాదరణ పొందిన సినిమాలు, ఉత్తమ నటులు, సింగర్స్‌కు గోల్డ్ మెడల్స్‌ను ప్రదానం చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బిహైండ్‌వుడ్ గోల్డ్ మెడల్ ప్రదానోత్సవానికి ఆమెను ఎంపిక చేశారు. చదవండి: హీరోయిన్ ప్రణీత సీమంతం ఫంక్షన్, ఫొటోలు వైరల్ ఈ సందర్భంగా ఇంద్రావతి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది. ‘నిజంగా నేను ఆశీర్వాదించబడ్డాను. మే 22 ఊ అంటావా.. ఊఊ అంటావా పాటకు గోల్డ్ మెడల్ తీసుకోబోతున్నాను. బెస్ట్ థింగ్స్ ఎప్పుడు ఊహించకుండానే వస్తాయి. నాకు ఈ గుర్తింపు రావడానికి కారణంగా దేవిశ్రీ ప్రసాద్ గారు. ఆయనకు నేను ఎప్పటికి కృతజ్ఞురాలిని. థ్యాంక్యూ సార్. ఇది నిజంగా గర్వించే విషయం’ అంటూ రాసుకొచ్చింది. కాగా ఇంద్రావతి ప్రముఖ సింగర్ మంగ్లీ సోదరి అనే విషయం తెలిసిందే. కాగా సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చదవండి: భర్త విక్కీ కౌశల్‌కు కత్రీనా స్వీటెస్ట్ బర్త్‌డే విషెస్ పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇక విడుదలకు ముందే పుష్ప.. పాటలతో రికార్డులు సృష్టించింది. ఇందులో సమంత నటించిన స్పెషల్ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఈ పాటను ఎన్నో వివాదాలు చూట్టుముట్టిన అదే స్థాయిలో రికార్డు క్రియేట్ చేసింది. సోషల్ మీడియా ఎక్కడ విన్న ఊ అంటావా? పాటే వినిపిస్తోంది. ఈ మూవీ విడుదలై సూమారు 5 నెలల గడుస్తున్నా ఇప్పటికీ ఈ పాట మేనియా ఏమాత్రం తగ్గలేదు. అంతేకాదు ఇటీవల ఓ ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్లో ఈ పాటను ప్రదర్శించడం విశేషం. I'm really so blessed that I'm going to receiving the gold medal on may 22 for oo antava mava song #pushpa movie😍. Best things happen unexpectedly!!! I'm really very much excited and can't express my happiness💃.I will always owe to the @ThisIsDSP sir🙏🏻🙏🏻😍..this is proud moment pic.twitter.com/zVDNuiBFIn — Indravathi Chauhan (@IndravathiChauh) May 15, 2022 -
సమంత పాటంటే ఇష్టం: బాలీవుడ్ హీరో
Ranveer Singh About His Favourite Song Is Samantha Oo Antava: బాలీవుడ్ యంగ్ హీరో రణ్వీర్ సింగ్ ఇటీవల కపిల్ దేవ్ బయోపిక్ '83' చిత్రంతో అలరించాడు. తాజాగా రణ్వీర్ సింగ్ నటిస్తున్న విభిన్న చిత్రం 'జయేశ్‌భాయ్ జోర్దార్'. దివ్యాంగ్ ఠక్కర్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో 'అర్జున్ రెడ్డి' ఫేమ్ షాలినీ పాండేతోపాటు అనన్య నాగల్ల కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు రణ్వీర్ సింగ్. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో రణ్‌వీర్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఈ ఇంటర్వ్యూలో హోస్ట్ రణ్వీర్ సింగ్‌ను 'తెలుగులో మీకు నచ్చిన పాట ఏది ?' అని అడిగాడు. దీనికి అల్లు అర్జున్ హీరోగా చేసిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప: ది రైజ్'లోని 'ఊ అంటావా మావా' అనే సాంగ్ ఇష్టమని తెలిపాడు రణ్వీర్. దీని గురించి రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ 'ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన పాట ఊ అంటావా మావా. ఆ సాంగ్ ప్లే అయినప్పుడు ఐయామ్ గోయింగ్ మ్యాడ్. ఆ పాట మీనింగ్ నాకు తెలియదు. కానీ నా మనసుకు మాత్రం బాగా నచ్చింది. అందుకే ఆ పాటంటే అంత ఇష్టం నాకు. 'అని పేర్కొన్నాడు. పుష్ప మూవీలో సమంత నర్తించిన ఈ స్పెషల్ సాంగ్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. చదవండి: ఓటీటీలోకి సిద్ధార్థ్.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే.. Oo antava from Pushpa is one of my favourite song in recent time: Ranveer Singh 🎧🎺🎻🎸🎶🎵🎼🎹🥁@alluarjun #AlluArjun #Sukumar @ThisIsDSP @Samanthaprabhu2 #RanveerSingh #Pushpa #OoAntavaOoOoAntava pic.twitter.com/6yi5osOwuk — Sreedhar Marati (@SreedharSri4u) May 10, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆనందం పట్టలేక సోషల్ మీడియాలో పంచుకున్న సమంత
సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇక విడుదలకు ముందే పుష్ప.. పాటలతో రికార్డులు సృష్టించింది. ఇందులోని రారా సామీ, టైటిల్ సాంగ్‌లకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక సమంత నటించిన స్పెషల్ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఈ పాటను ఎన్నో వివాదాలు చూట్టుముట్టిన అదే స్థాయిలో రికార్డు క్రియేట్ చేసింది. సోషల్ మీడియా ఎక్కడ విన్న ఊ అంటావా? పాటే వినిపిస్తోంది. చదవండి: ఆసక్తికర సన్నివేశాలతో ‘కేజీఎఫ్ 2’ ట్రైలర్, ఫ్యాన్స్‌కు పండగే.. ఈ మూవీ విడుదలైన నాలుగు నెలలు గడిచిన ఇప్పటికీ ఈ పాట క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. దీనికి తాజాగా జరిగిన ఈ సంఘటనే ఉదాహరణ. ఇంటర్నేషనల్ లెవల్లో సమంత ఐటెం సాంగ్ గుర్తింపు పొందింది. రీసెంట్గా అమెరికాలో జరిగిన ఓ మ్యూజిక్ ఫెస్టివల్లో ఊ అంటావా.. ఊ అంటావా పాట వినిపించడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది చూసి సమంత సైతం నమ్మలేకపోయింది. తన పాటకు ఈ రెంజ్లో రెస్పాన్స్ వస్తుందని ఊహించని సామ్ ఆనందం పట్టలేక ఇందుకు సంబంధించిన వీడియోలను, ట్వీట్లను తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంటుంది. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై బాబు గోగినేని వివాదస్పద రివ్యూ, ఏమన్నాడంటే అమెరికాలోని ఫ్లోరిడాలో మార్చిలో అల్ట్రా మైమీ పేరుతో ప్రతి ఏడాది గ్రాండ్ మ్యూజిక్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు. లక్షలాది మంది ఆడియన్స్ మధ్య ఈ వేడుక ఘనంగా జరుగుతుంది. ఈ క్రమంలో రీసెంట్గా నిర్వహించిన ఈ మ్యూజిక్ ఫెస్టివల్ వేదికపై సమంత నటించి ఊ అంటావా.. ఊహు అంటావా పాటను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ షేర్ చేస్తూ.. ఇది నమ్మశక్యం కానీ రిచ్.. పాన్ ఇండియానా కాదు.. పాన్ వరల్డ్ మూవీ పుష్ప’ అంటూ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఇక అతని ట్వీట్‌ను సమంత రీట్వీట్ చేస్తూ నిజమేనా ? ఇది అల్ట్రా మైమీ మ్యూజిక్ ఫెస్టివల్ లోనా ? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 😳 Are you sure this is #ultramiami .. 😱😱😱 https://t.co/gpWui0Ruwz — Samantha (@Samanthaprabhu2) March 27, 2022 -
సందీప్ వంగ మూవీలో రష్మిక ఐటెం సాంగ్, రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్‌లో హీరోయిన్లు స్టెప్పులు వేయడం సాధారణ విషయమైంది. ఇప్పటికే మిల్కీ బ్యూటీ తమన్నా, కాజల్ అగర్వాల్, సమంతలు స్పెషల్ సాంగ్స్‌తో ఆకట్టుకున్నారు. ఇక వారి బాటలోనే నడిచేందుకు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సైతం సిద్ధం అంటోంది. కన్నడ బ్యూటీ అయిన రష్మీక.. గీతా గోవిందం మూవీతో టాలీవుడ్ స్టార్డమ్ కొట్టేసింది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రం పుష్పతో జాతీయ స్తాయిలో గుర్తింపు పొందింది. చదవండి: ఈ యంగ్ హీరో 50 రోజుల కష్టం, సుకుమార్‌పై అరుదైన దృశ్యం ఈ క్రమంలో బాలీవుడ్‌లోనూ ఆఫర్స్ అందుకుంటూ ఇప్పటికే రెండు సినిమాలను సెట్స్‌పైకి తీసుకువచ్చింది. ఇలా సౌత్, నార్త్‌లో వరస ఆఫర్లతో బిజీగా ఉన్న రష్మిక.. స్పెషల్ సాంగ్స్‌తోనూ అలరించనుందుకు సై అంటుంది. ఈ క్రమంలో ఆమెకు బాలీవుడ్ హీరో రణ్‌బిర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగ కాంబినేషన్లో రూపొందనున్న యానిమల్ మూవీలో ఐటెం సాంగ్ కోసం రష్మికను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ఇప్పటికీ సీక్రెట్‌గానే.. పునీత్ లేడన్న విషయం ఆమెకు చెప్పలేదట అయితే కొన్ని చర్చల అనంతరం ఈ పాటకు రష్మికను ఫిక్స్ చేసిన దర్శక-నిర్మాతలు ఇదే విషయమై ఆమెను కలిశారట. అయితే దీనికి ఒకే చెప్పిన రష్మిక వారు అవాక్కాయ్యే రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ఈ ఐటెం సాంగ్ కోసం ఆమె ఏకంగా రూ. 2 కోట్లు ఇవ్వాలని నిర్మాతలకు చుక్కలు చూపించిందట. సినిమా మొత్తానికి రూ. 2 కోట్లు తీసుకునే రష్మిక.. ఒక ఐటెం సాంగ్‌కు భారీగా డిమాండ్ చేయడం చూసి నిర్మాతలు షాకయ్యారట. చివరకు ఆమెతో పలుమార్లు చర్చలు జరిపి కోటిన్నర ఇవ్వడానికి రెడీ అయ్యారని, దీంతో రష్మిక కన్విన్స్ అయ్యి వారం రోజుల కాల్షీట్ కూడా ఇచ్చినట్లు బీ-టౌన్లో గుసగుసల వినిపిస్తున్నాయి. -
స్పెషల్ సాంగ్‌కి రష్మిక స్టెప్పులు.. ఏ హీరో సినిమా అంటే?
స్టార్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ లో కనిపిస్తే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో టాలీవుడ్ ఇప్పటికే చాలా సార్లు చూసింది. జనతా గ్యారేజ్ లో కాజల్, పుష్పలో సమంత, గనిలో తమన్నా,ఆచార్యలో రెజీనా స్పెషల్ సాంగ్స్ తో మెరుపులు మెరిపించారు. ఇప్పుడు నేషన్ క్రష్ రష్మిక వంతు వచ్చింది. ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఆమె దగ్గరికి రిక్వెస్ట్ వెళ్లిందట. వివరాల్లోకి వెళితే అర్జున్ రెడ్డితో టాలీవుడ్లో సెన్సేషన్ సృష్టించిన సందీప్ వంగా..ఆ తర్వాత ఇదే సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా రణభీర్ కపూర్ తో ఓ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో పరిణీతి చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. స్పెషల్ సాంగ్ కోసం రష్మిక డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడట సందీప్ వంగా. పుష్పతో బాలీవుడ్ లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది రష్మిక.ఇప్పటి వరకు సౌత్ లోనే రష్మిక హవా కనిపిస్తూ వచ్చింది. పుష్పతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టింది.జూన్ 10న రష్మిక నటించిన తొలి హిందీ చిత్రం మిషన్ మజ్ను రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత అమితాబ్ తో కలసి నటించిన గుడ్ బై మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది.ఇప్పుడు యానిమల్ మూవీలో రణభీర్ తో రష్మిక స్టెప్పులేస్తే మాత్రం బీటౌన్ లో ఆమె క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. -
నితిన్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృతిశెట్టి ఇందులో నితిన్‌కి జోడీగా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలాను సంప్రదించారు. స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశీని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.ఇప్పటికే మేకర్స్ ఆమెను సంప్రదించగా, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఏప్రిల్ 29న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. -
మంత్రి మేకపాటి గౌతంరెడ్డిపై స్పెషల్ సాంగ్
-
‘గని’ మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్ చూశారా? అదరగొట్టేసిందిగా..
Tamannaah Special Song Released From Ghani Movie: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘గని’. అల్లు బాబీ - సిద్ధు ముద్ద ఈ సినిమాను నిర్మించారు. ఇందులో వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీతోనే ఆమె తెలుగు తెరకి పరిచయం కాబోతోంది. కాగా ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ పాట చిత్రీకరణ పూర్తి కాగా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేశారు. చదవండి: తొలి రోజు ‘బంగార్రాజు’ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. 'రింగారే రింగా రింగా .. రింగా రింగా' అంటూ సాగే ఈ పాటకు తమన్ సంగీతం అందించాడు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. హారిక నారాయణ్ ఈ పాటను ఆలపించింది. కాగా ఈ పాటలో తమన్నా తన స్టెప్పులతో అదరిగొట్టింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా బాక్సింగ్ నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్గా దూపొందించిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: గుర్రంతో డ్యాన్స్ చేయించిన బాలయ్య.. వీడియో వైరల్ -
స్పెషల్ సాంగ్‌తో పేరొస్తుందని చెప్పి బన్నీ ఒప్పించాడు: సమంత
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఈ సినిమా విడుదలై మూడు వారాలైనా ఇప్పటికీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లు రాబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ. 300కోట్లకు పైగా ట్రేడ్ మార్క్‌ను దాటేసి సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తుంది. అయతే విడుదలకు ముందే పుష్ప రికార్డులు సృష్టించింది. ఈ మూవీలోని ప్రతి పాట ట్రెండింగ్‌లో నిలిచింది. రారా.. సామీ అయితే ఏకంగా ఎల్లలు దాటింది. విదేశీయులు సైతం ఈ పాటకు డ్యాన్స్ చేసిన వీడియోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన త్రిష, కానీ సంతోషంగా లేనంటూ ట్వీట్.. ఇదిలా ఉంటే ఇక పుష్పలో సమంత చేసిన స్పెషల్ సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్ అంతాఇంతా కాదు. ఈ పాట ఎంత హిట్ అయ్యిందో అదే స్థాయిలో వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ఈ పాటలో లిరిక్స్ పురుషులను కించపరిచేలా ఉన్నాయంటూ పురుష సంఘాలు అభ్యంతరకం వ్యక్తం చేశాయి. ఓ వైపు వివాదాల్లో చిక్కుకుంటూనే.. మరోవైపు యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టింది ఈ సాంగ్. అయితే స్టార్ హీరోయిన్ అయిన సమంత ఈ పాటలో నర్తించడం అందరిని ఆశ్చర్యపరిచింది. తనకు ఇందంతా అవసరమా, స్పెషల్ సాంగ్స్ చేయడం ఏంటంటూ ఆమెపై పలువురు విమర్శలు గుప్పించారు. చదవండి: సల్మాన్ ఖాన్‌తో సీక్రెట్ డేటింగ్, క్లారిటీ ఇచ్చిన నటి సమంత.. ఈ నేపథ్యంలో పుష్పలో ఈ సాంగ్ చేయడానికి సమంత మొదట అభ్యంతరం చెప్పిందని, ఈ పాటకు కోసం తనని ఒప్పించామని పుష్ప డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ మూవీ ఈవెంట్స్‌లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై సమంత స్పందించింది. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ స్పెషల్ సాంగ్ చేయడానికి ముఖ్యకారణం అల్లు అర్జున్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘స్పెషల్ సాంగ్ చేయడానికి ముందు భయపడ్డాను. చేయాలా? వద్దా? అన్న సందిగ్ధంలో ఉండిపోయాను. ఆ సమయంలో బన్నీ నాకు స్ఫూర్తినిచ్చాడు. ఆ పాటలో నటిస్తే ఎంత పేరొస్తుందో కూర్చోబెట్టి మరి వివరించాడు. దీంతో బన్నీ మాటలు విన్నాక ఎలాంటి సందిగ్ధం లేకుండా ఒకే చెప్పేశా’ అంటూ చెప్పుకొచ్చింది. అంతేగాక బన్నీ ప్రోత్సాహకం లేకుంటే ఈ పాటలో అసలు నటించేదాన్ని కాదని చెప్పింది సామ్. -
ఇకపై నిన్ను ఎప్పటికీ నమ్ముతాను.. స్టార్ హీరోపై సమంత కామెంట్
నాగ చైతన్యతో విడాకుల తర్వాత కెరీర్ పరంగా జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తుంది సమంత. టాలీవుడ్, బాలీవుడ్,హాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలను ప్రకటిస్తూ.. బిజియెస్ట్ హీరోయిన్గా మారిపోయింది. ఇప్పటికే ఆమె గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం మూవీ షూటింగ్‌ని కంప్లిట్ చేసుకుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమా నటిస్తోంది. దీంతో పాటు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. అలాగే ఓ హాలీవుడ్ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో ‘ఊ అంటావా’అనే స్పెషల్ సాంగ్ చేసి ఔరా అనిపించింది. ఈ పాట ఇప్పడు యూట్యూబ్‌లో టాప్ 100 మ్యూజిక్ వీడియోలలో మొదటి స్థానంలో ఉండడం విశేషం. (చదవండి: ఆ సినిమా లేకపోతే నేను లేను: అల్లు అర్జున్) తాజాగా జరిగిన ‘పుష్ప’థ్యాంక్స్ మీట్లో అల్లు అర్జున్ సమంత గురించి మాట్లాడుతూ... ‘స్పెషల్ సాంగ్ చేసిన సమంతకు థ్యాంక్స్. మీరు ఈ పాటను ఎంత నమ్మారో గానీ.. మేం మిమ్మల్ని ఇంత నమ్ముతున్నామని, మీరు మమ్మల్ని నమ్మారు.. మా మీద నమ్మకంతో చేశారు కదా? ఆ నమ్మకానికి థ్యాంక్స్.సెట్లో నీకు ఎన్ని అనుమానాలు వచ్చాయో ఉన్నాయో నాకు తెలుసు.. తప్పా? ఒప్పా? అని ఆలోచించావ్.. నన్ను నమ్ము అని నేను ఒక్క మాట చెప్పడంతో ఇంకో ప్రశ్న కూడా వేయలేదు. చేసేశావ్. అది నా గుండెను తాకింది. ఏది అడిగినా కూడా ఆలోచించకుండా చేశావ్.. నీ మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది. ప్రపంచంలోనే నెంబర్ వన్ సాంగ్‌గా యూట్యూబ్‌లో నిలబడటం అంటే మామూలు విషయం కాదు’అని బన్నీ సమంతపై ప్రశంసల వర్షం కురిపించాడు. తనను అభినందిస్తూ.. బన్నీ చేసిన వ్యాఖ్యలకు సమంత రిప్లై ఇచ్చింది. బన్నీ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ.. ‘ఇకపై నేను మిమ్మల్నిఎప్పడూ నమ్ముతాను’అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. And now I will always trust you @alluarjun 🙌🙇♀️ https://t.co/EQOGv6M10F — Samantha (@Samanthaprabhu2) December 28, 2021 -
పుష్ప స్పెషల్ సాంగ్‌పై సమంత హాట్ కామెంట్స్, సెక్సీగా కనిపించాలంటే..
Samantha Hot Comments On Her Special Song In Pushpa Movie In Social Media: తను చేసిన ‘పుష్ప’ స్పెషల్ సాంగ్‌పై సమంత హాట్ కామెంట్స్ చేసింది. సెక్సీగా ఉండటానికి నెక్ట్ లెవల్ హార్డ్ వర్క్ చేయాలంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కాగా ఈ స్పెషల్ సాంగ్‌పై వస్తున్న ట్రోల్స్‌పై సమంత ఇప్పటి వరకు పరోక్షంగా స్పందిస్తూ వచ్చింది. తాజాగా ఈ పాట కోసం తను పెట్టిన ఎఫర్ట్స్ గురించి వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో సామ్ తన ఇన్స్టాగ్రామ్ ఓ పోస్ట్ షేర్ చేసింది. చదవండి: వెనక్కి తగ్గిన భీమ్లానాయక్, విడుదల తేదీ వాయిదా పుష్ప స్పెషల్ సాంగ్‌కు సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేస్తూ.. ‘నేను బాగా చేశాను, చెడ్డగా కూడా చేశాను. కొన్ని సందర్భాల్లో సీరియస్ అయ్యాను. నవ్వించాను కూడా. ఇలా నేను తీసుకునే ప్రతి నిర్ణయంలో రాణించాడానికి శ్రమిస్తున్నాను. కానీ సెక్సీగా ఉండటానికి దానికి మించిన స్థాయిలో హార్డ్ వర్క్ చేయాలి’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో సామ్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. ఇక ఈ మూవీ సమంత చేసిన స్పెషల్ సాంగ్ రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామ్ ఈ పాటలో నటిస్తుందనగానే ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. చదవండి: ‘పుష్ప’ స్పెషల్ సాంగ్‌పై ట్రోల్స్, ఎట్టకేలకు స్పందించిన సమంత రిలీజ్ అనంతరం కూడా ఈ పాట అదే రేంజ్లో యూట్యూబ్‌లో దూసుకుపోయింది. ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' అంటూ సాగే ఈ పాటకు ఏ రేంజ్లో రెస్పాన్స్ వచ్చిందో అంతే స్థాయిలో విమర్శలు కూడా ఎదురయ్యాయి. ‘మీ మగ బుద్ది వంకర బుద్ధి’ అనే లిరిక్స్‌పై వివాదం చెలరేగింది. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ మూవీ ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. తగ్గేదే లే అనే రేంజ్లో పుష్ప బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి నుంచి పుష్ప సంచలనం సృష్టిస్తూనే ఉంది. ఫస్ట్‌లుక్ పోస్టర్ల నుంచి ట్రైలర్, పాటలకు అన్ని సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
జన్మదినం సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌పై ప్రత్యేక గీతం
-
‘పుష్ప’ స్పెషల్ సాంగ్‌పై ట్రోల్స్, ఎట్టకేలకు స్పందించిన సమంత
Samantha Response On Trolls On Her Pushpa Movie Special Song: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ మూవీ డిసెంబర్ 17న విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ షూటింగ్ మొదలైనప్పటి నుంచి పుష్ప అత్యంత క్రేజ్‌ను సంతరించుకుంది. ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలకు భారీ స్పందన వచ్చింది. ఇక ఈ మూవీలో స్టార్ హీరోయిన్ సమంత చేసిన స్పెషల్ సాంగ్ రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లదు. ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' అంటూ సాగే ఈ పాటకు ఏ రేంజ్లో రెస్పాన్స్ వచ్చిందో అంతే స్థాయిలో విమర్శలు కూడా ఎదురయ్యాయి. ‘మీ మగ బుద్ది వంకర బుద్ధి’ అనే లిరిక్స్‌పై వివాదం చెలరేగింది. చదవండి: ప్రముఖ టాలీవుడ్ నటి హంసానందినికి క్యాన్సర్ ఇక ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పురుషుల సంఘంతో పాటు తమినాడు పురుషు సంఘం కూడా కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇలా యూట్యూబ్‌లో ఓ వైపు రికార్డు స్థాయిలో వ్యూస్ రాబుడుతూ ట్రెండింగ్‌లో దూసుకుపోయిన ఈ సాంగ్‌ను మరో వైపు వివాదాలు చుట్టుముట్టాయి. ఈ పాటపై వస్తున్న వ్యతిరేకతపై ఇప్పటికే బన్నీ, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్‌లు స్పందించగా ఇప్పటి వరకు సమంత పెదవి కూడా విప్పలేదు. ఈ క్రమంలో తాజాగా పుష్ప స్పెషల్ సాంగ్‌పై సామ్ స్పందించింది. పుష్ప మూవీ సక్సెస్ సందర్భంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సమంత తన స్పెషల్ సాంగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: సర్ప్రైజింగ్: రెండు నెలల్లోనే బిగ్‌బాస్ 6 తెలుగు సీజన్ పుష్పలో తను భాగమైనందకు చాలా సంతోషంగా ఉందని, ఈ స్పెషల్ సాంగ్ తనకు చాలెంజింగ్‌గా అనిపించిందని తెలిపింది. అంతేగాక ఈ పాటలో డ్యాన్స్, బన్నీకి సమానంగా స్టేప్పులు వేయడం ఇలా ప్రతిథి తనకు చాలా ఎక్జయిటింగ్‌గా అనిపించింది అని పేర్కొంది. అంతేగాక ఈ పాటకు వస్తున్న రెస్పాన్స్, ఆడియన్స స్పందన చ్తూస్తుంటే చాలా థ్రిల్లింగ్‌గా ఉందంటూ షాకింగ్ కామెంట్ ఇచ్చింది. ఇది ఓ మ్యాడ్నెస్ అంటూ వ్యాఖ్యానించింది. అలాగే సోషల్ మీడియాలో ఈ పాటపై వస్తున్న ఫన్నీ వీడియోస్‌పై సమంత తన ట్విట్టర్ వేదికగా స్పందించింది. కొందరు యువకులు ఈ పాటను షార్ట్ వీడియోగా తీసి ఎగ్జామ్స్ ఉన్నాయ్ కదరా.. అంటే ఎగ్జామ్‌లో ఊ అంటావా.. ఊహు అంటావా మావా అనే పాట రాస్తానేమోనని భయంగా ఉందిరా అంటూ ట్రోల్ చేశారు. వీడియోను సామ్ నవ్వుతున్న ఎమోజీలను జత చేసి రీట్వీట్ చేసింది. 😂😂😂😂 https://t.co/W7TUgPP0gN — Samantha (@Samanthaprabhu2) December 19, 2021 -
స్పెషల్ సాంగ్ చేయడానికి సమంత ఎందుకు ఒప్పుకుందో తెలుసా?
Pushpa Director Sukumar Reveals Secrets About Samantha Item Song: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' మూవీ అద్భుతమైన వసూళ్లతో దుమ్మురేపుతుంది. ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా'.. అనే పాట ఈ చిత్రానికే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రంలోని లిరిక్స్‌పై వివాదం చెలరేగినా, అదే స్థాయిలో సూపర్ హిట్టయ్యింది. సమంత ఐటెం సాంగ్ చేస్తుందనగానే ఈ పాటపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు విభిన్న పాత్రలతో స్టార్ హీరోయిన్గా సత్తా చాటుతున్న సమంత అసలు ఐటెం సాంగ్ చేయడానికి ఎలా ఒప్పుకుంది అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ విషయంపై డైరెక్టర్ సుకుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మొదట స్పెషల్ సాంగ్ చేయడానికి సమంత ఒప్పుకోలేదు. అలాంటి పాటలు నాకు కరెక్ట్ కాదేమో అని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో నేనే తనని కన్విన్స్ చేశాను. ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు..కాబట్టి ఇబ్బంది ఉండదని చెప్పా. ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు కాబట్టి ఇదో కొత్త అనుభవం..నటిగా ఓ సరికొత్త సమంతను చూస్తారు అని చెప్పా. నా మాట మీద నమ్మకంతో సమంత స్పెషల్ సాంగ్ చేయడానికి అంగీకరించింది అని సుకుమార్ వెల్లడించారు. -
దేవీశ్రీ ప్రసాద్‌కి వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్
Raja Singh Warning To Music Director Devi Sri Prasad Over His Comments: 'పుష్ప' సినిమా ఐటెం సాంగ్‌పై వివాదం ఇంకా ముదరుతూనే ఉంది. ఇటీవలె ఈ సాంగ్‌పై వస్తున్న విమర్శలపై దేవీశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. పుష్ప ప్రమోషన్స్‌లో భాగంగా ఐటెం సాంగ్స్‌ను భక్తి గీతాలతో పోలుస్తూ దేవీశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. దేవీశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు. వెంటనే దేవీశ్రీ ప్రసాద్ హిందువులకు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ఆయన్ను బయట తిరగనివ్వమని వార్నింగ్ ఇచ్చారు. ఐటెం సాంగ్‌లోని కొన్ని లిరిక్స్‌ని దేవుడి శ్లోకాలతో పోల్చాడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజాసింగ్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా పుష్ప ప్రమోషన్స్‌లో పాల్గొన్న డీఎస్పీ.. తన దృష్టిలో భక్తి గీతాలు, ఐటెం సాంగ్స్ ఒక్కటేనని మాట్లాడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా 'రింగ రింగా', 'ఊ అంటావా మావా' పాటలను సైతం భక్తి గీతాలుగా మార్చి పాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
సమంత స్పెషల్ సాంగ్‌పై పేరడీ, అమ్మాయిలకు కౌంటర్‌గా లిరిక్స్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్‌ను వివాదాలు చూట్టుముట్టుతున్నాయి. ఊ అంటావా మామ.. ఊఊ అంటావా అంటూ సాగే ఈ పాటపై పురుష సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పాటలో మీ మగబుద్ధి వంకర బుద్ధి అనే లిరిక్స్ మగవారిని చెడ్డవారిగా చూపించినట్టు ఉన్నాయంటూ ఆందోళనకు దిగారు. దీనిఇన తొలగించాలని లేదంటూ కేసు పెడుతామని ఏపీ పురుషుల సంఘం హెచ్చిరించింది. చదవండి: వివాదంలో పుష్ప స్పెషల్ సాంగ్, స్పందించిన దేవిశ్రీ ఇదిలా ఉంటే ఈ పాటు యూట్యూబ్‌లో దూసుకుపోతూ ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప స్పెషల్ సాంగ్ మానియానే కనిపిస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ పాటకు కౌంటర్‌గా పేరడీలు కూడా వచ్చేశాయి. మగాళ్లంతా ఇంతే అన్న రితీలో ఉన్న లిరిక్స్‌కు అడవాళ్లకు కౌంటర్ ఇస్తూ ఉన్న ఈ పేరడీ సాంగ్ సోషల్ మీడియాలో హల్చలన్ చేస్తోంది. మరి ఈ పాట ఎలా ఉందో చూద్దాం. చదవండి: సమంత స్పెషల్ సాంగ్‌ను చుట్టుముడుతున్న వివాదాలు, తమిళంలోనూ వ్యతిరేకత ‘కోక కట్టినా.. గౌను వేసినా వంకరగా చూస్తారానే లిరిక్స్‌కు దీటుగా.. పొట్టి బట్టలు వేసి టెంప్ట్ చేస్తారంటూ పేరడీ సాంగ్‌లో రాసుకొచ్చారు. రంగుతో పని లేకుండా అందరినీ వంకరగా చూస్తారన్నదానికి.. అబ్బాయి అందాన్ని కాకుండా డబ్బును చూసి ఊ.. అంటారనేది కౌంటర్ లిరిక్. బొద్దు, సన్నం కాదు.. ఒంటిగ ఉంటే.. నలిపేస్తారని అక్కడ అంటే.. షాపింగ్, సినిమా షికార్ల పేరుతో ఊడ్చేస్తారంటూ కౌంటర్ ఇచ్చారు. పెద్ద మనిషిలాగే ఉంటారు.. చీకటి పడితే.. తప్పుడు ఆలోచనలే అని అక్కడ అంటే.. సమయం వచ్చినప్పుడు అందరూ వంకరగా చూస్తారు’ అంటూ ఈ పేరడీలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పేరడీ సాంగ్ చర్చనీయాంశమైంది. -
వివాదంలో పుష్ప స్పెషల్ సాంగ్, స్పందించిన దేవిశ్రీ
Devi Sri Prasad Strong Counter To Trolls Over Pushpa Movie Special Song: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్‌పై వస్తున్న వివాదాలపై రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్పందించాడు. ఇటీవల జరిగిన ‘పుష్ప’ ఈవెంట్లో దేవిశ్రీ మాట్లాడుతూ.. ఐటెం సాంగ్స్ అన్ని తనకు డివోషనల్ సాంగ్సే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘నాకు అన్నీ ఒకటే. నేను కేవలం మ్యూజిక్ గురించి మాత్రమే ఆలోచిస్తాను. ఐటెం సాంగ్ మీకు మాత్రమే నాకు కాదు. ఐటెం సాంగ్స్ అన్ని నాకు డివోషనల్ సాంగ్సే’ అని అన్నాడు. చదవండి: సమంత స్పెషల్ సాంగ్‌ను చుట్టుముడుతున్న వివాదాలు, తమిళంలోనూ వ్యతిరేకత ఉదాహరణకు పాడి చూపిస్తాను అంటూ తాను కంపోజ్ చేసిన రెండు ఐటెం సాంగ్స్‌కు డివోషనల్ లిరిక్స్‌తో ట్యూన్ కట్టి పాడి వినిపించాడు కూడా. ఆర్య 2లోని ‘రింగ రింగ..’ సాంగ్‌కు ‘నాకు ఉన్న కోరికలన్నీ.. నువ్వే తీర్చాలి స్వామి.. స్వామీ.. స్వామీ..’ అంటూ అదే ట్యాన్తో జతకలిపాడు. ఇక ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా..’ సాంగ్‌కు కూడా ‘స్వామీ.. నేను కొండ ఎక్కాను, పూలు పళ్ళు అర్పించాను.. ప్రసాదం తినేసి.. నా కష్టాలు తీర్చు స్వామి.. ఊ అంటావా స్వామి.. ఊ ఊ అంటావా స్వామి..’ అని పాడి వినిపించాడు. చదవండి: ‘పుష్ప’ థియేటర్ ఎదుట ఫ్యాన్స్ ఆందోళన, రాళ్లతో దాడి అలాగే ఇటీవల విడుదలైన పుష్ప స్పెషల్ సాంగ్‌ను ప్రముఖ డివోషనల్ సింగర్ శోభారాజ్ గారు ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ అంటూ డివోషనల్‌కి మార్చి పాడుకున్నారంటూ డీఎస్పి వివరణ ఇచ్చాడు. దీనిపై దేవిశ్రీ కామెంట్ చేసిన అనంతరం సింగర్ శోభరాజ్ ఈ పాటను ‘ఊ అంటావా మాధవ.. ఊ ఊ అంటావా మాధవ..’ అని కృష్ణుడి కోసం పాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీని గురించే దేవిశ్రీ మాట్లాడుతూ పాటని మనం ఎలా తీసుకుంటే అలాగే ఉంటుందంటూ విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. -
సమంత ఐటెం సాంగ్‌పై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్
'పుష్ప' సినిమాలో సమంత స్పెషల్‌సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అదే స్థాయిలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. సమంత తొలిసారిగా చేసిన ఐటెం సాంగ్‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. పాట లిరిక్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ పాటను బ్యాన్ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ పురుషుల సంఘం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇటీవలె తమిళనాడులోని పురుషుల సంఘం సైతం ఏపీలోని చిత్తూరు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తాజాగా పుష్ప ప్రమోషన్లలో పాల్గొన్న అల్లు అర్జున్ ఈ కాంట్రవర్సరీపై స్పందించారు. ‘మీ మగబుద్ధే వంకరబుద్ధి..' అంటూ పాట లిరిక్స్‌పై వస్తున్న వివాదాలపై మీ స్పందన ఏంటి అని ఓ రిపోర్టర్ బన్నీని ప్రశ్నించగా... 'లిరిక్స్‌లో తప్పు లేదు, ఇదే నిజం' అంటూ షాకింగ్ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. "ஊ சொல்றியா மாமே!" பாடலில் வருவது உண்மை தானே...! அல்லு அர்ஜூன் பதில்..#AlluArjun #Pushpa pic.twitter.com/1TLqtscOe7 — Shruti TV (@shrutitv) December 14, 2021 -
సమంత స్పెషల్ సాంగ్‌ను చుట్టుముడుతున్న వివాదాలు, తమిళంలోనూ వ్యతిరేకత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్‌ను వివాదాలు చూట్టుముట్టుతున్నాయి. ఇప్పటికే ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ పురుషుల సంఘం కోర్టు ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పురుషులందరిని చెడ్డగా చూపించేలా ఈ పాట ఉందని, ఈ సాంగ్ బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేసింది పురుషుల సంఘం. తాజాగా ఈ పాటకు తమిళంలోనూ వ్యతిరేకత వస్తోంది. ఈ పాటలోని ‘మీ మగబుద్ధే వంకరబుద్ధి..' అనే లిరిక్స్ వివాదం రేపుతున్నాయి. చదవండి: ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుతం నో ఆఫర్స్, అయినా తగ్గని క్రేజ్.. దీనిపై తాజాగా తమిళనాడు పురుషుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పాటను తొగించకుంటే పాటకు డ్యాన్స్ చేసిన సమంత, పాట పాడిన ఆండ్రియా, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, గేయరచయిత వివేకాపై కేసు పెడతామని హెచ్చరించింది. ‘ఓ సొల్రియా’ అనే పాట తమిళంలోనూ సూపర్ హిట్ అయింది. ఈ పాటను తెలుగులో చంద్రబోస్ రాయగా, తమిళంలో గేయరచయిత వివేకా రాశారు. ఇటీవల విడుదలైన ఈ లిరికల్ ఈ పాటకు తెలుగుతో పాటు తమిళంలోనూ సూపర్ రెస్పాన్స్ వస్తోంది. చదవండి: ‘పుష్ప’ మూవీకి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇప్పటికే 20 మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. అయితే ఈ పాటలో ఉన్న పదాలు పురుష సమాజాన్ని మొత్తం కించపరిచేలా ఉందని, అందుకే ఈ పాటను బ్యాన్ చేయాలంటూ తమిళనాడులోని పురుషుల సంఘం ఏపీలోని చిత్తూరు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కాగా అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప సినిమా రేపు(డిసెంబర్ 17) విడుదలవుతోంది. ఎర్ర చందనం స్మంగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏడు భాషల్లో విడుదలవుతుంది. ఈ చిత్ర ఆడియో ఐదు భాషల్లో హిట్ కావడం గమనార్హం. -
మహిళల పరువు పోయింది.. సమంత స్పెషల్ సాంగ్‌పై మాధవిలత షాకింగ్ కామెంట్స్
Madhavi Latha Shocking Comments On Samantha Special Song In Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో సమంత చేసిన ఐటెం సాంగ్‌కు ఎంతగా రెస్పాన్స్ వస్తుందో అంతే రేంజ్లో వివాదాలు అలుముకుంటున్నాయి. ఊ ఉంటావా మామ.. ఊఊ అంటావా అంటు సాగే ఈ పాట ఓ వైపు వ్యూస్ పరంగా దూసుకుపోతూ యూట్యూబ్‌లో రికార్డు సృష్టిస్తోంది. మరో వైపు మగవారి మనోభవాలను దెబ్బతీశారంటూ ఈ పాటపై ఏపీ పురుషుల సంఘం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చదవండి: Allu Arjun Shoulder Surgery: ‘గతంలో నా ఎడమ భుజానికి రెండుసార్లు సర్జరీ జరిగింది’ మగవాళ్లంతా చెడ్డవారు అనే అర్థం వచ్చేలా ఈ సాంగ్ ఉందని, వెంటనే దీనిని తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అంతేగాక పుష్ప టీంతో పాటు సమంతపై కూడా కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో సమంత స్పెషల్ సాంగ్‌పై పురుషుల సంఘం పెట్టిన కేసుపై మాధవిలత స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఫేస్బుక్ వేదికగా ఆమె ఓ పోస్ట్ షేర్ చేస్తూ మహిళల పరువు పోయిందంటూ అసహనం వ్యక్తం చేసింది. ‘వాయమ్మో పుష్ప మూవీ సాంగ్ మీద కేసు అంటగా. ఈ లెక్కన ఇండస్ట్రీలో 98 శాతం పాటలు అలానే ఉంటాయి. సాంగ్స్ లేని మూవీ చెయ్యాలి. చదవండి: గతంలో చాలా తప్పులు చేశాను, కొన్ని పబ్లిక్‌గానే జరిగాయి: స్టార్ హీరోయిన్ నేను కూడా అమ్మాయిల మీద రాసే పాటలకి కేసులు పెడతా. పుష్పలో రారా సామీ సాంగ్ మీద కేసు వేస్తా. ఏంటీ ఒక అమ్మాయికి మగాడిని చూస్తే.. అతను పిలిస్తే అంత చులకనగా వెంటపడి వెళ్లిపోద్దా? అబ్బాయి నడిచినచోట భూమిని మొక్కుతుందా? ఒక మహిళ పరువు పోయింది. ఛ నాకు నచ్చలే. నేనూ కేసు పెడతా. అంతే తగ్గేదేలే’ అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో సమంత స్పెషల్ సాంగ్‌ను వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో మాధవిలత పెట్టిన ఈ పోస్ట్ హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై పలువురు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. -
సమంత ఐటెం సాంగ్ కోసం అన్ని కోట్లు ఖర్చుపెట్టారా?
Pushpa Movie Makers Spend Huge Amount on Samantha Item Song: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న సమంత ఐటెం సాంగ్ రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు సమంత స్పెషల్ సాంగ్‌తో మరింత హైప్ క్రియేట్ అయ్యింది.‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అంటూ సమంత చిందేసిన ఈ పాట కోసం మేకర్స్ దాదాపు రూ.5కోట్లు వరకు ఖర్చుపెట్టారని తెలుస్తుంది. ఈ ఒక్క సాంగ్ కోసమే సమంతకు సుమారు కోటిన్నరకు పైగా ఖర్చు పెట్టారని తెలుస్తుంది. దీంతో పాటు భారీ సెట్టింగ్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కించారట. సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ హైలెట్‌గా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సాంగ్ 45 మిలియన్స్‌కి పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతుంది. -
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సమంత స్పెషల్ సాంగ్
Youtube Records Of Samantha Oo Antava Oo Antava Song In Pushpa: ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా 'పుష్ప' మ్యానియా కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సమంత తొలిసారిగా ఐటెం సాంగ్ చేయడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. పాట అంటూ సమంత చేసిన ఈ సాంగ్ యూట్యూబ్‌ను దుమ్మురేపుతుంది. సమంత గ్లామర్, చంద్రబోస్ లిరిక్స్ ఒక ఎత్తైతే, గాయని ఇంద్రావతి చౌహాన్ తన మత్తు వాయిస్‌తో పాటను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది.చదవండి: నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే పనులు చేయను: నాగ చైతన్య తాజాగా అన్ని భాషల్లో కలుపుకొని ఈ పాటకి 45 మిలియన్స్‌కి పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా 1.6మిలియన్స్‌కి పైగా లైక్స్ వచ్చాయి. థియేటర్స్‌లో ఈ సాంగ్ మరింత సందడి చేయడం ఖాయమని అంటున్నారు. ముఖ్యంగా సమంత పర్ఫార్మెన్స్కి బొమ్మ దద్దరిల్లుతుందని మేకర్స్ భావిస్తున్నారు. కాగా సినిమాలో ఇంటర్వెల్‌కి ముందుగానే ఈ సాంగ్ సందడి చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. చదవండి: సమంత ఐటెం సాంగ్‌కి చిందేసిన బోల్డ్ బ్యూటీ అరియానా నాగ చైతన్య బెస్ట్‌ఫ్రెండ్‌కి బర్త్‌డే విషెస్ చెప్పిన సమంత 45M+ views with 1.6M+ Likes for the Record Breaking SIZZLING SONG OF THE YEAR💥 -https://t.co/xuag0ghoHu@alluarjun @iamRashmika @Samanthaprabhu2 @aryasukku @ThisIsDSP @adityamusic @TSeries @MythriOfficial #PushpaTheRise#PushpaTheRiseOnDec17 pic.twitter.com/OH3jDPvJhY — Pushpa (@PushpaMovie) December 15, 2021 -
సమంత ఐటెం సాంగ్‌కి చిందేసిన బోల్డ్ బ్యూటీ అరియానా
Ariyana Dancing For Samantha Oo Antava Oo Oo Antava Song In Pushpa: 'పుష్ప' మ్యానియా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తే, సమంత స్పెషల్ సాంగ్‌తో ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ఈ సినిమాలోని ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. పాట ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. సౌత్ ఇండియన్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ వ్యూస్ రాబట్టిన పాటగా దుమ్మురేపుతుంది. ముఖ్యంగా సమంత స్టన్నింగ్ లుక్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాజాగా బిగ్‌బాస్‌తో బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీ సైతం ఈ పాటకు తనదైన స్టైల్లో చిందులేసింది. రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కాగా అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్17న రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) -
సమంతలా నేను చేస్తానో లేదో చెప్పలేను : రష్మిక
Rashmika Mandanna About Samantha Special Song In Pushpa Movie: వరుస సినిమాలతో టాప్ హీరోయిన్గా దూసుకెళ్తున్న రష్మిక మందన్నా నటించిన లేటెస్ట్ మూవీ 'పుష్ప'. డిసెంబర్17న ఈ చిత్రం ఫస్ట్ పార్ట విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న రష్మిక పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌తో నటించాలనుకున్న తన కోరిక నెరవేరిందని, శ్రీవల్లి క్యారెక్టర్ కొత్త అనుభూతినిచ్చిందని తెలిపింది. ఇక ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేయడంపై మాట్లాడుతూ.. సూపర్‌స్టార్‌గా రాణిస్తూనే, స్పెషల్ సాంగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి షాకయ్యా. సాంగ్ షూట్ అవగానే అద్భుతంగా చేశావని సామ్‌కి మెసేజ్ పంపించా. అయితే ఇలాంటి అవకాశం నాకు వస్తే మాత్రం చేస్తానో లేదో కశ్చితంగా చెప్పలేను అని రష్మిక తెలిపింది. -
సమంత ‘పుష్ప’ స్పెషల్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది
Samantha Pushpa Movie Special Song Release Date Fix: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరెకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప లో సమంత స్పెషల్ సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ పాట చిత్రీకరణ మొదలు కాగా సోమవారంతో పూర్తయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సాంగ్‌పై పుష్ప టీం అప్డేట్ ఇచ్చింది. డిసెంబర్ 10న ఈ సాంగ్‌ను విడుదల చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందంప్రకటించింది. లంగా జాకెట్ ధరించి, మాస్ లుక్‌తో బ్యాక్ సైడ్ మాత్రమే కనిపిస్తున్న సమంత ఫోటోను ఇప్పటికే విడుదల చేసిన మూవీ యూనిట్ ఈ సందర్భంగా సమంత ఫుల్‌లుక్‌ను విడుదల చేసింది. చదవండి: అషూరెడ్డి ప్రెగ్నెంటా?! షాక్‌లో ఫ్యాన్స్, ఇంతగా దిగజారిపోయావా! కాగ ఆఈ స్పెషల్ సాంగ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చినట్లు చిత్రబృందం చెబుతోంది. ఈ మ్యూజిక్‌కి బన్నీతో సమంత ఇరగదీసే స్టెప్పులేసిందని సమాచారం. ‘ఉ అంటావా.. ఊ అంటావా’ అంటూ ఈ పాట సాగునుందని తెలుస్తోంది. ఇప్పటివరకు కెరీర్లో ఒక్కసారి కూడా స్పెషల్ సాంగ్స్ చేయని సామ్ మొదటిసారిగా బన్నీ కోసం ఈ సాంగ్‌లో స్టెప్పులేసింది. దీంతో పుష్ప సినిమాకు సమంత, ఈ స్పెషల్ సాంగ్ మరింత స్పెషల్‌గా మారింది. కేవలం ఐదు రోజులు మాత్రమే షూటింగ్ చేసిన ఈ పాట కోసం సమంత ఏకంగా కోటి 30 లక్షల కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. This winter is going to get heated up with @Samanthaprabhu2's moves 🔥🔥 'Sizzling Song of The Year' on 10th DEC 💥💥#PushpaTheRise#PushpaTheRiseOnDec17 @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @resulp @adityamusic @MythriOfficial pic.twitter.com/KL0d6L10ya — Pushpa (@PushpaMovie) December 8, 2021 -
చిరు సినిమాలో రష్మీ స్పెషల్ సాంగ్‌కు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Rashmi Gautam Remuneration Goes Hot Topic In Chiranjeevi Bhola Shankar Movie Special Song: బుల్లితెరపై దూసుకుపోతూ టాప్ యాంకర్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. తొలుత వెండితెరపై సహానటి పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకి పరిచయమైన రష్మీ ప్రముఖ కామెడీ షోతో తనకంటూ నేమ్, ఫేమ్‌ని సంపాదించుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు వెండితెరపై అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోన్న రష్మీ తాజాగా అనసూయను ఫాలో అవుతోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే ఆఫర్ కొట్టేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’. చదవండి: ఆ విషయంలో ఇంప్రెస్ అయిన బన్నీ, పుష్ప టీంకు స్పెషల్ గిఫ్ట్స్ ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. చిరు సినిమాలంటే పాటలకి ఉండే ప్రత్యేకత గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. అందులో మెగాస్టార్ ఆ పాటలకు కాలు కదిపితే ఆ రచ్చ మామూలుగా ఉండదనే విషయం ఆయన అభిమానులకే కాదు సినీ ప్రేక్షకులకు తెలిసిందే. అంత క్రేజ్ ఉన్న చిరు సినిమాలో రష్మీ స్సెషల్ సాంగ్ చేయడమంటే బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే. ఈ క్రమంలో ఈ పాటకు రష్మీ తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్‌టాపిక్‌గా మారింది. ఐటెం సాంగ్ చేయడానికి రష్మీ భారీగానే పారితోషికం అందుకుంటోందని ఫిలీం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్‌తో స్టెప్పేసే అవకాశం వచ్చినా రష్మీ రెమ్యునరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గలేదట. చదవండి: మరోసారి పెళ్లికి సిద్దమవుతున్న 7/G బృందావన కాలని హీరోయిన్..! ఈ ఐటమ్ సాంగ్ చేయడానికి భారీగానే డిమాండ్ చేసిందని వినికిడి. దీంతో ఈ ఒక్క పాట కోసం ఆమెకు దాదాపు 40 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. అది విని అంతా అవాక్కవుతున్నారు. ఒక్క పాటకే అంత పారితోషికమా? ఇది రష్మీకి గోల్డెన్ ఆఫర్ లాంటిది అంటున్నారు. అంతేకాదు చిరుతో స్టెప్పులేసి థియేటర్లలో రష్మీ గోల పెట్టించబోతోందని చెప్పుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే రష్మీ- చిరంజీవిల కాంబోలో ఈ సాంగ్ సెట్స్ మీదకు రానుందట. దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించబోతున్నారట. ఇక మరో ఆసక్తికర విషయమేంటంటే ఈ సాంగ్ కోసం రష్మీని రిఫర్ చేసింది శేఖర్ మాస్టార్ అట. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి. చదవండి: ప్రముఖ యూట్యూబ్ స్టార్ మృతి, దీప్తి సునైనా దిగ్భ్రాంతి -
పుష్ప స్పెషల్ సాంగ్: లంగా జాకెట్లో సమంత.. మాస్ లుక్ అదిరిందిగా!
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరెకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప లో సమంత స్పెషల్ సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ స్పెషల్ సాంగ్ త్వరలోనే విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా తెలియజేస్తూ.. సమంత లుక్‌ని విడుదల చేసింది. లంగా జాకెట్ ధరించి, మాస్ లుక్‌లో బ్యాక్ సైడ్ మాత్రమే కనిపిస్తున్న సమంత ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’గా వస్తున్న ఈ పాటలో సమంత అదిరిపోయే స్టెప్పులేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. బన్నీ- సుకుమార్- దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చే స్పెషల్ సాంగ్ ఏ రేంజ్లో ఉంటాయో ఊహించుకోవచ్చు. దానికి తోడు సమంత చేస్తున్న తొలి స్పెషల్ సాంగ్ ఇది.. మరి ఈ సాంగ్ ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌ని డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయనున్నారు. A Rocking Number with Icon Star @alluarjun & @Samanthaprabhu2 being shot in a gigantic set 🔥 Get ready to witness the 'Sizzling Song of The Year' soon💥#PushpaTheRise #ThaggedheLe 🤙#PushpaTheRiseOnDec17@iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic @MythriOfficial pic.twitter.com/Y1PbbAmoIm — Pushpa (@PushpaMovie) November 30, 2021 -
నాగార్జున సినిమాలో జాతిరత్నాలు బ్యూటీ
Jathi Ratnalu Heroine Faria Abdullah Gets A Special Chance In Bangarraju: చిట్టి.. నా బుల్బుల్ చిట్టి.. అంటూ కుర్రకారు మనసు దోచుకున్న నటి, సొగసైన పొడగరి ఫరియా అబ్దుల్లా. తొలి సినిమా జాతిరత్నాలుతో ఇటు గ్లామర్ పరంగా అటు నటనాపరంగా వందశాతం మార్కులు కొట్టేసింది. తాజాగా ఈ భామ మరో క్రేజీ ఛాన్స్ దక్కించుకున్నట్లు ఫిల్మీ దునియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. నాగార్జున, నాగచైతన్య కలిసి మల్టీస్టారర్‌గా నటిస్తున్న బంగార్రాజు చిత్రంలో చిట్టీ సందడి చేయనుందట. డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫరియా ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో చిందేయనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. 'సోగ్గాడే చిన్ని నాయనా' హిట్ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న 'బంగార్రాజు' సినిమాకు కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కృతిశెట్టి కథానాయికగా నటిస్తోంది. -
పుష్ప: హాట్ టాపిక్‌గా మారిన సమంత రెమ్యునరేషన్
Samantha remuneration for Pushpa: సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కెరీర్లోనే తొలిసారిగా సమంత స్పెషల్ సాంగ్ చేస్తుండటంతో మరింత ఆసక్తి పెరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాలుగురోజుల పాటు ఈ సాంగ్ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తుంది. ఇందుకు గాను సమంత కోటిన్నర రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.చదవండి: కేబీఆర్ పార్కులో నటిపై దాడి..దర్యాప్తు ముమ్మరం కేవలం ఒక్క పాట కోసం ఇంత భారీ రెమ్యునరేషన్ తీసుకోవడం అంటే రికార్డ్ అనే చెప్పుకోవాలి. గతంలో స్పెషల్ సాంగ్స్‌లో అలరించిన పూజా హెగ్డే, కాజల్, తమన్నాలు సైతం ఈ రేంజ్లో రెమ్యునరేషన్ అందుకోలేదు. కానీ సమంతకు ఉన్న క్రేజ్‌ను బట్టి కోటిన్నరకు పైగా రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సైతం మేకర్స్ వెనకాడలేదట. ప్రస్తుతం సమంత తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. చదవండి: 'పుష్ప'లో సమంత స్పెషల్ సాంగ్.. అందుకే ఒప్పుకుందా? ఊర'నాటు' స్టెప్పులేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్లు -
'పుష్ప'లో సమంత స్పెషల్ సాంగ్.. అందుకే ఒప్పుకుందా?
Samantha To Perform Special Song In Pushpa: నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా స్పెషల్‌సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని పుష్ప టీం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఒకే పాటలో బన్నీతో కలిసి మాస్ స్టెప్పులేయనుంది సమంత. పెళ్లి తర్వాత నుంచి కేవలం పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే సినిమాలు సైన్ చేస్తున్న సమంత తాజాగా స్పెషల్ సాంగ్‌కు ఓకే చెప్పడంతో మరింత ఆసక్తి పెరిగింది. దీనికి గల కారణాలు ఏమై ఉంటాయా అని నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. సాధారణంగానే సుకుమార్ సినిమా అంటేనే స్పెషల్ సాంగ్స్‌కి కేరాఫ్ అడ్రస్. ఆర్య సినిమాలోని అ అంటే అమలాపురం’నుంచి ‘రంగస్థలం’లో జిగేల్ రాణి వరకూ ప్రతి ఐటెమ్ సాంగ్ సూపర్ హిట్టే. దీనితో పాటు రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుకుమార్ అడగడంతో సమంత కాదనలేకపోయిందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఏది ఏమైనా ఇప్పటికే భారీ అంచనాలు పెంచేసిన పుష్ప చిత్రంలో ఈ స్పెషల్‌సాంగ్ మరింత హైలెట్‌గా నిలుస్తుందని చిత్రయూనిట్ భావిస్తుంది. అంతేకాకుండా అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ఈ పాట చిత్రీకరణ ఉంటుందని తెలుస్తుంది. ఇక ఇప్పటికే తెలుగు, తమిళ చిత్రాల్లో ఫుల్ బిజీగా ఉన్న సమంత త్వరలోనే బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో సైతం సందడి చేయనున్నట్లు సమాచారం. A big Thank You to the supremely talented @Samanthaprabhu2 garu for accepting our request and doing this sizzling number in #PushpaTheRise 💥#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @Mee_Sunil @anusuyakhasba @ThisIsDSP @adityamusic pic.twitter.com/fD0QRDVYTg — Mythri Movie Makers (@MythriOfficial) November 15, 2021 -
ఆ సినిమాలో సాయి పల్లవిపై స్పెషల్ సాంగ్, ఈసారి క్లాసికల్ టచ్‌తో..!
సాయిపల్లవి.. ఈ పేరు వింటే చాలు అందరిలో ఒక జోష్ వస్తోంది. తన సినిమా అంటే వెంటనే మనసులో మెదిలేది ఒక్కటే. అదే తనపై ఉండే స్పెషల్ సాంగ్. ప్రతి సినిమాలోనూ సాయి పల్లవిపై ప్రత్యేకమైన పాటను పెట్టి తమ సినిమాపై అందరి దృష్టి పడేలా చూసుకుంటారు దర్శకులు. అంతేగాక ఆ పాటలు సినిమాకే హైలెట్‌గా నిలవడం విశేషం. ఆమె సాంగ్స్ విడుదలయ్యాయంటే చాలు యుట్యూబ్ చానళ్లకు పండగే. రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతూ సంచనాలు సృష్టిస్తాయి. దీనికి గతంలో ఆమె నటించి ఫిదా చిత్రంలోని ‘వచ్చిండే.. మెల్లమెల్లగా వచ్చిండే’, ఇటీవల వచ్చిన ‘లవ్‌స్టోరీ’లోని సారంగధరియా పాటలే ఉదహరణ. చదవండి: మహేశ్ బాబును లాభాల బాట పట్టించిన ‘లవ్‌స్టోరీ’ ఈ పాటలు జనాల్లోకి, యుట్యూబ్ చానళ్లో ఎంతగా దూసుకుపోయాయే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు సాయి పల్లవి నాని సరసన ‘శ్యామ్ సింగరాయ్’లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా సాయి పల్లవిపై ఓ స్పషల్ సాంగ్ ఉండబోతుందట. కలకత్తాలో జరిగే దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఈ పాటను చిత్రీకరించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. క్లాసికల్ డ్యాన్స్ నేపథ్యంలో సాగే ఈ పాటలో సాయి పల్లవి మరోసారి తన డ్యాన్స్ స్కిల్స్‌తో అదరగొట్టబోతుందట. ఈ పాట కూడా సినిమాకు హైలెట్‌గా నిలవడం ఖాయం అంటున్నారు. కాగా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న ఈ మూవీ విడుదల కానుంది. చదవండి: 'శ్యామ్ సింగరాయ్' నుంచి బిగ్ అప్డేట్ -
బతుకమ్మ కొత్త పాట: ‘తెల్ల తెల్లారింది తమ్ముళ్లు..’ వైరల్
తెలంగాణ ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండగల్లో బతుకమ్మ ఒకటి. సహజ సౌందర్యానికి ప్రతీక బతుకమ్మ పండగ. ఒకప్పుడు పల్లెల్లో మాత్రమే కనిపించే బతుకమ్మ వేడుకలు ఇప్పుడు పట్టణ ప్రజలు సైతం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్టం వచ్చినప్పుటి నుంచి బతుకమ్మ పండగ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది. అంతేగాక ప్రతి ఏడాది బతుకమ్మ పాటలు రాష్ట్రంతో పాటు ప్రపంచ దేశాల్లోను మారుమోగుతున్నాయి. బతుకమ్మ పండగ వచ్చిందంటే చాలు.. పలు ప్రైవేట్ ఆల్బమ్స్ పుట్టుకొస్తాయి. తాజాగా ఓ ప్రైవేట్ ఆల్బమ్ ‘సాక్షి’వేదికగా రిలీజ్ అయింది. ‘తెల్ల తెల్లారిదింది తమ్ముళ్లు.. బతుకమ్మ పండగ నేడు తమ్ముళ్లు’అంటూ సాగే ఈ పాట.. బతుకమ్మ పండగ విశిష్టతను తెలియజేస్తుంది. -
గౌతమ్ మీనన్ దర్శకత్వం, ఎఆర్ రెహమాన్ సంగీతంతో ‘బతుకమ్మ’ పాట
తెలంగాణలో అతి పెద్ద పండగ బతుకమ్మ. తొమ్మిది రోజులపాటు ఘనంగా జరుపుకునే ఈ పండగకు ఆదరణ పెరిగిపోతుంది. ఒకప్పుడు పల్లెల్లో మాత్రమే కనిపించే బతుకమ్మ వేడుకలు ఇప్పుడు పట్టణ ప్రజలు సైతం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్టం వచ్చినప్పుటి నుంచి బతుకమ్మ పండగ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది. అంతేగాక ప్రతి ఏడాది బతుకమ్మ పాటలు రాష్ట్రంతో పాటు ప్రపంచ దేశాల్లోను మారుమోగుతున్నాయి. ప్రతి ఎడాది బతుకమ్మ సంబరాల్లో భాగం ఒక కొత్త పాటను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఎడాది లాగే ఈ సారి కూడా బతుకమ్మ పాటపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందుకే ఈ సారి బతుకమ్మ పాట అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ ఎడాది బతుకమ్మ పాటకు ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించగా, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ‘అల్లిపూల వెన్నెల’ అంటూ సాగే ఈ పాట హైదరాబాద్ సమీపంలోనే భూదాన్ పోచంపల్లిలో చిత్రీకరణ జరుపుకుంది. రేపు సాయంత్రం 5:30 గంటలకు తెలంగాణ జాగృతి, ఎమ్మెల్సీ కవిత ఈ పాటను విడుదల చేయనున్నారు. అంతేగాక ఈ సాంగ్‌ను ఇతర భాషల్లోకి సైతం అనువదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఎడాది అక్టోబర్ 6 నుంచి బతుకుమ్మ పండుగ సంబరాలు ప్రారంభం కానున్నాయి. -
తమన్నా స్పెషల్ సాంగు.. వరుణ్ మాసు స్టెప్పు
‘గని’తో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ స్టెప్పులేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘గని’. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ఈ సినిమాలో ఉన్న ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట తమన్నా. త్వరలో ఈ మాసీ సాంగ్‌ను చిత్రీకరించనున్నారట. ఇప్పటికే ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’, ‘జాగ్వార్’, ‘జై లవకుశ’, ‘కేజీఎఫ్: ఛాప్టర్ వన్’, ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల్లో తమన్నా స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ‘గని’ చిత్రాన్ని ఈ నెల 30న రిలీజ్ చేయాలనుకున్నారు. కోవిడ్ కారణంగా రిలీజ్ వాయిదా పడింది. -
'మాస్ట్రో' :ఆ ఒక్క సాంగ్ కోసం అరకోటి ఖర్చుపెట్టారట!
నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'మాస్ట్రో' సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అంధాదున్‌కు రీమేక్ ఇది. నితిన్‌కు జోడీగా నభా నటేశ్ నటిస్తుండగా, హిందీలో 'టబు' చేసిన పాత్రలో తమన్నా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..ఈ చిత్రంలోని ముఖ్యమైన పాత్రలు పోషించిన నటీనటులపై ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేశారట. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో ఈ సాంగ్ చిత్రీకరణ జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఒక్క పాట కోసమే మేకర్స్ దాదాపు రూ. 50 లక్షలు ఖర్చు పెట్టినట్లు ఫిల్మ్ నగర్ టాక్. సినిమా ప్రమోఫన్స్లో ముఖ్యంగా ఈ పాటనే వాడతారట. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. -
ప్రభాస్-కాజల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలోనే అనౌన్స్మెంట్
పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇప్పటికే చిరంజీవితో ఆచార్య, కమల్‌హాసన్‌తో ఇండియన్-2 చిత్రాలు చేస్తున్న కాజల్ ఇప్పుడు మరో పాన్ ఇండియా ప్రాజెక్టులో కనిపించనుందట. కథల ఎంపిక విషయంలో చాలా పకడ్బందీగా ఆలోచిస్తున్న కాజల్...ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పిందట. ప్రభాస్‌తో ఓ స్పెషల్ సాంగ్‌లో చిందేయడానికి ఈ చందమామ ఒప్పుకున్నట్లు సమాచారం. వివరాల ప్రకారం..ప్రస్తుతం ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సలార్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం అవుతుంది. ఇక తర్వాతి షెడ్యూల్లో భాగంగా ఓ స్పెషల్ సాంగ్‌ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సాంగ్‌లో ప్రభాస్‌తో కలిసి మాస్ స్పెప్పులేసేందుకు కాజల్‌ను ఫైనల్ చేశారట. ఇప్పటికే వీరిద్దరు కలిసి ‘డార్లింగ్’ ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’ వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఆ రెండు సినిమాలు సూపర్‌హిట్ కావడంతో పాటు వీరి జోడికి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ స్ర్కీన్ ముందు జోడిగా కనిపిస్తే ఫ్యాన్స్‌కు ఇక పండగే. ఇక ఇప్పటికే కాజల్ ఎన్టీఆర్ నటించిన ‘జనతాగ్యారేజ్’ సినిమాలో ‘పక్కా లోకల్..’ అనే స్పెషల్ సాంగ్‌తో ఇరగదీసిన సంగతి తెలిసిందే. యూత్ సహా మాస్ ఆడియెన్స్‌ను తన స్టెప్పులతో ఉర్రూతలూగించిన కాజల్..చాలా గ్యాప్ తర్వాత మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుంది. -
ఎఫ్-3 మూవీ : ప్రముఖ హీరోయిన్ స్పెషల్ సాంగ్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్ నటిస్తున్న మల్టీస్టారర్ ఎఫ్-3. దిల్‌రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెహరీన్, తమన్నా నటిస్తున్నారు. డబ్బు వల్ల కుటుంబ సభ్యుల మధ్య వచ్చే ఫ్రస్టేషన్‌ను ఫన్నీగా చూపిస్తూ 'F3' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 'ఎఫ్ 2' సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తిచేసుకుంది. కరోనా కారణంగా కొత్త షెడ్యూల్‌కు బ్రేక్ పడింది. దీంతో వచ్చే నెలలో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతోంది. ఎఫ్-3లో ఓ స్పెషల్ సాంగ్ కోసం కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్‌ని సంప్రదించారట. ఆమెతో పాటు మరో హీరోయిన్ సోనాల్ చౌహన్ కూడా చిందేయనున్నారట. త్వరలోనే ఈ సాంగ్‌కు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ ఉండనుందని సమాచారం. అంతేకాకుండా సునీల్ పాత్ర ఆకట్టుకుంటుందని సమాచారం. నటి సంగీత కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుందట. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. చదవండి : 'రాజా విక్రమార్క'గా కార్తికేయ..ఫస్ట్‌లుక్ విడుదల -
ఏ సాంగ్స్ చేయడం లేదు: పాయల్ రాజ్‌పుత్
కింగ్ నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన 'సోగ్గాడే చిన్నినాయన' సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది 'బంగార్రాజు'. 2015లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో నాగ్ బంగార్రాజు పాత్రకు అద్భుత స్పందన రావడంతో అదే పేరు మీద సీక్వెల్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇందులో పాయల్ రాజ్‌పుత్ ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలోనూ పాయల్.. 'సీత' సినిమాలో 'బుల్లెట్టు మీదొచ్చె బుల్రెడ్డి..' పాటలో ఆడి అలరించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె మరోసారి ఐటమ్ సాంగ్‌కు రెడీ అయిందని సోషల్ మీడియాలో కథనాలు రాగానే నిజమేనని నమ్మేశారు అభిమానులు. కానీ ఈ ప్రచారానికి చెక్ పెడుతూ అవన్నీ వుట్టి పుకార్లేనని బదులిచ్చిందీ హీరోయిన్. తాను ఏ స్పెషల్ సాంగ్‌లో కనిపించడం లేదు అని క్లారిటీ ఇచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్స్‌లో నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘సోగ్గాడే చిన్నినాయన’ డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్‌లు కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. చైతూ జోడిగా ఆయన భార్య, హీరోయిన్ సమంత కనిపించనున్నట్లు సమాచారం. Posting just to make clear I’m not going to be part of any song . Thanks 🙏🏻 pic.twitter.com/n2kysTV6J0 — paayal rajput (@starlingpayal) May 24, 2021 చదవండి: తెలుగు సినిమా చరిత్ర విశేషాలతో ఓ మ్యూజియమ్ ఏర్పాటు చేయాలి -
అభిమానుల కోసం కేకేఆర్ సాంగ్ రిలీజ్
కోల్‌కతా: త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ ఎడిషన్ కోసం ఆయా జట్లు తమ సాధనను ముమ్మరం చేశాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇదివరకే ప్రాక్టీస్ షురూ చేయగా, ఢిల్లీ క్యాపిటల్స్ మార్చి 31 నుండి ట్రైనింగ్ సెషన్‌ను ప్రారంభించనుంది. తాజాగా, కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా త్వరలో ట్రైనింగ్ క్యాంప్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. కరోనా నేపథ్యంలో ఆటగాళ్లు, సిబ్బంది ఏడు రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోల్‌కతా జట్టు తమ అభిమానుల కోసం స్పెషల్ ఐపీఎల్ క్వారంటైన్ సాంగ్‌ను విడుదల చేసింది. కరోనా కారణంగా గతేడాది మ్యాచ్‌లు ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించగా.. వరుసగా రెండో సీజన్లోనూ అదే పరిస్థితి నెలకొనడంతో, కోల్‌కతా ఫ్రాంచైజీ యాజమాన్యం మ్యాచ్‌లు వీక్షించే అవకాశం కోల్పోయిన తమ అభిమానులకు అంకితం చేస్తూ ఓ పాటను రూపొందించింది. వీ విల్ మిస్ యూ అంటూ సాగే ఈ పాటను కేకేఆర్ తమ ట్విటర్ ఖాతా ద్వారా రిలీజ్ చేసింది. Kuch din ki yeh majboori hai, lekin yeh doori bhi zaroori hai. Tere pyaar pe bharosa hai, Kyunki #TuFanNahiToofanHai 🔥 We will miss you, #Kolkata 💜#WorldPoetryDay #IPL2021 pic.twitter.com/QQIs4LJeKx — KolkataKnightRiders (@KKRiders) March 21, 2021 మరోవైపు ఏ జట్టుకు కూడా తమ సొంత మైదానాల్లో మ్యాచ్‌లు ఆడే వెసులుబాటు లేకపోవడంతో.. ఆయా జట్లు తటస్థ వేదికలపై మ్యాచ్‌లు ఆడనున్నాయి. కోల్‌కతా తమ మ్యాచ్‌లను చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, ముంబై నగరాల్లో ఆడనుంది. కాగా, కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫాస్ట్ బౌలర్ కమలేష్ నాగర్కోటి, బ్యాట్స్‌మన్ రాహుల్ త్రిపాఠి తదితరులు ఆదివారం నుంచి ప్రారంభమైన క్వారంటైన్లో చేరారు. ఏప్రిల్ 11న కోల్‌కతా తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. IT'S QUARANTIME and the #Knights are checking in for the season! ✅ The beginning of the camp is just around the corner... ⏳@DineshKarthik @abhisheknayar1 @ImRTripathi #KamleshNagarkoti #HaiTaiyaar #IPL2021 pic.twitter.com/KM84PxOPw9 — KolkataKnightRiders (@KKRiders) March 21, 2021 -
హల్ చల్ చేస్తున్న ‘జాతిరత్నాలు’ స్పెషల్ సాంగ్
చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన సినిమా ‘జాతిరత్నాలు’. కేవీ అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమా .. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తుంది.ముఖ్యంగా ఈ మూవీలోని కామెడీ సరికొత్త వినోదాన్ని పంచింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ‘అర్రెరెరె జాతిరత్నాలు..ఎన్నడు చూడని నవ్వుల వర్షాలు..’అనే స్పెషల్ సాంగ్‌ని వైజయంతి నెట్వర్క్ సంస్థ తన యూట్యూబ్‌లో షేర్ చేసింది. రామ్ మిర్యాల పాడిన ఈ పాట సోషల్ మీడియాలో దూసుకెళ్తుంది. ఈ పాటకు సంబంధించిన వీడియోలో సినిమా ప్రమోషన్స్‌కు సంబంధించిన విజువల్స్‌ని పంచుకున్నారు. స్వప్న సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రంలో హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా, ఇతర కీలక పాత్రల్లో బ్రహ్మానందం, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, బ్రహ్మజీ, తనికెళ్ల భరణి తదితరులు నటించారు. చదవండి: చిట్టీ అని పిలుస్తుంటే భలేగా ఉంది ‘జాతి రత్నాలు’ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ -
అది ఐటెం సాంగ్ కాదమ్మ.. అనసూయ కౌంటర్
అనసూయ భరద్వాజ్.. పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెర, వెండి తెర మీద యాంకర్‌గా, నటిగా తన సత్తా చాటుతున్నారు అనసూయ. ఓ పక్క ‘క్షణం’, ‘రంగస్థలం’ వంటి చిత్రాల్లో నటనకు ప్రాధన్యమున్న పాత్రలు చేస్తూనే.. మరో వైపు ప్రత్యేక గీతాల్లో కనిపిస్తున్నారు. ఇక బుల్లి తెర మీద యాంకర్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా చావు కబురు చల్లగా చిత్రంలో అనసూయ ప్రత్యేక గీతంలో కనిపించారు. పైన పటారం.. లోన లోటారం అంటూ సాగే ఈ పాటలో అనసూయ, కార్తికేయతో కలిసి చిందేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ట్విట్టర్ యూజర్ అనసూయను ఉద్దేశించి ‘‘ఐటెం సాంగ్స్ చేయను అన్నారు కదా.. మరి ఇదేంటి అండి.. అయినా ఆ లిరిక్స్ ఏంది’’ అంటూ అనసూయను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. సదరు యూజర్‌కి అనసూయ స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు. ‘‘నా కెరీర్ నా నమ్మకాల మీద, చాయిసెస్ మీద నిర్మితమై ఉంటుంది తప్ప.. ఎవరో రాసిన దాని మీద కాదు’’ అంటూ రిపై ఇచ్చారు. ఈ మేరకు అనసూయ ‘‘అది ఐటెం సాంగ్ కాదు.. అసలు ఐటెం సాంగ్ అంటూ ఏది లేదమ్మ. ఒక పాటకున్న క్యాస్ట్ కాకుండా.. స్పెషల్‌గా ఎవరన్న కావాలి అనుకున్నప్పుడు స్పెషల్ సాంగ్ వస్తుంది. ఒకప్పుడు అమ్మాయిని వస్తువుగా భావించే వాళ్లు ఇచ్చిన పేరు అది. అంతేకాదు ఆ లిరిక్స్ వల్లనే నేను ఈ స్పెషల్ సాంగ్ ఒప్పుకున్నాను’’ అన్నారు. అంతేకాదు ‘‘నేను స్పెషల్ సాంగ్ చేయ్యను అని ఎక్కడా అనలేదు. దయచేసి ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్‌గా నన్నే అడగండి. నా గురించి మీకు ఎలాంటి సందేహాలున్నా .. నన్ను అడగండి. ఇప్పుడు చేసినంత వెటకారంగా కాకపోయినా.. నిజాయతీగా ఏమన్నా తెలుసుకోవాలంటే నేను తప్పకుండా సమాధానం చెప్తాను. అంతేకాని ‘‘సమాచారం ప్రకారం’’ అంటూ రాసే వార్తలను నమ్మకండి. నా కెరీర్ నా నమ్మకాలు, చాయిస్‌ల మీద కొనసాగుతుంది తప్ప ఎవరో రాసినదాని మీద కాదు’’ అంటూ ట్వీట్ చేశారు అనసూయ. దీనిపై నెటిజనుల చాలా బాగా చెప్పారు అంటూ కామెంట్ చేస్తున్నారు. కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘చావుకబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. Hello!!😊Adi “item” song kadu..asalu “item” song anedi edi ledamma..oka paata ki unna cast kakunda special ga evaranna kavali anukunnappudu “special” song ostundi Okappudu ammai ni vastuvu la treat chesevallu ichina peru adi And aa Lyrics valle nenu ee special song oppukunnanu 😊 https://t.co/JP2Ak0ZeVB — Anasuya Bharadwaj (@anusuyakhasba) March 2, 2021 చదవండి: అనసూయ మాస్ సాంగ్.. దుమ్ములేపేసింది! ఓ మై గాడ్! ఇది మీకెక్కడ దొరికింది?: అనసూయ -
4 రోజులుగా నిద్ర లేకుండా నటి షూటింగ్!
నోరా ఫతేహీ.. స్పెషల్ సాంగ్స్‌లో ఆడిపాడే ఈమె ఆఫ్‌స్క్రీన్‌లోనూ అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. షూటింగ్ మధ్యలో ఏ చిన్న గ్యాప్ దొరికినా తెగ అల్లరి చేస్తుంటుంది. తాజాగా ఆమె షూటింగ్ లొకేషన్లో సాంగ్‌కు రెడీ అవుతూ, ప్రాక్టీస్ చేసిన ఓ ఫన్ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇందులో తను వాడిన విగ్గును నిమురుతున్న నోరా షూటింగ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. పని ఒత్తిడి కారణంగా కొంత అలిసిపోయినట్లు తెలుస్తోంది. "నాలుగు రోజులుగా కంటి నిండా నిద్ర పోకుండా మరీ షూటింగ్ చేశాం. తర్వాత హాయిగా ఓ కునుకు తీయాలి" అని పేర్కొంది. అయితే ఆమె నిద్రలేని రాత్రుళ్లు మాత్రమే కాదు, రాజస్తాన్‌లో చెమటలు కక్కించే మండుటెండలోనూ భారీ లెహంగాలు వేసుకుని నిప్పు ముందు డ్యాన్స్ చేసింది. ఇందులో రాజస్తాన్‌లోని బంజారాల డ్రెస్సింగ్ స్టైల్‌ను ఆమె ఫాలో అయినట్లు కనిపిస్తోంది. ఆమె ఇంతలా కష్టపడింది ఆ మధ్య రిలీజైన 'చోర్ దేంగే..' సాంగ్ కోసమే.. అరవిందర్ ఖైరా డైరెక్ట్ చేసిన ఈ పాట యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన ఒక్క రోజులోనే 25 మిలియన్ల వ్యూస్ సంపాదించుకుంది. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) ఇక నోరా గురించి ఆ సాంగ్ టీమ్‌లోని ఓ సభ్యుడు మాట్లాడుతూ.. 'అసలే ఎండాకాలం.. పైగా అది రాజస్తాన్. తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డాం. అయినా సరే మేము షూటింగ్ పూర్తి చేశాం. నోరా బరువైన లెహంగాలు ధరించి, నిప్పు మధ్యలో డ్యాన్స్ చేసింది. ఆమె అంకితభావానికి మేమంతా ఆశ్చర్యపోయాం. చిన్న బ్రేక్ కూడా తీసుకోకుండా, ఏమాత్రం అలసట చెందకుండా షూటింగ్లో పాల్గొంది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: మరో బాలీవుడ్ చిత్రానికి బాహుబలి రచయిత స్క్రిప్ట్ సన్నీడియోల్ మొదట ప్రేమించింది ఎవరినంటే? -
‘జగనన్న జయభేరి’ పాట విడుదల
తాడేపల్లిరూరల్(మంగళగిరి): పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సాధించిన విజయాన్ని పురస్కరించుకొని రూపొందించిన ‘జగనన్న జయభేరి’ పాటను రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ గుంటూరు, కృష్ణా జిల్లాల ఇన్చార్జి మోపిదేవి వెంకటరమణారావు మంగళవారం తాడేపల్లిలో విడుదల చేశారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని ఆకాంక్షిస్తూ రచయిత, సినీ నటుడు చిట్టినేని లక్ష్మీ నారాయణ ఐదు నిమిషాల నిడివి గల ఈ పాటను రచించి, సంగీతం సమకూర్చారు. ఈ కార్యక్రమంలో రచయిత చిట్టినేని లక్ష్మీనారాయణ, పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
గోపీచంద్‌తో అప్సర రాణి డ్యాన్స్
రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన వెబ్ ఫిల్మ్ ‘థ్రిల్లర్’తో పాపులారిటీ సంపాదించుకున్నారు అప్సరా రాణి. ఆ తర్వాత రవితేజ ‘క్రాక్’లో ‘భూమ్ బద్దల్...’ అంటూ ఓ స్పెషల్ సాంగ్‌లో స్టెప్స్ వేశారామె. ఈ పాట మంచి హిట్ అయింది. తాజాగా మరో స్పెషల్ సాంగ్‌కి రెడీ అవుతున్నారు అప్సర. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీటీమార్’. ఈ సినిమాలో అప్సరా రాణి స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. ‘‘మా సీటీమార్లో ఓ స్పెషల్ పటాకా సాంగ్‌లో చేస్తున్నారు అప్సర. ఈ పాట బొంభాట్గా ఉంటుంది’’ అని ట్వీట్ చేశారు సంపత్ నంది. ‘సీటీమార్’ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కానుంది. చదవండి: శృంగార సన్నివేశం.. హీరోను చూసి భయపడ్డాను -
అవసరమైతే వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు..!
అనసూయ భరద్వాజ్.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ బుల్లితెరను మెప్పిస్తున్న అనసూయ వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై మెరుస్తోంది. అక్కడ విభిన్న పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ముఖ్యంగా సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ మూవీలో రంగమ్మత్తగా అందరిని మెప్పించింది. ఈ సినిమాతో ఆమె క్రేజీ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. రంగమ్మత్త వంటి పాత్రలు పోషిస్తూనే అప్పుడప్పుడు ఐటెం సాంగ్స్‌తో అందాలు ఆరబోస్తోంది అనసూయ. ఇప్పటికే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విన్నర్లో సూయ సూయ అంటూ తన పేరుతో సాగే ఐటెం సాంగ్‌లో నటించిన సంగతి తెలిసిందే. అలాగే ‘సోగ్గాడు చిన్నినాయన’ మూవీలో కూడా టైటిల్ సాంగ్‌లో టాలీవుడ్ ‘మన్మథుడు’ నాగార్జు అక్కినేనితో చిందులేసింది. తాజాగా ‘చావురు కబురు చల్లగా’ మూవీలో కూడా ఓ స్పెషల్ సాంగ్ చేసేందుకు సిద్ధమైంది ఈ రంగమ్మత్త. మాస్ నేపథ్యంలో సాగే ఈ పాటలో అనసూయ హీరో కార్తికేయతో కలిసి డ్యాన్స్ చేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా తానే సోమవారం ప్రకటించింది. దీనికి ‘అవసమరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు.. అవసరం తీరాక ఆడుకుంటారు’ అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేస్తూ కమ్మింగ్ సూన్ అంటూ ఈ పాటలో తన లుక్‌ను షేర్ చేసింది. అలాగే ‘మీ ప్రజేన్స్‌తో మా సినిమాను మరింత ప్రత్యేకం చేసినందుకు ధన్యవాదాలు అనసూయ గారు.. ఈ స్పెషల్ సాంగ్ చూడాలంటే కొద్ది రోజులు వేచి చూడండి’ అంటూ హీరో కార్తికేయ కూడా ట్వీట్ చేశాడు. కాగా కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కార్తికేయ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోంది. నిర్మాత అల్లు అరవింద్ గీతాఆర్ట్స్-2 బ్యానర్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ‘చావు కబురు చల్లగా’ టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. “అవసరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు.. అవసరం తీరాక ఆడుకుంటారు.” #comingSoon https://t.co/k1x6ZVd3bY — Anasuya Bharadwaj (@anusuyakhasba) February 15, 2021 (చదవండి: అరుదైన గౌరవం..మురిసిపోతున్న అనసూయ) (నోరుపారేసుకున్న నెటిజన్.. అనసూయ గట్టి కౌంటర్) (మరోసారి వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి) -
మరో స్పెషల్ సాంగ్?
ఇటీవలే ‘అల్లుడు అదుర్స్’ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో సందడి చేశారు ‘బిగ్‌బాస్’ ఫేమ్ మోనాల్ గజ్జర్. ఇప్పుడు మరో స్పెషల్ సాంగ్‌లో స్టెప్స్ వేయబోతున్నారని టాక్. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారువారి పాట’. కీర్తీ సురేశ్ కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ దుబాయ్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ పాటలో మోనాల్‌తో స్టెప్స్ వేయించాలని చిత్రబృందం భావిస్తోందట. మరి సూపర్ స్టార్‌తో మోనాల్ మాస్ స్టెప్స్ వేస్తారా? చూడాలి. ‘సర్కారు వారి పాట’ 2022 సంక్రాంతికి విడుదల కానుంది. -
మహేశ్‌బాబుతో మోనాల్ స్పెషల్ సాంగ్!
అదృష్టానికి, మోనాల్ గజ్జర్‌కు మధ్య కొలవలేనంత దూరం ఉండేది. ఎన్ని సినిమాల్లో నటించినా ఆమెకు పెద్ద గుర్తింపు రాలేదు. ఇదంతా బిగ్‌బాస్ ముందు వరకు! కానీ ఒక్క అడుగు ఆమె జీవితాన్నే మార్చేసింది. బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆమె తన అందంతో, ముద్దు ముద్దు మాటలతో ఎందరో ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది. అయితే హౌస్‌లో అందరూ తనను ఏకాకిని చేసిన ప్రతిసారి ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకునేది. తనకే అన్ని కష్టాలొచ్చాయని తల్లడిల్లిపోయేది. (చదవండి: సంక్రాంతికి వస్తున్న 'సర్కారు వారి పాట') కానీ బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చిన మరుక్షణం ఆమె రాత మారిపోయింది. తనకు గుర్తింపు దక్కిన స్టార్ మాలోనే కొత్త షో డ్యాన్స్ ప్లస్‌లో జడ్జిగా రెండో జర్నీ మొదలు పెట్టింది. అటు ఆమె నటించిన హిందీ చిత్రం కాగజ్ ప్రశంసలు దక్కించుకుంది. మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్‌లో ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేశ్‌బాబు సినిమాలోనూ మెరుపుతీగలా వచ్చిపోనుందన్న టాక్ వినిపిస్తోంది. (చదవండి: ఎయిర్ పోర్ట్‌లో మోనాల్‌కి షాక్.. తెగ బాధేసిందంటూ..) మహేశ్‌బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' ప్రస్తుతం దుబాయ్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. గీతాగోవిందం డైరెక్టర్ పరుశురామ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 'అల్లుడు అదుర్స్'లో ఐటమ్‌సాంగ్‌తో ఆకట్టుకున్న మోనాల్‌తో 'సర్కారు వారి పాట'లో కూడా చిందులేయించాలని భావిస్తోందట చిత్రయూనిట్. ఇందుకోసం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. అయినా స్టార్ హీరోతో కలిసి ఆడిపాడేందుకు మోనాల్ అస్సలు వెనుకడుగు వేయందంటున్నారు ఆమె అభిమానులు. మరి మహేశ్ సరస మోనాల్ డ్యాన్స్ చేయనుందన్న విషయం ఎంతవరకు నిజమనేది తెలియాలంటే చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: వకీల్ సాబ్ వచ్చేస్తున్నాడు.. ఆ రోజే రిలీజ్) -
3 నిమిషాల పాట కోసం అనసూయకు రూ .20 లక్షలు!
బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తున్న యాంకర్ అనసూయ భరద్వాజ్..వెండితెరపై కూడా తనదైన నటనతో ఆకట్టుకుంటున్నారు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ సత్తా చాటతుంది. వరుస ఆఫర్లతో జోరు మీదున్న అనసూయ అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్‌లోనూ తళుక్కున మెరుస్తుంది. తాజాగా`చావు కబురు చల్లగా` సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో నర్తించడానికి అనసూయ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. 3 నిమిషాల నిడివి ఉండే ఈ సాంగ్ కోసం అనసూయ అక్షరాలా రూ .20 లక్షలు డిమాండ్ చేయగా, చిత్ర బృందం వెంటనే ఓకే చెసినట్లు సమాచారం. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సాంగ్ షూట్‌ను త్వరలోనే హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కౌశిక్ దర్శకత్వం వహిస్తుండగా, బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇంతకుముందు సాయి ధరమ్‌తేజ్ నటించిన విన్నర్ సినిమాలోనూ అనసూయ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. (అతడితో ప్రేమలో ఉన్నాను: నటి) ప్రస్తుతం అనసూయ, నటుడు అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం థ్యాంక్ యూ బ్రదర్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగ మార్తాండ’లో కీలక పాత్రలో నటిస్తున్న అనసూయ..రవితేజ హీరోగా వస్తోన్న ‘కిలాడి’లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమిళంలోనూ విజయ్ సేతుపతితో జోడీ కట్టే ఛాన్స్ కొట్టేసిన అనసూయ వెండితెరపై సెలక్టివ్ పాత్రలు పోషిస్తూ దూసుకుపోతుంది. (రకుల్ ఫిట్నెస్ మంత్రా : ఫ్యాన్స్ ఫిదా.) -
‘పుష్ప’ స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్ భామ!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియోటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మండన్న నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాపై సుక్కు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అల్లు అర్జున్ తొలిసారి పూర్తిస్థాయి మాస్ రోల్లో మెప్పించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. (ఆ హీరోయిన్ నా లక్కీ చామ్: అల్లు అర్జున్) కాగా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాని చిత్ర బృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఊర్వశి సైతం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ మూవీ తర్వాత బన్నీ కొరటాల శివ డైరెక్షన్లో వచ్చే ఓ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. (బర్త్‌డే స్పెషల్: రవితేజ గురించి ఆసక్తికరమైన విషయాలు) -
శర్వానంద్ సినిమాలో పాయల్ ‘స్పెషల్’..?
‘సీత’ సినిమాలో ‘బుల్లెట్టు మీదొచ్చె బుల్రెడ్డి.. రాజ్‌దూత్ మీదొచ్చె....’ అంటూ ఓ స్పెషల్ సాంగ్‌లో స్టెప్స్ వేశారు పాయల్ రాజ్‌పుత్. ఇప్పుడు మరో స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘మహా సముద్రం’ అనే సినిమా తెరకెక్కుతోంది. అదితీ రావ్ హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. ఈ మల్టీస్టారర్ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ సాంగ్‌లో పాయల్ స్టెప్స్ వేస్తారని సమాచారం. పాయల్‌కి పెద్ద బ్రేక్ వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’కి అజయ్ భూపతే దర్శకుడు అనే సంగతి గుర్తుండే ఉంటుంది. త్వరలోనే ఈ స్పెషల్ సాంగ్‌ను షూట్ చేయనున్నారట. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. -
సర్కారు వారితో పాట
మహేశ్‌బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుంది. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా స్టెప్ వేయబోతున్నారని తెలిసింది. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు, కీర్తీ సురేశ్ జంటగా రూపొందనున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దుబాయ్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌కు ఊర్వశీ రౌటేలాను సంప్రదించారట. తమన్ అందించిన ఈ మ్యాస్ ట్యూన్‌కి మహేశ్, ఊర్వశి స్టెప్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయని టాక్. -
పవన్ సినిమాలో అనసూయకు 'స్పెషల్' ఛాన్స్.?
యాంకర్‌గా ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ భరద్వాజ్.. అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపై కూడా తళుక్కుమంటున్నారు. సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ నటిగానూ ఆకట్టుకుంటుంది. ఇక రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ అభినయంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం భారీగా ఆఫర్లు వస్తున్నా అనసూయ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తాజాగా అనసూయకి ఓ క్రేజీ ఆఫర్ వరించినట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ -క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఓ అప్‌కమింగ్ ప్రాజెక్టులో అనసూయ ప్రత్యేకగీతంలో కనిపించనుందట. (అల్లు అర్జున్‌కు నో చెప్పిన అనసూయ) వకీల్‌సాబ్ నిమా చిత్రీకరణ పూర్తికాగానే పవన్.. క్రిష్ సినిమాలో బిజీ కానున్నారు. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. గతంలోనూ పవన్ సినిమా అత్తారింటికి దారేదిలో ఓ స్పెషల్ సాంగ్‌లో నటించడానికి అనసూయకు ఛాన్స్ వచ్చినా కొన్ని కారణాల వల్ల ఆ అవకాశాన్ని వదులుకున్నారు. ఇప్పుడు మరోసారి పవన్ సినిమాలో ఛాన్స్ రావడంతో ఈసారి వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్. వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న అనసూయ ప్రస్తుతం ఆమె కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగ మార్తాండ’లో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే రవితేజ హీరోగా వస్తోన్న ‘కిలాడి’లో కూడా నటిస్తున్నారు. అంతేకాకుండా కమెడియన్ సునీల్ హీరోగా తెరకెక్కుతున్న 'వేదాంతం రాఘవయ్య' సినిమాలోనూ అతడికి జోడీగా నటించేందుకు అనసూయ పచ్చజెండా ఊపినట్లు సమాచారం. రీసెంట్గా తమిళంలోనూ విజయ్ సేతుపతితో ఓ సినిమాలో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. (కరోనా లక్షణాలు కనిపించాయి.. జాగ్రత్త : అనసూయ) -
స్పెషల్ సాంగ్..మోనాల్‌కు అంత రెమ్యునరేషనా?
బిగ్‌బాస్ సీజన్-4 అనంతరం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్. అప్పటివరకు ఐదారు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఒక్క బిగ్‌బాస్‌తో సొంతం చేసుకుంది. తొలుత అభిజిత్‌తో సన్నిహితంగా ఉండటం.. ఆ తర్వాత అఖిల్‌తో క్లోజ్‌గా మూవ్ కావడం, ఈమె వల్లే వారిద్దరు గొడవ పడటం..ఈ సీజన్‌కి హైలెట్‌గా నిలిచాయి. బిగ్‌బాస్ నాల్గో సీజన్లో ఎక్కువ ఎపిసోడ్లు కూడా ఈ ముగ్గురిపైనే ప్రసారం జరిగింది. ఇది మోనాల్‌కు కావాల్సినంత పబ్లిసిటీని తెచ్చిపెట్టాయి. దీంతో హౌస్ నుంచి బయటకు వచ్చాకా.. ఈ బ్యూటీ వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది. (ఇల్లు కొనబోతున్న మోనాల్?!) ఇటీవలె బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘అల్లుడు అదుర్స్' సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి మరింత పబ్లిసిటీని తెచ్చుకుంది ఈ గుజరాతీ భామ. అంతేకాకుండా ఈ స్పెషల్ సాంగ్ కోసం మోనాల్ 50 లక్షల రూపాయల భారీ రెమ్యునరేషన్ అందుకుందట. ప్రస్తుతం ఆమెకున్న ఫేమ్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్మాతలు కూడా మోనాల్ అడిగినంత మొత్తంలో ఇవ్వడానికి ఏ మాత్రం వెనకడుగు వెయ్యడం లేదని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఏదైనా షాపు ఓపెనింగ్‌కి సైతం 10 లక్షలు ఇవ్వాలని కండిషన్ పెట్టినట్లు పలు వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లు అవకాశాలు ఉన్నప్పుడే వాటిని సద్వినియోగం చేసుకుంటే బెటర్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. (ఆరేళ్లు రిలేషన్షిప్, డిప్రెషన్లోకి వెళ్లిపోయా) -
మోనాల్ స్టెప్పుల్
‘బిగ్‌బాస్ 4’లో తన ఎమోషన్స్‌తో బుల్లితెర ప్రేక్షకుల మనసును షేక్ చేసిన మోనాల్ గజ్జర్ బిగ్ స్క్రీన్‌పై స్టెప్పులతో షేక్ చేయటానికి రెడీ అయ్యారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ïß రోగా నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో కాలు కదుపుతున్నారు మోనాల్. ‘సుడిగాడు’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన మోనాల్ ఆ తర్వాత పలు చిత్రాల్లో కథానాయికగా నటించారు. గడచిన మూడేళ్లలో గుజరాతీ, మరాఠీ చిత్రాలు చేశారు. ప్రస్తుతం ఓ హిందీ సినిమా, ఓ గుజరాతీ సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ‘అల్లుడు అదుర్స్’లో స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్న ఈ పెప్పీ నెంబర్లో సినిమాలోని ప్రధాన తారాగణమంతా స్టెప్పులేస్తారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. శ్రీనివాస్ సరసన అనూ ఇమ్మాన్యుయేల్, నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ స్వరకర్త. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 15న విడుదల కానుంది. -
బంపర్ ఆఫర్ అందుకున్న మోనాల్..
అప్పటి వరకు వాళ్ల ఫేమ్ ఎలా ఉన్నప్పటికీ ఒకసారి బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టి వచ్చాక ఏదైనా జరగవచ్చు. అవకాశాలు లేని వారికి తలుపుతట్టి మరి రావొచ్చు. బిజీగా ఉన్నవారికి అవకాశాలు తగ్గిపోవచ్చు. కంటెస్టెంట్ల జీవితాల్లో బిఫొర్ బిగ్‌బాస్ ఆఫ్టర్ బిగ్‌బాస్ అనేంతలా మార్పు వస్తుంది. అయితే మిగతా సీజన్లతో పోలీస్తే బిగ్‌బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్లకు హౌజ్ నుంచి బయటొచ్చాక సినిమా ఆఫర్లు తన్నుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే సోహైల్ ఓ సినిమాకు సైన్ చేయగా.. తన తదుపరి చిత్రంలో అవకాశం ఇస్తానని మెగాస్టార్ మాటిచ్చాడు. ఇక అభిజిత్ ఎఫ్ 3లో కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. చదవండి: విజయ్ ‘మాస్టర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఈ జాబితాలోకి తాజాగా మోనాల్ గజ్జర్ చేరిపోయింది. ఇప్పటికే బుల్లితెరలో ప్రసారమవుతున్న ఓ డ్యాన్స్ షోలో జడ్జీగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో మరోసారి తెలుగు సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది ఈ గుజరాత్ భామ. టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అల్లుడు అదుర్స్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో అను ఎమ్మాన్యుయేల్, నభానటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా స్పెషల్ సాంగ్‌లో మోనాల్.. బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఆడిపాడనుంది. ఈ పాట కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల సారథ్యంలో సెట్ వేసినట్లు, దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫీ చేయనున్నారని సమాచారం. ఇక మోనాల్ ఎంట్రీతో సినిమాకు మరింత గ్లామర్ యాడ్ కానుందనడంలో సందేహం లేదు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 15న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. చదవండి: అభిమానులకు రకుల్ గుడ్‌న్యూస్ #BiggBoss beauty #MonalGajjar shaking legs with @BSaiSreenivas for a special song in #AlluduAdhurs.🕺💃 Movie releasing on Jan 15th 2021.✨ #SanthoshSrinivas @ThisIsDSP @prakashraaj @SonuSood @NabhaNatesh @ItsAnuEmmanuel @shekarmaster #AvinashKolla #SumanthMovieProductions pic.twitter.com/7fFof5xE7u — Shreyas Group (@shreyasgroup) December 29, 2020 -
స్పెషల్ సాంగ్
సంజయ్ లీలా భన్సాలీ సినిమాలన్నీ భారీగా ఉంటాయి. స్క్రీన్ నిండుగా సెట్టింగులు ఉంటాయి. పాటల్ని చాలా కలర్ఫుల్గా తెరకెక్కిస్తుంటారాయన. అందుకే ఆయన సినిమాల్లో పాటలకు ప్రత్యేక క్రేజ్. తాజాగా భన్సాలీ కొత్త సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ వచ్చిందట బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీకి. ఆలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం ‘గంగూభాయ్ కతియావాడి’. ఈ సినిమాలో ఆలియా భట్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తారు. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ కోసం హ్యూమా ఖురేషీ డ్యాన్స్ చేయనున్నారట. త్వరలోనే ఈ పాటను చిత్రీకరించనున్నారని తెలిసింది. -
ప్రత్యేక పాటలో శ్రద్ధ
‘అల వైకుంఠపురములో’ వంటి భారీ హిట్ సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా పతాకాలపై వై. నవీన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మికా మందన్నా కథానాయిక. కాగా సుకుమార్ చిత్రాల్లో ప్రత్యేక పాటలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. స్పెషల్ సాంగ్ కోసం ఎంతో శ్రద్ధ తీసుకుంటారాయన. తాజాగా ‘పుష్ప’ చిత్రంలోనూ ప్రత్యేక పాట ఉందట. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ, ‘సాహో’ ఫేమ్ శ్రద్ధా కపూర్ నటించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
మూడు భాషల్లో ఇద్దరు
అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇద్దరు’. ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వంలో ఫర్హీన్ ఫాతిమా నిర్మిస్తున్నారు. తెలుగు–తమిళ–కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో రాధికా కుమారస్వామి, సోనీ చరిష్టా, జె.డి. చక్రవర్తి, కళాతపస్వి కె.విశ్వనాధ్, హీరో ఆమిర్ ఖాన్ సోదరుడు ఫైసల్ ఖాన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. శనివారం అర్జున్ జన్మదినాన్ని పురస్కరించుకుని ‘ఇద్దరు’ చిత్రంలోని ప్రత్యేక గీతాన్ని దర్శకుడు బోయపాటి శ్రీనుతో చిత్రబృందం విడుదల చేయించింది. ‘‘అర్జున్‌గారితో కలిసి నేను చేసిన స్పెషల్ సాంగ్ బోయపాటి సార్ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు సోనీ చరిష్టా. ఈ పాట విడుదల కార్యక్రమంలో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, చిత్ర సహనిర్మాత శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. -
65 మంది సింగర్స్.. 5 భాషల్లో స్పెషల్ సాంగ్
దేశ వ్యాప్తంగా 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ అందరు తమ తమ కార్యాలయాలలో జాతీయ జెండాని ఎగుర వేసి దేశభక్తిని చాటుకుంటున్నారు. మరికొంత మంది సోషల్ మీడియా ద్వారా దేశంపై వారికి ఉన్న ప్రేమను పంచుకుంటున్నారు. ఇక సినీ గాయకులు కూడా తమదైన శైలీలో దేశభక్తిని చాటుకున్నారు. భిన్న మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలు కలిగిన భారతీయులందరూ ఒకటేనని ప్రపంచానికి చాటి చెప్పారు. (చదవండి : సల్మాన్ నోట దేశభక్తి పాట.. వైరల్) భారతీయు ఐకమత్యం చాటుకోవడానికి 65 మంది సింగర్స్ 5 భాషలలో దేశ భక్తి పాట పాడారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన దేశభక్తి చిత్రం ‘రోజా. ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. ఇందులోని ‘వినరా.. వినరా.. దేశం మనదేరా’అనే పాటను 65 మంది గాయకులు పాడారు. ‘టుగెదర్ యాజ్ వన్’ పేరుతో తీర్చిదిద్దిన ఈ పాటను రామ్‌చరణ్ విడుదల చేశారు. ‘టుగెదర్ యాజ్ వన్ ట్రాక్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇది మనలోని ఏకత్వాన్ని చూపిస్తోంది. ఒక ముఖ్యమైన కారణం కోసం 65మంది సింగర్లు కలిసి ఈ పాట పాడటం విశేషం. ఈ క్లిష్ట సమయంలో అందరం ఒక్కటే అంటూ ఐకమత్యం చాటడానికి ఇంత మంది సింగర్స్ కలిసి పని చేయడం ఆనందంగా ఉంది’అని చరణ్ ట్వీట్‌చేశారు. -
తెలంగాణ భవన్లో ప్రొ.జయశంకర్ జయంతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో గురువారం పలువురు పార్టీ నేతలు నివాళి అర్పించారు. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ తెలంగాణ భవన్‌లోని జయశంకర్ విగ్రహానికి పూలు సమర్పించారు. ప్రత్యేక గీతం విడుదల తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం పరితపించారని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి రాష్ట్ర కార్యాలయంలో జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జయశంకర్‌పై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని కవిత ఆవిష్కరించారు. -
‘వెనకడుగేయని కాలం పేరే కేటీఆర్..’
సాక్షి, హైదరాబాద్: మంత్రి కె.తారకరామారావు పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనపై రూపొందించిన ‘వెనకడుగేయని కాలం పేరే కేటీఆర్’అనే ప్రత్యేక గీతాన్ని మాజీ ఎంపీ కవిత గురువారం మధుర ఆడియో సంస్థ ద్వారా విడుదల చేశారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి నిర్మాతగా వ్యవహరించారు. మిట్టపల్లి సురేందర్ రాసిన ఈ పాటకు భరత్ అడోనిస్ సంగీతాన్ని అందించగా, యాజీన్నిజార్ ఆలపించారు. -
స్పెషల్ పాయల్
‘ఆర్ఎక్స్ 100’లో తన గ్లామర్‌తో కుర్రకారు గుండెల్లో గుబులు రేపారు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. గత ఏడాది ‘సీత’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేశారు. తాజాగా మరో స్పెషల్ సాంగ్‌లో నర్తించడానికి రెడీ అవుతున్నారని టాక్. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కమల్, శంకర్ కాంబినేషన్లోనే 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) చిత్రానికి ఇది సీక్వెల్. భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులోని ఓ స్పెషల్ సాంగ్ కోసం పాయల్ రాజ్‌పుత్‌ను సంప్రదించారట ‘ఇండియన్ 2’ చిత్రబృందం. పాయల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సిద్దార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియాభవానీ శంకర్, బాబీ సింహా కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. -
కరోనాపై పోరు! మంచు మనోజ్ పాట
కరోనా వైరస్‌పై అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రజల ప్రాణాలను సంరక్షించేందుకు అహర్నిశలా శ్రమిస్తున్న డాక్టర్లు, పోలీస్, మున్సిపల్ సిబ్బందికి అంకితమిస్తూ మంచు మనోజ్ ఓ పాటను విడుదల చేశారు. ఈ పాటకోసం మనోజ్‌తో పాటు ఆయన మేనకోడలు విద్య నిర్వాణ కూడా గళం విప్పారు. ‘ గుండె సెదిరిపోకురా.. గూడు వదల మాకురా’ అంటూ సాగే ఈ పాట 6 నిమిషాల 11 సెకన్ల నిడివి ఉంది. అచ్చు రాజమని సంగీత అందించిన ఈ పాటకు కాశర్ల శ్యాం లిరిక్స్ రాశారు. ఈ పాటపై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘ చీకటి ఇలాగే ఉండిపోదని, మళ్ళా వెలుగు వస్తుందని, గొప్ప ఆత్మ స్థైర్యం ఇచ్చే గీతం’ అన్నారు. కాగా, మంచు మనోజ్ హీరోగా ‘ అహం బ్రహ్మాస్మి’ అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆయన కొద్దిరోజుల క్రితమే విడుదల చేశారు. మూడు సంవత్సరాల విరామం తర్వాత మనోజ్ నటిస్తున్న సినిమా ఇది. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కొద్దిరోజులకే లాక్డౌన్ కారణంగా షూటింగ్‌కు విరామం ఏర్పడింది. -
‘ఓ పోలీసు.. మీ వల్లే మేము పదిలం’
కరోనా నియంత్రణలో భాగంగా విశేష సేవలందిస్తున్న వైద్య సిబ్బంది, పోలీసు, పారిశుధ్య కార్మికులకు యావత్ దేశం ప్రత్యేక కృజ్ఞతలు తెలుపుతుంది. ఇప్పటికే సెలబ్రిటీలు వారి సేవలను కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. ఇక గాయకులు, సంగీత దర్శకులు మరో ముందడుగేసి వారిపై తమకున్న గౌరవంతో పాటలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే పోలీసులను కీర్తిస్తూ రఘు కుంచె ‘సలాం నీకు పోలీసన్నా’పేరిట ఓ పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగానే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి ‘జయహో పోలీస్’ అనే మరో పాటను విడుదల చేశారు. శ్రీనివాస మౌళి లిరిక్స్ అందించగా ట్యూన్ కట్టి, స్యయంగా పాడారు కోటి. కరోనా మహమ్మారిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు, భయాన్ని పారద్రోలేందుకు సంగీత దర్శకుడు కోటి ఇదివరకే ఓ పాటను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: సలాం నీకు పోలీసన్నా.. నా రామ్‌చరణ్ తెలుసా?: కేటీఆర్ -
పాటతో ప్రజల్లో చైతన్యం నింపుతున్న పోలీసు అధికారిణి
-
కరోనాపై బాడ సూరన్న జానపద గీతం
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో కరోనా వైరస్ అడుగుపెట్టకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగం రోజుకో సరికొత్త ఆలోచనతో ముందుకు సాగుతుంది. అనేక రకాలుగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. కరోనా రహితంగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే జిల్లాలోని ప్రముఖ జానపద కళాకారులు బాడ సూరన్నతో ప్రత్యేకంగా ఒక జానపద గీతాన్ని పాడించారు. జిల్లా కలెక్టర్ జే నివాస్ సమర్పించిన ఈ గీతాన్ని ఎల్ఐసీలో ఐటీ మేనేజర్‌గా పనిచేస్తున్న బల్లా విజయకుమార్ రచించారు. కరోనా వైరస్ నియంత్రణకు, అవగాహనకు పొందుపరిచిన సమాచారంతో ఈ పాటకు సాహిత్యం అందించారు. డాక్టర్ దానేటి శ్రీధర్ సౌజన్యంతో రూపొందించిన ఈ గీతానికి పి సుగుణాకరరావు, దుప్పల వెంకటరావు పర్యవేక్షణ చేశారు. లీలామోహన్ సంగీతం సమకూర్చారు. కాగా, ఇటీవల తెలుగు ప్రజల ఆదరణ పొందిన ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంలో సిత్తరాల సిరపడు పాటకు బల్లా విజయ్‌కుమార్ సాహిత్యం అందించగా, బాడ సూరన్న తన గాత్రంతో పాటకు ఊపు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పాట.. కరోనా గొప్ప హైరానా అమ్మో అదొక రాకాసిరో తిప్పుకోకు దాన్ని నీకాసిరో నీ ఊపిరితిత్తిని సీకేసిరో ఊపిరితీసేసి పోతాదిరో కరోనా గొప్ప హైరానా వేరన్నా దాని తీరన్నా మేలన్నా ఉంటే దూరాన. // కరోనా// నువ్వు కోరకుండా సెంత సేరదురో ఒద్దంటే దూరాన ఉండేనురో మూడుమూరల దూరముండాలిరో ఎడమెడమ లేకుంటే తంటాలురో తుంటరి పనులు మానెయ్యరో ఒంటరి ఔతుంది మహమ్మారి రో // కరోనా// నీ ఒళ్లు సుబ్బరంగ ఉండాలిరో మనసు నిబ్బరంగ మసలాలిరో మునియేళ్ళ నుండి మోసేతిదాక మురికిని సబ్బుతో కడిగేసిపోరో కాసింత శుద్దిని పాటించరో మట్టికరిసి పోవు మహమ్మారిరో // కరోనా// కుటుమానలొగ్గేసి పోలీసులు కునుకు లేకుండా డాక్టర్లు , నర్సులు కష్టాలకెదురీది సర్కారు సిబ్బంది నెత్తికెత్తుకుంటె బాదరబంది ఒత్తిడి పెంచి విసిగించకోరె ఓపికపట్టి గడపదాటకోరె ఓరుపు వుంటే విజయం మనదోరె ముందు ముందు మంచి కాలముందోరె -
ఊపిరితిత్తిని సీకేసిరో.. ఊపిరితీసేసి పోతాదిరో
-
గుంగూబాయ్కి దీపిక స్పెషల్
మాఫియా క్వీన్ గంగూబాయ్ కోసం దీపికా పదుకోన్ ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్నారని బాలీవుడ్ తాజా వార్త . సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘గుంగూబాయ్ కతియావాడి’. ఈ చిత్రంలో ఆలియా భట్ టైటిల్ రోల్ చేస్తున్నారు. అజయ్ దేవగన్ ఓ కీలక పాత్ర చేస్తున్నారని టాక్. ముంబైకి చెందిన గ్యాంగ్‌స్టర్ గుంగూబాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ఇది. కథ రీత్యా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌కి స్కోప్ ఉందట. ఈ పాట కోసం దీపికా పదుకోన్‌ను సంప్రదించారట. ఈ సినిమాకు ముందు దీపికా పదుకోన్‌కు ‘పద్మావత్’ రూపంలో మంచి హిట్ ఇచ్చారు భన్సాలీ. అందుకని ‘గుంగూబాయ్’లో ప్రత్యేక పాట చేయడానికి దీపిక సై అంటారని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ప్రజల కోసం చేసిన పాట ఇది
‘‘కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ప్రజల్ని చైతన్యపరిచేలా ఓ పాట చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. గిటార్ వాయిస్తూ ట్యూన్ చేయడం మొదలుపెట్టాను. ఆ ట్యూన్‌ని ఫోన్లో రికార్డు చేసి రచయిత శ్రీనివాస్ మౌళికి పంపించాను. మేమిద్దరం కలిసి ఓ సినిమాకి పనిచేశాం. కానీ, ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఆ చిత్రంలోని పాటలన్నీ తనే రాశాడు. ఆ లిరిక్స్, అందులోని పదాలు నాకు బాగా నచ్చాయి. అందుకే నా ట్యూన్‌ని ఆయనకి పంపించి, కరోనా నేపథ్యంలో ప్రజల్ని బాగా చైతన్యపరిచేలా మంచి లిరిక్స్ రాయాలని చెప్పా.. అలా ‘లైటజ్ ఫైట్ కరోనా’ పాట చేశాం’’ అని చెప్పారు సంగీతదర్శకుడు కోటి. ఇంకా ఈ పాట గురించి ఆయన మరిన్ని విశేషాలు చెప్పారు. ► నా ట్యూన్ విని శ్రీనివాస్ చరణం రాసి పంపించాడు. అప్పటికి ఇంగ్లిష్ పదాల్లేవు. ఈ పాట గురించి చర్చిద్దామని ఇంటికి రమ్మన్నాను. అప్పుడు ఇంగ్లిష్ పదాలు వచ్చాయి. ట్యూన్ కూడా చక్కగా కుదిరింది. నేను, మా అబ్బాయి రోషన్ కలిసి రికార్డ్ చేశాం. సమర్థ్ అనే కీ బోర్డ్ ప్లేయర్ కూడా నాకు రికార్డింగ్‌లో సహాయం చేశాడు. ► గిటార్‌తోనే ఈ పాటని కంపోజ్ చేశాను. చాలా బాగా వచ్చింది. కానీ, కొంచెం పెద్దగా ఉండటంతో నేను, రోషన్ కూర్చుని షార్ట్ చేశాం. గిటార్, వయొలిన్.. ఇలాంటి వాటితో మిక్స్ చేసి ఫైనల్ రికార్డింగ్ కోసం కృష్ణానగర్‌లోని ఓ రికార్డింగ్ స్టూడియోకి మెయిల్లో పంపించాను. అతను మొత్తం రికార్డింగ్ చేసి, క్లీన్‌గా అన్ని లెవల్స్ చూసుకుని తర్వాత నాకు పంపించాడు. ► ఈ పాటని ముందు నా స్నేహితులకు పంపించాను.. అందరూ చాలా బాగుందని అభినందించారు. అదే రోజు రాత్రి చిరంజీవిగారికి కూడా పంపించాను. ఉదయాన్నే ఆయన ఫోన్ చేసి, ‘పాట చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఈ పాటకి వీడియో చేద్దాం’ అన్నారు. ‘మీరు మెగాస్టార్.. మీరు వీడియో చేస్తే ఇంకేం కావాలి.. అందరికీ బాగా చేరువవుతుంది’ అన్నాను. ► చిరంజీవిగారే నాగార్జునగారికి ఫోన్ చేశారు. అలాగే ఆయనే వరుణ్ తేజ్, సాయిధరమ్‌తో పాడమని చెప్పారు. నిజానికి వెంకటేశ్‌గారు, మహేశ్‌బాబు, రామ్‌చరణ్.. ఇలా చాలామంది చేయాల్సింది. కానీ కుదరలేదు. అందుకే చిరంజీవిగారు, నాగార్జునగారు, వరుణ్‌తేజ్, సాయిధరమ్‌లతో రికార్డ్ చేశాం. చిరంజీవిగారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఈ పాట ఇంత పాపులర్ అయింది. ► ఈ వెర్షన్ రిలీజ్ చేయకముందే నేను గిటారుతో చేసిన పాటను రిలీజ్ చేశాను. దానికి కూడా మంచి స్పందన వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగువారందరూ అభినందించారు. ఆ తర్వాత ఈ నలుగురితో చేసిన వీడియో యూట్యూబ్, వాట్సాప్ ఇలా.. సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అయింది. ► కమర్షియల్ సాంగ్స్ ఎన్నో చేశాను. కానీ మానవాళికి నా వంతు ప్రయత్నంగా ఈ పాట చేశాను. అందుకే చిరంజీవిగారు ‘మా వంతు సాయం చేయాలి కదా’ అన్నారు. ఆయన నాకు ఓ బ్రదర్‌లాగా అన్నమాట. మేము కలసి ఎన్నో సినిమాలు చేశాం.. అయితే అవి కమర్షియల్. కానీ, ఈ పాట ప్రజల కోసం. అందరి కోసం చేసిన ఈ పాటకి మంచి స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది. ► మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు, కేసీఆర్‌గారు ప్రజల క్షేమం కోసం ఈ ‘లాక్‌డౌన్‌ని’ పక్కాగా అమలు చేస్తున్నారు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. -
రామ్ చరణ్ స్పెషల్ సాంగ్ ప్రోమో
-
సాక్షి: సంక్రాంతి స్పెషల్ సాంగ్
-
చందమామతో బన్నీ చిందులు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురములో. అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సుశాంత్, టబు, నవదీప్, జయరామ్, నివేదా పేతురాజ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నర్తించనున్నారట. గతంలో జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్‌తో స్పెషల్ సాంగ్‌లో నటించిన కాజల్, ఇప్పుడు బన్నీతో కలిసి ఆడిపాడేందుకు రెడీ అవుతున్నారు. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఐటమ్ భాయ్?
మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలకు స్పెషల్ అట్రాక్షన్ ‘ఐటమ్ సాంగ్’. ఆ స్పెషల్ సాంగ్‌ను టాప్ హీరోయిన్స్ లేదా ఐటమ్ గాళ్స్‌తో డ్యాన్స్ చేయించాలనుకుంటారు దర్శక–నిర్మాతలు. తాజాగా ‘మా సినిమాలో ఐటమ్ సాంగ్‌కు ఎవ్వరూ అవసరం లేదు’ అనుకుంటున్నారట సల్మాన్ ఖాన్, ‘దబాంగ్ 3’ చిత్రబృందం. బాలీవుడ్ భాయ్ సల్మాన్ తన కొత్త చిత్రం ‘దబాంగ్ 3’ కోసం ఐటమ్ భాయ్ కాబోతున్నారని బాలీవుడ్ టాక్. ‘దబాంగ్’లో ‘మున్నీ బద్నామ్ హుయి డార్లింగ్ తేరేలియే....’ అంటూ సాగే స్పెషల్‌సాంగ్ ఆ సినిమాకే హైలైట్. మలైకా అరోరా వేసిన స్టెప్స్ స్పెషల్ అట్రాక్షన్. ‘దబాంగ్ 2’లో కరీనా కపూర్‌తో ‘ఫేవికాల్ సే’ సాంగ్‌ను తెరకెక్కించారు. ఆ పాట కూడా సూపర్ హిట్. తాజాగా ‘దబాంగ్ 3’లో ఐటమ్ నంబర్ ఎలా ఉంటుందని ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘దబాంగ్ 3’ స్పెషల్ సాంగ్‌లో కాలు కదపడం లేదని మలైకా స్పష్టం చేశారు. ఇప్పుడు స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారని చూస్తుంటే ఓ క్రేజీ న్యూస్ తెలిసింది. ‘దబాంగ్’ ఐటమ్ సాంగ్ సిరీస్‌లో ట్విస్ట్ వచ్చింది. ‘దబాంగ్’ ఫస్ట్‌పార్ట్‌లో ఉన్న ‘మున్నీ బద్నామ్...’ను మున్నాగా మార్చి కొత్త పాట రాస్తున్నారట. ఈ కొత్త లిరిక్స్‌కు మ్యాచింగ్‌గా సల్మానే స్టెప్స్ వేయబోతున్నారట. ఇదే నిజమైతే సల్మాన్ ట్రేడ్‌మార్క్ స్టెప్స్ అభిమానులకు విందు అవుతాయని చెప్పొచ్చు. డిసెంబర్ 20న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. సోనాక్షి సిన్హా కథానాయిక. -
స్పెషల్ సాంగ్ @ సెకండ్ టైమ్
‘ఐ వాంట్ ఏ స్పైడర్‌మ్యాన్’ అని గతంలో ఓసారి అనుష్క అడిగారు గుర్తుందా? చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ చూసినవాళ్లు ఇది ఆ సినిమాలోని పాటే కదా అని చటుక్కున చెప్పేస్తారు. ఆ స్పెషల్ సాంగ్‌లో చిరు, అనుష్క వేసిన స్టెప్స్‌ను అంత సులువగా మరచిపోలేం. మళ్లీ చిరంజీవితో మరో స్పెషల్ సాంగ్‌కి నర్తించడానికి అనుష్క రెడీ అయ్యారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార, తమన్నా కథానాయికలు. చిరంజీవి గురువు పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నారు అనుష్క. పదమూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ చిరుతో కలసి ఆమె స్టెప్స్ వేయడం విశేషం. ఈ సాంగ్ షూటింగ్ ఈ నెలాఖరున జరగనుందని సమాచారం. సినిమా రెగ్యులర్ షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సాంగ్‌ను చిత్రీకరించే ప్లాన్‌లో చిత్రబృందం ఉందని తెలిసింది. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
కల్కీ కిక్
స్పెషల్ సాంగ్స్ మాస్ ఆడియన్స్‌కు స్పెషల్ కిక్ ఇస్తాయి. అందులోని డ్యాన్స్ మూమెంట్స్ అదిరిపోయేలా ఉంటే థియేటర్స్‌లో ఆడియన్స్ ఉత్సాహం ఇంకా పెరుగుతుంది. ఈ మ్యాజిక్‌నే క్రియేట్ చేయడానికి అజిత్ అండ్ టీమ్ ప్లాన్ వేసింది. బాలీవుడ్ స్పెషల్ సాంగ్స్ ఫేమ్ కల్కీ కొచ్లిన్‌తో స్పెషల్ సాంగ్‌ను షూట్ చేసింది ‘నేర్కొండ పార్వై’ టీమ్. అజిత్, శ్రద్ధాశ్రీనాథ్, అభిరామి వెంకటాచలం, ఆండ్రియా టరియాంగ్ ప్రధాన పాత్రల్లో విద్యాబాలన్ కీలక పాత్ర చేసిన చిత్రం ‘నేర్కొండ పార్వై’. బోనీ కపూర్ నిర్మించారు. హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సీ నటించిన ‘పింక్’ చిత్రానికి ఇది తమిళ రీమేక్. ఈ సినిమాలో కల్కీతో ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించారు. ‘‘ఇదొక పెప్పీ సాంగ్. ఇందులో క్యాప్ అండ్ హిప్పీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. కల్కీనే కరెక్ట్ అనిపించింది. ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేశారు’’ అన్నారు బోనీ. ఈ సినిమాలో అజిత్ భార్యగా విద్యాబాలన్ నటించారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వేసవిలో రిలీజ్ కానుంది. -
బుల్ బుల్ పాయల్
‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశారు పాయల్ రాజ్‌పుత్. అందం, అభినయంతో యువతని అలరించిన ఈ బ్యూటీ కథానాయికగా బిజీగా ఉన్నా ప్రత్యేక గీతాల్లో నటిస్తున్నారు. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘సీత’ చిత్రంలో ప్రత్యేక పాటలో నటించారు పాయల్. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ పాటలో భాగంగా ఆర్ఎక్స్ 100 బైక్‌పై చిరునవ్వులు చిందిస్తూ, వయ్యారాలు వొలకబోస్తున్న పాయల్ లుక్ ఆకట్టుకుంటోంది. ‘‘సినిమా కథానుసారం కీలక సమయంలో వచ్చే ‘బుల్ రెడ్డి...’ అనే పెప్పీ మాస్ సాంగ్‌లో పాయల్ న టించారు. ఈ పాట మాస్‌తో సహా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది. ఈ పాటలో పాయల్ సోలో పెర్ఫామెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనుంది. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ఈ పాటని రిలీజ్ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన మా సినిమా టీజర్ 2.5 మిలియన్ వ్యూస్‌తో సూపర్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. సోనూ సూద్, తనికెళ్ల భరణి, అభినవ్ గోమటం, అభిమన్యుసింగ్ నటించిన ఈ చిత్రానికి సమర్పణ: ఏ టీవీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి, సహ నిర్మాతలు: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: శిర్షా రే. -
సూపర్ హీరోలకు స్పెషల్ సాంగ్
దేశీ సూపర్ స్టార్స్‌కి ఎన్నో మంచి పాటలిచ్చారు ఏఆర్ రెహమాన్. విదేశీ తారలకూ మంచి పాటలిస్తుంటారు. మరి అద్భుతమైన విన్యాసాలు చేసే సూపర్ హీరో క్యారెక్టర్స్‌కే సంగీతం ఇవ్వాలంటే? అది ఏ లెవల్లో ఉంటుందో మీరు ఊహించుకోండి. ఇండియాలో హాలీవుడ్ సూ టపర్ హీరోల సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. ‘అవెంజర్స్’కు అయితే బోలెడు క్రేజు. ఈ సిరీస్‌లో లేటెస్ట్గా వస్తున్న సినిమా ‘అవెంజర్స్ – ఎండ్ గేమ్’. ఇందులో ఓ స్పెషల్ సాంగ్‌ను రెహమాన్‌తో కంపోజ్ చేయించారు చిత్రబృందం. హిందీ, తెలుగు, తమిళ వెర్షన్లలో ఈ సాంగ్‌ను పొందుపరచనున్నారు. ఈ స్పెషల్ సాంగ్‌ను ఏప్రిల్ 7 లేదా 8న హైదరాబాద్‌లో రెహమానే స్వయంగా రిలీజ్ చేయనున్నారు. వాల్ట్ డిస్నీ కంపెనీ స్టూడియో హెడ్ బిక్రమ్ దుగ్గల్ కూడా పాల్గొననున్నారు. -
‘సీత’ సినిమాలో పాయల్ పెప్పీ సాంగ్
హైదరాబాద్ : బోల్డ్ యాక్టింగ్, అద్భుతమైన డాన్సింగ్ స్కిల్స్‌తో ఇటు కుర్రకారును, అటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకున్న యంగ్ హీరోయిన్ 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ మరో బంపర్ ఆఫర్ దక్కించుకుంది. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మాణ సారధ్యంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న‘ సీత’ సినిమాలో ఒక పెప్పీసాంగ్కు స్టెప్పులేసే లక్కీ చాన్స్ దక్కించుకుందట. హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో అనూప్ రూబెన్స్ స్వరపర్చిన ఈ పాటను చిత్రీకరించబోతున్నారని సమాచారం. తేజ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సీత సినిమాలో కాజల్ అగర్వాల్ బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. అంతేకాదు కాజల్ నెగిటివ్‌రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో సోనూ సూద్ చాలా కాలం తరువాత మళ్లీ టాలీవుడ్ సినిమాలో నటిస్తుండటం విశేషం. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలను దాదాపు పూర్తి చేసుకుంది. అయితే పాయల్, కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్‌లపై ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ముగిసిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ మొదలు కానున్నాయి. ఏప్రిల్ 25న ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కాగా ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి ఇక్కడ వరస ఆఫర్లను తన ఖాతాలో వేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మాస్ మహారాజా రవితేజ సినిమా 'డిస్కో రాజా' తో పాటు, మన్మథుడు-2 మూవీలో కూడా చాన్స్ కొట్టేసింది. అలాగే కవచం సినిమా తరువాత కాజల్‌కు బెల్లంకొండతో ఇది రెండవ సినిమా. మరోవైపు ఇప్పటికే విడుదలైన సీత ఫస్ట్ లుక్ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
రంగీలా రమ్మంది
దక్షిణాది చిత్రాలపై హాట్‌స్టార్ సన్నీ లియోన్ ఎక్కువ మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఆమె కొన్ని దక్షిణాది చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన విషయం తెలిసిందే. గతేడాది హీరోయిన్గా తమిళంలో ‘వీరమాదేవి’ (తెలుగులో ‘వీరమహాదేవి’) అనే సినిమాకు సైన్ చేశారు సన్నీ. ఈ సినిమా తెలుగు, మలయాళంలో కూడా రిలీజ్ కానుంది. ఇప్పుడు ‘రంగీలా’ అనే చిత్రం సన్నీని కేరళకు రమ్మంది. ‘వీరమాదేవి’ అనువాద చిత్రం కాబట్టి ‘రంగీలా’ ఆమెకు మలయాళంలో డైరెక్ట్ చిత్రం అవుతుంది. ఈ సినిమా గురించి ఇప్పుడు సన్నీనే అధికారికంగా ప్రకటించారు. ‘‘మలయాళ చిత్ర పరిశ్రమలోకి ‘రంగీలా’ అనే మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇవ్వబోతున్నానని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతుంది. సంతోష్ నాయర్ దర్శకత్వం వహిస్తారు. జయలాల్ మీనన్ నిర్మిస్తారు’’ అని సన్నీలియోన్ పేర్కొన్నారు. మలయాళంలో మమ్ముట్టి హీరోగా రూపొందుతున్న ‘మధుర రాజా’ చిత్రంలోనూ సన్నీ ఓ ప్రత్యేక పాట చేయనున్నాట. -
ఆ చాన్స్ ఇప్పుడొచ్చింది
సన్నీలియోన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె వేసే స్టెప్పులకు కుర్రకారు హార్ట్ బీట్ పెరుగుతుంది. ఇప్పటికే చాలా స్పెషల్ సాంగ్స్‌లో నర్తించిన సన్ని తాజాగా మరో సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘పులిమురుగన్’ (తెలుగులో ‘మన్యం పులి’) ఫేమ్ వైశాక్ దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా మలయాళంలో ‘మధుర రాజా’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 2010లో వచ్చిన ‘పోకిరి రాజా’ సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమాలో సన్నీలియోన్ స్పెషల్ సాంగ్ చేయనున్నారు. ‘‘మమ్ముట్టిసార్తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను. ఆ చాన్స్ ఇప్పుడు వచ్చింది. ఇది నాకో మంచి అవకాశం. ఈ సాంగ్ గురించి నాకు తెలుసు. ఏదో సినిమాలో కావాలని పెట్టే పాట కాదిది. చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ విషయం నాకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది’’ అని సన్ని చెప్పారు. ఈ సాంగ్ కోసం సన్నీలియోన్ ఆల్రెడీ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసేశారు. వచ్చే నెలలో కొచ్చిలో ఈ పాట చిత్రీకరణకి ప్లాన్ చేశారు టీమ్. కాగా సన్నీలియోన్ ౖటైటిల్ రోల్లో ‘వీరమహాదేవి’ అనే పీరియాడికల్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
క్యాథరిన్ హై క్యా?
రామ్‌చరణ్ స్టెప్పేస్తే ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా మాస్ సాంగ్స్కైతే అదుర్స్. ఇప్పుడు రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘వినయ విధేయ రామ’లో ఓ మంచి మాస్ మసాలా సాంగ్ ఉందట. రెండు పాటలు మినహా ఈ చిత్రం పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ రెండు సాంగ్స్‌లో ఒకటి ఫ్యామిలీ సాంగ్ కాగా, మరొకటి స్పెషల్ మాస్ సాంగ్. ఈ స్పెషల్ సాంగ్‌లో అదిరిపోయే స్టెప్పులేయడానికి పలు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఆ చాన్స్ క్యాథరిన్‌కు దక్కిందని టాక్. మరి.. క్యాథరిన్ హై క్యా (క్యాథరిన్ ఉందా?) అనేది త్వరలో తెలుస్తుంది. అలాగే కేవలం స్పెషల్‌సాంగ్ కోసమే అన్నట్లు క్యాథరిన్ క్యారెక్టర్ ఉండదట. ఓ సీన్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ మాదిరిగా ఉంటూ సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో రామ్‌చరణ్‌తో కలిసి కాలు కదుపుతారట ఆమె. ‘వినయ విధేయ రామ’ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందు బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’ సినిమాలో సెకండ్ హీరోయిన్గా, ‘జయజానకి నాయక’ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేశారు క్యాథరీన్. వచ్చే నెల రెండో వారం తర్వాత ఈ పాట చిత్రీకరణ మొదలుపెట్టాలని అనుకుంటున్నారట. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రశాంత్, వివేక్ ఒబెరాయ్, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. -
సన్నీ స్టెప్పేస్తే!
సన్నీ లియోన్ స్పెషల్ సాంగ్‌కి డ్యాన్స్ వేస్తే సినిమాకో క్రేజ్ ఏర్పడుతుంది.. సన్నీ స్టెప్పేస్తే సిల్వర్ స్క్రీన్ షేక్ అవ్వడం ఖాయం. ఆల్రెడీ హిందీలో ‘పింక్ లిప్స్, లైలా మే లైలా’ వంటి స్పెషల్ సాంగ్స్‌తోపాటు రాజశేఖర్ ‘పీయస్వీ గరుడవేగ’ చిత్రంలో ‘డియో డియో..’ వంటి సాంగ్‌తో సన్నీ ఎంతటి సెన్సేషన్ సృష్టించారో తెలిసిందే. ఇప్పుడు అదే క్రేజ్ తమ సినిమాకి తోడవ్వాలనుకుంటున్నారు ‘అయోగ్య’ చిత్రబృందం. తెలుగు సూపర్‌హిట్ చిత్రం ‘టెంపర్’ను హీరో విశాల్ తమిళంలో ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాశీ ఖన్నా కథానాయిక. ఏఆర్ మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ దర్శకుడు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం చిత్రబృందం సన్నీ లియోన్ని సంప్రదించారట. ‘టెంపర్’లో ‘ఇట్టాగే రెచ్చిపోదాం పిల్లా’ అనే సాంగ్‌కు నోరా ఫతేహి స్టెప్స్ వేశారు. ఇప్పుడు ఈ ఐటమ్ సాంగ్‌కే తమిళంలో సన్నీ స్టెప్పులు వేయనున్నారట. ఈ చిత్రం ఫస్ట్ లుక్ సోమవారం రిలీజ్ కానుందని సమాచారం. ఈ చిత్రాన్మి ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
దేవదాస్ : వినాయక చవితి స్పెషల్ సాంగ్
కింగ్ నాగార్జున, యంగ్ హీరో నాని హీరోలుగా తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ దేవదాస్. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాను యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్, లిరికల్ వీడియోలతో సందడి చేస్తున్నారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా మరో సాంగ్‌ను విడుదల చేశారు. మా పండుగ కొంచెం ముందే మొదలయ్యింది అంటూ లక లక లకుమీకర లంభోదర అంటూ సాగే వినాయక చవితి పాటను రిలీజ్ చేశారు. మణిశర్మ సంగీత దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
అభిమాన నాయకుడి కోసం..!
జె ఎస్ ఆర్ మూవీస్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి సమర్పణలో హరికృష్ణ జొన్నలగడ్డను హీరోగా పరిచయం చేస్తూ జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమెంత పని చేసే నారాయణ’ ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆగస్ట్ 24న రిలీజ్‌కి రెడీ అయ్యింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అభిమాని అయిన హీరో హరికృష్ణ జగన్ కోసం ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ‘ఎదురు లేని మనిషి జననేత జగన్ అన్న’ అనే ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ఆ పాటను వైస్ జగన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా... చిత్ర దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘జగన్ గారి అభిమాని అయిన మా హీరో హరి కోరిక మేరకు ఎదురు లేని మనిషి జననేత జగనన్న అనే పాటను చేయడం జరిగింది. ఈ పాట ప్రతీ వైఎస్సార్ అభిమాని, వైఎస్ జగన్‌ను ప్రేమించే ప్రతీ వ్యక్తికి నచ్చే విధంగా రూపొందించడం జరిగింది. ఈ పాట సీడీలను జగన్ గారు ఆవిష్కరించి మా హీరో హరిని చిత్ర యూనిట్ ను అభినందించార’ని తెలిపారు. హీరో హరి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ గారు విడుదల చేసిన మా సినిమా ఆడియో పెద్ద హిట్ అయ్యింది. ఆయన ఎంతో బిజీగా వున్నా కూడా ఆడియోను విడుదల చేయటం నా జీవితంలో మరచిపోలేని విషయం. జగన్ గారికి ఎంతో రుణపడి ఉన్నాను. ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్న నా అభిమాన నాయకుడికి నా వంతుగా ఏదో ఒకటి చేయాలి అనుకొని ఆ ప్రజా నాయకుడి మీద ఓ పాట రూపొందించే ఆలోచన వచ్చింది. అందుకే ఈ ప్రత్యేక గీతాన్నిరూపొందించాం. త్వరలోనే మా సినిమాతో మీ ముందుకు వస్తున్నాను.. ప్రేక్షకులు నా ప్రయత్నాన్ని మెచ్చి నన్ను దీవిస్తారు అని ఆశిస్తున్నా’ అని తెలిపారు. -
చెర్రీ కోసం రకుల్
రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు. బోయపాటి మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చెర్రీ స్టైలిష్ లుక్‌లో అలరించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. బోయపాటికి తన సినిమాల్లో స్టార్ హీరోయిన్లతో స్పెషల్ సాంగ్స్ చేయించటం లో సెంటిమెంట్. అదే సెంటిమెంట్‌ను చరణ్ సినిమాలోనూ కంటిన్యూ చేస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ సరసన రకుల్ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడనుందట. బోయపాటి గత చిత్రం జయ జానకీ నాయక లో హీరోయిన్గా నటించిన రకుల్ చెర్రీతో ధృవ, బ్రూస్లీ సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఇప్పుడు స్పెషల్ సాంగ్‌లో ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. -
చెర్రీతో చిందేయనున్న రకుల్!
రంగస్థలం లాంటి క్లాసిక్ హిట్ తరువాత మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. ఈ మూవీని యాక్షన్ ఓరియెంటడ్గా తెరకెక్కించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతోందట. ఈ ప్రత్యేక గీతంలో రకుల్ ప్రీత్‌ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇప్పటికే బ్రూస్లీ, ధ్రువ సినిమాలతో అభిమానుల్ని మెప్పించిన ఈ జంట మరోసారి ప్రత్యేకగీతంలో చిందులు వేసే అవకాశం ఉందన్న మాట. ఈ సినిమాలో స్నేహ, తమిళ్ ఫేం ప్రశాంత్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీలో చెర్రీకి జోడిగా కైరా అద్వానీ నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. -
హాలీవుడ్లో దీపిక స్పెషల్ సాంగ్
బాలీవుడ్ హీరోయిన్లు హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ప్రియాంక చోప్రా లాంటి వారికి హాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. మరో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కూడా హాలీవుడ్లో జెండా పాతేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే విన్ డీజిల్ తో కలిసి ట్రిపుల్ఎక్స్ రిటర్న్ ఆఫ్ ది క్సాండర్ కేజ్ సినిమాలో నటించిన దీపికా మరో భాగంలోనూ నటించేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. దీపికా చేసిన సెరెనా ఉంగర్ పాత్రను నాలుగో భాగంలో కూడా కొనసాగించనున్నారు. అంతేకాదు ఈ సినిమా చివర్లో బాలీవుడ్ స్టైల్లో ఓ స్పెషల్‌సాంగ్ చేయించాలని నిర్ణయించారు. దీపికతో లుంగీ డాన్స్ తరహాలో మాస్ బీట్ సాంగ్‌ను చిత్రీకరించేందుకు ప్లాన చేస్తున్నారు. పద్మావత్ సినిమా తరువాత వెన్ను నొప్పి కారణంగా దీపికా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. పూర్తిగా కోలుకున్న తరువాతే సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నారు. -
చరణ్ సినిమాలో ఛాన్స్
రంగస్థలం సినిమాతో ఘనవిజయం సాధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భరత్ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. బోయపాటి సినిమాలో భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు ఓ మాస్ మసాలా ఐటమ్ సాంగ్ కూడా కంపల్సరీ. అందుకే చరణ్ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి. ఈ స్పెషల్ సాంగ్‌లో చరణ్ సరసన కేథరిన్ థ్రెస్సా ఆడిపాడినున్నారు. గతంలో బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సరైనోడు సినిమాలో కీలక పాత్రలో నటించిన కేథరిన్, తరువాత జయ జానకి నాయకలో స్పెషల్ సాంగ్‌లో మెరిశారు. ఇప్పుడు మరోసారి బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చరణ్ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నారు కేథరిన్. -
‘రంగమ్మ మంగమ్మ’ పేరడీ సాంగ్
-
‘ఇంతలోనే ఎంత ఎదిగే రామ్ చరణూ’
రంగస్థలం సినిమా రిలీజై ఐదు వారాలు గడుస్తున్నా సినిమా హవా మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉంది. ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాకు సంబంధించి రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా రంగమ్మ మంగమ్మ పాటకు చిన్నారులు డ్యాన్స్ చేసిన వీడియోలో పదుల సంఖ్యలో యూట్యూబ్‌లో దర్శనమిస్తున్నాయి. తాజాగా ఈ పాటకు పేరడీగా రూపొందించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశారు. రంగమ్మ మంగమ్మ పాటను రామ్ చరణ్ నటనకు తగ్గట్టుగా‘ఓరయ్యో ఓలమ్మో ఏం పిల్లడూ.. ఇన్ని నాళ్లు యాడదాగే ఇంత నటుడు’ అంటూ పేరడీ చేశారు. ఈ పాటను ప్రముఖ నటుడు రచయిత ఉత్తేజ్ చిన్న కూతురు పాట ఉత్తేజ్ స్వయంగా ఆలపించి, నటించారు. -
ఆ వార్త నిజం కాదు : రకుల్
అక్కినేని యువ హీరో నాగచైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయాన్ని చిత్రయూనిట్ వెల్లడించారు. నాగార్జున సూపర్ హిట్ సాంగ్స్ లో ఒకటైన ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయత్తు’ పాటను రీమిక్స్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అయితే ఈ పాటలో నాగచైతన్యతో రకుల్ ప్రీత్ సింగ్ ఆడిపాడుతుందన్న ప్రచారం జరిగింది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో కలిసి నటించిన చైతూ, రకుల్‌లు మరోసారి ఈ పాట కోసం ఆడి పాడనున్నారన్న టాక్ బలంగా వినిపించింది. అయితే ఈ వార్తపై హీరోయిన్ రకుల్ స్పందించారు. తాను సవ్యసాచి సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తలు నిజంగా కాదంటూ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం బాలీవుడ్లో అజయ్ దేవ్గన్ సరసన హీరోయిన్గా నటిస్తున్న రకుల్, కొన్ని తమిళ చిత్రాలకు కూడా ఓకె చెప్పింది. Not true https://t.co/AahmZLpR4X — Rakul Preet (@Rakulpreet) 15 April 2018 -
'ఎవరూ రాయనిది ఈ కథనం..'
-
'ఎవరూ రాయనిది ఈ కథనం..'
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ నటి గౌతమి ప్రత్యేక పాటను రూపొందించారు. ‘గౌతమి’ అనే టైటిల్‌తో ఉన్న ఈ పాటను గురువారం విడుదల చేశారు. ‘ఎవరూ రాయనిది ఈ కథనం..ఎప్పుడూ చూడనిది ఈ వైనం’ అంటూ మొదలయ్యే ఈ పాటలో ఆడపిల్లలపై సామాజం చూపుతున్న వివక్ష, పురిటిలోనే ఆడపిల్లలను చంపేయడం వంటి ఘటనలను చూపించారు. అనాథలైన ఆడపిల్లలను గౌతమి చేరదీసి పెంచడం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. కిదాంబరి పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన ఈ పాటుకు హైమా రెడ్డి దర్శకత్వం వహించారు. మహిళలకు ఈ ప్రత్యేక పాట అంకితమంటూ గౌతమి ట్విటర్లో పేర్కొన్నారు. -
రూటు మార్చిన అర్జున్ రెడ్డి హీరోయిన్
-
రూటు మార్చిన అర్జున్ రెడ్డి హీరోయిన్
సాక్షి, సినిమా : థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన షాలిని పాండే.. అర్జున్ రెడ్డి చిత్రంతో యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ప్రీతి పాత్రలో ఆమె ఇచ్చిన ఫెర్ఫార్మెన్స్ దెబ్బకు మిగతా భాషల్లో కూడా అవకాశాలు తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే షాలిని ఇప్పుడు మరో రూట్లోకి వెళ్లి సింగర్ అవతారం ఎత్తింది. ప్రేమికుల రోజు ప్రత్యేకం ‘నా ప్రాణమే’ అంటూ ఓ స్పెషల్ వీడియో ఆల్బమ్‌లో కోసం తన గళం వినిపించింది. పాప్ రాక్ బ్యాండ్ ‘లగోరీ’ కంపోజ్ చేసిన ఈ పాటలో షాలిని గాత్రం ఆకట్టుకుంది. ఈ పాటకు సంబంధించిన చిన్న టీజర్‌ను నెట్లో వదిలారు. చాలా కాన్ఫిడెంట్‌తో షాలిని పాటను పాడగా.. అద్భుతంగా ఉన్న ఆమె గాత్రం... అందుకు తగ్గట్లే మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ పూర్తి పాటను విడుదల చేయనున్నారు. చూస్తుంటే సింగర్‌గా కూడా ఆమె సక్సెస్ అవుతుందనే అనిపిస్తోంది. ఇక సినిమాల పరంగా చూసుకుంటే సావిత్రి బయోపిక్ మహానటితోపాటు, కోలీవుడ్‌లో 100% లవ్ రీమేక్‌లో షాలిని పాండే హీరోయిన్గా నటిస్తోంది. -
ఉర్రూతలూగిస్తోన్న క్రీడా గీతం.. వైరల్ వీడియో
న్యూ ఢిల్లీ: పాఠశాల క్రీడా పోటీల నేపథ్యంలో రూపొందించిన ప్రత్యేక గీతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంబించిన ‘ఖేలో ఇండియా’ ప్రచారంలో భాగంగా ‘ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్’ జరుగనున్నాయి. జనవరి15న కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఆవిష్కరించిన క్రీడా గీతాన్ని గంటల వ్యవధిలోనే సుమారు 20కోట్ల మంది వీక్షించారు. అమితాబ్, సచిన్ టెండూల్కర్, పలువురు రాజకీయనేతలు సైతం ఈ పాటకు కితాబిచ్చారు. నిర్వాణ ఫిల్మ్స్ సంస్థ రూపొందించిన ఈ ప్రత్యేక గీతాన్ని ప్రముఖ సంగీతకారుడు లూయిస్ బ్యాంక్ స్వరపర్చారు. ఏమిటీ క్రీడా గీతం? : పాఠశాల స్థాయిలో ఆటలను ప్రోత్సహించానే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా జనవరి 31 నుంచి ఫిబ్రవరి 8 వరకు ‘ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్’ను నిర్వహించనుంది. 17 ఏళ్లలోపు బాలబాలికలకు అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, కబడ్డీ, ఖొఖో, షూటింగ్, వాలీబాల్, స్విమ్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల ద్వారా వెయ్యి మంది క్రీడాకారులను ఎంపిక చేసి వరుసగా ఎనిమిది సంవత్సరాల పాటు ఐదు లక్షల స్కాలర్షిప్ను కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ అందజేస్తుంది. -
ఉర్రూతలూగిస్తోన్న క్రీడా గీతం..
-
స్పెషల్ సాంగ్ అని.. ఐటమ్ సాంగ్ చేశారు..!
సాక్షి, చెన్నై: దర్శకుడు బాలాజీ శక్తివేల్ వళక్కు ఎన్ 18/9 చిత్రం ద్వారా మనీషాయాదవ్ హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఆ డైరెక్టర్ అలా చెప్పి ఉండాల్సింది కాదు. నన్ను ఆయన మోసం చేశారని నటి మనీషాయాదవ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మధ్య చెన్నై-28 సీక్వెల్లో ఐటమ్ సాంగ్‌కు చిందులేసింది. సినిమా విడుదలైన చాలా కాలం తర్వాత డైరెక్టర్ వెంకట్ ప్రభుపై ఆరోపణలు గుప్పించింది. ఆమె మాట్లాడుతూ.. దర్శకుడు వెంకట్‌ప్రభు నన్ను మోసం చేశారు. చెన్నై-28 చిత్ర సీక్వెల్లో నాకు ఒక పాటతో పాటు చిత్రాన్ని మలు తిప్పే కీలక సన్నివేశాలు ఉంటాయని చెప్పారు. ముందుగా స్వప్నసుందరి పాటను చిత్రీకరించారు. అదీ స్పెషల్ సాంగ్ అని చెప్పారు. తీరా చిత్రం విడుదలైన తర్వాత చూస్తే అది ఐటమ్ సాంగ్ అని తెలిసింది. అందరూ స్వప్నసుందరి అని పిలుస్తున్నారు. దర్శకుడు ఆ పాటను స్పెషల్ అని చెప్పి ఉండకూడదు. అలా నన్ను వెంకట్ ప్రభు మోసం చేశారు. ఐటమ్ సాంగ్ గర్ల్ అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు అని ఒక ఇంటార్య్వూలో పేర్కొంది. ఈ అమ్మడు మొదట్లో త్రిష ఇల్లన్నా నయనతార చిత్రంలో తనతో అసభ్య సంభాషణలు చెప్పించారని, గ్లామరస్‌గా చూపించారని ఈ అమ్మడు ఆ చిత్ర దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్‌పై ఫైర్ అయ్యి కలకలం సృష్టించింది. ఆ సినిమాకు ఆమె దాదాపుగా దూరం అయ్యింది. అయినా సినిమాలకు దూరమై పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అయిన తరువాత ఎప్పుడో మోసం చేశారని ఇప్పుడు గగ్గోలు పెట్టడంలో ప్రయోజనం ఏముంటుందో మనీషాయాదవ్‌నే చెప్పాలి. -
పవన్‌తోపాటే అనిరుధ్ కూడా!
సాక్షి, సినిమా : కాస్త ఆలస్యంగానైనా కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తెలుగులో తన డెబ్యూ ఇవ్వబోతున్నాడు. ఏకంగా పవన్ 25వ చిత్రానికే ట్యూన్లు అందించే బంపరాఫర్‌ను కొట్టేశాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మెలోడియస్ పాటలతో అజ్ఞాతవాసి ఆల్బమ్‌ను అందంగా తీర్చి దిద్దాడు కూడా. అయితే అజ్ఞాతవాసికి సంగీతం అందించటంతోపాటు మరో అవకాశం కూడా అనిరుధ్ కొట్టేశాడంట. నిన్న సాయంత్రం విడుదలై సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది పవర్ స్టార్ పాడిన కొడకా కోటేశ్వర రావు సాంగ్. అందులో పవన్‌తోపాటు అనిరుధ్ కూడా స్టెప్పులేయబోతున్నాడని తెలుస్తోంది. సినిమాలోని ఆ పాట చివర్లో కొద్ది సెకన్లపాటు అనిరుధ్ కూడా కనిపించబోతున్నాడంట. అనిరుధ్‌కి ఇలా స్టార్ల సినిమాల్లో కనిపించటం కొత్తేం కాదు. గతంలో ధనుష్ నటించిన ఓ చిత్రం కోసం అనిరుధ్ సాంగ్‌లో మాస్ స్టెప్పులతో అలరించాడు కూడా. ఇక అజ్ఞాతవాసి విషయానికొస్తే.. టీజర్లతోనే పవన్ రికార్డులు బద్ధలు కొడుతుండగా... ట్రైలర్ ఎలా ఉండబోతుందోనని పీకే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. https://t.co/KjgFD3MHk0 — PK Creative Works (@PKCreativeWorks) 31 December 2017 -
43 ఏళ్ల వయసులో ఐటమ్ సాంగ్‌లో..!
రంగీలా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించి తరువాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హాట్ బ్యూటి ఊర్మిళ మతోండ్కర్. నార్త్ తో పాటు సౌత్ లోనూ ఆకట్టుకున్న ఈ బ్యూటి 2008 రిలీజ్ అయిన కర్జ్ సినిమా తరువాత సినీ రంగానికి దూరమైంది. అడపాదడపా టీవీ షోలతో పాటు మరాఠి సినిమాల్లో అతిథి పాత్రల్లో నటిస్తున్న ఈ బ్యూటి, త్వరలో ఓ బాలీవుడ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే సీనియర్ హీరోయిన్లందరూ తల్లి పాత్రలతో రీ ఎంట్రీ ఇస్తుంటే ఊర్మిళ మాత్రం స్పెషల్ సాంగ్ తో రానుంది. 43 ఏళ్ల ఈ బ్యూటీ ఇర్ఫాన్ ఖాన్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న రైతా సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుంది. అభినయ్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. -
నాలుగేళ్ల తర్వాత!
శ్రియ నాలుగేళ్ల తర్వాత డ్యాన్స్ చేయబోతున్నారు. అదేంటి? ఈ నాలుగేళ్లలో ఆమె చాలా సినిమాలు చేశారు కదా. వాటిలో డ్యాన్స్ చేశారు కూడా అనుకుంటున్నారా? మరేం లేదు. స్పెషల్ సాంగ్స్‌కి ఆమె డ్యాన్స్ చేసి, నాలుగేళ్లయింది. కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘నక్షత్రం’లో శ్రియ ఓ స్పెషల్ సాంగ్‌కి కాలు కదపనున్నారని టాక్. కాగా, సోమవారం సన్నీ లియోన్ని ఈ పాటకు తీసుకున్నారనే వార్త రాగా, ‘అదేం కాదు... ఓ ప్రముఖ హీరోయిన్ కోసం చూస్తున్నాం’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఆ స్టార్ ఈ స్టారే అన్నది మంగళవారం ఖబర్. దేవదాసు, మున్నా, తులసీ వంటి తెలుగు చిత్రాలతో పాటు మరికొన్ని తమిళ సినిమాల్లో శ్రియ స్పెషల్ సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరించారు. చివరిగా 2013లో ‘జిల్లా గజియాబాద్’ చిత్రంలో ఆమె స్పెçషల్ సాంగ్ చేశారు. ఇప్పుడు ‘నక్షత్రం’కి చేస్తున్నారట. -
ఎన్టీఆర్ సినిమాలో లక్కీ గర్ల్
జనతా గ్యారేజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్, షార్ట్ గ్యాప్ తరువాత బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాను ప్రారంభించాడు. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి రోజుకో ఇంట్రస్టింగ్ అప్ డేట్ సందడి చేస్తోంది. ఎన్టీఆర్ త్రిపాత్రినయం చేస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ అన్న, హీరో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మరిన్ని ఆకర్షణలు జోడిస్తున్నారు. తన ఐటమ్ సాంగ్ ఉంటే చాలు సినిమా హిట్ అన్న రేంజ్లో పేరు తెచ్చుకున్న హంసానందిని ఎన్టీఆర్ కొత్త సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయనుందట. అంతేకాదు సినిమాలో కీలకమైన పలు సన్నివేశాల్లోనూ హంస కనిపిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న జై లవకుశ సినిమాతో ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
స్పెషల్ సాంగ్‌కి గ్రీన్ సిగ్నల్
హీరోయిన్గా నటిస్తున్నవాళ్లు ప్రత్యేక పాటకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే.. ఆ పాటకు సినిమాలో చాలా స్పెషాల్టీ ఉండాలి. ఉంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. కేథరిన్ ఇప్పుడు ఓ స్పెషల్ సాంగ్ చేయడానికి పచ్చజెండా ఊపారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రకుల్ ప్రీత్‌సింగ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలు. ఈ చిత్రంలోనే కేథరిన్ ప్రత్యేక పాటలో మెరవనున్నారు. ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’ చిత్రాల్లో బెల్లంకొండ పక్కన తమన్నా ప్రత్యేక గీతాలతో కుర్రకారును ఊర్రూతలూగించిన విషయం తెలిసిందే. తాజా చిత్రంలో కేథరిన్ చేయనున్న ఐటమ్ సాంగ్ వాటికి ధీటుగా చాలా గ్రాండ్‌గా ఉంటుందని నిర్మాత పేర్కొన్నారు. ఈ ప్రత్యేక పాట కోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ఇప్పటికే భారీ సెట్ సిద్ధం చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో ప్రత్యేక పాట ట్యూన్ ఓ రేంజ్లో ఉంటుందని ఊహించవచ్చు. -
యాంగ్రీ హీరోతో సన్నీ
చాలా కాలంగా వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న యాంగ్రీ హీరో రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా గరుడ వేగ. గుంటూరు టాకీస్తో మంచి విజయం సాధించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. రాజశేఖర్ మరోసారి యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పూజా కుమార్ హీరోయిన్గా నటిస్తోంది. ఎక్కువగా భాగం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేస్తున్నారు చిత్రయూనిట్. సినిమాలో కీలక సమయంలో వచ్చే ఓ స్పెషల్ సాంగ్‌ను బాలీవుడ్ హాట్ బ్యూటి సన్నీలియోన్‌తో చేయిస్తున్నారు. భారీ మొత్తం ఆఫర్ చేయటంతో సన్నీ కూడా వెంటనే ఒప్పేసుకుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో గెస్ట్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ చేసిన సన్నీ మరోసారి తెలుగు ప్రేక్షకులను ఊర్రూతలూగించేందుకు రెడీ అవుతోంది. -
సింగమ్‌తో ఐటమ్!
‘గోదావరి’లో సుమంత్ మరదలుగా నటించిన నీతూ చంద్ర గుర్తుందా? చీరకట్టు, బొట్టుతో అచ్చ తెలుగు అమ్మాయిలా మెప్పించారు. ‘గోదావరి’ తర్వాత రాజశేఖర్ ‘సత్యమేవ జయతే’లో హీరోయిన్గా, ‘మనం’లో గెస్ట్ రోల్ చేశారు. ఇప్పుడీ బ్యూటీ ఐటమ్ సాంగ్ ద్వారా రీ-ఎంట్రీ ఇస్తున్నారు. సూర్య హీరోగా హరి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సింగం-3’లో నీతు ఐటమ్ సాంగ్ చేశారు. ‘ఓ సోనే సోనే..’ సాంగ్‌లో సూర్యతో కలసి స్టెప్పులేశారు. తమిళంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో మల్కాపురం శివకుమార్ విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 5న పాటల్ని, 16న తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అనుష్క, శ్రుతీహాసన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి హ్యారీస్ జయరాజ్ స్వరకర్త. -
ఒకేసారి రెండు ప్రతిష్టాత్మక చిత్రాల్లో..!
సీనియర్ హీరోయిన్ శ్రియ క్రేజీ ఆఫర్ సొంతం చేసుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ బ్యూటి కొంత కాలంగా ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతుంది. అయితే ఇక కెరీర్ ముగిసినట్టే అనుకున్న ప్రతీసారి ఏదో ఒక సినిమాతో తిరిగి సత్తా చాటుతున్న శ్రియ, ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రెండు భారీ చిత్రాల్లో నటిస్తోంది. ఇప్పటికే బాలకృష్ణ వందో సినిమాగా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణిలో హీరోయిన్గా నటిస్తోంది ఈ బ్యూటి. తాజాగా మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమాగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఖైదీ నంబర్ 150లో కూడా ఈ బ్యూటి ఛాన్స్ కొట్టేసిందట. ఈ సినిమాలో శ్రియ ఓ స్పెషల్ సాంగ్‌లో అలరించనుంది. గతంలో చిరు హీరోగా తెరకెక్కిన ఠాగూర్ సినిమాలో మెగాస్టార్‌కు జోడిగా నటించిన శ్రియ మరోసారి చిరుతో కలిసి చిందేసేందుకు రెడీ అవుతోంది. -
ఫ్రెండ్ సినిమాలో హీరో స్పెషల్ సాంగ్
స్టార్ హీరోయిన్లు కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడం ఈ మధ్య కాలంలో అడపాదడపా చూస్తూనే ఉన్నాం. అయితే స్టార్ హీరోలు అలాంటి ప్రత్యేక గీతాల్లో కనిపించడం విశేషం. బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ స్పెషల్ సాంగ్‌లో చిందేయనున్నాడట. స్నేహితుడు అజయ్ దేవగన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 'శివాయ్' లో సల్లూభాయ్ ప్రత్యేక పాటలో కనిపించనున్నారని టాక్. అజయ్, సల్మాన్ ల మధ్య ఎప్పటి నుంచో మంచి దోస్తీ ఉంది. పలు సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. ఇదివరకే అజయ్ సినిమా 'సన్ ఆఫ్ సర్దార్'లో ఓ స్పెషల్ సాంగ్‌కు అజయ్‌తో కలిసి కాలు కదిపాడు సల్మాన్. ఆ పాట పెద్ద హిట్ అవ్వడంతోపాటు ఫ్యాన్స్‌ను మెప్పించింది కూడా. అలానే ఇప్పుడు 'శివాయ్'లో సల్మాన్ స్పెషల్ డ్యాన్స్ నంబర్లో కనిపిస్తారనేది బీ టౌన్ న్యూస్. 'అఖిల్' ఫేమ్ సాయేషా సెహగల్ శివాయ్తో బాలీవుడ్లో అడుగుపెట్టబోతుంది. అక్టోబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రియో స్పెషల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్
-
జనతా గ్యారేజ్‌లో మిల్కీబ్యూటీ
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ జనతా గ్యారేజ్. ఎన్టీఆర్, కొరటాల ఇద్దరు మంచి విజయాలతో ఊపుమీద ఉండటంతో షూటింగ్ దశలోనే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగా ఇంట్రస్టింగ్ కాస్టింగ్‌తో ఆకట్టుకుంటున్నారు చిత్రయూనిట్. తెలుగుతో పాటు పరభాషా నటులను కూడా తీసుకొని సినిమా మార్కెట్‌ను భారీగా పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ భారీచిత్రం కోసం మరో గ్లామర్ ఎట్రాక్షన్‌ను యాడ్ చేస్తున్నారట. బాహుబలి, ఊపిరి సినిమాల సక్సెస్‌లతో సూపర్ ఫాంలో ఉన్న తమన్నా.. జూనియర్ ఎన్టీఆర్ కోసం ఓ ఐటమ్ సాంగ్‌లో నటించడానికి అంగీకరించింది. ఇప్పటికే అల్లుడు శీను, స్పీడున్నోడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన మిల్కీ బ్యూటీ, మరోసారి ఎన్టీఆర్‌తో కలిసి స్పెషల్ సాంగ్‌లో చిందేయనుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు ఉపయోగపడని తమన్నా గ్లామర్ ఎన్టీఆర్‌కు ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి. -
అందుకే... ఈ డ్యాన్స్!
‘హార్ట్ఎటాక్’,‘గరం’,‘క్షణం’ తదితర చిత్రాల ద్వారా పేరు తెచ్చుకున్న నటి అదాశర్మ ఆనందానికి ఇప్పుడు అవధులు లేవు. అందుకు కారణం ఉంది. హీరో శింబు నటిస్తున్న తమిళ రొమాంటిక్ కామెడీ ‘ఇదు నమ్మ ఆళు’ చిత్రంలో ఆమె ఒక ప్రత్యేక గీతంలో నటిస్తున్నారు. ఇటీవలే ఆ షూటింగ్లో పాల్గొన్న అదా శర్మ, శింబును ప్రశంసల్లో ముంచెత్తేస్తున్నారు. ‘‘శింబు ప్రతిభావంతుడైన డ్యాన్సర్. అతనితో డ్యాన్స్ చేయడం భలేగా ఉంటుంది. అతను అలా సెట్స్‌లోకి వస్తాడు. స్టెప్ ఏమిటని చూస్తాడు. అంతే! చటుక్కున డ్యాన్స్ మొదలుపెట్టేస్తాడు. కేవలం నిమిషాల్లో స్టెప్పులు నేర్చేసుకుంటాడు. అంత మంచి డ్యాన్సర్‌తో పనిచేస్తుండే సరికి నేను కూడా చాలా ఉత్సాహంగా, కష్టపడి డ్యాన్స్ చేశా’’ అని అదాశర్మ చెప్పుకొచ్చారు. సినిమాలో హీరో పరిచయగీతంగా వచ్చే ‘మామన్ వెయిటింగ్...’ అనే పాట ఇది. ‘‘డ్యాన్స్ నాకున్న ప్రధాన బలం. కానీ, ఇప్పటిదాకా నా ప్రతిభ చూపే అవకాశం రాలేదు. అందుకే, ఈ సినిమాలో ప్రత్యేక గీతమనగానే ఒప్పుకున్నా’’ అని ఈ భామ అన్నారు. అదా ఇప్పటికే రెండు హిందీ సినిమాలకూ, ఒక తమిళ-తెలుగు ప్రాజెక్ట్కూ సైన్ చేశారు. ఈ ఏప్రిల్ నుంచి ఆ హిందీసినిమాల్లో ఒకదాని షూటింగ్ మొదలవుతుందట! -
వెంకీ ఐటెం గాళ్ ఎవరో తెలుసా?
హైదరాబాద్: మారుతి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, హీరోగా తెరకెక్కుతున్న 'బాబు బంగారం' సినిమాలో ఓ ముద్దుగుమ్మ ఐటెమ్ సాంగ్ చేయనుందట. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లో సోనమ్ బాజ్వా , వెంకీ బాబుతో కలిసి స్టెప్స్ వేయనుంది. జిబ్రాన్ సంగీతంలో ఈ పాట చాలా సూపర్బ్ గా వచ్చిందని చిత్ర సన్నిహిత వర్గాలు ఏఎన్ఐకి తెలిపాయి. కాగా సుశాంత్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 'ఆటాడుకుందాం రా' చిత్రంలో సోనమ్ బజ్వా హీరోయిన్ గా నటించింది. ఇపుడు ఈ అమ్మడు వెంకీకి ఐటెమ్ గాళ్ గా సరికొత్త అవతారంలో మెరవనుంది. కాగా యూత్‌కి కనెక్ట్ అయితే చాలు అని భావిస్తున్న మారుతి అందుకు తగ్గట్టుగానే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో 'బాబు బంగారం' సినిమాను పక్కాగా రెడీ చేస్తున్నాడు. అటు చాలా రోజుల తరువాత ఫుల్‌లెంగ్త్ కామెడీ రోల్లో , కామెడీ పోలీస్ అధికారిగా నటిస్తున్న వెంకటేష్, ఈ సినిమా సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. మంచి ఫాంలో డైరెక్టర్ మారుతిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకటేష్ కి జోడీగా నయనతార నటిస్తున్న ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి, ఫిష్ వెంకట్ వంటి కమెడియన్స్ కూడా ఉన్నారు. ఈ సినిమాకి సూర్యదేవర నాగ వంశీ నిర్మాత. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న బాబు బంగారం జూన్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. -
సుప్రీమ్‌లో 'పటాస్' బ్యూటీ
కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా పటాస్. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్తో శృతి సోథి హీరోయిన్గా పరిచయం అయింది. పెద్దగా పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం లేకపోయినా, ఉన్నంతలో బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తరువాత పెద్దగా ఆఫర్స్ రాకపోవటంతో టాలీవుడ్‌కి దూరంగా ఉంది శృతి. త్వరలోనే మరోసారి ఈమె తెలుగు వెండితెర మీద సందడి చేయనుందట. హీరోయిన్గా ఒక్క సినిమా మాత్రమే చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఐటమ్ సాంగ్‌తో తెలుగు ఆడియన్స్‌ను పలకరించబోతోంది. పటాస్‌తో హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చిన అనీల్, తన రెండో సినిమా సుప్రీంలోనూ శృతి సోథిని కంటిన్యూ చేస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ చిన్న పాత్రతో పాటు స్పెషల్ సాంగ్‌లోనూ ఆడిపాడనుంది ఈ బ్యూటీ. మరి ఈ గెస్ట్ రోల్ అయినా శృతిసోథికి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. -
రబ్బరు బొమ్మ...బ్యాచిలర్ బాబులు!
మిల్క్ బ్యూటీ తమన్నా, కొత్త హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో చేసిన స్పెషల్ సాంగ్ ‘రబ్బరు బొమ్మ..’ గుర్తుందా? ‘అల్లుడు శీను’లోని ఆ పాట కుర్రకారుకి తెగ నచ్చేసింది. ఇప్పుడు మళ్లీ ‘స్పీడున్నోడు’ కోసం చిత్రకథానాయకుడు సాయి శ్రీనివాస్‌తో తమన్నా ఓ స్పెషల్ సాంగ్‌కి జతకట్టారు. అప్పుడేమో ‘రబ్బరు బొమ్మ...’ అంటూ ఆడి పాడిన ఈ జంట.. ఇప్పుడు ‘బ్యాచిలర్ బాబులు..’ అంటున్నారు. ఈ పాట ఓ హైలైట్‌గా నిలుస్తుందని చిత్రదర్శకుడు భీమనేని శ్రీనివాసరావు చెప్పారు. తమిళ సూపర్ హిట్ ‘సుందరపాండ్యన్’కి రీమేక్‌గా ఆయన దర్శకత్వంలో భీమనేని సునీత ఈ చిత్రం నిర్మించారు. వచ్చే నెల 5న విడుదల కానుంది. ‘సుడిగాడు’వంటి హిట్ తర్వాత ఆ విజయాన్ని కొనసాగించే చిత్రం తీయాలనుకునే పట్టుదలతో ఈ చిత్రం చేశానని భీమనేని అన్నారు. ఆల్రెడీ ఓ భాషలో హిట్ అయిన సినిమా కావడంవల్ల, పాటలు, పోస్టర్స్‌కి మంచి స్పందన రావడంవల్ల బిజినెస్ హాట్ కేక్‌లా అయ్యిందట. ఈ చిత్రానికి సంగీతం: డి.జె. వసంత్, సమర్పణ: వివేక్ కూచిబొట్ల. -
స్పోర్ట్స్ హీరోస్ స్పెషల్ సాంగ్
-
దిశాకి 'సరైనోడు' దొరికాడు
-
దిశాకి 'సరైనోడు' దొరికాడు
లోఫర్ సినిమాతో టాలీవుడ్లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ దిశాపటాని. తొలి సినిమాతో భారీ హిట్ సాధించలేకపోయినా తన గ్లామర్‌తో మంచి మార్కులే సాధించింది. దీంతో వరుస అవకాశాలతో బిజీ అయిపోతుందని భావించారు అంతా.. కానీ అనుకున్నట్టుగా అమ్మడికి అవకాశాలు తలుపు తట్టలేదు. లోఫర్ తరువాత ఇంతవరకు ఒక్క సినిమా కూడా కమిట్ అవ్వని దిశా.. తాజాగా ఓ స్టార్ హీరోతో ఐటమ్ సాంగ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్.., బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలోనటిస్తున్నాడు. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం దిశా పటానిని సంప్రదించారట. గతంలో ఈ పాటను అంజలి, అనుష్క లాంటి స్టార్ హీరోయిన్లతో చేయించాలని ప్లాన్ చేసినా, గ్లామర్ పాళ్లు మరింతగా ఉండాలనే ఉద్దేశంతో దిశాకే ఓటేశారు చిత్రయూనిట్. స్పెషల్ సాంగ్‌లో నటించడానికి దిశా కూడా ఓకె చెప్పేయటంతో త్వరలోనే ఈ పాట షూట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు సరైనోడు యూనిట్. -
బన్నీతో స్వీటీ
అనుష్క లీడ్ రోల్లో నటించిన రుద్రమదేవి సినిమా సక్సెస్‌లో అల్లు అర్జున్ నటించిన గోన గన్నారెడ్డి పాత్ర కీ రోల్ ప్లే చేసింది. సినిమా ప్రమోషన్‌తో పాటు మాస్ ఆడియన్స్‌కు సినిమాను చేరువ చేయటంలో బన్నీదే కీలక పాత్ర. అందుకే అల్లు అర్జున్ చేసిన సాయానికి బదులుగా అనుష్క కూడా బన్నీ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది. అల్లు అర్జున్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు (వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తున్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన చిత్రయూనిట్ అనుష్కతో ఆ సాంగ్ చేయించాలని భావిస్తున్నారట. ఇప్పటికే వేదం, రుద్రమదేవి సినిమాల్లో కలిసి నటించిన బన్నీ, అనుష్క ఒక్క సాంగ్ లో కూడా కలిసి ఆడిపాడలేదు. యోగా బ్యూటీ బన్నీతో కలిసి డ్యాన్స్ చేస్తే సినిమాకు కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. గీతా ఆర్ట్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ట్రెసాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీకాంత్, ఆది ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను 2016 సమ్మర్‌కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు -
బ్రూస్లీ పాటకు నన్నెవరూ అడగలేదు: తమన్నా
బ్రూస్లీ సినిమాలో చిరంజీవి సరసన ప్రత్యేక పాట కోసం తనను ఎవరూ సంప్రదించలేదని మిల్కీ బ్యూటీ తమన్నా చెప్పింది. ఈ విషయంలో ఇప్పటివరకు వచ్చినవన్నీ తప్పుడు వార్తలేనని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. బాహుబలి హిట్‌తో మంచి జోరుగా ఉన్న తమన్నాను.. ఈ సినిమాలో ప్రత్యేక గీతం కోసం ఎంపిక చేశారని కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. రామ్‌చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ యాక్షన్ డ్రామా బ్రూస్లీ. దాదాపు ఏడాది తరువాత రిలీజ్ అవుతున్న చరణ్ సినిమా కావటంతో అన్ని రకాల హంగులతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. బ్రూస్లీలో ఓ యాక్షన్ సీన్‌తో పాటు స్పెషల్ సాంగ్‌లో కూడా నటిస్తున్నాడు చిరు. చాలా కాలం తరువాత చిరు వెండితెర మీద కనిపిస్తుండటంతో ఈ సాంగ్‌ను భారీ స్థాయిలో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే థమన్ అదిరిపోయే ట్యూన్ అందించాడన్న టాక్ వినిపిస్తుండగా, చిరుతో చిందేసే అందాలభామ కోసం చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దసరా నాటికి ఈ సినిమాను విడుదల చేయాలని తలపెడుతున్నా.. చిరంజీవి పాట విషయం ఎంతకీ తేలకపోవడం కొంత ఇబ్బందిగానే ఉన్నట్లు తెలుస్తోంది. Not been approached for any song in the film #BruceLee , false news guys!!!! — Tamannaah Bhatia (@tamannaahspeaks) September 18, 2015