Samantha Got Another Special Song Offer In Ranbir Kapoor Animal Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Samantha Song In Animal Movie: సమంతకు మరో స్పెషల్‌ సాంగ్‌ ఆఫర్‌? ఈసారి తెలుగులో కాదు!

Published Wed, Jun 29 2022 12:41 PM | Last Updated on Wed, Jun 29 2022 12:59 PM

Samantha Got Another Special Song Offer in Ranbir Kapoor Animal Movie - Sakshi

మంచి కమర్షియల్‌ సినిమా అంటే అందులో తప్పకుండ ఓ ఐటెం సాంగ్‌ ఉండాల్సిందే. ఈ మధ్య కాలంలో స్పెషల్‌ సాంగ్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో తమ సినిమాల్లో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉండేలా హీరోలు, దర్శక-నిర్మాతలు చూసుకుంటున్నారు. అంతేకాదు ఈ పాటలో స్టార్‌ హీరోయిన్స్‌తో స్టెప్పుడు వేయించి మరింత హైప్‌ను క్రియేట్‌ చేస్తున్నారు దర్శకులు. 

చదవండి: మీనా భర్త మృతికి పావురాలే కారణమా?

ఈ క్రమంలో కాజల్‌, తమన్నా, సమంత వంటి స్టార్‌ హీరోయిన్స్‌ స్పెషల్‌ సాంగ్‌లో నటించి మరింత క్రేజ్‌ సంపాదించుకున్నారు. ఇటీవల సమంత చేసిన పుష్ప ఐటెం సాంగ్‌ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు ఈవెంట్స్‌లో, పెళ్లిళ్లలో, షోలో ఈ పాట ఇప్పటికి మారుమోగుతుంది. ఇదిలా ఉంటే సమంత మరోసారి స్పెషల్‌ సాంగ్‌తో అలరించనుందని తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప చిత్రంలో ఊ అంటావా మామ.. ఊఊ అంటావా సాంగ్‌తో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది సామ్‌.

చదవండి: సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్‌!, కారణం ఇదేనా?

ఈ క్రమంలో ఆమెకు మరో స్పెషల్‌ సాంగ్‌ ఆఫర్‌ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈసారి టాలీవుడ్‌ నుంచి కాకుండ బాలీవుడ్‌ నుంచి పిలుపు వచ్చిందట. హిందీ చిత్రం ‘ఎనిమల్‌’లోని ఐటెం సాంగ్‌లో నటించేందుకు చిత్ర బృందం సామ్‌ను సంప్రదించిందట. అయితే దీనికి ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందా? నో చెబుతుందా? అనేది తెలియాల్సి ఉంది. కాగా సందీప్‌ వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎనిమల్‌ మూవీలో రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నాలు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ మనాలిలో తొలి షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement