
Devi Sri Prasad Strong Counter To Trolls Over Pushpa Movie Special Song: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్‌పై వస్తున్న వివాదాలపై రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్పందించాడు. ఇటీవల జరిగిన ‘పుష్ప’ ఈవెంట్‌లో దేవిశ్రీ మాట్లాడుతూ.. ఐటెం సాంగ్స్ అన్ని తనకు డివోషనల్ సాంగ్సే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘నాకు అన్నీ ఒకటే. నేను కేవలం మ్యూజిక్ గురించి మాత్రమే ఆలోచిస్తాను. ఐటెం సాంగ్ మీకు మాత్రమే నాకు కాదు. ఐటెం సాంగ్స్ అన్ని నాకు డివోషనల్ సాంగ్సే’ అని అన్నాడు.
చదవండి: సమంత స్పెషల్ సాంగ్‌ను చుట్టుముడుతున్న వివాదాలు, తమిళంలోనూ వ్యతిరేకత
ఉదాహరణకు పాడి చూపిస్తాను అంటూ తాను కంపోజ్ చేసిన రెండు ఐటెం సాంగ్స్‌కు డివోషనల్ లిరిక్స్‌తో ట్యూన్ కట్టి పాడి వినిపించాడు కూడా. ఆర్య 2లోని ‘రింగ రింగ..’ సాంగ్‌కు ‘నాకు ఉన్న కోరికలన్నీ.. నువ్వే తీర్చాలి స్వామి.. స్వామీ.. స్వామీ..’ అంటూ అదే ట్యాన్‌తో జతకలిపాడు. ఇక ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా..’ సాంగ్‌కు కూడా ‘స్వామీ.. నేను కొండ ఎక్కాను, పూలు పళ్ళు అర్పించాను.. ప్రసాదం తినేసి.. నా కష్టాలు తీర్చు స్వామి.. ఊ అంటావా స్వామి.. ఊ ఊ అంటావా స్వామి..’ అని పాడి వినిపించాడు.
చదవండి: ‘పుష్ప’ థియేటర్ ఎదుట ఫ్యాన్స్ ఆందోళన, రాళ్లతో దాడి
అలాగే ఇటీవల విడుదలైన పుష్ప స్పెషల్ సాంగ్‌ను ప్రముఖ డివోషనల్ సింగర్ శోభారాజ్ గారు ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ అంటూ డివోషనల్‌కి మార్చి పాడుకున్నారంటూ డీఎస్పి వివరణ ఇచ్చాడు. దీనిపై దేవిశ్రీ కామెంట్ చేసిన అనంతరం సింగర్ శోభరాజ్ ఈ పాటను ‘ఊ అంటావా మాధవ.. ఊ ఊ అంటావా మాధవ..’ అని కృష్ణుడి కోసం పాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీని గురించే దేవిశ్రీ మాట్లాడుతూ పాటని మనం ఎలా తీసుకుంటే అలాగే ఉంటుందంటూ విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment