Samantha Reaction On Allu Arjun Comments In Pushpa Thank You Meet, Tweet Viral - Sakshi
Sakshi News home page

Samantha: ఇకపై నిన్ను ఎప్పటికీ నమ్ముతాను.. స్టార్‌ హీరోపై సమంత కామెంట్‌

Published Wed, Dec 29 2021 9:37 AM | Last Updated on Wed, Dec 29 2021 10:14 AM

Samantha Responds On Allu Arjun Speech At Pushpa Movie Thank You Meet - Sakshi

నాగ చైతన్యతో విడాకుల తర్వాత కెరీర్‌ పరంగా జెడ్‌ స్పీడ్‌లో దూసుకెళ్తుంది సమంత. టాలీవుడ్‌, బాలీవుడ్‌,హాలీవుడ్‌ అనే తేడా లేకుండా వరుస సినిమాలను ప్రకటిస్తూ.. బిజియెస్ట్‌ హీరోయిన్‌గా మారిపోయింది.  ఇప్పటికే ఆమె గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన శాకుంతలం మూవీ షూటింగ్‌ని కంప్లిట్‌ చేసుకుంది. ప్రస్తుతం  తమిళంలో విజయ్‌ సేతుపతితో  ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ సినిమా నటిస్తోంది.

దీంతో పాటు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. అలాగే ఓ హాలీవుడ్‌ చిత్రానికి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా అల్లు అర్జున్‌ తొలి పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’లో ‘ఊ అంటావా’అనే స్పెషల్‌ సాంగ్‌ చేసి ఔరా అనిపించింది.  ఈ పాట ఇప్పడు యూట్యూబ్‌లో టాప్‌  100 మ్యూజిక్ వీడియోలలో మొదటి స్థానంలో ఉండడం విశేషం.


(చదవండి: ఆ సినిమా లేకపోతే నేను లేను: అల్లు అర్జున్‌)

తాజాగా జరిగిన ‘పుష్ప’థ్యాంక్స్‌ మీట్‌లో అల్లు అర్జున్‌ సమంత గురించి మాట్లాడుతూ...  ‘స్పెషల్ సాంగ్ చేసిన సమంతకు థ్యాంక్స్. మీరు ఈ పాటను ఎంత నమ్మారో గానీ.. మేం మిమ్మల్ని ఇంత నమ్ముతున్నామని, మీరు మమ్మల్ని నమ్మారు.. మా మీద నమ్మకంతో చేశారు కదా? ఆ నమ్మకానికి థ్యాంక్స్.సెట్‌లో నీకు ఎన్ని అనుమానాలు వచ్చాయో ఉన్నాయో నాకు తెలుసు.. తప్పా? ఒప్పా? అని ఆలోచించావ్.. నన్ను నమ్ము అని నేను ఒక్క మాట చెప్పడంతో ఇంకో ప్రశ్న కూడా వేయలేదు. చేసేశావ్. అది నా గుండెను తాకింది. ఏది అడిగినా కూడా ఆలోచించకుండా చేశావ్.. నీ మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది. ప్రపంచంలోనే నెంబర్ వన్ సాంగ్‌గా యూట్యూబ్‌లో నిలబడటం అంటే మామూలు విషయం కాదు’అని బన్నీ సమంతపై ప్రశంసల వర్షం కురిపించాడు. తనను అభినందిస్తూ.. బన్నీ చేసిన వ్యాఖ్యలకు సమంత రిప్లై ఇచ్చింది. బన్నీ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని షేర్‌ చేస్తూ.. ‘ఇకపై నేను మిమ్మల్నిఎప్పడూ నమ్ముతాను’అని ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement