Samantha Thanks Allu Arjun for Success of Her Item Song in Pushpa Movie - Sakshi
Sakshi News home page

Samantha-Allu Arjun: ‘స్పెషల్‌ సాంగ్‌తో పేరొస్తుందని చెప్పి బన్నీ ఒప్పించాడు’

Published Wed, Jan 12 2022 4:40 PM | Last Updated on Wed, Jan 12 2022 7:34 PM

Samantha Said Allu Arjun Is The Reason For Done Pushpa Special Song - Sakshi

అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఈ సినిమా విడుదలై మూడు వారాలైనా ఇప్పటికీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లు రాబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ. 300కోట్లకు పైగా ట్రేడ్‌ మార్క్‌ను దాటేసి సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తుంది. అయతే విడుదలకు ముందే పుష్ప రికార్డులు సృష్టించింది. ఈ మూవీలోని ప్రతి పాట ట్రెండింగ్‌లో నిలిచింది. రారా.. సామీ అయితే ఏకంగా ఎల్లలు దాటింది. విదేశీయులు సైతం ఈ పాటకు డ్యాన్స్‌ చేసిన వీడియోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి.

చదవండి: గుడ్‌న్యూస్‌ చెప్పిన త్రిష, కానీ సంతోషంగా లేనంటూ ట్వీట్‌..

ఇదిలా ఉంటే ఇక పుష్పలో సమంత చేసిన స్పెషల్‌ సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్‌ అంతాఇంతా కాదు. ఈ పాట ఎంత హిట్‌ అయ్యిందో అదే స్థాయిలో వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ఈ పాటలో లిరిక్స్‌ పురుషులను కించపరిచేలా ఉన్నాయంటూ పురుష సంఘాలు అభ్యంతరకం వ్యక్తం చేశాయి. ఓ వైపు వివాదాల్లో చిక్కుకుంటూనే.. మరోవైపు యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్‌ రాబట్టింది ఈ సాంగ్‌. అయితే స్టార్‌ హీరోయిన్‌ అయిన సమంత ఈ పాటలో నర్తించడం అందరిని ఆశ్చర్యపరిచింది. తనకు ఇందంతా అవసరమా, స్పెషల్ సాంగ్స్‌ చేయడం ఏంటంటూ ఆమెపై పలువురు విమర్శలు గుప్పించారు.

చదవండి: సల్మాన్‌ ఖాన్‌తో సీక్రెట్‌ డేటింగ్‌, క్లారిటీ ఇచ్చిన నటి సమంత..

ఈ నేపథ్యంలో పుష్పలో  ఈ సాంగ్‌ చేయడానికి సమంత మొదట అభ్యంతరం చెప్పిందని, ఈ పాటకు కోసం తనని ఒప్పించామని పుష్ప డైరెక్టర్‌ సుకుమార్‌, హీరో అల్లు అర్జున్‌ మూవీ ఈవెంట్స్‌లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై సమంత స్పందించింది. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ స్పెషల్‌ సాంగ్‌ చేయడానికి ముఖ్యకారణం అల్లు అర్జున్‌ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘స్పెషల్‌ సాంగ్ చేయడానికి ముందు భయపడ్డాను. చేయాలా? వద్దా? అన్న సందిగ్ధంలో ఉండిపోయాను. ఆ సమయంలో బన్నీ నాకు స్ఫూర్తినిచ్చాడు. ఆ పాటలో నటిస్తే ఎంత పేరొస్తుందో కూర్చోబెట్టి మరి వివరించాడు. దీంతో బన్నీ మాటలు విన్నాక ఎలాంటి సందిగ్ధం లేకుండా ఒకే చెప్పేశా’ అంటూ చెప్పుకొచ్చింది. అంతేగాక బన్నీ ప్రోత్సాహకం లేకుంటే ఈ పాటలో అసలు నటించేదాన్ని కాదని చెప్పింది సామ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement