Pushpa Movie Oo Antava Oo Oo Antava Song Singer Indravati Chauhan Won Behindwoods Gold Model - Sakshi
Sakshi News home page

Indravathi Chauhan Gold Medal: సమంత ‘ఊ అంటావా..’ పాట సింగర్‌కు గోల్డ్‌ మెడల్‌!

Published Mon, May 16 2022 4:27 PM | Last Updated on Mon, May 16 2022 5:47 PM

Pushpa Movie: Samantha Special Song Singer Indravati Won Behindwoods Gold Model - Sakshi

సమంత స్సెషల్‌ సాంగ్‌ ‘ఊ అంటావా.. మావ ఊఊ అంటావా సింగర్‌కు ఇంద్రావతి చౌహాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ పాటకు గాను ఆమె బిహైండ్‌వుండ్‌ వారి గోల్డ్‌ మెడల్‌ను అందుకోనుంది. ప్రముఖ డిజిటల్‌ మీడియా గ్రూప్‌ బిహైండ్‌వుడ్‌ సంస్థ ఈ ఏడాది19 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సంస్థ యానివర్సరి సెలెబ్రెషన్స్‌లో భాగంగా మే 22న ఈ ఏడాది అత్యధిక ప్రజాదరణ  పొందిన సినిమాలు, ఉత్తమ నటులు, సింగర్స్‌కు గోల్డ్‌ మెడల్స్‌ను ప్రదానం చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బిహైండ్‌వుడ్‌ గోల్డ్‌ మెడల్‌ ప్రదానోత్సవానికి ఆమెను ఎంపిక చేశారు.

చదవండి: హీరోయిన్‌ ప్రణీత సీమంతం ఫంక్షన్‌, ఫొటోలు వైరల్‌

ఈ సందర్భంగా ఇంద్రావతి ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది. ‘నిజంగా నేను ఆశీర్వాదించబడ్డాను. మే 22 ఊ అంటావా.. ఊఊ అంటావా పాటకు గోల్డ్‌ మెడల్‌ తీసుకోబోతున్నాను. బెస్ట్‌ థింగ్స్‌ ఎప్పుడు ఊహించకుండానే వస్తాయి. నాకు ఈ గుర్తింపు రావడానికి కారణంగా దేవిశ్రీ ప్రసాద్‌ గారు. ఆయనకు నేను ఎప్పటికి కృతజ్ఞురాలిని. థ్యాంక్యూ సార్‌. ఇది నిజంగా గర్వించే విషయం’ అంటూ రాసుకొచ్చింది. కాగా ఇంద్రావతి ప్రముఖ సింగర్‌ మంగ్లీ సోదరి అనే విషయం తెలిసిందే. కాగా సుకుమార్‌- అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

చదవండి: భర్త విక్కీ కౌశల్‌కు కత్రీనా స్వీటెస్ట్‌ బర్త్‌డే విషెస్‌

పాన్‌ ఇండియా సినిమాగా రూపొందిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఇక విడుదలకు ముందే పుష్ప.. పాటలతో రికార్డులు సృష్టించింది. ఇందులో సమంత నటించిన స్పెషల్‌ సాంగ్‌ యూట్యూబ్‌ను షేక్‌ చేసింది. ఈ పాటను ఎన్నో వివాదాలు చూట్టుముట్టిన అదే స్థాయిలో రికార్డు క్రియేట్‌ చేసింది. సోషల్‌ మీడియా ఎక్కడ విన్న ఊ అంటావా? పాటే వినిపిస్తోంది. ఈ మూవీ విడుదలై సూమారు 5 నెలల గడుస్తున్నా ఇప్పటికీ ఈ పాట మేనియా ఏమాత్రం తగ్గలేదు. అంతేకాదు ఇటీవల ఓ ఇంటర్నేషనల్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో ఈ పాటను ప్రదర్శించడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement