Indravati
-
బృందావనంలో గోపికలుగా ఎంత ముద్దుగున్నారో.. గుర్తు పట్టారా? (ఫోటోలు)
-
తండ్రి తిట్టాడని 90 అడుగుల ఎత్తు నుంచి..
Waterfall Jump Video: చిన్న చిన్న కారణాలతో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటోంది ఇప్పటి తరం. తాజాగా.. తండ్రి మందలించాడని ఓ యువతి అఘాయిత్యానికి పాల్పడబోయింది. ఏకంగా 90 అడుగుల ఎత్తు నుంచి దూకేసింది. కానీ, ఆశ్చర్యకరరీతిలో.. ఆ జలపాతమే ఆమెను రక్షించింది!.. ఛత్తీస్‌గఢ్ బస్తర్ జిల్లా జగదల్పూర్ నుంచి 38 కిలోమీటర్ల దూరంలో చిత్రకూట్ చౌకీ వద్ద మంగళవారం సాయంత్రం ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. జలపాతం చివరి దాకా వెళ్లి.. నిల్చుంది. ఆ సమయంలో కొందరు ఆమెను గమనించి.. వద్దని వారించారు. కానీ, ఆమె వినకుండా దూకేసింది. కానీ, అంత పై నుంచి పడ్డా కూడా అదృష్టం కొద్దీ ఆమెకు ఏం కాలేదు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రాళ్లపై పడకుండా.. నేరుగా నీళ్లలోకి వచ్చి చేరింది. ఆమె బతికే ఉందని గుర్తించిన స్థానికులు పడవల్లో వెళ్లి రక్షించి.. ఒడ్డుకు తెచ్చారు. Watch this Earlier in the day, a woman attempted to commit suicide by jumping into Chitrakoot waterfall of Bastar district, #Chhattisgarh. Fortunately, the woman managed to swim back to shore.#mentalhealth pic.twitter.com/qtBGMaFhnu — Arvind Chauhan (@Arv_Ind_Chauhan) July 18, 2023 ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించి పేరెంట్స్‌కు అప్పజెప్పారు. సెల్‌ఫోన్ అతిగా వాడుతున్నందుకు తండ్రి మందలించడంతోనే ఆమె ఆత్మహత్యకు యత్నించిందని తెలుస్తోంది. జలపాతం వద్ద కొందరు యువకులు తమ సెల్ఫోన్లలో ఆమె దూకేటప్పుడు దృశ్యాలను బంధించగా.. అవి వైరల్ అవుతున్నాయి. ఇంద్రావతి నదిపై చిత్రాకోట్ జలపాతం ఉంది. దాదాపు 90 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు దూకుతుంటుంది. ఈ వాటర్ఫాల్కు స్థానికంగా మినీ నయాగారా ఫాల్స్‌గా పేరుంది. వానాకాలంలో 300 మీటర్ల విస్తీర్ణంతో ప్రవహిస్తుంటుంది. అయితే చుట్టూ రక్షణా వలయంలాంటివి లేకపోవడంతో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న 'ఊ అంటావా' సింగర్ ఇంద్రావతి
తమిళసినిమా: దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన పాట ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ. పుష్ప చిత్రంలో సమంత డాన్స్ చేసిన ఈ పాటను గాయని ఇంద్రావతి చౌహాన్ పాడారు. ఈ ఒక్క పాటతోనే ఆమె బహుళ ప్రాచుర్యం పొందారు. ఇంద్రావతి ఎవరో కాదు గాయని మంగ్లీ సోదరి. వీరిది అనంతపురం జిల్లాకు చెందిన బంజారా జాతికి చెందిన కుటుంబం కావడం గమనార్హం. చాలా మధ్యతరగతి కుటుంబానికి చెందిన మంగ్లీ జానపద గీతాలతో ఎదిగి సినీగాయనిగా పాపులర్ అయ్యారు. తాజాగా పుష్ప చిత్రంతో ఆమె సోదరి ఇంద్రావతి చౌహాన్ గాయనిగా తెరంగేట్రం చేశారు. ఈమె ఇప్పుడు పరిచయం కావడం విశేషం. తమిళంలో ఎంజాయ్ అనే చిత్రంలో చెంగు చక్కర కన్ను అనే పాటను ఇంద్రావతి చౌహాన్ పాడారు. పెరువళ్ కాశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎల్‌ఎన్‌హెచ్ క్రియేషన్స్ పతాకంపై కె.లక్ష్మీనారాయణన్ నిర్మిస్తున్న చిత్రం ఇది. గీత రచయిత వివేకా రాసిన ఈ పాటకు కేఎం.రయన్ సంగీతాన్ని అందించారు. ఈ పాట ఇటీవల విడుదల చేయగా సంగీత ప్రియుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని చిత్ర వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎంజాయ్ చిత్రంతో తమిళ చిత్ర సినిమాలోకి చెంగు చక్కర కన్ను పాటతో పరిచయం కావడం సంతోషంగా ఉందని, ఇక్కడ మరిన్ని అవకాశాలు వస్తున్నాయని గాయని ఇంద్రావతి చౌహాన్ పేర్కొన్నారు. కాగా ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. -
ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఇంద్రావతి.. పాపులర్ ఎలా అయింది
కన్నీటి సముద్రంలో మునిగిపోతే... కష్టాలు మాత్రమే కనిపిస్తాయి. పనే దైవం అనుకుంటే... ఆ దైవమే దారి చూపుతుంది. ఇది ఇంద్రావతి నిజజీవిత కథ... ఇంద్రావతికి బైక్‌లు అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నయ్య మనోజ్ తనకు బైక్‌రైడింగ్ నేర్పించాడు. ఇంద్రావతి బైక్‌పై రాజసంగా వెళుతుంటే చూసి మురిసిపోయేవాడు. అలాంటి అన్నయ్య ఒక దురదృష్టకరమైన రోజు యాక్సిడెంట్లో చనిపోయాడు. అంతే...ఆ కుటుంబంపై పిడుగు పడింది. మధ్యప్రదేశ్‌లోని మండ్ల జిల్లాకు చెందిన ఇంద్రావతి తల్లిదండ్రులు చిన్నాచితక పనులు చేస్తారు. మనోజ్ చేసే ఉద్యోగం ద్వారా వచ్చే జీతమే వారికి ప్రధాన ఆధారం. ఇంటికి నిట్టాడిలాంటి కొడుకు చనిపోవడంతో ఇంద్రావతి భవిష్యత్ గురించి ఆలోచిస్తూ కుమిలేపోయేవారు తల్లిదండ్రులు. అయితే ఇంద్రావతి ప్రస్తుతం వారికి భవిష్యత్‌గా మారింది. అన్నయ్య జ్ఞాపకాలు అనంతమైన దుఃఖాన్ని మోసుకొస్తూ తనను అల్లకల్లోలం చేస్తున్న సమయంలో...ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది ఇంద్రావతి. ఆ సమయంలో తల్లిదండ్రులు గుర్తుకు వచ్చి ఆ ఆలోచన మానుకుంది. ‘ఏడుస్తూ కూర్చుంటే దుఃఖం మరింత ఎక్కువ అవుతుంది. ఏదైనా పనిలో పడితే మంచిది’ అని పెద్దలు సలహా ఇచ్చారు. ‘ఏంచేయాలి? అని ఆలోచిస్తున్న సమయంలో ఒక స్వచ్ఛంద సంస్థ గురించి విన్నది. ప్రొఫెషనల్ అసిస్టెన్స్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ (ప్రధాన్) సంస్థ సహాయంతో బైక్ రిపేరింగ్ నేర్చుకుంది. ఆతరువాత...మెకానిక్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. జబల్పూర్లోని టూ–వీలర్ సర్వీస్ సెంటర్లో ఇంద్రావతికి ఉద్యోగం వచ్చింది. ఒకవైపు బైక్‌లు రిపేర్ చేస్తూనే, మరోవైపు చదువు కొనసాగించింది. ‘ఆడపిల్లలకు బైక్ రిపేర్ చేయడం ఏం వస్తుంది!’ అంటూ మొదట్లో ఆమె దగ్గరికి రావడానికి సంశయించేవారు. అయితే రోజులు గడిచేకొద్దీ∙ఇంద్రావతి ప్రతిభ గురించి అందరికీ తెలిసిపోయింది. ఆలస్యం చేయకుండా, బైక్‌లను వేగంగా రిపేర్ చేయడంలో మరింత ప్రావీణ్యం సంపాదించింది. సైన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన ఇంద్రావతి నారాయణ్‌గంజ్‌లో ఒక వర్క్‌షాప్ మొదలు పెట్టి, పేదింటి అమ్మాయిలకు బైక్ రిపేరింగ్ నేర్పించి వారికి ఉపాధి మార్గాలు చూపించాలనుకుంటుంది. ‘బైక్ రిపేరింగ్ అనేది నాకు ఆత్మసై్థర్యాన్ని ఇవ్వడమే కాదు, కుటుంబానికి ఆదాయాన్నీ ఇచ్చింది. ఏ దారిలో వెళ్లాలో తెలియక ఒకప్పుడు నేను అయోమయానికి గురయ్యాను. నాలాంటి వారు ఎంతోమంది ఉండొచ్చు. వారికి ధైర్యం చెప్పి, పని నేర్పితే సొంతకాళ్ల మీద నిలబడతారు’ అంటుంది ఇంద్రావతి. ‘నెల నెలా ఠంచనుగా వచ్చే జీతాన్ని వదులుకొని రిస్క్ తీసుకోవడం ఎందుకు?’ అంటున్న వాళ్లు చాలామందే ఉన్నారు. అయితే ఇంద్రావతికి వారి మాటలు వినిపించడం లేదు. లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది! -
సమంత ‘ఊ అంటావా..’ పాట సింగర్‌కు గోల్డ్ మెడల్!
సమంత స్సెషల్ సాంగ్ ‘ఊ అంటావా.. మావ ఊఊ అంటావా సింగర్‌కు ఇంద్రావతి చౌహాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ పాటకు గాను ఆమె బిహైండ్‌వుండ్ వారి గోల్డ్ మెడల్‌ను అందుకోనుంది. ప్రముఖ డిజిటల్ మీడియా గ్రూప్ బిహైండ్‌వుడ్ సంస్థ ఈ ఏడాది19 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సంస్థ యానివర్సరి సెలెబ్రెషన్స్‌లో భాగంగా మే 22న ఈ ఏడాది అత్యధిక ప్రజాదరణ పొందిన సినిమాలు, ఉత్తమ నటులు, సింగర్స్‌కు గోల్డ్ మెడల్స్‌ను ప్రదానం చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బిహైండ్‌వుడ్ గోల్డ్ మెడల్ ప్రదానోత్సవానికి ఆమెను ఎంపిక చేశారు. చదవండి: హీరోయిన్ ప్రణీత సీమంతం ఫంక్షన్, ఫొటోలు వైరల్ ఈ సందర్భంగా ఇంద్రావతి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది. ‘నిజంగా నేను ఆశీర్వాదించబడ్డాను. మే 22 ఊ అంటావా.. ఊఊ అంటావా పాటకు గోల్డ్ మెడల్ తీసుకోబోతున్నాను. బెస్ట్ థింగ్స్ ఎప్పుడు ఊహించకుండానే వస్తాయి. నాకు ఈ గుర్తింపు రావడానికి కారణంగా దేవిశ్రీ ప్రసాద్ గారు. ఆయనకు నేను ఎప్పటికి కృతజ్ఞురాలిని. థ్యాంక్యూ సార్. ఇది నిజంగా గర్వించే విషయం’ అంటూ రాసుకొచ్చింది. కాగా ఇంద్రావతి ప్రముఖ సింగర్ మంగ్లీ సోదరి అనే విషయం తెలిసిందే. కాగా సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చదవండి: భర్త విక్కీ కౌశల్‌కు కత్రీనా స్వీటెస్ట్ బర్త్‌డే విషెస్ పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇక విడుదలకు ముందే పుష్ప.. పాటలతో రికార్డులు సృష్టించింది. ఇందులో సమంత నటించిన స్పెషల్ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఈ పాటను ఎన్నో వివాదాలు చూట్టుముట్టిన అదే స్థాయిలో రికార్డు క్రియేట్ చేసింది. సోషల్ మీడియా ఎక్కడ విన్న ఊ అంటావా? పాటే వినిపిస్తోంది. ఈ మూవీ విడుదలై సూమారు 5 నెలల గడుస్తున్నా ఇప్పటికీ ఈ పాట మేనియా ఏమాత్రం తగ్గలేదు. అంతేకాదు ఇటీవల ఓ ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్లో ఈ పాటను ప్రదర్శించడం విశేషం. I'm really so blessed that I'm going to receiving the gold medal on may 22 for oo antava mava song #pushpa movie😍. Best things happen unexpectedly!!! I'm really very much excited and can't express my happiness💃.I will always owe to the @ThisIsDSP sir🙏🏻🙏🏻😍..this is proud moment pic.twitter.com/zVDNuiBFIn — Indravathi Chauhan (@IndravathiChauh) May 15, 2022 -
అదరగొడుతున్న ఐటెం సాంగ్.. సింగర్ మంగ్లీ ఎమోషనల్ పోస్ట్..
Singer Mangli Emotional Post On Oo Antava Oo Oo Antava Song Succes: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న 'పుష్ప: ది రైజ్' సినిమా కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఈ మూవీ నుంచి విడుదలైన వీడియోలు, పాటలు సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రస్తుతం 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..' సాంగ్ హవా నడుస్తోంది. సమంత స్పెషల్ సాంగ్ చేయడం ఒక కారణం అయితే, మత్తైన గాత్రం, లిరిక్స్ పాటను నెట్టింట్లో ట్రెండ్ అయేలా చేశాయి. 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..' అంటూ తన మత్తు వాయిస్తే అందరినీ కట్టిపడేసింది ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహన్. పాటను మత్తుగా పాడటం ఒకెత్తు అయితే, లిరికల్ వీడియోలో ఇంద్రావతి చౌహన్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మరో ఎత్తు. ఈ సాంగ్‌తో ఇంద్రావతి క్రేజ్ఒక్కసారిగా హై అయింది. దీంతో ఈ ఇంద్రావతి ఎవరా అని తెలుసుకునే పనిలో పడ్డారు ప్రేక్షకులు. అయితే ఇంద్రావతి ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ చెల్లెలు. చెల్లెలు ఇంద్రావతి సక్సెస్‌పై ఫుల్ కుషీగా ఉంది మంగ్లీ. ఈ క్రమంలోనే తన సోషల్ మీడియా అకౌంట్లో తన చెల్లెలి విజయం గురించి మంగ్లీ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. 'నువ్ పాడిన 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..' సాంగ్ నాలుగు రోజుల్లోనే 3 కోట్ల వ్యూస్‌ను రాబట్టి ఇంత పెద్ద విజయం సాధించడం నాకు చాలా ఆనందంగా ఉంది. కంగ్రాట్స్ ఇంద్రావతి చౌహన్. నీ డెబ్యూతోనే ఇంతటి సక్సెస్ అందుకున్నావ్. ఇక ముందు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలి. దేవీ శ్రీ ప్రసాద్, సుకుమార్ సర్, అల్లు అర్జున్ సర్, చంద్రబోస్ అన్న ఇలా అందరికీ థ్యాంక్యూ.' అని మంగ్లీ తన సంతోషాన్ని తెలియజేసింది. అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన పుష్ప సినిమా ఈ నెల 17న ప్రేక్షకులను అలరించనుంది. View this post on Instagram A post shared by Mangli Singer (@iammangli) -
సమంత ఐటమ్ సాంగ్ పాడిన సింగర్.. మంగ్లీకి ఏమవుతుందో తెలుసా!
Did You Know Singer Who Sing Item Song From Pushpa Samantha: ఎక్కడ చూసినా ప్రస్తుతం పుష్ప సినిమా హవా నడుస్తోంది. రిలీజ్‌కు ముందే పాటలు, ట్రైలర్, డైలాగులు అభిమానులకు పూనకం తెప్పిస్తున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌తోపాటు బాలీవుడ్ సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన కలిసి నటించిన ఈ సినిమాను సుకుమార్ తెరకెకిస్తున్న విషయం తెలసిందే. డిసెంబర్ 17న మొదటి భాగం విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్లను వేగం చేసింది చిత్ర యూనిట్. మూడు పాటలు, ట్రైలర్‌ను విడుదల చేయడగా.. తాజాగా పుష్ప నుంచి ఐటమ్ సాంగ్‌ను ప్రజల్లోకి వదిలింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తొలిసారి ఆడిపాడిన ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ అనే ఐటమ్ సాంగ్ లిరికల్ సాంగ్‌ను శుక్రవారం రిలీజ్ చేసింది. మత్తు వాయిస్‌తో సాగే ఈ పాటలో సమంత తన మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. సామ్ కాస్ట్యూమ్, స్టైల్, లుకింగ్ అన్నీ పాటకు పర్ఫెక్ట్ సెట్ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరోసారి మార్మోగించడంతో సాంగ్ బ్లాక్బాస్టర్ హిట్ అవుతుందనడంలో సందేహం లేదు. చదవండి: మీ మగబుద్ధే వంకరబుద్ధి అంటున్న సమంత! కాగా చంద్రబోస్ రాసిన ఈ ఐటమ్ పాటను పాడింది ఇంద్రావతి చౌహాన్. తన గొంతుతో ఈ పాటను మరో మెట్టు ఎక్కించింది. దీంతో ఈ సింగర్ ఎవరని వెతకడం ప్రారంభించారు నెటిజన్లు. ఇంద్రావతి చౌహన్ ప్రముఖ ఫోక్ సింగర్, సినీ నేపథ్య గాయని మంగ్లీ చెల్లెలు. ఈమె కూడా జానపద పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. జార్జిరెడ్డి సినిమాలో జాజిమొగులాలి అనే పాట కూడా పాడారు. అంతేగాక కోటి న్యాయ నిర్ణేతగా ‘బోల్ బేబీ బోల్’ రియాలిటీ షోలో కూడా పాడారు. -
ఇంద్రావతి నదిలో ప్రమాదం
సాక్షి, కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని ఇంద్రావతి నదిలో రెండు నాటు పడవలు మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు గల్లంతయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని అతుకుపల్లిలో ఓ శుభకార్యానికి పది మంది పురుషులు, ఐదుగురు మహిళలు నాటు పడవల్లో ఇంద్రావతి నది దాటి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చీకటి పడడంతో వరద ఉధృతిని అంచనా వేయలేక నది దాటే క్రమంలో రెండు నాటు పడవలు మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకా సోమన్‌పల్లి వాసులు 15 మంది నీటిలో కొట్టుకుపోయారు. కొంత మందికి ఈత రావడంతో సురక్షితంగా బయటపడ్డారు. చదవండి: పడవ ప్రమాదంలో 32 మంది మృతి! మిగతా వారు పెద్ద బండలను పట్టుకొని స్థానికులు వచ్చేవరకు ప్రాణాలు అరచేత పట్టుకుని గడిపారు. విషయం తెలుసుకున్న స్థానికులు మంగళవారం రాత్రి నీటిలో చిక్కుకున్న వారిని కాపాడారు. అయితే ఇద్దరు మహిళల ఆచూకీ మాత్రం లభించలేదు. బుధవారం ఉదయం అటవీ, పోలీసు శాఖ అధికారులు గల్లంతైన మహిళల కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదు. గల్లంతైన వారిని సోమన్పల్లికి చెందిన కాంత ఆలం, శాంత గావుడేలుగా గుర్తించారు. ఘటన జరిగిన ప్రాంతం భూపా లపల్లి జిల్లా పలిమెల మండలానికి సమీపంలో ఉంటుంది. మంజీరాలో చిక్కుకున్న నలుగురు సాక్షి, మెదక్: చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు మంజీర నదిలో చిక్కుకోగా.. అధికారులు గజ ఈతగాళ్ల సాయంతో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్‌లో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తిన విషయం తెలిసిందే. కాగా, పైనుంచి నీటి ప్రవాహం తగ్గడంతో గేట్లను మూసివేశారు. ప్రవాహం తగ్గడంతో మెదక్ పట్టణానికి చెందిన ఆర్నే కైలాశ్, రాజబోయిన నాగయ్యతోపాటు కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన దుంపల ఎల్ల, సాదుల యాదగిరి మంగళవారం పొద్దుపోయాక చేపలవేటకు అవసరమైన సామగ్రితో పాటు ఆహార పదార్థాలను తీసుకుని హనుమాన్ బండల్ వద్ద నది దాటారు. రాత్రంతా అక్కడే వలలు వేసి చేపల వేట కొనసాగిస్తూ నిద్రపోయారు. బుధవారం ఉదయం లేచే సరికి నదీ ప్రవాహం పెరగడంతో అక్కడి నుంచి అవతలి ఒడ్డుకు వచ్చే పరిస్థితి లేకపోయింది. దీంతో వారు తమ బంధువులకు ఫోన్ల ద్వారా విషయం చెప్పగా, వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కొల్చారం ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, తహసీల్దార్ ప్రదీప్, డీఎస్పీ కృష్ణమూర్తి, మెదక్ ఇన్చార్జి ఆర్డీఓ సాయిరాం సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఉన్నతాధికారుల ఆదేశంతో సాయంత్రం మెదక్ మత్స్య సహకార సంఘానికి చెందిన గజ ఈతగాళ్లు అగి్నమాపక దళం సహకారంతో ఆవలి ఒడ్డుకు చేరుకుని అక్కడ చిక్కుకున్న నలుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రవాహ ఉధృతి దృష్ట్యా అటువైపు వెళ్లొద్దని స్థానికులను హెచ్చరించారు. దీనికి సంబంధించి తగిన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు డీఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు. -
‘వారి శరీరాల్లో విష పదార్ధాలు లేవు’
ముంబై, నాగ్‌పూర్: గడ్చిరోలి ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల శరీరంలో ఎలాంటి విష పదార్ధాలు లేవని నాగపూర్ ప్రభుత్వ ఫోరెన్సిక్ ప్రయోగశాల వైద్యులు తెలిపారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఏప్రిల్ 23న ఇంద్రావతి నది వద్ద జరిపిన ఎన్కౌంటర్లో 34 మంది మవోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. తినే ఆహరంలో విషం కలిపి వారిని ఎన్కౌంటర్ చేశారని పలు ప్రజా సంఘాలు ఆరోపించాయి. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు పోస్ట్‌మార్టం నిర్విహించిన 18 మృతదేహాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. వారి శరీరంలో ఎలాంటి విష పదార్ధాలు లేవని నాగపూర్ వైద్యులు దృవీకరించారు. భద్రతా దళాలకు, మవోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లోనే వారు మృతిచెందారని తెలిపారు. ఏప్రిల్‌లో రెండు రోజుల వ్యవధిలో జరిగిన వరుస ఎన్కౌంటర్లలో 40కి మందికి పైగా మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. -
జాబులందించే జాబ్‌లో
స్వాతంత్య్రం వచ్చిన 66 ఏళ్లకు 2013 మార్చి 8న మహిళ దినోత్సవం రోజున అందరూ మహిళలే నిర్వహించే పోస్ట్ ఆఫీసు ఢిల్లీలో ఏర్పాటైంది. కానీ అంతకంటే 30 ఏళ్ల ముందుగానే పోస్ట్–ఉమన్‌గా ఎంపికై ఎంతో ధీమాగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు ఇంద్రావతి. ఇప్పటికీ ఆ బాధత్యలను ఇంకా పురుషులే ఎక్కువగా నిర్వహిస్తున్న ఈ కాలంలోనూ దాదాపు రిటైర్మెంట్ వరకూ తన పోస్టును విజయవంతంగా నిర్వహించారామె. ఈ మధ్యే రిటైర్ అయిన ఆమె కథ ఇది. పోస్ట్‌మ్యాన్ అనే మాటనే ఎక్కువగా వింటాం. వాళ్లనే చూసి ఉంటాం. కాని ఇంద్రావతి పోస్ట్ ఉమన్. ఢిల్లీ ఫస్ట్ పోస్ట్ ఉమన్‌గా రిక్రూట్ అయ్యి సేవలు అందించారామె. ఆడవాళ్లు చేయగలిగే ఉద్యోగాలలో వారి ప్రేవేశానికే ప్రతిబంధకాలు ఉన్న రోజుల్లో ఆడవాళ్లకు ఏ మాత్రం ప్రవేశం లేని పోస్ట్‌మేన్ రంగంలో విజయవంతగా సర్వీసు పూర్తి చేశారామె. ప్రయత్నిస్తే వీలు లేని ఉద్యోగాల్లో కూడా విజయం సాధించవచ్చు అంటారామె. కష్టాల నుంచి... హర్యానాలోని చిన్న పల్లెటూరు ఇంద్రావతి స్వస్థలం. అమ్మాయిలను అసలు బడికే పంపని ఊరది. అలాంటి ఊళ్లో ఇంద్రావతి వాళ్లది ఉమ్మడి కుటుంబం. వాళ్లమ్మ అకస్మాత్తుగా చనిపోవడంతో ఉమ్మడికుటుంబంలోంచి వాళ్లను ఉన్నపళంగా బయటకు పంపించేశారు. దాంతో ఇంద్రావతి వాళ్లు ఆ ఊళ్లో బడిలో తలదాచుకున్నారు. ఆమె అక్కడ అక్షరాలు దిద్దడం నేర్చుకున్నారు. ఆ శ్రద్థను చూసి ఇంద్రావతి తండ్రి ఆమెను బడిలో చేర్పించారు. అలా ఆమె చదువు సాగింది. అందుకే ఒక విషాదమే తన చదువుకు తోడ్పడిందని చెబుతారు ఇంద్రావతి. ఉద్యోగమూ అంతే. అనుకోకుండా పంపిన దరఖాస్తుతో కొలువు ఖరారైంది. 1982, సెస్టెంబర్ 13న పోస్ట్(ఉ)మ్యాన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ‘నేను చేరినప్పుడు ఆ జాబ్‌లో అందరూ మగవాళ్లే. అసలు ఆడవాళ్ల వస్తారని అనుకుని ఉండరు. అందుకే ఆ కొలువులో ఆడవాళ్లకు ఓ ప్రాపర్ టైటిల్ ఇవ్వలేదు. నన్ను కూడా పోస్ట్‌మ్యాన్ అనే పిలిచేవారు.’ అని వివరణ ఇస్తారు ఇంద్రావతి. ఒక్కోరోజు 70 ఉత్తరాలు... ఇంద్రావతి మొదట్లో హర్యానాలోని రోథక్‌లో ఉండేవారు. ఉద్యోగమేమో ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో. ఢిల్లీకి రోజూ ట్రైన్లో వచ్చేవారు. ఉదయం తొమ్మిదింటికి డ్యూటీ మొదలయ్యేది. పోస్ట్ ఆఫీస్‌కు వచ్చిన ఉత్తరాలన్నిటినీ బస్సు వెళ్లే దారి ప్రకారంగా విభజిస్తారు. ఆ తర్వాత ఆ రూట్ ప్రకారమే బట్వాడా చేస్తారు. వాటిని ఆయా గడపల్లో వేయడానికి రోజుకు కనీసం ఎనిమిది కిలోమీటర్లు నడిచేవారట ఆమె. ఒక్కోరోజైతే 70 ఉత్తరాల దాకా ఉండేవట. బట్వాడా కోసం ఎన్నో ఇళ్ల తలుపులు తట్టాలి. వాటిల్లో అపార్ట్మెంట్లూ ఉంటాయి. కొన్నిటికి లిఫ్ట్స్ ఉంటాయి. కొన్నిటికి ఉండవు. మెట్లెక్కాల్సిందే. ‘ఢిల్లీ ఫస్ట్ పోస్ట్ ఉమన్నే కాదు.. మా ఫ్యామిలీలో గవర్నమెంట్ జాబ్ దొరికిన ఫస్ట్ లేడీని, ఇంకా చెప్పాలంటే మా ఊరి తొలి ప్రభుత్వోద్యోగిని కూడా నేనే. ఈ క్రెడిట్ నాకూ ప్రౌడ్‌గానే అనిపిస్తుంటుంది. మా ఊళ్లో వాళ్లూ గొప్పగానే చూస్తారు’ అంటారు ఇంద్రావతి నవ్వుతూ. కోడలికీ స్ఫూర్తి.. ఇంద్రావతికి ఇద్దరు పిల్లలు. అమ్మమ్మ, నానమ్మ కూడా అయ్యారు. కోడలు వచ్చాక ఫక్తు అత్తగారిలా ప్రవర్తించలేదామె. తనకు చదువు విలువ తెలుసు కాబట్టి కేవలం ఇంటర్ వరకు మాత్రమే చదువుకున్న కోడలిని ఉన్నత చదువులకై ప్రోత్సహించారు. ఇప్పుడు కోడలు, కూతురు ఇద్దరూ పోస్ట్గ్రాడ్యూయేట్లే. మహిళలకు ఆర్థిక స్వావలంబన ఉండాలనే ఉద్దేశంతో కోడలినీ ఉద్యోగస్తురాలిని చేసింది. వింతగా చూసేవారు... వేధించేవారు కూడా... పోస్ట్ ఉమన్‌గా తన జీవితం ఎలా ఉంది అని అడిగితే.. ‘మొదట్లో చాలా చాలెంజింగ్‌గా అనిపించేది. యూనిఫామ్ వేసుకొని ఉత్తరాలు పంచడానికి వెళ్తుంటే అందరూ వింతగా చూసేవాళ్లు. కొంతమంది గేలి చేశారు. కొంత మందైతే దొంగననుకునే వాళ్లు. ఇంకొంతమంది బిచ్చగత్తెననీ భ్రమపడ్డారు. అ యితే విషయం తెలుసుకున్నాక వాళ్లే గౌరవించడం మొదలుపెట్టారు. ఒకసారి ఒక తాగుబోతు నాతో మిస్ బిహేవ్ చేశాడు. కాని మత్తు దిగాక మరుసటిరోజు నేను పనిచేస్తున్న పోస్టాఫీస్‌కు వచ్చి క్షమాపణ కోరాడు. తాను అలా ప్రవర్తించినందుకు ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. నా జీవితంలో అలాంటి సంఘటన అదే మొదలు, ఆఖరు కూడా. చదువురాని వాళ్లు పర్సనల్ లెటర్స్‌ను నాతో చదివించుకునేవాళ్లు. ఎంతో నమ్మకం ఉంటేనే కదా.. చదవమంటారు! చిన్న వాళ్లు, పెద్దవాళ్లు అందరూ ఆప్యాయంగా పలకరిస్తారు. ఢిల్లీ ఫస్ట్ పోస్ట్ ఉమన్‌ని అని తెలిసీ నాతో సెల్ఫీ దిగడానికి ఆరాటపడుతుంటారు. వాళ్ల అభిమానం చూస్తుంటే హ్యాపీగా ఉంటుంది.’ అంటారు ఇంద్రావతి. ఇంద్రావతి తొలిసారి ఉద్యోగ బాధ్యతలు తీసుకున్న న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ దగ్గరలోని గోల్ ఢాక్–ఖానాలోనే గత నెలాఖర్లో పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆ ఆఫీస్ సిబ్బంది ఆమెకు ఘనంగా వీడ్కోలు పార్టీని ఏర్పాటు చేశారు. ‘యోగా చేస్తాను. నా మనవరాళ్లతో కలిసి స్విమ్మింగ్‌కు వెళ్తాను. నాకిష్టమైన వ్యాపకాలతో రిటైర్మెంట్ లైఫ్‌నూ అంతే బిజీగా గడపాలని డిసైడ్ చేసుకున్నా’ అంటారు ఇంద్రావతి. -
‘మహా’ ఎన్కౌంటర్.. రక్తపుటేరుగా ఇంద్రావతి
గడ్చిరోలి ; మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృత దేహాలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. గడ్చిరోలి వద్ద ఇంద్రావతి నదిలో మరో రెండు మృతదేహాలను పోలీసు బలగాలు వెలికి తీశాయి. దీంతో వరుస ఎన్కౌంటర్లలో మృతుల సంఖ్య 42కి చేరింది. ఇంతకు ముందు నది నుంచి 15 మృతదేహాలను వెలికి తీయటం తెలిసిందే. తప్పించుకునే మార్గం లేకే?... నది తీర ప్రాంతంలో మావోయిస్టులు గుడారాలు వేసుకున్న ఆనవాలు, ఘటనాస్థంలో కొన్ని వస్తువులు దర్శనమిచ్చాయి. ఎన్కౌంటర్ నేపథ్యంలో తప్పించుకునే మార్గం లేక మావోయిస్టులంతా నదిలోకి దూకేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మొసళ్లు, చేపలు పీక్కుతినటంతో మృతదేహాల గుర్తింపు కష్టతరంగా మారింది. మరోవైపు మృతుల్లో నలుగురు దళ కమాండర్లు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లో ఆహెరి, పెరిమిళ దళాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లేనని పోలీసులు ప్రకటించారు. మృతుల్లో పౌరులు లేరు... ఇక మృతుల్లో సాధారణ పౌరులు ఉన్నట్లు వస్తున్న వార్తలను తడ్‌గావ్ ఏఎస్సై సమీర్ దబాడే తోసిపుచ్చారు. ‘ఒకవేళ పౌరులు చనిపోయి ఉంటే వారి తరపు బంధువులుగానీ, ప్రజాసంఘాలుగానీ, నేతలుగానీ ఫిర్యాదు చేసి ఉండేవారు. కానీ, అలా జరగలేదు. చనిపోయివారంతా మావోయిస్టులే’ అని సమీర్ మీడియాకు వెల్లడించారు. ఇంద్రావతి నది పరిసరాల్లో కూంబింగ్ కొనసాగుతోందని.. మరిన్ని మృతదేహాలు బయటపడే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. మృతదేహాలను హెలికాఫ్టర్‌లో తరలిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలు ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో శనివారం నక్సల్స్ జరిపిన దాడిలో సీఆర్పీఎఫ్ ఏఎస్సై ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆ వెంటనే నక్సల్స్ కోసం భారీ కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభమైంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు సంయుక్తంగా కిలోమీటర్ల మేర అడవిని జల్లెడపట్టాయి. గడ్చిరోలి జిల్లా ఏటపల్లి వద్ద శనివారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో 16 మంది మావోయిస్టులు చనిపోయారు. ఆదివారం రాత్రి సుక్మా జిల్లాలో 5 గురు.. రాజారాం ఖాండ్లా అడవి(గడ్చిరోలి)లోని జిమాల్‌గట్ట ప్రాంతంలో 4గురు మృతి చెందగా.. మంగళవారం ఉదయం గడ్చిరోలి జిల్లా ఇంద్రావతి నదీ తీరంలో 15 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. -
కొనసాగుతున్న కూంబింగ్: ప్రాజెక్టుల వద్ద నిఘా
గడ్చిరోలి: మహారాష్ట్ర - చత్తీస్గడ్ సరిహద్దులోని ఇంద్రావతి నది పరిసరాల్లో భద్రతాదళాల కూంబింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తాజా పరిణామాలతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతమైన కాళేశ్వరం, మహదేవ్‌పూర్‌లలో పోలీసుల తనిఖీలు చేస్తున్నారు. ప్రాజెక్టుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు. కాగా వరుస ఎన్కౌంటర్లలో 39 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇంద్రావతి నదిలో లభ్యమైన మృతదేహాలను మొసళ్లు పీక్కుతిన్నాయి. దీంతో మృతదేహాల గుర్తింపు కష్టమని అధికారులు అంటున్నారు. మృతుల్లో నలుగురు దళ కమాండర్లు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. తాజాగా ఎన్కౌంటర్లో ఆహెరి, పెరిమిళ దళాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. -
39కి చేరిన మృతుల సంఖ్య
కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో నాలుగు రోజులుగా భయానక వాతావరణం నెలకొంది. దేశ చరిత్రలోనే ఒకేసారి రెండు ఎన్కౌంటర్లలో 37 మంది మావోయిస్టులు నేలకొరిగారు. తాజాగా బుధవారం ఇంద్రావతి నదిలో మరో రెండు మృతదేహాలు లభ్యమైనట్లు తెలిసింది. దీంతో గడ్చిరోలి ఎన్కౌంటర్ల మృతుల సంఖ్య 39కి చేరింది. ఈ నెల 22న ఆదివారం ఉదయం గడ్చిరోలి జిల్లాలోని బామ్రాగఢ్ తాలూకా కస్నాగూడ అటవీ ప్రాంతంలోని బోరియా ప్రదేశంలో మావోయిస్టులపై పక్కా సమాచారంతో సీ–60 పోలీసులతోపాటు మరో ఐదు కంపెనీల పోలీసు బలగాలు ముప్పేట దాడికి దిగాయి. ఈ దాడిలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మృతదేహాలు మరుసటిరోజు ఇంద్రావతినదిలో తేలియాడుతూ కనిపించిన విషయం తెలిసిందే. ఈ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని గడ్చిరోలి జిల్లా ఆస్పత్రికి హెలికాప్టర్లో తరలించారు. ఈ నెల 23న గడ్చిరోలి జిల్లాలోని అహేరి తాలూ కాలోని రాజారాంఖాండ్ల పరిధిలోని జిమ్మటగట్టుపై జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో మృతుల సంఖ్య మొత్తం 37గా పోలీసులు ప్రకటించారు. ఇంద్రావతి నదిలో మరో రెండు మృతదేహాలు బయటపడటంతో మృ తుల సంఖ్య 39కి చేరింది. మృతుల్లో ఇప్పటి వరకు 20 మంది మహిళలు, 19 మంది పురుషులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గడ్చిరోలిలో పోలీసుల సంబురాలు దేశ చరిత్రలోనే భారీ ఎన్కౌంటర్ చేసిన సీ–60 పోలీసులు, ఇతర పోలీసులు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సంబురాలు చేసుకుంటున్నాయి. పేట్రేగుతున్న రాజ్యహింస: వరవరరావు చిట్యాల(భూపాలపల్లి): దేశంలో రాజ్యహింస పేట్రేగిపోతోందని విరసం నేత వరవరరావు అన్నారు. గడ్చిరోలిలో ఈ నెల 22న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ గడ్చిరోలి డివిజన్ కమిటీ సభ్యుడు రౌతు విజేందర్ అలియాస్ శ్రీకాంత్ మృతదేహం మంగళవారం అర్ధరా త్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని తనస్వగ్రామం చల్లగరిగెకు తరలించారు. బుధవారం విరసం నేత వరవరరావు అక్కడికి చేరుకుని విజేందర్ మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి జోహార్లు అర్పించారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో పాల్గొన్నారు. గడ్చిరోలి ఎన్కౌంటర్ బూటకమని, ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఏకపక్షంగా కాల్పులు జరిపి నలుగురు డివిజన్ కార్యదర్శులుసహా 37 మందిని పొట్టనబెట్టుకున్న రాక్షస ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలన్నారు. ఎన్కౌంటర్లో తెలంగాణ గ్రేహౌండ్స్ హస్తం ఉందన్నారు. -
కావేరికి నీరిస్తాం
సాక్షి, బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌లో 60 వేల కోట్ల రూపాయలతో పోలవరం ఆనకట్టను నిర్మించడం ద్వారా గోదావరి ఉప నది అయిన ఇంద్రావతిలో ప్రవాహానికి అడ్డుకట్ట వేయనున్నామని జల వనరుల శాఖ మంత్రి గడ్కారీ చెప్పారు. ఆ తర్వాత 1,300 కిలో మీటర్ల పైపులైను నిర్మించి 450 టీఎంసీల నీటిని తమిళనాడు చివరి వరకు తీసుకెళ్లొచ్చన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) బెంగళూరులో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన ప్రసంగించారు. గోదావరిని, కృష్ణా, పెన్నా నదుల మీదుగా కావేరితో అనుసంధానం చేయడం ద్వారా కర్ణాటక రాష్ట్రానికి కూడా తాగు, సాగు నీరు అందించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామనీ, త్వరలోనే నదుల అనుసంధాన ప్రక్రియ ప్రారంభమవుతుందని గడ్కారీ పేర్కొన్నారు. భారత్ నుంచి పాకిస్తాన్లోకి ప్రవహిస్తున్న నదుల్లోని జలాలను వాడుకోవడం ద్వారా పంజాబ్, హరియాణ, రాజస్తాన్ రాష్ట్రాల్లో నీటి సమస్యను తీర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు గడ్కారీ చెప్పారు. -
నదిని సైతం లెక్క చేయక..
రాయ్‌పూర్ : ఉపాధి కోసం, చదువు కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేవారి గురించి విన్నాం.. కానీ విధి నిర్వహణ కోసం, నిరుపేదలకు వైద్య సేవలు అందించడం కోసం ఓ నర్సు ప్రతి రోజూ సుమారు 10 కి.మీ. మేర కాలినడకన ప్రయాణం చేస్తున్నారు. మొసళ్లకు ఆవాసమైన నదిని కూడా లెక్కచేయకుండా వెళ్లి గ్రామీణులకు వైద్యం అందిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె స్ఫూర్తిదాయకమైన కథనమిది.. సునిత ఏఎన్ఎమ్ నర్సు. మావోయిస్టుల ప్రభావమున్న ఛత్తీస్‌గఢ్ దంతేవాడలో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. తాను ఉంటున్న ప్రదేశం నుంచి మారుమూల గ్రామమైన దంతేవాడ చేరుకోవాలంటే ఆమె ప్రతిరోజు ఇంద్రావతి నదిని దాటి వెళ్లాలి. ఆ నది మొసళ్లకు ప్రసిద్ధి. అయినా ఆమె భయపడలేదు. ప్రతిరోజు ఒంటరిగానే నాటుపడవ సహాయంతో నదిని దాటుకుని వెళ్లి గ్రామ ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్నారు. గత ఏడేళ్లుగా ఆమె ఈ విధంగా పల్లె ప్రజలకు చెంతకు వైద్యాన్ని తీసుకెళుతున్నారు. అది నా బాధ్యత... ‘‘నా విధులు నిర్వహించడానికి నేను ప్రతిరోజు దట్టమైన అడవిని, ఇంద్రావతి నదిని దాటుకుని వెళ్తాను. ఇది నాకు పెద్ద శ్రమ అనిపించడంలేదు. ఆ మారుమూల గ్రామానికి వెళ్లి గ్రామస్తులకు సేవ చేయడం నాకు చాలా సంతృప్తినిస్తుంది’’ అన్నారు సునిత. -
‘మిడిల్ కొలాబ్’ రాష్ట్రానికి గొడ్డలిపెట్టు
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదికి ప్రధాన ఉపనదిగా ఉన్న ఇంద్రావతిని ఒడిసిపట్టేం దుకు ఒడిశా రాష్ట్రం మిడిల్ కొలాబ్ ప్రాజెక్టును చేపడుతోందని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిం ది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి, నీటి వినియోగం మొదలు పెడితే ఇంద్రావతి దిగువ రాష్ట్రమైన తెలంగాణకు నీటి లభ్యత తగ్గిపోతుందని గుర్తించింది. ఇంద్రావతి నీటి లభ్యత తగ్గడం మొదలు పెడితే మన రాష్ట్రం లో చేపట్టే బోఢాఘాట్ జల విద్యుత్ ప్రాజెక్టుకు నీటి లభ్యతపై తీవ్ర ప్రభావం ఉంటుం దని అంచనాకు వచ్చింది. ఈ ప్రభావం దిగువన దేవాదుల ఎత్తిపోతలపైనా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మంత్రి ఆదేశాలతో నివేదిక.. ఈ నేపథ్యంలో ఇటీవల నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ ఉన్నతాధికారులతో చర్చించారు. మిడిల్ కొలాబ్ ప్రాజెక్టుతో రాష్ట్రానికి జరిగే నష్టాలపై లెక్కలు తేల్చాలని అధికారులను ఆదేశించారు. దీంతో నీటిపారుదల అధికారులు ఓ నివేదిక తయారు చేశారు. ఈ నివేదిక ప్రకారం.. ఇంద్రావతి, కొలాబ్ నది కలిసేచోట మిడిల్ కొలాబ్ ప్రాజెక్టును 536.5 మీటర్ల నీటి మట్టంతో కొలాబ్ నదికి అడ్డంగా జోర్నాల వద్ద ఒడిశా చేపడుతోంది. కొలాబ్ దగ్గర వరద నీటిని తరలించేందుకు 35.50 కి.మీ. కాల్వ తవ్వనున్నారు. ఈ నీటిని కొలాబ్‌కు ఉపనది అయిన కెరజోడిపైన 4.19 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్న డ్యామ్ కు తరలించేలా ప్రతిపాదించారు. ఇక్కడ 75 శాతం నీటి లభ్యత లెక్కన 36.88 టీఎంసీల నీరు లభ్యతగా ఉంటోంది. అలాగే డ్యామ్ వద్ద పవర్‌హౌస్‌ను ప్రతిపాదించారు. ఇక్కడ విద్యుదుత్పత్తికి వాడిన నీరు కొలాబ్ నదికి చేరేలా 264 మీటర్ల ఎత్తుతో మరో బ్యారేజీని నిర్మించనున్నారు. దీంతో 63,117 ఎకరాలకు ఈ బ్యారేజీ కింద సాగుకు నీరివ్వవచ్చు. ఈ ప్రాజెక్టుతో దిగువకు వచ్చే నీరు గోదావరిలోకి రాకుండా శబరిలోకి వెళ్లడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందంటున్నారు. ఛత్తీస్‌గఢ్ అభ్యంతరం దీనిపై ఇటీవలే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా అభ్యంతరం తెలిపింది. నదీ పరీవాహకంలో పర్యావరణ, వాతావరణ సమతు ల్యత ఉండేందుకు వీలుగా నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించగా, ఈ అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. దీనిపై సీడబ్ల్యూసీ, ఛత్తీస్‌గఢ్ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణ విషయానికొస్తే.. మిడిల్ కొలాబ్ ప్రాజెక్టుకు అభ్యంతరం చెబుతూ బుధవారం ప్రభుత్వం గోదావరి బోర్డుకు లేఖ రాసింది. ఒడిశా ప్రాజెక్టుతో దిగువన తెలంగాణకు ఉన్న ఇబ్బందుల దృష్ట్యా, ప్రాజెక్టు ప్రతిపాదనలను మార్చాలని, డిజైన్లలో మార్పులు చేసి సవరించిన ప్రతిపాదనలు కోరాలని లేఖలో కోరింది. నీటి వినియోగం వివరాలు కూడా అందించేలా చూడాలని బోర్డుకు విన్నవించింది. ఈ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరింది. -
శునకాలకు ఘనంగా వివాహం
అనంతపురం: వరుణుడి కరుణ కోసం అనంతపురం జిల్లావాసుల బుధవారం శునకాలకు ఘనంగా వివాహం జరిపించారు. జిల్లాలోని ఉరవకొండ మండలం ఇంద్రావతి గ్రామంలో సవృద్ధిగా వర్షాలు కురవాలని గ్రామస్తులంతా కలిసి శునకాల వివాహం జరిపించారు. అనంతరం బాజా భజంత్రీల నడుమ వాటిని ఉరేగింపు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులందరూ కలిసి పెళ్లి భోజనాలు చేశారు. ఇది అనాది కాలంగా వస్తున్న ఆచారమని ఇలా చేస్తే వర్షాలు బాగా కురిసి, కరువు కాటకాలు దరి చేరవని గ్రామస్తులు తెలిపారు. ప్రధానంగా ఈసారి ఖరీఫ్ ప్రారంభమై 45 రోజులు అయినా ఇంతవరకూ చినుకు పడలేదని, దీంతో వరుణ దేవుడిని ఈ విధంగా కుక్కలకు పెళ్లి జరిపించి, వర్షాలు కురవాలని ప్రార్థనలు చేశామన్నారు. తమ మొర ఆలకించి వరుణదేవుడు వర్షాలు కురిపించాలని ఆ దేవుడిని కోరుకున్నామని తెలిపారు. మరోవైపు కుక్కల పెళ్లితో గ్రామంలో సందడి నెలకొంది. -
'నా కుమారుడు ఏ తప్పూ చేయలేదు'
తిరుపతి: తన కుమారుడు ఏ తప్పూ చేయలేదని, అన్యాయంగా శిక్ష విధించారని, అలిపిరి ఘటనలో శిక్ష పడిన రామ్మోహన్ రెడ్డి తల్లి ఇంద్రావతి వాపోయారు. సమాజంలో అరాచకాలు చూసి తట్టుకోలేకనే తన కుమారుడు రెండేళ్లపాటు నక్సలైట్లతో కలిసి పనిచేసినట్లు తెలిపారు. పది సంవత్సరాల క్రితమే నక్సలైట్ బాట వదిలి, జనజీవన స్రవంతిలో కలిసినట్లు చెప్పారు. రామ్మోహన్ రెడ్డి టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేపర్లలో పనిచేసినట్లు వివరించారు. విధించిన శిక్షపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. తన కుమారుడు ఎప్పటికైనా నిర్దోషేనని ఇంద్రావతి అన్నారు. **