ఎన్‌కౌంటర్ (పాత ఫొటో)
ముంబై, నాగ్‌పూర్: గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల శరీరంలో ఎలాంటి విష పదార్ధాలు లేవని నాగపూర్ ప్రభుత్వ ఫోరెన్సిక్ ప్రయోగశాల వైద్యులు తెలిపారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఏప్రిల్ 23న ఇంద్రావతి నది వద్ద జరిపిన ఎన్‌కౌంటర్‌లో 34 మంది మవోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. తినే ఆహరంలో విషం కలిపి వారిని ఎన్‌కౌంటర్ చేశారని పలు ప్రజా సంఘాలు ఆరోపించాయి. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు పోస్ట్‌మార్టం నిర్విహించిన 18 మృతదేహాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు.
వారి శరీరంలో ఎలాంటి విష పదార్ధాలు లేవని నాగపూర్ వైద్యులు దృవీకరించారు. భద్రతా దళాలకు, మవోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లోనే వారు మృతిచెందారని తెలిపారు. ఏప్రిల్‌లో రెండు రోజుల వ్యవధిలో జరిగిన వరుస ఎన్‌కౌంటర్‌లలో 40కి మందికి పైగా మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment