గడ్చిరోలి: ఛత్తీస్‌గడ్-మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సీఆర్పీఎఫ్ బలగాల కాల్పుల్లో 13 మంది మావోయిస్టులు మరణించారు. గడ్చిరోలి జిల్లా బోరియా అటవీప్రాంతంలోని ఏటపల్లి వద్ద ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
ఎలా జరిగింది?: ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో శనివారం నక్సల్స్ జరిపిన దాడిలో సీఆర్పీఎఫ్ ఏఎస్సై ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆ వెంటనే నక్సల్స్ కోసం భారీ కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభమైంది. సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు కిలోమీటర్ల మేర అడవిని జల్లెడపట్టాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఏటపల్లి వద్ద.. బలగాలకు సాయుధ నక్సల్స్ తారాసపడ్డారు. దీంతో ఎదురుకాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. మొత్తం 13 మంది తీవ్రవాదులు చనిపోయారని, వారు ఎవరనేది ఇంకా గుర్తించాల్సిఉందని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.
Comments
Please login to add a commentAdd a comment