Gadchiroli
-
మావోయిస్టుల దుశ్చర్య.. ఇన్ఫార్మర్ నెపంతో దారుణ హత్య
ముంబై: మహారాష్ట్రలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసుల ఇన్ఫార్మర్ నెపంతో పౌరుడు సుఖ్రామ్ మాడవిని దారుణంగా హత్య చేశారు. అనంతరం, ఆయన మృతదేహం వద్ద మావోయిస్టులు లేఖను విడిచిపెట్టి వెళ్లారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. గడ్చిరోలిలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. భమ్రాగడ్ తహసీల్‌లో ఉన్న కియర్ గ్రామంలో సామన్య పౌరుడు సుఖ్రామ్ మాడవిని హత్య చేశారు. అనంతరం, అతడి మృతదేహం వద్ద లేఖను విడిచిపెట్టి వెళ్లారు. ఈ లేఖలో మాడవిని పోలీసుల ఇన్ఫార్మర్ని అని తెలిపారు. పెంగుండ ప్రాంతంలో పోలీసు క్యాంప్ ఏర్పాటుకు అతడు సహకరించాడని పేర్కొన్నారు. మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిపారు.ఇదిలా ఉండగా.. మావోయిస్టుల చర్యపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ పౌరుడైన సుఖ్రామ్ మాడవిని ఇన్ఫార్మర్ నెపంతో హత్య చేయడం దారుణమన్నారు. కాగా, ఈ ఏడాదిలో మావోయిస్టులు ఓ వ్యక్తిని హత్య చేయడం ఇదే మొదటిసారని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్త చేపట్టినట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఇటీవలి కాలంలో ఎన్కౌంటర్ల కారణంగా భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. దాదాపు 40 మందికి పైగా మావోయిస్టులు మృత్యువాతపడ్డారు. -
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. వ్యక్తిని తొక్కి చంపిన అడవి ఏనుగు
ముంబై: ఓ వైపు ప్రాణాలు పోగుట్టుకుంటున్నా యువతకు సెల్ఫీ పిచ్చి మాత్రం వదలట్లేదు. ప్రమాదకర పరిస్థితుల్లో సెల్ఫీలు దిగుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలో మరో సెల్ఫీ మరం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అడవి ఏనుగుతోనే సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు.శ్రీకాంత్ రామచంత్ర సాత్రే అనే 23 ఏళ్ల యువకుడు తన ఇద్దరు స్నేహితులలతో కలిసి గడ్చిరోలి జిల్లాలో కేబుల్ లేయింప్ పనికోసం వచ్చాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం అబాపూర్ అడవుల్లో అడవి ఏనుగును చేసేందుకు వెళ్లారు. అక్కడ రోడ్డు మీద వెళ్తుండగా అడవి ఏనుగు కనిపించింది. ఇంకేముంది దానితో సెల్ఫీ దిగేందుకు ముగ్గురు ప్రయత్నించారు. ఇది గమనించిన ఏనుగు ఒక్కసారిగా ముగ్గురిని తరుముకుంటూ వచ్చింది. ఏనుగు దాడి నుంచి ఇద్దరు తృటిలో తప్పించుకోగా.. శ్రీకాంత్‌ను అడవి ఏనుగు దాడి చేసి చంపింది.అయితే రెండు రోజుల క్రితం చిట్టగాంగ్, గడ్చిరోలి అటవీ ప్రాంతం నుంచి అడవి ఏనుగు బయటకు వస్తున్నట్లు అధికారులకు సమాచారం అందించింది. ముట్నూర్ అటవీ ప్రాంతంలోని అబాపూర్ అడవుల్లో ఏనుగు సంచరిస్తోందని గుర్తించారు. అదే సమయంలో శ్రీకాంత్అ తని ఇద్దరు స్నేహితులు పని నిమిత్తం ఆ ప్రాంతంలో ఉండటంతో. ఏనుగులను చూసేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దూరం నుంచి ఏనుగుతో సెల్ఫీ దిగాలని ప్రయత్నించగా..వెంటనే ఏనుగు అతనిపై దాడి చేసి ప్రాణాలు తీసింది. తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. -
హృదయ విదారకం.. ‘బిడ్డల మృతదేహాలను భుజాన వేసుకుని’
భార్య శవాన్ని భుజాన మోసుకొని వెళ్లిన భర్త.. కొడుకు మృతదేహాన్ని చేతలపై తీసుకెళ్లిన తండ్రి.. ఇలాంటి వార్తలను అప్పుడప్పుడూ పేపర్లు,టీవీల్లో చూస్తుంటాం. ప్రైవేట్ అంబులెన్స్‌లకు డబ్బులు ఇవ్వలేక.. ప్రభుత్వ ఆస్పత్రులను అంబులెన్స్‌లను పంపించక.. కొందరు అభాగ్యులు.. భుజాలపైనా తమ అయినవారి మృతదేహలను తీసుకెళ్లిన ఘటన గతంలో పలు చోట్ల జరిగాయి. ఈ కాలంలోనూ ఇలాంటి ఘటనలు జరగడం శోచనీయం. తాజాగా మహారాష్ట్రలో హృదయ విదారక దృశ్యాలు వెలుగుచూశాయి. గడ్చిరోలి జిల్లా అహేరి తాలూకాలో ఓ తల్లిదండ్రులు తమ ఇద్దరు కుమారుల మృతదేహాలను భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో తీవ్రమైన జ్వరంలో బాలురు మరణించారు. దీంతో ఆసుపత్రి నుంచి 15 కి.మీ దూరంలో ఉన్న తమ గ్రామానికి మృతదేహాలను భుజాలను మోసుకెళ్లారు. 10 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఇద్దరు మైనర్ బాలుర మృతదేహాలపే ఓ జంట వారి భుజాలపై మోసుకెళ్తూ బురదతో కూడిన అటవీ మార్గం గుండా వెళ్తున్న వీడియోను అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.‘ఇద్దరు సోదరులు జ్వరంతో బాధపడుతున్నారు. అయితే వారికి సకాలంలో చికిత్స లభించలేదు. కొన్ని గంటల్లోనే వారి పరిస్థితి క్షీణించింది. గంటల వ్యవధిలో ఇద్దరు బాలురు మరణించారు. వారి మృతదేహాలను స్వగ్రామమైన పట్టిగావ్‌కు తరలించడానికి కూడా అంబులెన్స్ లేదు. తల్లిదండ్రులు వర్షంలో తడిసిన బురద మార్గం గుండా 15 కిలోమీటర్లు నడవవలసి వచ్చింది. గడ్చిరోలి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ యొక్క భయంకరమైన వాస్తవికత ఈ రోజు మళ్లీ తెరపైకి వచ్చింది.’అంటూ వాడెట్టివార్ విషాదానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.‘గడ్చిరోలి జిల్లాకు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇంచార్జ్ మంత్రిగా ఉన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ధర్మారావు బాబా అత్రమ్ మంత్రిగా ఉన్నారు. ఇద్దరు మంత్రులు రాష్ట్రమంతటా కార్యక్రమాలు నిర్వహిస్తూ మహారాష్ట్ర ఎలా అభివృద్ధి చెందుతుందో వాదిస్తున్నారని కాని గ్రౌండ్ లెవల్‌కి వెళ్లి గడ్చిరోలిలో ప్రజలు ఎలా జీవిస్తున్నారో, అక్కడ ఎలా మరణాలు సంభవిస్తున్నాయో తెలుసుకోవడం లేదు.’ అని మండిపడ్డారు.అయితే విదర్భ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోవది. సెప్టెంబరు 1న ఒక గర్భిణీ గిరిజన మహిళ తన ఇంటి వద్ద చనిపోయిన బిడ్డను ప్రసవించింది. స్థానిక ఆసుపత్రికి ఆమెను సమయానికి తీసుకువెళ్లడానికి అంబులెన్స్‌ను రాకపోవడంతో నొప్పులతో తనువు చాలించింది. -
గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి
గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. ఈ దాదాపు ఆరు గంటల పాటు జరిగిన ఎదురుకాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని వండోలి గ్రామం సమీపంలో 12 నుంచి 15మంది మావోయిస్టులు ఉన్నారని సమాచారం అందడంతో డిప్యూటీ ఎస్పీ సారథ్యంలో పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. బుధవారం ఉదయం నుంచి పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో మధ్యాహ్నం నుంచి పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా దాదాపు ఆరు గంటల పాటు జరగ్గా.. ఇప్పటివరకు 12మంది మృతదేహాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. అలాగే, మూడు ఏకే 47 తుపాకీలతో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.ఇక, కాల్పుల సందర్భంగా తిపాగడ్ దళం ఇంఛార్జి డీవీసీఎం లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ ఆత్రం మృతిచెందినట్టు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. మిగతా మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, ఈ కాల్పుల్లో ఒక జవాన్‌కు బుల్లెట్ గాయం కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. -
ఇద్దరు ఓటర్లు.. 107 కిలోమీటర్లు.. ఎన్నికల అధికారుల సాహసం!
ముంబై, సాక్షి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో లోక్‌సభ ఎన్నికల కోసం ఇద్దరు వృద్ధులతో ఓటేయించడానికి ఎన్నికల అధికారులు సాహసం చేశారు. ప్రమాదకరమైన మలుపులు, అడవుల గుండా 107 కిలోమీటర్లు ప్రయాణించారు. వివరాల్లోకి వెళ్తే.. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మహారాష్ట్రలోని గడ్చిరోలి-చిమూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గంలో 100 ఏళ్లు, 86 సంవత్సరాల వయస్సు గల ఓటర్లు ఇద్దరు ఉన్నారు. ఎన్నికల సంఘం 85 ఏళ్లు పైబడిన వారికి, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. దీంతో ఎన్నికల అధికారులు అహేరి నుండి సిరొంచ వరకు 107 కిలోమీటర్లు ప్రయాణించి 100 ఏళ్ల కిష్టయ్య మదర్బోయిన, 86 ఏళ్ల కిష్టయ్య కొమెర ఇళ్లకు చేరుకున్నారు. వీరు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేసే పరిస్థితిలో లేరు కానీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తిగా ఉన్నారని ఎన్నికల అధికారి తెలిపారు. గడ్చిరోలి-చిమూర్ నియోజకవర్గంలో 1,037 మంది 85 ఏళ్లు పైబడిన ఓటర్లు, 338 మంది దివ్యాంగుల దరఖాస్తులను ఆమోదించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 1,205 మంది ఓటర్లు ఇంటి వద్ద నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
గడ్చిరోలి: మావోయిస్టులకు భారీ దెబ్బ
సాక్షి, గడ్చిరోలి: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మంగళవారం(మార్చి 19) తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్ట్ అగ్రనేతలు మృతి చెందారు. మిగిలిన మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. గడ్చిరోలిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డప్పుడు కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. చనిపోయిన వారంతా మావోయిస్టు అగ్రనేతలని.. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులని అధికారులు ధృవీకరించారు. మంచిర్యాల డివిజన్ కమిటీ సెక్రటరీ వర్గీస్, చెన్నూరు ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తూ, కుర్సంగ్ రాజు, కుడిమెట్ట వెంకటేశ్ ఉన్నారు. ఇదిలా ఉంటే.. కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టులపై రూ. 36 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదీ చదవండి.. ప్రాణం పోస్తారనుకుంటే తీశారు -
మహారాష్ట్రలో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్ మావోయిస్టు సీనియర్ నేత సహా ఇద్దరు నక్సల్స్ చనిపోయారు. ఛత్తీస్‌గఢ్– మహారాష్ట్ర సరిహద్దుల్లోని బోధింటొలా ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ సమయంలో మావోయిస్టులు వారిపైకి కాల్పులకు దిగారు. ఎదురుకాల్పుల్లో కసన్సూర్ దళం డిప్యూటీ కమాండర్ దుర్గేశ్ వట్టి, మరో గుర్తు తెలియని మావోయిస్టు చనిపోయారు. -
పాండు నరేటి మృతిపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న గడ్చిరోలికి చెందిన పాండు నరేటి మృతిపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రొఫెసర్ సాయిబాబా కేసులో అరెస్టయిన ఐదుగురిలో పాండు నరేటి ఒకరని, ఈ నెల 26నే నాగ్‌పూర్ జైల్లో పాండు నరేటి మృతిచెందిన వార్తను బీజేపీ ప్రభుత్వం దాచిపెట్టిందని ఆరోపించింది. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ మంగళవారం ఈ మేరకు లేఖ విడుదల చేశారు. తప్పుడు కేసుకు, శిక్షకు వ్యతిరేకంగా మానవ హక్కుల సంఘాలు పోరాడుతున్నాయని, ఆరోగ్యం సరిగాలేని పాండు స్వైన్ ఫ్లూతో మరణించినట్టు అభయ్ తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులకు గానీ, ఆయన తరపు లాయర్‌కు తెలియజేయలేదని ఆరోపించారు. పాండును చికిత్స నిమిత్తం మెరుగైన ఆస్పత్రికి తీసుకెళ్లాలని జైలు అధికారులకు డాక్టర్లు సూచించినా పట్టించుకోలేదని మండిపడ్డారు. పాండు మరణం ప్రభుత్వ హత్య అని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని అభయ్ స్పష్టంచేశారు. ముంబయి జైల్లో ఉన్న మావోయిస్టు కిరణ్ క్యాన్సర్ చికిత్స పొందుతున్నారని, ఆయన భార్య నర్మద ఆరోగ్యం విషమించిందని తెలిసినా కనీసం చూసేందుకు ఆయన్ను తీసుకెళ్లలేదని ఆరోపించారు. తీరా ఆమె చనిపోయిన తర్వాత శవాన్ని చూపించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్యం కూడా క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. పౌరుల ప్రజాస్వామిక, మౌలిక హక్కులను ప్రభుత్వం హరిస్తోందని, ఈ చర్యలను యావత్ ప్రజానీకం ఖండించాలని పిలుపునిచ్చారు. ఐసీఎస్ పీడబ్ల్యూఐ పిలుపు మేరకు సెప్టెంబర్ 13నుంచి 19 వరకు జరగనున్న ఆక్షన్ వీక్‌లో ఈ విషయంపై ప్రశ్నించాలని అభయ్ కోరారు. చదవండి: వారిద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. అయితేనేం వారి కనుసన్నల్లోనే.. -
సాక్షి గ్రౌండ్ రిపోర్ట్: దండకారణ్యంలో రక్తపాతం
-
గడ్చిరోలి ఎన్కౌంటర్..! ఆ పది మంది ఎవరు?
సాక్షి ప్రతినిధి, వరంగల్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యార్‌పట్టి అడవుల్లో శనివారం మధ్యాహ్నం జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో మృతిచెందిన వారిలో 16 మందిని గుర్తించగా, మిగతా పది మంది ఎవరనేది చర్చనీయాంశమైంది. ఆ పది మందిలో తెలంగాణకు చెందిన వారున్నారా? అనే దానిపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఎన్కౌంటర్లో 26 మంది ప్రాణాలు మృతిచెందగా, 16 మందిని ఆదివారం గుర్తించిన విషయం తెలిసిందే. కాగా, దండకారణ్యంతో పాటు వివిధ ప్రాంతాల్లో తెలంగాణకు చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్, కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, బండి ప్రకాశ్, మైలారపు అడెల్లు, కంకణాల రాజిరెడ్డి, మాచర్ల ఏసోబు, కొంకటి వెంకట్ పనిచేస్తున్నారు. నిజామాబాద్‌కు చెందిన పడకల్‌స్వామి ప్రస్తుతం గడ్చిరోలి అడవుల్లో ఫ్లటూన్ కమాండర్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో గుర్తించని 10 మంది మావోయిస్టులు ఎవరనే చర్చ సాగుతోంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో డిసెంబర్ 2 నుంచి వారం పాటు నిర్వహించే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) వారోత్సవాలపై మావోయిస్టు ఫ్లటూన్లు సమావేశమయ్యాయన్న పక్కా సమచారంతోనే పోలీసు బలగాలు శనివారం ఉదయం 6.30 గంటలకు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్కౌంటర్ చోటుచేసుకుందని అంటున్నారు. -
‘గడ్చిరోలి’ మృతుల్లో తేల్‌తుమ్డే
ముంబై/నాగ్‌పూర్: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో శనివారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతి చెందిన 26 మందిలో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ తేల్‌తుమ్డే ఉన్నట్లు పోలీసులు ఆదివారం ధ్రువీకరించారు. మర్దిన్‌తోలా అటవీప్రాంతంలోని కోర్చి సమీపంలో సి–60 పోలీస్ కమాండోలతో దాదాపు 10 గంటలపాటు జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో చనిపోయిన వారిలో మిలింద్ తేల్‌తుమ్డే కూడా ఉన్నట్లు పోలీసులు శనివారం అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎల్గార్ పరిషత్–మావోయిస్ట్ లింకుల కేసు లో ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన 26 మందిలో తేల్‌తుమ్డే కూడా ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. మృతుల్లో 20 మంది పురుషులు కాగా ఆరుగురు మహిళలు. వీరిలో తేల్తుమ్డేకు బాడీగార్డులుగా వ్యవహరిస్తున్న ఒక మహిళ, పురుషుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలి నుంచి పోలీసులు 29 ఆయుధాలతోపాటు మందుగుండు సామగ్రి, వాకీటాకీలు,విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల ముందే సమాచారం: కోర్చిలోని గ్యారపట్టి వద్ద మావోయిస్ట్‌ల శిబిరం ఉన్నట్లు తమకు రెండు రోజుల ముందే సమాచారం అందిందని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయెల్ చెప్పారు. ఈ మేరకు ఆ ప్రాంతంలో సి–60 కమాండోలు, స్పెషల్ యాక్షన్ టీమ్‌లతోపాటు మొత్తం 300 మంది పోలీసు బలగాలు అదనపు ఎస్పీ సౌమ్య ముండే నేతృత్వంలో గురువారం రాత్రి నుంచి కూంబింగ్ ప్రారంభించారన్నారు. శనివారం ఉదయం 6 గంటల సమయంలో వారికి తారసపడిన మావోయిస్టులు సుమారు 100 మంది అత్యాధునిక ఆయుధాలతో భారీ ఎత్తున కాల్పులకు దిగారన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో 26 మంది మావోయిస్ట్‌లు చనిపోగా, నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మృతి చెందిన 26 మందిలో తేల్‌తుమ్డే సహా ఇప్పటి వరకు 16 మందిని గుర్తించినట్లు చెప్పారు. తేల్‌తుమ్డే తలపై రూ.50 లక్షల రివార్డు ఉందన్నారు. మావోయిస్ట్ పార్టీకి పెద్ద దెబ్బ మిలింద్ తేల్‌తుమ్డే మరణం దేశంలో మావోయిస్ట్ ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ అని గడ్చిరోలి రేంజ్ డీఐజీ సందీప్ పాటిల్ పేర్కొన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్(ఎంఎంసీ జోన్) పరిధిలో మావోయిస్ట్‌ల ఉద్యమానికి మిలింద్ కీలకంగా మారాడన్నారు. మహారాష్ట్రలో 20 ఏళ్లుగా నక్సల్ ఉద్యమం బలపడటంలో ఇతడు ముఖ్యుడని, ఇతడికి సాటి వచ్చే మావోయిస్ట్ నేతలు ఈ ప్రాంతంలో మరెవరూ లేరని చెప్పారు. ఎంఎంసీ జోన్ చీఫ్ ఇన్ఛార్జిగా, మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో మహారాష్ట్రకు చెందిన ఏకైక నేత ఇతడేనన్నారు. కేంద్ర ప్రభుత్వ దృష్టిని కొండప్రాంతాల నుంచి ఎంఎంసీ జోన్ వైపు మళ్లించే బాధ్యతను కేంద్ర కమిటీ ఇతడికి అప్పగించిందని తెలిపారు. అటవీప్రాంతాలతోపాటు అర్బన్ నక్సల్ ఉద్యమంతో దగ్గరి సంబంధాలున్న మావోయిస్ట్ నేతల్లో మిలింద్ తేల్‌తుమ్డే ఒకడని చెప్పారు. మిలింద్ తేల్‌తుమ్డే హక్కుల కార్యకర్త ఆనంద్ తేల్తుమ్డేకు సోదరుడు. ఎల్గార్ పరిషత్ మావోయిస్ట్ లింకుల కేసులో అరెస్టయిన ఆనంద్ ప్రస్తుతం తలోజా జైలులో ఉన్నాడు. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కోర్టుకు సమర్పించిన చార్జిషీటులో మిలింద్‌ను ప్రమాదకరమైన మావోయిస్ట్‌గా పేర్కొంది. మహారాష్ట్రలో 1996 నుంచి కొనసాగుతున్న మావోయిస్ట్ కార్యకలాపాల్లో ఇతనికి ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. ఇతడిపై గత ఐదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర భద్రతా విభాగాలు ఒక కన్నేసి ఉంచాయి. అజ్ఞాతంలో ఉన్న ఇతడు అనిల్, దీపక్, సహ్యాద్రి, కామ్రేడ్ ఎం.. వంటి పేర్లతో వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. బిహార్‌లో నక్సలైట్ల దాడిలో నలుగురి మృతి గయ(బిహార్): బిహార్‌లో నక్సలైట్లు ఓ ఇంటిని బాంబులతో పేల్చివేయడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. గయ జిల్లా దుమారియా పోలీసు స్టేషన్ పరిధిలో బిహార్–జార్ఖండ్ సరిహద్దుకు సమీపంలో ఈ సంఘటన జరిగింది. మావోయిస్టులు శనివారం రాత్రి సర్యూసింగ్ భోక్తా ఇంట్లో బాంబు అమర్చి పేల్చేశారు. ఆ సమయంలో సర్యూసింగ్ ఇంట్లో లేరు. పేలుడుతో సర్యూసింగ్ ఇద్దరు కుమారులు, వారి భార్యలు మృతిచెందారు. మృతదేహాలను నక్సలైట్లు పశువుల దొడ్డిలో స్తంభానికి వేలాడదీశారు. ఘటనా స్థలంలో ఒక కరపత్రాన్ని వదిలి వెళ్లారు. సర్యూసింగ్, ఆయన కుటుంబం పోలీసు ఇన్ఫార్మర్లుగా పని చేస్తున్నందున వారిని శిక్షించామని అందులో పేర్కొన్నారు. -
మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ.. 26 మంది మృతి
-
మహారాష్ట్ర: గడ్చిరోలిలో ఎన్కౌంటర్
-
గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్
సాక్షిప్రతినిధి, వరంగల్/మంచిర్యాల/చర్ల: మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. శనివారం మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దు గడ్చిరోలి జిల్లా ధనోరా తాలుకా గ్యారబట్టి అడవుల్లో తుపాకులు గర్జించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఎదురు కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతిచెందారు. పోలీస్ కమాండోలు నలుగురు గాయపడ్డారు.మృతి చెందిన మావోయిస్టుల్లో కీలక నేత మిలింద్ తేల్‌తుమ్డే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతుండగా ఆదివారం ఉదయం వరకు మృతుల పూర్తి వివరాలు తెలుస్తాయని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ పేర్కొన్నారు. గాయపడిన పోలీసులను చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో నాగ్‌పూర్‌కు తరలించారు. సుదీర్ఘ పోరు గడ్చిరోలి డివిజనల్ కమిటీ సభ్యుడి నేతృత్వంలో కోర్చి దళం సంచరిస్తోందని పక్కా సమాచారం రావడంతో అడిషనల్ ఎస్పీ సౌమ్య ముండే నేతృత్వంలో సి–60 కమాండోల బృందం కూంబింగ్ ప్రారంభించింది. వంద మందికి పైగా బలగాలు ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ధనోరా గ్యారబట్టి అటవీ ప్రాంతంలోని కోర్చి గ్రామ సమీపంలో తారసపడిన మావోయిస్టులు కమాండో బృందంపైకి కాల్పులకు తెగబడ్డారు. వెంటనే బలగాలు దీటుగా బదులిచ్చాయి. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అడవులు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. ఘటనలో నలుగురు కమాండోలు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలం నుంచి రాత్రి 7 గంటల వరకు 26 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అంకిత్ గోయెల్ తెలిపారు. ఘటనాస్థలి నుంచి 18 ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులైన పోలీసులను చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో నాగ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సాంకేతిక విభాగంలో పని చేస్తున్న రవి అలియాస్ జైలాల్ చనిపోయినట్లు భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. గతేడాది జూన్ 25న బాణం బాంబులు పరీక్షిస్తున్న సమయంలో తీవ్రంగా గాయపడినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. సాంకేతికతలో దిట్ట అయిన రవి మరణవార్తను చాలా ఆలస్యంగా పార్టీ బహిర్గతం చేసింది. మృతుల్లో మిలింద్ తేల్‌తుమ్డే? ఎన్కౌంటర్ మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ తేల్‌తుమ్డే అలియాస్ దీపక్, అలియాస్ ప్రవీణ్ కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతుల్లో పలువురు డివిజన్, ఏరియా కమిటీ కార్యదర్శులు, సభ్యులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మృతుల వివరాలపై ఆదివారం వరకు స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఎల్గార్ పరిషత్–భీమా కోరెగావ్ కేసులో నిందితుడిగా ఉన్న మిలింద్ పుణె పోలీసుల మోస్ట్ వాటెండ్ జాబితాలో ఉన్నాడు. ‘మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బతగిలింది. ఇది పోలీసు బలగాలకు లభించిన ఘన విజయం’అని ఎస్పీ గోయెల్ పేర్కొన్నారు. మిలింద్కు గన్‌మెన్‌గా పని చేసిన రాకేశ్ కొద్ది రోజుల క్రితమే పోలీసులకు లొంగిపోవడం గమనార్హం. దెబ్బ మీద దెబ్బ... నిత్యం డ్రోన్లతో జల్లెడ పడుతూ, దండకారణ్యంలో కూంబింగ్‌లతో సాగుతున్న ఆపరేషన్ ప్రహార్‌తో ఏడాది కాలంగా మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. 2018లో ఏప్రిల్ 23న గడ్చిరోలి జిల్లా అహెరి, ఏటపల్లి తాలూకాల్లో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో 40మంది మావోయిస్టులు మృత్యవాత పడ్డారు. ఈ ఏడాదిలో భారీ ఎన్కౌంటర్లు మే 21న పయిడి, కోట్మి అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 13మంది మావోయిస్టులు చనిపోయారు. అక్టోబర్ 11న కోస్మి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. -
మావోయిస్టుల డంప్ లభ్యం .. రూ.15.96 లక్షల నగదు
కాళేశ్వరం: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకా కుద్రీ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టుల డంప్ లభ్యమైంది. ప్రత్యేక పోలీస్ బలగాలతో గురువారం రాత్రి కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ డంపు దొరికిందని ఎస్పీ అంకిత్‌గోయల్ తెలిపారు. అందులో రూ.15.96 లక్షల నగదు, మూడు డిటోనేటర్లతో పాటు వైర్ బండిళ్లు, వాకీటాకీ, బ్యానర్లు, కిట్‌బ్యాగులు ఉన్నాయని ఆయన శుక్రవారం విలేకరులకు వివరించారు. -
‘మహా’లో భారీ ఎన్కౌంటర్.. !
ముంబై: మహారాష్ట్రలో శుక్రవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గడ్చిరోలి జిల్లాలోని ఎటపల్లి అటవీ ప్రాంతంలోవద్ద సీ-60 యూనిట్ మహారాష్ట్ర పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు కొనసాగుతుండడంలో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఎదురు కాల్పులకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. -
గడ్చిరోలిలో ఇద్దరు మావోల ఎన్కౌంటర్
గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అబూజ్మడ్ అటవీ ప్రాంతం భామ్రాగఢ్‌లోని ఛత్తీస్‌గఢ్– మహారాష్ట్ర సరిహద్దుల్లో శనివారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. డిసెంబర్ 2 నుంచి మొదలయ్యే మావోయిస్టు వారోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీస్ కమాండోలు ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. -
గడ్చిరోలి–హెలికాప్టర్ పైలెట్లకు ప్రత్యేక శిక్షణ
సాక్షి, ముంబై: రాష్ట్రంలో రోజురోజు తీవ్ర రూపం దాలుస్తున్న మావోయిస్టుల కార్యకలాపాలకు చమరగీతం పాడేందుకు ఫ్రెంచ్ తయారి ‘హెచ్–145’ అత్య«ధునిక హెలికాప్టర్ కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేగాకుండా ఈ అత్య«ధునిక హెలికాప్టర్ నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వ విమానయాన డైరెక్టర్‌కు చెందిన ముగ్గురు సీనియర్ పైలెట్లను శిక్షణ నిమిత్తం జర్మనీకి పంపించనుంది. జర్మనీలోని డోనవర్థ్–మాన్‌చింగ్‌లో ఈ ముగ్గురు పైలెట్లకు 75 రోజుల పాటు కఠోర శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా నక్సలైట్ల ప్రాబల్యమున్న అలాగే అటవి ప్రాంతాల్లో హెలికాప్టర్‌ను ఎలా నడపాలనే దానిపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. కేవలం శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.7.30 లక్షలు ఖర్చు చేయనుంది. శిక్షణ కోసం విదేశాలకు వెళ్లే ముగ్గురిలో చీఫ్ పైలెట్ క్యాప్టన్ సంజయ్ కర్వే, సీనియర్ పైలెట్ క్యాప్టన్ మహేంద్ర దల్వీ, అసిస్టెంటెంట్ పైలెట్ క్యాప్టన్ మోహిత్ శర్మ ఉన్నారు. వీరంత జూన్ ఐదో తేదీన జర్మనికి బయలుదేరుతారు. అక్కడ 75 రోజులపాటు కఠోర శిక్షణ తీసుకున్న తరువాత ఆగస్టు 14వ తేదీ తరువాత తిరిగి స్వరాష్ట్రానికి చేరుకుంటారు. కేవలం అత్యధునిక హెలికాప్టర్ కొనుగోలు చేయగానే సరిపోదు. దాన్ని నడిపే సత్తా ఉండాలనే ఉద్ధేశ్యంతో ముగ్గురు పైలెట్లను ఎంపిక చేసి శిక్షణ కోసం జర్మనీకి పంపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నక్సలైట్ల కార్యకలాపాలను అంతమొందించేందుకు చేపట్టే గాలింపు చర్యల పనుల కోసం గత ఎనిమిదేళ్లుగా పవన్ హంస్ కంపెనీకి చెందిన హెలికాప్టర్లను ప్రభుత్వం అద్దెకు తీసుకుంటుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.25 కోట్లు చెల్లిస్తుంది. దీంతో సొంతంగా ఒక అత్యధునిక హెచ్–145 మోడల్ హెలికాప్టర్ కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీన్ని ఎయిర్ బస్ హెలికాప్టర్ కంపెనీ నుంచి రూ.72.43 కోట్లకు కొనుగోలు చేయనుంది. ఇందులో ఇద్దరు పైలెట్లు, పది మంది ప్రయాణించే సామర్ధ్యం ఉంటుంది. మావోలను ఏరివేయడంతోపాటు ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు సాయం అందించేందుకు కూడా దీన్ని వినియోగించవచ్చు. అందుకు ప్రధాన కారణం ఇందులో స్ట్రేచర్‌తోపాటు బాధితులకు అందజేసే రకరకాల మందులు, ఇతర వైద్య సామాగ్రి నిల్వచేసే సౌకర్యం ఉంది. గగనతలం నుంచి దృష్టి సారించేందుకు రాష్ట్రంలో నక్సలైట్ల కార్యకలాపాలు రోజు రోజుకు విస్తరిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇటీవల జరిగిన దాడిని బట్టి మావోలు క్రియశీలకంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దాడులకు, పోలీసును అంతమొందించేందుకు కొత్త కొత్త విధానాలను ఎంచుకుంటున్నారు. కారడవిలో దట్టమైన చెట్ల మధ్య మావోలను గుర్తించాలంటే పోలీసులకు దారి లభించదు. ఇలాంటి సందర్భంలో గగనతలంలోంచి దృష్టి సారించడానికి ఈ హెలికాప్టర్ ఎంతో దోహదపడనుంది. -
గడ్చిరోలి పేలుడు వెనుక నంబాల
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 16 మంది పోలీసుల్ని పొట్టన బెట్టుకున్న బాంబు పేలుడుకు కీలక సూత్రధారిని మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. భారీ దాడులకు ప్రణాళికలు రూపొందించడంలో దిట్టగా పేరొందిన సీపీఐ (మావోయిస్ట్) గ్రూప్ చీఫ్ నంబాల కేశవరావు (నంబాల) ఈ దాడికి నేతృత్వం వహించినట్లు పోలీసులు నిర్ధారించారు. గడ్చిరోలి మందుపాతర పేలుడు వెనుక తెలంగాణ మావోల హస్తం ఉందన్న విషయాన్ని ‘సాక్షి’ముందే వెల్లడించిన సంగతి తెలిసిందే. (చదవండి : పోలీసులపై మావోల పంజా) నంబాల కేశవరావు అలియాస్ గుర్రె బసవరాజుగా కూడా ప్రసిద్ధుడే. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి సీపీఐ (మావో యిస్టు) కేంద్ర మిలటరీ కమాండర్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఆయన వారసుడి గా నంబాల బాధ్యతలు చేపట్టాడు. నంబాల స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని జియ్యన్నపేట. తెలంగాణలోని వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థి. శ్రీకాకుళంలో ఇంటర్మీడియట్ చదివిన అనంతరం కేశవరావుకు వరంగల్ ఆర్ఈసీలో సీటు లభించింది. అక్కడే ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ సమయంలోనే నాటి పీపుల్స్ వార్ కార్యక్రమాల వైపు ఆకర్షితుడయ్యాడు. అంతకుముందు– ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్‌లో క్రియాశీలకంగా పని చేసిన సమయంలో నక్సల్ ఉద్యమానికి ఆకర్షితుడయ్యాడు. 1984లో పార్టీలో చేరిన కేశవరావు ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి దిశానిర్దేశకుడిగా వ్యవహరిస్తున్నాడు. నంబాల కేశవరావు (ఫైల్ ఫొటో) వ్యూహాలు రూపొందించడంలో దిట్ట.. భారీ దాడులు, హత్యలకు ప్రణాళికలు రూపొందించడంలో నంబాల కేశవరావు దిట్ట. మావో కీలక నేత గణపతి సారథ్యంలోనూ పార్టీలో కీలక ఆపరేషన్లు ఇతనికే అప్పగించేవారు. గణపతి నుంచి బాధ్యతలు స్వీకరించాక, తెలంగాణలో దాడులకు పాల్పడకున్నా.. ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో భీకరదాడులతో పార్టీలో తిరిగి ఉత్తేజం నింపే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇందులో భాగంగానే గతేడాది విశాఖపట్నం జిల్లా అరకు తెలుగుదేశం ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోమ హత్యకు నంబాల పథకం రూపొందించాడని సమాచారం. గత ఏప్రిల్ 9వ తేదీన తొలిదశ పోలింగ్ ముగిశాక ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో బీజేపీ ఎమ్మెల్యే కాన్వాయ్‌ను పేల్చేయడంలో కూడా నంబాల కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నంబాల తలపై రూ.19 లక్షల రివార్డు ఉంది. ఇతని కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర పోలీసులతోపాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కూడా వెదుకుతోంది. కలసి వచ్చిన పోలీసుల నిర్లక్ష్యం..! గడ్చిరోలి దాడిలో పోలీసుల నిర్లక్ష్యంవల్లే ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని విమర్శలు వస్తున్నాయి. పోలీసులను ఉచ్చులోకి లాగి మావోయిస్టులు లక్ష్యాన్ని ఛేదించారు. కుర్ ఖేడా అటవీ ప్రాంతంలో ముందుగా రోడ్డు నిర్మాణ పనులు చేస్తోన్న యంత్రాలు, వాహనాలకు మావోయిస్టులు నిప్పుపెట్టి పోలీసులను ఉచ్చులోకి లాగారు. వాస్తవానికి ఏదైనా ఘటన జరిగితే సమాచారం అందుకున్న వెంటనే తమపై దాడి జరిగే ప్రమాదముందని వెంటనే వెళ్లరు. కానీ, బుధవారం మాత్రం పోలీసులు ఘటనా స్థలానికి సివిలియన్ వెహికల్లో వెళ్లారు. పైగా రోడ్డుకు అడ్డంగా పెట్టిన చెట్లను పక్కకు తీసే ప్రయత్నం చేసి భారీ తప్పిదం చేశారు. అదే సమయంలో అదనుచూసి అత్యంత శక్తిమంతమైన ఐఈడీ అమర్చిన మందుపాతరను పేల్చేయడం ద్వారా 16 మందిని మావోయిస్టులు పొట్టన బెట్టుకున్నారు. -
నిర్లక్ష్యం వల్లే మావోల దాడి
గడ్చిరోలి/న్యూఢిల్లీ: గడ్చిరోలి జిల్లాలో 15 మంది పోలీస్ కమాండోలు, ఓ డ్రైవర్‌ను బలికొన్న ఘటనలో సిబ్బంది ప్రామాణిక నిర్వహణా విధానాన్ని(ఎస్పీవో) పాటించలేదని మహారాష్ట్ర సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. దాదర్‌పూర్ వద్ద 36 వాహనాలను దహనం చేసిన మావోలు పోలీసులు అక్కడకు వచ్చేలా ఉచ్చు పన్నారన్నారు. ఇలాంటి సందర్భాల్లో భద్రతాబలగాలు చిన్న బృందాలుగా విడిపోయి కాలినడకన ఘటనాస్థలికి చేరుకుంటాయని వెల్లడించారు. కానీ గడ్చిరోలిలో క్విక్ రెస్పాన్స్ టీం(క్యూఆర్టీ) కమాండోలు నిబంధనలు పాటించకుండా ఓ ప్రైవేటు వ్యానులో దాదర్పూర్కు బయలుదేరారనీ, తద్వారా మావోలు పక్కా ప్రణాళికతో చేసిన ఐఈడీ దాడిలో ప్రాణాలు విడిచారని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ సందర్భంగా జవాన్లు కనీసం మైన్ప్రూఫింగ్ వాహనాన్ని వాడకపోవడాన్ని ఆయన గుర్తుచేశారు. సాధారణంగా ఇక్కడి భద్రతను, కూంబింగ్ ఆపరేషన్లను పురాదా కేంద్రంగా ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు నిర్వహిస్తాయనీ, అయితే వీరంతా సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఉండిపోవడంతో పోలీస్ కమాండోలకు ఇక్కడి బాధ్యతలు అప్పగించారని చెప్పారు. మావోల దాడి ఘటనను మహారాష్ట్ర డీజీపీ స్వయంగా విచారిస్తారని సీఎం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. దాడిని ఖండించిన ఎన్హెచ్ఆర్సీ: గడ్చిరోలిలో మావోయిస్టుల దుశ్చర్యను జాతీయ మానవహక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) ఖండించింది. అమరుల కుటుంబాలు తగిన రీతిలో నష్టపరిహారం చెల్లించాలని వ్యాఖ్యానించింది. -
పోలీసులపై మావోల పంజా
సాక్షి, ముంబై, హైదరాబాద్, భూపాలపల్లి/ గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కూంబింగ్‌కు బయలుదేరిన పోలీసుల వాహనం లక్ష్యంగా శక్తిమంతమైన ఐఈడీ మందుపాతరను పేల్చారు. ఈ దుర్ఘటనలో మహారాష్ట్ర పోలీస్ విభాగం క్విక్ రెస్పాన్స్ టీం(క్యూఆర్టీ) యూనిట్‌కు చెందిన 15 మంది కమాండోలతో పాటు ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. పేలుడు ధాటికి పోలీసులు ప్రయాణిస్తున్న వ్యాను తునాతునకలైంది. ప్రమాద విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు మావోయిస్టుల ఏరివేతకు అదనపు బలగాలను ఘటనాస్థలికి పంపారు. కాగా, మావోయిస్టుల దుశ్చర్యను ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్, సీఎం ఫడ్నవీస్‌తో పాటు పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాయి. మరోవైపు మావోయిస్టులకు దీటైన జవాబు ఇస్తామని మహారాష్ట్ర డీజీపీ సుబోధ్ జైశ్వాల్ ప్రకటించారు. మహారాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవమైన మే 1నే మావోయిస్టులు ఈ ఘాతుకానికి తెగబడటం గమనార్హం. పక్కాగా వలపన్ని దాడి.. పక్కా ప్రణాళిక ప్రకారమే మావోయిస్టులు కమాండోలను ఉచ్చులోకి లాగి హత్య చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారులు చెబుతున్నారు. గడ్చిరోలి జిల్లాలోని దాదర్‌పూర్ గ్రామ సమీపంలో 136వ జాతీయ రహదారి పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున పలువురు మావోయిస్టులు ఇక్కడకు చేరుకున్నారు. అనంతరం రోడ్డు నిర్మాణ పనులకు వాడుతున్న జేసీబీలు, ట్రాక్టర్లు, డంపర్లు సహా 36 వాహనాలపై కిరోసిన్, డీజిల్ పోసి నిప్పంటించారు. అనంతరం అక్కడి నుంచి అడవిలోకి పారిపోయారు. ఈ సమాచారం అందుకున్న క్యూఆర్టీ కమాండోల బృందం అక్కడకు బయలుదేరింది. వీరి వాహనం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కుర్ఖేదా ప్రాంతంలోని లెన్ధారీ వద్దకు రాగానే రోడ్డుపై చెట్లు పడిపోయి ఉన్నాయి. వెంటనే వ్యాను నుంచి దిగిన కమాండోలు వాటిని తొలగించబోతుండగా అక్కడే నక్కిన మావోలు ఒక్కసారిగా మందుపాతరను పేల్చారు. అనంతరం పేలుడుకు చెల్లాచెదురైన కమాండోలపై అన్నివైపుల నుంచి చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కమాండోలు ఎదురుకాల్పులు జరుపుతూనే ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. సాధారణ వ్యానులో ప్రయాణం.. మావోయిస్టులకు గట్టి పట్టున్న గడ్చిరోలిలో కూంబింగ్ సందర్భంగా భద్రత విషయంలో పోలీస్ కమాండోలు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కీలకమైన ఆపరేషన్‌కు వెళుతూ కూడా వీరంతా మైన్‌ప్రూఫ్ వాహనంలో కాకుండా సాధారణ వ్యానులో ప్రయాణించడాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ విషయమై మహారాష్ట్ర పోలీస్ డీజీపీ సుబోధ్ జైశ్వాల్ మాట్లాడుతూ.. ‘నిఘా వైఫల్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని ఇప్పుడే చెప్పడం సరికాదు. ఈ కూంబింగ్‌కు ఓ ప్రైవేటు వాహనాన్ని ఎందుకు ఎంచుకున్నారు? క్యూఆర్టీ కమాండోల కదలికలపై మావోయిస్టులకు ముందే సమాచారం అందిందా? అనే కోణంలో విచారణ జరుపుతాం. మావోయిస్టులకు దీటుగా బదులివ్వగలిగే సత్తా మాకుంది. భవిష్యత్‌లో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసేందుకే మావోలు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. గడ్చిరోలిలో ఎన్నికలు పూర్తయిందున దాడులకు ఎన్నికలను ముడిపెట్టలేమని స్పష్టం చేశారు. కాగా, 2018, ఏప్రిల్‌లో క్యూఆర్టీ కమాండోలు ఓ ఆపరేషన్‌లో 40 మంది మావోయిస్టులను హతమార్చారు. ఇందుకు ప్రతిగానే మావోలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. దాడి వెనుక తెలంగాణ మావోయిస్టు కమిటీ గడ్చిరోలి దాడికి మావోయిస్టులు చాలాకాలం క్రితమే పథక రచన చేశారని నిఘావర్గాలు తెలిపాయి. ఈ దాడి పథకం అమలులో తెలంగాణ మావోయిస్టు కమిటీ నాయకులే కీలకమని వెల్లడించాయి. ఈ ఆపరేషన్‌లో కనీసం 100 మంది పాల్గొని ఉంటారని పేర్కొన్నాయి. మరోవైపు హైఅలర్ట్ ప్రకటించిన తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు, గ్రేహౌండ్స్ బలగాలను సరిహద్దు ప్రాంతానికి తరలించారు. గడ్చిరోలిలో కూంబింగ్ నుంచి తప్పించుకునేందుకు మావోలు తెలంగాణలోని పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి జిల్లాల్లో ప్రవేశించే అవకాశముండటంతో గాలింపును ముమ్మరం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వీవీఐపీలు, రాజకీయ నేతలను పోలీసులు అప్రమత్తం చేశారు. మహారాష్ట్రలో నెత్తుటి మరకలు మహారాష్ట్రలో భద్రతాబలగాలు లక్ష్యంగా గతంలో మావోయిస్టులు చేసిన దాడులివే.. ► 2009, ఫిబ్రవరి 1: గడ్చిరోలి జిల్లాలోని మోర్కే గ్రామం వద్ద మావోలు జరిపిన దాడిలో గస్తీ బృందానికి చెందిన 15 మంది పోలీసులు దుర్మరణం. ► 2009, మే 21: మహారాష్ట్రలోని మురు మ్ గ్రామం వద్ద మావోల మెరుపుదాడి లో 16 మంది పోలీస్ సిబ్బంది మృతి. ► 2009, అక్టోబర్ 8: గడ్చిరోలిలోని లహేరీ వద్ద ఎదురుకాల్పులు. 17 మంది పోలీసులు దుర్మరణం. ► 2011, మే 19: భమ్రాగఢ్ తాలుకాలో మావోయిస్టుల మెరుపుదాడి. నలుగురు పోలీస్ సిబ్బంది మృతి. ► 2012, మార్చి 27: ధనోరాలో సీఆర్పీఎఫ్ బస్సును పేల్చివేసిన మావోలు. 12 మంది సీఆర్పీఎఫ్ ఎలైట్ యూనిట్ జవాన్లు మృత్యువాత. మరో 28 మందికి తీవ్రగాయాలు. దోషులను వదిలిపెట్టం: మోదీ ‘గడ్చిరోలిలో మన భద్రతాసిబ్బందిపై మావోయిస్టుల హేయమైన దాడిని ఖండిస్తున్నా. ఈ హింసకు పాల్పడ్డ దోషులను వదిలిపెట్టబోం. అమరులైన వీరులకు నా సెల్యూట్. వారి త్యాగాలను ఎన్నటికీ మర్చిపోం. అమరుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అని చెప్పారు. పిరికిపందల చర్య: రాజ్‌నాథ్ ‘తీవ్రమైన నిరాశలో కూరుకుపోయిన మావోలు ఈ పిరికిపంద చర్యకు పాల్పడ్డారు. మావోల దుశ్చర్య విషయమై సీఎం ఫడ్నవీస్‌తో ఇప్పుడే మాట్లాడాను. మహారాష్ట్రకు కేంద్రం అన్నివిధాలుగా అండగా ఉంటుంది. హోంశాఖ వర్గాలు గడ్చిరోలి జిల్లా యంత్రాంగంతో టచ్‌లో ఉన్నాయి. ఈ దుర్ఘటనలో అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వీరి త్యాగం వృధాగా పోదు’ అని తెలిపారు. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా: రాహుల్ ‘గడ్చిరోలీలో మన భద్రతాసిబ్బందిపై దాడి గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. తమ ప్రియమైనవారిని కోల్పోయిన అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ట్వీట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పందిస్తూ..‘ఈ విషాద సమయంలో నేను, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అమరుల కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తున్నాం. దేశం మొత్తం మావోల హింసను వ్యతిరేకిస్తోంది. ఈ హింసాత్మక భావజాలాన్ని కలసికట్టుగా ఓడిస్తాం’ అని పేర్కొన్నారు. దాదర్పూర్లో మావోయిస్టులు తగులబెట్టిన వాహనాలు -
మావోయిస్టుల దాడిలో 15 మంది జవాన్ల మృతి..!
-
గడ్చిరొలి: భద్రతబలగాలు లక్ష్యంగా బాంబు పేలుడు
-
మావోయిస్టుల దాడిలో 15 మంది జవాన్ల మృతి..!
ముంబై : మావోయిస్టులు మరోసారి పేట్రేగిపో్యారు. భద్రతా సిబ్బందిపై పంజా విసిరిరారు. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీ మందుపాతర పెట్టి పేల్చేశారు. ఈ ఘటన మహారాష్ట్రాలోని గడ్చిరోలిలో బుధవారం చోటుచేసుకుంది. భారీ విస్పోటనం కారణంగా వాహనం తునాతునకలైంది. ఈ ప్రమాదంలో 15 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. జాంబిర్‌కేడ అటవీ ప్రాంతం గుండా వెళ్తున్న క్రమంలో ఈ దారుణం జరిగింది. అంతకు ముందు ఇదే జిల్లా కుర్ఖేడా తాలూకా దాదాపూర్ వద్ద మావోయిస్టులు బుధవారం రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన 36 వాహనాలకు నిప్పుపెట్టారు. (చదవండి : గడ్చిరోలిలో మావోయిస్టుల విధ్వంసకాండ) -
గడ్చిరోలిలో మావోయిస్టుల విధ్వంసకాండ
-
గడ్చిరోలిలో మావోయిస్టుల విధ్వంసకాండ
సాక్షి, గడ్చిరోలి: మహారాష్ట్రలో మావోయిస్టులు రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లా కుర్ఖేడా తాలూకా దాదాపూర్ వద్ద మావోయిస్టులు బుధవారం రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన 36 వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ఆ వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. కాగా ఈ ఏడాది జనవరిలో కూడా మావోలు విధ్వంసానికి పాల్పడ్డారు. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు నిలిపివేయాలంటూ మావోయిస్టులు ఈ సందర్భంగా ఘటనా స్థలంలో కరపత్రాలు వదిలి వెళ్లారు. మరోవైపు తమ వాహనాలకు మావోయిస్టులు నిప్పుపెట్టడంతో కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘బస్తర్’ మే సవాల్
మహారాష్ట్రలోని గడ్చిరోలి.. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్.. గిరిజన నియోజకవర్గాలు. అటవీ హక్కుల చట్టంపైనే అన్ని కళ్లూ పెట్టుకున్నారు ఇక్కడి ఆదివాసీలు. భూమి హక్కులు కాపాడే వారికే ఓటేస్తామంటున్నారు. మరోవైపు మావోయిస్టులు ఇక్కడ ఎన్నికల్ని అడ్డుకునేందుకు బెదిరింపులకు, హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. మంగళవారం బస్తర్‌లోని దంతేవాడకు చెందిన బీజేపీ శాసనసభ్యుడు భీమా మాండవి కాన్వాయ్‌పై దాడి జరిపి, ఆయనతో సహా నలుగురు భద్రతా సిబ్బందిని కాల్చి చంపారు. దీంతో మరింత అప్రమత్తమైన ప్రభుత్వం బస్తర్‌లో 80 వేల భద్రతా బలగాలను, డ్రోన్లను మోహరించింది. భారీ ఏర్పాట్ల మధ్య నేడు ఈ రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. గడ్చిరోలిలో అటవీ హక్కుల చట్టం ప్రభావం మహారాష్ట్రలోని గడ్చిరోలి చిముర్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ బలంగా ఢీకొంటున్నాయి. బీజేపీ సిట్టింగ్ ఎంపీ అశోక్ నేతే, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ నామ్‌దేవ్ ఉసెంది మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది. ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలే. మోదీకి వున్న జనాకర్షణ తమ అవకాశాలను మెరుగుపరుస్తుందని బీజేపీ భావిస్తుండగా, ఎన్సీపీ, సీపీఐ పొత్తుతో తాము గట్టెక్కగలమని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఎటపల్లి – భమ్రాగర్ మైనింగ్ బెల్ట్‌లో పెసా, అటవీ హక్కుల చట్టాలు అమలు చేయకపోవడంపై ఇక్కడ ఆదివాసీలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ అంశం ఎన్నికల్లో కీలకం కానున్నదని గడ్చిరోలి మారుమూల ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. గిరిజనుల అటవీ హక్కులు పరిరక్షించకపోవడమనేది బీజేపీకి నష్టదాయకంగా పరిణమించగలదన్న అభిప్రాయం వినపడుతోంది. గడ్చిరోలిలో 90.85 శాతం మంది గ్రామీణులు. 30.50 శాతం మంది ఆదివాసీలు. అభివృద్ధి, మౌలిక సదుపాయాల పరంగా వెనుకబడిన గడ్చిరోలి ప్రజలు రైల్వే కనెక్టివిటీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వీటిపై నేతే 2014లో ఓటర్లకు ఇచ్చిన వాగ్దానం నెరవేరకపోవడం, దీనికి తోడు ఆయన ఓ ఆర్థిక కుంభకోణంలో చిక్కుకోవడం అనే అంశాలు బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. 42 శాతం ఓబీసీల ఓట్లు ఇక్కడి అభ్యర్థి గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. తమ రిజర్వేషన్ కోటాను 19 నుంచి 6 శాతానికి తగ్గించడంపై వీరు ఆగ్రహంతో వున్నారు. కోటాను పునరుద్ధరింపచేస్తామని రెండు ప్రధాన పార్టీల నేతలూ హామీలిచ్చారు. భూమి హక్కులే ‘బస్తర్’ ఎజెండా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో భూమి హక్కే ప్రధాన ఎజెండా. అటవీ హక్కుల చట్టం కింద అడవులపై ఆధారపడి జీవించే హక్కు తమకు ఉందంటున్న ఆదివాసీలు.. తమ భూముల జోలికి రాబోమని ప్రకటించే వారికే ఓటు వేస్తామంటున్నారు. ‘జాతీయవాదం ఇక్కడ ఓట్లు రాల్చదు. జీవనాధారమైన భూమే మాకు అతి ముఖ్యం’ అంటున్నారు స్థానికులు. అడవుల్లో నివసించేందుకు అనర్హులైన ఆదివాసీలను దురాక్రమణదారులుగా గుర్తించి జూలై లోపు ఖాళీ చేయించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఇక్కడి ఆదివాసీలు మండిపడుతున్నారు. ఇటీవల నిరసన ప్రదర్శనలు జరిపి, కరపత్రాలు పంచారు. ఏ ఒక్కరినీ అడవుల నుంచి ఖాళీ చేయించబోమని ముఖ్యమంత్రి భాగెల్ హామీ ఇచ్చిన తర్వాతే వారు శాంతించారు. మోదీ ప్రభుత్వం కోర్టులో ఆదివాసీల తరఫున తన వాదన సరిగా వినిపించలేకపోయిందని, వారి హక్కులకు రక్షణ కల్పించలేకపోయిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కొంటా, బస్తర్, చిత్రకూట్, కొండగావ్, జగదల్పూర్, దంతేవాడ, బీజీపూర్, నారాయణపూర్ అనే ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న బస్తర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎస్టీ జనాభా 70 శాతం. బీజేపీ తరఫున ఆ పార్టీ బస్తర్ జిల్లా నేత బైదురామ్ కశ్యప్.. కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ లీడర్ దీపక్ బైజ్‌తో తలపడుతున్నారు. 1998 నుంచి బీజేపీ ఖాతాలో వున్న బస్తర్‌ను ఎలాగైనా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో వున్న కాంగ్రెస్.. ఈసారి చిత్రకూట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన దీపక్‌కు టికెట్ ఇచ్చింది. బీజేపీ అభ్యర్థి కంటే ఈ యువకుడికే ప్రజాదరణ ఎక్కువ వున్నట్టు స్థానికులు చెబుతున్నారు. గతంలో టాటా గ్రూప్ కోసం బీజేపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని తిరిగిచ్చేయడమనేది ఆదివాసీల్లో కాంగ్రెస్ ఆదరణకు దోహదపడగలదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బస్తర్ సిట్టింగ్ ఎంపీ దినేశ్ కశ్యప్‌పై స్థానికుల్లో చోటుచేసుకున్న వ్యతిరేకత కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా మారనుంది. పలు సమస్యలతో సతమతమవుతున్న నియోజకవర్గాన్ని ఎంపీ ఏనాడూ సందర్శించలేదని ఆదివాసీలు విమర్శిస్తున్నారు. కేంద్రంపై ఉన్న వ్యతిరేకతకు తోడు గత మూడు మాసాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగైన పనితీరు కనబరచడం, ప్రత్యేకించి రుణమాఫీ అమలు చేయడం, బీజేపీ సర్కారు స్వాధీనం చేసుకున్న గిరిజనుల భూములను తిరిగివ్వడం వంటి చర్యలు తమకు లాభిస్తాయనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ నేత కవసి లక్మా. మరోవైపు కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాలపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బస్తర్ లోక్‌సభ స్థానంలో దంతేవాడ మినహా మిగిలిన సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎన్నికలకు ముందు దంతేవాడలో మావోయిస్టులు పేల్చిన మందు పాతరలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి మృతి చెందారు. బీఎస్పీకి చెందిన ఆయుతు రామ్ మండవి, సీపీఐకి చెందిన రాము రామ్ మౌర్య సహా మొత్తం ఏడుగురు అభ్యర్థులు ఇక్కడ బరిలో వున్నారు. మొబైల్ ఫోన్లు వాడుకోగల పరిస్థితి కూడా ఈ నియోజకవర్గంలో అంతగా లేదు. రహదారులకు దగ్గరగా వుండే కొన్ని ఇళ్లలోనే ఇక్కడ టీవీలుంటాయి. బీజేపీ, కాంగ్రెస్లంటే ఇక్కడ పువ్వు, చేతి గుర్తులే. మావోయిస్టుల ఆదేశాల ప్రభావమే ఎక్కువ. మావోల బెదిరింపులు ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు ఏర్పాటు చేసిన బ్యానర్లను పోలీసులు కొన్ని ప్రాంతాల్లో తొలగించి, దగ్ధం చేశారు. మరోవైపు మావోల భయంతో అభ్యర్థులు భమ్రాగర్, సిరోంచ, అహేరి, ధనోరా, ఎటపల్లి సహా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రచారానికి దూరంగా వున్నారు. బెదిరింపుల నేపథ్యంలో జనం ఎన్నికల సభలకు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు నేతే. ఉసెంది మారుమూల ప్రాంతాల్లో కొద్ది మేర ప్రచారం జరిపారు. మావోయిస్టుల హింసకు సంబంధించి ఇక్కడ 2014లో 15 కేసులు, 2009లో 18 కేసులు నమోదయ్యాయి. 2004లో ఎదురు కాల్పుల ఘటనలు సహా మొత్తం 23 హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మందు పాతర పేలుళ్లలో ఇద్దరు పోలీసులు మరణించారు. గత ఏప్రిల్‌లో భద్రతా దళాలు కస్నాసుర్ గ్రామం వద్ద 40 మంది అనుమానిత మావోయిస్టులను మట్టుబెట్టాయి. ఇందుకు ప్రతీకారంగా మావోలు ఇన్ఫార్మర్లుగా ముద్ర వేసి, అరడజను మంది గ్రామస్తులను చంపేశారు. -
భారీ ఎన్కౌంటర్ : 8మంది మావోయిస్టులు మృతి
గడ్చిరోలి : మహారాష్ట్ర గడ్చిరోలి సవేగామ్ అటవీ ప్రాంతం జరిగిన భారీ ఎన్కౌంటర్ 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. సవేగామ్ అటవీ ప్రాంతంలో గురువారం పోలీసులకు మావోయిస్టులకు మధ్య హోరా హోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. మావోల కదలికల గురించి సమాచారం అందుకున్న బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. ఈ భారీ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు దళానికి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. -
‘వారి శరీరాల్లో విష పదార్ధాలు లేవు’
ముంబై, నాగ్‌పూర్: గడ్చిరోలి ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల శరీరంలో ఎలాంటి విష పదార్ధాలు లేవని నాగపూర్ ప్రభుత్వ ఫోరెన్సిక్ ప్రయోగశాల వైద్యులు తెలిపారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఏప్రిల్ 23న ఇంద్రావతి నది వద్ద జరిపిన ఎన్కౌంటర్లో 34 మంది మవోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. తినే ఆహరంలో విషం కలిపి వారిని ఎన్కౌంటర్ చేశారని పలు ప్రజా సంఘాలు ఆరోపించాయి. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు పోస్ట్‌మార్టం నిర్విహించిన 18 మృతదేహాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. వారి శరీరంలో ఎలాంటి విష పదార్ధాలు లేవని నాగపూర్ వైద్యులు దృవీకరించారు. భద్రతా దళాలకు, మవోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లోనే వారు మృతిచెందారని తెలిపారు. ఏప్రిల్‌లో రెండు రోజుల వ్యవధిలో జరిగిన వరుస ఎన్కౌంటర్లలో 40కి మందికి పైగా మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. -
‘మహా’ ఎన్కౌంటర్.. రక్తపుటేరుగా ఇంద్రావతి
గడ్చిరోలి ; మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృత దేహాలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. గడ్చిరోలి వద్ద ఇంద్రావతి నదిలో మరో రెండు మృతదేహాలను పోలీసు బలగాలు వెలికి తీశాయి. దీంతో వరుస ఎన్కౌంటర్లలో మృతుల సంఖ్య 42కి చేరింది. ఇంతకు ముందు నది నుంచి 15 మృతదేహాలను వెలికి తీయటం తెలిసిందే. తప్పించుకునే మార్గం లేకే?... నది తీర ప్రాంతంలో మావోయిస్టులు గుడారాలు వేసుకున్న ఆనవాలు, ఘటనాస్థంలో కొన్ని వస్తువులు దర్శనమిచ్చాయి. ఎన్కౌంటర్ నేపథ్యంలో తప్పించుకునే మార్గం లేక మావోయిస్టులంతా నదిలోకి దూకేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మొసళ్లు, చేపలు పీక్కుతినటంతో మృతదేహాల గుర్తింపు కష్టతరంగా మారింది. మరోవైపు మృతుల్లో నలుగురు దళ కమాండర్లు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లో ఆహెరి, పెరిమిళ దళాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లేనని పోలీసులు ప్రకటించారు. మృతుల్లో పౌరులు లేరు... ఇక మృతుల్లో సాధారణ పౌరులు ఉన్నట్లు వస్తున్న వార్తలను తడ్‌గావ్ ఏఎస్సై సమీర్ దబాడే తోసిపుచ్చారు. ‘ఒకవేళ పౌరులు చనిపోయి ఉంటే వారి తరపు బంధువులుగానీ, ప్రజాసంఘాలుగానీ, నేతలుగానీ ఫిర్యాదు చేసి ఉండేవారు. కానీ, అలా జరగలేదు. చనిపోయివారంతా మావోయిస్టులే’ అని సమీర్ మీడియాకు వెల్లడించారు. ఇంద్రావతి నది పరిసరాల్లో కూంబింగ్ కొనసాగుతోందని.. మరిన్ని మృతదేహాలు బయటపడే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. మృతదేహాలను హెలికాఫ్టర్‌లో తరలిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలు ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో శనివారం నక్సల్స్ జరిపిన దాడిలో సీఆర్పీఎఫ్ ఏఎస్సై ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆ వెంటనే నక్సల్స్ కోసం భారీ కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభమైంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు సంయుక్తంగా కిలోమీటర్ల మేర అడవిని జల్లెడపట్టాయి. గడ్చిరోలి జిల్లా ఏటపల్లి వద్ద శనివారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో 16 మంది మావోయిస్టులు చనిపోయారు. ఆదివారం రాత్రి సుక్మా జిల్లాలో 5 గురు.. రాజారాం ఖాండ్లా అడవి(గడ్చిరోలి)లోని జిమాల్‌గట్ట ప్రాంతంలో 4గురు మృతి చెందగా.. మంగళవారం ఉదయం గడ్చిరోలి జిల్లా ఇంద్రావతి నదీ తీరంలో 15 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. -
కొనసాగుతున్న కూంబింగ్: ప్రాజెక్టుల వద్ద నిఘా
గడ్చిరోలి: మహారాష్ట్ర - చత్తీస్గడ్ సరిహద్దులోని ఇంద్రావతి నది పరిసరాల్లో భద్రతాదళాల కూంబింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తాజా పరిణామాలతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతమైన కాళేశ్వరం, మహదేవ్‌పూర్‌లలో పోలీసుల తనిఖీలు చేస్తున్నారు. ప్రాజెక్టుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు. కాగా వరుస ఎన్కౌంటర్లలో 39 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇంద్రావతి నదిలో లభ్యమైన మృతదేహాలను మొసళ్లు పీక్కుతిన్నాయి. దీంతో మృతదేహాల గుర్తింపు కష్టమని అధికారులు అంటున్నారు. మృతుల్లో నలుగురు దళ కమాండర్లు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. తాజాగా ఎన్కౌంటర్లో ఆహెరి, పెరిమిళ దళాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. -
39కి చేరిన మృతుల సంఖ్య
కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో నాలుగు రోజులుగా భయానక వాతావరణం నెలకొంది. దేశ చరిత్రలోనే ఒకేసారి రెండు ఎన్కౌంటర్లలో 37 మంది మావోయిస్టులు నేలకొరిగారు. తాజాగా బుధవారం ఇంద్రావతి నదిలో మరో రెండు మృతదేహాలు లభ్యమైనట్లు తెలిసింది. దీంతో గడ్చిరోలి ఎన్కౌంటర్ల మృతుల సంఖ్య 39కి చేరింది. ఈ నెల 22న ఆదివారం ఉదయం గడ్చిరోలి జిల్లాలోని బామ్రాగఢ్ తాలూకా కస్నాగూడ అటవీ ప్రాంతంలోని బోరియా ప్రదేశంలో మావోయిస్టులపై పక్కా సమాచారంతో సీ–60 పోలీసులతోపాటు మరో ఐదు కంపెనీల పోలీసు బలగాలు ముప్పేట దాడికి దిగాయి. ఈ దాడిలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మృతదేహాలు మరుసటిరోజు ఇంద్రావతినదిలో తేలియాడుతూ కనిపించిన విషయం తెలిసిందే. ఈ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని గడ్చిరోలి జిల్లా ఆస్పత్రికి హెలికాప్టర్లో తరలించారు. ఈ నెల 23న గడ్చిరోలి జిల్లాలోని అహేరి తాలూ కాలోని రాజారాంఖాండ్ల పరిధిలోని జిమ్మటగట్టుపై జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో మృతుల సంఖ్య మొత్తం 37గా పోలీసులు ప్రకటించారు. ఇంద్రావతి నదిలో మరో రెండు మృతదేహాలు బయటపడటంతో మృ తుల సంఖ్య 39కి చేరింది. మృతుల్లో ఇప్పటి వరకు 20 మంది మహిళలు, 19 మంది పురుషులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గడ్చిరోలిలో పోలీసుల సంబురాలు దేశ చరిత్రలోనే భారీ ఎన్కౌంటర్ చేసిన సీ–60 పోలీసులు, ఇతర పోలీసులు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సంబురాలు చేసుకుంటున్నాయి. పేట్రేగుతున్న రాజ్యహింస: వరవరరావు చిట్యాల(భూపాలపల్లి): దేశంలో రాజ్యహింస పేట్రేగిపోతోందని విరసం నేత వరవరరావు అన్నారు. గడ్చిరోలిలో ఈ నెల 22న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ గడ్చిరోలి డివిజన్ కమిటీ సభ్యుడు రౌతు విజేందర్ అలియాస్ శ్రీకాంత్ మృతదేహం మంగళవారం అర్ధరా త్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని తనస్వగ్రామం చల్లగరిగెకు తరలించారు. బుధవారం విరసం నేత వరవరరావు అక్కడికి చేరుకుని విజేందర్ మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి జోహార్లు అర్పించారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో పాల్గొన్నారు. గడ్చిరోలి ఎన్కౌంటర్ బూటకమని, ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఏకపక్షంగా కాల్పులు జరిపి నలుగురు డివిజన్ కార్యదర్శులుసహా 37 మందిని పొట్టనబెట్టుకున్న రాక్షస ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలన్నారు. ఎన్కౌంటర్లో తెలంగాణ గ్రేహౌండ్స్ హస్తం ఉందన్నారు. -
38 ఏళ్ల ఉద్యమ చరిత్రలో భారీ ఎన్కౌంటర్
-
ముప్పేట దాడిలో 37 మంది మృతి
సాక్షి, హైదరాబాద్/కరీంనగర్ : మహారాష్ట్రలో 3 రోజుల పాటు జరిగిన వరుస ఎన్కౌంటర్లు మావోయిస్టు పార్టీని కోలుకోలేని దెబ్బతీశాయి. గడ్చిరోలి జిల్లా బామ్రాగఢ్–ఇంద్రావతి పరీవాహక ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లలో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 37కు చేరింది! వీరిలో 19 మంది మహిళలున్నారు. 38 ఏళ్ల పీపుల్స్‌వార్, మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఇదే భారీ ఎన్కౌంటర్! ఈ దెబ్బకు స్థానిక, జిల్లా, డివిజన్ కమిటీలు తుడిచి పెట్టుకుపోయినట్టు భావిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో మల్కన్‌గిరి వద్ద ఎదురుకాల్పుల్లో 26 మంది మావోలు మృతి చెందడం తెలిసిందే. మూడు బృందాలతో ముప్పేట దాడి సౌత్ గడ్చిరోలిలోని కాసన్‌పూర్ సమీపంలో బామ్రాగఢ్–బొరియా అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి 40 మందితో మావోయిస్టు రీజియన్ కమిటీ సమావేశం జరుగుతోందన్న పక్కా సమాచారంతో సీఆర్పీఎఫ్, కోబ్రా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. ఎదురు కాల్పులు జరుగుతుండగా గుంపుగా పారిపోయే ప్రయత్నంలో 16 మంది మావోలు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతావారిని తరుముతూ ధనోరా, బామ్రాగడ్, జిమ్మలగట్టు జింగనూరు, ఇంద్రావతి పరివాహక ప్రాంతాలను దిగ్బంధించి బలగాలు జరిపిన కాల్పుల్లో మరో 15 మంది మరణించారని పోలీసు వర్గాలు తెలిపాయి. అంతకుముందు సోమవారం సాయంత్రం జిమ్మలగట్టు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మరో ఆరుగురు మావోలు మృతిచెందారు. ఈ మొత్తం ఆపరేషన్లలో 37 మంది మావోయిస్టులు మరణించారని మహారాష్ట్ర యాంటీ నక్సల్స్ స్క్వాడ్ ఐజీ కనకరత్నం వెల్లడించారు. ఆపరేషన్ తాడ్గాంలో 31 మంది, ఆపరేషన్ రాజరాంలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని మంగళవారం రాత్రి విలేకరులకు తెలిపారు. ‘‘దక్షిణ గడ్చిరోలిలో మావో దళాలను పూర్తిగా తుడిచిపెట్టాం. ఐరి, పరిమల, సిరొంచ, కొట్ట దళాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రెండు ఏకే 47, రెండు ఎస్ఎల్ఆర్, ఒక 3.3, ఐదు 8 ఎంఎం, ఆరు 12 ఎంఎం తుపాకులు, భారీగా మందుగుండు స్వాధీనం చేసుకున్నాం’’ అని చెప్పారు. అగ్రనేతలనుకుని హంగామా... ఏకంగా 37 మంది మావోలు మరణించడం, సీఆర్పీఎఫ్–కోబ్రా బలగాలు భారీగా హంగామా నేపథ్యంలో అగ్ర నేతలు నేలకొరిగారన్న వార్తలు విన్పించాయి. అయితే మృతుల్లో రీజినల్ కమిటీ సభ్యులు, గడ్చిరోలి నార్త్, సౌత్ జిల్లా కమిటీలు, స్థానిక కమిటీ సభ్యులే ఉన్నారని పోలీసులు చెప్పారు. ఆదివాసీలను తీసుకెళ్లి చంపారని, పార్టీ సభ్యులుగా ముద్రవేసి ఏకపక్షంగా హతమార్చారని విప్లవ సంఘాలు దుయ్యబట్టాయి. 17 మంది గుర్తింపు 37 మంది మృతుల్లో 17 మంది పేర్లను మంగళవారం రాత్రి పోలీసులు విడుదల చేశారు. ఈ 17 మందిపైనే 1.6 కోట్ల రివార్డుంది! వీరిలో ప్లాటూన్ దళ కమాండర్ క్రాంతి తదితరులున్నారు. 1. క్రాంతి - పశ్చిమబస్తర్ 2. లత ఉరఫ్ మాధురి దల్లువడ్డే – మిట్టుగువంచా 3. కార్తీక్ ఊయికే – పామ్కేకటేజరీ 4. నందు ఉరఫ్ విక్రమ్ ఉరఫ్ వాసుదేవ్బిచ్చాఆత్రమ్ – అర్కపల్లి 5. జయశీల గావ్డె – పినిగుండా 6. గుర్తు తెలియని మహిళ 7. సాయినాథ్ ఉరఫ్ డోలేష్మాదీఆత్రమ్ – గట్టెపల్లి 8. రాజేశ్ ఉరఫ్ దామారాయిస్ నరూటీ – మురగావ్ 9. సుమన్ ఉరఫ్ జన్నీకుట్టేటీ – పడ్తన్ 10. శాంతాబాయి ఉరఫ్ మంగ్లీపదా – గంగలూర్ 11. నగేష్ ఉరఫ్ దుల్సాకన్నా నరోటే – జారేవాడా 12. తిరుపతి ఉరఫ్ ధర్మ్పుంగాటి – కేహకాపరి 13. శ్రీకాంత్ ఉరఫ్ దుల్సా ఉరఫ్ రానునారోటే – మోర్కండీ 14. రాజు ఉరఫ్ రమేశ్ ఉరఫ్ నరేష్కుట్కే – జిజగావ్ 15. సన్ను ఉరఫ్ బిచ్చుబొట్కాగావ్డే – కోరెపల్లి 16. శ్రీను ఉరఫ్ శ్రీకాంత్ ఉరఫ్ రావత్ విజేంద్ర – చల్లాగ్రీగ్ 17. అనిత ఉరఫ్ బాలీరాంజీ మడావీ – కరంపల్లి -
నక్సల్స్ నెత్తుటిధార.. 40కి పెరిగిన మృతులు
గడ్చిరోలి: వేసవికాలంలో పలుచబడ్డ అడవిలో నెత్తుటిధారలు ఆగడంలేదు. మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఒకదానితర్వాత మరొకటి ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. గడ్చిరోలి, సుక్మా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం నుంచి మంగళవారం వరకు చోటుచేసుకున్న ఎన్కౌంటర్లలో సుమారు 40 మంది మందికి మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. నక్సల్స్ నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని, ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఇంద్రావతి తీరంలో 15 మృతదేహాలు.. ►అసలేం జరిగింది?: ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో శనివారం నక్సల్స్ జరిపిన దాడిలో సీఆర్పీఎఫ్ ఏఎస్సై ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆ వెంటనే నక్సల్స్ కోసం భారీ కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభమైంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు సంయుక్తంగా కిలోమీటర్ల మేర అడవిని జల్లెడపట్టాయి. ఈ క్రమంలో.. ►శనివారం రాత్రి.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఏటపల్లి వద్ద చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో 16 మంది మావోయిస్టులు చనిపోయారు. ►ఆదివారం రాత్రి.. ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లాలోని పూసుపాల్ సమీపంలోని అడవిలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 5గురు నక్సల్స్ చనిపోయారు. ►సోమవారం సాయంత్రం..గడ్చిరోలి జిల్లా రాజారాం ఖాండ్లా అడవిలోని జిమాల్‌గట్ట ప్రాంతంలో ఎదురుకాల్పులు జరగడంతో 4గురు మావోయిస్టులు మరణించారు. ►మంగళవారం ఉదయం.. గడ్చిరోలి జిల్లా ఇంద్రావతి నదీ తీరంలో 15 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. -
గడ్చిరోలిలో మరో ఎన్కౌంటర్
నాగ్‌పూర్/చర్ల: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన తాజా ఎన్కౌంటర్లో నలుగురు నక్సల్స్ మరణించారు. అదే జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది నక్సల్స్ మృతి చెందిన సంగతి తెలిసిందే. గడ్చిరోలి జిల్లా రాజారాం ఖాండ్లా అడవిలోని జిమాల్‌గట్ట ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని ఐజీ శరద్ షెలార్ తెలిపారు. అయితే ఎంతమంది మరణించారన్న దానిపై కచ్చితమైన లెక్క లేకపోయినా కనీసం నలుగురు మరణించారని చెప్పారు. కాగా ఆదివారం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి మరికొన్ని నక్సల్స్ మృతదేహాలు స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే కూంబింగ్ ఆపరేషన్‌కు భారీ వర్షాలు అడ్డంకిగా మారాయని ఐజీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ఐదుగురు మావోల మృతి సరిహద్దు చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన హోరాహోరీ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. సుకుమా జిల్లాలోని పూసుపాల్ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తోన్న పోలీసులపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. -
భారీ ఎన్కౌంటర్ ;16 మంది మావోల మృతి
-
మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్కౌంటర్
-
భారీ ఎన్కౌంటర్; 13 మంది మావోయిస్టుల మృతి
గడ్చిరోలి: ఛత్తీస్గడ్-మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సీఆర్పీఎఫ్ బలగాల కాల్పుల్లో 13 మంది మావోయిస్టులు మరణించారు. గడ్చిరోలి జిల్లా బోరియా అటవీప్రాంతంలోని ఏటపల్లి వద్ద ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఎలా జరిగింది?: ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో శనివారం నక్సల్స్ జరిపిన దాడిలో సీఆర్పీఎఫ్ ఏఎస్సై ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆ వెంటనే నక్సల్స్ కోసం భారీ కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభమైంది. సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు కిలోమీటర్ల మేర అడవిని జల్లెడపట్టాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఏటపల్లి వద్ద.. బలగాలకు సాయుధ నక్సల్స్ తారాసపడ్డారు. దీంతో ఎదురుకాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. మొత్తం 13 మంది తీవ్రవాదులు చనిపోయారని, వారు ఎవరనేది ఇంకా గుర్తించాల్సిఉందని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. -
గడ్చిరోలిలో ఎన్కౌంటర్
సాక్షి, మహారాష్ట్ర: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మంగళవారం ఎన్కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దులోని సిరికొండ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళా నక్సలైట్లు ఉన్నారు. -
గడ్చిరోలీ జిల్లా గిన్నిస్ రికార్డు
గడ్చిరోలీ: పోలీసులు, మావోల మధ్య ఎదురుకాల్పులతో వార్తల్లో నిలిచే మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లా అరుదైన ఘనత సాధించింది. గడ్చిరోలీలో శనివారం నిర్వహించిన పుస్తక పఠన కార్యక్రమంలో దాదాపు 7,000 మంది ప్రజలు పాల్గొనడంతో, అత్యధికులు పాల్గొన్న కార్యక్రమంగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. గతేడాది టర్కీలోని అంకారాలో 5,754 మందితో జరిగిన పుస్తక పఠన కార్యక్రమమే ఇప్పటివరకూ తొలిస్థానంలో ఉండేది. మావోల హింసకు పేరుగాంచిన గడ్చిరోలీకి ప్రపంచవ్యాప్తంగా సానుకూల గుర్తింపును తీసుకురావడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ‘గాంధీ విచార్ ఆనీ అహింసా’(గాంధీ ఆలోచనలు–అహింస) అనే మరాఠీ పుస్తకంలోని ఓ భాగాన్ని ప్రజలు చదివినట్లు వెల్లడించారు. జిల్లాలోని విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ అహిర్‌తో పాటు ప్రత్యేక అతిథులుగా గిరిజన నేత బిర్సాముండా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. -
మందుపాతర పేల్చిన మావోయిస్టులు
-గడ్చిరోలి బూటకపు ఎన్కౌంటర్ బూటకమని వెల్లడి -ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ బంద్ పాటించాలని వాల్‌పోస్టర్లు చర్ల ఖమ్మం జిల్లా చర్ల మండల కేంద్రంలోని ఆనంద్‌కాలనీ సమీపంలో మావోయిస్టులు శనివారం రాత్రి మందు పాతర పేల్చారు. ఈ నెల 22న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహిరీ పోలీస్‌స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ జూన్ 26న తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని మండల కేంద్రంలోని ఆనంద్‌కాలనీ (చర్ల-ఉంజుపల్లి మార్గం) వద్ద రహదారి పక్కన పెద్ద ఎత్తున వాల్‌పోస్టర్లు వేయడంతోపాటు మందుపాతరను పేల్చారు. గతంలో పలు సందర్భాల్లో మావోయిస్టులు బంద్ పిలుపునివ్వగా పెద్దగా స్పందన లేకపోవడంతో ఈ సారి బంద్‌ను విజయవంతం చేసేందుకు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు తెలిపారు. ప్రధాన రహదారి (బీటీ రోడ్) పక్కనే మందు పాతరను ఏర్పాటు చేసిన మావోయిస్టులు సుమారు 50 మీటర్ల దూరం వరకు విద్యుత్ వైరును ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి దీనిని పేల్చినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ పేరిట పెద్ద ఎత్తున వాల్‌పోస్టర్లు సైతం అంటించారు. మావోయిస్టు పార్టీ గడ్జిరోలి జిల్లా కమిటీ సభ్యుడు చార్లెస్ అలియాస్ శోభన్, ఏరియా కమిటీ సభ్యుడు ముకేష్‌తోపాటు మరో పీఎల్జీఏ సభ్యుడిని ఇన్ఫార్మర్ల సమాచారంతో పట్టుకొని కాల్చి చంపి ఎన్కౌంటర్ కథ అల్లారని, దీనిని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు తీవ్రంగా ఖండించాలని కోరారు. కాగా, చర్ల పోలీస్‌స్టేషన్‌కు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోనే మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడడంతో అధికారులు ఉలిక్కి పడ్డారు. -
సీఎం కేసీఆర్ కు నిరసన సెగ
గడ్చిరోలి(మహారాష్ట్ర): కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమిపూజ చేసి పక్కనే ఉన్న కన్నెపల్లి గ్రామాన్ని పరిశీలించడానికి వెళ్లిన తెలంగాణ కే చంద్రశేఖర రావుకు సోమవారం నిరసన సెగ తగిలింది. మేడిగడ్డ-కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రాంత రైతులతో కాంగ్రెస్ నేతలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. మహారాష్ట్ర మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అహేరీ దీపక్దాదా ఆత్రం, కాంగ్రెస్ నేతలు రైతులతో పోచంపల్లి తరలివచ్చి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నల్లజెండాలను ప్రదర్శించారు. సీఎం కేసీఆర్ నదికి అవతలి ఒడ్డునున్న గ్రామంలో పర్యటిస్తుండటంతో పోలీసులు కాంగ్రెస్ నాయకులను, రైతులను నది దాటడానికి అంగీకరించలేదు. ప్రాజెక్టు కారణంగా దాదాపు 22 గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉండటంతో నిర్మాణం ఆపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
ఇన్ఫార్మర్ల పేరిట హత్యల పరంపర
- ఇప్పటి వరకూ నక్సల్స్ చేతిలో 493 మంది హతం - మహారాష్ట్రలో 1980 నుండి నక్సల్స్ కార్యకలాపాలు గడ్చిరోలి : రాష్ట్రంలో మూడు దశాబ్దాలుగా నక్సల్స్ హత్యల పరంపర కొనసాగుతోంది. ప్రైవేట్ కాంట్రాక్టర్లు, సర్పంచ్‌లు, జిల్లాపరిషత్, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా పలువురు సాధారణ పౌరులను సైతం పోలీస్ ఇన్ఫార్మర్ల పేరిట తీవ్రవాదులు హత్య చేశారని పోలీసులు చెబుతున్నారు. 1980 నుండి మహరాష్ట్రలో నక్సలైట్ ఉద్యమం ఊపందుకోంది. అప్పటి నుంచి గడ్చిరోలి, చంద్రాపూర్, గోండియా జిల్లాల్లో సుమారు 493 మంది నక్సల్స్ చేతిలో హత్యకు గురైనట్లు రాష్ట్ర నక్సల్స్ వ్యతిరేక పోలీసు విభాగం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఒక్క గడ్చిరోలి జిల్లాలోనే అత్యధికంగా (451) మంది ఉన్నారు. గోండియాలో(33), చంద్రాపూర్‌లో(9) మంది హతులయ్యారు. ఫిబ్రవరి 1985 నుంచి జూలై, 2014 మధ్య కాలంలోనే నక్సలైట్లు ఎక్కువగా సాధారణ పౌరులను పొట్టనపెట్టుకున్నారని ఆ నివేదిక తెలిపింది. ఈ మూడు జిల్లాల్లో ఇన్ఫార్మర్ల పేరుతో 206 మంది,188 మంది సాధారాణ పౌరులు, 24 మంది పోలీస్ పటేళ్లు, 14 మంది లొంగిపోయిన నక్సల్స్, 5గురు మాజీ పోలీస్ పటే ళ్లను హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సిరోంచ దళం పేరుతో షురూ నక్సలైట్ ఉద్యమం మొట్టమొదటి సారి గడ్చిరోలిలో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి నదిని దాటి మహారాష్ట్రలోని సిరోంచ తాలుకాలోని లంకచేన్ గ్రామానికి విస్తరించింది. ఇక్కడ నుండి సిరోంచ దళం పేరుతో నక్సలైట్లు తమ కార్యకలాపాలను కొనసాగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం 260 మంది క్యాడర్ 17 నుండి 19 దళాలుగా గడ్చిరోలి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటిదాకా 10 మంది సాధారణ పౌరులను నక్సల్స్ హతమార్చినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పోలీస్ ఎన్కౌంటర్లతో తీవ్రవాదులకు గట్టి ఎదురె దెబ్బ తగిలింది. వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కానీ, అంతకంతకూ నక్సలైట్లు ఆంధ్రప్రదేశ్ నుండి మహరాష్ట్రలోకి చొరబడుతున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ వారాన్ని నక్సల్స్ ‘అమరవీరుల వారోత్సవం’గా ప్రకటించారని పేర్కొన్నారు. -
మైనర్‌పై సామూహిక అత్యాచారం
గడ్చిరోలి: జిల్లాలోని ఎల్షిల్ గ్రామానికి చెందిన మైనర్ బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఎల్షిల్కు చెందిన 12 యేళ్ల బాలిక పండ్లు అమ్ముకునేందుకు శనివారం అల్లాపల్లి వెళ్లింది. సాయంత్రం వరకు పండ్ల అమ్మిన తర్వాత ఆమె బస్టాండ్‌కు వచ్చేసరికి బస్సు వెళ్లిపోవడంతో తన గ్రామానికి వెళ్లేందుకు వేచి చూస్తోంది. కాగా, బైక్‌పై వచ్చిన బాలికతో బాగా పరిచయమున్న కిషోర్ మండల్(23), ప్రదీప్ బిష్వాస్(22) అనే ఇద్దరు యువకులు ఆమెకు లిఫ్ట్ ఇస్తామని నమ్మించి తీసుకెళ్లి సమీప అటవీప్రాంతంలో అత్యాచారానికి ఒడిగట్టారు. తప్పించుకుని వచ్చిన ఆమె జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు అహెరీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కిషోర్ మండల్‌ను అరెస్టు చేసి, రెండో నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
పోలీసుల బస్సుపై మావోయిస్టుల కాల్పులు
గడ్చిరోలి, న్యూస్‌లైన్: గడ్చిరోలి జిల్లాలో ఎన్నికల బందోబస్తు నిర్వహించి తిరిగివె ళ్తున్న పోలీసుల బస్సుపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనతో అవాక్కయిన పోలీసులు కూడా నిలదొక్కుకుని ఎదురుకాల్పులు జరిపారు. అయితే సంఘటనలో ఒక పోలీసు అధికారి మరణించగా మరో అయిదుగురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు అందించిన వివరాల మేరకు అహేరి తాలూకాలోని ఆషా గ్రామం సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎన్నికలను అడ్డుకుంటామని మావోయిస్టులు ఇంతకుముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వారు జిల్లాలోని తమ పట్టున్న ప్రాంతాల్లో కరపత్రాలను పంచడంతోపాటు అనేక ప్రాంతాల్లో బోర్డులను కూడా ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీస్ యం త్రాంగం జిల్లాలో ఎన్నికల నిర్వహణకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసింది. అయితే జిల్లాలో తమ పట్టును నిరూపించుకునేందుకు గురువారం పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను అపహరిం చేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. బేస్ క్యాంప్‌పై కాల్పులు జరిపారు. అయితే పెద్ద మొత్తం లో ఉన్న పోలీసుల బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో పారిపోయారు. అనంతరం ఎన్నికల విధులు నిర్వహించి సామగ్రి సహా పోలీసులు, సిబ్బంది బస్సులో వెళ్తుండగా ఊహిం చని విధంగా మావోయిస్టులు మరోసారి పథకం ప్రకారం నలుమూలల నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పోలీసులు సైతం ఎదురుకాల్పులు ప్రారంభించడంతో దట్టమైన పొదలను ఆధారంగా చేసుకుని అక్కడి నుంచి పారిపోయారు. గంటసేపు రెండు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. కాగా, ఈ కాల్పు ల్లో గిరిధర్ ఆత్రమ్ అనే పోలీసు మరణిం చగా రమేష్, సందీప్ కొడపే, మురళి వెలదే, ఆమర్దీప్ బురసే, ప్రకాస్ చికారామ్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరిని హెలికాప్టర్ సహా యంతో నాగపూర్‌కు తరలించారు. ఈ ఘటన అనంతరం అక్కడికి అదనపు బలగాలు చేరుకుని ఆయా ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి. -
గడ్చిరోలి ఎన్కౌంటర్ బూటకం: ఏపీసీఎల్సీ
గత వారం గడ్చిరోలిలో జరిగినది బూటకపు ఎన్కౌంటర్ అని ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల కమిటీ మండిపడింది. ఆ సంఘటనలో పాల్గొన్న పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈనెల 18వ తేదీన మావోయిస్టులకు, సి-60 కమాండో దళాలకు కోర్చి తాలూకా బెట్కార్తి గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. అనంతరం ఏపీసీఎల్సీ నిజ నిర్ధారణ బృందం అక్కడకు వెళ్లి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ బృందంతో కలిసి సంఘటనపై విచారణ జరిపింది. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని ఏపీసీఎల్సీ ప్రధాన కార్యదర్శి సీహెచ్ చంద్రశేఖర్ తెలిపారు. ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మావోయిస్టులను పోలీసులు ఓ వాహనంలో తెచ్చారని, అప్పటికే వాళ్లకు విషం ఇచ్చారని, ఆ తర్వాత దగ్గరనుంచి కాల్చి చంపారు తప్ప పోలీసులు కథ అల్లుతున్నట్లుగా అక్కడ ఎన్కౌంటర్ ఏమీ జరగలేదని అన్నారు. సంఘటన స్థలంలో ఎక్కడా బుల్లెట్ల ఆనవాళ్లు లేవని, అలాగే మృతదేహాలకు పంచనామా చేయడం గానీ, స్థానిక మీడియాకు చెప్పడంగానీ జరగలేదని ఆయన ఆరోపించారు. మృతదేహాలను నేరుగా గడ్చిరోలి ప్రభుత్వాస్పత్రికి తెచ్చారన్నారు. ఆ సంఘటనలో పాల్గొన్న పోలీసులపై హత్యకేసు నమోదుచేసి, జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టుల మృతి
మహారాష్ట్రలో మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న గడ్చిరోలి జిల్లా దామరంచ ప్రాంతంలో పోలీసులు - మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు తెలిసింది. కూంబింగ్ కోసం వెళ్లిన పోలీసు దళాలకు మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. చివరకు కాల్పులు ముగిసిపోయిన తర్వాత చూస్తే, ముగ్గురు మావోయిస్టులు మరణించారు. వీరిలో ఓ మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు. పోలీసు బలగాలలో ఎవరికైనా గాయాలు అయ్యాయా అన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. -
అడుగడుగునా అడ్డుకుంటున్నాం
గడ్చిరోలి, న్యూస్‌లైన్: జిల్లాలో నక్సల్స్ ఆగడాలను అడుగడుగునా అడ్డుకుంటున్నామని పోలీస్ సూపరింటెండెంట్ సువేజ్ హక్ తెలిపారు. ఈ నెల 28న జిల్లాలో చోటుచేసుకున్న ఎన్కౌంటర్ వివరాలను బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... ‘గడ్జిరోలి జిల్లాలో పంచాయతీ సమితి, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అంతేగాకుండా పొరుగు రాష్ట్రమైన చత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు కూడా త్వరలో జరగనున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోలనలు సృష్టించి, తమ ఉనికిని చాటుకునేందుకు ఇదే సరైన సమయమని నక్సల్స్ భావిస్తున్నారు. ఇటీవల పోలీస్ కమెండోలపై రెండుసార్లు కాల్పులకు తెగబడడం ఇటువంటి ప్రయత్నమే. అయితే పోలీసులు వారి ఆగడాలను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. వారి దుశ్చర్యలను ఎక్కడికక్కడ తిప్పికొడుతున్నాం. 28 వ తేదీని జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళా నక్సలైట్లు మృతి చెందగా, ఒక పోలీసు జవాన్ మరణించాడు. అయితే ఈ ఎన్కౌంటర్లో పెద్ద నాయకులు పాల్గొన్నారని భావిస్తున్నాం. సంఘటనాస్థలంలో తమకు పెద్ద మొత్తంలో మారణాయుధాలు లభ్యమయ్యాయి. వాటిలో 17 రౌండ్ల బుల్లెట్లు, 303 నంబర్ రైఫిల్, ఎస్ఎల్ఆర్ రైఫిల్‌కు చెందిన ఏడు బులెట్లు, ఎనిమిది ఖాళీ కేస్ రౌండ్లు, రెండు గ్రనేడ్లు, బ్యాటరీ, చార్జర్, ఔషధాలు, పుస్తకాలు, వంట చేసుకొనే వస్తువులు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం. ఈ నెల 27న గడ్చిరోలి జిల్లా గట్టా పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. 29న ఓట్ల లెక్కింపు జరిగింది. 28న నక్సలైట్లు ఎదురుకాల్పులకు దిగారు. అయితే అప్రమత్తంగా ఉన్న పోలీసులు వారి ఆటలను సాగనీయలేదు. ఇకపై కూడా జిల్లాలో వారి కార్యకలాపాలను సమర్థవంతంగా అడ్డుకుంటా’మని చెప్పారు. -
మందుపాతర పేలి ముగ్గురు జవాన్లు మృతి
గడ్చిరోలి: రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లా దానోరా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందు పాతర పేల్చిన ఘటనలో ముగ్గురు పోలీస్ కమాండోలు మృతి చెందారు. మహరాష్ట్ర-చత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించేందుకు వెళ్లిన జవాన్లు మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు బలైయ్యారు.ఈ ఘటనలో సీ-60 విభాగానికి చెందిన జవాన్లు మృతి చెందినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపాడు. మందుపాతరను పేల్చిన అనంతరం జవాన్లు కూడా కాల్పులకు దిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ మధ్య కాలంలో మావోయిస్టులు దాడి చేసిన ఘటనలో ఇదే అతిపెద్ద దాడిగా పోలీసులు తెలిపారు. -
మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి
గడ్చిరోలి : మహారాష్ట్రలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లా దానోరా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందు పాతర పేల్చారు. మందుపాతర పేలిన ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. పోలీసులే లక్ష్యంగా మావోలు ఈ మందుపాతర పేల్చినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
14 మంది మావోయిస్టుల లొంగుబాటు
గడ్చిరోలి: పధ్నాలుగు మంది మావోయిస్టులు గురువారం ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. గడ్చిరోలి జిల్లాలోని గిరిజన ప్రాంతాలకు చెందిన మావోయిస్టులు హో మంత్రి ఆర్.ఆర్ పాటిల్ ఎదుట లొంగిపోతున్నట్లు ప్రకటించారు. లొంగిపోయిన వారిలో ఎనిమిది మంది పురుషులు, ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీరంతో 16 సంవ్సరాల నుంచి 40 సంవత్సరాలలోపు వారే. లొంగిపోయిన మావోయిస్టులకు సరెండర్ చట్టం కింద ఆర్ధికపరమైన వెసులుబాటు ఉంటుదని ఓ పోలీస్ అధికారి తెలిపాడు. జాతీయ పతాకం ఆవిష్కరణ అనంతరం లొంగుబాటు కార్యక్రమాన్ని కలెక్టరేట్ ముందు ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. లొంగిపోయిన మావోయిస్టలంతా ఇప్పటివరకూ తిప్పాగాడ్ దళం, భమ్మరా గాడ్ దళల్లో పనిచేశారు. -
గడ్చిరోలి, చంద్రపూర్‌లను తెలంగాణలో విలీనం చేయండి
గడ్చిరోలి, న్యూస్‌లైన్: ఓ వైపు ప్రత్యేక విదర్భ ఉద్యమం ఊపందుకుంటున్న నేపథ్యంలో మరో కొత్త ప్రతిపాదన ముందుకు వచ్చింది. ప్రత్యేక విదర్భ రాష్ట్రాన్ని ఇవ్వని పక్షంలో గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాలను కొత్తగా ఏర్పాటుకానున్న తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలని ఎన్సీపీ సీనియర్ నాయకుడు ధర్మారావ్‌బాబా ఆత్రం డిమాండ్ చేశారు. తెలంగాణ కన్నా విదర్భ డిమాండ్ చాలా పాతదని, అయితే దీన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని ఆయన కోరారు. అయితే గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాలను తెలంగాణలో కలపాలన్న అత్రమ్ వ్యాఖ్యలు విదర్భతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పాటు కోసం స్వచ్చంద సంస్థలతోపాటు బీజేపీ ఓవైపు ఉద్యమం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌నాయకుడు విలాస్ ముత్తెంవార్ ప్రత్యేక విదర్భ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి ఎన్సీపీ కూడా మద్దతు పలికింది. అయితే ఇటీవలే బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటైతే ప్రత్యేక విదర్భ ఏర్పాటు సాధ్యమన్నారు. దీనిపై పరోక్షంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక విదర్భ ఏర్పాటు సాధ్యం కాకపోతే గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాలను తెలంగాణలో విలీనం చేయాలన్నారు. ఇలాచేస్తే తెలంగాణాతో పాటు ఈ రెండు జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. రాష్ట్ర రాజధాని ముంబై ఈ జిల్లా నుంచి సుమారు 1,100 కిలోమీటర్ల దూరంలో ఉందని, దీంతో రాజధానిలో బతుకుతెరువుకోసం ప్రజలు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదే తెలంగాణలో విలీనం చేస్తే రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ మారతుందన్నారు. ఈ జిల్లాల నుంచి కేవలం 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ రాజధానిగా మారితే రాకపోకలకు ఇబ్బందులు ఉండవన్నారు.