గడ్చిరోలి(మహారాష్ట్ర): కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమిపూజ చేసి పక్కనే ఉన్న కన్నెపల్లి గ్రామాన్ని పరిశీలించడానికి వెళ్లిన తెలంగాణ కే చంద్రశేఖర రావుకు సోమవారం నిరసన సెగ తగిలింది. మేడిగడ్డ-కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రాంత రైతులతో కాంగ్రెస్ నేతలు నల్లజెండాలతో నిరసన తెలిపారు.
మహారాష్ట్ర మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అహేరీ దీపక్దాదా ఆత్రం, కాంగ్రెస్ నేతలు రైతులతో పోచంపల్లి తరలివచ్చి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నల్లజెండాలను ప్రదర్శించారు. సీఎం కేసీఆర్ నదికి అవతలి ఒడ్డునున్న గ్రామంలో పర్యటిస్తుండటంతో పోలీసులు కాంగ్రెస్ నాయకులను, రైతులను నది దాటడానికి అంగీకరించలేదు. ప్రాజెక్టు కారణంగా దాదాపు 22 గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉండటంతో నిర్మాణం ఆపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ కు నిరసన సెగ
Published Mon, May 2 2016 10:17 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement