Kaleshwaram Lift Irrigation Project
-
సుందిళ్ల బ్యారేజీ ఇంజినీర్లపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం
సాక్షి ,హైదరాబాద్ : సుందిళ్ల బ్యారేజీల నిర్మాణల కమిషనర్ ఆఫ్ డిజైన్స్ విభాగం(సీడీవో) ఇంజినీర్లపై కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యారేజీల నిర్మాణాలపై అఫిడవిట్లో ఒకలా.. బహిరంగ విచారణలో మరోలా ఇంజినీర్లు సమాధానాలు చెప్పడంపై మండిపడింది. నిర్మాణాలపై తప్పుడు సమాధానాలు చెబితే క్రిమినల్ కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించింది. మేడిగడ్డ, సుందిళ్ళ బ్యారేజి సహా కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన నిర్మాణాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ క్షేత్రస్థాయి ఇంజినీర్లతో జరిపిన రెండు రోజుల పాటు జరిపిన బహిరంగ విచారణ జరిపింది. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో కాళేశ్వరం న్యాయవిచారణ కమిషన్ తొలిరోజైన సోమవారం మేడిగడ్డ, రెండో రోజైన మంగళవారం సుందిళ్ళ బ్యారేజి నిర్మాణాలపై విచారణ చేపట్టింది. ఈ విచారణలో కమిషనర్ ఆఫ్ డిజైన్స్ విభాగాని(సీడీవో)కి చెందిన ఏఈఈ,డీఈ,ఈఈ,డీసీఈ’ 16మంది ఇంజినీర్లను కమిషన్ సుందిళ్ల నిర్మాణాలకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగింది. కమిషన్ చైర్మన్ అడిగిన ప్రశ్నలకు ఇంజినీర్లు తప్పుడు సమాధానాలు చెప్పిటన్లు తెలుస్తోంది. అఫిడవిట్లో ఒకలా.. బహిరంగ విచారణలో మరోలా సమాధానాలు మార్చి చెప్పడంపై కమిషన్ చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుందిళ్ళ బ్యారేజి బ్లాక్ 2ఏను డిజైన్ లేకుండానే నిర్మాణం చేశామని ఇంజినీర్లు కమిషన్‌కు వెల్లడించారు. దీంతో డిజైన్ లేకుండానే బ్లాక్ ఎలా నిర్మించారు? ఎలా సాధ్యమైంది? అని కమిషన్ ప్రశ్నించింది. కమిషన్ ప్రశ్నకు.. ఒకటో బ్లాక్,మూడు బ్లాక్‌ల మధ్య 2ఏ బ్లాక్ నిర్మాణం చేశామని ఒకసారి..రెండు,మూడు బ్లాక్‌ల మధ్య నిర్మాణం చేశామని బదులిచ్చారు. మధ్యలో రెండో బ్లాక్ తర్వాతే 2ఏ బ్లాక్ కట్టామని కమిషన్‌కు ఓ ఇంజినీర్ వివరించారు. 2ఏ బ్లాక్‌కు డిజైన్ లేకపోవడంతో రెండో డిజైన్ ఆధారంగా 2ఏ బ్లాక్ నిర్మాణం పూర్తి చేశామన్నారు. అప్పటి ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకే డిజైన్ లేకపోయినా 2ఏ బ్లాక్ నిర్మాణం చేశామని కమిషన్‌కు వివరించారు.ఇలా ఇంజినీర్లు చెప్పిన తప్పుడు సమాధానాలపై అవసరమైతే క్రిమినల్ కోర్టుకు వెళ్ళాల్సి వస్తుందని కమిషన్ హెచ్చరించింది. 16 మంది ఇంజినీర్ల నుండి బ్యారేజ్ పనుల రికార్డులపై సంతకాలు తీసుకుంది. ఆ రికార్డ్లను స్వాధీనం చేసుకున్న అనంతరం కమిషన్ తన విచారణను ముగించింది.తొలిరోజు మేడిగడ్డ నిర్మాణాలపై ప్రశ్నల వర్షంతొలిరోజు మేడిగడ్డ ఏడో బ్లాక్‌లో పియర్స్ కుంగుబాటుకు కారణాలతో పాటు ఇతర నిర్మాణలపై కమిషన్ ఇంజినీర్లకు పలు ప్రశ్నలు సంధించింది. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ముందే సిద్ధం చేసుకుని వచ్చిన సమాధానాలు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మాణలకు సంబంధించిన ఇంజినీర్లు సమర్పించిన రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్న కమిషన్.. వారితో సంతకాలు చేయించుకుని విచారణను నిలిపివేసిందిఇవాళ (మంగళవారం) సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాలపై ఇంజినీర్లను కమిషన్ బహిరంగంగా విచారించింది. విచారణలో ఇంజినీర్లు చెప్పిన సమాధానాలకు కమిషన్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. -
కాళేశ్వరం కమిషన్ విచారణ.. మూడుసార్లు హరీష్ రావు పేరు ప్రస్తావన
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి శనివారం హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల టెండర్లపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఆయన్ను విచారించింది. విచారణలో భాగంగా మాజీ జలవనరులశాఖ మంత్రి హరీష్ రావు పేరును సుధాకర్ రెడ్డి మూడుసార్లు ప్రస్తావించారు. ప్రాజెక్టు కోసం చేసిన టెస్టుల రిపోర్టులను వ్యాప్కోస్ సంస్థకు ఇవ్వనని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించగా.. ఆ సమయంలో హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారని, ఆయనే ఆదేశించారని తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టింది అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలోనేనని పేర్కొన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో 40 వేల కోట్ల నుంచి 127 వేల కోట్లకు పెంచారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కేవలం అదనంగా రెండు లక్షల ఎకరాల కోసమా?: కమిషన్డీపీఆర్ ప్రకారం కాఫర్ డ్యామ్‌కు డబ్బులు ఇచ్చాం-సుధాకర్ రెడ్డికాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ టెండర్ల ప్రాసెస్ జరిగిందా? కమిషన్టెండరింగ్ ప్రాసెస్ జరగలేదు. నామినేషన్ ప్రాసెస్ ద్వారా వ్యాప్కొస్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు- సుధాకర్ రెడ్డికాళేశ్వరం ప్రాజెక్టు టెండర్ ప్రాసెస్ ఎందుకు చేయలేదు చెయ్యొద్దు అని ఎవరు ఆదేశించారు?- కమిషన్బ్యారేజీ పనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఏ సమయంలో ఇస్తారు?- కమిషన్దాదాపు 90 శాతం పనులు పూర్తయితే సబ్ స్టాన్షల్ సర్టిఫికేట్ విడుదల చేస్తారు?- సుధాకర్ రెడ్డిపనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చేముందు ఫీల్డ్ విజిట్ లేదా డాక్యుమెంట్స్ చెక్ చేశారా?- కమిషన్ఫీల్డ్ విసిట్, డాక్యుమెంట్స్ చెక్ చేయకుండా పనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఎలా ఇస్తారు?- కమిషన్42.2b క్లాజ్ ఉపయోగించి సర్టిఫికెట్‌ను రిజెక్ట్ చేసే అర్హత ఉన్నప్పటికీ ఎందుకు ఆపలేదు?- కమిషన్సర్టిఫికెట్ ఇచ్చేముందు అసలు నిజాలు చూడకుండా ఎలా గుడ్డిగా సంతకాలు పెడుతారు?- కమిషన్కాపర్ డ్యాం నిర్మాణం తొలగింపు కోసం అదనంగా ఖర్చు చేసే నిధులు ప్రభుత్వానికి నష్టమే కదా?- కమిషన్మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఫైనల్ బిల్లులు ఆలస్యం ఎందుకు అయ్యాయి? - కమిషన్అన్నారం సుందిళ్ల ఫైనల్ బిల్లులను నిర్మాణ సంస్థలు ఇచ్చాయి,.మేడిగడ్డ బ్యారేజీ ఫైనల్ బిల్లులు ఇంకా సబ్మిట్ చేయలేదు.- సుధాకర్ రెడ్డిబిల్లుల చెల్లింపుల అంశంలో కాళేశ్వరం కార్పొరేషన్ ప్రస్తావన..కాళేశ్వరం కార్పొరేషన్ ఎవరు పెట్టారు? పెట్టమని ఎవరు ఆదేశించారు;- కమిషన్కాళేశ్వరం కార్పొరేషన్ ప్రభుత్వం పెట్టింది. అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో జరిగింది. సుధాకర్ రెడ్డిమేడిగడ్డ బ్యారేజీ కింద బొగ్గు గనుల ఆనవాళ్లు ఉన్నట్లు జోధాపూర్ యూనివర్సిటీ సర్దార్ కన్సల్టెన్సీ నివేదిక ఇచ్చింది. సుధాకర్ రెడ్డిబ్యారేజీలలో నీళ్లు స్టోరేజ్ చేయొచ్చా చేస్తే ఎంత చేయొచ్చు?- కమిషన్మేడిగడ్డ బ్యారేజీలో 100 మీటర్ల లెవెల్ వరకు స్టోర్ చేయొచ్చు.- సుధాకర్ రెడ్డిచేసుకున్న అగ్రిమెంట్ కంటే ఎక్కువ నిధులు ఏజెన్సీకి పే చేస్తే అది ప్రభుత్వానికి నష్టమే కదా- కమిషన్డిజైన్లలో లోపాల వల్ల బ్యారేజీల వద్ద డ్యామేజ్ జరిగింది నిజమేనా? - కమిషన్మేడిగడ్డ బ్యారేజీ లోని బ్లాక్ లలో లెన్త్ అండ్ విడ్త్ డిజైన్ సరిగ్గా లేకపోవడం వల్లే డ్యామేజి జరిగింది- సుధాకర్ రెడ్డి వరద వేగాన్ని అంచనా వేయకపోవడం వల్లే బ్లాకులు దెబ్బతిన్నాయి-సుధాకర్ రెడ్డి. -
లోపాలు తేలినా.. నష్ట నివారణ చర్యలు తీసుకోలేదు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో లోపాలపై 2021 అక్టోబర్, నవంబర్లలో తనిఖీలు నిర్వహించి నివేదికలు ఇచ్చినా.. రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు నష్ట నివారణ చర్యలు తీసుకోలేదని నీటిపారుదల శాఖ ఈఎన్సీ (ఓఅండ్ఎం) బి.నాగేంద్రరావు ఆరోపించారు. బరాజ్‌ల ఎగువన, దిగువన సీసీ బ్లాకులు కొట్టుకుపో యాయని, దిగువన వేరింగ్ కోట్ దెబ్బతిన్నదని నివేదికలలో తెలిపామని వివరించారు. ప్రాజెక్టుల ఈఈలు, ఎస్ఈలు, సీఈలు దీనికి బాధ్యులని.. బరాజ్‌లలో లోపాలున్నట్టు ఎన్నడూ నల్లా వెంకటేశ్వర్లు తమకు నివేదిక సమర్పించలేదని పేర్కొ న్నారు.కాళేశ్వరం బరాజ్‌లపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ బుధవారం బి.నాగేంద్రరావును మూడున్నర గంటలకుపైగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. 120కిపైగా ప్రశ్నలు వేసింది. నిర్వహణ, పర్యవేక్షణ (ఓఅండ్ఎం) విభా గానికి క్షేత్రస్థాయిలో ప్రత్యేక వ్యవస్థ లేదని.. క్షేత్ర స్థాయి అధికారులకు ప్రాజెక్టుల నిర్వహణపై ఎప్ప టికప్పుడు ఆదేశాలిస్తామని ఈ సందర్భంగా కమి షన్‌కు నాగేంద్రరావు వివరించారు. తమ తనిఖీల నివేదికలను కమిషన్‌కు అందజేశారు. డిఫెక్ట్ లయ బిలిటీ పీరియడ్‌లో బరాజ్‌లకు రక్షణ చర్యలు తీసు కోవాలని.. వర్షాకాలానికి ముందు, తర్వాత, మధ్య లో పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించాలని తాము కోరినా రామగుండం ఈఎన్సీ చేయలేదని వివరించారు. ఐఎస్ కోడ్, కేంద్ర జలసంఘం మా న్యువల్స్ను కూడా పాటించలేదని ఆరోపించారు. బరాజ్‌ల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ముగిసినట్టు నల్లా వెంకటేశ్వర్లు నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. గేట్ల నిర్వహణలో ఆపరేషన్ ప్రోటోకాల్ పాటించినట్టు సమాచారం లేదని.. వరద ఉధృతితో దిగువన రక్షణ పనులు దెబ్బతినడానికి అది ఒక కారణం కావొచ్చని తెలిపారు. మరమ్మతులు చేయడం కోసం బరాజ్ లలో నీటి నిల్వలను తగ్గించాలని నిర్మాణ సంస్థలు కోరినా పట్టించుకోలేదా? అని కమిషన్ ప్రశ్నించగా.. ఈ దిశగా తమ కార్యాలయం ఆదేశాలేమీ ఇవ్వలేదని, అయితే నిల్వలను పెంచాలని నల్లా వెంకటేశ్వర్లు మౌఖిక ఆదేశాలిచ్చారని నాగేంద్రరావు వివరించారు.ఈఎన్సీ పోస్టు అలంకారానికా?‘బరాజ్‌ల వైఫల్యానికి నిర్వహణ వైఫల్యం ఓ కారణం కాదా? ఈఎన్సీ (ఓఅండ్ఎం) పోస్టు ఎందుకు ఉంది? అలంకారానికా?’ అని కమిషన్ నిలదీయగా.. నిర్వహణ బాధ్యత క్షేత్రస్థాయి సీఈలదేనని నాగేంద్రరావు బదులిచ్చారు. నిర్వహ ణ మాన్యువల్స్, సర్క్యులర్లు జారీచేసి వాటిని పాటించాలని కోరడమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు. నిరంతర నిల్వలతో బరాజ్‌ల ఎగువ భాగంలో మరమ్మతులు సాధ్యం కాలేదని, దిగువన అవకాశమున్నా మరమ్మతులు చేయలేదని వివరించారు. అయితే ‘నీటి నిల్వ అవసరాలకు బరాజ్‌లు పనికిరావని ఐఎస్ కోడ్‌లో ఉన్న విషయం మీకు తెలియదా? నిల్వ చేయాలని ఆదేశించినది ఎవరు? నిల్వలతోనే పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి బరాజ్‌లు దెబ్బతిన్నాయా?’ అని కమిషన్ ప్రశ్నించగా.. ఉన్నత స్థాయి ఆదేశాలతోనే నీళ్లు నిల్వ చేశా రని నాగేంద్రరావు వివరించారు. నిల్వలతో ఇసుక కొట్టుకుపోయి దెబ్బతినే అవకాశాలుంటాయని అంగీకరించారు. మూడు బరాజ్‌ల పనులు సంపూర్ణంగా పూర్తయ్యాయా? అని కమిషన్ ప్రశ్నించగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పనులు పూర్తయ్యా యని, మేడిగడ్డ బరాజ్‌లో నిబంధనల ప్రకారం పనులు జరగలేదని నాగేంద్రరావు తెలిపారు.నాణ్యతా పరీక్షలకు మనస్సాక్షి అంగీకరించలేదా?‘వరదల అనంతరం బరాజ్‌ల పరిస్థితి ఏమిటి? ఏమైనా దెబ్బతిన్నాయా? నిర్మాణం సరిగ్గా జరిగిందా? లేదా? అని పరిశీలించాలని మీ మనస్సాక్షి అంగీకరించలేదా?’ అని క్వాలిటీ కంట్రోల్ రిటైర్డ్ సీఈ అజయ్‌కుమార్‌ను పీసీ ఘోష్ కమిషన్ నిలదీసింది. అయితే నిర్మాణ దశలో, బిల్లుల చెల్లింపుల సమయంలోనే నాణ్యతా పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తామని, నిర్మాణం పూర్తయిన తర్వాత అవసరం ఉండదని అజయ్‌కుమార్ బదులిచ్చారు. ఇక అసంపూర్తి పనులను పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలకు నోటీసులిచ్చామని కమిషన్‌కు మాజీ ఈఈ సర్దార్ వివరించారు. గురువారం కమిషన్ రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుకు రెండోసారి క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనుంది. -
కాంట్రాక్టర్లకు బిల్లుల కోసమే ‘కాళేశ్వరం’ కార్పొరేషన్!
సాక్షి, హైదరాబాద్: బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొంది కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం కోసమే కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటైందని నీటిపారుదల శాఖ చీఫ్ అకౌంట్స్ అధికారి పద్మావతి, కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ అధికారి కొమర్రాజు వెంకట అప్పారావు వెల్లడించారు. కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. బుధవారం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ముగ్గురు అధికారులను వేర్వేరుగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. నాటి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ ఆదేశాలతో కార్పొరేషన్ రుణాలను సమీకరించిందని ఓ ప్రశ్నకు సమాధానంగా కొమర్రాజు వెంకట అప్పారావు తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కు స్వతహాగా ఆదాయం ఏమీ లేదన్నారు. రుణా లు మంజూరైన వెంటనే కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరపకుండా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని.. వాటిపై వచ్చే వడ్డీలతో కార్పొరేషన్ నిర్వహణ జరుగుతోందని చెప్పారు. కాంట్రాక్టర్ల బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీలను సైతం కార్పొరేషన్ అవసరాలకు వాడుకుంటున్నామని వివరించారు. పూర్తయిన పనులన్నింటినీ కార్పొరేషన్ ఆస్తులుగానే పరిగణిస్తామని తెలిపారు. రామగుండం ఫెర్టిలైజర్, ఎనీ్టపీసీ నుంచి నీటి విడుదలకు సంబంధించిన బిల్లులు 2023 నుంచి వస్తున్నాయని వివరించారు. కొలతలు చూశాకే బిల్లులు ఇస్తారా? అని కమిషన్ ప్రశ్నించగా.. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సిద్ధం చేసిన బిల్లులను పేఅండ్‌అకౌంట్స్ విభాగం పరిశీలించి కార్పొరేషన్‌కు పంపిస్తుందని, తర్వాత చెల్లింపులు చేస్తామని బదులిచ్చారు. కాగ్ అభ్యంతరాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు.మిమ్మల్ని మీరే రక్షించుకోవాలినీటి పారుదల శాఖ బడ్జెట్ రూపకల్పనలో మీ పాత్ర ఏమిటని ఆ శాఖ చీఫ్ అకౌంట్స్ అదికారి పద్మావతిని కమిషన్ ప్రశ్నించగా.. చీఫ్ ఇంజనీర్ల నుంచి వివరాలను సేకరించి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపిస్తానని ఆమె బదులిచ్చారు. కార్పొరేషన్ రుణాల తిరిగి చెల్లింపు కోసం ప్రభు త్వం బడ్జెట్లో నిధులు కేటాయిస్తోందని తెలిపారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ అభ్యంతరాల విషయంలో మీ అభిప్రాయమేంటి? రుణాలపై నిర్వహించిన సమావేశాల్లో గత ప్రభుత్వంలోని సీఎంఓ అధికారులు పాల్గొన్నారా? ప్రాజెక్టుతో ఆర్థికభారం పడే అవకాశం ఉండటంతో ఆర్థిక క్రమశిక్షణ కోసం సలహాలు ఏమైనా ఇచ్చారా?’ కమిషన్ ప్రశ్నించగా.. ఆమె సమాధానం దాటవేసినట్టు తెలిసింది. ‘కాళేశ్వరం ప్రాజెక్టుతో పడే ఆర్థిక భారం? దీనికి మీ సమర్థన ఉందా? రాష్ట్రంపై ఈ భారం రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది? మీ బాధ్యతగా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారా?’ అన్న ప్రశ్నలకు తాను జవాబు చెప్పలేనని పేర్కొన్నట్టు సమాచారం. ఇక ఆర్థిక క్రమశిక్షణ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకున్నదెవరని ప్రశ్నించగా.. అది చాలా విస్తృతమైన అంశమని, దానిపై తానేమీ చెప్పలేనని చెప్పినట్టు తెలిసింది. దీంతో కమిషన్ కొంత ఘాటుగా స్పందిస్తూ.. ‘‘విచారణ సందర్భంగా ఎవరినో రక్షించే ప్రయత్నం చేయవద్దు. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. విచారణలో వాస్తవాలనే తెలపాలి. దాపరికాలు వద్దు’’ అని పేర్కొన్నట్టు సమాచారం. మరోవైపు బిల్లులను పరిశీలించి చెల్లింపులకు సిఫారసు చేయడమే తన బాధ్యత అని వర్క్ అకౌంట్స్ డైరెక్టర్ ఫణిభూషణ్ శర్మ కమిషన్‌కు వివరించారు. కాగ్ నివేదికలోని ఒకటి రెండు విషయాలు మాత్రమే వాస్తవాలని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచి్చందని తెలిపారు. -
కాళేశ్వరం కమిషన్‌కు కీలక విషయాలు వెల్లడించిన ఇంజినీర్లు
సాక్షి,హైదరాబాద్:కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లుగా పనిచేసిన ఈఈ, సీఈ,ఎస్ఈ శనివారం(సెప్టెంబర్21)నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయం జలసౌధలో కమిషన్ ముందు హాజరయ్యారు.మూడు బ్యారేజీలలో క్వాలిటీ కంట్రోల్ వింగ్ పోషించిన పాత్రపై అధికారులను కమిషన్ ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకుగాను క్వాలిటీ కంట్రోల్ అధికారులు కమిషన్‌కు విభిన్న సమాధానాలు చెప్పడం గమనార్హం.బ్యారేజీల సైట్ విజిట్ ఎన్ని రోజుల కొకసారి చేసేవారని అధికారులను కమిషన్ ప్రశ్నించింది.రెండు మూడు నెలలకొకసారని ఒకరు,అసలు సైట్ విజిట్ చేయలేదని మరొకరు పొంతన లేని సమాధానాలిచ్చినట్లు తెలిసింది.అన్నారం బ్యారేజ్ డిజైన్ సరిగా లేదని అన్నారం బ్యారేజ్ ఈఈ కమిషన్‌కు చెప్పారు.వరదకు తగ్గట్టుగా అన్నారం బ్యారేజ్ డిజైన్ లేదని తెలిపారు.తక్కువ వరదకు డిజైన్ చేస్తే ఎక్కువ వరద వస్తోందన్నారు. ఎత్తిపోతలకు బ్యారేజ్ అనుగుణంగా లేదని సమాధానమిచ్చారు.ఇదీ చదవండి.. కాళేశ్వరం తెలంగాణకు వెయ్యి ఏనుగుల బలం: హరీశ్‌రావు -
కేటీఆర్ కాళేశ్వరం పర్యటన ఒక విహారయాత్ర: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరంపై ఇప్పటికైనా బీఆర్ఎస్ తప్పు ఒప్పుకోవాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. వాస్తవాలు తెలిసి కూడా తప్పును కప్పి పుచ్చుకోవడానికి విహార యాత్రగా కాళేశ్వరంగా వెళ్లారు అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు.కాగా, బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజక్ట్ పర్యటనపై జీవన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం వెళ్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. కేటీఆర్ కాళేశ్వరం పర్యటన ఓ విహారయాత్ర. మూడు లిఫ్ట్‌ల్లో నీటిని తరలిస్తే 30వేల కోట్లు అయ్యే ప్రాజెక్ట్‌కు లక్షా 20వేల కోట్లు చేశారు. అప్పులకు కేసీఆరే బాధ్యుడు. ఈ ప్రాజెక్ట్‌లో నిర్మాణాత్మకంగా లోపాలు ఉన్నాయి. మూడు ప్రాజెక్ట్‌ల్లో నీటిని నిల్వ చేయకుడదని ఎన్డీఎస్ఏ స్పష్టం చెబుతోంది. విజిలెన్స్ కూడా ఇదే నివేదిక ఇవ్వబోతోంది.వాస్తవాలు తెలిసి కూడా ఇలా విహారయాత్రకు వెళ్లినట్టు వారంతా అక్కడికి వెళ్లారు. ఒకవైపు న్యాయవిచారణ జరుగుతోంది. వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ అనుభవం ప్రజలకు ఉపయోగపడుతుందని అనుకున్నాం. కానీ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి నీటిని తరలించడానికి ఒకేఒక అవకాశం ఉంది. మారో మార్గమే లేదు. గత బీఆర్ఎస్ వల్లే ఈ పరిస్థితి నెలకొంది. తుమ్మడిహట్టి వద్ద 148 మీటర్ల నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నారు. 148 మీటర్ల ఎత్తుతో నీటిని తరలిస్తే ప్రాణహిత నీళ్లు ఒక్క లిఫ్ట్‌తో ఎల్లంపల్లికి నీళ్లు వచ్చేవి. కేసీఆర్ కమీషన్ల కోసం లక్షల కోట్ల అప్పులు చేశారు. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడు. ఇప్పటికైనా మీరు చేసిన తప్పులకు ప్రజలను క్షమాపణ కోరండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
కాళేశ్వరం లిఫ్టులపైనా విచారణ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని కన్నెపల్లి (మేడిగడ్డ), సిరిపురం(అన్నారం), గోలివాడ (సుందిళ్ల) పంప్ హౌస్‌ల నిర్మాణంపై సైతం జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ ప్రారంభించినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో బరాజ్‌ల నిర్మాణంలో చోటుచేసుకున్న అవకతవకలు, లోపాలపై విచారణ నిర్వహించే బాధ్యతలను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు అప్పగించగా, విచారణలో అనుబంధ అంశాలుగా పంప్‌హౌస్‌లను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లతో పాటు పంప్ హౌస్‌లపై సైతం విచారణ జరిపించాలని పలువురు కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–1 ప్యాకేజీలో భాగంగా ఈ పంప్‌హౌస్‌ల నిర్మాణం జరిగింది. అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) నుంచి చీఫ్ ఇంజనీర్ (సీఈ) స్థాయి వరకు.. పంప్‌హౌస్‌ల నిర్మాణంలో భాగస్వాములైన అధికారులందరూ సోమవారం విచారణకు హాజరు కావాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ తాజాగా ఆదేశించడం చర్చనీయాంశమైంది. పంప్‌హౌస్‌ల నిర్మాణానికి జారీ చేసిన పరిపాలన అనుమతులు, సాంకేతిక పరిశీలనలు, ఏ మేరకు నీటిని పంపింగ్ చేయడానికి వీటికి అనుమతినిచ్చారు? చేసిన పంపింగ్ ఎంత? వీటి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎన్నిసార్లు అంచనాలు సవరించారు? గత ఐదేళ్లుగా పంప్ హౌస్‌ల పరిస్థితి ఏంటి? అనే అంశాలపై కమిషన్ ఆరా తీయనున్నట్టు సమాచారం. మూడేళ్ల కింద గోదావరికి వచ్చిన వరదల్లో మేడిగడ్డ, అన్నారం పంప్‌హౌస్‌లు నీట మునగడంతో భారీ నష్టం వాటిల్లింది. ఇదిలా ఉండగా, శనివారం జస్టిస్ పినాకి చంద్రఘోష్ తన కార్యాలయంలో కమిషన్‌కు సహకరించేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీతో సమావేశమై చర్చలు జరిపారు. సత్వరంగా నివేదిక సమర్పించాలని వారిని కోరారు. ఎన్డీఎస్ఏ తుది నివేదిక సమర్పించాలిమేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ తుది నివేదికను సత్వరం సమర్పించేలా చర్యలు తీసుకోవాలని జస్టిస్ చంద్రఘోష్ ఆదేశించారు. ఎన్డీఎస్ఏ చైర్మన్‌తో ఆయన శనివారం ఫోన్లో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లపై విచారణ ప్రక్రియలో ఈ నివేదిక కీలకమని స్పష్టం చేశారు. తుది నివేదిక కోసం కమిషన్ తరఫున ఎన్డీఎస్ఏకు లేఖ రాయాలని నీటిపారుదల శాఖ అధికారులను సైతంఆయన ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ నిర్వహిస్తున్న విచారణకు సంబంధించిన తుది నివేదికను కూడా సత్వరం తెప్పించుకోవాలని ఆయన సూచించారు. త్వరలో క్రాస్ ఎగ్జామినేషన్జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ త్వరలో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. ఇప్పటికే విచారణకు హాజరైన అధికారులందరినీ అఫిడవిట్ రూపంలో తమ వద్ద ఉన్న సమాచారాన్ని, వాదనలను సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. అఫిడవిట్ల పరిశీలన పూర్తయిన అనంతరం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ప్రజాప్రతినిధులకు సైతం నోటీసులు జారీ చేసి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియకు హాజరు కావాలని ఆదేశించే అవకాశముంది.ఇదిలా ఉండగా కమిషన్‌ను తప్పుదోవపట్టించే క్రమంలో కొందరు అధికారులు పరస్పర విరుద్ధమైన సమాచారాన్ని అఫిడవిట్ల రూపంలో సమర్పించినట్టు తెలిసింది. దీంతో వీరిని సైతం మళ్లీ క్రాస్‌ఎగ్జామినేషన్‌కు కమిషన్ పిలవనుంది. ఇక బరాజ్‌లు దెబ్బతినడానికి కారణాలేంటో తెలుసుకోవాలని కమిషన్ ఓ అధికారిని పుణెలోని సెంట్రల్ పవర్ అండ్ వాటర్ రీసెర్చ్ సెంటర్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)కు పంపించింది. విచారణ ముగింపులో బహిరంగ విచారణను సైతం కమిషన్ నిర్వహించనుందని సమాచారం. తొలుత అఫిడవిట్ల పరిశీలన, ఆ తర్వాత నోటీసుల జారీ, క్రాస్ ఎగ్జామినేషన్ అనంతరం బహిరంగ విచారణ ఉంటుందని కమిషన్ వర్గాలు తెలిపాయి. -
అన్నారం నుంచి నీటి తరలింపునకు కసరత్తు
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం (సరస్వతీ) బరాజ్ గుండా ఖరీఫ్ సీజన్లో నీటిని ఎగువకు తరలించడానికి రాష్ట్ర ఇరిగేషన్ సాంకేతిక ఉన్నతాధికారుల బృందం శనివారం కసరత్తు చేసినట్లు తెలిసింది. ఈఎన్సీ జనరల్ గుమ్మడి అనిల్‌కుమార్ బృందంతోపాటు సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజెషన్ (సీడీఓ) మోహన్‌కుమార్, క్వాలిటీ కంట్రోల్ సీఈ వెంకటకృష్ణల బృందాలు, రామగుండం సీఈ సుధాకర్‌రెడ్డి మేడిగడ్డ (లక్ష్మి) అన్నారం (సరస్వతీ) బరాజ్‌లను పరిశీలించారు. ముందుగా అన్నారంలో చేపట్టిన సీపేజీ మరమ్మతు లను పరిశీలించిన అనిల్‌కుమార్.. వాటిని త్వరగా పూర్తిచే యాలని ఆదేశించారు. కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్ ద్వారా నీటిని తరలించడానికి ఇప్పటికే అక్కడ ఉన్న 11 మోటార్ల టెస్ట్ రన్లు, రిపేర్లు పూర్తిచేసి సిద్ధంగా ఉంచినట్లు అధికారు లకు ఆయనకు చెప్పారని సమాచారం. అదేకాకుండా అన్నా రం బరాజ్ పెద్దవాగు, మానేరు వాగులతోపాటు చిన్నచిన్న వాగుల ద్వారా నీటిలభ్యత ఉందని ఇంజనీర్లు ఈఎన్సీతో పేర్కొన్నారు. ఇప్పటికే అన్నారం బరాజ్‌లో ఉన్న మొత్తం 66 గేట్లను మూసి ఉంచారు. నీటి తరలింపు అంశంపై పరిశీలన చేయాలని ఇంజనీర్లను ఆయా బృందాలు ఆదేశించినట్లు తెలిసింది. మేడిగడ్డ వద్ద నీటి ప్రవాహం పెరుగుతుండటంతో ఎగువ నుంచి ప్రాణహిత ద్వారా 20 వేల క్యూసెక్కులకుపైగా నీరు వస్తోంది. ఉన్నతాధికారుల బృందం వెంట ఎస్ఈ కరుణాకర్, ఈఈలు యాదగిరి, తిరుపతిరావు ఉన్నారు. -
మరో రెండు గేట్లు పైకి
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు చెందిన మరో రెండు రేడియల్ గేట్లను ఇంజనీరింగ్ అధికారులు గురువారం పైకి ఎత్తారు. గతేడాది అక్టోబర్‌లో 21న మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్‌లోని 19, 20, 21 పియర్లతో పాటు వంతెన కుంగి, పగుళ్లు తేలిన విషయం తెలిసిందే. గత నెల 17న 15వ పియర్‌లోని రేడియల్ గేటును పైకి ఎత్తేందుకు ప్రయత్నించగా, 20వ పియర్ ముందు బొరియలు ఏర్పడి భారీ శబ్ధం, ధ్వనులు వినిపించాయి. దీంతో బొరియల్లో సిమెంట్, ఇసుకతో గ్రౌటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 6న 7వ బ్లాక్‌లోని 16, 17 రేడియల్ గేట్లను బలంగా పైకి ఎత్తారు. 8వ తేదీన అదే బ్లాక్‌లోని 22వ రేడియల్ గేటును ఎత్తారు. గురువారం 18, 19 గేట్లను 100.50 మీటర్ల మేర ఎత్తారు. దీంతో ఈ బ్లాక్‌లోని మొత్తం 8 గేట్లకు గాను 5 గేట్లు ఎత్తినట్టయ్యింది. గేట్ల కటింగ్ పనులు వేగవంతం: ప్రాజెక్టులోని 19, 20, 21 గేట్ల కటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 20వ గేటును కట్ చేసి విడిభాగాలు తొలగించి, బయటకు తీసుకెళ్లేందుకు వీలుగా చేశారు. ఆ గేట్ల వద్ద ఉన్న కేబుల్స్, ఇతర పరి కరాలు తొలగించడానికి సమ యం పట్టనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా 7వ బ్లాక్‌లో షీట్‌ఫైల్స్ పనుల్లో వేగం పెంచారు. చెల్లాచెదురైన సీసీ బ్లాక్‌లను సరైన స్థానంలో అమర్చుతున్నారు. మంత్రి ఉత్తమ్ పర్యటన అనంతరం మరమ్మతుల్లో వేగం పెరిగిందని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. అటు అన్నారంలో బోర్‌తో డ్రిల్లింగ్ వేసి రంధ్రాలు చేస్తున్నారు. 25 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేయాల్సి ఉండగా కింద మట్టి దృఢంగా ఉండడంతో ఆలస్యం జరుగుతున్నట్లు తెలిసింది. -
‘కాళేశ్వరం’ విచారణ.. నేడు కమిషన్ ముందుకు 18 మంది మాజీలు
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై జస్టిస్ చంద్ర ఘోష్ కమిటీ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రాజెక్టును సందర్శించిన కమిటీ.. ఇప్పుడు విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఇవాళ భారీ సంఖ్యలో తాజా మాజీ అధికారులు కమిషన్ ముందు హాజరు కానున్నారు. విచారణలో భాగంగా.. కాళేశ్వరం కమిషన్ ముందుకు 18 మంది తాజా మాజీ అధికారులు హాజరు కానున్నారు. ఈ ఇరిగేషన్ అధికారులు మధ్యాహ్నాంలోపే నేరుగా కమిషన్ కార్యాలయానికి వెళ్తారని, కమిషన్ అడిగిన వివరాలకు లిఖితపూర్వకంగా సమాధానాలు ఇవ్వనున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరంపై ఇంజినీర్లు, రిటైర్డ్ఇంజినీర్లకు నోటీసులు ఇస్తూ వివరాలు రాబడుతున్నారు. ఇంకో నాలుగైదు రోజులు జస్టిస్ పినాకి చంద్రఘోష్ రాష్ట్రంలోనే ఉండి, విచారణ చేయనున్నారు. మరికొంతమందికి నోటీసులు జారీ చేసి, ఎంక్వైరీకి పిలువనున్నారు.నిన్నటి విచారణకు..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణలో భాగంగా.. తన ఎదుట చెప్పిన అంశాలను రాతపూర్వకంగా అఫిడవిట్ రూపంలో అందజేయాలని న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ఇంజినీర్లకు సూచించినట్లు తెలిసింది. ఈ అఫిడవిట్లన్నీ రహస్యంగా ఉంటాయని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజి కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజికి గల కారణాలతోపాటు డిజైన్లు, నిర్వహణ, ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయాలు, అంచనాల పెంపు తదితర అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. విచారణలో భాగంగా సోమవారం పలువురు ఇంజినీర్లు కమిషన్ ఎదుట హాజరయ్యారు. మాజీ ఈఎన్సీలు మురళీధర్ (జనరల్), వెంకటేశ్వర్లు (కాళేశ్వరం), నరేందర్‌రెడ్డి (డిజైన్స్)తో పాటు డిజైన్స్ విభాగంలో ఎస్ఈలుగా పనిచేసిన చంద్రశేఖర్, బసవరాజు, సుందిళ్ల, అన్నారం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఓంకార్‌సింగ్, యాదగిరి తదితరులు హాజరయ్యారు. మేడిగడ్డ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తిరుపతిరావు హాజరుకావాల్సి ఉండగా.. ఆయన గడువు కోరినట్లు తెలిసింది. బ్యారేజీలకు సంబంధించి మీ అనుభవాలను, అభిప్రాయాలను నిజాయతీగా, స్వేచ్ఛగా వెల్లడించాలని వారిని కమిషన్ కోరినట్లు తెలిసింది.జూన్‌లోపు పూర్తి కాదుకాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ సోమవారం నుంచి ప్రత్యక్ష విచారణను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లోని కమిషన్ కార్యాలయంలో ఇంజినీర్లను విడివిడిగా విచారించే ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విచారణ ప్రక్రియ ఈ నెలాఖరులోపు పూర్తికాదని విచారణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. సమగ్ర విచారణకు ఇంకా సమయం పడుతుందని, వాస్తవాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వడం సాధ్యం కాదని అన్నారు. గడువు అంశాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని పేర్కొన్నారు. ‘మొన్నటి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో విచారణలో కొంత జాప్యం చోటుచేసుకుంది. సోమవారం ఏడుగురిని విచారణకు పిలిపించాం. ఆనకట్టల బాధ్యతలు పర్యవేక్షించిన ఇంజినీర్ల నుంచి ఈ రోజు వివరాలు సేకరించాం. త్వరలో నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా పిలుస్తాం. మంగళవారం విచారణకు రావాలని 18 మందికి నోటీసులిచ్చాం. సాంకేతికాంశాలపై విచారణ జరుగుతోంది. ఇది పూర్తయ్యాక, ఆర్థికాంశాలు, అవకతవకలపై విచారణ మొదలు పెడతాం. లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. కమిషన్ సూచనల మేరకు ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వనుంది’ అని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల భేటీజస్టిస్ పీసీ ఘోష్‌తో సోమవారం సాయంత్రం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ సమావేశమయ్యారు. బ్యారేజీలపై విచారణ సందర్భంగా వెల్లడైన అంశాలు, ఇటీవల క్షేత్రస్థాయి పర్యటన సందర్భంగా కమిషన్ దృష్టికి వచ్చిన అంశాలపై చర్చించినట్లు తెలిసింది. 54 ఫిర్యాదులు:జస్టిస్ పీసీ ఘోష్కాళేశ్వరం విచారణ వేగంగా సాగుతోందని జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. ‘ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రాజెక్టును సందర్శించాను. విచారణకు హాజరు కావాల్సిన అధికారులు, ఇంజినీర్లకు నోటీసులిస్తున్నాం. అన్ని విషయాలు రానున్న రోజుల్లో బయటకు వస్తాయి. విజిలెన్స్ విభాగం వద్ద ఉన్న అన్ని వివరాలను ప్రభుత్వం అందజేసింది. వాటిని కూడా పరిశీలిస్తాం. కమిషన్‌కు ఇప్పటి వరకు 54 ఫిర్యాదులొచ్చాయి. వాటిలో భూసేకరణ, నష్టపరిహారానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. కమిషన్‌కు సంబంధం లేని అంశాలపై ప్రభుత్వానికి సూచనలు చేస్తాం. బ్యారేజీల రక్షణ చర్యలు, మరమ్మతులనేవి నా పని కాకపోయినా.. ప్రజాప్రయోజనాల దృష్ట్యా తగిన భద్రత చర్యలు చేపట్టాలని సూచించాను. ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలు స్పందించి పనులు చేపట్టాయి’ అని ఆయన వివరించారు. -
పనికిరాని ప్రాజెక్టుకు మరమ్మతులెందుకు?
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం త ప్పుదారిలో పడింది. ఈ ని ర్ణయం వల్ల కాంగ్రెస్‌కే నష్టం జరుగుతుంది. పనికిరాని ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడం సరికాదు’అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. దీనికి సంబంధించిన వివరాలను తాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో వివరించేందుకు సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. గురువారం బీజేపీ కార్యాలయంలో విశ్వేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా చూస్తే ఎన్నికల వరకే కొట్లాటలు ఉంటాయని, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్ల పరిధిలోని జంట జలాశయాల పరిరక్షణకు సంబంధించి గత ప్ర భుత్వం జీఓ 111 రద్దు చేసినా, దాని కంటే కూడా నిరర్థకమైన జీఓ 69ను కొత్తగా తీసుకొచ్చిందని విమర్శించారు. ఇక్కడ పర్యావరణ పరిరక్షణతోపాటు అభివృద్ధి కూడా జరగాలంటే ఈ ప్రాంతాన్ని ‘సస్టెయినబుల్ ఏరియా’గా ప్రకటించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముస్లింలలో విషం నింపిందని మండిపడ్డారు. బీజేపీ మతతత్వ పార్టీ కాదని, దానికి పూర్తి విరుద్ధంగా కాంగ్రెస్ మతతత్వ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. మోదీ వేవ్‌తోనే తాను చేవెళ్లలో పెద్ద మెజారిటీతో గెలుపొందానని చెప్పారు. కేంద్ర కేబినెట్లో మీకు పదవి ల భించనుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు విశ్వేశ్వర్‌రెడ్డి స్పందిస్తూ ‘కేంద్రమంత్రి అయితే నాకు రాజకీయంగా నష్టం. దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన బాధ్యతల కారణంగా చేవెళ్ల ప్రజలకు దూరం అవుతా. కానీ నాకున్న పరిజ్ఞానం దేశం మేలు కోసం ఉపయోగించాలని ఉంది’ అని అన్నారు. -
మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ (లక్ష్మి) కుంగిపోయిన అంశంపై ఏర్పాటు చేసిన జ్యుడీíÙయల్ కమిషన్ చైర్మన్, రిటైర్డ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ మంగళవారం.. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఆయన రాష్ట్ర ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్‌తో కలసి మంగళవారం మధ్యాహ్నం 1.40 గంటలకు బ్యారేజీకి వద్దకు చేరుకున్నారు. బ్యారేజీ 7వ బ్లాక్‌లో కుంగిన 20వ నంబర్ పియర్.. దానికి అటూఇటూ ఉన్న 19, 21 పియర్లను.. వాటి కింది భాగంలో వచ్చిన పగుళ్లను పరిశీలించారు. వంతెనపై కాలినడకన వెళ్లి చూశారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న పరిస్థితులు, పియర్ల కుంగుబాటు, ఇతర అంశాలపై ఇరిగేషన్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. తర్వాత ఎల్అండ్టీ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. భోజనం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విచారణ కోసం వచ్చినట్టు తెలిపారు. ఇరిగేషన్ నిపుణులతో కలసి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించామని, ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ బృందం ఇచ్చిన నివేదికలను స్టడీ చేయాల్సి ఉందన్నారు. తాను ఇంజనీర్‌ను కాదని, టెక్నికల్ టీం వాటిని పరిశీలిస్తుందని వివరించారు.మేడిగడ్డకు ఇంకా గండమే!» బ్యారేజీకి మరింత ముప్పును తోసిపుచ్చలేమన్న నిపుణుల కమిటీ» తాత్కాలిక చర్యలను సిఫార్సు చేస్తూ మధ్యంతర నివేదిక» నివారణ చర్యలు తీసుకున్నా తాత్కాలికమేనని వెల్లడి» మూడు బ్యారేజీల గేట్లన్నీ ఎత్తి ఉంచాల్సిందేనని సూచనసాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ వద్ద ప్రస్తుతం చేపట్టే ఎలాంటి చర్యలైనా తాత్కాలికమే నని.. మరింత దెబ్బతినకుండా ఉండటాకేనని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ పేర్కొంది. 7వ బ్లాక్ మరింత ప్రమాదానికి లోన య్యే అవకాశాలను తోసిపుచ్చలేమని పేర్కొంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నీటి ఒత్తి డి పడకుండా.. వర్షాకాలం ప్రారంభానికి ముందే అన్ని గేట్లను పూర్తిగా పైకి ఎత్తి ఉంచాలని.. బ్యారేజీ ల దిగువన కొట్టుకుపోయిన సీసీ బ్లాకులు, అప్రాన్ లను పునరుద్ధరించాలని సూచించింది. మేడిగడ్డలో మొరాయించిన గేట్లను అవసరమైతే తొలగించాల ని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం చేసి, పునరుద్ధరణకు తీసు కోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి ‘నేషన ల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)’ అయ్యర్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ పరిశీలన జరిపి.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అత్యవసరంగా చేపట్టాల్సిన తా త్కాలిక మరమ్మతులు, తదుపరి అధ్యయనా లను సిఫారసు చేస్తూ మధ్యంతర నివేదిక సమర్పించింది. ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ ఈ నెల 1న రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఈ నివేదికను పంపించారు.కుంగిపోయిన 7వ బ్లాక్‌కు సంబంధించి చేసిన సూచనలివీ..» పియర్లు, ర్యాఫ్ట్ ఫ్లోర్‌కు ఏర్పడిన పగుళ్లలో వచ్చే మార్పులను టెల్–టేల్స్ వంటి తగిన సాంకేతిక పరిజ్ఞానంతో నిరంతరం సమీక్షిస్తూ ఉండాలి.» 16 నుంచి 20వ నంబర్ వరకు పియర్లు స్వల్పంగా ఒరిగిపోవడం/ పగుళ్లు ఏర్పడటం జరిగింది. ఆ పగుళ్లు మరింత చీలకుండా తగిన రీతిలో బ్రేసింగ్ చేయాలి. అవసరమైతే బాక్స్ గ్రిడ్డర్, లాటిస్ గ్రిడ్డర్/ట్రస్ వంటిని వాడవచ్చు.» బ్యారేజీ పునాదిలోని ప్రెషర్ రిలీజ్ వాల్వŠస్ దెబ్బతిన్నాయి. మరమ్మతులైనా చేయాలి, కొత్తవైనా ఏర్పాటు చేయాలి.» బ్లాక్–7లోని అన్ని పియర్లపై ఆప్టికల్ టార్గెట్ పరికరాలను ఏర్పాటు చేసి, మార్పులను సమీక్షిస్తూ ఉండాలి.» ఎగువ, దిగువ సెకెంట్ పైల్స్, ఎగువ, దిగువ పారామెట్రిక్ జాయింట్ల పరిస్థితిని సమగ్రంగా మదించాలి.» దెబ్బతిన్న ప్లింత్ శ్లాబును తొలగించి నదీ గర్భాన్ని సరిచేయాలి. బ్యారేజీ కింద ఇసుక కొట్టుకుపోకుండా చూసే ఇన్వర్టెడ్ ఫిల్టర్లను తగిన ప్రాంతంలో ఏర్పాటు చేయాలి.» 7వ బ్లాక్‌కు దిగువన నదీ గర్భంలో షీట్‌పైల్స్‌ను 9 మీటర్ల లోతు వరకు ఏర్పాటు చేయాలి. ర్యాఫ్ట్ చివరి కొన, ప్లింత్ శ్లాబు, షీట్‌పైల్ ఉపరితల భాగం మధ్యలో సిమెంట్, ఇసుక మిశ్రమంతో సీల్ వేసినట్టు జాయింట్లు వేయాలి.» ర్యాఫ్ట్‌కు సాధ్యమైనంత తక్కువ సంఖ్యలో రంధ్రాలు చేసి... దాని దిగువన ఏర్పడిన ఖాళీల్లోకి ఇసుక, సిమెంట్, నీటి మిశ్రమాన్ని పంపి పూడ్చివేయాలి. -
కాళేశ్వరంపై న్యాయ విచారణ షురూ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ న్యాయ విచారణ ప్రక్రియను ప్రారంభించారు. బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన బీఆర్కేఆర్ భవన్లో తనకు కేటాయించిన కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.నీటిపారుదల శాఖపై ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం, మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ నిర్వహించిన దర్యాప్తు నివేదిక, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ సమర్పించిన ఆడిట్ నివేదికలతో పాటు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన కీలక ఫైళ్లను జస్టిస్ చంద్రఘోష్ కు ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు అందజేసినట్టు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణంలో నిర్లక్ష్యం, అక్రమాలు, లోపాలపై న్యాయ విచారణ కోసం ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించడం తెలిసిందే. కాగా, 26 లేదా 27 తేదీల్లో బ్యారేజీల సందర్శనకు ఆయన వెళ్లే అవకాశముందని అధికారవర్గాలు వెల్లడించాయి. నేడు అధికారులతో మళ్లీ భేటీ గురువారం ఉదయం 10 గంటలకు నీటిపారుదల శాఖ అధికారులతో మరోసారి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై వివిధ సందర్భాల్లో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రత్యేక నివేదికను ప్రభుత్వం ఆయనకు అందజేయనున్నట్టు తెలిసింది. కాగా, ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇంజనీర్లకు నోటీసుల జారీపై గురువారం నాటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. -
కేసీఆర్‌కు భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,ఢిల్లీ: మాజీ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో వాటర్ మేనేజ్మెంట్ లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎండిన పంటలను పరిశీలించిన తర్వాత సూర్యాపేటలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై భట్టి సోమవారం ఢిల్లీలో స్పందించారు. ‘చలికాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మా పాలనలో ఇంకా వర్షాకాలం రానే రాలేదు. కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ అని డబ్బా కొట్టారు అది కూడా కూలిపోయింది. నీళ్లు ఉంటే ఇప్పటికే అది మొత్తం కూలిపోయేది. కేసీఆర్ హయాంలో అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు. యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుపై ప్రస్తుతం ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. కేసీఆర్ పదేళ్లలో ఎస్ఎల్బీసీ ఒక్క కిలోమీటర్ కూడా తవ్వలేదు. కాళేశ్వరం కార్పొరేషన్ బకాయిలు చెల్లిస్తాం. డిఫాల్ట్ కాబోము. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోంది. ఐఐటీలో చదివిన ఐఏఎస్‌లను డిస్కంలకు చీఫ్‌లను చేశాం. కేసీఆర్ మాత్రం ఒక అకౌంటెంట్‌ను సీఎండీ చేశారు’ అని భట్టి విమర్శించారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్‌రెడ్డి -
మేడిగడ్డ విచారణకు కమిటీ ఏర్పాటు
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎన్డీఎస్ఏ ప్రకటించింది. వచ్చే వారం ఎన్డీఎస్ఏ కమిటీ మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు రానుంది. చదవండి: మేడిగడ్డ, కాళేశ్వరంపై చర్యలేవీ? -
లోక్‌సభ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్ నీటి పోరు యాత్ర
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ మళ్లీ పోరు బాట పట్టనుంది. తర్వలో నీటి పోరు యాత్ర చేసేందుకు పార్టీ యోచిస్తోంది. దక్షిణ తెలంగాణలోని నాగార్జున సాగర్, ఉత్తర తెలంగాణలోని కాళేశ్వరం నుంచి నీటి పోరు యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ పెద్దలు ప్లాన్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో యాక్టివ్ అవుతోంది. ఇటీవలే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడంపై నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభ సక్సెస్‌తో జోష్‌లో ఉన్న బీఆర్ఎస్ ఇదే ఊపులో నీటి పోరుయాత్ర చేసి తమ పాలనకు, కాంగ్రెస్ పాలనకు ఉన్న తేడాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కారు పార్టీ డిసైడైనట్లు కనిపిస్తోంది. తెలంగాణ కోసం కొట్లాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని ఎన్నికల వేళ మరోసారి ప్రజలకు గుర్తుచేసేందుకే ఈ యాత్ర అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఉంటుందని ఊహాగానాల నేపథ్యంలో ఇరు పార్టీల సీనియర్ నేతలు దానిని ఖండిస్తున్నారు. కానీ ఎన్నికల వేళ కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. పొత్తుపై బీజేపీ పెద్దలతో మాట్లాడేందుకే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి.. ఆరు గ్యారెంటీల అమలు ఎప్పుడు: కిషన్‌రెడ్డి -
అన్నారం బ్యారేజీని పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం
సాక్షి, హైదరాబాద్: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేతృత్వంలోని నిపుణుల బృందం నేడు(మంగళవారం) రాష్ట్రానికి చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం(సరస్వతీ) బ్యారేజీలను ఎన్డీఎస్ఏ అధికారులు పరిశీలించారు. ముందుగా అన్నారం బ్యారేజీలోని 39వ పియర్ వద్ద ఏర్పడిన సీపేజీ పరిశీలించారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ బ్లాక్ 7లో కుంగిన ప్రాంతాన్ని వీక్షించారు. నది గర్భంలో బ్యారేజీ కిందకు వెళ్లి ఇరువైపు ఏర్పడిన పగుళ్లను పరిశీలించారు. కాగా బ్యారేజీలో వాటర్ లీకేజీ విషయాన్ని ఇంజనీర్లు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ దృష్టికి తీసుకెళ్లగా.. మూడు బ్యారేజిల్లో నీళ్ల స్టోరేజి అంశాన్ని ఎన్డీఎస్ఏకు ప్రభుత్వం అప్పగించింది. ఎన్డీఎస్ఏ ఇచ్చే నివేదికతోనే మరమ్మత్తులు చేయాలా వద్దా అనే అంశంపై కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. మరమత్తుల కోసం అన్నారం బ్యారేజీలో ఇప్పటికే స్టోరేజ్ వాటర్ రిలీజ్ చేయాలని ఎన్డీఎస్ఏ సూచించిన క్రమంలో రాత్రికి రాత్రే గేట్లు తెరిచి నీటిని పూర్తిగా విడుదల చేశారు అధికారులు. బ్యారేజీలో నిలువ ఉన్న మొత్తం 2.5 టీఎంసీల నీటిని కిందికి వదిలారు. ఇక అన్నారం నీళ్లు వదలడంతో మేడిగడ్డ దగ్గర పనులు ఆగిపోయాయి. కాగా ఈ బ్యారేజీలోపలుమార్లు సీపేజ్‌లు ఏర్పడగా.. ఆప్కాన్స్ సంస్థ ఇప్పటికే కెమికల్ గ్రౌటింగ్ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మరోచోట చిన్న చిన్న సీపేజ్‌లు కనిపిస్తున్నాయి. దీంతో సీపేజ్‌లకు పూర్తిస్థాయి ట్రీట్మెంట్ చేయడంతోపాటు బ్యారేజీలోని లోపాలను కనుగొనేందుకు ప్రభుత్వం పార్సన్ సంస్థకు ఇన్వెస్టిగేషన్ బాధ్యతలను అప్పగించింది. అయితే నీటిని పూర్తిగా ఖాళీ చేయడంతో బ్యారేజీ పొడవునా 1.6 కిలోమీటర్ల దూరం వరకు లక్ష క్యూబిక్ మీటర్ల మేర గేట్ల వద్ద అర మీటరు ఎత్తులో ఇసుక పేరుకుంది. దీంతో బ్యారేజీలో సమగ్ర సర్వే చేసేందుకు వీలవుతుందా అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక తీయకపోతే ఫౌండేషన్, పియర్, ర్యాప్ట్‌ల కింద ఖాళీ ప్రాంతం ఎక్కడ ఎంత మేర ఉందనేది తెలియదని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇసుక తొలగించిన తరువాతనే సీపేజీ లీకేజీపై విశ్లేషణ సాధ్యం అవుతుందని అంటున్నారు. గేట్లు కూడా పాడైపోయినట్లు సమాచారం. చదవండి: HYD: పంటి చికిత్స కోసం వెళితే ప్రాణం పోయింది.. -
రీ–ఇంజనీరింగ్‌తో 122% పెరిగిన వ్యయం!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఏపీలో రూ.38,500 కోట్ల అంచనాతో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టగా.. తెలంగాణ వచ్చాక రీ–ఇంజనీరింగ్ ద్వారా కాళేశ్వరం, ప్రాణహిత అనే రెండు ప్రాజెక్టులుగా విభజించడంతో అంచనా వ్యయం రూ.85,651.81 కోట్లకు చేరిందని కాగ్ నివేదికలో పేర్కొంది. అంటే ప్రాజెక్టు వ్యయం 122శాతం పెరిగిందని.. కానీ లక్షిత ఆయకట్టు 52.22శాతమే పెరిగిందని వివరించింది. ఆ తర్వాత కూడా ప్రాజెక్టు పనుల్లో మార్పు లు, చేర్పులు చేయడంతో అంచనా వ్యయం రూ. 1,47,427.41 కోట్లకు చేరినా.. ప్రయోజనాలేమీ పెరగలేదని పేర్కొంది. కాళేశ్వరంపై 2021–22 ఆర్థిక ఏడాది చివరినాటికి కాగ్ నిర్వహించిన ఆడిట్ నివేదికను ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. నివేదికలోని ముఖ్యాంశాలివీ.. పంపింగ్ పెంచడంతో అదనపు వ్యయం కాళేశ్వరం డీపీఆర్‌ను 2018 జూన్‌లో కేంద్ర జలసంఘం ఆమోదించడానికి ముందే రూ.25,049.99 కోట్ల విలువైన 17 పనులను నీటిపారుదల శాఖ కాంట్రాక్టర్లకు అప్పగించింది. తొలుత గోదావరి నుంచి రోజుకు 2టీఎంసీలను ఎత్తిపోయాలని ప్రతిపాదించారు. తర్వాత అవసరం లేకున్నా పంపింగ్సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు పెంచడంతో రూ.28,151 కోట్ల అదనపు వ్యయం అవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో కలిగే ప్రయోజనాలను ఎక్కువ చేసి చూపారు. ఇతర ప్రాజెక్టుల కింద ఒక టీఎంసీ నీళ్లు 10వేల ఎకరాలకే సరిపోతాయని చూపగా.. కాళేశ్వరం కింద 17,668 ఎకరాలకు అందించవచ్చని లెక్కించారు. తాజా అంచనా రూ. 1.47 లక్షల కోట్లలెక్కన చూస్తే.. ప్రాజెక్టు ప్రయోజన–వ్యయ నిష్పత్తి 0.52గా తేలుతోంది. అంటే వెచ్చించే ప్రతి రూపాయికి 52 పైసలే ప్రయోజనం అందుతుంది. ప్రాజెక్టుకు ఏటా విద్యుత్ చార్జీలు, నిర్వహణ కలిపి రూ.10,647.26 కోట్ల ఖర్చు అవుతుంది. ఒక్కో ఎకరాకు సాగునీరు అందించడానికి ఏటా రూ.46,364 లెక్కన వ్యయం అవుతుంది. చెల్లింపుల వాయిదాతో మరింత భారం కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలను తిరిగి చెల్లించడానికి వచ్చే 14ఏళ్లలో మొత్తం రూ.1,41,544.59 కోట్లు అవసరం కానున్నాయి. కొన్ని రుణాల తిరిగి చెల్లింపు ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వాయిదా కోరింది. దీనితో రూ. 8,182.44 కోట్ల మేర అదనపు వడ్డీ భారం పడింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని 21 ఒప్పందాల పరిధిలో పంపులు, మోటార్లు, అనుబంధ పరికరాల కొనుగోళ్ల కోసం వాస్తవ ధరల కంటే అధికంగా వ్యయా న్ని అంచనా వేశారు. వీటిలోని నాలుగు పనుల్లో కాంట్రాక్టర్లకు రూ.2,684.73 కోట్ల మేర అనుచిత లబ్ధి కలిగే అవకాశాన్ని తోసిపుచ్చలేం. ఐదు ఒప్పందాల్లో టెండర్లు పూర్తయ్యాక ధరల సర్దుబాటుతో అధిక చెల్లింపులు జరిగాయి. నీరిచ్చింది 40,888 ఎకరాలకే.. ప్రాజెక్టు కింద 18.26లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును ప్రతిపాదించారు. ఇందులో 14.83లక్షల ఎకరాల మేర మాత్రమే కాల్వల వ్యవస్థను అభివృద్ధి పనులను చేపట్టారు. 2022 మార్చి చివరినాటికి వాస్తవంగా నీళ్లిచ్చింది 40,888 ఎకరాలకే. ఇక మల్లన్నసాగర్ జలాశయం ప్రాంతంలోని భూగర్భంలో నిటారుగా పగుళ్లు ఉన్నాయని, భూకంపాలకు అవకాశం ఉందని నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్ అధ్యయనంలో తేలింది. -
మాది ప్రజా ప్రభుత్వం.. భయపెడితే భయపడం: సీఎం రేవంత్
LIVE Updates గత ప్రభుత్వంలో మేడిగడ్డను ఎవ్వరినీ చూడనివ్వలేదు: సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విజిలెన్స్ విచారణ చేయించాము రీ డిజైన్ పేరుతో కేసీఆర్ వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుందనే నల్గొండ సభ పెట్టారు కేసీఆర్ కోటి ఒకటోసారి సావు నోట్లో తలకాయ పెట్టిన అని మరోసారి శుద్ధపూస లెక్క మాట్లాడుతుండు. కేసీఆర్ సావు నోట్లో తలకాయ పెడితే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు. స్మిత్మా సభర్వాల్ కృష్ణా బోర్డుకు ప్రాజెక్ట్ లను అప్పగించినట్లు అసెంబ్లీలో బయటపెట్టాము. మేడిగడ్డ పర్యటనకు, అసెంబ్లీకి కేసీఆర్ రాలేదు కాలు విరిగిన కేసీఆర్ నల్గొండ జిల్లాకు ఎలా వెళ్లారు? అసెంబ్లీ దగ్గర ఉందా? నల్గొండ దగ్గర ఉందా? కేసీఆర్ చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరు. కేసీఆర్ దోపిడీకి మేడిగడ్డ బలైపోయింది... అన్నారం సుందిల్లా సున్నం అయింది. మేడిగడ్డకు వచ్చిన వాళ్ళను కేసీఆర్ అవమానించారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్ట్ లు అప్పగించడం లేదని అసెంబ్లీ లో చేసిన తీర్మానానికి హరీష్‌రావు మద్దతు పలికారు. తీర్మానం పై లోపాలు ఉంటే కేసీఆర్ వచ్చి సవరించి ఉండేది. అఖిల పక్షం ఢిల్లీకి తీసుకుపోవాలని కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి డిమాండ్ చెయ్యాలి కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? కేసీఆర్ భేదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం... భయపెడితే భయపడం. మేము కేసీఆర్ లెక్క ఉద్యమం ముసుగులో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేదు. కాళేశ్వరం అంశాన్ని తప్పుదోవ పట్టించాడానికి నల్గొండ సభను కేసీఆర్ పెట్టారు. కేసీఆర్ మనస్తత్వం ముందే తెలుస్తే ఈ ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వకపోదురు. అధికారం పోగానే మళ్ళీ కేసీఆర్ కు ప్లా్రైడ్ గుర్తుకు వచ్చిందా? ప్రపంచ అద్భుత్వం అంటూ న్యూ యార్క్ లో కాళేశ్వరం ప్రాజెక్టు ను చూపించారు కేసీఆర్ నల్గొండ లో మాట్లాడటం కాదు - అసెంబ్లీ కి రావాలి ఇరిగేషన్ పై రేపు శ్వేతపత్రం పెడతాం... కేసీఆర్ చర్చలో పాల్గొనాలి. అన్ని పాపాలకు కారణం కేసీఆర్ మాత్రమే. మేడిగడ్డ తప్పిద్దాల్లో కేసీఆర్ భాగస్వయం ఉంది. కేసీఆర్ భాగస్వామ్యం ఉంది కాబట్టే అంత నిర్లక్ష్యం గా మాట్లాడుతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదంలో ఉంది రేపటి శాసన సభ సమావేశాల్లో పాల్గొని తన అనుభవాన్ని చెప్పాలి L AND T సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలా వద్దా అనేది కసీఆర్ సభలో చెప్పాలి. వందల మంది మరణించినా కేసీఆర్ రోడదెక్కలేదు... ఇప్పుడు అధికారం కోసం నల్గొండ జిల్లాకు వెళ్లారు. కుర్చీ దిగి 60 రోజులు కాలేదు... అప్పుడే ఓట్లు అడుక్కునే పరిస్థితి వచ్చింది. భయం అంటే తెలువని కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలి. నల్గొండ సభకు మహబూబ్ నగర్ నుంచి ప్రజలను తీసుకెళ్లారు. కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు పర్యటన కాదు.. కాశి పర్యటన కు వెళ్ళాలి వస్తానన్న బీజేపీ MLA లను కిషన్ రెడ్డి అడ్డుకున్నారు. బీజేపీ BRS ఒకటే అని మళ్ళీ నిరూపీతం అయింది. బీజేపీ BRS చీకటి ఒప్పందం త్వరలోనే బయటపడుతుంది. *కేసీఆర్ అవినీతి ని బయటకు తియ్యడానికి బీజేపీ వైఖరి ఏంటో తెలియజేయాలి కాళేశ్వరం పేరుతో రూ. లక్ష కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది: మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ నేతలను ఆహ్వానించినా రాలేదు వాస్తవాలు తెలుస్తాయనే భయపడుతున్నారు మేడిగడ్డ చేరుకున్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లర్లను పరిశీలిస్తున్న సీఎం, మంత్రులు. ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం బృందం మేడిగడ్డ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్న అధికారులు. మేడిగడ్డ పర్యటనకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి 4 ప్రత్యేక బస్సుల్లో సీఎం, మంత్రులు మరో గంటన్నరలో మేడిగడ్డకు చేరుకోనున్న సీఎం బృందం కాంగ్రెస్ సభ్యులతో కలిసి వెళ్లిన సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 3.30కు మేడిగడ్డ చేరుకోనున్న సీఎం, మంత్రులు మేడిగడ్డ ప్రాజెక్టు, కుంగిన పిల్లర్లను సందర్శించనున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం Hon’ble CM Sri. A.Revanth Reddy will participate in Medigadda Barrage site visit, Today https://t.co/o1kwK1stM5 — Telangana Congress (@INCTelangana) February 13, 2024 కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైంది: రేవంత్ రెడ్డి ట్వీట్ మేడిగడ్డ కూలి నెలలు గడుస్తున్నా...కేసీఆర్ నోరు మెదపడం లేదు రూ. 97 వేల కోట్ల వ్యయం చేస్తే 97 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదు. మేడిగడ్డ మరమత్తులకు పనికిరాదు. తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైంది. రూ. 97 వేల కోట్లు వ్యయం చేసి… 97 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రాజెక్టు డిజైన్ నుండి నిర్మాణం వరకు అన్నీతానై కట్టానని చెప్పిన కేసీఆర్, మేడిగడ్డ కూలి నెలలు… pic.twitter.com/GPGGtBX8Lf — Revanth Reddy (@revanth_anumula) February 13, 2024 కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే కాదు: హరీష్ రావు మిగతా బ్యారేజీలు కూడా చూడాలి రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ సర్కార్ మేడిగడ్డ బ్యారేజీ సందర్శన బ్యారేజీ పిల్లర్లు కుంగితే ఇష్యూ చేస్తున్నారు గత ప్రభుత్వంపై బురద చల్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నం మేడిగడ్డకు బయల్దేరిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులో సీఎం, మంత్రులు రోడ్డుమార్గాన మేడిగడ్డకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం, మంత్రుల రాకతో మేడిగడ్డ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు. బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలు. మేడిగడ్డ సందర్శనకు సీపీఐ, ఎంఐఎం సభ్యులు. బీఆర్ఎస్, బీజేపీ దూరం. సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం నేడు సందర్శించనుంది. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సుల్లో అక్కడికి వెళ్లనున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో బస్సులు సిద్ధంగా ఉన్నాయి. అసెంబ్లీ నుంచి బస్సుల్లో నేరుగా మేడిగడ్డకు బయలుదేరి మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 నుంచి 5 గంటల వరకు మేడిగడ్డ బ్రిడ్జి, కుంగిన పిల్లర్లను పరిశీలించనున్నారు. సాయంత్రం 5 గంటలకు అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. 6 గంటలకు సీఎం రేవంత్, మంత్రుల మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 7 గంటలకు మేడిగడ్డ నుంచి బయలుదేరి.. హైదరాబాద్‌కు తిరుగు పయనం కానున్నారు. -
కాళేశ్వరం అవినీతికి బీజేపీ మద్ధతు: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, సాక్షి: బాధ్యతలు తీసుకుని నెలైనా గడవక ముందే తమ ప్రభుత్వంపై కొందరు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం అవినీతి విషయంలో సీబీఐ విచారణ డిమాండ్ చేసే క్రమంలో కేంద్ర మంత్రి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేసిన రాజకీయ విమర్శలకు మంత్రి ఉత్తమ్ మంగళవారం సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ కౌంటర్ ఇచ్చారు. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలు సత్యదూరంగా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రంలో ఉన్న బీజేపీ మద్దతు ఇచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రూల్స్ మార్చారు. స్వాతంత్రం తరువాత సాగునీటి ప్రాజెక్టులకు కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదు. బ్యాంక్ లు, రూరల్ ఎలాక్ట్రిఫిషల్ ద్వారా లోన్స్ కాళేశ్వరం ప్రాజెక్టు కు కేంద్రం ఇప్పించింది. పవర్, ఇరిగేషన్ కార్పొరేషన్‌కు నిబంధనలు మార్చేసి మరీ లోన్ ఇచ్చింది. ప్రాజెక్టు కోసం ఏకంగా రూ. లక్షా 27 వేల కోట్లు మంజూరు చేశారు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకే రూ. 60వేల కోట్ల లోన్ బీజేపీ ఇప్పించింది. ‘‘దోచుకుందాం’’ అని లక్షల కోట్లు ఇచ్చారా?.. మేడిగడ్డ 5 పిట్లు కుంగితే కనీసం కిషన్ రెడ్డి పరిశీలన చెయ్యలేదు. కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ చేసిన కాళేశ్వరం కుంగితె ఎందుకు విజిట్ చెయ్యలేదు?. మేడిగడ్డ పై కేసీఆర్ స్పందించకపోతే కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు?. 80వేల కోట్ల ప్రాజెక్ట్ ను 1లక్ష 27వేల కోట్లకు పెంచితే కేంద్రం ఎందుకు అనుమతి ఇచ్చింది?. సీబీఐ-ఈడీ అంటూ ఇప్పుడు కిషన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నాయకుల పై తప్పు చేయకున్నా ఈడీ కేసులు వేసిన బీజేపీ.. కేసీఆర్ పై ఎందుకు వెయ్యలేదు?. కాళేశ్వరం కేసీఆర్ ఏటీఎం అనే అమిత్ షా, మోడీ, జేపీ నడ్డా పదే పదే అన్నారు కదా.. మరి ఎందుకు విచారణకు అదేశించలేదు? .. లిక్కర్ కేసులో కవిత పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?. పదేళ్ల పాటు లక్షల కోట్లు బీఆర్ఎస్ వాళ్ళు తిన్నారు అని బీజేపీ ఆరోపణ చేసింది మరి సీబీఐ విచారణ ఎందుకు కోరలేదు. మేడిగడ్డ డ్యామేజ్ పై ఖర్చు అంతా పూర్తిగా సంస్థనే భరిస్తుంది. ఇరిగేషన్ పై త్వరలోనే శ్వేత పత్రం విడుదల చేస్తాం. .. కాళేశ్వరం ప్రాజెక్టు పై మేము ఇచ్చిన మాట ప్రకారం జ్యుడీషియల్ విచారణ ఈ వారంలోనే మొదలు పెట్టాం. పదేళ్లపాటు అవినీతి కోసం బీజేపీ-బీఆర్ఎస్లు కలిసి పని చేశాయి. బాధ్యతలు తీసుకుని 20 రోజలైనా గడవక ముందే మాపై విమర్శలా?. కేసీఆర్ మాట్లాడకపోవడాన్ని బీజేపీ ఎందుకు ప్రశ్నించలేదు. ఎవరు తప్పు చేసినా మేం వదిలిపెట్టం అని మంత్రి ఉత్తమ్ చెప్పారు. అంతకు ముందు.. కాళేశ్వరం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం స్పందించారు. ‘‘కాళేశ్వరం పై సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణకు ఇప్పటికే ఆదేశించాం. కేసీఆర్‌ను రక్షించేందుకే బీజేపీ సీబీఐ విచారణ అడుగుతోంది. జ్యుడీషియల్ విచారణకు కేంద్రం ఉన్న బీజేపీ న్యాయ శాఖ సుప్రీం, లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జీని నియమించాలి. జ్యుడీషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జిని నియమించకుంటే.. కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి’’ అని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఇదీ చదవండి: ‘కాళేశ్వరం అవినీతి.. బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య సయోధ్యనా?’ -
రివైండ్ 2023.. 'వెలుగు' నీడలు..
ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అయ్యింది. ఒకేసారి ఏడు ప్రభుత్వ కాలేజీల ప్రారం¿ోత్సవం, వచ్చే సంవవత్సరానికి మరో ఏడు జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా వైద్యవిద్యకు పెద్దపీట వేశారు. ఇది సాకారం అయితే దేశంలోనే ప్రతిజిల్లాలోనూ మెడికల్ కాలేజీలున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కుతుంది. సాగునీటిరంగంలో కాళేశ్వం ప్రాజెక్టు లోపాలు పెద్ద కుదుపుగా చెప్పవచ్చు. పింఛన్లు పెంపు ఆసరా లబ్ధిదారులకు కొంత ఊరట కలిగించింది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిరాశే మిగిలింది. బదిలీలు, పదోన్నతులకు బ్రేక్ పడింది. కేంద్రంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘర్షణ వైఖరి కారణంగా ఉపాధి హామీ నిధుల విడుదలలో జాప్యం జరిగింది. వైద్య, ఆరోగ్యశాఖ ఈ ఏడాది సాధించిన ప్రధాన విజయాల్లో కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించడంగా చెప్పవచ్చు. 2023–24 సంవత్సరంలో కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ప్రారంభించింది. ఈ ఏడాది ఇప్పటికే మెడికల్ విద్యార్థులు వాటిల్లో చేరారు. ఇక 2024–25 సంవత్సరంలోనూ జోగుళాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఒక్కో కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోనుంది. అంటే 800 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. 33 జిల్లాలకుగాను ఇప్పటికే 25 జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకాగా, తాజాగా అనుమతించిన 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే అన్ని జిల్లాల్లో ఒక మెడికల్ కాలేజీ లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకుంటుంది. ఇవి పూర్తయితే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య మొత్తం 34కు చేరుతుంది. తాజా నిర్ణయంతో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండే ఏకైక రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నట్టే. అంటే మొత్తంగా రాష్ట్రంలో 10 వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. పీఆర్ అండ్ ఆర్డీ పింఛన్ రూ. 3,016 నుంచి రూ.4,016కు పెంపు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ విషయానికొస్తే..ప్రధానంగా ఆసరాలో భాగంగా దివ్యాంగుల పింఛన్ రూ.3,016 నుంచి రూ. 4,016కు బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది. పెంపునకు అనుగుణంగా 5,11,656 మందికి నెలకు రూ.205.48 కోట్లు అందజేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ♦ జీపీలు, సర్పంచ్‌లకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిధుల విడుదలలో జాప్యం గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎప్పటికప్పుడు రావాల్సిన నిధులు విడుదల కాకపోవడంతో పలు జీపీల్లో సర్పంచ్‌లు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నారు. వివిధ పనుల కోసం సొంత నిధులు ఖర్చు చేసినా ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాలేదు. ఈ బిల్లుల కోసం ఎదురుచూస్తూ, ఆర్థిక ఇబ్బందుల్లో మునిగి కొందరు సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్నారు. ♦ జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లోనూ నిధుల సమస్య ఉపాధి హామీ అమల్లో భాగంగా... తెలంగాణలో నియమ,నిబంధనలు, మార్గదర్శకాలు సరిగ్గా పాటించడం లేదంటూ రాష్ట్రానికి కేంద్రం నిధులు నిలిపేసింది. అయితే కేంద్రం పక్షపాతం ప్రదర్శిస్తూ సకాలంలో నిధులు విడుదల చేయడం లేదంటూ బీఆర్ఎస్ సర్కార్ విమర్శలు సంధించింది. ఇదిలా ఉంటే...ఈ పథకంలో భాగంగా ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్, ఔట్సోర్సింగ్–కాంట్రాక్ట్ పద్ధతుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి గత రెండు, మూడు నెలలుగా వేతనాలు విడుదల కాకపోవడంతో వీరిలో తీవ్ర ఆందోళన నెలకొంది. మా‘స్టార్’ ఏదీ? ♦ సాగని పదోన్నతులు... ఆగిన బదిలీలు ఆఖరులో తప్పని ♦ టెట్ చిక్కులు.. టీచర్ పోస్టులకూ బ్రేకులు ♦ ఉన్నత విద్యామండలిలో మహా నిశ్శబ్దం దీర్ఘకాలిక డిమాండ్ అయిన బదిలీలు, పదోన్నతులుపై ఆశలు రేకెత్తిందీ ఈ ఏడాదే. 10 వేలమంది టీచర్లు ప్రమోషన్లపై కలలుగన్నారు. దాదాపు 50 వేలమంది స్థానచలనం ఉంటుందని ఆశించారు. కానీ నోటిఫికేషన్ ఇచ్చిన ఊరట ఎంతోకాలం నిలవలేదు. అడ్డుపడ్డ కోర్టు వ్యాజ్యాలు టీచర్ల ఆనందాన్ని ఆవిరి చేసింది. ప్రమోషన్లకూ బ్రేకులు పడటం 2023 మిగిల్చిన చేదు జ్ఞాపకమే. ఉపాధ్యాయ కొలువుల భర్తీపై నిరుద్యోగుల గంపెడాశలకు 2023 నీళ్లు చల్లింది. విద్యాశాఖలో 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నా, 5 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ రావడం, అదీ అర్ధంతరంగా ఆగిపోవడం నిరుద్యోగులకు 2023 అందించిన ఓ పీడకల. జాతీయ ర్యాంకుల్లో మన విశ్వవిద్యాలయాల వెనుకబాటు, యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ కోసం జరిగిన ఉద్యమాలు దూరమయ్యే కాలంలో కని్పంచిన దృశ్యాలు. బాసర ట్రిపుల్ ఐటీలో వెంటవెంట జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు విద్యార్థిలోకాన్ని కలవరపెట్టాయి. టెన్త్ పరీక్షల సరళీకరణ, ఇంటర్ పరీక్షల్లో మార్పులకు శ్రీకారం 2023లో కనిపించిన కొత్తదనం. ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఉన్నత విద్యామండలిలో కుదుపులకు గతించే కాలమే సాక్షీభూతమైంది. మండలి చైర్మన్, వైస్‌చైర్మన్ తొలగింపుతో కార్యకలాపాలే మందగించిపోవడం ఈ ఏడాదిలో ఊహించని పరిణామమే. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు విద్యార్థులు పోటెత్తడం ఈ సంవత్సరంలో కనిపించిన విశేషం. కరోనా కాలం నుంచి ఆటుపోట్లు ఎదుర్కొంటున్న జేఈఈ మెయిన్ కాస్తా గాడిలో పడింది. రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి ♦ 2022–23 సీజన్లో వరి ఉత్పత్తి ♦ 2.58 కోట్ల టన్నులు రికార్డులు బద్దలు కొట్టిన తెలంగాణ వ్యవసాయరంగం రాష్ట్రంలో వరి ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరిగింది. 2022–23 వానాకాలం, యాసంగి సీజన్లలో వరి ధాన్యం 2.58 కోట్ల టన్నులు ఉత్పత్తి అయ్యింది. వానాకాలం సీజన్లో 1.38 కోట్ల టన్నులు, యాసంగిలో 1.20 కోట్ల టన్నులు ఉంది. ఈ మేరకు తుది నివేదికను ఈ ఏడాది ప్రభుత్వం విడుదల చేసింది. వానాకాలం సీజన్లో 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఉత్పాదకత ఎకరానికి 2,124 కిలోలు వచ్చింది. కాగా, ఈ యాసంగిలో 57.46 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వరి ఉత్పాదకత ఎకరానికి 2,091 కిలోలు వచ్చింది. మొత్తంగా చూస్తే ఈ రెండు సీజన్లలో 1.22 కోట్ల ఎకరాల్లో వరి సాగు కాగా, ఎకరానికి 2,108 కిలోల ఉత్పాదకత వచ్చింది. ఆ మేరకు 2.58 కోట్ల టన్నుల వరి ఉత్పత్తి అవుతుందని తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం గత మార్చి 15వ తేదీన విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణ వరి ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది. కాగా, ఈ ఏడాది వరకు 11 విడతల్లో కలిపి రైతుబంధు కింద రైతులకు పెట్టుబడి సాయం రూ. 72,815 కోట్లు ఇచ్చారు. ప్రస్తుతం 12వ విడత సొమ్మును కొత్త ప్రభుత్వం అందజేసే ప్రక్రియ చేపట్టింది. అందులో ఒక ఎకరాలోపు రైతులకు రైతుబంధు సొమ్ము అందజేస్తున్నారు. కాళేశ్వరం ‘కుదుపు’ మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతో మసకబారిన గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్ట ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చివరకు బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టను కుంగదీసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో బయటపడిన లోపాలు.. 2023 చివరి త్రైమాసికంలో రాష్ట్ర రాజకీయాలను కుదిపివేశాయి. మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ పియర్లు గత అక్టోబర్ 21వ తేదీన కుంగిపోగా, కొన్ని రోజులకే అన్నారం బ్యారేజీలో బుంగలు ఏర్పడ్డాయి. ప్లానింగ్, డిజైన్, నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకులోని పియర్లు కుంగినట్టు ..నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. 7వ బ్లాక్‌ను పూర్తిగా పునర్నిర్మించాల్సిందేనని సిఫారసు చేసింది. ఇతర బ్లాకులూ విఫలమైతే బ్యారేజీని పూర్తిగా పునర్నిర్మించక తప్పదని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకి సైతం ఇలాంటి డిజైన్లు, నిర్మాణ పద్ధతులనే అవలంబించడంతో భవిష్యత్‌లో వాటికి సైతం ఇలాంటి సమస్యలు తలెత్తవచ్చని ఎన్డీఎస్ఏ ఆందోళన వ్యక్తం చేసింది. అన్నారం బ్యారేజీ పునాదుల (రాఫ్ట్) కింద నిర్మించిన కటాఫ్ వాల్స్కి పగుళ్లు రావడంతోనే బ్యారేజీకి బుంగలు ఏర్పడినట్టు ఎన్డీఎస్ఏ బృందం మరో నివేదికలో స్పష్టం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను సొంత ఖర్చులతో చేస్తామని గతంలో హామీ ఇచ్చిన నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే మాట మార్చింది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ విషయం ఎవరు చేపట్టాలని అన్న అంశంపై ఎల్అండ్ టీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇంకా ఎలాంటి అంగీకారం కుదరలేదు. మిల్లుల్లోనే రూ. 22 వేల కోట్ల విలువైన బియ్యం పేదలకు ఉచిత బియ్యం పంపిణీతో పాటు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించే బృహత్తర బాధ్యత నిర్వహిస్తున్న పౌరసరఫరాల శాఖ 2023లో కొన్ని తప్పటడుగులు వేసింది. తద్వారా కార్పొరేషన్‌కు అప్పులు గుదిబండగా మారాయి. 2022 రబీ(యాసంగి)లో రైతుల నుంచి సేకరించిన సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి అప్పగించకపోవడంతో ఆ భారం సంస్థపై పడింది. యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయడం వల్ల బియ్యం విరిగి తమకు నష్టం వస్తుందని, అందుకే మిల్లింగ్ చేయలేమని రైస్‌మిల్లర్ల వాదనను అంగీకరించింది. మిల్లర్ల పట్ల ఉదారత చూపి, ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రయత్నించగా, ఎన్నికల సంఘం బ్రేక్ వేయడంతో మిల్లుల్లోనే 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉండిపోయాయి. వీటితో పాటు అంతకు ముందు లెక్క తేలని ధాన్యం కలిపి సుమారు రూ. 22వేల కోట్ల విలువైన 83 ఎల్ఎంటీ ధాన్యం మిల్లుల్లోనే ఉన్నట్లు మిల్లర్లు చూపారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే ఈ లెక్కలు తీసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌరసరఫరాల సంస్థ ఏకంగా రూ.56వేల కోట్ల అప్పులు ఉన్నట్లు లెక్కలు చెప్పారు. ఇవి కాకుండా రూ. 11వేల కోట్లు సంస్థ నష్టపోయినట్లు తేల్చారు. మిల్లర్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరించిన కారణంగా 2023లో ఆ సంస్థ ప్రజల్లో పలుచనైపోయిందన్న వాదనలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. -
కాళేశ్వరం ఖర్చు రూ.93,872.07 కోట్లు ..
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా 215 టీఎంసీల గోదావరి జలాలను తరలించి రూ.19.63 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి, 18.82 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ జరపాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 98,570 ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి చేశారు. మొత్తం రూ.1,27,872.28 కోట్ల అంచనాతో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టగా, ఇప్పటివరకు రూ.93,872.07 కోట్లు ఖర్చు చేశారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్) ద్వారా సమీకరించిన రూ.61,665.20 కోట్ల రుణాలతోపాటు రూ. 32,206.87 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులు అందులో ఉన్నాయి. కాళేశ్వరం కింద 18,64,970 ఎకరాల మిగులు ఆయకట్టును 2028–29 నాటికి అభివృద్ధి చేసేందుకు గత ప్రభు త్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. శుక్రవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ బృందం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించనుంది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ కాళేశ్వరం ప్రాజెక్టు పుట్టుపూర్వోత్తరాలపై మంత్రుల బృందానికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ఇవ్వనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎందుకు అర్ధంతరంగా విరమించుకున్నారు? ఆ ప్రాజెక్టుకు బదులుగా కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు నిర్మించాల్సి వచి్చంది? వ్యయం, ప్రతిపాదిత ఆయకట్టు, నిధుల సమీకరణ, విద్యుత్ అవసరాల విషయంలో రెండు ప్రాజెక్టుల మధ్య తేడాలేంటి? మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో తలెత్తిన లోపాలు, సమస్యలేంటి? వాటికి పరిష్కార మార్గాలేంటి? అన్న అంశాలతో నీటిపారుదల శాఖ పీపీటీని సిద్ధం చేసింది. వడ్డీ రూపంలో రూ.16,201.94 కోట్లు ఇప్పటివరకు తీసుకున్న రుణంలో అసలు రూ.4,696.33 కోట్లు మాత్రమే చెల్లించగా, గత ఐదేళ్లలో వడ్డీలు రూ.16,201.94 కోట్లు చెల్లించారు. అసలు, వడ్డీ కలిపి రూ.21,157.87 కోట్లు చెల్లించా రు. కాళేశ్వరం కార్పొరేషన్లో భాగమైనపాలమూరు–రంగారెడ్డికి రూ.10 వేల కోట్ల రుణం మంజూరు కాగా.. పవర్‌ఫైనాన్స్ కార్పొరేషన్రూ.7,721.51 కోట్లు విడుదల చేసింది. ఇంకో రూ.2,278.49 కోట్లు మంజూరు చేయాల్సి ఉంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పులకు గత మూడేళ్లలో రూ.1,522.8 కోట్ల వడ్డీ చెల్లించగా, అసలు చెల్లింపులు ఇంకా మొదలుకాలేదు. 17.08 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ దిగువ మానేరు జలాశయం కింద ఎస్సారెస్పీ స్టేజ్–1కి సంబంధించిన పాత ఆయకట్టుతోపాటు ఎస్సారెస్పీ స్టేజ్–2, నిజాంసాగర్ ప్రాజెక్టుల కింద పాత ఆయకట్టుకు 2023–24 ఖరీఫ్, రబీ సీజన్లలో కాళేశ్వరం ద్వారా సాగునీరు అందించారు. దీంతో మొత్తం 17,08,230 ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించినట్టు నీటిపారుదల శాఖ మంత్రులకు నివేదించనుంది. ♦ కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల ద్వారా 456 చెరువులను నింపగా, వాటి కింద 39,146 ఎకరాల ఆయకట్టు ఉంది. కాళేశ్వరం నీళ్లను ఎస్సారెస్పీ–1, 2, నిజాంసాగర్ కాల్వల ద్వారా 2,143 చెరువులకు తరలించగా, వాటి కింద మరో 1,67,050 ఎకరాల ఆయకట్టు ఉంది. ♦ 2020–21 రబీ నుంచి 2023–24 ఖరీఫ్ వరకు కుందెల్లి వాగు, హల్దివాగు, 66 చెక్‌డ్యామ్‌ల కింద ఉన్న మొత్తం 20,576 ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం జలాలను విడుదల చేశారు. -
కేసీఆర్ సర్కారు కంపుని ఎలా భరిస్తున్నారు?: రేవంత్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: కోదండరాంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బీఆర్ఎస్ నేతలను చెప్పుతో కొడతారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కోదండరాం కాంగ్రెస్ కోసం పోటీ చేయకపోతే కేఏ పాల్ బీఆర్ఎస్ కోసమే పోటీ చేయడం లేదా చెప్పాలని ఫైర్ అయ్యారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై మండిపడ్డారు. కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు బలయిందని రేవంత్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబం ఆర్థిక ఉగ్రవాద కుటుంబం అని ఆరోపించారు. ఈ కుటుంబాన్ని శిక్షించడానికి కేంద్రం ముందుకు రావాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపడడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందన్నారు. కాళేశ్వరంపై జాతీయ స్థాయిలో ఒక కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలన్నారు. ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని కోరారు. మేడిగడ్డ బ్యారేజ్‌కు జరిగిన డ్యామేజ్ పై చర్యలు తీసుకోవాలన్నారు. అవినీతి వాసననే పడని మోదీ కేసీఆర్ సర్కారు కంపుని ఎలా భరిస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు. మోదీకి కంపు కొట్టకుండా కేసీఆర్ ఏదైనా సెంటు కొట్టి వశీకరణ చేస్తున్నారా? చెప్పాలన్నారు.ఇద్దరం ఒకటే అని కేసీఆర్,మోదీ చెప్పదలచుకున్నారా? అని నిలదీశారు. కాంగ్రెస్ మొదలు పెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారన్నారు.కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆలోచనలు మారి ఆశలు పెరిగాయన్నారు. ‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజుల ప్లానింగ్ వేరు,నిర్మాణం వేరుకావడం వల్లే మునిగిపోతున్నాయి.కేసీఆర్ ధనదాహానికి మేడిగడ్డ కుంగింది. కాళేశ్వరం కోసం తన మెదడును ఖర్చు చేశానని చెప్పిన కేసీఆర్ లోపాలు బయట పడగానే తప్పించుకుంటున్నారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అడిగే ప్రశ్నలకు కేసీఆర్ ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు. ఎల్ అండ్ టీ కంపెనీపై చర్యలు తీసుకోవడానికి కేసీఆర్ ఎందుకు వెనకాడుతున్నారు. కమిషన్లు నొక్కేయడానికే కేసీఆర్ ప్రణాళిక బద్దంగా ప్లాన్ వేశారు’అని రేవంత్ విమర్శించారు. -
మేడిగడ్డ ఏడో బ్లాక్ పరిధిలో పనులు
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఏడో బ్లాక్ 20వ పియర్ భారీ శబ్దంతో కుంగిపోయింది. బ్యారేజ్ దెబ్బతినడంతో సరిహద్దులో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య అక్టోబరు 21వ తేదీ నుంచి రాకపోకలను నిలిపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక తెలంగాణ ఎన్నికల వేళ రాజకీయపరమైన విమర్శలకు తావిచ్చింది. ఒకవైపు బ్యారేజ్ వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. మరోవైపు డ్యామేజ్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. పిలర్లు కుంగిపోయిన ఏడో బ్లాక్ పరిధిలో పనులు కొనసాగుతున్నట్లు సమాచారం. నీటిని మళ్లించినా ఎగువ ప్రాంతం నుంచి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాణహిత నుంచి బ్యారేజ్‌కు నీరు చేరుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు. ఎగువ నుంచి 26,350 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 61 గేట్లు ఎత్తి 22,590 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు నదిలో కాఫర్ డ్యాం పనులు సాగుతున్నట్లు తెలుస్తోంది. అన్నారం బుంగల కోసం గ్రౌటింగ్ అన్నారం (సరస్వతి) బ్యారేజీ బుంగలు ఏర్పడిన విషషయమూ తెలిసిందే. ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో ఇసుక, రాళ్లతో కూడిన సంచులు వేసినా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదని సమాచారం. దీంతో రెండు పియర్ల వద్ద సీపేజీ (బుంగలు) ఏర్పడగా వాటి మరమ్మతులకు ఢిల్లీ నుంచి నిపుణుల బృందం రానున్నట్లు సమాచారం. 2020లో ఇలాంటి పరిస్థితి ఎదురుకాగా పాలియూరిథిన్ (పీయు) గ్రౌటింగ్ ద్వారా బుంగలను పూడ్చారు. ఈ సారి కూడా ఇదే పద్ధతిని అవలంబించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: మేడిగడ్డ పంచాయతీ.. బారికేడ్లతో బ్యారేజ్ మూసివేత -
మేడిగడ్డ పంచాయతీ.. బారికేడ్లతో బ్యారేజ్ మూసివేత
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుపై జాతీయ డ్యాం సేప్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక సంచలనంగా ఉండడం.. అది కాస్త రాజకీయ విమర్శలకు దారి తీయడం తెలిసిందే. మరోవైపు మేడిగడ్డ సందర్శన కోసం రాజకీయ పార్టీలు క్యూ కడుతుండడంతో అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్యారేజ్‌ను పరిశీలించగా.. తాజాగా బీజేపీ నేతలు బ్యారేజ్ సందర్శనకు సిద్ధమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్, ఈటల రాజేందర్ శనివారం బ్యారేజ్ వద్దకు వెళ్లనున్నారు. హెలికాఫ్టర్‌లో బ్యారేజ్‌ను పరిశీలించే అవకాశం ఉంది. మేడిగడ్డతో పాటు అన్నారం (సరస్వతీ) బ్యారేజ్‌ను కూడా సందర్శించనున్నట్లు సమాచారం. బారికేడ్లు ఏర్పాటు మేడిగడ్డ బ్యారేజీ పరిసరాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. రాహుల్ పర్యటన సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు బ్యారేజ్ వైపు దూసుకెళ్లే యత్నం చేయగా.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బ్యారేజ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇనుప రేకులు, బారికేడ్లు ఏర్పాటు చేసి మరీ బ్యారేజ్ వైపు ఎవరినీ వెళ్లకుండా చూస్తున్నారు. ప్రస్తుతానికి అధికారులు, సిబ్బందిని మాత్రమే రాకపోకలకు అనుమతిస్తున్నారు. నివేదిక ఇలా.. బ్యారేజీ ఏడో బ్లాక్ 20వ పియర్ కుంగిపోయి దెబ్బతినడంతో సరిహద్దులో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య అక్టోబరు 21వ తేదీ నుంచి రాకపోకలను నిలిపేసిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ అక్టోబర్ 24వ తేదీన బ్యారేజ్‌ను సందర్శించింది. ప్రాజెక్టకు సంబంధించిన వివరాలను తెలంగాణ ప్రభుత్వం నుంచి కోరింది. కానీ, తెలంగాణ సర్కార్ పూర్తి వివరాలు అందించలేదని సదరు కమిటీ తాజాగా తన నివేదిక విడుదల చేసింది. అంతేకాదు.. ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలతోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ పియర్లు కుంగాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ తేల్చింది. 7వ నంబర్ బ్లాక్‌లో తలెత్తిన తీవ్ర ప్రతికూల పరిస్థితితో బ్యారేజీ పనితీరుపై తీవ్ర దుప్రభావం పడిందని, ప్రస్తుత పరిస్థితిలో అది ఉపయోగానికి పనికిరాదని స్పష్టం చేసింది. సంబంధిత వార్త: డిజైన్‌కు విరుద్ధంగా మేడిగడ్డ నిర్మాణం! రాజకీయ విమర్శలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు.. మేడిగడ్డ ఎన్డీఎస్ఏ నివేదిక విమర్శల్ని మరింతగా గుప్పించేందుకు అవకాశం కల్పించింది. అయితే ఈ నివేదికపై అధికార బీఆర్ఎస్ మండిపడింది. ఎన్నికల సమయంలో రాజకీయ దురుద్దేశంతోనే మేడిగడ్డపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ కుటప్రూరితంగా నివేదిక ఇచ్చిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కమిటీ రావడం, అధ్యయనం చేయడం, నివేదిక ఇవ్వడం అంతా మూడు రోజుల్లోనే జరిగిపోయిందని, ఈ వేగం చూస్తే దేశంలో మిగతా వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో.. ఇదీ అలాగే చేస్తున్నట్లుందని వ్యాఖ్యానించారు. -
మేడిగడ్డ 7వ బ్లాక్ పూర్తిగా పునర్నిర్మించాల్సిందే..!
సాక్షి, హైదరాబాద్: ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలతోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ పియర్లు కుంగాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ తేల్చింది. 7వ నంబర్ బ్లాక్‌లో తలెత్తిన తీవ్ర ప్రతికూల పరిస్థితితో బ్యారేజీ పనితీరుపై తీవ్ర దు్రష్పభావం పడిందని, ప్రస్తుత పరిస్థితిలో అది ఉపయోగానికి పనికిరాదని స్పష్టం చేసింది. 7వ నంబర్ బ్లాక్ మొత్తం పునాదులతో సహా తొలగించి పూర్తి స్థాయిలో కొత్తగా పునర్నిర్మించిన తర్వాతే బ్యారేజీ ఉపయోగంలోకి వస్తుందని తెలిపింది. ఈ సమయంలో బ్యారేజీలో నీళ్లు నింపితే పరిస్థితి మరింతగా దిగజారుతుందని హెచ్చరించింది. బ్యారేజీ నిర్మాణ సారూప్యతలను పరిగణనలోకి తీసుకుంటే ఇతర బ్లాకులూ ఇదే రీతిలో విఫలమయ్యే పరిస్థితులున్నాయని, అదే జరిగితే మొత్తం బ్యారేజీని పునర్నిర్మించక తప్పదని తెలిపింది. మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిన ఘటనపై ఎన్డీఎస్ఏ సభ్యుడు, సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్ అనిల్ జైన్ నేతృత్వంలో కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తాజాగా ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు నివేదిక సమర్పించింది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలతో ఎన్డీఎస్ఏ చైర్మన్ సంజయ్‌కుమార్ సిబల్ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌కు ఈ నెల 1న లేఖ రాశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పునాది కుంగడం వల్లే.. ర్యాఫ్ట్ (పునాది) కుంగడమే మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి మూలకారణం. బ్యారేజీకి 3.3 మీటర్ల లోతుతో కాంక్రీట్ పునాది నిర్మించారు. ర్యాఫ్ట్కి ముందు, వెనుక రెండువైపులా 15 మీటర్ల లోతులో సెకెంట్ పైల్స్ (కటాఫ్ వాల్స్) నిర్మించారు. ర్యాఫ్ట్ కుంగడంతో దానిపై నిర్మించిన పియర్లూ (బ్యారేజీ గేట్ల మధ్య పిల్లర్లుగా ఉండే కాంక్రీట్ నిర్మాణం) కుంగి, వాటికి పగుళ్లు ఏర్పడ్డాయి. ర్యాఫ్ట్ కుంగడానికి పలు కారణాలుండవచ్చు. ర్యాఫ్ట్ కింది ఇసుక కొట్టుకుపోవడం/ ఆ ఇసుకకు ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం (బేరింగ్ కెపాసిటీ) లేకపోవడం/ బ్యారేజీ బరువు (లోడ్), ఇతర కారణాలతో ర్యాఫ్ట్కి ముందు భాగంలోని సెకెంట్ పైల్స్ విఫలం కావడం వంటి కారణాలు ఉండవచ్చు. ర్యాఫ్ట్, సెకెంట్ పైల్స్ నిర్మాణంలో నాణ్యత లోపం నాణ్యత పర్యవేక్షణలో వైఫల్యాలతో బ్యారేజీ కింద ర్యాఫ్ట్, సెకెంట్ పైల్స్ నిర్మాణంలో లోపాలు జరిగాయి. పక్కపక్కనే ఉండే సెకెంట్ పైల్స్ ఒకదానికి ఒకటి అతుక్కుని ఉండాలి. మధ్యలో గ్యాప్ ఉండకూడదు. కానీ గ్యాప్ ఏర్పడడంతో వాటి మధ్య నుంచి నీళ్లు పారి ర్యాఫ్ట్ కింద ఇసుక కొట్టుకుపోయింది. డిజైన్‌కు విరుద్ధంగా నిర్మాణం ఫ్లోటింగ్ స్ట్రక్చర్ (తేలియాడే కట్టడం)గా బ్యారేజీని డిజైన్ చేసి, రిజిడ్ స్ట్రక్చర్(దృఢమైన కట్టడం)గా నిర్మించారు. అంటే ఇసుక మీద బ్యారేజీ కట్టే పద్ధతుల మేరకు డిజైన్ రూపొందించి, దానికి భిన్నంగా రాతి మీద బ్యారేజీ నిర్మించే పద్ధతుల్లో నిర్మాణం జరిపారు. భూగర్భంలో రాయి తగిలే దాకా బ్యారేజీకి ఎగువ, దిగువన కాంక్రీట్ గోడలు (సెకెంట్ పైల్స్) నిర్మించారు. నీటి ప్రవాహానికి బ్యారేజీ అడ్డంకిగా ఉండడంతో ఏర్పడే ఊర్ధ్వ పీడనం (అప్లిఫ్ట్ ఫోర్స్) బ్యారేజీ పునాదుల కింది నుంచి నిష్క్రమించకుండా ఈ కాంక్రీట్ గోడలు అడ్డంకిగా మారాయి. దీంతో ఊర్ధ్వ పీడనం తీవ్రమై ర్యాఫ్ట్ కింద ఇసుకను బ్యారేజీ బయటికి తన్నడంతోనే ర్యాఫ్ట్ కుంగిపోయింది. బ్యారేజీతో ప్రాణాలు, ఆస్తులకు తీవ్ర ముప్పు బ్యారేజీ నిర్వహణ, పర్యవేక్షణలో తీవ్ర వైఫల్యం జరిగింది. నిర్మాణం పూర్తైన నాటి నుంచి ఏటా వర్షాకాలానికి ముందు, తర్వాత నిర్వహించాల్సిన సౌండింగ్ అండ్ ప్రోబింగ్ పరీక్షలను జరపలేదు. ఏదైన లోపాలుంటే గుర్తించడానికి వర్షాకాలానికి ముందు, తర్వాత తనిఖీలు జరపాలని తెలంగాణకు ఎన్డీఎస్ఏ క్రమం తప్పకుండా సూచించినా పట్టించుకోలేదు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021లోని చాప్టర్ 10 సెక్షన్ 41(బీ) కింద దీనిని తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిస్తారు. చాలా విషయాల్లో ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్టు తెలుస్తోంది. ఇది చాలా తీవ్రమైన విషయం. బ్యారేజీతో ప్రాణాలు, ఆస్తులకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. అడిగిన సమాచారం ఇవ్వలేదు.. నిపుణుల కమిటీ 20 రకాల సమాచారాన్ని కోరగా, నీటిపారుదల శాఖ 11 రకాల వివరాలను మాత్రమే అందజేసింది. ఇన్స్ట్రుమెంటేషన్ డేటా, వర్షాలకు ముందు తర్వాత బ్యారేజీ తనిఖీల సమాచారం, ప్రాజెక్టు కంప్లీషన్ రిపోర్టు, క్వాలిటీ కంట్రోల్ రిపోర్టులు, గేట్ల స్థితిగతులు తెలిపే వివరాలు.. లాంటి అనేక రకాల సమాచారాన్ని ఇవ్వలేదు. ఇవ్వడానికి వారి వద్ద ఎలాంటి సమాచారం లేదని నిపుణుల కమిటీ అభిప్రాయపడుతోంది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం లభ్యత ఉన్న సమాచారం బ్యారేజీ అధికారులు ఇవ్వకుండా నిరాకరించడానికి ఆస్కారం లేదు. సమగ్ర దర్యాప్తు జరపాలి.. బ్యారేజీ వైఫల్యానికి దారితీసిన కారణాలపై సమగ్ర దర్యాప్తు జరపాలి. దర్యాప్తులో తేలిన వివరాలతో పాటు బ్యారేజీ పునరుద్ధరణ ప్రతిపాదనలను ఎన్డీఎస్ఏకు తెలపాలి. ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో ఇదే ప్రక్రియను అనుసరించాలి. అన్నారం, సుందిళ్లకూ ప్రమాదమే! కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సైతం ఇలాంటి డిజైన్లు, నిర్మాణ పద్ధతులనే అవలంబించారు. దీంతో ఈ రెండు బ్యారేజీలు కూడా భవిష్యత్తులో ఇలాంటి వైఫల్యాలకు గురయ్యే అవకాశాలున్నాయి. అన్నారం బ్యారేజీ గేట్లకు దిగువన నీళ్లు ఉబికిరావడం (బాయిలింగ్) వైఫల్యానికి ముందస్తు సూచిక లాంటిదే. బ్యారేజీల పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోవడాన్ని సాంకేతిక పరిభాషలో పైపింగ్ అంటారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కింద పైపింగ్‌ను అత్యవసరంగా పరీక్షించాలి. -
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం సమాధానం చెప్పలేని స్థితిలో ఉంది: కిషన్ రెడ్డి
-
‘కేసీఆర్ ఇంజనీర్‌గా మారి కట్టడంతోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండగా మారిందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. నాలుగేళ్లలోనే ప్రాజెక్టు కుంగిపోయిందని, నాణ్యత లేని నాసిరకం నిర్మాణం చేశారని మండిపడ్డారు. ఈ మేరకు హైదరాబాద్‌లో శుక్రవారం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగుబాటుపై ప్రభుత్వం కనీసం సమాధానం చెప్పలేదని పరిస్థితి నెలకొందనన్నారు. కాళేశ్వరంపై పాదదర్శకత లేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతుకు వచ్చేది రూ.40 వేలు అయితే.. ప్రాజెక్టు నిర్వహణకు ఎకరాకు రూ. 85 వేలు ఖర్చవుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇంత వ్యత్యాసం ఉందంటే.. ఈ ప్రాజెక్టును కమీషన్ల కోసం కట్టినట్లా? కాంట్రాక్టర్ల కోసం కట్టినట్లా అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి కోసం కట్టారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల మీద ఆర్థిక భారం మోపే ప్రాజెక్టు అని విమర్శించారు. డ్యాం సేఫ్టీ అధికారులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని దుయ్యబటారు. ప్రాజెక్టుపై 9 అంశాలకు సంబంధించిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఇంజనీర్‌గా మారి కట్టడంతోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. చదవండి: పప్పు వ్యాఖ్యలపై కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్.. ‘కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా కట్టినట్లు బీఆర్ఎస్ చెప్పుకుంది. డిస్కవరీ ఛానల్లో కూడా ప్రచారం చేసుకున్నారు. ప్రజాధనం మొత్తం రాళ్లు, నీళ్ల పాలయింది. కాంగ్రెస్ హయాంలో 30 వేల కోట్లతో ప్రాజెక్టును ప్రారంభించారు. కానీ కేసీఆర్ రీడిజైన్ పేరిట 1.30 లక్షల కోట్లతో కాళేశ్వరం నిర్మించారు. ఇంజినీరింగ్ మార్వల్ అని గొప్పలు చెప్పుకున్నారు. జబ్బలు చరుచుకున్నారు. కేసీఆర్ ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకున్నారు. అలాంటి ప్రాజెక్టు కట్టిన నాలుగేళ్ళకే పిల్లర్లు కుంగిపోయాయి. ఆ పిల్లర్లను తొలగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మించాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. లేదంటే ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. కాంట్రాక్టు ఎవరికిచ్చారు? ఎంత ఖర్చయింది అనే అంశాలపై కూడా స్పష్టత ఇవ్వలేదు. ప్రాజెక్టును పరిశీలించేందుకు వచ్చిన జలశాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక డాక్యుమెంట్లు ఇవ్వలేని పరిస్థితి. లో క్వాలిటీ సాండ్ మెటీరియల్ వాడారని నిపుణుల నివేదికలో తేలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిపుణులు, ఇంజినీర్ల మాటలు పక్కనపెట్టి తానే ఇంజినీర్ లాగా వ్యవహరించి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కేసీఆర్ నిర్ణయాల వల్ల ప్రాజెక్టు నిరుపయోగంగా మారే ప్రమాదం ఉంది. పిల్లర్లు కుంగిపోవడంపై కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి. కేసీఆర్ కమీషన్లు తీసుకోవడంలో, తెలంగాణ సొమ్ము దోచుకోవడంలో సక్సెస్ అయ్యారు.. కానీ ప్రాజెక్టు విషయంలో ఫెయిలయ్యారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతాం. బాధ్యులు ముఖ్యమంత్రి అయినా, కాంట్రాక్టర్లు అయినా వందకు వంద శాతం చర్యలు తీసుకుంటాం. శనివారం కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు వెళతాం’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసింది : సీఎం కేసీఆర్ -
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక
-
కాళేశ్వరం మేడిగడ్డపై NDSA సంచలన నివేదిక
సాక్షి, ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(NDSA) సంచలన నివేదిక విడుదల చేసింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని నిర్ధారించింది. ఈ మేరకు నాలుగు పేజీల నివేదికను విడుదల చేసింది. అంతేకాదు.. బ్యారేజీ వైఫల్యం వల్ల ప్రజా జీవితానికి ,.ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమని పేర్కొన్న అథారిటీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యారేజ్‌ను ఉపయోగించడానికి అవకాశం లేదని నివేదికలో స్పష్టం చేసింది. పిల్లర్లు కుంగిపోవడానికి బ్యారేజి పునాదులకింద ఇసుక కొట్టుకుపోవడంవల్లే కుంగిపోయిందని ఆ నివేదికలో పేర్కొంది. కాళేశ్వరంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరకొర సమాచారం అందించిదని.. తాము అడిగిన 20 అంశాలకు 11 అంశాలకు మాత్రమే సమాధానం ఇచ్చిందని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ తన నివేదికలో ఆరోపించింది. ఇన్స్ట్రుమెంటేషన్ , వర్షాకాలం ముందు తర్వాత ఇన్స్పెక్షన్ రిపోర్టులు, కంప్లేషన్ రిపోర్టులు, క్వాలిటీ రిపోర్టులు, థర్డ్ మానిటరింగ్ రిపోర్టులు, భౌగోళిక సమాచారం, వర్షాకాలం ముందు తర్వాత నది కొలతలను చూపించే స్ట్రక్చరల్ డ్రాయింగ్‌లపై తెలంగాణ సర్కార్ తమకు సమాచారం ఇవ్వలేదని తెలిపింది. ఒకవేళ సమాచారాన్ని దాచిపెట్టినట్లయితే చట్టపరమైన చర్యలకు తీసుకునే అవకాశం కూడా తమకు ఉంటుందని డ్యామ్ అథారిటీ పేర్కొనడం గమనార్హం. పిల్లర్లు కుంగడానికి NDSA చెప్పిన కారణాలు ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయాయి బ్యారేజ్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయింది ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టంగా లేదు బ్యారేజ్ లోడ్ వల్ల కాంక్రీట్ బ్రేక్ అయింది బ్యారేజీని తేలియాడ నిర్మాణంగా రూపొందించారు కానీ స్థిరమైన నిర్మాణంగా నిర్మించలేదు బ్యారేజీ వైఫల్యం వల్ల ఆర్థిక వ్యవస్థకు ప్రజా జీవితానికి తీవ్ర ప్రమాదం బ్యారేజీ బ్లాక్ లలో సమస్య వల్ల మొత్తం బ్యారేజ్‌ని ఉపయోగించడానికి అవకాశం లేదు ఈ దశలో రిజర్వాయర్ నింపితే బ్యారేజ్ మరింత కుంగుతుంది అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లపైనా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల నిర్మించారు. ఈ రెండు ప్రాజెక్టులలో ఇవే పరిస్థితిలో వచ్చే అవకాశం ఉంది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన అన్నారం, సుందిళ్లను తనిఖీ చేయాలి. అన్నారం, సుందిళ్లలో కూడా ఇదే తరహా సమస్యలు ఉన్నాయి’’ అని తన నివేదికలో డ్యామ్ అథారిటీ పేర్కొంది. కాళేశ్వరం మేడిగడ్డపై డ్యాం సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి కమిటీ కోరినా.. మేడిగడ్డ బ్యారేజ్ 2019లో నిర్మించబడింది. 2023 అక్టోబర్ 21వ తేదీన బ్యారేజ్ పునాది భారీ శబ్దంతో కుంగిపోయింది. జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా ఉన్నారు. ఈ కమిటీ అక్టోబర్ 24వ తేదీన మేడిగడ్డ డ్యామ్‌ను సందర్శించింది. అక్టోబర్ 25వ తేదీన తెలంగాణ ప్రభుత్వం నుంచి 20 అంశాలపై సమాచారాన్ని కోరింది. కానీ, సర్కార్ పూర్తి సమాచారం ఇవ్వలేదు. అక్టోబర్ 29లోపు పూర్తి డేటాను ఇవ్వకపోతే బ్యారేజీ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించిందని భావించాల్సి వస్తోందని కమిటీ చెప్పినా కూడా తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదు. -
కాళేశ్వరం ఏటీఎంలతో కాంగ్రెస్ వినూత్న ప్రచారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో ప్రచారం చేసుకుంటోంది. అధికార బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించే క్రమంలో వెరైటీ కాన్సెప్ట్‌లతో ముందుకు వస్తోంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ మొదటి నుంచి ఆరోపిస్తున్న హస్తం.. ఇప్పుడు ఆ ఆరోపణలనూ ప్రచారానికి వాడుకుంటోంది. తాజాగా.. కాళేశ్వరం ఏటీఎంను ఆవిష్కరించి ప్రచారంలోకి దిగింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఫొటోతో కూడిన కాళేశ్వరం ఏటీఎంను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. ఆ ఏటీఎంలపై కాళేశ్వరం కరప్షన్ రావు( KCR) పేరుతో వినూత్నంగా కేసీఆర్ ఫొటోను.. కాళేశ్వరం కరప్షన్ రాకెట్ బ్యాంక్.. అలాగే కేసీఆర్ పేరుతో లక్ష కోట్ల నోటును రిలీజ్ చేసింది. ఈ శతాబ్దపు అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం అంటూ ఏటీఎంపై పేర్కొంది కాంగ్రెస్. -
జంతర్ మంతర్వద్ద వైఎస్ షర్మిల ధర్నా
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందని, అయినా ఇప్పటివరకు దీనిపై ఎటువంటి విచారణ చేపట్టలేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షరి్మల ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై పోరాడేందుకు ఎంపీలు కూడా తనతో కలసి రావాలని ఆమె సోమవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ మంగళవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనుందని వెల్లడించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ఎస్సారెస్పీ ఫేజ్–2, ఎల్లంపల్లి, వరద కాలువ, దేవాదుల, మిడ్‌మానేర్ లాంటి ప్రాజెక్టులు నీళ్లు ఇస్తుంటే అవి కాళేశ్వరం నుంచి వస్తున్న ట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఒక మహిళ బతుకమ్మ ముసుగులో లిక్కర్ స్కాంలో ఇరుక్కుంటే మంత్రులు, ఎంపీలు, ఎమ్మె ల్యేలు సిగ్గు లేకుండా మద్దతిస్తున్నారని మండిపడ్డారు. -
కాళేశ్వరానికి ‘అదనపు’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అదనపు టీఎంసీ ఎత్తిపోసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కాళేశ్వరం అదనపు టీఎంసీ డీపీఆర్‌కు అనుమతుల జారీ ప్రక్రియ విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. సాంకేతిక అనుమతుల ప్రక్రియ విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కు ఇటీవల లేఖ రాసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విషయాల్లో స్టేటస్ కో కొనసాగించాలని కేంద్ర న్యాయ శాఖ సూచించినట్లు గోదావరి బోర్డుకు జలశక్తి శాఖ తెలియజేసింది. దీంతో కాళేశ్వరం అదనపు టీఎంసీ పనుల ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలనను ప్రస్తుతానికి గోదావరి బోర్డు పక్కనబెట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అదనపు టీఎంసీ ప్రాజెక్టు పనులను నిలుపుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా అనుమతుల ప్రక్రియకు సైతం బ్రేక్ పడినట్టు అయింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే రూ. 85 వేల కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. అదనపు టీఎంసీ సహా ఇతర పనుల పూర్తికి మరో రూ. 30 వేల కోట్లను ఖర్చు చేయాల్సి ఉంది. డీపీఆర్ పరిశీలనకు గోదావరి బోర్డు నో గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల జలాలను తరలించే లక్ష్యంతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని అన్ని రకాల అనుమతులతో చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం... ఆ తర్వాత అదనపు టీఎంసీ తరలింపు పనులను మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండానే మొదలుపెట్టింది. అయితే ఈ పనులను అనుమతిలేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చిన కేంద్ర జలశక్తి శాఖ... 6 నెలల్లోగా అనుమతి పొందాలని 2021 జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఆదేశించింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం... అదనపు టీఎంసీ తరలింపు కోసం చేపడుతున్న పనులు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమేనని... అందువల్ల అనుమతిలేని ప్రాజెక్టుల జాబితా నుంచి దీన్ని తొలగించాలని విజ్ఞప్తి చేసింది. దీంతో సవరించిన కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను సమర్పించి అనుమతులు పొందాలని కేంద్రం సూచించింది. కేంద్ర జలసంఘానికి ఇప్పటికే సవరించిన డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించగా హైడ్రాలజీ, కాస్ట్ అప్రైజల్ అనుమతులు లభించాయి. అనంతరం సవరించిన డీపీఆర్‌ను గోదావరి బోర్డుకు సాంకేతిక అనుమతుల కోసం పంపింది. బోర్డు ఈ డీపీఆర్‌ను పరిశీలించి సంతృప్తి చెందితే కేంద్ర జలశక్తి శాఖలోని సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) ఆమోదం కోసం సిఫారసు చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ ప్రక్రియను తాజాగా గోదావరి బోర్డు పక్కన బెట్టింది. మరికొంత కాలం తప్పని జాప్యం... పరిహారం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కొందరు ప్రాజెక్టు భూనిర్వాసితులు... రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండానే అదనపు టీఎంసీ పనులు చేపడుతోందని నివేదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. కాళేశ్వరం అదనపు టీఎంసీ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అంశాలపై స్టేటస్ కో కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తమ తుది తీర్పునకు లోబడి చర్యలు ఉండాలని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను ఉపసంహరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇదీ చదవండి: మునుగోడులో పోస్టర్ వార్ -
గోదావరి బోర్డుకు కాళేశ్వరం సవరణ డీపీఆర్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సవరణ డీపీఆర్‌ను గోదావరి బోర్డు (జీఆర్ఎంబీ)కు సమర్పించింది. తొలుత రోజుకు 2 టీఎంసీల గోదావరి జలాలు ఎత్తిపోసే లక్ష్యంతో కాళేశ్వరాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. దానికి సంబంధించిన అనుమతులన్నీ కేంద్రం నుంచి పొందింది. తర్వాత మరో టీఎంసీ అదనంగా తరలించే పనులను చేపట్టింది. అయితే కేంద్రం ఈ మూడో టీఎంసీ పనులను అనుమతిలేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చుతూ.. ఆరునెలల్లో అనుమతి తీసుకోవాలని 2021 జూలై 15న ఆదేశించింది. అయితే రోజుకు రెండు టీఎంసీలు తరలించే ప్రాజెక్టు, అదనపు టీఎంసీ తరలించే పనులు వేర్వేరు కాదని, రెండూ కాళేశ్వరంలో అంతర్భాగమేనని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరించింది. సీఎం కేసీఆర్ స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనితో సవరించిన కాళేశ్వరం డీపీఆర్‌ను సమర్పించి అనుమతులు పొందాలని కేంద్రం సూచించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సవరణ డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కు సమర్పించి హైడ్రాలజీ, కాస్ట్ అప్రైజల్ అనుమతులు పొందింది. తాజాగా రూ.1.15 లక్షల కోట్ల అంచనాతో సవరించిన డీపీఆర్‌ను గోదావరి బోర్డుకు అందించింది. గోదావరి బోర్డు డీపీఆర్‌పై సాంకేతిక పరిశీలన జరిపాక.. సీడబ్ల్యూసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఓకే చేస్తుంది. చివరిగా అపెక్స్ కౌన్సిల్లో డీపీఆర్‌పై చర్చించి ఆమోదముద్ర వేస్తారు. మరో రూ.30వేల కోట్లు: కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే రూ.85 వేలకోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. కొత్త డీపీఆర్ ప్రకారం మిగతా పనుల పూర్తికి ఇంకో రూ.30వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో ఆర్ఈసీ, పీఎఫ్‌సీతోపాటు పలు బ్యాంకుల నుంచి కాళేశ్వరం కార్పొరేషన్‌కు రావాల్సిన రుణాలు ఏప్రిల్ నుంచి నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరంతోపాటు ఇతర ప్రాజెక్టుల పనులకు రాష్ట్ర బడ్జెట్ నిధులే దిక్కు అని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: కాళేశ్వరం వృథా కాదు.. ఆదా! -
కాళేశ్వరంతో ఎంత ఆదాయం వచ్చింది?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఆదాయం వస్తుందా? ఇప్పటి వరకు వచ్చిందెంత?.. అని ప్రాజెక్టు నిర్మాణానికి రుణాలిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాయి. ఈ వివరాలి వ్వాలని రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరా యి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రూ.65,454 కోట్ల ప్రత్యక్ష ఆదాయం రానుందని బ్యాంకులకు సమర్పించిన టెక్నో–ఎకనామిక్ వయబిలిటీలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. నీటి తీరు వా పన్నులు, పరిశ్రమలకు ముడి నీటి సరఫ రా, జంట నగరాలు, గ్రామాలకు తాగునీరు సరఫరాకు వసూలు చేయనున్న చార్జీలు, తదితర మార్గాల్లో ఈ మేరకు ఆదాయం రానుందని ప్రభుత్వం తెలిపింది. దీని ఆధారంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కాళేశ్వరం ప్రాజె క్టు నిర్మాణానికి రుణాలిచ్చాయి. బ్యాంకులు, రుణసంస్థలతో జరిగిన ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయంతోనే ప్రభు త్వం రుణాలను తిరిగి చెల్లించాలి. గత మా ర్చి 31 నాటికి కాళేశ్వరం పూర్తై వాణిజ్యపర కార్యకలాపాలను ప్రారంభించిందని కాళేశ్వ రం ఇరిగేషన్ కార్పొరేషన్ ప్రాజెక్టు లిమిటెడ్ (కేఐపీసీఎల్).. బ్యాంకుల కన్సార్టియంకు నివేదించింది. ఇప్పటి వరకు ప్రభుత్వమే తన బడ్జెట్ నుంచి ప్రాజెక్టు కోసం తీసుకున్న రు ణాలకు వడ్డీలు చెల్లిస్తోంది. కాళేశ్వరం వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిందని ప్రక టించిన నేపథ్యంలో గత జూన్ నుంచి అసలు రుణాల వాయిదాలతో పాటు వడ్డీ చెల్లింపు ను ప్రాజెక్టు ద్వారా వస్తున్న ఆదాయంతో కట్టాలి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు ఎంత ఆదాయం వచ్చిందో సమాచారమివ్వాలని బ్యాంకులు తాజాగా కేఐపీసీఎల్‌ను కోరాయి. నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) సి.మురళీధర్ తాజాగా రాష్ట్ర ప్ర భుత్వానికి రాసిన లేఖలో ఈ విషయాలను పొందుపరిచారు. ఈ క్రమంలో వివిధ రూపా ల్లో వస్తున్న ఆదాయాన్ని కాళేశ్వరం కార్పొరేషన్‌కు సాధ్యమైనంత త్వరగా బదిలీ చేయాలని ఆయన ఈ లేఖలో విజ్ఞప్తి చేశారు. భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే.. కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.86,064 కోట్ల రుణాలను వివి ధ బ్యాంకులు, సంస్థల నుంచి తీసుకుంది. మొత్తం రూ.97,445 కోట్ల రుణాలు రావాల్సి ఉండగా, మిగిలిన రుణాలు కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో నిలిచిపోయాయి. జంట నగరాల్లో నెలకు 20వేల లీటర్ల ఉచిత తాగునీటిని సరఫరా చేస్తుండటంతో జలమండలికి వచ్చే ఆదాయం పడిపోయింది. మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు సరఫరా చేసే నీళ్లకు సైతం నీటి కుళాయి చార్జీలు వసూలు చేయట్లేదు. రాష్ట్రంలో నీటి తీరువా పన్నుల వసూళ్లను ఎప్పుడో ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ద్వారా ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయాయి. నీటి తీరు వా పన్నులు, కుళాయి చార్జీలను రాష్ట్ర ప్రభు త్వం సబ్సిడీల రూపంలో కాళేశ్వరం కార్పొరే షన్ ఖాతాలోకి జమ చేయక తప్పని పరిస్థితి.. దీనికి బ్యాంకులు, రుణ సంస్థలు అంగీకరిస్తాయా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
‘కాళేశ్వరం’ విద్యుత్ బకాయిలు 3,114 కోట్లు!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విద్యుత్ బిల్లులు ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయి. మూడేళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 140 టీఎంసీల నీటిని తరలించగా మొత్తం రూ. రూ. 3,600 కోట్ల విద్యుత్ బిల్లులు వచ్చాయి. అయితే బిల్లులను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇప్పటివరకు జరిపిన చెల్లింపులు పోగా ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)కు రూ. 2,575.58 కోట్లు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)కు రూ. 538.51 కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ రెండు సంస్థలకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ. 3,114.09 కోట్లకు చేరుకున్నాయి. ఈ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ రెండు డిస్కంలు నీటిపారుదల శాఖకు తాజాగా లేఖలు రాశాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలోని మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకమ్మసాగర్లకు నీళ్లను ఎత్తిపోయడానికి మూడేళ్లలో మొత్తం రూ.866.21 కోట్ల విద్యుత్ బిల్లులు రాగా, రూ. 327 కోట్లను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఒక టీఎంసీ నీటి తరలింపునకు రూ. 25.71 కోట్ల మేర విద్యుత్ చార్జీల వ్యయమైంది. అలాగే ఎకరం సాగుకు విద్యుత్ బిల్లుల రూపంలో రూ. 21,810 ఖర్చయింది. భవిష్యత్‌లో మరింత భారం... కాళేశ్వరం ఎత్తిపోతల కింద నెలకొల్పిన 19 పంపు స్టేషన్లలోని 82 మోటర్ల వినియోగానికి 4,627 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని ప్రభుత్వం తొలుత అంచనా వేసింది. అంటే కనీసం 13,558 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం ఉంటుందని భావించింది. ఈ లెక్కన ఒక్కో యూనిట్‌కు రూ. 6.30 ల చొప్పున (పెరిగిన విద్యుత్ చార్జీలు కాకుండా) మొత్తం సంవత్సరానికి రూ. 8,541.54 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మొత్తం 20 లిఫ్టులు ఈ ప్రాజెక్టుకు చెందిన లింకు ప్యాకేజీల్లో భాగం. కానీ ఇందులో 8 చోట్ల వినియోగించిన మోటారు పంపులకు మూడేళ్లలోనే రూ. 3,060 కోట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఇక పూర్తిస్థాయిలో అన్ని పంపుస్టేషన్‌లలో మోటారు పంపులను వినియోగిస్తే మరింత విద్యుత్ భారం పెరుగుతుందని ఇరిగేషన్, విద్యుత్తు శాఖల అధికారులు చెబుతున్నారు. పెరిగిన విద్యుత్ వ్యయం... ఈ ప్రాజెక్టుకు మొదట విద్యుత్ చార్జీలు యూనిట్‌కు వ్యయం రూ. 5.80 ఉంటే దానిని రూ. 6.30 పైసలకు పెంచారు. ఫిక్స్డ్ చార్జీలు కిలోవాట్‌కు రూ. 165 ఉంటే దానిని రూ. 275కి పెంచారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రెండేళ్లలో 99 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. 2019–20లో 66 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా 1906.59 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమైంది. దీనికి గాను ఒక యూనిట్‌కు రూ.5.80 చొప్పున 1105.82 కోట్ల ఖర్చయింది. 2020–21లో 33 టీఎంసీల నీటిని తరలించగా 1,697.88 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. పెరిగిన చార్జీల ప్రకారం రూ. 984.77 కోట్ల విద్యుత్ బిల్లు వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 5 వరకు మూడేళ్లలో ఎత్తిపోసిన మొత్తం 140 టీఎంసీలకు రూ. 3,600 కోట్ల విద్యుత్ వినియోగం జరగ్గా రూ. 2,575.58 కోట్ల మేరకు బకాయిలు ఉన్నట్లు ఎన్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. -
లక్ష్మీపంప్‌హౌస్‌లో పూర్తిగా దెబ్బతిన్న ఆరు మోటార్లు.. కొత్తవాటికి ఆర్డర్?
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి లక్ష్మీపంప్హౌస్లోకి గత నెల 14న వరద నీరు చేరి రక్షణ గోడ కూలి మోటార్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డీవాటరింగ్ ప్రక్రియ పూర్తయింది. పంప్‌హౌస్‌లోకి తాత్కాలికంగా నిచ్చెనలు తయారు చేసి కూలీలు, ఇంజనీర్లు దిగుతున్నారు. దీంతో పంప్‌హౌస్‌లో మొత్తం 17 మోటార్లు, పంపులకు గాను ఆరు మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు సమాచారం. దీంతో ఫిన్లాండ్, ఆస్ట్రియా దేశాలకు ఆరు మోటార్ల కోసం సీడీఓ (సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్)కు డిజైన్స్ పంపినట్లు తెలిసింది. ఇంజనీరింగ్ అధికారులంతా అదేపనిలో పడ్డట్లు సమాచారం. ఇక్కడి ఇంజనీర్లు మోటార్లకు సంబంధించిన కంపెనీలకు చెందిన విదేశాల్లోని నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. మిగతా మోటార్లలో ఐదు వరకు.. ఉన్న స్థానం నుంచి పక్కకు జరిగి వంగినట్లు చెబుతున్నారు. మరికొన్ని మోటార్లు పాక్షికంగా చెడిపోయినట్లు సమాచారం. రక్షణ గోడ పూర్తిగా నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోర్‌బేకు పంప్‌హౌస్ మధ్యలో పొడవునా మళ్లీ పూర్తిగా నిర్మాణం చేయడానికి డిజైన్స్ రెడీ చేసినట్లు తెలిసింది. కాగా, వర్షాకాలం కావడంతో గోడ నిర్మాణం సాధ్యం కాదని, వరద తగ్గుముఖం పట్టిన తర్వాత చేపట్టనున్నారని ఇంజనీర్లు చెబుతున్నారు. కాళేశ్వరంలో గోదావరి ఉధృతి తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కాళేశ్వరం వద్ద గోదావరి 11.70 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. 7.30 లక్షల క్యూసెక్కుల నీరు లక్ష్మీబ్యారేజీకి తరలిపోతోంది. ములుగు జిల్లా పేరూరు వద్ద సాయంత్రానికి గోదావరి నీటిమట్టం 14 మీటర్లకు చేరింది. పూసూరు బ్రిడ్జి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. టేకులగూడెం గ్రామ చివరన 163 నంబర్ జాతీయ రహదారి మునిగిపోవడంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. -
నదులకు నడకనేర్పిన కేసీఆర్... కాళేశ్వరం మోటార్లకు ఈత నేర్పలేదా?
సాక్షి, సిద్దిపేట: ‘నదులకే నడకను నేర్పినట్టుగా సీఎం కేసీఆర్ చెప్పుకుంటున్నారు కదా.. వర్షాలకు నీళ్లలో మునిగిన కాళేశ్వరం మోటార్లకు ఈత ఎందుకు నేర్పించలేకపోయారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తోనే ముంపునకు గురయ్యాయన్నా రు. ఇరిగేషన్ ఇంజనీర్ అవతారమెత్తి రీడిజైన్ పేరు తో రూ.30 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని రూ.1.30 లక్షల కోట్లకు పెంచి ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. గురు వారం సిద్దిపేట అర్బన్ మండలం నాంచార్‌పల్లి నుంచి బీజేపీ చేపట్టిన ‘ప్రజా గోస–బీజేపీ భరోసా’ బైక్ ర్యాలీని సంజయ్.. బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. ప్రజల బాధలు పోవాలన్నా, అభివృద్ధి జరగాలన్నా బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. ‘దేశ్ కీ నేత.. దిన్ బర్ పీతా.. మోదీపే రోతా.. ఫాంహౌస్ మే సోతా.. అమాస పున్నానికి ఆతా..’ అంటూ ఎద్దేవా చేశారు. అడుగడుగునా అవమానించినా అల్లుడికి సిగ్గులే దని, నోటి నిండా అబద్ధాలే వల్లిస్తున్నాడంటూ హరీశ్‌రావుపై మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులు కొల్లగొట్టిన వారికి మద్దతుగా ఆందోళనలు చేయ డం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ ఈడీ విచారణను ఎదు ర్కోక తప్పదని హెచ్చరించారు. రైతులకు రైతుబంధు మాత్రమే ఇచ్చి అన్ని బంద్ చేశార న్నారు. తడిసిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుటుంబపాలనకు చరమగీతం పాడాలి కేసీఆర్ కుటుంబపాలనకు చరమగీతం పాడాలని మురళీధర్‌రావు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, ప్రజలకు అండగా ఉండేందుకే ‘ప్రజా గోస–బీజేపీ భరోసా’ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవుడినీ మోసం చేసిన ఘనుడు సిరిసిల్ల/వేములవాడరూరల్: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఏటా రూ.వంద కోట్లు ఇస్తానన్న సీఎం కేసీఆర్.. ఇవ్వకుండా దేవుడినీ.. వీఆర్ఏల సమస్యలు పరిష్కరి స్తానని అసెంబ్లీలో చెప్పి వీఆర్ఏలనూ మోసం చేశారని బండి సంజయ్ విమర్శించారు. ప్రజలకు అందుబాటులో లేకుండా వేముల వాడ ఎమ్మెల్యే ఏ దేశంలో తిరుగుతున్నారని, అతనిపై సీఎం కేసీఆర్‌కు ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు. గురువారం సిరిసిల్ల, వేములవాడల్లో పర్యటించారు. వేములవాడలో ‘జనం గోస– బీజేపీ భరోసా’ యాత్రలో భాగంగా బైక్‌ర్యాలీని ప్రారంభించారు. రాష్ట్రపతిగా బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపొందడంతో ఆ పార్టీ నాయకులు నిర్వహించిన సంబరాల్లో బండి సంజయ్ డోలు వాయించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. -
కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేం: కేంద్రం
న్యూఢిల్లీ: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించలేమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. కాళేశ్వరానికి పెట్టుబడులు అనుమతులు లేవని, అందుకే కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేదని కేంద్ర నీటి జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు. జాతీయ ప్రాజెక్టు స్కీంలోకి కాళేశ్వరాన్ని చేర్చే అర్హతలేదని వెల్లడించారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సీఎం కేసీఆర్ 2016, 2018లో ప్రధానికి లేఖలు రాసినట్లు పేర్కొంది. లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అన్నారు. జాతీయ హోదా కావాలంటే.. సీడబ్ల్యూసీ అధ్యయనం తప్పనిసరని, ప్రాజెక్టు అడ్వైజరీ కమిటీ కూడా ఆమోదం ఉండాలని, ప్రాజెక్టు పెట్టుబడులపై కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతులుంటే కాళేశ్వరాన్ని హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలించాలని, హైపవర్ స్టీరింగ్ కమిటీ అనుమతి ఇస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా అవకాశం ఉంటుందని లేఖలో కేంద్రమంత్రి పేర్కొన్నారు. చదవండి: హైదరాబాద్ మెట్రోలో డ్యాన్స్.. యువతికి షాకిచ్చిన అధికారులు -
Kaleshwaram Project: వందల కోట్ల నష్టమనే ప్రచారం అవాస్తవం: రజత్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన అన్నారం, మేడిగడ్డ పంపుహౌస్‌లు నీట మునగడంతో రూ.వందల కోట్ల నష్టం వాటిల్లిందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. వరదలతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల మేరకు మాత్రమే నష్టం జరిగిందని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ తెలిపారు. ఒప్పందం మేరకు ఈ నష్టాన్ని కూడా నిర్మాణ సంస్థలే భరిస్తాయని, ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. 45 రోజుల్లోగా కాళేశ్వరం పంపుహౌస్‌లకు మరమ్మతులు పూర్తి చేస్తామని.. సెప్టెంబర్‌లోగా పూర్తిగా పునరుద్ధరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో వరదల కారణంగా సాగునీటి ప్రాజెక్టులకు వాటిల్లిన నష్టంపై రజత్‌కుమార్ బుధవారం జలసౌధలో సమీక్షించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తు వరదల ప్రభావాన్ని సరిగా అంచనా వేయకుండానే కాళేశ్వరం ప్రా జెక్టు నిర్మించడంతో పంపుహౌస్‌లు నీటమునిగాయన్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఎవరూ సరిగా అంచనా వేయలేదు వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా క్లౌడ్ బరస్ట్ వంటి పరిస్థితులు ఉత్పన్నం కావడంతో పంపుహౌస్‌లు నీటమునిగాయని రజత్‌కుమార్ పేర్కొన్నారు. కేంద్ర జల సంఘంలోని 18 విభాగాల నుంచి అనుమతులు లభించాకే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామన్నారు. భారత వాతావరణ శాఖ, యూరోపియన్ శాటిలైట్ ఏజెన్సీలు సైతం వర్షాలు, వరదల తీవ్రతను సరిగ్గా అంచనా వేయలేక పోయాయని చెప్పారు. జలవనరుల శాఖలో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి కడెం ప్రాజెక్టుకు ఇటీవలే మరమ్మతులు చేశామని.. అందువల్లే రికార్డు స్థాయిలో వరద వచ్చినా ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. గత వందేళ్లలో ఎన్నడు లేని విధంగా ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు మండలాల్లో 30 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురవడంతోనే కడెంకు భారీ వరద వచ్చిందన్నారు. పోలవరంతో తెలంగాణలో భారీ ముంపు గోదావరి నదిపై ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో తెలంగాణలో లక్ష ఎకరాల మేర ముంపు బారినపడతాయని రజత్‌కుమార్ పేర్కొన్నారు. భద్రాచలం, పర్ణశాలతోపాటు పలు చారిత్రాక ప్రదేశాలు మునిగిపోతాయన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం జరపాలని కేంద్రానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా ఇప్పటివరకు స్పందన లేదని విమర్శించారు. -
Kaleshwaram Lift Irrigation Project: కాళేశ్వరానికి వరద పోటు
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం/మంథని/ మోపాల్: కనీవినీ ఎరుగని రీతిలో గోదావరికి వచ్చిన భారీ వరద కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ప్రభావం చూపింది. ప్రాజెక్టు పరిధిలోని సరస్వతి (అన్నారం), మేడిగడ్డ (లక్ష్మి) పంపుహౌస్‌లు పూర్తిగా నీట మునిగాయి. పంపుహౌస్‌లలోని పంపులు, మోటార్లు, ప్యానెల్ బోర్డు, విద్యుత్ పరిక రాలూ నీట మునిగాయి. ఇంకా భారీగా వరద కొనసాగుతున్న నేపథ్యంలో పంపుహౌస్‌లలో నీటిని తోడేసే అవకాశం లేదని.. నీటిని తోడేస్తేనే నష్టంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. వాగులో నీళ్లు వెనక్కి తన్ని.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు సమీపంలోని సరస్వతి (అన్నారం) పంపుహౌస్‌ను వరద ముంచెత్తింది. ఇక్కడ సరస్వతి బ్యారేజీ దిగువన చందనాపూర్ వాగు గోదావరిలో కలుస్తుంది. అయితే గోదావరిలో భారీ వరదతో వాగు ప్రవాహం వెనక్కి తన్నడంతో.. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో చందనాపూర్ వాగు పోటెత్తింది. సరస్వతి పంపుహౌజ్‌కు, వాగుకు మధ్య రక్షణగా ఉన్న ఇసుక కరకట్టపై నుంచి ప్రవాహం పొంగి.. పంపుహౌజ్‌లోకి ప్రవేశించింది. కొద్దిగంటల్లోనే పంపుహౌజ్ పూర్తిగా నీట మునిగింది. 12 పంపులతోపాటు స్కాడా వ్యవస్థ, కంట్రోల్ ప్యానెళ్లు, స్టార్టర్లు సహా ఎలక్ట్రికల్ పరికరాలన్నీ మునిగిపోయాయి. దీనితో నష్టం ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. గరిష్టంగా 100 మీటర్ల వరదను తట్టుకునేలా వీలుగా అన్నారం పంపుహౌజ్‌ను డిజైన్ చేయగా.. అనూహ్యంగా 113 మీటర్ల వరద పోటెత్తడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. పంపుహౌజ్ వద్ద విధి నిర్వహణలో ఉన్న 120 మంది ఇంజనీర్లు, ఇతర సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లక్ష్మి పంపుహౌస్ గోడకు గండ్లు గోదావరి వరద ఉధృతి భారీగా ఉండటంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లిలోని మేడిగడ్డ (లక్ష్మి) పంపుహౌస్ కూడా నీట మునిగింది. గోదావరి ప్రధాన నదిలో 16 లక్షల క్యూసెక్కులు, ప్రాణహిత నుంచి మరో 12 లక్షల వరద కలిసి.. ఏకంగా 28 లక్షల క్యూసెక్కుల భారీ ప్రవాహం రావడంతో పంపుహౌజ్‌పై ఒత్తిడి పెరిగింది. 106.7 మీటర్ల వరదను తట్టుకునేలా పంపుహౌజ్‌ను డిజైన్ చేయగా, 108 మీటర్లకుపైగా వరద రావడంతో.. పంపుహౌస్ అప్రోచ్ కెనాల్ ద్వారా హెడ్ రెగ్యులేటర్ నుంచి భారీగా వరద సర్జ్‌పూల్‌లోకి చేరింది. సర్జ్‌పూల్‌లోని ఫోర్‌బే, పంపుహౌస్‌కు మధ్య ఉండే కాంక్రీట్ గోడ (బ్రెస్ట్ వాల్) ఒత్తిడికి గురై గండ్లు పడ్డాయి. దీనితో పంపుహౌజ్‌లోని 17 పంపులు పూర్తిగా నీటమునిగాయి. కంట్రోల్ రూంలో ఉన్న కంట్రోల్ ప్యానెళ్లు, స్కాడా ఆపరేటింగ్ సిస్టం, ప్రొజెక్టర్లు, ఏసీలు, ఇతర విలువైన ఎలక్ట్రిక్ సామగ్రి, రెండు లిఫ్ట్‌లు నీటితో నిండాయి. నిజానికి అధికారులు బుధవారం రాత్రి నుంచి పంపుహౌస్‌లోకి వస్తున్న వరదను ఆపడం కోసం మోటార్లు నడిపించేందుకు సిద్ధమ య్యారు. కానీ భారీ వర్షాలతో అన్నారం నుంచి వచ్చే 220 కేవీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో మోటార్లను నడిపించలేకపోయారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి ట్రాన్స్‌కో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆలోగా పంపుహౌజ్ పూర్తిగా నీట మునిగింది. కాగా.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 21, 22లో భాగంగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బైరాపూర్ శివారులో నిర్మిస్తున్న గడ్కోల్ పంపుహౌస్‌లోకి కూడా వరద నీరు చేరింది. 1986 నాటి వరదను తట్టుకునేలా నిర్మాణం: శ్యాంప్రసాద్‌రెడ్డి మునిగిన పంపుహౌస్‌లలో నీటిని తొలగించి అన్ని పరికరాలను పరీక్షించాకే వాస్తవ నష్టాన్ని అంచనా వేయగలమని రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం అధ్యక్షుడు శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. 1986లో వచ్చిన వందేళ్ల గరిష్ట వరదను తట్టుకునేలా కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేసినా..అంతకు మించిన వరద రావడంతో పంపులు నీటమునిగాయని పేర్కొన్నారు. -
కాళేశ్వరానికి సాయమేది?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ముగింపు దశకు చేరుకుంటున్నా.. కేంద్రం నుంచి దక్కే ఆర్థిక సాయం మాత్రం తేలేలా లేదు. ఈ ప్రాజెక్టును సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ)లో చేరుస్తామంటూ ఆరు నెలల కిందటే కేంద్రం సంకేతాలు ఇచ్చినా దీనిపై మళ్లీ ఊసే లేదు. అడపాదడపా ప్రాజెక్టుకు ఉన్న అనుమతులు, ఇతర అంశాలపై లేఖలు రాస్తున్నా.. ఇంతవరకు నయాపైసా విదల్చలేదు. దీంతో కేంద్ర నిధులపై రాష్ట్రం ఆశలు పూర్తిగా నీరుగారినట్లే కన్పిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశం ఎటూ తేలకపోవడంతో కనీసం ఏఐబీపీ పథకంలోనైనా చేర్చి ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్ల కిందట కేంద్రాన్ని కోరింది. అప్పట్లోనే ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించింది. గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీలను తీసుకుంటూ రూ.80,190 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినట్లు వివరించింది. ఏఐబీపీలో ప్రాజెక్టును చేర్చాలని కోరే నాటికే ప్రాజెక్టు కింద సుమారు రూ.50 వేల కోట్ల మేర నిధులు ఖర్చు చేశామని, మిగతా నిధుల అవసరాలకు సాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఏడాది మేలో ఏఐబీపీ పథకాన్ని 2026 వరకు పొడిగిస్తున్నట్లు నిర్ణయించి, అందులో కాళేశ్వరాన్ని చేర్చేందుకు సద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ప్రాజెక్టు సమగ్ర వివరాలు కోరింది. దీంతో ఆ వివరాలను మరోసారి కేంద్రానికి పంపింది. దీనిపై పలుసార్లు పర్యావరణ, అటవీ అనుమతులు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) అనుమతులు, కాస్ట్ అప్రైజల్ అనుమతులు, భూసేకరణ, ఆర్అండ్ఆర్ వివరాలు కోరగా, వాటినీ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. ఈ అన్ని అంశాలపై సమగ్ర పరిశీలన చేసిన కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిధిలోని మానిటరింగ్ అండ్ అప్రైజల్ డైరెక్టరేట్ ప్రాజెక్టును ఏఐబీపీలో చేర్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయంటూ కేంద్రానికి నివేదించింది. తర్వాత కూడా ప్రాజెక్టుపై చేసిన వ్యయం, రానున్న ఆర్థిక సంవత్సరాల్లో ప్రాజెక్టుపై వెచ్చించేందుకు నిర్ణయించిన బడ్జెట్‌పై వివరణలు కోరింది. ఇన్ని వివరాలు అడిగినా ఇప్పటివరకు ప్రాజెక్టును ఏఐబీపీలో చేరుస్తున్నట్లు కేంద్రం ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు. అదనపు టీఎంసీ పనులకు కష్టమే.. ప్రాజెక్టు విస్తరణలో భాగంగా రూ.30 వేల కోట్లతో చేపట్టిన అదనపు టీఎంసీ పనులను ఏఐబీపీలో చేర్చాలని కోరుదామంటే, ఈ పనులన్నీ కొత్తగా చేపట్టినవని, వీటికి అపెక్స్ కౌన్సిల్ సహా, బోర్డుల అనుమతులు ఉండాలని కేంద్రం పేర్కొంటోంది. ఇప్పుడు చేర్చినా ఫలితం కొంతే.. కాళేశ్వరం మొత్తం వ్యయం రూ.80 వేల కోట్లలో ఇప్పటికే ప్రభుత్వం రూ.68 వేల కోట్ల మేర ఖర్చు చేసింది. ఈ నిధుల కోసం రుణ సంస్థల నుంచి నిధులు సేకరించింది. రుణాల ద్వారా సేకరించిన వాటి నుంచే రూ.45 వేల కోట్ల వరకు ఖర్చు జరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టును ఏఐబీపీలో చేర్చినా పెద్దగా ఫలితం ఉండదని చెబుతున్నారు. మిగిలిన రూ.12 వేల కోట్ల పనుల్లో ఏఐబీపీ కింద కేంద్రం గరిష్టంగా రూ.3–5 వేల కోట్లు ఇచ్చినా.. ఆ నిధులతో ప్రాజెక్టుకు ఒరిగే ప్రయోజం ఏమీ ఉండదు. పైగా ఈ నిధులు ఇచ్చేందుకు కూడా కేంద్రం రెండు, మూడేళ్లు గడువు పెడుతోంది. అప్పట్లోగా ప్రాజెక్టు పనులన్నీ పూర్తవుతాయి. -
TS: జలదృశ్యం సాకారం
సిద్దిపేటజోన్: గతంలో సాగుచేసేందుకు రైతులు కిలోమీటర్ల దూరం నుంచి పైపుల ద్వారా నీటిని తరలించడానికి పైపులు వాడి నానాపాట్లు పడేవారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రంగనాయక సాగర్ రిజర్వాయర్ నిర్మించడం వల్ల చిన్నకోడూర్ ప్రాంత రైతులకు సుదూరం నుంచి సాగునీటిని తీసుకొచ్చే వ్యథ తప్పింది. దీంతో నీటి తరలింపునకు వాడిన పైపులు చెట్టు పైన మూటకట్టిన దృశ్యాన్ని.. ముంగిట్లో గోదావరి జలాల స్థితిగతులు వివరిస్తోన్న ఓ ఫొటో ‘సాక్షి’ప్లస్‌లో మంగళవారం ప్రచురితమైంది. ‘సాక్షి’లో వచ్చిన ఫొటోపై మంత్రి హరీశ్‌రావు ‘తెలంగాణ జలదృశ్యం సాకారం’అని వ్యాఖ్యానిస్తూ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనికి కొద్దినిమిషాల్లోనే వందల కొద్దీ లైకులు వచ్చాయి. తెలంగాణ జలదృశ్యం కలసాకారం..#Kaleshwaram pic.twitter.com/s3ET7TAVBR — Harish Rao Thanneeru (@trsharish) October 5, 2021 -
గోదావరిలో జల సవ్వడి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు.. మొన్నటి వరకు కొనసాగిన కాళేశ్వరం ఎత్తిపోతల నేపథ్యంలో గోదావరిలో జల సవ్వడి నెలకొంది. మేడిగడ్డ మొదలు సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మసాగర్ వరకు బ్యారేజీలు, రిజర్వాయర్లన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే ఎల్లంపల్లి, కడెం, మిడ్‌మానేరు, లోయర్ మానేరులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీలోకి సైతం ప్రవాహాలు పెరిగాయి. ప్రస్తుత సాగు అవసరాలను దృష్టిలో పెట్టుకొని లోయర్ మానేరు నుంచి ఎస్సారెస్పీ కాల్వలకు నీటిని విడుదల చేసేందుకు ఇరిగేషన్ శాఖ సిద్ధమవుతోంది. అవసరాలకు తగ్గట్లు ఆయకట్టుకు.. జూన్ తొలి వారంలో వర్షాలు కురిసినా ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టడంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. జూన్ మూడో వారం నుంచి కాళేశ్వరం ఎత్తిపోతలు చేపట్టింది. ప్రాణహితలో వచ్చిన నీటిని వచ్చినట్లుగా 12 టీఎంసీల మేర నీటిని మేడిగడ్డ నుంచి దిగువ కొండపోచమ్మ వరకు తరలించింది. ప్రస్తుతం పంపులను పూర్తిగా నిలిపివేయగా మేడిగడ్డ వద్ద 55 వేల క్యూసెక్కులకుపైగా నీటి ప్రవాహాలు కొనసాగుతున్నాయి. 25 గేట్లు పైకెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారంలో 10.87 టీఎంసీలకుగాను ప్రస్తుతం 8.50 టీఎంసీల మేర నిల్వ ఉండగా సుందిళ్లలో 8.83 టీఎంసీలకుగాను 6 టీఎంసీల మేర నిల్వ ఉంది. ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకుగాను సోమవారం 17.25 టీఎంసీల మేర నీటి నిల్వ ఉండగా 15 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహాలు వస్తున్నాయి. దీంతోపాటు కాళేశ్వరం ద్వారా ఇప్పటికే లోయర్ మానేరు, మిడ్ మానేరును నింపారు. లోయర్ మానేరులో 24 టీఎంసీలకుగాను 21.10 టీఎంసీలు నిల్వ ఉండగా 4 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ఇక్క డి నుంచి సూర్యాపేట వరకు ఎస్సారెస్పీ కాల్వల కింద నీటిని అందించేందుకు గేట్లు ఎత్తాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది. మిడ్‌మానేరులో సైతం 25.87 టీఎంసీలకుగాను 23.34 టీఎంసీల నిల్వ ఉంది. ఇక మిడ్‌మానేరు నుంచి నీటిని ఎత్తిపోయ డంతో మలక్‌పేట, రంగనాయక్సాగర్లలో మూడే సీ టీఎంసీల నిల్వలు ఉండగా 15 టీఎంసీల కొండపోచమ్మ సాగర్‌లో సైతం 6.80 టీఎంసీల నిల్వ ఉం ది. బ్యారేజీలు, రిజర్వాయర్లలో ఉన్న నీటితో అవసరాలకు తగ్గట్లుగా ఆయకట్టు కాల్వలకు నీటిని విడుదల చేయనున్నారు. ఇక గోదావరి బేసిన్‌లోని ఎస్సారెస్పీకి వరద ప్రవాహం పెరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వస్తున్న వరదనీటి ఇన్‌ఫ్లో సోమవారం రాత్రి 9 గంటలకు 90 వేల క్యూసెక్కులకు చేరింది. నీటి మట్టం 1075.20 (40.203 టీఎంసీలు) అడుగులకు చేరింది. సమ్మక్క బ్యారేజీ నుంచి 1.35 లక్షల క్యూసెక్కులు విడుదల ఏటూరునాగారం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీ గేట్లను ఇరిగేషన్ అధికారులు సోమవారం తెరిచారు. 59 గేట్లలో 36 గేట్లను తెరిచి లక్షా 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 6.9 టీఎంసీలుకాగా ప్రస్తుతం 1.3 టీఎంసీలను నిల్వ చేశారు. -
‘ఇవన్నీ కేసీఆర్ గొర్రెలు అంటున్నరు.. ఇంకా నయం కేసీఆరే గొర్రె అంటలేరు.’
-
నన్నెవరూ ఆపలేరు: సీఎం కేసీఆర్
సాక్షి, సిరిసిల్ల: ‘కేసీఆర్ ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు.. తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు నేను అనుకున్నవన్నీ జరిగాయి. లక్ష్యశుద్ధి.. చిత్తశుద్ధి.. వాక్శుద్ధి ఉంటే.. ఏదైనా కచ్చితంగా అయి తీరుతుంది’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌తో కలసి రాజన్నసిరిసిల్ల జిల్లా నూతన కలెక్టరేట్ సముదాయం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇంటిగ్రేటెడ్ డ్రైవింగ్ స్కూల్, నర్సింగ్ కాలేజీ, వ్యవసాయ మార్కెట్ యార్డును ఆదివారం ప్రారంభించారు. కలెక్టరేట్లో కేసీఆర్ సుదీర్ఘంగా (గంటసేపు) మాట్లాడారు. తెలంగాణ వచ్చాక ఏడేళ్లలో ఏం సాధించామో అందరి కళ్లముందే కనిపిస్తోందని తెలిపారు. రాజకీయాల్లో కిరికిరిగాళ్లు ఎప్పుడూ ఉంటారని, సన్నాసులు ఎప్పుడూ సన్నాసులేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక పాలన సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని, కొత్త కలెక్టరేట్ నమూనాలను ఆర్కిటెక్చర్ ఉషారెడ్డి, ఇంజినీర్ గణపతిరెడ్డి అద్భుతంగా తీర్చిదిద్దారని అభినందించారు. రైతుల ఇళ్లలో బంగారు వాసాలు కావాలే గోదావరి జలాలను రివర్స్ పంపింగ్ ద్వారా మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెడితే అది అయితదా.. పోతదా.. అని అనుమానపడ్డారని, ఏం జరిగిందో కళ్లముందే ఉందని కేసీఆర్ అన్నారు. మల్టీ స్టేజీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని తాను చెబితే కొందరు అపవాదులు వేశారని తెలిపారు. ఈ విషయంలో ప్రధాని మోదీతోనే పంచాయితీ పెట్టుకున్నానని పేర్కొన్నారు. కాళేశ్వరం నుంచి మిడ్‌మానేరు వరకే 40 లక్షల ఎకరాలు పారుతోందని స్పష్టం చేశారు. ఎంతో శ్రమించి కాళేశ్వరం కడితే.. కరెంట్ ఖర్చు రూ.10వేల కోట్లు అంటూ.. కొందరు మాట్లాడుతున్నారని, రైతుల బాగుకోసం ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. రైతుల ఇళ్లలో బంగారువాసాలు కావాలన్నారు. చెంబుతో నీళ్లు ముంచుకోవచ్చు... ఆరేళ్లలో ఎంతో అద్భుతం జరిగిందని, వలస వెళ్లిన వారు తిరిగి వస్తున్నారని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుతో మహబూబ్‌నగర్, సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని, ఇంకా మధ్యలో చిన్నచిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ వరద కాలువ ఇప్పుడు రిజర్వాయర్‌గా మారిందని, 365 రోజులు చెంబుతో నీళ్లు ముంచుకోవచ్చన్నారు. లక్ష్మీ, సరస్వతి, పార్వతీ ప్రాజెక్టులతో 180 కిలోమీటర్లు గోదావరి సజీవ జలదృశ్యం ఆవిష్కృతమైందని స్పష్టం చేశారు. గతంలో వర్షాలు పడితే.. చెరువులు తెగిపోయేవని, ప్రస్తుత ప్రభుత్వం చెరువులను బాగు చేయడంతో అధిక వర్షాలు పడినా చెరువులు మంచిగా ఉన్నాయన్నారు. బతుకమ్మ చీరలపైనా రాజకీయం.. ఒకప్పుడు సిరిసిల్లలో ఆత్మహత్యలు వద్దు.. అనే నినాదాలు గోడలపై కనిపించాయని, అవి తనను ఎంతో కలిచివేశాయన్నారు. నేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు బతుకమ్మ చీరల తయారీ ఇస్తే.. దాన్ని కూడా రాజకీయం చేయడం దారుణమన్నారు. సిరిసిల్లలో పద్మశాలి భవన్ కు రూ.5కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పల్లె, పట్టణ ప్రగతిని బాగా చేయండి ‘మీకు దండం పెడతా.. పల్లె ప్రగతి.. పట్టణ ప్రగతిని పకడ్బందీగా చేయండి’ అంటూ సీఎం కోరారు. ఆక్సిజన్ కొనుక్కునే దుస్థితి ఎందుకొచ్చిందో అర్థం చేసుకోవాలన్నారు. హరితహారం ఉజ్వలమైన కార్యక్రమం అని.. అందరూ భాగస్వాములు కావాలని కోరారు. భవిష్యత్‌లో మన పిల్లలకు ఇచ్చే సంపద ప్రకృతి మాత్రమేనని, పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ ఏడాది లాక్డౌన్ కారణంగా ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఆదాయం కోల్పోయిందని పేర్కొన్నారు. అయినా ఒక్కో పనిని చేసుకుంటూ పోతున్నామని, దుబారా లేకుండా ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, జెడ్పీ చైర్పర్సన్ అరుణ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, రఘోత్తమరెడ్డి, భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పాల్గొన్నారు. నర్సింగ్ విద్యార్థుల స్టై ఫండ్ పెంపు.. మొదటి సంవత్సవం వారికి ప్రస్తుతం రూ.1500 స్టైఫండ్ ఇస్తున్నారు.. దాన్ని రూ.5 వేలకు పెంచుతున్నం. రెండో సంవత్సరం వారికి ఇచ్చే రూ.1600 స్థానంలో రూ.6వేలు, మూడో సంవత్సరం వారికి ఇచ్చే రూ.1900 స్థానంలో రూ.7వేలు ఇస్తం. గర్వంగా చెబుతున్నా... దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతీ గ్రామపంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ ఉంది. ప్రతీ ఊరిలోనూ వైకుంఠధామాలు ఉన్నాయని నేను గర్వంగా చెబుతున్నా. రూ.10వేల కోట్లు... రూ.10వేల కోట్లతో హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేస్తున్నం. రెండో విడత గొర్రెల పంపిణీని రూ.4వేల కోట్లతో చేపడతం. -
పార్వతీ బ్యారేజీ: డెలివరీ సిస్టర్న్ వద్ద కుంగిన భూమి
మంథని: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం సమీపంలో నిర్మించిన పార్వతీ బ్యారేజీ డెలివరీ సిస్టర్న్‌కు ఉన్న పైపులైన్లో నాల్గో మోటార్ పైపు వద్ద భూమి కుంగిపోయింది. పంపు మోటార్ నీటి ప్రవాహం తాకిడికి పైపు పైకి లేచింది. సుమారు 200 మీటర్ల మేర పైపుపై ఉన్న మట్టి కొట్టుకుపోయింది. మంథని మండలం గుంజపడుగు సమీపంలోని సరస్వతీ పంపుహౌస్ నుంచి 12 మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోయడానికి పార్వతీ బ్యారేజీకి పైపులైన్ నిర్మించారు. ఈనెల 18 నుంచి నీటి ఎత్తిపోత ప్రారంభమైంది. రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి వరదనీరు పైపులైన్ కిందకు చేరింది. పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తిపోస్తున్న క్రమంలో పైపులైన్లో వేగంగా నీటి ప్రవాహం ఉండటంతో డెలివరీ సిస్టర్న్ నుంచి వచ్చే ప్రెషర్‌కు పైపు పైకి లేచింది. సుమారు మూడు మీటర్ల ఎత్తున పైపుపైకి లేచి వంకర తిరిగింది. ఎత్తిపోతలకు అంతరాయం ఏర్పడంతో తేరుకున్న నీటిపారుదల శాఖ అధికారులు మరమ్మతు చేపట్టారు. భూమి కుంగిన చోట మొరం పోస్తున్నారు. డెలివరీ సిస్టర్న్ వద్ద మట్టిని తవ్వడం, అటు తర్వాత నింపడంతో భూమి కుంగిపోయిందని, ఇలా జరగడం సర్వసాధారణమని అధికారులు అంటున్నారు. మంగళవారం ఐదు మోటార్ల ద్వారా 14,,650 క్యూసెక్కుల నీటిని పార్వతీ బ్యారేజీలో ఎత్తిపోశారు. -
తెలుగు ఘనతకు దృశ్య సాక్ష్యం
రేపు అంటే జూన్ 25 రాత్రి 8 గంటలకు ప్రతిష్టాత్మక డిస్కవరీ చానెల్లో ‘లిఫ్టింగ్ ఏ రివర్’ డాక్యుమెంటరీ టెలికాస్ట్ కానుంది. తెలుగువారి ఘనతకు సాక్ష్యంగా నిలిచిన ‘కాళేశ్వరం ప్రాజెక్ట్’ మహా నిర్మాణ ఉత్కృష్టతను దేశానికే కాదు ప్రపంచానికీ తెలియచేయనున్న డాక్యుమెంటరీ ఇది. దీని దర్శకుడు తెలుగువాడైన కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స. గతంలో ‘ఇన్సైడ్ తిరుమల’ డాక్యుమెంటరీ తీసి 52 దేశాల్లో ప్రసారం చేసిన రాజేంద్ర డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్‌గా తెలుగువారి ఘనతను చూపుతూ తన ఘనతనూ నిరూపించుకుంటున్నారు. ఆయన పరిచయం. ఫిక్షన్లో కల్పన ఉంటుంది. నాన్ ఫిక్షన్లో వాస్తవాల ఆధారం ఉంటుంది. వాస్తవాలను నిరూపించడం, సాక్ష్యాధారాలతో నిక్షిప్తం చేయడం ఉంటుంది. నాన్ ఫిక్షన్ విభాగానికి వచ్చే డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్ ఒక విధంగా చరిత్రకారుడి పని చేస్తాడు. వర్తమానాన్ని చరిత్ర కోసం, చరిత్రను వర్తమానం కోసం అన్వేషిస్తాడు. కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స అలాంటి అన్వేషకుడు. ఆయన అన్వేషణ తెలుగువారి కోసం, తెలుగువారి తరఫున సాగడం తెలుగువారికి మేలు చేస్తోంది. లిఫ్టింగ్ ఏ రివర్ ‘జటిలమైన విషయాలను సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పడమే అసలైన కష్టం’ అంటారు 52 సంవత్సరాల రాజేంద్ర శ్రీవత్స. ఢిల్లీ నుంచి టెలిఫోన్ ద్వారా ‘లిఫ్టింగ్ ఏ రివర్’ డాక్యుమెంటరీ గురించి ఇంటర్వ్యూ ఇస్తూ ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప నిర్మాణం. ఈ స్థాయిలో ప్రాజెక్టులు కొన్ని ఉండొచ్చు. కాని అవన్నీ ఒకేచోట నిర్మితమయ్యాయి. కాళేశ్వరం పథకం అలాంటిది కాదు. అది మల్టీ లొకేషన్ ప్రాజెక్ట్. సాగునీటి కోసం తాగు నీటి కోసం సాగిన ఈ నిర్మాణం గురించి తెలుగువారే కాదు ప్రపంచమంతా తెలుసుకోవాలని ఈ డాక్యుమెంటరీ తీశాను. ఒక గంట దీని నిడివి’ అంటారు రాజేంద్ర. రెండేళ్ల కృషి ‘నేను ఢిల్లీలో ఉంటాను. 2017లో ఒక డాక్యుమెంటరీ పని మీద హైదరాబాద్ వచ్చినప్పుడు న్యూస్పేపర్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చదివాను. అరె... నేను తెలంగాణావాణ్ణి. పైగా మీడియాలో ఉన్నాను. నాకే దీని గొప్పతనం పూర్తిగా తెలియకపోతే సామాన్యుడికి ఏం తెలుస్తుంది. ఈ మొత్తం నిర్మాణాన్ని ఫాలో అవుతూ డాక్యుమెంటరీ తీద్దాం అనుకున్నాను’ అంటారు రాజేంద్ర. అనుకున్నదే తడవు తన సంస్థ పల్స్ మీడియా తరఫున డాక్యుమెంటరీ నిర్మాణ పనుల్లో దిగారాయన. ‘రెండేళ్ల పాటు ప్రాజెక్ట్ పనులను ఫాలో అవుతూ ఇంజనీర్లను కలుస్తూ ఇంటర్వ్యూలు చేస్తూ ఇమేజ్ లు కాప్చర్ చేస్తూ వందల గంటల ఫుటేజ్ తీశాం. పోస్ట్ ప్రొడక్షన్ ఇంకో సంవత్సరం పట్టింది. తీసిన ఫుటేజ్ మొత్తం చూడటానికే 3 నెలలు పట్టింది. నేను తప్పక పాటించిన విషయం ఏమిటంటే అంతా ఆన్ లొకేషన్‌గా ఉండేలా చూడటం. యాక్చువల్ సౌండ్‌ను ప్రేక్షకులకు వినిపించడం. ఈ డాక్యుమెంటరీ చూసినవారు ప్రాజెక్ట్‌లో తిరిగిన భావనకు లోనవుతారు. సౌండ్ రికార్డిస్ట్ పి.డి.వాల్సన్, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ ప్రశాంత్ కారంత్, స్క్రిప్ట్ రైటర్ పూర్ణిమా రావు... వీరందరూ గొప్పగా పని చేయడం వల్ల ఇది సాధ్యమైంది’ అన్నారు రాజేంద్ర. ‘ఇంత గొప్ప నిర్మాణం అన్నిసార్లు సాధ్యం కాదు. దీనిని జీవితంలో ఒకసారి దొరికే అవకాశం అనుకుంటాను. అంతేకాదు శివుడి (కాళేశ్వరుడి) ఆజ్ఞతో ఈ పని జరిగి ఉండొచ్చనిపిస్తుంది’ అంటారు రాజేంద్ర. అంతర్జాతీయ చానెల్స్‌తో ‘2002లో నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ భారతదేశం నుంచి ప్రొడ్యూస్ అయ్యే కంటెంట్‌ను ప్రసారం చేయదలిచి డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్స్ ను ఆహ్వానించింది. ఎంతోమంది అప్లై చేశారు. ఇద్దర్ని మాత్రమే ఎంచుకున్నారు. వారిలో నేనొకణ్ణి’ అంటారు రాజేంద్ర. ‘అదృష్టవశాత్తు దేశంలో శాటిలైట్ చానల్స్ వృద్ధి, నా కెరీర్ ఒకేసారి మొదలయ్యాయి. నా కెరీర్ మొదట్లోనే నేషనల్ జియోగ్రాఫిక్, డిస్కవరీ చానల్స్‌తో పని చేయడం వల్ల నాణ్యతతో ఎలా డాక్యుమెంటరీలు తీయాలో నాకు తెలిసింది. నిజానికి ఆ చానల్సే నాకు పని నేర్పాయి. దూరదర్శన్ దగ్గరి నుంచి అల్ జజీరా వరకూ అన్ని చానెల్స్‌కు డాక్యుమెంటరీలు చేశాను.’ అంటారు రాజేంద్ర. తిరుమల ఖ్యాతి నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ కోసం రాజేంద్ర తీసిన ‘ఇన్సైడ్ తిరుమల తిరుపతి’ 60 నిమిషాల డాక్యుమెంటరీ విశేష జనాదరణ పొందింది. ‘రోజూ 80 వేల మంది నుంచి లక్ష మంది భక్తులు తిరుమలకు వస్తారు. కాని అంతమందిని ఎంతో గొప్పగా పర్యవేక్షిస్తారు. తిరుమల అంటే దర్శనం, ప్రసాదం మాత్రమే కాక ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది అని ఆ డాక్యుమెంటరీ తీశాను. తెలుగువారి ఈ ఘన పుణ్యక్షేత్రం గురించి 2017లో ప్రసారం అయినప్పుడు సాధారణ టిఆర్పి కొలమానాలు ఆ ప్రేక్షకాదరణను కొలవడానికి పనికి రాలేదు. ఆ డాక్యుమెంటరీ 52 దేశాలలో ప్రసారమయ్యి తెలుగు వారి పుణ్యక్షేత్ర ఘనతను చాటింది ’ అంటారు రాజేంద్ర. ఇది కాకుండా దూరదర్శన్ కోసం ఎన్నో సైన్స్ కార్యక్రమాలు చేశారు రాజేంద్ర. అలాగే ‘స్వర్ణదేవాలయం’ మూలాలను తెలియ చేసే డాక్యుమెంటరీ ‘సీక్రెట్స్ ఆఫ్ గోల్డెన్ టెంపుల్’, 2010 కాలంలో భారతదేశంలో ఊపందుకున్న సరొగసీ ధోరణిని డాక్యుమెంట్ చేస్తూ తీసిన ‘ఫైండింగ్ ఏ ఊంబ్’ రాజేంద్రకు చాలా పేరు తెచ్చాయి. సానుకూల దృక్పథం ‘దేశంలోగాని తెలుగు ప్రాంతాలలో గాని మంచి పనులు జరుగుతున్నాయి. కాని మనం చెడును మాట్లాడుకున్నట్టుగా మంచి మాట్లాడుకోము. ఉదాహరణకు దేశంలో సైన్స్ పురోగతి కోసం గొప్ప కృషి జరుగుతోంది. దానిని ప్రజలకు చెప్పడం లేదు. ప్రభుత్వాలు చేస్తున్న మంచి పనులు చెప్పడం లేదు. మంచి మాట్లాడుతూ ఉంటే మంచి పనుల కొనసాగింపు ఉంటుంది’ అని ముగించారు కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స. ‘లిఫ్టింగ్ ఏ రివర్’ ప్రసార సమయాలు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స తీసిన 60 నిమిషాల డాక్యుమెంటరీ ‘లిఫ్టింగ్ ఏ రివర్’ డిస్కవరి చానల్లో జూన్ 25 రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతోంది. 6 భాషలలో దీనిని చూడొచ్చు. అలాగే డిస్కవరీ సైన్స్ చానెల్లో జూన్ 28 రాత్రి 9 గంటలకు, డిస్కవరీ టర్బో చానల్లో జూన్ 29 రాత్రి 9.50కు ఇది ప్రసారం కానుంది. డిస్కవరీ ఓటిటి చానల్ ‘డిప్లస్’లో జూన్ 25 నుంచి వీక్షణకు ఉంటుంది. పక్కా హైదరాబాదీ కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స పుట్టింది పెరిగింది హైదరాబాద్‌లో. తండ్రి సుధాకర రావు ఆంధ్రప్రదేశ్ మైనింగ్ కార్పొరేషన్లో పని చేసేశారు. తల్లి శాంత. రాజేంద్ర నిజాం కాలేజ్‌లో డిగ్రీ చేసి తర్వాత ఢిల్లీ జె.ఎన్.యూలో పి.జి ఫిలాసఫీ చేయడానికి వెళ్లారు. ‘శ్రీధర్‌బాబు (మంథని ఎం.ఎల్.ఏ, మాజీ మంత్రి) నేనూ చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. ఢిల్లీలో అతను జెఎన్‌యూకు ‘లా’ చేయడానికి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను. నిజాం కాలేజీలో నువ్వు క్రియేటివ్‌గా పనులు చేసేవాడివి కదా... ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్‌లోకి వెళ్లు అని అతడు ప్రోత్సహించేవాడు. అలా నేను ఫిల్మ్ మేకింగ్‌లోకి వచ్చాను’ అంటారు రాజేంద్ర. ‘నా భార్య మమతది వరంగల్. మా అబ్బాయ్ అమోఘ్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు’ అని తెలియచేశారు. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కాళేశ్వరం అద్భుత సృష్టి.. ఈనెల 25న డిస్కవరీ చానల్లో
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన ఓ అద్భుతం. ఈ భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు ఘనత, ప్రాముఖ్యత మరోమారు అంతర్జాతీయ స్థాయిలో మారు మోగనుంది. ఇప్పటికే కాళేశ్వరానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ ప్రాజెక్టుపై ప్రఖ్యాత డిస్కవరీ చానల్ ఓ డాక్యుమెంటరీని ప్రపంచ ప్రజల ముందుంచనుంది. ప్రాజెక్టు నిర్మాణాల్లో వినియోగించిన అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచంలో మరెక్కడా లేని అతి భారీ పంపులు, మోటార్లు, ఇంజనీర్లు, కార్మికుల శ్రమ, అన్నిటికీ మించి తమ కలల ప్రాజెక్టు సాకారానికి ప్రభుత్వం చేసిన కృషిని వివరించనుంది. గంట డాక్యుమెంటరీ గోదావరి జలాలను ఎత్తిపోస్తున్న వైనంపై ‘లిఫ్టింగ్ ఎ రివర్’పేరిట డిస్కవరీ కథనాన్ని ప్రసారం చేయనుంది. ఈ నెల 25న శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు తెలుగు, ఇంగ్లిష్ సహా ఆరు భారతీయ భాషల్లో ఈ డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. దీనిపై ప్రచారాన్ని మొదలు పెట్టిన డిస్కవరీ చానల్.. అన్ని దేశాల్లో తన మీడియా వ్యవస్థల ద్వారా ప్రోమోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతోంది. మనుషులు, మెషీన్లు కలిసి అసాధ్యమనుకున్న కార్యాన్ని ఏ విధంగా సుసాధ్యం చేశాయో తెలుసుకోవాలంటే దీన్ని వీక్షించాలని చెబుతోంది. అన్ని అంశాలూ కవర్ చేస్తూ.. 2017లో ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పూర్తి చేసిన నిర్మాణాలను చూపుతూనే.. నీటిని ఆయకట్టు ప్రాంతాలకు తరలించే క్రమంలో ఎదురైన అనుభవాలను డాక్యుమెంటరీలో చూపనుంది. రోజుకు గరిష్టంగా 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా నిర్మించిన ఈ భారీ పథకం కింద 20 పంపుహౌస్‌లలోని 104 భారీ పంపులు, మోటార్లను ఏర్పాటు చేయడంలో మేఘా ఇంజనీరింగ్ సంస్థ చేసిన కృషిని వివరించనుంది. ముఖ్యంగా గాయత్రి భూగర్భ పంపింగ్ కేంద్రం లోని 139 మెగావాట్ల భారీ పంపులు, మోటార్లు ప్రపంచంలో మరెక్కడా లేవు. డిస్కవరీ వీటిపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. రూ.80 వేల కోట్లకు పైగా వ్యయంతో 40 లక్షల ఎకరాలకు సాగునీటినిచ్చే ఈ భారీ ప్రాజెక్టుకు ఆర్థిక వనరులు సమకూర్చుకున్న విధానాలు, రైతులు, పారిశ్రామిక రంగాల వారికి ప్రయోజనాలు, వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసే తీరు తదితర అంశాలను చానెల్ విశ్లేషించనుంది. రెండ్రోజుల కిందట కామారెడ్డి కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ డాక్యుమెంటరీ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన అద్భుతాన్ని అంతర్జాతీయ సమాజం తెలుసుకుంటుందన్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం, ఆర్ధిక సం ఘం, నీతిఆయోగ్, వివిధ రాష్ట్రాల సీఎంలు, నిపుణులు, విదేశీ ప్రముఖులు కొనియాడటం గమనార్హం. -
‘కాళేశ్వర ఫలం’: 2.70 లక్షల ఎకరాలకు తొలి తడి
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తొలిసారి కొత్త ఆయకట్టుకు నీరందనుంది. ఇప్పటివరకు ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగానే ఎత్తిపోతలు కొనసాగగా.. మొదటిసారి 2.70 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు గోదావరి పారనుంది. అన్నీ కుదిరితే వచ్చే నెల చివరి నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేసేలా సాగునీటి శాఖ ప్రణాళికలు వేస్తోంది. ఇందులో ఈ ఏడాది నుంచి పాక్షికంగా అందుబాటులోకి రానున్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ కింద సైతం 55వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందనుంది. అన్ని రిజర్వాయర్ల కింద ఆయకట్టుకు.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 18.50 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు మరో 18.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే మొదలైన కాళేశ్వరం ఎత్తిపోతలు ద్వారా రెండేళ్లుగా కేవలం స్థిరీకరణ అవసరాల నిమిత్తమే నీటి వినియోగం జరిగింది. ముఖ్యంగా ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2 పరిధిలో ఉన్న 13 లక్షల ఎకరాలకు గానూ లోయర్ మానేరు దిగువున ఉన్న ఆయకట్టు సుమారు 8 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారానే నీరందిస్తున్నారు. మిడ్‌మానేరు దిగువున కొండపోచమ్మ సాగర్ వరకు ఉన్న రిజర్వాయర్లన్నింటినీ నింపినా వాటి చెరువులు నింపేందుకు మాత్రమే నీటిని వదిలారు. అయితే ఈ ఏడాది వానాకాలంలో మాత్రం తొలిసారి కాళేశ్వరంలోని అన్ని రిజర్వాయర్ల కింద కొత్త ఆయకట్టుకు నీరందించేలా పనులు పూర్తి చేశారు. మిడ్‌మానేరు కింద 50 వేల ఎకరాలు.. మిడ్‌మానేరు కింద 50 వేల ఎకరాలకు నీరిచ్చేలా ఇటీవలే నిర్ణయించగా, దీనితో పాటు అనంతగిరి రిజర్వాయర్ కింద 20 వేల ఎకరాలు, రంగనాయక్ సాగర్ కింద 55 వేల ఎకరాలు, మల్లన్నసాగర్ కింద 55 వేల ఎకరాలు, కొండపోచమ్మ సాగర్ కింద 70 వేల ఎకరాలకు కొత్తగా నీరివ్వాలని నిర్ణయించారు. ఇందులో మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులు చివరి దశలో ఉన్నాయి. 95 శాతం మేర పనులు ఇప్పటికే పూర్తవగా, జూలై 20 నాటికి మిగతా పనులు పూర్తి చేయనున్నారు. ఇందులో 50 టీఎంసీలకు గానూ మొదట 10 టీఎంసీలు నింపి, తర్వాత ప్రతి మూడు నెలలకు మరో 10 టీఎంసీలు నింపుతూ వెళ్లనున్నారు. తొలిసారిగా నింపే నీటి నుంచే సుమారు 55 వేల ఎకరాలకు నీళ్లిచ్చేలా కాల్వల పనులు పూర్తి చేస్తున్నారు. ఇక 15 టీఎంసీల సామర్ధ్యం గల కొండపోచమ్మ కింద తొలి ఏడాదిలో 7.8 టీఎంసీలు మాత్రమే నింపగా, ఈ ఏడాది పూర్తి స్థాయిలో నింపనున్నారు. దీనికింద సంగారెడ్డి, గజ్వేల్, రామాయంపేట, కిష్టాపూర్, జగదేవ్‌పూర్, తుర్కపల్లి, ఎం.తుర్కపల్లి, రావెల్ కోల్ వంటి కాల్వలు ఉండగా, 2.85 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో జగదేవ్‌పూర్, గజ్వేల్, రామాయంపేట, తుర్కపల్లి కాల్వల పనులు పూర్తయ్యాయి. వీటికింద కనీసంగా 70 వేల ఎకరాలకు సాగు నీరందించేలా పనులు జరిగాయి. ఇక కాళేశ్వరంలోని ప్యాకేజీ–21 కింద చేపట్టిన పైప్‌లైన్‌న్ వ్యవస్థ నిర్మాణాలు పాక్షికంగా పూర్తవడంతో ఈ వానాకాలంలోనే తొలిసారి దీనికింద నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 20 వేల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లివ్వనున్నారు. ఆయకట్టుకు నీటిని ఇవ్వడంతో ఈ రిజర్వాయర్ల కింద కనీసంగా 300 వరకు చెరువులు నింపే ప్రణాళిక సైతం సిద్ధమైంది. వానాకాలం, యాసంగిలో నీటి లభ్యత పెంచేలా చెరువులను పూర్తి స్థాయిలో నింపి ఆయకట్టును స్థిరీకరించనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతలు ద్వారా రెండేళ్లుగా కేవలం స్థిరీకరణ అవసరాల నిమిత్తమే నీటి వినియోగం జరిగింది. అయితే తొలిసారిగా ఈ సీజన్లో ప్రాజెక్టు పరిధిలోని అన్ని రిజర్వాయర్ల కింద కొత్త ఆయకట్టుకు నీరందించేలా పనులు పూర్తి చేశారు. మిడ్‌మానేరు కింద 50 వేల ఎకరాలు, అనంతగిరి 20 వేల ఎకరాలు రంగనాయక్ సాగర్- 55 వేల ఎకరాలు మల్లన్న సాగర్ - 55 వేల ఎకరాలు కొండపోచమ్మ సాగర్- 70 వేల ఎకరాలు కాళేశ్వరం ప్యాకేజీ-21 కింద - 20 వేల ఎకరాలు కలిపి మొత్తం 2.70 లక్షల ఎకరాలకు సాగు నీళ్లివ్వనున్నారు. -
అపూర్వం.. 30 ఏళ్ల తర్వాత తొలిసారి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను నీరందని ప్రాంతాలన్నింటికీ తరలిస్తున్న ప్రభుత్వం మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. గత నెల 23న కూడవెళ్లి వాగు ద్వారా విడుదల చేసిన కాళేశ్వరం జలాలు అప్పర్ మానేరు ను చేరడంతో ఆ ప్రాజెక్టు ప్రస్తుతం అలుగు దుంకుతోంది. సుమారు 30 ఏళ్ల తర్వాత నిండు వేసవిలో ప్రాజెక్టు నిండుకుండలా మారడం ఇదే తొలిసారి. కూడవెళ్లి వాగు నుంచి సుమారు 70 కి.మీ. మేర ప్రయాణించిన గోదావరి జలాలు దారిలో 39 చెక్ డ్యామ్‌లను నింపుకుంటూ అప్పర్ మానేరు చేరగా 11 వేల ఎకరాల మేర ఆయకట్టుకు సాగునీరు అందించగలిగింది. మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరుకు నీటిని తరలించే ప్యాకేజీ-9 పనులు ఆలస్య మవుతున్న నేపథ్యంలో కూడవెళ్లి వాగు ద్వారా తర లించిన జలాలు పెద్ద ఉపశమనం కలిగించనున్నాయి. ప్యాకేజీ-9 ఆలస్యమైనా చింతలేకుండా.. అప్పర్ మానేరు ప్రాజెక్టును సుమారు 50 ఏళ్ల కింద 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించగా పూడిక కారణంగా ప్రస్తుతం అందులో 2.20 టీఎంసీల నీటినే నిల్వ చేసే అవకాశం ఉంటోంది. దీని కింద 13 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించొచ్చు. అయితే వర్షాకాలంలో మినహాయిస్తే జనవరి తర్వాత ఇందులో నీటి లభ్యత ఉండట్లేదు. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరుకు 11.635 టీఎంసీలను తరలిస్తూ మొత్తంగా 60 వేల ఎకరాల కొత్త ఆయ కట్టు, 26 వేల ఎకరాల స్థిరీకరణ చేయాలన్న లక్ష్యం తో ప్యాకేజీ-9 పనులను చేపట్టారు. ఈ ప్యాకేజీని మొత్తంగా రూ. 996 కోట్లతో చేపట్టగా రూ. 600 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ముఖ్యంగా 12 కి.మీ. టన్నెల్లో 7 కి.మీ. టన్నెల్ పని పూర్తవ్వగా మిగతా లైనింగ్ పూర్తి చేయాల్సి ఉంది. మొదటి పంప్‌హౌస్‌లో 30 మెగావాట్ల సామర్థ్యంగల 2 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఒక దాని బిగింపు పనులు పూర్తయ్యాయి. రెండో దాని పనులు మొదలుపెట్టనున్నారు. ఈ పంప్‌హౌస్ నుంచి నీళ్లు మలక్‌పేట రిజర్వాయర్‌కు... అటు నుంచి సింగసముద్రం చెరువుకు 18 కి.మీ. గ్రావిటీ ద్వారా వెళ్తాయి. అక్కడ ఉన్న రెండో పంప్‌హౌస్‌లో 2.25 మెగావాట్ల సామర్థ్యంగల రెండు మోటార్ల ద్వారా 5.70 కి.మీ. ప్రెషర్ మెయిన్ నుంచి బట్టల చెరువు, అటు నుంచి 3.35 కి.మీ. గ్రావిటీ ద్వారా ప్రయాణించి అప్పర్ మానేరు చేరేలా డిజైన్ చేశారు. దీని ద్వారా అప్పర్ మానేరుకు నీటి లభ్యత పెంచాలని ప్రభుత్వం భావించింది. అయితే ప్యాకేజీ-9 పనుల్లో మరో 30 శాతం మేర పనులు పూర్తికాలేదు. రెండో పంప్‌హౌస్‌లో మోటార్ల బిగింపు ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలైంది. జూలై చివరి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం ప్యాకేజీలో 1,279 ఎకరాల భూసేకరణ అవసరం ఉండగా 605 ఎకరాలు పూర్తయింది. మిగతా భూసేకరణకు రూ. 25 కోట్ల తక్షణ అవసరాలున్నాయి. వాటి విడుదలలో ప్రభుత్వ జాప్యంతో పనులు నెమ్మదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించిన సీఎం కేసీఆర్... కూడవెళ్లి వాగు ద్వారా అప్పర్ మానేరుకు నీటిని తరలించే ప్రణాళికను అమల్లో పెట్టారు. కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్‌కు వెళ్లే గ్రావిటీ కెనాల్ 7వ కి.మీ. వద్ద నిర్మించిన హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని కూడవెళ్లి వాగులోకి తరలించేలా పనులు పూర్తి చేశారు. దీంతో గత నెల 23న మంత్రి హరీశ్‌రావు, ఈఎన్సీ హరిరామ్ ఈ కాల్వ నుంచి 1,300 క్యూసెక్కుల నీటిని వాగులోకి విడుదల చేశారు. ఈ నీరు దారిలోని 39 చెక్‌డ్యామ్‌లను నింపుకుంటూ అప్పర్ మానేరు చేరింది. మొత్తంగా 2 టీఎంసీల మేర నీరు అప్పర్ మానేరు చేరడంతో అది ప్రస్తుతం పూర్తిగా నిండి సోమవారం సాయంత్రం నుంచి అలుగు దుంకుతోంది. జూన్‌లో వర్షాలు ఆలస్యమైనా.. ప్యాకేజీ–9 పనులు పూర్తి కాకపోయినా కూడవెళ్లి వాగు ద్వారా అప్పర్ మానేరు కింది ఆయకట్టుకు ఇప్పుడు కొండంత భరోసా ఉంటుందని నీటిపారుదల ఇంజనీర్లు చెబుతున్నారు. -
వందల టీఎంసీల పంపింగ్‌లో కాళేశ్వరం రికార్డ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్మించిన ప్రపంచంలోనే పెద్దదైన బహుళ దశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ఆనతి కాలంలోనే నీటి పంపింగ్‌లో రికార్డ్ సాధించింది. ఈ పథకంలోని ప్రధానమైన నాలుగు పంపింగ్ కేంద్రాల్లో ఒక్కొక్క కేంద్రం నుంచి వంద టీఎంసీల చొప్పున నీటిని ఎగువకు ఎత్తి పోసింది. లింక్-1లోని మేడిగడ్డ లక్ష్మీ దాదాపు 100 టీఎంసీలకు దగ్గరగా ఉండగా, అన్నారం సరస్వతి, సుందిళ్ల పార్వతి, లింక్-2లో ప్యాకేజ్-8 భూగర్భ గాయత్రి పంపింగ్ కేంద్రాల నుంచి మొత్తం మీద 100 టీఎంసీల చొప్పున పంపింగ్‌ను చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడమే కాకుండా ఆనతికాలంలోనే వందల టీఎంసీల నీటిని ఎంఈఐఎల్ పంపింగ్ చేసింది. దశాబ్దాలుగా నీరందని తెలంగాణ పొలాలు ఇప్పుడు పచ్చని పైరును కప్పుకుని కళకళలాడుతున్నాయి. ఎంతో కాలంగా నీటి కోసం ఎదురుచూసిన రైతన్నలు కాళేశ్వరం నీటి రాకతో తమ బీడు భూములను సస్యశ్యామలం చేసుకుంటున్నారు. ఇంతటి బహుళార్ధక ఎత్తిపోతల పథకం తెలంగాణ దశనే మార్చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతం కాశేళ్వరం ప్రాజెక్టుతో జలకళను సంతరించుకుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పట్టుదలతో పాటు మేఘా శక్తి సామర్ధ్యాలతో ఇది సాధ్యమైంది. అతి తక్కువ సమయంలోనే ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. కాళేశ్వరంలోని ఏ పంప్ ఎంత నీటిని ఎత్తిపోసిందంటే? భూ ఊపరితలంపైన అతి పెద్దదైన లక్ష్మీ పంప్ హౌస్‌ను జూలై 6, 2019లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. 522 రోజుల పాటు పని చేసి దాదాపు 100 టీఎంసీల నీటిని పంప్ చేసింది. ఇక కీలకమైన ఈ పంప్ హౌస్‌లో 3వ మిషన్ 1,110 గంటల పాటు పని చేసి నీటిని ఎత్తిపోసింది. అత్యల్పంగా 13వ మిషన్ 262 గంటల పాటు పనిచేసింది. కాళేశ్వరం మొట్టమొదటి పంప్ హౌస్ ఇదే. ప్రాణహిత నీటిని గోదావరిలోకి ఎత్తిపోయడం లక్ష్మీ పంప్ హౌస్ నుంచే ప్రారంభమవుతుంది. లక్ష్మీ పంప్ హౌస్‌ను పార్వతి పంప్ హౌస్‌కు అనుసంధానం చేసే సరస్వతి పంప్ హౌస్ 363 రోజుల పాటు నీటిని ఎత్తిపోసింది. వంద టీఎంసీలను నీటిని ఎగువకు తరలించింది. ఇందులో మొదటి మిషన్ 1,347 గంటలు పాటు పని చేసింది. అతి తక్కువగా 12వ మిషన్ 195 గంటల పాటు పనిచేసింది. లింక్-1లో చివరిదైన పార్వతి పంప్ హౌస్ సైతం సత్తా చాటింది. ఏకంగా 504 రోజుల పాటు నీటిని పంప్ చేసింది. వంద టీఎంసీల నీటిని ఎత్తిపోసింది. ఇందులో అత్యధికంగా రెండో మిషన్ 1,076 గంటల నీటిని ఎత్తపోసింది. అత్యల్పంగా 14వ మిషన్ కేవలం 333 గంటల పాటు పని చేసింది. అతి కీలకంగా ఉన్న గాయత్రి పంప్ హౌస్ లింక్-2లో భూగర్భ అద్భుతమైన గాయత్రి పంప్ హౌస్‌ను ఆగస్టు 11, 2019లో ప్రారంభించిన మేఘా ఆనతికాలంలోనే 100 టీఎంసీలు ఎత్తిపోసింది. గాయత్రి పంప్ హౌస్ నుంచి ప్రాణహిత నీటిని శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు తరలించింది. ఈ పంప్ హౌస్‌లో రెండో మిషన్ అత్యధికంగా 1,703 గంటల పాటు నీటిని పంపింగ్ చేయగా, మొదటి మిషన్ 1,367 గంటల పాటు పనిచేసి 111 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేసింది. గాయత్రిలోని 7 మిషన్లలో ఒక్కొక్క మిషన్ నుంచి 3,150 క్యుసెక్కుల నీటిని విడుదల చేశాయి. ఇంతవరకూ ఎక్కడా చేపట్టనంతటి భారీ స్థాయిలో పంపుహౌస్‌లను ఈ పథకంలో ఏర్పాటు చేసింది. రోజుకు గరిష్టంగా 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా నిర్మించిన ఈ భారీ పథకంలో 20 పంపుహౌస్‌ల కింద మొత్తం 104 మెషీన్లను ఏర్పాటు చేసింది. కాళేశ్వరంలో మొత్తం 22 ఎత్తిపోతల కేంద్రాలు నిర్మించగా అందులో 15 కేంద్రాను మేఘా నిర్మించింది. ఎంఈఐఎల్ కాళేశ్వరంలో భారీ విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం - ట్రాన్స్ మిషన్ల లైన్ల ఏర్పాట్లలో మరో రికార్డ్‌ను సొంతం చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం 5,159 మెగావాట్ల విద్యుత్ అంటే అంతే పంపింగ్ సామర్థ్యం మిషన్లు అవసరం కాగా అందులో ఎంఈఐఎల్ 4,439 మెగావాట్ల విద్యుత్ అంటే అంత సామర్థ్య పంపింగ్‌తో పాటు విద్యుత్ సరఫరా చేసే 6 సబ్ స్టేషన్లు, వాటి లైన్లు నిర్మించింది. సకాలంలో పూర్తి చేసి తన సామర్థ్యాన్ని చాటుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన పంప్‌లు, మోటార్లను బీహెచ్ఈఎల్, ఆండ్రిజ్, జైమ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు సమకూర్చాయి. ఇంతవరకూ ప్రపంచంలో ఒక పంపింగ్ కేంద్రంలో 17 మెషీన్లు ఏర్పాటు కావడం ఎక్కడా లేదు. ఒక్క మేడిగడ్డలోనే మొట్ట మొదటిది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంపు హౌస్‌లో ఒక్కొక్కటీ 40 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 43 మెషీన్లను ఏర్పాటు చేశారు. లింక్--1లోని ఈ మూడు పంపుహౌస్‌ల కిందే 1,720 మెగావాట్ల విద్యుత్ వినియోగించేలా పంపులు, మోటార్లు ఏర్పాటయ్యాయి. అన్నారం సరస్వతిలో 12 పంపింగ్ యూనిట్లు, సుందిళ్ల పార్వతి పంపింగ్ కేంద్రంలో 14 యూనిట్లు ఆనతి కాలంలోనే పూర్తయ్యాయి. మొత్తం 43 మిషీన్లు వినియోగంలోకి వచ్చాయి. అన్నిటికన్నా ప్రధానంగా ప్యాకేజీ 8లోని గాయత్రి భూగర్భ పంపింగ్ కేంద్రంలో 7 రోజులకు 2 టీఎంసీలు పంపు చేసేలా 7 యూనిట్లు వినియోగంలోకి వచ్చాయి. ఇందులో ఒక్కొక్క యూనిట్ సామర్ధ్యం 139 మెగావాట్లు. ఇంత భారీస్థాయి పంపింగ్ కేంద్రం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ కేంద్రంలో 973 మెగావాట్ల విద్యుత్ వినియోగించేలా పంపిగ్ సామర్ధ్యం ఉందంటే ఎంతపెద్దదో అర్ధమవుతోంది. ఆ తరువాత రంగనాయక సాగర్‌లోని నాలుగు మెషీన్లను ఒక్కొక్కటి 135 మెగావాట్ల సామర్ధ్యంతో ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. అన్నపూర్ణ పంప్‌హౌస్‌ల నాలుగు మెషీన్లు ఒక్కొక్కటి 106 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటయ్యాయి. -
కాల్వలతో కాదు.. పైపులతో పారిద్దాం
ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు కాల్వల ద్వారా నీరందుతుంది. ప్రధాన కాల్వల నుంచి పిల్ల కాల్వల ద్వారా సాగునీరు రైతుల పొలాలకు చేరుతుంది. అయితే ముందుగా తమ క్షేత్రానికి నీరు అందాలనే ఆత్రంలో పిల్ల కాల్వలకు, గట్లకు గండికొట్టడం ద్వారా నీళ్లు మళ్లిస్తుంటారు. ఫలితంగా రైతుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటాయి. పైపెచ్చు కాల్వల ద్వారా సాగునీటిని అందించే క్రమంలో దాదాపు 30 శాతం వరకు నీరు వృథా అవుతుంది. అలాకాకుండా మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరందినట్లుగా... పైపుల ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరందితే ఎలాగుంటుంది? అద్భుతం కదూ! నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోని 2 లక్షల ఎకరాలకు ఇలాగే పైపుల ద్వారా నీరందనుంది. పంటకు నీరు పెట్టాలనుకుంటే చేనుకు సమీపంలోని వాల్వ్‌ను స్వయంగా రైతులు తిప్పుకోవచ్చు. ఈ రెండు లక్షల ఎకరాల్లో ప్రధానంగా వరి సాగవుతోంది. పైపుల ద్వారా సాగునీరు అందడం వల్ల పంట మార్పిడికి అవకాశం ఏర్పడనుంది. రైతులు వరికి బదులు అరుతడి, వాణిజ్య పంటలు వేసుకునే వెసులుబాటు ఉంటుంది. సాగునీటిని తీసుకొచ్చే పైపులకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్‌ను అనుసంధానిస్తే సరిపోతుంది. పైపుల ద్వారా సరఫరా కాబట్టి నీటి వృథా గణనీయంగా తగ్గుతుంది. దీనికి డ్రిప్ తోడైతే... ప్రతి చుక్కా సద్వినియోగం కానుంది. చివరి ఆయకట్టును దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పైపులైన్ ద్వారా నీటి సరఫరా వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ–21 కింద చేపట్టిన ఈ పైప్‌లైన్ వ్యవస్థ నిర్మాణాలు యుధ్ద ప్రాతిపదికన జరుగుతుండగా, ఈ వానాకాలంలోనే తొలిసారి దీనికింద 20 వేల ఎకరాలకు ఆయకట్టుకు నీరిచ్చేలా పనులు పూర్తి చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఫోర్‌షోర్ నుంచి నీటిని తీసుకుంటూ నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా కాళేశ్వరంలో ప్యాకేజీ–20, 21, 21(ఎ) పనులు చేపట్టారు. ప్యాకేజీ–20లో బినోల సమీపంలోని ఎస్సారెస్పీ ఫోర్‌షోర్ నుంచి అప్రోచ్ చానల్, 17.82 కిలోమీటర్ల టన్నెల్, 30 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్న 3 మోటార్లతో సారంగాపూర్ వద్ద పంప్‌హౌస్ నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. రూ.935 కోట్లతో చేపట్టిన ఈ పనులు 85 శాతం వరకు పూర్తయ్యాయి. సారంగాపూర్ పంప్‌హౌస్ నుంచి నిజాంసాగర్ కెనాల్‌కు నీటిని ఎత్తిపోసి అక్కడి నుంచి రెండు మార్గాల్లో పైప్లైన్ల ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా పనులు చేపట్టారు. సాధారణంగా కాల్వల నిర్మాణం చేపడితే 7 వేల నుంచి 8 వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంటుంది. అదే పైప్‌లై¯Œ వ్యవస్థ అయితే భూమిలో ఒకటిన్నర మీటర్ల కింద భూగర్భాన పైప్‌లైన్ ఏర్పాటు చేస్తారు. తద్వారా పైన యథావిధిగా వ్యవసాయం చేసుకునే అవకాశముంది. భూసేకరణ తప్పుతుంది. ఇక కాల్వల ద్వారా నీటి వృథా దాదాపు 30 శాతం వరకు ఉండగా... పైప్‌లై¯న్‌తో వృథా అతి తక్కువ. దీంతోపాటు పైప్‌లై¯న్‌తో చివరి ఆయకట్టు వరకు నీటిని అందించవచ్చు. నిర్ణీత ఆయకట్టులో రెండో పంటకు సైతం నీరు అందించవచ్చనే అంచనాతో ఈ పనులు చేపట్టారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అమలవుతున్న ఈ వ్యవస్థను మోడల్‌గా తీసుకొని రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టారు. పంప్‌హౌస్‌లో సిద్ధమైన మోటార్లు పైప్‌లైన్ నిర్మాణ పనులు ఇలా... ఎస్సారెస్పీ ఫోర్‌షోర్ నుంచి నిజాంసాగర్ కెనాల్లోకి చేరే నీటిని రెండు భాగాలుగా విభజించి నీటిని తరలించేలా పైప్‌లైన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఒక పైప్‌లైన్ వ్యవస్థను మెట్పల్లి సెగ్మెంట్‌గా, మరో పైప్‌లైన్ వ్యవస్థను గడ్కోల్ సెగ్మెంట్‌గా విభజించి పనులు చేపట్టారు. ఫోర్‌షోర్ నుంచి నీటిని తరలించే క్రమంలో నిజాంసాగర్ కెనాల్‌ను 23.10 కిలోమీటర్ల మేర వెడల్పు చేసే పనులు, గడ్కోల్ సెగ్మెంట్‌కు నీటిని సరఫరా చేసే అప్రోచ్ చానల్, టన్నెల్, పంప్‌హౌస్ నిర్మాణ పనులను ప్యాకేజీ–21 కింద చేపట్టారు. ఈ ప్యాకేజీని మొత్తంగా రూ.807 కోట్లతో చేపట్టగా, రూ.372 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తి కావాల్సి ఉంది. అయినప్పటికీ లభ్యత నీటిని తీసుకుంటూ మెట్పల్లి సెగ్మెంట్లో కొంత భాగానికి నీటిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్పల్లి సెగ్మెంట్లో 1.15 లక్షల ఎకరాలు (11.7 టీఎంసీ), గడ్కోల్ సెగ్మెంట్లో 85 వేల ఎకరాలకు(8 టీఎంసీ) నీరందించేలా ప్యాకేజీ–21(ఎ) కింద పనులను రూ. 2,950.31 కోట్లతో చేపట్టారు. ఇందులో ఇప్పటికే 1,430కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. తొలి ప్రాధాన్యతగా మెట్పల్లి సెగ్మెంట్ పరిధిలోని ప్రధాన పైప్‌లైన్ వ్యవస్థను పూర్తి చేసి దీనికింద ఈ వానాకాలంలోనే 20 వేల ఎకరాలకు పైపుల ద్వారా నీటిని అందించేలా పనులు జరుగుతున్నాయి. మిగతా ఆయకట్టుకు వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి నీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గడ్కోల్ సెగ్మెంట్ పరిధిలో 3.5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేయాల్సి ఉంది. దీనికింద భూసేకరణ సమస్యలు ఉండటంతో దీని పనులను రెండో ప్రాధాన్యం కింద పెట్టుకున్నారు. నీటి తరలింపు ఇలా... తొలి ప్రాధాన్యంగా తీసుకున్న మెట్పల్లి సెగ్మెంట్ కింద 1.15 లక్షల ఎకరాల్లో 20 వేల ఎకరాలకు ఈ వానాకాలంలో నీటి తరలించేలా ప్రస్తుతం పైప్‌లైన్ వ్యవస్థ సిధ్దమైంది. నిజాంసాగర్ కాల్వల నుంచి వచ్చే 650 క్యూసెక్కుల నీటిని పైప్లైన్లోకి తోసేలా మెంట్రాజ్‌పల్లి (డిచ్పల్లి మండలం)లో పంప్‌హౌస్ ఏర్పాటు చేస్తున్నారు. 2.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 10 మోటార్ల ద్వారా నీటిని 92 మీటర్ల మేర లిఫ్టు చేసి నిర్ణీత నీటిని 3 మీటర్ల డయాతో ఉండే ఒకే ఒక్క పెద్ద ఎంఎస్ పైప్‌లోకి తరలించేలా పంప్‌హౌస్‌ను నిర్మిస్తున్నారు. ఈ పంప్‌హౌస్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. దీనికి విద్యుత్‌ను అందించే సబ్‌స్టేషన్ నిర్మాణం పనులు వేగిరం చేశారు. ఈ పైప్లైన్లోకి నీటిని తరలించే క్రమంలో ఎలాంటి చెత్తాచెదారం రాకుండా మూడు దశల్లో నీటిని ఫిల్టర్ చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధాన పైప్‌లైన్ నుంచి నీటిని వివిధ జోన్ల కింది ఆయకట్టుకు తరలించేలా మరో చిన్న పైప్‌లైన్ వ్యవస్థ, ఈ వ్యవస్థ నుంచి జోన్ల పరిధిలోని ఆయకట్టుకు నీటిని అందించేలా మరో పిల్ల పైప్‌లైన్ వ్యవస్థను మూడు రకాల పైపులతో సిధ్దం చేస్తున్నారు. పైప్‌లైన్ వ్యవస్థలో భాగంగా నిర్మిస్తున్న మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌస్ ప్రధాన పైప్‌లైన్ 3 మీటర్ల నుంచి ఒక మీటర్ వరకు ఉండే ఎంఎస్ పైపుల వ్యవస్థ కాగా, ఈ పైప్‌లైన్ నుంచి నీటిని 900 మిల్లీమీటర్ల నుంచి 350 మిల్లీమీటర్లు ఉండే డీఐ పైపులు, అటునుంచి 315–40 మిల్లీమీటర్లు ఉండే హెచ్డీపీఈ పైపుల ద్వారా నిర్ణీత ఆయకట్టుకు నీటిని అందిస్తారు. మెట్పల్లి సెగ్మెంట్ పరిధిలో 88.17 కిలోమీటర్ల మేర ఎంఎస్ పైపుల నిర్మాణం చేయాల్సి ఉండగా, ఇందులో 75.37 కిలోమీటర్ల వ్యవస్థ పూర్తయింది. 192 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూటరీ పైప్‌లైన్‌లో 114 కిలోమీటర్లు, 3,319 కిలోమీటర్ల హెచ్డీపీఈలో 1,052 కిలోమీటర్లు మేర పూర్తి చేశారు. పెద్ద పైపులైన్ నుంచి డీఐ, హెచ్డీపీఈ పైపులకు నీటిని తరలించే క్రమంలో ఓఎంఎస్ చాంబర్, డిస్ట్రిబ్యూటరీ చాంబర్స్ అని ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారానే ఎంతమేర నీటిని తరలించాలి, ఏ ప్రాంతానికి నీటిని తరలించాలి అన్నది నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే 20 కిలోమీటర్ల మేర నీటిని తరలించేలా పైప్‌లైన్ వ్యవస్థ 95 శాతం పూర్తవగా, మార్చి చివరికి 100 శాతం పనులు పూర్తి చేయనున్నారు. కొన్ని అడ్డంకులు... ఈ పైప్‌లైన్ పనులకు ప్రధానంగా భూసేకరణ లేకున్నా... రైతులు సాగు చేస్తున్న భూముల్లోంచే పైపులు వేయాల్సి ఉంది. భూమిని తవ్వి 1.20 మీటర్ల దిగువన పైపులు వేయాలి. ఆ లైన్లు వెళుతున్న మార్గాలన్నీ ప్రస్తుతం సాగులో ఉన్న భూములే కావడంతో పనులకు రైతులు అడ్డుపడుతున్నారు. వ్యవసాయ పనులు సాగని రెండు నుంచి మూడు నెలల వ్యవధిలో మాత్రమే పైపులు వేయాల్సి వస్తోంది. దీంతో ఈ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. పైపులు వెళ్లే భూములకు నష్టపరిహారం చెల్లిస్తే యాసంగి సీజన్లో పనులు పూర్తి చేస్తామని ఏజెన్సీ సహా ప్రజాప్రతినిధులు కోరినా ప్రభుత్వం దీనికి అంగీకరించకపోవడంతో రైతుల సమ్మతి దొరికిన చోటే పనులు కొనసాగించాల్సి వస్తోంది. దీనికి తోడు ఓఎంఎస్ ఛాంబర్స్, డిస్ట్రిబ్యూటరీ ఛాంబర్స్ నిర్మాణాలకు గుంట కన్నా తక్కువ భూమే అవసరమవుతున్నా, దాన్ని ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. ఇక రెండు చోట్ల రైల్వే క్రాసింగ్, నేషనల్ హైవే క్రాసింగ్‌లు వెళుతున్నాయి. మరోవైపు నిజాంసాగర్ కాల్వల వెడల్పుకు దాని పరిధిలోని భూ ఆక్రమణలు, పంటల సాగు ఇబ్బందిగా పరిణమిస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రస్తుతం పనులు కొనసాగిస్తున్నారు. ఈ చాంబర్లు ఎలా పనిచేస్తాయంటే.. చివరి ఆయకట్టు వరకు నీటిని తరలించేలా ఓఎంఎస్ (ఔట్లెట్ మేనేజ్మెంట్ సిస్టమ్) చాంబర్ ఏర్పాటు చేస్తుండగా, ఈ ఛాంబర్లోకి వచ్చిన నీటిని 3 నుంచి 6 ఔట్లెట్ పైపుల ద్వారా బయటకు పంపించేలా ఏర్పాట్లుంటాయి. ఔట్లెట్ పైపుల ద్వారా నీటిని తరలించే వాల్వ్‌లను పూర్తిగా సాంకేతిక సహాయంతోనే ఆపరేట్ చేసేలా దీన్ని తీర్చిదిద్దారు. ఎంతమేర నీటిని తరలిస్తున్నారన్నది తెలుసుకునేలా దీనిలో వాటర్ మీటర్, ప్రెషర్ మీటర్లు అమర్చారు. దీనికి అవసరమయ్యే విద్యుత్‌కై సోలార్‌ను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం నిర్ణయించిన 20 వేల ఎకరాల పరిధిలోనే 1,892 ఓఎంఎస్ చాంబర్స్ నిర్మాణం పూర్తయింది. ఇక్కడి నుంచి ఔట్లెట్ ద్వారా తరలించే ఒక్కో పైప్‌లైన్‌కు దిగువన ప్రతి 3 ఎకరాలకు నీటిని అందించేలా మళ్లీ 5–7 వరకు చిన్న పైపుల ద్వారా నీటిని తరలించేందుకు డిస్ట్రిబ్యూటరీ చాంబర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఛాంబర్స్‌లో ఉండే పైపులన్నింటికీ వాల్వ్‌లను బిగించారు. అవసరమైతేనే నీటిని వాడుకునేలా ఈ వాల్వ్‌లు ఉపయోగపడతాయి. వాటిని రైతులే ఆపరేట్ చేసుకుంటారు. -
తెలంగాణ: వేసవిలోనూ చెరువులకు జలకళ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా వేసవిలోనూ చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. కాళేశ్వరం ద్వారా గోదావరి జలాల ఎత్తిపోత ఆరంభమైన నేపథ్యంలో ప్రస్తుత యాసంగి సీజన్లో ఆయకట్టు పంటలకు ఎలాంటి నీటి కొరత లేకుండా చెరువులు, చెక్‌డ్యామ్‌ల్లో నీటి నిల్వలు పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎల్లంపల్లి దిగువ నుంచి కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ వరకు ఎన్ని వీలైతే అన్ని చెరువులను వంద శాతం నీటితో నింపాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు ఇరిగేషన్ శాఖ పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళుతోంది. ఇప్పటికే చెరువుల్లో నీటిని నింపే ప్రక్రియ మొదలవగా, మొత్తంగా 2,074 చెరువులకు నింపేలా ప్రణాళిక రచించింది. ఈ చెరువుల ద్వారా 1.20 లక్షల ఎకరాల మేర నీరందించనుంది. చదవండి: (ఆ ప్రాజెక్టులకు నిధులు ఆగొద్దు: కేసీఆర్) ఎస్సారెస్పీ కింద చెరువులకు జలకళ... ముఖ్యంగా ఎస్సారెస్పీ ప్రాజెక్టులో నీటి నిల్వ పుష్కలంగా ఉండటంతో ఆ నీటి ద్వారా లోయర్ మానేరు డ్యామ్ (ఎల్ఎండీ) వరకు కాల్వల ద్వారా పంటలకు నీరిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎస్సారెస్పీలో నీటి నిల్వలు ఉంచడం మేలనే ఉద్దేశంతో ఎల్ఎండీ దిగువన కాళేశ్వరం ఎత్తిపోతల నీటిని వాడుతున్నారు. ఇక ఎల్ఎండీ దిగువన ఎస్సారెస్పీ స్టేజ్–1 కింద సుమారు మరో 3.50 లక్షల ఎకరాలకు నీరందించేలా ఇప్పటికే కాల్వల ద్వారా నీటి విడుదల జరగ్గా, దీని కింద 942 చెరువులున్నాయి. ఈ చెరువులకు నీటిని అందించేందుకు తొలి ప్రాధాన్యం ఇస్తూ నీటి విడుదల కొనసాగుతోంది. ఇప్పటికే చాలా చెరువులకు నీరందించేలా తూముల నిర్మాణం పూర్తయిన దృష్ట్యా, వాటి ద్వారా నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ఈ చెరువులను నింపడం ద్వారా వాటికింద ఉన్న సుమారు 80 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుండగా, 10 టీఎంసీల మేర నిల్వలు సాధ్యపడనున్నాయి. ఇక ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద మొత్తంగా 3.52 లక్షల ఎకరాలకు నీరందించనుండగా, 866 చెరువుల పరిధిలో కనీసంగా 30 వేల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. ఈ చెరువులన్నింటినీ ముందుగా నింపేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఇటీవలే నిర్వహించిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు చేశారు. చదవండి: (ప్రధాని మాటలు ఆచరణలోకి రావాలి: కేటీఆర్) మిడ్‌మానేరు దిగువన... ఇక మిడ్‌మానేరు దిగువన అనంతగిరి రిజర్వాయర్ మొదలు కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌కు పుష్కలంగా నీటి లభ్యత ఉంది. ఈ నీటితో మొత్తంగా 266 చెక్‌డ్యామ్‌లు, చెరువుల్లో నీటిని నింపేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే కొన్ని చెరువులను నీటితో నింపుతున్నారు. ఈ మొత్తం చెరువులు, చెక్‌డ్యామ్‌ల కింద 18 వేలకు పైగా ఎకరాలకు నీరందే అవకాశం ఉండగా, 8.60 టీఎంసీల మేర నీటి నిల్వలకు అవకాశం ఉంది. ఇందులో అనంతగిరి కింద బెజ్జంకి మండల పరిధిలో 16, ఇల్లంతకుంటలో 9, రంగనాయక్‌సాగర్ కింద చిన్నకోడూరు మండలంలో 23, నంగనూర్–49, నారాయణ్‌పేట–22, సిద్దిపేట–4, ఇల్లంతకుంట–3, తంగనపల్లి–10, ముస్తాబాద్–5 చెరువులు, వీటితో పాటు మరో 35 చెక్‌డ్యామ్‌లు ఉన్నాయి. మల్లన్నసాగర్లో తవ్విన ఫీడర్ చానల్ ద్వారా తొగుట–6, దుబ్బాక–సిద్దిపేట–25, ముస్తాబాద్–6, కొండపోచమ్మసాగర్ పరిధిలో జగదేవ్‌పూర్ కెనాల్ ద్వారా మర్కూక్–23, జగదేవ్‌పూర్–5, తుర్కపల్లి కెనాల్ ద్వారా మర్కూక్–5, ఎం.తుర్కపల్లి–9, బొమ్మలరామారం–5. గజ్వేల్ కెనాల్ ద్వారా మర్కూక్–3, గజ్వేల్–1 చెరువులను నింపుతున్నారు. -
అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది: సీఎం కేసీఆర్
సాక్షి , వరంగల్: తెలంగాణ రైతుల కలలను సాకారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిందని సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రైతులు సాగునీటి కోసం గోస పడొద్దనే ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. వేసవిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న సమయంలోనూ ఇంజనీర్లు, అధికారులు, వేలాది మంది కార్మికులు పనిలో నిమగ్నమయ్యారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్ని మార్చేసిందని సీఎం కేసీఆర్ అన్నారు. అనుకున్న సమయంలో అనుకున్న విధంగా ప్రాజెక్టు పూరై్త నీటి పంపింగ్ కూడా నిరాటంకంగా జరుగుతుండటంపై సీఎం సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కేసీఆర్ మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం చేరుకున్నారు. హెలీప్యాడ్ నుంచి ప్రత్యేక బస్సులో రోడ్డు మార్గం ద్వారా తన సతీమణి శోభతో కలసి ఆలయానికి చేరుకొని కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. ముందుగా గణపతిపూజ చేసిన కేసీఆర్ దంపతులు.. గర్భగుడిలో ప్రత్యేకంగా మహాన్యాసకపూర్వక రుద్రాభిషేక పూజలను పంచామృతాలతో నిర్వహించారు. అనంతరం శ్రీశుభానందదేవి (పార్వతి) అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం దంపతులకు ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చదవండి: (ప్రధాని బొమ్మను పెట్టాల్సిందే) మంగళవారం మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీ సందర్శన సందర్భంగా గోదావరి జలాలకు సీఎం కేసీఆర్ దంపతుల పుష్పాభిషేకం. చిత్రంలో మంత్రులు గంగుల, ఎర్రబెల్లి, కొప్పుల అనంతరం మంత్రులు, ఇతర నాయకులు, అధికారులతో కలసి సీఎం దంపతులు గోదావరి జలాలకు పుష్పాభిషేకం చేశారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ (విహంగ వీక్షణం) ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించిన ఆయన మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఆగారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ఎదురైన అనుభవాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్, డీజీపీ, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో పంచుకున్నారు. సముద్రాలను తలపిస్తున్న బ్యారేజీలు... ‘సాగునీరు లేక తెలంగాణ రైతాంగం దశాబ్దాల తరబడి గోస పడింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఫలితం సంపూర్ణంగా దక్కాలంటే రైతులు రెండు పంటలను సమృద్ధిగా పండించేలా సాగునీరు అందించి తీరాలని మొదట్లోనే నిర్ణయించుకున్నాం. అటు ప్రాణహిత, ఇటు గోదావరి రెండు నదుల నీళ్లు కలిసిన తర్వాత బ్యారేజీ నిర్మాణం చేపడితే ఎక్కువ కాలంపాటు కావలసినంత నీటిని పంపింగ్ చేయవచ్చని వ్యూహం రూపొందించాం. వ్యాప్కోస్‌తో శాస్త్రీయంగా సర్వే నిర్వహించి మేడిగడ్డ పాయింట్ వద్ద బ్యారేజీ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో దాదాపు 100 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించడం వల్ల 7 నెలలపాటు నీటిని పంపింగ్ చేయవచ్చని అంచనా వేశాం. అనుకున్నది అనుకున్నట్లు జరుగుతోంది. 99.7 మీటర్ల ఎత్తులో 16.17 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిర్మాణాలన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగాయి’అంటూ ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం ప్రాజెక్టు జ్ఞాపకాలను పంచుకున్నారు. చదవండి: (వినయ్‌రెడ్డి మనోడే!) ‘నీటి పంపింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగుతోంది. మేడిగడ్డ పాయింట్ నుంచి 54 కిలోమీటర్ల వరకు ప్రాణహితలో, 42 కిలోమీటర్ల వరకు గోదావరిలో నీరు నిల్వ ఉండటంతో జలకళ ఉట్టి పడుతోంది. బ్యారేజీలు సముద్రాలను తలపిస్తున్నాయి. ఏ సమయం ఎట్ల వచ్చినా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, ఎల్ఎండీ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లకు ఏటా నీరందుతుంది. ప్రాజెక్టు వద్ద అధికారులతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు తదితరులు నిజాం సాగర్‌కు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే నీరందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవసరమైన పక్షంలో ఎస్సారెస్పీకి కూడా ఈ ప్రాజెక్టు నుంచే నీటి పంపింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్ని మార్చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన స్ఫూర్తితోనే దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన తుపాకులగూడెం బ్యారేజీ, సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన దుమ్ముగూడెం బ్యారేజీ నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులన్నీంటినీ త్వరగా పూర్తిచేసి రైతుల సాగునీటి గోసను శాశ్వతంగా రూపుమాపాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం’అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అధికారులకు అభినందన.. ‘మేడిగడ్డ బ్యారేజీ, తుపాకులగూడెం బ్యారేజీ, దుమ్ముగూడెం బ్యారేజీలకు సంబంధించి కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఆపరేషన్ రూల్స్ రూపొందించాలి. సమయానుగుణంగా రూల్స్‌ను అమలు చేయాలి’అని సీఎం కేసీఆర్ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడంలో కృషి చేసిన నీటిపారుదల శాఖ అధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు, ఇతర శాఖల ఉద్యోగులను కేసీఆర్ అభినందించారు. ప్రస్తుతం బ్యారేజీల వద్ద పూర్తిస్థాయిలో నీటి నిల్వలున్నాయని, ఈ ఎండాకాలమంతా ఈ నీటితో రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు, నింపాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులవారీగా ఆపరేషన్ రూల్స్ రూపొందించి అమలు చేయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన స్ఫూర్తితోనే రాష్టంలో చేపట్టిన ఇతర భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పురాణం సతీశ్, నారదాసు లక్ష్మణ్‌రావు, నీటిపారుదల శాఖ ఈఎన్సీలు మురళీధర్‌రావు, నల్లా వెంకటేశ్వర్లు, భూపాలపల్లి, రామగుండం, మంచిర్యాల, పెద్దపల్లి ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, కోరుకంటి చందర్, నడపల్లి దివాకర్‌రావు, దాసరి మనోహర్‌రెడ్డి, పెద్దపల్లి, వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్లు పుట్టా మధు, గండ్ర జ్యోతి పాల్గొన్నారు. గోదావరిని చూసి పులకించిన ముఖ్యమంత్రి కాళేశ్వరాలయంలో పూజల అనంతరం ప్రగతిరథం బస్సులో మంత్రులతో కలసి కేసీఆర్ దంపతులు గోదావరి వద్దకు వెళ్లారు. గోదావరి నిండుగా ఉండటం చూసి కేసీఆర్ పులకించిపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ బ్యారేజీ బ్యాక్‌వాటర్‌తో నిండుగా ఉందని అధికారులతో అన్నారు. గతంలో వచ్చినప్పుడు కాలినడకన ఇసుకలో కిలోమీటర్ మేర నడిచే వాళ్లమని గుర్తుచేసుకున్నారు. నిత్యం భక్తుల రద్దీ ఉంటుందా? ఘాట్‌లో భక్తులు స్నానాలు చేస్తున్నారా? అప్పటికీ, ఇప్పటికీ భక్తుల సంఖ్య పెరిగిందా అంటూ పక్కనే ఉన్న అర్చకులతో వాకబు చేశారు. గతంలో కంటే భక్తుల రద్దీ పెరిగిందని, నిత్యం వేల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నట్లు వారు బదులిచ్చారు. ఆ తర్వాత గోదావరి మాతకు ప్రత్యేకంగా పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, పాలను సమర్పించిన కేసీఆర్ దంపతులు.. నదిలో నాణేలను వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఓ యజ్ఞంలా చేపట్టాం. 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న సమయంలోనూ వేలాది మంది కార్మికులు పనిలో నిమగ్నమయ్యారు. భూసేకరణతోపాటు వివిధ క్రాసింగ్లకు సంబంధించిన అంశాలను అధికారులు సమయోచితంగా, సమర్థంగా పరిష్కరించారు. మొత్తంగా రాష్ట్ర రైతాంగానికి ఎంతో ఆవశ్యకమైన ప్రాజెక్టు నిర్మాణం పూరై్త వినియోగంలోకి రావడంతో సంతోషంగా ఉంది. తెలంగాణ రైతుల కల నెరవేరినందుకు, సాగునీటి సమస్య తీరుతున్నందుకు సంతృప్తిగా ఉంది. -
కాళేశ్వరం చేరుకున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలన కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మంగళవారం ఉదయం బయల్దేరారు. కాళేశ్వరం చేరుకుని నేరుగా కాళేశ్వర.. ముక్తేశ్వర స్వామివార్ల దర్శనానికి వెళ్లారు. సీఎం కేసీఆర్, శోభ దంపతులు, మంత్రులకు వేద పండితులు ఘన స్వాగతం పలికి ఆలయం లోపలకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లారు. యాసంగి సీజన్లో కాళేశ్వరం ద్వారా.. నీటిని పంపించే విధానాన్ని పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ ఈ పర్యటన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని ప్రధాన బ్యారేజ్‌లు పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. యాసంగి సీజన్లో పంటలకు జలాలను పంపింగ్చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కాళేశ్వరంలో పర్యటిస్తున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో కాళేశ్వరం రిజర్వాయర్‌ను పరిశీలిస్తారు. లక్ష్మీ బరాజ్ చేరుకొని.. అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. యాసంగి పంటలకు సరిపడా సాగునీటిని అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తారు. ఈ సందర్భంగా మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉంది. బ్యారేజ్ వద్ద సీఎం కేసీఆర్ భోజనం చేసి అక్కడి నుంచి హెలిక్యాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరిగి వెళ్లనున్నారు. సీఎం వెంట ఉమ్మడి కరీంనగర్ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, సాగునీటి అధికారులు ఉన్నారు. -
కాళేశ్వరంలో మళ్లీ ఎత్తిపోతలు
కాళేశ్వరం/మంథని: కాళేశ్వరం పథకం ద్వారా మళ్లీ నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి లక్ష్మీపంపుహౌస్లో ఆదివారం ఇంజనీరింగ్ అధికారులు రెండు మోటార్లను ఆన్ చేసి ఎత్తిపోతలను ప్రారంభించారు. లక్ష్మీపంపుహౌస్ నుంచి ఇప్పటికే 11 మోటార్లతో 22 పంపుల ద్వారా గడిచిన రెండు సీజన్లలో నీటిని ఎత్తిపోసిన విషయం తెలిసిందే. కాగా, గతేడాది ఆగస్టులో భారీ వర్షా లతో ఇంజనీర్లు మోటార్లను నిలిపివేశారు. అప్పటి నుంచి పంపుహౌస్‌లో ఎత్తిపోతలు జరగలేదు. లక్ష్మీబ్యారేజీకి జలకళ: ఈ నెల 1 నుంచి మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీలోని 85 గేట్లు మూసివేసి నీటిని నిల్వచేస్తున్నారు. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16 టీఎంసీల వరకు నిల్వ ఉంది. మేడిగడ్డ నుంచి కాళేశ్వరం వరకు బ్యాక్ వాటర్ 20 కిలోమీటర్ల మేరకు పెరగడంతో ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు తాజాగా ఎత్తిపోతలు ప్రారంభించారు. 10.5 టీఎంసీల లక్ష్యం: లక్ష్మీపంపుహౌస్ మోటార్ల ద్వారా డెలివరీ సిస్టర్న్‌లో ఎత్తిపోసే నీరు.. అక్కడి నుంచి గ్రావిటీ కాల్వ ద్వారా 13.5 కిలోమీటర్ల దూరాన ఉన్న అన్నారం సరస్వతీ బ్యారేజీలోకి చేరుతుంది. అక్కడి నుం చి ఎగువన ఉన్న లోయర్ మానేరుకు 8 టీఎంసీలు, ఎల్లం పల్లికి 2.5 టీఎంసీలు.. మొత్తం కలిపి 10.5 టీఎంసీల నీటిని తరలించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఏకకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ, సరస్వతి, పార్వతి, నంది, గాయత్రి పంపుహౌస్‌లలో రెండు చొప్పున మొత్తం పది మోటార్లు రన్ చేస్తున్నారు. వీటి ద్వారా ఒక చోటనుంచి మరో చోటుకు నీటిని ఎత్తిపోస్తున్నారు. 3,150 క్యూసెక్కుల నీటిని మిడ్‌మానేరుకు, అక్కడి నుంచి ఎల్ఎండీకి తరలించనున్నారు. ఎల్ఎండీ ప్రాజెక్టులోకి 8 టీఎంసీల నీరు బోయినపల్లి(చొప్పదండి): కాళేశ్వరం నుంచి ఎత్తిపోతల ప్రారంభం కావడంతో దానికి అనుగుణంగా శ్రీరాజరాజేశ్వర (మిడ్‌మానేరు) ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న కరీంనగర్ ఎల్ఎండీ ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం నీటి ని విడుదల చేశారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు 12, 13 గేట్లను ఎత్తడంతో ఒక్కో గేటు ద్వారా 1,500 క్యూసెక్కుల చొప్పు న 3 వేల క్యూసెక్కుల నీరు ఎల్ఎండీ ప్రాజెక్టులోకి వెళ్తోంది. గాయత్రి పంప్‌హౌస్ నుంచి వరద కాలువ మీదుగా మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి 3 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 25.57 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. మిడ్‌మానేరు నుంచి ఎల్ఎండీ ప్రాజెక్టులోకి 8 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. దేవాదుల పంపింగ్ షురూ కన్నాయిగూడెం(ములుగు): దాదాపు ఐదు నెలల తర్వాత దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా నీటి పంపింగ్ మళ్లీ ప్రారంభమైంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద ఉన్న జె.చొక్కారావు దేవాదుల పథకంలోని ఫేజ్–1, ఫేజ్–2లో ఒక్కో మోటారు చొప్పున శనివారం రాత్రి ఇంజనీరింగ్ అధికారులు ఆన్ చేశారు. ‘కాళేశ్వరం’ సందర్శనకు పర్యాటకులకు అనుమతి కాళేశ్వరం: దాదాపు 9 నెలల సుదీర్ఘ విరామం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి కన్నెపల్లి లక్ష్మీ పంప్‌హౌస్ వద్ద పర్యాటకుల ప్రవేశానికి అధికారులు అనుమతులు ఇచ్చారు. కోవిడ్ నేపథ్యంలో గతేడాది మార్చి 20 నుంచి పర్యాటకులకు అనుమతులు ఇవ్వడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతేడాది జూన్ 8న ఆలయాలకు వెళ్లేందుకు భక్తులకు అనుమతులిచ్చినా.. ఇక్కడి పంప్‌హౌస్, బ్యారేజీల్లోకి మాత్రం బ్యారేజీ ఏజెన్సీ సంస్థలు అనుమతించడం లేదు. తాజాగా ఆదివారం నుంచి పంప్‌హౌస్‌లోకి పర్యాటకులను అనుమతిస్తున్నారు. -
అదనపు టీఎంసీ... ఆగినట్లే!
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులో అదనంగా మరో టీఎంసీ నీటిని తరలించేలా చేపట్టిన పనులకు బ్రేక్ పడనుంది. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ నుంచి రాష్ట్రానికి అందిన ఆదేశాలు, ఇప్పటికే జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) వెలువరించిన ఉత్తర్వుల నేపథ్యంలో.. నెలరోజుల కిందటే రూ.21 వేల కోట్లతో చేపట్టిన పనులన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోనున్నాయి. మూడో టీఎంసీ ఎత్తిపోత పనులను కొత్త ప్రాజెక్టుగానే పరిగణిస్తున్నందున... ఆ ప్రాజెక్టుకు కేంద్ర సంస్థల నుంచి పూర్తిస్థాయి అనుమతులు వచ్చే వరకు పనులు కొనసాగించే అవకాశాలు లేవని ఇరిగేషన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఆదిలోనే హంసపాదు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు 2 టీఎంసీలు, మిడ్‌మానేరు దిగువన ఒక టీఎంసీ నీటిని తరలించేలా పనులు పూర్తయిన విషయం తెలిసిందే. ఇక అదనంగా మరో టీఎంసీ నీటిని తరలించాలని నిర్ణయించిన ప్రభుత్వం మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఇప్పటికే పనులు ఆరంభించి కొనసాగిస్తోంది. ఎల్లంపల్లి దిగువన పనులకు ఈ ఏడాది మార్చిలో టెండర్లు పిలిచింది. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు 1.10 టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా నాలుగు ప్యాకేజీలకు రూ.9,747.30 కోట్లతో, మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు మరో నాలుగు ప్యాకేజీలకు రూ.11,710.70 కోట్లతో టెండర్లు పిలిచారు. టెండర్ల ప్రక్రియ మే నెలలో ముగిసింది. ఇదే సమయంలో ఈ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. డీపీఆర్‌లు సమర్పించాలని, కేంద్ర అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగించరాదని తెలిపింది. ఫలితంగా రాష్ట్రం ముందడుగు వేయలేదు. ఎన్జీటీ ఉత్తర్వులు అడ్డంకే దీంతో పాటే అదనపు టీఎంసీ పనులపై కొందరు ఎన్జీటీని ఆశ్రయించారు. దీనిపై అక్టోబర్‌లో తుదితీర్పును వెలువరించిన ఎన్టీటీ, కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. ‘గోదావరి బోర్డుకు డీపీఆర్ ఇవ్వకుండా, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టు పనులపై ముందుకెళ్లొద్దని ఆగస్టులోనే కేంద్రమంత్రి ముఖ్యమంత్రికి లేఖ రాశారు. విస్తరణ పనులకు ఎలాంటి ప్రతిపాదన తమవద్దకు రాలేదని కేంద్ర జల సంఘం స్పష్టం చేసింది. దీనికి కొత్తగా అనుమతులు అవసరమని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో అక్టోబర్ 2న తెలంగాణ సీఎం కేంద్రానికి రాసిన లేఖను జల్‌శక్తి శాఖ పరిశీలించాల్సి ఉంది. అనంతరం కేంద్ర జల్‌శక్తి శాఖ తీసుకునే నిర్ణయానికి తెలంగాణ కట్టుబడి ఉండాలి’అని తన తుదితీర్పులో ఎన్జీటీ పేర్కొంది. అయితే కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో గతనెలలో ఎనిమిది ప్యాకేజీల పరిధిలో అదనపు టీఎంసీ పనులను రాష్ట్రం ఆరంభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి లేఖపై ఈనెల 11న స్పందించిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, అదనపు టీఎంసీ పనులను పూర్తిగా కొత్త డిజైన్‌గానే చూస్తామని, మార్పు ఏదైనా జరిగినప్పుడు కేంద్ర హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర, పెట్టుబడులు, పర్యావరణ తదితర అనుమతులను పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ నుంచి మదింపు తప్పనిసరని, అది జరిగే వరకు ప్రాజెక్టుపై ముందుకెళ్లరాదని స్పష్టం చేశారు. ఇప్పటికే వెలువడిన ఎన్జీటీ ఉత్తర్వులు, కేంద్రం తాజా ఆదేశాల నేపథ్యంలో పనులను కొనసాగించే అవకాశం ఇరిగేషన్ శాఖకు లేకుండా పోయింది. కేంద్ర నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి. పనులను ఏమాత్రం కొనసాగించినా పిటిషనర్లు తిరిగి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్న నేపథ్యంలో ఈ పనులను తాత్కాలికంగా నిలిపివేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని ఇరిగేషన్ వర్గాలు తెలిపాయి. మిగతా ప్రాజెక్టుల డీపీఆర్‌లకు ఓకే కాళేశ్వరంతో పాటు సీతారామ ఎత్తిపోతల, జీఎల్ఐఎస్ ఫేజ్–3, తుపాకులగూడెం ప్రాజెక్టు, తెలంగాణ తాగునీరు సరఫరా ప్రాజెక్టు, లోయర్ పెన్ గంగపై బ్యారేజి, రామప్ప సరస్సు నుంచి పాకాల లేక్‌కు నీటి మళ్లింపు ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని, బోర్డుల మదింపు జరగనంతవరకు ముందుకు వెళ్లరాదని సైతం కేంద్రమంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఇరిగేషన్ శాఖ సిధ్దం చేస్తోంది. అయితే మిగతా చోట్ల పనులను పూర్తిగా నిలిపివేసే అంశంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులపై కోర్టులను ఆశ్రయించే అవకాశాలను సైతం రాష్ట్రం పరిశీలిస్తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో న్యాయనిపుణులతో ప్రభుత్వ పెద్దలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆ ఏడు ప్రాజెక్టులు ఆపండి..
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర జల్‌శక్తి శాఖ తాజాగా తెలంగాణకు ఓ లేఖ రాసింది. అదిప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ లేఖలో ఏం ఉందంటే? కాళేశ్వరం ఎత్తిపోతల మూడో టీఎంసీ ప్రతిపాదిత ప్రాజెక్టుసహా ఏడు ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టుల నిర్వచనం పరిధిలోకి వస్తున్నందున వాటిపై ముందుకు వెళ్లొద్దని పేర్కొంది. కాళేశ్వరం మూడో టీఎంసీ, సీతారామ ఎత్తిపోతల, జీఎల్ఐఎస్ ఫేజ్–3, తుపాకులగూడెం ప్రాజెక్టు, తెలంగాణ తాగునీరు సరఫరా ప్రాజెక్టు, లోయర్ పెన్‌గంగపై బ్యారేజీ, రామప్ప సరస్సు నుంచి పాకాల లేక్‌కు నీటి మళ్లింపు తదితర ఏడు ప్రాజెక్టులకు గోదావరి నదీజలాల యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) నుంచి మదింపు కానంత వరకు ముందుకు వెళ్లరాదని తెలంగాణకు స్పష్టం చేసింది. నీటి వివాదాలపై అక్టోబర్ 2న పలు అభ్యంతరాలను లేవనెత్తుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాసిన లేఖకు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ బదులిస్తూ నాలుగు పేజీల సమాధానం పంపారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో శుక్రవారం(డిసెంబర్ 11) జల్‌శక్తి మంత్రిని కలిసిన రోజే ఈ లేఖను పంపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు లేఖలోని వివరాలు ఇలా ఉన్నాయి. 1. ‘‘కృష్ణా, గోదావరి నదులలో నీటి వాటా, వినియోగానికి సంబంధించి మీరు అక్టోబర్ 2, 2020న రాసిన లేఖలోని అనేక అంశాలు అక్టోబర్ 6 నాటి అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో చర్చకు వచ్చాయి. అయితే మీరు లేవనెత్తిన అన్ని అంశాలపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రిగా స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ఇంకా లేఖలో ఏ ఏ అంశాలున్నాయంటే..కృష్ణా, గోదావరి జలాల పునఃపంపిణీపై..‘కృష్ణా నదీజలాల వాటా, నీటి వినియోగంలో ఉమ్మడి ఏపీలో తెలంగాణకు జరిగిన అన్యాయాల గురించి మీరు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటా కోసం మీరు చేసిన ప్రయత్నాలను వివరించారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం–1956 పరిధిలోని సెక్షన్ 3 ద్వారా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని 2014, 2018లో కోరినప్పటికీ కేంద్రం ఏడేళ్లుగా నిష్క్రియాత్మకంగా వ్యవహరించిందని మీరు ఆరోపించారు. ఈ సెక్షన్ పరిధిలో కాకుండా ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ఆధారంగా పరిష్కరించాలని ట్రిబ్యునల్‌కు సూచించారని మీరు నివేదించారు. దీనివల్ల తెలంగాణ ఉపశమనం పొందలేదని మీరు చెప్పారు. అయితే ఈ విషయంలో మీరు 2015లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా అది ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇది అక్కడ పరిష్కారమైతేనే కేంద్రం చర్య తీసుకోగలదు. అక్టోబర్ 6 నాటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మీరు ఈ పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అంగీకరించారు. మీరు ఉపసంహరించుకుంటే న్యాయ సలహా తీసుకుని నదీజలాల వివాద పరిష్కార చట్టంలోని సెక్షన్ 3 పరిధిలో కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అభ్యర్థనను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర జల్‌శక్తి శాఖ అంగీకరించింది. గోదావరి జలాల విషయంలో కూడా రెండు రాష్ట్రాలు ఈ సెక్షన్ పరిధిలో అభ్యర్థన ఇచ్చేందుకు సమ్మతించాయి. అభ్యర్థన రాగానే సానుకూల నిర్ణయం తీసుకుంటామని నాటి సమావేశంలో జల్‌శక్తి శాఖ అంగీకరించింది’ 2. పోతిరెడ్డి ప్రాజెక్టు విస్తరణపై .. ‘మీరు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్ట్, దాని విస్తరణ గురించి ప్రస్తావించారు. ఇది అనధికార విస్తరణ అని, దీని వల్ల తెలంగాణ హక్కులు కోలుకోలేని విధంగా దెబ్బతింటాయని మీరు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం–2014(ఏపీఆర్ఏ) ప్రకారం కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను మూల్యాంకనం కోసం కేఆర్ఎంబీకి సమర్పించడానికి ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలి. తదుపరి అపెక్స్ కౌన్సిల్ వాటిని అనుమతిస్తుంది. కృష్ణా నదీజలాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1)లో గానీ, ఏపీఆర్‌ఏలో గానీ ప్రస్తావించినవీ లేదా ప్రస్తావన లేనివీ అయినప్పటికీ.. సీడబ్ల్యూసీ ద్వారా సాంకేతిక, ఆర్థిక మదింపు జరగని పక్షంలో, జల వనరుల విభాగం సలహా కమిటీ ఆమోదం పొందని పక్షంలో అవి కొత్త ప్రాజెక్టుగా పరిగణించాల్సి ఉంటుంది. అది ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించినా, తరువాత ప్రతిపాదించినా ఈ షరతు మాత్రం సంతృప్తి పరచాల్సి ఉంటుంది. అలాగే ప్రాజెక్టు స్వభావంలో మార్పు చోటుచేసుకున్నా కొత్త ప్రాజెక్టుగా పరిగణించాల్సి ఉంటుంది. ఈ మేరకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణకు సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీల సాంకేతిక మదింపు లభించనంతవరకు ముందుకు వెళ్లరాదని కేఆర్ఎంబీ, జల్‌శక్తి శాఖ ఆంధ్రప్రదేశ్‌కు పలుమార్లు లేఖ రాశాయి. ఈమేరకు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చకు రాగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొత్త ప్రాజెక్టులకు డీపీఆర్‌లు పంపేందుకు అంగీకరించారు’ 3. కేఆర్ఎంబీ స్పందించలేదన్న ఆరోపణలపై.. ‘పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ఆపడంలో కేఆర్ఎంబీ విఫలమైందని మీరు పేర్కొన్నారు. అలాగే ఏపీ కృష్ణా బేసిన్ నుంచి ఇతర బేసిన్లకు నీటి తరలించడాన్ని కూడా కేఆర్ఎంబీ ఆపలేకపోయిందని రాశారు. టెండర్ ప్రక్రియను ఆపడంలో కూడా విఫలమైందన్నారు. ఏపీ అక్రమంగా జలాలు వినియోగించడాన్ని పర్యవేక్షించడానికి టెలిమెట్రీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని 2016లో జల్‌శక్తి శాఖ చేసిన సూచనలు అమలు చేయడంలో కేఆర్ఎంబీ విఫలమైందని రాశారు. అలాగే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ నుంచి విద్యుదుత్పత్తిని ఆపాలని తెలంగాణను కేఆర్ఎంబీ కోరడం తప్పని మీరు రాశారు. కేడబ్ల్యూడీటీ–1 ఆదేశాల మేరకు శ్రీశైలం వద్ద విద్యుత్ ఉత్పత్తికి, నీటిని దిగువకు విడుదల చేయడానికి, తాగునీరు మాత్రమే కాకుండా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు యొక్క ఆపరేషన్, నియంత్రణను ఇవ్వమని మీరు అభ్యర్థించారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ డీపీఆర్‌లను మదింపు చేసే వరకు ముందుకు వెళ్లవద్దని కేఆర్‌ఎంబీతోపాటు జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఏపీని నిరంతరం కోరుతూ వచ్చింది. దీనికి ఏపీ స్పందించలేదు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చకు వచ్చింది. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల సహా రెండు రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు పంపాలని మేం నిర్ణయించిన సంగతి మీకు తెలిసిందే. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిని నోటిఫై చేయాలని నిర్ణయించాం. నోటిఫై చేయడం పూర్తయితే విద్యుదుత్పత్తి సహా శ్రీశైలం నుండి దిగువకు నీటిని విడుదల చేయడం, నియంత్రించడం వంటి అంశాలను కేఆర్ఎంబీ నిర్దేశిస్తుంది. ఇక టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు వ్యయం భరించాలని 2016లో జరిగిన 1వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంగీకరించారు. దీనిపై పదేపదే అభ్యర్థన చేసినప్పటికీ రెండు రాష్ట్రాలు స్పందించలేదు. రెండు రాష్ట్రాలు ఈ దిశగా వ్యయం భరిస్తే టెలిమెట్రీ వ్యవస్థ స్థాపించడం పూర్తవుతుంది’ 4. సెక్షన్ 89 అంశంపై.. ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89కు సంబంధించిన సమస్యల గురించి మీరు రాశారు. అంతర్రాష్ట్ర నదీజలాల వివాద పరిష్కార చట్టంలోని సెక్షన్ 3 పరిధిలో కేంద్రం రెఫర్ చేయనందున కృష్ణా నదీజలాలను పునఃపంపిణీ చేసే అంశం పరిశీలించలేమని, సెక్షన్ 89 పరిధిలో మాత్రమే పరిశీలన జరుగుతుందని కేడబ్ల్యూడీటీ–2 అభిప్రాయపడ్డట్టు మీరు రాశారు. సెక్షన్ 3 పరిధిలో కొత్త ట్రిబ్యునల్ గానీ, ఉనికిలో ఉన్న ట్రిబ్యునల్‌గానీ కృష్ణా నదీజలాల పునఃపంపిణీ జరిపేలా రెఫర్ చేయాలని మీరు కోరారు. కేంద్రం స్పందించలేదని మీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే మేం మీ అభ్యర్థనను పరిశీలించేందుకు సిద్ధమని చెప్పగా అపెక్స్ కౌన్సిల్లో మీరు కూడా అంగీకరించారు’ 5. ఆ ఏడు ప్రాజెక్టుల్లో ముందుకు వెళ్లొద్దు.. ‘తెలంగాణలో గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలను మీరు మీ లేఖలో ప్రస్తావించారు. మీరు గోదావరిపై చేపట్టిన ఏడు ప్రాజెక్టులు కొత్తవి కావని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించినవని మీరు ప్రస్తావించారు. భారీ ముంపు నష్టం లేకుండా కొన్ని ప్రాజెక్టుల స్థలాన్ని మార్చినట్టు, మెరుగైన సామర్థ్యం కనబరిచేలా కొన్ని ప్రాజెక్టులను రీడిజైన్ చేసినట్టు మీరు చెప్పారు. జల్‌శక్తి మంత్రిత్వ శాఖ కూడా కాళేశ్వరం (2 టీఎంసీ) ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చినట్టు, ఆ స్థలంలో నీటి లభ్యత కారణంగా 3వ టీఎంసీ విస్తరణకు ముందుకు వెళ్లినట్టు మీరు మీ లేఖలో తెలిపారు. అయితే, ఆగస్టు 7న మీకు నేను రాసిన లేఖను గుర్తు చేయాలనుకుంటున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు 2 టీఎంసీల ప్రతిపాదనకు జల్‌శక్తి మంత్రిత్వ శాఖ సలహా కమిటీ 2018 జూన్‌లో అంగీకరించింది. కానీ, ·ఈ ప్రాజెక్ట్ పరిధిని 3 టీఎంసీలకు పెంచుతూ మీరు మార్చారు. అలాంటి మార్పు ఏదైనా ఉన్నప్పుడు కేంద్రం నుంచి హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర, పెట్టుబడులు, పర్యావరణ తదితర అనుమతులను పొందాల్సి ఉంటుందని మీకు రాశాను. ఈ మార్పు కారణంగా ఏపీఆర్ఏ–2014ను అనుసరించి జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ నుంచి మదింపు తప్పనిసరి. ఏపీ అభ్యంతరం చెప్పినట్టుగా ఈ ఏడు ప్రాజెక్టుల డీపీఆర్‌ల మదింపు జరగకుండా ముందుకు వెళ్లరాదని కూడా ఆ లేఖలో చెప్పాం. దీనిపై అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కూడా చర్చించాం. జీఆర్ఎంబీకి డీపీఆర్‌లు పంపేందుకు మీరు సమ్మతించారు. అందువల్ల మీరు కాళేశ్వరం ఎత్తిపోతల మూడో టీఎంసీ ప్రతిపాదన, సీతారామ ఎత్తిపోతల, జీఎల్ఐఎస్ ఫేజ్–3, తుపాకులగూడెం ప్రాజెక్టు, తెలంగాణ తాగునీరు సరఫరా ప్రాజెక్టు, లోయర్ పెన్‌గంగపై బ్యారేజి, రామప్ప సరస్సు నుంచి పాకాల లేక్‌కు నీటి మళ్లింపు ప్రాజెక్టులకు జీఆర్ఎంబీ మదింపు జరగనంతవరకు ముందుకు వెళ్లరాదని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను’ 6. గోదావరి జలాల పంపిణీపై.. ‘గోదావరి నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు 967.94 టీఎంసీలు, ఏపీకి 518.2 టీఎంసీలు కేటాయించారని మీరు ప్రస్తావించారు. తెలంగాణకు 1950 టీఎంసీల వాటా దక్కాలని మీరు రాశారు. ఏపీ, తెలంగాణల మధ్య గోదావరి జలాలను పంచుకునే విషయంలో కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు తక్షణం అభ్యర్థన పంపుతామని ఇరు రాష్ట్రాలు అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంగీకరించాయి. అభ్యర్థన రాగానే ఈ దిశగా కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుంది’అని మంత్రి పేర్కొన్నారు. ‘రెండు రాష్ట్రాల మధ్య నీటి భాగస్వామ్యం, నీటి వినియోగ సమస్యలు పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న అన్ని నిర్ణయాలపై వేగంగా ముందుకు సాగుతున్నామని ఆశిస్తున్నాను. తద్వారా రెండు రాష్ట్రాల చట్టబద్ధమైన నీటి హక్కులు త్వరితగతిన సాకారం అయ్యేలా చూసుకోవచ్చు’అని జల్‌శక్తి మంత్రి షెకావత్ పేర్కొన్నారు. ఆ ఏడు ప్రాజెక్టులు ఇవే.. కాళేశ్వరం మూడో టీఎంసీ సీతారామ ఎత్తిపోతలు జీఎల్ఐఎస్ ఫేజ్–3 తుపాకులగూడెం ప్రాజెక్టు తెలంగాణ తాగునీరు సరఫరా ప్రాజెక్టు లోయర్ పెన్‌గంగపై బ్యారేజీ రామప్ప సరస్సు నుంచి పాకాల లేక్‌కు నీటి మళ్లింపు -
ఎత్తిపోతకు.. గట్టిమోతే!
సాక్షి, హైదరాబాద్ : ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిశాయి. నీళ్లున్నాయి... యాసంగిలో పంటలకు ఢోకా లేదు. అంతవరకు బాగానే ఉంది కానీ... నీటిని ఎత్తిపోయాలి. దీనికి భారీగా విద్యుత్ కావాలి. రాష్ట్రంలో ప్రధాన ఎత్తిపోతల పథకాల కింద గరిష్ట ఆయకట్టుకు నీరివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఏకంగా 4,720 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమని నీటి పారుదల శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో కాళేశ్వరం ఎత్తిపోతల కిందే అత్యధికంగా 2,200 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటుందని లెక్కగట్టింది. ఖరీఫ్ సీజన్లో మంచి వర్షాలతో కృష్ణా, గోదావరి బేసిన్లలోని ఎత్తిపోతల పథకాలలో కరెంట్ మోత తప్పింది. యాసంగిలో మాత్రం బిల్లుల మోత గట్టిగానే ఉండనుంది. కాళేశ్వరం ద్వారా 50 టీఎంసీలు వానాకాలంలో స్థానిక పరీవాహకం నుంచి గరిష్ట ప్రవాహాల రాకతో రిజర్వాయర్లన్నీ నిండాయి. మోటార్ల ద్వారా ఎత్తిపోతల అవసరం గణనీయంగా తగ్గిపోయింది. ముఖ్యంగా కృష్ణా బేసిన్‌లోని భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల కింద 31 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోశారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 30 టీఎంసీల మేర తక్కువ. ఈ ఎత్తిపోతల పథకాల పరిధిలోని రిజర్వాయర్లలో స్థానిక ప్రవాహాల నుంచి నీరు చేరడంతో ఒకటి రెండు మోటార్ల ద్వారానే నీటిని ఎత్తిపోçశారు. దీంతో విద్యుత్ వినియోగం పెద్దగా జరుగలేదు. ఇక దేవాదుల కింద కూడా కేవలం 7 టీఎంసీల నీటి ఎత్తిపోతే జరిగింది. దీని పరిధిలోని వెయ్యికి పైగా చెరువులు వర్షాలతోనే నిండాయి. కాళేశ్వరం ద్వారా వానాకాలంలో 15 టీఎంసీల కన్నా తక్కువే నీటి ఎత్తిపోతల జరిగింది. దీంతో మొత్తంగా 2 వేల మిలియన్ యూనిట్లకన్నా తక్కువే విద్యుత్ వినియోగం జరిగింది. అయితే ప్రస్తుత యాసంగి సీజన్లో ప్రధాన ప్రాజెక్టుల కింద నీటి లభ్యత పుష్కలంగా ఉన్న దృష్ట్యా 33 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది. ఈ స్ధాయిలో ఆయకట్టుకు నీరివ్వాలంటే 330 టీఎంసీలు అవసరమని లెక్కగట్టింది. ఇందులో ప్రధాన ఎత్తిపోతల పథకాలైన దేవాదుల కింద 2.07లక్షల ఎకరాలకు 11.77 టీఎంసీలు, ఏఎంఆర్పీ కింద 2.67 లక్షల ఎకరాలకు 36 టీఎంసీలు, కల్వకుర్తి కింద 2.78 లక్షల ఎకరాలకు 37 టీఎంసీలు, ఎస్సారెస్పీ స్టేజ్–1, 2ల కింద కలిపి 13 లక్షల ఎకరాలకు 120 టీఎంసీలు అవసరం ఉంటుందని లెక్కగట్టింది. ఈ స్థాయిలో నీటిని ఇచ్చేందుకు ఎన్ని మోటార్లు... ఎప్పటినుంచి నడపాలి, ఎంత నీటిని ఎత్తిపోయాలి, ఎంత విద్యుత్ వినియోగం అవుతుందని ఇరిగేషన్ శాఖ అంచనాలు వేసింది. ఇందులో కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ మొదలు, ప్యాకేజీ–8లోని గాయత్రి పంప్‌హౌజ్ వరకు ఐదు పంప్‌హౌజ్‌లను కనీసంగా 60 నుంచి 80 రోజుల వరకు నడపాల్సి ఉంటుందని తేల్చింది. ఎస్సారెస్పీ కింద ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరివ్వాలంటే కాళేశ్వరం ద్వారానే కనీసంగా 50 టీఎంసీల మేర నీటిని జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎత్తిపోయాల్సి ఉంటుందని లెక్కగట్టారు. దీనికే 2,200 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఇక దేవాదుల పరిధిలోనూ ఈ ఏడాది 11 టీఎంసీల మేర నీటి ఎత్తిపోతలకు 779 మిలియన్ యూనిట్లు, మహబూబ్‌నగర్ ప్రాజెక్టుల కింద 800 మిలియన్ యూనిట్లు, ఏఎంఆర్పీ కింద 250 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ అవసరం ఉంటుందని గుర్తించారు. మిగతా చిన్న ఎత్తిపోతల పథకాలు, ఐడీసీ పథకాలు కలిపి మొత్తంగా యాసంగిలో 4,720 మిలియన్ యూనిట్లు విద్యుత్ అవసరాలను తేల్చారు. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి రెట్టింపు విద్యుత్ వినియోగం ఉండనుంది. -
కేంద్ర నిర్ణయానికి కట్టుబడాలి
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణ పనులపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఎత్తిపోతల సామర్థ్యాన్ని రోజుకు రెండు టీఎంసీల నుంచి మూడు టీఎంసీలకు పెంచడానికి ఎలాంటి పర్యావరణ అనుమతులు అవసరం లేదన్న తెలంగాణ వాదనతో విభేదించింది. ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని తెలిపింది. 2008 నుంచి 2017 వరకు ప్రాజెక్టు నిర్మాణంలో పలు మార్పులు జరిగినప్పటికీ పర్యావరణ అనుమతులు విస్మరించినట్లు గుర్తించామని స్పష్టం చేసింది. ఎత్తిపోతల సామర్థ్యం పెంపు పనులకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జలసంఘం, పర్యావరణ శాఖల అనుమతులు తప్పనిసరి అని పేర్కొంది. ప్రజా ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకువెళ్లాలే కానీ పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయరాదని తెలిపింది. పర్యావరణ ఉల్లంఘనలకు బాధ్యులెవరనేది గుర్తించాలని, ఏడుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నెలలోగా ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. కమిటీ నివేదిక ఆరునెలల్లో అందజేయాలని పేర్కొంది. కాళేశ్వరం విస్తరణ పనులను ఆపాలంటూ తెలంగాణకు చెందిన హయతుద్దీన్, తుమ్మనపల్లి శ్రీనివాస్ తదితరులు వేర్వేరుగా వేసిన పిటిషన్లను విచారించిన జస్టిస్ ఆదర్శకుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ‘‘ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం పర్యావరణ ఉల్లంఘనలు గుర్తించాం. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో పూర్వస్థితి తీసుకురావడం సాధ్యంకాదు. కానీ, ఉపశమన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత, జవాబుదారీతనం ఎంతైనా అవసరం. బహుళ ప్రయోజనంతో నిర్మిస్తున్న ప్రాజెక్టు కావడంతో పర్యావరణ అనుమతులు అవసరం లేదన్న తెలంగాణ ప్రభుత్వ వాదన సరికాదు. పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకు వెళ్లరాదని ట్రిబ్యునల్, హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. విస్తరణ పనులకు ముందు నిపుణుల కమిటీ అంచనా వేయాల్సిందే. గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు డీపీఆర్ ఇవ్వకుండా, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టు పనులపై ముందుకెళ్లొద్దని కేంద్ర జల్‌శక్తి మంత్రి 7.8.2020న తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. విస్తరణ పనులకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర జలసంఘం కూడా పేర్కొంది. అనుమతులు అవసరమని తెలిపింది. ఈ పరిస్థితుల్లో 2.10.2020న తెలంగాణ ముఖ్యమంత్రి రాసిన లేఖను కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ పరిశీలించాల్సిన అవసరం ఉంది. అనంతరం జల్‌శక్తి శాఖ తీసుకునే నిర్ణయానికి తెలంగాణ కట్టుబడి ఉండాలి’’ అని తీర్పులో పేర్కొంది. -
కాళేశ్వరంపై ఎన్జీటీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పును వెల్లడించింది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగినట్లు ఎన్జీటీ మంగళవారం పేర్కొంది. ఈ సందర్భంగా ఎన్జీటీ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినందున ఇప్పుడు ఉపశమన చర్యల తీసుకోవాల్సిన బాధ్యత ఉందిని తెలిపింది. సరైన పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టరాదని స్పష్టం చేసింది. అయితే, ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడంతో పర్యావరణ ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, పర్యావరణ అనుమతులపై కమిటీ ఏర్పాటు అవసరమని ఎన్జీటీ అభిప్రాయపడింది. ఈ మేరకు ఏడుగురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. 2008 నుంచి 2017 వరకు పర్యావరణ అనుమతుల లేకుండా చేసిన నిర్మాణాలకు.. జరిగిన పర్యావరణ నష్టాన్ని పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. నిర్వాసితులకు పరిహారం, పునరావసం అంశాలను కూడా అధ్యయనం చేయాలని చెప్పింది. ఇందుకు సంబంధించి నెల రోజుల్లో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తర్వాత నెల రోజుల్లో అధ్యయనం పూర్తి చేయాలని కమిటీకి ఆదేశాలిచ్చింది. కమిటీ పురోగతిని కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ తన తీర్పులో వెల్లడించింది. ప్రాజెక్టు విస్తరణపై సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారం పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దని తేల్చి చెప్పింది. ఇటీవల అపెక్స్ కౌన్సిల్లో చెప్పినట్లు డీపీఆర్‌లు సమర్పించి, కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకెళ్లొచ్చని ఆదేశాలు జారీ చేసింది. -
‘కాళేశ్వరం’ మరింత విస్తరణ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని మరింతగా వినియోగంలోకి తెచ్చే దిశగా ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక రచించింది. గోదావరి జలాల ఆధారంగా చేపట్టిన దేవాదుల ఎత్తిపోతల పథకంలో నీరందని చివరి ఆయకట్టు ప్రాంతాలకు కాళేశ్వరం ప్రాజెక్టుల్లోని రిజర్వా యర్ల ద్వారా నీరందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మల్లన్నసాగర్, గంధమల రిజర్వా యర్ల నుంచి లింక్ కెనాల్‌లను తవ్వి దేవాదుల లోని 2.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందిం చాలని భావిస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకట్రెండు రోజుల్లో సమీక్షించి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ‘మల్లన్న’ ద్వారా 1.37 లక్షల ఎకరాలు.. దేవాదులలో భాగంగా గంగాపురం ఇన్‌టేక్ పాయింట్ నుంచి నీటిని ఎత్తిపోస్తూ 6.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉంది. నిర్ణీత ఆయకట్టుకు నీటిని తరలించాలంటే సుమారు 200 కి.మీ.కిపైగా నీటిని తరలించాల్సి ఉంది. ఇందుకోసం కనీసం 460 మీటర్ల మేర నీటిని ఎత్తిపోయాల్సి వస్తోంది. ఈ స్థాయిలో ఎత్తి పోతలు చేసినా చివరి ఆయకట్టుకు నీరందడం కష్టంగా ఉందని భావించిన ప్రభుత్వం... కాళేశ్వ రంలోని వివిధ రిజర్వాయర్ల నుంచి దేవాదుల చివరి ఆయకట్టుకు నీటిని తరలించే అంశాలపై అధ్యయనం చేసింది. కాళేశ్వరం ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటికి తోడు అదనంగా మరో టీఎంసీని తీసుకొనేలా పనులు చేపట్టినందున ఈ నీటిని మరింత సద్వినియోగం చేసుకొనేలా దేవాదులతో అనుసంధాన ప్రణాళికను ముఖ్యమంత్రి కేసీఆర్ తెరపైకి తెచ్చారు. ముఖ్యంగా మల్లన్నసాగర్ నుంచి దేవాదులలోని తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలించే అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 11 కి.మీ. మేర గ్రావిటీ కెనాల్ నిర్మించి రోజుకు 44 క్యూమెక్కుల మేర నీటిని కనీసం 4 నెలలపాటు తీసుకెళ్లేలా ఇంజనీర్లు ప్రతిపాదనలు రూపొందించారు. కనీసం 15–16 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా తపాస్‌పల్లి కింద నిర్ణయించిన 82,500 ఎకరాలతోపాటు కన్నెబోయినగూడెం, వెల్దండ, లద్దనూరు దారి పొడవునా ఉండే చెరువుల కింద కలిపి మరో 55 వేల ఎకరాలు కలిపి 1.37 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనకు మొత్తంగా రూ. 80 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా వేశారు. గంధమల కెనాల్ నుంచి మరో 1.03 లక్షల ఎకరాలు.. ఇక మల్లన్నసాగర్ దిగువన ఉన్న గంధమల నుంచి బస్వాపూర్‌కు నీటిని తీసుకెళ్లే మెయిన్ కెనాల్ నుంచి లింక్ కెనాల్ తవ్వడం ద్వారా దేవాదుల కింద అశ్వరావుపల్లి, చిట్టకోడూరు, నవాబ్‌పేట మండలాల్లో ఉన్న ఆయకట్టుకు నీరిచ్చేలా మరో ప్రతిపాదన సిద్ధమైంది. గంధమల నుంచి బస్వాపూర్ వెళ్లే ప్రధాన కాల్వ 17వ కి.మీ. వద్ద నుంచి నీటిని మళ్లించేలా మరో 20 కి.మీ. లింక్ కెనాల్ ద్వారా నీటిని తరలించాలన్నది ప్రతిపాదన. ఈ లింక్ కెనాల్ ద్వారా అశ్వరావుపల్లి కింద 34 వేల ఎకరాలు, చిట్టకోడూరు కింద 9 వేలు, నవాబ్‌పేట కింద 54 వేల ఎకరాలతోపాటు ఆ దారిలోని చెరువుల కింద ఉన్న మరో 4 వేల ఎకరాలు కలిపి మొత్తంగా 1.03 లక్షల ఎకరాలకు నీరివ్వనున్నారు. ఈ లింక్ కెనాల్ ద్వారా 120 రోజులపాటు 10 టీఎంసీల మేర నీటిని తీసుకోనున్నారు. ఈ ప్రతిపాదనకు రూ. 30–35 కోట్ల మేర ఖర్చవుతుందని లెక్కగట్టారు. మొత్తంగా 25 టీఎంసీల మేర కాళేశ్వరం జలాలను వినియోగిస్తూ దేవాదులలోని 2.40 లక్షల ఎకరాలకు సుమారు రూ. 100 కోట్ల ఖర్చుతోనే నీటిని అందించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి త్వరలో సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. -
అదనపు టీఎంసీతో లబ్ధి ఎంత?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ప్రస్తుతం ఉన్న 2 టీఎంసీల నీటి ఎత్తి పోతలకు అదనంగా మరో టీఎంసీ నీటి ఎత్తిపోతలకు సంబంధించి చేపడుతున్న పనులతో ఎంత కొత్త ఆయకట్టు వినియోగంలోకి వస్తుందో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులకు కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేవని స్పష్టం చేసిన కేంద్రం, పర్యావరణ అనుమతులపై సైతం ఆరా తీయగా, తాజాగా అదనపు టీఎంసీతో చేకూరే ప్రయోజనాలపై వివరణ కోరింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ మంగళవారం రాష్ట్రానికి లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు 2015లో సమర్పించిన వ్యయ అంచనాల మేరకు టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) ఆమోదం తెలిపిందని లేఖలో ప్రస్తావిస్తూ, ప్రస్తుత అంచనా వ్యయాలు ఎంతో చెప్పాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. 98 రోజుల పాటు రోజుకు 2 టీఎంసీల చొప్పున 195 టీఎంసీల నీటి ఎత్తిపోతలకు మాత్రమే టీఏసీ అనుమతిచ్చిందని గుర్తుచేసింది. అయితే అదనంగా రోజుకు మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా ప్రతిపాదన ఏదైనా సిద్ధం చేశారా? అలాంటి ప్రతిపాదన ఉంటే.. ఆ వివరాలను తమకు తెలపాలని కేంద్రం ఆదేశించింది. ఇక అదనపు టీఎంసీ పనులపై కేంద్ర జల సంఘానికి ఏవైనా ప్రతిపాదన పంపారా? అని ప్రశ్నిం చింది. నీటి వినియోగానికి సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారాన్నంత తమకు అందజేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో పాటే ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2, వరద కాల్వ, సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టుల కింద స్థిరీకరణ ఆయకట్టు వివరాలనూ కోరింది. పాత ఆయకట్టునే కొత్తగా చూపిస్తున్నారంటూ.. కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులతో కొత్తగా వృధ్ధిలోకి వచ్చే ఆయకట్టు పెద్దగా లేదని, ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టునే కాళేశ్వరం ఆయకట్టు కింద చూపుతున్నారని వివిధ పార్టీల ఎంపీలు, రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఈ వివరాలను కోరినట్లుగా తెలిసింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను సమర్పించాలని పలుమార్లు కోరినా రాష్ట్రం స్పందించలేదు. కాళేశ్వరం అంచనా వ్యయం రూ.80,150 కోట్లుగా గతంలో పేర్కొన్నారని, ప్రస్తుతం సవరించిన అంచనాలు ఎంతో తెలపాలని కేంద్రం ఆదేశించింది. దీనిపై కొనసాగింపుగా ప్రస్తుతం ప్రాజెక్టు అదనపు టీఎంసీతో వృద్ధిలోకి వచ్చే ఆయకట్టు, ప్రయోజనాల వివరాలను కోరడంతో కేంద్రం కాళేశ్వరం అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు కనబడుతోందని ఇరిగేషన్ వర్గాలే అంటున్నాయి. -
ఉప్పొంగుతున్న ప్రాణహిత
సాక్షి, హైదరాబాద్ : గోదావరి ఎగువన రెండ్రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత పరవళ్లు తొక్కుతోంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు నిండి ఆ నీరంతా వచ్చి చేరుతుండటంతో ప్రాణహిత ఉప్పొంగుతోంది. ఇదే సమయంలో గోదావరి పరీవాహకంలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో రెండు నదులు కలిసే కాళేశ్వరం వద్ద గోదావరిలో 3.79 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు నమోదవుతున్నాయి. ఈ మొత్తం సీజన్లో ఇవే గరిష్ట ప్రవాహాలు కాగా, మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం ఇప్పటికే తెలంగాణతో పాటు పరీవాహక రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అన్నారం, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు.. అన్నారం బ్యారేజీలోకి స్థానికంగా ఉన్న మానేరు నది నుంచి 24 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తున్నాయి. దీనిలో 10.87 టీఎంసీలకు 9.25 టీఎంసీల మేర నీటి నిల్వ ఉండటంతో 8 పంపుల ద్వారా 20వేల క్యూసెక్కులకు పైగా నీటిని సుందిళ్లలోకి పంపింగ్ చేస్తున్నారు. సుందిళ్లకు వస్తున్న నీటిని వచ్చినవి వచ్చినట్లు ఎల్లంపల్లికి పంపింగ్ చేస్తున్నారు. ఎగువ పంపింగ్ చేస్తున్న నీటికి తోడు స్థానిక ప్రవాహాలు కలిసి ఎల్లంపల్లిలోకి ప్రస్తుతం 25,916 క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తున్నాయి. దీంతో ఎల్లంపల్లిలో నీటి నిల్వ 20.18 టీఎంసీలకు గాను 12 టీఎంసీలకు చేరింది. ఇక్కడి నుంచి నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా మిడ్‌మానేరుకు నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం మిడ్‌మానేరులోకి 21వేల క్యూసెక్కుల మేర నీటిని ఎత్తిపోస్తుండగా నిల్వ 25.87 టీఎంసీలకు 15.31 టీఎంసీలకు చేరింది. అన్నారం నుంచి మిడ్‌మానేరు వరకు కాళేశ్వరం ద్వారా గోదావరి ఎత్తిపోతలను మరో వారం పాటు కొనసాగించనున్నారు. రోజుకు రెండు టీఎంసీల చొప్పున కనీసంగా 14 టీఎంసీల నీటిని ఎత్తిపోసినా మిడ్‌మానేరు, ఎల్లంపల్లి పూర్తిగా నిండనున్నాయి. ఇక శ్రీరాంసాగర్‌లోకి నీటి ప్రవాహాలు స్థిరంగా నమోదవుతున్నాయి. ప్రాజెక్టులోకి 23,522 క్యూసెక్కుల మేర వరద వస్తుండగా, ప్రాజెక్టులో నిల్వ 90 టీఎంసీలకుగాను 41 టీఎంసీలకు చేరింది. ఇప్పటివరకు ప్రాజెక్టులోకి మొత్తంగా 27 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చి చేరింది. ‘కాళేశ్వరం’ జలజల కాళేశ్వరం వద్ద ఏటా జూన్ రెండో వారం నుంచే ప్రవాహాలు మొదలవుతుండగా, ఈ ఏడాది జూలై మొదటి వారం నుంచి ప్రవాహాలు మొదలయ్యాయి. గతేడాది జూలై మొదటి వారం నుంచే 50వేల క్యూసెక్కులకు పైగా నీరు రాగా, ఈ ఏడాది జూలై చివరి వారం నుంచి 50వేల నుంచి 1.10 లక్షల క్యూసెక్కుల వరకు ప్రవాహాలు వచ్చా యి. అయినా అవి మళ్లీ 80వేల క్యూసెక్కులకు తగ్గిపోయాయి. ఇటీవలి వర్షాలతో కాస్త పుంజుకొని, ఈ నెల 11న 83వేల క్యూసెక్కుల మేర నమోదుకాగా, 12న 2లక్షల క్యూసెక్కులకు పెరిగాయి. ఇక 13న గురువారం ఏకంగా 3.79 లక్షల క్యూసెక్కులకు చేరింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో ఇప్పటికే 16.17 టీఎంసీలకు గాను 9.20 టీఎంసీల మేర నీటి నిల్వ ఉండటంతో అన్ని గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ నదిలోకి వదిలేస్తున్నారు. ఇక మేడిగడ్డ పంప్‌హౌస్‌లోని పంపులను సైతం నిలిపివేశారు. -
శ్రీశైలంలోకి 2.13 లక్షల క్యూసెక్కులు
సాక్షి, హైదరాబాద్ :పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కృష్ణా, ఉప నదుల్లో వరద ప్రవాహం పెరుగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు నిండుకుండలుగా మారడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 2,13,486 క్యూసెక్కులు చేరుతుండగా..ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 40,259 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటిదాకా శ్రీశైలంలోకి వచ్చిన గరిష్ట వరద ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం శ్రీశైలంలో 855.80 అడుగుల్లో 94.02 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 121 టీఎంసీలు అవసరం. ఇదేరీతిలో వరద ప్రవాహం మరో వారం రోజులపాటు వస్తే శ్రీశైలం ప్రాజెక్టు నిండుతుంది. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం నుంచి విడుదల చేసిన వరద ప్రవాహం చేరుతుండటంతో నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 559.40 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 230.99 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్ నిండాలంటే ఇంకా 82 టీఎంసీలు అవసరం. ఎగువన తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద ఉధృతి పెరుగుతోంది. అప్పర్ తుంగ, భద్ర డ్యామ్, సింగటలూరు బ్యారేజీలు నిండిపోవడంతో భారీ ఎత్తున వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. సింగటలూరు బ్యారేజీ నుంచి 1.05 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతుండటంతో తుంగభద్ర డ్యామ్‌లోకి 1.16 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతోంది. ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్‌లో 66.96 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. డ్యామ్ నిండాలంటే ఇంకా 34 టీఎంసీలు అవసరం. వరద ప్రవాహం ఇదే రీతిలో మరో ఆరు రోజులు కొనసాగితే డ్యామ్ నిండుతుంది. అప్పర్ కృష్ణ, అప్పర్ తుంగభద్ర బేసిన్లలో మరో మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు కనీసం వారం నుంచి పది రోజులు ఇదే రీతిలో వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. సరస్వతీ బ్యారేజీకి 6 టీఎంసీలు కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ పంపుహౌస్ నుంచి 9 మోటార్లతో నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో నాలుగు రోజుల్లో (శనివారం వరకు) అన్నారంలోని సరస్వతీ బ్యారేజీకి 6 టీఎంసీల నీరు తరలిపోయింది. మహారాష్ట్రలో వర్షాలు భారీగా కురుస్తుండటంతో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ఆ వరద నీరు కలుస్తున్నది. ఇన్‌ఫ్లో 19,844 క్యూసెక్కులు.. లక్ష్మీ పంపుహౌస్ నుంచి సరస్వతీ బ్యారేజీకి 19,844 క్యూసెక్కుల ఇ¯Œ ఫ్లో వస్తోంది. బ్యారేజీలో నీటి నిల్వ 10.87 టీఎంసీలకుగాను 9.47 టీఎంసీల నిల్వ ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 119 ఎఫ్ఆర్ఎల్ కాగా ప్రస్తుతం 118.40 ఎఫ్ఆర్ఎల్కు చేరింది. -
నీటి నిర్వహణ కత్తిమీద సామే!
సాక్షి, హైదరాబాద్: ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింది కాల్వలన్నీ నిండుగా పారుతున్నా నీటి నిర్వహణ ‘కత్తిమీది సాములా’మారింది. అన్ని ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో నీటి నిర్వహణకు అవసరమైన వర్క్ ఇన్స్పెక్టర్లు, ఫిట్టర్లు, లష్కర్లు లేరు. దీంతో నీటి నిర్వహణ ఇరిగేషన్ ఇంజనీర్లకు అగ్ని పరీక్షలా మారింది. సిబ్బందిలేమి.. నీటి పంపిణీకి ఇబ్బంది ఎగువ నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలతో జూరాల, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు భారీ ప్రవాహాలు మొదలయ్యాయి. కాళేశ్వరం మొదలు కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోతలు ఆరంభమయ్యాయి. కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నీటిపంపిణీ ఆటంకాల్లేకుండా సాగా లంటే ఆపరేటర్లు, ఫిట్టర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, హెల్ప ర్లు, లష్కర్లు, ఎలక్ట్రీషియన్లు కీలకం. రాష్ట్రంలో మొత్తంగా ఈ తరహా సిబ్బంది 6 వేల మంది అవసరముండగా ప్రస్తుతం1,700 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కాల్వల పరిధిలోని మెయిన్‌కెనాల్, డిస్ట్రిబ్యూటరీల పరిధిలో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక రు, బ్రాంచ్ కెనాల్ల పరిధిలో ప్రతి 6 కిలోమీటర్లకు ఒకరు చొప్పున లష్కర్ ఉండాలి. కానీ, ప్రస్తుతం ప్రతి 25 కిలోమీటర్లకు ఒక్కరు కూడా లేరు. మొత్తం గా 3,800 మంది లష్కర్లు అవసరముండగా, 1,400 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కాల్వలకు గండ్లు పడుతున్నా... గోదావరి జలాల ద్వారా ఎస్సారెస్పీ పరిధిలోని 250 కిలోమీటర్ల మేర కాల్వలు పారుతున్నాయి. దీని పరిధిలో సుమారు 400 మంది లష్కర్లు అవసరముండగా 50, 60 మందితోనే నెట్టుకొస్తున్నారు. కనీసం 200 మంది లష్కర్లను అత్యవసరంగా నియమించాలని ఏడాదిగా ఇంజనీర్లు కోరుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. నాగార్జునసాగర్ పరిధిలోనూ ఇదే పరిస్థితి. కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్ల కింద 400 మంది లష్కర్లు, 60 మంది ఆపరేటర్లు, 75 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు, 20 మంది ఎలక్ట్రీషియన్లు, 15 మంది ఫిట్టర్లు కావాలని ఏడాదిగా కోరుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన సరిగాలేదు. దీంతో ఇక్కడ కాల్వలకు గండ్లు పడుతున్నా, కొన్నిచోట్ల అక్రమంగా కాల్వలను తెంచుతున్నా పట్టించుకునేవారులేరు. కిన్నెరసాని, కడెం, జూరాల, మూసీ, సింగూరు వంటి ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలన్నా, దించాలన్నా సరిపడా సిబ్బంది లేరు. గత ఏడాది సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో మూసీ గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. -
‘కాళేశ్వరం’ ఎత్తిపోతలు షురూ
కాళేశ్వరం : కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలు ప్రారంభించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్‌లో బుధవారం రాత్రి ఆరు మోటార్లను ఇంజనీరింగ్ అధికారులు ఆన్ చేశారు. మే 11వ తేదీన గోదావరిలో నీటి ప్రవాహం తగ్గడంతో మోటార్లను నిలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మహారాష్ట్రలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో.. కాళేశ్వరం వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. అలాగే, ప్రాణహిత వరద కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తోంది. దీంతో కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్ వద్ద అప్రోచ్ కెనాల్ నుంచి ఫోర్ బే వరకు నీరు నిల్వ అయింది. వరద కూడా పెరుగుతుం డటంతో లక్ష్మీ పంపుహౌస్‌లోని 11 మోటార్లలోని ఆరు మోటార్లను ఆన్ చేయగా.. 12 పంపుల ద్వారా గ్రావిటీ కాల్వలోకి నీరు ఎత్తిపోస్తోంది. ఈ నీరు 13.41 కిలోమీటర్ల దూరంలోని అన్నారంలోని సరస్వతీ బ్యారేజీకి తరలుతోంది. రాత్రిలోగా మిగిలిన మోటార్లను ఒకేసారి నడిపించనున్నట్లు తెలిసింది. ఈ సీజన్లో మోటార్లు ఆన్ చేయడం ఇదే ప్రథమం కావడంతో ఎస్ఈ, డీఈఈ, ఏఈఈ స్థాయి ఇంజనీరింగ్ అధికారులు పంపుహౌస్ వద్ద పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్ కాంతులతో జిగేల్ కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్‌లో మోటార్ల ద్వారా నీరు డెలివరీ సిస్టర్న్ వద్ద ఎత్తిపోస్తున్నాయి. దీంతో సిస్టర్న్‌కు రంగురంగుల విద్యుత్ దీపాలను అమర్చారు. దీంతో నీరు రంగు రంగులుగా మారి జిగేల్‌మంటోంది. -
‘కాళేశ్వరం’పై పోలీసుల నజర్!
సాక్షి, కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టులపై పోలీసులు నిఘా పటిష్టం చేశారు. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. జిల్లాలో మావోయిస్టులు పట్టు కోసం ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశముందని ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలిసింది. దీంతో రాత్రీపగలు గోదావరి తీర ప్రాంతాలు, అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. పల్లెలతో పాటు ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రాంతాల్లో అనుమానితులు కనిపిస్తే పోలీసులు విచారించి వదిలేస్తున్నారు. వాహనాల తనిఖీలు కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన మీదుగా మహారాష్ట్ర–తెలంగాణకు వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కాళేశ్వరం, మహాదేవపూర్, పలిమెల ఎస్సైలు అభినవ్, అనిల్, శ్యాంరాజ్ ఆధ్వర్యాన తనిఖీలు సాగుతున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు తెలంగాణ వైపు మహదేవపూర్, పలిమెల మండలాల్లో గోదావరి దాటి జిల్లాలోకి ప్రవేశించకుండా అప్రమత్తమయ్యారు. మహదేవపూర్, పలిమెల మండలంలోని రేవులపై ప్రత్యేక దృష్టిని సారించారు. గోదావరిలో ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రోడ్డు మార్గాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఇక మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డలోని లక్ష్మీ, అన్నారంలోని సరస్వతీ బ్యారేజీ, కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్, గ్రావిటీ కాల్వల వద్ద నిఘా తీవ్రం చేశారు. జిల్లా ఇన్చార్జి ఎస్సీ సంగ్రామ్‌సింగ్ పాటిల్, కాటారం డీఎస్పీ బోనాల కిషన్, సీఐ నర్సయ్య ఆధ్వర్యంలో బ్యారేజీలపై ప్రత్యేక నజర్ వేసినట్లు తెలిసింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్, డిస్ట్రిక్ గార్డులు, సివిల్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
పునరావాసం కల్పించండి
భువనగిరి టౌన్: బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణంలో ఇళ్లు, భూములు కోల్పోతున్న తమకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బీఎన్ తిమ్మాపురం గ్రామస్తులు సోమవారం ధర్నాకు దిగారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణంలో ఇళ్లు, భూములు కోల్పోతున్నామని, తమ గ్రామస్తులందరికీ ఒకే దగ్గర భూమి, ఇళ్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారిపై, అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున బైఠాయించారు. అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ ఆందోళనకారులతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కలెక్టర్ సెలవులో ఉన్నారని, తాను సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అయినా గ్రామస్తులు వినలేదు. కలెక్టర్ రావాలని పట్టుబట్టారు. సుమారు రెండున్నర గంటలపాటు హైవేపై బైఠాయించడంతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఏసీపీ భుజంగరావు జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. -
రివర్స్ పంపింగ్‌తో ఉపయోగం ఉందా?
కథలాపూర్/మేడిపల్లి (వేములవాడ): కాళేశ్వరం జలాల రివర్స్ పంపింగ్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం జగిత్యాల జిల్లా కథలాపూర్ జెడ్పీటీసీ భూమయ్య, మేడిపల్లి మండలం వెంకట్రావుపేట మాజీ సర్పంచ్ కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డితో వేర్వేరుగా ఫోన్లో మాట్లాడారు. జిల్లాలో నీటి సమస్య ఎక్కడ ఉంది.. దానికి పరిష్కార మార్గాలు.. వరద కాలువలో ప్రవహిస్తున్న కాళేశ్వరం జలాల విషయమై చర్చించారు. రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీ వరద కాలువలోకి వస్తున్న నీటితో రైతులకు ఏ మేరకు ఉపయోగపడుతోందని ఆరా తీశారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని మేడిపల్లి, కథలాపూర్ మండలాలతోపాటు చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల, కొడిమ్యాల మండలాలు నాన్ ఆయకట్టు కింద ఉన్నాయని, ఇక్కడ నీటి సమస్య ఉన్నట్లు భూమయ్య, శ్రీపాల్‌రెడ్డి ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకొచ్చారు. వరద కాలువ నుంచి లిఫ్ట్ ద్వారా కాలువ పై భాగంలోని చెరువులు, కుంటలు నింపితే సమస్య తీరుతుందన్నారు. వేములవాడ, చొప్పదండి, కోరుట్ల, ఆర్మూర్ నియోజకవర్గాల్లోని నీటి సమస్య ఉన్న గ్రామాలకు నాలుగు నెలల్లో నీరు అందేలా చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలసి శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌కు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. -
ఆచితూచి ఎత్తిపోత!
సాక్షి, హైదరాబాద్ : గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో నదిలో ప్రవాహాలు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు రెండువేల క్యూసెక్కుల మేర ఉన్న ప్రవాహాలు ఆదివారం ఐదు వేలకు పెరిగాయి. ఈసారి మంచి వర్షాలే పడతాయన్న అంచనాల నేపథ్యంలో కాళేశ్వరం ద్వారా ఆచితూచి, సమగ్ర ప్రవాహ అంచనాతో ఎత్తిపోతలు చేపట్టాలని ప్రభుత్వం భావి స్తోంది. కడెం నుంచి ప్రవాహాలు మొదలైతే ఎత్తిపోతలు చేపట్టే అవసరం ఉండదని భావిస్తోంది. అన్నీ లెక్క చూసుకొనే ఎత్తిపోత గడిచిన రెండు మూడ్రోజులుగా ఎగువన మహారాష్ట్రలో మంచి వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద పెరిగింది. ఆదివారం ఉదయానికి మేడిగడ్డ వద్ద 5,200 క్యూసెక్కుల మేర వరద కొనసాగగా, సాయంత్రానికి 18 వేల క్యూసెక్కులకు చేరింది. మరిన్ని రోజులు మహారాష్ట్రలో వర్షాలు కురిస్తే ప్రవాహాలు పెరిగే చాన్స్ ఉంది. రాష్ట్రంలోనూ ఈ ఏడాది మంచి వర్షాలుంటాయనే అంచనాలున్నాయి. దీంతో గోదావరి బేసిన్‌లోని కడెం ప్రాజెక్టుకు జూన్ చివరి వారం నుంచే ప్రవా హాలు నమోదవుతాయని భావిస్తున్నారు. ప్రస్తు తం కడెంలో 7.60 టీఎంసీలకు 3.14 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. దీనిలోకి గతేడాది గరిష్టంగా 40–50వేల క్యూసెక్కుల వరకు సైతం ప్రవాహాలు కొనసాగిన సందర్భాలున్నాయి. అదే జరిగితే ప్రాజెక్టు ఒక్కరోజులోనే నిండుతుంది. కడెం నుంచి దిగువకు ఏటా 15–20 టీఎంసీల మేర వరద దిగువకు వస్తుంటుంది. ఇది ఎల్లంపల్లికి చేరుతుంది. ప్రస్తుతం ఎల్లంపల్లిలో 5.50 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎల్లంపల్లి సైతం నిండితే గ్రావిటీ ద్వారా నీరు సుందిళ్ల, అన్నారం బ్యారేజీల ద్వారా మేడిగడ్డకు ప్రవహించి గోదావరిలో కలుస్తుంది. గతేడాది మేడిగడ్డ ద్వారా నీటిని ఎత్తి మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం, సుందిళ్ల నింపాక కడెం, ఎల్లంపల్లి నుంచి భారీగా వరద ప్రవాహాలు వచ్చాయి. దీంతో చాలా నీరు తిరిగి నదిలో కలిసిపోయింది. గతానుభవాల దృష్ట్యా, ఈ ఏడాది వర్షపాతం, ఎగువ నుంచి వచ్చే అంచనాలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వం భావిస్తోంది. సరైన అంచనా లేకుండా నీటిని ఎత్తిపోసేందుకు మోటార్లు నడిపిస్తే కరెంట్ ఖర్చు అనవసరపు భారం కానుంది. మేడిగడ్డలో నీటి నిల్వ 0.6 టీఎంసీల డెడ్ స్టోరేజీ ఉండగా, అన్నారంలో 2టీఎంసీలు, సుందిళ్లలో 2టీఎంసీల మేర నిల్వలున్నాయి. వీటిని అంచనా వేసుకుంటూ దిగువన ఎల్లంపల్లి మొదలు, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, ఎస్సారెస్పీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని గోదావరి ఎత్తిపోతలను మొదలుపెట్టే అవకాశం ఉందని ఇంజనీర్లు చెబుతున్నారు. -
డీపీఆర్‌లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్ పరిధిలో చేపట్టిన కొత్త ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డీపీఆర్)లను ఈ నెల 10లోగా సమర్పించాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆదేశించింది. అదే సమయంలో అనుమతిలేని ప్రాజెక్టులపై ముందుకెళ్లరాదని స్పష్టం చేసింది. బోర్డు ఆదేశంతో ప్రాజెక్టుల సాంకేతిక అనుమతి కోసం గోదావరి నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘానికి, వాటి ఆమోదం కోసం అపెక్స్ కౌన్సిల్‌కు నివేదికలు సమర్పించేందుకు తెలంగాణ అంగీకరించగా ఏపీ ఇప్పటికే కొన్ని డీపీఆర్‌లను ఇచ్చింది. మిగిలిన ప్రాజెక్టుల డీపీఆర్‌లను సాంకేతిక అనుమతి బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్‌కు ఇచ్చేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. గోదా వరి బేసిన్ పరిధిలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు, నీటి వాటాలు, కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణ, మళ్లింపు జలాల్లో వాటా, టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటు అంశాలపై చర్చించేందుకు గోదావరి బోర్డు శుక్రవారం హైదరాబాద్‌లోని ‘జలసౌధ’లో సమావేశమైంది. బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖ కార్యదర్శులు రజత్‌కుమార్, ఆదిత్యనాథ్దాస్లతోపాటు ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బోర్డు ఎజెండా అంశాలతోపాటు ఇరు రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలపై నాలుగు గంటలపాటు చర్చిం చారు. ఈ భేటీలో కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లపై వాడివేడిగా చర్చ జరిగింది. ఆ ప్రాజెక్టులన్నీ రీ ఇంజనీరింగ్ చేసినవే: తెలంగాణ బోర్డు భేటీలో పలు అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారులు వాదనలు బలంగా వినిపించారు. ముఖ్యంగా గోదావరి నదిలో తమకు 967 టీఎంసీల మేర వాటా ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన విషయాన్ని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్‌కుమార్ గుర్తుచేశారు. తమ వాటా మేరకే నీటి వినియోగాన్ని చేసుకునేలా ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని తెలిపారు. తమ వాటాల్లోంచే నీటిని వినియోగిస్తామన్నారు. అయితే దీనిపై ఏపీ అభ్యంతరం తెలిపింది. బచావత్ అవార్డు ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు చేయలేదని బోర్డు దృష్టికి తెచ్చింది. కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం, తమ్మిడిహెట్టి, ఛనాకా–కొరటా, రాజంపేట, పింపార్డ్ ప్రాజెక్టులన్నీ కొత్తవేనని, వాటికి ఎలాంటి అనుమతులు లేవని వాదించింది. ఏపీ వాదనపై అభ్యంతరం తెలిపిన తెలంగాణ... ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులనే రీ ఇంజనీరింగ్ చేశామని, వాటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం అటవీ, పర్యావరణ సహా అన్ని అనుమతులు ఇచ్చిందని స్పష్టం చేసింది. దీన్ని ఏపీ ఖండించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులిచ్చే ముందు దిగువ రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని, అదేమీ జరగని దృష్ట్యా తెలంగాణకు ఇచ్చిన అనుమతులను పునఃపరిశీలించాలని కోరుతూ కేంద్రానికి ఇప్పటికే లేఖలు రాసినట్లు వివరించింది. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు ఏపీ మళ్లిస్తున్నందున తమకు 45 టీఎంసీల వాటా రావాలని తెలంగాణ మరోమారు కోరింది. అయితే దీనికి అభ్యంతరం చెప్పిన ఏపీ... ఉమ్మడి రాష్ట్రానికి 45 టీఎంసీలని అవార్డులో ఉందని, ఈ మళ్లింపు జలాల్లో తమకు వాటా దక్కుతుందని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనకు పంపినందున అక్కడి నుంచి వచ్చే ఆదేశాల వరకు ఆగాలని బోర్డు ఇరు రాష్ట్రాలకు సూచించింది. పోలవరం బ్యాక్ వాటర్ సర్వే చేయాలని తెలంగాణ కోరింది. గరిష్ట వరదలు నమోదైనప్పుడు తెలంగాణలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతాయని చెప్పగా ఇప్పటికే కేంద్ర జల సంఘం అధ్యయనం చేసి తెలంగాణకు ఎలాంటి ముంపు లేదని నిర్ధారించిందని ఏపీ స్పష్టం చేసింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ టెలిమెట్రీపై నిపుణులతో కమిటీ.. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ప్రధాన ప్రాంతాల్లో నీటి ప్రవాహ లెక్కల నమోదు కోసం టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. ఏయే ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేయాలనే విషయమై ఇరు రాష్ట్రాలతోపాటు సీడబ్ల్యూసీ, పుణేలోని సీడబ్ల్యూపీఆర్ఎస్లోని ఇంజనీర్లతో బోర్డు ఓ కమిటీని నియమించింది. సత్వరమే ‘అపెక్స్’ఎజెండా: చంద్రశేఖర్ అయ్యర్ కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇచ్చేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించినట్లు గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాల గురించి వివరణ ఇవ్వాలని తెలంగాణను ఆదేశించినట్లు వెల్లడించారు. అలాగే అపెక్స్ భేటీలో చర్చించాల్సిన ఎజెండా అంశాలను సత్వరమే పంపాలని కోరగా ఇరు రాష్ట్రాలు అంగీకరించాయన్నారు. తెలంగాణ చేపట్టిన పెద్దవాగు ఆధునీకరణ పనులను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు ఏపీ ఒప్పుకున్నట్లు తెలిపారు. అనుమతులు లేని ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లరాదని ఇదివరకే ఇరు రాష్ట్రాలను కోరామని, అదే విషయాన్ని మరోమారు స్పష్టం చేసినట్లు తెలిపారు. ఎస్సారెస్పీ డీపీఆర్‌నూ అడగటం విచిత్రం... రాష్ట్రంలో ఎలాంటి కొత్త ప్రాజెక్టులు లేవని బోర్డుకు చెప్పాం. పాత ప్రాజెక్టులకే రీ ఇంజనీరింగ్ చేశాం తప్పితే కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదని వివరించాం. కాళేశ్వరం పాత ప్రాజెక్టేనని కేంద్రం లేఖ సైతం ఇచ్చింది. ప్రాజెక్టుల డీపీఆర్‌లపై ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాక తేలుస్తాం. రాష్ట్రానికి 967 టీఎంసీల వాటా ఉంది. ఈ వాటాల్లోంచే నీటిని వినియోగిస్తాం. ఇక ఎస్సారెస్పీ ప్రాజెక్టు డీపీఆర్‌ను అడగటం విచిత్రం. 2014 జూన్ 2కు ముందు పూర్తయిన డీపీఆర్‌లు అడగొద్దని స్పష్టంగా చెప్పాం.– రజత్‌కుమార్, నీటిపారుదల శాఖ కార్యదర్శి -
తెలంగాణ వాదనపై ఏపీ అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్ : గోదావరి జలాల్లో 967 టీఎంసీల వాటా ఉందన్న తెలంగాణ వాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోసిపుచ్చింది. గోదావరి జలాలపై తెలంగాణ నీటిపారుదల అధికారులు వాదనకు ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు ఎక్కడ చేసిందో చూపించాలని ఏపీ అధికారులు నిలదీశారు. కాగా గోదావరి నదిపై రెండు తెలుగు రాష్ట్రాలు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, వర్కింగ్ మాన్యువల్ ఖరారు, బడ్జెట్, సిబ్బంది కేటాయింపు తదితర అంశాలపై చర్చించేందుకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు హైదరాబాద్‌లోని జలసౌధలో బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన భేటీ ముగిసింది. (డీపీఆర్‌లు ఇవ్వాల్సిందే) బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ప్రామాణికం గోదావరి బోర్డు సమావేశంలో భాగంగా గోదావరి జలాల్లో 967 టీఎంసీల వాటా ఉందన్న తెలంగాణ వాదననలు ఏపీ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటన ఆధారంగా గోదావరిలో 967 టీఎంసీలు వాటా ఉంటుందని తెలంగాణ బోర్డు దృష్టికి తీసుకురాగా.. దీనిపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. బచావత్ ట్రిబ్యునల్‌లో తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు ఎక్కడ చూపలేదని స్పష్టం చేశారు. ప్రస్తుత నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ప్రామాణికంగా తీసుకోవాలని ఏపీ అధికారులు బోర్డు చైర్మన్‌కు విన్నవించారు. కొత్త ప్రాజెక్టులకు బ్రేక్.. అలాగే బచావత్ ట్రిబ్యునల్‌లో ఎక్కడా కూడా తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు చేయలేదని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే ఇరు రాష్ట్రాల అధికారుల వాదనలు విన్న బోర్డు చైర్మన్ చంద్రశేఖర్.. నీటి వినియోగం లెక్కలు తేల్చేందుకు టెలీమీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే కొత్త ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని రెండు రాష్ట్రాలను ఆదేశించారు. ఈ నెల 10వ తేదీలోగా ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డీపీఆర్)లు ఇవ్వాలని ఇరు రాష్ట్రాలకు సూచించారు. బోర్డు సూచనకు ఇరు ప్రభుత్వాల అధికారులు అంగీకరించారు. ఈ సమావేశంలో ఏపీ తరఫున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నుంచి నీటి పారుదల శాఖ కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్ వాదనలు విపించారు. కేంద్రం ఆదేశాలతో.. కాగా విభజన చట్టానికి విరుద్ధంగా, ‘అపెక్స్ కౌన్సిల్’ అనుమతి లేకుండా గోదావరిపై తెలంగాణ చేపట్టిన ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు, నీటి మళ్లింపు ప్రాజెక్టులు, ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు తదితర అంశాలపై గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం మరోసారి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకాల సామర్థ్యాన్ని పెంచుతుండటాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అపెక్స్ కౌన్సిల్ అనుమతించే వరకూ ఆ ప్రాజెక్టులను నిలుపుదల చేసేలా తెలంగాణ సర్కార్‌ను ఆదేశించాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ గోదావరి బోర్డు చైర్మన్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ దృష్ట్యా వాటిని నిలుపుదల చేయాలని తెలంగాణ సర్కార్‌ను గోదావరి బోర్డు ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం బోర్డు సమావేశం జరిగింది. గురువారంమే కృష్ణా బోర్డు సమావేశం జరిగిన విషయం తెలిసిందే. -
భార్య పిటిషన్.. భర్త మరణించాడన్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్ : కరోనా బారిన పడిన తన భర్తను వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారని, అయితే ఇప్పటి వరకు తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నగరంలోని వనస్థలిపురంకు చెందిన మధుసూదన్ భార్య మాధవి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం అసలు మధుసూదన్ బ్రతికి ఉన్నాడా? లేడా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హైకోర్టు ప్రశ్నకు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సమాధానిస్తూ.. కొద్ది రోజుల క్రితమే అతని కరోనాతో మరణించాడని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ సమాధానంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రోగి చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. కనీసం కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీసింది. దీనిపై పూర్తి వివరాలతో శుక్రవారంలోగా అఫిడవిట్ సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి (శుక్రవారం) వాయిదా వేసింది. (పదో తరగతి పరీక్షలపై హైకోర్టులో విచారణ) ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు.. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల సమస్యలపై హైకోర్టు విచారణ చేపట్టింది. రిజర్వాయర్ నిర్మాణంలో ముంపుకు గురవుతున్న ఏటిగడ్డ కిస్తాపూర్ గ్రామం ఖాళీ విషయంపై గురువారం వాడీవేడి వాదనలు జరిగాయి. భూ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించకుండా ఇళ్లను ఖాళీ చేయించడం సరైనది కాదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు చెల్లించిన నష్టపరిహారాలపై పూర్తిస్థాయిలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే తదుపరి తీర్పు వెలువరించే వరకు గ్రామాన్నిఖాళీ చేయించొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. -
చెరువులు నింపి అలుగులు పారిస్తుంటే..
సాక్షి సిద్దిపేట: గోదావరి నీటితో తెలంగాణ వ్యాప్తంగా చెరువులు నింపి అలుగులు పారిస్తుంటే.. కాంగ్రెస్ నేతలకు కళ్లు కనపడటం లేవా అని ఆర్థిక మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు నీరు రాలేదనడం సిగ్గుచేటని అన్నారు. ఆయన దుబ్బాకకు మంగళవారం సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరువు, వలసలు, ఆత్మహత్యలకు నిలయంగా ఉన్న దుబ్బాక ప్రాంతానికి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో సాగు, తాగునీరు అందడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల పోరాట ఫలితంగా దుబ్బాకకు సాగునీరు వచ్చిందని పేర్కొన్నారు. కెనాల్ ప్యాకేజీ 12 ద్వారా లక్షా 25 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. -
కాళేశ్వరంలో ‘మేఘా’ పవర్!
సాక్షి, హైదరాబాద్: లక్షలాది ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల్లోని కీలకమైన పనులను రికార్డు సమయంలో పూర్తి చేసిన ఘనత మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) దక్కించుకుంది. ప్రాజెక్టులోని అత్యధిక పంపింగ్ కేంద్రాలను త్వరితగతిన పూర్తి చేసి ఎంఈఐఎల్ మరోమారు తన ఇంజనీరింగ్ శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాన్ని చాటుకుంది. మొత్తం ప్రాజెక్టులో 4,680 మెగావాట్ల సామర్థ్యంతో పంపులు, మోటార్లు ఏర్పా టు చేస్తుండగా, ఇందులో 3,840 మెగావాట్ల సామర్థ్యం గల పంపులు, మోటార్ల పనులను చేపట్టిన ఎంఈఐఎల్.. అతి తక్కువ సమయంలోనే 3,767 మెగా వాట్ల పంపింగ్ కేంద్రాలను పూర్తి చేసి సరికొత్త అద్భుతాన్ని ఆవిష్కరించింది. ‘కొండ పోచమ్మ’తో కీర్తి శిఖరాలకు.. కాళేశ్వరంలోని మొత్తం 22 పంపింగ్ కేంద్రాల్లో 96 పంపులు, మోటార్లను 4,680 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తుండగా.. అందులో 15 పంపింగ్ కేంద్రాల్లో 89 పంపులు, మోటార్లను 3,840 మెగావాట్ల సామర్థ్యంతో మేఘా సంస్థ నిర్మిస్తోంది. ఇక రోజుకు 2 టీఎంసీల నీటిని పంప్ చేసే విధంగా మేఘా సంస్థ నిర్మించిన కేంద్రాల్లో 9 వినియోగంలోకి వచ్చాయి. మరో 4 పంపింగ్ కేంద్రాలు సిద్ధంగా ఉండగా, మరో రెండు పంపింగ్ కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ పనులు ప్రారంభించిన మూడేళ్లలోనే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి మొదటి దశలోని లక్ష్మి (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం), పార్వతి (సుందిళ్ల) పంపింగ్ కేంద్రాలు, ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు రెండో దశ ఎత్తిపోతలో గాయత్రి (ప్యాకేజీ–8), నాలుగో దశలో మిడ్‌మానేరు నుంచి కొండ పోచమ్మ సాగర్ వరకు అన్నపూర్ణ (ప్యాకేజీ–10), రంగనాయక సాగర్ (ప్యాకేజీ–11), మల్లన్నసాగర్ (ప్యాకేజీ –12) కేంద్రాలను సంస్థ వినియోగంలోకి తేగా.. శుక్రవారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆరంభించిన అక్కారం, మర్కూక్ (ప్యాకేజీ–14) మోటార్లతో సంస్థ వినియోగంలోకి తెచ్చిన పంపుల సామర్థ్యం 3,767 మెగావాట్లకు చేరింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ సంస్థలు బీహెచ్ఈఎల్, ఆండ్రిజ్, జైలం, ఏబీబీ, క్రాంప్టన్ గ్రేవ్స్, వెగ్ లాంటి సంస్థలు ఈ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాయి. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌కు నీటిని పంపింగ్ చేయడంలో ఎంఈఐఎల్ కీలక పాత్ర పోషించి కీర్తి దక్కించుకుంది. అమెరికాలోని కొలరాడోలో మాత్రమే భారీ ఎత్తిపోతల పథకం ఉండగా, ఆ తర్వాత లిబియాలోని గ్రేట్ మ్యాన్‌మేడ్ రివర్ రూపుదిద్దుకుంది. వీటన్నింటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోని హంద్రీ–నీవా ఎత్తిపోతల పథ కం పెదద్ది కాగా ఆ పథకంతో పోలిక లేని స్థాయిలో భారీ బహుళ తాగు, సాగు నీటి పథకంగా ప్రస్తుతం కాళేశ్వరం ప్రపంచా న్ని ఆకర్షిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం 4,680 మెగావాట్ల విద్యుత్ అవసరముండగా, ఇందులో అత్యధికంగా 3,840 మెగావాట్ల విద్యుత్ వ్యవస్థను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. మొత్తం 7 ఈశాన్య రాష్ట్రాల విద్యుత్ సరఫరా సా మర్థ్యం 3,916 మెగావాట్లైతే కాళేశ్వరంలో ఎంఈఐఎల్ ఏర్పాటు చేసిన విద్యుత్ వ్యవస్థకు దాదాపు సమానంగా ఉంది. సీఎం పట్టుదలతోనే.. ‘ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టులో పాలుపంచుకోవడం మేఘా ఇంజనీరింగ్ అదృష్టం. తెలంగాణ ప్రజల నీటి కలను తీర్చేందుకు, బీడు భూములను సస్యశ్యామ లం చేసేందుకు ప్రపంచంలో అత్యు త్తమ ఇంజనీరింగ్ సంస్థలతో కలసి పనిచేయడం, అత్యాధునిక టెక్నాలజీతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం మాకు లభించిన జీవితకాలపు గౌరవంగా భావిస్తున్నాం. సీఎం చంద్రశేఖర్‌రావు పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, నేరుగా యంత్రాంగంతో ప్రతీ అంశం చర్చించి ప్రోత్సహించడం వల్లనే ఇంత తక్కువ కాలంలో ప్రాజెక్టు పూర్తి చేయగలిగాం..’ – బి.శ్రీనివాస్‌రెడ్డి, ఎంఈఐఎల్ డైరెక్టర్ -
ఉద్యమ లక్ష్యం నెరవేరుతోంది
సాక్షి, సిద్దిపేట : రాష్ట్ర చరిత్రలో ఉజ్వల ఘట్టం ఇది. తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం. తలాపున పారుతున్న గోదావరి.. మన చేలు, మన బతుకు ఎడారి అని పాటలు పాడుకున్నాం. ఇప్పుడు గోదావరి జలాలు తెలంగాణలోని ఎత్తైన ప్రాంతం కొండపోచమ్మ రిజర్వాయర్‌లో ఎత్తిపోశాం. ఇక ఈ ప్రాంతం సాగునీటి కష్టాలు తీరినట్టే. ఇలా ఉద్యమ లక్ష్యాలను ఒకొక్కటిగా నెరవేర్చుకుంటూ పరాయి పాలనలో ఆగమైన తెలంగాణలో అద్భుత ఫలితాలు సాధిస్తూ ముందుకు వెళ్తున్నాం’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను చినజీయర్ స్వామితో కలసి విడుదల చేసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... నిర్వాసితులకు ఇళ్లు, ఉపాధి.. ప్రాజెక్టులు కడితే సాగునీరు వస్తుంది. ఇదే సందర్భంలో గ్రామాలు, భూములు కోల్పోవాల్సి వచ్చింది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి త్యాగానికి వెలకట్టలేం. వారికి ప్రభుత్వం మంచి ప్యాకేజీలు ఇచ్చింది. అయినా వారు గూడులేని పక్షులుగా మారిపోయారు. ఇలా త్యాగం చేసిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కార్పొరేట్‌కు దీటుగా వారికి ఇళ్లు కట్టిస్తున్నాం. అదేవిధంగా వారికి ఉపాధి కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. వారి కోసం నూతనంగా ఏర్పాటు చేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తాం. ఆరేళ్లలోనే పురోగతి... పరాయి పాలనలో ఆగమైన తెలంగాణ... స్వరాష్ట్రం సాధించిన ఆరు సంవత్సరాల్లోనే అద్భుత ఫలితాలు సాధిస్తూ ముందుకెళ్తోంది. గతంలో కరెంట్ కోతలు, నీటి కష్టాలు ఉండేవి. ఇప్పుడు నిరంతర విద్యుత్ సరఫరా అందుతోంది. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు అందిస్తున్నాం. ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, రైతు బీమాను అమలు చేస్తున్నాం. రైతులకు రుణమాఫీ కూడా అమలు చేస్తున్నాం. ఇందుకోసం ఈ ఏడాది రూ. 1,300 కోట్లు విడుదల చేశాం. అదేవిధంగా ఆసరా పెన్షన్లు, వికలాంగులకు నెలకు రూ. 3 వేలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమే. సంక్షేమ రంగంలోనూ అనేక మార్పులు తీసుకొచ్చాం. 53 లక్షల టన్నుల ధాన్యం సేకరణ ఒకప్పుడు కరువు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు« ధాన్య రాసులకు నిలయంగా మారింది. దేశం మొత్తంమీద 83 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే ఒక్క తెలంగాణ నుంచే 53 లక్షల టన్నుల ధాన్యం సేకరించడం మనం సాధించిన ప్రగతికి నిదర్శనం. ఈ విషయం నేను చెప్పేది కాదు.. ఎఫ్‌సీఐ సీఎండీ వీవీ ప్రసాద్ చెప్పిన మాటలివి. సాగునీటి ఇబ్బందులు తీర్చుకునేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నాం. 35 టీఎంసీల సామర్థ్యంతో సీతారామ, 7.5 టీఎంసీల సామర్థ్యంతో సమ్మక్క–సారక్క, గౌరవెల్లి, గండిపల్లి మొదలైన ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ బంగారు పంటలు, భాగ్యరాసులు, పసిడి పంటలు పండే తెలంగాణగా విరజిల్లనున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బ్యారేజీల్లో 40 టీఎంసీలు, రిజర్వాయర్ల ద్వారా 125 టీఎంసీలు మొత్తం 165 టీఎంసీలను నిల్వ చేసుకుంటున్నాం. అదేవిధంగా అన్ని విధాలుగా మొత్తం 530 టీఎంసీల నీటి వినియోగ సామర్థ్యం పొందాం. రంగనాయక సాగర్ ద్వారా ఇప్పటికే చెరువుల్లోకి జలకళ సంతరించుకుంది. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ద్వారా సింగూరు లిఫ్ట్ ఇరిగేషన్‌తో హల్దీ వాగుకు నీటిని విడుదల చేస్తాం. కామారెడ్డి, గుజ్జులు, కాయగల్ ప్రాంతాలకు కూడా సాగునీరు అందిస్తాం. ఇకపై పచ్చటి పొలాల తెలంగాణ... ప్రాజెక్టుల నిర్మాణం ఒక ఎత్తయితే పొరుగు రాష్ట్రాలతో ఒప్పందం కుదుర్చుకోవడం మరో ఎత్తు. ఇటువంటి కీలక సమస్యను అధిగమిస్తూ మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడం రాజనీతిజ్ఞతకు నిదర్శనం. వారిని మెప్పించడమే కాకుండా భూమిపూజకు అక్కడి ముఖ్యమంత్రిని ఆహ్వానించాం. తెలంగాణ అంతా సస్యశ్యామలం చేయాలని నిర్మించిన ప్రాజెక్టు ద్వారా రిజర్వాయర్లతోపాటు రూ. 4 వేల కోట్లతో 1,250 చెక్ డ్యాంలు నిర్మించాం. వ్యవసాయం లాభసాటి చేయాలనే ఆలోచనతో నియంత్రిత సాగు విధానం ప్రవేశపెట్టాం. ఇది నియంత్రిత సాగు మాత్రమే.. నియంతృత్వ సాగు కాదు. ఇంజనీర్లకు సెల్యూట్.. తెలంగాణ వారు అంటే తెలివితక్కువ వారని చులకన చేసేవారు. అటువంటి తెలంగాణ ఇంజనీర్లు ప్రపంచమే అబ్బురపడేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి చూపించారు. ప్రాజెక్టు ప్రారంభంలో విమర్శలు, శాపనార్థాలు పెట్టినవారు కూడా ఇప్పుడు మౌనంగా ఉండేలా చూపించారు. సముద్ర మట్టానికి 88 మీటర్ల ఎత్తులో ఉన్న గోదావరి నుంచి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపొచమ్మ సాగర్‌కు జలాలు ఎత్తిపోసేలా ఆవిష్కరణ చేసి చూపించిన తెలంగాణ ఇంజనీర్లకు సెల్యూట్. ఎత్తిపోతల సలహాదారులు పెంటారెడ్డి, ఇతర ఇంజనీర్ల మేధాశక్తితో దశాబ్దాలుపట్టే ప్రాజెక్టులను కేవలం నాలుగు సంవత్సరాల్లోనే నిర్మించి సత్తా చాటారు. ఇందుకు సహకరించిన కాంట్రాక్టర్లు, ఏజెన్సీలకు ధన్యవాదాలు. అదేవిధంగా 48 డిగ్రీల ఎండలోనూ పనులు చేసిన వలస కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం వందనాలు తెలుపుతోంది. 400 మెగావాట్ల విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం పదేళ్లు పట్టేది. కానీ నాలుగు సంవత్సరాల్లోనే 480 మెగావాట్ల విద్యుత్ వినియోగం కోసం 400 కేవీ సబ్స్టేషన్లు ఆరు, 220 కేవీ సబ్స్టేషన్లు ఏడు, 135 కేవీ సబ్ స్టేషన్లు రెండు నిర్మించారు. ఈ ప్రాజెక్టు కోసం వేగంగా భూసేకరణ చేసిన రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బందికి, ప్రాజెక్టుకు సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసిన విలేకరులకు ధన్యవాదాలు తెలుపుతున్నా. -
ఉవ్వెత్తున గోదారి
సాక్షి, సిద్దిపేట : కరువు నేలను గోదారమ్మ ముద్దాడింది. సముద్రమట్టానికి 88 మీటర్ల ఎత్తులో మేడిగడ్డ వద్ద ప్రవహించే గోదావరి 618 మీటర్ల ఎత్తులో ఉన్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోకి ఎగిరి దుంకింది. మేడిగడ్డ నుంచి పది లిప్టుల ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసే అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. త్రిదండి చినజీయర్ స్వామితో కలసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం మర్కూక్ పంప్‌హౌస్ వద్ద రెండు మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. మోటార్లను ఆన్ చేసిన 10 నిమిషాల్లోనే గోదావరి ఉత్తుంగ జలవాహినిలా కొండపోచమ్మ రిజ ర్వాయర్‌లోకి ప్రవహించింది. పంప్‌హౌస్ నుంచి రిజర్వాయర్ వద్దకు వచ్చిన సీఎం దంపతులు, చినజీయర్ స్వామి, మంత్రులు, ఇరిగేషన్ అధికారులు గోదావరి నీటికి స్వాగతం పలికారు. కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమలు, నవధాన్యాలు, పూలు, పండ్లను నీటి ప్రవాహంలో వేసి గోదారమ్మకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మం త్రులు తన్నీరు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కూర రఘోత్తంరెడ్డి, ఫారూక్ హుస్సేన్, బి. వెంకటేశ్వర్లు, శేరి శుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సొలిపేట రామలింగారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, సతీష్‌కుమార్, మదన్‌రెడ్డి, రసమయి బాలకిషన్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. కొండపోచమ్మ ఆలయంలో తీర్థం స్వీకరిస్తున్న సీఎం కేసీఆర్ దంపతులు పూజలతో కార్యక్రమానికి శ్రీకారం... కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభానికి విచ్చేసిన సీఎం కేసీఆర్ దంపతులు ముందుగా జగదేవ్‌పూర్ మండలం తీగుల్ నర్సాపూర్ మండలంలోని కొండపొచమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం ప్రాంగణంలో శుక్రవారం వేకువజామున 4 గంటలకు చండీయాగం చేపట్టగా కేసీఆర్ దంపతులు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు మర్కూక్, ఎర్రవెల్లి గ్రామాల్లోని రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం వరదరాజుపూర్లోని వరదరాజుల స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండపోచమ్మ ఆలయంలో నిర్వహించిన చండీయాగంలో పూజలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు చినజీయర్ స్వామితో కలిసి.. ఏ కార్యక్రమం చేపట్టినా యజ్ఞ, యాగాలు నిర్వహించే ఆనవాయితీ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్... కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభానికి ముందు కూడా మర్కూక్ పంప్‌హౌస్ వద్ద సుదర్శన యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న సీఎం దంపతులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు చినజీయర్‌కు స్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య సుదర్శన యాగం నిర్వహించారు. యాగం పూర్తయ్యాక అక్కడికి వచ్చిన వారందరికీ చినజీయర్ స్వామి ఆశీర్వచనాలు అందజేశారు. అక్కడి నుంచి నేరుగా పంప్‌హౌస్ వద్దకు చినజీయర్ స్వామితో కలసి సీఎం కేసీఆర్ వెళ్లి పంప్‌హౌస్‌లోని రెండు మోటార్లను స్విచ్ ఆన్ చేసి కొండపొచమ్మ రిజర్వాయర్‌లోకి గోదావరి జాలలను వదిలారు. శుక్రవారం కొండపోచమ్మ ఆలయం వద్ద నిర్వహించిన చండీయాగంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు. చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు సతాయించిన రెండో మోటార్ మర్కూక్, జగదేవ్‌పూర్ (గజ్వేల్): కొండపోచమ్మసాగర్ పంప్‌హౌస్ ప్రారంభంలో రెండో మోటార్ కొంతసేపు సతాయించింది. పంప్‌హౌస్‌లోని రెండు మోటార్లను ప్రారంభించేందుకు మర్కూక్ కట్టపైకి సీఎం కేసీఆర్ చేరుకొని మోటార్లను స్విచ్ ఆన్ చేయగా మొదటి మోటార్ వెంటనే ప్రారంభమైంది. కానీ సాంకేతిక కారణాలతో రెండో మోటార్ ఆన్ కాలేదు. దాన్ని రిపేర్ చేసేందుకు కొంత సమయం పడుతుందని అధికారులు చెప్పడంతో కేసీఆర్, మంత్రులు అక్కడి నుంచి వరదరాజుపూర్లోని వరదరాజస్వామి దేవాలయానికి వెళ్లారు. అరగంట తర్వాత మోటార్‌ను బాగు చేశాక సీఎం కేసీఆర్ తిరిగి పంప్‌హౌస్ వద్దకు చేరుకొని రెండో మోటార్‌ను ప్రారంభించారు. మర్కూక్ పంప్‌హౌస్ వద్ద నిర్వహించిన సుదర్శన యాగంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు, చినజీయర్‌స్వామి తదితరులు సుదర్శనయాగంలో నవ దంపతులు మర్కూక్ (గజ్వేల్): కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభానికి ముందు మర్కూక్ పంప్‌హౌస్ వద్ద నిర్వహించిన సుదర్శనయాగంలో పాల్గొనే అదృష్టం మర్కూక్ మండల ఎంపీపీ తాండ పాండుగౌడ్ నూత న దంపతులకు లభించింది. పాండుగౌడ్‌కు ఈ నెల 27న మెదక్ జిల్లా మనోహరాబాద్‌కు చెందిన మేఘనతో వివా హం జరగ్గా పెళ్ల యిన రెండో రో జే అంటే శుక్రవా రం సీఎం కేసీఆర్ సూచనల మేరకు సుదర్శనయాగంలో నూ తన దంపతులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దంపతులతో కలసి ఈ అరుదైన ఘట్టంలో పాలుపంచుకున్నారు. అలాగే త్రి దండి చినజీయర్‌స్వామి నుంచి ఆశీర్వాదాలు తీసుకు న్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా పాండు గౌడ్ దంపతులను మా ఎంపీపీ దంపతులు అంటూ పరిచయం చేయడంతో వారు ఉప్పొంగిపోయారు. కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవంలో తమకు అవకాశం దక్కడాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. -
‘కొండ’నెక్కిన గోదారి గంగమ్మ!
-
కష్టాల పాటల నుంచి పసిడి పంటలవైపు..
-
రైతులకు అతి త్వరలోనే అతిపెద్ద తీపి కబురు
-
వారం రోజుల్లోనే పెద్ద తీపి కబురు చెప్తా: కేసీఆర్
సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం బహుళ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రైతులకు వారం రోజుల్లోనే పెద్ద తీపికబురు చెబుతానని ప్రకటించారు. భారత్‌లో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి పనిని తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం చేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజక్టు కోసం భూములు ఇచ్చినవారి త్యాగాలు వెలకట్టలేనివని సీఎం పేర్కొన్నారు. భూములు కోల్పోయినవారందరికీ పునరావాసం కల్పించామని గుర్తు చేశారు. ఏ ప్రభుత్వం కూడా ఇంత త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేయలేదని ఆయన స్పష్టం చేశారు. లక్షలాది ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు వచ్చాయని అన్నారు. నిర్వాసితుల త్యాగాల వల్లే ఇది సాధ్యమైందన్నారు. (చదవండి: కేసీఆర్ పేరుకు కొత్త నిర్వచనం.. ) కష్టాల పాటల నుంచి పసిడి పంటలవైపు.. తెలంగాణ చరిత్రలో కొండపోచమ్మ సాగర్ ప్రారంభం ఉజ్వల ఘట్టమని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఏ లక్ష్యంతో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించామో ఆ కల సంపూర్ణంగా, సాదృశ్యంగా సాకారమైందని ఆనందం వ్యక్తం చేశారు. కొండపోచమ్మ సాగర్ అపురూపమైన ప్రాజెక్టు అని సీఎం వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల్లోనే దుమ్ముగూడెం దగ్గర సీతమ్మసాగర్, దేవాదుల ప్రాజెక్టు కోసం సమ్మక్క సాగర్ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. హుస్నాబాద్ దగ్గర గౌరవెళ్లి, గండిపెల్లి ప్రాజెక్టు కూడా త్వరలో నిర్మాణం పూర్తి చేసుకుంటుందన్నారు. దేశంలోనే అత్యధికంగా వరి సేకరించిన రాష్ట్రంగా తెలంగాణ పేరుతెచ్చుకుందని హర్షం వ్యక్తం చేశారు. ఆరేళ్ల క్రితం కష్టాల పాటలు పాడుకున్న తెలంగాణ ఇప్పుడు పసిడి పంటల రాష్ట్రంగా మారిందని కేసీఆర్ వెల్లడించారు. (చదవండి: తెలంగాణ సాగునీటి కల సాకారం) -
కేసీఆర్ పేరుకు కొత్త నిర్వచనం..
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుకు ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ కొత్త నిర్వచనం చెప్పారు. తెలంగాణలో కోటి ఎకరాల మాగాణికి నీరందించడమే లక్ష్యంగా.. కేసీఆర్ అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజక్ట్‌లో భాగమైన కొండపోచమ్మ రిజర్వాయర్(మర్కూక్) పంప్‌హౌస్‌ను కేసీఆర్ ప్రారంభించారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్ధ సాధక ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని దేశంలోనే యువ రాష్ట్రమైన తెలంగాణ కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసిందని తెలిపారు. కేసీఆర్.. తన పేరును K-కాల్వలు, C-చెరువులు, R-రిజర్వాయర్లు సార్థకం చేసుకున్నారని అన్నారు. తెలంగాణలో కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయనే ఉద్దేశంతో కేటీఆర్ ఈ విధంగా స్పందించారు.(చదవండి : కొండపోచమ్మకు గోదావరి జలాలు..) మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ వరకు, సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తు వరకు నీటిని చేరవేశామని కేటీఆర్ తెలిపారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ద్వారా 2.8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా.. త్వరలోనే కేశవపురం రిజర్వాయర్ ద్వారా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. దూరదృష్టితో భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులు నిర్మిస్తున్న కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.(చదవండి : కొండపోచమ్మ ఆలయంలో కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు) K కాల్వలు C చెరువులు R రిజర్వాయర్లు పేరు సార్థకం కాగా...🙏 మేడిగడ్డ నుండి కొండపోచమ్మ వరకు... 82 మీటర్ల ఎత్తు నుండి 618 మీటర్ల ఎత్తు వరకు 🙏 World’s largest multi-stage lift irrigation project 💪 completed in 3 years by India’s youngest state #Telangana #KaleshwaramProject pic.twitter.com/IQcoi46xSX — KTR (@KTRTRS) May 29, 2020 -
కొండపోచమ్మకు గోదావరి జలాలు..
-
కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం
సాక్షి, సిద్ధిపేట : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలమైన దశకు శుక్రవారం అంకురార్పణ జరిగింది. కొండపోచమ్మ సాగర్ పంపుహౌస్‌ను(మర్కూక్) సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభించారు. చినజీయర్ స్వామితో కలిసి ఆయన మోటార్ ఆన్ చేశారు. దీంతో కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కాయి. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తున నిర్మించిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడం ద్వారా రాష్ట్రం కొత్త చరిత్రని లిఖించినట్టయింది. 15 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్ ద్వారా 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. (చదవండి : కొండపోచమ్మ ఆలయంలో కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు) అంతకుముందు శుక్రవారం తెల్లవారుజాము నుంచే కొండపోచమ్మ దేవాలయంలో చండీయాగం, మర్కూక్ వద్ద సుదర్శన యాగం ప్రారంభం అయ్యాయి. ఉదయం 7 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు కొండపోచమ్మ దేవాలయంలో చండీయాగంలో భాగంగా నిర్వహించిన పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న కేసీఆర్ ఎర్రవల్లి, మర్కూక్ గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మర్కూక్ వద్ద నిర్వహించిన సుదర్శన యాగం పుర్ణాహుతిలో కేసీఆర్, చినజీయర్ స్వామి పాల్గొన్నారు. -
గోదావరి జలాల ఎత్తిపోతలకు సర్వం సిద్ధం
-
కొండంత సంబురం నేడే
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రానికి వరప్రదాయిని అయిన కాళేశ్వ రం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన దశకు శుక్రవారం అంకురార్పణ జరుగనుంది. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తున నిర్మించిన కొండపోచమ్మసాగర్రిజర్వాయర్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడం ద్వారా రాష్ట్రం కొత్త చరిత్ర ను లిఖించనుంది. ఈ చరిత్రా త్మక కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు కొండపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు, చండీయాగం, సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఉదయం నుంచే పూజలు.. శుక్రవారం ఉదయం 4.30 గంటల నుంచే ఏక కాలంలో కొండపోచమ్మ దేవాలయంలో చండీయాగం, కొండపోచమ్మ సాగర్ పంపుహౌస్ (మర్కూక్) వద్ద సుదర్శన యాగం ప్రారంభం కానున్నాయి. ఉదయం 7 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రాజెక్టు నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని కొండపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చండీ యాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో పాల్గొని తీర్థ ప్రసాదాలు, వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకొని ఉదయం 9 గంటల తర్వాత ఎర్రవల్లి, మర్కూక్ గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం మర్కూక్ వద్ద గల కొండపోచమ్మసాగర్‌కు నీటిని ఎత్తిపోసే పంప్‌హౌస్ వద్దకు చేరుకుంటారు. 10 గంటల సమయంలో పంప్‌హౌస్ వద్దకు చేరుకొనే చినజీయర్ స్వామికి కేసీఆర్ స్వాగతం పలుకుతారు. అక్కడ నిర్వహించే సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. అనంతరం 11.30 గంటలకు పంప్‌హౌస్‌లలోని రెండు మోటార్లను ఆన్ చేసి గోదావరి ఎత్తిపోతలకు కేసీఆర్ శ్రీకారం చుడతారు. అక్కడి నుంచి 11.35 గంటలకు ప్రాజెక్టు డిశ్చార్జి కెనాల్ వద్దకు చేరుకొని గోదా వరి జలాలకు పూలతో స్వాగతం పలుకుతారు. గోదావరి జలాలకు పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి వరదరాజుపూర్ గ్రామంలోని వరదరాజేశ్వరస్వామి దేవాలయానికి వెళ్తారు. అక్కడ పూజల అనంతరం 12.40 గంటలకు వరదరాజుపూర్ నుంచి మర్కూక్ పంప్‌హౌస్‌కు చేరుకొని అధికారులు, ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు. ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ కీలకపాత్ర... కాళేశ్వరంలోని మేడిగడ్డ నుంచి సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌కు గోదావరి జలాల తరలింపులో ముగ్గురి పాత్ర అత్యంత కీలకంగా ఉంది. అందులో మొదటి వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. తన సొంత నియోజకవర్గానికి నీళ్లు తెచ్చే లక్ష్యంతో పాత డిజైన్‌లో కేవలం ఒక టీఎంసీ సామర్థ్యమున్న ఈ రిజర్వాయర్‌ను 21 టీఎంసీలకు పెంచాలని నిర్ణయించారు. అయితే రిజర్వాయర్ కింద భారీగా ముంపు, భూసేకరణ అధికంగా ఉండటంతో మళ్లీ దాన్ని 15 టీఎంసీలకు కుదించారు. అయినప్పటికీ భూసేకరణ సమస్యలు, ఆర్ అండ్ ఆర్ సమస్యలు తలెత్తడంతో స్వయంగా జోక్యం చేసుకొని వాటిని పరిష్కరించారు. ఎప్పటికప్పుడు వివిధ విభాగాలను సమన్వయం చేస్తూ వచ్చారు. మంత్రి హరీశ్ సహకారం.. సీఎం ఆదేశాల మేరకు త్వరితగతిన 4,600 ఎకరాల భూసేకరణ జరిగేలా నాటి నీటిపారుదలశాఖ మంత్రి, ప్రస్తుత ఆర్థిక మంత్రి టి. హరీశ్‌రావు కృషి చేశారు. భూసేకరణపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్, ఆర్డీఓతోపాటు ప్రాజెక్టు ఇంజనీర్లకు సూచనలు చేస్తూ పంప్‌హౌస్, రిజర్వాయర్, కాల్వల పనులను పూర్తి చేయించారు. కొండపోచమ్మసాగర్‌కు ఎగువన ఉండే రంగనాయక్‌సాగర్ రిజర్వాయర్ కింద కాల్వల పనులను వేగంగా పూర్తి చేయించిన ఘనత ఆయనకే దక్కింది. ఈఎన్సీ హరిరామ్ సాంకేతిక సమన్వయం.. మిడ్‌మానేరుకు కా>ళేశ్వరం జలాలు చేరిన తర్వాత నుంచి రంగనాయక్‌సాగర్ వరకు నీటిని చేర్చడంలో ఈఎన్సీ హరిరామ్ అత్యంత కీలకంగా వ్యవహరించారు. అనంతగిరి, కొండపోచమ్మ కింద ముంపు గ్రామాల కోర్టు వ్యవహారాలను సమన్వయం చేయడం, 5 పంప్‌హౌస్‌లలో మోటార్ల బిగింపు, సమస్యల్లేకుండా నీటి ఎత్తిపోతలు, కాల్వలకు నీటి విడుదల కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, కొండపోచమ్మ ఎస్ఈ వేణు సైతం కీలకపాత్ర పోషించారు. అలాగే పంప్‌హౌస్ పనులను చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ సైతం పంపులు, మోటార్లను తక్కువ కాలంలోనే ఏర్పాటు చేయడం, అవి పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా సిద్ధం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించింది. మర్కూక్ పంప్‌హౌస్‌లోని 34 మెగావాట్ల సామర్థ్యంగల 6 మోటార్లను తక్కువ కాలంలోనే మేఘా సంస్థ సిద్ధం చేసింది. -
అడుగు దూరంలో కొత్త చరిత్ర...
-
కొండపైకి గోదారి..
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కారానికి ముహూర్తం ఖరారైంది. రాష్ట్రంలోనే సముద్రమట్టానికి అత్యధిక ఎత్తున నిర్మిస్తున్న కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోతలకు ఈ నెల 29న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శ్రీకారం చుట్టనున్నారు. 29న ఉదయం 11.30 గంటలకు త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్‌స్వామి పూజ, ఆశీర్వచనాల మధ్య మర్కూక్ పంప్‌హౌస్‌లో మోటార్లను ఆన్ చేయడం ద్వారా రిజర్వాయర్‌లోకి ఎత్తిపోతలను సీఎం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రెండ్రోజులే ఉండటంతో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్‌లు ఏర్పాట్లను వేగవంతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. గ్రావిటీ ద్వారా గోదావరి జలాల ప్రవాహాన్ని పరిశీలించిన హరీశ్‌రావు మర్కూక్ పంపుహౌస్ చూశారు. పంపుహౌస్ నుంచి గోదావరి జలాలను విడుదల చేసేందుకు సాంకేతిక అంశాలను నీటి పారుదల శాఖ ఎస్సీ వేణు, డీఈ మధులను అడిగి తెలుసుకున్నారు. భద్రతా, తదితర ఏర్పాట్లను కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, జిల్లా సీపీ జోయల్ డేవిస్ ఇతర అధికారులు పరిశీలించారు. అడుగు దూరంలో కొత్త చరిత్ర... కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు వానాకాలంలోనే నీటిని తరలించిన ప్రభుత్వం.. గత రెండు నెలలుగా నాలుగో దశలో మిడ్‌మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్ మీదుగా రంగనాయక్‌సాగర్ రిజర్వాయర్ వరకు అటు నుంచి మల్కాపూర్, అక్కారం, మర్కూక్ పంప్‌హౌస్‌ల మీదుగా సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో నిర్మించిన కొండపోచమ్మసాగర్‌లోకి నీటిని ఎత్తిపోసేందుకు సమాయత్తమైంది. 15 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన ఈ రిజర్వాయర్ పనులు గతంలోనే పూర్తవగా ఇందులోకి నీటిని తరలించే అక్కారం, మర్కూక్ పంప్‌హౌస్ పనులను ఇటీవలే పూర్తి చేశారు. కొండపోచమ్మసాగర్‌లోకి నీటిని తరలించేలా మర్కూక్ పంప్‌హౌస్‌లో 34 మెగావాట్ల సామర్థ్యంగల 6 పంపులను సిద్ధం చేశారు. ఇందులో రెండు పంపులను సీఎం కేసీఆర్ 29న ఆన్ చేసి నీటిని రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటిని మేడిగడ్డ బ్యారేజీలో 88 మీటర్ల బెడ్‌లెవల్ నుంచి తీసుకుంటున్నారు. ఈ నీటిని మొత్తంగా 10 స్టేజీల ఎత్తిపోతల ద్వారా 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మసాగర్‌కు తరలిస్తే 530 మీటర్ల ఎత్తుకు నీటిని తరలించినట్టవుతుంది. ప్రపంచంలో బహుళ దశల్లో నీటిని ఎత్తిపోయడం ఇదే మొదలని, ఈ అద్భుతం ఆవిష్కారం అయ్యేందుకు కేవలం అడుగు దూరంలో ఉన్నామని నీటిపారుదల ఇంజనీర్లు పేర్కొంటున్నారు. మేడిగడ్డ నుంచి 200 కి.మీ. దూరంలోని కొండపోచమ్మసాగర్‌కు నీరు చేరడం కొత్త చరిత్రేనని అంటున్నారు. ప్రస్తుతం మిడ్‌మానేరులో లభ్యతగా ఉన్న నీటిని ఎత్తిపోస్తూ కొండపోచమ్మసాగర్‌లోకి కనీసం 2–3 టీఎంసీలను ఎత్తిపోసే అవకాశం ఉంది. అనంతరం వానాకాలంలో పూర్తిస్థాయిలో జరిగే ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్ నింపనున్నారు. ఈ వానాకాలంలోనే గజ్వేల్, దుబ్బాక, భువనగిరి, నర్సాపూర్, మెదక్, సంగారెడ్డి, పటన్‌చెరు, మల్కాజిగిరి నియోజకవర్గాల పరిధిలో 26 మండలాల్లోని గ్రామాలకు 8 ప్రధాన కాల్వల ద్వారా గోదావరి జలాలను మళ్లించే అవకాశాలున్నాయి. దీనికింద 2.85 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా కనీసం సగం ఆయకట్టుకు నీరిందించేలా చర్యలు తీసుకుంటున్నారు. దక్షిణ తెలంగాణకు కొండంత అండ... గోదావరి నీటిని కరువుపీడిత ప్రాంతాలైన కృష్ణా బేసిన్‌లోని ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే కొండపోచమ్మసాగర్ నుంచి నల్లగొండ జిల్లాలో గంధమల, బస్వాపూర్‌లకు నీటిని తరలించేలా ఇప్పటికే పనులు చేస్తోంది. కొండపోచమ్మసాగర్ నుంచే గంధమల మీదుగా 11.39 టీఎంసీల సామర్థ్యంగల బస్వాపూర్ రిజర్వాయర్‌కు నీటిని తరలించి అక్కడి నుంచి పాలమూరు–రంగారెడ్డి, డిండి ఆయకట్టులకు నీటిని అందిచేలా ఇప్పటికే కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది. బస్వాపూర్ నుంచి హైలెవల్ కెనాల్ ద్వారా 45 కి.మీ. దూరంలోని చండూరు మండలం తుమ్మలపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్‌కు అటునుంచి ఇబ్రహీంపట్నం చెరువు మీదుగా పాలమూరు–రంగారెడ్డిలోని ఉద్దండాపూర్ రిజర్వాయర్‌కు తరలించేలా ఇప్పటికే ప్రతిపాదన సిద్ధం చేశారు. బస్వాపూర్ నుంచి రోజుకు 2 వేల క్యూసెక్కులను 120 రోజులపాటు తరలించగలిగినా 21 టీఎంసీలను ఉద్దండాపూర్‌కు తరలించే అవకాశం ఉంటుందని, దీనికి రూ. 5 వేల కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇదే బస్వాపూర్ నుంచి డిండి ఎత్తిపోతలలో నిర్మిస్తున్న శివన్నగూడెం రిజర్వాయర్‌కు గోదావరి జలాలను తరలించవచ్చని తేల్చారు. బస్వాపూర్, శివన్నగూడెం మధ్య దూరం 50 కిలోమీటర్లేనని, ఈ నీటి తరలింపుతో డిండి ఎత్తిపోతల కింద ఉన్న 3.41 లక్షల ఎకరాలతోపాటు అదనంగా యాదాద్రి జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని చెబుతున్నారు. ఇక కొండపోచమ్మసాగర్ నుంచి గోదావరి జలాలను గ్రావిటీ ద్వారా తరలించి హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చేలా కేశవాపూర్ రిజర్వాయర్‌కు ఇప్పటికే అనుమతులిచ్చారు. కొండపోచమ్మసాగర్ మీదుగా కేశవాపూర్ రిజర్వాయర్‌కు మూడు వరుసల గ్రావిటీ పైపులైన్ల ద్వారా నీటిని తరలించేలా త్వరలో పనులు చేపట్టనున్నారు. కొండపోచమ్మసాగర్ నుంచి సింగూరుకు నీటిని తరలించే సంగారెడ్డి కాల్వ నుంచి ఉస్మాన్‌సాగర్‌కు నీటిని తరలించేలా మరో ప్రణాళిక ఉంది. సంగారెడ్డి కాల్వ 27వ కి.మీ. వద్ద స్లూయిస్ నిర్మాణం చేసి అటునుంచి ప్రత్యేక పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా 50 కి.మీ. దూరాన ఉండే ఉస్మాన్‌సాగర్‌కు నీటిని తరలించేలా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలన్నీ పట్టాలెక్కితే వాటన్నింటికీ నీటిని అందించే ప్రధాన రిజర్వాయర్ కొండపోచమ్మసాగరే కానుంది. మిడ్‌మానేరు నుంచి కొండపోచమ్మసాగర్ వరకు ఎత్తిపోతల ప్రధానాంశాలు.. -
భాస్కర్.. ఏం నడుస్తుంది? :కేసీఆర్
గజ్వేల్/మర్కూక్ : క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్వయంగా తెలుసుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రానికి చెందిన సర్పంచ్ భాస్కర్, అలాగే చేబర్తి సర్పంచ్ అశోక్‌లతో సీఎం కేసీఆర్ ఫోన్లో సంభాషించారు. ముందుగా మర్కూక్ మండల కేంద్ర సర్పంచ్ భాస్కర్‌తో మాట్లాడారు. మండల అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూనే కొండపోచమ్మ సాగర్ నిర్మాణం తర్వాత ప్రజా స్పందన, ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై మాట్లాడారు. సోమవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో కొద్దిసేపు సీఎంకు, భాస్కర్‌కు మధ్య సంభాషణ సాగిందిలా... సీఎం కేసీఆర్: హలో భాస్కర్... నేను కేసీఆర్‌ను మాట్లాడుతున్న.. మర్కూక్‌లో ఏం నడుస్తుంది..? అభివృద్ధి పనులు ఎట్లున్నయ్.. పనులేమన్న పెండింగ్‌లో ఉన్నాయా..? సర్పంచ్ భాస్కర్: సార్ నమస్కారం.. చాలా వరకు పనులు పూర్తి చేశాం. మర్కూక్ గ్రామ పంచాయతీ మోడల్ భవనం నిర్మాణం కోసం నిధులు కావాలె. సీఎం: భాస్కర్ నువ్వు రందిపడకు.. మర్కూక్‌ను ఆదర్శంగా మార్చుకుందాం. అవసరమైతే మరో రూ.5–6 కోట్ల నిధులు మంజూరు చేస్తా. నువ్ దగ్గరుండి సమస్యలు లేకుండా చూసుకో.. అదే విధంగా రైతు వేదిక నిర్మాణం పనులు రాష్ట్రంలో మొట్టమొదటగా ప్రారంభించుకొని ఆదర్శంగా నిలుద్దాం. ఇందుకు సంబంధించి సర్వే కూడా పూర్తి చేయించిన. సర్పంచ్: సంతోషం సార్. సీఎం: ఇంకా ఏం నడుస్తుంది? సర్పంచ్: సార్... మర్కూక్పై మీరు చూపిస్తున్న ప్రేమకు రుణపడి ఉంటాం. కొండపోచమ్మ సాగర్‌కు నీళ్లొస్తున్నాయని అందరూ సంబరపడిపోతున్నరు. ఎక్కడ చూసినా ఇదే ముచ్చట చెప్పుకుంటున్నరు. సీఎం: సంతోషం.. త్వరలోనే కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకుందాం. ఇందుకు సంబంధించి మర్కూక్‌లో 15 వందల మందికి సరిపడా భోజనాలు ఏర్పాటు చేసుకుందాం.. ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించుకోవడం అవసరం. రైతుల కళ్లలో ఆనందం చూడాలనేదే నా తపన. అంతే కాకుండా మర్కూక్ శివారులోని 14 ఎకరాల్లో పబ్లిక్ పార్కును ఏర్పాటు చేసుకుందాం.. వెంటనే ఆ భూమిని క్లీన్ చేయాలి. సర్పంచ్: సార్.. నేను దగ్గరుండి పనులు మొదలు పెడతా. ప్రతిరోజు గ్రామంలోని వార్డులన్నీ కలియ తిరిగి సమస్యలు లేకుండా చూసుకుంటా సార్.. సీఎం: సరే... కొండపోచమ్మ ప్రారంభోత్సవానికి సంబంధించి భోజనాలు ఏర్పాటు చేసే స్థలం, ఇతర ఏర్పాట్లను దగ్గరుండి చూసుకో. సర్పంచ్: మంచిది సార్... తప్పకుండా ఏర్పాట్లలో నిమగ్నమవుతా. సీఎం కేసీఆర్ తనకు ఫోన్ చేసి గ్రామాభివృద్ధి గురించి ఆరా తీయడంతో సర్పంచ్ భాస్కర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్. ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పుకుంటూ తన సంతోషాన్ని పంచుకున్నాడు. చేబర్తి చెరువులో గోదావరి నీరు నింపుర్రి.. అశోక్.. నేను సీఎంను మాట్లాడుతున్న.. మంగళవారం చేబర్తి చెరువులోకి గోదావరి జలాలు వస్తున్నాయి.. ఏదో ఒక సమయంలో నీరు వదులుతారు.. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో నేను మాట్లాడినా.. మీ ఎంపీపీ పాండుగౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రంతో కలసి అందరూ బ్రహ్మాండంగా చెరువు నింపుర్రి. పూలు, పండ్లు తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి చెరువు, కుంటల్లోకి నీరు వదులుర్రి.. సర్పంచ్ అశోక్: తప్పకుండా అందరితో మాట్లాడుతా.. మా చెరువు కుంటలను నింపుకుంటం సార్.. కృతజ్ఞతలు సార్.. సీఎం: ప్రతాప్‌రెడ్డితో కలసి బ్రçహ్మాం డంగా చెరువులు నింపుకొర్రి సరేనా.. సర్పంచ్: తప్పకుండా సార్.. -
మర్కూక్ గ్రామ సర్పంచ్‌కు కేసీఆర్ ఫోన్!
సాక్షి, సిద్దిపేట: గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్ గ్రామ సర్పంచ్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ఫోన్ చేశారు. గ్రామం ఎలా ఉందంటూ పలకరించారు. త్వరలో ప్రారంభం కానున్న కొండపోచమ్మ సాగర్ గురించి చర్చించారు. 1500 మంది కూర్చునేలా కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేయాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. ప్రాజెక్ట్ నిర్మాణంతో రైతుల కష్టాలు తీరినట్లేనని కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. గోదావరి జలాలు తెలంగాణలోని ప్రతి పల్లెకి చేరాలన్న ధృఢసంకల్పంతో సాగుతున్న పనులు తుది దశకు చేరుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మర్కూక్ పంప్‌హౌజ్ చివరిది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. నాలుగైదు రోజుల్లో ఈ పర్యటన ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌కు చేర్చడం ద్వారా గోదావరి నీటిని అత్యధిక ఎత్తుకు తీసుకెళ్లినట్టవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మర్కూక్ పంప్‌హౌజ్‌లో మోటార్లను ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు సమాచారం. -
వర్షాకాలం నుంచి కాళేశ్వరం మూడో టీఎంసీ
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరంలో మూడో టీఎంసీ ఎత్తిపోసే పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. వచ్చే వర్షాకాలం నుంచి మూడో టీఎంసీని వాడుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టుల పరిధిలోని అన్ని పంపుల నిర్మాణం మే నెలాఖరు నాటికి పూర్తి చేసి కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని పంప్ చేయాలి. మల్లన్న సాగర్ ద్వారా తపాస్‌పల్లి రిజర్వాయర్ నింపి అక్కడి నుంచి మోత్కూరు, అడ్డగూడూరు, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, చిల్పూర్ మండలాలకు నీరందించాలి. ఈ వానాకాలంలో ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో 16,41,284 ఎకరాలకు సాగునీరు అందించాలి. గోదావరిలో ఎగువ నుంచి వచ్చే వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఎస్సారెస్పీని కాళేశ్వరం ద్వారా నింపాలి’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. (17 రోజులు.. 93 రైళ్లు.. 1.18 లక్షల మంది ) గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఈ వర్షాకాలం అవలంబించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటి పంపింగ్ ప్రారంభించిన వెంటనే మొదట ఆయా ప్రాజెక్టుల పరిధిలో గల చెరువులన్నింటినీ నింపాలన్నారు. దీనికోసం ప్రాజెక్టుల కాల్వల నుంచి అవసరమైన తూములు (ఓటీలు), డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. అన్ని ప్రాజెక్టుల వద్ద రివర్ గేజ్‌లు ఏర్పాటు చేయాలని, నీటి నిర్వహణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని రియల్ టైమ్ డేటా ఆపరేటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. రూ. వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సాగునీటి వ్యవహారమంతా ఒకే శాఖ గొడుగు కిందకు రావాలని, ప్రాజెక్టుల భౌగోళిక స్థితిని బట్టి నీటిపారుదల శాఖను పునర్వ్యవస్థీకరించుకోవాలని ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టుకు నిర్వహణ (ఓ అండ్ ఎం) మ్యాన్యువల్ రూపొందించాలన్నారు. నీటిపారుదల శాఖకు చెందిన భూములు, కట్టల ఆక్రమణను తీవ్రంగా పరిగణించాలని ఆదేశించారు. గోదావరి బేసిన్‌లోని ప్రతి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, ఈ వానాకాలంలో ఎంత ఆయకట్టుకు నీరందించగలిగే అవకాశం ఉందన్న అంశాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. మంత్రులు కె. తారక రామారావు, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్, నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. సమీక్షలో సీఎం కేసీఆర్ అధికారులకు జారీ చేసిన ఆదేశాలు, సూచనలు ⇒ వర్షాకాలంలో ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ప్రారంభం కాగానే మొదట అన్ని చెరువులు, కుంటలు నింపాలి. దీనికోసం అవసరమైన ఓటీలను, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను వెంటనే నిర్మించాలి. చెరువులు, కుంటలు ఏడాదంతా నిండి ఉండే వ్యూహం అవలంబించాలి. చెరువులకు నీరు అందించడానికి ఉన్న అడ్డంకులపై చర్చించేందుకు ఆయా జిల్లాల మంత్రులు, అధికారులు 2–3 రోజుల్లోనే సమావేశం కావాలి. ⇒ చెరువులు నింపడం ద్వారా భూగర్భ నీటిమట్టం పెరుగుతుంది. ఫలితంగా బోర్ల ద్వారా కూడా వ్యవసాయం సాగుతుంది. ⇒ చెరువుల నుంచి రైతులు స్వచ్ఛందంగా మట్టిని తీసుకెళ్లడానికి అవకాశం ఇవ్వాలి. అధికారులు రైతులపై ఆంక్షలు పెట్టరాదు. ⇒ ఎల్ఎండీ నుంచి దిగువకు నీరందించడానికి ప్రస్తుతమున్న కాలువ కేవలం 6 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో ఉంది. దీని సామర్థ్యాన్ని 9 వేల క్యూసెక్కులకు పెంచాలి. ప్రస్తుతమున్న కాల్వ సామర్థ్యం పెంచడమా లేక సమాంతరంగా మరో కాలువ నిర్మించాలా అనే విషయాన్ని ఈఎన్సీల కమిటీ తేల్చాలి. ⇒ తోటపల్లి కాలువ ద్వారా 77 వేల ఎకరాలకు నీరందించాలి. ⇒ గౌరవల్లి లిఫ్టు పనులను వెంటనే పూర్తి చేసి ఈ సీజన్లోనే నీళ్లు అందించాలి. ⇒ దేవాదుల ప్రాజెక్టు ద్వారా వరంగల్ జిల్లాలోని అన్ని చెరువులు నింపాలి. సమ్మక్క బ్యారేజీ పనులను వేగవంతం చేయాలి. దేవాదుల ప్రాజెక్టు ద్వారా 365 రోజులూ నీటిని లిఫ్టు చేయాలి. ⇒ వరద కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలి. వరద కాలువలపై ఓటీల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. ⇒ జగిత్యాల జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని ముక్కట్రావుపేట గ్రామంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయాలి. ⇒ భారీ, మధ్యతరహా, చిన్నతరహా నీటిపారుదల, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోని విభాగాలు, ప్రాజెక్టులన్నీ ఒకే గొడుగు కిందకు రావాలి. అన్నీ నీటిపారుదల శాఖ పరిధిలోనే ఉండాలి. ప్రాజెక్టులు, వాటి భౌగోళిక స్థితి ఆధారంగా నీటిపారుదల శాఖను పునర్వ్యవస్థీకరించాలి. సీఈ/ఈఎన్సీ పరిధులు నిర్ణయించి నీటిపారుదల జోన్లు ఏర్పాటు చేయాలి. అత్యవసరమైన సాగునీటి పనులకు కావాల్సిన అనుమతులు ఇవ్వడానికి సీఈ నుంచి ఈఈ వరకు అధికారాలను ప్రభుత్వం బదిలీ చేస్తుంది. సీఈ రూ. 50 లక్షల వరకు ఎస్ఈ రూ. 25 లక్షల వరకు, ఈఈ రూ. 5 లక్షల వరకు పనులకు అనుమతులు ఇవ్వొచ్చు. ⇒ 15 రోజుల్లోగా అన్ని ప్రాజెక్టులపై కొత్తగా గేజ్ మీటర్లు ఏర్పాట్లు చేయాలి. ప్రస్తుతమున్న గేజ్‌లు చాలా కాలం క్రితం ఏర్పాటు చేసివని. చాలా ప్రాజెక్టుల్లో పూడిక వల్ల గేజ్‌లు సరిగ్గా పనిచేయట్లేదు. కొత్తగా గేజ్‌లు ఏర్పాటు చేసి కచ్చితమైన అంచనా వేయాలి. ⇒ నీటిపారుదల శాఖ భూములు, ఆస్తుల వివరాలతో ఇన్వెంటరీ తయారు చేయాలి. నీటిపారుదల శాఖ సేకరించిన భూములను వెంటనే మ్యుటేషన్ చేయించాలి. ⇒ ప్రాజెక్టుల భూములను ఆక్రమించిన వారిపై సీరియస్‌గా ఉండాలి. సేకరించిన భూమిని మ్యుటేషన్ చేయాలి. ⇒ కాల్వ కట్టలపై నివాసం ఉండే వారు తక్షణం ఖాళీ చేసేలా కఠినంగా వ్యవహరించాలి. అక్రమ నిర్మాణాలను తొలగించాలి. ⇒ ప్రాజెక్టుల నిర్వహణ కూడా ముఖ్యం. ప్రతి ప్రాజెక్టు నిర్వహణ కోసం ఓఅండ్ఎం మ్యాన్యువల్ రూపొందించాలి. ఏటా బడ్జెట్లోనే నిర్వహణ వ్యయం కేటాయించి ప్రభుత్వం విడుదల చేస్తుంది. ⇒ ఎక్కడైనా భూసేకరణ మిగిలి ఉంటే పూర్తి చేయాలి. దీనికి కావాల్సిన నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. -
రోహిణిలోనే గోదారి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న గోదావరి నదీ జలాలతో వచ్చే వానాకాలంలో సాగును సంబరంచేసే దిశగా ప్రభుత్వం బృహత్ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. నీటి లభ్యత పుష్కలంగా ఉన్న ప్రాజెక్టులు, రిజర్వాయర్ల కింద రోహిణి కార్తెలోనే నారుమళ్లకు నీరు విడుదల చేయాలని యోచిస్తోంది. భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులకు నీరు చేరే వరకు వేచిచూడకుండా జూన్ తొలి వారం నాటికే తాగునీటిని పక్కనపెట్టి, సాగుకు నీటిని విడుదలచేసే అంశంపై దృష్టిపెట్టింది. దీంతో పాటే వర్షాలు పుంజుకొని వరద మొదలయ్యే నాటికి వచ్చిన నీటిని వచ్చినట్టు కాళేశ్వరం ద్వారా ఎత్తిపోసి తరలించే ఏర్పాట్లకు సిద్ధమవుతోంది. గోదావరి జలాల సమగ్ర వినియోగం, నీటి విడుదల వంటి అంశాలపై సీఎం కేసీఆర్ ఆదివారం జరిగే విస్తృత స్థాయి సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. నికరం, మిగులు.. ఏదీ వదలొద్దు రాష్ట్ర తాగు, సాగునీటి అవసరాలకు గోదావరే ప్రధాన నీటి వనరు. గోదావరీ జలాల్లో తెలంగాణకు 954 టీఎంసీల నికర జలాల వాటా ఉంది. ఇందులో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన శ్రీరాంసాగర్, సింగూరు, నిజాంసాగర్ వంటి ప్రాజెక్టుల కింద ఏటా వినియోగం సరాసరిన 470 టీఎంసీల మేర ఉంది. మరో 520 టీఎంసీల నీటి వినియోగానికి వీలుగా తెలంగాణ వివిధ ప్రాజెక్టులు చేపట్టింది. ఇందులో ప్రధానంగా కాళేశ్వరం (180 టీఎం సీలు), దేవాదుల (60), తుపాకులగూడెం (100), సీతారామ (60) వంటి ఎత్తిపోతల పథకాలున్నాయి. వీటి ద్వారా 520 టీఎంసీల మేర నీరు వినియోగంలోకి రానుంది. అయితే కాళేశ్వరం ద్వారా రోజుకు 3 టీఎంసీల మేర నీటిని 200 రోజుల పాటు తరలించి కనీసంగా 600 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని సీఎం పదేపదే చెబుతున్నారు. నీటి కొరత ఉన్న కృష్ణాబేసిన్‌కు వీటినే తరలిద్దామని చెబుతూ వివిధ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ స్థాయిలో నీటిని తరలించాలంటే ప్రస్తుత నికర జలాల వాటాకు అదనంగా మరో 600 టీఎంసీల మిగులు వాటాను సాధించాలని ఇటీవలి సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి సూచించిన విషయం తెలిసిందే. మిగులు జలాల వాటా వినియోగంపైనా ఆదివారం ముఖ్యమంత్రి సమీక్షించి, ఈ వాటాల సాధనపై మార్గదర్శనం చేయనున్నారు. 35 లక్షల ఎకరాలకు నెలాఖరు నుంచే నీళ్లు ఈ వానాకాలంలో గోదావరి బేసిన్లో మేజర్, మీడియం, మైనర్ కింద కలిపి మొత్తంగా 35లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఇందులో ఎస్సారెస్పీ–1, 2 కింది ఆయకట్టే 13లక్షల ఎకరాలు ఉండగా, దేవాదుల కింద 2లక్షలు, మిడ్‌మానేరు, ఎల్లంపల్లి కింద లక్ష, కాళేశ్వరం కింద 2–3లక్షలు, వరద కాల్వ కింద మరో 2లక్షలు, కడెం కింద 40వేలు, కొమరంభీం, సాత్నాల, పెద్దవాగు వంటి మధ్యతరహా ప్రాజెక్టుల కింద 3లక్షలు, ఇక చెరువుల కింద ఉన్న 14లక్షల ఎకరాల్లో కనీసంగా 10లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని భావిస్తున్నారు. ఇందులో ఎస్సారెస్పీలో ప్రస్తుతం 30 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. ఇక్కడ ఉన్న నీటిలో తాగునీటికి 10 టీఎంసీలు పక్కనపెట్టి, మిగతా 20 టీఎంసీలను వానాకాలం నారుమళ్ల కోసం విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 8 వరకు రోహిణి కార్తె ఉన్నందున అప్పటిలోగా నారుమళ్లకు నీటిని విడుదలచేస్తే మంచిదనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి తోడు మిడ్‌మానేరులో 17.36, లోయర్ మానేరులో 9, కడెంలో 3.34 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. ఇందులో తాగునీటిని పక్కనపెట్టి నారుమళ్లకు ముందే నీటిని విడుదలచేసే అంశమై ఆదివారం జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. వచ్చింది వచ్చినట్టే ఎత్తిపోత జూన్ మూడో వారం నుంచి గోదావరిలో ప్రవాహాలు మొదలవుతాయి. ఈ నేపథ్యంలో వచ్చిన నీటిని వచ్చినట్టుగా మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ద్వారా రోజుకు 2 టీఎంసీలకు తగ్గకుండా ఎత్తిపోసే అంశం సీఎం సమావేశంలో కీలకం కానుంది. ఇప్పటికే 2 టీఎంసీల నీటి ఎత్తిపోతలకు మోటార్లు సిద్ధంగా ఉండగా, ఆగస్టు 15 నుంచి మూడు టీఎంసీలు ఎత్తిపోసేలా పనులు కొనసాగుతున్నాయి. కనీసంగా ఈ ఏడాది కాళేశ్వరం ద్వారా 200–300 టీఎంసీలు ఎత్తిపోసేలా కార్యాచరణ ఉంటుందని చెబుతున్నారు. ఈ నీటితో బ్యారేజీలు, రిజర్వాయర్లు, చెరువులు నింపుతూ ప్రతి నీటిచుక్క సద్వినియోగమయ్యేలా పక్కా ప్రణాళికను రూపొందించనున్నారు. ఇక కొండపోచమ్మకు జూన్–2న స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిని తరలించే మోటార్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనే అంశంపైనా సమావేశంలో చర్చిస్తారు. -
కొండపోచమ్మ లిఫ్టు సిద్ధం చేయండి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రంగనాయకసాగర్ వరకు విజయవంతంగా కాళేశ్వరం ప్రాజెక్టు నీరు వస్తున్నదని, ఆ నీటిని ఈ వానాకాలంలోనే కొండపోచమ్మసాగర్ వరకు తరలించేందుకు విద్యుత్ శాఖ చేస్తున్న ఏర్పాట్ల పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కారం, మర్కూక్ పంపుహౌజుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు సీఎం ఫోన్ చేసి మాట్లాడారు. కొండపోచమ్మసాగర్ వరకు నీటిని తరలించేందుకు జరుగుతున్న లిఫ్టు పనులపై ఆరా తీశారు. నాలుగైదు రోజుల్లో లిఫ్టులన్నీ సిద్ధం చేయాలని కోరారు. ఈ వానాకాలంలోనే కొండపోచమ్మసాగర్ వరకు నీటిని తరలిస్తామన్నారు. విద్యుత్ శాఖ మొదటి నుంచి నిర్ణీత గడువులోగా తమ పనులు పూర్తి చేస్తూ మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నదని సీఎం ప్రశంసించారు. నాలుగైదు రోజుల్లో లిఫ్టులు సిద్ధం: సీఎండీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని లిఫ్టులను నాలుగైదు రోజుల్లోనే సిద్ధం చేస్తామని ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్రకటించారు. ప్రస్తుతం కాళేశ్వరం నీటిని రంగనాయక్ సాగర్ వరకు విజయవంతంగా లిఫ్టు చేయగలుగుతున్నామని, అక్కడి నుంచి కొండపోచమ్మసాగర్ వరకు నీటిని తరలించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నట్లు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అక్కారం, మర్కూక్ పంపుహౌజుల పనులను ప్రభాకర్‌రావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి సిబ్బందికి తగు సూచనలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా అన్ని నియమాలు పాటించాలని, భౌతిక దూరం పాటిస్తూ పనులు చేయాలని సూచించారు. ‘ప్రస్తుత కాళేశ్వరం ప్రాజెక్టు నీరు రంగనాయక్ సాగర్ వరకు విజయవంతంగా చేరుకుంది. అక్కడి నుంచి మల్లన్నసాగర్‌కు, తర్వాత కొండపోచమ్మ సాగర్‌కు నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన లిఫ్టులను విద్యుత్ శాఖ యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నది. అక్కారంలో 162 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపుసెట్లు సిద్ధంగా ఉన్నాయి. అక్కడి నుంచి నీరు మర్కూక్ చేరుకుంటుంది. మర్కూక్ నుంచి నీటిని ఎత్తిపోయడానికి 204 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులు సిద్ధమయ్యాయి. నాలుగు బృందాలు రేయింబవళ్లు పనిచేస్తున్నాయి. టెస్టింగ్ పూర్తి చేసి, నాలుగైదు రోజుల్లోనే సిద్ధం చేస్తాం’అని సీఎండీ చెప్పారు. ప్రభాకర్‌రావు వెంట ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, డైరెక్టర్ జె.సూర్యప్రకాశ్, ఈడీ ప్రభాకర్‌రావు, ఎస్ఈ ఆంజనేయులు, వేణు తదితరులున్నారు. ముంబై నుంచి నిపుణుల బృందం రాక పంపుహౌజుల కేబుల్ పనులు చేసే రాహుల్ కేబుల్ ఇంజనీరింగ్‌కు చెందిన నిపుణుల బృందం లాక్డౌన్ కారణంగా ముంబైలో చిక్కుకుంది. వారు వస్తే తప్ప ఇక్కడ పనులు జరిగే అవకాశం లేదు. దీంతో ప్రభాకర్‌రావు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డికి లేఖ రాశారు. డీజీపీ మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసి, ఫోన్ ద్వారా మాట్లాడి ప్రత్యేక అనుమతి ఇప్పించారు. దీంతో ప్రత్యేక అనుమతితో కూడిన వాహనాల్లో నిపుణుల బృందం ఈ నెల 21న సిద్దిపేట జిల్లాకు చేరుకుంది. వారి ఆధ్వర్యంలో పంపుహౌజుల కేబుల్ పనులు నడుస్తున్నాయి. తొలగిన అడ్డంకి ► మే 1లోగా కొండపోచమ్మ ముంపు గ్రామాల బాధితుల్ని ఖాళీ చేయించండి ► సిద్దిపేట కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కొండపోచమ్మ రిజర్వాయర్ ముంపునకు గురయ్యే మామిడ్యాల, బహిలాంపూర్ గ్రామాల వారిని మే 1వ తేదీలోగా ఖాళీ చేయించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. ములుగు మండలంలోని ఆ రెండు గ్రామాలకు చెందిన 55 కుటుంబాలను పునరావాస పథకం కింద నిర్మించిన గృహాల్లోకైనా.. లేదా తాత్కాలిక నివాసాల్లోకైనా తరలించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు గ్రామాలకు చెందిన 26 మంది దాఖలు చేసిన రిట్ పిటిషన్లను గురువారం మరోసారి విచారణకు వచ్చిన సందర్భంగా ధర్మాసనం.. పిటిషనర్లకు చెల్లించాల్సిన 55 మంది ఇళ్ల పరిహారం, పట్టాలను పిటిషనర్ తరఫు న్యాయవాదికి అందజేయాలని ఆదేశించింది. పరిహార వివాదాల పేరిట ప్రాజెక్టులపై మధ్యంతర ఉత్తర్వులు కొనసాగించలేమని కూడా స్పష్టం చేసింది. ప్రాజెక్ట్ నిర్మాణాలపై అభ్యంతరాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని హితవు చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. -
రూ.21వేల కోట్ల పనులకు టెండర్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అదనపు టీఎంసీ నీటి ఎత్తిపోతల పనుల్లో కీలక ముందడుగు పడింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఇప్పటికే అదనంగా మరో టీఎంసీ నీటిని తీసుకునేలా పనులు చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా ఎల్లంపల్లి దిగువన పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచింది. ఏకంగా రూ.21,458 కోట్లతో ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ వరకు నీటిని తరలించేలా పంప్‌హౌస్‌లు, కాల్వలు, రిజర్వాయర్లకు టెండర్లు పిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు 2 టీఎంసీలు, మిడ్‌మానేరు దిగువన ఒక టీఎంసీ నీటిని తరలించేలా పనులు పూర్తయిన విషయం తెలిసిందే. ఇక అదనంగా మరో టీఎంసీ నీటిని తరలించాలని నిర్ణయించిన ప్రభుత్వం మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఇప్పటికే పనులు ఆరం భించి పనులు కొనసాగిస్తోంది. ఎల్లంపల్లి దిగువన పనులకు ఎప్పుడో పరిపాలనా అనుమతులు ఇవ్వ డంతో పాటు బ్యాంకు రుణాలకు సైతం ఆమోదం ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం టెండర్లు పిలిచింది. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు 1.10 టీఎంసీ నీటిని ఎత్తిపోసే పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు రూ.9,747.30 కోట్లకు గాను.. ఎల్లంపల్లి నుంచి 1.10 టీఎంసీ నీటిని దేవికొండ రిజర్వాయర్ తరలించేందుకు వీలుగా అవసరమైన అప్రోచ్ చానల్, గ్రావిటీ కెనాల్, ఫోర్‌బే, వెలగటూరు వద్ద మొదటి పంప్‌హౌస్ నిర్మాణానికి రూ.6,167.31 కోట్లు, దేవికొండ రిజర్వాయర్ నుంచి వరద కాల్వ 95.27వ కిలోమీటర్ వరకు నీటిని తరలించేందుకు రెండో పంప్‌హౌస్, ఇతర నిర్మాణాలకు రూ.3,144.11కోట్లు, ఇక 109వ కిలోమీటర్ వరకు వరద కాల్వ సామర్థ్య పంపునకు వీలుగా 222.59 కోట్లు, 122వ కిలోమీటర్ వరకు వరద కాల్వ పనులకు రూ.213.29 కోట్లతో టెండర్లు పిలిచారు. ఈ 4 ప్యాకేజీ పనులకు ఈ నెల 4 నుంచి ఏప్రిల్ 18 వరకు టెండర్లు వేసుకునే అవకాశమిచ్చారు. 20న సాంకేతిక బిడ్లు తెరవ నున్నారు. నిజానికి ఈ మొత్తం పనులను 6 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచేలా కసరత్తు చేసినప్పటికీ తిరిగి వాటిని నాలుగు ప్యాకేజీలకు కుదించారు. ఇక మిడ్‌మానేరు నుంచి మల్లన్న సాగర్ వరకు నీటిని తరలించే పనులను సైతం నాలుగు ప్యాకేజీలుగా విభజించి రూ.11,710.70 కోట్లు కేటాయించారు. దీనిలో మొదటి ప్యాకేజీని రూ.3,286.77 కోట్లు, 2వ ప్యాకేజీని రూ.6,148.48 కోట్లు, 3వ ప్యాకేజీని రూ.680.90కోట్లు, 4వ ప్యాకేజీని రూ.1,594.55 కోట్లుగా విడగొట్టి టెండర్లు పిలిచారు. ఈ 4 ప్యాకేజీలకు ఏప్రిల్ 17 వరకు టెండర్లు వేసుకునే అవకాశం కల్పించగా, 18న టెక్నికల్ బిడ్ తెరవనున్నారు. -
మల్లన్న నుంచే సింగూరుకు గోదారి!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను సింగూరు ప్రాజెక్టుకు తరలించే విషయంలో ఇన్నాళ్లూ ఉన్న సందిగ్ధత తొలగింది. కాళేశ్వరంలో భాగంగా ఉన్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచే నీటిని గతంలో ప్రతిపాదించిన మాదిరి సింగూరుకు గోదావరి నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతంలో సింగూరుకు తరలించేలా చేపట్టిన పనులను తిరిగి ఆరంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రాజెక్టు ఇంజనీర్లను ఆదేశించారు. దీంతో గత కొన్నేళ్లుగా ఆగిన ప్యాకేజీ–17, 18, 19 పనులు తిరిగి ఆరంభమయ్యాయి. విద్యుత్, భూసేకరణ ఖర్చులు ఆదా.. మల్లన్న సాగర్ నుంచి గ్రావిటీ పద్ధతిన హల్దీ వాగు ద్వారా సింగూరుకు నీటిని తరలించే ప్రక్రియను గతంలోనే చేపట్టారు. మల్లన్న సాగర్‌లో నీటిని తీసుకునే లెవల్ 557 మీటర్లు ఉండగా, సింగూరు లెవల్ 530 మీటర్లు ఉంది. గ్రావిటీ పద్ధతిన నీటిని కొంతదూరం తీసుకెళ్లి, మధ్యన 32 మీటర్ల లిఫ్టు ద్వారా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగూరుకు పంపేలా రూ.2,500 కోట్లతో ప్యాకేజీ–17, 18, 19లను చేపట్టారు. ప్యాకేజీ–17లో ఉన్న 18 కి.మీల టన్నెల్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటం, ఆ పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించాలని ప్రభుత్వం మూడేళ్ల కింద నిర్ణయించింది. 627 మీటర్ల కొండపోచమ్మ లెవల్ నుంచి 530 మీటర్ల లెవల్ ఉన్న సింగూరుకు పూర్తి గ్రావిటీ ద్వారా నీటిని తరలించవచ్చని నిర్ణయించి దీనికి అనుగుణంగా ప్రణాళికలు వేసింది. అయితే కొండపోచమ్మ ద్వారా నీటిని తరలిస్తే, సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిశాట్, ఇస్నాపూర్ పారిశ్రామిక ప్రాంతాలతో పాటు ఎన్‌హెచ్–65ని కూడా దాటాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎకరా భూమి ధర రూ.5 కోట్లకు పైగా ఉండటంతో భూసేకరణ భారం కానుంది. అదీగాక కొండపోచమ్మ సాగర్ నుంచి పైప్‌లైన్ ద్వారా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నిర్మిస్తున్న కేశవపూర్ రిజర్వాయర్‌కు నీటిని తరలించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సింగూరుకు, అటు నుంచి నిజాంసాగర్‌కు నీటి తరలింపు అనుకున్న మేర సరఫరా చేయడం సాధ్యం కాదు. దీనికి బదులు మల్లన్న సాగర్ ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటిని హల్దీ వాగు ద్వారా సింగూరుకు, అటు నుంచి నిజాంసాగర్‌కు తరలిస్తే మేలని ప్రభుత్వం ఇటీవల ఇంజనీర్లతో జరిపిన చర్చల సందర్భంగా తేల్చింది. విద్యుత్ ఖర్చు రూ.67 కోట్లు.. మల్లన్న సాగర్ నుంచి సింగూరుకు నీటిని తరలిస్తే విద్యుత్ ఖర్చు కేవలం రూ. 67 కోట్లు మాత్రమే ఉంటుందని, అదే కొండపోచమ్మ ద్వారా అయితే రూ. 352 కోట్లు అవసరం ఉంటుందని రిటైర్డ్ ఇంజనీర్లు సైతం తేల్చి చెప్పారు. దీంతో పాటు ఇప్పటికే సేకరించిన భూమి అవసరాలపై వెచ్చించిన రూ.500 కోట్లు మేర ఆదా ఉంటుందని తెలిపారు. దీంతో ఏకీభవించిన ముఖ్యమంత్రి మల్లన్న సాగర్ ద్వారానే సింగూరుకు నీటిని తరలించాలని సూచించారు. దీంతో ఇప్పుడిప్పుడే మూడు ప్యాకేజీల పనులను ఏజెన్సీలు తిరిగి ఆరంభించాయి. -
‘అనంతగిరి’కి గోదారమ్మ
సాక్షి, హైదరాబాద్/సిరిసిల్ల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ఇప్పటికే మొదటి, రెండో దశ ఎత్తిపోతల ద్వారా మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ నుంచి మిడ్‌మానేరు (రాజరాజేశ్వరి) రిజర్వాయర్‌కు చేరుకున్న గోదావరి జలాల ప్రయాణం కొండలు, కోనలు, వాగులు, వంకలు, కాల్వలు, సొరంగ మార్గాలు దాటుకుంటూ కాళేశ్వర గంగమ్మ (గోదావరి), అనంతగిరి (అన్నపూర్ణ) రిజర్వాయర్ చేరింది. బుధవారం మిడ్‌మానేరు దిగువన పంప్‌హౌస్‌లోని ఒక మోటార్ ద్వారా నీటిని అనంతగిరి తరలించే ట్రయల్ రన్ ప్రక్రియ విజయవంతమైంది. 164.15 కి.మీ. ఎగువకు గోదావరి నీళ్లు ప్రయాణించాయి. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు 10వ ప్యాకేజీ పూర్తయినట్లయ్యింది. ఈఎన్సీ హరిరామ్, నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, ఎస్ఈ ఆనంద్ పర్యవేక్షణలో 106 మెగావాట్ల (1.40 లక్షల హెచ్‌పీ) సామర్థ్యంగల మోటారు ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటిని మధ్యాహ్నం 1.30 గంటలకు ఎత్తిపోసింది. ఇక్కడ నుంచి నీటిని రంగనాయక్‌సాగర్ మీదుగా ఈ నెల 25 నాటికి గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్‌కు చేరనున్నాయి. 90 మీటర్లు ఎగిసిపడిన జలాలు.. మధ్యమానేరు జలాశయం నుంచి 3.50 కి.మీ. కాలువ ద్వారా నీరు ఒబులాపూర్ చేరింది. అక్కడి నుంచి 7.65 మీటర్ల సొరంగ మార్గం ద్వారా తిప్పాపూర్ సర్జిపూల్ (మహాబావి)లోకి చేరాయి. అక్కడ ఏర్పాటు చేసిన 106 మెగావాట్ల సామర్థ్యంగల మోటార్ ద్వారా 90 మీటర్ల ఎత్తునకు నీటిని ఎత్తిపోశారు. దీంతో అనంతగిరికి నీరు చేరింది. సీఎం ఆదేశాలతో ఆగమేఘాలపై కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి దశలో మేడిగడ్డ, అన్నారం (సరస్వతి), సుందిళ్ల (పార్వతి) బ్యారేజీ, పంప్‌హౌస్‌ల నుంచి నీరు ఇప్పటికే ఎల్లంపల్లి చేరగా రెండో దశలో ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు తరలించారు. గతేడాది నవంబర్ నుంచి మిడ్‌మానేరులో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ నాలుగో దశ ఎత్తిపోతల ప్రక్రియ ప్రారంభం కాలేదు. మిడ్‌మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్‌కు తరలించాలంటే అనంతగిరి గ్రామాన్ని ఖాళీ చేయాల్సి ఉన్నా అక్కడ కోర్టు కేసుల కారణంగా అది సాధ్యపడలేదు. అయితే ఇటీవల నిర్వాసితుల తరలింపు ప్రక్రియను వెంటనే చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఆగమేఘాలపై ఎస్సీ కాలనీని ఖాళీ చేయించారు. అయినప్పటికీ మరో పదిగృహాలు ఇంకా ఖాళీ చేయాల్సి ఉంది. ఆ గృహాలకు ఇబ్బంది లేకుండా 3.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంగల అనంతగిరిలోకి ప్యాకేజీ–10లోని 4 మోటార్ల ద్వారా 0.8 టీఎంసీల నీటిని తరలించాలని ముఖ్యమంత్రి మంగళవారం రాత్రి ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్‌ను ఆదేశించారు. దీంతో హుటాహుటిన బుధవారం ఉదయం 106 మెగావాట్ల సామర్థ్యంగల ఒక మోటార్ ద్వారా తొలి ఎత్తిపోతలు చేశారు. ఇది విజయవంతం కావడంతో ఆ మోటార్‌ను 10 గంటలపాటు నిరంతరాయంగా నడిపించి రాత్రికి రెండో మోటార్ ఆన్ చేశారు. గురు, శుక్రవారాల్లో మరో రెండు మోటార్లను సైతం నడిపించి మొత్తంగా 0.8 టీఎంసీ నీటిని అనంతగిరికి తరలిస్తారు. అనంతరం అనంతగిరి నుంచి ప్యాకేజీ–11లోని 134.4 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటార్ల ద్వారా నీటిని రంగనాయక్ సాగర్‌కు తరలిస్తారు. ఈ పంపులన్నీ ఇప్పటికే సిద్ధమయ్యాయి. రంగనాయక్ సాగర్‌కు ఈ వారంలోనే నీటిని తరలించే ప్రక్రియ మొదలవుతుందని, మరో నాలుగైదు రోజుల్లో 3 టీఎంసీల ఈ రిజర్వాయర్‌ను నింపుతామని ఈఎన్సీ హరిరామ్ తెలిపారు. 25 నాటికి కొండపోచమ్మకు.. రంగనాయక్ సాగర్ నుంచి నీటిని గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్‌కు నీటిని తరలించేలా ప్యాకేజీ–12లో 16.18 కి.మీ. టన్నెల్ పనులు పూర్తికాగా 8 పంపుల్లో అన్నీ సిద్ధమయ్యాయి. ఇదే ప్యాకేజీలో ఉన్న కొమరవెల్లి మల్లన్నసాగర్ పనులు మొదలయ్యాయి. ఇక్కడ భూసేకరణ సమస్యగా ఉండటంతో రిజర్వాయర్ పనులు పూర్తికాకున్నా 18 కి.మీ. మేర ఫీడర్ చానల్ ద్వారా 15 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న కొండపోచమ్మ సాగర్ రిజర్యాయర్‌కు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొండపోచమ్మసాగర్‌కు నీటిని తరలించేలా ప్యాకేజీ–13 పనులు పూర్తవ్వగా, ప్యాకేజీ–14లో రెండు పంప్‌హౌస్‌ల్లోని ఆరేసి మోటార్లను సిద్ధం చేశారు. అయితే వాటికి విద్యుత్ కనెక్షన్ పనులు మరో నాలుగు రోజుల్లో పూర్తవుతాయని ప్రాజెక్టు ఇంజనీర్లు చెబుతున్నారు. ఇక్కడి నుంచి 15 టీఎంసీల సామర్థ్యంగల కొండపోచమ్మ సాగర్‌కు నీటిని తరలించనున్నారు. ఈ నెల 25 నాటికి కొండపోచమ్మకు గోదావరి జలాలు చేరతాయని, కనీసంగా 240 కిలోమీటర్ల గోదావరి తరలి రానుందని ఈఎన్సీ హరిరామ్ వెల్లడించారు. సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు.. గోదావరి జలాలు అనంతగిరికి చేర్చే ప్రక్రియ విజయవంతం కావడంతో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అనంతగిరి నిర్వాసితులను అధికారులు ఖాళీ చేయించారు. నీరు రావడంతో మిగతా వాళ్లు ఊరు విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఈఈ గోపాలకృష్ణ, డీఈఈ దేవేందర్, తహసీల్దార్లు రాజిరెడ్డి, ప్రసాద్, ప్రాజెక్టు అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. కేసీఆర్ పర్యవేక్షణలోనే పనుల పూర్తి ముఖ్యమంత్రి నిరంతర పర్యవేక్షణ, ప్రోత్సాహంతోనే నాలుగో దశ పూర్తయింది. ఆసియాలోనే అతిపెద్దదైన 92 మీటర్ల లోతైన సర్జ్‌పూల్ నుంచి నీటిని 101.20 మీటర్లు ఎత్తి అనంతగిరికి తరలించే ట్రయల్ రన్ బుధవారం పూర్తయింది. సీఎం సూచనల మేరకు ఈ నెలాఖరుకు కొండపోచమ్మ సాగర్‌కు కాళేశ్వరం జలాలు చేరతాయి. – హరిరామ్, ఈఎన్సీ -
700 టీఎంసీలు ఎత్తిపోసేలా...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టులన్నీ పూర్తి కావస్తున్న నేపథ్యంలో..వచ్చే వర్షాకాల సీజన్ నుంచి నీటి ఎత్తిపోతలు గణనీయంగా ఉండనున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుండటంతో నీటి వినియోగం గరిష్ట స్థాయికి చేరనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో ఎత్తిపోతలు ఏకంగా 700 టీఎంసీల వరకు ఉంటుందని నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. ఎత్తిపోసే నీటి పరిమాణానికి తగినట్టే విద్యుత్ వినియోగం సైతం 7 వేల మెగావాట్లను దాటే అవకాశం ఉందని శాఖ లెక్కలు కట్టింది. ఇకపై ‘డబుల్’ఎత్తిపోత.. కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాల ద్వారా ఏటా 282 టీఎంసీల మేర నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సీజన్లో కాళేశ్వరం ద్వారా 58 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోయడంలో అది 340 టీఎంసీలకు చేరింది. ఇందులో ప్రధానంగా పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు,భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ద్వారానే కనీసంగా 120 టీఎంసీలు, ఏఎంఆర్పీ ద్వారా మరో 50 టీఎంసీల మేర నీరు ఎత్తిపోస్తుండగా, దేవాదుల, ఎల్లంపల్లి, గుత్ప, అలీసాగర్ వంటి పథకాల కింద మరో 70 టీఎంసీల ఎత్తిపోతల కొనసాగుతూ వస్తోంది. పాత ప్రాజెక్టుల ద్వారా నీటిని తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ప్రాజెక్టు పరిధిలో పంపు మోటార్లు, వాటికి అనుగుణంగా విద్యుత్ అవసరాలు 1,600 మెగావాట్ల వరకు ఉన్నాయి. ఎత్తిపోతల పథకాలకు యూనిట్‌కు 5.80 చొప్పున గణించినా, రూ. 1,800 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. అయితే వచ్చే ఖరీఫ్ నుంచి నీటి ఎత్తిపోతలు గణనీయంగా పెరగనున్నాయి. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల ద్వారానే గరిష్టంగా 250 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోసేలా ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. ఇక గోదావరి బేసిన్లో 450 టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నారు. ఇందులో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే 200–250 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశాలున్నాయి. ఇక దేవాదుల పరిధిలోనూ కంతనపల్లి సిద్ధం కానుండటంతో రెండు సీజన్లలో కలిపి 100 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోసేలా ప్రణాళిక వేస్తున్నారు. మిగతా పథకాల కింద మరో 100 టీఎంసీల నీటిని తరలించనున్నారు. మొత్తంగా రెండు బేసిన్ల పరిధిలో 700 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. రెండు బేసిన్లలోని 22 ఎత్తిపోతల పథకాల పరిధిలో 96 పంప్‌హౌస్‌లు ఉండగా, 318 పంపుల నిర్మాణం కొనసాగుతోంది. ఇందులో 270 పంపులు జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయని భావిస్తోంది. వీటిని నిర్ణీత నీటిని ఎత్తిపోసేలా నడిపిస్తే విద్యుత్ వినియోగం 6,700–7000 మెగావాట్లు వరకు ఉంటుందని లెక్క గడుతోంది. ఇందులో అధికంగా కాళేశ్వరం ఎత్తిపోతలకే మోటార్లు తిరిగే రోజులు, వాటి సామర్థ్యాన్ని బట్టి 4,500 మెగావాట్ల నుంచి 5,500 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండవచ్చని నీటిపారుదల వర్గాలు అంటున్నాయి. ఈ విద్యుత్‌కే ఖర్చు దాదా పు రూ.6,500 కోట్లు ఉంటుందని చెబుతున్నాయి. -
వారంలో మేడిగడ్డ ఖాళీ?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని ఎత్తిపోస్తున్న ప్రభుత్వం మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీని వారంలో పూర్తిగా ఖాళీ చేయాలని నిర్ణయించింది. దిగువ బ్యారేజీలు, రిజర్వాయర్లలో నీటి లభ్యతను పెంచుతూ, మేడిగడ్డలో అవసరమైన మరమ్మతులు, ఇతర సాంకేతిక అంశాల పరిశీలనకు వీలుగా నీటినంతా దిగువకు పంపింగ్ చేయనుంది. ఇప్పటికే మేడిగడ్డ నుంచి నాలుగు టీఎంసీల మేర నీటిని పంపింగ్ చేయగా, ఆది వారం సైతం ఏడు పంపుల ద్వారా ఎత్తిపోతల ప్రక్రియ కొనసాగింది. ఈ నీరంతా దిగువ అన్నారం (సరస్వతి), అటు నుంచి సుందిళ్ల (పార్వతి) మీదుగా ఎల్లంపల్లికి చేరుతోంది. అనుకున్న దానికన్నా ముందుగానే.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీటినంతా ఏప్రిల్‌లో ఖాళీ చేయాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయిం చింది. అయితే ప్రస్తుతం కాస్త ముందుగానే ఖాళీ చేయనున్నారు. రాష్ట్రంలో ఇసుక అవసరాలు పెరగడం, లభ్యత తగ్గిన నేపథ్యంలోనే మేడిగడ్డ బ్యారేజీని ఖాళీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ నుంచి మొత్తం సీజన్లో 45 టీఎంసీల నీటిని దిగువకు ఎత్తిపోయగా, ఈ వారం రోజుల నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. బ్యారేజీలో 16.12 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 10 టీఎంసీల మేర నీటి లభ్యత ఉండగా, కొన్నిరోజుల్లో నీటిని పూర్తిగా ఖాళీ చేయనున్నారు. ఆదివారం సైతం ఏడు మోటార్ల ద్వారా 15 వేల క్యూసెక్కుల మేర నీటిని దిగువ అన్నారం తరలించారు. ఇదే రీతిని పంపింగ్ కొనసాగిస్తే వారంలో మేడిగడ్డ ఖాళీ కానుంది. ఇక్కడ కనీసంగా కోటి క్యూబిక్ మీటర్ల మేర ఇసుక లభ్యత ఉంటుందని అంచనా. ఇప్పుడు ఖాళీ చేస్తేనే మార్చి నుంచి జూన్ ఆరంభం వరకు మూడు నెలలపాటు ఇసుకను తరలించవచ్చనే ప్రణాళికతో ప్రభుత్వం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఖాళీ చేసిన అనంతరం బ్యారేజీని పూర్తి స్థాయిలో పరిశీలన చేసి అవసరమైన మరమ్మతులు సైతం చేయనున్నారు. ఇక ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహాలతో అన్నారంలో లభ్యత పెరగడంతో అక్కడ 10.87 టీఎంసీలకు గానూ 10 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. దీంతో ఇక్కడి పంప్‌హౌస్‌లోని 8 మోటార్లతో నీటిని సుందిళ్లకు తరలిస్తున్నారు. సుందిళ్ల నుంచి మరో 4 పంపుల ద్వారా నీటిని ఎల్లంపల్లి చేరుస్తున్నారు. ఎల్లంపల్లిలో ప్రస్తుతం 20.18 టీఎంసీలకు గానూ 8.30 టీఎంసీల నీటి లభ్యత ఉంది. మేడిగడ్డ బ్యారేజీని ఖాళీ చేసిన అనంతరం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సైతం ఖాళీ చేయనున్నారు. ఈ నీటితో ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరులో నిల్వలను పెంచనున్నారు. అనంతరం వీలునుబట్టి నీటిని పునరుజ్జీవం ద్వారా ఎస్సారెస్పీకి పంపనున్నారు. -
ఇసుకకు ఇక్కట్లే!
ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణ పనులు వేగంగా కొనసాగాలంటూ ప్రభుత్వ ఆదేశాలు ఒకవైపు... ఇసుక లభ్యత తగ్గుదల మరోవైపు.. వెరసి అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణానికి ఇసుక లభ్యత తగ్గుతుండటంతో ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు. గోదావరి నదీ తీర ప్రాంతాల్లో నీటి లభ్యత ఎక్కువగా ఉండటంతో ఇసుక లభ్యత కష్టంగా మారింది. ప్రాజెక్టుల ప్రాంతాల్లో నీటి నిల్వలు తగ్గితేగానీ ఇసుక తీయడం సాధ్యమయ్యేలా లేదు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు కొనసాగించేందుకు ఇసుక ఇక్కట్లు తప్పేలా లేవు. ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన మేర.. ఇసుక లభ్యత లేకపోవడం పెను ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయి. ఇసుక లభ్యత అధికంగా ఉండే గోదావరి నదీ తీర ప్రాంతాల్లోని బ్యారేజీలు, రిజర్వాయర్లలో నీటి లభ్యత అధికంగా ఉండటంతో కొరత తీవ్రమవుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుల పనులు వేగంగా కొనసాగించాల్సిన సమయంలో లభ్యత తగ్గుతుండటం శాఖకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రాజెక్టులేమో నిండు కుండలా.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) ఇదివరకే నిర్ణయించింది. సాగునీటి శాఖ చేపట్టిన బ్యారేజీల వద్ద ఇసుక తవ్వకాలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. ప్రధానంగా ప్రాజెక్టులు చేపడుతున్న పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలో ఇసుక తవ్వకాలు చేపడుతోంది. ముఖ్యంగా కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ వద్ద 4.18 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక లభ్యత ఉంటుందని గుర్తించి, అక్కడి నుంచే ప్రాజెక్టుల అవసరాలకు వాడుకున్నారు. అన్నారం బ్యారేజ్ వద్ద మరో 1.26 కోట్ల క్యూబిక్ మీటర్లు, సుందిళ్ల వద్ద సైతం అదే స్థాయిలో ఇసుక లభ్యత ఉంటుం దని గుర్తించి ఇందులో కొంతమేర వినియోగం చేశారు. అయితే ప్రస్తుతం ఈ బ్యారేజీలన్నీ నిండుకుండలుగా ఉన్నాయి. మేడిగడ్డలో 16.12 టీఎంసీలకు ప్రస్తుతం 14 టీఎంసీల మేర నిల్వలున్నాయి. అన్నారంలోనూ 10.87 టీఎంసీలకు గాను 6 టీఎంసీల మేర లభ్యత ఉంది. దీంతో ఇక్కడి నుంచి ఇసుక తీయడం సాధ్యం కాదు. సుందిళ్లలోనూ ఇదే పరిస్థితి మిడ్‌మానేరు రిజర్వాయర్ పరిధిలోనూ నీటి నిల్వలు నిండుగా ఉన్నాయి. 25.87 టీఎంసీలకు గాను, 24 టీఎంసీల మేర నిల్వలు ఉండటం, ఎగువ నుంచి నీటి ప్రవాహం కొనసాగుతుండటం, దిగువకు వదులుతుండటంతో పరీవాహకంలోనూ పూర్తిగా ఇసుక లభ్యత తగ్గింది. అవసరాలేమో ఆకాశంలో.. సమయంలో సాగునీటి ప్రాజెక్టులకు ఇసుకఅవసరాలు మాత్రం గణనీయంగా పెరిగాయి. ప్రధాన ప్రాజెక్టులకు మొత్తంగా 3కోట్ల క్యూబిక్ మీటర్ల అవసరం ఉండగా, ఇప్పటివరకు 1.50కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక వినియోగం జరగ్గా, మరో 1.50కోట్ల ఇసుక అవసరాలున్నాయని ఖనిజాభివృధ్ధి సంస్థకు నివేదిక అందింది. ఇందులో ఒక్క కాళేశ్వరం పరిధిలోనే 75 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉంటుందని తేల్చారు. ఇందులో మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి 40 లక్షల క్యూబిక్ మీటర్లు అవసరం కాగా ఇందులో 18 లక్షలు వినియోగం చేయగా, 22 లక్షల క్యూబిక్ మీటర్లు ఇంకా వినియోగించాల్సి ఉంది. వీటితో ఆదిలాబాద్ జిల్లాలోని కుఫ్టి, పెనుగంగ, చనాకా–కొరట, సదర్‌మఠ్ సహా ఇతర పనులకు 18 లక్షల క్యూబిక్ మీటర్లు, సీతారామ ఎత్తిపోతలకు 3.5 లక్షలు, దేవాదుల పరిధిలో 5.75 లక్షలు, పాలమూరులోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమాల పరిధిలో మరో 3 లక్షలు, నల్లగొండ జిల్లాలోని డిండి, ఎస్ఎల్బీసీ వంటి ప్రాజెక్టులకు 26 లక్షల క్యూబిక్ మీటర్ల మేర అవసరాలను ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో ఈ సీజన్లోనే జూన్ వర్షాలు కురిసే నాటికి 50 నుంచి 75 లక్షల క్యూబిక్ మీటర్లు అవసరం కానుంది. ఈ స్థాయిలో ప్రస్తుతం ఇసుక లభ్యత లేదు. తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల ప్రాంతాల్లోనే కొద్దిమేర లభ్యత ఉండగా, దాన్ని స్థానిక కాల్వలు, బ్యారేజీ, పంప్‌హౌస్‌ల నిర్మాణాలకు వాడుతున్నారు. ఖాళీ అయితే లభ్యత ఓకే.. ఏప్రిల్ నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఖాళీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కాస్త ఉపశమనం కల్గించేలా ఉంది. ఏప్రిల్ నుంచి బ్యారేజీలు ఖాళీ అయితే మూడు నెలల పాటు ఇసుక తీసుకునే అవకాశం దొరుకుతుంది. కనిష్టంగా కోటి క్యూబిక్ మీటర్ల మేర తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక తుపాకులగూడెం, దమ్ముగూడెం ఎగువన గోదావరి ప్రవాహాలు తగ్గడంతో ఇసుక లభ్యత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఇసుకతోనే గట్టెక్కాలని సాగునీటి శాఖ భావిస్తోంది. -
తరలివచ్చిన జలతరంగిణి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విస్తారంగా కురిసిన వర్షాలతో పెరిగిన నీటి లభ్యత, ఎగువ కాళేశ్వరం ద్వారా తరలివచ్చిన గోదావరి జలాలతో శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పరీవాహకం ఉప్పొంగుతోంది. గత యాసంగి సీజన్లకు భిన్నంగా ఈ ఏడాది ఎస్సారెస్పీ–1, 2 కింద పూర్తి ఆయకట్టుకు నీరందించడంతో పాటు గరిష్టంగా 65 టీఎంసీల మేర నీటి వినియోగం జరిగింది. మరో 20 నుంచి 25 టీఎంసీల నీటిని మార్చి చివరి వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండటంతో రైతులకు ఉపశమనం కలుగుతోంది. కొత్తగా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా వరద కాల్వ కింది చెరువులు నింపుతూ, ఆయకట్టుకు నీరిచ్చే ప్రక్రియ మొదలవడంతో జోష్ మరింత పెరిగింది. చరిత్రలో తొలిసారి.. ఎస్సారెస్పీ ప్రాజెక్టులో స్టేజ్–1 కింద 9.6 లక్షలు, స్టేజ్–2 కింద 3.97 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గతేడాది వర్షాకాల సీజన్లో కురిసిన వర్షాలతో 159 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చింది. ఇందులోంచి ఖరీఫ్‌లో నీటి వినియోగం పెద్దగా చేయలేదు. దీంతో యాసంగి మొదలయ్యే నాటికి ప్రాజెక్టులో 90 టీఎంసీలకు గాను.. 89 టీఎంసీల మేర లభ్యత ఉండటంతో స్టేజ్–1 కింద లోయర్ మానేరు డ్యామ్ (ఎల్ఎండీ) వరకున్న 4.62 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఎస్సారెస్పీ నుంచి గతేడాది డిసెంబర్ 25 నుంచి నిరంతరాయంగా నీటిని 4 తడుల ద్వారా విడుదల చేసి సాగునీరిచ్చారు. దీనికే ఇప్పటి వరకు 25 టీఎంసీల మేర నీటి వినియోగం చేశారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 90 టీఎంసీలకు 58 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. లభ్యత నీటిలోంచి మరో 3 తడుల ద్వారా 20–25 టీఎంసీల మేర నీరిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఇక ఎల్ఎండీ దిగువన స్టేజ్–1 కిందే ఉన్న మరో 5లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా ఎల్ఎండీకి ఎత్తిపోసిన నీటితో సాగునీరిచ్చారు. స్టేజ్–1 కిందే మొత్తంగా 9.5 లక్షల వరకు ప్రస్తుతం సాగునీరందింది. ఇక స్టేజ్–2 కింద 3.97లక్షల ఎకరాలకు గానూ 2.5 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నారు. దీంతోపాటే 592 చెరువులను నింపుతున్నారు. ఎల్ఎండీ దిగువన మొత్తం 44 టీఎంసీల మేర నీటిని వినియోగించారు. టెయిల్ టు హెడ్ అనే పద్ధతిన నీరు పంపిణీ చేయడంతో ఆయకట్టు చివరి జిల్లా అయిన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలానికి గోదావరి నీళ్లు చేరాయి. మొత్తంగా ఎస్సారెస్పీ కింద చరిత్రలో తొలిసారి 12 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 69 టీఎంసీల మేర నీటి వినియోగం జరిగింది. గడిచిన పదేళ్లలో యాసంగిలో జరిగిన వినియోగాన్ని పరిశీలిస్తే గరిష్టంగా 2010–11 ఏడాదుల్లో 57.96 టీఎంసీలుగా మాత్రమే ఉంది. కానీ ఇప్పటికే 69 టీఎంసీల మేర వినియోగం పూర్తవ్వడం, మరింత నీటి వినియోగానికి సిద్ధంగా ఉండటంతో మార్చి చివరికి 100 టీఎంసీల మార్కును దాటే అవకాశాలున్నాయి. పునరుజ్జీవంతో మరింత మేలు.. ఎస్సారెస్పీపైనే ఆధారపడిన వరద కాల్వకు సైతం పునరుజ్జీవ పథకం ద్వారా నీరందిస్తున్నారు. పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉన్న రాంపూర్, రాజేశ్వరరావుపేటలోని మోటార్లను ఆరంభించి కాల్వకు నీటిని విడుదల చేశారు. ఒక టీఎంసీ నీటిని పంపింగ్ చేసి 50 చెరువులను నింపనున్నారు. దీంతో పాటే వరద కాల్వ పరిధిలో బోరు మోటార్ల ద్వారా సాగు చేసిన ఆయకట్టుకు నీటి లభ్యత పెంచనున్నారు. ఎస్సారెస్పీలో ఏప్రిల్ నాటికి యాసంగి వినియోగంతో లభ్యత పడిపోగానే ఇదే ఎగువ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఖాళీ చేసి పునరుజ్జీవన పథకం ద్వారా మళ్లీ నింపనున్నారు. దీంతో మళ్లీ ఖరీఫ్‌లో సాగుకు నీటి కొరత లేకుండా చూసేలా ఇదివరకే ప్రణాళిక రచించారు. గత పదేళ్లలో ఎస్సారెస్పీకి వచ్చిన వరద నీరు, వినియోగం.. (టీఎంసీల్లో) సంవత్సరం వచ్చిన వరద నీటి వినియోగం 2009–10 27.34 13.61 2010–11 308.82 57.96 2011–12 174.20 33.67 2012–13 54.73 27.38 2013–14 320 56.60 2014–15 14.77 4.11 2015–16 4.42 1.61 2016–17 356.26 43.47 2017–18 75.31 33.42 2018–19 77.17 17.10 2019–20 159 69 -
హంద్రీ - నీవాను మించి...
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌తో ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా అద్బుతం చేసింది మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్చ్ లిమిటెడ్(ఎంఈఐఎల్). ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పధకంలో తమ ఇంజనీరింగ్ మేధస్సుతో అద్భుతాలు చేసింది. అనతికాలంలోనే అత్యధిక సామర్ధ్యం కలిగిన పంపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి తెలంగాణా ప్రజల గొంతుకను తడపడమే కాదు బీడుపడిన పంటపొలాలను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం. మూడేళ్ళలోనే 11పంపింగ్ కేంద్రాలలొ 3436 మెగావాట్ల సామర్ద్యం గల మిషన్ల ఏర్పాటుతో మొదటి దశ పనులు పూర్తిచేసి కాళేశ్వరంలోని లింక్ -1,2 లను పూర్తిచేసి రెండు టిఎంసిల నీటిని ఎత్తిపోసి చరిత్ర తిరగరాసింది. మేఘా పంపులతో గోదావరి పరవళ్లు రెండేళ్ళలో 11పంపింగ్ కేంద్రాలు పూర్తి చేయడంతో పాటు లింక్-1 పూర్తితో 120 కిమీ ఎగువకు గోదావరి నీరు రివర్స్ పంపింగ్ ద్వారా మళ్ళించడమే కాకుండా లక్ష్మీ పంప్ హౌస్ తో దిగువన ప్రాణహిత నీరు ఎగువ గోదావరిలోకి మళ్ళింపు చేయడం మరో రికార్డ్. గోదారి పరవళ్ళకు కొత్తనడకలు నేర్పుతూ రైతుల ఆశలకు జీవంపోస్తూ తెలంగాణా ప్రభుత్వ చిత్తశుద్దిని, పట్టుదలను, ఆచరణలో కాళేశ్వరాన్ని శరవేగంగా పూర్తి చేసి నిరూపించింది మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్స్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్). ఇప్పుడు లక్ష్మీ(మేడిగడ్డ)పంపింగ్ కేంద్రం నుండి 11 మిషన్లతో ఒకేసారి నీటిని ఎత్తిపోయడం ద్వారా మొదటి దశ పనులు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. తాజాగా లక్ష్మీ కేంద్రం ఫిబ్రవరి 15వ తేదీ అర్దరాత్రి నుండి ఇప్పటివరకు నాలుగు టిఎంసిల నీటిని ఎత్తిపోసింది. 11 మిషన్లు పనిచేయడం ద్వారా 22 డెలివరీ పైపుల ద్వారా విడుదలైన ఆ గోదావరి పరవళ్ళు కనులవిందుగా ఉంది. పంపింగ్ కేంద్రం నుండి జాలువారిన గోదారి జలాలు వాడిన రైతన్నల ఆశలను మళ్ళీ చిగురింపచేశాయి. లక్ష్మీ నుండి డిసి ద్వారా విడుదలైన నీరు 13 కిలోమీటర్ల మేర కాలువలో హోయలొలుకుతూ సరస్వతి జలాశయానికి చేరిన గోదారి సముద్రాన్ని తలపిసూ జనాలను మైమరిపిస్తోంది. హంద్రీ - నీవాను మించి... ఇప్పటి వరకూ ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పధకం అయిన హంద్రీనీవాతో ఔరా అనిపించుకున్న మేఘా ఇప్పుడు తాజాగా కాళేశ్వరంలో 3436 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన మిషన్లను 11పంపింగ్ కేంద్రాలలో ఏర్పాటుచేసి తన పేరిట ఉన్న రికార్డును తానే తిరగరాసింది. కాళేశ్వరంతో మరెవరికీ సాధ్యంకాని రికార్డు తన సొంతం చేసుకుంది మేఘా. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మొత్తం 22 పంపింగ్ స్టేషన్లు ఉండగా ఎంఈఐఎల్ మాత్రమే 17 పంప్ హౌస్‌లను నిర్మిస్తోంది. సాగునీటి రంగంలో ఎత్తిపోతల పధకాలకు ఇంత పెద్దస్థాయిలో విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయడం కూడా ఇదే మొదటిసారి. రికార్డు స్థాయిలో నిర్మాణం కాళేశ్వరం ద్వారా 7200 మెగావాట్ల సామర్ద్యంతో 3టిఎంసిల నీటిని రోజుకు పంప్ చేసే విధంగా పనులు జరగుతుండగా అందులో 2టిఎంసిల నీటిని రోజుకు పంప్ చేయడానికి 4992 మెగావాట్ల సామర్ద్యం కల్గిన పంపింగ్ కేంద్రాలతో పాటు అంతే విద్యుత్తు సరఫరా అవుతుంది.ఇందులోనూ అత్యధిక భాగం మేఘానే పూర్తిచేసింది. 11 పంపింగ్ కేంద్రాలలో 59మిషన్లను ఏర్పాటు చేయడం ద్వారా 3436 మెగావాట్లు రెండున్నరేళ్ళలో నిర్మించడం ఇంజనీరింగ్ వండర్ గా గుర్తింపు పొందింది.పంపింగ్ కేంద్రాల నిర్మాణంలో ఇంతవరకు దరిదాపుల్లో మరే ప్రాజెక్టు కూడా లేదు. ఐతే మొదటి దశలోని లక్ష్మీ, సరస్వతి, పార్వతి, గాయత్రి పంప్ హౌస్‌లను పూర్తిగా వినియోగిస్తుండటంతో దాదాపు 50టిఎంసిల నీటిని మిడ్ మానేరుకు పంప్ చేసి అక్కడి నుండి లోయర్ మానేరుకు విడుదల చేశారు. తాజాగా మళ్ళీ లక్ష్మీ కేంద్రం నుండి 11 మిషన్లతో పంపింగ్ ప్రారంభించగా సరస్వతి, పార్వతి, కేంద్రాల నుంచి కూడా పూర్తి స్థాయిలో పంపింగ్ కు రంగం సిద్దం చేశారు. ఇప్పటికే సరస్వతిలో 4మిషన్లు పంపింగ్ చేస్తున్నాయి. మేఘా విద్యుత్ వండర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కు మొత్తం 4627మెగావాట్ల విద్యుత్ సరఫరా అవసరం కాగా అందులో 3057మెగావాట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎంఈఐఎల్ అనతికాలంలోనే నిర్మించి రికార్డు క్రియేట్ చేసింది. ఇక అతి తక్కువ సమయంలోనే మేఘా పంపింగ్ కేంద్రాలు 44 టిఎంసీల నీటిని ఎత్తిపోశాయి. ఇంత తక్కువ సమయంలో అంత ఎక్కువ నీటిని పంప్చేయడం కూడా ఓ రికార్డ్‌గా చెప్పొచ్చు. -
జలకళతో ఉట్టిపడేలా మాస్టర్‌ప్లాన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వరప్రదాయినిగా ఉన్న గోదావరి నదిలోని ఒక్క నీటి చుక్కనూ వదలొద్దనే కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా నీటిని ఒడిసిపట్టే బృహత్ ప్రణాళికను సిద్ధం చేసింది. గోదావరి నీటిని వినియోగిస్తూ చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న ప్రతి బ్యారేజీ, రిజర్వాయర్‌లో నీటిని రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తూనే నిరంతరం అవి జలకళతో ఉట్టిపడేలా మాస్టర్‌ప్లాన్ వేసింది. ఇప్పటికే ఖాళీ అయిన లోయర్‌మానేరు డ్యామ్‌కు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోస్తున్న ప్రభుత్వం... మరోపక్క ఎల్లంపల్లిని నింపేందుకు నిండుగా ఉన్న మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ నుంచి పంపింగ్ మొదలుపెట్టింది. ఏప్రిల్‌లో మేడిగడ్డ మొదలు అన్నారం (సరస్వతి), సుందిళ్ల (పార్వతి) బ్యారేజీలను పూర్తిగా ఖాళీ చేసి ఆ నీటితో దిగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించేలా ప్రణాళిక తయారు చేసింది. మొత్తంగా మేడిగడ్డ నుంచి లోయర్ మానేరు వరకు 100 టీఎంసీలు నిరంతరం లభ్యతగా ఉండేలా, జూన్‌లో ఖరీఫ్ మొదలయ్యే నాటికి ఎస్సారెస్పీలో కనీసం 50 టీఎంసీల నీటి లభ్యత పెంచేలా భారీ ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఎల్ఎండీకి సాగుతున్న తరలింపు... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు మీదుగా ఎల్ఎండీకి నీటి తరలింపు కొనసాగుతోంది. రాత్రి సమయంలో నంది, గాయత్రి పంపులను 8 గంటలపాటు నడుపుతూ ఎల్లంపల్లి నుంచి నీటిని ఎల్ఎండీకి తరలిస్తున్నారు. రోజుకు అర టీఎంసీకి తగ్గకుండా సుమారు 6 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఇప్పటివరకు 2 టీఎంసీల మేర నీటిని తరలించగా ఎల్ఎండీలో ప్రస్తుతం 24 టీఎంసీలకుగాను 8.35 టీఎంసీల నిల్వలున్నాయి. మరో వారంపాటు ఎల్లంపల్లి నుంచి నీటిని తరలించి 13 టీఎంసీల మేర నీటిని నిల్వ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు మిడ్‌మానేరులో నీటి నిల్వలు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మిడ్‌మానేరులో ప్రస్తుతం 25.87 టీఎంసీలకుగాను 24.63 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. ఎల్లంపల్లికి మొదలైన ఎత్తిపోత... ఎల్ఎండీకి నీటిని తరలిస్తుండటంతో ఎల్లంపల్లిలో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకుగాను 10.98 టీఎంసీ ల మేర నిల్వలున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లికి మరో 5 టీఎంసీల మేర నీటిని తరలించాలని గురువారం కాళేశ్వరం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో నిండుకుండలా ఉన్న మేడిగడ్డ నుంచి నీటిని తరలించేలా శుక్రవారం రాత్రి మేడిగడ్డ పంప్‌హౌస్‌లోని మోటార్లను ప్రారంభించి ఎత్తిపోతల మొదలుపెట్టారు. ప్రస్తుతం మేడిగడ్డలో 16.12 టీఎంసీలకుగాను 14.80 టీఎంసీల నిల్వలున్నాయి. ఇక్కడి నుంచి 5 టీఎంసీలను అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌ల ద్వారా ఎల్లంపల్లికి తరలించనున్నారు. మేడిగడ్డలో 11 మోటార్లు సిద్ధంగా ఉండగా ఎన్ని మోటార్లతో ఎంతమేర నీటిని, ఎన్ని రోజులపాటు నడపాలన్నది విద్యుత్ శాఖ సూచనల మేరకు నిర్ణయించనున్నారు. ఇక అన్నారంలో ఇప్పటికే 10.87 టీఎంసీలకుగాను 6 టీఎంసీలు, సుందిళ్లలో 8.83 టీఎంసీలకుగాను 4.5 టీఎంసీల మేర నిల్వలున్నాయి. ఏప్రిల్‌లో మూడు బ్యారేజీలు ఖాళీ... ప్రస్తుతం మేడిగడ్డ మొదలు ఎల్ఎండీ వరకు 100 టీఎంసీలకుగాను సుమారు 70 టీఎంసీల మేర నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఎల్లంపల్లిని ఖాళీ చేస్తూ ఎల్ఎండీని నింపుతుండగా ఎల్లంపల్లిని నింపేందుకు మేడిగడ్డ నుంచి ఎత్తిపోతలు ప్రారంభించారు. దీంతో ఎల్లంపల్లి నుంచి ఎల్ఎండీ వరకు నీటి లభ్యత గణనీయంగా పెరగనుంది. ఇక వర్షాకాలం ప్రారంభమైతే జూన్ 15 నుంచే మేడిగడ్డ వద్ద గోదావరి నీటి లభ్యత పెరుగుతుంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా రోజుకు కనీసం 2 టీఎంసీల మేర మొత్తంగా 530 టీఎంసీలను ఎత్తిపోసేలా ఇప్పటికే మోటార్లు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో లభ్యతగా ఉండే నీటినంతా ఖాళీ చేసి దిగువ ఎల్లంపల్లి, మిడ్‌మానేరుకు వదలాలని సీఎం కేసీఆర్ సూచించారు. వాటిల్లో లభ్యతగా ఉన్న సుమారు 25 టీఎంసీల మేర నీటిని దిగువకు వదిలి మిగతా రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేయనున్నారు. బ్యారేజీలను ఖాళీ చేసి వాటిలో ఏమైనా మరమ్మతులు చేయాల్సి ఉన్నా పగుళ్లు, లీకేజీలు వంటివి ఏమైనా ఉంటే వాటిని గుర్తించి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయనున్నారు. జూన్‌లో మళ్లీ గోదావరిలో ప్రవాహాలు మొదలయ్యే నాటికి అన్ని పరిశీలనలు, మరమ్మతులు చేసి ఎత్తిపోతలకు వాటిని సిద్ధంగా ఉంచనున్నారు. జూన్‌లోనే ఎస్సారెస్పీ నుంచి సాగుకు నీళ్లు.. అయితే బ్యారేజీలను ఖాళీ చేసే సమయంలో నీటిని దిగువ ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, ఎల్ఎండీలను నింపుతూనే మరోపక్క కొంత నీటిని ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం దాని కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో 90 టీఎంసీలకుగాను 62 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ప్రస్తుత యాసంగిలో మరో 25 టీఎంసీల మేర నీటి వినియోగం జరిగే అవకాశం ఉంది. అంటే ఏప్రిల్‌లో బ్యారేజీలను ఖాళీ చేసే సమయానికి ఎస్సారెస్పీలో 36–37 టీఎంసీల మేర నిల్వ ఉంటుంది. బ్యారేజీల నుంచి వదిలే 24 టీఎంసీల్లో కనీసం 15–20 టీఎంసీలను ఎస్సారెస్పీకి తరలిస్తే అక్కడ 50 టీఎంసీల మేర లభ్యత పెరుగుతుంది. ఈ లభ్యత నీటితో జూన్ నుంచే ఎస్సారెస్పీ కింది ఆయకట్టుకు నీటిని అందించవచ్చు. నిజానికి ఎస్సారెస్పీకి ఆగస్టు వరకు ఎగువ నుంచి ప్రవాహాలు రావు. కానీ ప్రస్తుతం కాళేశ్వరం నీటితో జూన్ నుంచే లభ్యత పెంచడంతోపాటు సాగుకు నీటి విడుదల సాధ్యమయ్యేలా ప్రణాళిక రచించారు. సమాంతరంగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం.. కృష్ణా, గోదావరి నీటిని కాల్వల ద్వారా ఆయకట్టుకు మళ్లిస్తున్న ప్రభుత్వం... వాటి నిర్మాణాలకు సమాంతరంగా రాష్ట్ర పరిధిలో కురిసే ప్రతి నీటి బొట్టునూ ఎక్కడికక్కడ ఒడిసిపట్టేలా భారీగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపడుతుండటం తెలిసిందే. తొలి విడతగా ఈ ఏడాది 615 చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని నిర్ణయించగా ఇందులో గోదావరి పరిధిలో 410, కృష్ణాలో 205 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాన్ని ఈ ఏడాది వర్షాలు కురిసే నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యంగా కాళేశ్వరం కాల్వల పరిధిలోని 150 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించగా ఇందులో కరీంనగర్ జిల్లా పరిధిలోవే 32 చెక్‌డ్యామ్‌లు ఉన్నాయి. కాళేశ్వరం పరిధిలోని చెక్‌డ్యామ్‌లను జూన్ నాటికి పూర్తి చేస్తే వాటి కింద నీటి కట్టడి సాధ్యం కానుంది. -
530 టీఎంసీల ఎత్తిపోత లక్ష్యంగా..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సాగునీటి రంగంలోని ఇంజనీరింగ్ విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు అనుబంధంగా ఉన్న సాగునీటి ఇంజనీరింగ్ విభాగాలను పునర్ వ్యవస్థీకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. గురువారం సాయంత్రం మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏటా 530 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తి పోసేందుకు ఇంజనీరింగ్ అధికారులు సన్నద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. మేలో రాష్ట్రంలోని అన్ని సాగునీటి కాల్వలకు అవసరమైన మరమ్మతులు చేయాలని ఆదేశిం చారు. సాగునీటికి సంబంధించిన అన్ని ఇంజనీరింగ్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తేవాలని సూచించారు. సాగునీటి ఇంజనీరింగ్ వ్యవస్థను 11 సర్కిళ్లుగా విభజించనున్నట్లు చెప్పారు. సర్కిల్ అధిపతిగా చీఫ్ ఇంజనీర్ వ్యవహిస్తారని పేర్కొన్నారు. సర్కిల్ పరిధి లో సాగునీటికి సంబంధించి ఏ అంశం పై అయినా సంబంధిత చీఫ్ ఇంజనీర్ బాధ్యత వహిస్తారని తెలిపారు. జూన్‌లోగా ఖాళీల భర్తీ.. జూన్‌లోగా ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆపరేషన్ మెయిం టెనెన్స్ ప్రభావవంతంగా చేపట్టేందుకు వీలుగా ఇంజనీరింగ్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బం దికి సంబంధిత ప్రాజెక్టుల వద్ద కనీస వసతి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పనులు వెంటనే ప్రారంభించి ఏప్రిల్‌లోగా ఇరిగేషన్ అధికారులు, సిబ్బందికి క్వార్టర్స్ నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశించారు. 530 టీఎంసీల ఎత్తిపోత లక్ష్యంగా.. గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 530 టీఎంసీల మేర ఎత్తి పోసేందుకు అధికారు లు అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం, ఎల్లంపల్లి రిజర్వాయర్లలో ప్రస్తుతం ఉన్న నీటిని ఏప్రిల్ 10లోగా ఖాళీ చేయాలన్నారు. తద్వారా వర్షాకాలంలో మరింతగా గోదావరి జలాలను ఒడిసి పట్టే ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మధ్య సమాచారం చేరేందుకు వీలుగా వైర్లెస్సెట్లు కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల ఆపరేషన్ రూల్స్ కార్యచరణ సిద్ధం చేయాలన్నారు. గోదావరి ప్రధాన ఉపనది అయిన ప్రాణహితలో వాస్తవ నీటి పరిమాణాన్ని తెలుసుకునేందుకు వీలుగా కాళేశ్వరం నుంచి తమ్మిడిహెట్టి వరకు 5 నుంచి 6 చోట్ల గేజ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. పనులు దక్కించుకున్న ఏజెన్సీలు సకాలంలో పనులు పూర్తి చేయట్లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటివి గుర్తించి ఆయా ఏజెన్సీలను పనుల నుంచి తొలగించాలని సీఎం ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. భగీరథ పథకం పైపులు విరగొట్టే వారిని గుర్తించి ముందుగా నోటీసులు జారీ చేయాలన్నారు. అప్పటికి వినకపోతే రూ.5 వేల జరిమానా విధించాలని సీఎం సూచించారు. ఆ జిల్లాలకు కొత్త కలెక్టరేట్లు.. కరీంనగర్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో కొత్త కలెక్టరేట్ల నిర్మాణానికి సీఎం ఆదేశాలు జారీ చేశా రు. సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ కె.విజయ, ఎమ్మెల్యేలు రవిశంకర్, రసమయి బాలకిషన్, కొరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డి, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. చెరువులన్నీ నింపాలి రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి కాలువలకు మే ఆఖరులోగా అవసరమైన అన్ని మరమ్మతులు చేపట్టాలన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే మంజూరు చేసిన 161 చెక్ డ్యాంల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని ఇరిగేషన్ అధికారులను సీఎం ఆదేశించారు. మే 15లోగా చెక్ డ్యాంల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు మరిన్ని చెక్ డ్యాంలు కావాలని కోరుతున్నందున ఆ దిశగా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. చిన్ననాటి సహచరుడితో మాటాముచ్చట.. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తీగలగుట్టపల్లి ఉత్తర తెలంగాణ భవన్ నుంచి వెళ్తుండగా.. గురువారం ఉదయం తనను కలిసేందుకు వచ్చిన తన చిన్ననాటి స్నేహితుడిని సీఎం కేసీఆర్.. చిరునవ్వుతో పలకరించారు. ఆప్యాయతతో అక్కున చేర్చుకొని కుశల ప్రశ్నలు వేసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కొండపల్కల గ్రామానికి చెందిన ఆ చిన్ననాటి స్నేహితుడి పేరు సంపత్‌కుమార్. తనింట్లో జరిగే శుభకార్యానికి రావాలని ఆహ్వానిస్తూ సంపత్ పత్రిక అందజేశారు. హైదరాబాద్‌లో ఒకే గదిలో కలసి ఉన్నప్పటి జ్ఞాపకాలను సీఎం గుర్తు చేసుకున్నారు. -
ఒక్క చుక్క పోవద్దు : కేసీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘ఎంతో కష్టపడి కట్టుకున్న ప్రాజెక్టుల్లోని నీటిని ఎప్పటికప్పుడు తోడి పోసుకుని రిజర్వాయర్లను నింపుతూ.. గోదావరి నీళ్లు చుక్క కూడా వృథా పోకుండా చూడాల్సిన బాధ్యత ఇంజనీర్లదే. ఎస్సారెస్పీ మొదలుకుని కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు, రిజర్వాయర్లు, ఎత్తిపోతల పంపులు, కాల్వల ద్వారా చివరాఖరు ఆయకట్టు వరకు వ్యవసాయ భూములను తడిపేలా సునిశిత పర్యవేక్షణ చేయాలి’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా కేసీఆర్ గురువారం కరీంనగర్ నుంచి హెలికాప్టర్లో కాళేశ్వరం చేరుకున్నారు. నాణేలు వదిలి.. పుష్పాంజలి ఘటించి.. కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం సన్నిధిలోని గోదా వరి ఘాట్‌కు చేరుకున్న కేసీఆర్.. గోదావరి, ప్రాణహిత సంగమ స్థలి, అంతర్వాహిని సరస్వతీ నదుల త్రివేణి సంగమ పుణ్య స్థలిని దర్శించుకున్నారు. ప్రాణహిత గోదారి గంగ పవిత్ర జలాలను తలపై చల్లుకుని నాణేలు వదిలి పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత గోదావరి ఘాట్ నుంచి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం చేరుకుని పూజలు చేశారు. తర్వాత లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజ్ వద్ద నిండు కుండను తలపిస్తున్న ప్రాణహిత నదీ జలాలను ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. బ్యారేజ్ వద్దకు చేరుకున్న సీఎం.. బ్యారేజ్ మీద నుంచి నదీ జలాల్లో నాణేలు వదిలి, ఉద్యమ కాలం నాటి మొక్కు చెల్లించుకున్నారు. ‘సాగునీటి’పై అధికారులకు క్లాస్ మేడిగడ్డ వ్యూ పాయింట్ వద్ద ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. రాబోయే వర్షాకాలం వరద నీరు ఉధృతంగా చేరుతుందని, ఈ నేపథ్యంలో లక్ష్మీ బ్యారేజ్ నుంచి ఎప్పటికప్పుడు నీటిని తోడుకోవాలని, అందుకు సంబంధించిన వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని ఈఎన్సీలు మురళీధర్‌రావు, వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే సహా పలువురు ఇంజనీర్లు, ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. ‘ప్రాజెక్టుల నిర్మాణం, నీటి సరఫరా విషయంలో ఎక్కడికక్కడ పని విభజన చేసుకుని పూర్తిస్థాయిలో ఇంజనీరింగ్ వ్యవస్థను పటిష్ట పరుచుకోవాలి. అవసరమైతే పోలీసుల మాదిరి వైర్లెస్, వాకీటాకీ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని పని చేయాలి. సమాచారాన్ని ప్రతి క్షణం చేరవేసుకుంటూ ఎప్పుడు ఏ మోటార్ నడుస్తోంది.. ఏ పంపు పోస్తోంది.. ఎంత నీరు ఎత్తిపోయాలి.. ఎప్పుడు ఆపాలే.. ఎప్పుడు నీటిని కిందికి వదలాలే వంటి పలు విధాలైన నీటి పంపిణీ సాంకేతిక అంశాలపై కాళేశ్వరం టీం మొత్తానికి అవగాహన ఉండాలి’అని కేసీఆర్ తెలిపారు. అలా సమన్వయంతో పనిచేస్తేనే గోదావరి జలాలను నూరు శాతం సద్వినియోగపర్చుకోవడం సాధ్యమవుతుందని సీఎం స్పష్టం చేశారు. అందుకు సంబంధించి చర్యలు చేపట్టనున్నట్టు వివరించిన సీఎం.. మేడిగడ్డ వద్ద మధ్యాహ్నం భోజన అనంతరం కరీంనగర్ బయల్దేరారు. ముక్తేశ్వర స్వామికి పూజలు.. లక్ష్మీ బ్యారేజీ సందర్శన కంటే ముందు.. కాళేశ్వర క్షేత్రాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. తొలుత ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంతకుముందు పుష్కరఘాట్‌లో గోదావరిమాతకు సీఎం కేసీఆర్ పూజలు చేశారు. గోదావరిలో నాణేలు వదిలిన కేసీఆర్.. చీర, సారె సమర్పించారు. సీఎం కేసీఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్, ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐజీ నాగిరెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ మురళీధర్ రావు, కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు గండ్ర జ్యోతి, అలుగు శ్రీవర్షిణి, పుట్ట మధు తదితరులు పాల్గొన్నారు. -
కాళేశ్వరం ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా, సాగునీటి లక్ష్యాల సాధనకు ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాల పునర్ వ్యవస్థీకరణ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. సాగునీటికి సంబంధించిన అన్ని ఇంజనీరింగ్ విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకువస్తామని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు, ఇంజనీరింగ్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి సరఫరాపై అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. ఈ సమీక్షలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సాగు నీటి ఇంజనీరింగ్ వ్యవస్థను 11 సర్కిల్స్‌గా విభజన చేస్తామని తెలిపారు. సర్కిల్ అధిపతిగా చీఫ్ ఇంజనీర్‌ను నియమిస్తామన్నారు. జూన్ నెలాఖరులోగా ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరులోగా ఇరిగేషన్ అధికారులు, సిబ్బందికి క్వార్టర్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. 530 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తి పోసేలా అధికారులు అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపేలా కార్యచరణ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. సాగునీటి కాలువలకు మే నెలాఖరులోగా అవసరమైన అన్ని మరమ్మత్తులు చేపట్టాలన్నారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోనేలా బ్యారేజీల ఆపరేషన్ రూల్స్ కార్యచరణ సిద్ధం చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌తో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రాలలో ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ల స్థానంలో కొత్త కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టాలన్నారు. కొత్త కలెక్టరేట్లను మంజూరు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమారును ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశానికి ముందు సీఎం కేసీఆర్ జయశంకర్ భూపాలపల్లిలోని కాళేశ్వరంలో గోదావరి పుష్కరఘాట్‌కు చేరుకుని.. గోదావరి మాతకి ప్రత్యేక పూజలు చేశారు. గోదావరికి చీర, సారే సమర్పించారు. అనంతరం కాళేశ్వరము ముక్తేశ్వర ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ వెంట సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉన్నారు. -
ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోత
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల ఎత్తిపోత మళ్లీ మొదలైంది. లోయర్ మానేరు డ్యామ్(ఎల్ఎండీ)లో నీటి నిల్వలు తగ్గడంతో ఎల్లంపల్లి దిగువన ఉన్న పంపుల ద్వారా నీటి ఎత్తిపోతలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల ప్రకారం ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు మీదుగా ఎల్ఎండీకి 5 టీఎంసీల మేర నీటిని తరలించాలని నిర్ణయించినట్లు నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఎస్సారెస్పీ–2 కింద చివరకు చేరిన నీరు కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నింపుతూనే ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, ఎల్ఎండీలను పూర్తిగా నింపారు. 24 టీఎంసీల పూర్తి సామర్థ్యాన్ని చేరిన అనంతరం ఎల్ఎండీ నుంచి దాని కింద ఉన్న ఎస్సారెస్పీ–2 ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీటిని అందించేందుకు నీటిని వినియోగిస్తూ వచ్చారు. ఎస్సారెస్పీ–2 కింద నిర్ణయించిన 592 చెరువులను నింపుతూ, వరంగల్ రూరల్, ఖమ్మం, జనగాం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో 3.97 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించారు. దీంతో సూర్యాపేట జిల్లాలో చిట్టచివర ఉన్న పెన్‌పహాడ్ మండలంలోని మాచారం రాయిచెరువుకు గోదావరి నీళ్లు చేరాయి. ఎస్సారెస్పీ–2కి నీటి విడుదల జరగడంతో ఎల్ఎండీలో నిల్వ 24 టీఎంసీలకు గానూ 8.31 టీఎంసీలకు పడిపోయింది. ప్రస్తుతం ఎల్ఎండీ నుంచి మరింత నీటి విడుదల అవసరాలున్న నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి నీటిని మిడ్‌మానేరు మీదుగా తరలించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతం ఎల్లింపల్లిలో 20.18 టీఎంసీలకు గానూ 13.40 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అక్కడి నుంచి నంది, గాయత్రి పంప్‌హౌస్‌లలోని 5 మోటార్లను సోమవారం రాత్రి 9 గంటలకు ప్రారంభించి సుమారు 16వేల క్యూసెక్కుల నీటిని మిడ్‌మానేరుకు తరలిస్తున్నారు. రాత్రి సమయంలో విద్యుత్ కొనుగోళ్ల ధరలు తక్కువ ఉంటున్న నేపథ్యంలో రాత్రిపూట 8 గంటల పాటు నడపాలని ప్రభుత్వ పెద్దలు సూచించినట్లు చెబుతున్నారు. దీంతో మంగళవారం సైతం ఇదేరీతిన మోటార్లను నడిపించి నీటిని మిడ్‌మానేరుకు ఎత్తిపోశారు. ఇక మిడ్‌మానేరులో 25 టీఎంసీల మేర నిల్వ తగ్గకుండా, వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఎల్ఎండీకి తరలిస్తున్నారు. కనిష్టంగా ఎల్ఎండీలో నిల్వలు 13 టీఎంసీలకు చేరే వరకు నీటి పంపింగ్ కొనసాగే అవకాశం ఉంది. ఇక నీటి ఎత్తిపోతలతో ఎల్లంపల్లిలో నిల్వలు తగ్గితే, ఎగువ మేడిగడ్డ నుంచి నీటిని తరలించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. -
అదనపు టీఎంసీకి శ్రీకారం!
సాక్షి, హైదరాబాద్: బహుళార్థ సాధక ప్రాజెక్టు కాళేశ్వరంలో అదనంగా మరో టీఎంసీ నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ పనుల వేగిరానికి శ్రీకారం చుడుతోంది. మేడిగడ్డ నుంచి రోజుకు 2 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేలా పనులు కొనసాగిస్తున్న ప్రభుత్వం, ఇప్పటికే 3వ టీఎంసీ నీటిని తీసుకునేలా పంప్‌హౌస్‌ల నిర్మాణం కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఎల్లంపల్లి దిగువన మిడ్‌మానేరు వరకు ఉన్న పనులు జరుగుతున్నాయి. మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు మొత్తంగా రూ.25 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టే కసరత్తులు చేస్తోంది. వచ్చే నెలలో సీఎం శంకుస్థాపన.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు 2 టీఎంసీ, దిగువన ఒక టీఎంసీ నీటిని తీసుకునేలా పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం అదనంగా మరో టీఎంసీని తీసుకుంటూ మిడ్‌మానేరు వరకు 3 టీఎంసీలు, దిగువన 2 టీఎంసీల నీటిని తీసుకునేలా పనులు చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదనపు టీఎంసీ నీటిని తరలించేందుకు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌లలో ఉన్న 28 పంపులకు అదనంగా మరో 15 పంపుల ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఈ ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు పనులను త్వరగా చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో నీటి పారుదల శాఖ ఎల్లంపల్లి నుంచి రెండు పంప్‌హౌస్‌లను నిర్మించి, దేవికొండ రిజర్వాయర్ ద్వారా వరద కాల్వ నుంచి నీటిని మిడ్‌మానేరు తరలించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 3 టీఎంసీల మేర నీటిని తరలించేలా వరద కాల్వను మరింత వెడల్పు చేయాలని నిర్ణయించి ఈ ప్రక్రియకు మొత్తంగా రూ.11,800 కోట్లు అవుతుందని లెక్కించారు. ఈ పనులను 4 లేక 6 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇక మిడ్‌మానేరు దిగువన మల్లన్నసాగర్ వరకు పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా నీటిని తరలించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నీటి తరలింపునకు 3 స్థాయిల్లో లిఫ్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనిలో మిడ్‌మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్ వరకు పైప్‌లైన్ వ్యవస్థ నిర్మాణానికి రూ.4,142 కోట్లు, అనంతగిరి నుంచి మల్లన్నసాగర్ వరకు పైప్‌లైన్ నిర్మాణానికి రూ.10,260 కోట్లు కలిపి మొత్తంగా రూ.14,362 కోట్ల మేర వ్యయం కానుంది. ఈ పనులను సైతం 6 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచే యోచనలో నీటి పారుదల శాఖ అధికారులు ఉన్నారు. మొత్తంగా రూ.25 వేల కోట్ల పనులకు ఈ నెలలోనే టెండర్ల ప్రక్రియ ముగించేలా కసరత్తు చేస్తున్నారు. వచ్చే నెలలో ఈ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసే అవకాశముంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే అదనపు టీఎంసీ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. -
బడ్జెట్ : తెలంగాణకు దక్కినవేంటి?
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై టీఆర్ఎస్ సర్కార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి సరైన కేటాయింపులు లేవని ఆ పార్టీ ఎంపీలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రాజెక్టులను ప్రకటించకపోగా.. కనీసం విభజన హామీలను సైతం నెరవేర్చలేదని పెదవి విరిశారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు కేంద్రానికి విజ్క్షప్తి చేసిన విషయం తెలిసిందే. దాదాపు లక్ష కోట్లతో నిర్మించిన ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి ఆశలు పెట్టుకుంది. కానీ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంలో దాని ప్రస్తావనే లేదు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు తీవ్ర నిరాశ చెందారు. (బడ్జెట్‌పై తెలంగాణ ఎంపీల అసహనం) గత లోక్‌సభ ఎన్నికల సమయంలో నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇచ్చిన హామీని విస్మరిస్తూ.. రెండు బడ్జెట్ సమావేశాలు ముగిసినా.. కేంద్రం నుంచి ప్రకటన మాత్రం రాలేదు. దీనిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నా.. ముందడుగు మాత్రం పడలేదు. ఈ నేపథ్యంలో స్థానిక బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని టీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. అలాగే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ. 24వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సిఫారసు చేసినప్పటికీ.. కేంద్రం విడుదల చేయడంలేదని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని, తమపై ఇంత వివక్ష చూపడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (ఏపీకి అందని సీతమ్మ వరాలు..) అలాగే విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బడ్జెట్ సమావేశాల్లో పలు అంశాలను కేంద్రానికి ప్రతిపాదిస్తోంది. వాటిలో కాజీపేట్ రైల్వే వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, నిజామాబాద్ పసుపు బోర్డుతో పాటు కాళేశ్వరానికి జాతీయ హోదా వంటి అంశాలను ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. గత బడ్జెట్లో వీటికి మొండిచేయి చూపడంతో.. ఈ సారైనా కేంద్ర కరునిస్తుందని తెలంగాణ ప్రభుత్వం భావించింది. కానీ విత్తమంత్రి ప్రసంగంలో మాత్రం వాటి ప్రస్తవన లేదు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కేంద్ర నుంచి నిధుల విడుదలలో తీవ్ర అన్యాయం జరుగుతోందని కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా వ్యాఖ్యానించారు. మరోవైపు మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు కూడా బడ్జెట్లో కేటాయింపులు పెద్దగా లేకపోవడంతో.. తెలుగు ప్రజలు పూర్తి నిరాశలో ఉన్నారు. (కేంద్రం మొండిచేయి చూపింది: విజయసాయి రెడ్డి) -
మాంద్యంలోనూ నిధుల వరద!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉన్నా.. ప్రభుత్వం ప్రాధాన్యత రంగంగా తీసుకున్న నీటి పారుదలకు మాత్రం నిధుల కొరత రానివ్వడం లేదు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎత్తిపోతల పథకాలన్నింటినీ నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసే లక్ష్యంగా ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు సమకూరుస్తూనే రుణాల రూపేణా సేకరించిన వాటినీ ఖర్చు చేస్తోంది. తొమ్మిది నెలల వ్యవధిలో ప్రాజెక్టులపై ప్రభుత్వం ఏకంగా రూ.17,285 కోట్ల నిధులు ఖర్చు చేయగా, మరో మూడు నెలల వ్యవధిలో ఐదారు వేల కోట్ల మేర వ్యయం చేయనుంది. నెలకు రూ.1,920 కోట్లు.. 2019–20 ఆర్థిక ఏడాదిలో తొలి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. ఎక్కడా నిధుల కొరత లేకుండా చూస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో 9 నెలల వ్యవధిలో రూ.8,586 కోట్ల మేర ఖర్చు చేసింది. ఇందులో రుణాల ద్వారా రూ.5,945 కోట్ల మేర ఖర్చు చేయగా, ప్రభుత్వ ఖజానా నుంచి రూ.2,641 కోట్లు ఖర్చు చేశారు. దీంతో మిడ్‌మానేరు వరకు గోదావరి నీటి ఎత్తిపోతల సాధ్యమైంది. మిడ్‌మానేరు దిగువన కొండపోచమ్మసాగర్ వరకు నీటిని తరలించే వ్యవస్థ ప్రస్తుతం సిద్ధంగా ఉంది. దీంతోపాటే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సైతం రూ.2,021 కోట్లు మేర ఖర్చు చేశారు. ఇందులో మెజార్టీ నిధులు భూసేకరణ, సహాయ పునరావాస పనులకు వెచ్చించారు. సీతారామ ఎత్తిపోతల పథకం కింద ఈ ఏడాది జూన్ నాటికి గరిష్ట ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి నాటికి తొలి పంప్‌హౌస్, మార్చి నాటికి రెండో పంప్‌హౌస్, మే చివరికి మూడో పంప్‌హౌస్ నిర్మాణ పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా నిర్ణయించారు. దీనికి సైతం రుణాల రూపేణా రూ.1,500 కోట్ల మేర ఖర్చు జరిగింది. వీటితో పాటే దేవాదులకు రూ.800 కోట్ల మేర, వరద కాల్వ ప్రాజెక్టుకు రూ.వెయ్యి కోట్ల మేర ఖర్చు చేశారు. చిన్న నీటి పారుదల రంగానికి సైతం పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులకు రూ.873 కోట్లు ఖర్చు చేశారు. మొత్తంగా రాష్ట్రం తన బడ్జెట్ నుంచి రూ.7,434 కోట్లు ఖర్చు చేయగా, రుణాల ద్వారా రూ.9,851 కోట్లు ఖర్చు చేసింది. నెలకు రూ.1,920 కోట్లకు తగ్గకుండా 9 నెలల్లో 17,825 కోట్లు ఖర్చు చేసినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అయినా ప్రాజెక్టుల పరిధిలో నిర్మాణ పనులు.. పూర్తయిన పనులకు సంబంధించి చెల్లించాల్సిన బకాయిలు మరో రూ.10,000 కోట్ల మేర ఉండటం విశేషం. ఆర్థిక ఏడాది ముగిసే నాటికి మూడు నెలల వ్యవధిలో మరో రూ.5 వేల నుంచి రూ.6 వేల కోట్ల మేర ఖర్చు చేసే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
400 చెరువుల్లో... గోదావరి గలగలలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలతో రిజర్వాయర్లను పూర్తి స్థాయిలో నింపిన ప్రభుత్వం చెరువులను నింపేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే లోయర్ మానేరు డ్యామ్ కింద చెరువులను నింపించిన ప్రభుత్వం..వందకు వంద శాతం చెరువులను నింపే పనిలో పడింది. వీటితో పాటే మిడ్‌మానేరు పరిధిలోని చెరువులతో పాటే, మిడ్‌మానేరు దిగువన కొండపోచమ్మసాగర్ వరకు ఎన్ని వీలైతే అన్ని చెరువులకు నీళ్లందించి, వాటి కింది ఆయకట్టును స్థిరీకరించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే ఎస్సారెస్పీ స్టేజ్–2 చెరువులకు జలకళ.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్లుగా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి అటునుంచి మిడ్‌మానేరు వరకు ఎత్తిపోసిన విషయం తెలిసిందే. దీంతో మేడిగడ్డ మొదలు మిడ్‌మానేరు వరకు గోదావరి అంతా జలకళను సంతరించుకుంది. మిడ్‌మానేరులోకి ఈ సీజన్లో మొత్తంగా 52 టీఎంసీల మేర కొత్త నీరు రాగా, అందులోంచి 30 టీఎంసీల నీటిని లోయర్ మానేరు డ్యామ్‌కు తరలించారు. ఆ నీటిని వదిలి తొలిసారిగా ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద ఉన్న చెరువులను నింపే ప్రక్రియ గడిచిన రెండు నెలలుగా సాగుతోంది. స్టేజ్–2లో మొత్తంగా 681 చెరువులు నింపాల్సి ఉండగా, ఇప్పటికే 586 పూర్తయ్యాయి. మరో 78 చెరువులను ప్రస్తుతం నింపే ప్రక్రియ కొనసాగుతుండగా, మరో 17 నింపాల్సి ఉంది. వీటి నీటి నిల్వ సామర్థ్యం 8.63 టీఎంసీలుగా కాగా, ఇప్పటికే నిండిన చెరువులతో వాటి నిల్వ 8.10 టీఎంసీలకు చేరింది. ప్రస్తుత యాసంగిలో స్టేజ్–2 కింద ఉన్న 3.97 లక్షల ఎకరాల్లో 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం మిడ్‌మానేరు, లోయర్ మానేరులు నిండుగా ఉండటంతో నిర్దేశించిన ఆయకట్టుకు నీరందించడం పెద్ద కష్టం కాదని ప్రాజెక్టు వర్గాలు తెలిపాయి. ఇక మిడ్‌మానేరు సైతం పూర్తి సామర్థ్యంతో నిండి ఉంది. ఈ ప్రాజెక్టు కింద నిర్దేశించిన 80 వేల ఎకరాల ఆయకట్టులో 25 వేల ఎకరాలకు ఈ సీజన్లో నీరివ్వాలని నిర్ణయించారు. ఈ ఆయకట్టుకు నీరిస్తూనే మరో 50 చెరువులను పూర్తి స్థాయిలో నింపాలని సీఎం కేసీఆర్ సోమవారం ప్రాజెక్టు పర్యటన సందర్భంగా అధికారులను ఆదేశించారు. అనంతగిరి ఖాళీ అయితే... ఇక దీంతో పాటే మిడ్‌మానేరు కింద ఉన్న అనంతగిరి గ్రామాన్ని త్వరగా ఖాళీ చేయించాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. ఈ గ్రామం ఖాళీ అయితే అనంతగిరి, రంగనాయక్‌సాగర్ రిజర్వాయర్లను నింపడంతో పాటు కొండపోచమ్మసాగర్ వరకు నీటిని తరలించవచ్చు. ఇలా నీటిని తరలించే క్రమంలో రంగనాయక సాగర్ కింద సిద్దిపేట జిల్లాలో 50, సిరిసిల్ల జిల్లాలో 70 చెరువులు నింపుతూ, కొండపోచమ్మ వరకు మొత్తంగా 400 చెరువులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిని ఫిబ్రవరి నాటికి పూర్తి స్థాయిలో నింపే అవకాశం ఉంటుందని ప్రాజెక్టు ఇంజనీర్లు తెలిపారు. మొత్తంగా ఇప్పటికే నింపిన చెరువులు, కొత్తగా నింపేవి కలిపి మొత్తం వెయ్యికి పైగా చెరువులను గోదావరి జలాలతో నింపే కసరత్తు వేగంగా జరుగుతోంది. -
కాళేశ్వర గంగకు సీఎం జలహారతి
సిరిసిల్ల/మేడ్చల్‌రూరల్/బోయినపల్లి(చొప్పదండి)/వేములవాడ: కాళేశ్వర గంగమ్మను చూసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పులకించిపోయారు. సోమవారం కుటుంబసభ్యులతో కలసి హైదరాబాద్ నుంచి బస్సులో బయల్దేరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. సిరిసిల్ల మానేరు వంతెన వరకు చేరిన గోదావరి జలాలకు వేదమూర్తుల మంత్రోచ్ఛారణల మధ్య పూజలు చేశారు. సిరిసిల్లను తాకిన జలాలను చూసిన ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బోయినపల్లి మండలం మానువాడ వద్ద రూ.690.18 కోట్లతో నిర్మించిన మిడ్ మానేరు జలాశయాన్ని సందర్శించారు. 25.873 టీఎంసీల నీటి నిల్వతో నిండుకుండలా ఉన్న జలాశయం వద్ద జలహారతి పట్టారు. మిడ్ మానేరు జలాశయం 2006లో ప్రారంభం కాగా, పలు కారణాల వల్ల పనులు ఆగిపోయాయి. అయితే 2016 తర్వాత సీఎం ప్రత్యేక చొరవతో మిడ్ మానేరు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఎస్సారెస్పీ వరద కాలువ, ఎల్లంపల్లి జలాశయం నుంచి గోదావరి నీటిని మిడ్ మానేరులో నింపేందుకు చర్యలు తీసుకున్నారు. నవంబర్ 8 నుంచి ఎల్లంపల్లి నీటిని గాయత్రి పంపుహౌస్ ద్వారా ఎత్తిపోయడంతో మిడ్ మానేరు పూర్తిస్థాయిలో నిండింది. జలకళతో ఉట్టిపడుతున్న జలాశయానికి సీఎం కేసీఆర్ పూజలు నిర్వహించారు. సిరిసిల్ల మెట్ట ప్రాంతానికి కాళేశ్వరం జలాలు చేరడంతో సీఎం కేసీఆర్ పులకించిపోయారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్, జెడ్పీ చైర్పర్సన్లు న్యాలకొండ అరుణ, కనుమల విజయ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్హెగ్గే తదితరులు పాల్గొన్నారు. సోమవారం సిరిసిల్ల వంతెనపై గోదావరి జలాలకు పూజలు చేస్తున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో సీఎం కేసీఆర్ దంపతులు, వినోద్‌కుమార్ సీఎం వెంట ఈటల కుటుంబీకులు సిరిసిల్ల పర్యటనకు వెళ్తూ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబీకులను వెంట తీసుకుని వెళ్లారు. తన పర్యటన సందర్భంగా కుటుంబంతో సహా రావాలని కేసీఆర్ కోరారు. దీంతో మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలో ఉండే మంత్రి ఈటల రాజేందర్.. శామీర్‌పేటలో ఈటల భార్య జమున, కూతురు నీత, అల్లుడు అనూప్‌తో కలసి కేసీఆర్ బస్సు ఎక్కారు. సరిగ్గా పదేళ్లలో.. తెలంగాణ ఉద్యమ నేతగా కేసీఆర్ 2009 నవంబర్ 8న సిరిసిల్ల మానేరు వంతెనపై బట్టలు మార్చుకుంటూ.. పని ఒత్తిడితో కనిపించారు. మళ్లీ అదే వంతెనపై రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కుటుంబ సభ్యులు, మంత్రులు.. అధికారులతో మిడ్ మానేరు బ్యాక్ వాటర్‌కు పూజలు చేశారు. పదేళ్ల కిందట రాష్ట్ర సాధన ఉద్యమంలో బిజీగా ఉన్న సమయంలో కేసీఆర్ సిరిసిల్లలో బస చేసి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో సిరిసిల్ల మీదుగా హైదరాబాద్ వెళ్తూ.. ఢిల్లీకి విమానంలో వెళ్లే హడావుడిలో మానేరు వంతెనపై బట్టలు మార్చుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను సిరిసిల్ల ప్రజలు సోమవారం గుర్తు చేసుకున్నారు. సీఎంకు నిరసన సెగ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని నీలోజిపల్లి గ్రామానికి చెందిన మహిళలు నిరసన తెలిపారు. ఆర్అండ్ఆర్ కాలనీ నుంచి రోడ్డుపైకి ఊరేగింపుగా వస్తున్న మహిళలను, యువకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నిరసన కారులకు తోపులాట జరిగింది. మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మాణ గ్రామమైన మాన్వాడ వాసులు సీఎం పర్యటనకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలో పలువురికి ప్యాకేజీ డబ్బులు అందాల్సి ఉన్న నేపథ్యంలో తమ సమస్యలు సీఎంకు విన్నవించుకుందామని అనుకున్న వారికి నిరాశ ఎదురైంది. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని సీఎం పర్యటనను అడ్డుకుంటామన్న కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. రాజన్నను దర్శించుకునేందుకు వేములవాడకు వెళ్తున్న సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ను ఏబీవీపీ నేతలు వేణుగోపాలస్వామి ఆలయం వద్ద అడ్డుకునేందుకు యత్నించారు. పరిస్థితి గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మహిళలకు గాయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వేములవాడ దర్శనానికి సీఎం బస్సులో వెళ్తుండగా, ఆయనను చూసేందుకు సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ఓ చోట పేర్చిన విద్యుత్ స్తంభాలపై 20 మంది మహిళలు కూర్చున్నారు. సీఎం బస్సు రావడంతో ఒక్కసారిగా అందరూ లేచి నిల్చోవడంతో స్తంభాలు అదుపుతప్పి పక్కకు కూలాయి. దీంతో నక్షత్ర(19), వెంకాయమ్మ(35)లకు తీవ్ర గాయాలయ్యాయి. వేములవాడ రాజన్న ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేస్తున్న సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామిని కుటుంబ సభ్యులతో కలసి సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్, వీటీడీఏ వైస్‌చైర్మన్ పురుషోత్తంరావు, రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఆలయ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం కోడె మొక్కు చెల్లించుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అర్చకులు స్వామివారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. అనంతరం రాజన్నగుడి చెరువులో చేపట్టే అభివృద్ధి పనులను సీఎం పరిశీలించారు. అక్కడే ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించి వీటీడీఏ అధికారులకు పలు సూచనలు చేశారు. -
కలగన్న తెలంగాణ కన్పిస్తోంది
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘తెలంగాణ రాష్ట్రం సాకారమైతే గోదావరి డెల్టా కన్నా అద్భుతంగా ఉంటుందని 2001 ఏప్రిల్‌లో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో తొలి సింహగర్జన సభలో నేను చెప్పిన. కచ్చితంగా నిజాయితీ ఉన్న పోరాటం విజయం సాధిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. ఈరోజు ఆ కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మిడ్‌మానేరు ప్రాజెక్టు మీద నిల్చొని పూజ చేస్తున్నప్పుడు చాలా ఆనందం కలిగింది. జీవితంలో గొప్ప సఫలత్వం సాధించినట్లు అనుభూతి కలిగింది’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. సోమవారం మిడ్‌మానేరును సందర్శించిన అనంతరం కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కలగన్న తెలంగాణ ఇప్పుడు కనిపిస్తోందని భావోద్వేగంతో చెప్పారు. సమావేశంలో కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ఎంత ఆపినా ఆగలేదు.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు ఆపేందుకు వందల కేసులు వేసిన్రు. మిడ్‌మానేరుపైనా వేస్తున్నరు. చిల్లర రాజకీయ ఆటంకాలు ఉన్నా మా ప్రయత్నాలు ఆగలేదు. ఎవరూ ఏ ఆటంకం తలపెట్టినా మేం పురోగమిస్తూనే ఉంటం. కాళేశ్వరం ప్రాజెక్టుతో రెండు పంటలు కలిపి 75 నుంచి 80 లక్షల ఎకరాల పంట పండుతుంది. కాళేశ్వరం పరిధిలో ఇప్పుడు కళకళలాడుతున్న రాజరాజేశ్వర స్వామి జలాశయం, లోయర్ మానేరు జలాశయం ఎప్పుడూ నిండుకుండలా ఉంటయి. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, మల్లన్న సాగర్ నీటి ఖజానాలుగా ఉంటయి. ఎక్కడ నీరు తగ్గినా మిడ్‌మానేరు ఆదుకుంటది. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకే గాక, హైదరాబాద్‌కు, ఎన్టీపీసీ, ఎఫ్‌సీఐ, మిషన్ భగీరథకు నీరు వెళ్తుంది. కరువు కాటకాలకు మారుపేరుగా ఉన్న కరీంనగర్ జిల్లా కాకతీయ కాల్వ, వరద కాల్వ, మానేరు, కాళేశ్వరం డ్యాంల నీటితో పాలుగారే జిల్లాగా జూన్ తర్వాత మనం చూడబోతున్నాం. రాష్ట్రంలో అధికారికంగా 24 లక్షల పంపుసెట్లు రాష్ట్రంలో ఉన్నాయి. అనధికారికంగా మరో మూడు లక్షల పంపు సెట్లు ఉంటాయి. భూగర్భ జలాలు పెరగడంతో బోర్లకు ఉపయోగకరంగా ఉంటుంది’. కమిట్మెంట్ మాకే ఉంది.. రాష్ట్రం మీద కమిట్మెంట్ మాకే ఉంది. ఉద్యమకారులం, రాష్ట్రాన్ని సాధించినం. రాష్ట్రాన్ని ఎక్స్‌రే కళ్లతో చూసినం. రాష్ట్రం మీద టీఆర్ఎస్కు ఉన్న బాధ్యత ఇతర ఏ పార్టీలకు ఉండదు. రాష్ట్రవ్యాప్తంగా 1,230 చెక్‌డ్యాంలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అందులో సింహభాగం కరీంనగర్ జిల్లాలోనే ఉన్నాయి. రూ.1,232 కోట్లతో కరీంనగర్ జిల్లాలో చెక్‌డ్యాంలు రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించాం. మానేరు నది మీద 29 చెక్‌డ్యాంలు, మూలవాగుపై 10 చెక్‌డ్యాంలు నిర్మించేందుకు టెండర్లు పిలవాలని ఆదేశాలు జారీ చేశాం. సోమవారం కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.చిత్రంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్ మొగులుకు మొఖం చూడొద్దు తెలంగాణ రాకముందు గోదావరి ఒరుసుకుని పారిన వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు సంపూర్ణమైన వివక్షకు గురయ్యాయి. ఈ జిల్లాల్లో కరువు ఉండకూడదు. కానీ తీవ్ర వివక్ష కారణంగా ఈ జిల్లాలు కరువుతో తల్లడిల్లాయి. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అప్టూ మిడ్‌మానేరు లింక్ విజయవంతంగా పూర్తయింది. సుమారు 50 నుంచి 60 టీఎంసీలు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతో సంబంధం లేకుండా నీటిని ఎత్తిపోసుకోవడం జరిగింది. దీంతో మిడ్‌మానేరు, లోయర్ మానేరు డ్యాంలు నిండుగా ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల్లో 50 టీఎంసీలు, బ్యారేజీల్లో 60 టీఎంసీల వరకు మొత్తం 110 టీఎంసీల నిల్వ ఉంది. 20 టీఎంసీలు పోయినా నికరంగా 90 టీఎం సీలు ఉంటుంది. రైతులు మొగులుకు మొఖం చూడకుండా నిశ్చింతగా రెండు పంటలు పండించుకునే అవకాశం లభించింది. కరీంనగర్ నుంచి సూర్యాపేట జిల్లాకు నీళ్లు పోతున్నాయి. మహబూబాబాద్, డోర్నకల్, తుంగతుర్తి, సూర్యాపేట టేలెండ్ ప్రాంతాలకు నీళ్లు పోతున్నాయి. చావులు వద్దని రాసెటోళ్లు.. కరీంనగర్ జిల్లాలో 46 వాగులు ఉన్నాయి. ఇన్ని వాగులు ఉండి కూడా ఈ జిల్లా కరువు పాలైంది. ఇదే జిల్లా నుంచి దుబాయ్, గల్ఫ్, బొంబాయిలకు జనం వలసలు పోయిన్రు. సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలు పూర్తిగా కరువు బారినపడ్డాయి. 700 నుంచి 900 ఫీట్ల వరకు బోర్లు వేసినా నీళ్లు పడలే. కరెంటు బాధలు తాళలేక జమ్మికుంటలో భిక్షపతి అనే యువకుడు చచ్చిపోయిండు . సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా రు. ‘చావులు పరి ష్కారం కాదు.. చావకండి’అని అప్పటి కలెక్టర్ గోడల మీద నినాదాలు రాయించిండు. 60 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత ఈ నినాదాలా మనం చూసేదని కళ్లకు నీళ్లు వచ్చినై. కరీంనగర్‌కు జీవధార.. ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో లక్ష్మి, సరస్వతి, పార్వతీ బ్యారేజీలు కలిపి 145 కిలోమీటర్ల మేర గోదావరి 365 రోజులు సజీవంగా ఉంటుంది. ఇది కరీంనగర్ జిల్లాకు జీవధార. బోర్లు రీచార్జి అయినయి. అద్భుతంగా బోర్లు నిండాయని సిరిసిల్ల దగ్గర జిల్లెల్ల, నేరేళ్ల రైతులు చెప్పారు. మిడ్ మానేరు పుణ్యమా అని భూగర్భ జలాలు పైకి ఎగసిపడుతున్నాయి. కాకతీయ కాల్వ పాత కరీంనగర్ జిల్లాలో 200 కిలోమీటర్లు పారుతుంది. మెట్పల్లి దమ్మన్నపేట నుంచి హసన్‌పర్తి దాక 200 కి.మీ కాకతీయ కాల్వ రెండు పంటలకు నీళ్లిస్తుంది. ఎస్సారెస్పీ వరద కాల్వ కూడా 160 కిలోమీటర్లు జిల్లాలో ఉంది. ఈ కాల్వ మొత్తం 365 రోజులు నిండే ఉంటుంది. జిల్లాలో అన్నింటికన్న పొడవైన నది మానేరు. అప్పర్, మిడ్, లోయర్ మానేరు కలిపి 181 కిలోమీటర్ల మానేరు నది సజీవంగా ఉంటుంది. కరీంనగర్లో రూ. 530 కోట్లతో చెక్‌డ్యాంలు ‘రూ.490 కోట్లతో మానేరు మీద 210 చెక్ డ్యాంలు, రూ.40 కోట్లతో మూలవాగు మీద 10 చెక్‌డ్యాంలు కట్టుకోవాలి. జూన్‌లోగా ఇవి పూర్తి చేసి నీటితో నింపుకునేలా సిద్ధంగా ఉండాలి. లండన్ థేమ్స్ నది సజీవంగా ఉన్నట్లు మానేరు నది కూడా ఉంటుందని నేనంటే కొందరు సన్నాసులు వక్రీకరించిన్రు. కొన్ని వెకిలి పార్టీలు హేళన చేíసినయి. జూన్ తర్వాత అలా మాట్లాడిన సన్నాసులకు కూడా మనం చేసిన పని కనబడుతది. కరీంనగర్ మానేరు, మిడ్‌మానేరు, సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలను టూరిజంగా అభివృద్ధి చేస్తాం. పాపికొండల నడుమ గోదావరి కనిపించినట్లే వేములవాడ పుణ్యక్షేత్రం, మిడ్‌మానేరు కలిపి సిరిసిల్లలో కనబడుతుంది. ఏ తెలంగాణ కలగన్ననో ఆ తెలంగాణ కనబడుతంది. 46 నదులు కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. పిచ్చికూతలు కూసేవాళ్లకు ఇన్ని వాగులు ఉన్నట్లు కూడా తెల్వదు. ఈడ ప్రాజెక్టులు కట్టాలని మాకు ఎవ్వరూ దరఖాస్తులు ఇవ్వలేదు. ఎవరూ పైరవీలు చేయలేదు. ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా అభివృద్ధి చేసినం. రాజకీయ వివక్ష లేకుండా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పూర్తి చేసినం. ఈ చెక్‌డ్యాంలను కూడా అలాగే నిర్మిస్తం’అని సీఎం కేసీఆర్ వివరించారు. -
ఆహా.. మిడ్ మా‘నీరు’!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటి తరలింపుతో శ్రీ రాజ రాజేశ్వర రిజర్వాయర్ (మిడ్‌మానేరు) నిండు కుండను తలపిస్తోంది. రిజర్వాయర్ పూర్తి నిల్వ సామర్థ్యం 25.87 టీఎంసీలు కాగా ప్రస్తుతం 25.11 టీఎంసీల మేర నిల్వ ఉంది. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు రిజర్వాయర్‌లోకి 52 టీఎంసీల మేర కొత్త నీరు రాగా, అందులో కాళేశ్వరం ద్వారా ఎత్తిపోసిన నీటి పరిమాణమే 46.46 టీఎంసీలుగా ఉంది. మరో 3.07 టీఎంసీ వరద నీరు కాగా, 2.45 టీఎంసీల నీరు ఎస్సారెస్పీ ద్వారా వచ్చింది. ఇప్పటికే మిడ్‌మానేరు ద్వారా లోయర్ మానేరు డ్యామ్‌కు 29.14 టీఎంసీల మేర నీటిని తరలించారు. ఎల్ఎండీ నుంచి ఎస్సారెస్పీ–2 కాల్వల ద్వారా తుంగతుర్తి, సూర్యాపేట వరకు నీటిని తరలించి చెరువులు నింపారు. అయితే కాళేశ్వరంలో భాగంగా మిడ్‌మానేరు నుంచి నీటిని ప్యాకేజీ–10, 11, 12ల ద్వారా దిగువ అనంతగిరి, రంగనాయక్‌సాగర్ ద్వారా కొండపోచమ్మ వరకు తరలించాల్సి ఉంది. అయితే అనంతగిరి గ్రామం ఖాళీ చేయకపోవడంతో నీటి పంపింగ్ సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో మిడ్‌మానేరు కింద ఆయకట్టుకు కాల్వల ద్వారా నీటిని సరఫరా చేయాలని నీటిపారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రిజర్వాయర్ పరిధిలో చేసే పర్యటన సందర్భంగా కాల్వలకు నీటి విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మిడ్‌మానేరు కుడి, ఎడమ కాల్వల కింద 75 కిలోమీటర్ల కాల్వల తవ్వకం చేయాల్సి ఉండగా, 60కిలోమీటర్లు పూర్తయింది. దీనికింద 80 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఈ యాసంగిలో 25వేల నుంచి 30వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉందని ప్రాజెక్టు వర్గాలు వెల్లడించాయి. -
గోదారి పరుగుకు పునరావాసం అడ్డు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు మిడ్‌మానేరు దిగువకు వచ్చేందుకు పునరావాస ప్రక్రియ అడ్డుగోడగా మారింది. మిడ్‌మానేరు నుంచి కొండపోచమ్మసాగర్ వరకు గోదావరి జలాలను తరలించాలంటే నాలుగు గ్రామాలను ఖాళీ చేయాల్సి ఉండటం, అక్కడ పునరావాస ప్రక్రియ పూర్తయితే కానీ నీళ్లు దిగువకు పారే అవకాశం లేకపోవడం జాప్యానికి కారణమవుతోంది. ఈ ప్రక్రియ అనుకున్నంత వేగంగా సాగకపోవడంతో మరో నెలరోజులైతేకానీ మిడ్‌మానేరు నుంచి నీటిని ఎత్తిపోయడం సాధ్యమయ్యేలా లేదు. సంక్రాంతి తర్వాతే దిగువకు గోదావరి కాళేశ్వరం పథకం ద్వారా ఇప్పటికే మిడ్‌మానేరు వరకు నీటిని తరలించే ప్రక్రియ పూర్తయింది. అవసరాన్ని బట్టి మోటార్లను నడుపుతూ మేడిగడ్డ నుంచి నీటిని మిడ్‌మానేరుకు తరలిస్తున్నారు. మంగళవారం సైతం మిడ్‌మానేరులోకి 9,450 క్యూసెక్కుల మేర నీరు ఎగువ ప్యాకేజీ–6, 8ల ద్వారా పంపింగ్ చేశారు. 25.87 టీఎంసీ సామర్ధ్యం ఉన్న మిడ్‌మానేరులో ఇప్పటికే 23.09 టీఎంసీల నీటి నిల్వ ఉండటంతో ఇక్కడి నుంచి నీటిని లోయర్‌మానేరు డ్యామ్‌కు తరలిస్తున్నారు. నిజానికి మిడ్‌మానేరు నుంచి దిగువన ఉన్న కాళేశ్వరం ప్యాకేజీలు–10, 11, 12ల ద్వారా అనంతగిరి మీదుగా కొండపోచమ్మ వరకు తరలించాల్సి ఉన్నా పునరావాస ప్రక్రియ పూర్తిగాక, నిర్వాసితులు గ్రామాలు ఖాళీ చేయకపోవడంతో దిగువకు నీటి పంపింగ్ జరగడం లేదు. మిడ్‌మానేరు నుంచి నీటిని తోడే పంప్‌హౌస్‌లో 4 మోటార్లు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ఆసియాలోనే పెద్దదైన 0.2 టీఎంసీ నిల్వ సామర్ధ్యం ఉన్న ఓపెన్ సర్జ్‌పూల్‌ను సైతం నీటితో నింపి పెట్టారు. అయితే మోటార్లు నడిపి అనంతగిరి రిజర్వాయర్‌లోకి నీళ్లు ఎత్తిపోసేందుకు మాత్రం పునరావాస ప్రక్రియ అడ్డు వస్తోంది. అనంతగిరి కింద ముంపు గ్రామంగా ఉన్న అనంతగిరి గ్రామం ఇంతవరకు ఖాళీ కాలేదు. ఇటీవలే నిర్వాసితుల పునరావాసానికి రూ.50 కోట్లు ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే ఖాళీ చేయించే ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో పాటే న్యాయపరమైన అంశాలు అడ్డుగా ఉన్నాయి. ఈ గ్రామాన్ని ఖాళీ చేసేవరకు పంపులు నడిపే ఆస్కారమే లేదు. ఈ గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు మరో నెల రోజులైనా పడుతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇక్కడి నుంచి నీటిని తరలించి 15 టీఎంసీల సామర్ధ్యం ఉన్న కొండపోచమ్మసాగర్‌లో నిల్వ చేయాలన్నా దీనికింద మూడు గ్రామాల పునరావాస ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ మూడు గ్రామాల్లోని 900లకు పైగా నిర్వాసిత కుటుంబాలకు తుంకిబొళ్లారం పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణం చేసిచ్చినా, వివిధ కారణాలతో నిర్వాసితులు అక్కడికి వెళ్లలేదు. నిర్వాసితులకు ఇవ్వాల్సిన పెండింగ్ పరిహారంలో ఇటీవలే రూ.50 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులను నిర్వాసితులకు చెల్లించే ప్రక్రియ ఇప్పుడిప్పుడే పుంజుకుంది. ఈ ప్రక్రియ పూర్తయి, నిర్వాసితులు ఖాళీ చేయాలన్నా నెల రోజులు పట్టడం ఖాయంగా ఉంది. దీంతో కొండపోచమ్మ సాగర్‌లో నీటిని నిల్వ చేయాలంటే సంక్రాంతి తర్వాత కానీ సాధ్యపడేలా లేదు. -
వచ్చే ఐదేళ్లు.. రూ.2 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: సాగునీటి రంగాన్ని ఉరకలెత్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మున్ముందు భారీగా నిధులు వెచ్చించనుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను పూర్తిచేస్తూనే కేంద్రం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధాన ప్రక్రియను పరుగులు పెట్టించనుంది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో ఏటా రూ.40 వేల కోట్ల చొప్పున మొత్తం రూ.2 లక్షల కోట్ల మేర ఖర్చు చేయనుంది. దేశంలో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టిన కేంద్ర ప్రభుత్వం, తన బడ్జెట్లో ప్రకటించినట్లుగా రూ.100 లక్షల కోట్లతో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను గుర్తించడం కోసం ఆర్థిక శాఖ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయగా దానికి తెలంగాణ ప్రభుత్వం సమగ్ర నివేదికను సమర్పించింది. ఐదేళ్ల వ్యవధిలో చేపట్టాల్సిన ప్రాజెక్టులపై ఖర్చు చేయనున్న నిధుల వివరాల్ని అందులో పేర్కొంది. మొదట ప్రాజెక్టులు.. ఆపై అనుసంధానం కృష్ణా, గోదావరి నదీజలాల పూర్తి వినియోగానికి వీలుగా ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, డిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టింది. వీటితోపాటే నిర్మాణంలో ఉన్న భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తోంది. వీటి నిర్మాణాలకు భారీగా నిధులు కేటాయిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మినహాయిస్తే 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా సాగునీటి రంగంపై రూ.30 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల మేర నిధులను ఖర్చు చేయనున్నట్లు టాస్క్‌ఫోర్స్‌కు పంపిన నివేదికలో తెలిపింది. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మూడేళ్ల పాటు రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తామని, పాలమూరు–రంగారెడ్డికీ ఇలాగే నిధులు వెచ్చిస్తామని, నదుల అనుసంధానంతో సహా మొత్తంగా వచ్చే ఐదేళ్లలో సాగునీటి రంగంపై రూ.2 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. 2023–24 నాటికి కొత్తగా చేపట్టిన భారీ ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తవుతాయని, ఆపై నిధుల ఖర్చంతా గోదావరి–కృష్ణా నదుల అనుసంధానంపైనేనని వెల్లడించింది. టాస్క్‌ఫోర్స్‌కు ఎందుకీ ఐదేళ్ల ప్రణాళిక? కేంద్ర ప్రభుత్వం 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తయారు కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు రూ.100 లక్షల కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంది. ఈ క్రమంలో చేపట్టా్టల్సిన ప్రాజెక్టులపై సమగ్ర నివేదిక రూపకల్పనకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి చైర్మన్ కాగా, వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, నీతి ఆయోగ్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. 2019–20 నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరం దాకా చేపట్టాల్సిన కార్యాచరణను టాస్క్‌ఫోర్స్ తన నివేదికలో పొందుపరుస్తుంది. దీనికోసం మౌలిక వసతుల రంగంలో ఖర్చుచేసే నిధుల వివరాలివ్వాలని టాస్క్‌ఫోర్స్ ఆయా రాష్ట్రాలను కోరింది. దీంతో రాష్ట్ర ఆర్థిక శాఖ వివిధ శాఖల ఐదేళ్ల ప్రణాళికల వివరాలను సేకరించి కేంద్రానికి సమర్పించింది. దీని ఆధారంగా ఎఫ్ఆర్బీఎం పరిమితుల సడలింపు, కేంద్రసంస్థల నుంచి ఆర్థిక సాయం, రుణ సేకరణ అవకాశాలు వంటివి కేంద్రం పరిశీలిస్తుంది. -
కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం
సాక్షి, హైదరాబాద్ : పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి పర్వతాల్లో పుట్టి నాసిక్‌లోని త్రయంబకేశ్వరుడిని స్పృశిస్తూ తెలంగాణలో బాసర జ్ఞానసరస్వతికి ప్రణమిల్లుతూ గలగలపారుతూ భద్రాద్రిలో శ్రీరామచంద్రుడి పాదాలను తాకుతూ ప్రవహించే గోదావరి ఇప్పుడు దిశ మార్చుకుంది. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత సంగమ ప్రదేశంలో గోదావరి ప్రవాహ దిక్కు మారింది. ఈ అద్భుతాన్ని ఆవిష్కరించి నీరు పల్లమెరుగన్న మాటకు కాలం చెల్లిందని నిరూపించింది ఇంజినీరింగ్ దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. గోదావరి దిశ మార్చిన మేఘా తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. గోదావరి జలాలతో రాష్ట్రమంతా సస్యశ్యామలంగా ఉండాలనే సదాశయంతో రూపొందించిన పథకం ఇది. ప్రత్యక్షంగా కొంత ప్రాంతాన్ని, పరోక్షంగా కొంత ప్రాంతాన్ని మొత్తంగా తెలంగాణ అంతటికి నీరందించే ప్రాజెక్టు ఇది. భారీ ప్రాజెక్టులను అతి వేగంగా పూర్తి చేస్తూ సాగు, తాగునీటి రంగంలో అద్భుతాలు సృష్టిస్తూ సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ గోదావరి దిశ మార్చుతూ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక భూమిక పోషించింది. ప్రపంచంలో ఇంత వరకు ఎవరూ ఉపయోగించని భారీస్థాయి పంపులు కాళేశ్వరం ప్రాజెక్టు పంపుహౌజుల్లో ఏర్పాటు చేసి లిఫ్ట్ ఇరిగేషన్‌కు కొత్త భాష్యం చెప్పింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నది అయిన గోదావరిని దిగువ నుంచి ఎగువకు ప్రవహించేలా చేసి ఎలక్ట్రోమెకానికల్ రంగంలో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా తొలిసారిగా ఓ భారీ నదిని గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా సముద్రమట్టానికి 300 మీటర్ల ఎగువకు నీరు ఎదురు ప్రవహించేలా చేసిన అద్భుతాన్ని తెలంగాణ రాష్ట్రం సొంతం చేసుకుంది. మూడేళ్లలో పూర్తి ఆంధ్రప్రదేశ్‌లోని హంద్రీ-నీవా, అమెరికాలోని కొలరాడో, ఈజిప్టులోని గ్రేట్‌మ్యాన్‌మేడ్ రివర్ వంటి వాటికి ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టులుగా గుర్తింపు ఉంది. కాని వాటి పంపింగ్‌తో పోలిస్తే కాళేశ్వరం తక్కువ సమయంలో వాటికన్నా ఎక్కువ నీటిని ఎగువకు ఎత్తిపోసింది. ప్రపంచ నీటిపారుదల రంగంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఈ అద్భుతం ఆవిష్కృతం కావడం వెనుక మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) అనితర సాధ్యమైన కృషి ఉంది. సాంకేతికంగా, విద్యుత్‌పరంగా ఎన్నో సంక్లిష్టతలు ఉన్నా అకుంఠిత దీక్షతో ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది మేఘా వాస్తవానికి ఇంత భారీస్థాయి ప్రాజెక్టులు పూర్తికావడానికి దశాబ్దాలు పడుతుంది. నాగార్జున సాగర్, శ్రీరామ్, శ్రీశైలం, తెలుగు గంగ ప్రాజెక్టులు పూర్తి కావడానికి 20 ఏళ్లకు పైగా పట్టింది. అయినా ఇవి ఇప్పటికీ పూర్తిస్థాయి వినియోగంలోకి రాలేదని అందరూ అంగీకరిస్తారు. కాళేశ్వరంలో ప్రాజెక్ట్‌లో క్లిష్టమైన పనులు ఎన్నో ఉన్నప్పటికీ మూడేళ్లలో దాన్ని పూర్తికావడం అరుదైన విషయం. రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోతల పథకాల నిర్మాణం సాధారణ సాగునీటి ప్రాజెక్టుల్లాగా సులభంగా ఉండదు. అందులోనూ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భూగర్భంలో పంప్‌హౌస్‌లు, సొరంగాలు ఉన్నాయి. సాంకేతిక పనులు, ఇంజినీరింగ్ రంగంలో ముఫ్పై ఏళ్ల అనుభవం, నైపుణ్యాన్ని రంగరించి ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలన్న పట్టుదలతో అన్ని సవాళ్లను అధిగమించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది మేఘా ఇంజినీరింగ్. రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయగల సామర్ధ్యం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెకుకు ఉంది. నీటిని ఎత్తిపోసేందుకు లక్ష్మీ, సరస్వతి, పార్వతి, గాయత్రి పంపు హౌసుల్లో ఏర్పాటు చేసిన పంపులు సామర్థ్యం విషయంలో దేనికవే విశిష్టమైనవి. నాలుగు పంపు హౌసులు ఇప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. పంపు హౌజుల్లో అతి క్లిష్టమైనది లక్ష్మీపూర్ గాయత్రి. భూమికి 470 అడుగుల లోతున నిర్మించిన ఈ పంప్ హౌజ్ అన్ని రిజర్వాయర్లలో ఏడాది అంతా నీరు నిల్వ ఉండేలా చూస్తుంది. జంట సొరంగాలతో కూడిన ఈ పంపు హౌసులో నిర్మించిన భారీ సర్జ్ పూల్స్ ప్రపంచంలోనే అతి పెద్దవి. ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 7 మోటర్లు ఇందులో ఉన్నాయి. ఈ మోటర్లు రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయగలవు. మేకిన్ ఇండియాలో భాగంగా దేశీయంగా తయారు చేసిన భారీ మోటర్లు ఇవి. ఒక్కో మోటర్ పంపు బరువు 2376 మెట్రిక్ టన్నులు ఉంటుంది. సాధారణంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పంప్ హౌసులను నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా భూమికి సమానంగా నది ఒడ్డున నిర్మిస్తారు. కాని భూమి లోపల నిర్మించిన గాయత్రి పంప్ హౌస్ మాత్రం ఎంతో విశిష్టమైన నిర్మాణం. దీని కోసం 21.6 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వారు. కిలోల్లో చెప్పాలంటే ఇది కోట్లలో ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, సలహాలు సూచనలు, ప్రోత్సాహంతో ఈ ఇంజినీరింగ్ అద్భుతాన్ని మేఘా ఇంజినీరింగ్ పూర్తి చేయగలిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో దాదాపు 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పరిశ్రమలకు అవసరమైన నీరు ఈ ప్రాజెక్టు ద్వారా అందుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో మేడిగడ్డ నుంచి సిరిసిల్ల వరకు ఇసుకమేటలుగా కనిపించే ప్రదేశమంతా ఇప్పుడు సస్యశ్యామలం కాబోతోంది. గోదావరి దశ-దిశను మార్చయడంలో ఇంజినీరింగ్ దిగ్గజం మేఘా అద్భుతమైన పాత్ర పోషించింది. -
కేసీఆర్ 2.0 @ 365
కాళేశ్వరం జాతికి అంకితం.. రాష్ట్రంలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ కలసి గత జూన్ 21న ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి ఆయ కట్టుకు నీరందించేందుకు రాత్రింబవళ్లు పనులు కొనసాగుతున్నాయి. తొలి ఏడాదే అమలైన హామీలు.. ►రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ కొనసాగిస్తున్నారు. ►అన్ని రకాల ఆసరా పెన్షన్లను రూ.1,000 నుంచి రూ.2,016కు, వికలాంగుల పెన్షన్లను రూ.1,500 నుంచి రూ.3,016కు ప్రభుత్వం పెంచింది. వృద్ధాప్య పెన్షన్ల కనీస అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. దాదాపు 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు చెల్లించేందుకు ఏటా రూ.5,300 కోట్లు ఖర్చు చేస్తోంది. ►రైతు బంధు కింద ఎకరానికి రూ.8 వేలు చొప్పున ఏడాదికి అందిస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.10 వేలకు పెంచింది. 30 రోజుల ప్రణాళిక.. కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంతో పాటు గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతంగా అమలు చేశారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రెండో పర్యాయం బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తయింది. రైతు సంక్షేమం, సబ్బండ వర్గాల అభ్యున్నతి కార్యాచరణను యథాతథంగా అమలు చేస్తూ పాలనలో గత ఒరవడిని కొనసాగించారు. రైతుబంధు, ఆసరా పెన్షన్ల పెంపు హామీలను తొలి ఏడాదే అమల్లోకి తెచ్చి సంక్షేమ రంగాన్ని మరింత పటిష్టం చేశారు. పాలనలో సంస్కరణల కొనసాగింపు దిశగా పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాల రూపకల్పనకు దృష్టిసారించారు. మున్సిపల్, రెవెన్యూ శాఖల్లో అవినీతిని సమూలంగా నిర్మూలించేందుకు ఇప్పటికే కొత్త మున్సిపల్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ముసాయిదా రెవెన్యూ చట్టాన్ని సిద్ధం చేశారు. సుపరిపాలన, అవినీతి నిర్మూలన, జాప్యాలను తుద ముట్టిం చాలనే లక్ష్యంతో ఈ చట్టాల రూపకల్పనకు సీఎం శ్రీకారం చుట్టారు. ఇక సీఎం దృష్టంతా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై కేంద్రీకృతమైంది. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ, నిరంతరం సమీక్షిస్తూ, క్షేత్రస్థాయి పర్యటనలతో పరుగులు పెట్టించారు. పొరుగు రాష్ట్రంతో సత్సంబంధాలు.. పొరుగు రాష్ట్రం ఏపీతో సంబంధాలు మెరుగయ్యాయి. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, ఏపీల మధ్య నెలకొన్న విభేదాలు, వివాదాలను చర్చల ద్వారా పరిష్కారానికి రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన కృషి కొంత వరకు ఫలించింది. ఇచ్చిపుచ్చుకునే విధానంలో రెండు రాష్ట్రాలు ఇప్పటికే పలు వివాదాలను పరిష్కరించుకుని పరస్పరం సహకరించుకుంటున్నాయి. వివాదస్పదమైన నిర్ణయాలు.. రాష్ట్రానికి కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయాలను నిర్మించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ఎర్రంమంజిల్ భవనాన్ని కూల్చేసి అక్కడే రూ.400 కోట్లతో కొత్త అసెంబ్లీ భవనాన్ని, ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చి రూ.100 కోట్లతో కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మిస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఉద్యోగ, కార్మిక వర్గాల్లో అసంతృప్తి.. పీఆర్సీ, పదవీ విరమణ వయసు పెంపు, పదోన్నతులు వంటి హామీల అమల్లో జాప్యంపై ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన 52 రోజుల సమ్మె సైతం ప్రభుత్వం, ఉద్యోగ, కార్మిక వర్గాల మధ్య దూరాన్ని మరింత పెంచింది. ఇక రెవెన్యూ శాఖలో పెట్రేగిపోయిన అవినీతి నిర్మూలనకు తీసుకొస్తున్న కొత్త రెవెన్యూ చట్టంతో తమ ఉద్యోగ ప్రాధాన్యతలు తగ్గిపోతాయని ఆ శాఖ కింది స్థాయి అధికారుల్లో ఆందోళన నెలకొని ఉంది. మాంద్యం దెబ్బకు కొత్త పనులకు బ్రేక్.. ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు గత ఫిబ్రవరిలో రూ.1,82,087 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టగా, గత సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన పూర్తి స్థాయిలో బడ్జెట్‌ను రూ.1,46,492.30 కోట్లకు తగ్గించుకుంది. ఆర్థిక మాంద్యం ప్రభావంతో రాష్ట్ర రాబడులు తగ్గిపోవడం, కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాలు రాకపోవడంతో 2019–20కి సంబంధించిన బడ్జెట్ అంచనాలను ప్రభుత్వం కుదించాల్సి వచ్చింది. దీని ప్రభావం అభివృద్ధి పనులపై పడింది. ఇప్పటికే ప్రారంభించిన పనులను పూర్తి చేయాలని, కొత్త పనులు చేపట్టరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి ఏడాదే అమలైన హామీలు.. – రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్ని కొనసాగిస్తున్నారు. – అన్ని రకాల ఆసరా పెన్షన్లను రూ.1,000 నుంచి రూ.2,016కు, వికలాంగుల పెన్షన్లను రూ.1,500 నుంచి రూ.3,016కు ప్రభుత్వం పెంచింది. వృద్ధాప్య పెన్షన్ల కనీస అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. దాదాపు 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు చెల్లించేందుకు ఏటా రూ.5300 కోట్లు ఖర్చు చేస్తోంది. – రైతు బంధు కింద ఎకరానికి రూ.8 వేలు చొప్పున ఏడాదికి అందిస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.10 వేలకు పెంచింది. నెరవేరాల్సిన హామీల్లో ప్రధానమైవని.. – ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ. పదవీ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పొడిగింపు – రైతులకు రూ.లక్ష వరకు పంట రుణాల మాఫీ – నిరుద్యోగులకు నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి చెల్లింపు – సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల చెల్లింపు – ఉద్యోగాల నియామకాలకు గరిష్ట వయోపరిమితిని 3 ఏళ్లు పెంపు కొనసాగించడం. -
కాళేశ్వరానికి.... ‘అనంత’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను మిడ్‌మానేరు నుంచి దిగువకు తరలించేందుకు అనంతగిరి గ్రామం తరలింపు అడ్డంకిగా మారింది. ఈ రిజర్వాయర్ నిర్మాణం కింద పూర్తిగా ముంపునకు గురౌతున్న ఈ గ్రామాన్ని ఖాళీ చేయడంలో జాప్యం జరుగుతోంది. దీంతో నీటిని పంపడం సాధ్యం కావడం లేదు. ఈ ఒక్క గ్రామాన్ని తరలిస్తే కొండపోచమ్మసాగర్ వరకు నీటిని తరలించే అవకాశం ఉండటంతో దీని తరలింపును వేగిరం చేయాలని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులకు ఆదేశించారు. ఒక్క గ్రామం తరలిస్తే దిగువకు గోదావరి.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే లక్ష్మీ, సరస్వతి, పార్వ తి బ్యారేజీలను పూర్తిగా నింపారు. వీటి దిగువన ఉన్న ఎల్లంపల్లి బ్యారేజీని ప్రస్తుతం నింపుతున్నా రు, ఇప్పటికే బ్యారేజీలో 20.18 టీఎంసీలకు గానూ 13 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ఎగువన పార్వతి బ్యారేజీ నుంచి 11,197 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. మరో వారం రోజు ల్లో ఇదికూడా నిండనుంది. వీటి దిగువనున్న మిడ్‌మానేరు రిజర్వాయర్‌ను ఇప్పటికే నింపారు. ఇక్కడ 25.87 టీఎంసీల నిల్వలకు గానూ 20.10 టీఎంసీల నిల్వ ఉంది. వాటర్ ప్రోటోకాల్ ప్రకారం ఇంతవరకే నీటిని నింపి, లీకేజీలు గమనించాక మరో 15 రోజుల తర్వాత పూర్తిగానింపనున్నారు. మిడ్‌మానేరు నుంచి నీటిని అనంతగిరి రిజర్వాయర్‌లోకి తరలించేలా 64.5 మెగావాట్ల సామర్థ్యం గల 4 పంపులు సిద్ధమయ్యాయి. 12.03 కి.మీల టన్నెల్ పూర్తయింది. అనంతగిరి కింద కొచ్చగుట్టపల్లి, అనంతగిరి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురౌతున్నాయి. ఈ గ్రామాల్లో 2వేల ఎకరాల భూసేకరణతో పాటు సహాయ పునరావాసం కింద వెయ్యి గృహాలను తరలించాల్సి ఉంది. రూ.75కోట్లతో భూసేకరణ ప్రక్రియ చేపట్టి, కొచ్చ గుట్టపల్లిలోని 102 నిర్వాసిత కుటుంబాలను తరలించినా, అనంతగిరిలో మాత్రం పూర్తి కాలేదు. ఇక్కడనుంచి 839 గృహాలను, 1140 కుటుంబాలను తరలించాల్సి ఉన్నా, పునరావాస సాయం పూర్తిగా అంద లేదు. రూ.150 కోట్లకు గాను రూ.100 కోట్లు ఇచ్చి మరో రూ.50కోట్లు చెల్లించలేదు. పునరావాస సాయం అందకపోవడంతో గ్రామంలోనే నిర్వాసితులు ఈ యాసంగిలోనూ సాగుకు సిద్ధమయ్యారు. నీటిని ఎత్తిపోసేందుకు అనంతగిరి గ్రామం ఖాళీ చేయాల్సి ఉందని ప్రాజెక్టు ఇంజనీర్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో దీన్ని పరిశీలించాలని తన కార్యాలయ కార్యదర్శిస్మితా సబర్వాల్‌ను సీఎం ఆదేశించారు. ఇటీవలే అక్కడ పర్యటించిన ఆమె, పునరావాస సాయం కింద రూ.50 కోట్లను విడుదల చేయాలని ఆర్ధిక శాఖను ఆదేశించారు. దీంతో బోర్లకు, బోరు బావుల మోటార్లకు కరెంట్ సరఫరా నిలిపివేయాలని సిరిసిల్లా జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ భాషా ఉత్తర్వులు జారీ చేశారు. -
బాహుబలులన్నీ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని గాయత్రి (ప్యాకేజీ–8) పంప్‌హౌస్‌లోని బాహుబలి మోటార్ల న్నింటికీ పరీక్షలు పూర్తయ్యాయి. నిర్ణీత రెండు టీఎంసీల మేర గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా గాయత్రి పంపింగ్ కేంద్రం సిద్ధమైంది. అతితక్కువ సమయం లో పంపింగ్ కేంద్రాన్ని నిర్మించ డంతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ కొత్త రికార్డు సృష్టించింది. ఎల్లంపల్లి దిగువన ఉన్న నందిమేడారం పంప్‌హౌస్ పరిధిలో 124.5 మెగావాట్ల విద్యుత్‌తో నడిచే మోటార్లను ఏర్పాటు చేస్తుండగా, దాని దిగువన గాయత్రి పంప్‌హౌస్‌లో మోటార్ల సామర్థ్యం మరో 15 మెగావాట్ల మేర ఎక్కువగా అంటే 139 మెగావాట్ల సామర్థ్యం ఉండే పంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మొత్తంగా 7 మోటార్లను ఏర్పాటు చేసి రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించాల్సి ఉంది. ఒక్కో మోటారు 15 మీటర్ల ఎత్తు అంటే 4 అంతస్తులు ఉంటుంది. వ్యాసం 22 మీటర్లు, బరువు 650 టన్నులుగా ఉంది. ఈ మోటార్లు 115 మీటర్ల లోతు నుంచి 3,200 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నీటిని ఎత్తిపోస్తుంది. ఈ పంప్‌హౌస్‌లో మొదటి పంప్‌హౌస్‌కు ఈ ఏడాది ఆగస్టు 11న మొదటి మోటార్‌ను ప్రారంభిం చగా, అదేనెల 14న రెండు, 20న మూడు, 31న నాలుగు, సెప్టెంబర్ 18న ఐదు, అక్టోబర్ 19న ఆరు మోటార్లను ప్రారంభించారు. శనివారం మిగిలిన ఏడో మోటార్‌ను ఈఎన్ సీ నల్లా వెంకటేశ్వర్లు, ఎత్తిపోతల పథ కాల సలహాదారు పెంటారెడ్డి, ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ నూనె శ్రీధర్ల ఆధ్వర్యంలో ప్రారంభించారు. మోటార్ దిగ్విజయంగా నడవడంతో ఇక్కడ నూటికి నూరు శాతం మోటార్లన్నీ సిద్ధమైనట్లయింది. నెలాఖరుకు పూర్తి స్థాయిలో.. ఇక ఇప్పటికే లక్ష్మి (మేడిగడ్డ), సరస్వతి(అన్నారం)లలో మోటార్లు వెట్రన్లు పూర్తి చేసుకుని రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటన్నింటినీ మేఘా ఇంజనీరింగ్ సంస్థే పూర్తి చేసింది. ఇక సుందిళ్ల (పార్వతి)లో తొమ్మిది మోటార్లలో ఎనిమిది మాత్రమే సిద్ధమయ్యాయి. దీన్ని ఈ నెలాఖరుకు పూర్తి చేయనున్నారు. ఇక ప్యాకేజీ–6లో మరో మోటార్‌కు వెట్‌రన్ నిర్వహించాల్సి ఉండగా, దానికి నెలాఖరున పూర్తి చేయనున్నారు. ఇవన్నీ పూర్తయితే తొలిదశలో కాళేశ్వరం ఎత్తిపోతలు పూర్తిస్థాయిలో సిద్ధమైనట్లే. -
కాళేశ్వరానికి సాయం చేయండి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో కనీసం కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచైనా సాయం తీసుకోవా లని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బృహత్తర లక్ష్యా లతో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో మున్ముందు ఖర్చు చేయాల్సిన నిధుల్లో కొంతైనా కేంద్రం నుంచి రాబట్టుకోవాలనే కృత నిశ్చయంతో ఉంది. ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంకే ఎస్‌వై)లో భాగంగా ఉన్న సత్వర సాగునీటి ప్రాయోజిత కార్య క్రమం (ఏఐబీపీ)లో అయినా ఈ పథకాన్ని చేర్పించే దిశగా ప్రణాళి కలు రచిస్తోంది. ప్రాజెక్టు పూర్తికి ఇంకా రూ. 28 వేల కోట్ల మేర నిధుల అవసరాలను లెక్కగడుతున్న ప్రభుత్వం... వాటికి ఏమాత్రం కేంద్ర సాయమందించినా రాష్ట్రానికి పెద్ద ఊరటే అంటోంది. జాతీయ హోదా కాకున్నా.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశం ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణ లోని ఏదైనా ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలనే అంశం స్పష్టంగా ఉందని, దానికి అనుగుణంగా కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు టీఆర్ఎస్, ఇతర పార్టీల ఎంపీలు పార్లమెంటు లోపలా, వెలుపల డిమాండ్ చేస్తున్నారు. జాతీయ హోదా విషయమై పలుమార్లు స్వయంగా సీఎం కేసీఆర్ ప్రదానికి విన్నవించారు. రెండోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సైతం జరిగిన నీతి ఆయోగ్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ హోదా అంశాన్ని గుర్తుచేసింది. అనంతరం కేంద్ర బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు దీనిపై వినతులు వెళ్లాయి. అయినా దీనిపై కేంద్రం నుంచి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో ఏఐబీపీ కింద ద్వారా అయినా నిధులు రాబట్టుకోవాలని ఆలోచిస్తోంది. నిజానికి ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 80,190 కోట్లుగా ఉండగా అందులో ఇప్పటికే తెలంగాణ రూ. 51,666 కోట్ల మేర ఖర్చు చేసింది. మరో రూ. 28 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నిధులకు ఏఐబీపీ కింద సాయం కోరే అవకాశం రాష్ట్రాలకు ఉంది. ఎలాంటి భారీ ప్రాజెక్టు పరిధిలో అయినా ప్రధాన పనుల్లో 50 శాతం పూర్తయితే ఏఐబీపీ కింద సాయం కోరవచ్చు. ప్రస్తుతం ప్రాజెక్టు పరిధిలో 65 శాతం పనులు పూర్తవగా రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే 9 రకాల అనుమతులు రాగా ఇంకా ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే ఏఐబీపీ కింద నిధులు అందే అవకాశం ఉంటుంది. -
గోదారి తడారదు : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజె క్టుతో అన్నీ అద్భుతాలే జరుగుతున్నాయని, ఇకపైనా అద్భుతమే జరుగుతుందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజె క్టుతో ఆరునూరైనా 45 లక్షల ఎకరాల ఆయ కట్టుకు నీరందిస్తామని, గోదావరి నదిని సజీవం చేస్తామని తెలిపారు. ఇప్పటికే గోదా వరి 250 కిలోమీటర్లు ఉల్టా నడుస్తోందని, వరద కాల్వ అంతా పెద్ద రిజర్వాయర్‌గా మారిందని పేర్కొన్నారు. కాళేశ్వరం నీళ్లతో చెరువులు నింపుతుండటంతో ప్రజలంతా పండుగ చేసుకుంటున్నారని చెప్పారు. పున రుజ్జీవ పథకంతో ఎస్సారెస్పీ కింద 7 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అయినట్లేనని, ప్రస్తుతం సగం టీఎంసీ నీటిని తీసుకునేలా పంపులు సిద్ధం చేయగా, మరో 30 రోజుల్లోనే ఒక టీఎంసీ నీటిని ఎస్సారెస్పీకి తరలించే చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌రావు, బాల్క సుమన్ అడిగిన ప్రశ్నలకు సీఎం బదులిచ్చారు. ఎస్సారెస్పీకి టీఎంసీ నీరు.. ‘పునరుజ్జీవ పథకంలో ఇప్పటికే 0.5 టీఎంసీల నీటిని తరలించేలా ఐదేసి మోటార్లు సిద్ధమ య్యాయి. దీంతో ఎస్సారెస్పీ కింద 7 లక్షల ఎకరాలు స్థిరీకరణ అయినట్లే. ఇప్పటికే వరద కాల్వ.. రిజర్వాయర్‌గా మారడంతో 35 చెరు వులు నిండాయి. ఒక టీఎంసీ నీటిని మరో నెలలో ఎస్సారెస్పీకి తరలించే వ్యవస్థ సిద్ధమైతే, ఈ ఆయకట్టంతా సురక్షితమే’అని సీఎం కేసీఆర్ వివరించారు. గోదావరిలో సెప్టెంబర్ తర్వాత నీళ్లుండవని, అక్టోబర్‌లో 170 టీఎంసీలు, నవం బర్లో 40 నుంచి 50 టీఎంసీల లభ్యత ఉంటుం దని పేర్కొన్నారు. ప్రస్తుతం మరో 15 రోజులు ఉధృతంగా వర్షాలుండే అవకాశలుండటంతో.. కరెంటు ఖర్చు కావొద్దని ప్రస్తుతం కాళేశ్వరం పంపులు నడపట్లేదని తెలిపారు. ‘ఇప్పటికే మేడారంలో 129 మెగావాట్లు, గాయత్రి పంప్‌హౌజ్‌లో 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 బాహుబలి మోటార్లలో 5 మోటార్లు సిద్ధమయ్యాయి. పదిహేను, ఇరవై రోజుల్లో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. మరో 15 రోజుల్లోనే రోజుకు 2 టీఎంసీల నీటిని తీసుకునేలా వ్యవస్థ సిద్ధమవుతుంది. ఇందులో ఒక టీఎంసీని ఎంఎండీ, ఎల్ఎండీలకు తరలించి కోదాడ వరకు ఉన్న ఆయకట్టుకు నీరందిస్తాం’అని ఆయన చెప్పారు. అప్పులు సద్వినియోగం.. కాళేశ్వరం కోసం చేసిన అప్పులను సద్వినియోగం చేస్తున్నామని, ఈ ప్రాజెక్టుతో నిజాం సాగర్, సింగూరు ప్రాంతాలకు నీరిస్తామని తెలిపారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు పూర్తయితే సింగూరు, నిజాం సాగర్ ప్రాజెక్టుల్లో ఎప్పుడూ నీరు లభ్యతగా ఉంటుందని వివరించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని రేగొండ మండల పరిధిలో సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఊరికి కాళేశ్వరం జలాలు వచ్చాయని, ఆయన సైతం దీనిపై హర్షం వ్యక్తం చేసినట్లు గుర్తు చేశారు. తమ్మిడిహెట్టి బ్యారేజీని 148 మీటర్ల ఎత్తులో నిర్మించి.. ఆదిలాబాద్ జిల్లలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిస్తామని, ఇక్కడ లభ్యతగా ఉన్న 40 నుంచి 45 టీఎంసీల నీటిని పూర్తి స్థాయిలో వినియోగిస్తామని వివరించారు. అలాగే కుఫ్టి రిజర్వాయర్‌ను పూర్తి చేస్తామని చెప్పారు. వీక్లీ ఆఫ్‌పై త్వరలో నిర్ణయం.. పోలీసులకు వీక్లీ ఆఫ్ఫై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ వెల్లడించారు. 10 రోజులకు ఓసారి ఆఫ్ ఇవ్వడమా.. లేదా వారానికోసారి ఇవ్వడమా... అన్న దానిపై డీజీపీ, హోం శాఖ కార్యదర్శి చర్చిస్తున్నట్లు తెలిపారు. విపత్తుల నిర్వహణ, విపత్తుల నివారణను ఏకకాలంలో ఒకేచోట నుంచి పరిశీలించి అధ్యయనం చేసేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉపయోగపడుతుందని మరో ప్రశ్నకు తెలిపారు. -
హరీశ్, జీవన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మధ్య శాసన మండలిలో శనివారం మాటల యుద్ధం నడిచింది. ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ఎలాంటి విఙ్ఞప్తులు రాలేదని రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రకటించారని జీవన్‌రెడ్డి మండలి దృష్టికి తెచ్చారు. కాళేశ్వరానికి జాతీయ హోదా విషయంలో కేంద్రం చెబుతోంది తప్పా.. రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది తప్పా..? అని ప్రశ్నించారు. కాగా జీవన్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు స్పందించారు. కాళేశ్వరం ప్రాజక్టుకు జాతీయ హోదా దక్కకుండా చేసిన పాపమంతా కాంగ్రెస్‌దేనని అన్నారు. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి, ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదాను ఎందుకు విస్మరించారని నిలదీశారు. (చదవండి : హరీశ్.. తొలిసారి) స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన మంత్రిని కలిసి అన్ని ప్రాజెక్టుల గురించి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసిందని తెలిపారు. ఇంత కంటే ఏం సాక్ష్యాలు కావాలని అన్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేసులు వేసినోళ్ల పేర్లను సభా ముఖంగా తానే వెల్లడించానని హరీశ్ చెప్పారు. అయితే, ఎవరి తప్పు ఎలా ఉన్నా... రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారం పడుకుండా చూడాలని జీవన్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే... ఎవరు తప్పు చెబుతున్నారో తెలుస్తుంది కదా అని పేర్కొన్నారు. -
గిట్టుబాటే లక్ష్యం : మంత్రి గంగుల
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో సాగునీటి వన రుల కల్పన పెరిగింది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో ప్రభు త్వం పూర్తి చేస్తోంది. కాల్వలు, చెరువుల కింద గరిష్ట నీటి వినియోగం జరుగుతుండటంతో వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అందుకు తగ్గట్లే ధాన్యం సేకరణ చేయాల్సి ఉంది. ఈ ఖరీఫ్ నుంచే 50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉంది. దానికి తగినట్టే రైతుల నుంచి సేకరించే గింజ గింజకూ మద్దతు ధర దక్కేలా చూడటమే మా ముందున్న తొలి ప్రాధాన్యం’ అని రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈ రెండు శాఖలను సీఎం కేసీఆర్ తనకు కేటాయించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇటీవల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కమలాకర్ గురువారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. సివిల్ సప్లయ్స్ శాఖ ప్రక్షాళన... పౌరసరఫరాల శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తాం. రెండు, మూడు రోజుల్లోనే సమీక్షా సమావేశం నిర్వహించి ప్రాధాన్యతాంశాలపై చర్యలు చేపడతాం. ఏమాత్రం అవినీతికి ఆస్కారం లేని విధంగా పేదలకు బియ్యం, ఇతర నిత్యావసరాల సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం. బీసీ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం రాష్ట్రంలోని బీసీ వర్గాల సంక్షేమానికి ప్రభు త్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ వర్గాలకు పూర్తి న్యాయం చేసేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లతోపాటు వెనుకబడిన వర్గాలకు వివిధ సంక్షేమ పథకాల అమలుకు చర్యలు చేపడతాం. బీసీ వర్గాల్లో అనందం కలిగించే ధ్యేయంతో పనిచేస్తాం. ధాన్యం సేకరణకు ముందస్తు ప్రణాళికలు రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీడు భూములకు సాగునీరు చేరి వరి సాగు పెరగనుంది. ఫలితంగా రాష్ట్రంలో ధాన్యం దిగుబడి గణనీయంగా పెరగనుంది. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. ధాన్యం సేకరణ, ఇతర అంశాలకు సంబంధించి ప్రభుత్వం–మిల్లర్ల మధ్య పూర్తిస్థాయిలో పరస్పర సహకారం ఉండేలా చూస్తాం. ప్రజలకు ఏమాత్రం ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. -
‘మేఘా’ సిగలో మరో కీర్తి కిరీటం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇ్రన్ఫాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్)కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక సంస్థ ఇండియన్ కాంక్రీట్ ఇనిస్టిట్యూట్ (ఐసీఐ)నుంచి ఉత్తమ కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డు అందుకుంది. కాంక్రీట్ డే సందర్భంగా ఐసీఐ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు హోటల్లో కాంక్రీట్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీఐ అధ్యక్షుడు వినయ్ గుప్తా చేతుల మీదుగా ఉత్తమ కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డును ఎంఈఐఎల్ డైరెక్టర్ బి.శ్రీనివాస్ రెడ్డితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్, ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఇతర కంపెనీల ప్రతినిధులు అందుకున్నారు. ఈ సందర్భంగా బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..‘ఈ అవార్డును అందుకోవడం గర్వంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు లో ఎంఈఐఎల్ భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్టు కోసం పనిచేసిన 1,500 మంది ఇంజనీర్లు, సిబ్బందికి ఈ అవార్డును అంకితం ఇస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలతోనే ఈ ప్రాజెక్టును ఇంత త్వరగా పూర్తిచేయగలిగాం’అని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని అమెజాన్ భవనానికి, ఖాజాగూడ నుంచి నానక్ రామ్‌గూడ వరకు ఏర్పాటు చేసిన వైట్ ట్యాపింగ్ రోడ్‌తో పాటు వివిధ జిల్లాల్లోని ఉత్తమ కాంక్రీట్ నిర్మాణాలకు కూడా అవార్డులు అందించారు. -
ప్రత్యేకత చాటుకుంటున్న ’మేఘా’
కరీంనగర్: తెలంగాణలో పుడమిని చీల్చుకుంటూ గోదారమ్మ పొంగిపొర్లుతూ ఉరకలేస్తోంది. భూగర్భంలో నుంచి ’మేఘా’ గాయత్రి పంపింగ్ హౌసులో జలాలు ఉవ్వెత్తున ఉబుకుతున్నాయి. శివుడి శిరస్సుపై నుంచి గంగమ్మ జాలువారినట్టు పుడమిని నమ్ముకున్న రైతన్నల ఆశలకు అంకురార్పణ చేస్తూ తెలంగాణలోని మగాణిని పచ్చదనం పరిచేందుకు గోదారమ్మ బిరబిరా పరుగులెడుతోంది. గాయత్రి భాగర్భ పంపింగ్ కేంద్రం నిర్మాణంతో ఏటిలో నుంచి కాలువల్లోకి పొంగిపొర్లుతూ బీళ్లు బారిన పొలాల గట్లలోకి తడార్చేందుకు జలాలు ఉరకలేస్తున్నాయి. గొంతెండిన పొలాలను పులకరింపజేస్తూ పంటపొలాల్లో విత్తులు మొక్కై ఫలాలు అందించేందుకు భూమి పొరల్లోంచి చీల్చుకుంటూ వస్తోన్నాయి. మానేరులో గోదారమ్మ సాగరాన్ని తలపిస్తూ గాయత్రి పంపింగ్ హౌస్ కళకళలాడుతోంది. బీడుబారిన పొలాలను పులకరింపజేస్తూ మిడ్ మానేరుకు పరుగులు తీస్తోంది. తెలంగాణలో ’మేఘా ఇంజనీరింగ్’ ఓ అత్యద్భుతాన్ని ఆవిష్కరించింది. ’మేఘా ఇంజినీరింగ్’ భూగర్భంలో విశ్వవిఖ్యాతిగాంచిన గాయత్రి నీటి పంపింగ్ కేంద్రాన్ని తెలంగాణ కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గ్రామ సమీపంలో నిర్మించింది. ఈ కేంద్రాన్ని ఆగస్టు 11న ప్రారంభించి నేటి వరకు 22 రోజులు అవుతుండగా 3 పంపింగ్ మిషన్లతో 11. 40 టిఎంసీల నీరు మిడ్ మానేరుకు చేరుకున్నాయి. తొలిగా ప్రారంభించిన క్రమసంఖ్యలో 5వ మిషన్ 16 రోజుల్లో నిరంతరాయంగా 380 గంటపాటు, రెండోది వరుసలో 4వ మిషన్ 378 గంటలు పని చేయడంతో ఈ రెండు మిషన్లు ఒక్కొక్కటి దాదాపు 4.30 టిఎంసీల నీటిని పంప్ చేశాయి. అలాగే మూడోది 1వ మిషన్ 10రోజుల్లో 248గంటలు పని చేసి 2.80టిఎంసీల నీటిని తోడింది. ’మెగా’ మహాద్భుతం గాయత్రి పంపింగ్ కేంద్రాన్ని భూగర్భంలో 470 అడుగులు 327 మీటర్ల పొడవున నిర్మించి విశ్వవిఖ్యాతి ఘనత సాధించింది. ఈ నిర్మాణంలో తొలిదశలో ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్ధ్యంతో 5 మిషన్లున్నాయి. మోటారు, పంపు కలుపుకుంటే ఓ మిషన్. మలిదశలో మరో రెండు మిషన్లు సిద్ధమవుతుండగా ఇప్పటికే ఓ మిషన్ డ్రైరన్ కూడా పూర్తయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భూగర్భ గాయత్రి పంపింగ్ కేంద్రం గుండెకాయల పని చేస్తూ బీళ్లుబారిన లక్షల ఎకరాల చేనులకు సాగునీరు అందించేందుకు గోదారమ్మ పరుగులు పెడుతూ రైతన్నల కళ్ళల్లో ముంగిట్లో బంగారు కలలను , గుండెల్లో మొక్కవోని ధైర్యాన్ని చిగురింపజేస్తోంది. 2019 జూలైలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లింక్ 1లోని లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం), పార్వతి (సుందిళ్ల) నుంచి నీటిని పంపింగ్ చేస్తున్న ’మేఘా’ తన రికార్డును తానే అధిగమించింది. ప్రపంచ నెంబర్ వన్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా స్థాయిలో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమిస్తూ అతి పెద్ద పంపులు ఏర్పాటు చేసి ఎలాంటి సాంకేతిక సమస్యకు తావివ్వలేదు. అత్యద్భుతమైన ప్రాజెక్టుపై విమర్శలు చేస్తోన్న నోళ్లకు తాళాలు వేసుకునేలా ’మేఘా పంపింగ్ కేంద్రాలు’ గంగమ్మను భూ ఉపరితలంపైకి ఉబికిస్తూ నలుదిక్కులు ఘనతను పిక్కటిల్లెలా చాటుతోంది. ఇప్పటి వరకు అతిపెద్ద పంపింగ్ కేంద్రాలుగా హంద్రీనీవా తొలిదశలోని 12 కేంద్రాలు, రెండోదశలో 18 కేంద్రాలు ఖ్యాతిని గడించాయి. అంతేకాకుండా పట్టిసీమ, పురుషోత్తపట్నం, ముచ్చుమర్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ పంపింగ్ కేంద్రం చూసినా ’మేఘా ఇంజనీరింగ్’ నిర్మించినవే. ఏపీలోని హంద్రీనీవా అతి పెద్దది, ముఖ్యంగా అతి పొడవైనది అంతే కాకుండా ఎక్కువ పంపింగ్ కేంద్రాలతో రికార్డులను సొంతం చేసుకుంది. తొలిదశలో 12 కేంద్రాలు, 2వ దశలో 18 కేంద్రాలున్నాయి. తొలిదశలో 1వ పంపింగ్ కేంద్రం కృష్ణానది శ్రీశైలం ఎగువ భాగం మాల్యాలో నిర్మించారు. ఈ పంపింగ్ కేంద్రంలో 12 మిషన్లు ఉన్నాయి. ఒక్కొక్క మిషన్ 9.56 క్యూసెక్కుల నీరు అలాగే 5 మెగావాట్ల విద్యుత్ సామర్ధ్యంతో నిర్మించారు. దాదాపు నీటి పంపింగ్ ఎత్తు 38 మీటర్లు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వస్తే లింక్ 1లో ఒక్కొక్క మిషన్ సామర్ధ్యం 40 మెగావాట్లు. ఒక్క లక్ష్మీ మేడిగడ్డ కేంద్రంలోనే 17 మిషన్లు వున్నాయి. మొత్తం సామర్ధ్యం 680 మెగావాట్లు. హంద్రీనీవా మాల్యా పంపింగ్ కేంద్రం మొత్తం సామర్ధ్యం 60 మెగావాట్లు. అంటే హంద్రీనీవా కంటే కాళేశ్వరం లక్ష్మీ పంపింగ్ కేంద్రం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఐతే కాళేశ్వరంలోనే ఈ లక్ష్మీ మేడిగడ్డ కేంద్రంతో పోల్చితే గాయత్రి భూగర్భ పంపింగ్ కేంద్రం మరింత అత్యంత పెద్దది. ఇందులో ఒక్కొక్కటి 139 మెగావాట్ల చొప్పున 7మిషన్లు 973 మెగావాట్ల సామర్ధ్యంతో నిర్మించింది. అందులోనూ భూగర్భంలో 470 అడుగుల దిగువన నిర్మించడం విశేషం. ఏపీ, తెలంగాణలో ఏ పంపింగ్ కేంద్రముతోనూ గాయత్రి పంపింగ్ కేంద్రానికి పోలిక లేనేలేదు. హంద్రీనీవా అతిపెద్ద పంపింగ్ పధకం ఐనప్పటికీ అందులో మరింత పెద్దదిగా పరిగణించేది మాల్యాలోని తొలి కేంద్రం. 2012 నుంచి అంటే 8 ఏళ్లు 1242 రోజుల పాటు పంపింగ్ జరుగుతున్నప్పటికి 163.4 టిఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోసారు. అలాగే పట్టిసీమ నుంచి ఐదేళ్లలో 289 టిఎంసీల నీటిని అందించగలిగారు. ఐతే కాళేశ్వరంలోని ’మేఘా ఇంజనీరింగ్’ నిర్మించిన లింక్1, లింక్2 లోని 4 మెగా పంపింగ్ కేంద్రాలు పనిచేస్తే ఏ స్థాయిలో తెలంగాణలో బీళ్లు బారిన లక్షల ఎకరాల భూములకు సాగునీరు చేరుతుందో నోటి మాటతో లెక్కకట్టి చెప్పడం సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నిర్దిష్ట సమయంలో పూర్తి చేయడంతో పాటు ’మేఘా ఇంజనీరింగ్’ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా పంపింగ్ చేస్తుండటంతో విశ్వంలోనే ’మేఘా’ ప్రత్యేకతను చాటుకుంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ఫలాలు అందించేందుకు ఆరంభంలోనే ఈ పరిమాణంలో నీరు అందిస్తే భవిష్యత్తులో హంద్రీనీవా, పట్టిసీమ పథకాల్లాగే ఏళ్లపాటు వేల గంటలు పంపింగ్ జరిగితే ప్రపంచంలో నీటి కోసం యుద్ధాలు ఎక్కడైనా జరగొచ్చు కానీ తెలంగాణలో మాత్రం సాగు, తాగు నీరుకు చిరకాలం కరువే అనే మాట కనుచూపు మేరల్లో ఉండదు. తెలంగాణ మాగాణులు పచ్చదనంతో పరిడవిళ్లుతాయి. ఈ ఘన చరిత్రలో, తెలంగాణ భవిష్యత్తులో ’మేఘా ఇంజనీరింగ్’ నిర్మాణ భాగస్వామవడం ఓ మైలురాయి. -
‘కరెంట్’ రికార్డు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని భారీ సామర్థ్యం గల పంపుల ద్వారా నీటిని తోడుతుండటం, కొన్ని రోజులుగా వర్షాలు లేక పొలాలకు బోరుబావుల ద్వారా నీటిని తోడేందుకు విద్యుత్‌ను వినియోగిస్తుండడడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. గత 3 రోజులుగా వరుసగా విద్యుత్ డిమాండ్ రికార్డులపై రికార్డులు సృష్టించింది. 2018 సెప్టెంబర్ 11న నమోదైన 10,818 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఇప్పటివరకు రికార్డు కాగా, ఈ నెల 28న 11,064 మెగావాట్ల గరిష్ట వినియోగం నమోదై కొత్త రికార్డు సృష్టించింది. మరుసటి రోజు 29న డిమాండ్ 11,638 మెగావాట్లకు చేరి అంతకు ముందురోజు ఉన్న రికార్డును చెరిపేసింది. తాజాగా శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో విద్యుత్ డిమాండ్ 11,669 మెగావాట్లకు చేరి మరో కొత్త రికార్డు సృష్టించింది. తెలంగాణ చరిత్రలో ఇప్పటివరకిదే అత్యధిక విద్యుత్ డిమాండ్ కాగా, రానున్న 2 నెలల్లో డిమాండ్ పెరిగి 12,000 మెగావాట్లు దాటే అవకాశముందని ట్రాన్స్‌కో అంచనా వేసింది. -
ఆపరేషన్ అనంతగిరి..!
సిరిసిల్ల: కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–10లో భాగంగా రూ.2700 కోట్లతో చేపట్టిన పనులు తుది దశకు చేరాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు నుంచి మరో దశకు నీటి మళ్లింపునకు రంగం సిద్ధమైంది. సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం అనంతగిరి (అన్నపూర్ణ) ప్రాజెక్టులోకి మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర) నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే గోదావరి జలాలు లక్ష్మీపూర్ పంపుహౌస్ ద్వారా సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు జలాశయానికి 12 రోజులుగా చేరుతున్నాయి. మధ్యమానేరులో 13 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. అనంతగిరి జలాశయానికి గోదావరి జలాలను తరలించే పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందుకోసం అనంతగిరి ఊరును ఖాళీ చేయించేందుకు నోటీసులు జారీ చేశారు. నిర్వాసితులకు పునరావాసం కలి్పంచేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సర్జిపూల్ సిద్ధం మధ్యమానేరు బ్యాక్ వాటర్‌ను గ్రావిటీ ద్వారా ఒబులాపూర్ నుంచి తిప్పాపూర్ మహాబావి (సర్జిపూల్)కి మళ్లించే పనులు సాగుతున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద బావిని సిద్ధం చేశారు. 92 మీటర్లు లోతు, 56 మీటర్ల వెడల్పుతో సర్జిపూల్‌ను నిర్మించారు. మధ్యమానేరు నుంచి గోదావరి జలాలు 3.5 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా వచ్చి ఒబులాపూర్ సొరంగం ద్వారా తిప్పాపూర్‌లోని మహాబావికి చేరుతాయి. అక్కడ ఏర్పాటు చేసిన 106 మెగావాట్ల నాలుగు మోటార్లతో నీటిని అనంతగిరి రిజర్వాయర్‌కు ఎత్తిపోస్తారు. ఇందు కోసం తిప్పాపూర్‌లో 440 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. అనంతగిరి రిజర్వాయర్‌లో 3.5 టీఎంసీ నీటిని నిల్వ చేస్తారు. ఇప్పటికే నీటిపారుదలశాఖ అధికారులు తిప్పాపూర్‌లోని మోటార్లను వెట్‌రన్‌కు సిద్ధం చేశారు. అనంతగిరి రిజర్వాయర్ ద్వారా ఇల్లంతకుంట మండలంలోని 30 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. పునరావాస ప్యాకేజీ సిద్ధం ఇల్లంతకుంట మండలం అనంతగిరి నిర్వాసితుల కోసం పునరావాస ప్యాకేజీని సిద్ధం చేశారు. ఆ ఊరిలో 837 కుటుంబాలు ఉండగా.. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులను కుటుంబా లుగా గుర్తించడంతో నిర్వాసితుల జాబితా 1,135 చేరింది. తంగళ్లపల్లి మండల కేంద్రం శివారులో 62 ఎకరాలు, అనంతగిరి పోచమ్మ ఆలయం సమీపంలో మరో 70 ఎకరాలను పునరావాసం కోసం ప్రభుత్వం సేకరించింది. ఇప్పటికే 737 కుటుంబాలకు రూ.7.50 లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీని చెల్లించారు. 250 గజాల స్థలంతో కూడిన ప్లాట్లను ఇచ్చేందుకు లే అవుట్‌తో కూడిన పునరావాసం సిద్ధమైంది. 922 పట్టాలను పంపిణీకి సిద్ధం చేశారు. మరో 213 కుటుంబాలతో రెవెన్యూ అధికారులు సంప్రదింపులు సాగిస్తున్నారు. అనంతగిరి ఊరును ఖాళీ చేయిస్తేనే.. మధ్యమానేరు నీరు అన్నపూర్ణ ప్రాజెక్టులోకి మళ్లించే అవకాశం ఉంది. ఇందు కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, జేసీ యాస్మిన్‌బాషా, డీఆర్వో ఖీమ్యానాయక్, ఆర్డీవో శ్రీనివాస్‌రావులు తొలి ప్రాధాన్యతగా అనంతగిరి నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనుల్లో నిమగ్నమయ్యారు. అనంతగిరి నుంచి రంగనాయక సాగర్‌కు.. అనంతగిరిలో నిల్వ చేసిన నీటిని సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్‌కు ఎత్తిపోస్తారు. ఇప్పటికే ఎత్తిపోతలకు సంబంధించిన పనులు తుది దశకు చేరాయి. రంగనాయకసాగర్ నుంచి కొండ పోచమ్మ, అక్కడి నుంచి మల్లన్నసాగర్‌కు గోదావరి జలాలను తరలించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మధ్యమానేరులో 13 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ముందుగా కరీంనగర్ వద్ద ఉన్న లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ)కి నీటిని విడుదల చేశారు. కానీ అనంతగిరి ప్రాజెక్టును ముందుగా నీటితో నింపాలనే లక్ష్యంతో ఎల్ఎండీకి నీటి విడుదలను నిలిపి వేశారు. సిద్దిపేట జిల్లాకు గోదావరి జలాలను ముందుగా తరలించాలని ప్రభుత్వం భావిస్తుంది. నీటి విడుదలకు సీఎం కేసీఆర్ మధ్యమానేరు నీటిని అనంతగిరి రిజర్వాయర్‌కు విడుదల చేసే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే మధ్యమానేరు వద్ద హెలీప్యాడ్ సిద్ధం చేశారు. అనంతగిరి నిర్వాసితుల పునరావాసం పూర్తి అయితే.. మధ్యమానేరులోకి 16 టీఎంసీల నీరు చేరగానే అనంతగిరికి నీటి విడుదల ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మరో అద్భుతమైన జలదృశ్యం ఆవిష్కరణకు సిద్ధమైంది. పునరావాసానికి ఏర్పాట్లు అనంతగిరి నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రెండు చోట్ల పునరావాస కాలనీలు ఏర్పాటు చేశాం. నిర్వాసితుల అభీష్టం మేరకు ప్లాట్లు కేటాయిస్తాం. ముందుగా అనంతగిరి వాసులు ఇళ్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. పునరావాస ప్యాకేజీకి మెజార్టీ నిర్వాసితులు అంగీకరించారు. సంతకాలు చేయని వారి విషయంలో చట్టం ప్రకారం ముందుకు వెళ్తాం. టి.శ్రీనివాస్‌రావు, ఆర్డీవో, సిరిసిల్ల -
‘అందుకే కేంద్రానికి డీపీఆర్‌లు ఇవ్వడం లేదు’
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ తుమ్మిడిహెట్టి పర్యటన ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందనే వినోద్‌కుమార్ ఆరోపణలు సరికాదని ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పార్టీ నాయకుడిగా కాకుండా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే.. మేడిగడ్డ వద్ద నీటి లభ్యత లేదని బయటపడుతుందనే భయంతో కేసీఆర్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జీవన్‌రెడ్డి గురువారం గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా...తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేస్తే గ్రావిటీ ద్వారా మైలారం వరకు నీటిని తరలించవచ్చని తెలిపారు. తద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని పేర్కొన్నారు. మూడో టీఎంసీ నీటిని ఎత్తిపోతలకు మొగ్గు చూపకుండా.. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం టూరిజం స్పాట్ అయిపోయింది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ సాగునీటి ప్రాజెక్ట్ అనడం కంటే.. టూరిజం స్పాట్ అంటే బాగుంటుందేమోనని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం వద్దకు వెళ్ళే ఐఏఎస్ అధికారులు.. తుమ్మిడిహెట్టిని కూడా సందర్శించాలని సూచించారు. వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఐఏఎస్ అధికారులపైన ఉందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడిగిందని వినోద్ అబద్దాలు చెప్పడం సరికాదన్నారు. ‘తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా అడగలేదని లోక్ సభలో కేంద్ర జలవనరుల మంత్రి స్వయంగా చెప్పారు. కేంద్ర మంత్రి చెప్పింది అబద్ధమైతే.. ఆయనపై ప్రివిలేజ్ మోషన్ ఎందుకు ఇవ్వడం లేదు. ఇంకా ఎన్నిరోజులు రాష్ట్ర ప్రజలను మభ్యపెడతారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం డీపీఆర్‌లు కేంద్రానికి ఇవ్వలేదనేది నిజం. డీపీఆర్‌లు కేంద్రానికి ఇస్తే.. కమీషన్ల బాగోతం బయట పడుతుందనే భయం ప్రభుత్వ పెద్దలలో ఉంది. కమీషన్ల కోసమే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. తక్షణం ఈ నామినేషన్ ప్రక్రియను నిలిపివేయాలి. మూడో టీఎంసీ నీటిని ఎత్తి పోసేందుకు నామినేషన్ ద్వారా పనులు కట్టబెట్టడం సరికాదు.. గ్లోబల్ టెండర్ పిలవాల్సిందే అని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
జేపీ నడ్డా పచ్చి అబద్ధాలకు అడ్డా : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ జాతీయ నాయకుడు జగత్ ప్రకాశ్ నడ్డా విమర్శలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తిప్పికొట్టారు. దేశాన్ని 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌కు, బీజేపీకి తాము సాధిస్తున్న అభివృద్ది నచ్చదని ఎద్దేవా చేశారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పచ్చి అబద్ధాలకు అడ్డా అని చురకలంటిచారు. రాష్ట్రంలో 119 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ 103 స్థానాల్లో డిపాజిట్ గల్లంతైందని గుర్తు చేశారు. కర్ణాటక తరహా రాజకీయాలు తెలంగాణలో సాగవని కేటీఆర్ చెప్పారు. కూకట్‌పల్లిలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, నవీన్, ఇతర నాయకులు పాల్గొన్నారు. (చదవండి : అధికారంలోకి వస్తాం.. రూపురేఖలు మారుస్తాం: జేపీ నడ్డా) బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల విద్యుత్ సరఫరా ఎక్కడ ఉందో నిరూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. సాగు నీటి రంగంలో కోటి ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టామని పేర్కొన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే నడ్డా విమర్శలు హాస్యాస్పదమని అన్నారు. అది నిజమే అయితే ఢిల్లీలో తేల్చండని హితవు పలికారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే గడ్డం తీయనని శపథం చేసిన వ్యక్తి కనిపించడం లేదని పరోక్షంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌పై విమర్శలు చేశారు. దానికంటే వెయ్యిరెట్లు మేలు.. ‘ఆయుష్మాన్ పథకం కంటే ఆరోగ్య శ్రీ వెయ్యి రెట్లు మేలైంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా రూ. 2000 పింఛన్ పథకం లేదు. పింఛన్ పథకంలో కేంద్రం ఇచ్చేది రూ.200 మాత్రమే. మతాల మద్య చిచ్చు పెట్టడమే బీజేపీ లక్ష్యం. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కర్ఫ్యూలు ఒక్కటి కూడా జరగలేదు. మా పథకాలనే కాపీ కొట్టి ప్రవేశపెడుతున్నారు. మాధవరం కృష్ణారావు లాంటి ఎమ్మెల్యే వుండటం కూకట్ పల్లి ప్రజల అదృష్టం. తెలంగాణ వ్యాప్తంగా 50 లక్షల సభ్యత్వాలు సాధించాం. నామినేటెడ్ పదవులు కార్యకర్తలకు తప్పకుండా ఇస్తాం. బంగారు తెలంగాణ సాధించే వరకు అవిశ్రాంత పోరాటం చేస్తాం’అని కేటీఆర్ అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారమే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. గ్రేటర్లో గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని దీమా వ్యక్తం చేశారు. -
దేశంలో సమగ్ర విద్యుత్ విధానం రావాలి : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : అన్ని రంగాలకు అన్ని వేళలా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడం లక్ష్యంగా దేశంలో సమగ్ర విద్యుత్ విధానం రావాల్సిన అవసరముందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రస్తుతమున్న స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో సగం కూడా ఉపయోగించుకోవడం లేదని, ఇంకా చాలా ప్రాంతాలు చీకట్లోనే మగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు అమలవుతున్నా యని, ఈ పరిస్థితి పోవాల్సిన అవసరముందన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా పవర్ ప్లాంట్లు, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) సీఎండీ రాజీవ్‌శర్మ ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేశ, రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితిపై చర్చ జరిగింది. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొంది. రాష్ట్ర ప్రగతికి ఆనాడు విద్యుత్ సమస్యే తీవ్ర అవరోధంగా నిలి చింది. విద్యుత్ సమస్యను పరిష్కరించనిదే రాష్ట్ర పురోగతి సాధ్యం కాదని భావించాం. విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్దడానికి సమగ్ర వ్యూహం అనుసరించాం. ఆరు నెలల్లో విద్యుత్ కోతలు ఎత్తేశాం. ఇప్పుడు అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయానికి 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నాం. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. తెలంగాణలో పరిశ్రమలు మూడు షిఫ్టులు పనిచేస్తున్నాయి. దీనివల్ల ఉపాధి పెరిగింది. రాష్ట్ర ఆదాయం పెరిగింది. లో వోల్టేజీ లేకుండా ఉండేందుకు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా ఉండేందుకు పంపిణీ, సరఫరా వ్యవస్థలను మెరుగుపరిచాం. ప్రస్తుతం 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను వాడుకోవడానికి అనుగుణమైన వ్యవస్థ సిద్ధమైంది’’అని ముఖ్యమంత్రి వివరించారు. పీఎఫ్సీ సహకారం ఎంతో ఉపయోగపడింది.. తెలంగాణలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, ఇతర విద్యుత్ సంబంధ వ్యవస్థలను తీర్చిదిద్దడానికి పీఎఫ్సీ అందించిన ఆర్థిక సహకారం ఎంతో దోహదపడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ ప్రాజెక్టులతోపాటు రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సహకారం అందించినందుకు పీఎఫ్సీ చైర్మన్ రాజీవ్‌శర్మకు ముఖ్యమంత్రి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. విద్యుత్ సంక్షోభాన్ని చాలా తక్కువ సమయంలో పరిష్కరించుకొని మిగులు విద్యుత్ రాష్ట్రం దిశగా తెలంగాణ అడుగులు వేయడానికి పీఎఫ్సీ అందించిన సహకారం ఎంతో దోహదపడిందన్నారు. రాజీవ్ శర్మ దంపతులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా సన్మానించి మొమెంటోలు అందించారు. పీఎఫ్సీ సీఎండీ రాజీవ్‌శర్మ సత్కరిస్తున్న సీఎం కేసీర్, చిత్రంలో ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పీఎఫ్సీకి గౌరవం, గర్వం: రాజీవ్ శర్మ తెలంగాణలో దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రికార్డు సమయంలో అటు పవర్ ప్లాంట్లు, ఇటు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారని పీఎఫ్సీ సీఎండీ రాజీవ్‌శర్మ ప్రశంసించారు. పవర్ ప్లాంట్లయినా, నీటిపారుదల ప్రాజెక్టులయినా ఇంత తొందరగా పూర్తి కావడం తానెక్కడా చూడలేదన్నారు. అనుమతులు పొందడం, నిధులను సమీకరించడం, భూసేకరణ, ఇతర రాష్ట్రాలతో ఒప్పందాల వంటి ప్రక్రియల వల్ల ప్రాజెక్టుల నిర్మాణం సాధారణంగా ఆలస్యం అవుతుందన్నారు. కానీ తెలంగాణలో మాత్రం శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నదన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లు, నీటిపారుదల ప్రాజెక్టులకు తాము అందించిన ఆర్థిక సహకారం నూటికి నూరు పాళ్లు సద్వినియోగం కావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ భాగస్వామి కావడం తమకెంతో గౌరవంగా, గర్వంగా ఉందని రాజీవ్‌శర్మ అన్నారు. ‘‘మూడున్నరేళ్ల కింద హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ మాకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పారు. ప్రాజెక్టు ఎలా ఉండబోతుందో స్క్రీన్‌పై చూపించారు. అది విన్న నేను ఆశ్చర్యపోయా. ఇది సాధ్యమేనా అనుకున్నా. కానీ నిన్న కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి బ్యారేజీలు, పంప్‌హౌస్‌లను కళ్లారా చూశా. గోదావరి నీటిని పంపింగ్ చేసే విధానం నిజంగా అద్భుతం. మూడున్నరేళ్ల కింద కేసీఆర్ నాకు ఏం చెప్పారో, అది కళ్ల ముందు కనిపించింది. ఇలాంటి ప్రాజెక్టును ఇంత త్వరగా నిర్మించడం మాటలు చెప్పినంత తేలిక కాదు. కేసీఆర్ కృషి ఫలించింది. కల నెరవేరింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి యావత్ దేశం చెప్పుకుంటోంది. అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విజయగాథను ప్రదర్శిస్తున్నారు’’అని రాజీవ్‌శర్మ అభినందించారు. ట్రాన్స్‌కో సీఎండీపై ప్రశంసల వర్షం... రాష్ట్రంలో విద్యుత్ రంగం సాధించిన విజయాల వెనుక జెన్కో–ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు కృషి ఎంతో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్, పీఎఫ్సీ సీఎండీ రాజీవ్‌శర్మ, సీఎస్ ఎస్.కె. జోషి ప్రశంసించారు. విద్యుత్ రంగంలో ఎంతో అనుభవం ఉన్న ప్రభాకర్‌రావు తమకు ఆదర్శమని, ఆయన నాయకత్వంలో తెలంగాణలో విద్యుత్ రంగం ఎంతో ప్రగతి సాధించిందని రాజీవ్‌శర్మ కొనియాడారు. పవర్ ప్లాంట్లు శరవేగంగా నిర్మితమవుతున్నాయని, ప్లాంట్లలో విద్యుదుత్పత్తి (పీఎల్ఎఫ్) పెరిగిందని, ఆయనపై పెట్టిన బాధ్యతను ప్రభాకర్‌రావు పూర్తిగా నెరవేర్చారని కేసీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో 50 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రభాకర్‌రావు విద్యుత్ రంగంలో భీష్మాచార్యుడు అని ఎస్.కె. జోషి కొనియాడారు. విద్యుత్ రంగంపై పూర్తి అవగాహన కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో పనిచేయడం వల్లే మంచి ఫలితాలు వచ్చాయని ప్రభాకర్‌రావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. విద్యుత్ సంక్షోభ పరిష్కారం ఘనత అంతా ముఖ్యమంత్రిదేనన్నారు. -
లక్ష్మీపూర్ పంప్‌హౌజ్ అరుదైన ఘనత
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించిన విషయం తెలిసిందే. ఇక ఈ బృహత్తర ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీపూర్‌లో నిర్మించిన గాయత్రి పంప్‌హౌజ్ అరుదైన రికార్డు సాధించింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిర్మించిన ఈ పంప్‌హౌజ్.. ప్రాజెక్టు విశిష్టతను ప్రపంచవ్యాప్తం చేసేలా ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్‌స్క్వేర్ స్క్రీన్‌పై ప్రసారమవుతోంది. మూడు రోజుల పాటు రోజుకు ఐదుసార్లు న్యూయార్క్ కూడలిలోని అతిపెద్ద తెర మీద గాయత్రి పంప్‌హౌజ్ వీక్షకులకు కనువిందు చేసింది. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–8లో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద నిర్మించిన గాయత్రి పంప్‌హౌజ్ ప్రపంచంలోనే అతి పొడవైన భూగర్భ పంపుహౌజ్‌గా ప్రసిద్ధి పొందినది. ఈ పంప్‌హౌజ్‌లో మొత్తం ఏడు మోటార్లు ఉన్నాయి. భూగర్భంలో దాదాపుగా 140 మీటర్ల లోతులో ఉన్న ఈ పంప్‌హౌజ్‌లోని ఐదు భారీ విద్యుత్ మోటార్లు(బాహుబలులు) ద్వారా నీటి పంపింగ్ జరుగుతుంది. ఇక ఇందులోని బాహుబలి విద్యుత్ మోటార్లు నిత్యం 117 మీటర్ల ఎత్తులో ఉన్న కాలువలోకి నీటిని పంపింగ్ చేస్తాయి. ‘మేఘా’మహాద్భుత సృష్టి ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. ఇంతకుముందు ఎక్కడా లేనిది. అందులోనూ భూగర్భంలోనిది. శక్తిరీత్యా, సామర్ధ్యాల ప్రకారం, నీటి పంపింగ్ లక్ష్యం, పరిమాణం... ఇలా ఏ ప్రకారం చూసుకున్నా అదొక ఇంజనీరింగ్ కళాఖండం. మేఘా ఇంజనీరింగ్ తన సాంకేతిక శక్తి సామర్ధ్యాలతో నిర్మించిన మహాద్భుత సృష్టి. మానవనిర్మిత ప్రపంచ అద్భుతాల్లో ఇది ముందువరసలోకి చేరుతుంది. అదే కాళేశ్వరం పథకంలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామం వద్ద భూగర్భాన్ని తొలిచి నిర్మించిన లక్ష్మీపూర్ (గాయత్రి) భూ గర్భ పంపింగ్ కేంద్రం. ప్రపంచంలో ఇంత పెద్ద నీటి పంపింగ్ కేంద్రం ఇంతవరకూ ఎక్కడా నిర్మించలేదు. ఒక్కో మిషన్వారీగా చూస్తే సామర్ద్యం 139 మెగావాట్లు కావడంతో ప్రపంచంలో ఇదే పెద్దది. ఈఫిల్ టవర్ కన్నా పెద్దది.. లక్ష్మీపూర్ (గాయత్రి) భూగర్భ నీటి పంపింగ్ కేంద్రం పొడవు ఈఫిల్ టవర్ పొడవు కన్నా ఎక్కువ. ఈఫిల్ టవర్ ఎత్తు 324 మీటర్లు కాగా, ఈ పంప్‌హౌస్ పొడవు 327 మీటర్లు. కలకత్తాలోని దేశంలోనే అతిపొడవైన భవంతి ‘ది 42’ కంటే ఈ పంప్‌హౌస్ లోతు ఎక్కువ. ‘ది 42’ పొడవు 260 మీటర్లు. దానితో పోల్చితే ఈ పంప్‌హౌస్ ఎంత లోతైనదో (కింద నుంచి చూస్తే ఎత్తు) తెలిస్తే విస్తుపోక తప్పదు. ఈ పంప్‌హౌస్ నిర్మాణం కోసం భూగర్భాన్ని తొలిచి 2.3 కోట్ల ఘనపు మీటర్ల మట్టిని మేఘా ఇంజనీరింగ్ బయటకు తీసింది. మొత్తంగా లక్ష్మీపూర్ (గాయత్రి) భూగర్భ నీటి పంపింగ్ కేంద్రం వైశాల్యం 84,753.2 చదరపు అడుగులు. . -
‘మేఘా’ వండర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో అద్భుతం ఆవిష్కృతం అయింది. ఇంజనీరింగ్ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా 139 మెగావాట్ల సామర్థ్యంగల బాహుబలి మోటార్ 111 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడం ప్రారంభించింది. ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా లేని విధంగా, ఇంజనీరింగ్ నిపుణులు సైతం నివ్వెరపోయేలా భూగర్భంలో నీటి పంపింగ్ కేంద్రం నుంచి నీటిని పంప్ చేయించడం ద్వారా నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్ (ఎంఈఐఎల్) కొత్త రికార్డు సృష్టించింది. మానవ నిర్మిత ప్రపంచ అద్భుతాల్లో ముందు వరుసలో ఉండే కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామం వద్ద భూగర్భాన్ని తొలిచి నిర్మించిన లక్ష్మీపూర్ (గాయత్రి) భూగర్భ పంపింగ్ కేంద్రం బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం కానుంది. ‘మేఘా’ మహాద్భుత సృష్టి.. ప్రపంచంలోనే అతిపెద్దది.. ఇంతకుముందు ఎక్కడా లేనిది.. అందులోనూ భూగర్భంలో నిర్మించిన అతిపెద్ద పంప్‌హౌస్‌గా కాళేశ్వరంలోని లక్ష్మీపూర్ పంప్‌హౌస్ (ప్యాకేజీ–8) ఇప్పటికే పేరు గడించింది. ఈ భూగర్భ నీటి పంపింగ్ కేంద్రం వైశాల్యం 84,753.2 చదరపు అడుగులుకాగా 139 మెగావాట్ల సామర్థ్యంతో 5 మోటార్లను పంపింగ్‌కు సిద్ధం చేసింది. ఒక్కో మోటార్ బరువు 2,376 మెట్రిక్ టన్నులు. ఈ మోటార్లో ప్రధానమైన స్టార్టర్ బరువు 216 టన్నులుకాగా రోటర్ బరువు 196 టన్నులు. సాధారణంగా 200 టన్నుల బరువు మోసే క్రేన్లు ఉండవు. ఇక్కడ వీటిని కదిలించడానికి రెండేసి క్రేన్లను వినియోగిస్తున్నారు. ఈ పంప్‌హౌస్ నిర్మాణం కోసం 6 వేల టన్నుల స్టీల్‌తోపాటు 50 వేల టన్నుల సిమెంట్ కాంక్రీట్ వినియోగించారు. ఇక్కడి నుంచి కనీసం రోజుకు 2 టీఎంసీల నీటిని పంప్ చేసేలా నిర్మాణ పని పూర్తయింది. ఈ మిషన్లు పని చేయడం ప్రారంభం కాగానే నాగార్జున సాగర్ కుడి కాలువ ప్రవాహం ఎంత పెద్దదో అంతకన్నా రెండింతలు పెద్దగా నీరు ప్రవహిస్తుంది. అక్కడ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులుకాగా ఇక్కడ 22 వేల క్యూసెక్కుల నీరు పంపింగ్ ద్వారా వస్తుంది. సాధారణంగా 30 లేదా 40 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేయడమే ప్రాజెక్టుల్లో అరుదైన విషయంకాగా భూగర్భం నుంచి 111.4 మీటర్ల ఎత్తుకు 2 టీఎంసీల నీటిని పంపింగ్ చేసేలా మోటార్లను మేఘా సిద్ధం చేసింది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో 2 టీఎంసీల పంపింగ్‌కుగాను 4,627 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం గల మోటార్ పంపులు అవసరంకాగా ఒక్క మేఘానే 3,057 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యంగల మోటార్ పంపులను ఏర్పాటు చేసింది. దీంతోపాటే పంప్‌హౌస్ ఆకృతి నిర్మాణంలో సర్వీస్ బే భూమి ఉపరితలం నుంచి 210 మీటర్లు లోతున ఉంది. పంప్ బే 190.5 మీటర్లు, యాన్సిరీ బే 195.5 మీటర్లు, ట్రాన్స్ఫార్మర్ బే 215 మీటర్లు, కంట్రోల్ రూం 209 మీటర్ల లోతున ఉన్నాయి. ఆదివారం ఒక మోటార్‌కు విజయవంతంగా ట్రయల్ రన్ చేపట్టగా సోమవారం మధ్యాహ్నం సుమారు 45 నిమిషాలపాటు నీటిని పంప్ చేశారు. బుధవారం నాటికి రెండు మోటార్లను సిద్ధం చేయనుండగా వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇక్కడి నుంచి నీటిని మిడ్‌మానేరుకు తరలించనున్నారు. ప్రపంచంలోనే వినూత్నమైంది.. ఇదొక అత్యద్భుతమైన అండర్‌గ్రౌండ్ పంప్‌హౌస్. భూమికి 470 అడుగుల దిగువన, జంట టన్నెల్స్తోపాటు ప్రపంచంలోనే అతిపెద్ద సర్జ్‌పూల్స్ నిర్మించాం. ఈ మెగా ప్రాజెక్టులో 139 మెగావాట్ల సామర్థ్యంగల 5 మెషీన్లతో రోజుకు 2 టీఎంసీల నీటిని పంపింగ్ చేయగల సామర్థ్యంతో నెలకొల్పాం. ఏ రకంగా చూసినా ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే వినూత్నమైన మెగా ప్రాజెక్టు. ఈ మహా అద్భుతమైన ప్రాజెక్టును అనతి కాలంలోనే పూర్తి చేసిన ఘనత మాకే దక్కుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, నేరుగా యంత్రాంగంతో ప్రతి అంశం చర్చించి ప్రోత్సహించడం వల్లే తక్కువ కాలంలో దీన్ని పూర్తి చేయడం సాధ్యమైంది. – బి. శ్రీనివాస్‌రెడ్డి, మేఘా డైరెక్టర్ అత్యద్భుతమిది... లక్ష్మీపూర్ భూగర్భ నీటి పంపింగ్ కేంద్రం పొడవు ఐఫిల్ టవర్ పొడవుకన్నా ఎక్కువ. ఐఫిల్ టవర్ ఎత్తు 324 మీటర్లు కాగా పంప్‌హౌస్ పొడవు 327 మీటర్లు. కోల్‌కతాలో దేశంలోనే అతిపొడవైన భవంతి ‘ది 42’ (262 మీటర్లు) కంటే ఈ పంప్‌హౌస్ లోతు ఎక్కువ. పంప్‌హౌస్ నిర్మాణం కోసం భూగర్భాన్ని తొలిచి 2.30 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తీశారు. ఈ నీటి పంపింగ్ కేంద్రం వైశాల్యం 84,753.2 చదరపు అడుగులు. -
‘కాళేశ్వరం గురించి జయప్రకాశ్‌కు ఏం తెలుసు’
సాక్షి, జగిత్యాల: కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి జయప్రకాశ్ నారాయణకు ఏం తెలుసు.. ఆయనది హఫ్ నాలెడ్జ్ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా మంగళవారం ఆయన మేడిగడ్డ, సుందిళ్ల జలాశయాలతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టులను కూడా పరిశీలించారు. అనంతరం ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సజీవంగా కనిపిస్తోన్న గోదావరిని చూసి తన మనసు పులకిస్తోంది అన్నారు. గోదావరి నదిలోనే 100 టీఎంసీల నీరు నిండుకుండలా సజీవంగా ఉంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కో పంప్‌హౌస్ ఒక్కో ప్రాజెక్టుతో సమానమని చెప్పారు. కాళేశ్వరం మల్టిపుల్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల అనుకున్న దాని కంటే ఎక్కువగా లాభం చేకూరనుంది అన్నారు కేసీఆర్. 25 ఏళ్లైనా పూర్తి కానటువంటి ప్రాజెక్ట్‌లను కేవలం మూడేళ్లలో పూర్తి చేశామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నికరంగా 400 టీఎంసీల నీరు లభిస్తుందని.. 45 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తుందని తెలిపారు. ఆరునెలల పాటు నెలకు 60 టీఎంసీలు.. మిగతా సమయంలో నెలకు 40 టీఎంసీలు ఎత్తిపోస్తామని సీఎం వివరించారు. పరిశ్రమలు, ఇతర అవసరాల కోసం, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఎల్లంపల్లి నుంచి తీసుకుంటామన్నారు. ప్రతి రోజు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లకి 3 టీఎంసీలు, మిడ్ మానేరు నుంచి మల్లన్న సాగర్‌కు 2 టీఎంసీలు తీసుకుంటామని తెలిపారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం 9.6 టీఎంసీల నీరు మాత్రమే ఉందన్నారు కేసీఆర్. అక్కడ నీరు లేనప్పుడు ఇక్కడి నుంచి వరదకాలువ ద్వారా పంపింగ్ చేస్తామన్నారు. వివిధ దశల్లో ఎత్తిపోస్తూ 350 మీటర్ల ఎత్తున ఉన్న మిడ్ మానేరుకు నీటిని తీసుకెళ్తామని తెలిపారు. కాళేశ్వరం మల్టిపుల్ ప్రాజెక్టని.. ఇప్పటి వరకు మొత్తం ప్రాజెక్టులో 65 శాతం సాఫల్యం వచ్చిందన్నారు కేసీఆర్. కరెంట్ బిల్లు రూ. 4992 కోట్లు 400 టీఎంసీల కోసం ఏడాదికి రూ.4992 కోట్ల కరెంట్ బిల్లు ఖర్చవుతుందని కేసీఆర్ తెలిపారు. ఇది కూడా ప్రతి ఏటా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అహోరాత్రులు కష్టించి పనిచేసిన ఇంజినీరింగ్, నీటిపారుదల సిబ్బందిని కేసీఆర్ అభినందించారు. తుపాకుల గూడెం, సీతారామ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. ప్రసుత్తం రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేకుండా చేసుకున్నామని.. అన్ని రంగాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. మిషన్ భగీరథ మంచి ఫలితాన్ని ఇచ్చిందన్నారు. సంక్షేమంలో మనమే నంబర్.1 సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని కేసీఆర్ అన్నారు. వికలాంగులకు రూ.3,116 పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, వంటి ఎన్నో మంచి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రైతుబంధు, రైతు బీమా పథకాలు దేశం ఆశ్చర్యపోయేలా అమలు చేస్తున్నామన్నారు. మనల్ని ఆదర్శంగా తీసుకుని ఒడిషాలో రైతు బంధు అమలు చేస్తున్నారని తెలిపారు. రైతుల అప్పులు తీరిపోయి మిగులు సాధించే వరకు రైతులకు ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామన్నారు. తాను బతికున్నంత కాలం రైతులకు కష్టం రానియనని కేసీఆర్ స్పష్టం చేశారు. ధర్మపురి ఆలయ అభివృద్ధికి మరో 50 కోట్లు ఆలయ అభివృద్దికి ఇప్పటికే రూ. 50 కోట్లు కేటాయిస్తానని చెప్పాను అన్నారు కేసీఆర్. త్వరలోనే స్తపతులను రప్పించి కొంత స్థలం సేకరించి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఆలయ అభివృద్ధికి మరో 50 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. ధర్మపురి గోదావరి తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని కేసీఆర్ పేర్కొన్నారు. అంతేకాక నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీకి రూ.10లక్షల నిధులు మంజూరు చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ధర్మపురి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రానికి రూ.25లక్షల ప్రత్యేక నిధులు మంజూరు చేయనున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. -
మేడిగడ్డ చేరుకున్న సీఎం కేసీఆర్
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సందర్శించారు. అధికారులు, ఇంజనీర్లతో కలిసి బ్యారేజీ వద్ద గోదావరి వరదను పరిశీలించారు. ఆయన వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటెల రాజేందర్, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు. ఇక మేడిగడ్డ సందర్శన అనంతరం కేసీఆర్ గోలివాడ పంపుహౌజ్, ఆ తర్వాత ఎల్లంపల్లి బ్యారేజీ వద్దకు చేరుకోనున్నారు. అనంతరం ధర్మపురి చేరుకుని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు నిరసనగా.. ‘మా నీళ్లు మాకు ఇచ్చిన తరువాతే ఇతర ప్రాంతాలకు తరలించాలి’ అని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి ఇంచార్జి కన్నం అంజన్న వెల్గటూరులో ధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయనను అరెస్టు చేసి స్టేషనుకు తరలించారు. ఇక ధర్మపురి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత కేసీఆర్ విలేకరులతో మాట్లాడనున్నారు. -
ఎస్సారెస్పీ ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్లు
ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువు అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు వెతలు తీరే పరిస్థితి కనిపిస్తోంది. ఈనెల 15వ తేదీలోగా కాళేశ్వరం నీరు ఎస్సారెస్పీకి చేరేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించడంతో.. పునరుజ్జీవన పనుల్లో వేగం పెరిగింది. సీఎం ఆదేశాలతో ఈ సీజన్లోనే తమ పంటలకు సాగునీరు అందే అవకాశం ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు పూర్వ వైభవం తీసుకురావడం కోసం ప్రభుత్వం ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం తీసుకువచ్చింది. రూ. 1,067 కోట్లతో పనులు చేపట్టారు. వరద కాలువ గుండా నీటిని కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి రివర్స్ పంపింగ్ చేయడానికి వరద కాలువపై మూడు పంపు హౌజ్‌లు నిర్మిస్తున్నారు. ఎస్సారెస్పీ వరద కాలువ జీరో పాయింట్ వద్ద గల మూడో పంపు హౌజ్ నిర్మాణ పనులతో సంబంధం లేకుండా మొదటి రెండు పంపు హౌజులతో రోజుకు 0.5 టీఎంసీల నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీకి తరలించడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దీంతో 60 రోజుల పాటు 0.5 టీఎంసీల నీటిని తరలిస్తే 30 టీఎంసీల నీరు ఎస్సారెస్పీకి చేరుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి మరో 30 టీఎంసీల నీరు వచ్చి చేరితే ఖరీఫ్‌లో ఆయకట్టుకు ఢోకా ఉండదు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పూర్తయితే రోజుకు 1 టీఎంసీ చొప్పున 60 రోజులు 60 టీఎంసీల నీటిని ఎస్సారెస్పీకి రివర్స్ పంపింగ్ ద్వారా తరలించే అవకాశం ఉంటుంది. పనులను డిసెంబర్ చివరి నాటికి పూర్తి స్థాయిలో పూర్తి చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం కాళేశ్వరం వద్ద నీటి లభ్యత ఎక్కువగా ఉండటం, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరదలు లేకపోవడంతో 0.5 టీఎంసీల చొప్పున నీటిని ముందుగా తరలించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. సీఎం కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీకి తరలించే పథకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో ఈ నెల 15 లోపు ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు వచ్చే అవకాశాలున్నాయి. వరద కాలువలో ఏడాదంతా నీరు.. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా వరద కాలువలో నీరు రివర్స్ పంపింగ్ చేయడంతో వరద కాలువలో ఏడాదంతా నీరు నిల్వ ఉంటుంది. దీంతో వరద కాలువకు ఇరువైపులా భూగర్భజలాలు పెరగే అవకాశాలున్నాయి. రైతులకు ఈ నీటితో కొంత ఉప శమనం కలుగనుంది. ఆయకట్టు రైతుల్లో ఆనందం.. సీఎం ఆదేశాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రస్తుత సంవత్సరం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రాక పోవడంతో ప్రాజెక్ట్‌లో నీరు లేదు. దీంతో ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చాలామంది రైతులు ఖరీఫ్ పంటల సాగుపై ఆశలు వదులుకున్నారు. కానీ సీఎం ఆదేశాలతో ఈనెల 15వ తేదీలోపు కాళేశ్వరం నీళ్లు వచ్చే అవకాశాలు ఉండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీని చేరితే తమ పంటలకు ఢోకా ఉండదని రైతులు అంటున్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పనులు -
ఇక మిడ్‌మానేరుకు ఎత్తిపోతలు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో 2 నెలలు ఆలస్యంగా అయినా కరువుతీరా వర్షాలు కురుస్తుండటంతో ప్రధాన జలాశయాలన్నీ జలకళతో ఉట్టిపడుతున్నాయి. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండగా గోదావరిలోనూ ప్రవాహాలు పెరుగుతుండటంతో అవన్నీ నిండుకుండలుగా మారుతున్నాయి. కడెం, దాని పరీవాహకంలో కురిసిన వర్షాలతో గోదావరి బేసిన్ లోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20.18 టీఎంసీలుకాగా 19.14 టీఎంసీల మేర నిల్వలు చేరుకున్నాయి. ఆదివారం అర్ధరాత్రి ప్రవాహా లు తగ్గాయి. గేట్లు ఎత్తడంపై అధికారులు సోమ వారం నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ఎల్లంపల్లి నుంచి నీటిని మిడ్‌మానేరు ప్రాజె క్టుకు ఎత్తిపోసే పనులకు ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోసేందుకు కాళేశ్వరంలో భాగంగా ఉన్న ప్యాకేజీ–6 నందిమేడారం పంప్‌హౌస్‌లో మొత్తం 124.5 మెగావాట్ల సామర్థ్యంగల 7 మోటార్లలో ఐదింటిని ఇప్పటికే సిద్ధం చేశారు. ఎల్లంపల్లిలో లభ్యతగా ఉన్న నీటితో ఏప్రిల్‌లోనే 5 మోటార్లకు 0.25 టీఎంసీల నీటిని వినియోగించి ట్రయల్ రన్ నిర్వహించారు. ఎల్లంపల్లి నుంచి 1.1 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ, ఆ తర్వాత 9.53 కిలోమీటర్ల మేర 11 మీటర్ల వ్యా సంతో ఉన్న జంట టన్నెళ్ల ద్వారా ప్యాకేజీ–6 లోని సర్జ్‌పూల్‌ను నింపి లీకేజీలను పరిశీలించారు. ఎత్తిపోతలకు ప్యాకేజీ–6 సిద్ధంగా ఉం డగా ప్యాకేజీ–7 పరిధిలో 11.24 కిలోమీటర్ల జంట టన్నెళ్ల నిర్మాణం రెండ్రోజుల కిందటే పూర్తయింది. ఈ టన్నెల్లోకి నీటిని వదిలి లీకేజీలు, ఇతరత్రా పరీక్షలను సోమవారం నుంచి మొదలు పెట్టనున్నారు. సోమవారం సాయం త్రం 4 గంటలకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మం డలం మేడారం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా టన్నెల్లోకి నీటిని తరలించే షట్టర్ల వద్ద ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి షట్టర్లను ఎత్తనున్నారు. మరోవైపు పరీక్షలు చేస్తూనే ప్యాకేజీ–8లోని రామడుగు పంప్‌హౌస్‌కు నీటిని పంపనున్నారు. ‘బాహుబలులు’ సిద్ధం.. ప్యాకేజీ–8లోని బాహుబలి మోటార్లకు మంగళవారం నుంచి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ప్యాకేజీ–6 మోటార్లతో పోలిస్తే ప్యాకేజీ–8లోని మోటార్ల సామర్థ్యం 15 మెగావాట్ల మేర ఎక్కువ. ఒక్కో మోటారు సుమారు 15 మీటర్ల ఎత్తు అంటే 4 అంతస్తులు ఉంటుంది. ఈ మోటార్లు 115 మీటర్ల లోతు నుంచి 3,200 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నీటిని ఎత్తిపోస్తాయి. ఈ పంప్‌హౌస్‌లో మొత్తంగా 7 మోటార్ల నిర్మాణం చేయాల్సి ఉం డగా ఇప్పటికే ఐదింటిని సిద్ధం చేశారు. ఈ నెల 9 లేదా 10న ఎల్లంపల్లి నుంచి పూర్తిస్థాయిలో ఎత్తిపోతలు చేపట్టి ప్యాకేజీ–6, 7, 8ల ద్వారా నీటిని మిడ్‌మానేరుకు తరలించనున్నారు. కృష్ణా ఉగ్ర తాండవం... పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నది ఉగ్రరూపం చూపిస్తోంది. వాగులు, వం కలు నిండిపోవడం, వచ్చిన వరద వచ్చినట్లుగా ఆల్మట్టి, నారాయణపూర్‌లోకి చేరుతుండటంతో ఉధృతి పెరుగుతూనే ఉంది. ఆల్మట్టిలోకి 2.45 లక్షల క్యూసెక్కులు (22 టీఎంసీలు) వస్తోంది. దీంతో ప్రాజెక్టు నుంచి 2.85 లక్షల క్యూసెక్కుల (25.90 టీఎంసీలు) నీటిని దిగవ నారాయణపూర్‌కు వదులుతున్నారు. నారాయణపూర్‌కు వచ్చిన నీటిని దిగువ జూరాలకు వదులుతున్నారు. జూరాలకు 2.33 లక్షల క్యూసెక్కులు (21 టీఎంసీలు) వస్తుండగా అంతే మొత్తంలో శ్రీశైలానికి వదులుతున్నారు. దీంతో శ్రీశైలానికి 2.20 లక్షల క్యూసెక్కుల (20 టీఎంసీలు) మేర నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులో నిల్వ 100 టీఎంసీలకు చేరింది. ఈ నాలుగు రోజుల్లోనే ప్రాజెక్టులోకి 66 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చి చేరింది. రోజుకు 20 టీఎంసీలకు తగ్గకుండా వరద కొనసాగుతుండటంతో వారం రోజుల్లోనే ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులో కనీస నీటిమట్టం 854 అడుగులను దాటిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సైతం తాగు, సాగు అవసరాలకు నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభు త్వం శ్రీశైలం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2,400 క్యూసెక్కుల మేర నీటిని వినియోగిస్తోంది. వరద ఇలాగే కొనసాగితే మరో 10 రోజుల్లో దిగువ నాగార్జున సాగర్‌కు నీటి ప్రవాహాలు మొదలయ్యే అవకాశం ఉంది. మరో 3 రోజులు వర్షాలు రాగల 48 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేం ద్రం తెలిపింది. గ్యాంగ్‌టక్, పశ్చిమ బెంగాల్, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి వైపు వంపు తిరిగి ఉందని సీనియర్ అధికారి రాజా రావు తెలిపారు. దీంతో సోమవారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. స్వైన్ ఫ్లూ, డెంగీ, చికున్‌గున్యా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది. -
గోదారి గంగ.. ఉరకలెత్తంగ
సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మేడిగడ్డ వద్ద 4.50 లక్షల క్యూసెక్కుల మేర వరద ఉధృతి కొనసాగింది. దీంతో గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారం బ్యారేజీ వద్ద సైతం స్థానిక వాగుల నుంచి నీరు వస్తుండటంతో 9 గేట్లు ఎత్తి 36 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలకు ఎగువ నుంచి వరద ప్రవాహం పెరిగి జలాశయం నిండు కుండను తలపిస్తోంది. ప్రస్తుతం మేడిగడ్డలో 4.51 టీఎంసీలు, అన్నారంలో 9.25 టీఎంసీలు, సుందిళ్లలో 6 టీఎంసీల మేర నిల్వలున్నాయి. నిర్మల్ జిల్లా కడెం జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. శనివారం సాయంత్రానికి 51,864 క్యూసెక్కుల మేర వరద వస్తుండటంతో 4 గేట్లు తెరిచి 39,809 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి వదులుతున్నారు. కడెం నీటి నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలుకాగా ప్రస్తుతం 6.23 టీఎంసీల నిల్వ ఉంది. కడెం నుంచి వస్తున్న నీటితో ఎల్లంపల్లి జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. ఎల్లంపల్లిలోకి 48,861 క్యూసెక్కుల వరద వస్తుండగా, నిల్వ 20 టీఎంసీలకుగాను 13 టీఎంసీలకు చేరింది. ఎస్సారెస్పీలోకి 20 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. నీటి నిల్వ 90 టీఎంసీలకుగాను 7.3 టీఎంసీలకు చేరుకుంది. -
వరద పెరిగె.. పంపింగ్ ఆగె..
సాక్షి, హైదరాబాద్, కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు 3 పంప్‌హౌస్‌లలోని మోటార్లను తాత్కాలికంగా నిలిపివేశారు. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో మేడిగడ్డ నుంచి రివర్స్ పంపింగ్ ప్రక్రియను ఆపారు. ప్రస్తుతం వస్తున్న ప్రవాహాలతోనే ఎల్లంపల్లి నిండే అవకాశాలుండటం రివర్స్ పంపింగ్ ద్వారా గోదావరి నీటిని మోటార్ల ద్వారా ఎల్లంపల్లికి ఎత్తి పోస్తే కరెంట్‌చార్జీలు వృథా అయ్యే అవకాశాల నేప థ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాజెక్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఎల్లంపల్లిలో చేరుతున్న నీటిని కాళేశ్వరంలోని 3 ప్యాకేజీల ద్వారా మిడ్‌మానేరుకు తరలించే అవకాశాలపై దృష్టి పెట్టాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో ఆ దిశగా ఇంజనీర్లు చర్యలు చేపట్టారు. ప్యాకేజీ–7లోని టన్నెల్ పనులను పూర్తి చేసే కసరత్తు చేపట్టనున్నారు. వరద పెరిగింది.. గత 25 రోజులుగా ప్రాణహిత నదికి 8 వేల క్యూసెక్కుల నుంచి 13 వేల క్యూసెక్కుల మేర మాత్రమే వరద ప్రవాహాలు కొనసాగాయి. వచ్చిన కొద్దిపాటి వరదకే అడ్డుకట్ట వేసి మేడిగడ్డ నుంచి నీటిని పంపింగ్ చేశారు. మంగళవారం వరకు మేడిగడ్డ పంప్‌హౌస్ నుంచి 1,500 గంటలపాటు మోటార్లను నడిపి 12 టీఎంసీలను ఎత్తిపోశారు. అన్నారం చేరిన నీటిలో 6 టీఎంసీలను నిల్వ చేశారు. సుందిళ్ల నుంచి నీటిని ఎల్లంపల్లికి ఎత్తిపోసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. హెడ్ రెగ్యులేటర్ నుంచి ఫోర్ బేలోకి నీటిని పంపి సుందిళ్ల పంప్‌హౌస్‌లో మోటార్ల ద్వారా మంగళవారం నుంచి నీటిని ఎత్తిపోయాలని భావిం చారు. దీనికి అనుగుణంగా సుందిళ్లలో 4 మోటార్లను సిద్ధం చేశారు. గత 2 రోజులుగా కురు స్తున్న వర్షా లతో పరీవాహకం నుంచి కడెం, ఎల్లంపల్లిలోకి ప్రవాహాలు పెరిగాయి. కడెంలోకి మంగళవారం ఉదయం 60 వేల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో 6 గేట్లు ఎత్తి 52 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో ఎల్లంపల్లిలోకి 30 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు రాగా సాయంత్రానికి అవి 18 వేల క్యూసెక్కులకు తగ్గాయి. ప్రాజెక్టులో నీటి నిల్వ 20 టీఎంసీలకుగాను 7 టీఎంసీలకు చేరింది. ఎగువ కడెంలోకి స్థిరంగా 29,810 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండటం, మరో 4 రోజులు వర్షాలు కురిసే అవకాశాల నేపథ్యంలో ఎల్లంపల్లిలోకి మరో 3–4 రోజులు స్థిరంగా ప్రవాహాలు కొనసాగే అవకా శం ఉంది. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లిలో నిల్వలు పెరిగే అవకాశం ఉంది. దీంతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌ల మోటార్లను నిలిపివేశారు. సుందిళ్లలోని ఒక పంప్‌హౌస్‌ను మంగళవారం సాయంత్రం కాసేపు నడిపి ఆపేశారు. ఎల్లంపల్లికి వరద నేపథ్యంలో రివర్స్ పంపింగ్ ద్వారా ఎల్లంపల్లికి నీటిని పంపినా ఫలితం ఉండదు. ఒకవేళ తరలించినా అక్కడి నుంచి మిడ్‌మానేరుకు నీటి తరలింపు ప్రక్రియ సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–7 పనులు ఇంకా పూర్తికానందున ఈ ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో మోటార్లను నిలిపివేశారు. మోటార్లు ఆపేసిన అనంతరం ప్రాణహిత నదిలోనూ వరద ఉధృతి పెరిగింది. వచ్చే నెల 5 నుంచి ఎల్లంపల్లి ఎత్తిపోతలు ఎల్లంపల్లికి వరద ప్రవాహాలు మొదలవడం, ఒకవేళ ప్రవాహాలు ఆగినా సుందిళ్ల నుంచి నీటిని తరలించే వ్యవస్థ సిద్ధంగా ఉండటంతో ఈ ప్రాజెక్టు నుంచి నీటి తరలింపు చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–6లో 7 మోటార్లకు 5 మోటార్లు సిద్ధంగా ఉండగా ఐదో మోటార్ వెట్ రన్ మంగళవారం విజయవంతమైంది. ఇక ప్యాకేజీ–7 టన్నెల్లో సివిల్ పనులన్నీ బుధ, గురువారాల్లో పూర్తి కానున్నాయి. పనులు పూర్తయితే అక్కడ క్లీనింగ్ ప్రక్రియ మొదలవుతుంది. దీనికి 4–5 రోజులు పట్టనుంది. ఈ పనులను మంగళవారం సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, ఈఎన్సీ మురళీధర్ పరిళీలించారు. ఎల్లంపల్లి నుంచి వచ్చే నెల 5న ఎత్తిపోతలు ప్రారంభించాలని ఆదేశించారు. ఎల్లంపల్లి నుంచి ఈ మూడు ప్యాకేజీల ద్వారా మిడ్‌మానేరుకు నీటిని తరలించనున్నారు. వచ్చే నెల 5న ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు తెలిపాయి. కాగా, ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఆగస్టు 4న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజీలో 30 గేట్ల ఎత్తివేత మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నదికి వరద పోటెత్తింది. ఆ నీరంతా గడ్చిరోలి జిల్లా సిరొంచ మీదుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తోంది. దీంతో మంగళవారం సాయంత్రం వరకు కాళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 8 మీటర్లకు చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి ప్రాణహిత వరద పెరగడంతో మంగళవారం ఉదయం 30 గేట్లు పైకి ఎత్తారు. దీంతో బ్యారేజీ వద్ద 4.10 లక్షల క్యూసెక్కుల అవుట్ ఫ్లో తరలిపోతోంది. వరద ఇన్‌ఫ్లో పెరిగితే బ్యారేజీలోని మరిన్ని గేట్లను ఎత్తేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. బ్యారేజీలో ఆది, సోమవారాల్లో నీటి నిల్వ 4.5 టీఎంసీలు ఉండగా మంగళవారం అది 7 టీఎంసీలకు పెరిగింది. బ్యారేజీ పూర్తిస్థాయి సామర్థ్యం 16.17 టీఎంసీలు. -
‘కాళేశ్వరం’ తొలి ఫలితం జిల్లాకే..
సాక్షి, పెద్దపల్లిరూరల్: పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ సారథ్యంలోనే ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్రంలోని కోటి ఎకరాల మాగాణికి సాగునీరందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ మహాయజ్ఞంలా నీటి పథకాలకు శ్రీకారం చుట్టారని, గడిచిన ఐదేళ్లకాలంలో రాష్ట్రంలో చేపట్టిన పలు పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాల దృష్టిని ఆకర్షించేలా కేసీఆర్ రూపకల్పన చేశాడన్నారు. రైతాంగానికి అవసరమైన సాగునీటిని నిరంతరం అందించేందుకు రాష్ట్రంలో 23భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టి పూర్తి చేసే స్థాయికి చేరిందన్నారు. గోదావరి నదినే మళ్లించాం.. ఇంతకాలం గోదావరి నదిలో మిగిలిన నీరంతా సముద్రంలో వృథాగా కలిసిపోయేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ సభ్యులకు వివరించారు. ఆ వృథా నీటిని సముద్రంలోకి పోకుండా రైతాంగానికి ఉపయోగపడేలా చూడాలనే మంచి ఆలోచనతోనే కాళేశ్వరం ప్రాజెక్టును యజ్ఞంలా చేపట్టామన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం ఎక్కువగా చేయడంతో ఆ వైపు నుంచి ఎస్సారెస్పీకి చుక్కనీరు రాని పరిస్థితి ఏర్పడిందని, ప్రస్తుతం కాళేశ్వరం ద్వారా నీటిని మళ్లిస్తున్నామంటే గోదావరి నదికి మళ్లించినట్లేనని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పంటల సాగు ఆశించిన స్థాయిలో జరుగడం లేదని తుదిగడువుకల్లా ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ శ్రీదేవసేనకు మంత్రి సూచించారు. సాగునీటిపై రగడ.. జిల్లాలో పంటల సాగు, రైతాంగ సమస్యలపై ఓదెల జెడ్పీటీసీ గంట రాములు ప్రశ్నలు లేవనెత్తడం.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రతీసారి సాగునీటిపై మాట్లాడం ఆనవాయితీగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం సాగునీటి రగడకు కారణమైంది. సభలో ఈ అంశంపైనే అరగంటకు పైగా చర్చ జరిగింది. పంటల సాగుకు సాగునీటి ఇబ్బందులు ఉన్నాయని, పంట సాగు చేయాలా వద్దా, కాళేశ్వరం నీళ్లు వస్తాయో లేదో తెలియదని, జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఉండడంతో ఆందోళనలో రైతులున్నారని గంట రాములు ప్రస్తావించారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ ఆరుగురు రైతులకు ఇప్పటికీ పరిహారం అందించలేదని, ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకుంటారో చెప్పాలంటూ ప్రశ్నించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఎస్సారెస్పీలో నీళ్లుంటెనే పారుతాయని, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సాగునీటిపై రాద్ధాంతం చేయడం ఆనవాయితీగా మారిందన్నారు. రైతాంగ సంక్షేమంపై ఏదో పెద్ద ఆపేక్ష ఉన్నట్లు మాట్లాడడం సరికాదన్నారు. పైద్దపల్లి నియోజకవర్గంలో కాలువ చివరి భూములకు సాగునీరందించేందు కు కాలువల వెంట తిరిగి రైతులకు అండగా ని లిచామని మనోహర్‌రెడ్డి వివరించారు. సాగునీ టి లభ్యత లేదంటూ వరిపంటను సాగు చేసుకో వద్దంటూ గ్రామాల్లో ప్రచారం చేయాలంటూ వ్యవసాయాధికారికి గంట రాములు సూచించడంతో సుల్తానాబాద్ ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మ నోహర్‌రెడ్డి సాగునీటిని రైతులకు అందించాలని పరితపిస్తే, ఇన్నాళ్లు ఇంట్లో నిద్రపోయి ఇపుడు మాట్లాడుతారా అంటూ నిలదీశారు. జెడ్పీటీసీ పుట్ట మధు, మంత్రి కొప్పుల ఈశ్వర్ జోక్యం చేసుకుని సాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. మహాయజ్ఙంలా సా గుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌పార్టీ ఎన్ని ప్రయత్నాలు చే సిందో ప్రజలందరికీ తెలిసిందేనని, ఇకనైనా ఇ లాంటి పద్ధతులు మాని ప్రభుత్వం చేపట్టే మం చి పథకాల అమలుకు సహకరించాలన్నారు. అ యితే తాను ఎలాంటి దురుద్దేశ్యంతో మాట్లాడలేదని రాములు సర్ది చెప్పేందుకు యత్నించారు. వ్యవసాయంపై మొదలై.. ప్రాజెక్టుల వైపు మళ్లిన చర్చ పెద్దపల్లి జిల్లా పరిషత్ తొలి సర్వసభ్య సమావేశంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటల సాగుపై మొదలైన చర్చ ప్రాజెక్టుల వైపునకు మళ్లింది. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరినాట్లు ఆశించినస్థాయిలో జరగకపోయినా ఆగస్టు15 నాటికల్లా వేసుకునేందుకు అవకాశముందని, ఇందుకు పలురకాల స్వల్పకాలిక విత్తనాలున్నాయని జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్ సభ్యులకు వివరించారు. సబ్సిడీ విత్తనాల పంపిణీకి 42కేంద్రాలను ఏర్పాటు చేసి 10,692 క్వింటాళ్ల విత్తనాలను అందించామని వివరించారు. బయోమందుల అమ్మకాలు జరిగినట్టు తమ దృష్టికి వస్తే వాటిని వెనక్కి పంపించామని పేర్కొన్నారు. రైతుబీమా పథకం కింద 256మందికి రూ.12కోట్ల30లక్షలను పదిరోజుల్లోనే జమ చేయించామన్నారు. రైతుబంధు పథకం జిల్లాలో కోటి 25లక్షల మందికి వర్తింపజేయగా 70వేల మంది రైతుల ఖాతాకు జమ అయ్యాయన్నారు. -
కన్నెపల్లిలో మళ్లీ రెండు మోటార్లు షురూ
కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కన్నెపల్లి పంపుహౌస్‌లో మళ్లీ 2 మోటార్లను అధికారులు ప్రారంభించారు. 4 రోజులుగా ఆటోమోడ్ పద్ధతిలోకి మార్చడానికి మోటార్లకు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం 3, 4 నంబర్ల మోటార్లు డెలివరీ సిస్టంలో నీటిని ఎత్తిపోశాయి. కన్నెపల్లిలో 2, 7, 8 మోటార్లకు కూడా వెట్‌రన్ నిర్వహిస్తామని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీలోని 85 గేట్ల ను మూసివేశారు. 4 రోజుల క్రితం వరద ఉధృతి పెరగడంతో ఇంజనీరింగ్ అధికారులు 8 గేట్లు ఎత్తారు. వరద ఉధృతి తగ్గుతుండడంతో రెండేసి చొప్పున గేట్లు మూస్తూ వచ్చారు. బ్యారేజీ వద్ద 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 7 టీఎంసీలు నిల్వ ఉంది. అన్నారం బ్యారేజీలో 4 రోజులుగా మోటార్లు నిలిపివేశారు. ఆదివారం కన్నెపల్లిలో 2 మోటార్లు నడపడంతో మళ్లీ గ్రావిటీ కాల్వ నుంచి నీటిని తరలించారు. దీంతో అన్నారం బ్యారేజీలోకి నీరు చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీలో 5.8 టీఎంసీల నీరునిల్వ ఉంది. -
722 గంటలు.. 5.65 టీఎంసీలు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం.. ప్రాజెక్టుల్లోకి ఎక్కడా నీటి ప్రవాహాలు కానరాని నేపథ్యంలో ప్రాణహిత ద్వారా వస్తున్న వరద నీటికి అడ్డుకట్ట వేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటి తరలింపుపై ప్రభుత్వం పూర్తి శ్రద్ధ పెట్టింది. మేడిగడ్డ బ్యారేజీకి వచ్చిన వరదను వచ్చినట్లుగా ఒడిసిపడుతున్న నీటిపారుదల శాఖ కన్నెపల్లి పంప్‌హౌజ్ ద్వారా ఎత్తిపోతలు చేపడుతోంది. ఇంతవరకు 722 గంటల పాటు కన్నెపల్లిలోని 5 మోటార్లను నడపగా, 5.65 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోశారు. మేడిగడ్డ బ్యారేజీలో మరో 7 టీఎంసీల మేర నీటిని నిల్వ చేశారు. ప్రాణహిత నదీ పరివాహకంలో ఆశిం చిన స్థాయి వర్షాలు కురుస్తుండటంతో వరద ఉధృతి పెరిగే అవకాశాల నేపథ్యంలో దిగువ అన్నారం పంపులకు వెట్‌రన్ మొదలుపెట్టగా, సుందిళ్ల పంపులను అధికారులు సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఇప్పటివరకు ఓకే.. ఇకపైనే భారీ ఆశలు ప్రాణహిత నదికి ఇంతవరకు ఆశించిన స్థాయిలో ప్రవాహాలు రాలేదు. గతేడాది ఇదే సమయానికి 2.50 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహాలు నమోదు కాగా ఈ ఏడాది గరిష్టంగా 20 వేల క్యూసెక్కులకు మించి ప్రవాహం రాలేదు. వచ్చిన కొద్దిపాటి వరదను మేడిగడ్డ బ్యారేజీ గేట్లు మూసి, అక్కడి నుంచి కన్నెపల్లి పంప్‌హౌజ్ ద్వారా ఎత్తిపోస్తున్నారు. ఇప్పటివరకు 5.65 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. ఆదివారం నుంచి ప్రాణహిత ద్వారా 9,700 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో తిరిగి రెండు పంపులను ఆరంభించి నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీలో 7 టీఎంసీల మేర 96.5 మీటర్ల వరకు నీటి నిల్వ ఉంది. వచ్చిన వరదను వచ్చినట్లుగా అడ్డుకట్ట వేస్తున్నారు. అయితే ఈ వరద మరో 4 రోజుల్లో పుంజుకునే అవకాశాలు ఉన్నాయని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఉధృతి మొదలైతే కన్నెపల్లిలో 6 పంపులను ఆరంభించి రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా అధికారులు అంతా సిద్ధం చేశారు. ఇక వరద ఉధృతి పెరిగి రోజుకు టీఎంసీ నీటి ఎత్తిపోతల మొదలు పెట్టే నాటికి అన్నారంలో 4 పంపులు, సుందిళ్లలో 5 పంపులను పరీక్షించి సిద్ధం చేసేలా ఇంజనీర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నారంలో ఒక పంపు వెట్‌రన్ పూర్తి కాగా, ఆదివారం 3 వేల క్యూసెక్కుల సామ ర్థ్యం ఉన్న మరో పంపునకు వెట్‌రన్ నిర్వహించారు. అన్నారం నుంచి నీరు సుందిళ్ల బ్యారేజీకి చేరుతోంది. ఆగస్టు 15 నాటికి మిడ్‌మానేరుకు.. సుందిళ్ల నిల్వ సామర్థ్యం 8.87 టీఎంసీ కాగా ఇందులోనూ 4.5 టీఎంసీల మేర నిల్వలు చేరితే ఇక్కడి నుంచి నీటి ఎత్తిపోతలు మొదలు కానుంది. వచ్చే నెల తొలి వారం నుంచి ఇక్కడ ఎత్తిపోతలు ఆరంభిం చే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఎల్లంపల్లిలో ప్రస్తుతం లభ్యతగా ఉన్న 5.60 టీఎంసీల నీటిని ప్యాకేజీ–6లో సిద్ధంగా ఉన్న 5 మోటార్ల ద్వారా ప్యాకేజీ–7 టన్నెల్ ద్వారా ప్యాకేజీ–8 పంప్హౌజ్కి, అటునుంచి సిద్ధంగా ఉంచిన 5 మోటార్ల ద్వారా నీటిని మిడ్‌మానేరుకు తరలించనున్నారు. వచ్చే నెల ఆగస్టు 15 నాటికి గోదావరి నీళ్లు మిడ్‌మానేరుకు చేర్చాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఇంజనీర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. -
రూ.15 వేల కోట్లయినా కడతాం..
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్వహణ వ్యయంపై కొందరు చేస్తున్న ప్రచారం అర్థరహితమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఏ మాత్రం పరిజ్ఞానం లేని, సగం పరిజ్ఞానం ఉన్న వ్యక్తులే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ కోసం ఏటా రూ.10 వేల కోట్ల విద్యుత్ బిల్లులను చెల్లించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులను కాపాడుకోవడానికి అవసరమైతే రూ.12 వేల కోట్లు.. రూ.15 వేల కోట్లు కూడా చెల్లిస్తామన్నారు. రైతులు ధనిక రైతులయ్యే వరకు ఉచితంగా కరెంట్, ఎత్తిపోతల నీరిస్తామని చెప్పారు. రైతుల అప్పులన్నీ తీరిపోయే వరకు అండగా ఉంటామన్నారు. రుణ విముక్తుల్ని చేసేందుకే.. రాష్ట్ర రుణ విముక్తి కమిషన్ చట్ట సవరణ ఆర్డినెన్స్ బిల్లును గురువారం అసెంబీల్లో ప్రవేశపెట్టిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. చిన్న, సన్నకారు రైతు లు, వృత్తిపరులకు బ్యాంకుల నుంచి 42 శాతమే రుణాలందిస్తున్నారని, దీంతో వడ్డీ వ్యాపారుల నుం చి అప్పులు తీసుకోవాల్సి వస్తోందన్నారు. అధిక వడ్డీలు వసూలు చేసి పీడిస్తున్నారని, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం రుణ విమోచన కమిషన్ చట్టం తెచ్చిందన్నారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జిని కమిషనర్‌గా నియమించాలని చట్టంలో నిబంధన ఉందని, అయితే గ్రామీణ నేపథ్యం ఉన్న సీనియర్ రైతు లేదా వ్యవసాయరంగ నిపుణుడిని నియమిస్తే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో తాము ఈ ఆర్డినెన్స్ తెచ్చామన్నారు. రిటైర్డ్ జడ్జిని కమిషనర్‌గా నియమిస్తేనే నిష్పక్షపాతంగా వ్యవహరించే అవకాశముంటుందని కాంగ్రెస్, ఎంఐఎం పక్షనేతలు భట్టి విక్రమార్క, అక్బరుద్దీన్ ఒవైసీలు ప్రభుత్వానికి సూచిస్తూనే మద్దతు తెలపడంతో బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందింది. రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎకరాకు రూ.5 వేల ఆర్థిక సహాయం అందించడం ద్వారా సీఎం కేసీఆర్ కొత్త ఒరవడి సృష్టించారని అక్బరుద్దీన్ కొనియాడారు. అయినా రైతుల సమస్యలు తీరలేదని, ఇంకా రాష్ట్రంలో అక్కడక్కడా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించినందుకు సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. -
హైదరాబాద్‌కు 48 రోజులే నీళ్లు అందించగలరా?
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు మారుతి అడిగిన ఓ ప్రశ్నకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్విటర్ వేదికగా సమాధానమిచ్చారు. హైదరాబాద్ నగరాన్ని తాగునీటి కష్టాలు వెంటాడనున్నాయా అని మారుతి అడగ్గా అలాంటేదేమీ జరగదని కేటీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజక్టు ద్వారా నగరానికి కావాల్సినంత నీరు అందుబాటులో ఉండనుందని పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. కేటీఆర్ బుధవారం ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ట్విటర్లో పలు అంశాలను ప్రస్తావించారు. కాళేశ్వరం జలాలతో హైదరాబాద్ నీటి అవసరాలు కూడా తీరతాయని పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్‌కు రిప్లైగా మారుతి ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్‌కు కేవలం 48 రోజులకు సరిపడే తాగునీరు మాత్రమే అందుబాటులో ఉందా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ‘ఆ రిపోర్ట్ కచ్చితమైనది కాదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రాణహిత నుంచి నీరు ఎత్తిపోయడం ప్రారంభమైంది. కొద్ది వారాల్లోనే నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకోనుంది. దీంతో హైదరాబాద్‌కు 175 ఎంజీడీల నీరు అందనుంది. అందువల్ల తాగునీటి సమస్య అనేది చోటుచేసుకోదు. అలాగే నీటి పొదుపుకు సంబంధించిన ప్రాధాన్యతను కూడా నగరవాసులు గుర్తించార’ని సమాధానమిచ్చారు. అనంతరం మారుతి శుభావార్త చెప్పారంటూ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. That report is not accurate. Once water from #KaleshwaramProject reaches Yellampalli reservoir (next few weeks), it will ensure that 172 MGD supply to Hyderabad will continue unabated At the same time, it’s time all citizens realise importance of water conservation & Harvesting https://t.co/Vf9wWXf6lw — KTR (@KTRTRS) 17 July 2019 ఇది ప్రారంభం మాత్రమే.. అంతకుముందు ట్వీట్లో.. ‘ ఇంత తక్కువ వర్షాలు పడుతున్న కాలంలో, గోదావరికి ఏ మాత్రం వరద రాకున్న కూడా.. ప్రాణహిత నదిలో వస్తున్న వరదనీటిని 10 రోజుల్లో 5 మోటార్ల ద్వారా ఎత్తిపోసి 11 టీఎంసీలు ఒడిసిపట్టాం. గోదావరిలో తక్కువ వరద ఉన్నప్పుడే 11 టీఎంసీలు నిల్వచేయడం జరిగింది. ఈ నీటితో కనీసం లక్షన్నర ఎకరాలకు నీరు ఇవ్వొచ్చు. ఇది ప్రారంభం మాత్రమే.. వర్షాలు పడి, వరద పెరిగితే అన్ని మోటార్లు మొదలవుతాయి. అన్ని మోటార్లు ప్రారంభమైతే తెలంగాణలో బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయి. సీఎం కేసీఆర్ దార్శనికత వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే సాకారమైంది. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కావడం వల్ల తెలంగాణకు చేకూరిన లబ్ధి ఇది. కాళేశ్వరం జలాలతో హైదరాబాద్ నీటి అవసరాలు కూడా తీరుతాయి. చెన్నై కానీ, ఇతర మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో మాదిరి నీటి కష్టాలు హైదరాబాద్‌కు ఎప్పుడూ రాకుండా చూసుకోవచ్చ'ని కేటీఆర్ పేర్కొన్నారు. -
కాళేశ్వరం.. తెలంగాణకు వరం
చెన్నూర్‌రూరల్/చెన్నూర్ : కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం అవుతోందని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ అన్నారు. చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో అన్నారం బ్యారేజీ వద్ద మంగళవారం జల జాతర, సామూహిక వన భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రులు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరంలాంటిదని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తర, మధ్య తెలంగాణకు 45 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని, హైదరాబాద్‌కు 40 టీఎంసీల తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు 30 శాతం, మిషన్ భగీరథకు 60 శాతం నీరు అందుతుందని చెప్పారు. అయితే.. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తోందని విమర్శించారు. సామూహిక వనభోజనాలు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రాజెక్టుల గురించి పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసిస్తుంటే.. ఇక్కడి ప్రతిపక్ష పార్టీలు మాత్రం రాద్ధాంతం చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పాలనలో గోదావరి జలాల మీద ఏనాడూ ఒప్పందం కుదుర్చుకోలేదని విమర్శించారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాజనీతిజ్ఞుడిలా వ్యవహరించి ప్రాజెక్టులు నిర్మించి రైతాంగానికి నీరు అందిస్తున్నారని తెలిపారు. కాళేళ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎగువ, దిగువ ప్రాంతాల ముఖ్యమంత్రులు హాజరయ్యారని పేర్కొన్నారు. చాలా రాష్ట్రాల్లో నదీ జలాలపై గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. కావేరి జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తిందన్నారు. పక్క రాష్ట్రాలతో ఎలాంటి పంచాయితీ లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో చెన్నూర్ నియోజకవర్గంతోపాటు ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో మూడు లక్షల ఎకరాలకు సాగు నీరందించేలా సీఎం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నడిపల్లి దివాకర్‌రావు, కోరుకంటి చందర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, నారదాసు లక్ష్మణ్‌రావు, మంచిర్యాల జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మంథని జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, జక్కు శ్రీవర్షిణి పాల్గొన్నారు. -
వెబ్సైట్లో ఎప్పుడు పెట్టారు
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు మంజూరు చేసిన అనుమతులను అధికారికంగా వెబ్సైట్లో ఎప్పుడు పొందుపరిచారన్న విషయంపై స్పష్టత ఇవ్వాల్సిందిగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. ఈ ప్రాజెక్టుకు మంజూరు చేసిన అనుమతులు చెల్లవంటూ హాయాతుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ రఘువేంద్ర రాథోర్ బెంచ్ బుధవారం విచారించింది. అనుమతులు మంజూరైన అనంతరం పిటిషనర్లు 22 రోజులు ఆలస్యంగా కేసు దాఖలు చేశారు. దీంతో కేసు విచారణార్హతపై ట్రిబ్యునల్ విచారణ జరుపుతోంది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. -
కాళేశ్వరం రూపకర్త కేసీఆరే
సాక్షి, కాళేశ్వరం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి ఎకరం తడుస్తుందని... కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూపాయి నిధులు ఇవ్వలేదని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం ఆయన జయశంకర్ భూపాపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపుహౌస్, మేడిగడ్డ బ్యారేజీలను ఎమ్మెల్యేలు గండ్ర వెంకట్రమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్లు పుట్ట మధుకర్, జక్కు శ్రీహర్షిణి, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు. ముందుగా కన్నెపల్లి పంపుహౌస్‌లోని మోటార్ల బిగింపును పరిశీలించారు. అనంతరం గోదావరి నుంచి అప్రోచ్ కెనాల్లోకి నీరు వచ్చే ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ ఈఈ రమణారెడ్డి, డీఈఈ సూర్యప్రకాశ్‌లు ప్రాజెక్టు వచ్చే టీఎంసీలు, నీటినిల్వ సామర్థ్యాన్ని వారికి వివరించారు. అక్కడినుంచి పంపుల నుంచి నీటిని ఎత్తిపోస్తున్న డెలివరీ సిస్టం వద్ద నీటిని గ్రావిటికాల్వను పరిశీలించారు. నీటి లభ్యత పెరిగింది... గత నెల 21న సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు నీటి లభ్యత లేకపోవడంతో కొంత సేపు మాత్రమే నీటిని ఎత్తిపోసినట్లు మంత్రి దయాకర్‌రావు తెలిపారు. ప్రస్తుతం గోదావరి, ప్రాణహితలు గలగల పారుతున్నయన్నారు. వీటి ద్వారా నీటి లభ్యత వివరీతంగా పెరిగిందన్నారు. నీళ్లను తెలంగాణ అంతటికి అందించడానికి సిద్ధమైనట్లు తెలిపారు. ఇదంతా గొప్ప విషయమని పేర్కొన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు డైరెక్టర్, నిర్మాత, రచయిత సర్వం ఆయనేనన్నారు. ఆయనను తెలంగాణ ప్రజలంతా కొనియాడుతున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ కృషితో తెలంగాణ సశ్యశామలం అవుతుందని సంతోషపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు విమర్శలతో గగ్గోలు పెడుతున్నాయన్నారు. కట్టలు తెగిపోతున్నాయని, పంపులు నడుస్తలేవని తప్పుడు ప్రచారం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకులు ఒక్కసారి వచ్చి మోటార్ల పనితీరు చూసి నీళ్లు చల్లుకొని పోవాలని హితవు పలికారు. పంపుహౌస్‌లో మొత్తం 11 మోటార్లకు 3మోటార్లు నీటిని ఎత్తిపోస్తుందని తెలిపారు. త్వరలో 6మోటార్లు పూర్తిస్థాయిలో నడిపి రెండు టీఎంసీల నీటిని తరలించనున్నట్లు తెలిపారు. ఈ ఖరీఫ్‌కు మొత్తం 11మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్‌లో 3టీఎంసీలు ఎత్తిపోసేందుకు కేసీఆర్ ప్రణాళికలు చేశారన్నారు. మంత్రి వెంట ఎంపీపీ బస్సొడ రాణిబాయి, జెడ్పీ వైస్ చైర్మన్ శోభ, ఎంపీటీసీ మమత, సర్పంచ్ శ్రీపతిబాపు, మాజీ జెడ్పీటీసీ చల్లా నారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు ఉన్నారు. -
కాసుల వర్షం
సాక్షి, సిద్దిపేటజోన్: మూడేళ్లుగా అటవీశాఖలో కాసుల వర్షం కురుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా 3,517 ఎకరాల అటవీ భూమిని అధికారులు సేకరించారు. దీనికి బదులుగా జిల్లాలోని 760 ఎకరాల రెవెన్యూ భూమి అటవీశాఖకు అప్పగించారు. ప్రాజెక్ట్‌కు సేకరించిన భూమికి పరిహారం కింద జిల్లా అటవీశాఖకు రూ.149 కోట్లు డిపాజిట్ చేశారు. దీనిలో క్యాంపా(కంపెన్షనరీ అప్రిసియేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) కింద విడతల వారీగా రూ.20 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో అటవీ సంరక్షణ, విస్తరణ చేయనున్నారు. అలాగే జిల్లాలో 3.50 లక్షల మొక్కలను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని 23 మండలాల పరిధిలో ఆటవీశాఖ రికార్డుల ప్రకారం 27,604 హెక్టార్ల అటవీ విస్తరించి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు కాలువల కోసం జిల్లాకు చెందిన పలు ప్రాంతాల్లో అటవీశాఖకు చెందిన భూమిని సైతం సేకరించారు. దీంతో కేంద్ర అటవీ శాఖ నిబంధనల ప్రకారం ప్రాజెక్టులు, రైల్వేలైన్లు, జాతీయ రహదారులతో పాటు ప్రజా ప్రయోజనాల నిమిత్తం అటవీ భూమిని తీసుకోవడం వల్ల కోల్పోయిన భూమికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ భూమిని కాని, అది లేని పక్షంలో ఆ భూమికి సంబంధించిన విలువ మేరకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. క్యాంపా పథకం కింద అటవీ శాఖకు రెండు మార్గాల్లో నిధులు సమకూరుతున్నాయి. వాటిలో ఒకటి నెట్ ప్రజెంట్ వాల్యూ(ఎన్పీవీ) ద్వారా, ఆటవీ భూభాగంలో కోల్పోయిన అటవీ స్థలం విలువతో పాటు అడవుల్లోని చెట్లకు కూడా విలువ కట్టి పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. క్యాంపాలో రెండో విభాగంలో కంపెన్షనరీ అప్రియేషన్ (సీఏ) కింద జిల్లాలో నిర్మిస్తున్న నీటి ప్రాజెక్టుల కోసం అటవీభూమిని స్వీకరిస్తే పరిహారంగా ఎకరానికి ఎకరం చొప్పున రెవిన్యూ భూమిని గాని, లేని పక్షంలో పరిహారంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన సిద్దిపేట జిల్లాలో కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం అటవీశాఖకు చెందిన 3,517 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్టు నిమిత్తం సేకరించారు. దీనికి ప్రత్యమ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 760 ఎకరాల రెవెన్యూ భూమిని అటవీ విస్తరణ కోసం కేటాయించింది. మిగతా భూమికి విలువ కట్టి మూడేళ్లుగా దశల వారీగా ప్రభుత్వం అటవీశాఖకు క్యాంపా పద్దు కింద నిధులను కేటాయించింది. ఈ లెక్కన 2016–17 సంవత్సరంలో రూ. 6.35 కోట్ల ప్రతిపాదనలకు గాను ప్రభుత్వం రూ. 4.19 కోట్లను మంజూరి చేసింది. రెండో విడత 2017–18 సంవత్సరానికి సంబంధించి రూ. 5కోట్ల పరిహార ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రభుత్వం రూ. 3కోట్లు మంజూరి చేసింది. అలాగే 2018–19 సంవత్సరానికి సంబంధించి క్యాంపా పద్దు కింద రూ.13.29 కోట్ల ప్రతిపాదనలకు గాను ప్రభుత్వం రూ.9.38 కోట్లను మంజూరి చేసింది. ఈ ఏడాది 2019–20 సంవత్సరానికి సంబంధించి అటవీశాఖ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆటవీ భూమిని కోల్పోయిన పరిహారం కోసం రూ. 20 కోట్లతో పరిహారం కోసం ప్రతిపాదనలు పంపగా రూ. 2.50 కోట్లను విడుదల చేయడం విశేషం. రెవెన్యూ భూమి అప్పగింత క్యాంపా నిధులను అటవీ విస్తీర్ణం, సంరక్షణ, అభివృద్ధి కోసం కేటాయిస్తారు. అటవీ భూమిని కోల్పోయిన జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారంగా 706 ఎకరాల రెవెన్యూ భూమిని అప్పగించింది. ఈ భూమిలో అటవీశాఖ గతేడాది 200 ఎకరాల్లో పెద్ద ఎత్తున ప్లానిటేషన్ ప్రక్రియను చేపట్టి కోల్పోయిన అటవీ విస్తీర్ణాన్ని పెంచే దిశగా చర్యలు చేపట్టింది. మరోవైపు సుమారు 6,700 ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాకు మంజూరైన క్యాంపా నిధులతో ప్లానిటేషన్, కందకాల తవ్వకం, దట్టమైన అటవీ ప్రాంతం కలిగిన శనిగరం, చికోడు మల్లన్నగుట్టలు, అల్లీపూర్ గుట్టలు, గజ్వేల్, హుస్నాబాద్, ములుగుతో పాటు మర్పడగ ప్రాంతాల్లో అడవిలోని జీవాల కోసం నీటి తోట్లు(సాసర్పీట్లు) నిర్మాణం చేపట్టింది. నర్సంపల్లి అటవీ ప్రాంతం చుట్టూ ప్రహరీ గోడల నిర్మాణానికి నిధులను వినియోగించారు. శనిగరం, గండిపల్లి, కేశావపూర్, మీర్జాపూర్, గిరాయిపల్లి, శనిగరం లాంటి ప్రాంతాల్లో మరింత అటవి విస్తీర్ణం కోసం ప్లానిటేషన్ ప్రక్రియను పెద్ద ఎత్తున క్యాంపా నిధుల ద్వారా చేపడుతున్నారు. అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో రిజర్వాయర్ల కోసం 3,517 ఎకరాల అటవీ భూమిని ఇవ్వాల్సి వచ్చింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో 706 ఎకరాల రెవెన్యూ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖకు అప్పగించింది. మిగిలిన భూమికి పరిహారంగా క్యాంపా పథకం కింద నిధులు దశల వారిగా వస్తున్నాయి. ఈ క్యాంపా నిధులతో జిల్లాలో కోల్పోయిన అటవీ ని తిరిగి విస్తరించేందుకు ప్రణాళికలు రూ పొందించాం. ఇప్పటికే పలు చోట్ల ప్రభుత్వం ఇచ్చిన రెవెన్యూ భూమిలో 3.5 కోట్ల మొక్కలను ప్లానిటేషన్కింద అభివృద్ధి చేస్తున్నాం. –శ్రీధర్‌రావు, జిల్లా ఆటవీశాఖ అధికారి -
ఎత్తిపోతలు షురూ
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం: గోదావరి, ప్రాణహిత నదుల్లో ప్రవాహాలు పెరుగుతుండటంతో కాళేశ్వరం ప్రాజెక్టుల్లోని మేడిగడ్డ ద్వారా గరిష్ట నీటిని ఎత్తిపోసే ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇప్పటికే మేడిగడ్డ పంప్‌హౌజ్ పరిధిలో మూడు మోటార్లకు ట్రయల్‌రన్ పూర్తవగా, రెండు పంపులను నిరంతరాయంగా నడుపుతున్నారు. మూడు రోజులుగా వెట్రన్లు పూర్తి చేస్తుకున్న 1వ, 6వ మోటార్ల ద్వారా పంపుహౌస్ నుంచి డెలివరీ సిస్టర్న్‌లో నీటిని ఎత్తిపోస్తున్నారు. ఈ ప్రయత్నం ద్వారా 1.5 టీఎంసీల నీరు అన్నారం బ్యారేజీలో కలిసినట్లు ఇంజనీర్లు పేర్కొంటున్నారు. అలాగే మూడు మోటార్లు నడిస్తే మరింత నీరు అన్నారం బ్యారేజీలో నిల్వ చేయడానికి వీలుగా ఉంటుంది. అక్కడి నుంచి సుందిళ్ల, ఎల్లంపల్లి, మిడ్‌మానేరుకు తరలించనున్నారు. మూడో నంబర్ మోటార్‌కు రాత్రి వరకు వెట్‌రన్ నిర్వహించి ఎత్తిపోయనున్నారు. తెలంగాణలో ఆశించినమేర వర్షాలు లేనప్పటికీ మహారాష్ట్రలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో.. గడ్చిరోలి జిల్లా మాలేగావ్ నుంచి భారీగా వరద ప్రాణహిత నదిగుండా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తోంది. ఆదివారం కాళేశ్వరం, కన్నెపల్లి ప్రాంతాల్లో 96 వేల క్యూసెక్కులు, మేడిగడ్డ బ్యారేజీ వద్ద లక్ష క్యూసెక్కుల వరద కిందికి పోతోంది. సోమవారం తెల్లవారుజాము వరకు ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిసింది. దీంతో 4,600 క్యూసెక్కుల నీరు అన్నారం బ్యారేజీ వైపు పరుగులు తీస్తోంది. ఆదివారం అర్ధరాత్రినుంచి లేక సోమవారం నుంచి మూడు మోటార్లను నడిపేలా అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. మరో వారంలో 6 మోటార్లను నడుపుతూ ఒక టీఎంసీకి పైగా నీటిని.. ప్రతిరోజూ, వరద కొనసాగే అన్ని దినాలు నడిపేలా రంగం సిద్ధం చేస్తున్నారు. వచ్చిన వరద వచ్చినట్లుగా.. గోదావరిలో జూన్‌లో ఎక్కడా నీటి ప్రవాహాలు లేకున్నా ప్రస్తుతం క్రమంగా అవి పుంజుకుంటున్నాయి. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నదిలో ప్రవాహాలు పుంజుకున్నాయి. రెండ్రోజుల కిందట మేడిగడ్డ వద్ద గోదావరి ప్రవాహం 8వేల క్యూసెక్కులుండగా, అది శనివారం 14వేల క్యూసెక్కులకు పెరిగింది. అది మరింత పుంజుకొని ఆదివారం మధ్యాహ్నానికి 26వేల క్యూసెక్కులకు చేరింది. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 85 గేట్లు ఉండగా.. ఆదివారం సాయంత్రం వరకు 52 గేట్లను కిందికి దించినట్లు ఇంజినీర్లు తెలిపారు. మిగితా గేట్లను సైతం మరో రెండు రోజుల్లో దించి ఉంచనున్నారు. దీంతో వరద ప్రవాహం నిలిచి నీటి నిల్వ పెరుగుతుంది. ఆ నీటిని కన్నెపల్లి వద్ద మోటార్లతో ఎత్తిపోయనున్నారు. మేడిగడ్డ పంప్‌హౌస్ (కన్నెపల్లి) వద్ద ప్రస్తుతం నీటి మట్టం 96.6 మీటర్లలో ఉంది. మోటార్లు నడిపేంత నీటి మట్టాలు ఉండటంతో ఇక్కడ రెండు మోటార్లను ప్రారంభించారు. మేడిగడ్డ పంపుహౌస్‌లో 40 మెగావాట్ల సామర్థ్యముండే 11 పంపులను ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటికే 9 పంపుల బిగింపు పూర్తయింది. మరో రెండో పురోగతిలో ఉన్నాయి. ఇందులో రెండు మోటార్ల ద్వారా ప్రస్తుతం 4,600 క్యూసెక్కుల నీటిని గ్రావిటీ కాల్వ ద్వారా అన్నారం బ్యారేజీకి వదులుతున్నారు. మరో మోటార్‌ను ఆరంభించే అవకాశం ఉంది. ఈ మూడు పంపులు ఒకేమారు నడిస్తే సుమారు అర టీఎంసీ మేర నీరు అన్నారంలోకి చేరుతుంది. సీసీటీవీలతో సీఎం సమీక్ష కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌ల్లో నీటిని ఎత్తిపోస్తున్న దృశ్యాలను క్యాంపు కార్యాలయం నుంచి సీఎం కేసీఆర్ ప్రతిగంటకూ వీక్షిస్తున్నట్లు ఇంజనీర్లు వెల్లడించారు. వరద ఉధృతి, ఎన్ని మోటార్లు నడుస్తున్నాయి? ఇప్పటి వరకు ఎన్ని టీఎంసీల నీరు గోదావరి గుండా పోయింది? ఎన్ని టీఎంసీలు ఎత్తిపోశారనే వివరాలను తెలుసుకుంటున్నారు. అన్నారం బ్యారేజీ వద్ద గల అండల్ టన్నెల్లో సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని సీఎం కార్యాలయం నుంచి సూచించినట్లు తెలిసింది. ఆరు మోటార్ల ద్వారా.. ఇక గోదావరిలో ప్రవాహాలు మరింత పెరిగే అవకాశాల నేపథ్యంలో ఈ వారంలోనే మరో మోటార్‌కు ట్రయల్‌రన్ నిర్వహించి నీటిని ఎత్తిపోసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈఎన్సీ వెంకటేశ్వర్లు, మేఘ ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు అక్కడే ఉండి ట్రయల్‌రన్ పనులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఆరు రోజులుగా పంపుహౌస్ వద్దే మకాం వేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోని పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ 6 మోటార్ల ద్వారా 1.2 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. నీటి మట్టం 100 మీటర్లకు పైన చేరితే.. జులై చివరి నుంచి అన్ని మోటార్లను నడిపించనున్నారు. పంపుహౌస్‌లో 11 మోటార్లకు గానూ 6 మోటార్లు డెలివరీ సిస్టంలో ఎత్తిపోసే వరకు ఇక్కడే ఉంటానని ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఇక గ్రావిటీ కెనాల్ నుంచి నీరంతా అన్నారం బ్యారేజీకి చేరడంతో అక్కడ నీటి మట్టం పెరుగుతోంది. 11 టీఎంసీల సామర్థ్యమున్న అన్నారం బ్యారేజీలో 4.50 టీఎంసీల మేర నిల్వలు చేరితే అన్నారం పంప్‌హౌజ్‌లోని మోటార్లను నడపించే వీలుంది. అన్నారం పంపుహౌస్‌లో 8 మోటార్లకుగాను 7 పంపులు, మోటార్ల బిగింపు పూర్తవగా, మరొకటి పురోగతిలో ఉంది. వచ్చే నెల మొదటి వారం నుంచి ఇక్కడి నుంచి సుందిళ్ల బ్యారేజీకి నీటి ఎత్తిపోతలు ఆరంభమయ్యే వకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. అనుకున్నట్లుగా వరద కొనసాగి మోటార్లన్నీ నడిస్తే వచ్చే నెల 15 నాటికి ఎల్లంపల్లి నింపే అవకాశం ఉంది. ఆగస్టు చివరికి ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంటుందని నీటి పారుదల వర్గాలు వెల్లడిస్తున్నాయి.