సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరంపై ఇప్పటికైనా బీఆర్‌ఎస్ తప్పు ఒప్పుకోవాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. వాస్తవాలు తెలిసి కూడా తప్పును కప్పి పుచ్చుకోవడానికి విహార యాత్రగా కాళేశ్వరంగా వెళ్లారు అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు.
కాగా, బీఆర్‌ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజక్ట్ పర్యటనపై జీవన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నేతలు కాళేశ్వరం వెళ్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. కేటీఆర్ కాళేశ్వరం పర్యటన ఓ విహారయాత్ర. మూడు లిఫ్ట్‌ల్లో నీటిని తరలిస్తే 30వేల కోట్లు అయ్యే ప్రాజెక్ట్‌కు లక్షా 20వేల కోట్లు చేశారు. అప్పులకు కేసీఆరే బాధ్యుడు. ఈ ప్రాజెక్ట్‌లో నిర్మాణాత్మకంగా లోపాలు ఉన్నాయి. మూడు ప్రాజెక్ట్‌ల్లో నీటిని నిల్వ చేయకుడదని ఎన్డీఎస్‌ఏ స్పష్టం చెబుతోంది. విజిలెన్స్ కూడా ఇదే నివేదిక ఇవ్వబోతోంది.
వాస్తవాలు తెలిసి కూడా ఇలా విహారయాత్రకు వెళ్లినట్టు వారంతా అక్కడికి వెళ్లారు. ఒకవైపు న్యాయవిచారణ జరుగుతోంది. వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ అనుభవం ప్రజలకు ఉపయోగపడుతుందని అనుకున్నాం. కానీ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి నీటిని తరలించడానికి ఒకేఒక అవకాశం ఉంది. మారో మార్గమే లేదు. గత బీఆర్‌ఎస్ వల్లే ఈ పరిస్థితి నెలకొంది. తుమ్మడిహట్టి వద్ద 148 మీటర్ల నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నారు. 148 మీటర్ల ఎత్తుతో నీటిని తరలిస్తే ప్రాణహిత నీళ్లు ఒక్క లిఫ్ట్‌తో ఎల్లంపల్లికి నీళ్లు వచ్చేవి. కేసీఆర్ కమీషన్ల కోసం లక్షల కోట్ల అప్పులు చేశారు. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడు. ఇప్పటికైనా మీరు చేసిన తప్పులకు ప్రజలను క్షమాపణ కోరండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment