శాంతిభద్రతలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు.. కేటీఆర్‌ రియాక్షన్‌ | KTR Reply On Congress MLC Jeevan Reddy Comments On Law And Order | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు.. కేటీఆర్‌ రియాక్షన్‌

Published Tue, Oct 22 2024 6:28 PM | Last Updated on Tue, Oct 22 2024 6:52 PM

KTR Reply On Congress MLC Jeevan Reddy Comments On Law And Order

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో శాంతిభద్రతలపై జగిత్యాలలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. తెలంగాణలో శాంతిభద్రతలు లేవని గత కొన్ని నెలలుగా అందరూ చెబుతున్న మాటనే నేడు జీవన్‌రెడ్డి అంటున్నారని తెలిపారు. 

ఈ మేరకు ఎక్స్‌లో...రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని కొన్ని నెలల నుంచి జనం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవటం, పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉండటంతోనే ఈ సమస్య తలెత్తిందని ఆరోపించారు. ఇప్పుడు అదే విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కూడా ఆవేదనతో చెబుతున్నారని పేర్కొన్నారు.

ఇకనైనా శాంతి భద్రతలు కాపాడే విషయంలో ప్రభుత్వ పెద్దలు వివేకంతో ఆలోచించాలని కేటీఆర్‌ కోరారు. పోలీసు ఉన్నతాధికారులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని సూచించారు. రాష్ట్రంలో సమర్థవంతమైన పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారని.. వారి పని వారిని చేసుకొనిస్తే శాంతి భద్రతలు, రాష్ట్రంలో సామరస్యాన్ని కాపాడగలుగుతారని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement