Law and order
-
శాంతిభద్రతలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలపై జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో శాంతిభద్రతలు లేవని గత కొన్ని నెలలుగా అందరూ చెబుతున్న మాటనే నేడు జీవన్‌రెడ్డి అంటున్నారని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో...రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని కొన్ని నెలల నుంచి జనం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవటం, పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉండటంతోనే ఈ సమస్య తలెత్తిందని ఆరోపించారు. ఇప్పుడు అదే విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కూడా ఆవేదనతో చెబుతున్నారని పేర్కొన్నారు.ఇకనైనా శాంతి భద్రతలు కాపాడే విషయంలో ప్రభుత్వ పెద్దలు వివేకంతో ఆలోచించాలని కేటీఆర్ కోరారు. పోలీసు ఉన్నతాధికారులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని సూచించారు. రాష్ట్రంలో సమర్థవంతమైన పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారని.. వారి పని వారిని చేసుకొనిస్తే శాంతి భద్రతలు, రాష్ట్రంలో సామరస్యాన్ని కాపాడగలుగుతారని అన్నారు.A senior congress leader & a Former Minister, MLC Jeevan Reddy Garu today is echoing what the rest of Telangana has been saying since the last few months Law & Order in Telangana has been a major concern. Without a full time Home Minister and more importantly with police being…— KTR (@KTRBRS) October 22, 2024 -
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గతి తప్పింది: హరీశ్‌రావు
హైదరాబాద్, సాక్షి: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. అందుకు వరుసగా జరుగుతున్న ఘటనలే నిదర్శనమని మాజీ మంత్రి హరీష్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనేటందుకు వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే నిదర్శనం. గడిచిన వారం రోజుల్లో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారు. హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్ లో అందరూ చూస్తుండగా సమీర్ అనే యువకుడిని దారుణంగా పొడిచి చంపారు. .. పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన మరచిపోక ముందే, మరో దారుణం చోటుచేసుకున్నది. రక్షించాల్సిన పోలీసే, తోటి మహిళా కానిస్టేబుల్ ను భక్షంచే దుర్ఘటన నిన్న భూపాలపల్లి జిల్లాలో జరగడం అత్యంత హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వం తక్షణం స్పందించి కారకుడైన ఎస్సై పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. .. గత పదేళ్ళలో శాంతి భద్రతలకు చిరునామాగా మారిన తెలంగాణ రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో భద్రత ప్రశ్నార్ధకమవటం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇకమీదట ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలు కాపాడాలని కోరుతున్నాం అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. భట్టి కౌంటర్హరీష్రావు చేసిన ట్వీట్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ‘‘గత పదేళ్ళ పాలనను హరీష్ రావు మర్చిపోయారా?. బీఆర్ఎస్ ప్రభుత్వం లో జరిగిన సంఘటనలు చూస్తే కడుపు తరుక్కుపోతుంది’’ అని అన్నారు. తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణే తమ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్న మంత్రి భట్టి.. అవాంఛనీయ సంఘటనలకు పాల్డడే వ్యక్తులను ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. -
UP: మాఫియాపై సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భరోసా ఇచ్చారు. ముజఫర్‌నగర్‌లో బుధవారం(ఏప్రిల్ 10) జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో యోగి మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం మాఫియా దుస్థితి ఎలా ఉందో చూడొచ్చు. ఎవరి పేరు చెబితే ఒకప్పుడు కర్ఫ్యూ వాతావరణం ఏర్పడేదో వాళ్ల పరిస్థితి మీరే చూస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్నపుడు మాఫియా లీడర్ కాన్వాయ్కి ఏకంగా సీఎం కాన్వాయ్ దారి ఇచ్చే పరిస్థితి ఉండేది. మేం అధికారంలోకి వచ్చి చర్యలు తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత మాఫియా ప్యాంట్లు తడుస్తున్నాయి’అని యోగి అన్నారు. ఇదీ చదవండి.. రూ.200 కోట్ల హవాలా గుట్టురట్టు -
Hyderabad: ఇక తెల్లవార్లూ డ్రంక్ అండ్ డ్రైవ్!
హైదరాబాద్: ఇక తెల్లవార్లూ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంగా రెండు షిఫ్ట్‌లలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వేర్వేరు చోట్ల వాహనదారులకు శ్వాస పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించారు. వెస్ట్‌జోన్ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మధురానగర్, పంజగుట్ట, బోరబండ, ఎస్ఆర్నగర్, మాసబ్‌ట్యాంక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం 4 గంటల వరకు ఎనిమిది చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌పరిధిలో డైమండ్ హౌజ్, ఫిలింనగర్ విజేత సూపర్‌మార్కెట్ వద్ద నిర్వహించిన డ్రంక్ డ్రైవ్‌లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 24 మంది మందుబాబులు పట్టుబడ్డారు. ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ పోలీసులు ఎస్ఆర్నగర్ ఐసీఐసీఐ వద్ద రాత్రి 10 నుంచి ఒంటి గంట వరకు, జూబ్లీహిల్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 4 గంటల వరకు నిర్వహించిన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 26 మంది పట్టుబడ్డారు. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు స్టడీ సర్కిల్, గ్రీన్ బావర్చి వద్ద నిర్వహించిన తనిఖీల్లో 13 మంది పట్టుబడ్డారు. పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు రాత్రి 10 నుంచి ఒంటిగంట వరకు గ్రీన్‌ల్యాండ్స్ వద్ద, బంజారాహిల్స్ పార్క్ హయత్ వద్ద రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 4 గంటల వరకు నిర్వహించిన తనిఖీల్లో 19 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. -
ఇదీ సెక్షన్.. తప్పదు యాక్షన్!
సాక్షి, కరీంనగర్: 'ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులను ఎన్నుకోవడానికి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎన్నికల సమయంలో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఎక్కువ కేసులు నమోదు చేస్తుంటారు. ప్రచారంలో పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు అదుపుతప్పి వ్యవహరిస్తే దండన తప్పదు. సామాన్య పౌరులు సైతం ఫిర్యాదు చేసినా.. పోలీసులు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. పలువురు విద్యార్థులు, యువత ఇంటర్నెట్లో ఎన్నికల చట్టాలు– నిబంధనల గురించి సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొన్ని ఎన్నికల చట్టాలను వివరించే కథనం.' సెక్షన్ 123: జాతి, మతం, కులం, సంఘం, భాషను రెచ్చగొట్టేలా వ్యవహరించడం, ఒత్తిడికి లోను చేస్తే.. ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేయొచ్చు. 125: ఎన్నికల సందర్భంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందిస్తే మూడేళ్ల పాటు జైలు శిక్ష లేదా జరిమానా రెండింటినీ విధించే అవకాశం ఉంటుంది. 126: ఎన్నికల సమయానికి 48 గంటల ముందు బహిరంగ సభలు నిర్వహిస్తే శిక్షార్హులు. దీనికి రెండేళ్ల జైలు లేదా జరిమానా విధిస్తారు. 127: ఎన్నికల సమావేశం సందర్భంగా ఎటువంటి అల్లర్లకు పాల్పడినా.. పోలీస్ అధికారి అయినా ఆ వ్యక్తులను అరెస్టు చేయొచ్చు. ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.2 వేల జరిమానా. 128: బహిరంగంగా ఓటేస్తే మూడు నెలల జైలు లేదా జరిమానా. 129: ఎన్నికలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది, పోలీసులు పోటీచేసే అభ్యర్థికి సహకరించినా, ప్రభావం కలిగించినా శిక్షార్హులు. దీనికిగాను 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తారు. 130: పోలింగ్ స్టేషన్‌కు 100 మీటర్ల లోపల ప్రచారం చేయొద్దు. ఒకవేళ చేస్తే రూ.250 జరిమానా పడుతుంది. 131: పోలింగ్ కేంద్రానికి సమీపంలో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే.. ఏ పోలీస్ అధికారి అయినా ఆ సామగ్రిని స్వాధీనం చేసుకోవచ్చు. 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా, రెండూ అమలుచేయొచ్చు. 132: ఓటేసే సమయంలో నియమ నిబంధనలు పాటించనివారికి 3 నెలల జైలు శిక్ష లేదా జరిమానా. 134: అధికార దుర్వినియోగానికి పాల్పడితే శిక్షార్హులే. ఇందుకు రూ.500 జరిమానా విధిస్తారు. 134(అ): ఠాణా పరిసర ప్రాంతాలకు మారణాయుధాలతో వెళ్లడం నిషేధం. అలా వెళ్లినవారికి 2 నెలల జైలుశిక్ష, జరిమానా వేస్తారు. 135: పోలింగ్ కేంద్రం నుంచి బ్యాలెట్ పత్రం, ఈవీఎం అపహరిస్తే శిక్షార్హులు. ఏడాది పాటు జైలుశిక్ష, రూ.500 జరిమానా. 135(ఇ): పోలింగ్, కౌంటింగ్ రోజున మద్యం విక్రయించడం, మద్యం, డబ్బు ఇవ్వడానికి ఆశచూపడం నేరం. అందుకు 6 నెలల జైలుశిక్ష, రూ.2 వేల వరకు జరిమానా. 133: ఎన్నికల సందర్భంగా ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు చేరవేసేందుకు వాహనాలు సమకూర్చినా, అద్దెకు తీసుకున్నా శిక్షార్హులు. అందుకు 3 నెలల జైలుశిక్ష, జరిమానా. 135(ఆ): ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల రోజు వేతన సెలవుగా మంజూరు చేసినా శిక్ష, అందుకు రూ. 5వేల జరిమానా విధించొచ్చు. 49వీ: ఒక వ్యక్తి ఓటు మరొకరు వేస్తే పోలింగ్ ఆఫీసర్‌కు సదరు ఓటరు 49–వీ సెక్షన్ ప్రకారం తన ఆధారాలు చూపాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ సదరు ఓటరుకు ఓటు వేసే అధికారం కల్పిస్తారు. 134(అ): ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల ఏజెంటుగా గానీ పోలింగ్ ఏజెంటుగా గానీ, ఓట్ల లెక్కింపు సందర్భంగా గానీ ఏజెంటుగా వ్యవహరిస్తే శిక్షార్హులు. అందుకు 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా. ఇవి కూడా చదవండి: కొయ్యబొమ్మకు ‘మోదీ గ్యారంటీ’ -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి ... రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్
యాదాద్రి : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. బుధవారం ఉప్పల్‌లోని ట్రాఫిక్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన భునవగిరి జోన్ సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి అంశంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, పోలింగ్ కేంద్రాల వివరాలు తెలిసి ఉండాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాలకు సామగ్రి తీసుకెళ్లే రూట్‌ను చెక్ చేసుకోవాలని, చెక్‌పోస్టుల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. సమస్యలు సృష్టించేవారిపై నిఘా ఉంచాలి అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గతంలో జరిగిన ఎన్నికల్లో సమస్యలు సృష్టించిన వారిపై నిఘా ఉంచాలని పోలీసు అధికారులకు సీపీ సూచించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్, హిస్టరీ షీట్ ఉన్నవారిని బైండోవర్ చేయాలన్నారు. సోషల్ మీడియా ద్వారా పంపే సందేశాలు, వీడియోలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందజేయాలని కోరారు. ప్రశాంతమైన వాతావరణలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ సీపీ అంబర్ కిషోర్, డీసీపీ రాజేష్ చంద్ర, రాచకొండ ట్రాఫిక్ డీసీసీ–1 అభిషేక్ మహంతి, మల్కాజిగిరి డీసీపీ ధరావత్ జానకి, ఎస్ఓటీ డీసీపీ–1 గిరిధర్, మహేశ్వరం డీసీపీ శ్రీని వాస్, ఎస్బీ డీసీపీ బాలస్వామి, సెబర్ క్రైమ్ డీసీపీ అనురాధ, అడ్మిన్ డీసీపీ ఇందిరా, ఎల్పీనగర్ డీసీపీ సాయిశ్రీ, ట్రాఫిక్ డీసీపీ–2 శ్రీనివాసులు, ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉషావిశ్వనాథ్, క్రైమ్ డీసీపీ అరవింద్, అడిషనల్ డీసీపీలు పాల్గొన్నారు. -
మణిపూర్ పరిణామాలపై నివేదిక ఇవ్వండి: సుప్రీం
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బాధితుల పునరావాసంతోపాటు శాంతి భద్రతలను మెరుగుపర్చేందుకు చేపట్టిన చర్యలు, ఆయుధాల స్వాధీనం వంటి అంశాలపై తాజా నివేదికను సమరి్పంచాలని మణిపూర్ ప్రభుత్వాన్ని సోమవారం ఆదేశించింది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, కర్ఫ్యూ సమయాన్ని ఐదు గంటలకు కుదించామని మణిపూర్ ప్రభుత్వం తెలియజేసింది. మణిపూర్‌లో మైనారీ్టలైన కుకీ తెగ గిరిజనులకు రక్షణ కలి్పంచాలని కోరుతూ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో) ‘మణిపూర్ ట్రైబల్ ఫోరం’ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ ఆగస్టు 10కి వాయిదా పడింది. మరోవైపు, వేసవి సెలవుల అనంతరం సుప్రీంకోర్టు సోమవారం పునఃప్రారంభమైంది. మణిపూర్ పరిణామాలకు సంబంధించిన పిటిషన్లపై విచారణను మొదలుపెట్టింది. -
ప్రశాంత విశాఖ..
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశాంత విశాఖే లక్ష్యంగా అసాంఘిక శక్తుల ఆటకట్టించేందుకు సిద్ధమైంది. విశాఖను టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి విస్తరించింది. విశాఖ పోలీస్ కమిషనరేట్నంతా టాస్క్ ఫోర్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి తెచ్చింది. ఈ మేరకు హోం శాఖ సోమవారం ఉత్తర్వులిచ్చింది. ఉత్తర్వులు మే 24 నుంచి అమల్లోకొచ్చినట్టుగా పరిగణిస్తున్నట్టు కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఇటీవల ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, వైఎస్సార్సీపీ నేత, బిల్డర్ గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ) కిడ్నాప్ ఉదంతం కలకలం సృష్టించింది. మరో బిల్డర్ కిడ్నాప్ కూడా పరిస్థితి తీవ్రతను తెలియజేసింది. మరోవైపు అరకు జిల్లా పరిధిలో గంజాయి సాగును ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసినా.. ఒడిశా నుంచి గంజాయి అక్రమ రవాణా సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో అసాంఘిక శక్తుల ఆటకట్టించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు వారిపై కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు విధించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని భావించింది. అసాంఘిక శక్తులపై కేసులు నమోదుచేయనున్న టాస్క్‌ఫోర్స్ ఇప్పటివరకు ఏ ప్రాంతంలోని కేసులను అక్కడి పోలీస్ స్టేషన్లో నమోదు చేస్తూ దర్యాప్తు చేస్తున్నారు. దీంతో కేసుల దర్యాప్తు, విచారణ, శిక్షలు పడేలా చేయడం మొదలైన ప్రక్రియలో కొంత సమన్వయలోపం కనిపిస్తోంది. ఇక నుంచి విశాఖలో ఏ ప్రాంతంలో అసాంఘిక శక్తులపైన అయినా సరే టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టేందుకు ఆస్కారం ఏర్పడింది. రౌడీలు, ఇతర అసాంఘిక శక్తుల కట్టడి బాధ్యత టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేపడతారు. రౌడీలు, ఇతర అసాంఘిక శక్తులు, గంజాయి అక్రమ రవాణాదారులు, విక్రేతలు, ఈవ్ టీజర్లు, మహిళలపై వేధింపులకు పాల్పడేవారు... ఇలా అన్ని తరహా కేసులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేపడతారు. అందుకోసం టాస్క్‌ఫోర్స్ పోలీస్ స్టేషన్‌కు అదనపు అధికారులు, సిబ్బదిని కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనకు పోలీసు శాఖ సన్నద్ధమవుతోంది. -
ఈ మంటలు ఆర్పండి!
నెలన్నర దాటిపోయింది. ఇప్పటికి 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్ర బలగాలకు తోడు కేంద్ర బలగాలు రంగంలోకి దిగి చాలాకాలమైంది. సాక్షాత్తూ కేంద్ర హోమ్ మంత్రి వచ్చి పర్యటించారు. అయినా పరిస్థితి మారలేదు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఇవాళ్టికీ అగ్నిగుండమై మండుతోంది. శాంతిభద్రతలు క్షీణించి, మూకస్వామ్యం రాజ్యమే లుతోంది. షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) హోదా ఇవ్వాలంటూ మైతై తెగ ప్రజలు చేస్తున్న డిమాండ్‌కు వ్యతిరేకంగా మే మొదటివారంలో జరిగిన గిరిజనుల ప్రదర్శన హింసాత్మకంగా మారినప్పుడు మొదలైన ఈ జ్వాల మణిపూర్‌లోని తెగల మధ్య చీలికలను ఎత్తిచూపింది. మరి, ఈ మంటల్ని చల్లార్చి, శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత తల మీద ఉన్న సర్కారు ఇప్పటి దాకా ఏం చేసినట్టు? సమస్యను చక్కదిద్దాల్సిన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఒక వర్గం వైపు నిలబడి, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. కుకీలు ఎక్కువుండే కొండ ప్రాంత జిల్లాల నుంచి మైతైలు వలసపోతుంటే, మరోపక్క మైతైలు అధికంగా ఉండే ఇంఫాల్ లోయ నుంచి కుకీలు తరలిపోతున్నారు. కేంద్ర మంత్రి నివాసం సహా రెండు వర్గాలకు చెందిన 4 వేల గృహాలు ఇప్పటికే అల్లర్లలో అగ్నికి ఆహుతి అయ్యాయి. శరణార్థి శిబిరాలు కిక్కిరిశాయి. అమాత్యుడి ప్రైవేట్ నివాసంపై దాడి గత మూడు వారాల్లో ఇది రెండోసారి. జాతుల మధ్య విద్వేషం ఇంతగా పెచ్చరిల్లుతుంటే, కేంద్రంలో, రాష్ట్రంలో రెండుచోట్లా అధికారంలో ఉన్న పాలకపక్షం ఏం చేస్తోందన్నది ప్రశ్న. నిజానికి, కేంద్ర హోమ్ మంత్రి ఇటీవలే సంక్షుభిత మణిపూర్‌ను సందర్శించినప్పుడు, సమస్యకు పరిష్కారం లభిస్తుందనుకున్నా ఆ ఆశ నెరవేరలేదు. భౌగోళికంగా బంగ్లాదేశ్, చైనా, మయన్మార్ల మధ్య చిక్కిన ఈశాన్య రాష్ట్రాల్లో తెగల మధ్య తరచూ ఘర్షణలు కొత్త కావు. 1949లో భారత యూనియన్‌లో చేరినప్పటి నుంచి మణిపూర్‌లోనూ అవి ఉన్నవే. కానీ, మధ్యవర్తులుగా ఉండాల్సినవారే తద్విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న అనుమా నంతో ఇరువర్గాల మధ్య విశ్వాసం సన్నగిల్లడం విషాదం. అపనమ్మకం నిండినచోట భద్రతా దళాలైనా తగిన చర్యలు చేపట్టడం కష్టం. మణిపూర్ రైఫిల్స్ సహా రాష్ట్ర పోలీసు బలగాలు మైతైలకే మద్దతుగా నిలుస్తున్నాయని కుకీల భావన. మైతైలేమో కుకీ ప్రాబల్య పర్వత ప్రాంతాల్లో చట్ట విరుద్ధంగా గంజాయి సాగు చేస్తున్నా అస్సామ్ రైఫిల్స్ చూసీ చూడనట్టున్నాయని ఆరోపిస్తున్నారు. ఇది చాలదన్నట్టు భద్రతాదళాల మధ్యా ఘర్షణ వాతావరణం నెలకొంది. పారా మిలటరీ దళాలు తమ పనిలో జోక్యం చేసుకుంటున్నాయని పోలీసుల ఆరోపణ. వెరసి, పాలన మృగ్యమైన మణి పూర్లో నేటికీ రహదారులు సాయుధ మూకల నియంత్రణలోనే ఉన్నాయి. రాష్ట్రంలో ఉద్రిక్తతల్ని చల్లబరచడానికి పాలకుల వైపు నుంచి ఏ మాత్రం ప్రయత్నాలు జరుగుతు న్నాయంటే అనుమానమే. ఎంతసేపటికీ దీన్ని శాంతి భద్రతల సమస్యగానే వారు చూస్తున్నారు. అది పెద్ద చిక్కు. పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతలో ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ పదే పదే విఫలమైనా, కేంద్రం ఉపేక్షించింది. విద్వేషాగ్నిలో ఈశాన్యం కాలిపోతున్నా, మూడు వారాల పైచిలుకు తర్వాత కానీ హోమ్ మంత్రి అక్కడకు రాకపోవడం ఏ రకంగా సమర్థనీయం? కొన్ని వారాలుగా ఇలా ఉన్నా ప్రధాని తన రాజకీయ సభల్లో కానీ, ఇతరత్రా కానీ ఎక్కడా మణిపూర్ ఊసే ఎత్తలేదు. మాటల ద్వారా మనుషుల మధ్య మత్సరం తగ్గించాల్సిన వేళ పాలకులు మౌనముద్ర దాల్చడం విడ్డూరమే! గౌహతి హైకోర్ట్ రిటైర్డ్ ఛీఫ్ జస్టిస్ సారథ్యంలో ముగ్గురు సభ్యుల విచారణ సంఘం వేయడం బాగానే ఉంది. కానీ, రాష్ట్ర గవర్నర్ నేతృత్వంలో శాంతి సంఘం ఏర్పాటుకు మాత్రం ఆదిలోనే హంసపాదు పడింది. పక్షపాత సీఎం సభ్యుడిగా ఉన్న కమిటీలో తాము ఉండబోమనేది కుకీ ప్రతినిధులు తేల్చేశారు. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో బీరేన్ ఆలోచించుకోవాలి. 2017లో తొలి విడత సీఎంగా ఎన్నికైనప్పుడు గిరిజనవాసులతో సన్నిహితంగా మెలిగిన ఆయన 2022లో రెండో విడత అధికారం చేపట్టాక వైఖరి మార్చారు. ప్రభుత్వస్థలంలో ఆక్రమణల పేరిట ఇంఫాల్‌లో చర్చిలతో సహా అనేకం కూల్చివేతకు ఆదేశించి, కుకీలకు కోపకారణమయ్యారు. సంఖ్యాపరంగా మైతైలున్నందున మెజారిటీ వాదాన్ని స్థానిక గిరిజన తెగలపై రుద్దుతున్నారనే భావన కలగడమూ సమస్యకు కారణమైంది. మైతైలకు ఎస్టీ హోదానిచ్చే అంశం పరిగణనలోకి తీసుకోవచ్చని కోర్ట్ చెప్పింది సరే, ఆ వివాదా స్పద నిర్ణయంతో తెగల మధ్య అశాంతి నెలకొంటుందని ఊహించకపోవడం ప్రభుత్వ తప్పిదమే. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, పర్యవసానాలు ఊహించి సంబంధిత వర్గాల మధ్య అపోహల్ని ముందే తొలగించడం కీలకం. పాలకులు అక్కడే విఫలమయ్యారు. అనుమానాలు పెను భూతాలై, పరిస్థితిని ఇంతదాకా తెచ్చారు. ఇంటర్నెట్పై నిర్బంధాల నేపథ్యంలో క్షేత్రస్థాయి వార్తలు సరిగ్గా తెలియకపోగా, అసలు కథ వదిలేసి దీన్ని రెండు మతాల మధ్య ఘర్షణగా చిత్రించే ఘోర తప్పి దాలూ సాగుతున్నాయి. ఇప్పటికైనా కేంద్రం కలగజేసుకోవాలి. అన్ని తెగలకూ రాజ్యాంగ రక్షణ ఉందన్న భరోసా కల్పించాలి. మూలన విసిరేసినట్టుగా ఉన్న ఆ ప్రాంతాలనూ, ప్రజలనూ పరాయి వారుగా చూసే ధోరణి మారాలి. అక్కడి విభిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలను గౌర విస్తూ, దేశంలో తామూ భాగమనే అభిప్రాయం ఆ ప్రజల్లో కల్పించాలి. మరి, ఆ దిశగా శాంతి స్థాపనకు ఇకనైనా పాలకులు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తారా? ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ అన్నది మాటలకే పరిమితం కాదన్న నమ్మకం వివిధ తెగల మధ్య కల్పిస్తారా? -
బాబు హయాంలో నేరాలు-ఘోరాలు కంటపడలేదేమో?
ఈనాడు మీడియా మరో అడ్డగోలు వార్తకు ఇది నిదర్శనం. ఏపీ ప్రజలపై ఆ మీడియా అక్కసు ప్రదర్శిస్తోందని, ప్రత్యేకించి విశాఖ పట్నంపై విషం కక్కుతోందనడానికి ఇంతకన్నా రుజువు అవసరం లేదు. అరాచక శక్తులకు విశాఖ అడ్డానే అంటూ ఈనాడు పత్రిక రెండు రోజుల క్రితం బ్యానర్ హెడింగ్ పెట్టడం ద్వారా తమ కక్షను ప్రదర్శించారు. పైగా దానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏదో అన్నారట. అవి నూటికి నూరుపాళ్లు నిజమని తేలిపోయిందట. మాఫియా రెచ్చిపోతోందని, ఇంకేదేదో చెత్త రాస్తూ తమ మాఫియా బుద్దిని ఈనాడు చూపెట్టడానికి ఏ మాత్రం సిగ్గు పడడం లేదు. ✍️ విశాఖ లోక్ సభ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడితో పాటు ఆడిటర్ జీవీరావులను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేయడం సంచలన వార్తే. ఆ విషయం బయటపడిన కొద్ది గంటలలోనే పోలీసులు వారిని పట్టుకుని బాధితులను విడిపించారు. ఇందుకు విశాఖ పోలీసులను అభినందించవలసిందే. అలా చేయకపోగా అరాచక శక్తుల అడ్డా అంటూ ఈనాడు చెలరేగిపోయింది. దాదాపు అన్ని మీడియా ఛానెల్స్ ఈ వార్తను ప్రముఖంగానే ఇచ్చాయి. అందులో తప్పు లేదు. చాలా వరకు ఫ్రొఫెషనల్ గా కవర్ చేశాయి. కానీ, ఈనాడు మాత్రం తన విద్వేషాగ్నిని బహిర్గతం చేసుకోవడానికి ఈ ఘటనను ఉపయోగించింది. ఈ ఒక్క నేరంతో మొత్తం విశాఖ అంతా పాడైపోయినట్లా? ఎవడైనా బుద్ది ఉన్నవాడు ఇలాంటి చెత్త లాజిక్ తీసుకు వస్తారా?. ✍️ అదే నిజమని అనుకుంటే.. విశాఖ ప్రాంతంలో గత చంద్రబాబు పాలన సమయంలో ఒక ఎమ్మెల్యేని, ఒక మాజీ ఎమ్మెల్యేని కొందరు హత్య చేశారే. అది ప్రశాంతతకు చిహ్నమని ఈనాడు ఆనాడు భావించిందా?. ఆ హత్యలతో విశాఖ జిల్లా అంతా హత్యల అడ్డాగా మారిపోయిందని ఈనాడు ఎందుకు రాయలేదు!. ► గత టరమ్ లోనే విశాఖ పట్నం నడిబొడ్డులోనే ఒక మహిళను వివస్త్రను చేసి హత్య చేశారే. ఇందులో టీడీపీ నేతలపైనే ఆరోపణ వచ్చిందే! అప్పుడు మహిళలపై ఘాతుకాలకు విశాఖ కేంద్రం అయిందని రాయలేదే!. ► టీడీపీ హయాంలోనే విశాఖ భూ కబ్జాలపై సిట్ వేశారు. ఆ సందర్భంగా ఒక మంత్రి మరో మంత్రి పై కబ్జా ఆరోపణలు చేసినప్పుడు.. ఇది కబ్జాల మయం అయిందని రాయలేదే. ఇప్పుడున్న ప్రభుత్వం ఆ కబ్జాలను కొన్నింటిని విడిపించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే కక్ష అని రాశారే. ► విజయవాడలో ఒక టీడీపీ నేత లైంగిక వేధింపులకు తాళలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆ నేతకు జీవిత ఖైదు కూడా పడింది. దాంతో టీడీపీ నేతలంగా లైంగిక నేరస్తులని ఈనాడు రాయాలి కదా!. ‘ఒహో.. టీడీపీ వాళ్లు ఏమీ చేసినా వారికి కమ్మగా ఉంటుంది’’ అని ఎవరైనా విమర్శిస్తే మరి ఏమి చెబుతారు?. ► అదే విజయవాడలో చంద్రబాబు టైమ్ లో కాల్ మనీ సెక్స్ రాకెట్లకు ఎంతమంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ఇదేమి దరిద్రపు పాలన అనో, టీడీపీ నేతల నీచ బుద్దులు అనో ఈనాడు రాసిందా?.. లేదే! ఇప్పుడు జరిగిన ఒక కిడ్నాప్ నేరానికి రాజకీయ రంగు పులిమి తమ పైత్యం అంతా ప్రదర్శిస్తోంది. మార్గదర్శి కేసులో ఏపీసీఐడీ చెరుకూరి రామోజీరావును విచారించిన సందర్భంలో.. ✍️ టీడీపీ పాలనలో ఇవేకాదు.. ఇంకా ఎన్నో ఘోరాలు జరిగాయి. విజయవాడలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి రంగాను నడిరోడ్డు మీద దీక్ష చేస్తున్న సమయంలో టీడీపీ వాళ్లు దాడి చేసి దారుణంగా హత్య చేశారు. దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందని మాజీ మంత్రి హరిరామజోగయ్య తన పుస్తకంలో రాశారు. ఇందుకు ఈనాడు ఒప్పుకుని విజయవాడ హత్యల నగరం అయిపోయిందని కానీ, టీడీపీ హత్యాకాండలలో పాల్గొంటోందని కాని రాసిందా?. ► పులివెందుల వద్ద ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాత వైఎస్ రాజరెడ్డిని టిడిపి నేతలు హత్య చేస్తే, ఆ టిడిపివారికి హైదరాబాద్ లోని టిడిపి ఆఫీస్ లో రక్షణ కల్పించారన్న అబియోగం అప్పట్లో వచ్చిందే. ► పోనీ కిడ్నాప్ ఘటనలు ఏవీ టిడిపి హయాంలో జరగలేదా! ఆనాటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గుర్తేడు అనేచోట పది మంది ఐఎఎస్ అదికారులను నక్సల్స్ కిడ్పాన్ చేశారు. వారిని విడిపించడానికి జైలులో ఉన్న తీవ్రవాదులను వదలిపెట్టిన చరిత్ర టిడిపిదే కదా!. ► మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావును కూడా నక్సల్స్ కిడ్నాప్ చేస్తే, ఆయన సతీమణి దీక్ష చేసి విడిపించుకోవలసి వచ్చిందే! ► గతంలో హుజూరాబాద్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న దుగ్గిరాల వెంకటరావును కాల్చి చంపారు. మండలాధ్యక్షుడుగా ఉన్న టీడీపీ నేత మలహర్ రావును హత్య చేసిన ఘటన ఉమ్మడి ఏపీలో పెను సంచలనం అయింది. ► ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి పుష్కరాలలో స్నానం చేయడం కోసం సామాన్యులను నిలిపివేసిన సందర్భంలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారు. అయినా అది చంద్రబాబు తప్పు కాదని, భక్తుల తప్పని ప్రచారం చేశారే! ✍️ ఇక తెలంగాణలో ఏవైనా నేరాలు జరిగితే ఇలాగే దిక్కుమాలిన వార్తలు ఇస్తున్నారా? ముఖ్యమంత్రి కెసిఆర్ అంటే వణికే ఈనాడు మీడియా ఎపిలో మాత్రమే ఇలా నీచంగా రాస్తోంది. హైదరాబాద్ రింగ్ రోడ్డు వద్ద ఒక వెటర్నరీ మహిళా డాక్టర్ సామూహిక మానభంగానికి గురవడం, తదుపరి ఆమెను హత్య చేయడం ఎంత దారుణమైన ఘటనన్నది వేరే చెప్పనవసరం లేదు. ఆ దుర్ఘటన జరిగింది కనుక హైదరాబాద్ రేప్ ల అడ్డా అని ఈనాడు ఎందుకు రాయలేదు! ఆ తర్వాత కూడా పలు రేప్ కేసులు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి ఒక మహిళను ఎంత ఘాతుకంగా హతమార్చింది చూశాం. కొన్ని కిడ్పాప్ ఘటనలు, తుపాకి కాల్పులు ,రియల్ ఎస్టేట్ తగాదాలు, హత్యలు కూడా జరిగాయి. అయినా హైదరాబాద్ లో వచ్చే పరిశ్రమలు ఆగిపోతున్నాయా? లేదే! ✍️ దీని అర్ధం ఏమిటంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా, సమాజంలో కొన్ని నేరాలు రకరకాల కారణాలతో జరుగుతుంటాయి. వాటిని అవకాశం ఉన్న మేరకు అదుపు చేయడం పోలీసుల బాధ్యత. నేరం జరిగిపోతే నిందితులను పట్టుకుని శిక్షించడం పోలీసుల కర్తవ్యం. అది జరుగుతోందా?లేదా? అన్నది చూడాలి కాని ప్రతి ఘటనకు ప్రభుత్వానికి , అదికారంలో ఉన్న పార్టీకి పులిమి వార్తలు ఇచ్చి ప్రజలలో వ్యతిరేకత పెంచాలని చూడడం జర్నలిజం అవుతుందా!. మీడియా ఈ రకంగా నైతికంగా పతనం అవడం శోచనీయం. ✍️ అమిత్ షా ఆధ్వర్యంలోనే పోలీసు శాఖ డిల్లీలో పనిచేస్తుంటుంది. కానీ అక్కడ ఎన్ని నేరాలు జరిగాయి.మహిళల రేప్ లు జరిగాయి. దాంతో డిల్లీ అరాచక శక్తుల అడ్డాగా మారిందని ఈనాడు రాయలేదే! యూపీలో ఒక మాజీ ఎంపీని ,ఆయన సోదరుడిని పోలీసుల సమక్షంలో ప్రజలంతా చూస్తుండగానే ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. ఈ మధ్య కోర్టులోనే కాల్పులు జరిగాయి. అయినా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ శాంతి భద్రతలను బాగా కాపాడుతున్నారని ఎందుకు ప్రచారం జరుగుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు చెప్పవచ్చు. ఈనాడు మీడియా ఏపీలో ఏ చిన్న ఘటన జరిగినా దానిని వైఎస్సార్సీపీకి అంటకట్టి.. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చేస్తున్న కుట్రలు ప్రజలకు అర్దం కాకుండా ఉంటాయా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
శాంతిభద్రతలు భేష్
సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయికి పోలీసు వ్యవస్థ.. స్నేహపూర్వక పోలీసు విధానం.. దశాబ్దాలుగా బ్రహ్మపదార్థంగా అంతుచిక్కకుండా ఉన్న ఈ రెండు లక్ష్యాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాధించి చూపించింది. అందుకోసం పోలీసు యంత్రాంగాన్ని వ్యవస్థాగతంగా బలోపేతం చేసింది. విధానపరంగా తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. శాంతిభద్రతలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ప్రజలు భయ పడకుండా, శాంతి భద్రతలతో జీవించేలా ప్రభుత్వం పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దింది. అక్రమ వ్యాపారాల నిరోధానికి కొత్తగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ని నెలకొల్పింది. దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన గంజాయి సాగును కూకటివేళ్లతో సహా పెకలించివేసింది. నాటు సారా దందాను సమర్థంగా కట్టడి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సత్ఫలితాలు సాధిస్తోంది. రాష్ట్రంలో నేరాల కట్టడికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు, అల్లర్లు గణనీయంగా తగ్గాయని జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) నివేదికలే చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో 36 అవార్డులు సాధించడం రాష్ట్ర పోలీసుల సమర్థ పనితీరుకు నిదర్శనం. వ్యవస్థాగతంగా బలోపేతం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని వ్యవస్థాగతంగా బలోపేతం చేసింది. జిల్లాల పునర్విభజనతో 13 జిల్లా పోలీసు కార్యాలయాలు 26కు పెరిగాయి. క్షేత్రస్థాయిలో పోలీసు వ్యవస్థ బలోపేతానికి కొత్తగా 16 సబ్ డివిజన్లు, 19 పోలీసు సర్కిళ్లను ఏర్పాటు చేసింది. 2019కు ముందు 98 సబ్ డివిజన్లు ఉండగా ఇప్పుడు 114కు పెరిగాయి. 2019కు ముందు 197 పోలీస్ సర్కిళ్లు ఉండగా ప్రస్తుతం 216కు చేరాయి. ఇక ఏడాదికి 6,500 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 6,511 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. దేశంలోనే విప్లవాత్మక రీతిలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 15 వేల మంది మహిళా పోలీసులను నియమించి క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల పరిరక్షణకు కొత్త వ్యవస్థను సృష్టించింది. రాష్ట్రంలో నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేసి గస్తీ విధులు కేటాయిస్తోంది. అసాంఘిక శక్తులను ముందుగానే గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించడం, రౌడీషీట్లు తెరవడం మొదలైన చర్యలతో నేరాలకు ఆస్కారం లేకుండా చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు మెరుగైన భద్రత రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. వారిపై దాడులు, వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దాడులు, వేధింపుల కేసుల్లో తక్షణం ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. దర్యాప్తు వేగంగా చేస్తూ త్వరితగతిన చార్జిషీట్లు దాఖలు చేస్తోంది. దాంతో గతంతో పోలిస్తే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు, వేధింపుల కేసులు గణనీయంగా తగ్గాయి. 2019లో 2,382 కేసులు నమోదు కాగా 2022లో 2,229 కేసులకు తగ్గాయి. 2022 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 2023 మొదటి త్రైమాసికంలో 15 శాతం కేసులు తగ్గాయి. గంజాయి, నాటు సారాపై ఉక్కుపాదం గంజాయి, నాటుసారా, అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా కట్టడిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం కొత్తగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ)ని ఏర్పాటు చేసి మరీ పటిష్ట కార్యాచరణకు ఉపక్రమించింది. ఆంధ్ర – ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో దశాబ్దాలుగా వేళ్లూనుకున్న గంజాయి దందాను కూకటివేళ్లతోసహా పెకలించి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్ దేశంలోనే రికార్డు సృష్టించింది. ముందుగా గిరిజనులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. గంజాయి సాగు ప్రాంతాలను శాటిలైట్ మ్యాపింగ్ చేసి ప్రత్యేక బృందాలను నియమించి మరీ కట్టడి చేసింది. మొత్తం 384 గ్రామాల్లో మూడు దశల్లో ఆపరేషన్ పరివర్తన్ నిర్వహించింది. మొత్తం 9,093 ఎకరాల్లో ఏకంగా రూ.11,659 కోట్ల విలువైన గంజాయి సాగును ధ్వంసం చేసింది. స్మగ్లింగ్‌ను అడ్డుకుని భారీగా స్వాధీనం చేసుకున్న గంజాయిని కాల్చివేసింది. 2022లో 2 లక్షల కేజీలు, 2023లో ఇప్పటివరకు 3.32 లక్షల కేజీల గంజాయి నిల్వలను కాల్చి బూడిద చేసింది. ♦ దశాబ్దాలుగా గంజాయి సాగే జీవనాధారంగా చేసుకున్న గిరిజనుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకొచి్చంది. ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా వారిని ప్రోత్సహిస్తోంది. గతంలో గంజాయి సాగు చేసిన 7,328 ఎకరాల్లో కాఫీ, నిమ్మ, జీడి, కొబ్బరి, రాజ్మా, బత్తాయి వంటి పంటలు సాగు చేస్తుండటం ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పునకు నిదర్శనం. ♦ అదే రీతిలో నాటుసారా దందాపై కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నాటుసారా తయారీ కేంద్రాలుగా గుర్తింపు పొందిన మొత్తం 2,202 గ్రామాల్లో ఏకంగా 2,184 గ్రామాల్లో సారా బట్టీలన్నవే లేకుండా చేసింది. నాటు సారా కాచే వారిని ప్రత్యామ్నాయాల వైపు మళ్లిస్తోంది. మిగతా కొద్ది గ్రామాల్లోనూ త్వరలోనే నాటు సారా రూపుమాపడానికి చర్యలు చేపట్టింది. ఈ నాలుగేళ్లలో నాటు సారా, అక్రమ మద్యం దందాపై విస్తృతంగా దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసింది. 2019లో 527 కేసులు, 2020లో 922 కేసులు, 2021లో 1,691 కేసులు, 2022లో 1,379 కేసులు నమోదు చేయడం విశేషం. దాంతో రాష్ట్రంలో నాటుసారా, అక్రమ మద్యం దందా గణనీయంగా తగ్గింది. 2023లో ఇప్పటివరకు 497 కేసులే నమోదు కావడమే దీనికి నిదర్శనం. పదే పదే అక్రమ రవాణాకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ కింద ఇప్పటివరకు 705 కేసులు నమోదు చేయడం గమనార్హం. రహదారి భద్రతకు ప్రాధాన్యం ఎక్కువమందిని బలిగొంటున్న రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్, రవాణా, ఆర్ అండ్ బి, వైద్య – ఆరోగ్య శాఖలతో సంయుక్త కార్యాచరణ చేపట్టింది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రహదారులపై బ్లాక్ స్పాట్లను జియో ట్యాగింగ్ చేసి ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తోంది. ఆ ప్రదేశాల్లో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రత్యేకంగా అంబులెన్స్‌ల ఏర్పాటు మొదలైన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో 2019లో 20,575 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా 2022నాటికి 19వేలకు తగ్గాయి. హత్యలు, ఘర్షణలు కట్టడి ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో నాలుగేళ్లుగా హత్యలు, ఘర్షణలు గణనీయంగా తగ్గాయి. 2018తో పోలిస్తే 2022కి రాష్ట్రంలో హత్యలు 6 శాతం తగ్గగా, అల్లర్లు 36 శాతం తగ్గాయి. 2022 మొదటి త్రైమాసికంతో 2023 మొదటి త్రైమాసికాన్ని పోలిస్తే హత్యలు 15 శాతం తగ్గాయి. సైబర్ నేరాల కట్టడి యావత్ ప్రపంచానికే సవాల్‌గా మారిన సైబర్ నేరాల కట్టడిలోనూ రాష్ట్ర పోలీసు శాఖ ముందుంది. సైబర్ నేరాల కట్టడికి పోలిసు శాఖ ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో సైబర్ సెల్స్, సోషల్ మీడియా సెల్స్ ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా సైబర్ మిత్ర యాప్, 1930 రిపోర్టింగ్ సెల్ సెంటర్లను నెలకొల్పింది. సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. లోన్ యాప్‌ల వేధింపుల కట్టడికి ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి పకడ్బందీగా పర్యవేక్షిస్తోంది. సైబర్ నేరాల బాధితులు గతంలో ఫిర్యాదు చేసేందుకు సరైన వ్యవస్థ ఉండేది కాదు. ఇప్పుడు బాధితులు ఫిర్యాదు చేసేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పింది. శాంత్రిభద్రతల పరిరక్షణకు అగ్ర ప్రాధాన్యం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఘర్షణలు, అల్లర్లు, హత్యలను సమర్థంగా కట్టడి చేస్తున్నాం. సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. గంజాయి, నాటు సారా కట్టడికి విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ పరివర్తన్ దేశంలోనే రికార్డు సృష్టించింది. – డీజీపీ కేవీ రాజేంద్రానాథ్ రెడ్డి ప్రజల భద్రతకు భరోసానిస్తున్నారు రాష్ట్రంలో నాలుగేళ్లుగా శాంతి భద్రతలు గణనీయంగా మెరుగయ్యాయి. ఘర్షణలు, అల్లర్లకు అవకాశం లేకుండా పోలీసు వ్యవస్థ సమర్థంగా పని చేస్తోంది. బాధితుల ఫిర్యాదులపట్ల సానుకూలంగా స్పందిస్తూ తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అవసరానికి మేమున్నాం అనే నమ్మకాన్ని పోలీసు యంత్రాంగం కల్పిస్తోంది. – డా.ర్యాలీ శ్రీనివాస్, గోదావరి కవి, తెలుగు అధ్యాపకుడు, రామచంద్రాపురం, కోనసీమ జిల్లా ప్రశాంత పరిస్థితులు నెలకొల్పారు ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగించే సానుకూల పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసుల ద్వారా పోలీసు వ్యవస్థను ప్రజల ముంగిటకు తీసుకురావడం గొప్ప విప్లవాత్మకమైన మార్పు. దాంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే విధానం ఆచరణలోకి వచ్చింది. ఇది ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. –సి. స్వరాజ్యలక్ష్మి, రిటైర్డ్ ప్రిన్సిపల్, శ్రీ పద్మావతి డిగ్రీ–పీజీ కళాశాల, తిరుపతి -
అతీక్ అహ్మద్ హత్య ఘటనపై ఒవైసీ రియాక్షన్ ఇదే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అతీక్ అహ్మద్, అతని సోరుడు అష్రఫ్ హత్యలపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ ఘటనపై సుప్రీకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దర్యాప్తులో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక్క అధికారి కూడా ఉండొద్దన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'హత్య సమయంలో అక్కడున్న పోలీసులు అధికారులను విధుల నుంచి తొలగించాలి. పోలీస్ కస్టడీలోనే అతీక్ అతని సోదరుడు దారుణ హత్యకు గురయ్యారు. నిందితులకు ఆ ఆయుధాలు ఎలా వచ్చాయి? హత్య అనంతరం వారు జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. చంపిన తర్వాత మతపరమైన నినాదాలు ఎందుకు చేస్తున్నారు?. టెర్రరిస్టులు అని కాకపోతే వాళ్లను ఏమని పిలవాలి? దేశభక్తులు అనాలా? ఈ ఘటన అనంతరం సంబరాలు చేసుకుంటున్నవారు రాబందులు. ఈ హత్యలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం పాత్ర ఉంది. ఈ ఘటన యూపీలో శాంతి భద్రతలపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఇలా పబ్లిక్‌గా హత్యలు జరిగితే ప్రజలకు రాజ్యాంగం, శాంతి భద్రతలపై విశ్వాసం ఉంటుందా? యూపీలో బీజేపీ పరిపాలన చట్ట ప్రకారం జరగడం లేదు, తుపాకీ రాజ్యమేలుతోంది.' అని ఒవైసీ ఫైర్ అయ్యారు. చదవండి: ఫేమస్ కావాలనే అతీక్‌ను కాల్చి చంపాం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు.. -
అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వాతావరణం సమీపిస్తున్నందున శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్ పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించారు. ప్రతి పోలీస్ ఉన్నతాధికారి వారి పరిధిలోని గ్రామాల సందర్శన కొనసాగించాలని సూచించారు. నగరంలో ఏర్పా టు చేసిన డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ 125 అడుగుల ఎత్తు విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా హాట్స్పాట్ల గుర్తింపు, పోలీసుల ప్రవర్తన తదితర అంశాలపై డీజీపీ చర్చించారు. శాంతిభద్రతల అడిషల్ డీజీ సంజయ్‌కుమార్ జైన్, సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి పలు సూచనలు చేశారు. ప్రతీ పోలీస్ స్టేషన్ నుంచి పదిమంది పోలీస్ అధికారులకు సైబర్ క్రైమ్ నివారణలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో అంబేడ్కర్ చిత్రపటానికి డీజీపీ నివాళులర్పిం చారు. -
Yogi Adityanath: గ్యాంగ్స్టర్ల ప్యాంట్లు తడిసిపోతున్నాయ్: సీఎం యోగి
లక్నో: యోగి అదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఉత్తర్‌ప్రదేశ్‌లో రౌడీషీట్లరు, గ్యాంగ్స్టర్లు హడలిపోతున్నారు. నిర్దాక్షిణ్యంగా ఆయన నేరస్థులపై ఉక్కుపాదం మోపడమే ఇందుకు కారణం. గ్యాంగ్‌స్టర్ కం పొలిటీషియన్ అయిన అతిక్ అహ్మద్ కూడా ఇటీవలే ఓ కిడ్నాప్ కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు యోగి. ఒకప్పుడు యూపీలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి బలవంతపు వసూళ్లకు పాల్పడిన మాఫియా, గ్యాంగ్స్టర్లు ఇప్పుడు ప్యాంట్లు తడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వారు చేసిన నేరాలకు కోర్టుల్లో దోషులుగా తేలుతున్నారని చెప్పుకొచ్చారు. గతంలో శాంతిభద్రతలంటే గౌరవం లేకుండా చిన్నచూపు చూసిన వారు ఇప్పుడు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెడుతున్నారని యోగి వ్యాఖ్యానించారు. శనివారం ఓ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈమేరకు మాట్లాడారు. 'ఇన్వెస్టర్లు, వారి పెట్టుబడికి ఇవాళ యూపీ ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను ఎవరూ ధిక్కరించలేరు. ప్రజలను భయపెట్టిన మాఫియానే ఇప్పుడు భయంతో వణికిపోతుంది. కోర్టులో శిక్షలు పడటం చూసి వారి ప్యాంట్లు తడిసిపోతున్నాయ్.' అని యోగి అన్నారు. ఆరేళ్ల క్రితం యూపీ అంటే అరాచకాలు, అల్లర్లకు గుర్తింపు ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని యోగి చెప్పుకొచ్చారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో శ్రీరామ నవమి రోజు అల్లర్లు చెలరేగినా.. యూపీలో మాత్రం ప్రాశాంతంగా వేడుకలు జరిగాయని గుర్తుచేశారు. చదవండి: దేశంలో ఎన్ని పులులు ఉన్నాయంటే..? లెక్క చెప్పిన ప్రధాని మోదీ.. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులను డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నేర పరిశోధన, ఫంక్షనల్ వర్టికల్స్ పనితీరు, పీడీ చట్టం కింద కేసుల నమోదు, రైతు ఆత్మహత్యలు, కోర్టు కేసులు తదితర అంశాలపై డీజీపీ అంజనీకుమార్ శనివారం తన కార్యాలయం నుంచి సమీక్షించారు. సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్, మహిళా భద్రత విభాగం అడిషనల్ డీజీ షికాగోయల్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి జోనల్ ఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజిటింగ్ వీసాలపై రాష్ట్రానికి వచ్చే విదేశీయుల కదలికలపైనా నిఘా పెట్టాలని డీజీపీ సూచించారు. విదేశీయులు రాష్ట్రంలో ఏ అనధికారిక సమావేశాల్లో పాల్గొనకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, పీడీయాక్ట్ కేసుల నమోదులో నిబంధనలను అనుసరించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల పరిధిలో పీడీ చట్టం కేసుల నమోదు ఏకరీతిన ఉండాలని సూచించారు. పీడీ చట్టం ప్రయోగంపై కోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల నమోదులో తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ పేర్కొన్నారు. వచ్చే వారంలో జరిగే శివరాత్రి పర్వదినం సందర్బంగా ఏ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టు ధిక్కరణ (కంటెంప్ట్) లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. త్వరలో భారీ సంఖ్యలో పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తవనున్న నేపథ్యంలో శిక్షణపై దృష్టి పెట్టాలన్నారు. పీడీ చట్టాల నమోదులో తీసుకోవలసిన జాగ్రత్తలపై హైకోర్టులో పోలీస్ శాఖ జీపీ ముజీబ్ వివరించారు. -
చేష్టలుడిగిన భద్రతా మండలి: కొరోసీ
ఐరాస: అత్యంత శక్తిమంతమైన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పూర్తిగా చేష్టలుడిగిందని ఐరాస సర్వప్రతినిధి సభ అధ్యక్షుడు సబా కొరోసీ వాపోయారు. వర్తమాన కాలపు వాస్తవాలను అది ఎంతమాత్రమూ ప్రతిబింబించడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘యుద్ధాలను నివారించి అంతర్జాతీయ శాంతిభద్రతలను పరిరక్షించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మండలి ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతోంది. దానికి కారణమూ సుస్పష్టం. దాని శాశ్వత సభ్య దేశాల్లోనే ఒకటి పొరుగు దేశంపై దురాక్రమణకు పాల్పడి ప్రపంచాన్ని తీవ్ర ప్రమాదంలోకి, సంక్షోభంలోకి నెట్టింది. ఈ దుందుడుకుతనానికి గాను రష్యాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాల వీటో పవర్ కారణంగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడింది. అందుకే మండలిని సంస్కరించాల్సిన అవసరం చాలా ఉంది. మండలి కూర్పు రెండో ప్రపంచ యుద్ధానంతరపు అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో జరిగింది. దాన్నిప్పుడు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి’’ అని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ సంస్థల పనితీరు ఎలా ఉండాలనే విషయంలో రష్యా దురాక్రమణ పెద్ద గుణపాఠంగా నిలిచిందన్నారు. భారత పర్యటనకు వచ్చిన కొరోసీ పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. -
ఆ పదవి నాకు ఇవ్వాలి.. అప్పుడు పోలీసుల సంగతి చెప్తా: అయ్యన్న
సాక్షి, గుంటూరు: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై తన నోటి దురుసును ప్రదర్శించారు. గుంటూరులో గురువారం రోజున ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయాడు. తాము అధికారంలోకి వచ్చాక పోలీసులు తమ చంకే నాకాలంటూ తీవ్ర అభ్యంరతరకర వ్యాఖ్యలు చేశారు. 'త్వరలో టీడీపీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చాక నాకు లా అండ్ ఆర్డర్ మంత్రి పదవి ఇవ్వాలి. షూట్ అండ్ సైట్ అధికారాలు అప్పగించాలి. అప్పుడు ఈ పోలీసుల సంగతి చెబుతా' అంటూ అయ్యన్న పాత్రుడు భయబ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యానించారు. గతంలో కూడా పలు సందర్భాల్లో అయ్యన్న పోలీసులపై నోరు పారేసుకున్నారు. చదవండి: (బెంచ్ మార్క్‌గా సీఎం జగన్ నిర్ణయం: సజ్జల రామకృష్ణారెడ్డి) -
పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో 2022 ఏడాదిలో పోలీస్ శాఖ సఫలీకృతమైనట్టు డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి చెప్పారు. సైబర్ నేరాలు సహా కొన్ని రకాల నేరాలు కొంత పెరిగినా...నేరస్తులకు శిక్షలు పడే శాతం గతేడాదితో పోలిస్తే ఆరు శాతం పెరిగి 56 శాతానికి చేరడం సంతృప్తినిచ్చినట్టు వెల్లడించారు. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ఏడాది మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించగలిగామన్నారు. మతఘర్షణలు ఇతర నేరాల కట్టడిలో పోలీస్‌శాఖలోని అధికారులు, సిబ్బంది అంతా ఒక బృందంగా కలిసికట్టుగా పనిచేశారని డీజీపీ తెలిపారు. భవిష్యత్తులో సైబర్‌నేరాల ముప్పు మరింత పెరగనుందని, ఆ దిశగా పోలీస్‌శాఖ సమాయత్తమయ్యేలా ఎన్నో చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. గురువారం లక్డీకాపూల్‌లోని తెలంగాణ పోలీస్ కేంద్ర కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి తెలంగాణ రాష్ట్ర పోలీస్ 2022 వార్షిక నివేదిక, తెలంగాణ పోలీస్ ట్రాన్స్ఫార్మేషనల్ జర్నీ నివేదికలను విడుదల చేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఉత్తమ పోలీస్ స్టేషన్లుగా నిలిచిన ఉప్పల్, కోదాడ టొన్, ఆదిలాబాద్ వన్‌టౌన్, లక్ష్మీదేవిపల్లి, సిరోల్ పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓ (స్టేషన్ హౌజ్ ఆఫీసర్ల)కు ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహేందర్‌రెడ్డి సుదీర్ఘంగా ప్రసగించారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్ర పోలీస్‌శాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు, వాటి ఫలితాలు, గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో నేరాల సరళి తదితర అంశాలను వివరించారు. నాలుగు మూల సూత్రాలతో ముందుకెళ్లాం.. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షణతోపాటు మారుతున్న నేరసరళికి అనుగుణంగా మార్పు చెందేలా పోలీస్‌శాఖ బలోపేతానికి ప్రాసెస్, టెక్నాలజీ, కెపాసిటీ బిల్డింగ్, లీడర్షిప్ డెవలప్మెంట్ అనే నాలుగు మూల సూత్రాలను అనుసరించినట్టు ఆయన వెల్లడించారు. తెలంగాణలో ఎక్కడ ఉన్నా భద్రంగా ఉన్నామన్న విశ్వాసాన్ని ప్రజల్లో, అదే సమయంలో తెలంగాణలో నేరం చేస్తే తప్పక పట్టుబడతామన్న భయాన్ని నేరస్తుల్లో తేగలిగామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనడంలో పోలీస్‌తోపాటు ఇతర అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయ పర్చేలా తీసుకువచ్చిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణ పోలీస్‌శాఖకు చేరిన అదనపు వనరుగా డీజీపీ పేర్కొన్నారు. రానున్న ఐదారేళ్లలో దేశంలోనే ఉత్తమ సంక్షేమ పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో ఏర్పడుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ స్ట్రీట్ వెండార్స్‌తో సీసీటీవీల బిగింపు మొదలు.. రాష్ట్రవ్యాప్తంగా నిఘా నేత్రాలుగా మారిన సీసీటీవీల ఏర్పాటుపై ప్రజల్లో తొలుత ఎన్నో అనుమానాలు ఉండేవని డీజీపీ గుర్తు చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా తొలిసారి సీసీటీవీలను ఏర్పాటు చేసుకునేందుకు బంజారాహిల్స్‌లో తోపుడు బండ్ల వాళ్లు ముందుకు వచ్చారన్నారు. ఇప్పుడు గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రజలు, పలు సంస్థలు, ఎన్జీఓల సహకారంతో ప్రస్తుతం 10,25,849 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరి పోలీస్‌శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. కాగా, దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో కమిషన్ నివేదిక హైకోర్టుకు సమర్పించిందని, దానిపై నిర్ణయం తీసుకునే అధికారం హైకోర్టుకు ఉంటుందని, ఆ ప్రాసెస్ కొనసాగుతోందని ఓ ప్రశ్నకు సమాధానంగా డీజీపీ తెలిపారు. అన్ని రోడ్లపై స్పీడ్ లిమిట్‌కు సంబంధించిన సైన్‌బోర్డులు ఏర్పాటు చేసేలా ఇతర ప్రభుత్వశాఖలతో సమన్వయం చేసుకుంటామని మరో ప్రశ్నకు బదులిచ్చారు. వార్షిక నివేదిక విడుదల కార్యక్రమంలో శాంతిభద్రతల అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, రాచకొండ సీపీ మహేశ్‌భగవత్, అడిషనల్ డీజీలు నాగిరెడ్డి, సందీప్‌శాండిల్య, సంజయ్‌జైన్, ఐజీ కమలాసన్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అందరికీ థ్యాంక్స్ ఈనెల 31తో తన పదవీ కాలం పూర్తవుతుందని, గత 36 ఏళ్లుగా తన వృత్తిగత జీవితంలో అనేక అవకాశాలు ఇచ్చిన అన్ని ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, సీఎస్‌లు, ఇతర సిబ్బందికి అందరికీ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తన వృత్తిగత జీవితంలో మీడియా ఎంతో సహకరించిందని ఆయన గుర్తు చేసుకున్నారు. -
రాష్ట్రంలో ప్రతి మహిళ సెల్ఫోన్లో ‘దిశ’ యాప్ ఉండాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమీక్ష చేపట్టారు. ‘దిశ’ అమలు, మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు సంబంధించి ప్రత్యేక కోర్టులు, రాష్ట్రంలో నేరాల నిరోధం–తీసుకుంటున్న చర్యలు, పోలీసు బలగాల బలోపేతం, మాదకద్రవ్యాల నిరోధం... తదితర అంశాలపై సీఎం జగన్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు.. ‘దిశ’ చట్టం ప్రగతిపైనా సీఎం సమీక్ష.. – రాష్ట్రంలో ‘దిశ’ అమలుపై సీఎం జగన్ సమీక్షించారు. – ఇప్పటివరకూ 74,13,562 ‘దిశ’ యాప్‌ను డౌన్లోడ్స్ చేశారని వెల్లడించిన పోలీసు అధికారులు. – దిశ యాప్ ద్వారా 5,238 మందికి సహాయం. – దిశ యాప్ ద్వారా రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్లు 2021లో 684. – నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్ చేశామన్న పోలీసులు. – వచ్చిన ఫిర్యాదులపై పరిష్కారం ఎంతవరకూ వచ్చిందన్నదానిపై నిరంతరం మెసేజ్‌లు పంపిస్తున్నామన్న పోలీసులు. – దిశ పోలీస్స్టేషన్లు అన్నింటికీ కూడా ఐఎస్ఓ సర్టిఫికేషన్ వచ్చిందన్న పోలీసు అధికారులు. – మహిళలపై నేరాలకు సంబంధించి 2017లో ఇన్వెస్టిగేషన్‌కు 189 రోజులు పడితే 2021లో కేవలం 42 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నామన్న పోలీసులు. – జీరో ఎఫ్ఐఆర్లను కూడా నమోదు చేస్తున్నామన్న పోలీసులు. – ఫోరెన్సిక్ సదుపాయాలను ప్రభుత్వం పెంచడం వల్ల కేసుల దర్యాప్తు, ఛార్జిషీటులో వేగం పెరిగిందన్న పోలీసులు. – గతంలో డీఎన్ఏ రిపోర్టుకోసం ఏడాదిపాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు 2రోజుల్లో నివేదిక వస్తుందన్న పోలీసులు. - సంబంధిత కేసుల్లో 7 రోజుల్లో ఛార్జిషీటు వేయగలుగుతున్నామన్న పోలీసులు. ప్రతి మహిళ సెల్ఫోన్లో ‘దిశ’ యాప్ ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘‘దిశ’ చాలా సమర్థవంతంగా అమలు చేయాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఫోన్లో దిశ యాప్ ఉండాలి. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ‘దిశ’పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ప్రతి మహిళా చేతిలో ఉండే ఫోన్లో ‘దిశ’యాప్ డౌన్లోడ్ కావాలి. వలంటీర్లు, మహిళా పోలీసుల సహాయాన్ని తీసుకోవాలి. ‘దిశ’యాప్‌పై విస్తృత ప్రచారం నిర్వహించాలి. ‘దిశ’యాప్ డౌన్లోడ్, వినియోగించే విధానంపై ప్రచారం నిర్వహించాలి’’ అని సూచించారు. ‘దిశ’ బిల్లు ఆమోదం ఏ దశలో ఉందో అధికారులు సీఎం జగన్‌కి వివరాలు అందించారు. శాసనసభలో బిల్లును ఆమోదించి ఇన్ని రోజులైన తర్వాత కూడా పెండింగ్‌లో ఉండడం సరికాదని సీఎం జగన్ అభిపప్రాయపడ్డారు. వెంటనే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై సీఎం సమీక్ష సమీక్ష నిర్వహించారు. పోక్సో కేసుల విచారణకు ప్రస్తుతం 10 కోర్టులు ఆపరేషన్‌లో ఉన్నాయని.. డిసెంబర్ నాటికి మొత్తం 16 కోర్టులు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. (చదవండి: AP: ఇద్దరు యువతులను కాపాడిన ‘దిశ’) మహిళలపై నేరాలకు సంబంధించిన 12 కోర్టులు ఆపరేషన్‌లో ఉన్నాయని.. కడపలో మరో కోర్టు అందుబాటులోకి వస్తుందని పోలీసులు తెలిపారు. ఈ కోర్టుల్లో గవర్నమెంటు ప్లీడర్లను పూర్తిస్థాయిలో ఉంచాలని సీఎం జగన్ ఆదేశించారు.ఎక్కడా ఖాళీలు లేకుండా ప్రభుత్వ న్యాయవాదులను నియమించాలన్న సీఎం, దీనికోసం సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పనితీరుపైనా నిరంతరం సమీక్ష చేయాలన్న సీఎం, వారి పనితీరుపైనా కూడా పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ‘దిశ’ ఒన్‌స్టాప్ సెంటర్ల పనితీరుపైనా, సచివాలయాలల్లో మహిళా పోలీసుల వ్యవస్థపైనా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది సెప్టెంబరు వరకూ 2,652 కేసులను దిశ ఒన్‌స్టాప్ సెంటర్ల ద్వారా హేండిల్ చేశామని అధికారులు తెలిపారు. దేవాలయాల్లో భద్రతకోసం 51,053 సీసీ కెమెరాలు పెట్టించామన్నారు అధికారులు. బాధితులకు సత్వర న్యాయంపై దృష్టిపెట్టండి’: సీఎం జగన్ ‘‘అమ్మాయిలపై అఘాయిత్యాలను నివారించడమే కాదు, దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. శరవేంగా బాధితులను ఆదుకోవాలి. వారికి ఇవ్వాల్సిన పరిహారాన్ని సత్వరమే అందించేలా చూడాలి. ఘటన జరిగిన నెలరోజుల్లోపు బాధిత కుటుంబాలకు అందజేయాలి. ఎక్కడైనా అలసత్వం జరిగితే వెంటనే నా కార్యాలయానికి సమాచారం ఇవ్వండి’’ అని సీఎం జగన్ సూచించారు. (చదవండి: ఢిల్లీలో ఆపదలో ఉన్న మహిళను కాపాడిన ‘దిశ యాప్’ ) సైబర్ క్రైం నిరోధంపై ప్రత్యేక కార్యాచరణకు సీఎం ఆదేశం ‘‘సైబర్ క్రైం నిరోధానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించండి. సమర్థత ఉన్న అధికారులను, సమర్థవంతమైన న్యాయవాదులను ఇందులో నియమించండి. ఏపీలో డ్రగ్స్ వ్యవహారం నిజం కాదని తెలిసికూడా ఇవే వార్తలను కొన్ని మీడియా సంస్థలు, వెబ్సైట్లు ప్రముఖంగా ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి అంశాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి’’ అన్నారు సీఎం జగన్. కేసుల సంఖ్యను పట్టించుకోవద్దు.. ఫిర్యాదు చేయడానికి బాధితులు ముందుకొచ్చే పరిస్థితుల కల్పనే ముఖ్యం అన్నారు సీఎం జగన్. బాధితులు స్వేచ్ఛగా ముందుకురావాలి, వారు ఫిర్యాదు చేయాలి, ఆ ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. బాధితుడికి భరోసాగా పరిస్థితులు ఉండడం అన్నది ముఖ్యం అన్నారు సీఎం జగన్. (చదవండి: మహిళల రక్షణకు దిశ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది: అడవి శేషు) కాలేజీలు, యూనివర్శిటీలు డ్రగ్ ఫ్రీగా ఉండాలి కాలేజీలు, యూనివర్శిటీలు ‘మాదక ద్రవ్య రహితంగా తయారు కావాలి. ఇందుకుగాను తక్షణ చర్యలకు సీఎం జగన్ ఆదేశించారు. ‘‘రాష్ట్రంలోని అన్ని కాలేజీలు, యూనివర్శిటీల్లో పర్యవేక్షణ ఉండాలి. మాదకద్రవ్యాల ఉదంతాలు ఉన్నాయా.. లేవా.. సమీక్షించాలి. ఉంటే డ్రగ్స్‌ని ఎవరు పంపిణీ చేస్తున్నారు, ఎక్కడ నుంచి వస్తున్నాయన్న దానిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. కాలేజీలు, యూనివర్శిటీల్లో మాదకద్రవ్యాల ఆనవాళ్లు ఉండకూడదు. ప్రతి నాలుగు వారాలకు ఒకసారి దీనిపై ప్రగతి నివేదికలు సమర్పించండి’’ అని సూచించారు. ‘మద్యం అక్రమ తయారీ, రవాణాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. – రాష్ట్రంలో అక్రమంగా మద్యం తయారీ, అక్రమ రవాణాలపై ఎస్ఈబీ సహా... పోలీసులు ఉక్కుపాదం మోపాలి. – అధికారంలోకి రాగానే 43వేల బెల్టుషాపులు తీసేశాం.. మద్యం అమ్మే దుకాణాలను మూడోవంతు తగ్గించాం. – ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించి, మద్యం రేట్లు పెంచడం వల్ల మద్యం వినియోగం గణనీయంగా తగ్గింది – మద్యం అక్రమ రవాణా, తయారీకి ఆస్కారం ఇవ్వకూడదు. – దీన్ని నిరోధించడానికి అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. – ఎస్‌ఈబీతోపాటు, పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాలి. – ఇసుక అక్రమ రవాణాపైన కూడా చర్యలు తీసుకోవాలి. – గుట్కా నిరోధంపైనా కూడా దృష్టిపెట్టాలి. – ఈ ప్రభుత్వం వచ్చాక గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 15వేల మంది మహిళా పోలీసులను నియమించాం. – ఈ మహిళా పోలీసులకు శిక్షణ ఇవ్వాలి.. డిసెంబరు నాటికి పూర్తిచేయాలి. – వచ్చే ఏడాది కనీసంగా 6 నుంచి 7వేల మంది పోలీసుల నియామకాలపై దృష్టిపెట్టాలి. – దీనికి సంబంధించి సంబంధిత శాఖలు సిద్ధం కావాలన్న సీఎం జగన్ సూచించారు. ఈ సమీక్షా సమావేశానికి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ఆర్ధిక శాఖ కార్యదర్శి కె సత్యనారాయణ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, ఇంటలిజెన్స్ చీఫ్ కే వి రాజేంద్రనాథ్ రెడ్డి, వివిధ రేంజ్‌ల డీఐజీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: దిశ యాప్ ఉంటే.. ఓ అన్న మీ వెంట ఉన్నట్టు..! -
లా అండ్ ఆర్డర్ కుప్పకూలింది: ఉత్తమ్
మఠంపల్లి: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయిందని, పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ నాయకులు విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడుతున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాలో ఈనెల 13న స్థానిక సేవాలాల్ జాతరలో టీఆర్ఎస్ కార్యకర్తలు జరిపిన దాడిలో ఇళ్లు ధ్వంసమై, తీవ్రంగా గాయపడిన బాధిత కుటుంబాలను గురువారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, ఎంపీ సంతోష్ ద్వారా డీజీపీకి ఆదేశాలిప్పిస్తూ, పోలీసు అధికారులను అనుకూలమైన చోటుకు బదిలీ చేయించుకుంటున్నారని విమర్శించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలపై డీజీపీకి లేఖ రాస్తానని తెలిపారు. -
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టింగ్‌లు.. ఇద్దరిపై కేసు
సాక్షి, ఉప్పల్(హైదరాబాద్): మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు చేసిన ఇద్దరిపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇద్దరి పోస్టింగ్‌లపై పోలీసులు సుమోటాగా స్వీకరించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాలు సింగ్ హిందీలో, మహ్మద్ కలీం ఉర్దులో పోస్టింగ్‌లు పెట్టడంతో ఇద్దరూ విద్వేశాలు రెచ్చగొట్టడంతోపాటు లా అండ్ ఆడర్ సమస్య తలెత్తే విధంగా ఉన్నాయని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ పోలీసులు తెలిపారు. -
హైదరాబాద్‌లో అల్లర్లకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్న కొన్ని అరాచక శక్తులు హైదరాబాద్ నగరంలో, రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని, వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పోలీసు అధికారులను ఆదేశించారు. అరాచక శక్తుల కుట్రలకు సంబంధించి ప్రభుత్వానికి కచ్చితమైన సమాచారం ఉందని సీఎం అన్నారు. హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటమే అత్యంత ప్రధానమని, సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకునే వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని, సంఘ విద్రోహశక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని చెప్పారు. ఈ విషయంలో పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిస్తుందని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు అంజనీకుమార్, వీసీ సజ్జనార్, మహేశ్ భగవత్, అడిషనల్ డీజీపీ జితేందర్, ఐజీలు స్టీఫెన్ రవీంద్ర, వై.నాగిరెడ్డి, నిజామాబాద్, వరంగల్ ఐజీలు శివశంకర్‌రెడ్డి, ప్రమోద్‌కుమార్ పాల్గొన్నారు. మాకు పక్కా సమాచారం ఉంది.. ‘జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా రాజకీయ లబ్ధి పొందడానికి కొందరు అనేక కుట్రలు చేస్తున్నారు. మొదట సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేశారు. మార్ఫింగ్ ఫొటోలతో ప్రజలను ఏమార్చాలని చూశారు. తర్వాత మాటలతో కవ్వింపులకు దిగుతున్నారు. సహజంగానే శాంతి కాముకులైన హైదరాబాద్ ప్రజలు ఈ అబద్ధపు ప్రచారాన్ని పట్టించుకోలేదు. డబ్బులు పంచి ఓట్లు దండుకోవాలనే ప్రయత్నాలూ హైదరాబాద్‌లో నడవవని అరాచకశక్తులకు తెలిసింది. దీంతో మరింత దిగజారి రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. రాష్ట్రంలోని ఏ కరీంనగర్లోనో, వరంగల్‌లోనో, ఖమ్మంలోనో, మరోచోటనో గొడవలు రాజేసి, దాన్ని హైదరాబాద్‌లో విస్తృత ప్రచారం చేయాలని చూస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా ఏదోచోట గొడవ పెట్టుకోవాలని, దానికి మతం రంగు పూయాలని, ప్రార్థన మందిరాల దగ్గర ఏదో ఒక వికృతచేష్ట చేయాలని చూస్తున్నారు. అలాచేసి ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. పెద్దఎత్తున గొడవలతో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి అసలు జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకుండా చేయాలని, ఎన్నికలు వాయిదా వేయించాలని పక్కా ప్రణాళిక రచించారు. దీనికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది’అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరినీ ఉపేక్షించొద్దు.. ‘హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో శాంతి సామరస్యాలు యథావిధిగా కొనసాగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఎట్టి పరిస్థితుల్లో సంఘ విద్రోహ శక్తుల ఆటలు సాగనీయవద్దు. ఎంతో పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. కడుపు, నోరు కట్టుకుని నిబద్ధతతో పనిచేసి రాష్ట్రాన్ని ఓ దరికి తెచ్చాం. శాంతిభద్రతల పరిరిక్షణలో రాజీలేకుండా వ్యవహరిస్తున్నాం. పేకాట క్లబ్బులు, గుడుంబాలాంటి మహమ్మారులను దూరం చేశాం. సంఘ విద్రోహశక్తులు, మాఫియా, విచ్చిన్నకర శక్తులపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించిందో ప్రజలు చూశారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభించింది. శాంతిభద్రతల పరిరక్షణ, సంఘ విద్రోహశక్తుల అణచివేతలో ప్రభుత్వం మొదటి నుంచి రాజీలేని ధోరణి అవలంభిస్తున్నది. కాబట్టే నేడు హైదరాబాద్ నగరం, రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నాయి. ప్రజలు సుఖంగా ఉన్నారు. ఎవరి పని వారు ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి సేఫ్ సిటీ అనే మంచి పేరొచ్చింది. భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. యువకులకు ఉపాధి దొరుకుతున్నది. హైదరాబాద్ మహా నగరంలో మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు కోటీ 60 లక్షల జనాభా ఉంది. ఈ నగరాన్ని కాపాడుకోవడం ప్రభుత్వానికున్న ప్రధాన బాధ్యత. ప్రభుత్వానికి ఈ రాష్ట్రం బాగుండటం, హైదరాబాద్ ప్రశాంతంగా ఉండటం, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించటం ముఖ్యం. తెలంగాణకు గుండెకాయలాంటి ప్రశాంత హైదరాబాద్ నగరంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి, మత ఘర్షణలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నగర ప్రశాంతతను ఫణంగా పెట్టి ఎవరినో క్షమించాల్సిన అవసరం లేదు. ఘర్షణలు సృష్టించే వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలి. ఎంతటి వారినైనా సరే, వారు అధికార పార్టీ సభ్యులైనా సరే వదలొద్దు. ఎక్కడికక్కడ సమాచారం సేకరించి, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి కుట్రలను భగ్నం చేయాలి’అని సీఎం పోలీసులకు స్పష్టం చేశారు. ప్రజలూ అప్రమత్తంగా ఉండాలి.. ప్రశాంత హైదరాబాద్‌లో మతచిచ్చు పెట్టడానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించే శక్తులపై అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉద్వేగాలు, ఉద్రేకాలు రెచ్చగొట్టే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవద్దని యువకులను కోరారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా పోరాడాలని రాజకీయ పార్టీలను కోరారు. పోలీస్ యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉందని, ఎట్టి పరిస్థితుల్లో అరాచక, సంఘ విద్రోహశక్తుల కుట్రలు భగ్నం చేసి తీరుతామని పోలీసు అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి హామీనిచ్చారు. హైదరాబాద్‌లోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటారని, ఎక్కడా ఏ చిన్న అవాంఛనీయ సంఘటనా జరగకుండా చూస్తామని తెలిపారు. -
ఎన్నికల పేరుతో కుట్రలు చేస్తున్నారు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో పార్టీ నేతల మాటల తూటాలతో హైదరాబాద్‌లో వాతావరణం వేడెక్కింది. ప్రచారంలో దూసుకెళ్తూ.. ప్రత్యర్థులపై విమర్శలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఎన్నికల పేరుతో రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు జరుగుతున్నాయని, వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. చదవండి: గ్రేటర్ వార్ : ఉచితంగా తాగునీరు అరాచక శక్తుల కుట్రలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఉందన్న కేసీఆర్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటమే అత్యంత ప్రధానమన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను అడ్డు పెట్టుకొని కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సామరస్యాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నారని అన్నారు. సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. చదవండి: సర్జికల్ స్ట్రైక్ అంటే కంగారెందుకు: విజయశాంతి -
బిహార్‌లో నేరాలు తగ్గాయా, పెరిగాయా?
సాక్షి, న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీకి మూడ విడతల్లో జరుగుతున్న ఎన్నికల్లో రాష్ట్ర శాంతి భద్రతల అంశం ప్రధాన ఎజెండాగా మారింది. ‘తిరిగి లాలూ ప్రసాద్ యాదవ్ గూండా రాజ్యం కావాలా? లేదా రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎంతో మెరగుపర్చిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం కావాలా?’ అంటూ నితీష్ కుమార్ పార్టీ అయినా జేడీయూతోపాటు దాని మిత్రపక్షమైన బీజేపీ తెగ ప్రచారం కొనసాగిస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్, తన భార్య రాబ్డీదేవీతో కలసి 1990 నుంచి 2005 సంవత్సరం వరకు బీహార్ రాష్ట్రాన్ని పాలించారు. ఆ తర్వాత 2005 నుంచి 2014లో కొన్ని నెలలు మినహా ఇప్పటి వరకు దాదాపు 15 ఏళ్లపాటు నితీష్ కుమార్ పాలించారు. మొదటి విడత ఎన్నికల ప్రచారంలో, ఆదివారమే ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారంలో, నవంబర్ ఏడవ తేదీన జరుగనున్నన మూడవ విడత ఎన్నికల ప్రచారానికి కూడా రాష్ట్ర శాంతి భద్రతల పరిస్థితే ప్రధానాంశం అయినందున నాటి లాలూ ప్రసాద్ హయాంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది ? నితీష్ కుమార్ హయాంలో పరిస్థితిలో మార్పు వచ్చిందా ? నిజంగా శాంతి భద్రతలు మెరగుపడిందా ? ‘నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో’ డేటాను పరిశీలించడం ద్వారా ఏది వాస్తవమో, ఏదవాస్తవమో, ఏ మేరకు వాస్తవమో సులభంగానే గ్రహించవచ్చు. 2018 సంవత్సరం దేశవ్యాప్తంగా నేరాల సరాసరి సగటు రేటు లక్ష జనాభాకు 300లకు పైగా ఉండగా, బీహార్‌లో నేరాల రేటు సగటు రేటు లక్ష జనాభాకు 222.1 శాతం మాత్రమే ఉందని నితీష్ కుమార్ ప్రభుత్వం గర్వంగా ప్రకటించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలనే ప్రస్థావించింది. 2018 సంవత్సరానికి బీహార్‌లో ఐపీసీ, ఎస్ఎల్ఎల్ కింద మొత్తం 2,62,815 కేసులు నమోదయ్యాయి. ఇది లక్ష జనాభాకు 222.1 శాతం సగటని చెప్పడం కూడా సబబే. అదే 2016లో 1,89,696 కేసులు, 2017లో 2,36,055 కేసులు నమోదయ్యాయి. అధికారంలో ఏ ప్రభుత్వం ఉందనే అంశంతో సంబంధం లేకుండా 2001 సంవత్సరం నుంచి బీహార్‌లో ఏటేటా నమోదవుతున్న నేరాల సంఖ్య పెరగుతూనే వస్తోంది. నేరాల సంఖ్యలో బీహార్ దేశంలోనే 23వ స్థానంలో ఉందని నితీష్ ప్రభుత్వం చెప్పుకోవడం ఆత్మవంచనే అవుతుందని మీడియా విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. దేశం మొత్తంగా జరిగిన నేరాల్లో 5.2 శాతం నేరాలు ఒక్క బీహార్‌లో జరిగినవేనని, నేరాల సంఖ్య విషయంలో దేశంలో బీహార్ ఏడవ స్థానంలో ఉంది. లక్ష జనాభాతో పోల్చినప్పుడే అది 23వ స్థానంలో కనిపిస్తుంది. ఎఫ్ఐఆర్ నమోదైన నేరాలను మాత్రమే తాము పరిగణలోకి తీసుకున్నామని, ఎఫ్ఐఆర్ నమోదుకానీ కేసులను పరిగణలోకి తీసుకోలేదని స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సబ్ ఇనిస్పెక్టర్ ఉమేశ్ కుమార్ తెలిపారు. రేప్‌లు, కులులు, మతాల మధ్య జరిగే కలహాలు, భూముల వివాదాలపై ఎక్కువగా ఎఫ్ఐఆర్లు దాఖలు కావు. బీహార్‌లో 60 శాతం నేరాలు భూ తగాదాల కారణంగానే జరగుతాయి. ఈ తగాదాల కారణంగా బీహార్‌లో 2018 సంవత్సరంలో 1,016 మంది హత్యకు గురయ్యారు. వీటిని పరిగణలోకి తీసుకున్నట్లయితే రాష్ట్రంలో జరిగిన హత్యలు 34.6 శాతం. ఇంకా దేశంలో ఎక్కడా లేనివిధంగా జల వివాదాల కారణంగా బీహార్‌లో 44 మంది హత్యకు గురయ్యారు. ఇక మహిళలకు వ్యతిరేకంగా జరిగిన నేరాల్లో కూడా దేశంలోనే బీహార్ 29వ స్థానంలో ఉందని చెప్పడం కూడా ఒక విధంగా వక్రీకరించడమేనని మీడియా విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. ఇందులో 33 రేప్‌లు, 23 కిడ్నాప్‌లు, 11 హత్యలు మాత్రమే పరిగణలోకి వచ్చాయి. వాస్తవానికి వీటి విషయంలో బీహార్ ఎనిమిదవ స్థానంలో ఉంది. వాస్తవానికి రేప్‌ల విషయంలో బీహార్ రెండో స్థానంలో, కిడ్నాప్‌ల విషయంలో మూడవ స్థానంలో కొనసాగుతోంది. 2016 నాటి గణాంకాలతో పోలిస్తే గతేడాదికి 42 శాతం పెరిగాయి. అవే హత్యలు 20 శాతం పెరిగాయి. 2016లో 2,581 హత్యలు జరగ్గా, గతేడాది 3,138 హత్యలు జరిగాయి. అలాగే 2016తో పోలిస్తే గతేడిదాకి రేప్‌లు 44 శాతం పెరిగాయి. నితీష్ కుమార్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన 2005 నుంచి 2010 మధ్యనే బీహార్‌లో నేరాలు తగ్గాయని, ఆ తర్వాత పెరగుతూనే వచ్చాయని పట్నాలో సెక్యూరిటీ సంస్థ నడుపుతున్న ఆర్కే కాంత్ పేర్కొన్నారు. -
బాబోయ్ ఆ డ్యూటీలా.. వద్దే వద్దు
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ పోలీసు కమిషరేట్‌లో పోస్టు అంటే ఏ పోలీసు అధికారి అయినా ఎగిరి గంతేస్తారు. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ పరిస్థితి ఉంది. లా అండ్ ఆర్డర్ విభాగంలో పనిచేయలేమని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. అవసరమైతే లూప్లైన్లో పనిచేయడానికైనా సిద్ధమంటున్నట్లు తెలుస్తోంది. తీరిక లేని విధులే ఇందుకు కారణమని సమాచారం. ప్రస్తుత పని విధానం.. ప్రతిరోజు డ్యూటీలో చేరిన వెంటనే టెలీ కాన్ఫరెన్స్‌కు హాజరు కావాలి. తరువాత స్టేషన్ పరిధిలో అప్పటి వరకు ఉన్న కేసులు పరిశీలించడంతో పాటు వీఐపీల రాక వంటి బాధ్యతలు చూసుకోవాలి. సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్, మళ్లీ రాత్రికి వాహనాల తనిఖీ, వీటితో పాటు నిత్యం స్టేషన్లకు వచ్చే కేసుల దర్యాప్తు ఉండనే ఉంటుంది. వీటితో వీక్లీ ఆఫ్‌లు సరిగా వినియోగించుకోలేని పరిస్థితి. కొత్తగా స్టేషన్లలో విధుల్లో ఉన్న యువ ఎస్‌ఐలూ మా వల్ల కాదంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ విభాగం పరిధిలోని స్టేషన్లలో కొందరు ఉన్నతాధికారులు రెండేళ్లుగా పనిచేస్తున్నారు. వీరంతా కొంత కాలంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. ఎందుకీ పరిస్థితి.. నగర కమిషనరేట్ పరిధిలో చిన్నచిన్న ఘటనలపైనా మినిట్ టూ మినిట్ వాకబు ఉంటోంది. అధికారులు ఫోన్లలోనే పరిస్థితిని సమీక్షిస్తారు. చిన్న పొరపాట్లకు చార్జీ మెమోలు జారీ. దీంతో మానసిక వేదనకు గురవుతున్నట్లు చెబుతున్నారు. పోలీసు బాస్‌లు మారిన ప్రతిసారి ఆయా పోలీసు అధికారుల తీరు నచ్చకపోతే వారి స్థానంలో కొత్త వారు రావడం సహజంగా జరిగే పనే. అయితే ప్రస్తుతం పనితీరు బాగున్నా కొందరు అధికారులను తప్పించేందుకు కొందరు పావులు కదుపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ నగరంలో కీలకమైన ఓ జోన్ పరిధిలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఉన్నతాధికారి ఒకరు ఇటీవల తాను శాంతిభద్రతల విభాగంలో పనిచేయలేనని ఓ ఉన్నతాధికారికి తేల్చిచెప్పగా.. మరో అధికారి ఆ జోన్లో ఫోకస్ పోస్ట్ వద్దు బాబోయ్.. లూప్లైన్లో పనిచేస్తానని ఉన్నతాధికారి వద్ద మొర పెట్టుకున్నట్లు తెలిసింది. ఇలా నగర కమిషనరేట్ పరిధిలో పలువురు అధికారులు లూప్లైన్లో పనిచేయడానికి ఇంటెలిజెన్స్, టాస్క్‌ఫోర్స్, ఎస్బీ విభాగాలకు దరఖాస్తు చేసుకునేందుకు క్యూ కడుతున్నట్లు తెలిసింది. పోలీసులపై ఒత్తిడి లేదు.. నగర కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసులపై ఎలాంటి ఒత్తిడి లేదు. అందరూ సమన్వయంతో పనిచేయాలంటున్నాం. విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చాం. ప్రస్తుతం పోలీసులు సమర్ధవంతంగా పనిచేయడం వలనే పెండింగ్‌లో ఉన్న 10 వేల కేసులను నాలుగు వేలకు తీసుకురాగలిగాం. పోలీసుల పనితీరు వల్లే ఇది సాధ్యమైంది. పనితీరు బాగాలేకపోతే వారి స్థానంలో కొత్త వారు వస్తారు. –బత్తిన శ్రీనివాసులు, నగర పోలీసు కమిషనర్, విజయవాడ -
శాంతి భద్రతలు అదుపు తప్పాయి : భట్టి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పిందని, పోలీసు యంత్రాంగం ప్రజల కోసం పనిచేయడం లేదని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఒక్క హైదరాబాద్‌లోనే రెండేళ్లలో వేలమంది అమ్మాయిల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని, రోజుకు ఇద్దరు అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. భట్టి అధ్యక్షతన గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో కలసి భట్టి విలేకరులతో మాట్లాడుతూ.. దిశ ఘటన తమను తీవ్రదిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆసిఫాబాద్, వరంగల్‌లో మహిళలపై జరిగిన ఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న నిందితులకు ఉరిశిక్ష పడాలని అభిప్రాయపడ్డారు. మహిళలపై దాడులకు మద్యమే ప్రధానకారణంగా కనిపిస్తోందన్నారు. మద్యాన్ని నియంత్రించాలి మద్యం నియంత్రణ కోసం శనివారం ట్యాంక్‌బండ్ నుంచి రాజ్‌భవన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి గవర్నర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. ఆర్టీసీకి రూ.1000 కోట్లు కేటాయిస్తామని చెప్పి చార్జీల పెంపు పేరుతో ఆ భారాన్ని ప్రజలపై ఎందుకు మోపారో అర్థం కావడం లేదన్నారు. సీఎల్పీ సమావేశానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (మునుగోడు), పొడెం వీరయ్య (భద్రాచలం)లు గైర్హాజరయ్యారు. భట్టితో పాటు శ్రీధర్‌బాబు, సీతక్క, జగ్గారెడ్డి పాల్గొని పలు అంశాలపై చర్చించారు. -
ప్రియాంక హత్య: ‘సున్నా’తో పరిధి సమస్య ఉండదు!
సాక్షి, హైదరాబాద్ : ప్రియాంకరెడ్డి మిస్సింగ్ కేసు నమోదు చేయించడానికి ఆమె కుటుంబీకులు బుధవారం అర్ధరాత్రి రెండు ఠాణాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇది కేవలం వీరొక్కరికే కాదు... ఏటా అనేక మంది బాధితులకు ఎదురవుతున్న సమస్య. ఇక్కడ అమలులో ఉన్న చట్టం ప్రకారం జ్యురిస్‌డిక్షన్‌లోకి (పరిధి) వచ్చే అంశాలను మాత్రమే కేసుగా నమోదు చేయాల్సి ఉందని సిబ్బంది చెబుతున్నారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ముంబై పోలీసులు ‘జీరో ఎఫ్ఐఆర్’ విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇది ఇక్కడా అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రియాంక కేసు స్పష్టం చేసింది. ఠాణాల పరిధులు తెలుసుకోవడం సామాన్యుడికే కాదు ఒక్కోసారి పోలీసులకూ ఇబ్బందికరంగా మారుతోంది. ఈ పరిధుల సమస్య ఎక్కువగా ఒకచోట నుంచి మరో చోటుకి ప్రయాణాల నేపథ్యంలో జరిగే మిస్సింగ్, చోరీ, యాక్సిడెంట్ కేసుల్లో ఉత్పన్నమవుతోంది. ప్రతి పోలీసు స్టేషన్‌కు జ్యురిస్‌డిక్షన్‌గా పిలిచే అధికారిక పరిధి ఉంటుంది. ఆయా పరిధుల్లో జరిగిన నేరాలపై మాత్రమే సదరు ఠాణా అధికారులు కేసు నమోదు చేస్తుంటారు. దీన్ని విస్మరిస్తే చట్ట పరంగా అధికారులు సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు చెప్తుంటారు. ఈ నిబంధనలు సామాన్యులకు ఇబ్బందుల్ని తెచ్చిపెడుతోంది. అప్పటికే సమస్య ఎదురైన, ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొని నష్టపోయిన బాధితులకు ఇబ్బందికరంగా మారడంతో పాటు పోలీసుల పట్ల వ్యతిరేక భావాన్ని కలిగేలా చేస్తోంది. ఇలాంటి సమస్యల పరిష్కారానికే ముంబై పోలీసులు ‘జీరో ఎఫ్ఐఆర్’ విధానం అమలు చేస్తున్నారు. బాధితుడి నుంచి అందుకున్న ఫిర్యాదును పోలీసుస్టేషన్లో కేసుగా నమోదు చేస్తూ ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) జారీ చేస్తారు. ప్రతి ఎఫ్ఐఆర్కు సీరియల్ నెంబర్/ఆ సంవత్సరం సూచిస్తూ సంఖ్య కేటాయిస్తారు. ముంబైలో పరిధులు కాని నేరాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులకు ఎలాంటి నెంబర్ కేటాయించకుండా ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేస్తున్నారు. 2014లో వెలుగులోకి వచ్చిన సంచలనం సృష్టించిన ముంబై మోడల్‌పై అఘాయిత్యం కేసే దీనికి ఉదాహరణ. 2013 డిసెంబర్ 31న కొందరు దుండగులు కుట్రతో ముంబై మోడల్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. చదవండి : శంషాబాద్‌లో మరో ఘోరం స్ఫృహలో లేని స్థితిలో ఉన్న ఆమెను ముంబై పంపేశారు. అక్కడకు చేరుకున్న ఆమె వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ‘జీరో ఎఫ్ఐఆర్’తో కేసు నమోదైంది. ప్రాథమిక విచారణ నేపథ్యలంలో ఉదంతం హైదరాబాద్‌లో జరిగినట్లు గుర్తించిన అక్కడి పోలీసులు కేసును ఇక్కడకు బదిలీ చేశారు. దాదాపు ప్రతి ఉదంతంలోనూ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ప్రాథమిక దర్యాప్తు చేసి, సంబంధిత స్టేషన్‌కు బదిలీ చేసే ఆస్కారం ఉంది. బాధితుడు ఠాణాకు వచ్చినప్పుడు పరిధులు పేరు చెప్పి తిప్పడం కంటే ముందు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ప్రాథమిక విచారణ చేపడితే ఉత్తమం అని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రియాంక హత్య; అనేక ప్రశ్నలు ప్రియాంక హత్యపై స్పందించిన నిర్భయ తల్లి అందుకే ఆలస్యం: సీపీ సజ్జనార్ -
రెచ్చిపోతున్న అల్లరిమూకలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రశాంతమైన అందరూ ఇష్టపడే ఖమ్మం నగరం ఇప్పుడు అల్లరిమూకలకు అడ్డాగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అల్లరిమూకలు రెచ్చిపోతున్నాయి. అన్ని ప్రాంతాల్లో బ్యాచ్‌లుగా విడిపోయి, రోడ్లమీదే తన్నుకునే పరిస్థితి ఏర్పడింది. అయినా పోలీసులకు పట్టడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ జీపు పక్క నుంచే వెళ్తున్నా.. ఖమ్మం నగరంలో దాదాపుగా శాంతిభద్రతలు అదుపు తప్పాయని పలువురు ఆరోపిస్తున్నారు. పోలీస్ జీపు పక్క నుంచే వెళ్తున్నా, అందులో పోలీస్ అధికారి ఉన్నా రోడ్డుపైనే తన్నుకుంటున్నారు. కనీసం పోలీసులు వస్తున్నారనే మర్యాద కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. కొందరైతే పోలీస్ స్టేషన్లో పోలీసులనే దుర్భాషలాడుతున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో ఖమ్మంలోని రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ తరహా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్లపై విచ్చలవిడిగా రాడ్లు , కర్రలతో పోలీసుల ముందే తన్నుకుంటున్నా, అడ్డుకోబోయిన పోలీస్ సిబ్బందిని నెట్టివేసినా పోలీస్ యంత్రాంగం పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులతోపాటు, రాజకీయ ఒత్తిళ్లు ఉంటున్నాయని, దీంతో ఏమీ చేయలేకపోతున్నామని పోలీస్ అధికారులు వాపోతున్నారు. రోడ్లపై ఘర్షణలకు పాల్పడుతున్న అల్లరిమూకలను స్టేషన్‌కు తీసుకొచ్చిన 10 నిమిషాలలోపే రాజకీయ నాయకులు ప్రత్యక్షమవుతున్నారని, చివరకు శబ్ద కాలుష్యం ఏర్పడే డీజేలను స్టేషన్‌కు తరలించినా పైరవీలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ తప్పుదారి పట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాంతి భద్రతల అదుపుకోసం అత్యాధునిక పెట్రోలింగ్ వాహనాలు , బ్లూకోల్ట్స్ ఏర్పాటు చేసినా అల్లరిమూకలను అదుపు చేసే పరిస్థితి కనిపించడంలేదు. గతంలో స్టేషన్‌కు ఒక్క పోలీస్ జీప్ ఉన్నా శాంతి భద్రతలను అదుపులో ఉండేవి. ఇప్పుడా పరిస్థితి లేదనే విమర్శలు వినపడుతున్నాయి. త్రీటౌన్ పరిధిలో.. నిత్యం వ్యాపారాలతో కళకళలాడే త్రీటౌన్ గ్యాంగ్‌వార్‌లకు అడ్డాగా మారిపోయింది. యువకులు రోడ్డుమీదనే తన్నుకుంటున్నా పట్టించుకోనే దిక్కులేదు. పంపింగ్‌వెల్‌రోడ్, గాంధీనగర్, వ్యవసాయమార్కెట్ ప్రాంతం, బొక్కలగడ్డ , సారథీనగర్ , జూబ్లీపుర , ప్రకాష్‌నగర్ ప్రాంతాల్లో ఆకతాయిలు ఎక్కువై అర్ధరాత్రి వరకు మద్యం, గంజాయి వంటివి సేవించి ద్విచక్రవాహనాలు అతివేగంతో నడుపుతూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు, వ్యాపారులు గ్యాంగ్‌లను పెంచి పోషిస్తూ్త తమ పబ్బం గడుపుకుంటున్నారని, కొందరు పోలీస్ సిబ్బంది కూడా సాయం చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. దీంతో అల్లరిమూకలు మరింత రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. వనటౌన్, టూటౌన్ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చొరవ తీసుకుని శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చే పోలీస్ అధికారులు సైతం కరువయ్యారనే అభిప్రాయం నగరవాసుల్లో వ్యక్తమవుతోంది. పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి అల్లరిమూకలను, వారిని రెచ్చగొడుతున్నవారిపై ఉక్కు పాదం మోపకపోతే ఖమ్మం మరో బెజవాడగా మారే అవకాశం ఉందని, సామాన్యులకు రక్షణ ఉండదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై త్రీటౌన్ సీఐ సీహెచ్. శ్రీధర్‌ను వివరణ కోరగా.. అల్లరి మూకలపై గట్టి నిఘా పెట్టామని తెలిపారు. రెండుసార్లకు మించి అరెస్ట్‌యితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని అన్నారు. -
సూర్యాపేటలో 30 పోలీస్ యాక్ట్
సాక్షి, సూర్యాపేట : హుజుర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశామని, అక్టోబర్ 24వతేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా అధికారుల అనుమతి లేకుండా ఎటువంటి ధర్నాలు, రాస్తారొకో, సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడానికి వీలులేదన్నారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్పీ హెచ్చరించారు. ప్రజలకు రక్షణ, శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకూడదనే ఈ యాక్ట్‌ను అమలు చేస్తున్నట్లు ఎస్పీ ఉత్తర్వుల్లో వెల్లడించారు. -
వదంతులను ప్రచారం చేస్తే సహించేది లేదు
-
నేరాలపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నేరాల అదుపుతోపాటు, శాంతిభద్రతలపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ఆ దిశగా సమాయత్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశంతో ప్రభుత్వ ప్రాథమ్యానికి తగ్గట్టుగా రక్షక భట యంత్రాంగం కార్యరంగంలోకి దిగింది. అసాంఘిక కార్యకలాపాలు, అన్ని రకాల నేరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సమాజానికి రుగ్మతగా మారిన అనేక రకాల అరాచకాలను అరికట్టేందుకు పోలీసులు దాడులు విస్తృతం చేశారు. క్రికెట్ బెట్టింగ్‌లు, గాంబ్లింగ్ క్లబ్‌లు(పేకాట స్థావరాలు), గంజాయి, గుట్కా స్మగ్లింగ్‌లపై మెరుపుదాడులు తీవ్రతరమయ్యాయి. ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన ‘స్పందన’ను ప్రజలు కూడా బాగా వినియోగించుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లకు వెళ్లడానికి భయపడే జనం ఇపుడు ఈ కార్యక్రమం ద్వారా తమకు జరిగే అన్యాయాలను చెప్పుకుంటున్నారు. పోలీసుల తక్షణ చర్యలతో చాలా ఫిర్యాదులకు పరిష్కారం లభిస్తోంది. కొత్త అంశాలు కూడా ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయి. తక్షణం స్పందిస్తున్న పోలీసులు... వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు నేరాలపై పోలీసులు వెంటనే స్పందిస్తున్నారు. పోలీసులు దాడులు, నమోదు చేసిన కేసుల వివరాలను పరిశీలిస్తే ..నిషేదిత గుట్కాను రవాణా చేస్తున్న స్మగ్లర్లు, అమ్మకందార్లపై 888 కేసులు నమోదు చేసి 1,251 మందిని అరెస్టు చేశారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం కింద 107 కేసులను నమోదు చేసి 325 మందిని అరెస్టు చేశారు. ఎక్సైజ్ చట్టం కింద 1,026 కేసులను నమోదు చేసి 1,147 మందిని జైలుకు పంపారు. పేకాట క్లబ్‌లపై వరుస దాడులు నిర్వహించి 3,180 కేసుల్లో 9,787 మంది జూదరులను కటకటాల వెనక్కు పంపారు. క్రికెట్ బుకీల స్థావరాలపై దాడులతో 205 క్రికెట్ బెట్టింగ్ కేసులు నమోదయ్యాయి. ‘స్పందన’లో చాలా సమస్యలు వెలుగులోకి.... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో ప్రతీ సోమవారం పోలీసు శాఖ చేపట్టిన స్పందన కార్యక్రమానికి బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అన్ని ఎస్పీల కార్యాలయాలు, నగర పోలీస్ కమిషనరేట్ల వద్ద దీన్ని నిర్వహిస్తున్నారు. గత నాలుగు సోమవారాల్లో నిర్వహించిన స్పందనలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,079 ఫిర్యాదులపై కేసులు నమోదు చేశారు. వాటిలో 9,791 ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడంతో 97శాతం ఫిర్యాదులకు పరిష్కారం చూపినట్టు అయ్యింది. స్పందనలో ప్రధానంగా మహిళలపై నేరాలు, సివిల్ వివాదాలు, సెటిల్మెంట్లు, ఆస్థి సంబంధమైన గొడవలు ఎక్కువగా వస్తుండటంతో పోలీసులు ప్రధానంగా వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. స్పందన ఫిర్యాదుల్లో సివిల్ వివాదాలు 1,900 (19శాతం), మహిళలపై నేరాలు 1,837 (15శాతం), ఆస్తిసంబంధమైన వివాదాలు 1,145 (8శాతం), వైట్ కాలర్ నేరాలు 873(4.7శాతం), కుటుంబ తగాదాలు 472 కేసులతోపాటు ఇతర నేరాలు(15శాతం) ఉన్నాయి. స్పందనలో అత్యధిక విజ్ఞాపనలు వచ్చి పరిష్కరించిన వాటిలో కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు రూరల్ జిల్లాలు ఉన్నాయి. ‘కోడ్’ ఉల్లంఘనలో టీడీపీవారిపైనే ఎక్కువ కేసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు, దాడులు, ఘర్షణలు వంటి కేసులు... 2014లో టీడీపీకి చెందిన వారిపై 2,162 కేసులు, వైఎస్సార్సీపీకి చెందిన వారిపై 1,877 కేసులు నమోదయ్యాయి. 2019 ఎన్నికల్లో టీడీపీకి చెందిన వారిపై 2,049 కేసులు, వైఎస్సార్సీపీకి చెందిన వారిపై 2,038 కేసులు నమోదు చేశారు. శాంతిభద్రతలపై రాజీ లేదు..డీజీపీ గౌతమ్ సవాంగ్ శాంతిభద్రతల విషయంలో రాజీ పడొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా గట్టి చర్యలు చేపట్టాం. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పలు నేరాల్లో మొదటి పది స్థానాల్లో ఉంది. దీనిపై ప్రధానంగా దృష్టి సారించాం. మహిళలపై నేరాలు, మానవ అక్రమ రవాణా, ఎస్సీ, ఎస్టీలపై దాడులు, సివిల్ సెటిల్మెంట్లు, సైబర్ క్రైమ్ రేటు తగ్గించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. నేరస్తులకు శిక్ష పడేలా పక్కా సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుమందు పెడతాం. తప్పు చేయడానికి అసాంఘిక శక్తులు భయపడేలా మా ప్రయత్నాలున్నాయ్. నేర నిరూపణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాం. త్వరలో ప్రతీ ఇంటికీ ఒక సీసీ కెమెరా ఉండేలా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతాం. సమాజంలో ప్రజలు శాంతిభద్రతలతో జీవించేలా పోలీసులుగా మా వంతు కర్తవ్యాన్ని త్రికరణశుద్ధితో నిర్వర్తిస్తాం. రాజకీయ హింస తగ్గుముఖం.. రాష్ట్రంలో వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తరువాత రాజకీయ హింస గణనీయంగా తగ్గింది. దాదాపు 31 శాతం రాజకీయ హింస తగ్గినట్టు పోలీసు అధికారులు లెక్కలు తేల్చారు. దీనికితోడు ఎన్నికలు, దాని అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలను 2014తో పోల్చితే 2019లో 15శాతం తక్కువేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. 2014లో మొత్తం 908, 2019లో 628 హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఎన్నికల ముందు 2014లో 345, 2019లో 198 సంఘటనలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ సందర్భంగా 2014లో 276, అదే 2019లో 301 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల అనంతరం 2014లో 284 ఘటనలు, 2019లో 129 ఘటనలు జరగడం గమనార్హం. ఎన్నికల సమయమైన 2014 మే, జూన్ మాసాల్లో 3,874 కేసులు, అదే 2019 మే, జూన్ మాసాల్లో 3,323 కేసులు నమోదు అయ్యాయి. ఎన్నికల సమయంలో గుంటూరు రూరల్‌లో 158 ఘటనలు, అనంతపురం జిల్లాలో 90, తూర్పుగోదావరి జిల్లాలో 87, కడప జిల్లాలో 60, నెల్లూరు జిల్లాలో 54 ఘటనలతో వరుస స్థానాల్లో నిలిచాయి. -
జైపూర్‌లో ఇంటర్నెట్ నిషేధం పొడిగింపు
జైపూర్ : జైపూర్‌లోని శాస్రి నగర్లో సోమవారం ఓ వ్యక్తి ఏడేళ్ల బాలికను అపహరించి అత్యాచారం చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో అక్కడ పరిస్థితులు ఉధృతంగా మారాయి. అయితే నగరంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని శుక్రవారం వరకు పొడిగించినట్లు డివిజనల్ కమిషనర్ కేసీ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవకుండా, శాంతి భద్రతలు అదుపు తప్పకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ వెల్లడించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు పోలీసు బలగాలను మోహరించామని పేర్కొన్నారు. రామ్‌గంజ్, గాల్టా గేట్, మనక్ చౌక్, సుభాష్ చౌక్, బ్రహంపూర్, నహర్గర్, కొత్వాలి, సంజయ్ సర్కిల్, శాస్రి నగర్, భట్టా బస్తీ, లాల్ కోతి, ఆదర్శ్ నగర్, సదర్ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 10గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయని ఆయన స్పష్టం చేశారు. కాగా, అత్యాచారానికి గురైన ఏడేళ్ల బాలికకు జైపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్నట్లు తెలిపారు. -
శాంతిభద్రతలకు మొదటి ప్రాధాన్యత
-
నాలుగో సింహానికి మూడో నేత్రం
సాక్షి, హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్, వుమెన్ ప్రొటెక్షన్ వింగ్ వంటి వినూత్న పద్ధతులతో ముందుకు సాగుతున్న రాష్ట్ర పోలీసులు మరో కొత్త ప్రయత్నా నికి శ్రీకారం చుట్టారు. పోలీసింగ్‌లో పారదర్శకత తీసుకువచ్చేందుకు శాంతి భద్రతల విభాగం పోలీసులకు బాడీ వోర్న్ కెమెరా లేదా చెస్ట్ మౌంటెడ్ కెమెరాలు ఇవ్వనున్నారు. ఇవి స్థానిక ఎస్పీ, కమిషనరేట్లతో పాటు, డీజీపీ ఆఫీసుకు కూడా అనుసంధానమై ఉంటాయి. ఫలితంగా ఘటనాస్థలంలో జరుగుతున్న కార్యక్రమాలను డీజీపీ కార్యాలయంలో ఉన్నతాధికారులు కూడా ప్రత్యక్షంగా వీక్షించగలరు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని త్వరలోనే అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా తొలిదశలో అన్ని జిల్లాల్లోని ముఖ్యమైన 10 పోలీస్ స్టేషన్ల సిబ్బందికి వీటిని పంపిణీ చేశారు. తర్వాత అన్ని పోలీస్ స్టేషన్లకు అందజేస్తారు. అందజేసిన సిబ్బందికి హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో వీటి వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. రాజధానిలో ఫలితాలివ్వడంతో..! చెస్ట్ మౌంటెడ్ కెమెరాలు హైదరాబాద్‌లో ట్రాఫిక్ విభాగం పోలీసులు చాలా కాలం నుంచే అమలు చేస్తున్నారు. రాజధానిలో ధర్నాలు జరిగినప్పుడు వీటిని సివిల్ పోలీసులు వినియోగించారు. హైదరాబాద్‌లో సత్ఫలితాలు ఇవ్వడంతో అన్ని జిల్లాలు, కమిషనరేట్లకు పంపిణీ చేయాలని డీజీపీ కార్యాలయం నిర్ణయించింది. పోలీసుల్లో జవాబుదారీతనం పెంచేందుకు, ఘటనాస్థలంలో సాక్ష్యాధారాల సేకరణకు ఈ విధానం దోహదపడనుంది. ఆందోళనలు, అల్లర్లు, విపత్తులు సంభవించినప్పుడు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్న విషయం ఫోన్లు, వాకీటాకీల ద్వారానే చెప్పే వీలుంది. ఈ విధానం ద్వారా ఉన్నతాధికారులు వేగంగా స్పందించి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చే వీలుంటుంది. ప్రత్యేకతలేంటి? విదేశాల్లో వీటి వినియోగం ఎప్పట్నుంచో ఉంది. వీటికి 3జీ, 4జీ, ఆడియో, వీడియో సదుపాయంతో పాటు జీపీఎస్ కనెక్షన్ ఉంటుంది. రికార్డింగ్ బటన్ ఆప్షన్‌తో పాటు 400 నుంచి 500 గ్రాముల బరువు ఉంటాయి. ఈ కెమెరాలను భుజానికి ధరించేందుకు వీలుగా రూపొందిం చారు. వీటిని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) ఆదేశాల మేరకు సిబ్బంది వినియోగిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులతో పాటు రైల్వే పోలీసులు వీటిని వాడుతున్నారు. -
ఖాకీలకూ నో ఎంట్రీ!
సాక్షి, సత్తెనపల్లి : ఎన్నికల విధుల్లో పబ్లిక్ సర్వెంట్ అనే పదానికి సాధారణ అర్థం పోలీస్ అధికారి అని కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. యూనిఫామ్‌లో ఉన్నా .. లేకున్నా పోలీసులు తమ విధుల్లో భాగంగానైనా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకూడదని సూచించింది. అవసరమైన పక్షంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఎన్నికల అధికారి పిలిస్తే తప్ప ఏ ప్రత్యేక కారణం లేకుండా పోలీసులకు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడానికి అనుమతి లేదు. పోటీ చేసే అభ్యర్థి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా ఆయన ఒక్కరే లోపలికి వెళ్లాలి. భద్రతా సిబ్బంది మాత్రం ద్వారం బయటే ఆగాలి. ఎన్నికల విధులలో ఉన్న సిబ్బందికి ఇబ్బంది కలిగించే ఏ పని ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, స్పీకర్ కానీ, వారి అనుచరులు కానీ చేయరాదు. పోటీల్లో ఉన్న అభ్యర్థికి జెడ్‌ప్లస్ క్యాటగిరి రక్షణ ఉన్నా.. వారి వెంట వచ్చే సిబ్బందిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించరు. మఫ్టిలో ఉన్న భద్రతా సిబ్బందిలో ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల క్యాబినెట్ మంత్రులు, ఉప మంత్రులకు భద్రతా సిబ్బంది ఉంటారు. వారు కూడా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లకూడదు. పోలింగ్ సిబ్బంది రాజకీయ నాయకులు, మంత్రుల మాటలను పట్టించుకోకూడదు. సిబ్బంది ఎన్నికల సంఘం ఆదేశాలను మాత్రమే అమలు చేయాలి. ఎన్నికల సంఘం ఆజ్ఞాపత్రం ఉంటేనే పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలి. పదవుల్లో ఉన్న వారు, పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రవర్తించినా, మాటలు, సైగలు చేసినా అది నేరం గానే పరిగణిస్తారు. వెబ్‌కాస్టింగ్‌తో పారదర్శకత ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ విధానాన్ని అములు చేయనున్నారు. నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తుంటారు. దీని ద్వారా ప్రతి క్షణం ఓటింగ్ ప్రక్రియ..అవాంఛనీయ ఘటన వివరాలను నేరుగా తెలుసుకునే వీలుంటుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచే పోలింగ్ ప్రక్రియను వీక్షించే సౌకర్యం ఉంటుంది. పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిపించడమే దీని లక్ష్యం. -
శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి: డీజీపీ
సాక్షి, కడప : కడప జిల్లాలో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్లను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర డీజీపీ మాలకొండయ్య తెలిపారు. జిల్లాలో మంగళవారం డీజీపీ పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో శాంతి భద్రతలు కంట్రోల్ ఉన్నాయని.. నేరాలు క్రమంగా తగ్గుతున్నాయన్నారు. రెండు మూడు ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఈవ్‌టీజింగ్ అరికట్టేందుకు త్వరలో షీటీమ్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాబోయేది ఎన్నికల సమయం కనుక ఎప్పటికప్పుడు జిల్లా పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు. బ్యాంక్ ఓటీపీల కారణంగా సైబర్ నేరాలు అధికం అవుతున్నాయని. బ్యాంక్‌ల ఖాతా వివరాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అపరిచితులకు తెలపొద్దని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా పార్థిగ్యాంగ్ ఆనవాలు లేవని స్పష్టం చేశారు. గత ఏడాది మధ్యప్రదేశ్ నుంచి కొంతమంది వచ్చారని, కానీ వారిని అరెస్టు చేసినట్టు తెలిపారు. అమాయకులపై పార్థిగ్యాంగ్ అంటూ ప్రజలు దాడులు చేయడం సరికాదన్నారు. ఎర్రచందనం డాన్ సాహుల్ భాయ్‌ను త్వరలోనే రాష్ట్రానికి తీసుకుని వస్తామన్నారు. -
‘బెంగళూరు’ తీర్పే కీలకం!
బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కన్నడ అసెంబ్లీ ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకుంది. అధికారం కోసం నువ్వా–నేనా అనే రీతిలో అధికార విపక్షాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ అంశాలు, వివిధ వ్యూహాలతో ప్రచారం చేస్తున్న పార్టీలకు రాజధాని బెంగళూరుపై పట్టు చాలా కీలకం. అందుకే ఉద్యాన నగరిపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఐటీ హబ్, మెట్రోపాలిటన్ సిటీ కావడంతో ఇక్కడి ఓటర్ల తీర్పుపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఎన్నికల్లో నగర ఓటర్లు ఏ పార్టీకి అండగా నిలవబోతున్నారు? వీరి ఆకాంక్షలు, అవసరాలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏ మేరకు తీర్చగలిగాయి? ప్రజల అభిప్రాయాల ఆధారంగా ‘సాక్షి’ అందిస్తున్న కథనం. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఒక్క బెంగళూరు సిటీలోనే 28 స్థానాలున్నాయి. వీటితోపాటు 4 బెంగళూరు రూరల్ నియోజకవర్గాలు కూడా సిటీ పరిధిలోకే వస్తాయి. దీంతో ఈ 32 స్థానాల్లో ఓటరు తీర్పుపై చర్చ జరుగుతోంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో సిటీలో 13, రూరల్‌లో 2 సీట్లు కలిపి 15 స్థానాల్లో కాంగ్రెస్ గెలవగా.. బీజేపీ సిటీలో 12 స్థానాలు కైవసం చేసుకుంది. జేడీఎస్ సిటీలో 3, రూరల్‌లో 2 స్థానాలు దక్కించుకుంది. అయితే తర్వాత జరిగిన బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో (198 వార్డుల్లో) బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. జేడీఎస్, స్వతంత్రుల సాయంతో కాంగ్రెస్ మేయర్ సీటు కైవసం చేసుకుంది. కార్పొరేషన్ ఎన్నికల తర్వాత బెంగళూరును న్యూయార్క్, లండన్ తరహాలో అభివృద్ధి చేసి ప్రపంచఖ్యాతి కల్పిస్తానని సిద్దరామయ్య ప్రకటించారు. కానీ ఈ దిశగా అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడుకూడా సిటీ పరిధిలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. కనెక్టివిటీ లేని మెట్రో మెట్రోపాలిటన్ సిటీ అయిన బెంగళూరులో ఐటీ ఉద్యోగులు, ఇతర రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారుల సంఖ్య ఎక్కువ. వీరు మౌలిక వసతుల కల్పన, మహిళల భద్రత, శాంతిభద్రతలు, ట్రాఫిక్, పారిశుద్ధ్యం, కాలుష్యం వంటి ప్రధానాంశాలపై ఆలోచిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య బెంగళూరును ఇప్పటికీ పట్టిపీడిస్తోంది. మెట్రోరైలు ఏర్పాటు చేసినప్పటికీ సిటీ మొత్తం కనెక్టివిటీ లేకపోవడంతో సిటీ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరలేదు. అలాగే ఐటీ ఉద్యోగులు అర్ధరాత్రి వరకూ విధుల్లో ఉండటంతో మహిళా భద్రత అంశాన్ని నగర ప్రజలు ప్రధానంగా భావిస్తున్నారు. బెంగళూరు సిటీ పరిధిలో 2013లో 70.4లక్షల ఓటర్లున్నారు. ఐదేళ్లలో 17.5 లక్షల మంది ఓటర్లు పెరిగి ప్రస్తుతం ఆ సంఖ్య 89.9 లక్షలకు చేరింది. పెరిగిన ఓటర్లలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి జీవనోపాధికోసం బెంగళూరుకు వచ్చి స్థిరపడినవారే. వీరిలో ఎక్కువ మంది మధ్యతరగతి వారే. సిద్దరామయ్య ఏర్పాటుచేసిన ఇందిరా క్యాంటీన్లపై వీరు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ.. మిగిలిన అంశాలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆరెస్సెస్ ప్రచారం కలిసొచ్చేనా? 50వేల మంది ఆరెస్సెస్ కార్యకర్తలు బీజేపీ విజయం కోసం క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది సిటీ పరిధిలో ఉన్నారు. సిటీలో బీజేపీ బలంగా ఉండటంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ప్రచారం కచ్చితంగా ప్రభావం ఉంటుందని ఆపార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సిటీలో ముఖ్యమైన వర్గాలివే బెంగళూరు సిటీలో బ్రాహ్మణులు, లింగాయత్, మైనార్టీ, దళిత వర్గాలతో పాటు తెలుగు, తమిళ ఓటర్లు కూడా నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. యడ్యూరప్ప లింగాయత్ కావడంతో బ్రాహ్మణులు, లింగాయత్ ఓటర్లు బీజేపీపై సానుకూలంగా ఉన్నారు. మైనార్టీ, దళిత వర్గాలు కాంగ్రెస్‌వైపు ఉన్నారు. 2008 ఎన్నికల్లో క్రిస్టియన్లు బీజేపీ వైపు నిలిచినప్పటికీ.. మంగళూరు చర్చిదాడి ఘటనతో పూర్తిగా దూరమయ్యారు. వీరంతా బృందాలుగా ఏర్పడి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 391 మందిపై క్రిమినల్ కేసులు కర్ణాటకలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న 2,560 మంది అభ్యర్థుల్లో 391 మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. హత్య, హత్యాయత్నం, మహిళలపై వేధింపులు, అపహరణ తదితర తీవ్ర అభియోగాలు ఉన్నాయి. కళంకితులను పోటీకి దింపడంలో బీజేపీ ముందువరుసలో ఉంది. ఆ పార్టీ అభ్యర్థుల్లో 83 మంది (37%)పై నేరారోపణలు ఉన్నాయి. అలాగే 93% మంది బీజేపీ అభ్యర్థులు కోటీశ్వరులే. కాంగ్రెస్ అభ్యర్థుల్లో 27% మందిపై క్రిమినల్ కేసులుండగా 15% మంది కోటీశ్వరులు. జేడీఎస్‌లో 21% మందిపై కేసులున్నాయి. -
చట్టాలపై పోలీసులు అవగాహన పెంచుకోవాలి
మహబూబ్‌నగర్ క్రైం: వివిధ కేసుల్లో నిందితులకు శిక్ష ఖరారు చేయడంలో తగినంత ఆధారాలు సేకరించేందుకు పోలీసు పరిశోధనాధికారులు కృషి చేయాలని ఎస్పీ బి.అనురాధ సూచించారు. జిల్లా పోలీసు కార్యాల యం లో శనివారం ఉదయం ‘చిట్‌ఫండ్ వ్యవహారాల్లో జరిగే మోసాలు–ప్రజలకు చేయాల్సిన న్యాయ సేవలు, ఇతర చట్టాలు’ అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సును ప్రారంభించిన ఎస్పీ అనురాధ మాట్లాడుతూ పోలీసు అధికారులు నూతన చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ సాక్షాల సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఏఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, డీఎస్పీలు భాస్కర్, శ్రీధర్, పీపీపీబాలగంగాధర్రెడ్డి, ఏపీపీ అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
చౌటుప్పల్‌లో కార్డన్ సెర్చ్
చౌటుప్పల్ (మునుగోడు) : చౌటుప్పల్ మండల కేంద్రంలో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి నాయకత్వంలో 150మంది పోలీసులు 10బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న బుడిగ జంగాల కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వ్యక్తిగత గుర్తింపు కార్డులు, వాహనాల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. తెల్లవారుజామున పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి తనిఖీలు చేస్తుండడంతో కాలనీ వాసులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. పోలీసులంతా ఇండ్లల్లోకి ఎందుకు వచ్చారో తెలియక మొదట ఆందోళన చెందారు. గంజాయి స్వాధీనం పోలీసుల కార్డన్ సెర్చ్‌లో కుంబ శ్రీరాములు ఇంట్లో అరకిలో గంజాయి లభించింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ధైర్యంగా గంజాయిని ఇంట్లో నిలువచేసుకోవడం పట్ల పోలీసులు విస్తుపోయారు. శ్రీరాములును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అదే విధంగా సరైన పత్రాలు లేని 42ద్విచక్రవాహనాలు, 1కారు, 3ఆటోలు, 1సిలిండర్ పట్టుబడ్డాయి. కాలనీ పరిసరాల్లో మద్యం అమ్మే ముగ్గురు బెల్టు షాపు దుకాణాదారులను అదుపులోకి తీసుకున్నారు.అదే విధంగా మరో ఐదుగురు అనుమానితులను సైతం అదుపులోకి తీసుకున్నారు. నేరస్తులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకే : డీసీపీ ఈ ప్రాంతంలో ఇటీవల దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తులు మండల కేంద్రంలోనే సంచరిస్తున్నారన్న సమాచారం తమకు అందింది. అందులో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించామని భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణకు కార్డన్ సెర్చ్ దోహదపడుతుందన్నారు. పాత, కొత్త నేరస్తుల గుండెల్లో గుబులు పుడుతుందని తెలిపారు. ప్రజలంతా సరైన ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని, వాహనాల ఒర్జినల్ పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్డన్ సెర్చ్‌లు నిరంతరం కొనసాగుతూ ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమకు సహకరించాలని కోరారు. ఆయన వెంట ఏసీపీలు రామోజు రమేష్, శ్రీనివాసాచార్యులు, స్థానిక సీఐ వెంకటయ్య, ఎస్సై చిల్లా సాయిలు, వివిధ మండలాల సిబ్బంది పాల్గొన్నారు. సూర్యాపేటలో 40 ద్విచక్రవాహనాలు.. సూర్యాపేటక్రైం : జిల్లా కేంద్రంలోని అన్నాదురైనగర్‌లో మంగళవారం తెల్లవారు జామున డీఎస్పీ నాగేశ్వర్రావు, సీఐ శంకర్ ఆధ్వర్యంలో 150మంది సిబ్బందితో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ పాల్గొని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రకాశ్‌జాదవ్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన భద్రత, రక్షణ కల్పించడం, దొంగతనాలు నివారించడం, అక్రమకార్యకాలపాలు, సంఘ వ్యతిరేక చర్యలను అడ్డుకోవడం, అనుమానిత వ్యక్తుల గుర్తింపు, శాంతి భద్రతల రక్షణ, సంఘ వ్యతిరేక కార్యకలాపాల అదుపు చేయడము కోసమే జిల్లా వ్యాప్తంగా నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్డన్‌సెర్చ్ నిర్వహించేటప్పుడు ప్రజలు ఆందోళన చెందవద్దని, పోలీసులకు సహకరించాలని కోరారు. అనుమానిత వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలపాలన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 40 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం
సాక్షి, అమరావతి/మంగళగిరి టౌన్: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తానని నూతన డీజీపీ మన్న మాలకొండయ్య అన్నారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన పూర్తిస్థాయి డీజీపీగా ఆదివారం మధ్యాహ్నం 12.15 గంటలకు బాధ్యతలు చేపట్టారు. నండూరి సాంబశివరావు నుంచి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. రాష్ట్రంలో తీవ్ర నేరాలను అదుపు చేయడంలో కేసుల నమోదు, అరెస్టులు, దర్యాప్తులు, ప్రాసిక్యూషన్ వంటి కీలక విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సైబర్ నేరాలను అదుపు చేసేలా ఇంటెలిజెన్సీ, ఇన్వెస్టిగేషన్ తదితర పోలీస్ శాఖలు ప్రత్యేక దృష్టి పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా పదవీ విరమణ చేసిన డీజీపీ సాంబశివరావుకు పోలీసు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన∙ తనకు చదువు చెప్పిన గురువులను తలచుకుంటూ ఉద్వేగానికి గురయ్యారు. -
'శాంతి భద్రతలకే అత్యంత ప్రాధాన్యం'
సాక్షి, హైదరాబాద్: 2018 లో 8 లక్ష్యాలతో ముందుకెళ్తున్నట్టు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయనిక్కడ శనివారం మీడియాతో మాట్లాడుతూ 2018 పోలీసు శాఖకు ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ-చలాన్, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా యూనిట్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. హైదరాబాద్ తరహాలో అన్నీ పీఎస్‌లను తీర్చిదిద్దుతామన్నారు. అన్ని జిల్లాల్లో కమాండ్ కంట్రోలు సెంటర్లు ఏర్పాటు చేసి.. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేస్తామని తెలిపారు. నేరాల సంఖ్య గతంతో పోలిస్తే 12.93 శాతం పెరిగిందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ముందుకెళ్తామని.. పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పని చేస్తున్నామని తెలిపారు. పోలీస్ శాఖలో త్వరలో 18, 290 పోస్టును భర్తీ చేయనున్నట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. -
శాంతి భద్రతలే ప్రగతిపథ వారథులు
కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు సాక్షి, హైదరాబాద్: దేశం ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే శాంతి భద్రతల పరిరక్షణ అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదం, డ్రగ్స్ అక్రమ రవాణా, దొంగ నోట్ల వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి పటిష్టమైన భద్రత ఉండాలని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్‌వైకే)ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో జరిగిన ‘జాతీయ భద్రతపై యువ సమ్మేళనం’అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక ఎంతో కాలం భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండబోదని, దేశం పురోగమించడానికి ఇదే మంచి సమయమని పేర్కొన్నారు. దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల వయసు లోపు వారేనని, ఈ యువత వృద్ధాప్యం పొందేలోపు మన దేశం సంపన్న దేశంగా ఆవిర్భవించాలని ఆకాంక్షించారు. ప్రతి పౌరుడిని సంతోషంగా ఉంచాలనే ఉద్దేశంతోనే కేంద్రం ప్రజాసంక్షేమ కార్యక్రమాలను రూపొందిస్తోందని చెప్పారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని చెప్పారు. నెహ్రూ యువక కేంద్ర సంఘటన్ వైస్ చైర్మన్ శేఖర్‌రావు, యువకులు, విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆ బాధ్యత మాపై ఉంది: చినరాజప్ప
అమరావతి: ఏపీలో శాంతిభద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత మాపై ఉందని ఏపీ ఉప ముఖ్య మంత్రి చినరాజప్ప తెలిపారు. ఇందులో భాగంగానే అనుమతి లేని సభలను నియంత్రిస్తున్నామని చెప్పారు. తెలంగాణ వాళ్లు వచ్చి ఆంధ్రాలో సమస్యలు సృష్టించాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రాలో ఎవరికి ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. -
శాంతిభద్రతలపైనే అభివృద్ధి ఆధారం
జిల్లా ఎస్పీ రవిప్రకాష్ అనపర్తి: జిల్లా ప్రజలు శాంతికాముకులని, జిల్లాలో పనిచేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని బదిలీపై పశ్చిమ గోదావరికి వెళ్తున్న జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ అన్నారు. అనపర్తిలో నూతనంగా నిర్మించిన సర్కిల్ కార్యాలయాన్ని ఆయన గురువారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ ఒక ప్రాంతం అభివృద్ధి ఆ ప్రాంతంలో ఉన్న శాంతిభద్రతలపై ఆధారపడి ఉంటుందన్నారు. అభివృద్ధిని కోరుకునే ప్రజలు ఇక్కడ ఉండబట్టే శాంతిభద్రతలు అదుపులో ఉంటున్నాయన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడాల్సిన గురుతర బాధ్యత పోలీసులపై ఉందని, ఆ విధంగానే తాను కృషి చేసినట్లు తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి ఆస్తినష్టం కలగకుండా కృషి చేయడంలో తాను కృత్యుడనైనట్లు తెలిపారు. కొన్ని దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకున్నా..ప్రాణ నష్టం కలగకుండా చూశామన్నారు. అవినీతికి తావులేకుండా ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ విధి నిర్వహణ కొనసాగించాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ కార్యాలయాలను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, అడిషనల్ ఎస్పీ దామోదర్, డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, సీఐ శీలబోయిన రాంబాబు తదితరులు మాట్లాడారు. అనంతరం ఎస్పీని ఉచితరీతిన సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కర్రి ధర్మారెడ్డి(దొరబాబు), ఎంపీపీ తేతలి ఉమామహేశ్వరి, అడిషనల్ ఎస్పీ దామోదర్, ట్రైనీ ఏఎస్పీ అజిత, జిల్లా స్పెషల్ బ్రాంచి డీఎస్పీలు ఆర్.విజయభాస్కరరెడ్డి, ఎస్.అప్పలనాయుడు, మండపేట సీఐలు లక్ష్మణరెడ్డి, గీతాకృష్ణ, రామచంద్రపురం సీఐ కె.శ్రీధర్‌కుమార్, ఎస్సైలు పి.దొరరాజు, ఎన్.రజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మూడు కబ్జాలు.. ఆరు దోపిడీలు!
మూడేళ్లలో రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు ► కాల్‌మనీ నుంచి హవాలా వరకు అభాసుపాలు ► సవాలుగా మారిన ఎర్రచందనం, గంజాయి స్మగ్లింగ్ ► అక్రమార్జన కోసం అధికార పార్టీ నేతల బరితెగింపు ► చోద్యం చూడటం తప్ప చర్యలు తీసుకోలేకపోతున్న పోలీసులు ► నలిగిపోతున్న సామాన్యులు.. అడకత్తెరలో ఉద్యోగులు ► 2015 కంటే 2016లో పెరిగిన హత్యల శాతం 1.60 ► దాడుల శాతం 4.01 ►ఆర్థిక నేరాల శాతం 11.16 ► మహిళలపై వేధింపుల శాతం 10.98 ఆంధ్రప్రదేశ్ అంటే అశాంతికి చిరునామాగా మారింది. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, ఆర్థిక నేరాలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, కాల్ ‘నాగు’ల విషపు కాట్లు, కేటుగాళ్ల కేరింతలు.. ఇదీ రాష్ట్రంలో మూడేళ్ల ప్రగతి. తరతరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి సంపాదించాలన్న ఏకైక లక్ష్యంతో అధికార పార్టీ నేతలు బరితెగించడం సర్వత్రా కలవరపెడుతోంది. ‘అన్యాయం జరిగిందయ్యా.. న్యాయం చేయండ’ని వేడుకుని మరిన్ని ఇక్కట్ల పాలయ్యేకంటే నోరు కట్టేసుకుని కుమిలి పోవడమే ఉత్తమం అనే దుస్థితి దాపురించింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడేళ్లుగా శాంతిభద్రతలు అదుపు తప్పాయి. గడిచిన మూడేళ్లలో చోటుచేసుకున్న అకృత్యాలు, అరాచకాలే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో మూడేళ్లుగా చోటుచేసుకున్న నేరాల్లో పోలీస్ రికార్డులకు ఎక్కినవి కొన్నే. నేర పరిశోధన విభాగం (సీఐడీ) గణాంకాలు పరిశీలిస్తే 2015 కంటే 2016లో హత్యలు, దాడులు, మహిళలపై వేధింపులు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాదీ హత్యలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు బాగా పెరిగాయి. మహిళల అక్రమ రవాణా (ఉమన్ ట్రాఫికింగ్) గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్నా అడ్డుకట్ట వేయడంలో విఫలమవుతున్నారు. రాజధానిలో రాకాసి మూక రాజధాని ప్రాంతం అరాచక శక్తులకు అడ్డాగా మారుతోంది. భూములు ఇవ్వని రైతుల పాకలు, అరటి తోటలను ధ్వంసం చేసి తగలబెట్టిన వారిని ఇప్పటి వరకు పట్టుకోలేపోయారు. విజయవాడలో ఎమ్మెల్యే బొండా ఉమా అనుచరుల దందాలో ఆదుకునే దిక్కులేక చిన్నారి సాయిశ్రీ క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్సకు నోచుకోక మే 15న మృత్యువాత పడింది. కండ్రికలో కార్పొరేషన్ భూమిని బొండా ఉమ సోదరుడు ఆక్రమించినా అధికారులు ప్రేకక్షపాత్ర వహించారు. మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ అనుచరుల పేరుతో బెజవాడలో కొందరి దందాలు కేసుల వరకు వెళ్లాయి. గుంటూరులో ఎంపీ గల్లా జయదేవ్.. తాను అద్దెకు ఉంటున్న ఇల్లునే బ్యాంకు వేలం ద్వారా దక్కించుకోవడం దుమారమే రేపింది. స్పీకర్ కోడెల తనయుడు శివరాం తన అనుచరులతో నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే కాంట్రాక్టర్ మామూళ్లు ఇవ్వలేదనే కారణంతో దాడి చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. కృష్ణా నదికి ఇరువైపులా టీడీపీ ప్రజాప్రతినిధుల అండతో ఇసుక మాఫియా కోట్లకు పడగలెత్తుతోంది. కొత్త సవాళ్లతో పోలీసులు సతమతం అధికారులు, పోలీసులపై టీడీపీ నేతల దాడులు శాంతిభద్రతలకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. 2015 జూలై 8న ముసునూరు మహిళా తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి, 2015 జూలైలో చిత్తూరు జిల్లా చిన్నగొట్టికల్లు మండల తహసీల్దార్ నారాయణమ్మపై టీడీపీ నేతల దాడి ఘటనల్లో చర్యలు లేవు. వైజాగ్‌లో 2015 నవంబర్‌లో అనూషా(హిజ్రా) హత్య మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. అనంతపురం జిల్లాలో అయితే టీడీపీ నేతల ఆగడాలు మితిమీరాయి. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కూతురు డాక్టర్ మాధవికి అన్యాయం జరిగినా పట్టించుకోలేదు. తాము చెప్పినట్టు వినలేదనే అక్కసుతో విజయవాడ నడిబొడ్డున సీనియర్ ఐపీఎస్ అధికారి, ట్రాన్సుపోర్టు కమిషనర్ బాలసుబ్రమణ్యంను ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ద వెంకన్నలు దుర్భాషలాడారు. ఆయన గన్‌మెన్‌పై ఎమ్మెల్యే బొండా ఉమ చేయి చేసుకున్నా చట్టపరమైన చర్యలు లేవు. ఎమ్మెల్యే చింతమనేని ఏకంగా పోలీసులపైనే దాడి చేసి కొట్టినా దిక్కులేదు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతానికి బలైపోయిన రిషితేశ్వరి, ఫ్రొఫెసర్ వేధింçపుల కారణంగా గుంటూరులో పీజీ మెడికో విద్యార్థిని బాల సంధ్యారాణి ఆత్మహత్య ఘటనల్లో పోలీసులు విమర్శలనెదుర్కొన్నారు. ఆయా ఘటనల్లో నిందితులు అధికార పార్టీ వారు కావడంతోనే చర్యలు తీసుకోలేక, బాధితులకు న్యాయం చేయలేక పోలీసులు సతమతమవుతున్నారు. ► ఎర్రచందనం స్మగ్లర్లకు చెక్ పెడతామని, స్మగ్లింగ్‌ను అరికడతామని ప్రభుత్వం చేసిన ప్రకటనలు ఆచరణలో అమలు కాలేదు. అసలు స్మగ్లర్లను పట్టుకోలేక చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో 2015 ఏప్రిల్‌లో 20 మంది కూలీలను పోలీసులు ఎన్కౌంటర్ చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ► విజయవాడ నగరంలో కాల్‌మని కాలనాగులు కోరలు చాచి మహిళలపై లైగింక వేధింపులకు పాల్పడటం అధికార తెలుగుదేశం పార్టీకి మాయని మచ్చను తెచ్చింది. ► కొద్ది రోజుల క్రితం విశాఖ, విజయవాడలోను వెలుగు చూసిన హవాలా స్కామ్లోను టీడీపీ పెద్దల జోక్యం పలు అనుమానాలకు తావిచ్చింది. ► టీడీపీ నేతల వేధింపుల కారణంగానే గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపల్ చైర్పర్సన్ గోపవరపు శ్రీదేవి భర్త గుండెపోటుతో మృతి చెందడం, ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకోవడం దుమారం రేగింది. ► పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రుల్లో ఫుడ్‌పార్కు విషయంలో నిరసన తెలిపిన మహిళలపై టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు దాడి చేయించినా పోలీసులు స్పందించ లేదు. కర్నూలు జిల్లాలో వైఎస్సార్ సీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసులో అసలు నిందితులపై చర్యలు లేవు. ► విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో సాగు అవుతున్న గంజాయి రాజధాని ప్రాంతమైన విజయవాడ, గుంటూరుతోపాటు విద్యాలయాలు, శ్రమజీవులు ఉండే ప్రాంతాలకు పెద్ద ఎత్తున సరఫరా అవుతోంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, మద్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి గంజాయి, మాదకద్రవ్యాలు దిగుమతి అవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ► ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార యావతో 2015 జూలైలో జరిగిన గోదావరి పుష్కరాలు తొలి రోజునే రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాటలో 29 మంది భక్తులు దుర్మరణం చెందడం, పెద్ద సంఖ్యలో జనం గాయపడటం దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. ► ఆంధ్ర – ఒడిశా బోర్డర్(ఏఓబి) మల్కన్‌గిరి ప్రాంతంలో 2016 అక్టోబర్‌లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు, గిరిజనులు మృతి చెందడం కలకలం రేపింది. -
నిందితుల ఇళ్ల పరిశీలన
కృష్ణగిరి: పత్తికొండ నిమోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి, అతని అనుచరుడు సాంబశివుడు హత్య కేసులో కొందరి నిందితుల ఇళ్లను పోలీసులు పరిశీలించారు. జంట హత్యకేసులో 12 మందిపై కేసు నమోదు కాగా, ఆరుగరు తొగర్చేడు గ్రామస్తులు ఈ మేరకు తొగర్చేడు గ్రామాన్ని శుక్రవారం డోన్ సీఐ శ్రీనివాసులు, కృష్ణగిరి ఎస్ఐ సోమ్లానాయక్‌లు సందర్శించారు. ఈ హత్య కేసులో నిందితుల ఇళ్లను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. గ్రామంలోకి ఎవరైన కొత్త వ్యక్తులు వస్తే తమకు సమాచారమందించాలని ప్రజలకు సూచించారు. -
శాంతిభద్రతల పరిరక్షణ.. అందరి బాధ్యత
► సీమ ఐజీ శ్రీధర్‌రావు చింతకొమ్మదిన్నె : శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ కృషి చేయాలని రాయలసీమ ఐజీ ఎన్. శ్రీధర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం చింతకొమ్మదిన్నె పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ముందుగా ఇటీవల నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్ భవనాన్ని పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కొద్దిపాటి చిన్న పనులను వెంటనే పూర్తి చేసి కడప కర్నూలు రేంజ్ డీఐజీకి సమాచారం అందించాలన్నారు. తర్వాత ప్రస్తుతం అద్దె భవనంలో నడుస్తున్న పోలీస్‌స్టేషన్ భవనం, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, మట్కా, గ్యాబ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలను నివారించాలన్నారు. ప్రస్తుతం మండలంలో నాలుగు సీసీ కెమెరాలు ఉన్నాయని, మండల కార్యాలయాల్లో కళాశాలలు, పాఠశాలలు, రద్దీ ప్రదేశాలలో మరిన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రస్తుత వేసవి కాలంలో ప్రజలు ఎక్కువగా ఇంటిపైన నిద్రిస్తారని, దొంగతనాలు జరగకుండా లాకర్ బీగాలను వాడాలని సూచించారు. ప్రజలు ఎవరైనా ఊర్లకు వెళ్లేటప్పుడు సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందిస్తే.. ఆ ఇంటికి పోలీసుల ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తమ పోలీస్‌స్టేషన్ నుంచి నిఘా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ సత్య ఏసుబాబు, కడప డివిజన్ డీఎస్పీ ఈజీ అశోక్ కుమార్, ఎస్బీ డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, రూరల్ సీఐ వెంకటశివారెడ్డి, ఎస్ఐలు కుళ్ళాయప్ప. చాంద్‌బాషా పాల్గొన్నారు. -
శాంతిభద్రతలే తొలి ప్రాధాన్యత
డీజీపీకి సూచించిన యూపీ సీఎం ⇒ 15 రోజుల్లో అధికారులు ఆస్తులు వెల్లడించాలి ⇒ అలహాబాద్‌లో బీఎస్పీ నేత హత్యపై సీరియస్ లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టనున్నట్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాహుల్ భట్నాగర్, డీజీపీ జావీద్ అహ్మద్, హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి దేబాషిష్ పాండాలతో సమావేశమ్యారు. వారికి బీజేపీ మేనిఫెస్టోను అందజేసిన సీఎం.. వీటి అమలు దిశగా కార్యాచరణను మొదలుపెట్టాలని ఆదేశించారు. అలహాబాద్‌లో జరిగిన బీఎస్పీ కార్యకర్త హత్యపై స్పందిస్తూ.. శాంతిభద్రతల విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని డీజీపీకి సూచించారు. దీంతోపాటుగా రాష్ట్రంలోని 75 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు, ఇతర పాలనాపరమైన సమస్యపై సమీక్ష నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మంత్రులు ఆస్తుల వివరాలు వెల్లడించాలని ఇప్పటికే ఆదేశించిన సీఎం.. సోమవారం అధికారులకు కూడా ఇవే ఆదేశాలు జారీ చేశారు. 15 రోజుల్లో స్థిర, చరాస్తుల వివరాలన్నీ అందించాలన్నారు. ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ కూడా ఆదిత్యనాథ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 47 మంది మంత్రులకు త్వరలోనే శాఖలు కేటాయించనున్నారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్ అధికారిక నివాసంలో సాధువులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలహాబాద్‌లో బీఎస్పీ నేత హత్య: అలహాబాద్ సమీపంలోని మవాయిమా పోలీసుస్టేషన్ సమీపంలో బీఎస్పీకి చెందిన మహ్మద్ షమీ (60) అనే నేతను గుర్తుతెలియని ఆదివారం రాత్రి వ్యక్తులు కాల్చి చంపారు. సీఎంగా ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేసిన కాసేపటికే ఈ ఘటన జరగటం కలకలం రేపింది. కాగా, నిషేధం ఉన్నప్పటికీ అక్రమంగా పశువులను వధిస్తుండటంతో అలహాబాద్‌లో రెండు కబేళాలను అధికారులు మూసేశారు. -
అయ్యో..! అతివ
రాజధాని నగరంలో మహిళల భద్రత ప్రశ్నార్థకమే విజయవాడలో హడలెత్తిస్తున్న మహిళలపై నేరాలు 2016లో అమాంతంగా పెరిగిన కేసుల సంఖ్య ‘శాంతిభద్రతలు... ప్రత్యేకించి మహిళల భద్రత విషయంలో అత్యంత కఠినంగా ఉంటాం. అమరావతి ప్రాంతాన్ని ప్రజా రాజధానిగా తీర్చిదిద్దుతాం’అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా చెప్పుకుంటున్నారు. కానీ విజయవాడలో మహిళల భద్రత గాలిలో దీపంలా మారింది. మహిళలకు ఏమాత్రం రక్షణలేని, దాడులు పెరుగుతున్న నగరంగా విజయవాడ రూపాంతరం చెందుతుండటం ఆందోళన కలిగిస్తున్న వాస్తవం. – సాక్షి, అమరావతిబ్యూరో సాక్షి, అమరావతిబ్యూరో : విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలకు రక్షణ లేకుండాపోయింది. మహిళా హత్యలు, వరకట్న హత్యలు, వేధింపులు, ఆత్మహత్య చేసుకునేలా వేధింపులు, లైంగికదాడులు... ఇలా అన్ని రకాల కేసులు పెరుగుతున్నాయి. 2015 కంటే 2016లో నగర పరిధిలో మహిళలపై దాడులు, వేధింపుల కేసులు బాగా పెరిగాయి. 2015లో మొత్తం 464 కేసులు నమోదయ్యాయి. 2016లో ఏకంగా 760 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్న వాస్తవం. అంటే నేరాలు 63 శాతం అధికమయ్యాయి. ► 2015లో ఒక్క వరకట్న హత్య కూడా లేదు. 2016లో ఐదు వరకట్న హత్యలు జరిగాయి. ► మహిళలపై వివిధ రకాల వేధింపుల కేసులు 2015లో 175 నమోదయ్యాయి. 2016లో ఏకంగా 411 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ► కమిషరేట్ పరిధిలో మహిళలపై లైంగిక దాడులు అమాంతం పెరుగుతున్నాయి. 2015లో నగరంలో లైంగికదాడులు కేసులు 53 నమోదయ్యాయి. 2016లో 70 నమోదు కావడం ఆందోళనకరంగా మారింది. ► మహిళలను అపహరించిన కేసులు 2015లో 21 నమోదయ్యాయి. 2016లో 26 కేసులు నమోదు కావడం గమనార్హం. ► మహిళలపై దాడులకు పాల్పడి వారి గౌరవానికి భంగం కలిగిస్తున్న కేసులు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. 2015లో ఇలాంటి కేసులు 156 నమోదయ్యాయి. 2016లో 198 కేసులు నమోదు కావడం మహిళలపై పెరుగుతున్న దాడులకు నిదర్శనం. ► 2015లోనూ, 2016లోనూ నగర పరిధిలో వరకట్న వేధింపుల వల్ల ఆత్మహత్యలు 10 చొప్పున నమోదయ్యాయి. ► ఆత్మహత్య చేసుకునేలా వేధింపులకు గురిచేసిన కేసులు కూడా 2015లో 25 ఉండగా, 2016లో 24 నమోదయ్యాయి. లైంగికదాడులను అరికట్టలేరా! మహిళలపై నేరాల్లో లైంగికదాడులు, వేధింపులు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాజధానిగా రూపాంతరం చెందిన తరువాత నగరంలో లైంగికదాడు లు అధికం కావడం విస్మయకర వాస్తవం. ► 2012లో 47, 2013లో 40 లైంగిక దాడులు జరిగాయి. 2014 నుంచి పెరుగుతూ వస్తున్నాయి. 2014లో 61, 2015లో 53 కేసులు నమోదయ్యాయి. 2016లో ఏకంగా 70 కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రభుత్వం ఏం చేస్తున్నట్టో...! ముఖ్యమంత్రి చంద్రబాబు సహా అధికార యంత్రాంగం అంతా విజయవాడలోనే కేంద్రీకృతమై ఉంది. కానీ రాజధానికి తగ్గట్లుగా రక్షణ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయ లేదు. కేవలం వీఐపీల భద్రత, హంగు ఆర్భాటాలకే పోలీసు వ్యవస్థను వాడుకుంటు న్నారు. దాంతో సామాన్యులకు ప్రత్యేకించి మహిళల రక్షణపై దృష్టిసారించలేకపోతు న్నామని పోలీసు వర్గాలే చెబుతుండటం గమనార్హం. సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చిన తరువాత కూడా... మహిళలపై వేధింపులు, దాడులకు సంబంధించిన కేసులను ఏకపక్షంగా నమోదు చేయొద్దని 2014లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. మొదట ఇరువర్గాలతో మాట్లాడి వాస్తవాలను తెలుసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అప్పటి నుంచి వచ్చిన ఫిర్యాదులను యథాతథంగా కేసులుగా నమోదు చేయడం లేదు. ఇరువర్గాలతో సంప్రదించి వీలైనంతవరకు రాజీ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దాంతో కేసుల సంఖ్య తగ్గుతుందని అంతా భావించారు. కానీ 2014 తరువాత విజయవాడలో మహిళలపై దాడులు, వేధింపుల కేసులు మాత్రం అమాంతంగా పెరుగుతూనే ఉన్నాయి. అంటే నేరాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. -
పోలీసులు అంకితభావంతో పనిచేయాలి
– ఎస్పీ ఆకే రవికృష్ణ కర్నూలు : శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని సోమవారం ఉదయం పోలీసు కార్యాలయంలోని పెరేడ్ మైదానంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పోలీసు అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. మహాత్మాగాంధీ ఆచరించిన సత్యం, అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. గాంధీజీ కలలుగన్న భారతదేశం తయారవ్వాలంటే యువత కీలకంగా వ్యవహరించాలన్నారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, ఓఎస్డీ రవిప్రకాష్, డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, మురళీధర్, కృష్ణమోహన్, సీఐలు నాగరాజ యాదవ్, మహేశ్వరరెడ్డి, మధుసూదన్, డీపీఓ ఏఓ అబ్దుల్ సలాం, పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం... రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి మతిస్థిమితం కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబాలకు పోలీసు సంక్షేమ నిధి నుంచి ఎస్పీ ఆకే రవికృష్ణ ఆర్థిక సాయాన్ని అందించారు. ఏఆర్పీసీ రామాంజనేయులు, సివిల్ పీసీ నాగరాజు రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలకు గురై మతిస్థిమితం కోల్పోయి రెండేళ్లుగా చికిత్స పొందుతున్నారు. వారి కుటుంబాలు చంద్రరేణుక, కాంతమ్మలకు ఒక్కొక్కరికి రూ.5 వేలు ఆర్థిక సాయాన్ని ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ పాల్గొన్నారు. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం
బుక్కరాయసముద్రం : శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం డీఎస్పీ మల్లికార్జునవర్మతో కలిసి ఎస్పీ బుక్కరాయసముద్రం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ అనంతపురం నగరంలో 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. నేరాలను తగ్గించేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగంలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫ్యాక్షన్ గొడవలకు పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2017 సంవత్సరం ప్రారంభం నుంచి విప్లవాత్మకంగా నేరాలు తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, ఎస్ఐ విశ్వనాథ్ చౌదరి, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు హెడ్ కానిస్టేబుల్ లక్ష్మినారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
హింసను ప్రేరేపిస్తే కఠిన చర్యలు
- దాడికి పాల్పడిన 23 మంది అరెస్టు - రౌడీషీట్ ఓపెన్ చేయాలని ఎస్పీ ఆదేశాలు - సిద్దపల్లిలో పర్యటన ఆత్మకూరు: పల్లెల్లో హింసను ప్రోత్సహించి శాంతి భద్రతలకు విఘాతం కల్గించిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ హెచ్చరించారు. ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దపల్లి గ్రామంలో జరిగిన దాడుల్లో 23 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. గ్రామానికి చెందిన ఈశ్వరరెడ్డి వర్గీయులు దరగయ్య కుటుంబంపై కర్రలు, మారణాయుధాలతో దాడికి పల్పడినట్లు తెలిపారు. ఇలా గ్రామాల్లో అల్లర్లకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని ఆదేశించారు. మరో 9 మంది పరారిలో ఉన్నట్లు చెప్పిన ఎస్పీ.. త్వరలోనే సీఐ ఎదుట లొంగిపోవాలని వారికి సూచించారు. గ్రామాల్లో మళ్లీ ఘర్షణలకు తావులేకుండా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. సిద్దపల్లిలో ఎస్పీ పర్యటన సిద్దపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఎస్పీ పర్యటించారు. బాధిత కుటుంబ సభ్యులు, అంతకు ముందు చిన్నారులతో మాట్లాడి దాడికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నారు. ఇరువర్గాల వారితో మాట్లాడారు. ఏ సమస్య ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. దెబ్బతిన్న బైకులు, సైకిళ్లు ఇళ్లను పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ సుప్రజ, సీఐ కృష్ణయ్య, ఎస్ఐలు సు«ధాకరరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, శివశంకర్‌నాయక్, సిబ్బంది ఉన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణలో సహకారం అవసరం
ఎస్పీ విశాల్ గున్నీ నెల్లూరు(క్రైమ్): శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని ఎస్పీ విశాల్‌గున్నీ పేర్కొన్నారు. నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వ్యాపారులు, నగర ప్రజలతో ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం నిర్వహించిన ఆత్మీయ సదస్సులో ఆయన మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నగర ప్రజలకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని వివరించారు. ఇందులో భాగంగా నగరంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని దాతలను కోరామని, అనేక మంది ముందుకొచ్చి ఏర్పాటుకు తమ వంతు సహకారం అందించారని పేర్కొన్నారు. వీరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కొంత మంది నగదు చెల్లించారని, వీరికి నగదును ఇచ్చేస్తామని, డీడీ, చెక్కుల రూపంలోనే సహకారం అందించాలని కోరారు. దాతలు తాము అందించిన విరాళాలకు సంబంధించిన రసీదులను పొందాలని సూచించారు. వ్యాపారులు తమ వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. లాడ్జీల యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు గది అద్దెకు కావాలనే వారి నుంచి ఆధార్‌కార్డు, ఓటర్‌కార్డు, తదితరాలకు సంబంధించిన జిరాక్స్‌లను సేకరించిన అనంతరమే అద్దెకు ఇవ్వాలని చెప్పారు. లాడ్జిలో ఎవరెవరు ఉంటున్నారనే విషయాలను స్థానిక పోలీసులకు తెలియజేయాలని సూచించారు. మొబైల్‌షాపు నిర్వాహకులు సరైన గుర్తింపు కార్డులను తీసుకున్నాకే సిమ్‌లను విక్రయించాలని ఆదేశించారు. నగరంలో ఇప్పటికే 106 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, వీటిని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌కు అనుసంధానం చేశామన్నారు. విజయవాడ తర్వాత నెల్లూరు జిల్లాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సిస్టమ్‌ను ఏర్పాటు చేశామని, త్వరలోనే డీజీపీ సాంబశివరావు చేతుల మీదుగా ప్రారంభించి శాంతిభద్రతలను పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొస్తామని చెప్పారు. ఏఎస్పీ శరత్‌బాబు, ఎస్బీ, నగర డీఎస్పీలు కోటారెడ్డి, వెంకటరాముడు, ఇన్స్పెక్టర్లు మాణిక్యరావు, అబ్దుల్ కరీమ్, సుధాకర్‌రెడ్డి, రామారావు, సీతారామయ్య, మంగారావు, చెంచురామారావు, ఎస్బీ ఎస్సై శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణలో బీజేపీ విఫలం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శాంతిభద్రతల విషయంలో బీజేపీ తీరు సక్రమంగా లేకపోవడం వల్లే కశ్మీర్ మరోసారి నెత్తురోడిందని సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసి జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ అన్నారు. కశ్మీర్లో దాడులను నిరసిస్తూ బుధవారం శ్రీకాకుళం నగరంలోని వైఎస్సార్ కూడలిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కశ్మీర్లో అల్లర్లు జరుగుతున్నా ప్రధాని పట్టించుకోవడం లేదని, ఇటువంటి పాలకులను జమ్ముకశ్మీర్ ప్రజలు ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు. కశ్మీర్లో భారత ప్రభుత్వ సైనిక దమనఖాండను నిలిపివేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా సంఘీభావ సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, సెమినార్లు జరపాలని సీపీఐ (ఎమ్ఎల్) రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు నేతింటి నీలంరాజు, ఎన్.వెంకటరావు, ఎస్.కృష్ణవేణి, బి.భాస్కరరావు, మార్పు మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రశ్నార్థకం
కోడెల గెలిచిన తర్వాతే ఈ దుస్థితి.. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే గోపిరెడ్డి నరసరావుపేట: డాక్టర్ కోడెల శివప్రసాదరావు శాసనసభ్యుడిగా గెలిచి స్పీకర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశ్నార్థకంగా మారాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వెల్లడించారు. స్పీకర్ కోడెల మాటలు విని.. బాధితులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఆయనకు,ఆయన కుమారుడికి గుండాలుగా పని చేయటం ప్రమాదకరమైన విషయమన్నారు. రైల్వే కాంట్రాక్టర్‌పై దౌర్జన్యం కేసులో ముఖ్యమంత్రి చూస్తూ ఊరుకున్నారంటే ఆయనే ప్రోత్సహిస్తున్నట్లుగా అర్థమవుతోందన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నడికుడి– శ్రీకాళహస్తి పనులు చేస్తున్న రైల్వే కాంట్రాక్టర్, ఆయన మనుషులు, కూలీలపై స్పీకర్ కోడెల, ఆయన కుమారుడు పంపిన గుండాలు దాడిచేసి ఆస్తులను ధ్వంసం చేశారన్నారు. దీనిపై కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదుచేస్తే, వారిపై మరో కౌంటర్ కేసును నమోదుచేయటం దారుణమన్నారు. ఈ సంస్కృతి కోడెల శాసనసభ్యుడిగా అయిన దగ్గర నుంచి ఉందని, తెలుగుదేశం వారు ఎవరినైనా కొడితే కేసు పెట్టడానికి వెళ్ళిన వ్యక్తిపైనే కేసు పెట్టి బెదిరించి రాజీచేసే ప్రక్రియకు పాల్పడుతున్నాన్నారు. పరిస్థితి ఈ విధంగా ఉంటే రాష్ట్రంలో, సత్తెనపల్లి, నరసరావుపేటల్లో శాంతిభద్రతలు ఏవిధంగా రక్షించబడతాయో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కోడెల గెలిచిన తర్వాత సత్తెనపల్లిలో పోలీసులే గుండాలుగా వ్యవహరించి తమ పార్టీ ఎంపీటీసీలను అపహరించుకెళ్ళారన్నారు. సత్తెనపల్లిలోని వెన్నాదేవి దగ్గర పోలీసులకు ఏవిధమైన సంబంధంలేకపోయినా ఒక స్థలం వద్దకు వెళ్ళి ఆ స్థల యజమానిని భలవంతంగా ఖాళీచేయించిన తర్వాత కోడెల శివప్రసాదరావు గుండాలు ప్రవేశించారన్నారు. దీనిని బట్టి పోలీసు వ్యవస్థ ప్రజల మానప్రాణాలను రక్షించటానికంటే కోడెల, అతని కుమారుడికి ఖాకీ డ్రస్సు వేసుకున్న గుండాలుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇది సమాజానికి,. పోలీసులకు మంచిది కాదన్నారు. కమిషన్ లేనిదే ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరూ ఏ పనిచేసే పరిస్థితిలేదన్నారు. మొన్న స్పీకర్‌ను లోకేష్ కలిసిన తర్వాత కాంట్రాక్టర్‌పై దౌర్జన్య వ్యవహారం చోటుచేసుకుందన్నారు. లోకేష్, స్పీకర్, చంద్రబాబులు ఇప్పటికే ప్రజలను దోచుకుంటున్నారని, అయితే ఇంత దౌర్జన్యంగా ఇక్కడ దోచుకోవటం జరుగుతున్నా పోలీసులు చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. అంతా కోడెల కుమారుడి లీల.. ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ సంగం డెయిరీ రైతులకిచ్చే బోనస్‌లో లీటర్‌కు అర్ధ రూపాయి కమీషన్ కావాలని స్పీకర్ కోడెల కుమారుడు డిమాండ్ చేయటంతో రెండు నెలలుగా ఆ సంస్థ బోనస్ చెల్లించలేదన్నారు. దీనిపై రైతులు తన దృష్టికి తీసుకురావడంతో డెయిరీ మేనేజర్‌ను ప్రశ్నిస్తే ఈ విషయం వెల్లడైందన్నారు. ఈ విధంగా వ్యవహరిస్తున్న వీరి చేష్టలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. సమావేశంలో జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్‌మాబు, సత్తెనపల్లి మార్కెటింగ్‌యార్డు మాజీ ఛైర్మన్ కట్టా సాంబయ్య, రాజుపాలెం మాజీ ఎంపీపీ బాసు లింగారెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి కోడిరెక్క దేవదాసు తదితరులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి
సీపీ సుధీర్‌బాబు పోలీస్ క్రికెట్కప్–2016 ప్రారంభం వరంగల్ : వరంగల్ కమిషనరేట్ పరిధిలోని గ్రామాల్లో యువత.. పోలీసులకు ప్రతినిధులుగా వ్యవహరించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు సహMýరించాలని పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా నిర్వహిస్తున్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రికెట్ కప్–2016 టోర్నమెంట్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. హన్మకొండలోని పోలీసు మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీ పాల్గొని మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో యువత భాగస్వాములు కావాలన్నారు. పోలీసులకు యువత చేరువ కావాలన్న ధ్యేయంతోనే ఈ క్రికెట్ కప్–2016ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్–ఏ, వరంగల్–బీ జట్ల మధ్య మ్యాచ్ జరగగా కమిషనర్ టాస్ వేయడంతో పాటు బౌలింగ్ చేయగా హన్మకొండ ఏసీపీ శోభన్‌కుమార్ బ్యాటింగ్ చేశారు. కాగా, తొలుత ఎస్వీఎస్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు నృత్యాలు చేశారు. కార్యక్రమంలో డీసీపీ యాదయ్య, ఏసీపీలు ఈశ్వర్రావు, శోభన్‌కుమార్, సురేంద్రనాథ్, రవీందర్రావు, సీఐలు సంపత్‌రావు, ఎస్ఎం.అలీ, కిషన్, రవికుమార్, శ్రీనివాస్, శివరామయ్య, రమేష్, వేణు, ప్రభాకర్‌రావు, సత్యనారాయణ, ఆర్ఐలు శ్రీనివాస్, నాగయ్య, సిటీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్, క్రికెట్ కోచ్ జైపాల్ పాల్గొన్నారు. వరంగల్ – ఏ, వరంగల్ – బీ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ‘ఏ’ జట్టు విజయం సాధించింది. -
ప్రధాని మోదీతో గవర్నర్ నరసింహన్ భేటీ
-
ప్రధాని మోదీతో గవర్నర్ నరసింహన్ భేటీ
న్యూఢిల్లీ : గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు సహా తాజా పరిస్థితులపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు సమాచారం. భేటీ అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానితో సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యత లేదన్నారు. హైకోర్టు విభజనపై ప్రధానమంత్రితో చర్చించలేదని ఆయన తెలిపారు. జల వివాదాలపై తాను జోక్యం చేసుకోనని, అలాగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆ అంశంపై మాట్లాడనని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. కృష్ణా పుష్కరాల పనులు సకాలంలో పూర్తవుతాయని ఆయన తెలిపారు. -
అదుపుతప్పిన శాంతిభద్రతలు
– ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్స్టేషన్ల సమీపంలోనే హత్యలు – డీజీపీ సొంత జిల్లాలో ప్రశ్నార్థమైన లా అండ్ ఆర్డర్ – జిల్లా వ్యాప్తంగా పోలీసుల నిర్లిప్తత – ఎస్పీ రాజశేఖర్‌బాబు బాధ్యతలు తీసుకుని నేటితో రెండేళ్లు పూర్తి (సాక్షి ప్రతినిధి, అనంతపురం) : 2015 మార్చి 31 : తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలం కిష్టిపాడులో సింగిల్‌విండో అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ నేత విజయభాస్కర్‌రెడ్డిని సొసైటీ కార్యాలయంలోనే టీడీపీ నేతలు హత్య చేశారు. –2015 ఏప్రిల్ 29 : రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ మాజీ మండల కన్వీనర్ ప్రసాదరెడ్డిని హæత్య చేశారు. –2016 జూలై 21 : అనంతపురం నాలుగో పట్టణ æపోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో గోపీనాయక్, వెంకటేశ్‌నాయక్‌లను హతమార్చారు. ఈ మూడు సంఘటనలే కాదు...టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత ‘అనంత’లో తరచూ ఎక్కడో ఒకచోట హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ 8 హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష పార్టీలో చురుకైన నేతలు, కార్యకర్తలను తుదముట్టడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. తద్వారా జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులను బలహీనపరిచి 2019 ఎన్నికల్లో లబ్ధి పొందేలా ఇప్పటి నుంచే ‘అరాచక ప్రణాళిక’ను రచించారు. ఇందుకు పోలీసులను పావులుగా వాడుకుంటున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. సున్నిత ప్రాంతాలను గుర్తించి శాంతిభద్రతలు అదుపు తప్పకుండా చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందని ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు పరిశీలకులు విమర్శిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, అధికారపార్టీ నేతలు చెప్పినట్లే పోలీసులు నడుచుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఈ వైఖరితో ప్రతిపక్షపార్టీ శ్రేణులతో పాటు సామాన్యప్రజలకూ ఇబ్బందులు తప్పడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎస్పీ మృదు స్వభావమే కొంప ముంచుతోందా? ఎస్పీ రాజశేఖర్‌బాబుకు మృదుస్వభావిగా పేరుంది. దీన్ని ఆసరాగా తీసుకుని ఆయన కిందనున్న కొందరు కీలక పోలీసు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. చాలా సర్కిళ్లలో సీఐలు, ఎస్ఐలను ఎమ్మెల్యేలు సిఫార్సు చేసినవారినే నియమించినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి/ఎమ్మెల్యే అండ ఉంటే చాలని, ఎవ్వరు అడ్డొచ్చినా తన ‘సీటు’ పదిలమనే ధీమాతో కొందరు సీఐలు, ఎస్ఐలు పనిచేస్తున్నారు. ఉన్నతాధికారులను సైతం బైపాస్ చేసి వెళుతున్నారు. పేకాట, మట్కా, క్రికెట్‌బెట్టింగ్‌లు జరుగుతున్నా కొందరు పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇంకొంతమంది స్టేషన్లలో స్థలవివాదాలతో పాటు పంచాయితీలు చేస్తున్నారు. ఎస్పీ దృష్టికి వచ్చిన ఘటనలపై ఆయన తక్షణ చర్యలు తీసుకుంటున్నా.. దృష్టికి రానివి మాత్రం చాలానే ఉన్నాయి. ఇటీవల వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన రైతుభరోసా యాత్రలో పామిడి సీఐ నరేంద్రరెడ్డి వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. గ్రామస్థాయి టీడీపీ నేతలు రోడ్డుపై ఆందోళనకు సిద్ధమవుతున్నారని తెలిసి ప్రతిపక్షనేత కాన్వాయ్‌ని ముందుకు వెళ్లకుండా నరేంద్రరెడ్డి అడ్డుపడ్డారు. ‘గ్రామస్థాయి లీడర్లు ఆందోళన చేస్తే వారిని అదుపు చేయకుండా.. ప్రతిపక్షనేత కాన్వాయ్‌ను ఆపడమేంటని’ వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తే...‘గ్రామస్థాయి అయినా, మండలస్థాయి అయినా వారు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నవారికి, లేనివారికి తేడా ఇలాగే ఉంటుంది’ అంటూ అధికార పార్టీకి తాము అనుకూలంగా వ్యవహరిస్తున్నామన్న విషయాన్ని కుండబద్దలు కొట్టారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు రెండేళ్లుగా పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవడానికి. ప్రభుత్వాలు ఐదేళ్లకోసారి మారతాయి. కానీ పోలీసుల పనితీరును ప్రజలు నిత్యం గమనిస్తూనే ఉంటారు. మొత్తం మీద ఎస్పీ రెండేళ్లలో కొన్ని వినూత్న, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మంచిపేరు తెచ్చుకున్నా, శాంతిభద్రతల పరిరక్షణలో మాత్రం వెనుకబడ్డారనే భావన ప్రజల్లో నెలకొంది. -
శాంతి భద్రతలా... ఎక్కడ?
సాక్షి, చెన్నై: డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ మంగళవారం తన నియోజకవర్గం కొళత్తూరులో పర్యటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, శాంతి భద్రతల పరిరక్షణ ఎక్కడ.. ఏమేరకు ఉన్నదో ప్రజలందరూ గుర్తించాల్సిన విషయంగా వ్యాఖ్యానించారు. కొళత్తూరు నుంచి రెండో సారిగా అసెంబ్లీలోడీఎంకే దళపతి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ అడుగు పెట్టిన విషయం తెలిసిందే. తన నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం, ప్రజల్ని కలిసి వారి మొర ఆలకించేందుకు మంగళవారం స్టాలిన్ రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో వీధి వీధిన తిరిగారు. అక్కడక్కడ ఎదురైన సమస్యల్ని గుర్తించి, వాటి పరిష్కారానికి తగ్గ చర్యలు అక్కడక్కడే తీసుకునే విధంగా అధికారుల్ని ఆదేశించారు. తిరువళ్లువర్ నగర్, కన్నగినగర్, తదితర ప్రాంతాల్లో ప్రజలు తమ సమస్యల్ని, తమకు ఎదురు అవుతున్న కష్టాల్ని స్టాలిన్ దృష్టికి తీసుకొచ్చారు. పారిశుధ్య లోపం, కాలువల మరమ్మతులు తదితర అంశాలను పరిశీలించి తగిన చర్యలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన నియోజకవర్గంలో చేపట్టనున్న పనులను వివరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హత్యల పర్వం కొనసాగుతుంటే నోరు మెదపని సీఎం జె జయలలిత, అన్నాడీఎంకేకు చెందిన కౌన్సిలర్ హత్యతో సంతాపం తెలియజేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. తన దాకా సమస్య వస్తే గానీ స్పందించరా? అని ప్రశ్నించారు. శాంతి భద్రతల పరిరక్షణ ఎక్కడ ఉందో, ఏమేరకు ఉన్నదో ప్రజలు గుర్తించాలని వ్యాఖ్యానించారు. నియోజకవర్గ నిధుల కేటాయింపుల విషయంలో సంబంధిత శాఖ మంత్రి తగిన సమాధానం ఇంత వరకు ఇవ్వలేదని, ఈ విషయంలో కోర్టుకు వెళ్లడానికి తాను సిద్ధం అని స్పష్టం చేశారు. -
పోలీసుల సంక్షేమానికి కృషి చేస్తాం: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపులో ఉంచడంలో పోలీసుల కృషి ఎనలేనిదని, వారి సంక్షేమానికి మరింత కృషి చేస్తామని డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. పోలీసుల సంక్షేమంలో భాగంగా సిబ్బంది కంట్రిబ్యూషన్‌తో నడుస్తున్న ‘భద్రత’ పొదుపు సంఘం మొదటి సర్వసభ్య సమావేశం ఆదివారం డీజీపీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా 2014-15 సంవత్సర కార్యకలాపాలను ఐజీ సౌమ్యామిశ్రా, సంఘం కార్యదర్శి గోపాల్ రెడ్డిలు వివరించారు. సిబ్బంది జీతభత్యాలు, వారి కుటుంబ సభ్యుల మేలును దృష్టిలో పెట్టుకొని పొదుపు, ఆరోగ్య భద్రత పథకాలను మరింత ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2,441 మందికి వ్యక్తిగత రుణాల కింద రూ.30.06 కోట్లు అందజేసినట్లు వివరించారు. అలాగే 252 మందికి గృహ అవసరాల కోసం రూ.17.23 కోట్లు, పిల్లల ఉన్నత చదువుల కోసం రూ.8.78 కోట్లు అందజేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆరోగ్య భద్రతపై ప్రత్యేకంగా చర్చించారు. వివిధ జిల్లాల ప్రతినిధులు మాట్లాడుతూ... కొన్ని ఆస్పత్రులు పోలీసు సిబ్బందిని పట్టించుకోవడం లేదని, ఎమర్జెన్సీ సమయంలో చేర్చుకోవడం లేదని అన్నారు. భద్రత సంస్థ చైర్మన్, డీజీపీ అనురాగ్‌శర్మ మాట్లాడుతూ పోలీసు సంక్షేమం కోసం నూతన పద్ధతులు అవలంబిస్తామని చెప్పారు. భద్రత, ఆరోగ్య సేవలకు సంబంధించి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామన్నారు. త్వరలో ప్యానల్లో ఉన్న ఆస్పత్రులను పరిశీలిస్తామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో సంస్థ మేనేజింగ్ కమిటీ సభ్యులు వీవీ శ్రీనివాసరావు, బాలనాగదేవి, కల్పనా నాయక్, శివధర్‌రెడ్డిలతో పాటు పోలీసు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి, కరణ్‌కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల కోసమే పోలీసులు : ఎస్పీ
ఆదిలాబాద్: ప్రజల కోసమే పోలీసులున్నారని ప్రజా సంక్షేమమే తమ ఆకాంక్ష అని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. సోమవారం తిర్యాణి మండలంలోని రోంపల్లి, గుండాల, మంగి గ్రామాల్లో పోలీసులు జనమైత్రి గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో రోడ్డు, తాగునీరు, విద్యా, వైద్యం తదితర సౌకర్యాలు ఏర్పడినపుడే గ్రామాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతాయన్నారు. అసాంఘిక శక్తులకు సహకరించి గ్రామాల వెనకబాటు తనానికి కారణం కావద్దన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లకు మంచి భవిష్యత్‌ను చూపించాలని మావోయిస్టుల వైపు అకర్షితులు కాకుండా చూడాలన్నారు. అసాంఘిక శక్తులకు సహకరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మంగి గ్రామంలో సెల్ టవర్, రోడ్డు నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 23 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉండి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని వారు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని వారికి పునరావాసం కల్పించి ప్రభుత్వం ఉపాది కల్పిస్తుందన్నారు. యువకుల కోసం పోటీపరీక్షల గైడెన్సు, పుస్తకాలు శిక్షణ కల్పిస్తామన్నారు. అనంతరం అడిషల్ ఎస్పి పనసారెడ్డి మాట్లాడుతూ, ఖైరిగూడలో బల్లార్షను మావోయిస్టులు పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో కాల్చి చంపారని అతడు ఏడు సంవత్సరాల నుంచే పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడ ని వారి లేఖలో పేర్కొన్నార ని అన్నారు. ఏడేళ్ల కుర్రాడు పోలీస్‌లకు సమాచారం ఇస్తాడా అని ప్రశ్నించారు. రోంపల్లి, మంగి గ్రామాల్లో పోలీ స్ అధికారులు ప్రజలతో కలిసి అల్పాహారం, భోజనం చేశారు. రోంపల్లి నుంచి గుండాలకు కాలినడకన పోలీస్ అధికారులు చేరుకుని అక్కడి ప్రజలతో సమావేశమయ్యారు. బెల్లంçపల్లి డీఎస్పీ రమణారెడ్డి, సీఐ కరుణాకర్, ఎస్సైలు బుద్దేస్వామి, అశోక్ జనమైత్రి గ్రామపోలీస్ అధికారులు కిరణ్, శ్రీనివాస్, మండల వైస్ ఎంపీపీ మెస్రం గణేశ్ పాల్గొన్నారు. -
శాంతి భద్రతలను పరిరక్షించండి : ఎస్పీ
నెల్లూరు: నెల్లూరు నగరంలో శాంతి భధ్రతలను పూర్తిస్థాయిలో పరిరక్షించాలని ఎస్పీ విశాల్‌గున్నీ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం రాత్రి 11 గంటల తర్వాత ప్రాంతంలో ఆయన తన క్యాంపు కార్యాలయంలో నగర డీఎస్పీ జి.వి.రాముడుతో కలిసి నగర పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ, తీసుకొంటున్న చర్యలపై చర్చించారు. అసాంఘీక శక్తులు, ఆకతాయిలపై కఠినంగా వ్యవహరించాలని, నేరాల నియంత్రణకు అవసరమైన అన్నీ చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది అందరూ కలిసికట్టుగా పనిచేసి పోలీస్‌శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. బాలాజీనగర్ ఇన్స్పెక్టర్పై అసహనం..? ఈక్రమంలోనే బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ సీహెచ్ రామారావు వ్యవహారశైలిపై ఎస్పీ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటీవల రామారావు వ్యవహారశైలిపై పలు ఆరోపణలు వెల్తువెతిన్న విషయం తెలిసిందే. ఇన్స్పెక్టర్ సిబ్బంది నడుమ పొరపొచ్చాలు ఏర్పడ్డాయి. ఈవిషయాలన్నీ ఎస్పీ దృష్టికి వెళ్లాయి. దీంతో ఆరోపణలకు దూరంగా ఉంటూ సిబ్బందిని సమన్వయం చేసుకొని విధులు నిర్వహించాలని ఎస్పీ ఆయన్ను ఆదేశించినట్లు సమాచారం. -
నవ్వుతూనే వుండు!
హ్యూమర్ దేవుడికి మనిషంటే చాలా ప్రేమ. అందుకే ఇన్ని కోట్ల జీవరాసుల్లో నవ్వే శక్తిని మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఒక కుక్కకి సంతోషమొస్తే తోకని విసనకర్రలా ఊపు తుందే తప్ప నవ్వలేదు. ఒక పిల్లికి ఆనందమొస్తే కాళ్ల చుట్టూ మియ్యావ్ అని తిరగు తుందే తప్ప పకపక నవ్వ లేదు. తనకున్న శక్తిని మనం గుర్తించలేక, నవ్వలేక, నవ్వు నాలుగు విధాల చేటు అని కూడా సృష్టించాం. మనం పుడుతూనే ఏడుస్తూ ఈ భూమ్మీదికి వస్తాం. అక్కడ మనకు చాయిస్ లేదు. కానీ బతికినంతకాలం నవ్వుతూ బతకొచ్చు. ఇక్కడ చాయిస్సుంది. కానీ చాలామంది ఏడుస్తూ, ఏడిపిస్తూ బతుకుతూ వుంటారు. వీళ్లు కచ్చితంగా నరకానికే పోతారు. నవ్వేవాళ్లు స్వర్గానికి పోతారో లేదో నాకు తెలియదు కానీ, నవ్వుతూ వుంటే దానికి మించిన స్వర్గం ఏముంటుంది? దేవుడికి మనిషంటే చాలా ప్రేమ. అందుకే ఇన్ని కోట్ల జీవరాసుల్లో నవ్వే శక్తిని మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఒక కుక్కకి సంతోషమొస్తే తోకని విసనకర్రలా ఊపుతుందే తప్ప నవ్వలేదు. ఒక పిల్లికి ఆనందమొస్తే కాళ్ల చుట్టూ మియ్యావ్ అని తిరగుతుందే తప్ప పకపక నవ్వలేదు. తనకున్న శక్తిని మనం గుర్తించలేక, నవ్వలేక, నవ్వు నాలుగు విధాల చేటు అని కూడా సృష్టించాం. అన్నిటిని కల్తీ చేసినట్టే మనం నవ్వుని కూడా కల్తీ చేశాం. పసిపాపలు, పరమయోగుల పెదాలపై మెరిసే నవ్వు నిజమైన నవ్వు. మిగతా అంతా ఎంతో కొంత కల్తీనే. తమాషా ఏమంటే అందరూ ఒకేలా ఏడుస్తారు కానీ ఒకేలా నవ్వలేరు. కొందరు పకపక నవ్వితే, మరికొందరు పగలబడి నవ్వుతారు. కొందరు సోడా కొట్టినట్టు ‘స్స్స్’మని నవ్వితే, మరికొందరికి సౌండే రాదు. బాస్ జోక్‌లకి మనకి తెగ నవ్వొస్తుంది. తుపాన్లో చెట్లు వూగినట్టు వూగిపోతూ నవ్వుతాం. ఒక్కోసారి జోక్ మొదలు పెట్టకముందే నవ్వుతాం. ‘ఇప్పుడేమైందంటే’ అనగానే ఓహ్హోహ్హో అని నవ్వేస్తాం. జోక్ బిగినింగే ఇంత హాస్యంగా వుంటే, పూర్తిగా వింటే పొట్ట చెక్కలైపోతుందేమో! మా పెద్దమ్మ ఒకావిడ కేవలం నవ్వుతోనే మా పెద్దనాయన్ని కంట్రోల్ చేసింది. ఆమె ప్రతి నవ్వు వెనక ఒక ఆదేశముండేది. ఆ ఆర్డర్ మా పెద్దనాయనకే అర్థమయ్యేది. లాఫింగ్తోనే లా అండ్ ఆర్డర్. విలన్ల నవ్వు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పాతాళభైరవిలో ఎస్వీఆర్ నవ్వుని ఎన్నాళ్లైనా మర్చిపోలేం. రాజనాల, సత్యనారాయణ నవ్వారంటే ఎవరి కొంపకో ఎసరు పెట్టారని అర్థం. ఇక మన రాజకీయ నాయకుల సంగతి. వాళ్లు ఓట్లు వేసే వరకూ మనల్ని చూసి చిరునవ్వు నవ్వుతారు. గెలిచిన తరువాత మనల్ని అంతకంత ఏడిపిస్తారు. హాస్యనటులు అదృష్టవంతులు. కోట్లాది మందిని నవ్వించడం నిజంగా వాళ్లకు దేవుడిచ్చిన ఒక వరం. చిన్నప్పుడు జానపద సినిమాల్లో ఒక సీన్ తప్పకుండా వుండేది. ఎలుగుబంటి హాస్యనటుణ్ని తరుముతూ ఉండే సీన్. దాన్ని చూసి నేను పడీ పడీ నవ్వేవాణ్ని. జీవితమే ఒక ఎలుగుబంటని, అది మనల్ని తరుముతూ వుంటుందని అప్పుడు, ఆ వయసులో నాకు ఏమాత్రం తెలియదు. తెలిసి వచ్చాక నిజం బోధపడింది. ఎప్పుడైనా కానీ మనం పారిపోతుంటే ఇతరులకి హాస్యం. ఇతరులు పారిపోతుంటే మనకి చెప్పలేనంత హాస్యం. మనం జాగ్రత్తగా గమనించాలే కానీ, జీవితంలో అడుగడుగునా హాస్యం కనిపిస్తుంది. సెలూన్ షాప్‌లో, సిటీ బస్సులో, ఆఫీసుల్లో, అసెంబ్లీలో, సీరియస్ సీరియల్స్‌లో, తెలుగు సినిమాల్లో... అన్ని చోట్లా హాస్యం ఉంటుంది. పండుతుంది. ఈ మధ్య సెలూన్కెళితే ఒక పెద్దమనిషి గడ్డానికి తెల్లటి నురుగు రాశారు. తీరా చూస్తే బ్లేడ్ లేదు. దానికోసం ఒక కుర్రాడెళ్లాడు, తిరిగి రాలేదు. హిమాలయాల్లో సాధువులా ఈయన వెయిటింగ్. ఆయనలో కోపం, నాకు నవ్వు. నవ్వు మంచిదే కానీ ఎప్పుడు పడితే అప్పుడు నవ్వితే మాత్రం కురుక్షేత్రమే. ఒక చోటికి వెళ్లబోయి, ఇంకో బస్సు ఎక్కేస్తారు. సిటీ బస్సులో వీళ్ల హడావుడి చాలా కామన్. పని రానివాళ్లు చాలా సీరియస్‌గా పనిచేస్తుంటారు. ఇది ఆఫీస్ కామెడీ. అలాగే ఏడిపిస్తూ నవ్వించేవాళ్లు, నవ్విస్తూ ఏడిపించేవాళ్లు చాలా తక్కువమంది వుంటారు. వీళ్లు జీవితం తప్ప ఇంకేమీ చదువుకోరు. వీళ్లలో చాప్లిన్ ఒకడు. వానలో నడవడం ఇష్టమంటాడు. వానలో తన కన్నీళ్లు ఇతరులకి కనిపించవట. మనసారా నవ్వేవాడికి ప్రతిరోజూ నవ్వుల దినోత్సవమే. నవ్వనివాడికి ఇలాంటి నవ్వుల దినోత్సవాలు వంద వచ్చినా ప్రయోజనం లేదు. ఈ ప్రపంచంలో అందరూ పోయేవాళ్లే. కానీ నవ్వుతూ బతికినోళ్లు ఎప్పటికీ బతికే వుంటారు. ఏడుస్తూ బతికేవాళ్లు, వుండగనే పోయుంటారు. - జి.ఆర్.మహర్షి -
వీళ్లు..మారరు!
అదుపు తప్పిన శాంతిభద్రతలు పెచ్చుమీరుతున్న నేరాలు పట్టించుకోని పోలీసులు ఎస్పీ ఆదేశిస్తే నాలుగు రోజులు కదలిక..ఆపై షరామామూలే అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో కొందరు.. అత్యాశతో మరికొందరు అనంతపురం: ఇసుక ఉచితమని ప్రభుత్వం ప్రకటించినా అధికార పార్టీ నేతలు మాత్రం భారీగా తవ్వకాలు చేపడుతున్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసినా పట్టించుకోలేదు. వ్యవస్థలోని లోటుపాట్లను ఎత్తిచూపుతూ ‘సాక్షి’ ఈ నెల 24న ‘ఉచితం ఉత్తిదే’ శీర్షికతో కథనం ప్రచురించింది. దీనికి ఎస్పీ రాజశేఖర్‌బాబు స్పందించి వెంటనే రీచ్‌లను తనిఖీ చేయించారు. అక్రమార్కులను అరెస్టు చేసి.. కేసులు నమోదు చేశారు. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ విచ్చలవిడిగా సాగుతోన్న వైనం, పోలీసుల పాత్రను వివరిస్తూ ఈ నెల 27న ‘సాక్షి’లో ‘బెట్టింగ్ హీట్’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. తీవ్రంగా పరిగణించిన ఎస్పీ వెంటనే దాడులకు ఆదేశించారు. పలుచోట్ల అరెస్టులు చేశారు.ఈ రెండు ఉదాహరణలు చాలు పోలీసుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి. ఎస్పీ కన్నెర్ర చేసినప్పుడు మాత్రమే పరిస్థితిలో మార్పు కన్పిస్తోంది. తర్వాతే షరామామూలే. ‘అనంత’ కర్ణాటక సరిహద్దు ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లా. నేరాలు అధికంగా జరిగేందుకు అవకాశాలు ఎక్కువ. ఈ క్రమంలో పోలీసులు నిత్యం అప్రమత్తతతో వ్యవహరించాలి. నేరనియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి. అయితే.. జిల్లాలో పలుచోట్ల ఎస్ఐలు, సీఐల పనితీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నిరోజులూ ఇసుక అక్రమరవాణా పోలీసులకు తెలిసే జరిగిందనే ఆరోపణలున్నాయి. క్రికెట్ బెట్టింగ్, మట్కా, కాల్‌మనీ వ్యవహారాల్లోనూ ఇదే తంతు నడిచింది. పోలీసు అధికారులతో ఎస్పీ సమీక్ష సమావేశాలు నిర్వహించినప్పుడు ‘మీ కనుసన్నల్లో అంతా సవ్యంగా నడుస్తోంద’ని కొందరు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఆ శాఖ వర్గాలే చెబుతున్నాయి. ఘటన జరిగినప్పుడు పత్రికల్లో వార్తలు చూసి ఎస్పీ ప్రశ్నిస్తే...అప్పుడు మాత్రం సీరియస్‌గా స్పందిస్తున్నారు. ఇందుకు ఇటీవల జరిగిన ఘటనలే తార్కాణం. అసలు ‘అనంత’లో క్రికెట్ బెట్టింగ్ లేదని, మట్కాను పూర్తిగా అరికట్టామని, కాల్‌మనీ ఉదంతాలను కూడా పూర్తిగా నివారించామని ఎస్పీకి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పటికీ ఈ తరహా నేరాలు జూలు విదిల్చుతూనే ఉన్నాయి. అధికారపార్టీ నేతల ఒత్తిళ్లూ కారణమే పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వహించకపోవడానికి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు కూడా కారణంగా తెలుస్తోంది. స్టేషన్‌కు 10 ఫిర్యాదులొస్తే కనీసం ఏడింటికి అధికారపార్టీ నేతల నుంచి సిఫార్సులు వస్తున్నాయి. ‘ఫలానా వ్యక్తికి ఫేవర్‌గా చేయి’అని చెబుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ధనార్జనకు అలవాటుపడిన కొందరు పోలీసులు వారి సర్కిల్, స్టేషన్ పరిధిలో పంచాయితీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మచ్చుకు కొన్ని.. ‘అనంత’ ఒకటి, రెండో పట్టణ పోలీసుస్టేషన్ల పరిధిలో మట్కా విచ్చలవిడిగా నడుస్తోంది. ఈ సెంటర్లన్నీ పోలీసులకు తెలిసినా పట్టించుకోవడంలేదు. తాడిపత్రి, కదిరి, గుంతకల్లులోనూ ఇదే పరిస్థితి. అనంత టూటౌన్ పరిధిలో కాల్‌మనీ ఉదంతాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై రోజూ పంచాయితీలు స్టేషన్లో నడుస్తున్నట్లు తెలుస్తోంది.ఈ స్టేషన్‌కు వచ్చే వారి పట్ల కూడా ఓ పోలీసు అమర్యాదగా మాట్లాడుతున్నారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. కొంతకాలం కిందట ఈ పోలీసు తనపై ఇంట్లో అసభ్యంగా ప్రవర్తించారని ఓ మహిళ మీడియా దృష్టికి తెచ్చింది. క్రికెట్ బెట్టింగ్ కూడా ఈ సర్కిల్లోనే ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అనంతలో కాల్‌మనీ బాధితులు స్టేషన్ మెట్లెక్కితే వారించడం, చిన్న పంచాయితీ చేసి పంపడం మినహా బాధితుల పక్షాన కేసులు నమోదు చేయడం లేదు. నగరపాలకసంస్థ పాలకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధి ఇప్పటికీ ‘కాల్‌మనీ’ నడుపుతున్నారు. కానీ ఆయన ఇంట్లో తనిఖీలు చేసి చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. ఇటీవల ‘అనంత’కు చెందిన ఓ వ్యక్తిని బాగేపల్లి సమీపంలో సజీవదహనం చేశారు. కళ్యాణదుర్గం పరిధిలోని పాలవాయి సమీపంలో మరో వ్యక్తిని హత్య చేసి దహనం చేశారు. ఈ రెండు హత్యలకు ఆర్థిక వ్యవహారాలే కారణమని తెలుస్తోంది. ఇలాంటి వివాదాలతోనే ఉరవకొండలోనూ హత్య జరిగింది. ‘అనంత’లో హెరాయిన్ విక్రయాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
అతివకు ‘భరోసా’
బాల బాధితులకూ సమగ్ర ఆసరా అన్ని సేవలూ ఒకే గొడుకు కిందికి హాకా భవన్లో ప్రత్యేక కార్యాలయం త్వరలో అందుబాటులోకి: పోలీసు కమిషనర్ నగరంలోని 60 శాంతిభద్రతల ఠాణాలు, మూడు మహిళా పోలీసుస్టేషన్లకు బాధిత మహిళలు నుంచి ప్రతి రోజూ 50 వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. మైనర్లు, చిన్నపిల్లలపై జరిగే దారుణాలపైనా నిత్యం అనేక ఫిర్యాదులందుతున్నాయి. సిటీబ్యూరో: తీవ్రమైన వేధింపులు, దాడులు ఎదుర్కొన్న మహిళలు, చిన్నారులకు ఊరట లభించాలంటే కేవలం కేసు నమోదు చేస్తే సరిపోదు. దీంతో పాటు వైద్య-న్యాయ సహాయాలు, పునరావాసం, కౌన్సెలింగ్ తదితరాలు ఎంతో అవసరం. ప్రస్తుతం వీటి కోసం బాధితులు పోలీసుల నుంచి స్వచ్ఛంద సంస్థల వరకు అనేక చోట్లకు తిరగాల్సి వస్తోంది. ఇది వారికి ఎంతో ఇబ్బంది కలిగించే అంశం. ఈ సమస్యలకు పరిష్కారంగా నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆలోచన నుంచి పుట్టిందే ‘భరోసా’ కేంద్రం. మహిళా దినోత్సవం నేపథ్యంలో మంగళవారం దీని వివరాలు వెల్లడించిన కొత్వాల్.. ఇందుకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. దేశంలో మరే ఇతర నగరంలోనూ ఈ తరహా సెంటర్ లేదని అధికారులు చెప్తున్నారు. అంతర్జాతీయ హంగులతో... లక్డీకాపూల్‌లో ఉన్న హాకా భవన్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో ‘భరోసా’ రూపుదిద్దుకుంటోంది. ఏడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో తయారవుతున్న ఈ కేంద్రం పరిధిలోకే ‘షీ-టీమ్స్’, ‘చైల్డ్ లైన్’ విభాగాలనూ తీసుకువస్తున్నారు. కమిషనర్ నేతృత్వంలో ఉండే కమిటీ పర్యవేక్షణలో పని చేసే ఈ కేంద్రానికి మహిళా ఏసీపీ ఇన్చార్జ్గా, వివిధ రంగాలకు చెందిన 36 మంది ఉద్యోగులు పని చేస్తుంటారు. వివిధ నేరాల్లో బాధితులైన మహిళలు, యువతులు, బాలికలకు ఈ కేంద్రం సేవలందిస్తుంది. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో పని చేసే ‘భరోసా’లో దాదాపు అంతా మహిళా ఉద్యోగులు, అధికారులే ఉంటారు. కేసు... కౌన్సెలింగ్... సహాయం... కుటుంబం, సమాజం, పని చేసే ప్రాంతాల్లో మానసిక, శారీకర, లైంగిక వేధింపులు, నేరాల బారినపడే అతివలు, నేరాల్లో బాధితులుగా మారే బాలికలు భరోసా కేంద్రాన్ని ఆశ్రయించవచ్చు. దీనికి వచ్చే బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకునే సిబ్బంది అవసరమైన పోలీసుస్టేషన్, విభాగంలో కేసు నమోదు అయ్యేలా చూస్తారు. వైద్య, న్యాయ సహాయాలు అవసరమైన వారికి వాటిని అందిస్తారు. పునరావాసం, కౌన్సెలింగ్ ఇప్పించడంలో కీలకపాత్ర పోషిస్తారు. ఈ సహాయ, సహకారాలు అందుతున్న విధానాన్నీ పర్యవేక్షిస్తారు. వీడియో లింకేజ్ ద్వారా విచారణ... వివిధ రకాలైన నేరాల్లో బాధితులుగా ఉండి, ఈ కేంద్రం ద్వారా సహాయం పొందిన వారు సాక్ష్యం చెప్పడానికి న్యాయస్థానానికి వెళ్లాల్సిన అవసరమూ ఉండదు. న్యాయ సాధికారిక సంస్థతో ఒప్పందం ఉన్న నేపథ్యంలో ఈ కేంద్రంలో ఉండే ప్రత్యేక వీడియో లింకేజ్ రూమ్ నుంచి కోర్టుకు సాక్ష్యం ఇచ్చే సౌలభ్యం కల్పించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, రెవెన్యూ విభాగం, పలు స్వచ్ఛంద సంస్థలకు భాగస్వామ్యం కల్పిస్తూ అవగాహన ఒప్పందాలు చేసుకున్న పోలీసు విభాగం అన్ని సేవల్నీ ఒకే గొడుగు కిందికి తెచ్చింది. కొత్వాల్ కల సాకారం ‘భరోసా లాంటి కేంద్రం ఉండాలనేది నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి కల. ఆయన కృషి ఫలితంగానే సాకారమవుతోంది. స్త్రీ-పురుషులు సమానమనే స్ఫూర్తిని పెంచే ఈ కేంద్రం ఏర్పాటు సుదీర్ఘ ప్రయాణంలో ఓ అడుగు మాత్రమే.’ - అంజనీకుమార్, అదనపు సీపీ (శాంతిభద్రతలు) సహాయంతో పాటు పర్యవేక్షణ ‘భరోసా సెంటర్‌ను ఆశ్రయించిన బాధితులకు తక్షణం సహాయ సహకారాలు అందిస్తాం. దీంతో పాటు వారు జీవితంలో పూర్తిగా స్థిరపడేలా, వారికి అన్ని దశల్లోనూ పూర్తిస్థాయి న్యాయం జరిగేలా పర్యవేక్షణ బాధ్యతల్నీ స్వీకరిస్తాం. షీ-టీమ్స్, చైల్డ్ లైన్ తదితరాలనూ దీని పరిధిలోకే తీసుకువస్తున్నాం.’ - స్వాతి లక్రా, అదనపు సీపీ (నేరాలు) రాష్ట్ర వ్యాప్తంగా అమలు యోచన ‘ఈ తరహా కేంద్రాన్ని ప్రభుత్వం పెలైట్ ప్రాజెక్టుగా నగరంలో ఏర్పాటు చేస్తోంది. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు వారి విధి నిర్వహణనూ పర్యవేక్షిస్తూ విజయవంతం చేస్తాం. ఆపై రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది.’ - డాక్టర్ టి.ప్రభాకరరావు, జేసీపీ (క్రైమ్స్) సుదీర్ఘకాలం కొనసాగేలా ప్రభుత్వ అనుమతితో ఏర్పాటవుతున్న భరోసా కేంద్రం సుదీర్ఘకాలం కొనసాగేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. కేంద్రం నుంచి నిర్భయ ఫండ్ ద్వారా, రాష్ట్రం నుంచి వివిధ పథకాల ద్వారా నిధులు సమకూర్చుకోవడంతో పాటు కార్పొరేట్ సంస్థల సీఎస్సార్ ఫండ్స్, స్వచ్ఛదంగా ముందుకు వచ్చే ఆస్పత్రులు, ఎన్జీఓలను భాగస్వాముల్ని చేశాం. బాధితులకు అన్ని రకాల సహాయసహకారాలు అందడంతో పాటు వారు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉన్న ‘భరోసా’ త్వరలో ప్రారంభమవుతుంది.’ - ఎం.మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ -
పోలీసు అధికారులతో సీఎం భేటీ
సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం పోలీసు అధికారులతో భేటీ అయ్యారు. విజయవాడ లోని క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని శాంతి భద్రతల అంశంపై సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణపై ఐదేళ్ల రికార్డును తయారు చేయాలని అధికారులకు బాబు సూచించారు. -
మాజీలపై నజర్!
నక్సల్స్ కార్యకలాపాల సంగతేంటి? విచారణ చేసి నివేదిక ఇవ్వండి పోలీసులకు జిల్లా ఎస్పీ ఆదేశం మావోయిస్టు, సానుభూతి పరుల కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కరీంనగర్ : 'జిల్లాలో శాంతిభద్రతలను కాపాడటం, నక్సల్స్ ప్రభావం లేకుండా చూడటం... ఇవే నా అత్యంత ప్రాధాన్యత అంశాలు'. ఈ నెల 8న జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మీడియాతో జోయల్ డేవిస్ చేసిన వ్యాఖ్యలివి. పై వ్యాఖ్యలను పరిశీలిస్తే జిల్లాలో అడుగుపెట్టడానికి ముందే పోలీస్ బాస్ తన ప్రాధాన్యతలేమిటనే దానిపై కార్యాచరణ రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే వచ్చీ రాగానే జిల్లాలో నక్సల్స్ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాకు చెందిన వారిలో ఎవరెవరు మావోయిస్టు, జనశక్తి, ఇతర విప్లవ సంస్థల్లో పనిచేస్తున్నారు? వారికి ఎవరెవరు సహకారం అందిస్తున్నారు? వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. దీంతోపాటు ప్రధానంగా గతంలో మావోయిస్టు, జనశక్తి గ్రూపుల్లో పనిచేసి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ నక్సలైట్లపైనా ప్రత్యేక నిఘా పెట్టారు. జిల్లాలో ఎంతమంది మాజీ నక్సలైట్లు ఉన్నారు? వారు ఏయే విప్లవ సంస్థలకు చెందిన వారు? వారిప్పుడు ఏం చేస్తున్నారు? అందులో సెటిల్మెంట్లు, దందాలు చేస్తున్న వాళ్లున్నారా? ఉంటే ఎందరున్నారు? మాజీ నక్సలైట్లలో ఎంతమంది మావోయిస్టులతో ఇంకా సంబంధాలు కొనసాగిస్తున్నారు? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. పైన పేర్కొన్న అంశాలపై లోతుగా విచారణ జరిపి నివేదిక అందజేయాలని కౌంటర్ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, ఐడీ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఎస్పీ ఆదేశాల మేరకు నిఘా అధికారులు లోతు గా విచారణ ప్రారంభించారు. 2000 నుంచి 2014 వరకు పీపుల్స్‌వార్, ప్రజాప్రతిఘటన, జనశక్తి, మావోయిస్టు సహా మొత్తం 11 విప్లవ సంస్థల్లో వివిధ హోదా ల్లో పనిచేసి లొంగిపోయిన వారు ఎంతమంది ఉన్నారనే దానిపై జాబితా సేకరించారు. నాటి నుంచి గత ఏడాది వరకు జిల్లాలో దాదాపు 750 మంది నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసినట్లు గుర్తించారు. ఇందు లో దళ కమిటీ సభ్యుడు మొదలు జిల్లా, జోనల్ కమి టీ సభ్యులు, దళ కమాండర్, కేంద్ర కమిటీ సభ్యుల వరకు వివిధ హోదాల్లో పనిచేసిన వాళ్లూ ఉన్నారు. ఈ మేరకు ఫోన్ నంబర్లు, అడ్రస్‌ల ఆధారంగా వారి నివాస ప్రాంతాలకు వెళ్లి రోజువారీ కార్యకలాపాలపై ఆరా తీసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీ సుల విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు జరిపిన విచారణలో కొందరు సెటిల్మెంట్లు, భూకబ్జా దందాలు కొనసాగిస్తుంటే... మరికొందరు మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. అలాగే తీవ్రవాద కార్యకలాపాలకు దూరం గా ఉంటూ తమ కాళ్లపై తాము నిలబడుతూ కుటుం బాలను పోషిస్తున్న వాళ్లూ కూడా ఉన్నట్టు తెలుస్తోం ది. మొత్తమ్మీద వారం, పది రోజుల్లో విచారణ పూర్తి చేసి పోలీస్ బాస్‌కు నివేదిక అందించే పనిలో పడ్డారు. మావోయిస్టులెందరున్నారు? ప్రస్తుతం మావోయిస్టు నాయకుల్లో జిల్లాకు చెందిన వారెందరున్నారు? వారు ఏయే హోదాల్లో ఉన్నారు? ఇప్పటికీ జిల్లా ప్రజలతో సంబంధాలున్న వారున్నారా? తదితర అంశాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. వారి కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీసులను జిల్లా బాస్ ఆదేశించినట్లు తెలిసింది. ప్రధానంగా ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లాలోని తూర్పు ప్రాంతంలో మావోయిస్టులతోపాటు వారి సానుభూతిపరుల కదలికలపై కన్నేసి ఉంచాలని సూచించినట్లు సమాచారం. -
'పోకిరీల ఆటలు ఇక చెల్లవు'
హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపట్ల కఠినంగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. అరాచక శక్తుల ఆట కట్టిస్తామన్నారు. మహానాడులో మూడో రోజు శాంతి భద్రతలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... హైదరాబాద్ లో శాంతిభద్రతలు పరిరక్షించి మతసామరస్యాన్ని కాపాడింది టీడీపీ అని చెప్పారు. శాంతిభత్రలు నాగరికతకు చిహ్నమన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. పోకిరీల పట్ల కఠినంగా వ్యహరిస్తామన్నారు. ర్యాగింగ్ జోలికి వెళ్లొద్దని, చదువుపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు. -
టార్గెట్ స్టూడెంట్స్!
వర్సిటీ విద్యార్థులపై మావోయిస్టుల కన్ను ఉద్యమంలోకి ఆక ర్షించే యత్నాలు చాపకింద నీరులా పార్టీ సంస్థాగత నిర్మాణం విద్యావంతులను చేర్చుకుంటున్నట్లు నిఘా వర్గాల హెచ్చరిక అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం కరీంనగర్: మావోయిస్టులు చాపకింద నీరులా ఉద్యమాన్ని బలోపేతం చేసుకునే పనిలో ఉన్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం ఏ మాత్రం లేని ప్రాంతాల్లో యువకులను ఉద్యమంలోకి చేర్చుకునే కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిఘా వర్గాల వద్ద కచ్చితమైన సమాచారం ఉంది. రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత కూడా తెలంగాణలో మావోయిస్టుల కార్యకలాపాలు దాదాపు లేనేలేవు. కరీంనగర్ జిల్లా మంథని ప్రాంతంలో నామమాత్రంగా, ఖమ్మం జిల్లా చింతూరు ప్రాంతంలో (ఛత్తీస్‌గఢ్ సరిహద్దు) తప్ప ఎక్కడా వారి కదలికలు లేవు. అయితే పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా ఉద్యమంలోకి విద్యావంతులను ఆకర్షించేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాలు తాజాగా పేర్కొన్నాయి. దీంతో అప్రమత్తమైన ఉత్తర తెలంగాణ పోలీసులు కాలేజీల్లో చదువుకుంటూ అదృశ్యమైన యువకుల జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచిఇప్పటికే కొందరు విద్యార్థులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వారి విచారణలో వెల్లడైంది. ‘విశ్వవిద్యాలయాల్లో మావోయిస్టు కార్యకలాపాలపై మనం నిఘా వేయాలి. ఇప్పటికే కొందరు విద్యార్థులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలి’ అని ఇటీవల శాంతిభద్రతలపై సమీక్షలో ఓ ఎస్పీ పేర్కొన్నట్లు తెలిసింది. ఉద్యమంలో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులతోపాటు, పరిస్థితుల ప్రభావంతో లొంగిపోయిన మాజీలను కూడా తిరిగి చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. హరిభూషణ్ రాకతో... మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ ఎన్నికైనప్పటి నుంచి సంస్థాగత నిర్మాణం జోరందుకున్నట్లు తెలుస్తోంది. దళిత, గిరిజన, బలహీన వర్గాలనే కాకుండా మేధావులు, విద్యావంతులను ఆకర్షించాలని భావిస్తున్న మావోయిస్టు అగ్రనేతలు ఆ దిశగా ప్రయత్నాలను తీవ్రం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే వర్షాకాలంలో దట్టంగా మారే అడవులను అనుకూలంగా మార్చుకుని ప్రజా దర్బారులు నిర్వహించాలని, పలు సంచనాలతో తమ ఉనికి చాటుకోవాలని మావోయిస్టులు ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటి నుంచే రాజకీయ నేతలు, పోలీసు అధికారులు, ప్రభుత్వానికి సంబంధించిన సమగ్ర వివరాలను ఇప్పటినుంచే సేకరిస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లోని అన్ని పోలీస్స్టేషన్ల సిబ్బందిని సర్కారు అప్రమత్తం చేసింది. రాష్ర్ట సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్‌ను కూడా పోలీసులు విస్తృతం చేశారు. మావోయిస్టుల దాడులను ఎదుర్కొనడం, ఆయుధాల వినియోగంపైనా పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. -
విద్రోహుల పీచమణుస్తాం
సీఎం సిద్ధరామయ్య బెంగళూరు : రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పే ర్కొన్నారు. పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా కోరమంగళలోని కేఎస్ఆర్పీ మైదానంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని అన్నారు. ఇందుకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పోలీసుల సంక్షేమం కోసం ప్ర భుత్వం అనేక కార్యక్రమాలను రూపొం దిస్తోం దన్నారు. అందులో భాగంగా వారి పిల్లల కోసం ప్రత్యేకంగా త్వరలో గుల్బర్గా, ఉడిపిల్లో ప్రత్యేక పాఠశాలలను ప్రారంభించనున్నామన్నారు. ఇలాంటి పాఠశాలలు ఇప్పటికే కోరమంగల, మైసూరు, ధార్వాడలో ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పోలీస్ క్యాంటీన్లోని సౌలభ్యాలను విశ్రాంత ఉద్యోగులకూ అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. కాగా, కార్యక్రమం లో భాగంగా పోలీసు శాఖలో ఉత్తమ సేవలు అందించిన 85 మంది సిబ్బందికి ముఖ్యమంత్రి పతకాలను ప్రదానం చేశారు. -
చిత్తూరులో టీడీపీ నేత ఆగడాలు
పిస్తోలు చూపి బెదిరింపులు పోలీసులపైనే తిరుగుబాటు? వెపన్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు చిత్తూరు: ఓ అధికారపార్టీ నేత దూకుడు నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే స్థాయికి చేరింది. బుధవారం రాత్రి ఆ నేత నగరంలోని తన కార్యాలయం వద్ద కొందరు వ్యాపారులను నిర్బంధించి వారికి దేహశుద్ధి చేయడమే కాక పిస్తోలు చూపి బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలంటూ ఢిమాండ్ చేసినట్లు ప్రచారం సాగింది. ఈ నేపధ్యంలో ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నగరంలో పనిచేసే ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ హుటాహుటిన రాత్రి పది గంటల ప్రాంతంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ జనం పోైగె ఉండడాన్ని గమనించిన సీఐ అందరినీ మందలించే ప్రయత్నం చేయగా, అధికార పార్టీ నేత సీఐపై ఎదురుతిరిగినట్లు సమాచారం. తనజోలికొస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అంతటితో వదలక ఒక దశలో దమ్ముంటే తనను అరెస్ట్ చేసి చూడాలని ఆ నేత సీఐ కి సవాల్ విసిరినట్లు సమాచారం. ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్యుద్ధం జరిగింది. ఇంతలో నేత వద్ద ఉన్న పిస్తోల్,మూడు బుల్లెట్లను గమనించిన సీఐ వాటిని స్వాధీనం చేసుకున్నారు. నాగాలాండ్ లెసైన్సు,తమిళనాడు అడ్రస్సుతో పిస్తోలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయి విచారణ జరిపిన తరువాత అది లైసన్సుగల పిప్తోలా ? కాదా అనే విషయాలను వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. పోలీస్ సీరియస్: అధికార పార్టీ నేత వ్యవహారాన్ని జిల్లా పోలీసు అధికారి తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయనకు భయపడిన బాధితులు ఫిర్యాదు ఇచ్చేందుకు జంకుతున్నట్లు సమాచారం. పిస్తోలు, బుల్లెట్లు ఎక్కడ నుంచి వచ్చాయి? అవి లైసన్స్డా?కాదా? ఒకవేళ లైసన్స్ ఉన్నవి అయితే ఎవరి పేరు మీద ఉన్నాయి? అనే వివరాలను పోలీసులు ఇప్పటికే ఆరా తీసే పనిలో పడ్డారు. పిస్తోల్, బుల్లెట్లు స్వాధీనం చేసుకోవడంతో అధికారపార్టీ నేత జిల్లా పోలీసు అధికారిపై హైదరాబాద్ స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. -
ప్రతీది వారికి చెప్పాల్సినవసరం లేదు : పీడీపీ
న్యూఢిల్లీ: శాంతిభద్రతలనేవి రాష్ట్రానికి సంబంధించిన విషయం అని, ప్రతీది ప్రధాని కార్యాలయానికి చెప్పాల్సిన అవసరం లేదని జమ్మూకశ్మీర్‌లోని అధికార పార్టీ పీడీపీ పేర్కొంది. ప్రత్యేక కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు, హుర్రియత్ నేత మసరత్ అలాం విడుదలపై అధికార పీడీపీ ఈ మేరకు వివరణ ఇచ్చింది. ఇదే విషయంపై ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభలో వివరణ ఇస్తూ అలాంను పీడీపీ ప్రభుత్వం విడుదల చేసిందని, ఆ విషయంలో కేంద్రాన్ని సంప్రదించలేదని చెప్పారు. జమ్మూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మొత్తం దేశానికి వ్యతిరేకమైన నిర్ణయమని, కేంద్ర ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు పార్లమెంటులో పట్టుబట్టడంతో ప్రధాని ఈ వివరణ ఇచ్చారు. దేశ సమైక్యత తమకు ముఖ్యమని దీనిపై త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో స్పందించిన పీడీపీ ప్రధాని వ్యాఖ్యలకు భిన్నంగా స్పందించింది. జమ్మూకశ్మీర్‌లో బీజేపీ-పీడీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
‘పోలీసు స్కాన్’
ఖాకీల పనితీరుకు ప్రజల మార్కులు లా అండ్ ఆర్డర్‌కు 42 శాతం స్పెషల్ బ్రాంచ్‌కు 70 శాతం మొదటి స్థానంలో కాలాపత్తర్ చివరి స్థానంలో మాదన్నపేట ఠాణా సిటీబ్యూరో: పోలీసుల పనితీరుకు నగర ప్రజలు ఇచ్చిన మార్కుల ఫలితాలను పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి మూల్యాంకనం చేస్తున్నారు. ప్రజలకు ఉత్తమ సేవలందించడంలో ముందు వరుసలో ఉన్న ఠాణాలతో పాటు పూర్తిగా వెనకబడిపోయిన ఠాణాలను సైతం ఆయన గుర్తించారు. పనితీరు సరిగా లేని ఠాణా సిబ్బందిని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. రాబోయే రోజుల్లో పనితీరును మెరుగుపర్చుకుని ప్రజలతో శభాష్ అనిపించుకోవాలని లేకుంటే బదిలీ వేటు పడుతుందని పేర్కొన్నారు. గతడాది ఆగస్టు 25 నుంచి ప్రత్యేక కాల్ సెంటర్ ద్వారా బాధితులు, ఫిర్యాదుదారులకు నేరుగా ఫోన్ చేసి పోలీసుల పనితీరుపై ఆరా తీయడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఆరు నెలల పాటు సాగిన ఈ వ్యవహారంలో మూడు నెలలకు ఒకసారి ఠాణాల గ్రేడింగ్‌ను తీశారు. ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు శాంతి భద్రతల విభాగం పోలీసుల సేవలకు 42 శాతం సంతృప్తి వ్యక్తం చేయగా, స్పెషల్ బ్రాంచ్ విభాగం పనితీరుపై మాత్రం 70 శాతం మార్కులు వేశారు నగర పౌరులు. ప్రజలకు మేలైన సేవలందించడంలో మొదటి స్థానంలో సౌత్‌జోన్‌లోని కాలాపత్తర్ పోలీసు స్టేషన్ ఉండగా, చివరి స్థానాన్ని మాదన్నపేట దక్కించుకుంది. ఆరా తీసి మార్కులు... కాల్సెంటర్లో ప్రైవేటు వ్యక్తులుంటారు. వీరు బాధితులు/ఫిర్యాదుదారులకు నేరుగా ఫోన్ చేసి ‘‘ ఫిర్యాదు రాసేందుకు రాణాలో రిసెప్షనిస్టు సహకరించారా? లేదా?, ఫిర్యాదు స్వీకరించే సమయంలో పోలీసులు ఎలా వ్యవహరించారు, డబ్బు డిమాండ్ చేశారా, ఎఫ్ఐఆర్ నమోదు చేశారా, నిందితులను అరెస్టు చేశారా’’ అని అడుగుతారు. ఇలా సేకరించిన వివరాలతో పోలీసుల పని తీరుపై మూడు నెలలకు ఒకసారి ఠాణాలకు గ్రేడింగ్ ఇస్తారు. మొదటి మూడు నెలల్లో ఠాణాలకు సగటున 46 శాతం మార్కులు రాగా, రెండో దశలో 42 శాతం మార్కులు వచ్చాయి. మొదటి మూడు స్థానాలు... మొదటి దశ ఫలితాల్లో మొదటిస్థానంలో గోపాలపురం, రెండో స్థానంలో కాలాపత్తర్, ఎస్ఆర్నగర్, మూడో స్థానంలో తిరుమలగిరి ఠాణాలు వచ్చాయి. ఇక రెండో దశ ఫలితాల్లో మొదటిస్థానంలో కాలాపత్తర్, రెండో స్థానంలో కంచన్‌బాగ్, ఆసిఫ్‌నగర్, మూడో స్థానంలో బొల్లారం ఉంది. చివరి మూడో స్థానంలో... మొదటి దశ ఫలితాల్లో చివరి స్థానంలో 5 శాతంతో బేగంపేట మహిళా పీఎస్, 31 శాతంతో చంద్రాయణగుట్ట, 32 శాతంతో రెయిన్‌బజార్ ఉంది. రెండో దశ ఫలితాల్లో 31 శాతంతో మాదన్నపేట, 33 శాతంతో మలక్‌పేట, ఫలక్‌నుమా, 34 శాతంలో చాదర్‌ఘాట్ ఠాణాలు చివరి స్థానాల్లో నిలిచాయి. ఎస్బీపై 70 శాతం సంతృప్తి... స్పెషల్ బ్రాంచ్ విభాగం పోలీసు సేవలపై 70 శాతం ప్రజలు తమ సంతృప్తిని వ్యక్తపరిచారు. మొదటి దశలో ఇది కేవలం 42 శాతం మాత్రమే ఉండే. రెండో దశకు వచ్చేసరికి 27 శాతాన్ని పెంచుకుంది ఎస్బీ. రెండో దశలో 1442 మంది పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు కాల్‌సెంటర్ ద్వారా ఫోన్ చేయడంతో ఈ ఫలితాలు ఇలా వచ్చాయి. మొదటి దశలో ఓ అధికారి జీరో శాతం ఉండగా రెండో దశకు వచ్చే సరికి 70 శాతం మార్కులను సాధించడం గమనార్హం. ట్రాఫిక్ విభాగంపై కూడా.. ఇప్పటి వరకు శాంతి భద్రతలు, స్పెషల్ బ్రాంచ్ విభాగాలపైనే ఫీడ్‌బ్యాక్ తీసుకున్న నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ట్రాఫిక్ విభాగంపై కూడా దృష్టి సారించారు. ట్రాఫిక్ పోలీసుల పనితీరుపై కాల్‌సెంటర్ నుంచి ఫోన్ చేసే ప్రక్రియ వారం రోజుల క్రితం మొదలైంది. -
లా అండ్ ఆర్డర్లో రాజకీయ జోక్యం
ఆదిలాబాద్ క్రైం : సాధారణంగా లా అండ్ ఆర్డర్ పేరు చెప్పగానే నేరాలు చేసే వారిలో వణుకుపుడుతుంది. నేరం చేయాలన్న ఆలోచన కూడా రాదు. ప్రజాస్వామ్యంలో శాంతిభద్రతలు కాపాడే పోలీసుల చేతుల్లో ఉండాల్సిన లా అండ్ ఆర్డర్ ఇప్పుడు జిల్లాలో కొంత మంది అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్లిపోతోందనే ఆందోళన కలుగుతోంది. శాంతిభద్రతల విషయంలో పక్షపాతం లేకుండా బాధితులకు న్యాయం చేసి.. బాధ్యులకు శిక్ష పడేలా చేయడమే లా అండ్ ఆర్డర్ పని. కానీ.. గతంలో ఎప్పుడూ లేని విధంగా రోజురోజుకూ పోలీసుల కేసుల్లో రాజకీయ జోక్యం పెరిగిపోతోంది. ఒకప్పుడు తప్పు చేసే వారికి పోలీసులంటే భయం ఉండేది. కానీ ప్రస్తుతం తాము ఏ కేసులోనైనా తప్పు చేసినా తమను విడిపించేందకు నాయకులున్నారనే నమ్మకం వారిలో పెరిగిపోయిది. అధికారంలో ఉన్నామనే ఉద్దేశంతో ఒకే వర్గానికి, నేరం చేసిన వారికి మద్దతు తెలిపి పోలీసులపై ఒత్తిడి తేవడం సరైంది కాదని ప్రజలు పేర్కొంటున్నారు. దీంతో ఎదుటి వ్యక్తికి న్యాయం జరుగదు. ప్రస్తుతం జిల్లాలో ఇదే తంతు కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలోనైతే ఇలాంటి సంఘటనలకు అంతులేకుండా పోతోందని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. చోటామోటా నాయకులదే పెత్తనం.. జిల్లాలోని ఏ పోలీసు స్టేషన్లోనైనా ఒక చిన్న కేసు నమోదైతే చాలు.. ఆ వెంటనే సంబంధిత పోలీసు అధికారికి ఫోన్లు వస్తున్నాయి. ఎలాంటికేసైనా సరే అందులో తమవారున్నారని.. వెంటనే విడుదల చేయాలని హెచ్చరించడం పరిపాటి. ఈ విషయంలో ప్రజాప్రతినిధుల కంటే అధికారంలో ఉన్న పార్టీకి చెందిన కొంత మంది చోటామోటా నాయకులే ఎక్కువగా అధికారం చెలాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కటేమిటి.. ట్రాఫిక్, ఆర్టీవో నిబంధనలు పాటించని వాహనదారుడికి జరిమానా వేసినా.. ఘర్షణల్లో తోటి వారిపై దాడి చేసినా.. పేకాట ఆడుతూ దొరికిపోయినా.. అక్రమ మద్యం విక్రయిస్తున్నా.. మరే కేసుల్లోనైనా అందులో ఉండే బాధ్యులు ప్రజాప్రతినిధులకు సంబంధించిన వారుంటే చాలు.. కేసు పక్కతోవ పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. తప్పు తమదేనని తెలిసినా.. కేసులో పేరు ఉండకూడదని పోలీసులకు ఫోన్లు రావడం ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది. సంబంధిత పోలీసు అధికారి కేసు విషయంలో రాజీపడని పక్షంలో అధికారంలో ఉన్నామని కొంత మంది చోట నాయకులు హెచ్చరిస్తుండడం శోచనీయం. చిన్నచిన్న కేసుల్లో జోక్యం చేసుకుంటుండడంతో పోలీసులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎఫ్ఐఆర్లో నమోదైన కేసులను సైతం తీసేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారంటే పరిస్థితి ఎలా తయారైందో చెప్పనక్కర్లేదు. రాజకీయ జోక్యం ఎందుకు..? పోలీసు కేసుల్లో రాజకీయ జోక్యంతో బాధితుడికి న్యాయం జరగకపోగా.. నేరస్థులు కేసు నుంచి తప్పించుకునే ఆస్కారం ఉంటుంది. పోలీసులు మనవారే ఉన్నారనే ధైర్యంతో కొంత మంది నాయకులు అదుపు తప్పి ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్నచిన్న తగదాల్లో జోక్యం చేసుకొని పోలీసు స్టేషన్లకు వచ్చిన వారిని విడిపించేందుకు అధికార పార్టీ నాయకులు కొం దరు ప్రయత్నించడంతో సామాన్యులకు న్యాయం జరగడం లేదు. పోలీసులు సైతం ఇలాంటి కేసుల్లో చేతులె త్తేస్తున్నట్లు తెలుస్తోంది. చట్టాన్ని శాసించి.. చట్టం ఎవరికీ చుట్టం కాదు.. ఇది పోలీసు వ్యవస్థలో ప్రతిఒక్కరూ చెప్పే మాటే. కానీ ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులను బట్టి చూస్తే చట్టం పోలీసుల చేతుల్లోంచి.. రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోతుందేమోననే భయం సామాన్య ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. పోలీసు వ్యవస్థలో చట్టాన్ని శాసించే స్థాయిలో రాజకీయ జోక్యం జరుగుతుండడం బాధాకరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పోలీసు వ్యవస్థలో రాజకీయ జో క్యం లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
ఏపీలో శాంతిభద్రతల సమస్య లేదు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల సమస్య లేదని సీఎం నారా చంద్రబాబు చెప్పారు. 24 గంటల విద్యుత్ సరఫరాకు కేంద్రం ఎంపిక చేసిన మూడు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటని, పెట్టుబడులు పెట్టేవారికి రాష్ట్రం స్వర్గధామంగా ఉందన్నారు. సోమవారం ముంబైలో నిర్వహించిన పారిశ్రామికవేత్తల రౌండ్ టేబుల్ (సిటీ ఇండియా ఇన్వెస్టర్స్) సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రాన్ని లైఫ్ సెన్సైస్, ఆటోమొబైల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, విశాఖను పారిశ్రామిక హబ్‌గా తయారుచేస్తామని చెప్పారు. 2050 నాటికి ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం ఖాయమని పేర్కొన్నారు. డెయిరీ, పౌల్ట్రీ, సిమెంట్, పేపర్ పరిశ్రమలలో ఇప్పటికే ముందున్న ఏపీ.. ఫార్మా, బయోటెక్నాలజీ, మెటలర్జీ, ఎలక్ట్రానిక్స్, రసాయన పరిశ్రమల రంగాలలో దూసుకెళ్లనున్నదని చెప్పారు. ఇండస్ట్రియల్ టౌన్‌షిప్పులు, పెట్రో కెమికల్ కాంప్లెక్సులను అభివృద్ధి చేస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్కులను, అపెరల్ పార్కులను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎలక్ట్రానిక్ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు, పీపీపీ పద్ధతిలో భవిష్యత్తులో పది లక్షల ఎకరాలను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇలావుండగా.. విద్యుత్, సహజవాయువు రంగాలలో అతిపెద్ద కంపెనీగా ఉన్న తమ కంపెనీ ఏపీలో వివిధ రంగాలలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందని బాబుతో భేటీ అయిన సూయజ్ ఎనర్జీ ఇంటర్నేషనల్ కంపెనీ సీఈవో బెర్నెడ్ చెప్పారు. సన్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సుధీర్ వాల్యా కూడా సీఎంతో సమావేశమయ్యారు. రూ.12 వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామన్నారు. సుజ్లాన్, ఆదిత్య బిర్లా గ్రూప్, ఎల్ అండ్ టీ, టాటా ఆపర్చ్యునిటీస్ ఫండ్, బ్లాక్ స్టోన్, ఐడీఎఫ్, ఫిడెలిటీ వరల్డ్ వైడ్, బ్రూక్ ఫీల్డ్, జీఐసీ కంపెనీల ప్రతినిధులు కూడా సీఎంతో భేటీ అయినట్లు ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం వెల్లడించింది. -
కాల్ కలకలం
అనీల్ నగరంలోని ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే గురువారం ఉదయం ఆఫీసుకు బయల్దేరాడు. బైక్ తీస్తుండగా ఆయన సెల్‌ఫోన్ రింగ్ అయ్యింది. చూస్తే.. అపరిచిత నంబరు. లిఫ్ట్ చేయగానే.. హలో.. నమస్కారం.. నగరంలో శాంతిభద్రతలపై మీ అభిప్రాయం ఏమిటీ? భద్రత బాగానే ఉందా.. అయితే, ఆప్షన్-2 నొక్కండి.. లేదంటే ఆప్షన్-7 నొక్కండి.. అంటూ రికార్డెడ్ వాయిస్. అనీల్ తేరుకుని ఏదో ఒక నంబరు ప్రెస్ చేయగానే.. ఉన్నట్టుండి కాల్ కట్ అయ్యింది.గురువారం ఉదయం నగరంలోని చాలామంది ఫోన్లకు 83339 99999 నంబరు నుంచి ఇలాంటి వాయిస్ రికార్డెడ్ కాల్సే వచ్చాయి. ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం ప్రభుత్వం తరఫున కాల్ చేస్తున్నట్టు ఆ కాల్ సారాంశమే అయినా.. ఇందులోని అంతర్థాన్ని పరిశీలిస్తే.. పోలీస్ కమిషనరేట్‌లో శాంతిభద్రతలపై ప్రభుత్వానికి సందేహాలు ఉన్నాయా? ఏజెన్సీల నుంచి తగిన సమాచారం లేదని ప్రభుత్వం భావిస్తోందా? ప్రజల నుంచి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నాల్లో ప్రభుత్వ పెద్దలు ఉన్నారా? అనే అనుమానం రాకమానదు. సిటీ పోలీస్‌పై నిఘానా..? కొద్దిరోజులుగా నగర పోలీసులు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. శాంతిభద్రతల పేరిట తనిఖీలు, ట్రాఫిక్ నియంత్రణ పేరిట జులుం ప్రదర్శించడం, పాత నేరస్తుల కస్టోడియల్ డెత్ వంటి అంశాల్లో వారి వ్యవహారశైలి విమర్శనాత్మకంగా మారింది. అనేక సందర్భాల్లో అధికార పార్టీ నేతల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. పోలీస్‌పరంగా చేపట్టిన కార్యక్రమాలపై విమర్శలు రావడంతో ప్రభుత్వ ఏజెన్సీల నుంచి తగిన సమాచారం రావడం లేదనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. పైకి చెబుతున్నంత గొప్పగా ఇక్కడ శాంతిభద్రతల పరిస్థితి ఏమీ లేదనే అభిప్రాయంతో వీరున్నట్టు చెబుతున్నారు. ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని పోలీసుల పనితీరు, శాంతిభద్రతల అంశాలను నేరుగా తెలుసుకోవాలనే ప్రభుత్వం నిర్ణయించి ఇలాంటి ఫోన్‌కాల్స్ చేస్తోందని సమాచారం. సేఫ్ సిటీ కోసమేనా.. విజయవాడ రాజధాని అయిన క్రమంలో త్వరలో ఇక్కడి నుంచే ప్రభుత్వ పాలన సాగనుంది. వీటన్నింటి దృష్ట్యా నగరంలో శాంతిభద్రతల అంశం ప్రధానంగా మారింది. ఇక్కడికి వచ్చే వారికి భద్రతపై భరోసా కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని నగర పరిస్థితులను అంచనా వేసేందుకే ప్రభుత్వం ఇలాంటి ఫోన్‌కాల్స్‌తో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోందనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది. కమిషనరేట్‌లో చర్చ పోలీస్‌లపై ప్రభుత్వం నేరుగా అభిప్రాయ సేకరణ చేయడంపై నగర పోలీసులు అవాక్కవుతున్నారు. గురువారం ఉదయం పలువురికి వచ్చిన ఫోన్ కాల్స్‌పై పోలీస్ కమిషనరేట్‌లో తీవ్రమైన చర్చ మొదలైంది. ఎవరెవరికి ఫోన్లు వచ్చాయి? వారే ఏ విధమైన సమాచారం ఇచ్చారు?.. వంటి అంశాలను నిఘా వర్గాల ద్వారా పోలీసులు కూడా సేకరిస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనా పోలీసుల పనితీరుపై ప్రభుత్వం ఆరా తీయడం ప్రస్తుతం సిటీలో హాట్ టాపిక్‌గా మారింది. - విజయవాడ సిటీ -
గల్లీగల్లీలో గస్తీ
జహీరాబాద్: గల్లీగల్లీలో గస్తీ నిర్వహిస్తూ.. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. జహీరాబాద్ పట్టణంలో రూ.55 లక్షల వ్యయంతో నిర్మించిన పోలీసు స్టేషన్ నూతన భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. శాంతిభద్రతలు బాగుంటేనే ప్రజలు సుఖశాంతులతో ఉండటంతో పాటు అభివృద్ధి సాధ్యమని తెలిపారు. తెలంగాణలో శాంతిని కాపాడేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ప్రతీ పోలీస్ స్టేషన్‌కు ఒక కొత్త జీపును అందించనున్నట్లు చెప్పారు. రెండు నెలల్లో వీటిని సమకూరుస్తామన్నారు. వీధివీధినా తిరిగేందుకు వీలుగా 1,500 మోటారు సైకిళ్లను అందజేయనున్నట్లు వివరించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరం కోసం 1,600 ఇన్నోవాలు కొనుగోలు చేశామని తెలిపారు. నగరంలో పోలీసు కంట్రోల్ రూం నిర్మాణం కోసం మొదటి విడత కింద రూ.340 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. 8 ఎకరాల స్థలంలో అత్యాధునికంగా 8 అంతస్తుల భవనాన్ని నిర్మించి ఇస్తామన్నారు. 10 జిల్లాలతో దీనిని అనుసంధానం చే స్తామని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలోని ఏ మూలన చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా రెండు నిమిషాల్లో కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రం విడిపోయినా కూడా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణకు ఇబ్బందులు సృష్టించేందుకు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు, నీళ్లను అడ్డుకుంటున్నాడని విమర్శించారు. ఐఏఎస్ అధికారులు కూడా తెలంగాణకు రాకుండా కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. గొలుసు కట్టు చెరువులకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ బడ్జెట్లో 9 వేల చెరువుల పునరుద్ధరణకు నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం బడ్జెట్లో గొలుసుకట్టు చెరువుల అభివృద్ధికి గాను రూ.20వేల కోట్లు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే జె.గీతారెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్, జిల్లా కలెక్టర్ రాహూల్ బొజ్జా, వరంగల్ ఐజీ నవీన్‌చంద్, జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, డీసీసీబీ చైర్మన్ ఎం.జైపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్యచందు పాల్గొన్నారు. -
కేసు పెడితే అంతు చూస్తాం...
* తప్పతాగి డ్రైవింగ్ * పోలీసులపై నైజీరియన్ల దౌర్జన్యం బంజారాహిల్స్: తప్పతాగి బైక్‌లు నడుపుకుంటూ వస్తున్న ఆరుగురు నైజీరియన్లను పోలీసులు పట్టుకోగా... కేసు నమోదు చేస్తే అంతు చూస్తామని వారు పోలీసులను హెచ్చరించడంతో పాటు దుర్భాషలాడారు. ఈ తతంగాన్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై నైజీరియన్లు దాడి చేశారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. వివరాలు... బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద శనివారం రాత్రి బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ‘డ్రంకన్ డ్రైవ్’ తనిఖీలు చేపట్టారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ఆరుగురు నైజీరియన్లు పోలీసులకు పట్టుబడ్డారు. తమపై కేసు నమోదు చేస్తే అంతు చూస్తామని వారు ట్రాఫిక్ పోలీసులపై చిందులు తొక్కి.. బూతులు తిట్టారు. అంతే కాకుండా బైకులు తీసుకొని పరారయ్యేందుకు యత్నించారు. ఈ దృశ్యాలను చిత్రీకరించబోయిన మీడియా ప్రతినిధులను దుర్భాషలాడి దాడి చేశారు. కెమెరాలు ధ్వంసం చేసేందుకు యత్నించారు. ఇంతలో చేరుకున్న లా అండ్ ఆర్డర్ పోలీసులు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా... శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో 20 బైకులు, 18 కార్లను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రెండు రోజుల వ్యవధిలో నిర్వహించిన డ్రంకన్‌డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 76 కేసులు నమోదు చేశారు. -
అవినీతి పాలనొద్దు
మంత్రివర్గ సమావేశాన్ని అడ్డుకునేందుకు బీజేపీ నేతల యత్నం కళంకిత మంత్రులను తొలగించాలని డిమాండ్ = ఆందోళనాకారులను అదుపులోకితీసుకున్న పోలీసులు చెరకు మద్దతు ధరపై రైతుల నిరసన మినీ విధానసౌధఎదుట ధర్నా మద్దతు ధరను ఒకే విడతలో చెల్లించాలంటూ నినాదాలు బెంగళూరు : గుల్బర్గా నగరంలో శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమావేశాన్ని అడ్డుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అవినీతి కూడా పెచ్చుమీరిపోయిందని నినదించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తక్షణమే మంత్రి వర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ మంత్రి మండలి సమావేశం జరుగుతున్న మిని విధానసౌధను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఆందోళనకు దిగిన బీజేపీ నేతలు రేవూనాయక బెళమగి, సునీల్ వల్ల్యాపుర, దత్తాత్రేయ పాటిల్, అమరనాథ పాటిల్, ఎంవై పాటిల్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఇక ఇదే సందర్భంలో రైతులకు చక్కెర కర్మాగారాలు చెల్లించాల్సిన మద్దతు ధరను విడతల వారీగా చెల్లించవచ్చన్న ప్రభుత్వ ఆదేశాలను నిరసిస్తూ స్థానిక చెరకు రైతులు సైతం మంత్రివర్గ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంత్రివర్గ సమావేశం జరుగుతున్న మిని విధానసౌధ ఎదుట ధర్నాకు దిగారు. చెరకు రైతులకు చక్కెర కర్మాగారాలు చెల్లించాల్సిన ధరను ఒకే విడతలో చెల్లించే విధంగా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంలో సిద్ధరామ భూనసూర అనే రైతు తీవ్ర అవ్వస్థతకు గురికావడంతో అతన్ని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.