ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ కడిగిపారేశారు!
ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ కడిగిపారేశారు!
Published Tue, Aug 19 2014 5:37 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడిగిపారేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణించి పోతున్నాయని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతలపై చర్చ జరపడానికి 344 నిబంధన కింద నోటీస్ ఇచ్చామని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కు వైఎస్ జగన్ విజ్క్షప్తి చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ శాంతి భద్రతల అంశంపై బుధవారం చర్చిస్తామని దాటవేసే ధోరణి ప్రదర్శించారు.
స్పీకర్ స్పందనకు సంతృప్తి చెందని వైఎస్ జగన్ .. మనుషుల ప్రాణాలపై చర్చకన్నా మరో అంశమేమైనా ఉందా వైఎస్ జగన్ ప్రశ్నించారు. గత మూడు నెలల తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో జరుగుతున్న రాజకీయపరమైన దాడులు, హత్యలు ప్రజల్ని భయభ్రాంతులకు లోను చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలపై చర్చ కోరడం తప్పా అంటూ సభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. సభలో అన్ని అంశాలను చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకాల్సిన పరిస్థితి ఏర్పడింది అని వైఎస్ జగన్ సభలో అన్నారు. మూడు నెలల తెలుగుదేశం ప్రభుత్వం పాలన జరుగుతున్న హత్యల గురించి చర్చించాల్సిన అవసరముందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
శాంతి భద్రతలపై చర్చించడానికి ఎందుకు పారిపోతున్నారు.. సభలో చర్చ జరగాల్సిందే అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సమయంలో వైఎస్ జగన్ పై అధికారపక్షానికి చెందిన సభ్యులు ఎదురుదాడికి ప్రయత్నించారు. సభలో చర్చను పక్కదారి పట్టించేందుకు అధికార సభ్యులు ప్రయత్నించారు. సభలో ప్రతిపక్ష సభ్యుల డిమాండ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు మంత్రులు, సభ్యులు కూడా కంగారు పడటం కనిపించింది. చర్చ జరుగుతుండగానే చంద్రబాబు, మంత్రులతో గుసగుసలాడటం కనిపించింది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ నిలదీయడంతో చెప్పడానికి జవాబు లేని పరిస్థితి స్పష్టం కనిపించింది. సభలో ప్రభుత్వంపై వైఎస్ జగన్ స్పందించిన తీరుకు ఓదశలో అధికారపక్షం వద్ద సమాధానం దొరక్క సందిగ్ధంలో పడింది. రాష్ట్ర శాంతిభద్రతలపై వైఎస్ జగన్ అనుసరించిన విధానం, వ్యూహం అందర్ని ఆకట్టుకుంది.
Advertisement
Advertisement