'వాళ్లు బతకడానికే భయపడుతున్నారు' | farmers are afraid to live, says errabelli dayakarrao | Sakshi
Sakshi News home page

'వాళ్లు బతకడానికే భయపడుతున్నారు'

Published Tue, Sep 22 2015 7:13 PM | Last Updated on Thu, Jul 11 2019 7:38 PM

'వాళ్లు బతకడానికే భయపడుతున్నారు' - Sakshi

'వాళ్లు బతకడానికే భయపడుతున్నారు'

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సమావేశాలు 15 రోజులుపాటు నిర్వహించాలని రాష్ట్ర టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు డిమాండ్ చేశారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ టీడీపీ తరఫున 21 సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామన్నారు. ఆ సమస్యలు అన్నింటిపైనా కచ్చితంగా సభలో చర్చ జరపాలని ఆయన పేర్కొన్నారు.

రైతు ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్కు... ఎర్రబెల్లి దయాకరరావు బహిరంగ లేఖ రాశారు. రైతు ఆత్మహత్యలపై చేతులు దులుపుకోకుండా రైతు కుటుంబాలను భరోసా కల్పించాలని కోరారు. 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉండటం అవమానకరం అన్నారు. ప్రస్తుతం రైతులు చావుకు భయపడటం లేదని, బతకడానికి భయపడుతున్నారని, ఎర్రబెల్లి తన లేఖలో ప్రస్తావించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement