Assembly Sessions
-
దమ్ముంటే అసెంబ్లీకి రా.. తేల్చుకుందాం
సాక్షి,రంగారెడ్డి జిల్లా: ‘‘కేసీఆర్(KCR) గత 14 నెలలుగా ఫౌమ్‌హౌస్‌లో పడుకొని గంభీరంగా చూస్తున్నానని అంటున్నారు. ఎవరిని చూస్తున్నావు? ఎందుకు చూస్తున్నావు? బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చించేందుకు ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నాం. ఫామ్‌హౌస్‌లో పడుకుని పొంకనాలు కొట్టడం కాదు. దమ్ముంటే అసెంబ్లీకి రా.. అన్ని లెక్కలు తేల్చుకుందాం.’’ అని మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సవాల్ విసిరారు.రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల 150వ వార్షికోత్సవానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫౌమ్‌హౌస్‌లో పడుకొని కొడుకు, అల్లుడిని ఊర్లపైకి ఉసిగొల్పుతున్నడు. జహంగీర్‌పీర్ దర్గా, వేములవాడ రాజన్నలను మోసం చేసిన చరిత్ర నీది. నీ రాక కోసం తెలంగాణ ప్రజలెవరూ ఎదురు చూడటం లేదు. సరిగ్గా నిలబడటం నేర్చుకో.. నువ్వో చెల్లని వెయ్యి రూపాయల నోటువు. ఆ నోటును ఎవరైనా జేబులో పెట్టుకునిపోతే.. జైలుకు వెళ్లడం ఖాయం. కొడితే బలంగా కొడతానని అంటున్నారు. కొట్టడం కాదు ముందు సరిగ్గా నిలబడటం నేర్చుకో. సోషల్ మీడియా టిక్‌టాక్‌లో తనకు ఎక్కువ మార్కులు వచ్చాయని గొప్పలు చెప్పుకొంటున్నారు. సల్మాన్‌ఖాన్‌కు రాఖీ సావంత్‌కు మధ్య పోటీపెడితే ఎక్కువ లైకులు రాఖీ సావంత్‌కే వచ్చాయి. అంత మాత్రన సల్మాన్‌ఖాన్ గొప్పవాడు కాకుండా పోతాడా? ఆయన ఆరోగ్య పరిస్థితి బాగులేదు కేసీఆర్ మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. ఆయన కుటుంబ సభ్యులు యమకింకరులై తిరుగుతున్నారు. ఫామ్‌హౌస్‌లో పడుకుని సోది చెప్పుకోవడం కాదు. అసెంబ్లీకి రా.. అన్ని లెక్కలు వివరిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి పనులను, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను అభినంచడానికి మనసు రాకపోతే ఫామ్‌హౌస్‌లోనే పడుకో. పాలమూరు, జూరాల ఎత్తిపోతల, కోయల్‌సాగర్ కడతానని హామీ ఇచ్చి.. ప్రజలను మోసం చేశావు. నువ్వు ఎన్ని చెప్పినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. ఏడాదిలో ఎన్నో చేశాం.. మా ఏడాది పాలనలో రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. సన్నాలకు రూ.500 బోనస్ ఇచ్చాం. 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే గృహాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు భర్తీ చేశాం. రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేలు ఇస్తున్నాం. భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద నగదు అందజేస్తున్నాం, రైతును రాజును చేస్తున్నాం. ప్రభుత్వ విద్యకు బడ్జెట్ 15 శాతానికి పెంచుతాం దివంగత వైఎస్సార్ పాలనలో జిల్లాకో యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. అనేక ప్రభుత్వ పాఠశాలలను నెలకొల్పాం. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు ఉన్నత చదువులు చదివే అవకాశం కల్పించాం. పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా నిర్విర్యమైంది. ఉస్మానియా, కాకతీయ వర్సిటీలు పునరావాస కేంద్రాలుగా మారాయి. అవి ప్రతిష్టను కోల్పోయే పరిస్థితికి దిగజార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాం. బడ్జెట్లో ఏడు శాతం నిధులు కేటాయించాం. తండాలు, మారుమూల గ్రామాల్లో మూసివేసిన అనేక పాఠశాలలను పునఃప్రారంభించాం. 11 వేల కొత్త ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం. భవిష్యత్తులో విద్యకు బడ్జెట్‌ను 15 శాతానికి పెంచాలని నిర్ణయించాం. స్టాన్‌ఫర్డ్ వర్సిటీతో ఎంఓయూకు యత్నం మహాత్మాగాంధీ నడిపిన యంగ్ ఇండియా పత్రిక స్ఫూర్తితో విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలను అందించేందుకు ‘యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్’ను ఏర్పాటు చేస్తున్నాం. రూ.2,400 కోట్లతో 75 ఐటీఐలను ఆధునీకరించాం. టాటా కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. సింగపూర్ నుంచి నిపుణులను ఇక్కడికి రప్పించి, నిరుద్యోగులకు ఆయా అంశాల్లో శిక్షణ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్ వర్సిటీతో ఎంఓయూ కోసం ప్రయత్నిస్తున్నాం. కేవలం చదువుకున్నవారికే కాదు ఆటల్లో రాణిస్తున్నవారికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగంతోపాటు రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించాం. పెద్దగా చదువు లేని సిరాజుద్దీన్ సహా దీప్తికి గ్రూప్–2 ఉద్యోగం, ఆర్థిక సాయం, ఇంటి స్థలం ఇచ్చి ప్రోత్సహించాం..’’ అని సీఎం రేవంత్ తెలిపారు. ప్రభుత్వ టీచర్లు ఆత్మ విమర్శ చేసుకోవాలి. విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమై ఉంది. రాష్ట్రంలో 12వేల ప్రైవేటు పాఠశాలల్లో 31లక్షల విద్యార్థులు చదువుతుంటే.. 30వేల ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది చదువుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. ప్రభుత్వ విద్య ప్రైవేటుపరం కాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. మట్టిలో మాణిక్యాలను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు స్థానికంగా నివాసం ఉండాలి. విద్యార్థులను ప్రోత్సహించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో డిగ్రీలు, పట్టాలు ఉంటే సరిపోదు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే మార్కులు, డిగ్రీలేకాదు.. సాంకేతిక నైపుణ్యం కూడా తోడవాలి. అప్పుడే కోరిన ఉద్యోగం దొరుకుతుంది. మొగిలిగిద్దకు రూ.16 కోట్లు మొగిలిగిద్ద పాఠశాల తెలంగాణకే వన్నె తెచ్చిందని, ఇక్కడ చదువుకున్న వారిలో ఇద్దరు సీఎంలు, గవర్నర్, మాజీ మంత్రి, ప్రొఫెసర్ సహా అనేక మంది ఉన్నారని సీఎం గుర్తు చేశారు. ఇలాంటి చారిత్రక స్కూలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. మొగిలిగిద్దలో పాఠశాల భవనం, గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్ల కోసం రూ.16 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక్కడి విద్యార్థులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ‘అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్’ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ బహిరంగ సభలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
హరీశ్‌రావు ఏమైనా డిప్యూటీ లీడరా?: కోమటిరెడ్డి
ాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మంత్రి కోమటిరెడ్డి, హరీష్‌రావు మధ్య మరోసారి మాటల తూటాలు పేలాయి. హరీష్‌రావు ఏ హోదాలో ప్రశ్నలు అడుగుతున్నారని కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీంతో, పొలిటికల్ హీట్ నెలకొంది.తెలంగాణలో ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గురువారం సభ ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలోని నీటి సమస్యలు చెప్పారు. అనంతరం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పందిస్తూ.. ఒక మంత్రి లేచి మరో మంత్రిని ప్రశ్నలు అడిగితే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందన్నారు. ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీదే మూసీ పాపం. కాళేశ్వరం జలాలను నల్లగొండకు అందించామన్నారు. దీంతో, కోమటిరెడ్డి.. హరీష్ వ్యాఖ్యలు మండిపడ్డారు. Are You a Deputy Leader or an MLA?-- Harish Rao Questioned by Minister Komatireddyమీకు LP లీడర్ లేడుహరీష్ రావు.. నువ్వు డిప్యూటీ లీడర్ వా..?లేక శాసనసభ్యుడిగా...??అసలు ఏ హోదాలో నువ్వు మైక్ అడుగుతున్నావ్-- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి#TelanganaAssembly •… pic.twitter.com/zjt3SUAHEG— Congress for Telangana (@Congress4TS) December 19, 2024అనంతరం, మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. అసలు హరీష్‌రావు ఎవరు?. డిప్యూటీ లీడర్నా? ఎమ్మెల్యేనా? ఏ హోదాలో మాట్లాడుతున్నారు?. ఆయనకు అడిగే హక్కు లేదు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎక్కడున్నారు? తెలంగాణ ప్రజలను ఆయన అవమానపరచడమే అవుతుంది. నల్గొండ ప్రజల కడుపులో ఆవేదన ఎలా ఉంటుందో చెప్పాను. డబ్బున్న వాళ్లు హైదరాబాద్ వచ్చారు. లేని వాళ్లు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఆయనకు నల్గొండ గురించి, నా గురించి మాట్లాడే హక్కు లేదు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ మూసీని పట్టించుకోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. బుధవారం కూడా సభలో వీరద్దరి మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. అంతకుముందు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్న నిరసన తెలిపారు. రైతు సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బీజేపీ నేతలు ఎడ్ల బండ్లపై అసెంబ్లీకి వచ్చి నిరసన ప్రదర్శన చేపట్టారు. -
ఈ నెల 20 వరకే అసెంబ్లీ సమావేశాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 20వ తేదీ వరకే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో శుక్రవారంతో సమావేశాలు ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. కానీ ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పట్టుబట్టినట్టు సమాచారం. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో స్పష్టత రాలేదు. సోమవారం మధ్యాహ్నం స్పీకర్ ప్రసాద్‌కుమార్ చాంబర్లో బీఏసీ భేటీ జరిగింది.ఇందులో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్.. బీఆర్ఎస్ నుంచి హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ నుంచి పాయల్ శంకర్, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ నిర్వహణ తేదీలు, ఎజెండాపై ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.కనీసం 15 రోజుల పాటు సభ నిర్వహించాలని కోరింది. దీనికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో భేటీ నుంచి వాకౌట్ చేసింది. మరోవైపు సభ నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ కూడా బీఏసీ భేటీ బయటికి వచ్చారు. బీఏసీ భేటీకి సంబంధించిన వివరాలను మంగళవారం ఉదయం అధికారికంగా వెల్లడించే అవకాశముంది. బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదు: హరీశ్‌రావు కనీసం 15 రోజులపాటు అసెంబ్లీ నడపాలని కోరా మని బీఏసీ భేటీ అనంతరం హరీశ్‌రావు చెప్పారు. ‘‘బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదు. బీఏసీలో ఏమీ తేల్చకపోవడంతో, సభ ఎన్ని రోజులు నడుపుతారో చెప్పకపోవడంతో వాకౌట్ చేశాం. లగచర్ల అంశంపై చర్చకు మంగళవారం కూ డా పట్టుబడతాం. ఒకరోజు ప్రభుత్వం, మరోరోజు విపక్షం ప్రతిపాదించే ఎజెండాకు అవకాశం ఇవ్వ డం సాంప్రదాయం. బీఏసీకి కేవలం సూచనలు చేసే అధికారం మాత్రమే ఉందని సీఎం చేసిన వ్యా ఖ్యలపై అభ్యంతరం తెలిపాం.హౌజ్ కమిటీలు ఏ ర్పాటు చేయాలి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)పై బీఆర్ఎస్ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని అడిగాం. బీఏసీలో చర్చించకుండానే సభలో బిల్లులు ప్రవేశపెట్టడం, పుట్టినరోజులు, పెళ్లిళ్లు ఉన్నందుకు సభ వాయిదా వేయడంపై అభ్యంతరం చెప్పాం. ప్రతీరోజూ జీరో అవర్‌లో బీఆర్ఎస్ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా మాట్లాడే సమయం ఇవ్వాలని కోరాం’’అని హరీశ్‌రావు వెల్లడించారు. గత పదేళ్లలో చాయ్ తాగి, బిస్కెట్లు తినే వచ్చారా?: మంత్రి శ్రీధర్‌బాబు ఉమ్మడి ఏపీతోపాటు తెలంగాణ ఏర్పాటైన పదేళ్ల నుంచీ కూడా బీఏసీ సమావేశంలో చర్చించి సభ నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటున్నారని... సభ ఎన్ని రోజులు నడపాలనేది స్పీకర్ నిర్ణయమని శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడారు. ‘‘బీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేయడం ద్వారా బీఆర్ఎస్, ఎంఐఎం స్పీకర్‌ను అవమానించాయి. బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు చెప్పినట్టు గత పదేళ్లలో కూడా బీఏసీ సమావేశంలో చాయ్ తాగి, బిస్కెట్లు తినే వచ్చారా? బీఆర్ఎస్ తీరు సరికాదు..’’అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. -
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్తత
-
‘తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వo’: కేసీఆర్
సాక్షి,ఎర్రవల్లి: తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వo అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ, మండలి సమావేశాలు సోమవారం (డిసెంబర్ 9) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో గజ్వేల్ జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ఎల్పీ ఆదివారం సమావేశమైంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ నేతలకు కీలక సూచనలు జారీ చేశారు. ‘‘అసెంబ్లీ, మండలి సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలి. సమావేశాల్లో అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి. నాడు రైతుబంధు తీసుకొచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలను ప్రజలకు వివరించాలి. బీఆర్ఎస్ ఎల్పీలో తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఘత్వం. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా?. సమస్యలు, పరిష్కారంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. కానీ.. మార్పులు చేసుకుంటూ పోతే ఎలా?’’ అని ప్రశ్నించారు. అందుకే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాల్లో ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఆవశ్యకత, పరిస్థితులను అందరికీ వివరించాలి. నాడు తెలంగాణ తల్లి విగ్రహం నింపిన స్ఫూర్తి గురించి చెప్పాలి. ఫార్మాసిటీ ఎందుకు ప్రతిపాదించింది. పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను వివరించాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. నిర్భంద పాలన గురించి సమావేశాల్లో ప్రస్తావించాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రోటోకాల్ విషయమై నిలదీయాలి. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తిచూపాలి. అసెంబ్లీ సమావేశాల తర్వాత బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం, పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం, కొత్త కమిటీల నియామకం, భారీ బహిరంగ సభ నిర్వహించేలా బీఆర్ఎస్ శాసనసభా పక్షనేతలతో కేసీఆర్ చర్చించారు. చదవండి👉 తెలంగాణలో వీఆర్ఓ, వీఆర్ఏ సేవలు -
9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్ 9న ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నాయి. అనంతరం బీఏసీ సమావేశం జరుగనుంది.ప్రతీ రోజూ ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయని నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ సమావేశాల్లో పలు కీలక చట్టాల ఆమోదానికి రేవంత్ సర్కారు సిద్ధం చేస్తోంది. పంచాయతీ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. నూతన ఆర్ఓఆర్ చట్టం, కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్, పలు కొత్త చట్టాలు అసెంబ్లీలో చర్చించనున్నట్లు తెలిసింది. -
రాజ్యాంగం ప్రకారమే ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాలు రాజ్యాంగం, చట్టప్రకారం మాత్రమే ఉత్తర్వులు ఇవ్వగలవని హైకోర్టు స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ఉత్త ర్వులు ఇవ్వలేమని చెప్పింది. ఈ మేరకు దాఖలైన మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేసింది. ఒక పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన శాసనసభ్యులు వెంటనే మరో పార్టీలోకి ఫిరాయి స్తున్నారని.. ఇలాంటి వారి శాస నసభ సభ్యత్వాన్ని రద్దు చేసేలా ఎన్నికల కమిషన్‌కు ఆదే శాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరుకాకుండా ఆదేశాలి వ్వాలని పాల్ మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీని వాస్‌రావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మె ల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, వారు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా నిషేధం విధించాలని కేఏ పాల్ కోరారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మహిపాల్ రెడ్డి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. స్పీకర్ అధికారాల్లో జోక్యం కోరుతూ వేసిన ఈ పిటిషన్ చెల్లదని, మధ్యంతర ఉత్తర్వులు కోరలేరని అన్నారు. పలువురి అనర్హత పిటిషన్లు స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేసింది. -
డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 9వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పషతనిచ్చారు.ఈ సమావేశాల్లో పలు కీలక చట్టాల ఆమోదానికి రేవంత్ సర్కారు ప్లాన్ చేస్తోంది. ఆర్ఓఆర్ చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించాలని చూస్తోంది. రైతు, కుల గణన సర్వేపై చర్చించే అవకాశం ఉంది.డిసెంబర్ 7వ తేదీతో రేవంత్ సర్కార్ ఏడాది కాలం పూర్తి చేసుకోనుంది. దీంతో మంత్రివర్గ విస్తరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వినిపిస్తోంది. మరోవైపు పంచాయతీ ఎన్నికలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, త్వరలో సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు వెళ్ళక ముందే ఆసరా పెన్షన్, రైతు భరోసా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. -
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-
Video: జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో రచ్చ.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు రసాభాసాగా కొనసాగుతున్నాయి. ఆరేళ్ల తర్వాత సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశాల్లో తొలిరోజైన సోమవారం నుంచే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా పునరుద్దరణ అంశాలపై గందరగోళం నెలకొంది. గురువారం అయిదోరోజు అసెంబ్లీలో ఆర్టికల్ 370పై పెద్ద రచ్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూ సభలో వాగ్వాదానికి దిగారు.అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే, జైల్లో ఉన్న బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ సోదరుడు ఖుర్షీద్ అహ్మద్ షేక్ ఆర్టికల్ 370ను పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేయడంతో సభలో రగడ మొదలైంది. ఈ నిరసన ప్రదర్శనపై సభలో బీజేపీ ప్రతిపక్షనేత సునీల్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పలువురు సభ్యులు గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వెంటనే మార్షల్స్ జోక్యం చేసుకొని గొడవపడుతున్న ఎమ్మెల్యేలను బలవంతంగా దూరం తీసుకెళ్లారు. దీంతో సభ కొద్దిసేపు వాయిదా పడి, తర్వాత మళ్లీ ప్రారంభమైంది. కాగా ఎమ్మెల్యేల ముషియుద్దానికి దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.This is a reminder to BJP, this is not UP, this is Jammu and Kashmir assembly. ANY misadventure will get befitting reply! Kudos to @sajadlone for being the fierce tiger he is and putting these BJP MLA's in their place. DONT REKINDLE OUR MUSCLE MEMORY!!!!! @JKPCOfficial pic.twitter.com/kJpxTK9n59— Munneeb Quurraishi (@Muneeb_Quraishi) November 7, 2024గురువారం సభ ప్రారంభమైన వెంటనే జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను పునరుద్దరించాలని కేంద్రాన్ని కోరుతూ శాససనసభ బుధవారం ఆమోదించిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష బీజేపీ ఆందోళన చేపట్టింది. పార్టీ సభ్యులు తీర్మానం ప్రతులను చించి సభ వెల్ లోకి విసిరారు. ఈ గందరగోళం మధ్య ఎమ్మెల్యే షేక్ ఖుర్షీద్ వెల్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. అసెంబ్లీ మార్షల్స్ అడ్డుకున్నారు. అయితే ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్‌పై స్పీకర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర చీఫ్ రవీందర్ రైనా స్పందిస్తూ.. అధికార ఎన్సీ, కాంగ్రెస్‌లు భారత వ్యతిరేక భావాలను పెంచి పోషిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ కా హాత్ పాకిస్థాన్ కే సాత్, కాంగ్రెస్ కే హాత్ టెర్రరిస్టుల కే సాత్ అంటూ నినాదాలు చేశారు. -
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ తొలిరోజు సమావేశాల్లో గందరగోళం
న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.. ఆరేళ్ల తర్వాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే గందరగోళం నెలకొంది. నేటి సమావేశంలో భాగంగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) ఎమ్మెల్యే వహీద్ పారా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పుల్వామా నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న పారా.. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన స్పీకర్ అబ్దుల్రహీమ్ రాథర్‌కు తీర్మానాన్ని సమర్పించారు. అయిదు రోజుల అసెంబ్లీ సెషన్ ఎజెండాలో ఈ అంశం లేకపోయినప్పటికీ ప్రజల కోరకు మేరకు స్పీకరర్గా తన అధికారాలను ఉపయోగించి దీనిపై చర్చించాలని ఆయన కోరారు.అయితే ఈ తీర్మానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీనిని అనుమతించకూడదని కాషాయ పార్టీకి చెందిన 28 మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా తీర్మానం తీసుకొచ్చినందుకు పారాను సస్పెండ్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే షామ్ లాల్ శర్మ డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ పదేపదే అభ్యర్థించినప్పటికీ వారు తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో కాసేపు అసెంబ్లీలో రగడ చోటుచేసుకుంది.అనంతరం అధికారిక నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన స్పీకర్ రహీమ్ రాథర్ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దు లాంటి తీర్మానాన్ని తాను ఇంకా అంగీకరించలేదని చెప్పారు. ఈ తీర్మానానికి ప్రాధాన్యత లేదని సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా తేల్చిచెప్పారు. సభ ఎలా జరగాలనేది, ఏం చర్చించాలనే ఏ ఒక్క సభ్యులచే నిర్ణయించరాదని అన్నారు. 2019 ఆగస్టు 5న తీసుకున్న ఆర్టికల్ 370ని రద్దు నిర్ణయాన్ని జమ్ముకశ్మీర్ ప్రజలు ఆమోదించడం లేదని అన్నారు. అయితే రాష్ట్ర పునరుద్దరణకు తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా 2019లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. దీంతో, ఆ ప్రాంతం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలని ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ డిమాండ్ చేస్తోంది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ ఇటీవల ఒమర్ మంత్రివర్గం తీర్మానం చేసింది. దానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం కూడా తెలిపారు. ఈ పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించే యోచనలో కేంద్రం ఉందని, ఈమేరకు హామీ లభించిందని ప్రచారం జరుగుతోంది. -
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం
-
దొర పన్నిన కుట్రలో మా అక్కలు బందీ అయ్యారు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలుచేశారు. తనను నమ్ముకున్న అక్కలు (సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను ఉద్ధేశించి)మంత్రులయ్యారని.. వారిని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్ల మాటలు నమ్మవద్దని అక్కలకు చెబుతున్నానని తెలిపారు. వాళ్లను నమ్మిన చెల్లెలు తీహార్ జైలులో ఉందని, సొంత చెల్లినే జైలుకు పంపిన వాళ్లను నమ్మవద్దని సీఎం పేర్కొన్నారు. సొంత చెల్లి జైల్లో ఉంటే దాని గురించి మాట్లాడలేదని, మైక్ ఇస్తే శాపనార్ధాలు, లేకుంటే పోడియం ముందుకు.. వాళ్ల పనే అంత అంటూ మండిపడ్డారు. తనను అయిదేళ్ల పాటు సభలోకి రానివ్వలేదని, వచ్చినా మార్షల్స్‌ను పెట్టి బటయకు గెంటారని గుర్తు చేశారు.చెల్లి జైల్లో ఉంటే బజార్ల రాజకీయాలు చేసే నీచుడిని కాదని సీఎం తెలిపారు. మంత్రి సీతక్కపై అవమానకరమైన పోస్టులు పెడుతున్నారని, ఆదివాసీ ఆడబిడ్డను అవమానించినట్లు కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని కూడా సొంత అక్కల్లాగే భావించానని అన్నారు. అయితే ఒక అక్క నన్ను నడిరోడ్డు మీద వదిలేసి వెళితే.. మరో అక్క కోసం ప్రచారానికి వెళ్తే తనపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. దొర పన్నిన కుట్రలో మా అక్కలు చిక్కుకున్నారన్న సీఎం.. దొర కుట్రలను తెలుసుకుని అక్కలు బయటకు రావాలని సూచించారు.కాగా అసెంబ్లీలో ఆడబిడ్డలను అవమనించేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని బుధవారం మీడియాతో మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. తనను టార్గెట్ చేసిన రేవంత్ ఏ పార్టీ నుంచి వచ్చారని ప్రశ్నించారు. రేవంత్‌ను కాంగ్రెస్‌లోకి తానే ఆహ్వానించానని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లు పార్టీలు మారి రాలేదా? అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. -
కేటీఆర్ Vs సీతక్క.. ఓయూకు ఎందుకు పోలేదు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం నడుస్తోంది. ఉద్యోగాల విషయంలో మంత్రి సీతక్క, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య వాడీవేడి చర్చ నడిచింది. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం ఇస్తే తాను రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ చేశారు.సభలో ఉద్యోగాలపై కేటీఆర్ కామెంట్స్..ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ నేతలు తప్పుడు లెక్కలు చెబుతున్నారు.ఇప్పటికే 34వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పారు.బడ్జెట్ సమావేశాల్లో కూడా ఇదే చెప్పారు.కాంగ్రెస్ నేతలకు ఇదే నేను సవాల్ చేస్తున్నారు.మా ప్రభుత్వంలో ఇచ్చిన నియామకాలకు సంబంధించి కాకుండా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు.మా ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాలను తాము ఇచ్చినట్టు చెప్పుకున్నారు.నేను ఇప్పుడే సవాల్ చేస్తున్నారు.సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి.. నేను ఇప్పుడు నిరుద్యోగుల వద్దకు పోదాం.అశోక్ నగర్, సెంట్రల్ లైబ్రరీ, ఓయూకు వెళ్దాం.ఈ కాంగ్రెస్ పాలనలో ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరుద్యోగులు చెబితే నేను అక్కడే రాజీనామా చేస్తాను.ఏ ఒక్కరు ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు చెప్పినా.. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను.ఇదే సమయంలో సీఎం రేవంత్, భట్టి విక్రమార్కకు లక్ష మందితో పౌర సన్మానం చేస్తాను అంటూ సవాల్ విసిరారు.అలాగే, ఎన్నికల సందర్భంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి.కేటీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్..ఉద్యోగాల విషయంలో కేటీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్..అహనా పెళ్లాంటా అనే సినిమా అందరికీ గుర్తు ఉంటుంది. నటుడు కోటా శ్రీనివాస్ రావు కోడి కథ గుర్తుకు వస్తుంది. ఎన్నికల సమయంలో ఉద్యోగాలు అంటూ ఆశ పెట్టారు. ఎన్నికలు అయిపోగానే మళ్లీ దాని గురించి మాట్లాడరు. మళ్లీ ఎన్నికల అనగానే నోటిఫికేషన్లు అని ఊరించి ఉసూరుమనిపించారు. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులను బీఆర్ఎస్ మోసం చేసింది.ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇంటికో ఉద్యమం అన్నారు.గత పదేళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు.ఉద్యోగాలు ఇవ్వకలేపోగా బీఆర్ఎస్ నేతలు ఓయూకు వెళ్లేందుకు భయపడ్డారు.34వేల ఉద్యోగాలు పదేళ్లలో ఎందుకు ఇవ్వలేకపోయారు.బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో పరీక్షల పేపర్లు లీకయ్యాయి.పేపర్ లీకేజీలతో నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరిగింది.మేము ఇప్పుడే అధికారంలోకి వచ్చాం.తప్పకుండా నిరుద్యోగులకు న్యాయం చేస్తాం. -
అసెంబ్లీలో 19 పద్దులపై చర్చ..
-
తెలంగాణ అసెంబ్లీ: ‘హరీశ్ రావు వాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి’
Updatesతెలంగాణ శాసనసభ సోమవారం ఉదయం 10 గంటలకు వాయిదావ్యవసాయ మోటార్ల దగ్గర మీటర్ల అంశంపై సీఎం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆందోళనస్పీకర్ పోడియం వద్ద నిరసన చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలువ్యవసాయ మీటర్ల అంశంపై మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుఎమ్మెల్యేలు నిరసన చేస్తుండగాని సభను వాయిదా వేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై కొనసాగుతున్న చర్చ.. మైనార్టీలకు మంత్రి వర్గంలో చోటులేదు: హరీశ్ రావుఉద్యోగులకు కొత్త పీఆర్సీలకు అనుగుణంగా కేటాయింపులు లేవుఈ ప్రభుత్వంలో మైనార్టీలకు న్యాయం జరగలేదుబీసీలు 9 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే పెట్టారుఅభయ హస్తం శున్య హస్తంలా మారింది. సభను తప్పుదోవ పట్టించిప్పుడు సరిదిద్దాల్సిన బాధ్యత నాపై ఉంది: సీఎం రేవంత్ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నాం. పూర్తి సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు.విపక్షాలు సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తాం. బడ్జెట్ పై సమగ్ర చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యులకు ఎక్కువ సమయం ఇచ్చాం.అసత్యాలను రికార్డుల నుంచి తొలగించాల్సిన బాధ్యత నాపై ఉంది..కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, విద్యుత్ సంస్థలు మూడు పార్టీలు కలపి 2017లో ఒప్పందం చేసుకున్నారు.మీటర్లు పెడతాం అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందిగృహాలకు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని ఓప్పందంలో బీఆర్ఎస్ స్పష్టంగా పేర్కొందివిద్యుత్ ఒప్పందాలపై హరీష్ రావు వాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలిహరీష్ రావుకు ఆఫ్ నాలెడ్జ్.. పెద్దాయనకు ఫుల్లు నాలెడ్జ్.. ఇలాంటి వారికి మేం ఏం చెప్తాం హైదరాబాద్ సిటీలో ఆటో ఎక్కిన అమ్మాయిని సామూహిక అత్యాచారం చేశారు: హరీశ్రావుశాంతిభద్రతలు రాష్ట్రంలో లోపించాయిఅర్దరాత్రి ఐస్ క్రీం తినాలనుకున్న మంత్రికి.. ఐస్ క్రీం దొరకలేదట10 గంటలకే హైదరాబాద్‌లో షాపులు మూసేస్తున్నారని.. రివ్యూలో సదరు మంత్రి సీఎంకు చెప్పారట ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్న బీఆర్ఎస్ సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరిన మంత్రి శ్రీధర్ బాబునడి రోడ్డుపై మిట్టమధ్యాహ్నం ఇద్దరు అడ్వకేట్లను చంపేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు..హరీష్ రావు మాట్లాడుతుంటె దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది చేత గానమ్మకు మాటలు ఎక్కువ అన్న భట్టి వాఖ్యలు కాంగ్రెస్‌కు వర్తిస్తాయి: హరీశ్ రావుకాంగ్రెస్ ఇస్తా అన్న రెండు లక్షల ఉధ్యోగాలు ఏమయ్యాయిసభలో బీఆర్ఎస్ సభ్యులు ఫ్లకార్డులు ప్రదర్శించడంపై స్పీకర్ అభ్యంతరం. 2020 జులై నెలలో పెన్షన్ ఇవ్వకుండా నెల ఆలస్యం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది.అప్పటి నుంచి నెల ఆలస్యం అవుతూ ఉంది..57 ఏళ్ళకే బీఆర్ఎస్ ప్రభుత్వం పెన్షన్ అన్నారు.. ఎందుకు ఇవ్వలేదు.బీఆర్ఎస్ ప్రభుత్వం లో ఏ రోజు నెల మొదటి వారం లో పెన్షన్ ఇవ్వలేదు.వాళ్లు చేసింది మాత్రమే రైట్ అన్నట్లు హరీష్ రావు మాట్లాడుతున్నారు. మే , జూన్ నెల పెన్షన్ ఇంకా ఇవ్వలేదు: హరీష్ రావునాలుగు వేల పెన్షన్ సరికదా.. రెండు వేల పెన్షన్ టైం కు ఇవ్వడం లేదు మంత్రులపై హరీష్ రావు వాఖ్యలు సరికాదన్న విప్ ఐలయ్యతెలంగాణ మొదటి సీఎం దలితుడే అని పదేళ్లలో ఎందుకు చేయలేదురెవెన్యూ వ్యవస్థ ను బిఆర్ఎస్ నాశనం చేసిందివిఆర్ఎ, వీఆర్వో వ్యవస్థను తొలగించి.. రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించారు కోమటిరెడ్డికి హరీశ్ రావు కౌంటర్కోమటిరెడ్డికి హాఫ్ నాలెడ్జ్ అన్న హరీశ్ రావు.గతంలో డబ్బులిచ్చి టీపీసీసీ తెచ్చుకున్నారని అనేదా? బస్సులు సరిపోక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.బస్సులు లేని 15 వందల గ్రామాలు బస్సులు నడపాలిప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది.మహాలక్ష్మీ పథకాన్ని వెంటనే అమలు చేయాలిమద్దతు ధర సన్నాలకు మాత్రమేనని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రైలు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలితెలంగాణ లో 90 శాతం దొడ్డు వడ్లు పండిస్తారుదొడ్డు రకానికి బోనస్ ఇవ్వాలిగృహజ్యోతి పథకం లో పాక్షికంగా ఇబ్బందులు ఉన్నాయియువ వికాసం పథకంపై బడ్జెట్ లో చర్చే లేదుచేయూత గురించి ప్రభుత్వం మాటైనా మాట్లాడడం లేదు హరీశ్ రావు వద్ద సబ్జెక్ట్ లేదు: మంత్రి కోమటిరెడ్డిఅబద్దాలు, గారడీలు అంటే బీఆర్ఎస్సేహరీష్ రావు వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి.హరీష్ రావు బడ్జెట్ పై కాకుండా రాజకీయాలు సభలో మాట్లాడుతున్నారు. ఉద్యమంలో కేసీఆర్ దళితున్ని సీఎం చేస్తా అన్నారు.దళితున్ని సీఎం చేయకపోతే తలనరుక్కుంటా అన్నారు.బీఆర్ఎస్ పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేదు.బడ్జెట్‌పై చీల్చి చెండాడుతా అన్నారు కేసీఆర్.ఈరోజు ఏం చీల్చుతారో అని నేను అసెంబ్లీకి వచ్చాను కానీ కేసీఆర్ రాలేదు.కేసీఆర్‌కు సభకు రావాలంటే భయం.. అందుకే వీళ్లను పంపాడు.గతంలో హరీశ్ రావు ఒక డమ్మీ మంత్రికేసీఆర్ సభుకు రాలేక హరీశ్‌రావును పంపారు.బీఆర్ఎస్ నేతలు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. 24 గంటల కరెంట్ ఎక్కడిచ్చారో చెప్పాలి మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీ అమలు చేస్తాం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుబీఆర్ఎస్ నాశనం చేసిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాం గత ప్రభుత్వం భూములు అమ్మింది అన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సమాధానం ఇచ్చిన మాజీ మంత్రి హరీష్ రావుసీఎం గత ప్రభుత్వం భూముల అమ్మింది అంటున్నారు.. మరి ఈ బడ్జెట్లో 24 వేల కోట్ల రూపాయలు భూముల అమ్మో తెస్తాం అనడం ఏంటి?మహబూబ్‌నగర్ జిల్లాకు నీళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. కాలేశ్వరం ప్రాజెక్టుపై నేను ఒకే మాటపై ఉన్నాను. అప్పుడైనా ఇప్పుడైనా రూ. 94 వేల కోట్లు ఖర్చు చేశాం అని చెప్పాను.బతుకమ్మ చీరలపై సీఎం వ్యాఖ్యలు సరికాదు వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలి.ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, కాలేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా చర్చ పెడితే అన్నిటికీ సమాధానాలు చెప్తాను.పాలమూరు వెనబాటుకు కాంగ్రెస్సే కారణంమహబూబ్నగర్కు ఐదు మెడికల్ కాలేజీలు ఇచ్చాం.100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. హారీశ్‌రావు వ్యాఖ్యలకు సీఎం రేవత్‌రెడ్డి కౌంటర్గతంలో బతుకున్న చీరలు ఇస్తే.. మహిళలు తగలబెట్టిన పరిస్థితి ఉంది: సీఎం రేవంత్‌రెడ్డితెలంగాణ ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో బతుకుతారు.బతుకమ్మ చీరల విషయంలో అవినీతి జరిగింది.బీఆర్ఎస్ ఆలోచన మారలేదు.. విధానం మారలేదు.బీఆర్ఎస్ తీరు వల్ల కేంద్ర బడ్జెట్లో నిధులు రాలేదు.గొర్రెల పథకంలో 700 కోట్ల స్వాహా చేశారు. వేల కోట్ల విలువైన భూములు అమ్మేశారు.పాలమూరు జిల్లా కేసీఆర్‌కు ఏం అన్యాయం చేసింది? పాలమూరు ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి బీఆర్ఎస్ దుర్మార్గ కారణం కాదా?బీఆర్ఎస్ నేతలు ప్రజలను సభ్యపెట్టాలని చూస్తున్నారు.రంగారెడ్డి జిల్లా, కొడంగల్‌కు గోదావరి నీరు ఇవ్వొద్దని కుట్ర చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు భారీ అవినీతి జరిగిందిపార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు గుండు సున్నా ఇచ్చినా వారి బుద్ధి మారలేదుచేవెళ్ల ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. రంగారెడ్డి జిల్లా ఆస్తులను భూములను అమ్ముకున్నది గత ప్రభుత్వం.మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్లో ప్రజలు బొంద పెట్టారు.బతుకమ్మ చీరలు, కెసిఆర్ కిట్లు, గొర్రెల పంపిణీ పై విచారణకు సిద్ధమా?విచారణకు సిద్ధమైతే సవాళ్లు బీఆర్ఎస్ స్వీకరించాలి? ఆరోగ్య శ్రీ పథకం వైఎస్ఆర్ ప్రవేశపెట్టారు - హరీష్ రావుఫీజు రీయింబర్స్ మెంట్, 108 పథకాలను వైఎస్సార్ ప్రారంభించారువైఎస్ఆర్ పెట్టిన పథకాలను కేసీఆర్ సభలో పొగిడారు మంచి పథకాలు అయిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్, 108 ను పేర్లు మార్చకుండా కేసీఆర్ కొనసాగించారు.ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ తెచ్చిన న్యూట్రిషన్ కిట్‌ను పక్కకు పెట్టింది.ఆరోగ్య శ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచటం సంతోషమేకానీ, వైద్య శాఖ బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తే.. ఇది ఎలా సాధ్యం అవుతుంది? రుణమాఫీ కోసం 31వేల కోట్లు ఖర్చు అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు: హరీష్ రావు బడ్జెట్ లో 26వేల కోట్లు మాత్రమే నిధులు కేటాయింపు జరిగింది.5వేల కోట్ల రూపాయలను కోత విధించారు ఎలా బడ్జెట్ తగ్గింది?రుణమాఫీ కోత విధించారు.. రుణమాఫీ అర్హులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రుణమాఫి విషయంలో చాలా కోతలు పెట్టారు. 31వేల కోట్ల రుణమాఫి ఒకేసారి చేస్తామన్నారు. 31 వేల కోట్ల నుంచి 25 వేల కోట్లకు తగ్గించారు.రాజకీయాలు కోసం పేదల కడుపుకొట్టకండి ఎక్సైజ్ ఆదాయం 7వేల కోట్లు ఎలా పెరుగుతుంది?: హరీష్ రావు తెలంగాణ ప్రజలను మద్యం బానిసలు చేస్తున్నారు అని కాంగ్రెస్ ఆరోపణలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మద్యం పై ఆదాయం పెరుగుతుంది అంటే బిర్ల ధరలు పెంచుతారా?బెల్ట్ షాపులను రాష్ట్ర వ్యాప్తంగా పెంచుతారా? భూములు అమ్మి 10వేల కోట్లు, మరో 14వేల అడిషనల్ రెవెన్యూ మొబలైజేషన్ ద్వారా ఆదాయం అని బడ్జెట్ పెట్టారు ఆదాయ మార్గాలను చెప్పకుండా 24వేల కోట్ల రూపాయలను ఆదాయం అని బడ్జెట్లో చూపించారు.వారసత్వ భూములు ఎలా అమ్ముతారు? అని ఆనాడు నేటి సీఎం రేవంత్ అన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ పాలన ప్రజలను మభ్య పెట్టారు -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కప్రతిపక్షంలో కూడా అలానే భ్రమలు కల్పిస్తున్నారుప్రతిపక్ష నేత ఇవ్వాళ సభకు వస్తారు అనుకున్నాం.బడ్జెట్‌పై ఎల్ఓపీ మాట్లాడుతారు అనుకున్నాం.ఎక్సైజ్ టెండర్లు ముందే ఎందుకు పిలిచారు?టానిక్ లాంటి వారితో కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళనివ్వం.ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకువచ్చారు. మేం అధికారంలోకి వచ్చాకు నెలనెలా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పని మొదలు పెట్టాంసర్కార్ సొమ్ము ప్రజలకు చేరేలా చేశాం మా బడ్జెట్ చూసి హరీశ్ రావుకు కంటగింపుగా ఉంది: మంత్రి భట్టి విక్రమార్కహరీశ్ రావు ఎందుకు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు.హరీశ్‌రావు లేనిది ఉన్నట్లు మాట్లాడుతున్నారు.పూర్తి సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారు.పత్రిపక్ష నేత బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రమే వచ్చారు.ఇవాళ ప్రతిపక్ష నేత సభకు ఎందుకు రాలేదు.పదేళ్లు తెలంగాణను ఆర్థికంగా నాశనం చేశారు.మంత్రి జూపల్లి గల్లీకో బెల్ట్ షాప్ పెడతామని అన్నారా? ఎక్సైజ్ శాఖ పై హరీష్ రావు వ్యాఖ్యలను తప్పుబట్టిన మంత్రి జూపల్లి కృష్ణారావు2014లో పదివేల కోట్ల ఆదాయం ఉండే బీఆర్ఎస్ రాగానే అది 19వేలకు పెరిగింది.అదే విధంగా 2019 నాటికి 19వేల కోట్లు.. గత ఏడాదికి రూ. 35వేల కోట్లు ఎక్సైజ్ నుంచి ఆదాయం వచ్చినట్లు లెక్కలు చెప్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వల్ల రియలేస్టేట్ కుదేలైంది: హరీశ్ రావురాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల తగ్గుతున్నాయి... రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గుతుంది.రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గుతున్నా .. 4 వేల కోట్లు అదనపు ఆదాయం ఎలా తెస్తారు?రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ వ్యాల్యూ పెంచుతారా? రెట్లు పెంచుతారా?7700 కోట్ల రూపాయలు గత ఏడాది కంటే ఎక్కువ ఆదాయం వస్తుందని బడ్జెట్లో పెంచారుమొత్తం ఎక్సైజ్ శాఖ నుంచి గత ఏడాది 25వేల కోట్లు ఆదాయం వస్తె ఇప్పుడు 42వేల కోట్లకు పెంచారు.42వేల కోట్ల ఆదాయం రావాలంటే గల్లీలో బెల్ట్ షాప్ పెట్టాల్సి వస్తది. సభలో హరీష్ రావు స్పీచ్‌కు అడ్డుపడ్డ మంత్రి జూపల్లి కృష్ణారావుజూపల్లి కృష్ణారావు మంత్రిపై మాజీ మంత్రి హరీష్ చురకలుఎవరూ ఆవేశపడకండి.. అన్ని లెక్కలు చెప్తాను, లిక్కర్ లెక్కలు చెప్తా అన్న హరీష్ రావు కాంగ్రెస్ పార్టీకి మమ్మల్ని తిట్టడమే సరిపోతుంది8 నెలల పాలన కాంగ్రెస్ ఏం సాధించింది: హరీశ్ రావుబీఆర్ఎస్ టార్గెట్‌గానే బడ్జెట్ ప్రసంగం ఉంది.ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెబుతోంంది.బడ్జెట్లో వాస్తవాలు విస్మరించారు. గల్లీకో బెల్ట్ షాప్ ఓపెన్ చేశారుమేం అధికారంలోకి వచ్చాక పెన్షన్ రూ. 2 వేలు చేశాం రాష్ట్రంలో దశ, దిశలేని పాలన నడుస్తోంది కరెంట్ అంశంపై కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరిన హరీష్ రావుభట్టి విక్రమార్క, నేను అసెంబ్లీ బయట రోడ్డుపై పదినిమిషాలు ప్రజలను అడుగుదాం- హరీష్ రావుకరెంట్ బీఆర్ఎస్ పాలనలో భగుండేనా?, కాంగ్రెస్ పాలనలో బాగుండేనా? ప్రజలే చెప్తారురాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగా లేదుగ్రామాల్లో విద్యుత్‌పై చర్చకు సిద్దమా? : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుప్రతిపక్ష నేతలు మాట్లాడేటప్పుడు మమ్మల్ని టీవీలో చూపించాలి : హరీష్ రావు.పార్లమెంట్ లో రాహుల్ గాంధీని చూపించడం లేదు అని కోడ్ చేసిన హరీష్ రావు.మమ్ములను సైతం అలా వివక్ష చూపిస్తున్నారు.. మమ్ములను మాట్లాడేటప్పుడు చూపించాలి: హరీష్ రావు హరీష్ రావు పై స్పందించిన స్పీకర్, మంత్రి శ్రీధర్ బాబు.రాహుల్ గాంధీ కంటే పదిరెట్లు ఇక్కడ చూపిస్తాం : శ్రీధర్బాబురాహుల్ గాంధీ బాటలో మేము నడుస్తం - శ్రీధర్బాబుప్రతిపక్ష నాయకులను టీవీలో చూపిస్తున్నారు కదా - స్పీకర్శ్రీధర్ బాబు వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్రాహుల్ గాంధీ బాటలో నడవటం కాదు - ఆయన చెప్పినట్లు ఎమ్మెల్యేలను డిస్క్వాలిపై చేయాలి అని కోరుతున్నాం: హరీష్ రావుతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం బీజేపీ వాయిదా తీర్మానంరాష్ట్రంలో బాలికల మీద పెరుగుతున్న అత్యాచారాలపై వాయిదా తీర్మానం పెట్టిన బీజేపీబీజేపీ తరపున అసెంబ్లీలో మట్లాడనున్న ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ బాబు, రామారావు పటేల్ నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి.శాసన సభలో నేడు క్వశ్చన్ అవర్ రద్దుబడ్జెట్పై సభలో సాధారణ చర్చ జరగనుంది.అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్లుబడ్జెట్ లో హైదరాబాద్ అభివృద్ధి కి 10 వేల కోట్లు కేటాయించిన సీఎంకు , డిప్యూటీ సిఎంకు కృతజ్ఞతలుజీహెఎంసీ, వాటర్ బోర్డు, మెట్రో లకు ప్రభుత్వం ఆర్థిక ఊతం ఇచ్చిందిసికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ కు ఏం తెచ్చారుటూరిజం మంత్రి గా ఉన్నా కిషన్ రెడ్డి చేసిందేమి లేదు.హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నిధులు తెచ్చి కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధి ని నిరూపించుకోవాలికిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయినా రాష్ట్రానికి ఉపయోగం లేదుహైదరాబాద్ అభివృద్ధి కి నిధులు ఇచ్చినందుకా రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్నారాకేంద్ర బడ్జెట్ ప్రిపరేషన్‌కు ముందే రాష్ట్ర అవసరాలను కేంద్ర ప్రభుత్వం కు తెలియజేసాం. అయినా సహకారం లేదు.గంగా ప్రక్షాళనకు బడ్జెట్ కేటాయింపులు చేసిన కేంద్రం, మూసీ అభివృద్ధికి ఎందుకు ఇవ్వరుకారణం లేకుండా కేసీఆర్ నీతి అయోగ్ సమావేశానికి వెల్లలేదుకేంద్ర బడ్జెట్ లో మాకు అన్యాయం జరిగింది.. అందుకే నిరసన తెలియజేయడం కోసమే నీతిఅయోగ్ సమావేశాన్ని బైకాట్ చేస్తున్నాంతమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టకపోవడం వల్ల భారీ నష్టం జరిగిందిగేట్లు తెరవడానికి మీరు పోటుగాళ్ళా?మెడిగడ్డ దగ్గర నీరు పంప్ చేసే అవకాశం లేదని ఎన్డిఎస్ఎ చెప్పిందికేటీఆర్ యువరాజు కాదు, హుకుంలకు.. అల్టిమేటంకు బయపడేది లేదు -
తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నేడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. శాసన సభలో బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగించారు. ఇక, 2024-25 గాను తెలంగాణ బడ్జెట్: రెండు లక్షల 91వేల 191 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం రూ.2.20,945 కోట్లు. మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ఉంది. బడ్జెట్ కేటాయింపులు ఇలా..సాగునీటి పారుదల శాఖకు రూ.26వేల కోట్లు.విద్యాశాఖకు రూ.21,292 కోట్లు.ప్రజాపంపిణీకి రూ.3836 కోట్లుఆరోగ్యశ్రీని రూ.10లక్షలకు పెంచాం.సంక్షేమానికి రూ.40వేల కోట్లు.రోడ్లు, భవనాలకు రూ.5790 కోట్లు.ఐటీ శాఖకు రూ.774 కోట్లు.హార్టీకల్చర్కు రూ.737 కోట్లు.పరిశ్రమల శాఖకు రూ.2762 కోట్లు.ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు.గృహజ్యోతికి రూ.2418 కోట్లు.500 రూపాయల గ్యాస్ సిలిండర్‌కు రూ.723 కోట్లు.అడవులు, పర్యావరణ శాఖకు రూ.1064 కోట్లు.ఎస్టీ సంక్షేమానికి రూ.17056 కోట్లు.ట్రిపుల్ ఆర్ఆర్ఆర్కు రూ.1525 కోట్లు.ఎస్సీ సంక్షేమానికి రూ.33.124 కోట్లుట్రాన్స్కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు.వైదారోగ్య శాఖకు రూ.11468 కోట్లు.ఓఆర్ఆర్కు రూ.200 కోట్లు.ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు.హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌కు రూ.500 కోట్లు.హెచ్ఎండీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు.హోంశాఖకు రూ.9564 కోట్లు.పంచాయతీరాజ్ శాఖకు రూ.29,816 కోట్లు.బీసీ సంక్షేమానికి రూ.9200 కోట్లు.మైనార్టీ శాఖకు రూ.3003 కోట్లు.మెట్రోవాటర్ వర్క్స్ కోసం రూ.3385 కోట్లు.కొత్త ఏర్పాటు చేసిన హైడ్రాకు రూ.200 కోట్లు.మొత్తం హైదరాబాద్ అభివృద్ధికి రూ.10వేల కోట్లు. పశుసంవర్థక శాఖకు రూ.1980 కోట్లు.విద్యాశాఖకు రూ.21,292 కోట్లు.స్త్రీ శిశు సంక్షేమశాఖకు రూ.2736 కోట్లు.ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు.అడవులు, పర్యావరణ శాఖకు రూ.1064 కోట్లు.విద్యుత్ శాఖకు రూ.16,410 కోట్లు.రూ.2లక్షల రుణమాఫీ కోసం రూ.31వేల కోట్లు.ఇందిరా మహిళా శక్తి పథకానికి రూ.50.41 కోట్లు. మహాలక్ష్మి ఉచిత రవాణాకు రూ.723కోట్లు.మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌కు రూ.1500 కోట్లు.ఎస్సీ, ఎస్టీ గృహ లబ్ధిదారులకు రూ.6 లక్షల సాయం. మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్‌పోర్టు సిస్టంకు రూ.50 కోట్లు. మంత్రి భట్టి విక్రమార్క ప్రసంగిస్తూ.. పదేళ్ల అస్తవ్యస్త పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు పది రేట్లు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉద్యోగాలు, నీళ్లు దక్కలేదు. బంగారు తెలంగాణ చేస్తామని ఉత్తరకుమార ప్రగల్బాలు పలికారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైంది. వామనావతారం లెక్క అప్పలు పెరిగాయి. గత ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. కొత్త ఉద్యోగాలు..గత ప్రభుత్వం మాదిరిగా దుబారా ఖర్చు ఆపేసి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం. ఒంటెద్దు పోకడలతో ఆర్ధిక వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అప్పులు పెరగడంతో పాటుగా బిల్లులు బకాయిలు భారీగా పెరిగిపోయాయి. కొత్త ఉద్యోగాలు సృష్టించడం కాదు.. ఉన్న ఉద్యోగాలే ఇవ్వలేదు. దశాబ్ద కాలంలో తెలంగాణ పురోగమించలేదు. జీతాలు, పెన్షన్లు చెల్లింపులు కూడా చేయలేని పరిస్థితి. రాష్ట్రంలో ఏర్పడిన పదేళ్ల తర్వాత వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టాం. నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఎన్నో ఏళ్లు ప్రజలు ఉద్యమం చేశారు.రైతులకు మేలు..ఆయిల్ పామ్ సాగుకు రైతులకు అవసరమైన సాయం అందిస్తాం. రాష్ట్రంలో లక్ష ఎకరాల ఆయిల్ పామ్ సాగును లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు, పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను విస్తరిస్తాం. మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు మెట్రోను విస్తరిస్తాం. ఉచిత బస్సులు పథకం రాష్ట్ర అభివృద్ధి సాయపడుతోంది. అప్పులకు వడ్డీల కోసం రూ.17,729 కోట్లు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా అభివృద్ధిని ఆపలేదు. ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రీమియం అంతా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకు ఇది ఎంతోగానో ఉపయోగపడుతుంది. రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది.ఇందిరమ్మ ఇళ్లు..త్వరలో భూమిలేని రైతు కూలీలకు ఏటా రూ.12వేలు అందిస్తాం. ఏదో గెలవాలని మేం ఎన్నికల హామీలు ఇవ్వలేదు. ఈ ఏడాది మార్చి వరకు 2,26,740 ధరణి అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా మరో 1,22,774 ధరణి దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు 1,79,143 దరఖాస్తులను పరిష్కరించాం. రూ.2లక్షల వరకు రుణం ఉన్న రైతులకు త్వరలో రుణమాఫీ. రైతు భరోసా పథకం కింద ఎకరాకి రూ.15వేలు ఇవ్వాలన్నది మా సంకల్పం. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదలకు రూ.5లక్షల సాయం. ఎస్సీ, ఎస్టీ గృహ లబ్దిదారులకు రూ.6 లక్షల సాయం. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు. రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల 50వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు.డ్వాక్రా మహిళలకు జీవిత బీమాస్వయం సహాయక సంఘాల్లోని 63.86 కోట్ల మంది మహిళా సభ్యులకు జీవిత బీమా. వీరికి రూ.10 లక్షల జీవిత బీమా. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు. గత ఆరు నెల్లలో బకాయిపడిన కస్టమ్ మిల్లర్స్ నుంచి రూ.450 కోట్లు వసూలు చేశాం.గత ప్రభుత్వం రైతుబంధుకు రూ.80వేల కోట్లు ఖర్చు చేసింది. రైతుబంధు ద్వారా అనర్హులకే అధికారంగా లబ్ధి చేకూరింది.తలసరి ఆదాయం ఇలా..తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,47,299. జాతీయ తలసరి ఆదాయంలో పోల్చితే లక్షా 64వేలు అధికం. అత్యధికంగా రంగారెడ్డి తలసరి ఆదాయం రూ.9,46,862. అత్యల్పంగా వికారాబాద్ తలసరి ఆదాయం రూ.1,80,241. తెలంగాణ జీఎస్డీపీ రూ.14,63,963 కోట్లు. గతేదాడితో పోల్చితే 11.9 శాతం జీఎస్డీపీ వృద్ధిరేటు. 2023-24 తెలంగాణ వృద్ధిరేటు 7.4 శాతం. ఇదే సమయంలో జాతీయ వృద్ధి రేటు 7.6 శాతం. హైదరాబాద్‌పై స్పెషల్ ఫోకస్..ఓఆర్ఆర్ పరిధిలో కొత్త వ్యవస్థ ఏర్పాటు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(TCUR) ఏర్పాటు. టీసీయూఆర్ పరిధిలో జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు ఉంటాయి. హైదరాబాద్‌లో విపత్తుల నివారణ, ఆస్తుల పరిరక్షణకు హైడ్రా. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు అధిక ప్రాధాన్యత. మూసీ చుట్టూ రిక్రియేషన్ జోన్లు, పీపుల్స్ ప్లాజాలు, చిల్డ్రన్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్లు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతాం. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మారుస్తాం. డ్రగ్స్ నిర్మూలనకు అవగాహన సదస్సులు. హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లు. టౌన్‌షిప్‌లు అన్ని సౌకర్యాలు ఉండేలా ప్రణాళికలు. వారికి వేల్ఫేర్ బోర్డులు..ఈ సంవత్సరం రంజాన్ పండుగ కోసం రూ.33కోట్లు కేటాయింపు. కల్లు గీత కార్మికులు ప్రమాదాలకు గురికాకుండా కొత్త పరికరాల పంపిణీ. కొత్తగా ముదిరాజ్, యాదవ్, కురుమ, మున్నూరు కాపు, పద్మశాలి, లింగాయత్, గంగపుత్రుల కార్పొరేషన్లు ఏర్పాటు. ఆర్థికంగా వెనుకబడిన కులాల సంక్షేమం కోసం వేల్ఫేర్ బోర్డు ఏర్పాటు. ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా 163 రకాల వ్యాధులను చేర్చాం. నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. తీవ్ర వేసవిలో కూడా నిరంతరాయంగా విద్యుత్‌ను అందించాం. అడవులు, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అర్హులైన వారికి రైతుభరోసా ఇస్తాం. అసెంబ్లీలో రైతుభరోసా విధి విధానాలపై చర్చిస్తాం అని అన్నారు. మరోవైపు.. అసెంబ్లీలో భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. భట్టి ప్రసంగానికి సభలో నిరసన నినాదాలు. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని పార్టీ నేతలు భట్టి వ్యాఖ్యలను ఖండించారు. -
తెలంగాణపై వివక్ష.. కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్ష చూపారంటూ రాష్ట్ర శాసనసభ తీవ్ర అసంతృప్తిని, నిరసనను తెలియజేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్‌కు సవరణలు చేసి తెలంగాణకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బుధవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం ముగిశాక.. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల చూపిన వివక్షపై విస్తృతంగా చర్చించారు. మంత్రి శ్రీధర్‌బాబు చర్చను ప్రారంభించగా.. తర్వాత కేటీఆర్, బీజేపీపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజిద్ హుస్సేన్ (ఎంఐఎం), కూనంనేని సాంబశివరావు (సీపీఐ), వివేక్ వెంకటస్వామి (కాంగ్రెస్) తదితరులు మాట్లాడారు. చివరగా ఈ తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం సభను స్పీకర్ ప్రసాద్‌కుమార్ గురువారానికి వాయిదా వేశారు. అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానం ఇదీ.. ‘‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం.. భారతదేశం అన్ని రాష్ట్రాల సమాఖ్య. అన్ని రాష్ట్రాల సమీకృత, సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఈ ఫెడరల్ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచీ ఇదే ధోరణి కొనసాగుతోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. కానీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ఇది తెలంగాణ ప్రగతిపై తీవ్ర ప్రభావం చూపింది. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి, మంత్రులు పలు దఫాలుగా ప్రధాన మంత్రిని, ఇతర కేంద్ర మంత్రులను కలసి వివిధ విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరటంతోపాటు చట్ట ప్రకారం రావాల్సిన నిధులు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అనేక అభ్యర్థనలు అందించారు. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా.. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల పూర్తిగా వివక్ష చూపింది. తెలంగాణ పట్ల కేంద్రం అనుసరించిన తీరుపై శాసనసభ తీవ్ర అసంతృప్తిని, నిరసనను తెలియజేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడెŠజ్ట్కు సవరణలు చేసి.. తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సభ తీర్మానం చేస్తోంది..’’ -
కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో తీర్మానం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీలోని సభ్యులకు తీర్మానం పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి జరగాలని ఏపీ విభజన చట్టంలో పొందుపర్చారని తెలిపారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టం చేశారని పేర్కొన్నారు. గడిచిన పదేళ్లు ఆ చట్టాలను అమలు చేయలేదని, గత ప్రబుత్వం కేంద్రాన్ని నిలదీయలేదని మండిపడ్డారు.‘మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఢిల్లీకి వెళ్లాం. ప్రధానిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను ప్రస్తావించాం. పెద్దన్న పాత్ర పోషించాలని మోదీని కోరాను. మోదీని పెద్దన్న అని కీర్తిస్తే నాకు వచ్చేది ఏముంది?. రాష్ట్రాలకు పెద్దన్నలగా వ్యవహరించాలని కోరానుఎవరి దగ్గర వంగిపోవడమో, లొంగిపోవడమో చేయలేదు. తెలంగాణపై కేంద్రానిది వివక్ష కాదు కక్ష. కొందరు త్యాగాలు చేశామని చెప్పుకుంటున్నారు . ఎమ్మెల్యే కాకముందు మంత్రిని చేసింది కాంగ్రెస్ కాదా?పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ రూపాయి చెల్లిస్తే.. 45 పైసలు కూడా తిరిగి ఇస్తలేదు. అదే బిహార్ రూపాయి చెల్లిస్తే, కేంద్రం తిరిగి రూ. 7 ఇస్తోంది. గుజరాత్లో మోదీ తన ఎస్టేట్లు అమ్మి మనకు ఏమైనా ఇచ్చారా? తెలంగాణ నుంచి కేంద్రానికి రూ. 3.67 లక్షల కోట్లు వెళ్లాయి. కేంద్రం నుంచి వచ్చింది రూ. 1.68 లక్షల కోట్లు మాత్రమే. అయిదు దక్షిణాది రాష్ట్రాలు రూ. 22.66 లక్షల కోట్ల పన్నులుచ చెల్లించాయి. పదేళ్లలో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చింది కేవలం రూ. 6 లక్షల కోట్లే. యూపీ రూ. 3.47 లక్షల కోట్లు పన్ను చెల్లిస్తే, అక్కడ కేంద్రం రూ. 6.91 లక్షల కోట్లు ఖర్చు చేసింది. దేశాభివృద్దిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది. ఈనెల 27న జరగబోయే నీతి ఆయోగ్ కార్యక్రమాన్ని బహిష్కరించాం. పార్లమెంట్లో ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలి’ అని పేర్కొన్నారు.శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.సీఎం ఏమన్నారో ఆయన మాటల్లో..ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ దేశ అభివృద్ధికి బాటలు వేశారు.వారి స్ఫూర్తితో ఇందిరాగాంధీ ఎన్నో సరళీకృత విధానాలను తీసుకొచ్చారు.దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారు.ఆ తరువాత సోనియాగాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేశారు.తెలంగాణ అభివృద్ధికి కావాల్సినవన్నీ విభజన చట్టంలో పొందుపరిచి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.విభజన హామీలు అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది.రాష్ట్రంలో మేం అధికారంలోకి రాగానే కేంద్ర పెద్దలను కలిసి మా విజ్ఞప్తులు ఇచ్చాము.ఎవరి దయా దాక్షిన్యాలతో నాకు ముఖ్యమంత్రి పదవి రాలేదు..ఎవరినో పెద్దన్న అంటే నాకు ఈ పదవి రాలేదు..రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడు సార్లు ప్రధానిని కలిశా.. 18సార్లు కేంద్ర మంత్రులను కలిశాం.తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం.ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే కలిశాం తప్ప.. ఎవరి దగ్గరో వంగిపోవడానికో.. లొంగిపోవడానికో కాదు...తెలంగాణపై కేంద్రానిది వివిక్ష మాత్రమే కాదు.. కక్ష పూరిత వైఖరి...కొంతమంది త్యాగాలు చేశామని చెప్పుకుంటున్నారు...ఎమ్మెల్యే కాకుండానే కొందరికి మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ అని వాళ్లు గుర్తుంచుకోవాలి.తెలంగాణ ఒక రూపాయి పన్ను చెల్లిస్తే తెలంగాణకు కేంద్రం ఇచ్చేది 43 పైసలే.. బీహార్ కు రూ.7.26 పైసలు.తెలంగాణ నుంచి 3లక్షల కోట్లకుపైగా పన్నుల రూపంలో ఇస్తే... కేంద్రం రాష్ట్రానికి ఇచ్చేది 1లక్షా 68వేల కోట్లు మాత్రమే..మన హక్కులు మనకు ఇవ్వకపోవడం వల్లే ఈ అంశంపై సభలో చర్చించాల్సిన పరిస్థితి.అయిదు దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్నది ఎంత?దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తున్నది రూ.22లక్షల 26 వేల కోట్లుకేంద్రం ఐదు రాష్ట్రాలకు తిరిగి ఇచ్చేది రూ.6లక్షల 42వేల కోట్లు మాత్రమే.యూపీ పన్నుల రూపంలో కేంద్రానికి ఇచ్చేది రూ.3 లక్షల 41వేల కోట్లు మాత్రమే..కానీ యూపీకి కేంద్రం తిరిగి ఇచ్చేది రూ.6 లక్షల 91వేల కోట్లు.ఐదు రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల కంటే యూపీకి చెల్లించేది ఎక్కువ.. ఇదీ కేంద్రం వివక్ష..దేశం 5ట్రిలియన్ ఎకానమీ సాధించాలంటే హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ప్రధానికి స్పష్టంగా చెప్పాం.మూసీ అభివృద్ధికి, మెట్రో విస్తరణకు, ఫార్మా అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరాం.ఐఐఎం, సైనిక్ స్కూల్ ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు.సభలో పార్టీలు, వ్యక్తుల ప్రయోజనాల కోసమే కొంతమంది మాట్లాడటం శోచనీయం.అందరం ఏకతాటిపై ఉంటే కేంద్రం మెడలు వంచి నిధులు సాధించుకోవటం పెద్ద కష్టం కాదు..రాష్ట్రాలకు న్యాయంగా దకాల్సిన వాటా దక్కడంలేదు.కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆఖరు నిముషం వరకు ప్రయత్నం చేశాం.తెలంగాణ హక్కులకు భంగం కలిగించినందుకు, నిధుల కేటాయింపులో జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం. -
TS Assembly: కేటీఆర్ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా సీనియర్ సభ్యుడని, ఆయనకు సభా వ్యవహారాలు తెలుసని అన్నారు. సభా నాయకుడికి అనుభవం లేదని కేటీఆర్ మాట్లాడటం సరికాదని అన్నారు బీజేపీకి కోపం వస్తుందని కేటీఆర్ అసలు విషయాన్ని వదిలేసి అన్నీ మాట్లాడారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే బీఆర్ఎస్కు రాజకీయ ప్రమోజనాలు ముఖ్యమని మండిపడ్డారు.ఏడు మండలాల గురించి మీరు ఏం చేశారని, ఏడు మండలాల విషయం లేకుండానే ఏపీ పునర్విభజన బిల్లు పాస్ అయ్యిందని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. ఢిల్లీలో యుద్ధం చేస్తామన్నారు చేశారా? కనీసం మాట అయినా అడిగారా? అని ప్రశ్నించారు. రూ. 8 వేల కోట్లుఖర్చు చేసినా ఖమ్మం జిల్లాకు నీరు ఇవ్వలేదని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో మూసీ, మెట్రోకు నిధులు ఇవ్వలేదని, తాము అడుగుతన్నవి హక్కుగా రావాల్సిందేనని చెప్పారు.మేం బీజేపీతో కలవడమేంటి?రాజకీయాలు పక్కనపెట్టి సర్కార్‌తో కలిసి రావాలి. ప్రధాని మోదీని మన వాటా అడుగుదాం. ఎందుకు కేంద్రం నుంచి నిధులు రావో చుద్దాం. తెలంగాణకు అన్యాయం జరగడంపై తీర్మానం పెట్టాలి. ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేస్తున్న అన్ని పార్టీల ఆలోచన పరిగణలోకి తీసుకొని రెవల్యూషన్ తీసుకురావాలి. అన్ని పార్టీలతో కలిసి కేంద్రం వద్దకు వెళ్దాం. తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ప్రశ్నిద్దాం. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని పూడ్చడానికి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టింది.చర్చకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరాం.బీజేపీ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుల సహాయం సహకారం మాకు అందరం లేదు అనిపిస్తుంది. ప్రధాన ప్రతిపక్షం అయిన బీఆర్ఎస్ ఈ నష్టం గురించి గట్టిగా వాదిస్తుంది అనుకున్నాం. బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయాలు తప్ప రాబడిల గురించి మాట్లాడటం లేదు. బీజేపీచ బీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాలు కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలి.బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం నుంచి మొండిచేయి జరిగింది. అప్పుడు సభలో అంశం పెట్టి వదిలేశారు.. మేము ఇప్పుడు అట్లా కాకుండా చర్చ చేస్తున్నాం. విభజన చట్టం ద్వారా రావలసిన అంశాలు నిధులు ఈ బడ్జెట్ లో వస్తాయి అని ఆశించాం. జాతీయ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఐటిఐ ఆర్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, అడిగాం ఇవ్వలేదు. ఆనాడు సోనియాగాంధీ తెలంగాణకు అన్యాయం జరగద్దు అని విభజన అంశాల్లో చాలా విషయాలు పొందుపరిచారు. ఆనాడు కాంగ్రెస్ పొందుపరిచిన అంశాలను కూడా ఈరోజు బిజెపి ఇవ్వడం లేదు. మూసి అభివృద్ధి, మెట్రో రైలు అభివృద్ధి, డిఫెన్స్, ఫార్మా హబ్ అడిగాం ఇవ్వలేదు. తెలంగాణ ప్రజలు కేంద్రానికి పనులు పడుతున్నారు. హక్కు ద్వారా రావాల్సిన అంశాలు మాత్రమే అడిగాం. కేంద్ర ప్రభుత్వ ఆలోచనలపై రాష్ట్రాలు పునరాలోచన చేస్తున్నాయి. రాష్ట్రాలు దేశం గురించి ఆలోచిస్తున్నప్పటికీ... దేశం రాష్ట్రాల గురించి ఆలోచన చేయడం లేదు. దేశాన్ని పాలించే బిజెపి రాజకీయ అవసరాల కోసం పనిచేస్తుంది. కేంద్రం నుంచి ఏమైనా నిధులు వస్తాయేమో మన బడ్జెట్ మరింత పెరుగుతుంది అనుకున్నాం. గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిందే ఇప్పుడు కేంద్రం సహాయం చేస్తుంది. ఇప్పుడు కేంద్రం నుంచి ఎలాంటి సహాయం రాలేదు. సింగరేణి విషయంలో కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి వేలం పాట వేసేందుకు కారణం గత ప్రభుత్వమే. బీజేపీ ప్రభుత్వానికి ఐదేళ్లపాటు రాష్ట్ర బీఆర్ఎస్ మద్దతు పలికింది.ఏడు మండలాలు ఏపీకి పోతుంటే గత కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏడు మండలాలు ఏపీకి ధారా దత్తం చేశారు. -
కేంద్రం తెలంగాణకు అన్యాయం చేయలేదు: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: కేంద్రం సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు పక్కదారి పట్టిస్తుందన్నారు బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేయలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ పరిశ్రమలు ఏపీకి తరలి వెళ్ళేవని అన్నారు. కేంద్రం చేసిన పనికి తెలంగాణ కేంద్రానికి పాలాభిషేకం చేయాలని చెప్పారు.విభజన చట్టం హామీల్లో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లేదన్నారు మహేశ్వర్ రెడ్డి. అవకాశం ఉంటేనే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పరిశీలన చేస్తానని విభజన చట్టంలో ఉందన్నారు. ఫీజిబిలిటీ లేదని అధికారులు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో చెప్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 28 వేల కోట్ల ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.‘మొదటినుంచి తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ మెయిన్ విలన్. ఆనాడు తెలంగాణను ఆంధ్రావాలతో విలీనం చేసింది నెహ్రూ. మళ్లీ కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర వాళ్ళతో తెలంగాణను విడదీసింది. విభజన చట్టంలో సరైన అంశాలను చేర్చలేదు అందుకే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఉద్యమంలో వేలమంది అమరులు అయ్యారు. ఉద్యమాన్ని తట్టుకోలేక తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. కేంద్రం అన్యాయం చేసింది అని కాంగ్రెస్ భావిస్తే 8 మంది ఎంపీలు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి.బీఆర్ఎస్ కాళేశ్వరం లక్ష కోట్లతో కట్టి కమిషన్లు తీసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ మూసి నది లక్ష కోట్లతో అభివృద్ధి చేస్తానంటుంది. ఎవరికోసం ఎవరికీ కమిషన్లు ఇవ్వడానికి తీసుకోవడానికి లక్ష కోట్లతో మూసీ నది అభివృద్ధి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలో బీజేపీని భాగస్వామ్యం రమ్మంటున్నారు’ అని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామా సవాళ్లకు కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ముందు బీజేపీకి చెందిన 8 మందినెంపీలు రాజీనామా చేసి తమ దగ్గరికి రావాలని సవాల్ విసిరారు. బీజేపీ ఎంపీలు రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాడాలని తెలిపారు.బీజేపీ వారు తెలంగాణ కోసం ఫైట్ చేయాల్సింది పోయి కాంగ్రెస్ ఎంపీలను రాజీనామా చేయమనడం విడ్డూరంగా ఉందన్నారు -
అయినా బీఆర్ఎస్ మారలేదు: సీఎం రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘‘పంచాయతీలుగా మారిన తండాలకు రోడ్డు మార్గం లేదు. అన్ని తండాలకు మండల కేంద్రం నుంచి బీటీ రోడ్లు వేస్తాం. విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం. .. ఏడు లక్షల ఇళ్లకు గత ప్రభుత్వం తాగునీరు ఇవ్వలేదు. ప్రజలు ఆగ్రహించినా బీఆర్ఎస్ మాత్రం మారలేదు. తప్పులు చేశారు. ప్రజలు శిక్షించారు. అయినా మారలేదు. బీఆర్ఎస్ నేతలకు మంచి బుద్ధి కలగాలని ప్రార్థిస్తున్నాం’’ అని రేవంత్ తెలిపారు. కార్మికులు పక్షాన కొట్లాడే కమ్యూనిస్టులకు మైక్ ఇస్తే తప్పేంటి?. ఎమ్మెల్యే సాంబశివరావుకు మైక్ ఇవ్వటం తప్పా?. స్పీకర్‌పై ఆరోపణలు చేయటం తగదని సీఎం రేవంత్ అన్నారు. -
అసెంబ్లీ ఎదుట పోలీసుల అతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
AP: అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలను ఐదు రోజులు నిర్వహించాలని శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో నిర్ణయించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన సోమవారం అసెంబ్లీలో జరిగిన బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ తరఫున విష్ణుకుమార్‌రాజు పాల్గొన్నారు. మొదటి రోజు గవర్నర్ ప్రసంగంతో సభ వాయిదా పడిన నేపథ్యంలో మిగిలిన నాలుగు రోజులు సభ ఎలా నిర్వహించాలనే దానిపై చర్చించారు. రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి దానిపై చర్చించాలని నిర్ణయించారు. ఆ తర్వాత మూడు రోజులు పలు బిల్లులు ప్రవేశపెట్టాలని, మూడు శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే ప్రతిపాదన ఏదీ ఈ సమావేశంలో చర్చకు రాలేదు. -
ఏపీలో సేవ్ డెమోక్రసీ.. జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ నిరసన (ఫొటోలు)
-
Watch Live: ఏపీ అసెంబ్లీ సమావేశాలు-2024
-
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-
22 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శాసన సభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపించారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి నాలుగు నెలల వ్యయానికి అసెంబ్లీ ఆమోదం పొందింది. ఈ నెలాఖరుతో ఈ గడువు పూర్తి కానుంది. సాధారణంగా అధికారంలోకి రాగానే కొత్త ప్రభుత్వాలు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతాయి. అయితే కూటమి సర్కారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా తప్పించుకునేందుకు పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు సన్నద్ధమైనట్లు స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టగా ఈ నెల 23వ తేదీన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేని అసాధారణ పరిస్థితులేమీ లేవు. పైగా కేంద్రం నుంచి రాబడులు, రాష్ట్ర ఆదాయాలు ఎంతనేవి స్పష్టంగా ఉన్నాయి. కేంద్ర తరహాలో రాష్ట్ర బడ్జెట్లో పన్నులు వేయడాలు లాంటివి ఉండవు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా కాలయాపనకు సిద్ధమైనట్లు వెల్లడవుతోంది. కేటాయింపులు చేయకుండా హామీలకు ఎగనామంగత ప్రభుత్వంపై నిందలు మోపి బురద చల్లేందుకే చంద్రబాబు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎత్తుగడ వేశారనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తం అవుతోంది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే ఎన్నికల హామీలకు కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ నెలకు రూ.నాలుగు వేల చొప్పున ఇస్తానని చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల్లో ప్రకటించారు. ఇప్పుడు ఆ ఊసే మరిచారు. తల్లికి వందనం, దీపం, ఆడబిడ్డ నిధి, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, యువగళం లాంటి పథకాలకు కేటాయింపులు చేయకుండా ఉండేందుకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఎంచుకున్నట్లు స్పష్టం అవుతోంది. మరోవైపు ఎక్సైజ్, ఆర్ధిక, శాంతి భద్రతలపై శ్వేతపత్రాలను అసెంబ్లీ వేదికగా విడుదల చేయడం ద్వారా వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేయడానికి వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. ఐదు రోజులు పాటు సమావేశాలను నిర్వహించాలని, ఈ నెల 25 లేదా 26వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం పొందాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సీసీ కెమెరాలన్నీ పని చేయాలిశాసన సభ సమావేశాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట బందోబస్తు కల్పించాలని స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు, శాసన మండలి అధ్యక్షుడు కె.మోషేన్ రాజు ఆదేశించారు. బందోబస్తు ఏర్పాట్లపై శుక్రవారం అసెంబ్లీ భవనంలో పోలీసు ఉన్నతాధికారులతో వారు చర్చించారు. అన్ని సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ సూచించారు. అసెంబ్లీ గ్యాలరీల్లోకి ప్రవేశించే వారిని పూర్తిగా తనిఖీ చేశాకే అనుమతించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. గుర్తింపు కార్డు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించాలని స్పష్టం చేశారు. ఈసారి 88 మంది కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులు, తొమ్మిది మంది శాసన మండలి సభ్యులు హాజరు కానున్న నేపథ్యంలో వారిని గుర్తించేందుకు ప్రవేశ ద్వారాల వద్ద ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. సమావేశంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, శాంతి భద్రతల ఐజీ శ్రీకాంత్, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్, సచివాలయ చీఫ్ సెక్యూరిటీ అధికారి కె.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-
23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
-
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నేటి నుంచి రెండ్రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 9.46 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయించేందుకు, అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక నిర్వహించేందుకు ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల లైవ్ కవరేజ్‌ను అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ నుంచి మీడియాకు ఇవ్వనున్నట్లు సమాచార శాఖ తెలిపింది. టీడీపీ సీనియర్, ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి సభ్యులచేత ప్రమాణం చేయించనున్నారు. మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యేల అక్షర క్రమం ప్రకారం ప్రమాణ స్వీకారం చేయిస్తారు ప్రొటెం స్పీకర్. స్పీకర్ ఎన్నికకు ఇవాళే ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. -
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-
ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. వైఎస్ జగన్ విస్తృతస్థాయి సమావేశం
-
ఈనెల 21 నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
-
వైట్‌పేపర్ కాదు.. ఫాల్స్ పేపర్
సాక్షి, హైదరాబాద్: ‘మీరు అధికారంలో ఉన్నారు. మా హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై విచారణ జరపండి. తప్పు చేస్తే చర్యలు తీసుకోండి. మేము తప్పు చేయలేదు. భయపడేది లేదు’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సభ్యుడు తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వాన్ని దోషిగా చూపించే ప్రయత్నమే తప్ప, రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రయత్నం చేయడం లేదన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద జరిగిన ఘటన ద్వారా రాజకీయంగా లబ్ధిపొందాలని చేస్తున్న యత్నాన్ని విరమించుకొని, రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని సూచించారు. కేసీఆర్ హయాంలో చేసిన మంచి పనులు కనిపించకుండా చేయడమే లక్ష్యంగా పని చేస్తే అంతిమంగా ప్రజలే నష్టపోతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం సత్యదూరమంటూ అది ‘వైట్‌పేపర్ కాదు.. ఫాల్స్ పేపర్’ అని ఎద్దేవా చేశారు. మిడ్‌మానేరు జలాశయం నిర్మాణం ఉమ్మడి రాష్ట్రంలో పూర్తైందని రుజువు చేస్తే రాజీనామా చేసి మళ్లీ సభలో అడుగుపెట్టనని సవాల్ చేశారు. శనివారం శాసనసభలో ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. హరీశ్‌రావు ప్రసంగం ఆయన మాటల్లోనే... సీడబ్ల్యూసీ సూచనల మేరకే... ‘కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు ఏడేళ్లలో కనీస అనుమతులు తీసుకురాలేదు. అప్పటి ఉమ్మడి రాష్ట్రం, మహారాష్ట్ర, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ప్రాజెక్టుకు అనుమతి రాలేదు. దీనికోసం 2014 వరకు రూ.6,116 కోట్లు ఖర్చు చేసింది. అంతకుముందే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి ఏపీ సీఎంకు ఈ ప్రాజెక్టు సాధ్యం కాదు, చేసే ఖర్చు వృథా అవుతుందని లేఖ రాశారు. అయినా పట్టించుకోలేదు. ఆ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు అనుమతుల కోసం యత్నించినా, మహారాష్ట్ర ఒప్పుకోలేదు. 152 మీటర్ల ఎత్తులో తుమ్మడిహెట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణానికి ఒప్పుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా ఒప్పుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కూడా తుమ్మడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని, జలాశయాల సామర్థ్యం సరిపోదని తెలిపింది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ సూచనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైనింగ్ చేశాం. కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్ సూచనల మేరకు మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. 20 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఆయకట్టు తక్కువ వచ్చిందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. మీరు ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారమే కాళేశ్వరం కింద కొత్త ఆయకట్టు 98,570 ఎకరాలు వచ్చింది. కాళేశ్వరం ద్వారా నిండిన చెరువులు, కుంటలు, స్టేజ్–1, స్టేజ్–2లలో జరిగిన స్థిరీకరణ కలిపి దాదాపు 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లిచ్చాం. ఏ ప్రాజెక్టుకైనా ప్రారంభించిన వెంటనే కొత్త ఆయకట్టు రాదు. ఎస్సారెస్పీ, నాగార్జున సాగర్ ఎడమకాలువ, దేవాదుల, కల్వకుర్తి మొదలైనప్పుడు అన్ని ప్రాజెక్టుల పరిస్థితి ఇదే. శ్వేతపత్రంలో అబద్ధాలనే పొందుపరిచారు. మిడ్ మానేర్‌కు రూ. 106 కోట్లు ఖర్చు చేస్తే, మేమొచ్చాక రూ.775 కోట్లు ఇచ్చాం. మేమే పూర్తి చేసి నీళ్లిచ్చాం. రాయలసీమ లిఫ్ట్ విషయంలో మేము కేంద్రానికి ఫిర్యాదు చేయలేదన్నారు... అది తప్పు. కేఆర్ఎంబీకి అప్పగించాలని గెజిట్ ఇస్తే మేము సవాల్ చేయలేదని చెప్పడం కూడా తప్పే. మేము దీన్ని వ్యతిరేకిస్తూ అపెక్స్ కౌన్సిల్‌కు రిఫర్ చేయాలని చెప్పాం. కేఅర్ఎంబీకి అప్పగించింది మేం కాదు. మేడిగడ్డను పునరుద్ధరించి నీళ్లివ్వండి మేడిగడ్డ బ్యారేజ్‌ను పునరుద్ధరించకుండా సాగదీస్తున్నారు. మొత్తం కూలిపోతే రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తున్నట్లు అనుమానం వస్తోంది. వర్షాకాలం వచ్చేలోపు పునరుద్ధరణ పనులు చేయాలి. పదేళ్లలో మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ కింద 17.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తెచ్చాం. 31.50 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేశాం. ప్రాజెక్టుల అంచనాలు పెరగడం కొత్త కాదు. కాళేశ్వరం ఒక్కటే పెరగలేదు. నాగార్జున సాగర్ అంచనా 9.7 రెట్లు పెరిగింది. రాష్ట్రంలో నిర్మించిన అన్ని ప్రాజెక్టుల అంచనాలు పెరిగాయి. కృష్ణా నుంచి 299 టీఎంసీలు కాదు, 600 టీఎంసీలకు పైగా నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేయాలి. టీవీలో నా ముఖం చూపించడం లేదట.. శ్వేతపత్రంపై చర్చలో హరీశ్‌రావు మాట్లాడుతుండగా, సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అడ్డుతగిలారు. దీంతో హరీశ్‌రావు పలుమార్లు అసహనం వ్యక్తం చేస్తూ ‘నేను శ్వేతపత్రంపై వివరణ ఇవ్వాలో లేదా మంత్రులు మాట్లాడే మాటలకు వివరణ ఇవ్వాలో తెలియట్లేదు?’ అని పేర్కొన్నారు. అదే సమయంలో ఆయన స్పీకర్‌నుద్దేశించి ‘నేను అసెంబ్లీలో మాట్లాడుతుంటే టీవీలో నా మొహం చూపిస్తలేరంట. ఇప్పుడే మా ఆవిడ ఇంట్లో టీవీ చూసి కాల్ చేస్తే.. మా పీఏ కాగితం పంపించాడు. గొంతు వినిపిస్తోందట కానీ నా ముఖం బదులు స్పీకర్ లేదా సీఎంను చూపిస్తున్నారట. నా ముఖం కూడా చూపించండి’ అని అన్నారు. దానికి స్పీకర్ ప్రసాద్ కుమార్ స్పందిస్తూ ‘మీరు సీనియర్ సభ్యులు. అలా మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడితే వారినే చూపిస్తారు’ అని చెప్పారు. మంత్రి శ్రీధర్‌బాబుతో హరీశ్ భేటీ... భోజన విరామ సమయంలో లాబీల్లోని శాసనసభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు గదికి హరీశ్‌రావు వచ్చారు. అప్పుడు శ్రీధర్ గదిలో లేకపోవడంతో వెనక్కు తిరిగారు. అంతలోనే లాబీల్లో శ్రీధర్‌బాబు ఎదురుపడి హరీశ్‌ను తన వెంట తీసుకెళ్లారు. శ్వేతపత్రంపై చర్చ ఎంత సేపు జరగనుంది, సీఎం రేవంత్‌రెడ్డి కూడా దీనిపై మాట్లాడతారా అన్న విషయాల గురించి హరీశ్ అడిగినట్టు తెలిసింది. నీటిపారుదల ప్రాజెక్టులపై చాలా మంది సభ్యులు మాట్లాడతామని కోరుతున్నారని, వారందరికీ అవకాశం కల్పిస్తామని శ్రీధర్ చెప్పినట్టు సమాచారం. ప్రభుత్వం వాస్తవాలు దాచి పెట్టింది స్థిరీకరణ, ఆయకట్టు విషయంలో ప్రభుత్వం వాస్తవాలు దాచి పెట్టిందని, దీనిపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మమల్ని ఇరికించబోయి ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకుందని, నాలుగు ఎంపీ సీట్లలో గెలుపు కోసం దీన్ని భూతద్దంలో చూపే ప్రయత్నం చేసిందని ధ్వజమెత్తారు. కాగ్ పనికి రాదని తాము అనలేదని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పిన అన్న విషయాన్ని గుర్తుచేశామని, ఇదే కాగ్ తమను ఎన్నోసార్లు మెచ్చుకుందని చెప్పారు. -
తెలంగాణ అసెంబ్లీలో బీసీ కులగణన తీర్మానం
-
అసెంబ్లీలో కాళేశ్వరంపై కాగ్ రిపోర్ట్
Updates.. రేపటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీలో కుల గణన తీర్మానం రేపటికి వాయిదా ఇవాళ సభలో కుల జనగణన తీర్మానం పెట్టాలని భావించిన సర్కార్ ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ఆలస్యం అవడంతో రేపు సభలో కులగణన తీర్మానం రేపు ఉదయం 10 గంటలకు సభలో తీర్మానం పెట్టనున్న మంత్రి పొన్నం ఆ తర్వాత నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం పెట్టనున్న ప్రభుత్వం. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క... అసెంబ్లీలో బడ్జెట్‌పై రిప్లై రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన గత ప్రభుత్వం జీఎస్డీపీకి అనుగుణంగానే 60వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో చూపించాము రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి గ్రూప్ -1 వేయలేకపోయారు. ఎంత మంది తల్లులు కన్నీళ్లు పెట్టుకున్నారో మీకు తెలియదు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేశాం. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం 40 కోట్ల రూపాయలు ఇచ్చాము. 563 గ్రూప్-1 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వేయబోతున్నాము. ఎల్ బి స్టేడీయంలో 7వేల మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు ఇచ్చాము సింగరేణిలో 441 మందికి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నియామక పత్రాలు ఇచ్చాము రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలు పెట్టాము. ఇది ఆరంభం మాత్రమే 13444 మందికి కానిస్టేబుల్స్‌కు నియామక పత్రాలు ఎల్ బి స్టేడియంలో ఇచ్చాము ఆరు గ్యారంటీల హామీలకు కట్టుబడి ఉన్నాము. గాలికి వదిలేయలేదు వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ రూపాకల్పన చేసాము గత ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితికి బడ్జెట్ తీసుకువచ్చింది ఆరు గ్యారెంటిలకు 53వేలు కేటాయించాము.. ఇందులో తప్పేముంది ప్రతీ సెగ్మెంట్ కు ఇందిరమ్మ 3వేల కు పైగా కట్టిస్తాము మహాలక్ష్మీ పథకం దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. గతంలో ఆదాయం లేకున్నా 20 శాతం పెంచుకుంటూపోయారు పెట్టిన లెక్కలు ఖర్చు అయ్యాయా లేదా అన్నది గత 10 ఏళ్లు పట్టించు కోలేదు 2014 నుంచి 2023 వరకు 14,87,834 కోట్లు ప్రవేశ పెట్టగా ఖర్చు చేసింది 12,25,326 కోట్లు మాత్రమే- 2,62,518 కోట్లు ఖర్చు పెట్టలేదు 2023-24 వార్షిక సంవత్సరం లో కూడ బడ్జెట్లో 70 వేల రూపాయల వ్యత్యాసం ఉంది బడ్జెట్లో నిధులు కేటాయించి రాబడి రాకుండ ఎత్తి వేయడం వల్ల పేదలు, బడుగు బలహీన వర్గాల కొరకు కేటాయించిన సంక్షేమ పథకాలకు కోత పడుతుంది ఆదాయం బాగున్న తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ లో పెట్టిన ఖర్చు 79 శాతం మాత్రమే ఉండటం దురద్రుష్టకరం శాసన మండలి ప్రాంగణంలో.. ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ప్రభుత్వం నిన్న సెక్రటేరియట్ దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహానికి భూమి పూజ చేశారు గత ప్రభుత్వం అక్కడ తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిచేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి అనుకున్నం నిన్న సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేసి అధికారికంగా రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు చేస్తామని చెప్పారు తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయడంలో మాకు అభ్యతరం లేదు ఎందుకంటే అమ్మ పేదగా ఉన్న గొప్పగా ఉన్న అమ్మనే అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాని వ్యతిరేకిస్తున్నాం ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాకు రాజీవ్‌గాంధీ పట్ల మాకు గౌరవం ఉంది దేశం కోసం అయినా చేసిన సేవలు పట్ల గౌరవం ఉంది జాతీయ నాయకుల పేర్లు అనేక వాటికి పెట్టుకున్నాం ఇప్పటికే ఎయిర్‌పోర్టు పెట్టుకున్నాం.. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహన్నీ పెట్టాల్సిన చోట ఈ విగ్రహం పెట్టటం సరైనది కాదు తెలంగాణలో ఇసుక తవ్వకాలపై కాగ్ అక్షింతలు పేరుకే గిరిజన సంఘాలకు ఇసుక తవ్వకాల కాంట్రాక్టు ఇచ్చారు కానీ, నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు కాంట్రాక్టులు బదలాయించారు ప్రభుత్వం ఇసుక అక్రమాలను అడ్డుకోలేకపోయింది ఇసుక తవ్వకాల ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవు అధిక లోడ్లు వేసి ప్రజాధనానికి నష్టం చేశారు ఇసుక రవాణా వాహనాలకు జీపీఎస్ లేదు అనుమతులు లేకుండా అధిక ఇసుక తవ్వకం, అక్రమ రవాణా జరిగింది పర్యావరణ రక్షణ కోసం ఎలాంటి చర్యలు లేవు. అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్‌ను ప్రవేశ పెట్టిన ప్రభుత్వం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్ అస్తవ్యస్తంగా.. పనులు ప్రారంభించారు మహారాష్ట్రలో ముంపు సమస్య ఎత్తిచూపిన కాగ్ డీపీఆర్‌లో 63,352 కోట్లు చూపించి.. 1,06,000 కోట్లకు అంచనా వ్యయం పెంచారు. ప్రస్తుత నిర్మాణం వరకు 14 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉంది. మొత్తం ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు 1,47,427 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రాజెక్టు నుంచి ఊహించిన ప్రయోజనాలను ఎక్కువ చూపెట్టారు. ప్రాజెక్టు వార్షిక ఖర్చులు తక్కువ చూపించారు. కాళేశ్వరం నీటి అమ్మకం ద్వారా రూ.1,019కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు. ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు తీసుకున్నారు. 15 బ్యాంకులతో 87వేల కోట్లు సమకూర్చుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. బడ్జెటేతర రుణాలపై ప్రభుత్వం ఎక్కువ ఆధారపడి ఉంది. రుణాలు చెల్లించడంలో కాలయాపన చేసింది. ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రతీ సంవత్సరం 700 కోట్ల నుంచి 14వేల ఐదు వందల కోట్ల వరకు ఖర్చు అవుతుంది. రుణాలు కట్టడం కోసం మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి. కాళేశ్వరం అప్పు కట్టుకుంటూ పోతే 2036లో పూర్తవుతుంది. ప్రాజెక్టు వ్యయం 122 శాతం పెరిగింది కానీ. ఆయకట్టు 52 శాతం మాత్రమే పెరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు వడ్డితో సహా 1,47,427 కోట్లకు పెరిగింది.. ప్రాణహిత ప్రాజెక్టు డీపీఆర్ లేదు ప్రాజెక్టు పనుల్లో మార్పుల కారణంగా కొన్ని పనులు నిరార్థకం అయ్యాయి.. ఫలితంగా 767 కోట్లు నష్టం కాళేశ్వరం డీపీఆర్ తయారు చేసిన వ్యాప్కోస్ పని తీరులో లోపాలు ఉన్నాయి రీఇంజనీరింగ్ పనులు కూడా అదే సంస్థకు అప్పగించారు అసెంబ్లీలో ముగిసిన జీరో అవర్.. ►జీవో 317పై ఎమ్మెల్యే పాల్వయి హరీష్ బాబు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్. ►మధ్యాహ్నం ఒంటి గంటకు నామినేషన్లు వేయనున్న కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు. ►అసెంబ్లీ సెక్రటరీ వద్ద నామినేషన్ దాఖలు చేయనున్న అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ►గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర పంచాయతీరాజ్ శాఖపై కాగ్ రిపోర్ట్.. కాగ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు గత ప్రభుత్వ హయాంలో గ్రాంట్స్ మళ్ళింపు జరిగింది. నిధుల దుర్వినియోగం జరిగింది. బకాయిలు వసూలు చేయలేకపోయారు. కొన్ని పనులకు అధిక బిల్లులు చెల్లించారు. సకాలంలో రికార్డులు సమర్పించలేదు. బీఆర్ఎస్ కోసం నా వంతు కృషి చేస్తా: వద్దిరాజు రాజ్యసభ బీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవి చంద్ర కీలక వ్యాఖ్యలు మరోసారి కేసీఆర్ నాకు అవకాశం ఇవ్వటం ఆనందంగా ఉంది బీసీ బిడ్డనైన నాకు అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు కృష్ణాజలాల వాటా కోసం రాజ్యసభలో నా గళం విప్పుతాను కెసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు నా వంతు కృషి చేస్తాను. అలవి గాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీలు నెరవేర్చే వరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాను. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశాలు పెడుతున్నారు. ప్రజలచేత ఎన్నికైతేనే మేము ఎమ్మెల్యేలమయ్యాము. సమావేశాలకు మమ్మల్ని కూడా పిలవాలి అని కోరుతున్నాం. జీహెచ్ఎంసీలో నిధుల కొరత ఉంది. కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ అసెంబ్లీ ఇన్సైడ్ చైర్ అనుమతి లేకుండా మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, వీడియో ప్రదర్శన చేయొద్దు అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద సభ్యులు మాట్లాడవద్దు బ్రేక్ టైం లేదా సభ వాయిదా తరువాతే సభ్యులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడాలి నిన్న ఈ అంశంపైనే బీఆర్ఎస్ ఆందోళన మీడియా పాయింట్ వద్దకు అనుమతించకపోవడంతో.. అసెంబ్లీలో రోడ్డుపైనే బైఠాయించి నిరసన బీజేపీఎల్ ఫ్లోర్ లీడర్ గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ని ప్రకటించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ ► తెలంగాణ శాసన సభలో ప్రారంభమైన జీరో అవర్ ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ఆరో రోజు ప్రారంభం సభను ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ బడ్జెట్‌పై సమాధానం ఇవ్వనున్న ఆర్థిక మంత్రి భట్టి ► నేడు(ఆరో రోజు) తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ► నేడు అసెంబ్లీలో బడ్జెట్‌పై సమాధానం ఇవ్వనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ► ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం తెలుపనున్న సభ ► ఉభయ సభల్లో కాగ్ నివేదికను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం ► కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్‌ను సభలో పెట్టనున్న ప్రభుత్వం ► ఇరిగేషన్, రెవిన్యూ, ఫైనాన్స్, పంచాయితీరాజ్ రిపోర్ట్‌లను టేబుల్ చేయనున్న ప్రభుత్వం ► అసెంబ్లీలో పలు ప్రకటనలు చేయనున్న కాంగ్రెస్ ప్రభుత్వం. మరోవైపు.. ► నేటితో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ గడువు ముగియనుంది. ► తెలంగాణలో నేడు నామినేషన్ వేయనున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు. కాంగ్రెస్ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ వేయనున్నారు. ► అటు బీఆర్ఎస్ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేయనున్నారు. ► నేడు అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. -
హరీష్ రావుకు మంత్రి ఉత్తమ్ కౌంటర్..
-
ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయారు..
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో చివరి రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేల తీరులో ఎటువంటి మార్పులేదు. సభ మొదలైన మరుక్షణం నుంచే కార్యకలాపాలను స్తంభింపజేసేందుకు ప్రయత్నించారు. సభ ప్రారంభమైన వెంటనే పథకం ప్రకారం గొడవ చేసి వెళ్లిపోయారు. కేవలం సభలో 15 నిమిషాలు మాత్రమే టీడీపీ సభ్యులు సభలో ఉన్నారు. సంప్రదాయం ప్రకారం బుధవారం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై గురువారం సభలో చర్చ నిర్వహించాల్సి ఉంది. ఇందుకు విరుద్ధంగా సభ ప్రారంభమైన వెంటనే జాబ్ క్యాలెండర్, మద్యపాన నిషేధంపై టీడీపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దానిని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. దీంతో టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంలోకి వెళ్లారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, డోలా బాలవీరాంజనేయస్వామి, అశోక్, రామకృష్ణలు స్పీకర్ చైర్‌ను చుట్టుముట్టారు. మరోవైపు ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, చినరాజప్ప తదితరులు స్పీకర్ పోడియం ముందు నిలుచుని, పోడియాన్ని తడుతూ ఆందోళనకు దిగారు. వారి ఆందోళన మధ్యే సభా కార్యకలాపాలను కొనసాగిస్తూ స్పీకర్ మాట్లాడుతుండగా... ఆయన ప్రసంగానికి అడ్డుతగులుతూ స్పీకర్ మైక్‌లో వినిపించేలా టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రంలో గంజాయి సాగు, వాడకం మితిమీరిపోయిందంటూ ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ సభ్యులు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేల తీరును శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తప్పుబట్టారు. సభలో జరుగుతున్న బిజినెస్‌కు విరుద్ధంగా వాయిదా తీర్మానాలకు డిమాండ్ చేసి ఆందోళనకు దిగడమేమిటని ప్రశి్నంచారు. రాష్ట్రంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణపై సీఎం జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుందని గుర్తుచేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఒకసారి పోలీస్ రికార్డులను పరిశీలించి వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. అయినా టీడీపీ సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత టీడీపీ సభ్యులు రాలేదు. రెండు బిల్లులకు ఆమోదం ఏపీ విద్యుత్ సుంకం (సవరణ) బిల్లు–2024, ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు–2024ను శాసనసభ ఆమోదించింది. విద్యుత్ సుంకం బిల్లును ఆ ర్థి క మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సభలో ప్రవేశపెట్టారు. -
ప్రొసీజర్ ప్రకారమే...
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సిట్టింగ్ జడ్జిని కేటాయించలేమని హైకోర్టు పేర్కొందని, రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించుకోవాలని సూచించిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. దీనిపై మంత్రివర్గంలోగానీ, అసెంబ్లీలోగానీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లోనే కులగణనపై తీర్మానం ఉంటుందన్నారు. గురువారం అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగం అనంతరం రేవంత్ తన చాంబర్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘కాళేశ్వరం విషయంలో సరైన దిశలోనే ముందుకు వెళ్తున్నాం. దేనికైనా ఓ ప్రోసీజర్ ఉంటుంది. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం ఒక ప్రొసీజర్ ప్రకారం పనిచేస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్‌కు ఉరి అమలు కూడా ఓ ప్రొసీజర్ ప్రకారమే జరిగింది. మిషన్ భగీరథలో అక్రమాలపైనా విచారణకు ఆదేశించాం. టీఎస్పీఎస్సీ విషయంలోనూ పక్కా ప్రొసీజర్‌తో వెళుతున్నాం. భవిష్యత్‌లో నిరుద్యోగులకు ఇబ్బందులు ఎదురవకుండా నియామకాల విషయంలో స్పష్టతతో వ్యవహరిస్తున్నాం. విధానపరమైన లోపాలు చోటుచేసుకోకుండా పాలన సాగిస్తాం..’’ అని రేవంత్ తెలిపారు. కేసీఆర్ చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోంది! అధికారం కోల్పోవడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని, అసహనంతో మాట్లాడుతున్నారని రేవంత్ విమర్శించారు. కానీ కేసీఆర్, బీఆర్ఎస్ల గురించి ప్రజలు ఆలోచించడం మానేశారని వ్యాఖ్యానించారు. ‘‘కేసీఆర్ బేషరం మనిషి.. కేసీఆర్ ఓ ఎక్స్పైరీ మెడిసిన్. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి హాజరుకాలేదు. సభలో చర్చించాల్సిన అంశాలపై ఏర్పాటు చేసిన బీఏసీ సమావేశానికి రాలేదు. అంటే ప్రతిపక్ష నేత ఏమిటో, ఆయన చిత్తశుద్ధి ఏమిటో, ఎంత బాధ్యతతో వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే రాలేదు. తర్వాతైనా వస్తారా లేదా..’’అని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ రావాలని, ప్రతిపక్షనేతగా బాధ్యతలను నిర్వర్తించాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. హరీశ్‌రావుది అవగాహన రాహిత్యం బీఏసీ సమావేశంలో తాము హరీశ్‌రావును అడ్డుకోవడం ఏమిటని రేవంత్ పేర్కొన్నారు. పదేళ్లు శాసనసభా వ్యవహారాల మంత్రిగా పనిచేసినా కూడా హరీశ్‌రావు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని.. అసెంబ్లీ స్పీకర్ తీసుకునే నిర్ణయానికి మమ్మల్ని బాధ్యుల్ని చేస్తామంటే ఎలాగని నిలదీశారు. బీఏసీ భేటీకి హాజరయ్యేందుకు కేసీఆర్, కడియం శ్రీహరి పేర్లను బీఆర్ఎస్ ఇచ్చిందని.. వారు కాకుండా వేరేవారిని సమావేశానికి అనుమతించాలా, లేదా అనేది స్పీకర్ నిర్ణయమని స్పష్టం చేశారు. వివిధ అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందనుకుంటే సమావేశాలను స్పీకర్ పొడిగించవచ్చని చెప్పారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ మనవడు హిమాన్షు కూడా బీఏసీ భేటీకి వస్తానంటే కుదురుతుందా? అని ప్రశ్నించారు. తన వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాదు కేసీఆర్ వచ్చినా కలుస్తానని చెప్పారు. గతంలో తాను కేసీఆర్ దగ్గరికి వెళ్లి కలసినప్పుడు జరగని చర్చ.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి తనను కలిస్తే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. చాంబర్ కేటాయింపు స్పీకర్ నిర్ణయం.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతకు చాంబర్ కేటాయింపు, బీఆర్ఎస్ కార్యాలయం మార్పు అనేవి స్పీకర్ నిర్ణయానికి అనుగుణంగా జరుగుతాయని రేవంత్ చెప్పారు. ‘‘చాంబర్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. కానీ ఇక్కడే ఇవ్వాలి.. అక్కడ ఇవ్వద్దు అనేవేమీ ఉండదు కదా!’’అని పేర్కొన్నారు. ఇప్పటికైతే నాలుగు రోజులు సభను నిర్వహించాలని అనుకున్నామని.. దీనిపై స్పీకర్ తర్వాత నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అసెంబ్లీలో నీటిపారుదల ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల అంశాన్ని మీడియా ప్రస్తావించగా.. సంబంధిత శాఖ మంత్రి ఆ వివరాలు చెప్తారని రేవంత్ బదులిచ్చారు. మేడిగడ్డపై చర్చను పక్కదారి పట్టించేందుకు కృష్ణాబోర్డు అంశాన్ని కేసీఆర్ ముందుకు తెస్తున్నారని విమర్శించారు. ఏపీ నాగార్జునసాగర్‌పైకి పోలీసులను పంపి లాక్కునే ప్రయత్నం చేస్తే కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. బేసిన్లు లేవు, భేషజాలు లేవని కేసీఆర్ అన్నారంటే.. ఆయనకున్న నిబద్ధత ఏమిటో ప్రజలకు అర్థమైందని వ్యాఖ్యానించారు. కృష్ణాబేసిన్ పరిధిలో బీఆర్ఎస్కు వచి్చన అసెంబ్లీ సీట్లను చూస్తే ఇది స్పష్టమవుతుందన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగా రాజ్యసభ ఎన్నికల్లో ఎంతమందిని పోటీకి దింపాలనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
సభా సమయం.. నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మూడో శాసనసభ తొలి బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30కి శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. ఈ నెల 9న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ఆమోదం ఉంటాయి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 10వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. కాగా బడ్జెట్లోని అంశాలపై 12 నుంచి చర్చ జరగనుంది. ఆరు రోజుల పాటు బడ్జెట్‌పై చర్చ జరుగుతుందని భావిస్తుండగా, గురువారం స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో సమావేశ తేదీలు, ఎజెండా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే బీఏసీ ఇంకా ఏర్పాటు కాకపోవడంతో విపక్ష పారీ్టల నేతలతో సంప్రదించి సభ నిర్వహణ తీరు తెన్నులపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. సకాలంలో సమాధానాలు ఇవ్వండి శాసనసభ, శాసనమండలి సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. ఉభయ సభల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు ఇవ్వడంతో పాటు సమావేశాలు సజావుగా నడిచేందుకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. ఆఫీసర్ బాక్సులో అధికారులు తగిన సమాచారంతో సిద్ధంగా ఉండాలని అన్నారు. పాత అసెంబ్లీ భవనంలోకి శాసనమండలిని తరలించే పనులు త్వరగా పూర్తి చేయాలని గుత్తా చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భద్రత, లాబీల్లోకి సందర్శకులు గుంపులుగా రావడం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రోటోకాల్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడటం వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. సమావేశాలు జరిగే సమయంలో మంత్రులు అందుబాటులో ఉండాల ని మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ కోరారు. ప్రోటోకాల్‌లో తప్పిదాలు జరగొద్దు: శ్రీధర్‌బాబు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని విభాగాలను సమన్వయం చేసేందుకు, త్వరితగతిన సమాధానాలు వచ్చేలా చూసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎస్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. ప్రస్తుత సమావేశాల్లో మంత్రులకు సబ్జెక్టుల వారీగా బాధ్యతలు ఇస్తున్నామని, సభ్యుల ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాధానాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రోటోకాల్ విషయంలో తప్పిదాలు జరగవద్దని అన్నారు. ప్రోటోకాల్ విషయంలో గతంలో తాను కూడా బాధితుడినని గుర్తు చేశారు. త్వరలో ఓరియెంటేషన్ కార్యక్రమం మండలిని అసెంబ్లీ ప్రాంగణంలోకి త్వరితగతిన తరలించేందుకు చర్యలు తీసుకుంటామని శ్రీధర్‌బాబు చెప్పారు. తొలిసారిగా శాసనసభ, శాసనమండలికి ఎన్నికైన సభ్యుల కోసం రెండురోజుల ఓరియెంటేషన్ కార్యక్రమం త్వరలో ఏర్పాటు చేస్తా మన్నారు. ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్, బీర్ల ఐలయ్య, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నర్సింహాచార్యులు, లెజిస్లేచర్ అడ్వైజర్ ప్రసన్నకుమార్‌తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. కాగా పాత అసెంబ్లీ భవనంలోకి శాసనమండలిని తరలించాలనే నిర్ణయం నేపథ్యంలో బుధవారం మండలి చైర్మన్, స్పీకర్ తదితరులు పాత అసెంబ్లీ భవనంలోని సమావేశ మందిరాన్ని పరిశీలించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. -
Live: ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
-
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
-
AP: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ, కౌన్సిల్ బీసీఏ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 7న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. 7తేదీన ఉదయం 8 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. 8వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. -
అప్పుల్లో ‘కరెంట్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ రంగం ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ సర్కారు గురువారం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణ ఆవిర్భవించే నాటికి రాష్ట్ర విద్యుత్ సంస్థల అప్పులు రూ.20,856.12 కోట్ల మేర ఉండగా.. 2022–23 నాటికి రూ.78,553.92 కోట్లకు పెరిగాయని అందులో పేర్కొంది. తెలంగాణ ఏర్పడినప్పుడు విద్యుత్ సంస్థలు చెల్లించాల్సిన మొత్తం అప్పులు, బకాయిలు (లయబిలిటీస్) కలిపి రూ.37,081.64 కోట్లుకాగా.. 2022–23 నాటికి రూ.1,37,571.4 కోట్లకు చేరాయని వివరించింది. అంటే ఏకంగా రూ.1,00,489 కోట్లకుపైగా పెరిగినట్టు పేర్కొంది. విద్యుత్ సంస్థలు చెల్లించాల్సిన బకాయిల్లో.. విద్యుదుత్పత్తి కోసం జెన్కో కొనుగోలు చేసిన బొగ్గు వ్యయం, డిస్కంలు కొనుగోలు చేసిన విద్యుత్‌కు సంబంధించి ఇంకా చెల్లించాల్సిన బిల్లుల వంటివి ఉంటాయి. అయితే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసి మాట్లాడినప్పుడు.. పలు అంశాలను విడివిడిగా వివరించారు. విద్యుత్‌శాఖ మొత్తం అప్పులు రూ.81,516 కోట్లు అని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వంలోని వివిధ శాఖలు/విభాగాలు విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన బిల్లులు రూ.28,842.72 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వ శాఖలు బకాయిపడిన సొమ్ము రూ.720 కోట్లు. రూ.39,722 కోట్ల తాత్కాలిక విద్యుత్ కొనుగోళ్లు డిమాండ్‌లో హెచ్చుతగ్గులు, విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోవడం, స్థిరత్వం లేని పునరుత్పాదక విద్యుత్ లభ్యత వంటి కారణాలతో 2014–24(నవంబర్ 2023) మధ్య సగటున యూనిట్‌కు రూ.5.03 ధరతో 78,970 మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్ నుంచి డిస్కంలు కొనుగోలు చేశాయి. ఇందుకు రూ.39,722 కోట్లను ఖర్చు చేశాయి. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాకున్నా రూ.638 కోట్ల కారిడార్ చార్జీలు ఒప్పందం ప్రకారం రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ రావాలి. కానీ 2022 ఏప్రిల్ నుంచి నిలిచిపోయింది. నిజానికి సర్కారు ఆదేశం మేరకు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కోసం డిస్కంలు 2,000 మెగావాట్ల సామర్థ్యమున్న కారిడార్‌ను బుక్ చేశాయి. 2017–22 మధ్య పాక్షికంగానే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరాకాగా.. పూర్తిస్థాయిలో 1,000 మెగావాట్ల కోసం కారిడార్ చార్జీలను చెల్లించాల్సి వచ్చింది. కారిడార్‌ను ఉపయోగించకపోయినా 2020 అక్టోబర్ వరకు రూ.638.5 కోట్ల చార్జీలను చెల్లించాల్సి వచ్చింది. సరఫరా అయిన విద్యుత్‌కు సంబంధించి మరో రూ.723 కోట్ల కారిడార్ చార్జీలను చెల్లించారు. పెరిగిన ఆస్తులు, నష్టాలు ► తెలంగాణ ఆవిర్భావం నాటితో పోల్చితే రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) స్థిరాస్తుల విలువ రూ.12,783 కోట్ల నుంచి రూ.40,454 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో అప్పులు రూ.7,662 కోట్ల నుంచి రూ.32,797 కోట్లకు పెరిగాయి. అంటే ఆస్తులు 3.16 రెట్లు పెరగగా, అప్పులు 4.28 రెట్లు పెరిగాయి. ► తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల నష్టాలు రూ.62,461 కోట్లుగా ఉన్నాయి. 2022–23లోనే రూ.11,103 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. ► పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) వార్షిక రేటింగ్స్‌లో 2015–16లో ‘బీ+’గ్రేడ్‌లో ఉన్న డిస్కంలు.. 2021–22 నాటికి ‘సీ–’గ్రేడ్‌కు పడిపోయాయి. ► రేటింగ్స్ నివేదిక ప్రకారం.. డిస్కంల నికర విలువ మైనస్‌లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం వాటి నికర విలువ ‘మైనస్ రూ.30,876 కోట్లు’. ► వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌కు సంబంధించి డిస్కంలు సమర్పించిన అంచనాలతో పోల్చితే తెలంగాణ ఈఆర్సీ ఆమోదించిన అంచనాలు తక్కువగా ఉన్నాయి. దీంతో డిస్కంలకు రావాల్సిన సబ్సిడీతో పోల్చితే ప్రభుత్వం తక్కువ సబ్సిడీ ఇచ్చింది. దీంతో డిస్కంలపై రూ.18,725 కోట్ల అదనపు భారం పడింది. ► తెలంగాణ ఈఆర్సీ 2016–17 నుంచి 2022–23 మధ్య కాలానికి సంబంధించి రూ.12,550 కోట్ల మేర ట్రూఅప్ చార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు డిస్కంలకు అనుమతిచ్చింది. అయితే ఈ సొమ్మును తామే చెల్లిస్తామని, వినియోగదారుల నుంచి వసూలు చేయవద్దని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ చెల్లించలేదు. మరో రూ.2,378 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీ(ఎఫ్ఎస్ఏ)లనూ చెల్లించాల్సి ఉంది. ► భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పి ఏడేళ్లు చేశారు. ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిపోయింది. బొగ్గుగనులకు దూరంగా నల్లగొండ జిల్లాలో యాదాద్రి థర్మల్ కేంద్రం నిర్మాణాన్ని చేపట్టడంతో బొగ్గు రవాణా అనవసర భారంగా మారనుంది. విద్యుత్ సంస్థల ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే ఈ ప్రాజెక్టులు తీవ్ర భారంగా మారనున్నాయి. -
రాష్ట్ర అప్పులు రూ.6,71,757 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు నాటి నుంచి తాము అధికారంలోకి వచ్చేంత వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన గణాంకాలతో కాంగ్రెస్ సర్కారు శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థికశాఖ బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దీనిని బుధవారం శాసనసభ ముందుంచారు. గత పదేళ్లలో ప్రభుత్వం చేసిన అప్పులు, రెవెన్యూ రాబడులు, వసూళ్ల తీరు, ఇతర రాష్ట్రాలతో పోలుస్తూ గణాంకాలు, కేంద్ర ప్రభుత్వ లెక్కలు, ఆర్బీఐ, కాగ్ నివేదికల్లో పేర్కొన్న అంశాలను పొందుపరిచారు. మొత్తం 22 పట్టికల్లో పలు గణాంకాలను వెల్లడించారు. ఆర్థిక శ్వేతపత్రంలోని ముఖ్యాంశాలివీ.. ► బడ్జెట్ ప్రతిపాదనల్లో వాస్తవ ఖర్చు శాతం ఆందోళనకరం. 2014–15లో బడ్జెట్ అంచనాలతో పోలిస్తే వాస్తవ ఖర్చు 61.9శాతమే. 2014– 2023 మధ్య సగటు వ్యయం 82.3 శాతం. గత పదేళ్లలో రూ.14,87,834 కోట్ల మేర బడ్జెట్ అంచనాలను ప్రతిపాదిస్తే.. అందులో ఖర్చు చేసినది రూ.12,24,877 కోట్లు. ► కాంగ్రెస్ పాలనలో 2004–14 వరకు సగటు వ్యయం 87శాతం. మొత్తం రూ.10,04,326 కోట్ల అంచనాలకు గాను రూ.8,73,929 కోట్ల ఖర్చు జరిగింది. ► 1956–57లో ఉమ్మడి ఏపీ బడ్జెట్లో తెలంగాణ వాటా కింద రూ.33 కోట్లు ఖర్చు పెట్టగా.. 2013–14 నాటికి ఇది రూ.56,947 కోట్లకు చేరింది. మొత్తంగా గత 57 ఏళ్లలో అంటే 1956– 57 నుంచి 2013–14 వరకు తెలంగాణ లో జరిగిన ఖర్చు రూ.4,98,053 కోట్లు. ► ఈ నిధులతోనే ఓఆర్ఆర్, ఎయిర్‌పోర్టుతోపాటు నాగార్జునసాగర్, జూరాల, కోయల్‌సాగర్, దేవా దుల, శ్రీరాంసాగర్, కడెం లాంటి సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టులు, ట్రిపుల్‌ఐటీలు, వర్సిటీలు, వైద్య కళాశాలలు, ఆస్పత్రులు, రోడ్లు–భవనాలు, కాల్వలు, విద్యుత్ లైన్లు, రక్షణ సంస్థలు, ఔషధ పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు ఏర్పాటు చేయగలిగాం. 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన 16 మంది సీఎంల కాలంలో తెలంగాణ అప్పు రూ.72,658 కోట్లు మాత్రమే. ► 2014–15 తర్వాత రాష్ట్రంలో రెవెన్యూ రాబడులు అస్థిరంగా ఉన్నాయి. స్థూల ఉత్పత్తితో పోలిస్తే రెవెన్యూ రాబడులు 2015–16లో గరిష్టంగా 13.2శాతంగా ఉండగా.. 2018–19లో 11.8 శాతానికి క్షీణించాయి. అంటే కరోనా మహమ్మారికి ముందే ఆర్థిక మందగమనం ప్రారంభమైంది. ఇక రెవెన్యూ రాబడుల శాతం కూడా పడుతూ, లేస్తూ వచ్చింది. 2021–22లో తెలంగాణ కంటే కేవలం మరో ఐదు రాష్ట్రాలే తక్కువ రెవెన్యూ రాబడులు కలిగి ఉన్నాయి. ► పెరుగుతున్న ఖర్చులతో పోలిస్తే ఆదాయ వనరుల్లో పెరుగుదల లేని కారణంగా ద్రవ్యలోటు పెరిగింది. ఈ లోటును పూడ్చడానికి రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ రుణాలు గత పదేళ్లలో ఏటా సగటున 24.5శాతం చొప్పున పెరిగాయి. బడ్జెట్ ప్రతిపాదనల్లో చూపించిన రుణాల్లో బడ్జెటేతర రుణాలను చేర్చలేదు. ప్రభుత్వ హామీతో స్పెషల్ పర్పప్ వెహికిల్స్ (ఎస్పీవీలు) ఏర్పాటు చేసి ప్రభుత్వమే చెల్లించే విధంగా కొన్ని రుణాలు, ప్రభుత్వ హామీ ఉన్న ఎస్పీవీలు చెల్లించేలా మరికొన్ని, ప్రభుత్వ హామీ లేకుండా మరికొన్ని రుణాలు సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా చేసిన అప్పులు, హామీ ఇచ్చినవి, హామీలేనివి కలిపి మొత్తం అప్పు రూ.6,71,757 కోట్లకు చేరింది. ► ఈ అప్పులతో ఏటా రుణాల తిరిగి చెల్లింపు భారం పెరిగిపోయింది. 2014–15లో అప్పుల అసలు, వడ్డీ చెల్లింపులు రూ.6,954 కోట్లు కాగా..2023–24 నాటికి ఇది రూ.32,939 కోట్లకు చేరింది. ► మొత్తం రెవెన్యూ రాబడుల్లో రుణాల చెల్లింపుల భారం 2014–15లో 14 శాతం కాగా.. 2023–24 నాటికి 34 శాతానికి పెరిగింది. బహిరంగ మార్కెట్ రుణాల సగటు వడ్డీ రేటు 7.63 శాతం. కానీ గత ప్రభుత్వం గ్యారంటీలిచ్చి తీసుకున్న రుణాల్లో 95 శాతం రుణాల వడ్డీ రేటు 8.93 నుంచి 10.49 శాతం వరకు ఉంది. ► రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 24 ప్రభుత్వ శాఖల్లో 39,175 ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. ఇందుకు రూ.3,49,843 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా.. రూ.1,89,903 కోట్లు వ్యయమైంది. మిగతా పనుల కోసం రూ.72,983 కోట్లను రుణాలు తీసుకోవాల్సి ఉంది. ► ఈ ఏడాది డిసెంబర్ 19 నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, డి్రస్టిబ్యూటర్లకు సంబంధించిన 4,78,168 బిల్లులను క్లియర్ చేయాల్సి ఉంది. ఈ బిల్లుల మొత్తం విలువ రూ.40,154 కోట్లు. ► ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్ల సగటు వార్షిక వృద్ధిరేటు 17 శాతం. 2014–15లో రూ.17,130 కోట్లు జీతాలు, పెన్షన్ల కింద చెల్లించగా.. 2021–22 నాటికి అది రూ.48,809 కోట్లకు చేరింది. రాష్ట్ర రాబడిలో ఇది 38 శాతం. ► కొన్నేళ్లుగా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాలపై ఆధారపడటం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణతను సూచిస్తోంది. 2014–15లో రాష్ట్ర ఖజనాలో 303 రోజులు నగదు నిల్వ ఉండగా..2023–24 (నవంబర్ 30వరకు) 30 రోజు లకు పడిపోయింది. 2022–23లో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సు, ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాలను 328 రోజులు ఉపయోగించుకున్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ డొల్లతనాన్ని తెలియజేస్తోంది. ► 2014–19 మధ్య రాష్ట్రం రెవెన్యూ మిగులును నమోదు చేయగా.. 2019–22 మధ్య జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, సబ్సిడీల వంటి చెల్లింపులు, పునరావృత ఖర్చులను తీర్చడానికి కూడా రెవెన్యూ రాబడులు మిగలలేదు. ► మొత్తం రాబడులు, వ్యయం మధ్య ఉండే తేడాను ద్రవ్యలోటు అంటారు. ఈ ద్రవ్యలోటు 2014–15లో రూ.9,410 కోట్లుకాగా.. 2015–16లో రూ.18,856 కోట్లు, 2016–17 నాటికి రూ.35,281 కోట్లకు చేరింది. ► కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్టేట్ ఆఫ్ స్టేట్ ఫైనాన్సెస్ నివేదిక ప్రకారం.. 2023–24లో దేశంలోని రాష్ట్రాలు తమ బడ్జెట్లో 14.7 శాతం విద్యపై ఖర్చు చేస్తాయని అంచనా వేయగా.. తెలంగాణ 7.6శాతం ఖర్చు చేస్తుందని అంచనా వేసింది. ఇది జాతీయ సగటులో సగం మాత్రమే. ఇదే నివేదిక ప్రకారం వైద్యంపై ఖర్చు కేవలం 5 శాతం మాత్రమే. పారదర్శకంగా అధిగమిస్తాం మొత్తం 42 పేజీల్లో 13 అంశాలను కూలంకషంగా వివరిస్తూ ఆర్థిక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. రాష్ట్ర బడ్జెట్ అంచనాలు–వాస్తవ వ్యయం, ఉమ్మడి ఏపీలో తెలంగాణలో చేసిన ఖర్చు, రెవెన్యూ వసూళ్లు, రుణాల తీరు, మూలధన వ్యయం, జీతభత్యాలు–పెన్షన్ల ఖర్చు, రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు, విద్య, ఆరోగ్య రంగాల్లో ఖర్చును అంశాల వారీగా వివరిస్తూ రూపొందించినట్టు తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం వారసత్వంగా పొందిన ప్రభు త్వ ఆర్థిక పరిస్థితిని వివరించడమే దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. ప్రజలు మార్పు కోసం ఇచ్చిన ఆదేశాన్ని, పార్టీ వాగ్దానం చేసిన ఆరు హామీలను నెరవేర్చడానికి ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా, వివేకంతో, పారదర్శకంగా అధిగమించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొంది. -
సభలో శ్వేతపత్రం ఫైర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన శ్వేతపత్రం అసెంబ్లీలో సెగలు రేపింది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. రాష్ట్రం ఏర్పడే నాటికి 2014–15లో ప్రభుత్వ అప్పులు రూ.72,658 కోట్లు అయితే.. ఇప్పుడు రూ.6.71 లక్షల కోట్లకు చేరాయని పేర్కొంటూ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేయగా.. దీనిపై జరిగిన స్వల్పకాలిక చర్చలో అధికార, విపక్ష సభ్యుల నడుమ పలు సందర్భాల్లో తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దారుణంగా మార్చిందని అధికారపక్షం విమర్శలు గుప్పిస్తే.. ‘శ్వేతపత్రం’ అంతా తప్పులతడక అని, అప్పులతోపాటు ఆస్తులు పెరిగిన అంశాన్ని ఎందుకు చెప్పడం లేదని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నిలదీసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో ప్రజలకు తెలియజేయాలన్నదే తమ ఉద్దేశమని అధికారపక్షం పేర్కొంటే.. ఈ సాకుతో గ్యారంటీ హామీలు అమలు చేయకుండా తప్పించుకోవాలని కాంగ్రెస్ సర్కారు చూస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. మాజీ ఎమ్మెల్యేలకు నివాళి అర్పించి.. మూడు రోజుల విరామం అనంతరం బుధవారం ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. సభలో ఎంఐఎం పక్ష నేతగా అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ పక్ష నేతగా కూనంనేని సాంబశివరావులను గుర్తిస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు రామన్నగారి శ్రీనివాస్‌రెడ్డి, కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, కుంజా సత్యవతి మరణం పట్ల శాసనసభ రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపింది. తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ప్రభుత్వ వనరుల వినియోగం సక్రమంగా జరగలేదని, రోజూవారీ ఖర్చుల కోసం కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దశాబ్దకాలంలో జరిగిన ఆర్థిక తప్పిదాలను ప్రజలకు తెలియపర్చడం కోసమే శ్వేతపత్రాన్ని విడుదల చేశామని చెప్పారు. పరిశీలించేందుకు అరగంట సమయమిచ్చి.. స్వల్పకాలిక చర్చలో భట్టి అనంతరం ప్రసంగించాల్సిందిగా బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి హరీశ్‌రావుకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. అయితే 42 పేజీల నివేదికను ఇచ్చి, అధ్యయనం చేసేందుకు సమయం ఇవ్వకపోవడంపై హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావు కూడా కొంత సమయం కావాలని కోరారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. సుమారు గంటా 15 నిమిషాల తర్వాత సభ తిరిగి సమావేశమైంది. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేందుకే.. ప్రసంగాన్ని ప్రారంభించిన హరీశ్‌రావు.. కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన శ్వేతపత్రం గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే ధోరణిలో తప్పులతడకగా రూపొందించారని మండిపడ్డారు. శ్వేతపత్రంలో ప్రగతికోణం లేదని, రాజకీయ ప్రత్యర్ధులపై దాడి చేయడంతోపాటు వాస్తవాల వక్రీకరణ కోసం ఉపయోగించుకునేలా ఉందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో సస్పెండైన అధికారుల సాయంతో కాంగ్రెస్ సర్కారుకు అనుకూలంగా ఉండేలా శ్వేతపత్రం తయారు చేయించారని విరుచుకుపడ్డారు. అయితే హరీశ్ ప్రసంగిస్తున్న సమయంలో... సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు తదితరులు జోక్యం చేసుకుని గత సర్కారుపై విమర్శలు చేశారు. దీనిపై హరీశ్ అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు శ్వేతపత్రంలో లోపాలు ఉన్నాయంటూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ తప్పు పట్టారు. ఈ తరహా చర్చల ద్వారా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయొద్దని సూచించారు. మరోవైపు కాంగ్రెస్ సర్కారు రాష్ట్ర ఆర్థిక స్థితిని సాకుగా చూపించి ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి తప్పుకోవాలని చూస్తే ఊరుకోబోమని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ పక్షాన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసింది శూన్యమని వ్యాఖ్యానించారు. భారీగా అప్పులు చేసినా.. ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేపట్టలేదని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు విమర్శించారు. అప్పులు, తప్పులే అంటూ సీఎం విమర్శలు గత ప్రభుత్వం మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి ఆదాయం వస్తుందంటూ తప్పుడు నివేదికలతో అప్పులు చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హరీశ్‌రావు ప్రసంగిస్తున్న సమయంలో పలుమార్లు జోక్యం చేసుకుని విమర్శలు గుప్పించారు. అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్‌రావు అత్యధిక వడ్డీకి అడ్డగోలుగా రుణాలు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. చివరిగా శ్వేతపత్రంపై జరిగిన స్వల్పకాలిక చర్చకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తర్వాత కూడా సీఎం రేవంత్ మరోసారి జోక్యం చేసుకుని గత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. తొమ్మిది గంటలకుపైగా సుదీర్ఘంగా సాగిన ఈ చర్చను ముగిసినట్లు ప్రకటించిన స్పీకర్.. శాసనసభను గురువారంకు వాయిదా వేశారు. -
సభలో లెక్కాపత్రాలు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం మూడు రోజుల క్రితం వాయిదా పడిన రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఉదయం 11 గంటలకు తిరిగి భేటీ కానుంది. సమావేశం ప్రారంభమైన వెంటనే మాజీ ఎమ్మెల్యేలు రామన్నగారి శ్రీనివాస్‌రెడ్డి (రామాయంపేట), కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (పరిగి), కుంజ సత్యవతి (భద్రాచలం) మృతి పట్ల సభ సంతాపం ప్రకటించనుంది. ఆ తర్వాత స్వల్పకాలిక చర్చ కింద రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఇందులో భాగంగా రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణకు ఉన్న అప్పులు, ఆ తర్వాత పదేళ్లలో చేసిన అప్పులు, పదేళ్ల బడ్జెట్ అంచనాలు, వాస్తవ రాబడులు, ఖర్చు గురించి సాగునీరు, ఆర్అండ్బీ, విద్యుత్, మున్సిపల్ తదితర శాఖల పరిస్థితినీ వివరించనుంది. సంవత్సరాల వారీగా అప్పుల డేటాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు నీటి పారుదల రంగం గురించిన వివరణలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, ఆయకట్టు, నీటి వినియోగం తదితరాలను శాసనసభలో వెల్లడించనున్నారు. విద్యుత్ శాఖకు సంబంధించి ప్రధానంగా విద్యుత్ సంస్థల అప్పులు, నష్టాలు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరా, కొత్త విద్యుత్ ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితరాలను వివరించనున్నారు. ఆర్థిక, విద్యుత్, నీటి పారుదల శాఖలకు సంబంధించి డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా ప్రసంగించే అవకాశముందని సమాచారం. స్వల్పకాలిక చర్చ అనంతరం గురువారం సభ కొనసాగేదీ లేనిదీ బుధవారమే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మా వాదనకు అవకాశం ఇవ్వాలి: హరీశ్‌రావు శాసనసభలో ఆర్థిక, సాగునీరు, విద్యుత్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశమున్నందున ప్రధాన ప్రతిపక్షంగా తమ వాదన వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు మంగళవారం స్పీకర్‌కు లేఖ అందజేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు తమకు అనుమతి ఇవ్వాలని హరీశ్ విజ్ఞప్తి చేశారు. ఇలావుండగా ప్రభుత్వం లేవనెత్తే అంశాలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు హరీశ్‌రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రెండు రోజుల పాటు ముమ్మర కసరత్తు చేశారు. -
కేటీఆర్ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ వేశారు. కొంతమంది NRIలకు ప్రజాస్వామ్యం విలువ తెల్వదని అన్నారు. కేటీఆర్ చెప్పే పాపాల్లో ఆయన చుట్టూ కూర్చున్న వాళ్ళదే పాత్ర ఉందని మండిపడ్డారు. ఐదేళ్లు సమయం ఉంది.. జరిగిన విధ్వంసం ఏంటో అన్ని బయటపడతాయని అన్నారు. కేటీఆర్ మేనేజ్ మెంట్ కోటాలో రాజకీయాల్లోకి వచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు రాజకీయ జీవితం ప్రసాదించింది కాంగ్రెస్సేనని మర్చిపోవద్దని రేవంత్ రెడ్డి అన్నారు. గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, సింగిల్ విండో చైర్మెన్ గా ఓడినా కేసీఆర్ ను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తు చేశారు. వైఎస్ఆర్ పాలనలో కేసీఆర్ కుటుంబం నుంచి ఎమ్మెల్యే గా లేకుండా మంత్రిగా చేశారని తెలిపారు. ప్రతిపక్షాలకు 2014కు ముందు అభివృద్ధిపై చర్చ కావాలంటే ఒక రోజు అంతా చర్చించుకుందామని అన్నారు. ప్రజాస్వామ్యంలో 49 శాతానికి 51 శాతానికి చాలా తేడా ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. 51 శాతం నెంబర్ ఉన్నవారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజాస్వామ్యంలో 49 శాతానికి సున్నా వాల్యూ అని తెలిపారు. నా రిప్లే గురించి బీఆర్ఎస్ తహతహలాడుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. అచ్చోసిన ఆంబోతులం .. పోడియంకి వస్తాం అనే అహం పనికిరాదని దుయ్యబట్టారు. ఐదేళ్ల సమయం ఉంది ఏమి జరిగిందో అన్ని తెలుసుకుందాం అని సీఎం రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనపై ఎక్స్‌రై తీస్తానని చెప్పారు. గతం గురించి చర్చ చేద్దాం అంటే.. ఒక్క రోజు సమయం ఇవ్వండి అన్నీ లెక్కలు తీద్దామని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై తమ నాయకులే కొట్లాడారు అని రేవంత్ రెడ్డి అన్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దారుణమైన ప్రసంగం విన్నాక రాష్ట్రం ఎలా ఉండబోతుందో అర్థం అవుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. నాలుగోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదని, ఢిల్లీ నామినేట్ చేసీ ముఖ్యమంత్రి అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో త్రాగు, సాగు, కరెంట్ దిక్కు లేదని అన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ తప్ప ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో 50 ఎకరాల రైతు అయినా సరే గుంపు మేస్త్రి లాగా ఉండేవారని విమర్శించారు. -
కాంగ్రెస్‌కు ఇంత మిడిసిపాటు వద్దు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దారుణమైన ప్రసంగం విన్నాక రాష్ట్రం ఎలా ఉండబోతుందో అర్థం అవుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. నాలుగోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ మాట్లాడారు. నక్క మోసం చేయనని, పులి మాంసం తినను అని వాగ్దానం ఇచ్చినట్లు గవర్నర్ ప్రసంగం ఉందని అన్నారు. తాము ఎక్కడ ఉన్నా ప్రజా పక్షమేనని తెలిపారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదని, ఢిల్లీ నామినేట్ చేసీ ముఖ్యమంత్రి అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో త్రాగు, సాగు, కరెంట్ దిక్కు లేదని అన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ తప్ప ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో 50 ఎకరాల రైతు అయినా సరే గుంపు మేస్త్రి లాగా ఉండేవారని అన్నారు. కలసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు కేసీఆర్ అని అన్నారు. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ మిడిసిపడుతోందని, ఇంత మిడిసిపాటు వద్దని తెలిపారు. -
మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ: సీఎం రేవంత్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రజలు చాలా బాధపడ్డారు: ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ జరిగింది గవర్నర్ ప్రసంగంపై ప్రజలు చాలా బాధపడ్డారు రెండు సార్లు ఓట్లేస్తే గెలిచి ఏర్పాటు చేసిన ప్రభుత్వంపై గవర్నర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు నిరంకుశ, నిర్బంధ ప్రభుత్వంగా దూషించారు ఆ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం ఆ పదాలు రికార్డుల్లో నుంచి తొలగించాలని కోరాం ప్రజల తీర్పు గౌరవిస్తున్నాం తొలి శాసనమండలి సమావేశాలు ఇవి మండలిలో భారాసకు మెజారిటీ ఉంది ప్రభుత్వానికి సహరించాలన్న ఉద్దేశంతో ప్రజలకు ఓ సందేశం ఇవ్వాలనుకున్నాం ఆ స్ఫూర్తిని ప్రభుత్వం కొనసాగించాలి రాష్ట్ర ప్రగతిపై రోడ్ మ్యాప్ ప్రజలకు చెప్పాలి నష్టం జరిగే చర్యలు అడ్డుకుంటాం.. పోరాటాలు చేస్తాం తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాలు వాడీవే‘ఢీ’గా శాసన సభలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం అనంతరం మండలిలోనూ అదే తరహా సీన్ సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అభ్యంతరం చివరకు శాసన మండలి నిరవధిక వాయిదా సీఎం రేవంత్ ప్రకటనపై కవిత సెటైర్లు సీఎం ప్రకటన అనంతరం శాసనమండలిలో కల్వకుంట్ల కవిత ప్రసంగం మేడిగడ్డ ఏమైనా టూరింగ్ స్పాటా.. అందరినీ తీసుకెళ్లడానికి నిపుణుల ఆధ్వర్యంలో కమిటీ వేసి.. వాళ్లను తీసుకెళ్లండి అని సీఎం రేవంత్‌కు చురక మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ: సీఎం రేవంత్ మేడిగడ్డ అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించనున్న తెలంగాణ ప్రభుత్వం శాసన మండలిలో ప్రకటించిన సీఎం రేవంత్ ఎందుకు కుంగిపోయిందో.. ఎందుకు పనికి రాకుండా పోయిందో తెలుసుకుంటాం అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకెళ్తాం విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి కాంట్రాక్టులు ఎవరిచ్చారు? వారి వెనుకున్న మంత్రులు ఎవరు?.. అధికారుల పాత్ర సహా అన్నీ బయటపడతాయి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ వ్యాఖ్యలు ముఖ్యమంత్రిలో గొప్ప పరిణితి కన్పిస్తుంది అసెంబ్లీ ముందు కూడా ఇంకా ముళ్ళ కంచె ఉంది.. వాటిని తొలగించాలి. ముఖ్యమంత్రి బాష సంస్కార వంతంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ అంటే ఒక్కరే కాదు అందరూ కలిస్తేనే ప్రభుత్వం మీ పార్టీలో వ్యక్తి ఆరాధన ఎందుకు? రీసెంట్ గా ఒక లాకప్ డెత్ జరిగింది దానిపై ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలి. ఒక జర్నలిస్ట్ ను చంపుతానని ఒక ఎమ్మెల్యే సెక్రటేరియట్ లో బెదిరించాడు.. దానిపై స్పందించాలి రైతు బీమా పై వారి ఆలోచన ఏంటో చెప్పాలి. భయపెట్టే విధంగా పాలకులు మాట్లాడకూడదు మూసీని జీవనదిగా మారుస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ శాసన మండలిలో సీఎం రేవంత్ ప్రసంగం స్వేచ్ఛకోసమే ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నాం ఇంకా ఉమ్మడి రాష్ట్రంలోలా పరిపాలన చేస్తామంటే ఎలా? ఉక్కు కంచెలు వేసుకుని ఇన్ని రోజులు ప్రజలకు దూరమయ్యారు ఇప్పుడు ప్రజావాణిని వింటున్నాం.. ప్రజావాణితో మార్పును తెచ్చాం గత ప్రభుత్వంలో పేదలకు ఆరోగ్య శ్రీ అందలేదు పాతబస్తీకి మెట్రో రైలు తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది మురికి మూసీని ప్రక్షాళన చేసి జీవనదిగా మారుస్తాం మూసీ పరివాహక ప్రాంతాన్ని ప్రత్యేక కారిడార్‌గా అభివృద్ధి చేస్తాం ఈ ప్రభుత్వానికి ఎవరైనా.. ఎప్పుడైనా సూచనలు ఇవ్వొచ్చు ప్రభుత్వం అంటే పాలకపక్షం, ప్రతిపక్షం బానిస మనస్తత్వాన్ని ఇంకా కొందరు వదులుకోలేదు: మండలిలో సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని రకాల ఒడుదుడుకులు వచ్చినా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు: రేవంత్ రెడ్డి జైపాల్ రెడ్డి కృషితోనే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందింది ప్రజల స్వేచ్ఛను ఏడో హామీగా ఇచ్చాం ప్రగతి భవన్ ఉక్కు కంచెలు బద్ధలు కొట్టి.. చేసిన తప్పుల్ని సరిదిద్దాం కొందరు నేతలు ఇంకా బానిస మనస్తత్వాన్ని వదులుకోలేదు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే ప్రగతిభవన్ గేట్లు బద్దలుకొట్టాం ఇంకా బానిస మనస్తత్వాన్ని కొందరు నేతలు వదులుకోవడం లేదు బీఆర్ఎస్ నేతలు మోసం చేస్తూ వచ్చారు: మండలిలో సీఎం రేవంత్‌రెడ్డి రాచరిక పోకడలను ఉద్యమాలతో నిర్మూలించిన చరిత్ర తెలంగాణది ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు మూడోసారి ఉద్యమం చేశారు ఉద్యమ నేపథ్యం ఉన్నవాళ్లకు, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంటుంది ఇంతకాలం బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెబుతూ వచ్చారు తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం 10వ స్థానంలో ఉంది రైతుల ఆదాయంలో.. తెలంగాణ 25వ స్థానంలో ఉంది రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉంది రైతుల్ని ఆదుకుంటున్నామని అబద్ధం చెబుతూ వస్తున్నారు రైతుల ఆదాయం పెంచడానికి.. వ్యవసాయం రంగం అభివృద్ధికి సరైన ప్రణాళిక రచించలేదు నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది ఇప్పటికీ నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అదే వెనుకబాటుతనం ఉంది గవర్నర్ ప్రసంగం ఎమ్మెల్సీ కవిత అభ్యంతరం హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర అభ్యంతరం అభ్యంతరకరమైన వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించాలని ప్రతిపాదించిన ఎమ్మెల్సీ కవిత విముక్తి, అణచివేత, నియంతృత్వ పాలన, వ్యవస్థల విధ్వంసం, వివక్ష వంటి పదాలను గవర్నర్ ప్రసంగం నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ కవిత ప్రతిపాదన గవర్నర్ ప్రసంగంలోని అనుచిత వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ కవిత ప్రతిపాదన ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసింది మీడియా పాయింట్ వద్ద హరీష్ రావు వ్యాఖ్యలు ప్రధాన ప్రతిపక్షానికి కనీసం మాట్లాడే అవకాశం కూడా కల్పించలేదు బీఆర్ఎస్కే కాదు బీజేపీ, ఎంఐఎం పార్టీలకు కూడా మాట్లాడే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు అబద్ధాలు చెప్తూ గోబెల్స్ ప్రచారం చేసింది సత్య దూర మాటలు మాట్లాడింది కాంగ్రెస్ ప్రభుత్వం డెమొక్రాటిక్ గా ఉంటామని చెప్పి ఇప్పుడెందుకు ఇవ్వలేదు మేము మాట్లాడుతుంటే మా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు పీవీ నరసింహారావు చనిపోతే కనీసం నివాళులు అర్పించలేదు, కనీసం వెళ్లి చూడలేదు కాంగ్రెస్ పార్టీ గుంటెడు జాగా కూడా ఇవ్వలేదు అంజయ్యను అవమానించింది కాంగ్రెస్ అమరులను ప్రతిసారి నివాళులు అర్పించిన తర్వాతే కేసీఆర్ పనులు మొదలు పెడుతారు సచివాలయం ముందు అమరుల స్థూపం ముందు కట్టింది బీఆర్ఎస్ ‘‘జై తెలంగాణ అంటే.. కాల్చేస్తా’’ అంటూ గన్ను పట్టుకొని వచ్చింది రేవంత్ రెడ్డి యాది రెడ్డి శవాన్ని కనీసం చూడలేదు రేవంత్ రెడ్డి అనేక ఉద్యమ కేసులు మాపై ఉన్నాయి కేసులే లేవని అసెంబ్లీ చెప్తున్నాడు రేవంత్ రెడ్డి అసెంబ్లీ బుధవారానికి వాయిదా హరీశ్‌రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం గవర్నర్ ప్రసంగంపై కేవలం క్లారిఫికేషన్స్ అడగాలని సూచన సీఎం మాటలకు సమాధానం చెబుతానన్న హరీశ్‌రావు కాంగ్రెస్సే కుటుంబ పార్టీ అని కౌంటర్ పీవీ నరసింహారావును అవమానించారని ఫైర్ దీంతో సభను వాయిదా వేసిన స్పీకర్ సీఎం రేవంత్‌రెడ్డి స్పీచ్ ప్రగతిభవన్ గేట్లు బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించాం కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలనకే పరిమితమవుతుందని మరోసారి నిరూపించారు ఎంతోమంది సీనియర్లున్నా మాట్లాడేందుకు బీఆర్ఎస్ వారికి అవకాశమివ్వలేదు ప్రజాభవన్‌లో ప్రజావాణిని బీఆర్ఎస్ నేతలు భరించలేకపోతున్నారు హోం మంత్రిని ప్రగతిభవన్ లోపలికి రానివ్వలేదు గద్దరన్నను ఎండలో నిలబెట్టిన ప్రగతిభవన్ గేట్లను బద్దలు కొట్టాం ఫామ్ హౌస్ లో పండిన వడ్లకు 4200 లకు క్వింటాలు అమ్మారు ఎవరికి అమ్మినారో...ఎలా అమ్మారో విచారణకు సిద్ధమా బీఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకుంటే నేను విచారణకు అదేశిస్తా విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో లేదు ప్రతిపక్షంలో కూడా అబద్ధాలు చెప్తూనే ఉన్నారు కేంద్ర లెక్కల ప్రకారం తెలంగాణ 10వ స్థానంలో ఉంది గోవా పంజాబ్, హరియాణ మొదటి స్థానంలో ఉన్నాయి కాలువల ద్వారా నీళ్ళు ఇస్తే పంప్ సెట్లు పెరుగుతాయా? కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇస్తునం అనే వాదన శుద్ధ అబద్ధం తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అసెంబ్లీకి 15 నిమిషాలు టీ బ్రేక్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడిన తర్వాత టీ బ్రేక్ ఇచ్చిన స్పీకర్ కూనంనేనికి మంత్రి హరీశ్‌రావు ఛాలెంజ్ బీఆర్ఎస్ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ఎక్కడ చెప్పిందో నిరూపించాలి గవర్నర్ స్పీచ్‌పై కూనంనేని మాట్లాడితే మంచిదని సూచన తెలంగాణ అసెంబ్లీలో వైఎస్సార్‌పై పొగడ్తల వర్షం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని పొగిడిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఒక వ్యక్తి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అనేదానికి నిదర్శనం వైఎస్సార్ ఎవ్వరూ ఊహించని విధంగా వైఎస్సార్ పాలన సాగింది ఒక్కడే ఆరోగ్య, ఫీజు రీయింబర్స్మెంట్, పెన్షన్లు, ఇండ్లు, రేషన్, జలయజ్ఞం ఇలా అసాధ్యాలను సుసాధ్యం చేశారు వైఎస్ఆర్ ఎన్నో హామీలు ఇచ్చారు...అన్ని అమలు చేసి చూపించారు వైఎస్ఆర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, కమిట్మెంట్ తో పని చేశారు 50 ఏళ్లలో ఎంతో కొంత అభివృద్ధి జరిగింది గత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలోనూ అభివృద్ధి ఉంది ఏం చేయకపోవడం అనేది ఉండదు..అందరూ ఎంతో కొంత చేశారు గత బీఆర్ఎస్ తప్పులు జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకోవాలి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయొద్దు పార్టీ మార్పులను ప్రోత్సహించవద్దు ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను కాంగ్రెస్ కాపాడాలి కాంగ్రెస్- హామీలు చాలా ఇచ్చారు.. ఎన్ని నెరవేర్చారు అనేది ముఖ్యం. * బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయింది. * ముస్లింల అభివృద్దికి ఆ పార్టీలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. * కాంగ్రెస్‌కు మేము దగ్గర ఉన్నామంటే.. అందుకు కారణం మాజీ సీఎం, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాత్రమే. * ముస్లింల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ ఎంతో కృషి చేశారు - అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీకి మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ * అసెంబ్లీ ఛాంబర్లో సీఎం రేవంత్‌రెడ్డితో జైరాం రమేష్ భేటీ. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కామెంట్లు * ముస్లింలు కాంగ్రెస్, బీఆర్ఎస్ను గెలిపించారు కానీ వీళ్ళు మాత్రం ముస్లింలను గెలిపించడం లేదు. * వాళ్ళు కూర్చునే ప్లేస్ మారుతుంది కానీ మేము ఎప్పుడూ అలానే ఉన్నాం. * ముస్లింల కోసం మేము పోరాటం చేస్తున్నాం.. చేస్తూనే ఉంటాం. అసెంబ్లీలో బీఆర్ఎస్పై బీజేపీ ఎటాక్ • మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది కేంద్ర బీజేపీ. • కేంద్రం నుంచి కాంగ్రెస్‌ను కాపాడేందుకు మేము రెస్క్యూ చేస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకేటే అన్నట్లు అనిపిస్తోంది • మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పొన్నం ప్రభాకర్ • తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారని ప్రధాని మోదీ అవమానించారు - మంత్రి పొన్నం • తెలంగాణను అవమానించిన బీజేపీలో ఉండటంపై సిగ్గుపడాలి - మంత్రి పొన్నం • ఎంఐఎం, బీఆర్ఎస్, బీజేపీ.. ఒక్కటే అని బయట అనుకుంటున్నారు - పొన్నం ప్రభాకర్ * రేవుల ప్రకాశ్‌రెడ్డి, బాలు నాయక్, కౌసర్ మోయినొద్ధిన్, కూనం నేని సాంబశివరావులను ప్యానెల్ స్పికర్లగా ప్రకటించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ అరు గ్యారెంటీలు అన్నారు.. అందులో రెండు అమలు అన్నారు.. కానీ పూర్తిగా అమలు కావడం లేదు - కేటీఆర్ * మార్చ్ 17 వరకు ఆరు గ్యారెంటీలు అమలు కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. * హరీష్ రావు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడే ఆరోగ్య శ్రీ 10లక్షలు అమలు మేము చేశాం. * ప్రజావాణి ప్రతి మంగళవారం కలెక్టరేట్లో జరుగుతూనే ఉంది. * ఫస్ట్ కేబినెట్లో ఆరు గ్యారెంటీలకు చట్ట భద్దత తెస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. ఇప్పటికీ మూడు కేబినెట్లు అయ్యాయి కానీ కాలేదు. * 2లక్షల రుణమాఫీ అన్నారు చెప్పిన డేట్ దాటిపోయింది. * రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి డీఎస్సీ, జాబ్ గ్యారెంటీ అన్నారు కానీ కాలేదు. * మేము చేసిన అభివృధి కంటే ఎక్కువ అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. * అమరుల గురించి గవర్నర్ ప్రసంగంలో ఉంది. అమరులకు కారణం ఎవరు? అందరికీ తెలుసు! * ఆల్రెడీ శ్వేత పత్రాలు ఉన్నాయి. కొత్తగా బయట పెట్టాల్సిన అవసరం లేదు. అప్పుల సాకు చెప్పి ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టెందుకు ప్లాన్ వేస్తున్నారు: కేటీఆర్ * ట్రాన్స్‌కో ఆస్తులు 24వేలు జెంకో 53వేలు, డిస్కాంలు 59వేల ఉన్నాయి. * 81వేల అప్పులు ఉంటే.. 1లక్ష 75వేలు ఉన్నాయి. * ఆనాడు కొత్త ప్రభుత్వానికి 11వేల డిస్కాంల అప్పులు వదిలేస్తే దానితో పాటు 9వేల కోట్లు చెల్లించాం. * మహిళలకు, మధ్యతరగతి ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి. * అప్పుల కంటే ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి. గతంలో వైఎస్సార్ గొప్పతనాన్ని, అభివృద్ధిని కేసీఆర్ గొప్పగా చెప్పారు * విద్యుత్ డిమాండ్, పంప్సెట్ల సంఖ్య మా ప్రభుత్వంలో పెరిగింది. * గావు కేకలతో విద్యుత్ సంస్థలు బాగుపడవు. * 2014లో 24లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 1కోట్లు 30లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పెరిగింది. కాంగ్రెస్ నాయకులు కష్టపడి కట్టుకున్న పుట్టలో చీమలు చొరబడట్లు పార్టీలోకి చొరబడి సీఎం అయింది రేవంత్ రెడ్డి: ఎమ్మెల్యే కేటీఆర్ * తెలంగాణ ప్రజలు ఎన్నుకుంటే రేవంత్ రెడ్డి సీఎం అవ్వలేదు.. హైకమాండ్ చేస్తే అయ్యారు. * బయటదేశం నుంచి వచ్చిన వాళ్లకు అధ్యక్షులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐల గురించి మాట్లాడితే ఎలా? * NRI అంటే బయట వాళ్ళే అనే కాంగ్రెస్ నాయకుల మాటలు ఎన్ఆర్ఐలు ఆలోచన చెయ్యాలి. * బస్సు, బంగారం ఫ్రీ అని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. * అధికారంలో కూర్చున్న ఒక్కరికీ కూడా ఐటీఐఆర్ తెల్వదు. * అభ్యుదయం తెల్వని వాళ్ళు అవాస్తవాలు చెప్తున్నారు. • పదవులను గడ్డిపోసలెక్క వదిలేసిన చరిత్ర కేసీఆర్‌ది : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు. • ఏబీవీపీ నుంచి మొదలై టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చి రేపు ఎక్కడా రేవంత్‌రెడ్డి ఉంటారో తెలియదు • పదవుల కోసం పార్టీలు మారిన చరిత్ర మీది.. మాది కాదు. శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కామెంట్లు.. * గత ఐదేళ్లుగా ఇందిరమ్మ రాజ్యం ఎలా ఉందో బీఆర్ఎస్ చెప్తూనే ఉంది. కానీ ప్రజలు మళ్ళీ కాంగ్రెస్‌కే అధికారం ఇచ్చారు. * గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడితే బాగుంటుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కామెంట్లు.. * సీఎం రేవంత్‌రెడ్డి సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారు * మేం పొత్తు పెట్టుకోవటం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. * ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది కేసీఆరే. కొంతమంది ఎన్ఆర్ఐలకు తెలంగాణ ప్రజాస్వామ్యం విలువ తెలియదు: సీఎం రేవంత్‌రెడ్డి * గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, సింగిల్ విండో చైర్మెన్‌గా ఓడినా కేసీఆర్‌ను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీనే. * వైఎస్ఆర్ పాలనలో కేసీఆర్ కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా లేకుండా మంత్రిగా చేశారు. * ప్రతిపక్షాలకు 2014కు ముందు అభివృధిపై చర్చ కావాలంటే ఒక రోజు అంతా చర్చించుకుందాం. * కేటీఆర్ చెప్పే పాపాల్లో ఇప్పుడు ఆయన చుట్టూ కూర్చున్న వాళ్ళదే పాత్ర ఉంది. * ఐదేళ్లు సమయం ఉంది. జరిగిన విధ్వంసం ఏంటో అన్ని బయటపడతాయి. * పిల్లి శాపనార్థాలకు ఉట్లు తేగిపడవు. గవర్నర్ ప్రసంగం పై కేటీఆర్ మాట్లాడుతుండగా గందరగోళం • కేటీఆర్ వ్యాఖ్యలను తప్పు పట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ • పదేళ్ల పాలన పై కాంగ్రెస్ చర్చ జరగాలి అంటే.. 50 ఏళ్ల పాలనపై చర్చ జరగాలని బీఆర్ఎస్ పట్టు • ఆనాడు అన్యాయం జరిగింది కాబట్టే తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిందన్న భట్టి • సంపద రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే • తెలంగాణ అంటే 2014 నుంచి మాత్రమే లెక్క వేయాలన్న భట్టి విక్రమార్క • బీఆర్ఎస్కు గోదావరి, కృష్ణలో ఒక్క చుక్క నీళ్లు తెలీదు • బీఆర్ఎస్ పాలన విధ్వంసం చేసింది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్లు.. * ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు చేస్తే స్వాగతిస్తాం. * ప్రజాస్వామ్య యుతంగా సభను నడుపాలని మేము అనుకుంటున్నాం. * అదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ప్రతీ గల్లికి నీళ్ళు కాంగ్రెస్ పాలనలో నీళ్ళు ఇచ్చింది మేము లెక్కలు చెప్పగలం. కేటీఆర్ స్పీచ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డగింత * తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ తెచ్చుకున్నాం - పొన్నం ప్రభాకర్ మంత్రి గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూత కల్పనగా ఉంది - కేటీఆర్ * గవర్నర్ దారుణమైన ప్రసంగం విన్నాక రాష్ట్రం ఎలా ఉండబోతుందో అర్థం అవుతోంది. * నక్క మోసం చేయనని, పులి మాంసం తినను అని వాగ్వాదం ఇచ్చినట్లు గవర్నర్ ప్రసంగం ఉంది. * మేము ఎక్కడ ఉన్న ఉన్నా ప్రజా పక్షమే. * కాంగ్రెస్ పాలనలో త్రాగు, సాగు, కరెంట్ దిక్కు లేదు. * నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ తప్ప ఏమైనా ఉందా? * కాంగ్రెస్ పాలనలో 50 ఎకరాల రైతు అయినా సరే గుంపు మేస్త్రి లాగా ఉండేవారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కామెంట్లు... * ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. * తెలంగాణ వస్తె భవిషత్ భాగుపడుతుందని ప్రజలు ఆశించారు. * గత ప్రభుత్వం పాలనలో చాలా లోపాలు ఉన్నాయి. * కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ చేపట్టాలి. * రీ డిజైన్ ఎందుకు చేశారో? వేల కోట్లు ఎందుకు ఖర్చు చేశారో తేల్చాలి. * బీఆర్ఎస్ పాలనలో పవర్ కార్పొరేషన్ వేల కోట్ల అప్పుల్లోకి వెళ్ళింది. * బీఆర్ఎస్ పాలనలో నియంతృత్వం కొనసాగింది, అక్రమ కేసులు పెట్టారు. * రేవంత్ సీఎం అవ్వగానే ప్రగతి భవన్ వద్ద ముళ్ళ కంచెలు తొలగించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. * 90శాతం వరకు మిషన్ భగీరథ నీళ్ళు రాలేదు. * ఏ గ్రామాల్లో కూడా డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టలేదు. * ఇందిరమ్మ పాలన మళ్ళీ తెలంగాణలో రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. * 60వేల ఉద్యోగులున్న సింగరేణి, బీఆర్ఎస్ వచ్చాక 39వేలకు పరిమితం అయింది. * తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు. * మూడు వందల రిటైర్డ్ అధికారులకు మళ్ళీ ఉద్యోగం కల్పించారు. * ప్రతి ఫైల్ పై విచారణ జరిగితే నిజాలు తెలుస్తాయి. గత పదేళ్లు ఎన్నో నిర్బంధాలకు గురి అయ్యాము: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి •బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా ప్రాంతానికి తీరని అన్యాయం జరిగింది. •రీ-డిజైన్ పేరుతో బీఆర్ఎస్ మా ప్రాంతానికి తీరని అన్యాయం చేసింది. • ఫార్మసీటి రద్దు చేస్తాం, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తాం • బాసర ట్రిపుల్ ఐటి టైప్ మరో నాలుగు ఏర్పాటు చేస్తాం. • ధరణి ప్లేస్ భూమాత ఏర్పాటు చేస్తాం, బెల్ట్ షాప్ లను రద్దు చేస్తాం. • బిసి కుల గణన చేస్తాం, ప్రతి జిల్లాకు బిసి భవన్ ఏర్పాటు చేస్తాం. • ప్రజల కోసం ఎదైనా నిరసనకు పిలుపునివ్వగానే ఇంటి ముందు పోలీసులు ఉండే వాళ్ళు. • రేవంత్ రెడ్డి సీఎం అయిన 24గంటల్లోనే ప్రగతి భవన్ కంచెలు తొలగించారు. • గత ప్రభుత్వం ఇంట్లో ఒకరికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవాళ్లు.. మేము అర్హులైన అందరికీ ఇస్తాం. • వచ్చే వంద రోజుల్లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తాం. • వికారాబాద్, పరిగి సెగ్మెంట్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ గత ప్రభుత్వం ప్రారంభించలేదు. • గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రతిపాదించారు. • చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ బలపరిచారు • రెండవ అతిపెద్ద పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లు స్పీకర్ వెల్లడి • గవర్నర్ ప్రగంగంపై మొదలైన ధన్యవాదాల తీర్మానం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు • ప్రతిపక్ష పార్టీ నేతగా కేసీఆర్‌ను సభలో ప్రకటించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ • శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గవర్నర్ ధన్యవాదాల తీర్మానంపై మాట్లాడనున్న మధుసూదనా చారి, దేశపతి శ్రీనివాస్ బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో సమావేశమైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు • హాజరైన కేటీఆర్,హరీష్ రావు, తలసాని • గవర్నర్ ప్రసంగంపై కౌంటర్ ఎటాక్ చేయాలని నిర్ణయం శాసనసభ, శాసనమండలి ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. • గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో నేడు చర్చ • ప్రభుత్వ సమాధానం ఉండనుంది. • కొత్త అసెంబ్లీ కొలువు తీరిన తర్వాత జరుగుతున్న మొదటి చర్చపై ఆసక్తి • నేడు శాసనసభతో పాటు మండలిలోనూ గవర్నర్ ప్రసంగం ధన్యవాదాలు తీర్మానం పై చర్చ ఉంటుంది. • అసెంబ్లీలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదా తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. • చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద బలపరుస్తారు. • మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు • టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బలపరుస్తారు. • బీఅర్ఎస్ పార్టి తరపున గవర్నర్ ప్రసంగంపై ఎమ్మెల్యేలు కేటీఅర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు మాట్లాడనున్నారు. • గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ విధానాలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగంలో తీవ్రంగా విమర్శించారు. • అప్పులు భారీగా పెరిగాయని, వ్యవస్థలను దెబ్బ తీశారని గవర్నర్ ఆరోపించారు. • కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న మొదటి చర్చపై నెలకొన్న ప్రాధాన్యత. • గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగానికి, ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఎలా సాగుతుందన్న దానిపై ఆసక్తి. • అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, కాంగ్రెస్ గెలుపు అనంతరం జరుగుతున్న మొదటి చర్చ హాట్ హాట్‌గా సాగనుంది. • గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచిన అంశాలపై బీఆర్ఎస్ సభా వేదికగా ఎలా స్పందించనుంది..? • సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం ఎలా ఉండనుంది అన్న అంశం ఆసక్తికరంగా మారింది..? • ఆరు గ్యారంటీలను అమలు చేయకపోతే అసెంబ్లీ వేదికగా పోరాటమే అంటున్న - బీజేపీ ఎమ్మెల్యేల హెచ్చరిక. • ఇంకా కాన్స్టిట్యూట్ కానీ బిజినెస్ అడ్వైజర్ కమిటీ. • బీజేపీ, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ల ఎంపిక విషయంలో స్పీకర్ కార్యాలయానికి అందని లేఖలు • ఇక ఈ నెల 9న సమావేశాలు ప్రారంభమయ్యాయి. • సభ్యుల ప్రమాణ స్వీకారాలు, స్పీకర్ఎన్నిక జరిగింది. • ఉభయ సభల సంయుక్త సమావేశంలో సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఇప్పటి వరకు జరిగాయి. -
రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
-
ఆ విషయంపై క్లారిటీ కావాలి: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ పెట్టుబడిపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదని.. క్లారిటీ కావాలంటూ కొత్త ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. రైతులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోందన్నారు. శనివారం అసెంబ్లీ సమావేశాల ముగింపు అనంతరం మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. విమర్శలు చేయడానికి తాము రాలేదన్నారు. ‘‘ఓ వైపు వర్షాలు పడుతున్నాయి. బోనస్ ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి. రైతు బంధు రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. డిసెంబర్ 9న ఇస్తామని చెప్పింది కానీ ఇవ్వటం లేదు. మేం అధికారంలో ఉన్నపుడు నవంబర్ చివరి వారం, డిసెంబర్ మొదటి వారంలో వేశాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా ఎప్పటి లోగా ఇస్తారో స్పష్టత ఇవ్వాలి. యాసంగి పంట వేసే సమయం వచ్చింది దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. డిసెంబర్ 9న వచ్చిన ప్రభుత్వం నుంచి స్పందన లేదు’’ అని హరీష్‌రావు విమర్శించారు. ఇదీ చదవండి: మహాలక్ష్మీ పథకం ప్రారంభం.. మహిళలకు ఉచిత ప్రయాణం -
తెలంగాణ అసెంబ్లీ గురువారానికి వాయిదా
Live Updates.. తెలంగాణ శాసనసభ వచ్చే గురువారానికి వాయిదా రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం, ఉచిత బస్సు ప్రయాణం పథకాలు ప్రారంభిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించిన ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయని ఇద్దరు మంత్రులు ప్రమాణం చేయని ఉత్తమ్‌కుమార్, కోమటిరెడ్డి వారిద్దరూ ఎంపీలుగానే ఉన్నారు. ఇంకా ఎంపీ పదవులకు రాజీనామా చేయని కారణంగా నేడు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయలేదు. రాజ్‌భవన్‌కు బీజేపీ ఎమ్మెల్యేలు.. బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఎంపికపై గవర్నర్‌కు ఫిర్యాదు. గవర్నర్ తమిళిసై లేకపోవడంతో రాజ్‌భవన్ సెక్రటరీకి వినతి పత్రం అందజేత బీజేపీ ఎమ్మెల్యేలు సీనియర్లు కాదని మజ్లిస్ ఎమ్మెల్యేను కావాలనే ప్రొటెం స్పీకర్ చేశారని ఫిర్యాదు. శాసనసభ సంప్రదాయాలను కాలరాస్తున్నారని ఆగ్రహం. నేడు రెండు పథకాలకు శ్రీకారం.. మధ్యాహ్నం ఒంటి గంటకు అసెంబ్లీ ఆవరణలోని ఒకటో గేటు వద్ద రెండు పథకాలను ప్రారంభించనున్న సీఎం రేవంత్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం పేదలందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల ఉచిత వైద్య సదుపాయం చేయూత. కొలువుదీరిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీలకు శ్రీకారం. నేడే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతులమీదుగా ప్రారంభం. 👉 ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం. 👉 రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం 10 లక్షలు. ప్రగతి పథం.. సకల జనహితం.. మన ప్రజా ప్రభుత్వం!… pic.twitter.com/stqOjkF10T — Telangana Congress (@INCTelangana) December 9, 2023 అందుకే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాం: కిషన్‌రెడ్డి శాసనసభ గౌరవాన్ని కాలరాసేలా ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది. సీనియర్ సభ్యులు ఉన్నా ఎంఐఎంతో ఒప్పందం మేరకు అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించింది. సభా నియమాలను తుంగలో తొక్కడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది అందుకే ఇవాళ అసెంబ్లీని బహిష్కరించాలని నిర్ణయించాం ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఎంఐఎం ఒకటేనన్న కాంగ్రెస్ అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎలా నియమించింది. సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించి ఆయన ఆధ్వర్యంలోనే స్పీకర్ ఎన్నిక జరగాలని డిమాండ్ చేస్తున్నాం ఇదే విషయాన్ని గవర్నర్‌ను కలిసి కోరుతాం గాంధీభవన్‌లో సీఎం రేవంత్ కామెంట్స్.. భుజాలు కాయలు కాసేలాగా కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాదాలు కార్యకర్తల వల్లే మేం సీట్లలో కూర్చున్నాం ఎన్ని రాజకీయ ప్రకంపనలు ఎదురైనా ఉక్కు సంకల్పంతో సోనియా తెలంగాణ ఇచ్చారు తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో మనం చూడలేదు తెలంగాణ తల్లి సోనియా లాగే ఉంటుందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు లక్షలాది తెలంగాణ బిడ్డలకు సోనియానే తల్లి డిసెంబర్ ఏడో తేదీన సోనియా ఎల్బీ స్టేడియంలోకి ఎంటర్ అయ్యే క్షణాలని నేను ఎప్పటికీ మర్చిపోలేను డిసెంబర్ 9, 2017న గాంధీ భవన్లో అడుగుపెట్టాను డిసెంబర్ 9, 2023న ప్రభుత్వం ఏర్పాటు అయింది పాలకుడిగా కాకుండా సేవకుడిగా ఉంటాను పది సంవత్సరాలు కార్యకర్తలు వేల కేసులు ఎదుర్కున్నారు కార్యకర్తలకు మాట ఇస్తున్నాను. ఈ ప్రభుత్వం కార్యకర్తలది సోనియా గాంధీ 100 సంవత్సరాలు సంతోషంగా జీవించాలి శాసనసభలో అడుగు పెడుతున్న సందర్భంగా ప్రజల ఆశీర్వాదం ఇవ్వాలి ►సభకు హాజరైన 109 మంది ఎమ్మెల్యేలు. ►అనారోగ్యం కారణంగా సభకు హాజరు కాని కేసీఆర్, కేటీఆర్ ►సభకు బీజేపీ సభ్యులు ఎనిమిది మంది గైర్హాజరు ►మొదట రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు ప్రమాణ స్వీకారం.. ►ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ. ►తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ► తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన 51 మంది ఎమ్మెల్యేలు ►అసెంబ్లీ సమావేశాలకు బాయ్‌కాట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు ►కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం ►అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ►రేవంత్‌కు స్వాగతం పలికిన మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్, అసెంబ్లీ సెక్రటరీ ►అసెంబ్లీ ఆవరణలోని బంగారు మైసమ్మ ఆలయంలో రేవంత్ ప్రత్యేక పూజలు. ►అసెంబ్లీకి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ►భట్టి తో పాటు అసెంబ్లీకి వచ్చిన పొంగులేటి, తుమ్మల గన్‌పార్క్ వద్ద కోలాహలం గన్‌పార్క్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఎదురుపడిన రెండు పార్టీల నేతలు గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుంటున్న మంత్రులు కొత్త మంత్రులు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. అసెంబ్లీకి చేరుకున్న మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ గాంధీ భవన్లో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు.. గాంధీభవన్‌లో సోనియ బర్త్ డే సెలబ్రేషన్స్.. 78 కిలోల కేట్ కట్ చేసి శుభాకాంక్షలు చెపుకున్న కాంగ్రెస్ నేతలు సోనియా పుట్టినరోజు సందర్బంగా కేక్ కట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, వీహెచ్, మాణిక్‌రావ్ ఠాక్రే ఇతర నేతలు డిప్యూటీ సీఎం భట్టి ,మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,తుమ్మల, సీతక్క, కొండా సురేఖ ,పొన్నం ప్రభాకర్, హాజరైన పార్టీ నేతలు. భట్టి కామెంట్స్.. గాంధీభవన్ ఆశయాలను నెరవేరుస్తాం సోనియా గాంధీ కలలు కన్న సంక్షేమ రాజ్యాన్ని స్థాపిస్తాం. ప్రజలు మెచ్చేలా పాలన ఉంటుంది రాష్ట్ర సంపద ప్రజలకు పంచుతాం. తెలంగాణభవన్‌లో ముగిసిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్‌ను ఎన్నుకున్న పార్టీ ఎమ్మెల్యేలు బస్సులో అసెంబ్లీకి బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణభవన్ నుంచి గన్‌పార్క్‌కు బయలుదేరిన ఎమ్మెల్యేలు గన్‌పార్క్ వద్ద నివాళులు అర్పించనున్నారు అసెంబ్లీకి హాజరుకానున్న ఎమ్మెల్యేలు కేసీఆర్ పేరును ప్రతిపాదించిన పోచారం.. బలపరచిన తలసాని, కడియం శ్రీహరి శాసనభాపక్ష మిగతా కమిటీని ఎంపిక చేసే బాధ్యత కేసీఆర్‌కు అప్పగింత. బీజేపీ నేతల కీలక నిర్ణయం.. అసెంబ్లీ బహిష్కరించాలని బీజేపీ నిర్ణయం ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రమాణం చేయవద్దని డిసైడ్ అయిన కమలం పార్టీ అక్బరుద్దీన్ ఓవైసీ ముందు ప్రమాణం చేసేందుకు ససేమీరా అన్న బీజేపీ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోనున్న ఎమ్మెల్యేలు ఈరోజు ఉదయం 10:30 గంటకు మీడియాతో మాట్లాడనున్న కిషన్ రెడ్డి ►అసెంబ్లీ ప్రారంభానికి ముందే మంత్రులకు శాఖల కేటాయింపు ►శాఖల కేటాయింపుపై ఇప్పటికే కేసీ వేణుగోపాల్‌తో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. ►ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ►అక్బరుద్దీన్ ఒవైసీతో ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళిసై #WATCH | AIMIM MLA Akbaruddin Owaisi takes oath as Pro-tem Speaker of Telangana Legislative Assembly, in Raj Bhawan, Hyderabad pic.twitter.com/PpMoZhOvjy — ANI (@ANI) December 9, 2023 ►ప్రొటెం స్పీకర్ ప్రమాణానికి బీజేపీ దూరం ►బీఆర్ఎస్ నుంచి హాజరైన పోచారం శ్రీనివాస్, మాజీ మంత్రి హరీశ్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి. ►రాజ్‌భవన్ దర్బార్ హాల్లో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం ►కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం, మంత్రులు ►తెలంగాణ మూడో శాసన సభకు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ►చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యేగా ఉన్న అక్బరుద్దీన్ ►రాజ్‌భవన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ►కాసేపట్లో రాజ్‌భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం. ►అక్బరుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ►నేడు ప్రమాణ స్వీకారానికి బీజేపీ ఎమ్మెల్యేలు దూరం. ►తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ శనివారం ఉదయం 11 గంటలకు తొలిసారిగా కొలువు దీరనుంది. ►తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. ►కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం, ధన్యవాద తీర్మానం తదితరాల కోసం నాలుగు రోజుల పాటు అసెంబ్లీ తొలి సమావేశాలు జరుగనున్నాయి. తొలిసారిగా అసెంబ్లీకి 51 మంది ►అన్ని పార్టీల తరఫున కలుపుకుని మొత్తం 51 మంది తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు కాగా, కరీంనగర్ జిల్లా నుంచి 8 మంది తొలిసారిగా ఎన్నికైన వారున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇద్దరు తొలిసారి అడు గు పెడుతున్నారు. 51 మందిలో 18 మంది క్రియాశీల రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేస్తున్న వారే. రాజ్‌భవన్‌లో అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం ►తొలిరోజు సమావేశంలో కొత్తగా ఎన్నికైన 119 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ►ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏఐఎంఐఎం సీనియర్ శాసన సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్‌గా నామినేట్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. ►ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్‌తో రాజ్‌భవన్‌లో శనివారం ఉదయం 8.30కు గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ►సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రివర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ►ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ప్రొటెమ్ స్పీకర్ అధ్యక్షతన తెలంగాణ మూడో శాసనసభ తొలిరోజు సమావేశం ప్రారంభమవుతుంది. ►తొలుత సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ►ఆ తర్వాత తెలుగు అక్షరమాలలోని అక్షర క్రమంలో ఎన్నికైన ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. బీఆర్ఎస్కు విపక్ష హోదా ►శాసనసభలో మొత్తం 119 మంది సభ్యులకు గాను తెలంగాణ మూడో శాసనసభలో అధికార కాంగ్రెస్‌కు 64, మిత్రపక్షం సీపీఐకి ఒకరు చొప్పున ఎమ్మెల్యేల బలం ఉంది. బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఏఐఎంఐఎంకు ఏడుగురు సభ్యుల బలం కలిగి ఉన్నాయి. అధికార కాంగ్రెస్ తర్వాత ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్కు విపక్ష హోదా దక్కే అవకాశముంది. ►బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. ►ఈ మేరకు శనివారం ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ తరపున శాసనసభకు ఎన్నికైన 38 మంది ఎమ్మెల్యేలు తెలంగాణభవన్‌లో భేటీ అవుతున్నారు. ►బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేల భేటీకి అధ్యక్షత వహిస్తారు. ►కేసీఆర్‌ను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వీలుగా ఈ భేటీలో ప్రవేశపెట్టే తీర్మానాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆమోదిస్తారు. నేడు స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ ►శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత స్పీకర్ ఎన్నిక కోసం శనివారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల కానుంది. వికారాబాద్ శాసనసభ్యుడిగా ఎన్నికైన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను శాసనసభ స్పీకర్‌గా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఆయన శనివారం సాయంత్రం సీఎం రేవంత్, మంత్రివర్గం సమక్షంలో నామినేషన్ సమర్పిస్తారని తెలిసింది. ►కాగా రెండో రోజు ఆదివారం స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బాధ్యతల స్వీకరణ కార్యక్రమం, ఆ తర్వాత కొత్త స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. ఈ నెల 11న సోమవారం జరిగే మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత వాయిదా పడే సభ తిరిగి 12వ తేదీ మంగళవారం ఉదయం ప్రారంభమవుతుంది. నాలుగో రోజు సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడుతుంది. -
ప్రతిపక్షం పలాయనం
సాక్షి, అమరావతి: తాము చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు కళ్లకు కట్టినట్టు వివరించడానికి అధికార పక్షానికి.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షానికి శాసనసభ సమావేశాలు సరైన వేదిక. అధికార పక్షం నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తూ శాసనసభ సమావేశాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే.. చంద్రబాబు చేసిన అక్రమాలతో ఆత్మరక్షణలో పడ్డ ప్రతిపక్షం పలాయనం చిత్తగించి అభాసుపాలైంది. గత 52 నెలల్లో సంక్షేమ, అభివృద్ధి, పథకాల ద్వారా ప్రజలకు చేసిన మంచిని వివరించడంతోపాటు టీడీపీ సర్కార్ హయాంలో జరిగిన కుంభకోణాలను సాక్ష్యాధారాలతో బయటపెట్టడంలో అధికార పక్షం విజయవంతమైంది. స్కిల్ స్కామ్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును అరెస్ట్ చేయడంపై శాసనసభ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ప్రజలకు వాస్తవాలు తెలిసేలా గళమెత్తుతామని బీరాలు పలికిన ప్రతిపక్ష సభ్యులు చిల్లర చేష్టలు, వెకిలి వేషాలు, అసభ్య సైగలు చేస్తూ లేకి ప్రవర్తనతో ఆత్మరక్షణలో పడి రెండ్రోజుల్లోనే పలాయనం చిత్తగించారు. ఇదీ శాసనసభ సమావేశాలు జరిగిన తీరు. ఈనెల 21న ప్రారంభమైన శాసనసభ సమావేశాలు బుధవారం ముగిశాయి. ఐదు రోజులపాటు సమావేశాలు జరిగాయి. ఆత్మరక్షణలో ప్రతిపక్షం స్కిల్ స్కామ్‌లో ప్రభుత్వ ఖజానా నుంచి రూ.371 కోట్లు దోచేసి, సీఐడీ పోలీసులకు దొరికిపోయిన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపింది. ఈ ఉదంతంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని.. ప్రజలకు వాస్తవాలను వివరించేలా గళమెత్తి అధికార పక్షం కక్ష సాధింపు చర్యలను జనంలోకి తీసుకెళ్తామని టీడీపీ శాసనసభా పక్షం ప్రకటించింది. తీరా శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాక ఆత్మరక్షణలో పడిపోయింది. స్కిల్ స్కామ్‌తోపాటు ఫైబర్ నెట్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ సహా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలు చర్చకు వస్తే చంద్రబాబు అక్రమాల బాగోతం సాక్ష్యాధారాలతో సహా అధికారపక్షం గుట్టురట్టు చేయడం ఖాయమని.. అప్పుడు ప్రజల్లో మరింత చులకనవుతామని భావించిన ప్రతిపక్షం వ్యూహం మార్చింది. ఎలాగైనా సరే సస్పెన్షన్ వేటు వేయించుకుంటే చర్చ నుంచి తప్పించుకోవడంతోపాటు సభ నుంచి బయటకు వచ్చాక అధికార పక్షం తమ గొంతు నొక్కుతోందంటూ రాద్ధాంతం చేసి చంద్రబాబు కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లింపవచ్చని ఎత్తు వేసింది. ఆ వ్యూహంలో భాగంగా తొలి రోజు, రెండో రోజూ స్కిల్ స్కామ్‌పై చర్చకు సిద్ధమని అధికార పక్షం స్పష్టం చేసినా వినకుండా స్పీకర్ పోడియంను చుట్టుముట్టి.. పేపర్లు చింపి విసిరేస్తూ వీధి రౌఢీల్లా అరుపులు, కేకలు వేస్తూ.. బూతులు తిడుతూ ప్రతిపక్ష సభ్యులు వీరంగం చేశారు. బాలకృష్ణ అయితే మీసం మెలేసి.. అసభ్య సైగలు చేస్తూ లేకిగా ప్రవర్తించి చట్టసభల ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించి సస్పెన్షన్ వేటు వేయించుకున్నారు. శాసనభలో మొదటి రోజు, రెండో రోజు ప్రతిపక్షం లేకి ప్రవర్తనను ప్రజలు అసహ్యంచుకోవడంతో.. అకారణంగా తమను సస్పెండ్ చేస్తూ అధికార పక్షం తమ గొంతు నొక్కుతోందని.. అందుకే తాము శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నామంటూ ప్రతిపక్షం పలాయన మంత్రం జపించింది. ప్రజాపక్షమై ప్రతిధ్వనిస్తూ.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా చేసిన మేలును శాసనసభ సాక్షిగా అధికార పక్షం ప్రజలకు వివరించింది. టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానం మేరకు స్కిల్ స్కామ్‌పై చర్చను చేపట్టి.. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.371 కోట్లను అప్పటి సీఎం చంద్రబాబు ఎలా దోచుకున్నారన్నది సాక్ష్యాధారాలతో ప్రజలకు వివరించడంలో సక్సెస్ అయ్యింది. ఇదే క్రమంలో ఫైబర్ గ్రిడ్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు స్కామ్‌లతో చంద్రబాబు, లోకేశ్ అధికార దుర్వినియోగానికి పాల్పడి.. ప్రభుత్వ ఖజానాను దోచేయడంతోపాటు తమ వందిమాగధులకు ఎలా లబ్ధి చేకూర్చారన్నది సాక్ష్యాధారాలతోసహా ప్రజల ముందు పెట్టింది. ప్రజాధనానికి ధర్మకర్తగా వ్యవహరించాల్సిన బాధ్యతను నిర్వర్తించే క్రమంలోనే దర్యాప్తు సంస్థ సీఐడీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని.. స్కిల్ స్కామ్‌లో అడ్డంగా దొరికిన చంద్రబాబును ఆ సంస్థ అరెస్ట్ చేసిందని వివరించింది. ఈ వ్యవహారంలో ఎలాంటి కక్ష సాధింపులు లేవని.. ప్రజాధనానికి ధర్మకర్తగా వ్యవహరించాల్సిన బాధ్యతను త్రికరణ శుద్ధితో నిర్వర్తిస్తున్నామనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో అధికార పక్షం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. -
Live: ఐదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-
ఏపీ అసెంబ్లీలో కీలక బిల్లులు పాస్
-
ఏపీ విద్యార్థులు ఐక్యరాజ్య సమితి లో ప్రసంగించడం హర్షణీయం
-
జగనన్న హయాంలోనే ఇది సాధ్యమయ్యింది
-
Live: మూడోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-
బాలకృష్ణ, టీడీపీ నేతల చిల్లరి వేషాలు...ఎమ్మెల్యే కిలారి కౌంటర్
-
పలాయనవాదమే లక్ష్యం
సాక్షి, అమరావతి : అసెంబ్లీలో ఏం మాట్లాడాలో దిక్కుతోచక, ఏం మాట్లాడితే ఏమవుతుందోననే భయంతో టీడీపీ పలాయనవాదాన్ని నమ్ముకుని, ఆచరిస్తోంది. ఇందులో భాగంగానే చట్టసభల ఖ్యాతిని దిగజారుస్తూ చిల్లర వ్యాఖ్యలతో స్పీకర్, అధికార పక్ష సభ్యులను చిరాకుపరుస్తోంది. తద్వారా సస్పెన్షన్ వేటు వేయించుకుని బయటకు జారుకోవచ్చనే వ్యూహంతో ముందుకు వెళుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అడ్డంగా బుక్కై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండటంతో టీడీపీ సభ్యుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. దీంతో సభలో ‘స్కిల్’ స్కామ్‌పై మాట్లాడే అవకాశం ఇచ్చినప్పటికీ, జైల్లో సౌకర్యాల గురించి అడ్డగోలుగా తప్పులు పట్టడం మినహా.. ఆయన నేరం చేయలేదని చెప్పేందుకు అవకాశం, ఆధారం లేక సభలో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది. గురు, శుక్రవారాల్లో శాసనసభ సమావేశాల్లో టీడీపీ సభ్యుల ప్రవర్తనే ఇందుకు సాక్షంగా నిలుస్తోంది. రెండవ రోజు శుక్రవారం కూడా టీడీపీ ఎమ్మెల్యేలు తమ స్థాయిని మరిచి వ్యవహరించారు. ఆకతాయిల మాదిరిగా స్పీకర్‌ను చుట్టుముట్టి ఆయనపై కాగితాలు చింపి విసిరేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. నినాదాలు చేస్తూ, బయటి నుంచి తెచ్చుకున్న విజిల్స్ ఊదుతూ అధికార పార్టీ సభ్యులను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. కుర్చీలు, బల్లలపై ఎక్కి తీవ్ర గందరగోళాన్ని సృష్టించారు. చంద్రబాబు అరెస్ట్ అంశంపై సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దమ్ముంటే చర్చలో పాల్గొనాలని మంత్రులు సవాల్ విసిరినా పట్టించుకోలేదు. సభా సమయాన్ని వృధా చేయడమే లక్ష్యంగా గొడవ సృష్టించేందుకు యత్నించారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్ఫోన్లలో చిత్రీకరిస్తున్న ఇద్దరు సభ్యులను స్పీకర్ సెషన్ మొత్తం సస్పెన్షన్ వేటు వేయగా, మరో ముగ్గురిని ఒకరోజు సస్పెన్షన్ చేశారు. దీంతో మిగిలిన టీడీపీ సభ్యులు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్–చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై చేపట్టిన స్వల్ప కాలిక చర్చలో పాల్గొనకుండా పలాయనం చిత్తగించారు. సభ ప్రారంభమైంది మొదలు.. రెండో రోజు శాసనసభ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు మొదలు పెట్టారు. సభ్యులడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు మంత్రి గుడివాడ అమర్నాథ్ సిద్ధమయ్యారు. టీడీపీ సభ్యులు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ సభలోకి వస్తూనే స్పీకర్ పోడియం వైపునకు దూసుకెళ్లారు. స్పీకర్ చైర్‌ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చలో పాల్గొని మీ వాదన వినిపించుకోవచ్చన్నారు. అయినా తక్షణమే చర్చకు పట్టుబడుతూ స్పీకర్‌పై కాగితాలు విరుసుతూ నినాదాలు చేయడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. రెండోసారి సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యుల చుట్టూ మార్షల్స్‌తో మూడంచెల భద్రత వలయాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ తీరుపై మండిపాటు టీడీపీ సభ్యుల తీరుపై మంత్రులతో సహా పలువురు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేల తీరు చూసి.. ఇలాంటి వారినా మనం ఎన్నుకున్నదని ప్రజలు సిగ్గు పడుతున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌పై చర్చలో పాల్గొనే దమ్ము లేకే టీడీపీ ఎమ్మెల్యేలు ఇలా దిగజారి వ్యవహరిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. అసెంబ్లీలో టీడీపీ రౌడీయిజానికి ఎవరూ భయపడరని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సైకో చంద్రబాబు పాలన ఎప్పుడో పోయిందని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఎన్టీఆర్‌ను పొట్టనపెట్టుకున్న చంద్రబాబే అసలైన సైకో అని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు అధ్వాన్నంగా ప్రవర్తిస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. ప్రజాధనాన్ని దోచుకుని దొరకిపోయిన దొంగ చంద్రబాబు అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మానసిక రోగి అని,ఆయనకు మెంటల్ సర్టిఫికెట్ ఉందని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆయన్ను ఆస్పత్రికి తరలించకపోతే గన్ను తెచ్చి సభలో ఎవరో ఒకరిని కాలి్చనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. నిషేధం ఉన్నా సెల్ఫోన్లతో చిత్రీకరణ మూడంచెల భద్రతను ఏర్పాటుచేయడంతో టీడీపీ సభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌లు తమ సెల్ఫోన్ల ద్వారా సభలో దృశ్యాలను రికార్డింగ్ చేయడం మొదలుపెట్టారు. నిబంధనను తుంగలో తొక్కి వీడియో రికార్డు చేసిన టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు స్పీకర్‌ను కోరారు. వీడియో రికార్డింగ్ చేసిన ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, అశోక్‌లను సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తూ స్పీకర్ రూల్ పాస్ చేశారు. దీంతో వీరిని మార్షల్స్ బయటకు పంపారు. ఈ దశలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడుతో సహా సభ్యులందరూ తమ వెంట తీసుకొచ్చిన విజిల్స్ ఊదుతూ సభలో గందరగోళం సృష్టించే యత్నం చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ, గద్దె రామ్మోహన్ సహా టీడీపీ సభ్యులు కుర్చీలలో నిల్చొని విజిల్స్ ఊదుతూ హంగామా చేశారు. సభా సంప్రదాయాలను తుంగలోకి తొక్కి విలువలను దిగజారుస్తున్న సభ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరగా, ఎమ్మెల్యేలు గోరంట్ల, వెలగపూడి, నిమ్మలపై ఒకరోజు సస్పెన్షన్ వేటు వేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీచేశారు. వారిని మార్షల్స్ బయటకు పంపగా, వారి వెంట మిగిలిన సభ్యులు కూడా వెళ్లిపోయారు. కనీసం మిగిలిన వాళ్లయినా చర్చలో పాల్గొనాలని మంత్రులు సహా పలువురు సభ్యులు కోరినా పట్టించుకోకుండా సభ నుంచి వెళ్లిపోయారు. ఇది కూడా చదవండి: సీఐడీ కస్టడీకి చంద్రబాబు -
Live: ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-
అసెంబ్లీలో చంద్రబాబు స్కాం ప్రెజెంటేషన్
-
Andhra Pradesh: నేటి నుంచి ‘అసెంబ్లీ’
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన సభ, శాసన మండలి సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. శాసనసభ సమావేశాలు ఉదయం 9 గంటలకు, మండలి సమావేశాలు 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. అనంతరం శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశం కానుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి.. ఏ అంశాలపై చర్చించాలనే దానిపై ఈ సమావేశంలో అజెండా ఖరారు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించనుంది. సమావేశాలు సజావుగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. అసెంబ్లీ, మండలి సమావేశాల నేపథ్యంలో బుధవారం శాసనసభ కమిటీ హాల్లో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉన్నతాధికారులతో సమావేశమై బందోబస్తు, ఇతర ఏర్పాట్లుపై సమీక్ష నిర్వహించారు. పటిష్టమైన పోలీస్, మార్షల్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధికారులను ఆదేశించారు. మార్షల్స్ అప్రమత్తంగా ఉండాలి మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్.. పోలీస్ అధికారులతో శాంతి భద్రతల అంశాన్ని సమీక్షిస్తూ.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పోలీస్, మార్షల్స్ ఎంతో అప్రమత్తంగా ఉండాలని, పాస్ లేకుండా ఏ ఒక్కరినీ అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించ వద్దని రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి వారు సూచించారు. ఈ సారి పాస్‌ల జారీని కూడా సాధ్యమైనంత నియంత్రించాలని.. ప్రముఖులు, అధికారులు, సిబ్బంది మినహా ఇతరులకు ఎటువంటి విజిటింగ్ పాస్‌లు జారీ చేయవద్దని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులను ఆదేశించారు. సభ్యులు సమావేశాలకు సకాలంలో హాజరయ్యేలా వారి రాకపోకలకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వారు బసచేసే ప్రాంతాల్లో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కోరారు. సచివాలయం నాలుగు వైపులా పటిష్టమైన పోలీస్ బందోబస్తుతో పాటు అధునాతన సమాచార, సాంకేతిక వ్యవస్థతో పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎటువంటి ఏమరపాటు లేకుండా ఎంతో అప్రమత్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తు విధులను నిర్వహించాలని సూచించారు. సభ్యులకు సంతృప్తికర సమాధానాలు అంతకు ముందు పలు శాఖల కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సమావేశాలను సజావుగా నిర్వహించడంలో పలు శాఖల కార్యదర్శులు, అధికారులు ఎంతగానో సహకరించారని, అదే సహకారాన్ని ఇకపైనా కొనసాగించాలని కోరారు. ఎన్నికలు జరిగే సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో గౌరవ సభ్యులు పలు ప్రజా సమస్యలపై ప్రశ్నలు అడుగుతుంటారని, వాటన్నింటికీ సమావేశాల నిర్వహణ సమయంలోనే సంతృప్తికర స్థాయిలో సమాధానాలు ఇవ్వాలని సూచించారు. గౌరవ సభ్యులు వారి నియోజకవర్గాల సమస్యలను సభలో చెప్పుకునేందుకు జీరో అవర్ ఎంతో ప్రాముఖ్యమైనదని, ఆ సమయంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలను అధికారులు వెంటనే అందజేయాలన్నారు. పలు శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న స్టార్డు, అన్ స్టార్డు, షార్టు నోట్ ప్రశ్నలను వివరిస్తూ వాటన్నింటికీ వెంటనే సరైన సమాధానాలను అందజేసి జీరో స్థాయికి తీసుకురావాలన్నారు. ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు ఇచ్చేందుకు, వారి పిటిషన్లను సత్వరమే పరిష్కరించేందుకు ఆన్లైన్ ప్లాట్‌ఫాంను సత్వరమే రూపొందించాలని ఐటీ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలను సచివాలయం నాలుగవ బ్లాకు పబ్లిసిటీ సెల్ నుండి మీడియాకు అందజేసేలా సమాచార శాఖ ఏర్పాట్లు చేసింది. -
ఇకపై బహుభార్యత్వం నిషేధం.. డిసెంబర్లో బిల్లు
గౌహతి: డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. టిన్సుకియాలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అయన మాట్లాడుతూ వచ్చే 45 రోజుల్లో ఈ బిల్లును సిద్ధం చేసి డిసెంబర్ సమావేశాల్లో ప్రవేశపెడతామని అన్నారు. లీగల్ కమిటీ.. శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ అసోం ప్రభుత్వం బహుభార్యత్వం బిల్లును సీరియస్‌గా తీసుకుందని దీనిపై ఒక లీగల్ కమిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు. బహుభార్యత్వాన్ని నిషేధించడంలో సాధ్యాసాధ్యాలు గురించి అధ్యయనం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కమిటీని సూచించినట్లు తెలిపారు. ప్రజాభిప్రాయం కూడా.. ఇదే అంశంపై ప్రజాభిప్రాయాలను కూడా సేకరించగా ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని మొత్తం 149 మంది నుంచి అభిప్రాయసేకరణ చేయగా వారిలో 146 మంది సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. మరో ముగ్గురు మాత్రం బహుభార్యత్వాన్ని సమర్ధించినట్లు తెలిపారు. బిల్లును రూపొందించడమే మా తదుపరి కార్యాచరణని అన్నారు. వీలైతే రాష్ట్రంలో లవ్ జిహాద్‌ను కూడా అంతం చేసే విధంగా ఇదే బిల్లులో మరికొన్ని అంశాలను కూడా చేర్చనున్నామన్నారు. ఈ సందర్బంగా సాయుధ దళాల ప్రత్యేక అధికారాలు ఉపసంహరించే చట్టం గురించి ప్రస్తావిస్తూ.. అది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయమని ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని.. ఈ నెలాఖరులో కేంద్రంతో చర్చించి కచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటామని అన్నారు. సాయుధ దళాల ప్రత్యేక చట్టం.. 1958 సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ప్రకారం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రాంతాల్లో ప్రజా జీవనానికి ఇబ్బంది లేకుండా చేయడానికి పార్లమెంట్ వారికి ఈ అధికారాలను మంజూరు చేసింది. 1972లో ఈ చట్టాన్ని సవరిస్తూ ఒకసారి ఇబ్బందికరమైన ప్రాంతమని ప్రకటించాక అక్కడ కనీసం మూడు నెలల పాటు విధులు నిర్వర్తించేందుకు సాయుధ దళాలకు ప్రత్యేక అధికారముంటుంది. #WATCH | On banning polygamy in the state, Assam CM Himanta Biswa Sarma says "A legal committee was formed to check if polygamy can be banned by the state govt or not. Later, we asked the public for their opinion if they had any objections. We received a total of 149 suggestions… pic.twitter.com/ZC9U2TNSQQ — ANI (@ANI) September 3, 2023 ఇది కూడా చదవండి: సరదా సన్నివేశం.. రాహుల్‌కు మటన్ కర్రీ వండటం నేర్పిన లాలూ -
మణిపుర్ గవర్నర్ మౌనమేల?
ఇంటి దీపమని ముద్దాడితే మీసాలు తెగకాల్చిందని సామెత. మణిపుర్లో కల్లోలం జాడలు కనబడి నప్పుడు అక్కడున్నది ‘డబుల్ ఇంజన్’ సర్కారే కదా అని ఉపేక్షించిన కేంద్ర ప్రభుత్వానికి తదుపరి కర్తవ్యం బోధపడటం లేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. సోమవారం ప్రారంభం కావాల్సిన మణిపుర్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల గురించి 24 గంటలు గడిచినా అతీగతీ లేకపోవటం దాన్నే సూచిస్తోంది. ఆగస్టు మూడోవారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని గత నెల 27న కేబినెట్ భేటీ తర్వాత ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ ప్రకటించారు. అందుకు సంబంధించిన సిఫార్సును ఈనెల 4న లాంఛనంగా గవర్నర్ అనసూయ ఊకే ఆమోదానికి పంపారు. అసెంబ్లీ ప్రోరోగ్ అయింది గనుక నిబంధనల ప్రకారం పక్షం రోజుల ముందు అసెంబ్లీ సమావేశాలపై రాజ్‌భవన్ నుంచి నోటిఫికేషన్ వెలువడాలి. కానీ ఆశ్చర్యకరంగా అలాంటిదేమీ జరగలేదు. హింసాకాండ మొదలై నాలుగు నెలలు గడిచినా ఇంతవరకూ రాష్ట్రంలో ప్రశాంతత ఏర్పడలేదన్నద వాస్తవం. హత్యాకాండలో 160 మందికి పైగా మరణించగా వందలాది మంది పౌరులు గాయ పడ్డారు. బాధితులు ఇప్పటికీ సహాయ శిబిరాల్లో తలదాచుకునే పరిస్థితులే ఉన్నాయి. భద్రతా బల గాలు సోదాలు నిర్వహిస్తూ పోలీస్ స్టేషన్ల నుంచి అపహరించిన మారణాయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకుంటున్నాయి. వివిధ నేరాలతో సంబంధమున్నదని భావిస్తున్న దాదాపు 1,500 మందిని అరెస్టు చేశారు. అయినా చెదురుమదురుగా ఎక్కడో ఒకచోట హింసాత్మక ఘటనలు జరుగు తూనే ఉన్నాయి. మరోపక్క కొండ ప్రాంతాలకు నిత్యావసర సరుకులు సరఫరా కాకుండా ప్రత్యర్థి మైతేయి తెగ అడ్డుకుంటున్నదని ఆరోపిస్తూ ఇంఫాల్–అస్సాంలోని సిల్చార్‌ల మధ్య ఉన్న 37వనంబర్ జాతీయ రహదారిని కుకీలు దిగ్బంధించారు. ఇంఫాల్–నాగాలాండ్‌లోని దిమాపూర్ మధ్య గల రెండో నంబర్ జాతీయ రహదారిపై సైతం ఉద్యమకారుల దిగ్బంధంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. భద్రతా బలగాలు రంగంలోకి దిగినా పరిస్థితి ఇంకా పూర్తిగా మెరుగుపడలేదని మీడియా కథనాలు చెబుతున్నాయి. సమస్యల వలయం నుంచి మణిపుర్ ఇంకా బయటపడలేదన్నది నిజం. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే భద్రతా కారణాల రీత్యా తాము హాజరుకావటం అసాధ్యమని వివిధ పార్టీల్లోని కుకీ తెగ శాసనసభ్యులు పదిమంది గవర్నర్‌కు విడివిడిగా వినతిపత్రాలు పంపిన మాట కూడా వాస్తవం. ఇందులో ఇద్దరు సభ్యులున్న అధికార కూటమి భాగస్వామ్య పార్టీ కుకీ పీపుల్స్ అలయెన్స్ కూడా ఉంది. నాగా తెగకు చెందిన మరో పదిమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావొద్దని మణిపుర్‌లోని యునైటెడ్ నాగా కౌన్సిల్ (యూఎన్సీ) కోరడాన్ని విస్మరించలేం. అంతేకాదు, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి రాష్ట్ర సమగ్రత పరిరక్షణకు తీర్మానం చేయాలని మైతేయిలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మణిపుర్ సమగ్రత సమన్వయ కమిటీ (కొకోమీ) గత జూలైలో జరిపిన ర్యాలీలో మాండ్ చేయటం కూడా వాస్తవమే. అలాగని కేబినెట్ సిఫార్సుపై గవర్నర్ మౌనం వహించటం సరికాదు. రాష్ట్రంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఉనికిలో ఉంది. 60 మంది సభ్యులుండే అసెంబ్లీలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌కు ఇప్పటికైతే మెజారిటీ ఉంది. ఆయనకు మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ఎమ్మెల్యేలు ఎవరూ ప్రకటించలేదు. అసెంబ్లీ కూడా రద్దు కాలేదు. మణిపుర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గత మార్చిలో జరిగాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా వర్షా కాల సమావేశాలు నిర్వహించాల్సివుంది. అంటే వచ్చే నెల 2లోగా అసెంబ్లీ సమావేశం కావాలి. అటువంటప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయకపోతే అది రాజ్యాంగ సంక్షోభానికి దారితీయదా? గవర్నర్ విధి నిర్వహణ మంత్రివర్గం సలహాలకు లోబడివుంటుందని రాజ్యాంగంలోని 163వ అధి కరణ చెబుతోంది. అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ లేదా దాని ప్రోరోగ్, అసెంబ్లీ రద్దు అధికా రాలు గవర్నర్‌కు ఉంటాయని 174వ అధికరణ వివరిస్తోంది. అయితే మంత్రివర్గాన్ని సంప్రదించి మాత్రమే ఈ అధికారాలను వినియోగించాల్సి వుంటుందని హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2016లో తీర్పునిచ్చింది. మణిపుర్లో రాజ్యాంగసంక్షోభం ఏర్పడిందని గవర్నర్ భావించివుండొచ్చు. ప్రభుత్వానికి తగిన మెజారిటీ లేదని అనుకొని వుండొచ్చు. అదేమిటో ప్రకటించి, తదనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌కు లేదా? అంతా సవ్యంగా ఉందనుకుంటే సమావేశాల నోటిఫికేషన్ విడుదలకు అభ్యంతరం దేనికి? సమస్యలున్నప్పుడే ప్రజలెన్నుకున్న సభల ప్రాధాన్యత పెరుగుతుంది. చుట్టుముట్టిన ఉద్రిక్త పరిస్థితులను ఉపశమింపజేయడానికి అనుసరించాల్సిన మార్గాలపై చర్చిస్తే, సభ్యుల అభిప్రా యాలు పరిగణనలోకి తీసుకుని నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందిస్తే, ఏకగ్రీవ తీర్మానం ద్వారా ప్రజానీకానికి భరోసా ఇవ్వగలిగితే దాని ప్రభావం ఎంతో ఉంటుంది. అందుకు భిన్నంగా గవర్నర్ వ్యవహరించటం రాజ్యాంగ విరుద్ధం మాత్రమే కాదు, రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసే చర్య కూడా. చిత్రమేమంటే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సిద్దార్థ్ మృదుల్‌ను నియమించాలన్న జూలై 5 నాటి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు ఫైలును మణిపుర్ సర్కార్ ఆమోదానికి కేంద్రం పంపింది. అదేమైందో తెలియదు. మణిపుర్లో సర్కారు ఉంటే అది సక్రమంగా పని చేస్తున్నదో లేదో తేల్చవలసిన బాధ్యత కేంద్రంపై ఉంది. నిరవధిక అనిశ్చితి మణిపుర్‌ను మరింత సంక్షోభంలోకి నెడుతుందని అందరూ గుర్తించాలి. -
మా అమ్ములపొదిలో ఎన్నో అస్త్రాలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తమ విజయం ఖాయమని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తమ అమ్ముల పొదిలో ఉన్న అ్రస్తాలు తీస్తే విపక్షాలు గాలికి కొట్టుకుపోవాల్సిందేనని అన్నారు. ఈసారి ఎన్నికల్లో గతంలో కంటే 7–8 సీట్లు ఎక్కువ వస్తాయని చెప్పారు. అసెంబ్లీలో ఆదివారం ‘రాష్ట్ర ఆవిర్భావం–సాధించిన ప్రగతి’పై జరిగిన చర్చకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై ఆయన మండిపడ్డారు. తనకు పిండం పెడ్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని, ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పిండం పెడ్తారో చూద్దాం అంటూ సవాల్ విసిరారు. ‘రాహుల్ ఎన్నికల సభలో మోదీపై చేసిన వ్యాఖ్యకు జైలు శిక్ష వేశారు. మరి మీరు ఇక్కడ పిండం పెడ్తామంటూ పిచ్చికూతలు కూస్తున్నారు. మనసుకు బాధేసినా పోలీసులను ఉసిగొల్పకుండా సంయమనం పాటిస్తున్నాం’అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ అంటే ప్రధాని మోదీకి ఎందుకు వ్యతిరేకమో తెలియదని, తల్లిని చంపి పిల్లను బతికించారంటూ వ్యాఖ్యానాలు చేశారని గుర్తుచేశారు. దేశం ప్రగతి పథంలోకి వెళ్లకుండా అడ్డుపడుతున్నారని సీఎం విమర్శించారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. రైతుబంధు మరింత పెంపు.. ‘కర్ణాటకలో కాంగ్రెస్ అలవికాని హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేయలేక అక్కడి సీఎం ఎస్సీ, ఎస్టీ ఫండ్స్ మళ్లిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో ఇచ్చే పెన్షన్ ఎంత?.. తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.4 వేలు పెన్షన్ ఇస్తారా? మేం అలవికాని హామీలివ్వం. గత ఎన్నికల్లో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెబితే.. మేము రూ.లక్ష వరకు చేస్తామని చెప్పాం. మేం 80 సీట్లు గెలిస్తే వాళ్లు 19 సీట్లు గెలిచారు. రెండేళ్ల నుంచి పెన్షన్ రూ.2 వేలు ఇస్తున్నాం. మొదట వెయ్యి ఆ తర్వాత రూ.2 వేలు ఇచ్చాం. కల్యాణలక్ష్మిలో మొదట రూ.50 వేలు.. ఆ తర్వాత రూ.లక్ష ఇచ్చాం. గొర్ల యూనిట్లకు సైతం రూ.1.75 లక్షలకు పెంచాం. రైతుబంధు ఎకరాకు రూ.4 వేలతో మొదలు పెట్టి రూ.5 వేలకు పెంచాం. దీనిని మరింత పెంచుతాం. రుణమాఫీ అమలుతో కాంగ్రెస్ దిగాలు పడింది. నెల రోజుల్లో రుణమాఫీ సొమ్ము మొత్తం రైతుల ఖాతాల్లో జమ చేస్తాం..’అని కేసీఆర్ చెప్పారు. కరెంటు గోల్మాల్ చేస్తారు..రైతుబంధు రాదు ‘ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ముంచింది కాంగ్రెస్ పార్టీయే. ఇదే కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూయే. చివరకు 1969 ఉద్యమంపై కర్కశంగా వ్యవహరించింది కూడా కాంగ్రెస్సే. 1969లో చెన్నారెడ్డి, విద్యార్థులు, ఉద్యోగుల నాయకత్వంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడితే... చివరకు తెలంగాణ డెమొక్రటిక్‌గా 14 ఎంపీ స్థానాల్లో 11 మంది గెలిచారు. యావత్ తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలి అంటే ఆనాడు ఇందిరాగాంధీ నో తెలంగాణ అంటూ నిరాకరించారు. అలాగే కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వను అని సభలో చెప్పారు. అయినా ఒక్క తెలంగాణ మంత్రి కూడా వ్యతిరేకించలేదు. త్వరలో దామరచర్లలో 4 వేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్‌ను రూ.30 వేల కోట్లతో అందుబాటులోకి తీసుకొస్తున్నాం. దీన్ని కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. వాళ్లు కరెంటు కూడా గోల్మాల్ చేస్తారు. రైతుబంధు రాదు..’అని సీఎం పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో రైతులపై కాల్పులు ‘చంద్రబాబు పాలన సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ మౌన ప్రేక్షక పాత్ర వహించింది. తెలుగుదేశం హయాంలో తెలంగాణలో పరిస్థితులు మరింత దిగజారాయి. ఆనాడు స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి.. ప్రణయ్ భాస్కర్ అనే ఎమ్మెల్యే ‘తెలంగాణ’అంటే.. నో నో తెలంగాణ అనే పదం వాడకూడదని రూలింగ్ ఇచ్చిన స్థాయికి దిగజారింది. ఆ రోజు కూడా కాంగ్రెస్ మౌన ప్రేక్షక పాత్ర పోషించింది. చంద్రబాబు నాయుడు విద్యుత్ సంస్కరణల ముసుగులో విద్యుత్ చార్జీలను పెంచారు. ఒక సంవత్సరం కాదు.. మూడు సంవత్సరాలు 15 శాతం పెరుగుతుందని చెబితే ఆ సమయంలో నేను డిప్యూటీ స్పీకర్‌గా ఉండి లేఖ రాశా. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ప్రజలు, రైతులు బషీర్‌బాగ్‌లో నిరసన తెలిపేందుకు వస్తే కాల్పులు జరిపారు. పట్టపగలు జరిగిన ఆ కాల్పుల్లో కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు చనిపోయారు..’అని కేసీఆర్ గుర్తు చేశారు. కేంద్రం తప్పనిసరిగా అవార్డులు ఇవ్వాల్సి వస్తోంది ‘కేంద్రంలో మమ్మల్ని రాసి రంపాన పెట్టే పార్టీ ప్రభుత్వమే ఉంది. అయినా తప్పనిసరిగా మూడు నెలలకోసారి అవార్డులు ప్రకటించాల్సి వస్తోంది. బండి పోతే బండి, గుండు పోతే గుండు ఇస్తా అన్నోడు పత్తా లేకుండా పోయిండు. రైతులు పండించిన పంట మొత్తం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ధరణి రద్దు చేసి ఏం చేస్తారో కాంగ్రెస్ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ బీఆర్ఎస్ను బీజేపీకి బీ టీమ్ అన్నాడు. సీన్ కట్ చేస్తే ఆయనే వెళ్లి బీజేపీలో జొర్రిండు. మా పార్టీ ఎప్పుడూ లౌకికవాద పార్టీయే. మజ్లిస్– బీఆర్ఎస్ భవిష్యత్‌లో కూడా ఫ్రెండ్లీ పార్టీలుగానే ఉంటాయి..’అని కేసీఆర్ స్పష్టం చేశారు. వీధి నల్లాలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ ‘ప్రపంచమంతా ప్రభావం చూపే హైదరాబాద్ స్థిరాస్తి రంగం పెరుగుతోంది. హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి స్థిరాస్తి కంపెనీలు వస్తున్నాయి. సింగరేణి కార్మికులకు వచ్చే దసరా, దీపావళి సందర్భంగా రూ.వెయ్యి కోట్లు బోనస్ ఇవ్వబోతున్నాం. అప్పుల్లో తెలంగాణ 23వ స్థానంలో ఉంది. పరిమితికి లోబడే అప్పులు చేశాం. నియామక పరీక్షలు దశల వారీగా నిర్వహిస్తున్నాం. గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వాటిని మార్చేందుకు వీలుకాదు. పల్లెలు, పట్టణాల్లో రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తున్నాం. వీధి నల్లాలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. మిషన్ కాకతీయ పుణ్యమే 30 లక్షల బోర్లు నీళ్లు పోస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కాళేశ్వరం నుంచే తుంగతుర్తి, కోదాడ, డోర్నకల్‌కు నీళ్లు వెళ్తున్నాయి. దేశంలోనే అత్యుత్తమ పునరావాసాలు నిర్మించింది తెలంగాణ. కరోనా, నోట్ల రద్దు వంటివి రాకపోయి ఉంటే తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించేది..’అని కేసీఆర్ పేర్కొన్నారు. 7 వేల దరఖాస్తులు పెండింగ్‌లో.. సీఎం సమాధానం తర్వాత ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నకు కేసీఆర్ వివరణ ఇచ్చారు. ‘మౌజంలు, ఇమాంలకు ఇప్పటికే నెలకు రూ.10 వేలు ఇస్తున్నాం. అయితే ఇంకా 7 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అందరికీ సోమవారం సాయంత్రంలోగా ఉత్తర్వులు ఇచ్చేస్తాం. ఖబరస్తాన్ కోసం మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో 150 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 112 ఎకరాల భూమికి సంబంధించి రేపటిలోగా ఉత్తర్వులు ఇస్తాం..’అని ముఖ్యమంత్రి తెలిపారు. జగన్‌ను అనేక రకాలుగా వేధించారు.. ‘రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్రెడ్డిని రాంగ్ హ్యాండిల్ చేసింది. ఆయన్ని అనేక రకాలుగా వేధించి, చివరకు జైల్లో కూడా పెట్టారు. ఆయన సొంత పార్టీ స్థాపించుకున్నారు. ఆ తర్వాత కడప ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వస్తే ఆయన నాలుగైదు లక్షల బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. అనంతరం వచ్చిన ఒకటి రెండు ఎన్నికలను కూడా ఆయన స్వీప్ చేయడంతో ఇక ఆంధ్రాలో మన పని అయిపోయిందనే ఆలోచనకు వచ్చారు. 2014 ఎన్నికల సందర్భంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఎదురుగాలి వచ్చింది. ఫలితాలు కూడా అదే విధంగా వచ్చాయి. ఆంధ్రాలో పోయింది. తెలంగాణలోనన్న కనీసం పది సీట్లన్నా రాకపోతాయా అనే ఒత్తిడిలో తెలంగాణ ఇచ్చారే కానీ ప్రేమతో ఇవ్వలేదు..’ అని కేసీఆర్ అన్నారు. దేశమే ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు పేస్కేల్ ‘దేశమే ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు పేస్కేల్ ఇస్తాం. మాకు మానవీయ దృక్పథం ఉంది. ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడాం. త్వరలోనే మధ్యంతర భృతి ఇచ్చి పీఆర్సీని నియమిస్తాం. బ్రహ్మాండంగా జీతాలు పెంచుకుంటాం. రాష్ట్రం ధనికమైతే.. వాళ్లు ధనికులు కావాలి. వారికి నాలుగు రూపాయలు కావాలి. భారత్‌లో అధికంగా వేతనాలు పొందేది తెలంగాణ ఉద్యోగులే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే వీరికి ఎక్కువ జీతాలు ఇస్తున్నాం..’అని సీఎం చెప్పారు. -
బీఆర్ఎస్ ప్రభుత్వంపై అక్బరుద్దీన్ ప్రశంసలు.. కేసీఆర్ మళ్లీ సీఎం!
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ పాలనపై అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రశంసలు కురిపించారు. తమ ప్రయాణం బీఆర్‌ఎస్‌తోనేనని స్పష్టం చేశారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. తమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని చెప్పారు. శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు-స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిపై అక్బరుద్దీన్ ఒవైసీ లఘుచర్చను ప్రారంభించారు. జైపూర్ రైలు ఘటనలో చనిపోయిన హైదరాబాద్ యువకుడికి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఇందుకు రాష్ట్ర సర్కారుకు, కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని అక్బరుద్దీన్ చెప్పారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని అన్ని రాష్ట్రాలు చూసి నేర్చుకోవాలన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండటం గర్వంగా భావిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో 50 లక్షల మంది ముస్లీం మైనార్టీలు ఉన్నారని వారి ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2200 కోట్లు కేటాయించిందన్నారు. మైనార్టీలకు షాదీముబారక్, ఓవర్సీస్ స్కాలర్షిప్ వంటి పథకాలు చేపట్టారని వెల్లడించారు. రెండో హజ్ హౌస్‌కు ప్రభుత్వం రూ.23 కోట్లు కేటాయించిందని చెప్పారు. 58, 59 జీవో కింద పట్టాలు ఇచ్చి ప్రభుత్వం పేదలను ఆదుకుంటుంన్నదని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సక్షేమాభివృద్ధికి కృషిచేస్తుందన్నారు. -
నేడు అసెంబ్లీ ముందుకు మరో మూడు బిల్లులు
-
ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు బ్రేక్ పడింది. వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు కల్పించేందుకు టీఎస్ఆర్టీసీ చట్ట సవరణ ముసాయిదా బిల్లు–2023ను రూపొందించిన ప్రభుత్వం.. దాని ని శాసనసభలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ తమిళిసై అనుమతి కోరుతూ రాజ్‌భవన్‌కు పంపింది. కానీ గవర్నర్ దీనికి అనుమతి ఇవ్వకపోవడంతో.. చట్టరూపంలోకి రాని బిల్లుల జాబితాలో చేరిపోయింది. రేపటితో అసెంబ్లీ ముగుస్తుండటంతో.. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే ఆర్టీసీ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు కల్పించాలని ఇటీవలి కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆదివారంతో రాష్ట్ర శాసనసభ సమావేశాలు ముగుస్తున్నాయి. ఆలోగా బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి లభించడం అనుమానమేనని అభిప్రా యం వ్యక్తమవుతోంది. దీంతో 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు నైరాశ్యంలో మునిగిపోయారు. ఇదే తొలిసారి ద్రవ్య వినిమయం (బడ్జెట్), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలోని అంశాలకు సంబంధించిన బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టడానికి ముందే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఇక శాసనసభ పాస్ చేసిన ఏ బిల్లునైనా గవర్నర్ ఆమోదానికి రాజ్‌భవన్‌కు పంపాలి. ఆపై బిల్లులు చట్టరూపం దాల్చి అమల్లోకి వస్తాయి. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసుకోనుండటంతో వారికి ప్రతినెలా జీతభత్యాలను ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆర్థికపరమైన వ్యవహారం కావడంతో ప్రభుత్వం ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందే గవర్నర్ అనుమతికి పంపాల్సి వచ్చింది. అయితే గతంలో కూడా.. ఇలాంటి బిల్లుల ను సభలో ప్రవేశపెట్టడానికి ముందు గవర్నర్ అనుమతిని వాయిదా వేసిన/నిరాకరించిన సందర్భాలు లేవని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వం వివరణ ఇస్తే నిర్ణయం! ఆర్టీసీ బిల్లుకు సంబంధించి రాజ్‌భవన్ శుక్రవారం మధ్యాహ్నం, అర్ధరాత్రి రెండు ప్రకటనలు విడుదల చేసింది. తొలుత ‘‘ఈ నెల 3న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. 2న మధ్యాహ్నం 3.30 గంటలకు ఆర్టీసీ చట్ట సవరణ బిల్లు–2023 ప్రతిపాదన రాజ్‌భవన్‌కు చేరింది. బిల్లు పరిశీలన, న్యాయ నిపుణుల సలహా తీసుకుని ప్రభుత్వ విజ్ఞప్తిపై నిర్ణయం తీసుకోవడానికి మరో కొంత సమయం అవసరం’’ అని పేర్కొంది. రాత్రి విడుదల చేసిన ప్రకటనలో.. ‘‘ఆర్టీసీ బిల్లును గవర్నర్ పరిశీలించారు. సంస్థ, ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని.. పలు అంశాలపై వివరణలు, స్పష్టతను కోరుతూ ప్రభుత్వానికి వర్తమానం పంపించారు. ప్రభుత్వం తక్షణమే వివరణలతో బదులిస్తే.. బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు’’ అని తెలిపింది. ఆర్టీసీ బిల్లుకు అనుమతి ఇవ్వకుంటే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. -
మంత్రి కేటీఆర్, శ్రీధర్‌బాబు మధ్య మాటల యుద్ధం
-
తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశాలు
-
మూడు రోజులపాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Telangana: అసెంబ్లీ 3 రోజులే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమావేశాలు మూడు రోజుల పాటు కొనసాగి ఆదివారం ముగియనున్నాయి. శాసనసభ, శాసనమండలి బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మూడు రోజులకు సంబంధించిన ఎజెండాను కూడా ఖరారు చేశారు. దీని ప్రకారం.. 10 ప్రభుత్వ బిల్లులపై చర్చించి ఆమో దించడంతో పాటు 3 అంశాలకు సంబంధించి స్వల్పకాలిక చర్చ కూడా జరుగుతుంది. శని, ఆది వారాల్లో ప్రభుత్వ బిల్లులపై చర్చించి ఆమోదించిన తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడనుంది. సాయన్న మృతికి సంతాపం.. వాయిదా శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం 11.30కు ప్రారంభమయ్యాయి. దివంగత ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాపం ప్రకటించిన తర్వాత సభ వాయిదా పడింది. అనంతరం స్పీకర్ పోచారం అధ్యక్షతన ఆయన చాంబర్లో బీఏసీ భేటీ జరిగింది. డిప్యూటీ స్పీకర్ పద్మా రావుతో పాటు మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ పాల్గొన్నారు. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. సభ్యులు కోరినన్ని రోజులు సభ నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని భట్టి, వరదలపై స్వల్పకాలిక చర్చ జరపాలని అక్బరుద్దీన్ ప్రతిపాదించారు. చివరకు మూడురోజుల పాటు సభ నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. వరదలు, విద్య, వైద్యంపై స్వల్పకాలిక చర్చ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశంలో తొలుత ప్రశ్నోత్తరాలను చేపడతారు. అనంతరం రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలు, విద్య, వైద్య రంగం బలోపేతానికి ప్రభుత్వం చర్యలు– ఫలితాలు అనే అంశాలపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. వివిధ అంశాలపై మొత్తం 10 బిల్లులు ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శనివారం కూడా ఏదేని ఒక అంశంపై స్వల్పకాలిక చర్చతో పాటు బిల్లులపై చర్చ జరుగుతుంది. ఇక శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ భేటీలో డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ, చీఫ్ విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావు, ఎంఐఎం సభ్యులు అఫెందీ, మీర్జా రహమత్ బేగ్ పాల్గొన్నారు. శాసనసభలో ప్రవేశ పెట్టే బిల్లులకు అనుగుణంగా ఎజెండాను రూపొందించారు. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు ఇలా.. ప్రశ్నోత్తరాల్లో భాగంగా శుక్రవారం శాసనసభలో ఐటీ ఎగుమతులు, రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు, చార్మినార్ పాదచారుల రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టు, ఆరోగ్య లక్ష్మి పథకం, జీహెచ్ఎంసీ పరిధిలో ఎస్‌ఆర్‌డీపీపై మంత్రులు సమాధానాలు ఇస్తారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, బీసీ కులవృత్తులకు ఆర్థిక సాయం, గొర్రెల సంఖ్య పెరుగుదల, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లు, జాతీయ విద్యా సంస్థల్లో బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లింపు అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. శాసనమండలిలో హరితహారం, కొత్త మెడికల్ కాలేజీల మంజూరు, పంటల బీమా పథకం, పల్లె ప్రగతి, ఆసరా పింఛన్లు, హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్ కోతలపై ప్రశ్నలు ఉంటాయి. వ్యవసాయ రంగం అభివృద్ధి, గురుకులాలకు భవనాలు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు, బీరప్ప ఆలయాలకు సాయం అంశాలపై కూడా ప్రశ్నోత్తరాలు ఉంటాయి. -
వరదలపై తెలంగాణ మండలిలో స్వల్పకాలిక చర్చ
-
అసెంబ్లీలో కనీసం గది కూడా కేటాయించలేదు: ఈటల రాజేందర్
-
ఈ దఫా అసెంబ్లీ చివరి సమావేశాల్లో హోరాహోరీ !
-
3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీ మీటింగ్‌లో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతమైన ఉదయం 11 గంటలకు మొదలైన సమావేశంలో ముందుగా కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్నతో పాటు ఇటీవలి కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం పాటించారు. సాయన్నకు అసెంబ్లీలో నివాళి అర్పించారు. ఆయన మృతికి శాసన సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు. సాయన్నతో ఎంతో సాన్నిహిత్యం: కేసీఆర్ సంతాప తీర్మానాన్ని కేసీఆర్ ప్రవేశ పెట్టగా.. సభ్యులు సాయన్న రాజకీయ జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కంటోన్మెంట్ అభివృద్ధికి సాయన్న ఎంతో కృషి చేశారని అన్నారు. సాయన్నతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని తెలిపారు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి సాయన్న.. నిత్యం ప్రజలతో మమేకమై నిరాడంబరంగా ఉండేవారని పేర్కొన్నారు. సాయన్న లేని లోటు తీర్చలేనిదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని.. కంటోన్మెంట్ అభివృద్ధికి చేసిన కృషిని మరవలేమని గుర్తుచేసుకున్నారు. తరువాత ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క్, రఘునందన్ రావు తదితరులు సాయన్నను గుర్తుచూస్తూ కాసేపుమాట్లాడారు. అనంతరం తెలంగాణ శాసన సభ రేపటికి వాయిదా పడింది. మూడు రోజులుపాటు అసెంబ్లీ సమావేశాలు స్పీకర్ పోచారం అధ్యక్షతన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం అయ్యింది. బీఆర్ఎస్ నుంచి మంత్రులు హరీష్‌రావు, ప్రశాంత్‌రెడ్డి హాజరవ్వగా.. కాంగ్రెస్ నుంచి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క్, ఎంఐఎం నేత అక్భరుద్దిన్ హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నేతలంతా చర్చించారు. కాగా మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ తీర్మానించింది. శుక్రవారం వరదలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. వివిధ బిల్లులపై శనివారం అసెంబ్లీలో చర్చ జరగనుంది. అయితే పని దినాలు పొడిగించాలని, పది రోజులపాటు సభ నిర్వహించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు దూరంగా ఉన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని వనమా నిర్ణయం తీసుకోగా.. జలగం వెంకట్రావును ఇంకా ఎమ్మెల్యేగా పరిగణించని కారణంగా ఆయన కూడా అసెంబ్లీకి రాలేదు.