సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోడు భూములపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీ వేదికగా పోడుభూముల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా, కేసీఆర్ సభలో మాట్లాడుతూ.. పోడు భూములంటే దురాక్రమణే. అడవులను నరికేయడం కరెక్టేనా?. ప్రభుత్వ షరతులను ఒప్పుకుంటేనే పోడు భూముల పంపిణీ ఉంటుంది. పోడు భూములు న్యాయపరమైన డిమాండ్ కాదు. ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్‌ను ఎవరు చంపారు?. గుత్తికోయల గూండాగిరి మంచిది కాదు. పోడు భూములు తీసుకున్న వారు లిఖితపూర్వక హామీ ఇవ్వాలి. ఫిబ్రవరిలో పోడు భూముల పంపీణి ఉంటుంది. పోడు భూములకు విద్యుత్, రైతుబంధు కూడా ఇస్తాము. అటవీ సంపదకు ఇబ్బంది కలిగిస్తే పోడు భూములు రద్దు చేస్తాము. పోడు భూములు గిరిజనుల హక్కు కాదు. అడవులను కాపాడాలా వద్దాఅని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment