podu lands
-
తెలంగాణలో రెండేళ్లుగా తగ్గిపోతున్న అటవీ విస్తీర్ణం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం మళ్లీ తగ్గినట్లు ‘ఫారెస్ట్ సర్వే రిపోర్ట్–2023’లో తేలింది. తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఏర్పడిన తర్వాత చేపట్టిన హరితహారం, వనమహోత్సవం కార్యక్రమాలతో రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ వచ్చింది. అయితే పోడు భూములకు (Podu Lands) పట్టాలు జారీ చేసిన తర్వాత నుంచి అడవులు తగ్గటం మొదలైందని రిపోర్ట్‌లో వెల్లడైంది.13 జిల్లాల్లో తగ్గుదల హరితహారం (Haritha Haram)తో రాష్ట్రంలో మోస్తరుగా ఉన్న అడవులు (Forests) చిక్కబడడం మొదలైంది. 2015లో 511 చ.కి.మీ.లు ఉన్న దట్టమైన అడవులు.. 2021 నాటికి 1,623 చ.కి.మీ.కు పెరిగాయి. అదే కాలంలో బహిరంగ అడవుల విస్తీర్ణం 7,477 చ.కి.మీ.ల నుంచి 10,471 చ.కి.మీ.కు పెరిగింది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పోడు భూములకు పట్టాలు జారీ చేయడంతో వనాల పెరుగుదలకు బ్రేక్ పడినట్లయింది. మొత్తం 33 జిల్లాలకుగాను 13 జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గిపోయింది. 20 జిల్లాల్లో పెరుగుదల నమోదైంది. మొత్తంగా 2021 నాటి గణాంకాలతో పోలిస్తే 2023 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 100 చ.కి.మీ.లు అటవీ విస్తీర్ణం తగ్గింది.అగ్నిప్రమాదాలు, స్మగ్లర్ల నుంచి ముప్పు ఉన్నప్పటికీ అడవులు తగ్గిపోవడానికి పోడు సాగే ప్రధాన కారణమని అటవీశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు గడిచిన పదేళ్లలో హరితహారం, వన మహోత్సవాలతో అడవులు తక్కువగా ఉన్న జిల్లాలో పచ్చదనం పెరిగింది. రోడ్ల పక్కన, ఖాళీ, ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బంజరు భూములు, గుట్టలు, చెరువులు, కాల్వల వెంట, ప్రజల ఇళ్ల ప్రాంగణాల్లో మొక్కలు పెంపకం వల్ల ఈ జిల్లాల్లో పచ్చదనం మెరుగైంది. కనుమరగయ్యే దశలో ఉన్న మోస్తరు అడవులు ఉనికిని నిలుపుకోగలిగాయి.చదవండి: స్కూల్ చుట్టూ చీరలు.. సంగతేంటి సారూ! పదేళ్లలో హరితహారం, వన మహోత్సవాలతో అడవులు తక్కువగా ఉన్న జిల్లాలో పచ్చదనం పెరిగింది. రోడ్ల పక్కన, ఖాళీ, ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బంజరు భూములు, గుట్టలు, చెరువులు, కాల్వల వెంట, ప్రజల ఇళ్ల ప్రాంగణాల్లో మొక్కలు పెంపకం వల్ల ఈ జిల్లాల్లో పచ్చదనం మెరుగైంది. కనుమరగయ్యే దశలో ఉన్న మోస్తరు అడవులు ఉనికిని నిలుపుకోగలిగాయి. అడవులను కాపాడుకోవాలి మొక్కలే ప్రాణకోటికి మూలాధారం. అడవుల విస్తీర్ణం పెంచేలా ప్రభు త్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి. అడవిలో ఒక చెట్టు పోతే 4 చెట్లు నాటాలి. లేదంటే రాబోయే తరాలకు భవిష్యత్తే ఉండదు. – వనజీవి రామయ్య, పద్మశ్రీ పురస్కార గ్రహీత, రెడ్డిపల్లి, ఖమ్మంజిల్లా పోడుతోనే నష్టం అడవులు విస్తారంగా ఉన్న జిల్లాల్లో రెవెన్యూ స్థలాలు తక్కువ. హరితహారంతో ఈ జిల్లాల్లో మోస్తరు అడవులు దట్టంగా మారాయి. అయితే, ఈ జిల్లాల్లో పోడు కారణంగా ఎక్కువ అటవీ భూభాగం కోల్పోయాం. – కిష్టాగౌడ్, భద్రాద్రి జిల్లా అటవీ శాఖాధికారి -
పోడు భూముల పంపిణీపై నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏళ్ళుగా పోడు సాగు చేసుకుంటున్న రైతు కుటుంబాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ భరోసానిచ్చారు. అయితే చట్టాలకు విరుద్ధంగా కొత్తగా పోడు భూములను ఆ«దీనంలోకి తీసుకున్నట్లయితే కఠినచర్యలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అనర్హులకు పోడు భూముల కేటాయింపు జరిగిన విషయం తమ దృష్టికి వచి్చన నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పోడు భూముల పంపిణీపై నివేదికను సమరి్పంచాలని అటవీశాఖ ఉన్నతాధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు.నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ గ్రామంలో ఎఫ్ఆర్ఓ, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లపై గిరిజనులు చేసిన దాడిని మంత్రి ప్రస్తావించారు. పోడు సాగుచేసుకుంటున్న రైతు కుటుంబాలు అటవీశాఖ అధికారులకు ఎలాంటి హానీ తలపెట్టవద్దని, దాడులకు దిగితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. పోడు సమస్యకు పరిష్కారం వెదకాలని సీతక్క పలుమార్లు చెప్పగా, అదే విషయాన్ని మంత్రి కొండా సురేఖ ప్రస్తావిస్తూ ఏళ్ళుగా కొనసాగుతున్న పోడు భూముల చిక్కు సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ఈ సమావేశాన్ని ప్రాథమిక సమావేశంగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు.ఛత్తీస్‌గఢ్ నుంచి వలసలను నివారించండి ఛత్తీసగఢ్ నుంచి రాష్ట్రంలోకి వస్తున్న గిరిజనులు అటవీ భూములను ఆక్రమించుకుంటున్న విషయాన్ని అధికారులు మంత్రులకు వివరించారు. దీనికి మంత్రులు స్పందిస్తూ, ‘‘పక్క రాష్ట్రాల నుంచి గిరిజనులు మన ప్రాంతానికి వస్తే ఇక్కడ ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయి. భవిష్యత్‌లో ఇలాంటి వలసలు కొనసాగకుండా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి కచి్చతమైన మార్గదర్శకాలను రూపొందించాలి. ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాలి’’అని అధికారులను ఆదేశించారు.అభివృద్ధి పనులు కొనసాగించండి: సీతక్క అటవీ ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న గ్రామాల్లో అభివృద్ధి పనులకు అటవీశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఏళ్ళుగా కొనసాగుతున్న గ్రామాల్లో అభివృద్ధి పనులను కొనసాగించేలా అధికారులకు ఆదేశాలివ్వాలని మంత్రి కొండా సురేఖను మంత్రి సీతక్క కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, పథకాల అమలులో అటవీశాఖ మార్గదర్శకాలు ప్రతిబంధకాలుగా మారుతున్న నేపథ్యంలో... ఈ దిశగా కేంద్రంతో సంప్రదింపులు జరిపి పోడు భూముల సమస్యపై పరిష్కారాన్ని రాబట్టేలా చర్యలు చేపట్టాలని కోరారు.అటవీ భూములను కాపాడుకుంటూనే, పోడు రైతులకు ప్రయోజనం కలిగేలా పోడు భూముల్లో ఉద్యానవన శాఖ మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు చేపట్టి వారికి ప్రయోజనాలను కలిగించాలని ఆమె కోరారు. ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా పలు రకాల మొక్కలను పెంచడం, పామాయిల్ చెట్ల సాగు వంటి చర్యల ద్వారా పోడు రైతులకు ప్రయోజనాలను కలిగించవచ్చని సురేఖ అధికారులకు సూచించారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు పోడు పట్టాలు ఇవ్వడం ఏంటి?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు పోడు పట్టాలు ఇవ్వడమేంటని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. పదేళ్లుగా దొర అమలు చేసిన ప్రతి పథకం తీరిదేనని ట్విట్టర్ వేదికగా ఆమె మండిపడ్డారు. పేదలకు దక్కాల్సిన పథకాలన్నీ బీఆర్ఎస్ దొంగల పాలవుతున్నాయని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నుంచి, దళితబంధు వరకు అన్నీ అక్రమాలేనన్నారు. 9 ఏళ్లుగా ఊరించి.. ఊరించి ఇస్తున్న పోడుపట్టాలను సైతం కేసీఆర్ అండ్‌కో వదిలిపెట్టడం లేదన్నారు. గిరిజనులకు దక్కాల్సిన భూముల విషయంలో అక్రమాలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. గిరిజనులకు బదులు గిరిజనేతరులకు ఎలా పట్టాలు ఇచ్చారని ప్రశ్నించారు ఈ విషయంలో వెంటనే ఒక విచారణ కమిటీ వేసి పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని షర్మిల డిమాండ్ చేశారు. -
క్షమాణలు చెప్పాకే మోదీ వరంగల్‌లో అడుగు పెట్టాలి: కేటీఆర్
సాక్షి, మహబూబాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర పునఃర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాణలు కోరిన తర్వాతే వరంగల్‌లో అడుగుపెట్టాలని అన్నారు. ములుగులో రాష్ట్ర ప్రభుత్వం 360 ఎకరాల భూమి కేటాయించినప్పటికీ.. గిరిజన యూనివర్శిటీకి ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. మహబూబాబాద్‌లో జరిగిన పోడు భూముల పట్టాల పంపిణీ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తీరు, బీజేపీ వైఖరిపై ధ్వజమెత్తారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి రిపేర్ సెంటర్ మంజూరు చేయడం సరైంది కాదన్నారు. రైళ్లు తయారీ చేసే ఫ్యాక్టరీనీ గుజరాత్‌కు తరలించి.. రిపేర్ సెంటర్ కాజీపేటకు ఇవ్వడం వివక్షకు గురిచేయడమేనని మండిపడ్డారు. వీటన్నిటికీ జవాబు చెప్పిన తర్వాతనే ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనకు రావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చదవండి: గిరిజనులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేసీఆర్.. ఆ కేసులు రద్దు! కాగా పోడు భూములకు పట్టాలు మాత్రమే కాకుండా.. రైతు బంధు, రైతు బీమా కూడా అందుతుందని కేటీఆర్ అన్నారు. ప్రమాదవశాత్తు రైతు చనిపోతే రైతు బీమా వర్తిస్తుందని చెప్పారు. జిల్లాలో 24,281 మంది రైతులకు 67,730 ఎకరాల పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. -
గిరిజనులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేసీఆర్.. ఆ కేసులు రద్దు!
సాక్షి, కొమురం భీం అసిఫాబాద్: అసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గిరిజనులకు పోడు భూముల పట్టాలను సీఎం విడుదల చేశారు. లక్షన్నర మంది గిరిజనులకు 4 లక్షల 6 వేల ఎకరాల పట్టాలు పంపిణీ చేశారు. పోడు భూములకు రైతుబంధు నిధులు విడుదల చేశారు. కేసీఆర్ మాట్లాడుతూ.. గిరిజన మహిళల పేరు మీదే పోడు భూముల పట్టాలు అందిస్తున్నట్లు తెలిపారు. పోడు భూములపై ఉన్న గతంలోని కేసులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టాలు ఇచ్చిన తరువాత కేసులు ఉండటం సరికాదని అన్నారు. ఈ మేరకు వేదిక మీదే డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. రైతు బంధు కోసం దాదాపు రూ. 24 కోట్లు నిధుల కేటాయించినట్లు చెప్పారు. గిరిజన రైతుల పల్లెలకు త్రీ-ఫేజ్ కరెంట్ అందించాలని పేర్కొన్నారు. దేశంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్టం తెలంగాణనే అని పునరుద్ఘాటించారు. అసిఫాబాద్‌లో మెడికల్ కాలేజీ కలలో కూడా ఊహించి ఉండరని అన్నారు. అంతకముందు మధ్యాహ్నం రెండు గంటలకు ఆసిఫాబాద్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ ముందుగా జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కొత్తగా నిర్మించిన జిల్లా పోలీస్ ఆఫీస్ కాంప్లెక్స్‌కు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అక్కడ రిబ్బన్ కట్ చేసి పోలీస్ ఆఫీస్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. చదవండి: వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలి: ఈటల కౌంటర్! -
పోడు భూముల పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం కేసీఆర్
Updates.. ► భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి మంత్రి హరీష్ రావు హెలికాప్టర్లో బయలుదేరారు. ► హరీష్‌తో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర కూడా ఉన్నారు. ► సాక్షి, హైదరాబాద్/ ఆసిఫాబాద్: పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన, ఆదివాసీ రైతుల కల సాకారం కానుంది. వీరికి పట్టా పుస్తకాలు పంపిణీ చేసేందుకు గిరిజన సంక్షేమ, అటవీ శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ క్రమంలో ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అర్హులకు పట్టాలు అందజేయనున్నారు. మిగతా జిల్లాల్లో జిల్లా మంత్రుల చేతుల మీదుగా అర్హులకు పట్టా పుస్తకాలు పంపిణీ చేస్తారు. ► పోడు భూముల్లో సాగుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. 1,50,012 మంది రైతులు 4,05,601 ఎకరాల్లో సాగు చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా గిరిజనులు, ఆదివాసీలే. కాగా అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 50,595 మంది రైతులు 1,51,195 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 24,972 మంది రైతులు, ఆసిఫాబాద్ జిల్లాలో 15,254 మంది రైతులు పట్టాల కోసం దరఖాస్తులు సమర్పించారు. -
నేడే పోడు పట్టాలు
సాక్షి, హైదరాబాద్/ ఆసిఫాబాద్: పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన, ఆదివాసీ రైతుల కల సాకారం కానుంది. వీరికి పట్టా పుస్తకాలు పంపిణీ చేసేందుకు గిరిజన సంక్షేమ, అటవీ శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అర్హులకు పట్టాలు అందజేయనున్నారు. మిగతా జిల్లాల్లో జిల్లా మంత్రుల చేతుల మీదుగా అర్హులకు పట్టా పుస్తకాలు పంపిణీ చేస్తారు. పోడు భూముల్లో సాగుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. 1,50,012 మంది రైతులు 4,05,601 ఎకరాల్లో సాగు చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా గిరిజనులు, ఆదివాసీలే. కాగా అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 50,595 మంది రైతులు 1,51,195 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 24,972 మంది రైతులు, ఆసిఫాబాద్ జిల్లాలో 15,254 మంది రైతులు పట్టాల కోసం దరఖాస్తులు సమర్పించారు. కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం 10.50 గంటలకు ప్రగతిభవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడినుంచి హెలికాప్టర్లో ఆసిఫాబాద్‌కు బయలుదేరతారు. పట్టణంలో తొలుత కుమురంభీం విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సమీపంలోని పిల్లల పార్కులో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి కోట్నాక భీంరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని, చివరగా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోడు రైతులకు పట్టా పుస్తకాలు ముఖ్యమంత్రి అందజేస్తారు. సాయంత్రం 6.25 గంటలకు ప్రగతిభవన్ చేరుకోనున్నారు. -
పోడు రైతులకు 30 నుంచి పట్టాల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు పట్టా పుస్తకాల పంపిణీకి సర్వం సన్నద్ధమైంది. అర్హత ఉన్న రైతులకు పట్టాలను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 30వ తేదీన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారు. ఆ జిల్లాల్లో అర్హులైన గిరిజన రైతులకు పట్టాలను పంపిణీ చేస్తారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రారంబోత్సవం అనంతరం పట్టాల పంపిణీ చేసి అక్కడ జరిగే బహిరంగసభలో సీఎం ప్రసంగిస్తారు. వాస్తవానికి పట్టాల పంపిణీ ఈనెల 24న ప్రాథమికంగా ఖరారు చేసినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ఈనెల 30కి మార్చారు. ఈ మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం ప్రకటన విడుదల చేశారు. 1,50,012 మంది రైతులకు 4,50,601 ఎకరాలు.. పోడుభూముల్లో సాగుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల నుంచి గిరిజనులు, ఆదివాసీల నుంచి దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించిన అధికారులు అర్హతలను ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,50,012 మంది రైతులు 4,50,601 ఎకరాల్లో సాగు చేసుకుంటున్నట్లు గుర్తించారు. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 50,595 మంది రైతులు 1,51,195 ఎకరాల్లో సాగు చేసుకుంటున్నట్లు దర ఖాస్తులు సమర్పించారు. ఈ లెక్కన ఒక్కో రైతు సగటున 3 ఎకరాలు సాగు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లాలో 24972 మంది రైతులు, ఆసిఫాబాద్ జిల్లాలో 15,254 మంది రైతులు దరఖాస్తులు సమ ర్పించారు. ఈ రైతులకు పట్టా పాసుపుస్తకాలు అందించేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పట్టాలను అందించిన తర్వాత ఇతర జిల్లాల్లో సంబంధిత జిల్లా మంత్రులు కూడా అదేరోజు పట్టాల పంపిణీ చేస్తారు. పోడు సమస్యకు పరిష్కారం చూపాలన్న సీఎం కేసీఆర్ సంకల్పానికి గిరిజనులు కృతజ్ఞతులై ఉంటారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. -
కేసీఆర్ చేతుల మీదుగా పోడు పట్టాలిస్తాం... మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
ఆసిఫాబాద్: సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పోడు పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా భద్రాచలం, మహబూబాబాద్ తరువాత మూడో స్థానంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనను పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయ భవనాలు, జిల్లా పోలీస్ కార్యాలయంతోపాటు సీఎం సభ నిర్వహించనున్న స్థలాన్ని కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎస్పీ సురేశ్‌కుమార్, జెడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సమీకృత కలెక్టరేట్ పనులు పూర్తి చేసే విషయంపై కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 24న హెలీక్యాప్టర్ ద్వారా సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారని తెలిపారు. పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన కొమురంభీం, దివంగత మంత్రి కొట్నాక భీమ్రావు విగ్రహాల ఆవిష్కరణ, ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. సమయాభావం, సీఎం షెడ్యూల్‌కు అనుగుణంగా బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్లో ప్రారంభోత్సవానికి పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు. సమీకృత కలెక్టరేట్లో 40 శాఖలకు చెందిన కార్యాలయాలతో పాటు స్టేట్ చాంబర్, మంత్రులు, వీవీఐపీలు వచ్చినప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు ప్రత్యేక చాంబర్లు నిర్మించినట్లు చెప్పారు. కొత్త భవనంలో వసతులతో అధికారులు 20నుంచి 30శాతం వరకు అధికంగా ఏకాగ్రతతో విధులు నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. వందేళ్ల క్రితం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా ఉన్నప్పటికీ అప్పుడు జరగని అభివృద్ధి ప్రస్తుతం జరుగుతోందని వివరించారు. జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు, ఎంపీపీ అరిగెల మల్లికార్జున్, సింగిల్‌విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, ఏఎంసీ మాజీ చైర్మన్లు గాదెవేణి మల్లేశ్, చిలువేరు వెంకన్న, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, డీఎస్పీలు శ్రీనివాస్, కరుణాకర్, సంబంధిత శాఖల అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
పోడు భూముల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం చర్యలు
-
పోడు పట్టాల పండగ!
సాక్షి, హైదరాబాద్: గిరిజనులకు పోడు భూములకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జూన్ 24 నుంచి 30 వరకు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి రైతుబంధు పథకాన్ని వర్తింపచేయాలని ఆదేశించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు పట్టాల పంపిణీ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంగళవారం సచివాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమానికి తాను స్వయంగా హాజరవుతానని ముఖ్యమంత్రి తెలిపారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్ఓఎఫ్ఆర్)–2006 కింద పట్టాలు పొంది రైతుబంధు అందుకుంటున్న గిరిజన రైతులతో, కొత్తగా పోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజన లబ్ధిదారులను క్రోడీకరించాలని సూచించారు. ఇతర రైతుల తరహాలోనే వీరికీ రైతుబంధు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వమే బ్యాంకు ఖాతాలను తెరిచి పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లో రైతుబంధు మొత్తాన్ని జమ చేస్తుందని చెప్పారు. కొత్తగా పోడు పట్టాలు అందుకుంటున్న గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖకు అందజేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను కేసీఆర్ ఆదేశించారు. అర్హులైన నిరుపేదలకు భూములు గ్రామాల్లో ఇంకా మిగిలి వున్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను గుర్తించి, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అర్హులైన నిరుపేదల ఇళ్ల నిర్మాణాల కోసం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సొంత జాగాలో ఇళ్ల నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం విధివిధానాలను త్వరితగతిన తయారు చేయాలని, జూలైలో ఈ పథకాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. జూలైలోనే దళితబంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్‌కు సూచించారు. కలెక్టర్లతో రేపు సదస్సు తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి ఈ నెల 25న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా ఎస్పీలు పాల్గొంటారు. 14న నిమ్స్ విస్తరణకు శంకుస్థాపన వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా జూన్ 14న నిమ్స్ ఆస్పత్రి విస్తరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. 2,000 పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణం పనులకు పునాదిరాయి వేయనున్నారు. -
పొలిటికల్ కారిడార్: పోడు భూములపై ఆధారపడ్డ వేలాది కుటుంబాలు
-
ఉట్నూర్ ఐటీడీఏకి ‘తుడుందెబ్బ’
సాక్షి,ఆదిలాబాద్: ఎస్టీల్లో నుంచి లంబాడాలను తొలగించాలని ఇప్పటివరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించిన ఆదివాసీలు తాజాగా ప్రభుత్వం వివిధ కులాలను ఎస్టీల్లో చేర్చడంపై ఆగ్రహావేశాలతో ఆందోళన ఉధృతం చేశారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో వాల్మీకిబోయ, ఖైతి లంబాడాతో పాటు మొత్తంగా 11 కులాలను షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో చేరుస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏను ముట్టడించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ముందుగా నిర్ణయించింది. రాష్ట్ర అధ్యక్షుడు బుర్సా పోచయ్య ఆధ్వర్యంలో సోమవారం ఆదివాసీలు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఆ తర్వాత కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సమీపంలో ఏర్పాటుచేసిన బారికేడ్లను తోసేసి ఆదివాసీలులోనికి దూసుకెళ్లారు. కార్యాలయం పైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఆవరణలో ఉన్న ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ వాహన అద్దాలను ధ్వంసం చేశారు. అదనపు బలగాలతో చేరుకున్న ఎస్పీ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్పీ డి.ఉదయ్‌కుమార్ రెడ్డి అదనపు బలగాలతో ఉట్నూర్ చేరుకున్నారు. సమస్యలను కలెక్టర్‌కు విన్నవించాలని కోరారు. అయితే ఆందోళనకారులు ఐటీడీఏ పీవో రావాలని పట్టుబట్టారు. ప్రస్తుతం నిర్మల్ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న వరుణ్‌రెడ్డి ఉట్నూర్ ఐటీడీఏకు ఇన్చార్జి పీవోగా కొనసాగుతున్నారు. ఓ గంట తర్వాత ఆయన అక్కడికి చేరుకోవడంతో ఆదివాసీలు తమ సమస్యలను విన్నవించారు. ఎస్టీల్లో అదనంగా కులాలను చేర్చడాన్ని వెనక్కి తీసుకోవాలని డి మాండ్ చేశారు. పోడు భూములకు పట్టాల జారీలో షరతులు విదించడం సరికాదన్నారు. దీనిపై వినతి పత్రాన్ని అందజేశారు. ఆయన స్పందిస్తూ ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. -
గొత్తి కోయలకూ ‘పోడు’ పట్టాలివ్వాలి
నర్మెట: పోడు భూములు సాగు చేసుకుంటున్న ఇతర ఎస్టీలతోపాటు గొత్తి కోయలకు కూడా వెంటనే పట్టాలు ఇవ్వాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గొత్తి కోయలు అటవీ అధికారులను హత్య చేయడాన్ని తాను సమర్థించడం లేదని, అయితే వారు కూడా చాలా కాలం నుంచి పోడు చేసుకుని జీవిస్తున్నందున వారికి కూడా పట్టాలివ్వాలని అన్నారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం జనగామ జిల్లా నర్మెట, తరిగొప్పుల మండలాల్లో సాగింది. ఈ సందర్భంగా నర్మెట మండలం ఆగాపేటలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, తన కుటుంబ సభ్యులే భూకబ్జాలకు పాల్పడుతుంటే సీఎం కేసీఆర్ నోరు మెదపడంలేదని, ఇదేనా బంగారు తెలంగాణ అని దుయ్యబట్టారు. ధరణి పోర్టల్ బీఆర్ఎస్ నేతల కబ్జాలకే ఉపయోగపడిందని మండిపడ్డారు. వైఎస్సార్ పాలనలో 9 రకాల నిత్యావసర సరుకులను పేదలకు రేషన్‌ద్వారా అందిస్తే.. కేసీఆర్ బెల్ట్‌షాపులను ఏర్పాటు చేసిన ఘనత దక్కించుకున్నారని ఎద్దేవా చేశారు. తన పాదయాత్ర 3,700 కిలోమీటర్ల మైలురాయి దాటిన సందర్భంగా తరిగొప్పులలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. -
పోడు పట్టాలు ఇవ్వకుంటే చెట్టుకు కట్టేయండి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా ఓట్లు అడగడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తే చెట్లకు కట్టేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు కాంగ్రెస్ వెంట ఉన్నారనే భయం సీఎం కేసీఆర్‌కు పట్టుకుందని.. అందుకే ఇప్పుడు 11.5 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు జారీ చేస్తామని మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. ‘హాథ్‌సే హాథ్ జోడో’యాత్రలో భాగంగా శనివారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు జగదాంబ సెంటర్లో జరిగిన కార్నర్ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. అధికారం చేపట్టిన తొమ్మిదేళ్లలో పోడు రైతులు, ఆదివాసీలపై దాడులు చేయడం తప్ప పట్టాలు ఇచ్చే విషయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. పోడు భూముల అంశంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడితే.. ఆదివాసీ మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా కేసీఆర్ ఆమెపైకి దూసుకొస్తూ రంకెలు వేశారని వ్యాఖ్యానించారు. పోడు సాగుచేస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్నామే తప్ప.. ఫాంహౌజ్ భూములు, బ్యాంకులోని డబ్బులు రాసి ఇవ్వాలని ఏమీ అడగటం లేదని పేర్కొన్నారు. ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలి మాయమాటలు చెప్పడంలో, ప్రజలను మోసం చేయడంలో సీఎం కేసీఆర్‌ను మించిన వారు ఎవరూ లేరని రేవంత్‌రెడ్డి విమర్శించారు. వాల్మీకి బోయ వర్గానికి చెందిన గట్టు భీముడికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆశ చూపి, చివరికి ఎగ్గొట్టారని ఆరోపించారు. వాల్మీకి బోయతోపాటు మరికొన్ని కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. రిజర్వేషన్ల పెంపు, కొత్త కులాల చేర్పు వంటి అంశాలను కేంద్రం మీద నెట్టేస్తూ తప్పు కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సింగరేణిలో అవినీతిపై విచారణ చేస్తాం కాంగ్రెస్ సభలకు వెళ్తున్న వారికి పోడు పట్టాలు ఇవ్వబోమంటూ ప్రభుత్వం బెదిరింపులకు గురిచేస్తోందని రేవంత్ ఆరోపించారు. జవహర్‌ఖని గనిని సందర్శించిన రేవంత్‌రెడ్డి కార్మికులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేయిస్తామని.. సింగరేణి సీఎండీ శ్రీధర్, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కవితపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అర్హులందరికీ పోడు పట్టాలిస్తాం 2024 జనవరిలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. ఆ వెంటనే అర్హులైన అందరికీ పోడు పట్టాలు జారీ చేస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆహార, వాణిజ్య పంటన్నింటికీ గిట్టుబాటు ధర కల్పిస్తామని, రూ.5 లక్షల వ్యయంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తామని ప్రకటించారు. రూ.ఐదువేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, రూ.800 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిల విడుదల, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీలు ఇచ్చారు. -
ఆదివాసీలను కించ పర్చేలా కేసీఆర్ వ్యాఖ్యలు: వైఎస్ షర్మిల
-
నెలాఖరుకల్లా పోడు భూములు పంపిణీ చేస్తాం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటికే సాగులో ఉన్న 11.5 లక్షల ఎకరాల పోడు భూముల పంపిణీ ప్రక్రియను ఈ (ఫిబ్రవరి) నెలాఖరుకల్లా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆయా జిల్లాల్లో పంపిణీ చేయాల్సిన భూములకు సంబంధించిన సర్వే ఇప్పటికే పూర్తయిందని, నివేదికలు కూడా సిద్ధమయ్యాయని వెల్లడించారు. పంపిణీ చేసే పోడు భూములకు పట్టా ఇవ్వడంతోపాటు విద్యుత్ కనెక్షన్, రైతుబంధు, నీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. పోడు భూముల పంపిణీ తర్వాత క్షేత్రస్థాయిలో గిరిజన గణన జరిపి భూమిలేని వారికి ‘దళితబంధు’తరహాలో ‘గిరిజన బంధు’అమలు చేస్తామని ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో పోడు భూముల సమస్యపై కాంగ్రెస్ సభ్యులు పొదెం వీరయ్య, ధనసరి అనసూయ (సీతక్క), బీఆర్ఎస్ సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘పోడు భూముల విషయంలో మాకు స్పష్టమైన విధానం ఉంది. సాగు చేసుకునే వారికి పట్టాలు ఇవ్వాలని ఇటీవలే ఓ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. ఆ భూములు పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పిస్తాం. భూమిలేని గిరిజన బిడ్డలకు గిరిజన బంధు ఇచ్చి సాయం చేస్తాం. ఏయే జిల్లాల్లో ఎంత భూమిని పంపిణీ చేయాలో సర్వే చేసి, నివేదికలు కూడా సిద్ధం చేశారు. కానీ.. అఖిలపక్షంతోపాటు స్థానిక సర్పంచి, ఎంపీటీసీ, స్థానిక గిరిజన ప్రతినిధులు సంతకాలు పెడితేనే పోడు భూములకు పట్టాలిస్తాం. పోడు భూములు హక్కుకాదు.. దురాక్రమణ కొన్నిచోట్ల గొత్తికోయలను తీసుకొచ్చి అడవులను నరికేస్తున్నారు. మన రాష్ట్రానికి చెందిన శ్రీనివాసరావు అనే ఫారెస్టు అధికారిని ఛత్తీస్‌ఘడ్ నుంచి వచి్చన గొత్తికోయలు హత్య చేశారు. ఇదేం పద్ధతి. పోడు భూముల గురించి అందరూ మాట్లాడుతున్నారు. పోడు భూములు గిరిజనుల హక్కు కాదు.. దురాక్రమణ. దయతలచి ఇస్తే తీసుకోవాలి. గతంలో ఉన్న ప్రభుత్వాలు సరైన పద్ధతుల్లో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడింది. పోడు భూములు, అటవీ భూములు కొన్ని పార్టీలకు ఆట వస్తువులుగా మారాయి. గతంలో ఎన్నికలకు ముందు పోడు భూములకు పట్టాలు అని ఇష్టమొచి్చనట్టు చేశారు. పోడు భూముల పేరుతో ఆందోళన చేస్తే హీరోలు అనుకుంటున్నారు. విచక్షణారహితంగా అడవులను నరికేయడం సరికాదు. పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. అడవులను రక్షించాల్సిన బాధ్యత మనమీద ఉంది. గిరిజనుల హక్కులను కాపాడాల్సిందే.. మరి రాష్ట్రంలో అటవీ సంపద ఉండాలా వద్దా? ఆలోచించాలి. అంతటా అడవులు కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు నర్సాపూర్ అడవుల్లో సినిమా షూటింగులు జరిపేవారు. ఇప్పుడు ఎడారి అయింది. అడవులను పునరుద్ధరించుకునేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఇప్పటికి రాష్ట్రంలో 7.8 శాతం గ్రీనరీ పెరిగిందని ప్రశంసలు వస్తున్నాయి. బ్రెజిల్, చైనా తర్వాత తెలంగాణలోనే గ్రామాల్లో ప్రజా ప్రతినిధులకు టార్గెట్లు పెట్టి నిర్బంధంగా మొక్కలు నాటించి గ్రీనరీని పెంచే ప్రయత్నం చేస్తున్నాం. భూముల కోసం పెళ్లిళ్లు.. ఇక నుంచి పోడు లేదు.. అటవీ దురాక్రమణ ఉండొద్దు. అడవులు అంతరించిపోవడం సమాజానికి ప్రమాదకరం. అడవుల సంరక్షణ జరగాలి. పోడు భూముల విషయంలో గిరిజనుల పేరిట అగ్రవర్ణాల వాళ్లు అటవీ భూములు పొందుతున్నారు. గిరిజన తెగకు చెందిన ఆడపిల్లలను పెళ్లి చేసుకొని ఎకరాల కొద్దీ భూములను ఆక్రమించుకుంటున్నారు. అటవీ సంపదను దోపిడీ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పలువురు ఉన్నత కులాలవారు అటవీ భూములను కబ్జాచేశారు. 10, 20 ఎకరాల పోడు భూములు ఎవరికైనా ఉంటాయా? గిరిజనుల హక్కులను కాపాడాల్సిందే. అలాగే అటవీ హక్కులను కూడా కాపాడాలి. గతంలో మా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు పోడు భూముల విషయంలో జోక్యం చేసుకుంటే కేసులు పెట్టారు. ఎవరినీ ఉపేక్షించేది లేదు. పోడు భూములకు సంబంధించి ఆర్ఓఎఫ్ఆర్ కింద ఇచి్చనవి ఎన్నో లెక్కచూసుకొని ఇస్తాం. గతంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిన వారికి రైతుబంధు కూడా ఇస్తున్నాం. కొన్ని అటవీ గ్రామాల్లో గిరిజనుల విజ్ఞప్తి మేరకు రూ. 400 కోట్లు వెచి్చంచి మూడో ఫేజ్ విద్యుత్ సౌకర్యం కలి్పంచాం. అయితే అటవీ అధికారుల వ్యవహారశైలి కూడా మారాల్సిన అవసరం ఉంది. శవ దహనానికి కట్టెలు తీసుకొచ్చినా కొందరు అతి చేస్తున్నారు. దీనిపై అటవీశాఖ మంత్రి, అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి క్లారిటీ ఇస్తాం. సాయుధ దళాలతో పహారా గిరిజనులపై పోలీసులు, అటవీ అధికారులు దాడి చేయవద్దు. అదే సమయంలో అధికారులపైనా గిరిజనుల దాడులను సహించబోం. మన రాష్ట్రం కాని గొత్తికోయల దౌర్జన్యం మంచిది కాదు. అడవిని నరికేసి భూములు ఇవ్వామని అడగడం ఏంటి? అడవుల నరికివేతకు ఎక్కడో చోట ఫుల్స్టాప్ పడాలి. అడవులకు సరిహద్దులు పెట్టి సాయుధ దళాలతో పహారా ఏర్పాటుచేస్తాం. గిరిజనుల పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలి. పర్యావరణ పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటాం. అడవుల రక్షణ అనేది మనందరి బాధ్యత’’అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గిరిజనులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి: పొదెం వీరయ్య ప్రశ్నోత్తరాల సమయంలో పోడుభూముల సమస్యపై కాంగ్రెస్ సభ్యుడు పొదెం వీరయ్య మాట్లాడారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడలో 12 మంది గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. పోడు భూముల మీద ఆధారపడి ఈ తండాలో 39 కుటుంబాలు జీవనం సాగిస్తుంటే.. అటవీ చట్టాల కింద కేసులు పెట్టి 12 మందిని ఆదిలాబాద్ జైలుకు పంపారని వివరించారు. అనంతరం ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. కోయపోచగూడలో అటవీ అధికారులు దుశ్శాసన పర్వం చూపించారని ఆందోళన వ్యక్తం చేశారు. చేపలుపట్టుకోవడానికి, పొయ్యిలకు కట్టెలు తెచ్చుకోవడానికి అడవిలోకి వెళ్లినా.. కొట్టి హింసించి, అటవీ చట్టాల కింద గిరిజనులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పోడుసాగులో ఉన్నవారిని కూడా దున్నుకోనివ్వడం లేదన్నారు. దీనిపై మంత్రి సత్యవతి రాథోడ్ సమాధానమిస్తూ.. కోయపోచగూడలో 12 మందిపై పెట్టిన కేసులను ఎత్తివేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. లిఖిత పూర్వక హామీ ఇస్తేనే.. పోడు భూముల పంపిణీ తర్వాత అడవిలో ఒక్క చెట్టు కూడా నరకబోం.. మళ్లీ పోడు భూములనే మాటెత్తం. అడవులను రక్షిస్తామని సర్పంచి నుంచి ఎంపీటీసీ, అఖిలపక్ష గిరిజన ప్రతినిధుల దాకా సంతకాలు పెడితేనే పోడు భూములను పంపిణీ చేస్తాం. అందుకు సిద్ధంగా లేని వారికి భూములు ఇవ్వం. ఇక నుంచి పోడు భూములను రక్షిస్తామని.. పట్టాలు ఇచ్చాక గజం భూమిని కూడా ఆక్రమించబోమని ప్రభుత్వానికి లిఖిత పూర్వక హామీ ఇవ్వాలి. ఎవరైనా దాన్ని అతిక్రమిస్తే పోడు పట్టాలు రద్దు చేస్తాం. భూములు పొందిన తర్వాత వారే అటవీ సంపదను కాపాడే హక్కుదారులు కావాలి – అసెంబ్లీలో సీఎం కేసీఆర్ -
‘పోడు’ పట్టాలివ్వకుంటే ఫామ్‌హౌస్‌ను దున్నేస్తారు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ మానవమృగంలా వ్యవహరిస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంటర్ విద్యార్థులు మొదలుకుని రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కనీసం స్పందించని నరరూప రాక్షసుడు అని మండిపడ్డారు. కేసీఆర్ పాలన మానవత్వానికి చిరునామా అంటూ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఎనిమిదేళ్లుగా పోడు భూములకు పట్టాలివ్వకుండా సాగతీత ధోరణి అనుసరించి ఇప్పుడు మళ్లీ అఖిలపక్షం పేరుతో కొత్త డ్రామాలకు తెరదీశారని మండిపడ్డారు. ఈసారి పోడు భూములకు పట్టాలివ్వకుంటే పేదలంతా ఫామ్‌హౌస్‌ను ఆక్రమించుకుని దున్నడం ఖాయమని హెచ్చరించారు. ‘అఖిలపక్ష సమావేశం నిర్వహించి భవిష్యత్తులో పోడు సాగు చేయబోమని హామీ ఇస్తేనే పట్టాలిస్తానని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పడం సిగ్గు చేటు. ఉప ఎన్నికల సమయంలో ఈ మాట ఎందుకు చెప్పలేదు? మళ్లీ అఖిలపక్షం పేరుతో కొత్త డ్రామా చేస్తున్నదెవరు?’ అని అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో సిరిసిల్ల సెస్ మాజీ వైస్ చైర్మన్, శ్రీనివాస చారిట బుల్ ట్రస్ట్ అధినేత లగిశెట్టి శ్రీనివాస్ సహా పలువురు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కూల్చే సంస్కృతి ఎవరిది? తాము కడుతుంటే కొందరికి కూల్చే సంస్కృతీ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఒక విలేకరి ప్రస్తావించగా సంజయ్ తీవ్రంగా స్పందించారు. ‘అసలు సచివాలయాన్ని కూల్చిందెవరు? కూల్చే సంస్కృతి ఎవరిది? మీ తండ్రి సచివాలయానికే పోనప్పుడు కూల్చాల్సిన అవసరం ఏముంది? సచివాలయంలో పోచమ్మ తల్లి ఆలయాన్ని కూల్చిందెవరు? ప్రజలను కలవని ప్రగతి భవన్‌ను ఎందుకు కట్టుకున్నవ్? పేదలకు ఉపయోగపడే ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్థలో ఉంది. దానిని కూల్చి కొత్త భవనం ఎందుకు కట్టడం లేదు’ అని బదులిచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలివ్వాలి పాతబస్తీలో విద్యుత్ బకాయిల్లేవంటూ ఎంఐఎం నేతలు, బీæఆర్ఎస్ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని సంజయ్ వ్యాఖ్యానించారు. పాతబస్తీలో ఏటా రూ.వెయ్యి కోట్ల విద్యుత్ చౌర్యం జరుగుతోందని, తనతో వస్తే నిరూపించేందుకు సిద్ధమని సంజయ్ సవాల్ విసిరారు. జర్నలిస్టుల సంక్షేమంలో తమ ప్రభుత్వం నంబర్ వన్ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని 1,100 మంది జర్నలిస్టులకు నిజాంపేట, పేట్ బషీరాబాద్‌లో తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చి 6 నెలలైనా అమలు చేయని దుర్మార్గుడు కేసీఆర్ అని మండిపడ్డారు. ‘జర్నలిస్టులకు ఇళ్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. మీకు చేతగాకుంటే మాకు అప్పగించండి. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే జర్నలిస్టులకు ఇళ్లు ఇవ్వాలని ప్రతిపాదన పంపితే కేంద్రంతో మాట్లాడి వారం రోజుల్లో మంజూరు చేయిస్తా’ అని చెప్పారు. -
ఫారెస్ట్ అధికారిని ఎవరు చంపారు?.. గూండాగిరి మంచిది కాదు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోడు భూములపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీ వేదికగా పోడుభూముల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, కేసీఆర్ సభలో మాట్లాడుతూ.. పోడు భూములంటే దురాక్రమణే. అడవులను నరికేయడం కరెక్టేనా?. ప్రభుత్వ షరతులను ఒప్పుకుంటేనే పోడు భూముల పంపిణీ ఉంటుంది. పోడు భూములు న్యాయపరమైన డిమాండ్ కాదు. ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్‌ను ఎవరు చంపారు?. గుత్తికోయల గూండాగిరి మంచిది కాదు. పోడు భూములు తీసుకున్న వారు లిఖితపూర్వక హామీ ఇవ్వాలి. ఫిబ్రవరిలో పోడు భూముల పంపీణి ఉంటుంది. పోడు భూములకు విద్యుత్, రైతుబంధు కూడా ఇస్తాము. అటవీ సంపదకు ఇబ్బంది కలిగిస్తే పోడు భూములు రద్దు చేస్తాము. పోడు భూములు గిరిజనుల హక్కు కాదు. అడవులను కాపాడాలా వద్దాఅని ప్రశ్నించారు. -
ఫిబ్రవరిలో పోడు భూములకు పట్టాలు
సాక్షి, మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోడు రైతులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఫిబ్రవరిలో చేపట్టనున్నట్లు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈనెల 12న ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబాబాద్ పర్యటన నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లు సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యవతి మాట్లాడారు. మహబూబాబాద్‌లో సీఎం కేసీఆర్‌తో భారీ బహిరంగ సభ ఏర్పా టు చేయాలని అనుకున్నామని అన్నారు. సభ లో గిరిజనులకు పోడు భూములకు సంబంధించి పట్టాలు పంపిణీ చేసేందుకు సమాయ త్తమయ్యామని చెప్పారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల పట్టాల పంపిణీలో జాప్య మవుతోందన్నారు. ఫిబ్రవరిలో మహబూబా బాద్‌లో భారీ బహిరంగ సభ పెట్టి పట్టాలు పంపిణీ చేసేందుకు వస్తానని సీఎం చెప్పినట్లు మంత్రి వివరించారు. అప్పటివరకు గిరిజను లు వేచి ఉండాలని, అర్హులైన వారందరికి పట్టాలు అందజేస్తామని ఆమె పేర్కొన్నారు -
బీజేపీతో తస్మాత్ జాగ్రత్త
పటాన్చెరు: మతతత్వ బీజేపీతో బంజారాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగిన రాష్ట్ర బంజారా ఎంప్లాయీస్ సేవాసంఘ్ కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో కలసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లంబాడాలకు రిజర్వేషన్లు తొలగించాలని ఓ తెలంగాణ ఎంపీ డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన ఉద్యోగులపై బీజేపీ వాదులు దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నెల రోజుల్లో పోడు భూముల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా బంజారా భవన్‌ను నిర్మిస్తున్నామని, సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నామని, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని హరీశ్‌రావు వివరించారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచామని, ఎస్టీ బాలికల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలను తెరిచామని గుర్తు చేశారు. కాగా, గిరిజన యూనివర్సిటీ మంజూరు విషయంలో కేంద్రం తాత్సారం చేస్తోందన్నారు. ఏడేళ్ల క్రితం 317 ఎకరాల భూమిని ఈ యూనివర్సిటీ కోసం కేటాయించినప్పటికీ నేటికీ అక్కడ యూనివర్సిటీ రాలేదన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు రాలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని నిలదీయాలని ఆయన కోరారు. కాంగ్రెస్, టీడీపీలు బంజారాలను ఓట్ల కోసం వాడుకున్నాయే తప్ప వారి అభ్యున్నతికి చేసిందేమీ లేదన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో బంజారాలు బీఆర్ఎస్ను బలపరుస్తున్నారని తెలిపారు. త్వరలో భర్తీ చేయనున్న 81 వేల ఉద్యోగాల్లో బంజారాలకు పది శాతం రిజర్వేషన్లు ఉంటాయన్నారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
గొత్తికోయలను వెళ్లగొట్టాలనడం రాజ్యాంగ వ్యతిరేకచర్య: జూలకంటి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: గొత్తికోయలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలనడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అని సీపీఎం మాజీ శాసనసభ పక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. ఆదివాసీలకు రాష్ట్రాల మధ్య సరిహద్దులు ఉన్నాయన్న విషయం తెలియకుండా శతాబ్దాలుగా అడవే జీవనా«ధారంగా జీవిస్తున్నారని తెలిపారు. గత రెండు, మూడు దశాబ్దాల నుంచి ఛతీస్‌గఢ్ రాష్ట్రం నుంచి పక్కనే ఉన్న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు గొత్తికోయలు వలస వచ్చారన్నారు. గురువారం సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో ఆదివాసీ అటవీహక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ‘గొత్తికోయలు – పోడుభూముల సమస్యలు’అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ...దశాబ్దాలుగా ఇక్కడికి వచ్చి జీవనం సాగిస్తున్న గొత్తికోయల జీవించే హక్కును కాలరాస్తూ వెళ్లగొట్టాలని చూడటం దుర్మార్గమైన చర్య అన్నారు. వారు తెలంగాణ పౌరులు కాదని మంత్రి సత్యవతిరాథోడ్, అటవీఅధికారులు బహిరంగ ప్రకటనలు ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అని విమర్శించారు. అటవీశాఖ అధికారి శ్రీనివాసరావు హత్యను బూచీగా చూపి వారికి పోడు భూములపై హక్కులు కల్పించకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, గిరిజన సంఘం కార్యదర్శి ఆర్.శ్రీరాంనాయక్, రమణాల లక్ష్మయ్య, ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ మాజీ ఎమ్మెల్యే యాదగిరిరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
పోడు పట్టాల పేరిట కేసీఆర్ చిచ్చు
ములుగు: పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి గిరిజనులు, అటవీ అధికారుల మధ్య చిచ్చు పెట్టిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం యాత్ర శుక్రవారం ములుగు జిల్లాలో కొనసాగింది. సాయంత్రం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. పోడు భూములకు పట్టాలివ్వకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజన మహిళల జుట్లు పట్టుకులాగే అరాచక, దుర్మార్గపు పాలన చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని ఆరోపించారు. కేసీఆర్ తన పాపాలను కప్పి పుచ్చుకోవడానికే రాష్ట్ర మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. విభజన చట్టంలో భాగంగా కేటాయించిన గిరిజన యూనివర్సిటీ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటలాడుతున్నాయన్నారు. రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థులకు సరైన భోజనం పెట్టలేని సీఎం ఉంటే ఎంత.. లేకుంటే ఎంత.. అని ఎద్దేవా చేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలనను తీసుకొస్తానని షర్మిల హామీ ఇచ్చారు. -
ఉమ్మడి ఖమ్మంలో పోడు భూముల సర్వేకు బ్రేక్
-
పోడు సర్వేకు బ్రేక్.. విధులు బహిష్కరించిన అటవీ సిబ్బంది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పోడు సర్వేకు బ్రేక్ పడింది. ఎఫ్ఆర్ఓ చలమల శ్రీనివాసరావు హత్యను నిరసి స్తూ అటవీశాఖ ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో గ్రామసభలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శాఖ సిబ్బంది గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మంలో నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శన చేయడంతో పాటు డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. అలాగే గాందీచౌక్‌లోని గాంధీ విగ్రహానికి కూడా వినతిపత్రం ఇచ్చారు. ఇక శుక్రవారం నుంచి డివిజన్, జిల్లా స్థాయిలో ఆందోళనలకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా ఉద్యమం చేపట్టనున్నట్లు ఫారెస్ట్ రేంజర్స్ అసోసియేషన్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. అడవుల్లో విధులు నిర్వహించే తమ కు ఆయుధాలు ఇవ్వాలని, ప్రత్యేకంగా ఫారెస్ట్ స్టేష న్లు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిబ్బందిని పెంచడంతో పాటు ఎనిమిది గంటల పనివిధానం అమలు చేయాలని నినదించారు. అలాగే ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్‌ను బహిర్గతం చేయాల న్నారు. ఇక ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు హత్యకు సంబంధించిన దర్యాప్తును పారదర్శకంగా చేయా లని డిమాండ్ చేశారు. నిందితులను తామే పట్టు కుని పోలీసులకు అప్పగించినట్లు ఉద్యోగులు తెలిపారు. దరఖాస్తులపై గందరగోళం.. పోడు దరఖాస్తులపై గందరగోళం నెలకొంది. దర ఖాస్తుల స్వీకరణ గడువు తేదీని బహిర్గతం చేయకపోవడంతో ఇంకా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయని అటవీశాఖ యంత్రాంగం తెలిపింది. ప్రస్తుతం పోడు కొడుతూ దరఖాస్తులు చేసుకుంటున్నారని, దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పోడు సర్వే చివరి దశకు చేరిందని ప్రకటిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అటవీశాఖ సిబ్బంది చెబుతున్న సమస్యలను అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇంతలోనే ఎఫ్ఆర్ఓ హత్య జరగడంతో వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది ఆందోళనలు పోడు సర్వేపై ప్రభావం చూపిస్తున్నాయి. పోడు సర్వేలో అటవీ సిబ్బంది కీలకం కాగా.. వీరు లేకుండా రెవెన్యూ, గ్రామ పంచాయతీ సిబ్బంది సర్వేకు వెళ్లే అవకాశాలు లేవు. ఇదీ చదవండి: Recession: ముందు నుయ్యి... వెనుక గొయ్యి -
సర్కారు వైఫల్యంతోనే అటవీఅధికారి బలి
సాక్షి, హైదరాబాద్: పోడుభూముల సమస్యను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా కాలయాపన చేయడం వల్లే ఫారెస్ట్ అధికారి బలయ్యారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోడురైతులకు చట్టబద్ధంగా హక్కులు కల్పించాలని రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి అసెంబ్లీ లోపలా, బయటా మొర పెట్టుకుంటున్నప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. భూమికి, మనిషికి అవినాభావ సంబంధం ఉందని, ఆడవిలో పుట్టినబిడ్డలకు అడవిపై హక్కులేదనడం సరికాదని పేర్కొన్నారు. అటవీహక్కుల చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం వల్లే సమస్య జఠిలం అవుతోందన్నారు. ఎమ్మెల్యేలు చైర్మన్‌గా ఉండే ల్యాండ్ అసైన్డ్ కమిటీ సమావేశాలు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేయడం వల్ల అనేక సమస్యలు పరిష్కారం కావడంలేదన్నారు. భూమి సమస్యలను పెండింగ్‌లో పెట్టడం వల్ల అనర్థాలు జరిగే ప్రమాదం ఉందని ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వివరించినట్లు చెప్పారు. భూసేకరణ చేపట్టినప్పటికీ ఇళ్లపట్టాలు పంపిణీ చేయని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటన్నారు. పార్టీ పిలుపు మేరకు గురువారం రాష్ట్రంలోని అన్ని మండలాల్లో లబ్ధిదారులు పెద్దఎత్తున తరలివచ్చి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పారు. జాతిపిత మహాత్మాగాంధీని చంపిన గాడ్సే పార్టీ బీజేపీ అని పలుమార్లు విమర్శించిన మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం విచారకరమన్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయాలను తాను గౌరవిస్తానని అన్నారు. పార్టీలో అంతర్గతంగా ఉన్న అభిప్రాయభేదాలపై తాను చొరవ తీసుకొని మాట్లాడతానని చెప్పారు. సామాజిక తెలంగాణ దిశగా అడుగులు పడుతున్న క్రమంలో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి శ్రీనివాస్‌రావు సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడాన్ని భట్టి ఖండించారు. ప్రభుత్వ అధికారిగా కాకుండా శ్రీనివాస్‌రావు వ్యక్తిగతంగా కేసీఆర్ కాళ్లు మొక్కినా, కడిగినా, నొక్కినా తమకు అభ్యంతరంలేదని పేర్కొన్నారు. పక్కదారిపట్టిస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు వేసే ఎత్తులే ఈడీ, ఐటీ, జీఎస్టీ దాడులని భట్టి ధ్వజమెత్తారు. విధినిర్వహణలో భాగంగా జరిగే ఐటీ దాడులనూ టీఆర్ఎస్, బీజేపీలు రాజకీయం చేస్తున్నాయన్నారు. -
కొత్త ఏడాదిలో అటవీ ఆక్రమణలకు చెక్
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల చివర్లోగా పోడుభూములపై క్లెయిమ్స్ పరిష్కరించే ప్రక్రియ పూర్తవుతుందని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఇది ముగిశాక కొత్త ఏడాది నుంచి అక్రమంగా అడవుల్లోకి ప్రవేశించకుండా, ఆక్రమణలు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నారు. పోడుభూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే నిమిత్తం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారని మంత్రి తెలిపారు. ఈ భూములపై అందిన క్లెయిమ్స్‌పై ఈ నెలాఖరులోగా సర్వే పూర్తవుతాయని చెప్పారు. ఆ తర్వాత వివిధ కమిటీల ద్వారా సమావేశాలు నిర్వహించి భూమి అప్పగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఆ తర్వాత అటవీభూముల జోలికి ఎవరూ వెళ్లకుండా, అక్రమణలు చోటుచేసుకోకుండా ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. పోడుభూముల వివాదాల పరిష్కారం, పులుల దాడుల ఘటనలు, టైగర్ రిజర్వ్‌ల పరిధిలోని గ్రామాల తరలింపు తదితర అంశాలపై శుక్రవారం ‘సాక్షి’తో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడారు. అటవీ ప్రాంతాల్లో గుంపులుగా శబ్దాలు చేస్తూ... అటవీ ప్రాంతాల్లోని పత్తిచేన్లకు గుంపులుగా వెళ్తూ శబ్దాలు చేయాలని మంత్రి ఇంద్రకరణ్ సూచించారు. పులుల కదలికలున్న చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్ తదితర ప్రాంతాల్లో ప్రజలను అటవీశాఖ అప్రమత్తం చేసిందని తెలిపారు. ఇటీవల పెద్దపులి దాడిలో ఒక వ్యక్తి మృతి చెందిన నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ ఆదేశాలు జారీచేశారని చెప్పారు. అటవీ ప్రాంతాల్లో జనసంచారం లేనిచోట్ల తమకు అనువైన ప్రాంతాల్లో పులులు ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటాయని చెప్పారు. ఇటీవల కాలంలో ప్రజలపై పులులు దాడులు చేసిన ఘటనలు తగ్గిపోగా తాజాగా ఈ ఉదంతం చోటుచేసుకుందన్నారు. మహారాష్ట్ర లోని తిప్పేశ్వర్, తడోబాలలో పులుల సంతతి పెరిగిపోవ డంతో రాష్ట్రంలో టైగర్ కారిడార్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లోకి అడుగు పెడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని రాంపూర్, మైసంపేట గ్రామాలను మంచి పునరావాస ప్యాకేజీ అందించి బయటకు తీసుకొచ్చి నట్టు మంత్రి తెలిపారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా ఇది జరిగిందని చెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున పరిహారం, ఇళ్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాల్లోనే ఈ గ్రామాలు కొనసాగితే విద్యుత్, మంచినీళ్లు, రోడ్డు వంటివి, స్కూల్, ఆసుపత్రి వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. వచ్చే జూన్ నెల కల్లా ఈ రిజర్వ్ కోర్ ఏరియాలో ఉండిపోయిన కొన్ని గ్రామాలు పూర్తిగా బయటకు తీసుకువస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు. -
పారదర్శకంగా ‘పోడు’ పరిశీలన
సాక్షి, హైదరాబాద్: పోడుభూములకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను అత్యంత పారదర్శకంగా పరిశీలించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. గురువారం డీఎస్ఎస్ భవన్లో ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. వచ్చే నెలలో పోడురైతులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని, వేగవంతంగా పరిశీలనను పూర్తి చేయాలన్నారు. పోడుభూముల సర్వే ప్రక్రియను సైతం పక్కాగా నిర్వహించాలని సూచించారు. ఈ అంశంపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారని చెప్పారు. గ్రామ, డివిజన్, జిల్లా సభలను ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా పూర్తిచేయాలన్నారు. దరఖాస్తుల పరిశీలన, సర్వే కోసం అవసరమైనచోట అదనపు బృందాలను ఏర్పాటు చేసుకుని ఆ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు. పోడుభూముల సర్వేతోపాటు గ్రామీణ రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి స్పష్టం చేశారు. గిరి వికాస్ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. అనంతరం మంత్రి ఐటీడీఏ పీవోలకు ఆపిల్ ట్యాబ్‌లను అందజేశారు. -
పోడు రైతులకు వచ్చే నెలలో పట్టాలు
సాక్షి, హైదరాబాద్: పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు వచ్చే నెలలో పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఇప్ప టికే స్వీకరించిన దరఖాస్తుల పరిశీలన యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పోడు భూముల సర్వే పూర్తి చేసి పట్టాలు సైతం సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో కలిసి శుక్రవారం బీఆర్కేఆర్ భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ సభలను నిర్వహించి తీర్మానం కాపీలను జిల్లా స్థాయి కమిటీలకు వెంటనే పంపాలన్నారు. విజ్ఞాపనల పరిశీలన, సర్వేలను వెంటనే పూర్తి చేయడానికి అదనపు బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.14 లక్షల క్లెయిములు అందగా, అధిక శాతం క్లెయిముల వెరిఫికేషన్ పూర్తయిందన్నారు. అన్ని అర్హతలున్న దరఖాస్తుదారులకు పట్టాలను అందించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కాన్ఫరెన్స్‌లో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రిన్సిపల్ సీసీఎఫ్ డో బ్రియెల్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి దివ్య, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
పోడు సర్వే జాబితాలో పేర్లు లేవని ఆత్మహత్యాయత్నం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రభుత్వం చేపట్టిన పోడుభూముల సర్వే జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో మనస్తాపానికి గురైన ఇద్దరు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వివరాలిలా.. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం భూక్యతండాలో పోడుభూముల సర్వేను సర్వే కమిటీ చైర్మన్ భూక్య శ్రీరాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పోడుభూముల వ్యవహారంలో రాశిగుట్టతండా, భూక్యతండా మధ్య కొన్ని విభేదాలున్నాయి. జాబితాలో భూక్యతండాకు చెందిన బాదావత్ కమల(50), బాదావత్ శివరాం(30) పేర్లు లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. 2004 నుంచే తాము సాగుచేసు కుంటున్నా పేర్లు ఎందుకు లేవంటూ ఆవేదనకు లోనయ్యారు. వీరు సాగు చేసుకుంటున్న భూములు రాశిగుట్ట తండా పరిధిలోకి వస్తాయని.. జాబితాలో పేర్లు లేవని చెప్పగానే శివరాం తాను తెచ్చుకున్న పురుగుల మందు తాగేశాడు. అదే సమయంలో అక్కడే ఉన్న కమల కూడా పురుగుల మందు తాగారు. వెంటనే ఇద్దరినీ ఎల్లారెడ్డి పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కమల 1.20 ఎకరాలు, శివరాం రెండెకరాలు సాగు చేస్తున్నారు. -
బైక్‌పై.. కాలినడకన కలెక్టర్ తనిఖీలు
రఘునాథపాలెం: అధికారులకు ఆదేశాలు ఇచ్చి వదిలేయకుండా క్షేత్రస్థాయిలో పనులెలా జరుగుతున్నాయో పరిశీలించారు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్. రఘునాథపాలెం మండలం పంగిడి రెవెన్యూ పరిధిలో పోడు భూముల సర్వే పనులను మంగళవారం డీఎఫ్‌వో సిద్ధార్థ విక్రమ్‌సింగ్‌తో కలిసి కలెక్టర్ గౌతమ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయితే, భూముల వద్దకు వెళ్లేందుకు సరైన మార్గంలేకపోవడంతో ఆయన ద్విచక్రవాహనం నడుపుతూ బురద దారిలో మూడున్నర కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. ఆతర్వాత ముందుకెళ్లడానికి సాధ్యం కాకపోవడంతో మరో మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి గుట్టలపై భూముల సర్వేను పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. -
‘10 శాతం కోటా’.. వారంలో గిరిజన రిజర్వేషన్ల పెంపు
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో గిరిజనులకు రిజర్వేషన్లను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి విసిగి వేసారిపోయాం. ఇకపై విసిగిపోం. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా వారం రోజుల్లో జీవోను విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తాం. ప్రధాని నరేంద్ర మోదీ.. మా జీవోను అమలు చేయించి గౌరవం కాపాడుకుంటావా? లేక దానితో ఉరి వేసుకుంటవా ఆలోచించుకో..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యకు అతి త్వరలో పరిష్కారం చూపుతామని.. పట్టాలు ఇచ్చి రైతు బంధు పథకం అమలు చేస్తామని చెప్పారు. భూమిలేని, ఉపాధి లేని గిరిజనుల కోసం ‘గిరిజన బంధు’ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన తెలంగాణ ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ వివరాలు సీఎం కేసీఆర్ మాటల్లోనే.. అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా.. ‘‘జాతి, కులం, మతం, వర్గం అనే విభేదాలు లేకుండా 58 ఏళ్లు ఐక్యంగా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులకు ఐదారు శాతంగా ఉన్న రిజర్వేషన్లను తెలంగాణ వచ్చాక పది శాతానికి పెంచాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. ఏడేళ్లు దాటిపోయింది. దీనిపై ప్రధాని మోదీని, ఈ రోజు హైదరాబాద్‌కు వచ్చి విభజన రాజకీయాలు చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అడుగుతున్నా.. ఏం అడ్డుపడుతోందని గిరిజన రిజర్వేషన్ల బిల్లును ఆపుతున్నారు? రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే ఐదు నిమిషాల్లో జీవో విడుదల చేస్తాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రధాని మోదీని తెలంగాణ గడ్డ నుంచి చేతులు జోడించి అభ్యర్తిస్తున్నా. గిరిజన రిజర్వేషన్ల బిల్లును మీరు ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిస్తే ఆపకుండా ఆమోదం ఇస్తారు. రిజర్వేషన్లు 50శాతం మించకూడదనే ప్రతిబంధన ఎక్కడా లేదు. పక్కరాష్ట్రం తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే కేంద్రం ఏడో షెడ్యూల్లో చేర్చింది. అదే తరహాలో తెలంగాణ న్యాయపరమైన హక్కుకు కేంద్రానికి ఉన్న ప్రతిబంధకమేంటో చెప్పాలి. కేంద్రం సులభంగా పరిష్కరించే విషయాల్లో కూడా తాత్సారం చేస్తూ ప్రజలను గాలికి వదిలేస్తోంది. ప్రైవేటీకరణ పేరిట లక్షల కోట్ల రూపాయలను ప్రైవేటు వ్యక్తులకు దోచి పెడుతోంది. పోడు భూములకు పట్టాలు.. గిరిజన బంధు పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు భూమి దక్కేలా కమిటీ ఏర్పాటు చేసి జీవో 140 కూడా ఇచ్చాం. కమిటీల నుంచి నివేదికలు అందిన వెంటనే పోడు భూములకు పట్టాలు ఇచ్చి రైతుబంధు పథకం అమలు చేస్తాం. సంపద పెంచడం.. అవసరమైన పేదలకు పంచడమే మన సిద్ధాంతం. పోడు భూమి పట్టాల పంపిణీ తర్వాత భూమి లేని గిరిజనులను గుర్తిస్తాం. దళిత బంధు తరహాలో భూమి, భుక్తి, ఆధారం లేని గిరిజన బిడ్డల కోసం వెసులుబాటు చూసుకుని నా చేతుల మీదుగా ‘గిరిజన బంధు’ పథకాన్ని ప్రారంభిస్తాం. మేధోమధన వేదికలుగా ఆదివాసీ, బంజారా భవన్లు గిరిజనుల సమస్యల పరిష్కారానికి బంజారా, ఆదివాసీ భవన్లు వేదికలుగా మారాలి. రాష్ట్రంలో ‘మా తాండాలో మా రాజ్యం’ నినాదాన్ని ఆచరణలోకి తేవడంతో 3 వేలకు పైగా గిరిజన గూడేలు, తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయి. రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయమున్న పంచాయతీలకు ప్రోత్సాహం, ఉచిత విద్యుత్, గురుకులాలు, రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్, టీ ప్రైడ్ కింద గిరిజన పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం వంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. గిరిజన తండాలు, చెంచు, ఆదివాసీ గూడేల్లో మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందుతోంది. రూ.300 కోట్లతో ప్రతి గిరిజన ఆవాసానికి త్రీఫేజ్ విద్యుత్, రూ.200 కోట్లు విద్యుత్ బకాయిలు మాఫీ, వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రోడ్లు, కల్యాణలక్ష్మి, పెన్షన్లు ఇలా ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. గిరిజనుల సంస్కృతి, భాష, జీవన శైలి కాపాడేలా జాతరలు, పండుగలను వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్వహిస్తున్నాం. గిరిజన గురుకులాల ద్వారా ప్రతిభ చూపుతున్న విద్యార్థులు.. బంగారు తెలంగాణ బిడ్డలుగా, భారత ప్రతినిధులుగా ఎదగాలి. గిరిజన బిడ్డలు చదుకునేందుకు మరిన్ని గురుకుల సంస్థలు ఏర్పాటు దిశగా చర్చలు జరుగుతున్నాయి..’’ అని కేసీఆర్ తెలిపారు. ఇన్నాళ్లూ పార్టీలు ఓటుబ్యాంకుగానే చూశాయి: సత్యవతి రాథోడ్ గతంలో రాజకీయ పార్టీలు గిరిజనులను ఓటు బ్యాంకుగానే తప్ప మనుషులుగా చూడలేదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కేసీఆర్‌ను తమ జాతి ఎప్పటికి మరిచిపోదని చెప్పారు. ఇక జల్, జంగల్, జమీన్ నినాదాన్ని నిజం చేసిన నాయకుడు కేసీఆర్ అని ప్రభుత్వ విప్ రేగ కాంతారావు అన్నారు. ఈ ఆత్మీయ సభలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతా.. ‘‘తెలంగాణ సమాజం ఐక్యత, ప్రగతి పరుగులు ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోవద్దు. దుర్మార్గులు, నీచ రాజకీయ నాయకులు, సంకుచిత స్వార్థంతో వస్తున్నారు. మతపిచ్చి కార్చిచ్చులా అంటుకుంటే ఎటూ కాకుండా పోతాం. మీ బిడ్డగా, తెలంగాణ సాధించిన వ్యక్తిగా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా. తెలంగాణలో కల్లోలం రానీయొద్దు. ఈ సమాజం సర్వమానవ సౌభ్రాతృత్వంతో పురోగమించే దిశగా ప్రజల పక్షాన నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తా. ప్రజల రాజ్యం, రైతుల రాజ్యం కోసం తెలంగాణ జాతిగా మనం భారత జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు కదలాలి’’ రాష్ట్రవ్యాప్తంగా సమైక్యత ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్, మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర సచివాలయం బీఆర్కేఆర్ భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాల యాలు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో సైతం ఘనంగా ఉత్సవాలను నిర్వహించారు. ఇదీ చదవండి: విమోచనమే నిజమైన స్వాతంత్య్ర దినం -
కార్పొరేట్లకు ఆదివాసీలను బలిపెడతారా?
‘జల్, జంగిల్, జమీన్ ఔర్ ఇజ్జత్’ కోసం పోరాడే ఆదివాసీ ప్రజలను ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ పేరిట అంతం చేస్తూనే ఆ తెగ బిడ్డనే రాష్ట్రపతిని చేయడం ఓ కళ! ప్రస్తుత కేంద్రప్రభుత్వ పాలనలో దళితులు, ఆదివాసీలు తీవ్రమైన దాడులకు గురవుతున్నారు. వారి హక్కులు హరించివేయబడుతున్నాయి. రాజ్యాంగం 5వ షెడ్యూల్లోని భూమిని వినియోగించుకునేందుకు గిరిజనుల అంగీకారం కావాలన్న క్లాజును తొలగించారు. గనులపై ఉన్న గిరిజన హక్కులను కాలరాశారు. షెడ్యూల్డు కులాల, తెగల సబ్ ప్లాన్ నిధులు భారీకోతలకు గురవుతున్నాయి. ఆటవీ సంరక్షణ చట్టం –1980 ప్రకారం రూపొందించబడిన ప్రస్తుత అటవీ సంరక్షణ నియమాలను సవరించడానికి... ‘అటవీ సంరక్షణ నియమాలు– 2022’ పేరుతో కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2022 జూన్ 28న నోటిఫికేషను విడుదల చేసింది. 2004, 2014, 2017లలో సవరణల తర్వాత రూపొందించిన అటవీ సంరక్షణ నియమాలను ఈ కొత్త సవరణలు మార్పు చేస్తాయి. రియల్ ఎస్టేట్ చేపట్టే భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు, ప్రాజెక్టులు, చెట్ల నరికివేత, ఇతర అభివృద్ధి పనులకు నిబంధనల్ని సడలించారు. అడవుల్లో నివసించే ఆదివాసీలు, గిరిజనులు, ఇతరుల అనుమతి అవసరం లేకుండా... భూముల కేటాయింపు జరగనున్నది. వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం ఆ భూముల్ని రియల్ ఎస్టేట్ ఇకపై ఇష్టానుసారంగా వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. ఆదివాసీలకు నష్టపరిహారం చెల్లించే విధానం రియల్ మాఫియాకు అనుకూలంగా కేంద్రం మార్చింది. ఉదాహరణకు 5 నుంచి 40 హెక్టార్ల అటవీ భూములపై స్క్రీనింగ్ కమిటీ 60 రోజుల్లో కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం నోటిఫై చేసిన కొత్త నిబంధనావళిపై పర్యావరణ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తూ కొత్త నిబంధనావళిని కేంద్రం తీసుకొచ్చిందని ఆదివాసీ లు ఆరోపిస్తున్నారు. అటవీ హక్కుల చట్టం 2003–06లో పేర్కొన్న నిబంధనావళి స్థానంలో కొత్త నిబంధనావళిని కేంద్రం తీసుకొచ్చిందనీ, ఇది అత్యంత ప్రమాదకరమైన విధానమనీ ఆదివాసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2006 అటవీ హక్కులు చట్టం ప్రకారం మౌలిక వసతులు, అభివృద్ధికి సంబంధించి ఎలాంటి కట్టడం చేపట్టాలన్నా, ఇతర పనులు చేపట్టలన్నా... అక్కడ నివసించే అడవి బిడ్డల అనుమతి, అంగీకారం తప్పనిసరి. అటవీ భూముల్ని ప్రభుత్వాలు ఏకపక్షంగా వేరే అవసరాలకు వాడటానికి వీల్లేదు. ప్రస్తుత చట్ట సవరణల వల్ల... ఏదైనా ప్రయివేటు ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇవ్వగానే, ఇకపై ప్రయివేటు డెవలపర్స్ భూముల్ని తమ ఆధీనంలోకి తీసుకోవచ్చు. ఆ తర్వాత ప్రాజెక్టు నిర్వాసితులు, బాధితులకు నష్టపరిహారం అందజేస్తుంది. ఇదంతా అయిన తర్వాత బాధితుల పునరావాసం, వారి అటవీ హక్కుల పరిరక్షణ జరిగిందా? లేదా? అన్నది రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఆదివాసీలు, గిరిజనుల అంగీకారంతో సంబంధం లేకుండా, కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. (క్లిక్: ఆర్టికల్ 370 రద్దు చట్టబద్ధమేనా?) కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ‘అటవీ సంరక్షణ నియమావళి 2022’ ఉపసంహరించాలి. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహ రించుకోవాలి. ఆదివాసీ ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. ఆదివాసీ అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. (క్లిక్: రక్తక్షేత్రం వెలుగులో దళిత ఉద్యమ ప్రజ్వలనం) - వూకె రామకృష్ణ దొర ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ (ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం) -
పోడు భూములకు హక్కుపత్రాలివ్వాలి
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన మేరకు పోడు భూముల దరఖాస్తులను పరిశీలించి హక్కు పత్రాలను ఇవ్వాలని గిరిజన, ఆదివాసీలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం డిమాండ్ చేసింది. హనుమకొండ జిల్లా కాజీపేట ఫాతిమానగర్‌లోని బాలవికాసలో మూడు రోజులుగా జరుగుతున్న సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు బుధవారంతో ముగిశాయి. కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాల్లో తమ్మినేని వీరభద్రం పలు తీర్మానాలను ప్రతిపాదించగా, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిన్న పంటలు, నష్టాలపై అంచనా వేసి వెంటనే పరిహారం చెల్లించాలంటూ చేసిన మొత్తం ఏడు తీర్మానాలను రాష్ట్ర కమిటీ ఆమోదించింది. చలో హైదరాబాద్‌కు మద్దతు ఆగస్టు 3న కార్మికులు తలపెట్టిన చలో హైదరాబాద్‌కు సీపీఎం మద్దతిస్తున్నట్లు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తెలిపారు. ప్రజా సమస్యల మీద నిరంతరం సమరశీల పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతా రాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవు లు, చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. -
‘పోడు’పై తెగని పంచాయితీ!
సాక్షి, హైదరాబాద్: పోడు భూములకు సంబంధించిన పట్టాల పంపిణీకి విపక్షాలు ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఈ సమస్య మరోసారి రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నా.. ఈ క్రమంలో అనేక సవాళ్లు ముందుకొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పోడు వ్యవసాయం చేస్తున్న రైతుల వివరాల సేకరణ ప్రక్రియలో భాగంగా దరఖాస్తులను స్వీకరించింది. 28 జిల్లాల్లోని 3,041 గ్రామపంచాయతీల పరిధిలో సుమారు 12.60 లక్షల ఎకరాల పోడు భూముల్లో సుమారు 3,95,000 మంది రైతులు వ్యవసాయం చేస్తున్నట్లు తేలింది. ఇందులో 62 శాతం గిరిజనులు, 38% గిరిజనేతరులు ఉన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వ అటవీ హక్కుల చట్టం 2006 ఆధారంగా 2008లో సుమారు 96,600 మందికి 3,08,000 ఎకరాల భూమిపై హక్కు లభించింది. అయితే పోడు వ్యవసాయం చేస్తున్నప్పటికీ కొంతమందికి హక్కులు దక్కలేదు. మరోవైపు మరికొంతమంది కొత్తగా అటవీ భూముల్లో పోడు వ్యవసాయం మొదలుపెట్టడంతో రాష్ట్రంలో పోడు రైతుల సమస్య సుదీర్ఘకాలంగా పెండింగ్‌లోనే ఉండిపోయింది. చట్ట సవరణతోనే సాధ్యం! అటవీ శాఖ భూములపై హక్కులు కల్పించే అటవీ హక్కుల చట్టం– 2006 లో అనేక కఠిన నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ నియమ నిబంధనలే సమస్య పరిష్కారానికి ఆటంకంగా మారాయని, ఈ చట్ట సవరణ ద్వారానే పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమనే అభిప్రాయం ఉంది. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13 నాటికి పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు మాత్రమే ఆయా భూములపై హక్కులు కల్పించే అవకాశం ఉంది. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఆ తేదీ నాటికి వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు మాత్రమే హక్కులు కల్పించేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. ఇక గిరిజనేతరులు తాము 75 ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నట్లు తగిన ఆధారాలను చూపిస్తే వారికి హక్కులు దక్కేలా అప్పటి ప్రభుత్వం ఈ చట్టాన్ని తయారుచేసింది. అయితే 75 ఏళ్ల పోడుకు సంబంధించి సాక్ష్యాధారాలను సంపాదించే అవకాశాలు లేకపోవడంతో గిరిజనేతరులకు ఈ భూములపై హక్కులు దక్కడం లేదనే అభిప్రాయం గట్టిగా ఉంది. అంతా కేంద్రం చేతిలోనే..! ప్రస్తుతం తెలంగాణలో హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 3,95,000 మందికి ప్రయోజనం కలగాలంటే 2006 నాటి చట్టంలో ఉన్న డిసెంబర్ 2005 కట్ ఆఫ్ తేదీని మార్చాల్సి ఉంటుంది. దీంతో పాటు గిరిజనేతరులకు పోడు హక్కులు దక్కాలంటే, వారు 75 ఏళ్లుగా తాము వ్యవసాయం చేస్తున్నట్లు సాక్ష్యాధారాలను చూపించాలన్న నిబంధనను తొలగించాల్సిన అవసరం ఉంది. ఈ రెండు అంశాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న నేపథ్యంలో..దరఖాస్తులు స్వీకరించినా, అర్హులైన పోడు రైతుల ఎంపిక, క్షేత్రస్థాయిలో పరిశీలనకు అవకాశం లేకుండా పోయిందనే వాదనను రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వినిపిస్తున్నాయి. మినహాయింపులకు అవకాశం లేదు.. అటవీ హక్కుల చట్టానికి కొన్ని సవరణలు చేసి పోడు రైతుల సమస్యను పరిష్కరించాలని తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఒక లేఖ కూడా రాశారు. అయితే తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలు అడుగుతున్నట్టుగా మినహాయింపులు ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరిస్తూ కేసీఆర్‌కు కేంద్ర మంత్రి అర్జున్ ముండా లేఖ రాశారు. ఒకవేళ రాష్ట్రాలు అడుగుతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వ అటవీ హక్కుల చట్టానికి మినహాయింపులు ఇస్తే, గిరిజనులతో పాటు అటవీ సంరక్షణకు తీవ్ర నష్టం కలుగుతుందని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో ‘పోడు’మింగుడు పడని సమస్యగా మారింది. -
ఇళ్లున్నా ఆక్రమణలు: అటవీశాఖ
సాక్షి, హైదరాబాద్: కోయపోచగూడలో పోడు భూములు లేవని, గతంలో ఎప్పుడూ అక్కడి వారు పోడు వ్యవసాయం చేసిన దాఖలాలు లేవని అటవీశాఖ స్పష్టంచేసింది. కోయపోచగూడకు ఆనుకుని ఉన్నదంతా కవ్వాల్ టైగర్ రిజర్వ్‌కు చెందిన అటవీభూమి మాత్రమేనని, అటవీ, రెవెన్యూ రికార్డుల్లో పోడు భూమే లేదని వెల్లడించింది. గ్రామంలో ఇళ్లు, భూములున్నా కూడా, అటవీభూమిని ఆక్రమించాలనే దురుద్దేశంతోనే కోయపోచగూడలో కొందరు రాద్దాంతం చేస్తున్నారని మంచిర్యాల జిల్లా అటవీ అధికారి శివాని డోగ్రా ఒక ప్రకటనలో తెలిపారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం, మాకులపేట పంచాయతీ, కోయపోచగూడలో అటవీ భూములను ఆక్రమిస్తున్నారని, అడ్డుకున్న అధికారులపై దాడులకు పాల్పడుతూ అటవీశాఖ అధికారుల విధులను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. వాస్తవంగా వారికి మాకులపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఇళ్లు ఉన్నాయని, కొందరి ప్రోద్బలంతో ఫారెస్ట్ భూములను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అక్కడికి మహిళలని పంపించి, వారిని ముందు పెట్టి పోడు భూముల పేరుతో ఫారెస్ట్ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అది చట్టరీత్యా నేరమని స్పష్టంచేశారు. కోయపోచగూడ పరిధిలో పోడు భూములు లేవని చెప్పడానికి తమ వద్ద ఆధారాలున్నాయన్నారు. పోడు భూముల్లో ఆక్రమణలకు పాల్పడ్డ వారు అధికారులకు సహకరిస్తే భవిష్యత్‌లో వారికి అక్కడ చేపట్టే ఫారెస్ట్ పనుల్లో ఉపాధి కల్పిస్తామని శివాని వెల్లడించారు. -
సీఎం చెప్పినా పట్టించుకోరా?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పోడు భూముల అంశంపై అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి మంత్రులకు ఊహించని పరిణామం ఎదురైంది. పోడు భూముల్లో అటవీ అధికారులు కందకాలు తీయడం, మొక్కలు నాటడం వంటి పనులతో గిరిజనులను ఇబ్బంది పెడుతున్నారని వారు గళం విప్పారు. అధికారుల తీరుతో తాము ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. భద్రాచలంలో శుక్రవారం జరిగిన ఐటీడీఏ పాలకమండలి వేదికగా పోడు భూములపై వాడీ వేడి చర్చ జరిగింది. ఆవేదనతో చెబుతున్నా: వనమా పోడు భూములకు పట్టాల అంశంపై చర్చ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దని సీఎం కేసీఆర్ చెప్పారని తాము అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. వారు ఖాతరు చేయడం లేదన్నారు. ఒకవైపు టీఆర్ఎస్ది ప్రజా ప్రభుత్వంగా చెప్పుకుంటుంటే అటవీ అధికారులు గిరిజనులను, గ్రామీణ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, దీనిపై మంత్రులు స్పందించాలని డిమాండ్ చేశారు. అడవి నుంచి కనీసం రోడ్డు నిర్మాణాలకు కూడా అనుమతి ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకర్గంలో పలు రోడ్లకు రూ.50 కోట్ల వరకు నిధులు మంజూరైనా అటవీ శాఖ అడ్డంకులతో పనులు జరగడం లేదన్నారు. రెవెన్యూ సదస్సుల్లో పరిష్కరిస్తాం: సత్యవతి రాథోడ్ పోడు అంశంపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందిస్తూ.. పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే లబ్ధిదారులను గుర్తించడంలో అనేక సమస్యలు ఉన్నందున ఆలస్యం అవుతోందన్నారు. దీనిపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ సీఎం కేసీఆర్‌కు నివేదిక అందించిందని తెలిపారు. ఈనెల 11న ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తామని, 15 నుంచి జరిగే రెవెన్యూ సదస్సుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ట్రెంచ్‌లు కొట్టొద్దు: పువ్వాడ పోడు భూములకు యాజమాన్య హక్కులు కల్పించే అంశంపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. వివాదం లేని పోడు భూముల జోలికి వెళ్లొద్దని ఆయన అటవీ శాఖకు సూచించారు. ఎక్కడైనా సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించి ట్రెంచ్‌లు కొడితే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినట్టుగా పరిగణిస్తామ న్నారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ.. పంటలు వేసిన తర్వాత ట్రెంచ్‌లు కొట్టడం, ప్లాంటేషన్ చేయడం వల్ల ఈ సమస్య జటిలంగా మారుతోందని అన్నారు. -
పోడుభూములకు పట్టాలివ్వాలి
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పోడుభూములకు పట్టాలిచ్చేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కరించకుండా ఈ భూముల్లో హరితహారం చేపడితే ఎదురయ్యే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. పోడుభూమి పట్టాలకోసం పోరాడుతున్న గిరిజనులు, ఆదివాసీలపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. బీజేపీ హరితహారానికి వ్యతిరేకం కాదని కేవలం పోడుభూముల్లో ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరుతున్నామన్నారు. గిరిజనుల హక్కులను టీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాయడం క్షమించరాని నేరమని లేఖలో మండిపడ్డారు. -
పోడు భూములకు పట్టాలతో ఆనందం
ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న కొండపోడు భూములపై హక్కులు లేక గిరిజనులు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. ఆ భూములపై వారికి హక్కులు లేవంటూ అటవీ అధికారులు వేధించేవారు. రెక్కలు ముక్కలు చేసుకుని ఆ భూముల్లో సాగు చేసిన పంటలను అటవీశాఖ సిబ్బంది నాశనం చేసేవారు. పోడు భూములను ఖాళీ చేయాలని హెచ్చరిస్తూ అక్కడ గిరిజనులు ఏర్పాటు చేసుకున్న మకాంలు తగులబెట్టి బెంబేలెత్తించేవారు. ఏమీ చేయలేని నిస్సహాయతతో గిరిజనులు దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొనే వారు. వీరికి హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం పట్టాలివ్వడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వారి బతుకులకు భరోసా ఏర్పడింది. రంపచోడవరం: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రంపచోడవరం నియోజకవర్గంలో 17,661 మంది గిరిజనులకు 45,871. 23 ఎకరాల పోడు భూములపై హక్కులు కల్పించారు. పోడు పట్టాలు అందజేసి వరి కళ్లల్లో ఆనందం నింపారు. దీంతో పాటు స్థానిక గిరిజనులకు కమ్యూనిటీ పట్టాలు అందజేశారు. తద్వారా ఆ భూముల్లో లభించే చిన్న తరహా అటవీ ఉత్పత్తులను స్వేచ్ఛగా అమ్ముకునే అవకాశం కల్పించారు. ఇలా రంపచోడవరం డివిజన్లో 12,334 మంది గిరిజనులకు 49,508 ఎకరాలపై కమ్యూనిటీ హక్కులు కల్పించారు. దీంతో తమ కల నెరవేరిందంటూ ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులకు అండగా.. గిరిజనులకు అండగా వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్(అనంతబాబు), ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మిలు అండగా నిలిచారు. వారి సమస్యలను వైఎస్సార్ సీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. హక్కు పట్టాలు మంజూరులో వారు కీలకపాత్ర పోషించారు. పోడు భూమి ఖాళీ చేయమన్నారు నా భర్తకు అనారోగ్యం. ముగ్గురు పిల్లలతో బొల్లికొండలో పోడు చేసుకుంటూ అక్కడే జీవిస్తున్నాం. పోడు వదిలి వెళ్లిపోవాలని అటవీ సిబ్బంది బెదిరించారు. అలా ఇబ్బంది పడుతూనే పోడు పట్టాల కోసం ఎదురు చూశా. సీఎం జగనన్న వచ్చిన తరువాత 3 ఎకరాల 85 సెంట్ల పోడు భూమికి పట్టాలు ఇచ్చారు. అందులో కందులు, కొర్రలు వేశాను. జీడిమామిడి మొక్కలు పెంచుకుంటున్నాను. –మర్రిక సీత, దాకరాయి, రాజవొమ్మంగి మండలం నిబంధనల మేరకు పట్టాలు అటవీ హక్కుల చట్టం ద్వారా అర్హత ఉన్న ప్రతీ గిరిజనుడికి కొండపోడు పట్టాలు మంజూరు చేస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు పరిశీలించిన తరువాత పట్టాలు మంజూరు చేస్తాం. అటవీ హక్కుల చట్టం నిబంధనల ప్రకారం దరఖాస్తులు పరిశీలన జరుగుతుంది. ఏజెన్సీలో ఇప్పటికే పోడు భూములు సాగు చేసుకుంటున్న అనేక మంది గిరిజన రైతులకు పట్టాలు ఇచ్చాం. –కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్, రంపచోడవరం స్వేచ్ఛగా సాగు చేసుకుంటున్నా గత 25 ఏళ్ల నుంచి దాకరాయి దగ్గర బొల్లికొండలో నివాసం ఉంటూ అక్కడే కొండపోడు సాగు చేసుకుంటున్నాను. బుడములు, చోళ్లు , సామలు జీడిమామిడి మొక్కలు పెంచుకుంటుండగా అటవీ అధికారులు అనేక ఇబ్బందులు పెట్టారు. జగనన్న సీఎం అయిన తరువాత 8 ఎకరాల పోడు భూమికి పట్టాలు ఇచ్చారు. రెండు సార్లు రైతు భరోసా పొందాను. ప్రభుత్వ సాయం ఎన్నటికీ మరువలేను. –మర్రి లక్ష్మయ్య, దాకరాయి, రాజవొమ్మంగి మండలం -
పోడు భూములపై నిఘా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పోడు భూములపై నిఘా పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పోడు భూములను టీఆర్ఎస్ నేతలు బినామీల పేరుతో కబ్జాలు చేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా వం దలాది ఎకరాలు టీఆర్ఎస్ నేతల చేతుల్లో ఉన్నాయని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) అభిప్రాయపడింది. కమిటీ కన్వీనర్ షబ్బీ ర్ అలీ అధ్యక్షతన బుధవారం కొంపల్లిలోని కార్యకర్తల శిక్షణా శిబిరం ప్రాంగణంలో పీఏసీ సమా వేశం జరిగింది. పోడు భూములపై జరిగిన చర్చలో పార్టీ నేతలు మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలు పోడు భూములను ఆక్రమించుకుంటున్నారని, అ టవీ అధికారులు వారి జోలికి వెళ్లకుండా గిరిజనులపై దాడులు చేస్తున్నారని చెప్పారు. దీనిపై కలసివచ్చే పార్టీలతో నిఘా పెట్టాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై నిర్ణయాన్ని జిల్లా నేతలకే అప్పగించాలని పీఏసీ నిర్ణయించింది. అన్ని జిల్లాల నేతలతో కలిసి నిర్ణయం తీసుకునేందుకు దామోదర రాజనర్సింహ, చిన్నారెడ్డి, బలరాంనాయక్‌ల నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమించింది. ఈనెల 14 నుంచి ఏఐసీసీ పిలుపు మేరకు నిర్వహించే జనజాగరణ యాత్రను ఎన్నికల కోడ్ నిబంధనల మేరకు నిర్వహిస్తామని షబ్బీర్ అలీ చెప్పారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, గీతారెడ్డి, మహేశ్‌గౌడ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు. 13న ఢిల్లీకి టీపీసీసీ నేతలు హుజూరాబాద్ ఉపఎన్నికలో ఘోరపరాజయంపై ఏఐసీసీ ప్రత్యేక దృష్టిపెట్టింది. దీనిపై ఇప్పటికే నివేదిక ఇచ్చేందుకు కర్ణాటకకు చెందిన సీనియర్ నేత మత్‌ను పరిశీలకుడిగా నియమించిన ఏఐసీసీ తాజాగా రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిచింది. అభ్యర్థి బల్మూరి వెంకట్‌తోపాటు స్థానిక ముఖ్య నేతలు, హుజూరాబాద్ ఎన్నికల ఇన్చార్జి దామోదర రాజనర్సింహ, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, రాష్ట్ర ఇన్చార్జి కార్యదర్శులు ఈనెల 13న ఢిల్లీకి రావాలని ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ ఆదేశించినట్టు సమాచారం. -
8,208 మంది.. 17,449 ఎకరాల భూమి ఆక్రమణ
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని అటవీ భూమిలో పోడు ఆక్రమణ ఎంతో తేలింది. 10 మండలాల్లోని 95 గ్రామ పంచాయతీలకు చెందిన 125 గ్రామాలు, ఆవాసాల్లో ఈ ఆక్రమణ భూమి ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. మొత్తంగా 8,208 మంది ఆధీనంలో 17,449 ఎకరాలు ఉందని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొంది. ఈనెల 8 నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. గ్రామసభల ద్వారా ఈ దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. ఈలోగా ప్రభుత్వం నుంచి వచ్చే గైడ్‌లైన్స్‌తో అధికార యంత్రాంగం దరఖాస్తుల స్వీకరణపై ముందుకెళ్లనుంది. అటవీ భూమి 1.57 లక్షల ఎకరాలు.. జిల్లావ్యాప్తంగా 10.77 లక్షల ఎకరాల్లో భూమి ఉంది. ఇందులో అటవీ విస్తీర్ణం 1,57,888 ఎకరాలు (14.66 శాతం). మొత్తం అటవీ భూమిలో ప్రస్తుతం ఇందులో 17,449 ఎకరాలు ఆక్రమణకు గురైంది. అత్యధికంగా కారేపల్లి (సింగరేణి) మండలంలో 1,510 మంది ఆధీనంలో 4,673.315 ఎకరాలు, ఆ తర్వాత సత్తుపల్లి మండలంలో 2,355మంది చేతిలో 3,208.27 ఎకరాల భూమి ఉంది. 2005 నుంచి ఇప్పటి వరకు 17,861 ఎకరాలకు సంబంధించి అటవీ హక్కు పత్రాలు ఇచ్చారు. ఎఫ్ఆర్సీ కమిటీ పర్యవేక్షణలో.. ఫారెస్ట్ రైట్స్ కమిటీ (ఎఫ్ఆర్సీ) ఆధ్వర్యంలో మొదటిగా గ్రామసభ నిర్వహిస్తారు. ఈ కమిటీకి పోడుదారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో సంబంధిత అధికార బృందం విచారణ, సర్వే పూర్తి చేస్తుంది. అనంతరం అర్హులు ఎవరన్నది గ్రామసభ తీర్మానం చేసి దరఖాస్తులను సబ్ డివిజన్ లెవెల్ కమిటీకి పంపుతుంది. అక్కడి నుంచి ఈ నివేదిక జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీకి చేరుతుంది. ఈ కమిటీ పరిశీలించిన తర్వాత హక్కుపత్రాలను పోడుదారులకు జారీ చేస్తుంది. ఈనెల 8 నుంచి అటవీ భూమి ఆక్రమణకు గురైన 95 గ్రామ పంచాయతీల వారీగా 95 బృందాలు దరఖాస్తులు స్వీకరించనున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో ఆర్వోఎఫ్ఆర్ 2005 చట్టం ప్రకారం సాగు చేసుకుంటున్న అర్హులైన పోడుదారులను గుర్తించి హక్కపత్రాలు ఇస్తారు. గిరిజన సంక్షేమ శాఖ ఈ ప్రక్రియను అంతా పర్యవేక్షిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అటవీ భూమి సంరక్షణకు హద్దులు నిర్ణయిస్తారు. ఈ భూమి సంరక్షణ కోనం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విజిలెన్స్ వింగ్‌ను ఏర్పాటు చేస్తారు. ఎస్టీల ఆధీనంలో 56 శాతం.. జిల్లాలోని 10 మండలాల్లో పోడు భూమి ఉంటే..ఎస్సీ,ఎస్టీ, గొత్తికోయ, ఇతర కేటగిరిలకు చెందిన మొత్తం 8,208 మంది 17,449 ఎకరాలను ఆక్రమించారు. ఇందులో ఎస్టీల చేతిలో అత్యధికంగా 9764 ఎకరాలు ఉండగా.. ఎస్సీలకు 1,602 ఎకరాలు, గొత్తికోయలు ఆధీనంలో 116 ఎకరాలు ఉంది. ఇతర కేటగిరిలకు చెందిన వారు మిగితా అటవీ భూమిని ఆక్రమించుకున్నారు. సుమారు 56 శాతం ఎస్టీల ఆధీనంలోనే ఈ ఆక్రమణకు గురైన భూమి ఉంది. మిగితా 44 శాతం ఎస్సీలు, గొత్తికోయలు, ఇతర కేటగిరిల చేతిలో ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. గైడ్‌లైన్స్ ప్రకారం చర్యలు.. ప్రభుత్వం పోడు భూములపై దరఖాస్తుల స్వీకరణ, అఖిలపక్ష పార్టీలతో సమావేశంపై జిల్లా యంత్రాంగాలకు గతంలో సూచనలు చేసింది. ఈ ఆదేశాల మేరకు జిల్లాస్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో అఖిలపక్ష పార్టీలతో సమీక్ష సమావేశం కూడా పూర్తయింది. అయితే ఈనెల 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ, అర్హుల గర్తింపు ప్రక్రియ ఎలా ఉండాలన్న దానిపై ప్రభుత్వం ఇచ్చే గైడ్‌లైన్స్ ప్రకారమే జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోనుంది. పోడుదారులను ఎలా గుర్తించాలన్న దానిపై అఖిలపక్ష పార్టీల నేతలు, ఆదివాసీ సంఘాలు కూడా జిల్లా యంత్రాంగానికి, నేరుగా ప్రభుత్వ పెద్దలకు పలు దఫాలుగా వినతులు అందించారు. ప్రభుత్వ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగానే ఎఫ్ఆర్సీ కమిటీలు గ్రామసభ అర్హుల జాబితాను ఫైనల్ చేసి సబ్ డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి కమిటీకి పంపనుంది. మండలాల వారీగా ఆక్రమణకు గురైన భూమి (ఎకరాల్లో..), పోడు దారుల సంఖ్య ఇలా ఉంది మండలం పోడుదారులు భూమి సత్తుపల్లి 2,355 3,208.27 కొణిజర్ల 1,575 3,682 సింగరేణి 1,510 4,673.315 పెనుబల్లి 1,182 1,580.8 రఘునాథపాలెం 735 1,795.525 కామేపల్లి 314 988.2275 ఏన్కూరు 282 1,087.975 తల్లాడ 104 270.8 చింతకాని 88 130 వేంసూరు 63 31.75 మొత్తం 8,208 17,448.66 –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– పోడుదారులు భూమి –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– సత్తుపల్లి 3,208.27 కొణిజర్ల సింగరేణి 4,673.315 పెనుబల్లి 1,580.8 రఘునాథపాలెం 1,795.525 కామేపల్లి 988.2275 ఏన్కూరు 1,087.975 తల్లాడ 270.8 చింతకాని 130 వేంసూరు 31.75 ––––––––––––––––––––––––––––––––––––––––––––––– మొత్తం ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– పొటోరైటప్ 02సీకేఎం01: కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో అటవీ భూమి గూగుల్‌మ్యాప్ -
8కి ముందే ఫారెస్ట్ రైట్స్ కమిటీలు
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల 8 నుంచి పోడు భూముల సమస్యపై దరఖాస్తుల స్వీకరణకు ముందే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ప్రజా ప్రతినిధులు, ఇతర సభ్యులతో ఫారెస్ట్ రైట్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులకు సూచించారు. ఈ కమిటీల ద్వారా ఆయా గ్రామాలలో దరఖాస్తుల స్వీకరణ, అందులో పొందుపరిచే అంశాలు, ఇతర విషయాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. పోడు భూములపై హక్కుల విషయంలో నవంబర్ 8 నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో సోమేశ్‌కుమార్ బుధవారం సచివాలయంలో అటవీ, రెవెన్యూ ఉన్నతాధికారులతో సమా వేశం నిర్వహించారు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, విధి విధానాల రూపకల్పనపై సమావేశంలో చర్చించారు. పోడు భూముల సమస్య అధికంగా ఉన్న జిల్లాల్లో ప్రత్యేకాధికారులను నియమించాలని పేర్కొన్నారు. పోడు భూములు అత్యధిక విస్తీర్ణం ఉన్న ప్రాంతాలకు సీనియర్ అటవీ శాఖ అధికారులను నియమించాలని సీఎస్ సూచించారు. అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్.శోభ, రెవెన్యూ శాఖ కార్యదర్శి శేషాద్రి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా, సీఎంవో ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్ తదితరులు పాల్గొన్నారు. -
‘పోడు’కు బదులు సర్కారీ భూమి
సాక్షి, హైదరాబాద్: అడవుల లోపల పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు ప్రత్యామ్నాయంగా సమీపంలోని ప్రభుత్వ భూములను కేటాయించాలని.. ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోతే అడవుల అంచున భూమిని ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దీనితోపాటు వారికి నీరు, విద్యుత్, నివాస సదుపాయాలు కూడా కల్పించాలని.. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యపై శనివారం ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమం, పోలీస్, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. పోడు సాగుచేస్తున్న గిరిజనులు, గిరిజనేతరుల నుంచి దరఖాస్తుల స్వీకరణను వచ్చే నెల 8న ప్రారంభించాలని.. డిసెంబర్ 8 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు వచ్చేనెల 8లోగా అన్నిస్థాయిల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలన్నారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్ఓఎఫ్ఆర్)–2006 ప్రకారం గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని.. రెండు, మూడు గ్రామాలకో నోడల్ అధికారిని నియమించాలని, సబ్ డివిజన్ స్థాయిలో ఆర్డీవో, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు. అడవులకు శాశ్వత సరిహద్దులు అటవీ భూములకు శాశ్వత సరిహద్దులను నిర్ణయించి, ప్రొటెక్షన్ ట్రెంచ్‌లను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ట్రెంచ్‌లపై గచ్చకాయ ప్లాంటేషన్ చేపట్టాలని.. ట్రెంచ్ ఏర్పాటుకు అటవీ, ఉపాధి హామీ నిధులను ఉపయోగించుకోవాలని సూచించారు. పోడు భూముల ఆక్రమణల్లో 87శాతందాకా భద్రాద్రి కొత్తగూడెం, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, నిర్మల్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్ తదితర 12 జిల్లాల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. పీడీ చట్టం ప్రయోగించండి గిరిజనులు అడవిని కంటికి రెప్పలా కాపాడుకుంటారని, బయటి నుంచి వచ్చేవారే అడవిని నాశనం చేస్తున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోండు, కోలం, కోయ వంటి గిరిజన తెగల ప్రజలు అడవికి నష్టం చేయరన్నారు. అడవిపైనే ఆధారపడి బతికే వీరికి మేలు చేయాలని, బయటి శక్తులు అడవులను ధ్వంసం చేయకుండా కట్టడి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లాల కలెక్టర్లు అటవీ భూముల రక్షణలో కీలకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. అడవుల రక్షణ చర్యల్లో సంబంధిత శాఖల అధికారులు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. జిల్లాల్లో అఖిలపక్ష సమావేశాలు పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ భూముల రక్షణ అంశాలపై అన్నిజిల్లాల్లో అఖిలపక్ష సమావేశాలను నిర్వహించాలని కలెక్టర్లకు సీఎం కేసీఆర్ సూచించారు. ఇప్పటివరకు పోడు సాగు చేస్తున్న గిరిజనులు, ఇతరులకు ఆర్వోఎఫ్ఆర్ హక్కులు కల్పించడంతోపాటు.. ఇక ముందు అంగుళం కూడా అటవీ భూమి ఆక్రమణకు గురికావొద్దన్న అంశంలో అఖిలపక్ష నాయకుల నుండి ఏకాభిప్రాయం తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు తదితర ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. గంజాయి సాగు చేస్తే జైలుకే.. గంజాయి సాగుచేస్తే రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్ సౌకర్యం నిలిపివేయడంతోపాటు అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో గంజాయి సాగుచేస్తే ఆర్వోఎఫ్ఆర్ పట్టాల రద్దుకు చర్యలు తీసుకోవాలన్నారు. గుడుంబా తయారీని పూర్తిగా అరికట్టి తయారీదారులకు ఉపాధి, పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పదెకరాల అడవి కొన్ని లక్షల మొక్కలతో సమానం.. సామాజిక వనాల పెంపకంలో భాగంగా ఎన్ని కోట్ల మొక్కలు నాటినా అడవితో సమానం కాదని కేసీఆర్ స్పష్టం చేశారు. కేవలం పదెకరాల అడవి కొన్ని లక్షల మొక్కలతో సమానమన్నారు. గజ్వేల్ తరహాలో అన్ని జిల్లాల్లో అడవుల పునరుజ్జీవానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అడవులు లేని జిల్లాల్లో ఖాళీగా ఉన్న అటవీ భూముల్లో చెట్లను పెంచాలన్నారు. -
పోడుపై కీలక భేటీ.. కేసీఆర్ నిర్ణయాలపై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్/ ఏటూరునాగారం /ములుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములు, అటవీ సంరక్షణ, హరితహారం వంటి అంశాలపై ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుందా అన్న దానిపై అటవీశాఖ ఉన్నతాధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ముఖ్యమైన సమావేశంలో పోడు ఆక్రమణలను క్రమబద్ధీకరించే దిశలో ప్రభుత్వం నిర్ణయిస్తుందా లేదా అన్న చర్చ సాగుతోంది. ఈ సమీక్షా సమావేశంలో పోడు భూములపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొననున్నారు. అటవీ శాఖతో పాటు పలు ఇతర శాఖల ఉన్నతాధి కారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరుకానున్నారు. 2005 తర్వాత మళ్లీ పోడు భూముల పేరిట అటవీ ఆక్రమణలను క్రమబద్ధీకరిస్తే జరిగే నష్టంపై పర్యా వరణ నిపుణుల వాదనలు, ఇతర అంశాలు పరిగణ నలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చ ని, అటవీశాఖకు సంబంధించిన ప్రత్యేక ఆదేశాలతో కార్యాచరణ ప్రణాళికలు ప్రకటించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఏరియల్ సర్వే పోడు భూముల సాగు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు శుక్రవారం ములుగు జిల్లా ఏటూరునాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాల్లో అధికారులు హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేపట్టారు. ఫొటోలు తీయడంతో పాటు వీడియో చిత్రీకరణ చేసినట్లు సమాచారం. ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన భూముల వివరాలు, పోడు భూముల దరఖాస్తులపై ప్రభుత్వం ఇప్పటికే సమాచారాన్ని తెప్పించుకుంది. పోడు భూముల సర్వే పూర్తయ్యే వరకు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే కొనసాగుతుందని అధికారులు తెలిపారు. పోడు భూములపై ఆరా ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఆర్డీఓలు, అటవీశాఖ డీఎఫ్ఓలు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులతో.. పోడు భూముల కమిటీ సభ్యులు శాంతికుమారి, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. అటవీ ప్రాంతాల్లో ఏయే తెగలు నివాసం ఉంటున్నాయో ఆరా తీశారు. నాలుగు జిల్లాల్లో పోడు భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
Telangana: పోడుపై బహుముఖ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: పోడు భూములు, అడవుల పరిరక్షణ, హరితహారం అమలు తీరుతెన్నులపై సీఎం కేసీఆర్‌కు ఉన్నతాధికారుల బృందం శుక్రవారం నివేదిక సమర్పించనుంది. ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్న ఈ అంశాలపై సీఎం ఓఎస్డీ భూపాల్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, పీసీసీఎఫ్ శోభ, ఎస్టీ సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా చొంగ్తూలతో కూడిన బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతోంది. ఇందుకు సంబంధించి 13 జిల్లాల కలెక్టర్లు, అటవీ, రెవెన్యూ, ఎస్టీ సంక్షేమం, పీఆర్, పోలీస్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ అంతా శుక్రవారంతోనే ముగియనుంది. తమ క్షేత్రస్థాయి పర్యటనలో వెల్లడైన అంశాలు, సమీక్షల్లో కలెక్టర్లు, ఇతర అధికారులు అందజేసిన వివరాలు, సమాచారం ఆధారంగా శుక్రవారం రాత్రికల్లా ముఖ్యమంత్రికి నివేదిక సమరి్పంచనున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. ఎలా ముందుకెళ్లాలి? పోడు సమస్య పరిష్కారానికి అనుసరించాల్సిన బహుముఖ వ్యూహం, అటవీహక్కుల పరిరక్షణ చట్టం (ఆర్వోఎఫ్ఆర్), పోడు చేస్తున్న వారిని మరో చోటికి తరలింపు, పునరావాస చర్యలు, అటవీ పరిరక్షణ చర్యల్లో భాగంగా ఇంకా తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన చర్యలు నివేదికలో పొందుపరచనున్నారు. అలాగే ఇకముందు ఆక్రమణలు జరగకుండా ఏమి చేయాలి? హరితహారంలో భాగంగా అడవుల పునరుజ్జీవం, పట్టణ అటవీ పార్కుల తీరుతెన్నులు, రిజర్వ్ ఫారెస్ట్ వెలుపల మొక్కలు, చెట్ల పెంపకానికి చేపట్టాల్సిన కార్యాచరణను వివరించనున్నారు. పోడు, ఇతర సమస్యలు ఎక్కువగా ఉన్న కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, ములుగు, భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ ఉన్నతస్థాయి బృందం పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, శనివారం ఉదయం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన పోడు భూములపై సమావేశం జరగనుంది. ఈ భేటీలోనే పోడు పట్టాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది. దీంతో పాటు ధరణి పోర్టల్‌కు సంబంధించిన సమస్యలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. అటవీ అంచున కేటాయింపు! అడవుల మధ్యలో సాగుతున్న పోడు వ్యవసాయాన్ని తరలించి, అటవీ అంచున వారికి భూమి కేటాయింపు, తరలించిన వారికి సర్టిఫికెట్లు ఇచ్చి, వసతులు కల్పించడం, రైతుబంధు, రైతుబీమా వర్తింప చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు. అటవీ భూముల రక్షణ నిమిత్తం అటవీ పరిరక్షణ కమిటీల నియామకానికి విధి విధానాలను ఖరారు చేయనున్నారు. అడవుల్లోకి అక్రమ చొరబాట్లు లేకుండా అటవీశాఖే బాధ్యత తీసుకునేలా చర్యలు చేపడతారు. సమావేశం ముగిశాక పోడు భూములకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టి, వాటిల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా వారి వ్యవసాయ భూమి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. 3,31,070 ఎకరాలు ..లక్ష మందికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల పరిధిలో 3,31,070 ఎకరాల పోడు భూములను దాదాపు లక్ష మంది వరకు గిరిజన, ఇతర అట్టడుగు వర్గాలకు పంపిణీ చేయాల్సి ఉన్నట్టుగా అటవీశాఖ ప్రాథమికంగా తేల్చినట్టు సమాచారం. 2006లో కేంద్ర ప్రభుత్వం అటవీహక్కుల గుర్తింపు చట్టం తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగా ఈ భూములకు సంబంధించి గ్రామసభ ఆమోదించిన వారికే పట్టాలు ఇవ్వాలి. 2017 ఆఖరుకు మొత్తం 11 లక్షల ఎకరాల్లో తమకు హక్కులు కల్పించాలంటూ 1,86,534 క్లెయిమ్స్ రూపంలో దరఖాస్తులందాయి. 6,30,714 ఎకరాలకు సంబంధించి హక్కులు కల్పించాలంటూ 1,83,107 మంది దరఖాస్తు చేసుకున్నారు. 4,70,605 ఎకరాలకు సంబంధించి 3,427 సా మూహికంగా క్లెయిమ్స్ రూపంలో దరఖాస్తులు అందాయి. ఇందులో భాగంగా వ్యక్తిగత క్లెయిమ్స్ కింద 3 లక్షల ఎకరాలకు సంబంధించి 93,494 మందికి హక్కుపత్రాలు ఇచ్చారు. సామూహికంగా 721 క్లెయిమ్స్‌లో భాగంగా 4,54,055 ఎకరాలకు హక్కు పత్రాలిచ్చారు. -
మూడోవారం నుంచి ‘పోడు’ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: పోడు భూముల సాగుదా రుల నుంచి దరఖాస్తుల స్వీకరణకుగాను విధివిధానాలను ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ నెల మూడోవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తు ఏ విధంగా ఉండాలి, అందులో పొందుపరిచే అంశాలు, అటవీ సరిహద్దుల కోఆర్డినేట్స్ నిర్ణయం, వివిధ స్థాయిల్లో కమిటీల ఏర్పాటు, అటవీ పరిరక్షణకు పౌరుల భాగస్వామ్యం తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ అంశాలపై త్వరలో జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖ కన్జర్వేటర్లు, డీఎఫ్‌వోలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. -
పోడు వివాదానికి ఇక తెర!
సాక్షి, మహబూబాబాద్: దశాబ్దాల తరబడి పోడు రైతులకు, అటవీ అధికారులకు మధ్య జరుగుతున్న వివాదానికి తెరపడనుంది. అయితే భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్న రైతులు భూమిని విడిచి పెట్టేందుకు సిద్ధంగా లేకపోగా, ఫారెస్టు భూమిని సైతం తగ్గించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. ఇందులో మధ్యేమార్గంగా వేసిన మంత్రివర్గ ఉపసంఘం చైర్పర్సన్, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, జగదీశ్వర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఉపసంఘం మూడుసార్లు సమావేశమైంది. అయితే సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకోలేదని చెబుతూనే.. ఇప్పటికే ప్రాథమిక నివేదికను తయారు చేసి సీఎం కేసీఆర్‌కు అందజేసినట్లు సమాచారం. 2005కు ముందున్నవారికే ప్రాధాన్యం! రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో 2005కు ముందు నుంచి సాగులో ఉన్నవారికే హక్కుపత్రాలు ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. అందుకు ఆధారాలుగా గిరిజన ప్రాంతంలోని రేషన్‌కార్డు, ఓటరు ఐడీ, లేదా ఫారెస్టు, పోలీసు కేసు రికార్డులు ఉంటే సరిపోతుందనే నిబంధనలు పెట్టారు. గిరిజనేతరులైతే మూడు తరాలుగా ఏజెన్సీ ప్రాంతంలో ఉంటూ భూమిని సాగు చేసుకున్నవారు అర్హులు. ఇందుకోసం 25 ఏళ్లకు ఒక తరం చొప్పున 75 ఏళ్లు, 2005 నుంచి ఇప్పటివరకు 16 ఏళ్లు.. ఇలా మొత్తం 91 ఏళ్లుగా గిరిజనేతరులు సాగులో ఉండాల్సి ఉంటుంది. అయితే గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతంలో ఎలా ఉన్నారనే విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు రామప్ప దేవాలయం ఎనిమిది శతాబ్దాల క్రితం నిర్మించారు. అప్పటికే అక్కడే బ్రాహ్మణులు, ఇతర కులాలవారు వ్యవసాయం చేసుకుంటూ జీవించారనే చారిత్రక ఆధారాలు ఉన్నట్లు చర్చ జరిగింది. ఇలా గిరిజనేతరులకు కూడా పట్టాలు ఇవ్వాల్సిన ఆవశ్యకతను కమిటీ చర్చించింది. గొత్తికోయలు మనోళ్లు కాదు.. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాల్సి వస్తే ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గొత్తికోయలకు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం లేదని కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రధానంగా ములుగు, మహబూబాబాద్‌తోపాటు ఖమ్మం జిల్లా చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం మండలాలు, భూపాలపల్లి జిల్లాలోని వాజేడు ప్రాంతంలో గొత్తికోయలు ఉంటున్నారు. వీరు సంచార జీవనంగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చినవారే కానీ, స్థానికులు కాదనే అభిప్రాయానికి వచ్చారు. ఒక్కొక్కరికి నాలుగు హెక్టార్ల వరకే పట్టాలు.. అటవీశాఖ భూములే కదా.. అని గిరిజనులు, గిరిజనేతరులు వందల ఎకరాలు ఆక్రమించుకున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. అయితే ఒక్కొక్కరికి 4 హెక్టార్లు(పది ఎకరాలు) భూమికి మాత్రమే పట్టాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకోనుంది. మిగిలిన భూమిని ఫారెస్టులో కలుపుకోవాలని భావిస్తోంది. పండుగ తర్వాతే.. పోడు భూముల పట్టాలు అందించేందుకు అర్హులైన రైతులను ఎంపిక చేసే ప్రక్రియ దసరా తర్వాత ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రొఫార్మా తయారు చేసి దరఖాస్తులను ఏజెన్సీ ప్రాంతాల్లోని రైతులకు అందుబాటులో ఉంచుతారు. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ముందుగా గ్రామపంచాయతీ, మండలస్థాయిలో, రెండో దశలో రెవెన్యూ డివిజన్ స్థాయిలో, కలెక్టర్, భూ పరిపాలనా విభాగం, ఫారెస్టు, ఐటీడీఏ పీవో స్థాయి అధికారులు పరిశీలించి తుది జాబితా రూపొందిస్తారు. నిజమైన రైతులకు న్యాయం.. భూమినే నమ్ముకొని జీవిస్తున్న నిజమైన రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం తీసుకునే నిర్ణయాలు వారికి అనుకూలంగా ఉంటాయి. ఎన్ని ఎకరాలు ఇవ్వాలి.. ఎప్పటి నుంచి భూమిని సాగు చేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలి.. ఎవరికి ఇవ్వాలి.. అనేవి కీలకాంశాలుగా చర్చ జరుగుతోంది. – సత్యవతి రాథోడ్, రాష్ట్ర మంత్రి, ఉపసంఘం చైర్పర్సన్ శాశ్వత పరిష్కారం చూపాలి ఏజెన్సీ మండలాల్లో ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపాలి. 2005 కంటే ముందు సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇచ్చి రైతుబంధు, రైతుబీమా, సాగునీరు అందించినట్లయితే ఉన్న అడవులను స్థానికులే కాపాడుకుంటారు. – సీతక్క, ములుగు ఎమ్మెల్యే స్వేచ్ఛగా సాగు చేసుకోనివ్వాలి.. ఏజెన్సీ గ్రామాల్లోని పోడు భూముల్లో స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకునే విధంగా చూడాలి. అర్హులైన ప్రతి వ్యక్తికి పట్టాలు ఇచ్చి రెండు పంటలకు నీరందించాలి. అప్పుడే ఆదివాసీల అభివృద్ధి సాధ్యమవుతుంది. – ఆగబోయిన రవి, తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు -
Telangana: అడవే ఉండాలి.. ఆక్రమణ ఉండొద్దు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కారానికి ఈ నెల మూడో వారం నుంచి కార్యాచరణ చేపడతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ‘భవిష్యత్తులో అంతా అడవే ఉండాలని, లోపల ఎవరూ ఉండటానికి వీల్లేదు (నన్ ఈజ్ ఇన్ సైడ్. ఇన్సైడ్ ఈజ్ ఓన్లీ ఫారెస్ట్)’ అని స్పష్టం చేశారు. అడవుల మధ్యలో పోడు చేస్తున్నవారిని గుర్తించి అంచులకు తరలిస్తామని.. అక్కడ భూమి ఇచ్చి, సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. సాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని.. రైతుబంధు, రైతు బీమా కూడా వర్తింపజేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఒక్క గజం అటవీ భూమి అన్యాక్రాంతం కావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ శనివారం పోడు భూముల అంశంపై ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అటవీ పరిరక్షణ కమిటీల నియామకానికి విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు. పోడు సమస్య పరిష్కారంపై అఖిలపక్ష భేటీ నిర్వహిస్తామని, అవసరమైతే ఇతర పార్టీల నేతలను హెలికాప్టర్లో తీసుకెళ్లి అన్యాక్రాంతమైన భూములను చూపిస్తామని చెప్పారు. సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన సూచనలు, ఇచ్చిన ఆదేశాలు ఆయన మాటల్లోనే.. నిర్లక్ష్యం వద్దు ‘‘మానవ మనుగడకు అడవుల సంరక్షణ ఎంతో కీలకం. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలకు ఒక్క చెట్టూ మిగలదు. అడవుల సంరక్షణ, పచ్చదనం పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గొప్ప ఫలితాలను ఇస్తున్నాయి. హరితహారంతో దేశానికే ఆదర్శంగా నిలిచాం. హరితనిధికి విశేష స్పందన వస్తోంది. అడవులను రక్షించుకునే విషయంలో అటవీశాఖ అధికారులు మరింతగా శ్రద్ధ కనబర్చాలి. సమర్థవంతమైన అధికారులను నియమించాలి. వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం.. పోడు భూముల సమస్య పరిష్కారానికి అక్టోబర్ మూడో వారం నుంచి కార్యాచరణ ప్రారంభించాలి. బయటివారితోనే అసలు సమస్య గిరిజనుల సంస్కృతి అడవితో ముడిపడి ఉంటుంది. వారు అడవులకు హాని తలపెట్టరు. జీవనోపాధి కోసం అడవుల్లో దొరికే తేనె, బంక, కట్టెలు, ఇతర అటవీ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించుకుంటారు. సమస్య అంతా బయటినుంచి వెళ్లి అటవీ భూములను ఆక్రమించి, చెట్లను నరికి, అటవీ సంపదను దుర్వినియోగం చేసేవారితోనే. వారి స్వార్థానికి అడవులను బలికానివ్వం. పోడు సమస్య పరిష్కారమైన మరుక్షణమే అటవీభూముల పరిరక్షణ కోసం పటిష్టమైన చర్యలను ప్రారంభిస్తాం. అక్రమ చొరబాట్లు లేకుండా చూసుకోవడం అటవీశాఖ అధికారుల బాధ్యతే. మూడో వారంలో దరఖాస్తులు రాష్ట్రవ్యాప్తంగా పోడు భూములకు సంబంధించి ఈ నెల మూడో వారంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించాలి. ఆ దరఖాస్తుల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా.. వ్యవసాయ భూమి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్థారించాలి. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ చర్యలు చేపట్టాలి. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేయాలి. ఈ విషయంగా ఎమ్మెల్యేల సలహాలు, సూచనలు తీసుకోవాలి. గిరిజన సంక్షేమశాఖతో సమన్వయం చేసుకుని అటవీ భూముల రక్షణకు చర్యలు చేపట్టాలి. నవంబర్ నుంచి సర్వే.. రాష్ట్రంలో అటవీ భూముల సర్వేను నవంబర్ నుంచి ప్రారంభించనున్నాం. అక్షాంశ, రేఖాంశాల కో–ఆర్డినేట్స్ ఆధారంగా.. ప్రభుత్వ, అటవీ భూముల సరిహద్దులను గుర్తించాలి. అవసరమైన చోట కందకాలు తవ్వడం, కంచె వేయడం వంటి చర్యలు చేపట్టాలి. ఇందుకు కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. పకడ్బందీ చర్యల కోసం అవసరమైతే పోలీస్ రక్షణ అందిస్తాం. అంతిమంగా అందరి లక్ష్యం ఆక్రమణలకు గురికాకుండా అడవులను పరిరక్షించుకునేదై ఉండాలి..’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్‌కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శులు స్మితా సబర్వాల్ , భూపాల్‌రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, సీఎం ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్, పీసీసీఎఫ్ శోభ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘మీ కాళ్లు మొక్కుతా.. మేం దళితులం.. మా పంట పాడు చేయకండి’
గూడూరు: ‘కాళ్లు మొక్కుతా.. దళితులం.. పంట నాశనం చేయకండి’.. అంటూ ఓ పోడు రైతు అటవీ అధికారి కాళ్లు మొక్కాడు. అయినా కనికరం చూపకుండా అటవీ అధికారులు పంటను ధ్వంసం చేసేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని బొల్లెపల్లి శివారు పోడు భూముల్లో శుక్రవారం జరిగింది. కొన్ని నెలలుగా బొల్లేపల్లి శివారులోని సర్వే నంబర్ 1 నుంచి 30 గల పోడు భూముల్లో స్థానిక దళిత, గిరిజన రైతులు 1985కు ముందు నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు. చదవండి: టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు ఆ భూమి అటవీ శాఖది పేర్కొంటుండడంతో ఏడాదిగా అధికారులు, రైతులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి జోక్యం చేసుకోవడంతో నాటి గొడవలు సద్దుమణిగాయి. దీంతో రైతులు వారి భూముల్లో పంటలు సాగు చేసుకున్నారు. అయితే శ్రీను అనే రైతు మిర్చి పంట వేసుకోగా శుక్రవారం డీఎఫ్ఓ కిరణ్ సమక్షంలో మానుకోట అటవీ అధికారులు అక్కడకు చేరుకున్నారు. అటవీ భూమిగా పేర్కొంటూ పంటను ధ్వంసం చేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న రైతులు వారితో వాగ్వాదానికి దిగారు. ఓ రైతు ఏకంగా డీఎఫ్ఓ కాళ్లపై పడి వేడుకున్నా కనికరం చూపకుండా పంటను నాశనం చేసి వెళ్లిపోయారు. చదవండి: నేను గెలిస్తే కేసీఆర్ రోడ్డుమీదకు: ఈటల రాజేందర్ -
తెరపైకి ‘పోడు’ గోడు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అటవీ పరిరక్షణ, పోడు భూములు, ఆక్రమణల అంశానికి మరోసారి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. హరితహారంలో భాగంగా మొక్కలు నాటే నెపంతో అటవీ, రెవెన్యూ, పోలీసు అధికారులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో వేసిన పంటలు నాశనం చేయడంతో పాటు మొక్కలు నాటి తమను వాటిల్లో వెళ్లకుండా అడ్డుకుంటున్నారని పోడు రైతులు వాపోతున్నారు. 2005 తర్వాత రాష్ట్రంలో కొత్తగా పోడు అనేదే లేదని, తెలంగాణ ఏర్పడ్డాక గత ఏడేళ్లలో అటవీ భూముల్లో ఆక్రమణలు భారీగా పెరగడంతో అటవీ విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోందని అటవీ, రెవెన్యూ అధికారులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించి, జిల్లాల వారీగా పోడు భూములు, వాటిలో ఇంకా ఎవరెవరికి, ఎన్ని ఎకరాల్లో పట్టాలు ఇవ్వాలో లెక్క తేల్చే పనిలో పడింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ప్రస్తుతం అటవీ శాఖ ఏయే జిల్లాల్లో పోడు కింద ఎంత భూమి ఉంది, ఎన్ని ఎకరాల్లో అటవీ ఆక్రమణలు జరిగాయి, అటవీహక్కుల పరిరక్షణ చట్టం (ఆర్వోఎఫ్ఆర్) కింద ఎంతమేర హక్కు పత్రాలు ఇచ్చారో లెక్కలు తీసేపనిలో పడింది. దేశ వ్యాప్తంగా అటవీ భూములు పంపిణీ చేస్తే అడవులతో పాటు పర్యావరణం దెబ్బతింటుందని కొన్ని ఎన్జీవో సంస్థలు కేసు వేయడంతో ఆర్వోఎఫ్ఆర్ కింద భూముల పంపిణీపై 2019 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో తెలంగాణ సహా ఏపీ, త్రిపుర ఇతర రాష్ట్రాల్లో అప్పట్నుంచీ పోడు భూముల పంపిణీ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో అటవీ, రెవెన్యూ, సర్వే విభాగాలు ఉమ్మడిగా మొత్తం రాష్ట్రంలోని అటవీ భూముల సర్వే నిర్వహిస్తే అటవీ విస్తీర్ణం, ఆక్రమణలు, పోడు, ఇతర అన్ని విషయాలపై స్పష్టత వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆ తర్వాతే ప్రభుత్వపరంగా ఇతర చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం తగ్గుదల: అడవుల విస్తీర్ణాన్ని 24 నుంచి 33 శాతానికి పెంచాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే అత్యంత వేగంగా, అత్యధికంగా అటవీ విస్తీర్ణం తగ్గుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 24 శాతం అడవులున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నా... క్షేత్రస్థాయిలో ఈ విస్తీర్ణం పది శాతం వరకే ఉంటుందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. అటవీ భూముల ఆక్రమణలు ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో దట్టమైన అడవే కనిపించకుండా పోయే స్థితి దాపురిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆర్ఓఎఫ్ఆర్ కింద హక్కు పత్రాల పంపిణీ రాష్ట్రంలో అటవీ హక్కుల గుర్తింపు చట్టం (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్–ఆర్ఓఎఫ్ఆర్) కింద 2017 చివరినాటికి 11 లక్షల ఎకరాల్లో హక్కులు కల్పించాలంటూ 1,86,534 క్లెయిమ్స్ అందాయి. వాటిలో 1,83,107 మంది వ్యక్తిగతంగా (6,30,714 ఎకరాలకు) దరఖాస్తు చేయగా సామూహిక (కమ్యూనిటీ) క్లెయిమ్స్ కింద 3,427 దరఖాస్తులు (4,70,605 ఎకరాలకు) అందాయి. వాటిలో వ్యక్తిగత క్లెయిమ్స్‌లో భాగంగా 93,494 మందికి 3 లక్షల ఎకరాలకు హక్కుపత్రాలు పంపిణీ చేశారు. 721 సామూహిక క్లెయిమ్స్ కింద 4,54,055 ఎకరాలకు హక్కు పత్రాలు అందజేశారు. మిగతా వాటి లో కొన్ని క్లెయిమ్స్ తిరస్కరించగా కొన్ని పెండింగ్‌లో ఉన్నట్టుగా అటవీ, ఎస్టీ సంక్షే మ శాఖలకు చెందిన రికార్డులను బట్టి స్పష్టమవుతోంది. గిరిజనేతరుల ఆక్రమణతో... పోడు వ్యవసాయం పేరుతో ఆదివాసీలు, గిరిజనులను తమ బినామీలుగా చేసుకుని ఆదివాసీలు కాని వారు, గిరిజనేతరులు పెద్ద మొత్తంలో అటవీ భూములను ఆక్రమించి తమ స్వాధీనంలో పెట్టుకోవడం పెద్ద సమస్యగా మారిందని అటవీ అధికారులు చెబుతున్నారు. వీరికి రాజకీయ పార్టీల అండకూడా ఉందని అంటున్నారు. పోడు పట్టాలున్న ఆదివాసీలు, పేద ఎస్సీ, బీసీ వర్గాల వారిని ముందుంచి, వారి భూముల పక్కల నుంచి ఆక్రమణలు మొదలుపెట్టి చెట్లు కొట్టడం, అటవీ భూఆక్రమణ విస్తీర్ణం క్రమంగా పెంచుకోవడంతో ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసే ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. అమ్ముకోకూడదు.. కుదవ పెట్టకూడదు కొన్ని దశాబ్దాల క్రితం నుంచి మారుమూల అడవుల్లోని ఆదివాసీలకు పోడు సాగు జీవనాధారంగా ఉండేది. జీవనోపాధి కోసం అడవుల్లో చెట్లు లేని చోట సాగుచేసి ఆ భూమిలో సారం తగ్గగానే ఒకటి, రెండేళ్లలోనే చెట్లు కొట్టకుండానే మరోచోటుకు తరలిపోవడం జరిగేది. పారలు, ఎడ్లు వంటి వాటిని ఉపయోగించకుండా వ్యవసాయం చేసేవారు. కాలక్రమేణా పోడు నిర్వచనమే మారిపోయింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ముఖ్యంగా ఉమ్మడి ఏపీలో పోడు వ్యవసాయానికి 1907లో నిజాం నవాబు అనుమతించాడు. కొన్నేళ్ల తరబడి పోడు సాగు చేసుకునే వారికి ఆ భూమిపై హక్కును కల్పించినా, దున్నుకోవాలి తప్ప అమ్ముకోకూడదు, కుదవపెట్టకూడదు, ఈ భూములకు బ్యాంకులు రుణాలు సైతం ఇస్తాయి. 2006లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అటవీహక్కుల చట్టం ప్రకారం గ్రామసభ ఆమోదించిన వారికే ఈ పట్టాలు ఇవ్వాలి. రాజకీయ ఒత్తిళ్లతో నిబంధనలకు విరుద్ధంగా.. రాష్ట్రంలో మొత్తం 7,37,595 ఎకరాల విస్తీర్ణంలో అటవీ భూమి ఆక్రమణలకు గురైనట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు నివేదికలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ, ఇతర ఒత్తిళ్లకు తలొగ్గి జిల్లాల్లో రెవెన్యూ శాఖ 1,09,584 ఎకరాల్లో పట్టాలిచ్చినట్టు అటవీ అధికారులు తమ నివేదికల్లో తేల్చారు. అత్యధికంగా కొత్తగూడెం జిల్లాలో 2.15 లక్షల ఎకరాలు, అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలో 9 వేల ఎకరాల అటవీశాఖ భూములకు రెవెన్యూశాఖ పట్టాలు అందజేసినట్టు పేర్కొన్నారు. -
అడవిలో అడుగు పెట్టనివ్వం
సాక్షి, కొణిజర్ల/కారేపల్లి(ఖమ్మం): పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులు, గిరిజనేతరులపై అటవీ, పోలీసు అధికారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని..ఇకపై వారిని అడవిలో అడుగు పెట్టనివ్వబోమని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి, కారేపల్లి మండలం చీమలపాడులో శనివారం ‘పోడు రైతుల పొలికేక’నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడుతూ..అడవిలో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకే హరితహారం పేరుతో అటవీ భూములను పేదల నుంచి లాక్కుంటున్నారని మండిపడ్డారు. పోడు సమస్యలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీతో కాలయాపనే తప్ప సామాన్యుడికి ఒరిగేదేమీ లేదన్నారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ..పోడుసాగు చేసుకుంటున్న మహిళలు, చిన్నారులు..చివరకు ఎద్దులపై కూడా కేసులుపెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. పోడు రైతుల సమస్యల పరిష్కారానికి అక్టోబర్ 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు రహదారులను దిగ్బంధం చేయనున్నట్లు వెల్లడించారు. పోడుసాగుదారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్, టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి గోపగాని శంకర్రావు, సీపీఐ, సీపీఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్, బాగం హేమంతరావు తదితరులు పాల్గొన్నారు. భారత్ బంద్‌కు మావోల మద్దతు దుమ్ముగూడెం: ప్రతిపక్షాలు ఈనెల 27న పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు మావోయిస్టులు మద్దతు ప్రకటించారు. ఇందులో భాగంగా రోడ్లను ధ్వంసం చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో శనివారం చోటుచేసుకుంది. జాగుర్గుండ దంతెవాడ రోడ్డు కమర్గూడ సమీపంలోని రహదారిని మావోయిస్టులు తవ్వేశారు. దీంతో ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అలాగే, దంతెవాడ–సుక్మా సరిహద్దులోని సామేలి గ్రామంలో రైతుల ఉద్యమానికి మద్దతుగా 27న జరిగే బంద్‌కు తమ మద్దతు ఉంటుందంటూ మావోయిస్టులు పోస్టర్లు వేశారు. చదవండి: పాఠశాలలో కరోనా కలకలం -
ఆదిలాబాద్ నుంచి అశ్వారావుపేట వరకు 5న భారీ రాస్తారోకో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఆదివాసీ గిరిజనులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యలపై ఉద్యమించాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఈ భూముల సాగుకు హక్కు పత్రాలు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గాను ఆదిలాబాద్ నుంచి అశ్వారావుపేట వరకు 400 కిలోమీటర్ల మేర కనెక్టింగ్ కారిడార్ అంతటా వచ్చే నెల 5వ తేదీన రాస్తోరోకో నిర్వహించాలని తీర్మానించాయి. ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఏడు ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. మధుయాష్కీగౌడ్, మల్లురవి, కోదండరెడ్డి, అన్వేష్‌రెడ్డి (కాంగ్రెస్), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), చాడా వెంకటరెడ్డి, బాలమల్లేశ్ (సీపీఐ), ప్రొఫెసర్ ఎం.కోదండరాం, పీఎల్ విశ్వేశ్వర్రావు (టీజేఎస్), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటిపార్టీ) పోటు రంగారావు, గోవర్ధన్, నరసింహారావు, కె. రమ (సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ), రాజేశ్ (సీపీఐఎంఎల్ లిబరేషన్), ప్రదీప్ (పీవైఎల్), రాము (పీడీఎస్‌యూ)లు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలు, ధరల పెరుగుదల, పోడు భూములు, వ్యవసాయ, రైతాంగ సమస్యలపై చర్చించారు. అనంతరం ఉద్యమ కార్యాచరణను విలేకరులకు వెల్లడించారు. ప్రభుత్వాల మెడలు వంచుతాం: రేవంత్‌రెడ్డి కేసీఆర్, మోదీల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడి పోరాటాలు చేయడం ద్వారా ఈ ప్రభుత్వాల మెడలు వంచి ప్రజలకు న్యాయం చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్య చాలా కీలకమైందని, దాదాపు 20 నియోజక వర్గాల్లోని గిరిజనులు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై దీర్ఘకాలిక పోరాటాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పోడు భూముల సమస్య పరిష్కారమయ్యేంత వరకు క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేస్తామని చెప్పారు. ధరణి పోర్టల్‌లో దాదాపు 25 లక్షల ఎకరాల రైతుల పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో సామాన్య, పేద రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 22న ఇందిరాపార్కు వద్ద ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో రైతులు, బాధితులను సమీకరించి మహాధర్నా చేస్తామని తెలిపారు. అదే విధంగా ఈనెల 27న జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చిన ‘భారత్ బంద్’కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. ఈనెల 30న రాష్ట్రంలోని రైతులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. కేసీఆర్‌కు భయం పట్టుకుంది: తమ్మినేని పోడు భూముల సమస్యలపై ప్రతిపక్ష పార్టీల పోరాటం అని ప్రకటించగానే సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందని తమ్మినేని వీరభద్రం అన్నారు. అందువల్లే వెంటనే పోడు భూముల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారని ఎద్దేవా చేశారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షాల పోరాట కార్యక్రమాల్లో తమ పార్టీకి చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు. మహాధర్నా, రాస్తారోకో తదితర కార్యక్రమాలన్నిటినీ విజయవంతం చేయాలని కోదండరాం ప్రజలను కోరారు. పోటు రంగారావు తదితరులు మాట్లాడారు. టార్గెట్ కేటీఆర్ సీఎం కేసీఆర్ లక్ష్యంగా గజ్వేల్‌లో దండోరా సభ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ, తాజాగా ఆయన కుమారుడు కేటీఆర్ నియోజకవర్గంపై దృష్టి పెట్టింది. అక్టోబర్ 2వ తేదీన సిరిసిల్లలో నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఇలావుండగా టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రతిపక్ష పార్టీలు గాంధీభవన్‌కు వచ్చి కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో సమావేశం కావడం ఇదే తొలిసారని, ఇది రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణకు దోహదపడుతుందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీల డిమాండ్లివే.. ►దేశంలోని వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగంలోకి తేవాలి. విదేశాల నుంచి వ్యాక్సిన్ దిగుమతి చేసుకోవాలి. ►కోవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించాలి. ►ఆదాయ పన్ను పరిధిలోని లేని ప్రతి కుటుంబానికి నెలకు రూ.7,500 నగదు అందించాలి. తలకు ఒక్కింటికి 10 కిలోల బియ్యం ఇవ్వాలి. ►పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం విధించిన ఎక్సైజ్ డ్యూటీలు, సర్ చార్జీలను వెంటనే ఉపసంహరించాలి. ►రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి. ►ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలి. మూసివేసిన పరిశ్రమలను తెరిపించాలి. ►కార్మిక కోడ్‌ను రద్దు చేయాలి. సమ్మె, వేతనాల కోసం బేరసారాల హక్కులను పునరుద్ధరించాలి. ►ఉపాధి హామీ చట్టంలో ఏడాదికి 200 పనిదినాలు కల్పించాలి. ►‘పెగాసస్’వ్యవహారంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయవిచారణ జరిపించాలి. ►దేశద్రోహం, జాతీయ భద్రతా చట్టం లాంటి దుర్మార్గపు చట్టాలను ఉపసంహరించాలి. ►అటవీహక్కులు, పీసా చట్టాల అమలు జరపా లి. పోడు భూములకు సాగుహక్కు పత్రాలివ్వాలి. -
పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: ఏళ్లు గా పెండింగ్‌లో ఉన్న పోడుభూముల సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. పోడుభూముల అంశాలపై సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌కమిటీ శనివారం తొలిసారి భేటీ అయింది. గిరిజన, సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రు లు పువ్వాడ అజయ్‌కుమార్, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోడు భూముల కింద వచ్చిన దరఖాస్తులు, పరిష్కారమైనవెన్ని, మిగిలిపోయినవెన్ని? తదితర అంశాలపై పక్కా సమాచారాన్ని రూపొందించి నివేదిక ఇవ్వాలని గిరిజన సంక్షేమం, అటవీశాఖ అధికారులను మంత్రులు ఆదేశించారు. పూర్తి సమాచారంతో ఈనెల 24న మరోసారి సమావేశం నిర్వహించి లోతుగా చర్చించాలని నిర్ణయించారు. సమావేశంలో సీఎస్ సోమేశ్‌కుమార్, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ, పీసీసీఎఫ్ శోభ తదితరులు పాల్గొన్నారు. -
పోడు రైతులకు పట్టాలివ్వాలి
సుందరయ్య విజ్ఞానకేంద్రం (హైదరాబాద్): రాష్ట్రంలో పోడు భూములను సాగుచేస్తున్న రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. అటవీ హక్కుల చట్టాన్ని, పెసా చట్టాన్ని అమలు చేయాలన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో పోడురైతు పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో పలు పార్టీలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తరతరాలుగా భూములను సాగుచేస్తూ అడవులను కాపాడుతున్న గిరిజనులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అటవీ హక్కులను సాధించుకునేందుకు అక్టోబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే రాస్తారోకోను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ వేలాది ఎకరాల భూమి కొద్దిమంది చేతుల్లోనే ఉందని, ఈ భూములు సరిపోవడం లేదని గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములను ప్రభుత్వం లాక్కోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ‘అటవీప్రాంతం ఉన్న అన్ని ప్రాంతాల్లో రైతులు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. దేశంలో అడవిని నమ్ముకుని జీవించేవారికి బతుకులేకుండా చేస్తున్నారు’అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చంద్రశేఖర్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివాసీ మంచ్ జాతీయ నాయకుడు, మాజీ ఎంపీ బాబూరావు మాట్లాడుతూ అనేక పోరాటాల వల్ల వచ్చిన ఈ చట్టాన్ని ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయని ధ్వజమెత్తారు. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోటు రంగారావు మాట్లాడుతూ ఏళ్లుగా పోడు చేసుకుని బతుకుతున్న వారి భూములను ప్రభుత్వం లాక్కొని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని చూస్తోందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ భూమి అనేది ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాంబశివరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భవానిరెడ్డి, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు వెంకటేశ్వర్రావు, గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే నర్సయ్య, రైతు స్వరాజ్య వేదిక నాయకులు రవి, రంగారావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఐఎంఎల్ నాయకులు ప్రసాదన్న, ఆదివాసీ నాయకులు బాబూదొర, టీపీఎఫ్ అధ్యక్షులు రవిచంద్ర, టీడీపీ నాయకులు ఇందిర, ఎంసీపీఐయూ నాయకులు రవి, జనసేన నాయకులు శంకర్‌గౌడ్, ఏఐకెఎంఎస్ నాయకులు అచ్యుత రామారావు తదితరులు పాల్గొన్నారు. -
YS Sharmila: ‘పోడు’పై పోరాడతా..
ఎస్ఎస్ తాడ్వాయి: గిరిజన రైతుల పోడు భూముల హక్కుల కోసం పోరాటం చేస్తానని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల భరోసా ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి రాజన్న బిడ్డగా లింగాల ఏజెన్సీ ప్రాంతంలోని పోడు భూముల సమస్యలు పరిష్కారించే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాలలో బుధవారం ఏర్పాటు చేసిన పోడు భూముల రైతుల భరోసా యాత్రలో షర్మిల మాట్లాడారు. హుజూరాబాద్‌లో ఓట్ల కోసం సీఎం కేసీఆర్ దళితబంధు ప్రవేశపెట్టారని, గిరిజన ప్రాంతంలో ఎన్నికలు లేనందునే పోడు సమస్య పరిష్కరించట్లేదని ఆరోపించారు. స్వయంగా గిరిజన గ్రామాలకు వెళ్లి మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్... ఫాంహౌస్‌కు వెళ్లాక మరిచిపోయారని షర్మిల ఎద్దేవా చేశారు. దివంగత నేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన అటవీ హక్కుల చట్టం అద్భుతంగా ఉందని ఆనాడు మాట్లాడిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల సమస్యలపై ప్రశ్నించినందుకు 20 మంది మహిళలపై హత్యాయత్నం కేసులు పెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని దుయ్యబట్టారు. అడవి బిడ్డల భూములు లాక్కుంటే గిరిజనులు మీ కుర్చీ లేకుండా చేస్తారని హెచ్చరించారు. వై.ఎస్. ఇచ్చిన భూములనూ లాక్కుంటున్నారు తెలంగాణలోని సుమారు 11 లక్షల ఎకరాల పోడు భూములకుగాను వై.ఎస్. హయాంలో 3 లక్షల ఎకరాల మేర గిరిజనులకు హక్కులు కల్పించగా కేసీఆర్ ఆ భూములను లాక్కుంటున్నారని, మిగిలిన 7 లక్షల ఎకరాల్లో ఇప్పటివరకు ఒక ఎకరానికీ పట్టా ఇవ్వలేదని షర్మిల విమర్శించారు. రాజన్న బిడ్డగా గిరిజనుల పోడు భూముల కోసం గిరిజనులు పక్షాన నిలబడి కోట్లాడతానన్నారు. రాబోయే రోజుల్లో తాము అధికారంలోకి వస్తే పోడు భూములన్నింటికీ పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చారు. కాగా, పోడు భూముల సమస్యలపై షర్మిలకు గిరిజన మహిళలు తమ గోడు వినిపించారు. వైఎస్ హయాంలో ఇచ్చిన పట్టాలున్న పోడు భూములనూ అటవీ అధికారులు లాక్కొని మొక్కలు నాటుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు కల్పన గాయత్రి, ములుగు కన్వీనర్లు బానోత్ సుజాత మంగిలాల్, మహబూబాబాద్ పార్లమెంట్ కో–కన్వీనర్ రామసహాయం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
కొంగుపట్టి లాగి.. జాకెట్ చించి..
టేకులపల్లి (భద్రాద్రి కొత్తగూడెం): పోడుభూములను సాగు చేసుకుంటున్న ఆదివాసీ మహిళారైతులపై అటవీఅధికారులు దౌర్జన్యం చేయడంతోపాటు అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గంగారం పంచాయతీ సిద్ధారం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. సిద్ధారం సమీపంలో ఆదివాసీలు 30 ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొందరికి పట్టాలు ఇచ్చారు. మరికొన్ని భూములకు ఫారెస్టు అధికారులు రీసర్వే చేయడంతో బాధిత రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో గురువారం సాగు చేసుకుంటున్న రైతులు మధ్యాహ్న భోజనానికి ఇళ్లకు వెళ్లిన సమయంలో అటవీ అధికారులు పోడు భూముల వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్న మహిళలను దుర్భాషలాడుతూ వారిపై దౌర్జన్యానికి దిగారు. ‘ఎవడబ్బ సొమ్మని పోడు దున్నుతున్నారు’ అని తిడుతూ అరకలను తొలగించేందుకు ప్రయత్నించగా మహిళారైతులు అడ్డుకున్నారు. బీట్ ఆఫీసర్ మోతీలాల్ ఆగ్రహంతో మహిళా రైతులు జోగ కుమారి, కోరం రమణల కొంగుపట్టి లాగడంతో వారి జాకెట్లు చిరిగిపోయాయి. ఈ విషయమై వివరణ కోరేందుకు ఎఫ్ఆర్వోను ‘సాక్షి’ ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. కాగా, ఈ ఘటనపై బాధితులు జోగ కుమారి, కోరం రమణతోపాటు మహిళారైతులు స్వరూప, సమ్మక్క, పవిత్ర, లక్ష్మీ, నాగమణి, పద్మ, వివిధ పార్టీల నేతలు బోడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీట్ ఆఫీసర్లు మోతీలాల్, రమేష్‌పై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. -
అధికారిపై పెట్రోల్ పోసి.. తానూ పోసుకున్న మహిళ
మన్ననూర్ (అచ్చంపేట): నాగర్‌కర్నూల్ జిల్లాలో పోడు భూముల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఓ అధికారిపై చెంచు మహిళ పెట్రోల్ పోసి, తానూ పోసుకుని నిప్పంటించేందుకు యత్నించగా అక్కడున్నవారు అడ్డుకున్నారు. విషయం తెలిసి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అక్కడికి చేరుకుని అధికారుల తీరుపై మండిపడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారానికి చెందిన 20 మంది చెంచులు 30 ఏళ్లుగా సమీపంలోని 60 ఎకరాల పోడు భూములను సాగు చేసుకుంటున్నారు. నెల క్రితం ఆ భూములు సాగు చేయొద్దని చెంచులకు అటవీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు యత్నించగా తిరస్కరించారు. తాజాగా శుక్రవారం ప్లాంటేషన్ ఏర్పాటుకు అటవీ శాఖ అధికారులు ఆ భూముల్లో మార్కింగ్ వేయడానికి వచ్చారు. దీంతో చెంచు మహిళా రైతులు వాగ్వాదానికి దిగారు. భూముల కోసం చావడానికైనా, చంపడానికైనా సిద్ధమేనని తెగేసి చెప్పారు. అంతలోనే ఓ మహిళ అటవీశాఖ అధికారిపై పెట్రోల్ చల్లి తానూ పోసుకుని అగ్గిపుల్ల గీసేందుకు యత్నించింది. వెంటనే కొందరు లాగేసుకోవడంతో ప్రమాదం తప్పింది. ఇది తెలిసి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అక్కడి వెళ్లి మాట్లాడారు. పోడు భూముల విషయాన్ని త్వరలోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని, చెంచులను ఇబ్బంది పెట్టవద్దని 15 రోజుల క్రితమే అధికారులకు చెప్పామని పేర్కొన్నారు. -
కొండపల్లి ‘పోడుభూమి’ రణరంగం
సాక్షి, పెంచికల్పేట్: కొండపల్లి ‘పోడుభూమి’రణరంగమైంది. గిరిజనులకు, పోలీసులకు మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. పోలీసులపైకి గిరిజన రైతులు, మహిళలు రాళ్ల దాడి చేశారు. పలువురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం కొండపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. అటవీ భూముల్లో ప్లాంటేషన్ నిలిపివేయాలని, పోడు రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత పాల్వాయి హరీశ్‌బాబు రెండురోజులుగా నిరవధిక దీక్ష చేపట్టారు. అర్ధరాత్రి దీక్షా శిబిరం వద్దకు జిల్లాస్థాయి అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.హరీశ్‌బాబుతోపాటు పార్టీ జిల్లా కార్యదర్శి కొంగ సత్యనారాయణను పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించడంతో మహిళలు, రైతులు తిరగబడి రాళ్ల దాడికి దిగారు. దీంతో కాగజ్‌నగర్ రూరల్ సీఐ, పెంచికల్పేట్ ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. పోలీసులను అడ్డుకున్న గ్రామస్తులు హరీశ్‌బాబును రెబ్బెన వైపు వాహనంలో తరలించగా.. మరో పోలీసు అధికారుల బృందం కొండపల్లి మీదుగా పెంచికల్పేట్ చేరుకోవటానికి బయలుదేరింది. దీంతో కొండపల్లి పొలిమేర్లలో పోలీసుల వాహనాలను మహిళలు అడ్డుకున్నారు. హరీశ్‌బాబును విడిచిపెట్టాలని భీష్మించుకు కూర్చున్నారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి శనివారం వేకువజాము 4 గంటల వరకూ పోలీసులను ఘెరావ్ చేశారు. ఆసిఫాబాద్ ఏఎస్పీ అచ్చేశ్వర్రావు అదనపు పోలీసు బలగాలతో గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన మహిళా కానిస్టేబుల్స్ తిరుపతిబాయి, కోమలి రెబ్బెనలో పోలీసు వాహనాల అడ్డగింపు బెజ్జూర్ మండలం రెబ్బెన గ్రామం మీదుగా పోలీసులు హరీశ్‌బాబును తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న గ్రామస్తులు అదే రాత్రి 12 గంటల సమయంలో పెద్దసంఖ్యలో రోడ్డుకు అడ్డుగా నిలిచారు. పోలీసు వాహనాలను ఆపేసి టైర్లలో గాలిని తీసేశారు. వాహనంలో ఉన్న హరీశ్‌బాబును తీసుకునివెళ్లారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమపై పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారని, మహిళల కళ్లలో కారం చల్లి ఇష్టారీతిన వ్యవహరించారని హరీశ్‌బాబు విమర్శించారు. పలువురిపై కేసు నమోదు కొండపల్లిలో పోలీసులపై దాడికి పాల్పడి, పోలీసు వాహనాలను ధ్వంసం చేసిన పలువురిపై కేసులు నమోదు చేసినట్లు పెంచికల్‌పేట ఎస్సై రమేశ్ తెలి పారు. బీజేపీ నేతలు పోలీసుల కళ్లలో కారంకొట్టి దాడి చేశారని, కాగజ్‌నగర్ రూరల్ సీఐ, ఎస్సై, ఇద్దరు మహిళాకానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఆరు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారని, దాడులకు పాల్పడిన వారిపై కేసు నమెదు చేశామని వివరించారు. -
‘పోడు’ రగడ.. బావిలో దూకిన మహిళ
గూడూరు: పోడు భూముల్లో సర్వే కోసం వెళ్లిన అటవీ అధికారులు, గిరిజన రైతుల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. మహబూబాబాద్ జిల్లా లైన్‌తండాలో మంగళవారం ఈ ఘటన జరి గింది. 1032 కంపార్ట్మెంట్ ఫారెస్టు పరిధిలో తండావాసులు యాభై ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నారు. వీరిలో కొందరికి పాస్‌పుస్తకాలు ఉన్నాయి. వారం క్రితం అధికారులు గిరిజనులు సాగు చేసుకునే పంట భూములను స్వాధీనం చేసుకునేందుకు ట్రెంచ్ పనులు చేపట్టాలని సర్వే మొద లుపెట్టారు. ఇది తెలుసుకున్న గిరిజనులు.. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో మాట్లాడిస్తామని చెప్పడంతో వారు వెనుతిరిగారు. తర్వాత తమకు ఆర్ఓఎఫ్ఆర్ పత్రాలు ఉన్నందున సాగు భూములను పరిశీలించాలని కోరగా.. అధికారులు మంగళవారం అక్కడికి వచ్చారు. రైతులు, మహిళలు ఒక్కసారిగా అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. తండాకు చెందిన బానోతు పార్వతి తమ భూమి పోతుందేమోనన్న ఆవేదనతో పురుగుల మందు తాగుతూ వ్యవసాయ బావిలో దూకింది. తండావాసులు ఆమెను పైకితీసి ఆస్పత్రికి తరలించారు. కొందరు ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. చదవండి: కరోనా టీకా వికటించి అంగన్వాడీ కార్యకర్త మృతి -
గిరిజనులకు మాత్రమే హక్కుంది..
ఖమ్మంమయూరిసెంటర్: షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనులకు మాత్రమే భూములపై హక్కు ఉందని, వారి దగ్గరి నుంచి ఎవరైనా గిరిజనేతరులు భూములు అక్రమంగా ఆక్రమించుకుంటే నేరమని ఐటీడీఏ పీఓ వీపీ.గౌతమ్ పేర్కొన్నారు. నగరంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో ఎల్టీఆర్(ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్) కేసు భూములకు సంబంధించి తహసీల్దార్లతో మండలాలవారీగా బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ మాట్లాడుతూ గిరిజనుల నుంచి ఆక్రమించుకున్న భూములను గుర్తించి, ఎల్టీఆర్ ద్వారా పరిష్కారమైన భూములను వారికి అప్పగించాలన్నారు. గిరిజనులకు భూములను అప్పగించే సమయంలో గిరిజనేతరులు వినకుంటే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. కోర్టు ఆదేశాలు ఉన్న గిరిజనులకు వెంటనే పంచనామా చేసి.. ఆ భూములను అందేలా చూడాలన్నారు. మండలాల్లో ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే గుర్తించి.. పంచనామా చేసి ప్రతిపాదనలు పంపించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అనురాగ్ జయంతి, ట్రెయినీ కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఇన్చార్జ్ డీటీడీఓ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇంనీరింగ్ అధికారులపై ఆగ్రహం.. కాగా.. అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం ఖమ్మం నగరంలోని నయాబజార్ కళాశాల ఎదుట నిర్మిస్తున్న మహిళా వసతి గృహాన్ని పీఓ పరిశీలించారు. వసతి గృహ నిర్మాణం ఆలస్యంపై ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన నిర్మాణం ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తికాకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. నిర్లక్ష్యం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండు నెలల్లో భవన నిర్మాణం పూర్తి కావాలని, 15 రోజులకు ఒక ఫ్లోర్ నిర్మాణం జరగాలని ఆదేశించారు. భవన నిర్మాణంలో ఎలాంటి అలసత్వం వహించినా సంబంధీకులపై చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో డీఈ మురళి, ఏఈ ప్రసాద్ పాల్గొన్నారు. -
పోడు భూముల సంగతి తేలుస్తా
సాక్షి, హైదరాబాద్: ‘‘అడవులను రక్షించుకోవాలి. గిరిజనుల హక్కులను కూడా పరిరక్షించాలి. పోడు భూముల వ్యవహారం కూడా తేల్చేయాలి. నేనే బయలుదేరుతా.. అన్ని జిల్లాలకు అన్ని డివిజన్లకు వెళ్తా. నేనొక్కడినే కాదు మొత్తం మంత్రివర్గాన్ని అధికారగణాన్ని, అటవీశాఖ ఉన్నతాధికారులను, సీఎస్, రెవెన్యూ సెక్రటరీని తీసుకెళ్లి ఇది పోడు భూమి.. ఇది మీ పట్టా అని ఇచ్చేస్తం. ఫైనల్ చేస్తం. ఆ తర్వాత ఒక్క అంగుళం కూడా అటవీ భూమి ఆక్రమణ కానివ్వం’’అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ‘‘పొరుగు రాష్ట్రం నుంచి గుత్తికోయలు వచ్చి అడవులను ఇష్టం వచ్చిట్లు నరికేస్తున్నరు. మన గిరిజనులు నష్టపోయే పరిస్థితి. కఠినంగా నియంత్రించాలంటే ఎక్కడ్నో ఓ కాడ భరతవాక్యం పాడాలి. ఆర్ఓఎఫ్ఆర్ కేంద్రం చట్టం నిబంధనల ప్రకారం హక్కులిస్తం. ఆ పేద గిరిజనులకు కూడా రైతు బం«ధు, రైతు బీమా రావాలి. స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, స్థానిక సంస్థల ప్రతినిధులను తీసుకెళ్లి ఏ తాలుకా కేంద్రంలో సమస్య ఉంటే అక్కడే బహిరంగంగా ప్రజాదర్బార్ నిర్వహించి సమస్య పరిష్కారం చేస్తం’’అని వెల్లడించారు. కొత్త పురపాలక చట్టంపై శుక్రవారం శాసనసభలో ప్రసంగం సందర్భంగా అడవులు తరిగిపోవడంపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్సిజన్ కూడా కొనుక్కుంటామా? ‘‘గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల గడ్డాలు పట్టుకున్నా మొక్కలు పెట్టలేదు. నిర్లక్ష్యం విహిస్తున్నరు. మనం పెంచకపోతే అమెరికా వాడు వచ్చి పెంచడు కదా. ఏ రోజుకైనా మనకు మనమే మేలుకోవాలి. భయంకరమైన ఎండలు రావొద్దంటే, రెండు మూడు డిగ్రీల ఎండను తగ్గించాలన్నా, మన భవిష్యత్ తరాలు గొప్పగా బతకాలన్నా మనమే ఏదైనా చేయాలి. భవిష్యత్ తరాలకు బతకగల సమాజాన్ని ఇవ్వాలి. ఆక్సిజన్ కొనుక్కుంటామా అధ్యక్షా. హైదరాబాద్‌లో ఆక్సిజన్ క్లబ్స్ వస్తున్నయి. సిగ్గు చేటు. బంజారాహిల్స్‌లో నా చిన్నప్పుడు ఫ్యాన్లు కూడా ఉండకపోయేవి. అంత చల్లగా ఉండేది హైదరాబాద్. అటువంటి హైదరాబాద్ నేడు కాంక్రీట్ జంగిలైపోయి ఎయిర్ కండిషన్ లేకుండా బతకలేని పరిస్థితి’’అని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆదివాసి, లంబాడీల మధ్య చిచ్చు పెట్టింది వాళ్లే
భద్రాద్రి కొత్తగూడెం : అడవి మీద గిరిజనులకు హక్కు లేదనటం అవివేకమని, ప్రభుత్వ పెద్దలే ఆదివాసీ, లంబాడీల మధ్య చిచ్చు పెట్టారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..ఈ విషయంపై సీఎం కేసీఆర్ ఎందుకు నోరు మెదపడటం లేదని ప్రశ్నించారు. అఖిల పక్షం ఎందుకు నిర్వహించటం లేదని అడిగారు. ఇలాంటి గొడవలు పాలక వర్గాలకు లాభమేనని, గతంలో మాల, మాదిగల మధ్య చిచ్చు రేపారని గుర్తు చేశారు. ఆదివాసీ, లంబాడీల మధ్య సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారు. బీసీ సబ్ ప్లాన్‌ను ఎందుకు చట్టంగా మార్చటం లేదో చెప్పాలన్నారు. రాష్ట్రంలో పాలన ప్రజలకు వ్యతిరేకంగా ఉందని, ఈ పాలనలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. గిరిజనుల పోడు భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. సామాజిక న్యాయం కావాలని సీపీఎం కోరుతుందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ గద్దె దించటమే లక్ష్యంగా సీపీఎం ఉద్యమాలు చేస్తుందని వ్యాఖ్యానించారు. -
కొత్తగూడెంలో గిరిజనుల భారీ ర్యాలీ
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో పోడు భూముల రక్షణ కోసం సీపీఐ ఆధ్వర్యంలో గిరిజనులు, దళితులు కొత్తగూడెం మార్కెట్ యార్డు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తీశారు. కలెక్టర్ కార్యాలయం ముందు గిరిజనులతో కలిసి సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులపై అటవీ శాఖ అధికారుల దౌర్జన్యాలు ఆపాలని డిమాండ్ చేశారు. ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్న పోడు భూములు గిరిజనులకే దక్కాలని, అధికారుల దాడులు ఆపాలని కోరారు. -
పోడు భూముల వివాదం
భూపాలపల్లి: జిల్లాలోని వెంకటాపురం మండలం బోధపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామ శివారులోని పోడు భూములలో మొక్కలు నాటేందుకు వచ్చిన అధికారులను స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. పోడు భూములలో మొక్కలు నాటేందుకు వీళ్లేదని.. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. -
పోడు భూములను సొంతదారులకిచ్చేయాలి
వైఎస్సార్సీపీ నేత కొండా రాఘవరెడ్డి సాక్షి, హైద రాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరిట పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీలు, గిరిజనులను తీవ్ర ఇబ్బందులకు గురిచే స్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ప్రధానకార్యదర్శి కొండా రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ఇదేనా బంగారు తెలంగాణ అంటే.. అని ప్రశ్నించారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా 2006 లో అటవీహక్కుల చట్టాన్ని తీసుకొచ్చి, ఖమ్మం జిల్లాలో కొన్ని లక్షల ఎకరాల్లో పోడుభూముల్లో గిరిజనులు, ఇతర సాగుదారులకు పట్టాలిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వెంటనే మిగతా వారికి పట్టాలివ్వాలని, వారికి బ్యాంకుల నుంచి రుణాలు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. ఖమ్మంజిల్లాలో పోడు భూములు అన్యాక్రాంతం చేయడాన్ని ఖండించారు. ‘‘పోడుకు రాజకీయ చెర’’ శీర్షికతో సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఉటంకిస్తూ ఇటు తెలంగాణలోని అధికారపార్టీ నాయకులు, అటు ఏపీకి చెందిన రాజకీయ నాయకులు అక్రమంగా పోడుభూములను ఆక్రమించుకుని, వాటిని లీజుకు ఇచ్చుకోవడాన్ని తప్పుబట్టారు. వాస్తవంగా ఈ పోడు భూములను సొంతదారులకు అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్వరలోనే తమ పార్టీ పక్షాన ఆ భూములను సందర్శించి సమాచారాన్ని సేకరిస్తామని చెప్పారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం కాకుండా రకరకాలుగా మాట్లాడుతోందని ధ్వజమెత్తారు. ముందుగా ఏదో ఒక డ్రాఫ్ట్‌నిచ్చి దానిపై వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుంటామని చెప్పి, మళ్లీ ఇప్పుడు క్షేత్రస్థాయి పరిశీలన అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలకు దగ్గరగా వ్యవహరించాలని సూచించారు. -
పోడుభూముల జోలికొస్తే ఖబడ్దార్
సురవరం సుధాకర్‌రెడ్డి హైదరాబాద్: పోడు భూముల జోలికొచ్చినా, గిరిజనుల బతుకుల్లో నిప్పులు పోసినా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ మెడపై కాడి పెట్టి దున్నిస్తామని సీపీఐ నేతలు హెచ్చరించారు. ‘ఉంటే భూమిపై.. లేదంటే జైలులోనే’ అనే నినాదంతో గిరిజనులు మరింత ఉధృత పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. పోడు రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని, రైతులపై పీడీ యాక్ట్, అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ ఇందిరాపార్కు వద్ద పోడు సాగుదారులు ధర్నా నిర్వహించారు. సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ... ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ తదితర జిల్లాల్లో దశాబ్దాలుగా గిరిజ నులు దాదాపు 10లక్షల ఎకరాల్లో పోడు భూములు సాగు చేసుకుంటున్నారని, వాటికి పట్టాలు ఇవ్వాలని అడిగితే ప్రభుత్వం దాడులు, అరెస్టులకు పాల్పడుతోందన్నారు.భూస్వాములు, కాం ట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులను అరెస్టుచేయలేని ప్రభుత్వం.. సేద్యం చేసుకుంటున్న గిరిజనులను వెళ్లగొట్టడం దుర్మార్గమన్నారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధానకార్యదర్శి, మాజీ ఎంపీ నాగేంద్రనాథ్ ఓఝా మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల హక్కులను హరించే విధానాలు అవలంభిస్తున్నాయన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు కె.నారాయణ మాట్లాడు తూ అటవీ భూముల నుంచి గిరిజనులను ఖాళీ చేయించి పెట్టుబడిదారులకు అప్పగించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌హంట్ పేరుతో రాక్షసంగా వ్యవహరిస్తున్నాయన్నా రు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఆ పార్టీ నేత గుండా మల్లేష్, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షురాలు పశ్య పద్మ పాల్గొన్నారు. -
పోడుభూములపై సీఎం స్పష్టత ఇవ్వాలి
అశ్వారావుపేట రూరల్: ఎన్నోఏళ్లుగా గిరిజ నులు సాగుచేసుకొని జీవిస్తున్న పోడు భూములపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌లు డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేట మండల కేంద్రం లో పోడు భూముల సమస్యను పరిష్కరించి,గిరిజనులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ భారీ ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ వేణుగోపాల్‌రెడ్డికు వినతి పత్రాన్ని అందించారు.అనంతరం వారు మాట్లాడుతూ మండలంలోని వాగొడ్డుగూడెం, మల్లాయిగూడెం గ్రామాల్లో దాదాపు రెండొందల మంది గిరిజ నులు ఇరవై ఏళ్ల క్రితం పోడు నరికి పంటలు సాగుచేసుకుంటున్నారన్నారు. ఆ భూములను అటవీ అధికారులు దౌర్జన్యంగా లాక్కునేందుకు పోలీసుల సహాయంతో గిరిజనుల పై అన్యాయంగా కేసులు పెట్టి భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ వెంటనే అలాంటి చర్యలను ఉపసంహరించుకోవాలన్నారు. అటవీ అధికారులు, పోలీసులు తీరు మార్చుకోకపోతే పోడు పోరును మరింత ఉధృతం చేసి భూములను కాపాడుకుంటామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పోడు భూములపై సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో సమస్య ఉత్పన్నం అవుతుందని వాపోయారు. కలెక్టర్ దృష్టికి పోడు వివాదం.. పోడుభూముల వివాదంపై శుక్రవారం అశ్వారావుపేటలో పర్యటించిన జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ దృష్టికి సీపీఎం నాయకులు పోతినేని సుదర్శన్, ఎమ్మెల్యే సున్నం రాజయ్యలు తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ పోడు భూములపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదని అన్నారు. -
పోతే జైలుకు.. లేదంటే భూమిలోనే..
భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఏటూరునాగారం: ప్రకృతితో సావాసం చేసే గిరిజనులు జైలుకు వెళ్లడమో.. లేదంటే పోడు భూమిలోనే ఉండడం జరుగుతుందని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య స్పష్టం చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్‌తో సోమవారం వరంగల్ జిల్లా ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయ ముట్టడి, ధర్నా నిర్వహించారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సున్నం రాజయ్య మాట్లాడుతూ 2005కి పూర్వం సాగులో ఉన్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని అటవీ హక్కుల చట్టం చెబుతున్నా పాలకులు పట్టించుకోవ డం లేదన్నారు. ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చేతకానితనాన్ని నడిరోడ్డుకు ఈడుస్తామన్నారు. పోడు భూములపై స్పష్టమైన సర్వే చేయిస్తామని ఉన్నతాధికారుల హామీని ఐటీడీఏ పీవో వెల్లడించడంతో ధర్నా విరమించారు. -
పోడుభూముల సాగుయత్నం..ఉద్రిక్తత
ఇల్లందు : పోడు భూములను సాగు చేసేందుకు యత్నించిన గ్రామస్తులను పోలీసులు అరెస్టు చేయటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం మిట్టపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలోని పోడు భూముల్లో ఉన్న చెట్లు, ముళ్ల కంపలను కొట్టేసి సాగు చేసుకునేందుకు బుధవారం గ్రామస్తులు కొందరు యత్నించారు. అటవీ అధికారుల సమాచారంతో పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోడు భూముల్లో ఉన్న మహిళలతో పాటు 30 మందిని అరెస్టు చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. -
1/70, పోడు భూములు ఇవ్వొద్దు
సీపీఎం నేత సీతారామ్ జంగారెడ్డిగూడెం : పోలవరం ప్రాజెక్టు, జల్లేరు ప్రాజెక్టు నిర్వాసితులకు 1/70 చట్టం, పోడు భూములు ఇవ్వవద్దని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు మంతెన సీతారామ్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం స్థానిక సుందరయ్య కార్యాలయంలో ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీతారామ్ మాట్లాడుతూ ఏజెన్సీలోని మూడు మండలాల్లో సుమారు 900 ఎకరాలు 1/70 చట్టం భూములను ప్రభుత్వం గిరిజనేతరుల వద్ద నుంచి కొనుగోలు చేసి ప్రాజెక్టుల నిర్వాసితులకు నష్టపరిహారం అందజేసిందన్నారు. అయితే 1/70 చట్టం భూములు పూర్తిగా గిరిజనులకు మాత్రమే చెందినవని, అలాంటప్పుడు గిరిజనేతరులకు ఎక్కడివని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చట్టం చేసిన ప్రభుత్వమే చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. జల్లేరు రిజర్వాయర్‌లో జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లోని ఏడు గిరిజన గ్రామాలకు చెందిన 800 ఎకరాల 1/70 చట్టం భూములు, 1200 ఎకరాల పోడు భూములు ముంపునకు గురవుతున్నాయన్నారు. 1/70 చట్టం భూములు సాగు చేస్తున్న గిరిజనుల పేర్లు అడంగల్‌లో నమోదు చేయకుండా భూములు సాగు చేయని గిరిజనేతరుల పేర్లు నమోదు చేసి నష్టపరిహారం గిరిజనేతరులకు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని వెంటనే ఆపివేయాలని లేనిపక్షంలో ఆందోళన చేపడతామని సీతారామ్ హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.రవి మాట్లాడుతూ నవంబర్ 2న ఏలూరులో, 8న ఐటీడీఏ వద్ద అన్ని గిరిజన సంఘాలతో సమావేశం నిర్వహించి ఆందోళన నిర్వహించనున్నట్టు ప్రకటించారు. గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పి.నాగేశ్వరరావు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి టి.రామకృష్ణ, ఎంసీపీఐ(యు) నాయకుడు పెన్మెత్స అప్పలరాజు, రైతు కూలీ సంఘం నాయకులు జొన్నకూటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పోడు గోడు..
- జైలు పాలవుతున్న గిరిజనులు - పట్టించుకోని పాలకులు - ఆదివాసీలకు అందని అటవీహక్కు అశ్వారావుపేట : ఆదివాసీలకు చిరునామాగా పేరొందిన జిల్లాలో ఆదివాసీలకు అటవీ హక్కులు అందని ద్రాక్షగానే మిగిలాయి. రాష్ట్ర విభజనలో భాగంగా జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనమైన ముంపు మండలాల్లో గిరిజనుల పోడు భూముల జోలికి అక్కడి అటవీ సిబ్బంది రాకపోవ డంలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రమే గిరిజనులపై కక్షసాధింపు చర్యకు పాల్పడుతుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీల ఆకలి పోరు.. అటవీశాఖ అధికారుల ఉద్యోగ ధర్మం మధ్య జరుగుతున్న పోరు నానాటికీ ఉధృతమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అటవీభూముల్లో దశాబ్దాల తరబడి పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీలపై కన్నెర్ర చేయడం గిరిపుత్రులకు శాపంగా పరిణమించింది. అటవీహక్కుల చట్టం అమల్లోకి రాకమునుపే గిరిజనుల సాగుబడిలో ఉన్న పోడుభూముల వివరాలను సర్వే చేయకపోవడం.. సమగ్ర వివరాలను అప్పటి అధికారులు పొందుపరచకపోవడం ఆయా ప్రాంతాల గిరిజనుల ఉనికిని దెబ్బతీస్తున్నాయి. మైదాన ప్రాంతాల్లో జీవించలేక.. తరతరాలుగా అడవితల్లిని నమ్ముకుంటూ.. పోడు నరుక్కుంటూ జీవిస్తున్న అడవి బిడ్డలకు తెలంగాణ ప్రభుత్వ నిబంధనలు నోటికాడ కూడు లాగేసినట్టయ్యాయి. జిల్లాలోని ప్రతి ఏజెన్సీ గ్రామంలో పోడు భూముల సమస్యలు దాదాపు 5లక్షల ఎకరాల్లో ఉన్నా.. పరిష్కరించేందుకు పాలకపక్షం దర్బార్‌ను నిర్వహించేందుకు ముందుకు రావట్లేదు. అడుగడుగునా కేసులే.. తాతాల కాలం నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూమిలో కాలు పెట్టినా కేసే.. ఫారెస్టు వారిని అడ్డగించినా కేసే.. ఫారెస్టు సిబ్బంది నాటిని మొక్కలు పీకేసినా కేసేనంటూ అడుగడుగునా ఆదివాసీలపై కేసులు నమోదు చేస్తూ పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని అడవిబిడ్డలు ఆవేదన చెందుతున్నారు. అటవీభూముల చుట్టూ కందకాల తవ్వకం పేరుతో అటవీశాఖ పోడుభూముల జోలికి రావడంతో ఆదివాసీలు ఉలిక్కిపడ్డారు. జిల్లాలోని అశ్వారావుపేట, ఇల్లందు, భద్రాచలం, పినపాక గిరిజన నియోజకవర్గాల్లో దాదాపు 5 లక్షల ఎకరాలలో గిరిజనులు అటవీభూములను పోడు చేసుకుని జీవిస్తున్నారు. కాగా కందకాలు తవ్వేందుకు వచ్చిన అటవీసిబ్బందిని అడ్డుకున్న పోడు దారులపై కేసులు నమోదు చేశారు. కందకం తవ్వాక ఎవరి భూమిలో వారు సాగు చేసుకోవచ్చని చెప్పి అటవీశాఖ అధికారులు వారి పని ముగించేసుకున్నారు. కానీ గిరిజనులు నాటే పత్తిచేలను తొలగించడం..దుక్కి దున్ననీయకుండా అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం మొదలుపెట్టారు. ఏదశలో గిరిజ నులు నోరు మెదిపినా.. అటవీశాఖ అధికారుల కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారని వెంటనే పోలీస్ కేసులు నమోదు చేసి రిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు. గిరిజనుల పోడు భూములకు రక్షణ ఏప్రభుత్వ శాఖ కల్పిస్తుందో అర్థం కావడంలేద ంటున్నారు. భూముల వద్ద ఘర్షణలు జరిగితే కేసులు కూడా చాలా ఆలస్యంగా నమోదయ్యేవి. అలాంటిదిప్పుడు ప్రభుత్వ ప్రోద్భలంతోనే పోలీసులను వెంటబెట్టుకుని ఫారెస్టు సిబ్బంది పోడుభూముల వద్దకు వెళుతున్నారు. ఈక్రమంలోనే అశ్వారావుపేట మండలం ఊట్లపల్లికి చెందిన 29మంది పోడుదారులను ఆదివారం అశ్వారావుపేట పోలీసులు రిమాండ్ చేశారు. ఇదే తంతు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. పట్టించుకోని పాలకులు ఆదివాసీల పోడుభూముల సమస్య వామపక్షాలు, వైఎస్ఆర్సీపీకి తప్ప ఏ రాజకీయ పార్టీకి పట్టినట్టు లేదు. జిలాలో సీపీఐ (ఎన్డీ న్యూడెమొక్రసీ), సీపీఎం, సీపీఐలు కూడా వారికి ప్రాభల్యం ఉన్న గ్రామాల్లో గిరిజనుల హక్కుల కోసం ప్రత్యక్షంగా పోరాడుతూనే ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి హామీ మేరకు అర్హులైన గిరిజనులందరికీ అటవీహక్కు పత్రాలు ఇవ్వాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది. కానీ పాలక పక్షానికి , ప్రతిపక్షాలకు గిరిజనుల గోడుమాత్రం పట్టకపోవడం బాధాకరం. ఏజెన్సీ నియోజకవర్గం అయినా గిరిజనులకు అన్యాయమే జరుగుతుందని పలుమార్లు ఆదివాసీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వమే స్పందించి ఆదివాసీలపై వివక్షణను వీడి పోడు భూములపై హక్కులు కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. -
ఉంటే భూముల్లో.. లేదంటే జైల్లో ఉంటాం
వాగొడ్డుగూడెంలో మళ్లీ గిరిజనుల పోడు పోరు అశ్వారావుపేట రూరల్: ‘ఇరవై ఏళ్లుగా పోడు భూముల్లో సాగు చేసుకొని పొట్ట నింపుకుంటున్నాం.. ఇప్పుడొచ్చి ఈ భూములు సర్కార్‌వి. ఖాళీ చేయాలి.. ప్లాంటేషన్లు వేస్తామంటే ఏలా..?’ అని గిరిజనులు ఆదివారం అటవీ, పోలీసు అధికారులను ప్రశ్నించారు. ‘ఉంటే పోడు భూముల్లో ఉంటాం.. లేదంటే జైల్లో ఉంటాం.. భూములను అప్పగించే ప్రసక్తే లేదు’ అని తేల్చి చెప్పారు. ఖమ్మం జిల్లా వాగొడ్డుగూడెం వద్దగల అటవీ భూముల్లో ఏళ్లుగా అదే గ్రామానికి చెందిన కొంతమంది గిరిజనులు పోడు సాగు చేసుకుంటున్నారు. ఈ భూముల్లో అటవీ శాఖ అధికారులు ప్లాంటేషన్ వేసేందుకు కొద్ది రోజులుగా అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఈ భూములు విషయంపై ఇప్పటికే అనేకసార్లు గిరిజనులు, అటవీ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే, ఆదివారం అటవీ అధికారులు చేస్తున్న పనులు నిలిపివేయాలని గిరిజనులు గొడవకు దిగడంతో అధికారులు వెనుదిరిగారు. -
‘పోడు’దారులందరికీ పట్టాలివ్వాలి
- రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ రాంపురంలో పోడు - సాగుదారులతో సమీక్ష రాంపురం(కొణిజర్ల) : ఏళ్లతరబడి పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులు, గిరిజనేతరులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని రిటైర్డ్ హైకోర్డు జడ్జి చంద్రకుమార్ అన్నారు. మండల పరిధిలోని గుబ్బగుర్తి అటవీ ప్రాంతంలోని రాంపురం గ్రామంలో ఆయన శుక్రవారం పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులు, గిరిజనేతరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు సాగుదారులు తమ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. తాము సాగు చేసుకుంటున్న భూములను బిడ్డలకు వరకట్నంగా ఇస్తే.. ఇప్పు డు ఆ భూములు ప్రభుత్వం లాగి వేసుకుంటుం దని, దీంతో తమ అల్లుళ్లు బిడ్డలను ఇళ్ల వెళ్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమినే నమ్ముకుని బతుకుతున్న తమకు భూమి లేకుం డా చేయాలని అధికారులు, ప్రభుత్వం చూస్తుం దన్నారు. అనంతరం చంద్రకుమార్ మాట్లాడుతూ 30,40 ఏళ్ల నుంచి భూములు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు రాకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు. ఎంతో మంది పట్టాలు కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఆలోచించకుండా భూములు లాగేసుకోవాలని ప్రయత్నించడం దారుణమన్నారు. హరితహా రం పేరుతో మొక్కలు నాటడానికి గిరిజనులు వ్యతిరేకం కాదన్నారు. వాతావరణ కాలుష్యం ఏర్పడటానికి కార్పొరేట్ సంస్థలు, వాటి కంపెనీల నుంచి వచ్చే కాలుష్యం తప్ప నిత్యం మొక్కల మధ్య బతికే గిరిజనులు కాదన్నారు. ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, కానీ ప్రకృతిని కాపాడటానకి గిరిజనులపై యుద్ధం వద్దన్నారు. పెట్టుబడిదారులు, పారిశ్రామిక వర్గాలకు అండగా ఉంటున్న వారి ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం వల్లే ప్రజ లకు ఇలాంటి దుస్థితి ఏర్పడిందన్నారు. రాబో యే ఎన్నికల్లో కాంట్రాక్టర్ల ప్రతినిధులను, డబ్బు కు ఆశపడే వారిని ఎన్నుకోవద్దన్నారు. నిరుపేదల పక్షాన నిలబడి ైధె ర్యంగా పోరాడే వారిని గెలిపించాలన్నారు. సీఎం కేసీఆర్ మనసు కరి గించడానికి గ్రామాల్లో ప్రతి టీఆర్ఎస్ ముఖ్య నాయకుడికి పోడు సాగుదారులు తమకు పట్టాలు ఇప్పించాలని దరఖాస్తులు ఇవ్వాలన్నారు. వారే తమ నాయకుడితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న వారు భయపడాల్సిన పని లేదన్నారు. ధైర్యంగా ఉండి భూములు సాగు చేసుకోవాలన్నారు. గిరి జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ ధర్మా, ఎంపీపీ వడ్లమూడి ఉమారాణి, పోడు భూము ల పరిరక్షణ కమిటీ సభ్యులు బొంతు రాంబా బు, భూక్యా వీరభద్రంనాయక్, తాళ్లపల్లి కృష్ణ, రైతు సంఘం మండల కార్యదర్శి వడ్లమూడి నాగేశ్వరావు, ఐలూ, వి.లక్ష్మీనారాయణ, చింతనిప్పు చలపతిరావు, శాగం కృష్ణారెడ్డి, బానోత్ భరత్, డి.రామ్మూర్తి పాల్గొన్నారు. -
‘స్ట్రెంచ్’ పనులు అడ్డుకున్న పోడు రైతులు
- మేడపల్లి బీట్ పరిధిలో రైతుల బైఠాయింపు - పోడు భూముల్లో చెట్లు పెంచడాన్ని విరమించుకోవాలి - హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ నల్లబెల్లి : పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు స్ట్రెంచ్ కటింగ్ పనులు చేయడాన్ని నిరసిస్తూ పోడు రైతులు ఫారెస్ట్ అధికారులపై శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడపల్లి బీట్ పరిధిలో ఫారెస్టు అధికారులు స్ట్రెంచ్ కటింగ్ పనులు చేస్తుండగా జేసీబీ వాహనానికి అడ్డంగా బైఠాయించి పనులను అడ్డుకున్నారు. మేడపల్లి ఫారెస్టు బీట్ పరిధిలోని రామారావుతండా, వీర్యతండా, గొల్లపల్లి, లచ్చితండా, దబ్బిరిపేట గ్రామాలకు చెందిన పోడు రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. నర్సంపేట ఇన్చార్జి ఎఫ్ఆర్ఓ యాకయ్య పోడు రైతులకు నచ్చజెప్పినా వారు వినలేదు. దీంతో పనులు నిలిపి వేసి ఫారెస్ట్ అధికారులు వెనుదిరిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 40 ఏళ్లు పోడు భూములు సాగు చేసుకుంటు జీవిస్తున్న తమను భూముల నుంచి వెళ్లగొట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ప్రభుత్వం ఆలోచన వెంటనే విరమించుకోవాలన్నారు. అర్హులైన రైతులకు హక్కు పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రామారావుతండా, వీర్యతండా, గొల్లపల్లి, లచ్చితండా, దబ్బిరిపేట గ్రామాలకు చెందిన పోడు రైతులు పాల్గొన్నారు. పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి ఖానాపురం : పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని పోడు రైతులు డివూండ్ చేశారు. ఈ మేరకు వుండలంలోని దబ్బీర్‌పేట శివారులో పోడు భూమూలకు ట్రెంచ్ కట్ కొడుతున్న అటవీశాఖ అధికారులు డీఆర్వో యూకయ్యు, బీట్ ఆఫీసర్ సాంబు, లక్ష్మణ్‌ను పోడు రైతులు అడ్డుకున్నారు. మిషన్‌ను నిలిపివేసి గ్రావూనికి తరలించారు. అనంతరం వారు వూట్లాడుతూ గత 20 ఏళ్లుగా పోడు సాగు చేసుకుని జీవిస్తున్న తవుకు పట్టాలు ఇవ్వకుండా భూవుులను స్వాధీనం చేసుకోవాలనుకోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పోడు భూవుులకు పట్టాలు అందించాలని కోరారు. కార్యక్రవుంలో పోడు రైతులు పాల్గొన్నారు. -
పోడు కోసం ‘ప్రత్యేక’ పోరు..
- ఆదివాసీలు, గిరిజనుల సంక్షేమమే ధ్యేయం - మహాధర్నాలో న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు టాన్యా దోమలగూడ: ప్రభుత్వం పోడు భూములను స్వాధీనం చేసుకునే చర్యలను విరమించుకోవాలని, లేకుంటే ఆదివాసీలకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాల్సి వస్తుందని సీపీఐ (ఎంఎల్ ) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు టాన్యా హెచ్చరించారు. పోడు భూములను లాక్కునే చర్యలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ జల్, జమీన్, జంగిల్‌పై ఆదివాసీలదే హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించడం లేదని ఆరోపించారు. ఆదివాసీలను న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు వారికి అన్యాయం చేసే చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెచ్చిన భూ ఆర్డినెన్స్ ద్వారా లక్షల ఎకరాల వ్యవసాయ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. అడవిపై ఫారెస్టు సిబ్బంది పోలీసులు, పెట్టుబడిదారుల పెత్తనం ఎమిటని ప్రశ్నించారు. పొట్ట కోసం చెట్లను నరికేందుకు వచ్చిన కూలీలను చంద్రబాబు ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లో చంపిందని, రూ. వందల కోట్ల రుణాలు ఎగవేసిన సుజనాచౌదరిని ఎన్కౌంటర్ చేయగలదా అని నిలదీశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోవర్ధన్ మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయడం లేదని ఆరోపించారు. న్యూడెమోక్రసీ నాయకులు ముక్తార్ పాషా, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు వి.సంధ్య, ఏఐకేఎంఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అచ్యుతరామారావు, మండల వెంకన్న, ఎ. నరేందర్, అనురాధ, భూక్యా, అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి నిర్మల, గౌని ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.