పోతే జైలుకు.. లేదంటే భూమిలోనే..
భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య
ఏటూరునాగారం: ప్రకృతితో సావాసం చేసే గిరిజనులు జైలుకు వెళ్లడమో.. లేదంటే పోడు భూమిలోనే ఉండడం జరుగుతుందని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య స్పష్టం చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్‌తో సోమవారం వరంగల్ జిల్లా ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయ ముట్టడి, ధర్నా నిర్వహించారు.
వివిధ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సున్నం రాజయ్య మాట్లాడుతూ 2005కి పూర్వం సాగులో ఉన్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని అటవీ హక్కుల చట్టం చెబుతున్నా పాలకులు పట్టించుకోవ డం లేదన్నారు. ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చేతకానితనాన్ని నడిరోడ్డుకు ఈడుస్తామన్నారు. పోడు భూములపై స్పష్టమైన సర్వే చేయిస్తామని ఉన్నతాధికారుల హామీని ఐటీడీఏ పీవో వెల్లడించడంతో ధర్నా విరమించారు.