MLA sunnam rajaiah
-
ప్రశ్నించే హక్కును ప్రభుత్వం హరిస్తోంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే హక్కును హరిస్తోందని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద మాట్లాడుతూ... సభలో ప్రజా సమస్యలపై, శాసనసభ్యుల సస్పెన్షన్‌పై కనీసం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సభ్యుల హక్కుల్ని హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కార్మికుల వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాల్లో రూ.5,500 వేతనం ఇస్తుంటే... ఇక్కడ మాత్రం రూ.వెయ్యి మాత్రమే ఇస్తున్నారన్నారు. -
సీఎం తన మాటను నిలబెట్టుకోవాలి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ తానూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. 1998 డీఎస్సీలో సెలెక్టయిన అభ్యర్థులకు ప్రభు త్వ ఉద్యోగమిస్తామని గతంలో సీఎం మాటిచ్చారని, ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకొని వారికి న్యాయం చేయా ల ని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సచివాలయం విశాలంగా ఉందని, రూ.500 కోట్లతో కొత్త భవనాల నిర్మాణం అనవసరమని, సీపీఎం కొత్త సచివాలయాన్ని వ్యతిరేకిస్తోందన్నారు. -
పోతే జైలుకు.. లేదంటే భూమిలోనే..
భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఏటూరునాగారం: ప్రకృతితో సావాసం చేసే గిరిజనులు జైలుకు వెళ్లడమో.. లేదంటే పోడు భూమిలోనే ఉండడం జరుగుతుందని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య స్పష్టం చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్‌తో సోమవారం వరంగల్ జిల్లా ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయ ముట్టడి, ధర్నా నిర్వహించారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సున్నం రాజయ్య మాట్లాడుతూ 2005కి పూర్వం సాగులో ఉన్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని అటవీ హక్కుల చట్టం చెబుతున్నా పాలకులు పట్టించుకోవ డం లేదన్నారు. ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చేతకానితనాన్ని నడిరోడ్డుకు ఈడుస్తామన్నారు. పోడు భూములపై స్పష్టమైన సర్వే చేయిస్తామని ఉన్నతాధికారుల హామీని ఐటీడీఏ పీవో వెల్లడించడంతో ధర్నా విరమించారు. -
ఆటోలో వచ్చావు.. ఎమ్మెల్యేవి కావు!
కోట్ల రూపాయల విలువ చేసే కారు.. మడత నలగని ఖద్దరు చొక్కా.. రెండు చేతులకు ఉన్న నాలుగేసి వేళ్లకు పెద్ద పెద్ద బంగారు ఉంగరాలు.. కనీసం ఇవన్నీ ఉంటేనే ఓ ఎమ్మెల్యే అనేది మనవాళ్ల లెక్క. రాజకీయ నాయకుల హంగు, ఆర్భాటాలకు పోలీసులు కూడా అంతలా అలవాటు పడిపోయారు. గురువారం తెలంగాణ సచివాలయంలో ఓ ఎమ్మెల్యేకు జరిగిన ఘోర అవమానమే ఇందుకు తాజా నిదర్శనం! ఆర్భాట రాజకీయాలు ఇంకా వంటబట్టని గిరిజన నాయకుడిగా, సీపీఎం శాసనసభా పక్ష నేతగా సుపరిచితుడైన ఖమ్మం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్యను సచివాలయం ద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కారణం.. ఆయన సామాన్యులు ప్రయాణించే ఆటోలో వెళ్లారట! గేటు బయటే రాజయ్యను అడ్డుకున్న పోలీసులు.. 'ఆటోలో వచ్చావ్.. నువ్వు ఎమ్మెల్యేవంటే మేము నమ్మం' అనడంతో తన ఐడెంటిటీ కార్డు తీసి పోలీసులకు చూపారు రాజయ్య. ఐడీ కార్డును క్షుణ్ణంగా పరిశీలించిన మీదట గానీ ఎమ్మెల్యే రాజయ్యను పోలీసులు లోనికి అనుమతించలేదు!