![YSRTP YS Sharmila Padyatra Held At Jangaon - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/12/YS-SHARMILA.jpg.webp?itok=lahXfy8S)
వైఎస్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న షర్మిల
నర్మెట: పోడు భూములు సాగు చేసుకుంటున్న ఇతర ఎస్టీలతోపాటు గొత్తి కోయలకు కూడా వెంటనే పట్టాలు ఇవ్వాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గొత్తి కోయలు అటవీ అధికారులను హత్య చేయడాన్ని తాను సమర్థించడం లేదని, అయితే వారు కూడా చాలా కాలం నుంచి పోడు చేసుకుని జీవిస్తున్నందున వారికి కూడా పట్టాలివ్వాలని అన్నారు.
షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం జనగామ జిల్లా నర్మెట, తరిగొప్పుల మండలాల్లో సాగింది. ఈ సందర్భంగా నర్మెట మండలం ఆగాపేటలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, తన కుటుంబ సభ్యులే భూకబ్జాలకు పాల్పడుతుంటే సీఎం కేసీఆర్ నోరు మెదపడంలేదని, ఇదేనా బంగారు తెలంగాణ అని దుయ్యబట్టారు.
ధరణి పోర్టల్ బీఆర్‌ఎస్ నేతల కబ్జాలకే ఉపయోగపడిందని మండిపడ్డారు. వైఎస్సార్ పాలనలో 9 రకాల నిత్యావసర సరుకులను పేదలకు రేషన్‌ద్వారా అందిస్తే.. కేసీఆర్ బెల్ట్‌షాపులను ఏర్పాటు చేసిన ఘనత దక్కించుకున్నారని ఎద్దేవా చేశారు. తన పాదయాత్ర 3,700 కిలోమీటర్ల మైలురాయి దాటిన సందర్భంగా తరిగొప్పులలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment