షర్మిలకు గజమాల వేస్తున్న అభిమానులు
సాక్షి, మహబూబాబాద్: ‘మంత్రి దయాకర్‌రావు టీడీపీలో ఉన్నప్పుడు.. కేసీఆర్ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు అని మాట్లాడారు.. ఇప్పుడు ఆయన కేసీఆర్‌కు ఎంతకు అమ్ముడుపోయి ఆయన పార్టీలో చేరారు’అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. గురువారం ఆమె మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం అవుతాపురంలో పాదయ్రాత కొనసాగించారు.
3,800 కిలోమీటర్ల మైలురాయి పూర్తి చేసుకుని నాంచారి మడూరు మీదుగా తొర్రూరు చేరుకున్నారు. సాయంత్రం తొర్రూరు బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఐదో తరగతి చదివిన దయాకర్‌రావు మంత్రి అయ్యారని, పీజీలు, పీహెచ్‌డీలు చేసిన బిడ్డలు నిరుద్యోగులుగా మిగిలి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీపరుడినని చెప్పే మంత్రి 680 ఎకరాల భూమిని ఎలా సంపాదించారని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment