రైతులను బర్బాద్‌ చేస్తున్న సర్కారిది  | YSRTP YS Sharmila Slams BRS Party On Her Padayatra | Sakshi
Sakshi News home page

రైతులను బర్బాద్‌ చేస్తున్న సర్కారిది 

Feb 11 2023 2:44 AM | Updated on Feb 11 2023 2:44 AM

YSRTP YS Sharmila Slams BRS Party On Her Padayatra - Sakshi

రఘునాథపల్లి సబ్‌స్టేషన్‌ ముందు హైవేపై బైఠాయించిన వైఎస్‌ షర్మిల   

రఘునాథపల్లి: ‘అబ్‌కి బార్‌ కిసాన్‌ సర్కార్‌ కాదు.. తెలంగాణలో రైతులను బర్బాద్‌ చేస్తున్న సర్కారు మీది’.. అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం జనగామ జిల్లా రఘునాథపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా విద్యుత్‌ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని పలువురు రైతులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు.

దీంతో ఆమె రఘునాథపల్లి సబ్‌స్టేషన్‌ ఎదుట వరంగల్‌– హైదరాబాద్‌ జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. ఈ కార్యక్రమంలో షర్మిల మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నామని కేసీఆర్‌ గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కరెంట్‌ కోతలు లేని పాలన అని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement